గోస్ట్ వేర్‌హౌస్‌లు గురించి చాలామంది వినే ఉంటారు. బహుశా కొంతమందికి తెలియకపోవచ్చు. ఇక్కడ మనుషులు కనిపించరు, అందుకే వీటిని గోస్ట్ అని పిలుస్తారు. ఇక్కడంతా ఏఐ ఆధారిత రోబోట్స్ పనిచేస్తుంటాయి. 24/7 అలసట లేకుండా.. సెలవు లేకుండా పనిచేస్తూనే ఉంటాయి. ఇప్పటికే ఇలాంటి తరహా విధానం చైనాలో జరుగుతోంది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
అన్ని పనుల్లో రోబోలే!
పాస్కల్ బోర్నెట్ (Pascal Bornet) అనే ఎక్స్ యూజర్ షేర్ చేసిన వీడియోలో గమనిస్తే.. కొన్ని ఏఐ ఆధారిత రోబోటిక్ వాహనాలు నెమ్మదిగా కదులుతూ.. కంటైనర్లను మోసుకెళ్తుండటం చూడవచ్చు. వీడియోలో ఒక్క మనిషి కూడా కనిపించడు. గిడ్డంగులలో సరుకులు ఎత్తడం, కదలించడం, ప్యాక్ చేయడం వంటివన్నీ ఏఐ రోబోలే చూసుకుంటారు. కాబట్టి మనుషుల అవసరం ఉండదు.
అలీబాబా, జేడీ.కామ్ వంటి పెద్ద ఈ-కామర్స్ కంపెనీలు ఇలాంటి ఏఐ రోబోట్స్ వినియోగిస్తున్నాయి. ఇలాంటి రోబోట్స్ ఉపయోగించడం వల్ల.. కార్మిక కొరత ఉండదు, మానవుల మాదిరిగా తప్పులు జరగవు, ఖర్చులు తగ్గిన్చుకోవచ్చు, పని కూడా వేగంగా.. నిరంతరాయంగా జరుగుతుంది.
Ghost warehouses aren’t science fiction anymore — they’re already humming quietly in China
They are warehouses run entirely by AI-powered robots, operating 24/7 with zero human presence.
China and much of Asia have already embraced this shift, and they’re not slowing down.… pic.twitter.com/Spxwfaq7TJ— Pascal Bornet (@pascal_bornet) December 12, 2025
మనుషులు చేయాల్సింది!
ఈ వీడియో షేర్ చేసిన.. పాస్కల్ బోర్నెట్ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ, పనులన్నీ రోబోలు చేస్తున్నాయి, మనుషులు ఏమి చేయాలో ఆలోచించాలని అన్నారు. రోబోలు ఎప్పుడూ ఒకే పని చేస్తూనే ఉంటాయి. కాబట్టి మీరు డిజైన్, ఇన్నోవేషన్, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ వంటి వారిపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. చివరగా మీరేమనుకుంటున్నారని.. ప్రశ్నిచారు.
ఇదీ చదవండి: వారంలో నాలుగు రోజులే వర్క్!: కొత్త పని విధానం..
పని చేయడానికి రోబోట్స్ ఉపయోగించడం వల్ల.. చాలామంది ఉద్యోగావకాశాలు కోల్పోతారు. అయితే సంస్థలు కొత్త స్కిల్స్ రోబోల నుంచి ఆశించడం అసాధ్యం. రోబోట్స్ వినియోగం చైనా వంటి దేశాల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. భారతదేశంలో కూడా ఇలాంటి విధానం ప్రారంభం కావడానికి ఎంతోకాలం పట్టకపోవువచ్చు. కాబట్టి అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ''మనుషులు కష్టపడే యంత్రాలు కాదు - ఆలోచించే సృష్టికర్తలు''. కాబట్టి మనిషి ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ స్కిల్స్ పెంచుకుంటూ ఉండాలి.


