రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత 'రాబర్ట్ కియోసాకి' క్యాష్, ట్రాష్, క్రాష్ అంటూ.. ఎక్కడ పెట్టుబడులు పెట్టాలి అనే విషయాలను గురించి వివరించారు. దీనికి సంబంధించిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
క్రాష్‌లో క్యాష్ అంటే ట్రాష్ కాదు అని ట్వీట్ ప్రారంభించిన కియోసాకి.. ప్రపంచ ప్రసిద్ధ పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్ స్టాక్స్, బాండ్స్ వంటివి విక్రయించి ఎందుకు బిలియన్ల కొద్దీ నగదుతో కూర్చున్నారు? అని ప్రశ్నించారు. దీనికి కారణం ''keeping his powder dry'' అనే వ్యూహం. అంటే మార్కెట్ పడిపోయిన తర్వాత మంచి కంపెనీలు లేదా విలువైన ఆస్తులు తక్కువ ధరకు అందుబాటులోకి వస్తాయి. అప్పుడు వాటిని కొనడానికి చేతిలో డబ్బు ఉండాలి.
నా వ్యూహం ఏమిటంటే.. నా దగ్గర ఉన్న డబ్బును మరిన్ని ఆయిల్ వెల్స్, బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి పెట్టుబడుల్లో పెట్టాను. అంటే ప్రతి వ్యక్తి లేదా పెట్టుబడిదారుడు.. తన ఆలోచనలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. మరొక విషయం ఏమిటంటే.. పెద్ద ఆర్థిక సంక్షోభం వచ్చిన తర్వాత కూడా బంగారం, వెండి, బిట్‌కాయిన్ ధరలు పెరిగే అవకాశం ఉందని కియోసాకి పేర్కొన్నారు. ఇప్పుడు నా ఆలోచన తప్పుగా అనిపించవచ్చు. కానీ పెట్టుబడుల్లో ఎప్పుడూ రిస్క్ ఉంటుందని వివరించారు.
ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్లో నష్టపోయారా?.. కియోసాకి సూచనలు
మార్కెట్ పడిపోయినప్పుడు మీ వద్ద స్పష్టమైన పెట్టుబడి ప్రణాళిక లేకపోతే, ఏమీ చేయకుండా ఉండటం కూడా ఒక మంచి నిర్ణయం కావచ్చు. తొందరపడి తప్పు నిర్ణయాలు తీసుకోవడం కంటే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిదని కియోసాకి స్పష్టం చేశారు.
CASH is not TRASH in a CRASH
Q: Why has Warren Buffet sold stocks and bonds and is sitting with billions in cash?
A: Because he is “keeping his powder dry” a.k.a. He is in CASH so he can buy priceless assets….after the crash and are on sale.
Q: Should you follow in…— Robert Kiyosaki (@theRealKiyosaki) March 15, 2026


