హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్.. 2025వ సంవత్సరాన్ని సరికొత్త రికార్డుతో ముగించింది. కంపెనీకి చెందిన క్రెటా 2,00,000 యూనిట్లకు పైగా అమ్మకాలను నమోదు చేసింది. భారతదేశంలో దాని విభాగంలో.. అత్యంత పోటీ ఉన్నప్పటికీ మంచి అమ్మకాలను సాధించగలిగింది.
2025లో హ్యుందాయ్ రోజుకు 550 క్రెటా కార్లను విక్రయించింది. అంటే.. మార్కెట్లో ఈ కారుకు ఎంత డిమాండ్ ఉందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మొత్తం మీద హ్యుందాయ్ క్రెటా గత ఐదు సంవత్సరాలుగా (2020–2025) భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన SUVగా అవతరించింది. మిడ్-సైజ్ SUV విభాగంలో 34 శాతానికి పైగా కమాండింగ్ మార్కెట్ వాటాతో, దాని పోటీదారుల కంటే అమ్మకాల్లో చాలా ముందుంది.
క్రెటా రెండు లక్షల కంటే ఎక్కువ అమ్మకాలను పొందిన సందర్భంగా.. హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ డిజిగ్నేట్ తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. భారతదేశంలో హ్యుందాయ్ క్రెటా ప్రయాణం అసాధారణమైనది. 2 లక్షల యూనిట్లకు పైగా వార్షిక అమ్మకాలను సాధించడం అనేది చాలా గొప్ప విషయం అని అన్నారు.


