breaking news
elon musk
-
భారత్‌లో టెస్లా బిగ్ డీల్!.. నెలకు రూ.17.22 లక్షల రెంట్
ప్రపంచం కుబేరుడు 'ఎలాన్ మస్క్' యాజమాన్యంలోని ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం 'టెస్లా'.. ముంబైలో తన మొదటి షోరూమ్ ప్రారంభించింది. ఇప్పుడు తన రెండో షోరూంను ప్రారంభించడానికి సిద్ధమవుతోంది.తన రెండో షోరూమ్ కోసం టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ ఢిల్లీలోని ఏరోసిటీలో 8,200 చదరపు అడుగుల స్థలాన్ని తొమ్మిది సంవత్సరాలకు లీజుకు తీసుకుంది. దీని నెలవారీ అద్దె రూ. 17.22 లక్షలు. ఈ విషయాన్ని డాక్యుమెంట్స్‌ను అసెస్ చేసిన 'సీఆర్ఈ మ్యాట్రిక్స్' వెల్లడించింది.టెస్లా ఈ స్థలాన్ని ఓక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి చదరపు అడుగుకు రూ. 210 చొప్పున.. రూ.1.03 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్‌తో లీజుకు తీసుకుంది. అంతే కాకుండా టెస్లా నెలకు రూ. 6,000 చొప్పున 10 పార్కింగ్ స్లాట్లను కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: ప్రపంచాన్ని వణికించిన '1929 మహా మాంద్యం': ప్రధాన కారణాలు ఇవే..జూలై 15, 2025న ప్రారంభమయ్యే లీజు మొదటి సంవత్సరానికి రూ. 40.17 లక్షలు, రెండవ సంవత్సరంలో రూ. 42.07 లక్షలు, మూడవ సంవత్సరంలో రూ. 44.07 లక్షలు, నాల్గవ సంవత్సరంలో రూ. 46.17 లక్షలు, ఐదవ సంవత్సరంలో రూ. 48.36 లక్షలు, ఆరవ సంవత్సరంలో రూ. 50.66 లక్షలు, ఏడవ సంవత్సరంలో రూ. 53.06 లక్షలు, ఎనిమిదవ సంవత్సరంలో రూ. 55.58 లక్షలు, తొమ్మిదవ సంవత్సరంలో రూ. 58.22 లక్షలకు చేరుకుంటుంది. -
‘ఓపెన్ఏఐతో మైక్రోసాఫ్ట్ సర్వనాశనం’
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రేసులో మాది గొప్ప అంటే మాది గొప్ప.. అంటూ చంకలు చరుచుకోవడం కంపెనీలకు అలవాటైంది. మైక్రోసాఫ్ట్ భాగస్వామ్యంగా ఉన్న ఓపెన్ఏఐ తాజాగా విడుదల చేసిన చాట్‌జీపీటీ-5 మోడల్ ఎంతో సమర్థంగా పని చేస్తుందని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ఎలాన్‌మస్క్ స్పందిస్తూ త్వరలో ఓపెన్ఏఐ మైక్రోసాఫ్ట్‌ను నాశనం చేస్తుందని చెప్పారు.సత్య నాదెళ్ల పోస్ట్ చేస్తూ..‘ఈ రోజు జీపీటీ-5 మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్, కోపైలట్, గిట్‌హబ్ కోపైలట్, అజూర్ ఏఐ ఫౌండ్రీతో సహా మా ప్లాట్ఫామ్ల్లో లాంచ్ అవుతుంది. ఇది ఓపెన్ఏఐ వద్ద ఉన్న అత్యంత సమర్థవంతమైన మోడల్. ఇది రీజనింగ్, కోడింగ్, చాట్‌లో మెరుగైన పురోగతిని అందిస్తుంది. దీని మోడల్స్ అన్నీ అజూర్‌లో శిక్షణ పొందాయి. సామ్ఆల్ట్మన్ మాతో చేరి రెండున్నరేళ్లు అయిందంటే నమ్మలేకపోతున్నాం. బింగ్‌లో జీపీటీ-4 ఇంప్లిమెంట్ చేసేందుకు సామ్ మాతో చేరారు. అప్పటి నుంచి ఎంతో సాధించాం. తాజా పురోగతితో వేగం పెరుగుతుంది. ఈ మోడల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’ అన్నారు.Today, GPT-5 launches across our platforms, including Microsoft 365 Copilot, Copilot, GitHub Copilot, and Azure AI Foundry. It's the most capable model yet from our partners at OpenAI, bringing powerful new advances in reasoning, coding, and chat, all trained on Azure.It’s… pic.twitter.com/jHDA94YOL0— Satya Nadella (@satyanadella) August 7, 2025ఇదీ చదవండి: ‘భారత్‌ను బెదిరిస్తారు’.. సూపర్ పవర్‌గా ఎదగాలంటే..సత్య పోస్ట్‌పై ఎలాన్‌మస్క్ స్పందిస్తూ.. ‘త్వరలో ఓపెన్ఏఐ మైక్రోసాఫ్ట్‌ను బ్రతికుండగానే మింగేస్తుంది’ అన్నారు. దీనిపై సత్య ప్రతిస్పందిస్తూ.. ‘కొందరు 50 ఏళ్లుగా అందుకోసం ప్రయత్నిస్తున్నారు. అదే సరదా అయిన విషయం! ప్రతిరోజూ మీరు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటారు. సృజనాత్మకతను జోడిస్తూ భాగస్వామిగా మారుతారు. తర్వాత ఇతరులతో పోటీపడతారు. అజూర్‌లో గ్రోక్ 4 వినియోగంపట్ల ఉత్సాహంగా ఉన్నాను. గ్రోక్ 5 కోసం ఎదురుచూస్తున్నాను!’ అని రాసుకొచ్చారు. ‘గ్రోక్ 4 హెవీ రెండు వారాల క్రితం జీపీటీ 5 కంటే స్మార్ట్‌గా ఉంది’ అని మస్క్ రిప్లై ఇచ్చారు. దాన్ని సూచించే కొన్ని డేటా పాయింట్లు ఉన్న పోస్ట్‌ను కోట్ చేశారు.OpenAI is going to eat Microsoft alive— Elon Musk (@elonmusk) August 7, 2025People have been trying for 50 years and that’s the fun of it! Each day you learn something new, and innovate, partner, and compete. Excited for Grok 4 on Azure and looking forward to Grok 5!— Satya Nadella (@satyanadella) August 7, 2025 -
పాటుపడనిదే 'ఫలితం' రాదు!
ధన్యవాదాలు.నేను చెప్పగలిగినవి, అత్యంత ఉపయోగకరమైనవి, ఏవైనా ఉంటే చెప్పవలసిందని నాకు సుమారు ఐదు నుంచి ఆరు నిమిషాల సమయం ఇచ్చారు. వీలైనంత ప్రయత్నిస్తాను. ఏవైనా మూడు అంశాలకు పరిమితం కావలసిందని కూడా నాకు సూచించారు. నేను నాలుగు అంశాలు చెప్పాలనుకుంటున్నాను. అవి చాలా ముఖ్యమైన అంశాలని నేను భావిస్తున్నాను. వాటిలో కొన్ని ఇంతకు ముందు మీరు విన్నవి కూడా కావచ్చు. కానీ, వాటి గురించి మళ్ళీ చెప్పు కోవడంలో తప్పు లేదు.కష్టపడి పనిచేయాలి!మొదటిది – కృషి చేయడం! మీరు ఒక పనిని ఎంత బాగా చేయాలనుకుంటున్నారో, దాని కోసం అంతగా కృషి చేయాలి. మీరు ఒక కంపెనీని నెలకొల్పదలిస్తే, దానికి సంబంధించి మీరు ఇంకా ఎక్కువ పాటుపడాలి. ఎంతగా అంటారా... నేను, నా సోదరుడు కలసి మొదటి కంపెనీని ప్రారంభించినపుడు, అపార్ట్మెంట్ తీసుకోవడానికి బదులు, ఒక చిన్న ఆఫీసును అద్దెకు తీసుకున్నాం. అక్కడే సోఫాలో పడుకునేవాళ్ళం. స్నానాలు, నిత్యకృత్యాలు వై.ఎం.సి.ఏ.లో కానిచ్చేసే వాళ్ళం. ఎంత కష్టపడ్డామంటే, ఒకటే కంప్యూటర్ ఉండేది. పగటి పూట వెబ్‌సైట్‌కి వాడుకునేవాళ్ళం. కోడింగ్ పని నేను రాత్రిపూట చేసేవాడిని. వారంలో 7 రోజులూ, మొత్తం సమయాన్ని దానికే వెచ్చించేవాళ్ళం. నా సంగతి తెలుసుగా! నాకో గర్ల్ ఫ్రెండ్ ఉండేది. నాతో ఉండటం కోసం, ఆమె కూడా ఆఫీసులోనే పడుకునేది. కనుక కష్ట పడాలి. మెలకువగా ఉన్నంతసేపూ పని చేస్తూనే ఉండాలి. అదే నేను చెప్పదలచుకుంది. ముఖ్యంగా మీరు ఏదైనా కంపెనీ ప్రారంభించాలంటే శ్రమించక తప్పదు. ఏమీ లేదు. చిన్న లెక్కే. ఎవరన్నా వారి సంస్థ కోసం వారానికి 50 గంటలు పని చేస్తున్నారనుకుందాం. మీరు 100 గంటలు పని చేయాలి. ఫలితంగా,రెండింతల పని పూర్తవుతుంది. తర్వాత కాలంలో, ఆ ఇతర కంపెనీలలా పనిచేసినా ఫరవాలేదు.గొప్ప బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలి!రెండవ సంగతి. మీరు ఏదైనా కంపెనీ ప్రారంభిస్తున్నా లేదా ఏదైనా కంపెనీలో చేరదలచుకున్నా కూడా ప్రజ్ఞావంతుల సాహ చర్యం లభించేటట్లు చూసుకోండి. పెట్టదలచుకుంటే ప్రతిభా వంతులతో కంపెనీ పెట్టండి లేదా మీరు గౌరవించే ప్రతిభావంతులున్న కంపెనీలో చేరండి. కంపెనీ అంటే ఏమిటి? ఒక వస్తువును తయారు చేసేందుకు లేదా ఒక సేవను అందించేందుకు కొంతమంది ఒకచోట చేరి, కలసికట్టుగా పనిచేయడం. అంతేనా? ఒక బృందంలోనివారి శక్తియుక్తులు, కష్టపడి పనిచేసే తత్త్వం, సరైన దిశలో సమన్వయంతో, సమష్టిగా దృష్టి కేంద్రీకరించి పని చేయడాన్ని బట్టి ఆ కంపెనీ విజయం ఆధారపడి ఉంటుంది. అందుకని, కంపెనీని నెలకొల్పదలిస్తే, గొప్ప వ్యక్తులందరినీ ఒక చోట చేర్చేందుకు ఏం చేయాలో అంతా చేయండి. పూర్తిగా మీ పని మీదే దృష్టి పెట్టాలి!హంగు ఆర్భాటాలకన్నా శ్రేష్ఠతపై దృష్టి పెట్టడం మూడవ అంశం. చాలా కంపెనీలు ఈ విషయంలో గందరగోళంగా ఉంటాయి. వస్తువును మెరుగుపరచడానికి, వాస్తవానికి ఏ విధంగానూ తోడ్పని అంశాలపై అవి పెద్ద మొత్తంలో ద్రవ్యాన్ని వెచ్చి స్తూంటాయి. మేం ‘టెస్లా’లో ఎన్నడూ అడ్వర్టయిజింగ్ కోసం ఖర్చు పెట్టింది లేదు. కారును వీలైనంత గొప్పదిగా తీర్చిదిద్దేందుకు డిజైన్, తయారీ, పరిశోధన–అభివృద్ధి విభాగాలపైనే మొత్తం డబ్బు వెచ్చించాం. పయనించాల్సింది ఆ మార్గంలోనేనని అనుకుంటున్నా. ఆ మాటకొస్తే ఏ కంపెనీ విషయంలోనైనా సరే, ‘‘మనం చేస్తున్న ప్రయత్నాలు ప్రజల ఆశలను ప్రతిఫలిస్తున్నాయా? వాటి వల్ల మెరుగైన ఉత్పత్తి ఒనగూడుతోందా? సేవలు సమకూరుతు న్నాయా?’’ అని నిరంతరం ఆలోచిస్తూనే ఉండండి. లేదని భావిస్తే, ఆ ప్రయత్నాలకు అంతటితో స్వస్తి పలకండి. ట్రెండ్స్‌ను ఫాలో కావొద్దు!చివరగా చెప్పదలచుకున్నది ఏమంటే, గొర్రెదాటు మనస్తత్త్వం వద్దు. వర్తమాన ధోరణిని పరిశీలించాల్సిందే. కానీ, దాన్ని గుడ్డిగా అనుసరించ కూడదు. భౌతిక శాస్త్ర దృక్పథంతో చూడటం అన్నమాట. పోల్చి చూసి ఒక నిర్ణయానికి రావడం కన్నా, ఆ వస్తువుల మూలాల్లోకి వెళ్ళాలి. అత్యంత మౌలిక సత్యాలను తెలుసుకునేందుకు ఎంతవరకు అన్వేషించగలరో అంతవరకు అన్వేషించండి. తార్కికతను అక్కడ నుంచి వర్తింప జేయండి. ఒక వస్తువును సృష్టించడంలో లేదా ఏదైనా ఒక పని చేయడంలో ప్రయోజనం ఏమైనా ఉందా లేక మిగిలిన వాళ్ళందరూ చేస్తున్నారు కనుక మనమూ అదే పనిచేస్తున్నామా అని తెలుసుకునేందుకు అదే సరైన మార్గం. ఆ విధంగా ఆలోచించడం కష్టం. అన్నింటి విషయంలోనూ అలాగే ఆలోచించలేం. దానికి చాలా కృషి చేయాలి. ఒప్పుకుంటాను. కానీ, మీరు ఏదైనా కొత్తది చేయదలచుకున్నప్పుడు, అదే ఉత్తమ మార్గం. అది అంతరాత్మ ప్రబోధాలకు వ్యతిరేకమైన అంశాలను అర్థం చేసుకునేందుకు భౌతికశాస్త్రం అభివృద్ధి చేసిన చట్రం. క్వాంటమ్ మెకానిక్స్ లాగా అది చాలా చాలా శక్తిమంతమైన పద్ధతి. రిస్క్ తీసుకోవాలి!అదీ సంగతి. ఇంకొక్కటి చెప్పదలచుకున్నాను. మీరు రిస్క్ తీసుకోవడాన్ని నేను ప్రోత్సహిస్తాను. అందుకు ఇదే సరైన సమయం. మీకు పిల్లాజెల్లా లేరు. బరువు బాధ్యతలు లేవు. మీలో కొందరికి బరువు బాధ్యతలు ఉంటే ఉండవచ్చు. బహుశా పిల్లలు మాత్రం ఉండి ఉండరు. వయసు పెరుగుతున్న కొద్దీ బరువు బాధ్యతలు కూడా పెరుగుతాయి. మీకో కుటుంబం ఏర్పడ్డాక, రిస్కులు తీసుకోవడం ప్రారంభిస్తే, మీతోపాటు మీ కుటుంబంలోని వారు కూడా ఆ రిస్కులను స్వీకరిస్తున్నట్లు లెక్క. ఫలిస్తాయో లేదో తెలియని వాటిని ప్రయత్నించి చూడటం కష్టమవుతుంది. కనుక, సాహసించేందుకు ఇదే తగిన సమయం. బరువు బాధ్యతలు మీద పడకముందే, తెగించండి. ఏమైతే అదవుతుంది అనుకోండి. ధైర్యంగా అడుగు ముందుకు వేయండి. ఈ విషయంలో మీ భుజం తట్టేందుకు నేను రెడీ. చేసిన పనికి చింతించాల్సిన అవసరం ఉండదు. థ్యాంక్యూ. నా మాటలు మీకేమైనా ఉపయోగపడతాయో లేదో నాకు తెలియదు. మంచి విషయాలే మాట్లాడుకున్నాం అనుకుంటా! -
‘మెటా మాదిరి అనైతిక ఆఫర్ ఇవ్వట్లేదు’
మెటా వంటి కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా జరుపుతున్న టాలెంట్ వార్‌పై ఎలాన్ మస్క్ మౌనం వీడారు. సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్స్ ఏర్పాటు కోసం మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఏఐ టాలెంట్వార్ను ప్రారంభించారు. దాదాపు చాలా టాప్ టెక్నాలజీ కంపెనీల నుంచి ఉన్నతస్థాయి ఉద్యోగులను మెటాలో నియమించుకుంటున్నారు. అందుకోసం భారీగా వేతన ప్యాకేజీలు ప్రకటిస్తున్నారు. ఇప్పటికే యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్, విండ్సర్ఫ్.. వంటి ప్రముఖ కంపెనీల నుంచి ఉద్యోగులకు ఆఫర్ లెటర్లు ఇస్తున్నారు. దీనిపై ఎలాన్ మస్క్ తాజాగా వ్యాఖ్యలు చేశారు.ఎక్స్ఏఐలో చేరిన మెటా ఇంజినీర్లను ఉద్దేశించి ఎలాన్ మస్క్ మాట్లాడుతూ..‘కంపెనీ ఏఐ స్టార్టప్ ఎక్స్ఏఐలో చాలా మంది మెటా ఇంజినీర్లు చేరారు. అయితే మెటా మాదిరిగా కాకుండా, ఎక్స్ఏఐ వారిని అనైతికంగా కంపెనీలో చేరడానికి భారీ వేతనాలు ఇవ్వడం లేదు. మెరుగైన నైపుణ్యం కలిగిన చాలా మంది మెటా ఇంజినీర్లు ఎక్స్ఏఐలో చేరుతున్నారు. మెటా కంటే ఎక్స్ఏఐకి చాలా ఎక్కువ మార్కెట్ క్యాపిటల్ వృద్ధి సామర్థ్యం ఉంది. హైపర్ మెరిట్ ఆధారంగా నియమకాలు చేపడుతున్నాం. భారీ ప్యాకేజీల ఆశ చూపడం లేదు’ అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ‘అల్ట్రా హార్డ్ కోర్ ఇంజినీర్లకు ఎక్స్ఏఐ బెటర్ ప్లేస్’ అని మరో పోస్ట్‌లో రాసుకొచ్చారు.ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటలిజెన్స్(ఏజీఐ)ను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన సూపర్ ఇంటెలిజెన్స్ ల్యాబ్(ఎంఎస్ఎల్) అనే కొత్త విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ విభాగంలో పనిచేసే మెటా ఏఐ మోడల్, ఉత్పత్తి బృందాలు ఫండమెంటల్ ఏఐ రీసెర్చ్(ఫెయిర్)ను అభివృద్ధి చేస్తాయని చెప్పారు. ఎంఎస్ఎల్ కింద కొత్త ల్యాబ్ తదుపరి తరం లార్జ్ ల్యాంగ్వేజ్ మోడళ్ల (ఎల్ఎల్ఎం) నిర్మాణంపై దృష్టి పెడుతుందని తెలిపారు.ఇదీ చదవండి: ట్రంప్ టారిఫ్ ఆందోళనలు.. త్వరలో మంత్రి భేటీగూగుల్, ఎక్స్, మెటా, ఓపెన్ఏఐ.. వంటి ప్రధాన కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐ మోడళ్లను సృష్టిస్తున్నాయి. ఈ సంస్థల మధ్య పోటీ తీవ్రతరం అవుతుంది. దాంతో తోటివారికంటే ఓ అడుగు ముందుడాలనే భావనతో కంపెనీ ఏఐ నైపుణ్యాలున్నవారికి భారీ ప్యాకేజీలు ప్రకటిస్తున్నాయి. కృత్రిమ మేధస్సుపై ఆధిపత్యం చెలాయించే రేసులో భాగంగా మెటా కీలక ప్రచారం ప్రారంభించినట్లు ఇటీవల కొన్ని సంస్థలు తెలుపుతున్నాయి. ఈ విభాగంలో అగ్రశ్రేణి ఏఐ ప్రతిభావంతులను ఆకర్షించేందుకు భారీ ప్యాకేజీ ప్రకటిస్తున్నట్లు తెలుస్తుంది. మెరుగైన ఏఐ నైపుణ్యాలున్న ఎక్స్పర్ట్లకు 100 మిలియన్ డాలర్ల (రూ.860 కోట్లు) ప్యాకేజీ చెల్లించేందుకు కూడా వెనుకాడడం లేదని సమాచారం. -
భౌతికశాస్త్ర నియమాలకు సవాలు.. మస్క్ ఫైటర్ జెట్
ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత 'ఎలాన్ మస్క్' టెక్నాలజీలో సరికొత్త మార్గాలను అన్వేషిస్తూ.. కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతూనే ఉంటారు. ఇందులో భాగంగానే భౌతిక శాస్త్ర నియమాలనే సవాలు చేసే ఒక కొత్త యుద్ధ విమానాన్ని ఆవిష్కరించారు. దీని పేరు 'యూఎఫ్ఓ ఫైటర్' (UFO Fighter).ఎలాన్ మస్క్ ఆవిష్కరించిన యుద్ధ విమానం యూఎఫ్ఓ ఫైటర్.. ఇప్పటి వరకు ఉన్న అన్ని విమానాలకంటే భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది. ఈ జెట్ చాలా వేగంగా ప్రయాణించగలదు. అంతే కాకుండా.. అసాధ్యమైన విన్యాసాలు చేయగలదని, ఆకాశంలో నిశ్శబ్దంగా పనిచేయగలదని మస్క్ వెల్లడించారు.ఇదీ చదవండి: మేమంతా ఆమె వెంటే.. వేలకోట్ల ఆఫర్ వదులుకున్న ఉద్యోగులుమస్క్ ఆవిష్కరించిన కొత్త యూఎఫ్ఓ ఫైటర్.. ఎంతోమంది నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. కొందరు ఈ ఫైటర్ జెట్ మీద కొంత సందేహాస్పదంగానే ఉన్నారు. ఇది టెక్నాలజీనా? లేక దార్శనిక భావననా? అని అనుకుంటున్నారు. అయితే మస్క్ కొత్త ఆవిష్కరణ ఓ సరికొత్త విప్లవానికి నాంది పలకనుంది. లేటెస్ట్ ఏరోస్పేస్ టెక్నాలజీ మానవాళి భవిష్యత్తుకు దోహదపడుతుందని పలువురు చెబుతున్నారు. అయితే మస్క్ యూఎఫ్ఓ ఫైటర్ గురించి చాలా విషయాలు తెలియాల్సి ఉంది. -
భారత్‌లో స్టార్‌లింక్ సబ్స్క్రిప్షన్ ఎంతంటే..
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలోని ‘స్టార్‌లింక్’ ఇంటర్నెట్ సేవల సంస్థకు భారత్‌లో ద్వారాలు తెరచుకున్న నేపథ్యంలో సబ్స్క్రిప్షన్ ఎంత ఉండబోతుందనే దానిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇప్పటికే భూటాన్, ఇండోనేషియా, ఒమన్, మాల్దీవులు.. వంటి ఆసియా దేశాల్లో స్టార్‌లింక్ వసూలు చేస్తున్న ఛార్జీలను పరిగణలోకి తీసుకుని భారత్‌లో నెలవారీ ఇంటర్నెట్ సర్వీసులు ఎంతో ఉండొచ్చనే దానిపై కావాలనుకునేవారు ఎంత చెల్లించాలనే వివరాలపై కొన్ని అంచనాలు వెలువడుతున్నాయి.ఇదీ చదవండి: త్వరలో మడతెట్టే యాపిల్ ఫోన్?స్టార్‌లింక్‌కు సంబంధించి కొన్ని అంశాలు..ఇంటర్నెట్ స్పీడ్ 200 ఎంబీపీఎస్ వరకు ఉంటుంది. లొకేషన్‌ను అనుసరించి సగటు వేగం 100 ఎంబీపీఎస్‌గా ఉండొచ్చు.మారుమూల, గ్రామీణ ప్రాంతాలకు లో-ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్ అందిస్తారు.వినియోగదారులు, ఆయా ప్రాంతాన్ని బట్టి నెలకు రూ.3,000 నుంచి రూ.4,200 వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.హార్డ్ వేర్ కిట్‌లో భాగంగా శాటిలైట్ డిష్, రౌటర్‌ను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ధర సుమారు రూ.33,000 ఉండొచ్చు.ఇంటర్నెట్ సర్వీసుల కోసం అనువైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఎయిర్టెల్, జియోతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.బీఎస్ఎన్ఎల్ వంటి ప్రస్తుత టెలికాం సంస్థలకు అంతరాయం కలగకుండా ఉండటానికి భారతదేశం అంతటా 20 లక్షల కనెక్షన్లకే పరిమితం చేశారు. అంతకంటే ఎక్కువ కనెక్టన్లు ఇవ్వకూడదు.2025 చివరి నాటికి భారత్‌లో ఈ సర్వీసులు లాంచ్ చేస్తారని అంచనా. తర్వలో ప్రీ-ఆర్డర్లు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. -
టెక్ దిగ్గజాలు.. ఎవరేం చదివారంటే..
టెక్ బిలియనీర్ల ప్రపంచంలో సుందర్ పిచాయ్, ఎలాన్మస్క్లకు ప్రత్యేక స్థానం ఉంది. సుందర్ పిచాయ్ ఆల్ఫాబెట్ ఇంక్‌కు నాయకత్వం వహిస్తూ, బిలియనీర్ జాబితాలో ఇటీవల చోటు సంపాదించారు. టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ఏఐ వ్యవస్థాపకుడిగా ఎలాన్‌మస్క్ ప్రపంచ కుబేరుల్లో అగ్రస్థానంలో ఉన్నారు. వీరు సారథ్యం వహిస్తున్న కంపెనీల ఉత్పత్తుల ద్వారా నిత్యం పోటీ పడుతున్నారు. ఈ తరుణంలో ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులు వీరి నుంచి అకడమిక్ ప్రమాణాలతోపాటు చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉంది.సుందర్ పిచాయ్చెన్నైలో జన్మించిన సుందర్ పిచాయ్ టెక్ ప్రపంచంలో ఎంతో ప్రసిద్ధి చెందారు. చెన్నైలోని అశోక్ నగర్లో ఉన్న జవహర్ విద్యాలయంలో ప్రాథమిక విద్య అభ్యసించారు. వానవాణి స్కూల్లో హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసి ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలార్జీ ఇంజినీరింగ్ చేశారు. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయం నుంచి మెటీరియల్స్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో ఎంఎస్ చేశారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం నుంచి వార్టన్ స్కూల్ ద్వారా ఎంబీఏ చేశారు. గూగుల్‌లో ప్రొడక్ట్ మేనేజర్‌గా బాధ్యతలు స్వీకరించి సంస్థ అసాధారణమైన పనితీరుతో గూగుల్ యాజమాన్యం తనకు దాసోహమయ్యేలా చేసుకున్నారు. ముఖ్యంగా గూగుల్ క్రోమ్, గూగుల్ టూల్ బార్స్‌ను అందుబాటులోకి తెచ్చి ఔరా అనిపించుకున్నారు. అందుకు ప్రతిఫలంగా సుందర్ పిచాయ్‌కు గూగుల్ యాజమాన్యం సీఈఓ అనే సింహాసనం మీద కూర్చోబెట్టింది. 2015లో గూగుల్‌లో సీఈఓగా బాధ్యతలు చేపట్టినప్పటి అమెరికన్ స్టాక్ మార్కెట్లైన ఎస్ అండ్ పీ 500, నాస్డాక్ల్లో గూగుల్ షేర్లను పరుగులు పెట్టేలా చేశారు.ఇదీ చదవండి: ‘ఏఐ మా ఉద్యోగులను ఏం చేయలేదు’ఎలాన్ మస్క్దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించిన ఎలాన్ మస్క్ చిన్న వయసులోనే కంప్యూటింగ్‌పై ఆసక్తి పెంచుకుని 10 ఏళ్లకే ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు. దక్షిణాఫ్రికాలోని తప్పనిసరి సైనిక సేవను నివారించడానికి క్వీన్స్ విశ్వవిద్యాలయంలో చేరడానికి కెనడా వెళ్లారు. రెండేళ్ల తరువాత పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలో చేరారు. వార్టన్ స్కూల్ నుంచి ఫిజిక్స్, ఆర్థికశాస్త్రంలో మాస్టర్స్ చేశారు. మస్క్ స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో అప్లైడ్ ఫిజిక్స్ అండ్ మెటీరియల్స్ సైన్స్‌లో పీహెచ్డీ కోసం కొంతకాలం చేరారు. కాని కొద్ది రోజులే అందుకు కొనసాగారు. -
ఆలోచనలతో కంప్యూటర్ని కంట్రోల్ చేస్తున్న తొలి మహిళ!
సాంకేతికత కూడిన వైద్యం ఎందరో రోగులకు కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అందుకు ఎన్నో ఉదంతాలు నిదర్శనం. అయితే బ్రెయిన్ సంబంధిత విషయంలో మాత్రం సాంకేతికతను వాడటం కాస్త సవాలు. అయితే దాన్నికూడా అధిగమించి..స్ట్రోక్‌కి గురై పక్షవాతంతో బాధపడుతున్న పేషెంట్లలో కొత్త ఆశను అందించేలా టెక్నాలజీని అభివృద్ధి చేస్తోంది ఎలోన్ మస్క్ స్థాపించిన న్యూరాలింక్ (Neuralink) కంపెనీ. ఇది మానవ మెదడు, కంప్యూటర్ మధ్య నేరుగా కమ్యూనికేషన్ ఏర్పరిచే బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ (BCI) టెక్నాలజీపై పని చేస్తోందనే విషయం తెలిసిందే. ఈ టెక్నాలజీ ద్వారా, మెదడులో చిన్న చిప్‌ను అమర్చి, ఆలోచనల ద్వారా డిజిటల్ పరికరాలను నియంత్రిస్తారు. ప్రస్తుతం ఈ టెక్నాలజీ క్లినకల్ ట్రయల్ దశలో ఉంది. అందులో భాగంగానే ఈ న్యూరాలింక్ చిప్‌ను పొందింది ఆడ్రీక్రూస్ అనే మహిళ. ఎవరామె.? ఆమె ఈ సాంకేతికత సాయంతో ఏం చేసిందంటే..రెండు దశాబ్దాలకు పైగానే ఆడ్రీ కూస్ పక్షవాతానికి గురై మంచానికే పరిమితమైంది. క్లినికల్ ట్రయల్‌లో భాగంగా ఎలోన్ మస్క్ న్యూరాలింక్ చిప్‌ను ఆమె మెదడులో అమర్చారు. దీంతో న్యూరాలింక్ బ్రెయిన్ ఇంప్లాట్ ద్వారా తన ఆలోచనలతో కంప్యూటర్ని నియంత్రిస్తున్న తొలి మహిళగా రికార్డు సృష్టించింది. ఆమె తన మానసిక ఆదేశాలతో తన పేరుని డిజిటల్ రూపంలో రాసింది. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ఎక్స్‌లో షేర్ చేసుకున్నారామె. ఆ పోస్ట్‌లో ఆండ్రీ డిజిటల్ సిరాతో తన పేరును( ఆడ్రీ) సూచించే ల్యాప్‌టాప్ స్క్రీన్ ఫోటోని షేర్ చేశారు. అంతేగాదు దాంతోపాటు ఎర్రటి హార్ట్ సింబల్, ఒక పక్షి, పిజ్జా ముక్క ఉండే డూడుల్‌ని కూడా పంచుకుంది. దీన్ని ఆమె టెలిపతి ద్వారా గీసినట్లుగా ఆ పోస్ట్‌కి క్యాప్షన్ ఇచ్చింది ఆడ్రీ. ఆమె 20 ఏళ్ల తర్వాత తొలిసారిగా తన పేరును రాసిన క్షణం నెట్టింట తెగ వైరల్ అయ్యింది. ఎందుకంటే ఆమె గత 20 ఏళ్లకు పైగా పక్షవాతానికి గురై కదలలేని, మాట్లాడలేని స్థితిలో ఉండిపోయారామె. ఆమె తన చూపుడు వేలుని క్లిక్‌గా, కర్సర్గా మణికట్టుని ఊహించుకుంటూ.. తన మానసిక ఆలోచనలతో కంప్యూటర్ని నియంత్రిస్తుందామె. ఇదంతా ఆమె తన బ్రెయిన్‌తో చేస్తుంది. ఇక్కడ ఆడ్రికి ఈ న్యూరాలింక్ క్లినికల్ ట్రయల్‌లో తొమ్మిదొ పేషెంట్‌గా ఈ చిప్‌ను ఆమెకు అమర్చారు. పుర్రెలో రంధ్రం చేసి మోటారు కార్టెక్స్లో సుమారు 128 కనెక్షన్లతో ఈ చిప్‌ని అమర్చారు. ఈ బీసీఐ(బ్రెయిన్-కంప్యూటర్ ఇంటర్ఫేస్ టెక్నాలజీ) ఆమె మెదడు కదలికలు, సంకేతాలను చదివి వాటిని కర్సర్ కదలికలుగా అనువదిస్తుంది. ఈ బ్రెయిన్ చిప్ ఆమెను మళ్లీ నడిచేలా సాయం చేయలేకపోయినా..డిజిటల్ పరికరాలతో తన మనసులోని మాటలను వ్యక్తం చేయడానికి వీలు కల్పిస్తోంది. ఇది పూర్తి మానసిక ఆలోచనలతో పనిచేస్తుంది. న్యూరాలింక్ అంటే.. 2016లో ఎలోన్ మస్క్ స్థాపించిన న్యూరాలింక్, మానవ మెదడును నేరుగా కంప్యూటర్లకు అనుసంధానించడం లక్ష్యంగా పెట్టుకుంది. పక్షవాతం వంటి నాడీ సంబంధిత పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులు డిజిటల్ స్వాతంత్య్రాన్ని పొందేలా.. సంభాషించడంలో సహాయపడటమే ఈ సాంకేకతికత లక్ష్యం.కాగా, ఇక్కడ ఆడ్రీ ఇలాంటి మరిన్ని పోస్ట్‌లను వీడియోలను పంచుకోవాలని ఆత్రుతగా ఎదురుచూస్తోంది. అంతేగాదు ఆమె తన పోస్ట్‌లో తాను త్వరలో ఇంటికి వస్తానని, ఈ ప్రక్రియ గురించి మరింత వివరంగా తెలిపేలా వీడియోలను కూడా పోస్ట్ చేస్తానని పేర్కొనడం విశేషం. ఈ న్యూరాలింక్ సాంకేతికతను వినియోగించిన తొలి మహిళగా ఆమె ప్రస్థానం పూర్తి స్థాయిలో విజయవంతం కావాలని ఆశిద్దాం.(చదవండి: 12వ తరగతి డ్రాపౌట్..సొంతంగా జిమ్..ఇంతలో ఊహకందని మలుపు..!) -
స్టార్‌లింక్ ఇచ్చేది 20 లక్షల కనెక్షన్లే
న్యూఢిల్లీ: అమెరికన్ శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థ స్టార్‌లింక్ నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌లాంటి దేశీ టెలికం సంస్థలకు ఎలాంటి పోటీ ఉండబోదని కేంద్ర టెలికం శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ప్రస్తుత సామర్థ్యాలను బట్టి స్టార్‌లింక్ భారత్‌లో గరిష్టంగా 200 ఎంబీపీఎస్ స్పీడ్‌తో 20 లక్షల కనెక్షన్లు మాత్రమే ఇవ్వగలదని ఆయన తెలిపారు. దీనితో టెలికం సర్వీసులపై ఎలాంటి ప్రభావం ఉండదని చెప్పారు. ఈ సర్వీసులను పొందాలంటే ముందుగా భారీ మొత్తం వెచ్చించడంతో పాటు ప్రతి నెలా సుమారు రూ. 3,000 వరకు చెల్లించాల్సి రావచ్చని మంత్రి చెప్పారు. ప్రభుత్వ రంగ బీఎస్ఎన్ఎల్కి గణనీయంగా కార్యకలాపాలున్న గ్రామీణ, మారుమూల ప్రాంతాలే లక్ష్యంగా శాట్‌కామ్ సర్వీసులు ఉండనున్న నేపథ్యంలో మంత్రి వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. బీఎస్ఎన్ఎల్ 4జీ సర్వీసుల విస్తరణ పూర్తయిందని ఆయన చెప్పారు. ప్రస్తుతం మార్కెటింగ్‌పైనే దృష్టి పెడుతున్నట్లు, టారిఫ్‌లు పెంచే ప్రతిపాదనేదీ లేనట్లు మంత్రి వివరించారు. బీఎస్ఎన్ఎల్లో చైనా పరికరాల వినియోగంపై స్పందిస్తూ, పూర్తిగా దేశీ సాంకేతికతల వినియోగానికి ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు. -
Vaibhav Taneja: ఎలోన్ మస్క్ ఆర్థిక సామ్రాజ్యం మనోడి చేతిలో..
-
మస్క్ ఆర్థిక సామ్రాజ్యం మనోడి చేతిలో.. ఎవరీ వైభవ్ తానేజా?
