డిజిటల్ పేమెంట్లు ఇప్పుడు దేశవ్యాప్తంగా అందుబాటులో ఉన్నాయి, ఇవి భారతదేశాన్ని డిజిటల్–ఫస్ట్ ఆర్థిక వ్యవస్థ వైపు తీసుకెళ్తున్నాయి. ఇవి భద్రతతో పాటు, వినియోగదారులకు చెల్లింపుల్లో సౌకర్యాన్ని అందిస్తాయి. అయితే, డిజిటల్ పేమెంట్లను సురక్షితంగా ఉపయోగించడం, ఆన్‌లైన్ మోసాలకు గురి కాకుండా ఉండటం ఈరోజుల్లో అత్యంత కీలకం.
సంభవించే మోసాలను ముందుగానే గుర్తించగలిగితే అది మీతోపాటు మీ కుటుంబ సభ్యులను కూడా ఆన్ లైన్ మోసాల నుంచి కాపాడడమే కాకుండా అందరికీ సురక్షితమైన, తక్కువ నగదు వినియోగంతో కూడిన ఆర్థిక వ్యవస్థను నిర్మించడంలో సహాయపడుతుంది. ఆధునిక టెక్నాలజీ చెల్లింపులను వేగంగా జరిపేలా, సులభతరంగా మార్చినప్పటికీ, ఆన్‌లైన్ మోసాల నుండి పూర్తి స్థాయి రక్షణ అవగాహనతోనే సాధ్య పడుతుంది. ఆన్‌లైన్ మోసాలు, ముఖ్యంగా సామాజిక ఇంజినీరింగ్ ద్వారా జరిగేవి ఇటీవలి కాలంలో చాలా ఆందోళనగా కలిగిస్తున్నాయి. దురాశ, భయం, అత్యవసరం వంటి భావోద్వేగాలను సాధనాలుగా ఉపయోగించి ఆన్‌లైన్ మోసగాళ్లు వినియోగదారులను వంచిస్తారు.
ఇటీవలి కాలంలో వేగంగా పెరుగుతున్న ధోరణుల్లో ఒకటి ‘‘డిజిటల్ అరెస్టు‘ తమను పోలీసులమని చెప్పుకుంటూ ఎవరో కాల్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. మీ బ్యాంక్ ఖాతా దర్యాప్తులో ఉందని, డబ్బును ‘సురక్షిత’ ఖాతాకు మార్చాలని వారు చెబుతారు. వెంటనే మానసిక ఒత్తిడికి గురైన వినియోగదారులు వారి ట్రాప్‌లో పడి అంతా పోగొట్టుకుని చాలా ఆలస్యంగా అది మోసమని గ్రహిస్తారు. నిజమైన ప్రభుత్వ సంస్థలు, నియంత్రణ సంస్థలు ఎప్పుడూ ఫోన్లు, వీడియో కాల్ ద్వారా డబ్బు అడగవు, కేసులను దర్యాప్తు చేయవు. డబ్బు విషయంలో నిర్ణయం తీసుకునే ముందు కాల్ చేసిన వ్యక్తి నిజస్వరూపాన్ని నిర్ధారించుకోవడం, నమ్మకమైన ప్రభుత్వ సంస్థలను సంప్రదించడం చాలా ముఖ్యం.
వేగంగా పెరుగుతున్న పెట్టుబడి మోసాలు
ఆరి్ధక నిపుణులుగా పరిచయం చేసుకుని మోసంచేసే వారు ఇటీవలి బాగా పెరిగారు. పేరున్న సంస్థలను, నకిలీ రిఫరెన్సులను అమాయక, ఔత్సాహిక ఇన్వెస్టర్లను మోసగించేందుకు వీరు ఉపయోగిస్తారు.అసాధారణ లాభాలు , ప్రత్యేక పెట్టుబడి అవకాశాలను అందిస్తామని వాగ్దానం చేస్తారు. బదులుగా డబ్బు అందుకున్న వెంటనే అదృశ్యమైపోతారు. అందుకే ఎల్లప్పుడూ సెబీ, ఆర్‌బీఐ ఇతర అధికారిక నియంత్రణ సంస్థల వెబ్‌సైట్లలో నమోదైన సంస్థల జాబితాలను తనిఖీ చేస్తుండాలి.
వినియోగదారులు సురక్షితంగా ఎలా ?
డిజిటల్ పేమెంట్‌లను ఆమోదించే ముందు వినియోగదారులు ఎల్లవేళలా యాప్ నోటిఫికేషన్‌లను జాగ్రత్తగా పరిశీలించాలి, మోసం జరిగితే వెంటనే తమ బ్యాంకుకు తెలియజేయాలి లేదా 1930 (సైబర్ సెక్యూరిటీ హెల్ప్‌లైన్)కు కాల్ చేయాలి, అలాగే నిర్ధారించని యాప్‌లను డౌన్‌లోడ్ చేయకూడదు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(NPCI) కూడా తక్షణ చెల్లింపు వ్యవస్థ –యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(UPI) వ్యవస్థలో అనేక భద్రతా చర్యలను అమలు చేస్తోంది. తెలియని యూపీఐ ఐడీలకు డబ్బు పంపేటప్పుడు హెచ్చరిక సందేశాలతో ప్రారంభ అలర్ట్‌లు, అలాగే డివైస్ బైండింగ్ లాంటి రెండంచెల ధృవీకరణతో కూడిన భద్రతా వ్యవస్థను అమల్లోకి తెచ్చింది.
‘మే మూర్ఖ్ నహీ హూన్’’ వంటి ప్రచార వీడియోల ద్వారా ప్రజల్లో అవగాహనను పెంచడానికి కూడా ఎన్‌పీసీఐ కృషి చేస్తోంది. డిజిటల్ భద్రతగా ఉండడం, ఆన్‌లైన్ మోసాల విషయంలో అప్రమత్తతతో ఉండే సంస్కృతిని వినియోగదారుల్లో పెంపొందించేందుకు ప్రయత్నిస్తోంది. డిజిటల్ పేమెంట్లు ప్రతి వినియోగదారుడికి సులభంగా సురక్షితంగా ఉండేలా చేస్తోంది.


