ఆషాఢ బోనాలు (Bonalu Festival 2026) ఉత్సవాలు నగరంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలోనే గురువారం డా.బీఆర్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయ (Telangana Secretariat) ఉద్యోగుల ఆధ్వర్యంలో బోనాల సంబరాలు అంబరాన్నంటాయి.
మహిళా ఉద్యోగులు సంప్రదాయ వస్త్రధారణలో అమ్మవారికి బోనాలను సమర్పించారు.
అనంతరం నృత్యాలతో హోరెత్తించారు.
పోతురాజుల విన్యాసాలు, కళాకారుల ఆటాపాటలతో సచివాలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది.


