హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హరిత విద్యుత్ ఆధారిత డేటా సెంటర్ ప్యాకేజీలను సంయుక్తంగా అభివృద్ధి చేసే దిశగా బొండాడ ఇంజినీరింగ్ (బీఈఎల్), దుబాయ్‌కి చెందిన బ్రయాన్‌స్టన్ రెన్యువబుల్స్ ఎఫ్‌జెడ్‌సీవో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. భారత్‌తో పాటు నిర్దిష్ట అంతర్జాతీయ మార్కెట్లలో ఈ సెంటర్లను ఏర్పాటు చేయనున్నాయి. మరోవైపు మహారాష్ట్ర, తమిళనాడులో 69.51 ఎండబ్ల్యూపీ సామర్థ్యంతో సోలార్ పవర్ ప్రాజెక్టులను జనవరిలో విజయవంతంగా వినియోగంలోకి తెచి్చనట్లు కంపెనీ తెలిపింది. పారడైమ్ ఐటీ, మహాజెన్‌కో, ఎన్‌ఎల్‌సీ ఇండియా తదితర క్లయింట్ల కోసం ఈ ప్రాజెక్టులను నిర్మించినట్లు వివరించింది.


