వెనుకబడ్డ టెస్లా.. అమ్మకాల్లో ఫోక్స్‌వ్యాగన్ | Tesla Sales Down Know The Reasons | Sakshi
Sakshi News home page

వెనుకబడ్డ టెస్లా.. అమ్మకాల్లో ఫోక్స్‌వ్యాగన్

Feb 5 2026 4:54 PM | Updated on Feb 5 2026 6:52 PM

Tesla Sales Down Know The Reasons

అమెరికన్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా.. యూరోపియన్ మార్కెట్లో అమ్మకాల పరంగా వెనుకబడింది. రిజిస్ట్రేషన్ డేటా ప్రకారం.. టెస్లా జనవరి 2026 నుంచి మోడల్ వై కార్లను కేవలం 62 మాత్రమే విక్రయించింది. ఇది మొత్తం కొత్త కార్ల అమ్మకాలలో 2.8 శాతం మాత్రమే.

టెస్లా ఈ ఏడాది మొత్తం 83 కార్లను విక్రయించింది. గత ఏడాది ఇదే నెల అమ్మకాలతో పోలిస్తే ఇది 88 శాతం తక్కువ. ఇప్పుడు అమ్మకాల్లో ఫోక్స్‌వ్యాగన్ అగ్రస్థానంలో ఉంది. టెస్లా కంటే ఐదు రేటు ఎక్కువ అమ్మకాలు సాధించింది.

టెస్లా సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ.. నార్వేలోని ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. దీనివల్ల టెస్లా అమ్మకాలు కొంత ఆశాజనకంగానే ఉన్నాయి. గత నెలలో నార్వేలో జరిగిన అన్ని కొత్త వాహనాల అమ్మకాలలో 94 శాతం ఈవీలు ఉన్నాయి. డీజిల్ కార్లు 98 కాగా, పెట్రోల్ కార్ల అమ్మకాలు కేవలం 7 మాత్రమే.

మోడల్ ఎక్స్, ఎస్ నిలిపివేత!
అమెరికన్ కార్ల తయారీ దిగ్గజం టెస్లా.. తన పాపులర్ మోడల్స్ 'ఎస్, ఎక్స్' ఎలక్ట్రిక్ కార్లను దశలవారీగా నిలిపివేయనున్నట్లు వెల్లడించింది. బదులుగా.. హ్యూమనాయిడ్ రోబోలను ఉత్పత్తి చేయడానికి కాలిఫోర్నియా ఫ్యాక్టరీని తిరిగి ఏర్పాటు చేస్తామని సీఈఓ ఎలాన్ మస్క్ తెలిపారు.

2012, 2015లో మార్కెట్లో విడుదలైన టెస్లా మోడల్ ఎస్, మోడల్ ఎక్స్ కార్లను అతి తక్కువ కాలంలోనే అధిక ప్రజాదరణ పొందాయి. స్టార్టప్ నుంచి టెస్లా ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటోమేకర్‌గా ఎదగడానికి ఇవి దోహదపడ్డాయి. అలాంటి కార్లను కంపెనీ నిలిపివేయడానికి సిద్ధమైంది. పెట్టుబడిదారులు & వాల్ స్ట్రీట్ విశ్లేషకులతో జరిగిన సమావేశం తరువాత మస్క్ ఈ ప్రకటన చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement