శీతాకాలంలో పొగమంచు సర్వసాధారణం. ఇది చూడటానికి ఆహ్లాదంగా ఉంటుంది. కానీ వాహనదారులు మాత్రం ఒకింత జాగ్రత్త వహించాలి. లేకుంటే అనుకోని ప్రమాదంలో చిక్కుకోవాల్సి ఉంటుంది. ఈ కథనంలో శీతాకాలం పొగమంచులో డ్రైవింగ్ టిప్స్, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం.
పొగమంచులో డ్రైవింగ్ టిప్స్
నెమ్మదిగా డ్రైవ్ చేయండి: పొగమంచు ఉన్నప్పుడు మీ వాహనాలను నెమ్మదిగా నడపాలి. అకస్మాత్తుగా బ్రేక్స్ వేయడం మానుకోవాలి. ముందున్న వాహనాలను జాగ్రత్తగా గమనించాలి.
ఫాగ్ లైట్స్ ఉపయోగించండి: ప్రయాణించేటప్పుడు.. తప్పకుండా ఫాగ్ లైట్స్ ఉపయోగించాలి. లో బీమ్ హెడ్లైట్ మాత్రం ఆన్ చేయడం మర్చిపోవద్దు. హైబీమ్ లైట్ ఆన్ చేస్తే.. ఎక్కువ లైటింగ్ వల్ల ఎదురుగా వచ్చే వాహనాలు కొంత ఇబ్బందికి గురవుతాయి.
సేఫ్ డిస్టెన్స్ పాటించండి: మీకు ప్రయాణించే సమయంలో తప్పకుండా.. ముందు వెళ్తున్న వాహనానికి డిస్టెన్స్ పాటించండి. ముందు వెళ్తున్న వాహనం అకస్మాత్తుగా ఆగినా.. మీరు ప్రమాదంలో చిక్కుకుండా ఉంటారు. ఈ విషయం తప్పకుండా గుర్తుంచుకోవాలి.
లేన్ డిసిప్లిన్ పాటించండి: వాహనదారులు తప్పకుండా.. రోడ్డు మధ్య లైన్ లేదా ఎడ్జ్ మార్కింగ్‌ని గమనిస్తూ డ్రైవ్ చేయాలి. ఒకవేళా లేన్ మార్చాల్సి వస్తే.. జాగ్రత్తగా ఉండాలి. అవసరమైనప్పుడు హారన్ మోగించడం మర్చిపోవద్దు. అనవసరంగా హారన్ మోగించవద్దు.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వాహనం ముందే చెక్ చేయండి: ప్రయాణించే వాహనం కండిషన్ ఎలా ఉందనే విషయాన్ని.. ముందుగానే గమనించాలి. లైట్స్, బ్రేక్స్, వైపర్స్ సరిగ్గా ఉన్నాయా.. పనిచేస్తున్నాయా అనే విషయం కూడా తెలుసుకోవాలి. విండ్‌షీల్డ్ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
హజార్డ్ లైట్స్ ఆన్ చేసుకోండి: ఫాగ్ లైట్ కాంతి ఎక్కువ అనిపిస్తే.. హజార్డ్ లైట్స్ ఆన్ చేసుకోవాలి. ఈ లైట్స్ వెనుక వచ్చే వాహనాలకు.. ముందు ఒక వాహనం వెళ్తోందని చూపిస్తాయి.
ఇదీ చదవండి: కొత్త కారు కొనే ముందు.. జాగ్రత్తలివి!
మొబైల్ వాడకండి: పొగమంచుతో డ్రైవింగ్ చేసేటప్పుడు మాత్రమే కాకుండా.. డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ వాడకుండా ఉండాలి. వాహనం డ్రైవింగ్ మీదనే మీ పూర్తి దృష్టి పెట్టాలి. మొబైల్ వాడాలంటే.. వాహనం ఆపి ఉపయోగించుకోవడం మంచిది.
ఉదయం, రాత్రి వేళల్లో జాగ్రత్త: ప్రత్యేకింగ్ పొగమంచు ఉదయం, సాయంత్రం, రాత్రి వేళల్లో ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో అత్యవసరమైతే.. తప్పా ప్రయాణం వాయిదా వేసుకోవడం మంచిది. ఒకవేళా ప్రయాణం తప్పనిసరి అయితే.. కొంత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది.


