‘బంగారం బాట’లో యువ భారతం  | 62percent Young Indians See Gold As Safest Investment | Sakshi
Sakshi News home page

‘బంగారం బాట’లో యువ భారతం 

Feb 15 2026 5:09 AM | Updated on Feb 15 2026 5:09 AM

62percent Young Indians See Gold As Safest Investment

పసిడిలో పెట్టుబడులకే ఆసక్తి 

స్మిట్టెన్‌ ప్లస్‌ఏఐ సర్వేలో వెల్లడి  

న్యూఢిల్లీ: బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నా... యువ భారతం బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. దేశవ్యాప్తంగా 18–39 ఏళ్ల మధ్య వయసు కలిగిన 5,000 మంది నుంచి సేకరించిన అభిప్రాయాలతో  ‘స్మిట్టెన్‌ పల్స్‌ఏఐ’ ఒక నివేదిక విడుదల చేసింది. సర్వేలో పాల్గొన్నవారిలో 62 శాతం మంది పెట్టుబడుల్లో తొలి ప్రాధాన్యతం బంగారానికి ఇచ్చారు.

 గతంలో బంగారం కొనాలంటే ఇంటి పెద్దల సలహా తీసుకునేవారు. కానీ ఇప్పుడు 66.7% మంది యువత స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయిదు గ్రాముల లోపే పసిడి కొన్నామని 62% మంది వెల్లడించారు. 2 గ్రాముల లోపు కొనుగోలు చేసిన వాళ్లు 27.5% మంది కాగా..  2–5 గ్రాముల మధ్య కొనుగోలు చేసిన వాళ్లు 34.4% మంది ఉన్నారు. 

→ తమ మొదటి జీతం/సంపాదనతో తొలిసారి 24% మంది పసిడిని కొనుగోలు చేశారు. కేవలం పెట్టుబడిగా పసిడిని కొనుగోలు చేసినట్లు 23.9% మంది వెల్లడించారు. ఆర్థిక అనిశ్చితి సందర్భాల్లో, బ్యాంకు సేవింగ్స్, మ్యూచువల్‌ ఫండ్స్, ఈక్విటీలతో పోలిస్తే 65.7% మంది బంగారమే అత్యంత సురక్షితమైన సాధనంగా భావిస్తున్నామని తెలిపారు. సుమారు 65.7% మంది స్టాక్స్, మ్యూచువల్‌ ఫండ్ల (ఎంఎఫ్‌) కంటే పసిడినే అత్యంత సురక్షిత పెట్టుబడి మార్గంగా భావిస్తున్నారని సర్వేలో తేలింది. 

→ ఒకవేళ రూ.25,000 నగదు రూపంలో ఉంటే.., పసిడి కొంటామని 61.9% మంది పేర్కొన్నారు. మ్యూచువల్‌ ఫండ్లకు 16.6%, డిపాజిట్లు 13%, షేర్లు 6.6%, క్రిప్టో 1.9% మంది ఆసక్తి చూపారు.  

రత్నాలు, ఆభరణ ఎగుమతులు డీలా 
గత  నెల(జనవరి)లో రత్నాలు, బంగారు ఆభరణ ఎగుమతులు డీలా పడ్డాయి. 2025 జనవరితో పోలిస్తే 6% క్షీణించి 2,239 మిలి యన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. 2025 జనవరిలో ఇవి 2,376 మిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. రత్నాలు, ఆభరణ ఎగుమతుల ప్రో త్సాహక సమితి(జీజేఈపీసీ) వివరాలివి. ప్రపంచ వాణిజ్య సవాళ్లు, కీలక మార్కెట్లలో టారిఫ్‌ ఒత్తిళ్లు ప్రభావం చూపాయి.

 ఈ బాటలో ప్రస్తు త ఆర్థిక సంవత్సరం(2025–26) తొలి 10 నెల ల(ఏప్రిల్‌ 2025–జనవరి 2026)నూ ఇవి నామమాత్ర వెనకడుగు వేశాయి. 0.6% తగ్గి 23,186 మిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. గతే డాది(2024–25) ఇదే కాలంలో ఇవి 23,335 మిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ప్రధా నంగా దేశీ ఆభరణ ఎగుమతులకు ప్రధాన మార్కెట్‌గా నిలిచే యూఎస్‌కు షిప్‌మెంట్స్‌ 45% నీరసించడం ప్రభావం చూపింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement