బెంగళూరులో దారుణం
రాపిడో (Rapido) బైక్ ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు
స్పందించలేదని బాధితురాలి ఆవేదన
సాక్షి, బెంగళూరు : క్యాబ్ సేవల సంస్థ ర్యాపిడోపై ఒక మహిళ ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. బెంగళూరుకు చెందిన 32 ఏళ్ల శని కృష్ణ అనే మహిళకు ర్యాపిడో బైక్ ప్రయాణం పీడకలగా మారింది. తీవ్ర గాయాలతో ప్రాణాపాయ స్థితినుంచి బైటపడింది. దీనికి సంబంధించిన వివరాలను ఇన్‌స్టాలోపోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. చివరికి దీనిపై కంపెనీ స్పందించింది.
జూన్ 17న శని కృష్ణ ఆఫీసుకు వెళ్లడానికి ర్యాపిడో బైక్ బుక్ చేసుకున్నారు. బాగ్మానే టెక్ పార్క్ వద్ద రైడర్ ఒక ట్రాక్టర్‌ను ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించడంతో బైక్ నియంత్రణ కోల్పోయింది. రోడ్డుపై పడిపోయిన ఆమెపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంలో ఆమె ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి, కాలేయం దెబ్బతింది, 9 పక్కటెముకలు విరిగాయి, ఊపిరితిత్తులు దెబ్బతినడంతో పాటు ప్లీహం (Spleen) తొలగించాల్సి వచ్చింది. మెరుగైన వైద్యం కోసం ఆమెను కేరళలోని ఆసుపత్రికి తరలించారు. ఈ తీవ్ర ప్రమాదంలో ఆమె ప్రాణాపాయ స్థితికి చేరుకోగా, ఆసుపత్రి ఖర్చులు రూ. 20 లక్షలు దాటాయని, అయితే రాపిడో సంస్థ తనకు ఎలాంటి సహాయం అందించలేదని ఆమె ఆరోపించారు.
రూ. 20 లక్షల ఖర్చు
అత్యవసర శస్త్రచికిత్సలు, వైద్య ఖర్చుల నిమిత్తం ఇప్పటివరకు రూ. 20 లక్షలకు పైగా ఖర్చయిందని, ఇది తమ కుటుంబంపై తీవ్ర ఆర్థిక భారంగా మారిందని ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు.
ర్యాపిడోపై ఆరోపణలు
మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నామని ప్రకటనలు ఇచ్చే రాపిడో, ప్రమాదం జరిగాక తనను పట్టించుకోలేదని శని కృష్ణ ఆరోపించారు. న్యాయపరమైన నోటీసులు పంపినప్పటికీ, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ప్రాసెస్ చూసుకోమంటూ కేవలం ఆటోమేటెడ్ ఇమెయిళ్ళు మాత్రమే పంపారని తెలిపారు. ఈ విషయమై తాను వినియోగదారుల కోర్టును (Consumer Court) ఆశ్రయించనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: ఢిల్లీ అమ్మాయి, జాంబియా సుప్రీంకోర్టు తొలి మహిళా జడ్జ్‌గా ఘనత
ఇదీ చదవండి: అర్ధరాత్రి దాకా క్యాబ్ డ్రైవింగ్, రూ. 20 లక్షల నష్టం, ఇపుడు రూ. కోట్ల కంపెనీ
ర్యాపిడో స్పందన:
శని కృష్ణ ఇన్‌స్టాగ్రామ్ వీడియోపై రాపిడో సంస్థ స్పందిస్తూ, తాము బాధితురాలితో సంప్రదింపుల్లో ఉన్నామని, ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరపడానికి కొంత సమయం కావాలని కోరింది.
ఇదీ చదవండి: 'జెన్ జీ' పై ఎంపీ కంగనా రనౌత్ యూటర్న్: ఆసక్తికర వ్యాఖ్యలు


