మాస్కో: ఉక్రెయిన్-రష్యా యుద్ధంలో ఆధునిక సాంకేతికతకు తోడు శతాబ్దాల క్రితం నాటి యుద్ధ వ్యూహాలు కనిపిస్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌కు చెందిన 92వ పదాతిదళ బ్రిగేడ్ షేర్ చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రష్యన్ సైనికులు గుర్రాలపై పరుగులు తీస్తుండగా, ఉక్రెయిన్ డ్రోన్ వారిని వెంబడించి దాడి చేయడం కనిపిస్తుంది. కాగా రష్యా దళాలు తమ సైనిక పరికరాలను వేగంగా కోల్పోతుండటంతో, వారు గత్యంతరం లేక రవాణా కోసం గుర్రాలను ఆశ్రయిస్తున్నారని ఉక్రేనియన్ సైన్యం చెబుతోంది.
వీడియోలో కనిపిస్తున్న దాడిలో డ్రోన్ నేరుగా గుర్రంపై ఉన్న సైనికుడిని లక్ష్యంగా చేసుకుంది. బాంబు పేలుడు తీవ్రతకు గుర్రం కిందపడిపోగా, సైనికుడు అల్లంత దూరాన ఎగిరిపడ్డాడు. అనంతరం ఆ గుర్రం అక్కడి నుండి ప్రాణభయంతో పరుగులు తీయగా, సైనికుడు మాత్రం అక్కడే చిక్కుకుపోయాడు. ఆయుధాల కొరతను ఎదుర్కొంటున్న ఉక్రెయిన్.. రష్యన్ స్థావరాలను ట్రాక్ చేసేందుకు, దాడులు కొనసాగించేందుకు ప్రస్తుతం మానవరహిత డ్రోన్ వ్యవస్థలపైనే పూర్తిగా ఆధారపడుతోందని ఎన్‌డీటీవీ తన కథనంలో పేర్కొంది.
Earlier today, Ukrainian forces repelled a Russian cavalry assault in Donetsk Oblast.
Cavalry, in this case, actually using horses. pic.twitter.com/WUlDyWachc— OSINTtechnical (@Osinttechnical) December 22, 2025
సుమారు 600 మైళ్ల యుద్ధ క్షేత్రంలో ఉక్రెయిన్ తన నిఘా కోసం, బాంబులు వేసేందుకు రకరకాల డ్రోన్లను ఉపయోగిస్తోంది. రష్యా సైన్యం కూడా డ్రోన్ దాడుల నుండి తప్పించుకునేందుకు మోటార్ సైకిల్ యూనిట్లు వంటి తక్కువ సాంకేతికత కలిగిన పద్ధతులను ప్రయత్నిస్తోంది. చారిత్రాత్మకంగా రెండో ప్రపంచ యుద్ధం సమయంలో గుర్రాలను వాడారు. ఇప్పుడు ఈ 2025 నాటి హైటెక్ డ్రోన్ల కాలంలోనూ గుర్రాలను ఉపయోగించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
మరోవైపు రష్యాలోని మయామీలో యుద్ధ శాంతి చర్చలు జరిగిన కొద్ది గంటలకే అక్కడి మాస్కోలో ఒక సీనియర్ రష్యన్ జనరల్ కారు బాంబు దాడిలో మృతిచెందడం కలకలం సృష్టించింది. 2022లో యుద్ధం మొదలైనప్పటి నుండి రష్యా లోపల, ఆక్రమిత ప్రాంతాల్లోని కీలక వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని ఉక్రెయిన్ ఇటువంటి దాడులను కొనసాగిస్తూనే ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: రష్యన్ జనరల్ హత్య.. ఉక్రెయిన్ ప్రమేయం?


