సాధారణంగా మాల్స్‌లో ట్రయల్ రూమ్స్ ఎలా ఉంటాయో తెలిసిందే. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే ట్రయల్ రూమ్ మాత్రం అస్సలు చూసుండే ఛాన్సే లేదు. పైగా ఒక్కసారి అందులోకి ఎంటర్ అయితే..బయటకు రావడం చాలా కష్టమట. చెప్పాలంటే అస్సలు వదిలపెట్టి రాబుద్ధి కాదట.అబ్బా అంత స్పెషాలిటి ఏముంది అనుకుంటున్నారా..!.
ఇన్‌స్టాగ్రామ్ యూజర్ సార్థక్ సచ్‌దేవా షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ చక్కెర్లు కొడుతోంది. అది చూస్తే దుబాయ్‌లో ట్రయల్ రూమ్స్ ఇలా ఉంటాయా అనిపిస్తుంది. ఆ వీడియోలో దుబాయ్‌లోని H&M స్టోర్‌లోని హైటెక్ ట్రయల్ రూమ్‌ని కళ్లకు కట్టినట్లు చూపించాడు సార్థక్ సచ్‌దేవా. చక్కటి మ్యూజిక్‌ని వింటూ డ్రెస్ మార్చుకోవచ్చు. అంతేగాదు అక్కడ ముందు ఉన్న టచ్‌స్క్రీన్ ప్యానెల్‌లో హైప్, వైబ్, చిల్, లోకల్ అనే నాలుగు రకాల సంగీత శైలిని అందిస్తుంది.
వాటిలో మనకు నచ్చింది ఏదో ఒకటి ఎంచుకున్నాక..మొత్తం ట్రయల్ రూమ్ మ్యూజిక్ పరంగానే కాదు రూమ్ వ్యూ కూడా మారిపోతుంది. ఇక లోపలి గది గోడలు స్క్రీన్‌లతో ఉంటాయి. ఇందులోని డైనమిక్ విజువల్స్, కదిలే నమునాలు మనం ఎంచుకున్న సంగీతానికి అనుగుణంగా గది అంతా లైటింగ్‌ని ప్రొజెక్ట్ చేస్తాయి. సింపుల్‌గా చెప్పాలంటే..ఆ గది హంగుఆర్భాటం, మంచి సంగీతానికి అందులోనే లీనమై ఉండిపోయేలా చేస్తుంది.
అందుకు సంబంధించిన వీడియోకి “దుబాయ్‌లో వైరల్ డ్రెస్సింగ్ రూమ్!” అనే క్యాప్షన్ ఇచ్చి మరి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. నెటిజన్లు కూడా ఈ వీడియోని చూసి..ఇలాంటి ట్రయల్ రూమ్ అయితే అక్కడే ఉండిపోతా అంటూ కామెంట్ చేస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: ఆ ప్యాలెస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ఇంత ఖరీదా..? పీవీ సింధు ఏకంగా రూ. 7 లక్షలు..)


