
హైదరాబాద్: ఇటీవల నగరంలో తరుచు వినిపిస్తున్న పేరు హైడ్రా. అక్రమ కట్టడాల కూల్చివేతకు సంబంధించి హైడ్రా పేరు బాగా హైలైట్ అయ్యింది. దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది అక్రమాలకు పాల్పడుతున్నారు.. తమకు హైడ్రా అధికారులు బాగా తెలుసని ఓ మహిళన మోసం చేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. హయత్‌నగర్‌లో కొంతమంది ముఠాగా ఏర్పడి హైడ్రా అధికారులతో పనిచేయిస్తామని చెప్పి స్థానిక మహిళను ప్రలోభాలకు గురి చేశారు. హయత్‌నగర్‌లోని ల్యాండ్ ఇష్యూకు సంబంధించి సదరు మహిళ రూ. 50 లక్షలను ఆ ముఠాకు అప్పగించింది.
వివరాల్లోకి వెళితే.. హయత్‌నగర్‌లో ఉన్న ల్యాండ్ ఇష్యూపై హైడ్రాకు ఫిర్యాదు చేసింది ఓ మహిళ. ఇదే విషయాన్ని స్నేహితుల వద్ద కూడా చెప్పింది. అయితే తమకు హైడ్రా అధికారులు తెలుసని, ఈ విషయాన్ని తాము చూసుకుంటామని పలువురు వ్యక్తులు నమ్మబలికారు. దాంతో రూ. 50 లక్షలను ఆ మహిళను నుంచి తీసుకుంది ముఠా. ఇది హైడ్రా కమిషనర్ వరకూ వెళ్లడంతో అసలు విషయం బయటపడింది. దీంతో విచారణ చేయగా వారిపై పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేశారు.
పరిధి విస్తరించి ఉన్న ఓఆర్ఆర్ వరకు ఉన్న ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా. ఫిర్యాదు చేయాలన్నా నేరుగా తమనే సంప్రదించాలని కమిషనర్ ఏవీ రంగనాథ్ కోరారు. ప్రతి సోమవారం హైడ్రా ప్రధాన కార్యాలయంలో నిర్వ హించే ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేయవచ్చని సూచిం చారు. హైడ్రా అధికారులు తమ బంధువులని, మిత్రులని, తమకు బాగా తెలుసంటూ ఎవరైనా చెబితే నమ్మి మోస పోవద్దని హెచ్చరించారు. హైడ్రాకు సంబంధించి ఫిర్యాదులు ఉన్నా తనను సంప్రదించవచ్చని స్పష్టం చేశారు.