బోరబండలో యువతిపై కత్తితో దాడి.. కలకలం | Knife Attack On Minor Girl Incident In Borabana Hyderabad | Sakshi
Sakshi News home page

బోరబండలో యువతిపై కత్తితో దాడి.. కలకలం

Aug 7 2026 11:50 PM | Updated on Aug 7 2026 11:50 PM

Knife Attack On Minor Girl Incident In Borabana Hyderabad

హైదరాబాద్: నగరంలోని బోరబండ ప్రాంతంలో యువతిపై కత్తితో దాడి జరిగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి సుమారు 8 గంటల సమయంలో హిచ్ హోటల్ సమీపంలో చంపాపేటకు చెందిన కె. చంటి బోరబండకు చెందిన రమ్యశ్రీ మైనర్‌ బాలికపై కత్తితో దాడి చేశాడు. దీంతో యువతి స్వల్పంగా గాయపడింది. అనంతరం నిందితుడు, బాధితురాలిని పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ చేపట్టారు. ఈ దాడికి గల కారణాలు, ఇద్దరి మధ్య ఉన్న సంబంధం, ఘటన వెనుక అసలు పరిస్థితులేంటనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement