]
రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్, వోడాఫోన్-ఐడియా ఎప్పటికప్పుడు తమ కస్టమర్ల కోసం లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ ప్రవేశపెడుతున్న సమయంలో బీఎస్ఎన్ఎల్ కూడా.. ఇదే బాటలో పయనిస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పుడు 365 రోజుల ప్లాన్ పరిచయం చేసింది. ఈ లేటెస్ట్ రీఛార్జ్ ప్లాన్ గురించి పూర్తి వివరాలు ఈ కథనంలో చూసేద్దాం.
బీఎస్ఎన్ఎల్ పరిచయం చేసిన రూ. 2399 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో వస్తుంది. రోజుకి 2జీబీ డేటా, 100 ఎస్‌ఎమ్ఎస్‌లు, అపరిమిత కాల్స్ ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా పొందవచ్చు. ఈ విషయాన్ని బీఎస్ఎన్ఎల్ తన ఎక్స్ ఖాతాలో పేర్కొంటూ.. నాన్ స్టాప్ కనెక్షన్ అని పోస్ట్ చేసింది.
సంవత్సరం ప్లాన్ కోరుకునేవారికి ఈ ప్లాన్ అనుకూలంగా ఉంటుంది. ఈ రీఛార్జ్ ప్లాన్ ధర రిలయన్స్ జియో, ఎయిర్‌టెల్ కంటే తక్కువే. దీన్నిబట్టి చూస్తుంటే.. బీఎస్ఎన్ఎల్ తన కస్టమర్ల కోసం ఎప్పటికప్పుడు కొత్త ప్లన్స్ పరిచయం చేస్తూ ముందుకు సాగుతుందని స్పష్టమవుతోంది.
Attention !!!
Non- stop connection at 2399/- for 365 days#BharatFibre #SuccessStory #Partnership #4Gmobile #BusinessSuccess #BSNLSelfCareApp #SwitchToBSNL #entertainment #mobilerecharge #fypage✨ #explorepage pic.twitter.com/774dFc3jeJ— BSNL_Kolkata (@BSNL_KOTD) December 13, 2025


