గ్రామీణ ఉపాధి పథకం: కొత్త పేరు ఇదే.. | Centre to bring new rural employment Bill | Sakshi
Sakshi News home page

గ్రామీణ ఉపాధి పథకం: కొత్త పేరు ఇదే..

Dec 15 2025 1:09 PM | Updated on Dec 15 2025 2:45 PM

Centre to bring new rural employment Bill

ఢిల్లీ, సాక్షి: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మారుస్తున్న సంగతి తెలిసిందే. ఆ పథకానికి వికసిత్‌ భారత్‌ -  జీ- రామ్‌- జీ (గ్యారెంటీ ఫర్‌ రోజ్‌గార్‌ అండ్‌ ఆజీవిక మిషన్‌ (గ్రామీణ్‌)) పేరును పెట్టింది. దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో  సోమవారం ప్రవేశపెడుతోంది.

బిల్లులోని ముఖ్యాంశాలు

  • ఇక నుంచి గ్రామ పంచాయతీల ద్వారా పనులకు ప్రణాళికలు
  • ప్రస్తుత పని దినాలు 100 నుంచి 125కు పెంపు
  • వ్యవసాయ సీజన్‌లలో కూలీల కొరత రాకుండా ఉపాధి పనులు 60 రోజుల వరకు తాత్కాలికంగా నిలిపివేసే వెసులుబాటు
  • వికసిత భారత్ లక్ష్యాలకనుగుణంగా రాష్ట్ర, జిల్లా, బ్లాక్ స్థాయిలో పనుల ప్రణాళికలు
  • వారానికోసారి కూలి చెల్లింపు తప్పనిసరి
  • ఏబీసీ కేటగిరీలుగా గ్రామ పంచాయతీల విభజన
  • కేంద్రం నిర్ధారించిన పారామీటర్స్ ఆధారంగా రాష్ట్రాల వారీగా ఉపాధి హామీ నిధులు కేటాయింపు  
  • కేటాయింపునకు అదనంగా నిధులు ఖర్చు చేస్తే వాటిని భరించే బాధ్యత రాష్ట్రాలదే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement