క్రిస్మస్ వేడుకల్లో భాగంగా మంగళవారం ‘విల్లా ఫీస్ట్–2025’ పేరుతో విద్యార్థుల ప్రదర్శనలు అబ్బురపరిచాయి. అనంతరం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.
‘భారతదేశపు వారసత్వం, పురోగతి’ అనే థీమ్‌పై విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. భారతభూమి ఆత్మ, వైభవం, అభివృద్ధి వంటి అంశాలను చూడచక్కగా ప్రదర్శించారు. 2047 నాటికి వికసిత్ భారత్ దిశగా భారత్ ఎలా దూసుకుపోతుంది, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ దిశగా వేస్తున్న అడుగులు, ఆయన దార్శనికత, పాలన, 150 సంవత్సరాల వందేమాతరం భావోద్వేగాన్ని విద్యార్థినులు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా చక్కగా వివరించారు.
ఈ ఆకర్షణీయమైన కార్యక్రమాలకు సోమాజిగూడలోని విల్లా మేరీ కాలేజీ వేదికైంది.
విద్యార్థుల్లో జాతీయ స్పృహను పెంచేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని కాలేజీ వ్యవస్థాపక చైర్మన్ డాక్టర్ ఫిల్లోమినా, పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కె.బాలసుబ్రమణియన్, డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్ రేవతిదేవి మాథుర్, జూనియర్ కాలేజీ ప్రిన్సిపల్ ఎన్‌ఎస్ విజయ అన్నారు.