ప్రపంచ అపర కుబేరుడు ఎలాన్ మస్క్ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఆర్థిక భారత సంతతికి చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ వైభవ్ తనేజా. ప్రస్తుతం టెస్లా చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్ఓ)గా ఉన్న ఆయనకు ఇప్పుడు మరింత పెద్ద బాధ్యతలు అప్పగించారు మస్క్. కొత్తగా ప్రకటించిన రాజకీయ వెంచర్ అయిన అమెరికా పార్టీకి వైభవ్ తానేజాను ట్రెజరర్, రికార్డుల కస్టోడియన్గానూ చేశారు. సంప్రదాయ ఐఐటీ-ఐఐఎం నుంచి వచ్చినవాడు కాకపోయినా తనేజా రూ.1,100 కోట్ల వేతన పరిహారాన్ని అందుకుంటున్నారని ది వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.తనేజా అధికారికంగా అమెరికా పార్టీ ఆర్థిక వ్యవహారాల బాధ్యతలు చేపట్టినట్లు ఇటీవల ఫైనాన్షియల్ ఎక్స్ ప్రెస్ నివేదిక ధృవీకరించింది. ఈ పాత్రలో ఆయన రాజకీయ నిధులు, బడ్జెట్ పంపిణీని పర్యవేక్షించడం, ఆర్థిక చట్టాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. ఇది కార్పొరేట్ ఫైనాన్స్ లో ఆయన ప్రస్తుత పాత్ర నుండి రాజకీయ రంగానికి గణనీయమైన మార్పును సూచిస్తుంది. తనేజాపై ఉన్న నమ్మకంతో మస్క్ ఇప్పుడు తన రాజకీయ పార్టీ ఆర్థిక బాధ్యతలనూ అప్పగించారు. ఢిల్లీ యూనివర్సిటీ నుంచి మొదలై..వైభవ్ తనేజా ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఫైనాన్స్ లో తన ప్రయాణాన్ని ప్రారంభించారు. 1999 లో కామర్స్ లో పట్టభద్రుడయ్యారు. ఆ తర్వాతి సంవత్సరం చార్టర్డ్ అకౌంటెంట్ గా అర్హత సాధించారు. 2006లో అమెరికా వెళ్లి సర్టిఫైడ్ పబ్లిక్ అకౌంటెంట్ (సీసీఏ) అయ్యారు. ఇదే ఆయన ప్రపంచ ఆర్థిక జీవితాన్ని విస్తరించింది.ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ (పీడబ్ల్యూసీ)లో ఆయన దాదాపు 17 సంవత్సరాలు పనిచేశారు. అక్కడాయన 500 మందికి పైగా క్లయింట్లకు రెగ్యులేటరీ ఫైలింగ్స్, ఫైనాన్షియల్ ఆపరేషన్స్, ఐపీఓలను నిర్వహించారు. పునరుత్పాదక ఇంధన రంగంలోకి ఆయన ప్రవేశం 2016లో సోలార్సిటీతో జరిగింది. ఈ సంస్థ తరువాత టెస్లాలో విలీనమైంది.రూ.1,100 కోట్ల వేతనం2017లో టెస్లాలో చేరిన తనేజా క్రమంగా ఎదుగుతూ 2023లో ఆ సంస్థకు సీఎఫ్ఓ అయ్యారు. 2024లో ఆయన 139.5 మిలియన్ డాలర్లు (సుమారు రూ.1,157 కోట్లు) వేతన పరిహారం అందుకున్నారు. ఇందులో మూల వేతనంగా అందుకున్నది 4 లక్షల డాలర్లే అయినప్పటికీ మిగిలినది స్టాక్ ఆప్షన్లు, ఈక్విటీ అవార్డుల ద్వారా వచ్చింది. టెస్లా ఇండియా మోటార్స్ అండ్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ లో డైరెక్టర్ గా కూడా తానేజా పనిచేశారు. -
పతనం దిశగా మస్క్?
-
అంతా ఉత్తుత్తే.. మస్క్ మీద ప్రేమ ఒలకబోస్తున్న ట్రంప్
వాష్టింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. టెస్లా సీఈవో,అపర కుబేరుడు ఎలాన్ మస్క్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘నాకు మస్క్ కావాలి. మస్క్‌తో కలిసి పనిచేయాలని ఉంది. మస్క్ కంపెనీలకు అమెరికా ప్రభుత్వం ఇచ్చే భారీ సబ్సిడీలు తీసేస్తానని అందరూ అంటున్నారు. ఇది నిజం కాదు! నేను మస్క్‌ను, అలాగే అమెరికాలోని అన్ని వ్యాపారాలను అద్భుతంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను’అని ట్రూత్ సోషల్ వేదికగా ట్వీట్ చేశారు. తాజా, ట్రంప్ ట్వీట్‌తో గత కొంతకాలంగా ట్రంప్-మస్క్‌ల మధ్య కొసాగుతున్న మాటల యుద్ధానికి పులిస్టాప్ పెట్టినట్లైంది. ఒకప్పుడు డొనాల్డ్ ట్రంప్- మస్క్‌లు స్నేహితులు. కానీ బిగ్ బ్యూటీఫుల్ బిల్లుతో మిత్రలు కాస్తా బద్ద శత్రువుల్లా మారారు. బిగ్ బ్యూటీఫుల్ బిల్లాంతా నాన్సెస్ అని మస్క్ అంటే.. మస్క్ కంపెనీలకు అమెరికా ప్రభుత్వం రాయితీలు ఇవ్వబోదని వార్నింగ్ ఇస్తూ కయ్యానికి కాలుదువ్వారు.అదిగో అప్పడే జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ ప్రయోమం అందంటూ మస్క్ వరుస ట్వీట్లు, అమెరికాలో ప్రస్తుతం ఉన్న రెండు పార్టీలకు ప్రత్యామ్నాయంగా ది అమెరికా పార్టీ పేరుతో కొత్త పార్టీ అంటూ హడావిడి చేశారు. ఉన్నట్లుండి ఏమైందో ఏమో మస్క్ సైలెంట్ అయ్యారు.ఈ క్రమంలో ట్రంప్ కూడా ఓ మెట్టుదిగొచ్చాడు. ట్రూత్ పోస్టులో ఎలాన్ మస్క్ కంపెనీలపై సబ్సిడీలు తొలగిస్తానన్న ఆరోపణలను ఖండించారు. మస్క్ కంపెనీలతో పాటు అమెరికాను అభివృద్ధి చేస్తానంటూ ట్వీట్లో చెప్పడంతో వ్యాపార వర్గాల్లోనే కాదు రాజకీయాల్లో సైతం ఆసక్తికరంగా మారింది. -
పాప్‌కార్న్ రోబోలు వచ్చేస్తున్నాయ్
లాస్ ఏంజెలెస్: వేడివేడి పాప్‌కార్న్ కావాలంటే చెఫ్‌కే చెప్పనక్కర్లేదు. తమ హ్యూమనాయిడ్ రోబోట్‌కు చెప్పినా చకచకా చేసి ఇచ్చేస్తుందని ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ చెప్పారు. తమ ‘టెస్లా’ సంస్థ అభివృద్ధిచేస్తున్న హ్యూమనాయిడ్ రోబో త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తుందని మస్క్ ప్రకటించారు. లాస్ఏంజెలెస్ నగరంలోని ప్రఖ్యాత హాలీవుడ్ ప్రాంతంలో టెస్లా కొత్తగా ‘డిన్నర్, సూపర్‌చార్జర్’ అనే రెస్టారెంట్, చార్జింగ్ స్టేషన్‌ను ఏర్పాటుచేస్తోంది. ఇందులో ఆప్టిమస్ పేరిట ఒక రోబోట్‌ను అందుబాటులోకి తేనున్నారు.ఇది పోప్కార్న్ను ఎప్పటికప్పుడు తాజాగా తయారుచేసి అతిధులు, వినియోగదారులకు అందిస్తుంది. సంబంధిత వీడియోను మస్క్ తన ‘ఎక్స్’ఖాతాలో పోస్ట్‌చేశారు. అడిగిందే తడవుగా కస్టమర్‌కు కవర్లో పాప్‌కార్న్‌ను సర్వ్చేయడం, ప్రతిగా ధన్యవాదాలు తెలిపిన కస్టమర్‌కు రోబోట్ చేయి ఊపుతూ అభివాదంచేయడం ఆ వీడియోలో ఉంది. ‘‘ ఈరోజు ఇంటర్నెట్లో చూడదగ్గ వీడియో ఉందంటే అది ఇదే. కస్టమర్‌కు ఆప్టిమస్ ఎంత చక్కగా, పద్ధతిగా, మర్యాదగా సర్వ్ చేస్తోందో చూడండి. ఇదంతా త్వరలో సర్వసాధారణ విషయంగా మారబోతోంది’’ అని మస్క్ ‘ఎక్స్’లో క్యాప్షన్ పెట్టారు.హాలీవుడ్‌లోని శాంటామోనికా బోల్వార్డ్ ప్రాంతంలో ఈ అధునాతన డిన్నర్, సూపర్‌చార్జర్ రెస్టారెంట్, చార్జింగ్ స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. ‘‘ భవిష్యత్తులో ఈ రోబోలు మన దైనందిన జీవిత పనులన్నీ చేస్తూ మనకు సాయంగా ఉంటాయి. మనం కూర్చున్న చోటుకే వచ్చి మనకు కూల్‌డ్రింక్స్ అందిస్తాయి. పెంపుడు శునకాన్ని అలా బయట వాకింగ్‌కు తీసుకెళ్తాయి. పిల్లలను ఆడిస్తాయి’’ అని గతేడాది అక్టోబర్‌లో జరిగిన రోబోల సంబంధ ‘మనం’ కార్యక్రమంలో మస్క్ వ్యాఖ్యానించారు. -
‘బేబీ గ్రోక్’ వస్తుంది.. పిల్లల కోసం ప్రత్యేక ఏఐ యాప్
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ఎక్స్ఏఐ పిల్లల కోసం ప్రత్యేక ఏఐ చాట్‌బాట్ యాప్‌ను తీసుకురానుంది. తమ గ్రోక్ చాట్‌బాట్‌కు కిడ్-ఫ్రెండ్లీ వెర్షన్‌ను రూపొందించే పనిలో ఉన్నట్లు ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’(ట్విటర్) పోస్ట్ చేశారు.'ఎక్స్ఏఐలో బేబీ గ్రోక్ అనే యాప్‌ను రూపొందించబోతున్నాం' అని మస్క్ తాజాగా ట్వీట్ చేశారు. పిల్లలకే ప్రత్యేకమైన కంటెంట్‌తో ఈ యాప్‌ను రూపొందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త వెర్షన్ యువ వినియోగదారుల కోసం రూపొందించిన ప్రత్యేక అప్లికేషన్ గా లాంచ్ అవుతుందని భావిస్తున్నారు, అయితే మరిన్ని వివరాలను ఇంకా ప్రకటించలేదు.మస్క్ యాజమాన్యంలోని ఎక్స్ స్పామ్ సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి ప్లాట్‌ఫామ్‌పై కొత్త గ్రోక్ ప్రస్తావనలను తాత్కాలికంగా నిలిపివేసిన కొన్ని రోజుల తర్వాత ఈ ప్రకటన వచ్చింది. మరోవైపు వైరల్ వీడియోలను జనరేట్ చేయడానికి, దాని సృజనాత్మక సాధనాలను మరింత విస్తరించడానికి వీలు కల్పించే ‘ఇమాజిన్’ అనే కొత్త సామర్థ్యాన్ని ‘గ్రోక్’కు జోడించే పనిలో ఉన్నట్లు కూడా మస్క్ ఇటీవల వెల్లడించారు.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వినియోగం ఇటీవల విస్తృతంగా పెరిగింది. ముఖ్యంగా పిల్లల్లో ఏఐ వినియోగం క్రమంగా పెరుగుతోంది. కొన్ని నివేదికల ప్రకారం.. 44 శాతం మంది పిల్లలు జనరేటివ్ ఏఐని చురుగ్గా ఉపయోగిస్తున్నారు. ఇందులో తమ స్కూల్ వర్క్ లేదా హోమ్ వర్క్ చేయడానికే 54 శాతం వినియోగం ఉంటోంది.We’re going to make Baby Grok @xAI, an app dedicated to kid-friendly content— Elon Musk (@elonmusk) July 20, 2025 -
భారత్‌లో టెస్లా బ్రాండ్ బాజా బారాత్!
