ఆదాయంలో గూగుల్ సరికొత్త రికార్డ్.. మస్క్ రియాక్షన్ ఇదే! | Sundar Pichai Tweet About Google Revenue Growth And Elon Musk Reply | Sakshi
Sakshi News home page

ఆదాయంలో గూగుల్ సరికొత్త రికార్డ్.. మస్క్ రియాక్షన్ ఇదే!

Feb 5 2026 2:42 PM | Updated on Feb 5 2026 3:34 PM

Sundar Pichai Tweet About Google Revenue Growth And Elon Musk Reply

ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్.. ఆదాయం విషయంలో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడించారు. దీనిపై ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ స్పందించారు.

''మా సంస్థకు సంబంధించిన 2025 ఆర్ధిక సంవత్సరం నాలుగవ త్రైమాసికం ఆర్థిక ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలు మా ప్రయాణంలో ఒక చారిత్రక మైలురాయిగా నిలిచాయి. మా భాగస్వాములు & ఉద్యోగుల అంకితభావం, కృషి వల్ల ఈ త్రైమాసికం విజయవంతంగా ముగిసింది. ముఖ్యంగా.. మా వార్షిక ఆదాయం తొలిసారిగా 400 బిలియన్ డాలర్లను అధిగమించడం.. గర్వించదగ్గ విషయం'' అని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు.

సుందర్ పిచాయ్ పోస్టుపై స్పందించిన ఎలాన్ మస్క్..'వెల్ డన్' అని రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

2025 ఆర్ధిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో.. సెర్చ్ & ఇతర యాడ్స్ విభాగం 17 శాతం వృద్ధిని సాధించింది. జెమిని యాప్ నెలకు 750 మిలియన్లకు పైగా యాక్టివ్ యూజర్లను కలిగి ఉంది. 2025లో యూట్యూబ్ యాడ్స్ & సబ్‌స్క్రిప్షన్ ద్వారా 60 బిలియన్ డాలర్లకు పైగా ఆదాయం వచ్చింది. ఇలా విభాగాల వారీగా గూగుల్ కంపెనీ మంచి వృద్ధిని నమోదు చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement