నుమాయిష్ ఫుల్ రష్‌తో కిక్కిరిసిపోయింది. ఆదివారం సుమారు 80 వేల మంది సందర్శించారని ఎగ్జిబిషన్ సొసైటీ ఉపాధ్యక్షుడు ఆర్.సుఖేష్ రెడ్డి, కార్యదర్శి బీఎన్.రాజేశ్వర్ తెలిపారు. ఇప్పటివరకు 14.60 లక్షల మంది సందర్శించినట్లు వారు వివరించారు. గోషామహల్ డివిజన్ ఏసీపీ సుదర్శన్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు.