విశాల భారతావని.. 140 కోట్లకుపైగా జనాభా. విభిన్న తరాలు.. ఖర్చుల్లో అంతరాలు. పది రూపాయలకూ వెనుకడుగు వేసే కస్టమరే కాదు.. బ్రాండ్ కోసం రూ.10 కోట్లకూ సై అనే వినియోగదార్లు ఉన్నారు. ఇలా ప్రీమియం ధర చెల్లించే కొనుగోలుదారులు ఉన్నారు కాబట్టే భారత్‌లో టెస్లా రేస్ ప్రారంభించింది. పైగా ప్రపంచవ్యాప్తంగా ఈ బ్రాండ్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ‘బ్రాండ్స్’ అంటే భారతీయులకు మక్కువ. రూ.50 లక్షలకుపైగా విలువ చేసే లగ్జరీ కార్లు సగటున గంటకు ఆరు రోడ్డెక్కుతున్న మార్కెట్ మనది. ఇలాంటి మార్కెట్లో రిటైల్‌తో పరుగు మొదలుపెట్టిన ఈ అమెరికన్ ఆటోమొబైల్ దిగ్గజం రానున్న రోజుల్లో తయారీ చేపట్టే అవకాశమూ లేకపోలేదు.ప్రస్తుతం బీఎండబ్ల్యూ నం.1భారత్‌లో ప్రీమియం కార్ల మార్కెట్ విభాగంలో 2024–25లో 51,406 యూనిట్లు కస్టమర్ల చేతుల్లోకి వెళ్లాయి. మెర్సిడెస్–బెంజ్, బీఎండబ్ల్యూ, ఆడి, జాగ్వార్ ల్యాండ్ రోవర్ వంటి ప్రపంచ ప్రఖ్యాత సంస్థలు ఇప్పటికే దేశీయంగా బలమైన తయారీ, సర్వీస్ నెట్వర్క్ వ్యవస్థలను నిర్మించాయి. ప్యాసింజర్ వాహనాల (పీవీ) రంగంలో 2025 జూన్ నాటికి ఈవీల వాటా 4.5 శాతం మాత్రమే. లగ్జరీ పీవీల విభాగంలో ఈవీల వాటా 10 శాతం. ఇందులో బీఎండబ్ల్యూ 53 శాతం మార్కెట్ వాటాతో ఆధిపత్యం చెలాయిస్తోంది. 33 శాతం వాటాతో రెండో స్థానంలో మెర్సిడెస్–బెంజ్ పోటీపడుతోంది. టెస్లాకు ఇప్పటికే ఉన్న సవాళ్లకు తోడు ఈ సంస్థకు ప్రపంచ పోటీదారుగా ఉన్న చైనా దిగ్గజం బీవైడీ ఇండియాలో ఇప్పటికే అడుగుపెట్టింది. వియత్నాం కంపెనీ విన్ ఫాస్ట్ ఇక్కడ అడుగుపెట్టబోతోంది.పదేళ్ల నిరీక్షణ తర్వాత మనదేశంలోకి టెస్లా ఎంట్రీ ఇచ్చింది. తొలి ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను ముంబైలో ఆవిష్కరించింది. పూర్తిగా తయారైన కార్లకు దిగుమతి సుంకం భారత్‌లో 100 శాతం వరకు ఉంది. మనదేశంలో తయారీ చేపడితేనే ప్రయోజనాలు ఇస్తామని భారత్ స్పష్టం చేసింది. ఈ అంశాలే టెస్లా రాక ఆలస్యానికి కారణమయ్యాయి. మొత్తానికి పాలసీ అడ్డంకులు, సుంకాల సంక్లిష్టతలు, ఇతర బ్రాండ్లతో పోటీ, భౌగోళిక రాజకీయ ఒత్తిడి.. ఇవన్నీ అధిగమించి ఎట్టకేలకు అరంగేట్రం జరిగింది. దేశీయంగా తయారీ చేపట్టే అంశానికి కట్టుబడేముందు ఇక్కడి మార్కెట్‌ను పరీక్షిస్తామని టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ పలు సందర్భాల్లో పునరుద్ఘాటించారు. సుమారు రూ.60 లక్షల ధరతో తొలుత వై మోడల్‌ను టెస్లా ప్రవేశపెడుతోంది. ప్రపంచంలో అత్యధిక సుంకం ఉన్నది భారత్‌లోనే అని టెస్లా అధిపతి ఎలాన్ మస్క్ పలు సందర్భాల్లో వ్యాఖ్యానించారు. అందువల్లే, ఇతర దేశాలతో పోలిస్తే టెస్లా కారు ధర మనదేశంలోనే ఎక్కువ.టెస్లానా మజాకా!యూఎస్, జర్మనీ, చైనాలో టెస్లాకు తయారీ కేంద్రాలున్నాయి. ఇవి ఏటా 25–30 లక్షల యూనిట్లు ఉత్పత్తి చేయగలవు. 2019లో చైనాలో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 3.8 శాతం మాత్రమే. అదే ఏడాది డిసెంబర్లో టెస్లా మార్కెట్లోకి ప్రవేశించింది. అప్పటి నుంచి చైనాలో ఎలక్ట్రిక్ వాహనాల వ్యాప్తి క్రమంగా పెరుగుతోంది. 2024లో ఇది 24.6 శాతానికి చేరడంలో టెస్లా కీలకపాత్ర పోషించింది. ఆటో దిగ్గజాల మాదిరిగా కాకుండా ప్రకటనల విషయంలో టీవీలు, ఇతర మాధ్యమాలకు బదులు సెలబ్రిటీల ప్రభావం, నోటి మాటగా ప్రచారంపై టెస్లా ఆధారపడింది. ప్రీమియం, ప్రత్యేక బ్రాండ్‌గా కంపెనీ ఇమేజ్ను నిలబెట్టడంలో ఈ విధానం సహాయపడింది. నటుడు బ్రాడ్ పిట్, గూగుల్ సహ వ్యవస్థాపకులు లారీ పేజ్, సెర్గీ బ్రిన్, ‘ఈబే’ మొదటి అధ్యక్షుడు జెఫ్ స్కోల్, షావొమీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లే యూ.. ఇలా ఎందరో ప్రముఖులు టెస్లా కస్టమర్ల జాబితాలో ఉన్నారు.డెలివరీలు తగ్గాయ్అంతర్జాతీయంగా 2025 జనవరి–మార్చిలో టెస్లా డెలివరీలు 13% పడిపోయాయి. గడిచిన మూడేళ్లలో ఇది అత్యంత భారీ క్షీణత. పెరుగుతున్న ప్రపంచ పోటీ, నూతన మోడళ్ల రాక ముఖ్యంగా మోడల్–వై ఆలస్యం కావడం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు సలహాదారుగా ఎలాన్ మస్క్ పాత్రపై పెరుగుతున్న వ్యతిరేకత వంటివి ఈ క్షీణతకు దారితీశాయి. ఒకప్పుడు టెస్లాకు బలమైన మార్కెట్లలో ఒకటైన చైనాలో సంస్థ ఈవీ వాటా 2025 మొదటి ఐదు నెలల్లో 7.6%కి పడిపోయింది. ఇది గత సంవత్సరం 10%, 2020లో గరిష్ట స్థాయిలో 15%గా నమోదైంది. బీవైడీ, షావొమీ వంటి ప్రత్యర్థులు ఫీచర్–రిచ్ మోడళ్లు, పోటీ ధరలతో సవాల్ విసిరి మార్కెట్ వాటాను పెంచుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా టెస్లా 2025 జనవరి–మార్చి కాలంలో 3,36,681 వాహనాలను విక్రయించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 3,86,810గా నమోదైంది. -
అమెరికా రాజకీయాలను కుదిపేస్తున్న జెఫ్రీ ఎప్స్టీన్ కేసు
-
ఇండియాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన టెస్లా కార్లు
-
భారత్ లోకి టెస్లా ఎంట్రీ వెనుక మస్క్ మాస్టర్ ప్లాన్
-
ముంబైలో ‘టెస్లా’ కార్ల తొలి షోరూమ్ ప్రారంభం (ఫొటోలు)
-
Shubhanshu Shukla: భూమిపైకి శుభాంశు శుక్లా
వాషింగ్టన్: అంతరిక్షంలో భారత కీర్తిపతాకను సమున్నతంగా ఎగరేసిన మన ముద్దుబిడ్డ శుభాంశు శుక్లా నింగి నుంచి సగర్వంగా నేలకు తిరిగొచ్చాడు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అడుగుపెట్టిన తొలి భారతీయునిగా చెరిగిపోని రికార్డును తన పేరిట లిఖించుకున్న శుభాంశు.. మరో ముగ్గురు సహచర వ్యోమగాములతో కలిసి సురక్షితంగా భూపైకి చేరుకున్నారుయాక్సియం-4 మిషన్ లో భాగంగా... అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ఐఎస్ఎస్) వెళ్లిన భారత వ్యోమగామి శుభాంశు శుక్లా, మరో ముగ్గురు వ్యోమగాములు భూమిపైకి చేరుకున్నారు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం ఉదయం 2.50 నిమిషాలకు కాలిఫోర్నియా సమీపంలోని సముద్ర జలాల్లో ల్యాండింగ్ అయ్యారు. డ్రాగన్ స్పేస్ క్యాప్స్‌లో భూమి మీదకు చేరుకున్నారు. వ్యోమగాములను ఏడు రోజుల పాటు క్వారంటైన్‌కు తరలించేందుకు స్పేస్ ఎక్స్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఐఎస్ఎస్ నుంచి ఘనంగా వీడ్కోలు ఐఎస్ఎస్లోని ఏడుగురు సహచర వ్యోమగాములు శుభాంశు బృందానికి ఘనంగా వీడ్కోలు పలికారు. ఆ సందర్భంగా పరస్పర కౌగిలింతలు, కరచాలనాలు ముగిసిన అనంతరం వాతావరణం ఉద్వేగపూరితంగా మారింది. 18 రోజుల పాటు కలిసి గడిపిన క్షణాలను అందరూ ఆనందంగా నెమరేసుకున్నారు. ముఖ్యంగా శుభాంశు రుచి చూపిన క్యారెట్, పెసరపప్పు హల్వాను ఎన్నటికీ మర్చిపోలేమని సహచరులు చెప్పుకొచ్చారు. జూన్ 25న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ప్రారంభంశుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర జూన్ 25, 2025న ప్రారంభమైంది. అమెరికాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ ద్వారా శుక్లా బృందం అంతరిక్షంలోకి వెళ్లింది. 28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)లోకి ప్రవేశించారు. అక్కడ పైలట్ శుక్లా నేతృత్వంలోని గ్రూప్ మొత్తం 60 రకాల శాస్త్రీయ ప్రయోగాలు నిర్వహించింది. ఇందులో శుక్లా ఒక్కరే స్వయంగా 7 ప్రయోగాలు నిర్వహించారు. ఫ్లోటింగ్ వాటర్ బబుల్ ఐఎస్ఎస్లో 60కి పైగా ప్రయోగాలు శుభాంశు బృందం ఐఎస్ఎస్లో 18 రోజులు గడిపింది. ఆ క్రమంలో 60 కీలక ప్రయోగాలు చేపట్టింది. అంతరిక్షంలో జీరో గ్రావిటీ పరిస్థితుల్లో మానవ కండరాలకు కలిగే నష్టంపై శుక్లా అధ్యయనం చేశారు. మానవ జీర్ణవ్యవస్థ ఖగోళంలో ఎలా పని చేస్తుందనే అంశంపై భారత విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఒక వీడియోను ఆయన రూపొందించారు. దాంతోపాటు నలుగురు వ్యోమగాముల బృందం తమ మానసిక స్థితిగతులపైనా ప్రయోగాలు చేసి చూసింది. ఆ క్రమంలో ఫ్లోటింగ్ వాటర్ బబుల్ తయారు చేసి అందులో గడిపింది. అది అద్భుతమైన అనుభవమని శుభాంశు గుర్తు చేసుకున్నారు. ‘‘ఐఎస్ఎస్లో ప్రతి క్షణాన్నీ పూర్తిగా ఆస్వాదించా. ముఖ్యంగా కిటికీ పక్కన కూచుని కిందకు చూడటాన్ని. బహుశా నా జీవితంలోకెల్లా అత్యంత అద్భుతమైన అనుభూతి అది’’ అని చెప్పారు. అంతరిక్షంలో వ్యవసాయం దిశగా కూడా వ్యోమగాములు పలు కీలక పరీక్షలు జరిపారు.76 లక్షల మైళ్లు..288 భూ ప్రదక్షిణలు శుభాంశు బృందం ఐఎస్ఎస్లో గడిపిన 18 రోజుల్లో భూమి చుట్టూ ఏకంగా 76 లక్షల మైళ్లకు పైగా ప్రయాణించింది. ఆ క్రమంలో 288 సార్లు భూప్రదక్షిణలు చేసింది. నవభారత శకమిది శుభాంశు భావోద్వేగం భూమికి తిరుగు ప్రయాణమయ్యే ముందు శుభాంశు ఐఎస్ఎస్లో వీడ్కోలు ప్రసంగం చేశారు. 41 ఏళ్ల ముందు రాకేశ్ శర్మ రూపంలో తొలి భారతీయుడు అంతరిక్షంలో కాలు పెట్టిన క్షణాలను, అక్కడినుంచి భారత్ కనిపించిన తీరును వర్ణించిన వైనాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు. ‘‘మా తిరుగు ప్రయాణం సందర్భంగా ఈ రోజు ఆకాశం నుంచి భారత్ ఎలా కనిపిస్తుందో చూడాలని మా బృందమంతా ఉత్సాహపడుతోంది. నేటి భారత్ ఘనమైన ఆకాంక్షల భారత్. నిర్భయ భారత్. సగర్వంగా తలెత్తుకుని సాగుతున్న భారత్. అందుకే నేడు కూడా నా దేశం మిగతా ప్రపంచమంతటి కంటే మిన్నగా (సారే జహా సే అచ్ఛా) కనిపిస్తోందని చెప్పగలను’’ అంటూ నాడు రాకేశ్ శర్మ చేసిన వ్యాఖ్యలను శుభాంశు పునరుద్ఘాటించారు. అక్కడి సహచరులపై శుభాంశు ఈ సందర్భంగా ప్రశంసల జల్లు కురిపించారు. ‘‘ఈ యాత్ర ఇంత అద్భుతంగా సాగుతుందని జూన్ 25న ఫాల్కన్–9 రాకెట్ ద్వారా అంతరిక్షానికి పయనమయ్యే క్షణాల్లో నేనస్సలు ఊహించలేదు! ఇదంతా ఇదుగో, ఇక్కడ నా వెనక నుంచున్న ఈ అద్భుతమైన వ్యక్తుల వల్లే సాధ్యమైంది. ఈ యాత్రను మా నలుగురికీ అత్యంత ప్రత్యేకమైనదిగా మార్చింది వీళ్లే. అంకితభావంతో కూడిన ఇలాంటి అద్భుతమైన వృత్తి నిపుణులతో కలిసి పని చేయడం నిజంగా మరచి పోలేని అనుభూతి’’ అంటూ హర్షం వెలిబుచ్చారు. -
మస్క్ అన్ని కంపెనీల్లో ఒక్కటే ఏఐ
ఎలాన్‌మస్క్‌కు చెందిన కంపెనీలన్నింటినీ ఒకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గొడుగు కిందకు తీసుకువచ్చే దిశగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతేడాది మస్క్ స్థాపించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ ఎక్స్ఏఐలో స్పేస్ఎక్స్ రెండు బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టినట్లు రాయిటర్స్ తెలిపింది. స్పేస్ఎక్స్, టెస్లా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)తో సహా అతని అన్ని కంపెనీల్లో ఏఐని అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నారు.ఈ ఏడాది ప్రారంభంలో ఎక్స్ఏఐ ఎక్స్‌లో విలీనమైన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారని, ఇప్పుడు కంపెనీ విలువ 113 బిలియన్ డాలర్లుగా ఉందని రాయిటర్స్ నివేదిక తెలిపింది. జూన్‌లో మోర్గాన్ స్టాన్లీ ఈ భారీ ఫండింగ్‌కు నేతృత్వం వహించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను తన వ్యాపారాల్లో కీలకంగా ఉపయోగించుకోవాలన్న మస్క్ ప్రణాళికపై బలమైన పెట్టుబడిదారుల విశ్వాసాన్ని ఇది హైలైట్ చేస్తుంది.ఇదీ చదవండి: పీఎం కిసాన్ నిధి విడుదలకు డేట్ ఫిక్స్?ఈ ప్లాన్‌లో ఎక్స్ఏఐ రూపొందించిన చాట్‌బాట్ గ్రోక్ కీలకంగా మారింది. స్పేస్ఎక్స్ శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ స్టార్‌లింక్‌లో కస్టమర్ ప్రశ్నలను నిర్వహించడానికి గ్రోక్‌ను ఇప్పటికే ఉపయోగిస్తున్నారు. దీన్ని టెస్లా ఆప్టిమస్ రోబోట్లలోకి తీసుకురావడానికి టెస్టింగ్ నిర్వహిస్తున్నారు. మస్క్‌కు చెందిన అన్ని కంపెనీల ఎకోసిస్టమ్‌లో గ్రోక్‌ను ప్రధాన ఏఐ వ్యవస్థగా ఉండాలని కోరుకుంటున్నట్లు సమాచారం. -
టెస్లా షోరూం ప్రారంభిస్తున్నట్లు మస్క్ ట్వీట్
-
మస్క్ కంపెనీకి భారత్‌లో అనుమతులు
ఎలాన్ మస్క్‌కు చెందిన శాటిలైట్ ఇంటర్నెట్ సంస్థ స్టార్‌లింక్ భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభించడానికి అన్ని అడ్డంకులను అధిగమించింది. భారతదేశ అంతరిక్ష నియంత్రణ సంస్థ ఇన్-స్పేస్ (ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్) ఈ సంస్థకు అనుమతులు ఇచ్చింది. దాంతో దేశంలో స్టార్‌లింక్ ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవలను అందించేందుకు అడ్డంకులు తొలగినట్లయింది.2022 నుంచి భారతదేశంలో స్టార్‌లింక్ తన సర్వీసులు ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. గత నెలలో టెలికమ్యూనికేషన్స్ విభాగం (డాట్) నుంచి గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్ బై శాటిలైట్ (జీఎంపీసీఎస్) లైసెన్స్ కూడా పొందింది. ఇప్పుడు, ఇన్-స్పేస్ ఆమోదంతో స్టార్‌లింక్ భారత్‌లోని కంపెనీ ప్రణాళికలకు లైన్ క్లియర్ అయింది.ఐఎన్-స్పేస్ స్టార్‌లింక్ తన జెన్ 1 ఉపగ్రహ సమూహాన్ని భారతదేశంపై నిలిపేందుకు అనుమతిస్తుంది. ఈ అనుమతులు జులై 7, 2030 వరకు చెల్లుబాటు అవుతాయని కొన్ని సంస్థలు తెలిపాయి. ఈ ఆమోదంలో భాగంగా IN-SPACe యూజర్లు ఉపయోచించేందుకు నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ బ్యాండ్లను కూడా ఖరారు చేస్తుంది. గేట్ వే బీమ్ల కోసం స్టార్‌లింక్ 27.5–29.1 గిగాహెర్జ్ట్, 29.5–30 గిగాహెర్జ్ట్ అప్‌లింక్ బ్యాండ్లను, 17.8–18.6 గిగాహెర్జ్ట్, 18.8–19.3 గిగాహెర్జ్ట్ డౌన్‌లింక్ బ్యాండ్లను ఉపయోగించే అవకాశం ఉందని సమాచారం. సరళంగా చెప్పాలంటే స్టార్‌లింక్ దాని వినియోగదారులు, గ్రౌండ్ స్టేషన్ల నుంచి భారతదేశం అంతటా ఇంటర్నెట్ డేటాను పంపించేందుకు నిర్దిష్ట ఉపగ్రహ సంకేతాలను ఉపయోగించేలా అధికారిక అనుమతులు పొందింది.ఇదీ చదవండి: పిల్లలూ.. బ్యాంకు తలుపు తట్టండి!గేట్‌వే స్టేషన్లు నిర్మాణం..ఇదిలాఉండగా, ఈ ఆమోదం పొందడం వల్ల స్టార్‌లింక్ వెంటనే భారత్‌లో సర్వీసులు ప్రారంభిస్తుందని కాదు. సంస్థ ఇంకా భారత ప్రభుత్వం నుంచి స్పెక్ట్రమ్‌ను పొందాల్సి ఉంటుంది. గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేయడం, భద్రతా అవసరాలను తీర్చడానికి పరీక్షలను పూర్తి చేయాల్సి ఉంది. కాబట్టి దేశవ్యాప్తంగా కనీసం మూడు గేట్‌వే స్టేషన్లను నిర్మించాలని కంపెనీ యోచిస్తోంది. ఈ వ్యవస్థ పూర్తయితే స్టార్‌లింక్ కూడా త్వరలో ట్రయల్స్ ప్రారంభించే అవకాశం ఉంది. కంపెనీ భారతదేశ సాంకేతిక, భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఉందని నిరూపించడానికి టెలికమ్యూనికేషన్స్ విభాగం ట్రయల్ స్పెక్ట్రమ్‌ను మంజూరు చేయబోతున్నట్లు సమాచారం. -
‘స్టార్‌లింక్’ ఇంటర్నెట్ సేవలకు పచ్చజెండా
న్యూఢిల్లీ: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలోని ‘స్టార్‌లింక్’ ఇంటర్నెట్ సేవల సంస్థకు భారత్‌లో ద్వారాలు తెరచుకున్నాయి. ఇంటర్నెట్ సేవలు అందించేందుకుగాను సంస్థకు కీలక అనుమతులు వచ్చాయి. భారత్‌లో వాణిజ్యపరంగా ఉపగ్రహ ఇంటర్నెట్ సేవలు మొదలుపెట్టేందుకు అవసరమైన అనుమతులను భారత అంతరిక్ష సేవల నియంత్రణ సంస్థ అయిన ‘ఇండియన నేషనల్ స్పేస్ అథరైజేషన్ అండ్ ప్రమోషన్ సెంటర్(ఇన్–స్పేస్)’ మంజూరు చేసింది. 2022 నుంచి వాణిజ్య లైసెన్స్ పొందేందుకు ఎదురుచూస్తున్న ఈ సంస్థకు ఎట్టకేలకు ఆమోదం లభించింది. టెలికాం విభాగం నుంచి గత నెలలో స్టార్‌లింక్ అనుమతులు పొందిన విషయం తెల్సిందే. తాజాగా అంతరిక్ష సేవల నియంత్రణ సంస్థ నుంచి కూడా అనుమతులు రావడంతో స్టార్ లింక్‌కు మార్గం సుగమమైంది. -
మస్క్‌కు బిగ్ షాక్.. ‘ఎక్స్’ సీఈవో పదవికి లిండా యాకరినో రాజీనామా
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ఎక్స్’ సీఈవో పదవి నుంచి లిండా యాకరినో(Linda Yaccarino) వైదొలిగారు. 2023 మే నుంచి రెండేళ్లకు పైగా ఈ పదవిలో కొనసాగిన ఆమె బుధవారం రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ఆమె ‘ఎక్స్’ ఖాతాలో పోస్టు పెట్టారు. బిలియనీర్ ఎలాన్ మస్క్ చేతుల్లోకి ‘ఎక్స్’ (అంతకముందు ట్విటర్) వెళ్లిన తర్వాత తొలి సీఈవోగా లిండానే కావడం తెలిసే ఉంటుంది. తన రాజీనామా విషయాన్ని స్వయంగా లిండా యాకరినో ఎక్స్‌వేదికగా ప్రకటించారు. మే 2023 నుంచి జూలై 2025 వరకు ఆమె సీఈవోగా కొనసాగారు. ఇది నా జీవితంలో ఒక అద్భుతమైన ప్రయాణం. ‘ఎక్స్’ బృందంతో కలిసి సాధించిన విజయాలు చరిత్రలో నిలిచిపోతాయి. ఇప్పుడు ‘xAI’తో కలిసి సంస్థ కొత్త అధ్యాయంలోకి అడుగుపెడుతోంది అని ఆమె పేర్కొన్నారు.After two incredible years, I’ve decided to step down as CEO of 𝕏. When @elonmusk and I first spoke of his vision for X, I knew it would be the opportunity of a lifetime to carry out the extraordinary mission of this company. I’m immensely grateful to him for entrusting me…— Linda Yaccarino (@lindayaX) July 9, 2025xAI అనేది ఎలాన్ మస్క్ ప్రారంభించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ. ఇది Grok(గ్రోక్) అనే చాట్‌బాట్‌ను అభివృద్ధి చేసింది. అయితే లిండా రాజీనామా సమయంలో Grokపై వివాదాస్పద వ్యాఖ్యలు వెలుగులోకి వచ్చాయి. కానీ ఆమె రాజీనామా వాటికి సంబంధం లేదని సమాచారం. ఇక ఎక్స్ కొత్త తదుపరి సీఈవో ఎవరనేదానిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. ఎలాన్ మస్క్ తాత్కాలికంగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. -
‘ఎప్స్టీన్ ఫైల్స్ ఎక్కడ?’.. ట్రంప్‌పై మస్క్ కొత్త దాడి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మధ్య విభేదాలు ఇప్పట్లో చల్లారేలా కనిపించడం లేదు. పార్టీని ప్రకటించిన ఎలాన్ మస్క్ తాజాగా మరోమారు ట్రంప్‌పై విరుచుకుపడ్డారు. లైంగిక నేరస్తుడు జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించిన కీలక ఫైల్స్‌ను ప్రభుత్వం ఎందుకు దాస్తున్నదంటూ ఎలాన్ మస్క్ అధ్యక్షుడు ట్రంప్‌ను నిలదీశారు.How can people be expected to have faith in Trump if he won’t release the Epstein files?— Elon Musk (@elonmusk) July 8, 2025దీంతో జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్ వ్యవహారం తాజాగా అమెరికా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. “జెఫ్రీ ఎప్స్టీన్ ఫైల్స్‌ను ట్రంప్ బయటపెట్టకపోతే ప్రజలు ఆయనను ఎలా నమ్ముతారు?” అంటూ మస్క్ ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. తాను కొత్తగా స్థాపించిన అమెరికా పార్టీ అధికారంలోకి వస్తే ఈ కుంభకోణాన్ని బయటపెట్టడానికే తొలి ప్రాధాన్యత ఇస్తానని మస్క్ పేర్కొన్నారు.ఇటీవల అమెరికా న్యాయశాఖ (డీఓజే) జెఫ్రీ ఎప్స్టీన్ సంబంధించిన కేసుపై కీలక ప్రకటన చేసింది. ఎప్స్టీన్ నివాసాలలో సోదాలు చేసినా ఎటువంటి క్లయింట్ లిస్ట్ దొరకలేదని, ఇకపై ఈ కేసులో ఎలాంటి సమాచారం వెల్లడించబోమని స్పష్టం చేసింది. దీనిపై మస్క్ తీవ్రంగా స్పందించారు. మీడియా సమావేశంలో ఒక విలేకరి ఇదే అంశంపై ట్రంప్‌ను ప్రశ్నించగా, ఆయన సమాధానాన్ని దాటవేశారు. మీరు ఇంకా ఎప్స్టీన్ గురించే మాట్లాడుతున్నారా? అని తిరుగు ప్రశ్నవేశారు. Will exposing the Epstein files rank high on the America Party’s list?— Community Notes & Violations (@CNviolations) July 8, 2025న్యూయార్క్‌కు చెందిన ప్రముఖ ఫైనాన్షియర్ జెఫ్రీ ఎప్స్టీన్ సాగించిన దుర్మర్గాల జాబితాను గత ఏడాది న్యూయార్క్ న్యాయస్థానం బట్టబయలు చేసింది. ఈ కేసుకు సంబంధించిన రహస్య పత్రాలను విడుదల చేసే ప్రక్రియలో భాగంగా తొలి విడతగా 40 పత్రాలను విడుదల చేశారు. ఈ కుంభకోణంలో అమెరికా మాజీ అధ్యక్షులు బిల్ క్లింటన్, డొనాల్డ్ ట్రంప్‌ల పేర్లతో పాటు మైకెల్ జాక్సన్ తదితరుల పేర్లు బయటికొచ్చాయి. -
