దాదాపు అన్ని రంగాల్లోనూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) హవా కొనసాగుతోంది. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఈ తరుణంలో ఓపెన్ఏఐ (OpenAI) పెద్దలకోసం 'అడల్ట్ మోడ్' అందించడానికి సిద్ధమైంది. ఇది ఎప్పటి నుంచి అంబాటులోకి వస్తుందనే విషయాన్ని ఆ సంస్థ సీఈఓ శామ్ ఆల్ట్‌మన్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.
అడల్ట్ మోడ్ ఫర్ చాట్‌జీపీటీ (ChatGPT) 2026 మొదటి త్రైమాసికంలో లాంచ్ కానుంది. కొత్త GPT-5.2 మోడల్‌పై బ్రీఫింగ్ సందర్భంగా ఓపెన్ఏఐ అప్లికేషన్స్ సీఈఓ ఫిడ్జీ సిమో ప్రకటించారు. ఇది కేవలం వెరిఫైడ్ అడల్ట్స్ కోసం మాత్రమే. వయసు నిర్దారణతోనే ఈ ఫీచర్స్ యాక్సెస్ లభిస్తుందని వెల్లడించారు.
చాట్‌జీపీటీ అడల్ట్ మోడ్.. వినియోగం కేవలం పెద్దలకు మాత్రమే. దీనిని మైనర్లు ఉపయోగించుకుండా ఉండేందుకు సంస్థ తగిన ఏర్పాట్లు చేస్తోంది. కంపెనీ ప్రస్తుతం ఎంపిక చేసిన దేశాలలో వయస్సు అంచనాకు సంబంధించిన విషయాలను ధృవీకరించడానికి టెస్టింగ్ జరుగుతోందని సిమో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: అన్నింటా రోబోలే!.. మనుషులు ఏం చేయాలి
అడల్ట్ మోడ్ ఖచ్చితంగా ఆప్ట్-ఇన్ అయి ఉంటుంది. డిఫాల్ట్‌గా స్విచ్ ఆఫ్ చేయబడి ఉంటుంది. కంటెంట్‌ను అన్‌లాక్ చేయడానికి వినియోగదారులు స్పష్టంగా అభ్యర్థించి ధృవీకరణను పాస్ చేయాలి. అప్పుడే దీనిని ఉపయోగించుకోవడం సాధ్యమవుతుంది. ఈ మోడ్ పరిమితులకు లోబడి ఉంటుంది.
We made ChatGPT pretty restrictive to make sure we were being careful with mental health issues. We realize this made it less useful/enjoyable to many users who had no mental health problems, but given the seriousness of the issue we wanted to get this right.
Now that we have…— Sam Altman (@sama) October 14, 2025


