ఇంటి దగ్గర ఉన్న సాధారణ నీటి పైపులు రాత్రి వీధి దీపాలను వెలిగించగలవంటే నమ్ముతారా? నిజమే. ఎలాంటి సౌర ఫలకాలూ లేకుండా, పెద్ద యంత్రాలను అమర్చే అవసరం లేకుండా కేవలం నీరు పారుతూనే విద్యుత్ తయారవుతోంది. ఇదే ఇజ్రాయెల్ ఇంజినీర్లు ఆవిష్కరించిన ‘స్మార్ట్ వాటర్ పైప్స్’ మ్యాజిక్!
పైపుల లోపల చిన్న చక్రాలు లాంటివి అమర్చితే, నీరు ఒత్తిడితో ప్రవహించినప్పుడు అవి మెల్లగా తిరుగుతాయి. ఆ తిప్పుడే నీటి ప్రవాహాన్ని నేరుగా విద్యుచ్ఛశక్తిగా మారుస్తుంది. నీరు మాత్రం ఎలాంటి అడ్డంకి లేకుండా తన దారినే ప్రవహిస్తుంది. నగరాలు ఇప్పుడు ఈ స్మార్ట్ ఎనర్జీ పైపులను పరీక్షిస్తున్నాయి.
వీధి దీపాలు వెలిగించడం నుంచి నగరంలోని సెన్సర్లు పనిచేయించడం వరకూ ఇవే సరిపోతున్నాయని తేలింది. అంతేకాదు, పైపుల్లో ఎక్కడ లీక్ ఉందో, నీటి నాణ్యత ఎలా ఉందో కూడా వెంటనే తెలియజేస్తాయి. ఇలా మన చుట్టూ ఉన్న చిన్న వ్యవస్థలే భవిష్యత్తును ఎలా మార్చగలవో ఈ పైపులు చూపుతున్నాయి.


