స్లిప్పర్స్ వేసుకుని డ్రైవింగ్ చేస్తే చలాన్ పడుతుందా?: గడ్కరీ క్లారిటీ | Can Driving in Slippers Attract a Challan in India | Sakshi
Sakshi News home page

స్లిప్పర్స్ వేసుకుని డ్రైవింగ్ చేస్తే చలాన్ పడుతుందా?: గడ్కరీ క్లారిటీ

Feb 14 2026 8:56 PM | Updated on Feb 14 2026 9:31 PM

Can Driving in Slippers Attract a Challan in India

భారతదేశంలో ట్రాఫిక్ రూల్స్ కఠినంగా ఉంటాయని తెలుసు. అయితే కొందరికి ఈ రూల్స్ గురించి సరైన అవగాహన ఉండదు. కాబట్టి మాటల ద్వారా విన్న విషయాలను నిజమని నమ్మేస్తుంటారు. అలాంటి ఒక సాధారణ అపోహ ఏమిటంటే.. చెప్పులు వేసుకుని వాహనం నడిపితే చలాన్ పడుతుందనే భావన. కొన్నేళ్లుగా ఈ విషయం గురించి చర్చ జరుగుతున్నా, ఇంకా చాలా మందికి ఆ సందేహం అలాగే ఉంది.

భారతదేశంలో అమలులో ఉన్న మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం.. స్లిప్పర్లు వేసుకుని కారు లేదా బైక్ నడపడం నేరం కాదు. ఈ విషయాన్ని 2019లోనే కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. దీంతో ప్రజల్లో ఉన్న అపోహ కొంత వరకు తొలగింది.

స్లిప్పర్లు వేసుకుని వాహనం నడపడం చట్ట విరుద్ధం కానప్పటికీ.. అది పూర్తిగా సురక్షితమని చెప్పలేం. ఎందుకంటే స్లిప్పర్లు సాధారణంగా పాదానికి బిగుతుగా ఉండవు. బ్రేక్ లేదా క్లచ్ వేయాల్సిన సమయంలో జారిపోయే అవకాశం ఉంది.

బైక్ రైడ్ చేసేటపుడూ గేర్ మార్చేటప్పుడు కూడా సరైన నియంత్రణ ఉండకపోవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో క్షణాల్లో స్పందించాల్సి వస్తుంది. అప్పుడు పాదరక్షలు సరిగా లేకపోతే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి భద్రత దృష్ట్యా షూస్ ధరించడం మంచిది. సరైన పాదరక్షలు వాహనంపై మంచి నియంత్రణను ఇస్తాయి & ప్రమాదాలను తగ్గిస్తాయి.

ఇదీ చదవండి: ఈ హోండా బైకుపై రూ.లక్ష డిస్కౌంట్!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement