టెలికాం రంగంలో అతిపెద్ద యూజర్ బేస్, రీఛార్జ్ ప్లాన్ల విస్తృత పోర్ట్‌ఫోలియోను కలిగి ఉన్న రిలయన్స్ జియో.. తన కస్టమర్ల కోసం తక్కువ-ధర, హై-ఎండ్ విభాగాలలో విస్తృత శ్రేణి ప్లాన్‌లను అందిస్తోంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ రోజులు సిమ్ కార్డును యాక్టివ్‌గా ఉంచుకోవాలనుకునే కస్టమర్ల కోసం దీర్ఘకాల వ్యాలిడిటీతో చౌక రీచార్జ్‌ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
మిలియన్ల మంది మొబైల్ వినియోగదారుల అవసరాలను గుర్తించి, జియో ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాలిడిటీ రీఛార్జ్ ప్లాన్ల జాబితాలో చేర్చిన ప్లాన్ ధర రూ.2025. ఖరీదైన 365 రోజుల రీఛార్జ్ ప్లాన్ కొనడానికి ఇష్టపడని కస్టమర్లకు ఈ ప్లాన్ ఉత్తమ ఎంపిక. జియో ఈ ప్లాన్‌ను ఉత్తమ 5జీ ప్లాన్లలో ఒకటిగా లిస్ట్ చేసింది.
ప్లాన్ ప్రయోజనాలు
జియో తన రూ.2025 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తో వినియోగదారులకు 200 రోజుల సుదీర్ఘ వాలిడిటీని అందిస్తుంది. అన్ని మొబైల్ నెట్ వర్క్ లకు 200 రోజుల పాటు అపరిమిత కాలింగ్ ను ఆనందించవచ్చు. ఇక డేటా ప్రయోజనాల విషయానికి వస్తే.. 200 రోజుల పాటు మొత్తం 500 జిబి డేటాను అందిస్తుంది. రోజుకు 2.5 జీబీ వరకు హై స్పీడ్ డేటాను వినియోగించుకోవచ్చు. ఇంకా ఈ ప్లాన్ లో రోజుకు 100 ఉచిత ఎస్ఎంఎస్‌లు ఉన్నాయి. ఈ ప్లాన్ తో అపరిమిత 5జీ డేటాను ఆనందివచ్చు.
జియో యూజర్లు ఈ ప్లాన్ తో కొన్ని అదనపు ప్రయోజనాలను కూడా పొందుతారు. ఈ ప్లాన్ లో మూడు నెలల పాటు జియో హాట్ స్టార్ కు ఉచిత సబ్ స్క్రిప్షన్ కూడా ఉంది. మీరు టీవీ ఛానెల్స్ చూడాలనుకుంటే జియో టీవీకి కూడా ఉచిత యాక్సెస్ పొందుతారు. డేటా స్టోరేజ్ కోసం 50 జీబీ జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ కూడా ఈ ప్లాన్ లో ఉంది.


