వరంగల్ : నిట్ సాంకేతిక మహోత్సవం టెక్నోజియాన్–26 శుక్రవారం అట్టహాసంగా ప్రారంభమైంది.
సాంకేతిక ఆవిష్కరణలతో ఆకట్టుకుంది. దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ కళాశాలల నుంచి ఏడు వేల మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని నూతన సాంకేతిక ఆవిష్కరణల ప్రదర్శనలను తిలకించారు.
నిట్‌లోని అంబేడ్కర్ లెర్నింగ్ సెంటర్ ఆడిటోరియంలో రెండు రోజుల పాటు నిర్వహించనున్న టెక్నోజియాన్–26ను ‘ఇన్నోవేషన్స్ బియాండ్ బౌండరీస్’ అనే ట్యాగ్‌లైన్‌తో టెక్‌ఫెస్ట్‌ను ఓలెక్ట్రా వైస్ ప్రెసిడెంట్ కమల్ కిషోర్ వోరా ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.