మస్క్ కొత్త పార్టీ ఎఫెక్ట్.. కుప్పకూలిన టెస్లా షేర్లు
-
మస్క్ కొత్త పార్టీ ప్రకటనలపై విరుచుకుపడ్డ ట్రంప్
-
మస్క్‌ను చూస్తే జాలేస్తోంది.. అమెరికా అధ్యక్షుడి సంచలన ఆరోపణలు
అమెరికాలో రాజకీయంగా మరో సంచలనం రేగింది. ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ రాజకీయ పార్టీని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే అమెరికా పార్టీ ఏర్పాటుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా స్పందించారు. మస్క్ పార్టీని అసంబద్ధమైనదిగా ఆయన అభివర్ణిస్తూ.. తీవ్ర ఆరోపణలే చేశారాయన. అమెరికాలో రిపబ్లికన్ పార్టీ ఘన విజయం సాధించింది. పరిపాలన సజావుగా సాగిపోతోంది. మరోవైపు డెమొక్రట్లు తమ ప్రాబల్యం కోల్పోతున్నారు. అయినప్పటికీ అమెరికా రాజకీయ వ్యవస్థ ఈ రెండు పార్టీలకు అనుకూలంగా ఉంది. ఈ తరుణంలో మూడో పార్టీ ఏర్పాటు అనేది అసంబద్దమైన చర్య. మూడో పార్టీ అమెరికా చరిత్రలో ఎప్పుడూ విజయవంతం కాలేదు అని ట్రంప్ అన్నారు. మూడో పార్టీని ఎవరు ఏర్పాటు చేసుకున్నా(మస్క్‌ను ఉద్దేశిస్తూ..) తమకేం ఫరక్ పడదని, అయితే ఆ పార్టీ వల్ల అమెరికా రాజకీయాల్లో గందరగోళం నెలకొంటుంది. దేశంలో అస్తవ్యస్తత నెలకొని కలహాలు చెలరేగే అవకాశమూ ఉంది అని ట్రంప్ హెచ్చరించారు. మస్క్ గతంలో తనకు మద్దతు ఇచ్చినా.. ఇప్పుడు పూర్తిగా మారిపోయారని ట్రంప్ అంటున్నారు. ‘‘మస్క్‌ను చూస్తే జాలేస్తోంది. గత ఐదువారాలుగా ఆయన అదుపు లేకుండా వ్యవహరిస్తున్నారు అని ట్రూత్ సోషల్‌లో ట్రంప్ ఓ పోస్ట్ చేశారు. నేను ప్రవేశపెట్టిన బిల్లులో Electric Vehicle (EV) Mandate రద్దు చేయడం ముఖ్యాంశంగా ఉంది. దీని వల్ల ప్రజలు ఇకపై గ్యాస్, హైబ్రిడ్ లేదా కొత్త టెక్నాలజీ వాహనాలను స్వేచ్ఛగా కొనుగోలు చేయవచ్చు. అయితే మస్క్ గతంలో ఈ నిర్ణయానికి మద్దతు ఇచ్చి.. ఇప్పుడు వ్యతిరేకంగా వ్యవహరించడం ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అంతేకాదు.. మస్క్ తన సన్నిహితులను NASA చీఫ్‌గా నియమించాలనుకున్నారు. కానీ ఆ వ్యక్తి రిపబ్లికన్ పార్టీకి మద్దతు లేని డెమొక్రాట్ కావడం వల్లే అలా నియమించడం అనుచితమని భావించా. అమెరికా ప్రజలను రక్షించడమే నా ముందుకు ప్రధాన కర్తవ్యం’’ అంటూ ట్రంప్ పోస్టులో ప్రస్తావించారు.ఇదిలా ఉంటే.. బిగ్ బ్యూటీఫుల్ బిల్లును వ్యతిరేకిస్తూ ట్రంప్ పాలనా విభాగం డోజ్ నుంచి బయటకు వచ్చేసిన ఎలాన్ మస్క్ విమర్శలను తీవ్రతరం చేస్తూ వచ్చారు. ఈ క్రమంలో బిల్లు ఆమోదం గనుక పొందితే మూడో పార్టీ పెడతానంటూ చెబుతూ వచ్చారు. తాజాగా అదీ జరగడంతో శనివారం రాత్రి తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్(పూర్వపు ట్విటర్)లో ‘అమెరికా పార్టీ’ని ప్రకటించారు. అమెరికాలో రెండు ప్రధాన పార్టీలు.. ఒకే పార్టీ వ్యవస్థగా మారిందని, ప్రజలకు తిరిగి స్వేచ్ఛ ఇవ్వడమే తన లక్ష్యమని చెబుతూ అమెరికా పార్టీ పేరును ప్రకటించారు. అలాగే.. ప్రజలలో 65% మంది మూడవ పార్టీకి మద్దతు ఇస్తున్నారని ఓ పోల్‌ను చూపించారు. ఈ క్రమంలో ట్రంప్ ప్రవేశపెట్టిన భారీ ఖర్చుల బిల్లును(బిగ్ బ్యూటీఫుల్ బిల్)ను మరోసారి తీవ్రంగా విమర్శించారు. -
‘రెండు తలల పాము’తో మస్క్ ఎలక్షన్ ‘వెర్రి’!
వాషింగ్టన్: అమెరికా (usa) రాజకీయాల్లో కీలక మలుపు అంటూ,. ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ (elon musk) రాజకీయ రంగంలోకి వస్తున్నానంటూ ఆయన స్వయంగా షేర్ చేసిన కొత్త పార్టీ ప్రకటన.. తాజాగా పెద్ద చర్చకు దారి తీసింది. ‘ది అమెరికా పార్టీ’ (the america party) అనే పేరుతో మూడో రాజకీయ శక్తిని ప్రకటించిన మస్క్, ఆ పార్టీకి రెండు తలల పాము మీమ్‌ను షేర్ చేశారు. కానీ మస్క్ నిజంగానే కొత్త పార్టీని పెట్టారా.. ?లేక జనాల్ని వెర్రివాళ్లను చేయడానికే ఇలా చేశారా అనేది ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. ఎందుకంటే.. అమెరికన్ చట్టాల ప్రకారం..ఆయన అధ్యక్షుడిగా ఎన్నికల బరిలోకి దిగేందుకు అనర్హులు. దీంతో మస్క్ కొత్త పార్టీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మస్క్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికల్లో పోటీ చేస్తారా? లేదంటే.. కొత్త పార్టీ లేదు. ఏమీ లేదు. తూచ్ అని పక్కకు తప్పుకుంటారా? అని చూడాల్సి ఉండగా.. మస్క్ సౌతాఫ్రికన్ పౌరుడుమస్క్ 2028లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నా, అమెరికన్ రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆయన అనర్హులు. ప్రస్తుత అమెరికా రాజ్యాంగాల ప్రకారం.. ఆర్టికల్ 2, సెక్షన్ 1 ప్రకారం.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు సదరు అభ్యర్థి అమెరికా పౌరుడై ఉండాలి. తద్వారా మస్క్‌కు అర్హత లేదు. కారణం ఆయన జన్మస్థలం దక్షిణాఫ్రికా కావడం. మస్క్ పార్టీపై సవాలక్ష ప్రశ్నలుఈ నేపథ్యంలో, మస్క్ పార్టీ విస్తరణకు ముందు వ్యతిరేక వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. ఆయన మాత్రం అధ్యక్ష పదవిపై నిర్ణయం వచ్చే ఏడాది చెబుతానంటూ ట్వీట్ చేశారు. ఇంతకీ.. మస్క్ టార్గెట్ ఏంటి? అమెరికాను పాలించాలని చూస్తున్నారా? పార్టీగా ప్రభావం చూపాలని అనుకుంటున్నారా? అనేది సదరు అమెరికన్ పౌరుల్లో పుట్టుకొస్తున్న సవాలక్ష ప్రశ్నలు.. ఈ ప్రశ్నలన్నింటికి కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది. మస్క్‌కే మద్దతు ఈ క్రమంలో మస్క్ కొత్త పార్టీ ఏర్పాటు? అందుకు గల కారణాలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి. అమెరికాలో ప్రస్తుతం అధికార, ప్రతిపక్ష రిపబ్లికన్, డెమోక్రాట్ పార్టీలు ప్రజల స్వేచ్ఛను హరించుతున్నాయని మస్క్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ ప్రతిపాదించిన కీలక ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ బిల్లు ఆమోదం పొందిన వెంటనే, మస్క్ అమెరికా స్వాతంత్ర్య దినోత్సవం జులై 4న తన కొత్త పార్టీని ప్రకటించారు. ముందుగా కొత్త పార్టీ స్థాపన విషయంలో నెటిజన్ల అభిప్రాయాల్ని సేకరించారు. కొత్త పార్టీకి మద్దతుగా 1.2మిలియన్ల మంది నెటిజన్లు స్పందించారు. దాదాపు 80 శాతం మంది మస్క్‌కు మద్దతు తెలిపారు. ఈ ఫలితాల ఆధారంగా, ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఆయన కొత్త పార్టీని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.త్వరలోనే పార్టీ లోగో ప్రకటనపార్టీ పేరు ది అమెరికా పార్టీగా నామకరణం చేసినా.. పార్టీ గుర్తును రెండు తలల పాము మీమ్‌ను షేర్ చేస్తూ తన పార్టీ ప్రస్తుత రాజకీయ వ్యవస్థకు ప్రత్యామ్నాయంగా నిలబడుతుందనే సంకేతాలిచ్చారు. ఇది అధికారిక పార్టీ లోగోగా ప్రకటించలేదు కానీ.. ప్రారంభ దశలో పార్టీ భావజాలానికి ప్రతీకగా ఈ చిహ్నాన్ని ఉపయోగిస్తున్నారు. భవిష్యత్తులో పార్టీకి ప్రత్యేక లోగో, జెండా, రంగులు ప్రకటించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది ఎన్నికల్లో మస్క్ పోటీఇక వచ్చే ఏడాది అమెరికాలో జరగనున్న మధ్యంతర ఎన్నికల్లో 2–3 సెనేట్ స్థానాలు, 8–10 ప్రతినిధుల సభ స్థానాల్లో ఎలాన్ మస్క్ పోటీ చేయనున్నారంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం, ప్రభుత్వ ఖర్చులను తగ్గించడం. తన పార్టీ ద్వారా ప్రజల గొంతుకను వినిపించడమే తన పార్టీ ఉద్దేశమనే నినాధాలతో ప్రజల్లోకి వెళ్లనుంది. ఎన్నికల్లో మస్క్ లేజర్ ఫోకస్ వ్యూహం అమెరికాలో ప్రతినిధుల సభ (House of Representatives) సభ్యుల పదవీకాలం కేవలం 2 సంవత్సరాలు. పదవీ కాలం పూర్తయిన వెంటనే ప్రతినిధుల సభ (House of Representatives) లోని 435 స్థానాలకు, సెనేట్ (Senate) లోని 34 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తన పార్టీ సైతం ఈ ఎన్నికల బరిలో దిగేలా ఎలాన్ మస్క్ లేజర్ ఫోకస్ వ్యూహాన్ని అమలు చేయనున్నారు. ఈ స్ట్రాటజీ ప్రకారం దేశంలోని అన్నీ స్థానాల్లో పోటీ చేయకుండా.. కేవలం గెలిచే స్థానాల్లో పోటీకి దిగడం, గెలుపు సమీకరణాల్ని మార్చే ప్రయత్నం చేయడం వంటి అంశాలు దీని కిందకే వస్తాయి.మస్క్ ముందున్న సవాళ్లుకాగా,మస్క్ సంపద, ప్రభావం ఉన్నప్పటికీ, మూడో పార్టీగా ఎదగడం సవాలుతో కూడుకున్నదే. గతేడాది అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ తరుఫున మస్క్ ప్రచారం చేశారు. ఆ సమయంలో నేను అమెరికా అధ్యక్షుడిని కాలేను. ఎందుకంటే? నేను సౌతాఫ్రికాలో జన్మించాను. మా తాత అమెరిన్. నేను ఆఫ్రికన్. కాబట్టి నేను అమెరికాకు అధ్యక్షుడిని కాలేను. రాకెట్లను, కార్లను నిర్మించడమే తన లక్ష్యమని చెప్పుకున్న మస్క్ ఇప్పుడు అకస్మాత్తుగా పార్టీ ప్రకటించడం.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయాలని ఉందని పరోక్ష సంకేతాలివ్వడంపై అమెరికన్లు పెదవి విరుస్తున్నారు. మస్క్‌కు ఎలక్షన్ ఎర్రి ఉందంటూ మండిపడుతున్నారు. -
ఎలాన్ మస్క్ పార్టీ ప్రకటన.. అమెరికాలో మూడో పార్టీ సక్సెస్ ఎలా ఉందంటే?
వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. ‘ది అమెరికా పార్టీ’ స్థాపిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో, అమెరికాలో మరోసారి మూడో రాజకీయ పార్టీ అంశం తెరపైకి వచ్చింది. కాగా.. దీనిని రిపబ్లికన్, డెమొక్రటిక్ అనే రెండు పార్టీల వ్యవస్థకు సవాల్‌గా మస్క్ అభివర్ణించారు.అయితే, పార్టీ అధికారికంగా నమోదైనట్లు ఫెడరల్ ఎలక్టోరల్ కమిషన్ ఇంకా ధ్రువీకరించలేదు, దానికి సంబంధించి ఇంకా ఎలాంటి పత్రాలనూ కమిషన్ ప్రచురించలేదు. ఆ పార్టీ అధికారికంగా నమోదైందా? లేదా? అనేది అమెరికా ఎన్నికల అధికారుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. ఆ పార్టీని ఎవరు నడిపిస్తారు, ఎలా ఉండబోతోందనే విషయాలను మస్క్ కూడా వెల్లడించలేదు. ఒకవేళ మస్క్ పార్టీని ఎన్నికల గుర్తిస్తే మూడో పార్టీ అవతరించే అవకాశం ఉంది. మస్క్ పార్టీ ఎన్నికల్లో ఎంత ప్రభావం చూపుతుంది అనేది ఆసక్తికరంగానే మారనుంది.రెండు పార్టీలదే హవా..ఇక, ఇప్పటి వరకు అమెరికా చరిత్రలో మెజార్టీ అధ్యక్షులు కేవలం రెండు పార్టీల నుంచే వచ్చారు. అవే రిపబ్లికన్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ పార్టీకి చెందిన వ్యక్తి. గత అధ్యక్షుడు జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీకి చెందినవారు. ఇదిలా ఉండగా.. అమెరికా ఇప్పటికే పలుమార్లు కొందరు వ్యక్తులు మూడో పార్టీని పెట్టి ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. కేవలం ఒకే ఒకరు జార్జ్ వాషింగ్టన్ మాత్రమే స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి.. అమెరికాకు అధ్యక్షుడు అయ్యారు. ఆయన 1789-97 వరకు అధ్యక్షుడిగా పనిచేశారు. ఇదిలా ఉండగా.. అమెరికా రాజకీయ చరిత్రను పరిశీలిస్తే.. పలు పార్టీలను కొందరు నాయకులు ప్రారంభించినప్పటికీ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. కేవలం ఒకటి, రెండు పార్టీలు మాత్రమే ఎన్నికల్లో ఓట్లను చీల్చగలిగాయి. అంతే తప్ప అధికారంలోకి మాత్రం రాలేకపోయాయి. మెజార్టీ నేతలు తమ మార్కును ఎన్నికల్లో చూపించలేకపోయారు. ఈ నేపథ్యంలో ఎలాన్ మాస్క్ కొత్త పార్టీ.. అమెరికాలో ఎంత మేరకు ప్రభావం చూపించనుంది అనేది ఆసక్తికరంగా మారింది. అమెరికన్లు మస్క్‌ను ఎలా ఆదరిస్తారనేది హాట్ టాపిక్‌గా మారింది.అమెరికాలో మూడో పార్టీ చరిత్ర ఇలా..Anti-Masonic Party (1828): ఇది అమెరికాలో మొట్టమొదటి మూడో పార్టీగా గుర్తించబడుతుంది. మాసన్రి సంస్కృతిని వ్యతిరేకిస్తూ ఏర్పడింది.Liberty Party (1840): దాస్యవ్యవస్థను వ్యతిరేకించడానికి ఏర్పడింది.Free Soil Party (1848): స్లేవరీ విస్తరణకు వ్యతిరేకంగా.Know-Nothing Party (1850): మైగ్రేషన్, కాథలిక్ వ్యతిరేక భావాలతో పనిచేసింది.Populist Party (People’s Party, 1890s): రైతుల హక్కులు, ఫెడరల్ బ్యాంక్ రిఫార్మ్స్, డైరెక్ట్ సెనేటర్ ఎలెక్షన్స్ వంటివి మద్దతుగా ఉంది.Progressive Party (1912): టెడి రూజవెల్ట్ నాయకత్వంలో ఏర్పడింది. సామాజిక న్యాయం, కార్మిక హక్కులు, వ్యాపార నియంత్రణపై దృష్టి సారించింది.Socialist Party (1901-1950): యుజీన్ డెబ్స్ వంటి నాయకులు ప్రముఖులుగా నిలిచారు.Libertarian Party (1971): వ్యక్తిగత స్వేచ్ఛ, ఉచిత మార్కెట్ సిద్ధాంతాలపై నమ్మకంతో ఏర్పడింది.Green Party (1990): పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం, శాంతి సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రారంభమైంది.Reform Party (1995): రాస్ పెరో స్థాపించాడు. ప్రభుత్వ ఖర్చులు తగ్గింపు, కరపన్ను సవరణలు వంటివి ప్రధాన అంశాలు.అయితే, అమెరికాలో పలు పార్టీలు పోటీలో ఉన్నప్పటికీ కేవలం మూడు పార్టీలు మాత్రమే ఎన్నికల్లో కొంత ప్రభావం చూపించాయి.Theodore Roosevelt (Progressive Party 1912): మూడో పార్టీ అభ్యర్థిగా అత్యధిక ఓట్లు (27%) పొందిన అభ్యర్థి.Ross Perot (Independent/Reform Party 1992): సుమారు 19% ఓటు బ్యాంక్ సంపాదించాడు.George Wallace (American Independent 1968) : ఐదు రాష్ట్రాల్లో విజయం సాధించారు.Ralph Nader (Green Party 2000): ఎన్నికల్లో డెమోక్రాట్ల ఓటు చీల్చాడనే వాదన ఉంది.RFK Jr Cornel West (Independent 2024): ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ప్రభావం చూపించకలేకపోయారు. ఇప్పటి వరకు మూడో రాజకీయ పార్టీ, అభ్యర్థి సాధించిన ఓట్ల శాతం.. -
అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ పై యుద్ధం ప్రకటించిన మస్క్
-
కొత్తపార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు ఎలాన్ మస్క్ ప్రకటన
-
అన్నంతపనీ చేసిన మస్క్.. పార్టీ ఫ్యూచర్ ప్లాన్ ఇదే..
వాషింగ్టన్ డీసీ: టెక్ దిగ్గజం ఎలన్ మస్క్ తన కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. అధ్యక్షుడు ట్రంప్ బిగ్ బ్యూటీఫుల్ చట్టం తీసుకువచ్చిన దరిమిలా, దాన్ని వ్యతిరేకిస్తూ మస్క్ కొత్త రాజకీయ పార్టీ పెట్టారు. తాను అనుకున్నది సాధించేవరకూ వదలని చెప్పే మస్క్ ఇప్పుడు అమెరికాలో కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారు.ప్రముఖ టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ ఎలన్ మస్క్, అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని స్థాపనపై ప్రకటన చేశారు. ఈ పార్టీకి ‘అమెరికా పార్టీ’ అని పేరు పెట్టే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో విభేదాల నేపధ్యంలో ఆయన ఈ ప్రకటన చేయడం విశేషం. ఎలన్ మస్క్ తన ‘ఎక్స్’లో ఒక పోల్ నిర్వహించి, తన 22 కోట్ల మంది ఫాలోవర్స్‌ను ఓ ప్రశ్న అడిగారు ‘అమెరికాలో కొత్త రాజకీయ పార్టీని నెలకొల్పాల్సిన సమయం వచ్చిందా?" అని అడిగినప్పుడు 80 శాతం మంది అవును అని సమాధానమిచ్చారు. By a factor of 2 to 1, you want a new political party and you shall have it!When it comes to bankrupting our country with waste & graft, we live in a one-party system, not a democracy.Today, the America Party is formed to give you back your freedom. https://t.co/9K8AD04QQN— Elon Musk (@elonmusk) July 5, 2025ఈ ఫలితాలను వెల్లడిస్తూ మస్క్ ఓ ప్రకటనలో ‘అమెరికాలో 80 శాతం మందికి ప్రాతినిధ్యం వహించే కొత్త రాజకీయ పార్టీ అవసరమని తెలిపారు. ఇది ప్రధాన పార్టీలైన డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఉంటుందని మస్క్ అభివర్ణించారు. కొత్త పార్టీ సాయంతో 2026 మధ్యంతర ఎన్నికల్లో హౌస్, సెనేట్ సీట్లపై మస్క్ దృష్టి సారించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. తదుపరి అధ్యక్ష ఎన్నికల్లో మస్క్ అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. అమెరికాలో డెమోక్రటిక్, రిపబ్లికన్ పార్టీలు దశాబ్దాలుగా రాజకీయ రంగంలో ఆధిపత్యం చలాయిస్తున్నాయి. ఇప్పుడు మస్క్ ‘అమెరికా పార్టీ’ వీటికి సవాలుగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
పుట్టకతో చెవిటివారా? ‘ఫర్వాలేదు శబ్దాలు వినవచ్చు’
పుట్టకతోనే చెవిటివారా లేదా చెవిలో మిషన్ పెట్టనిదే బయట శబ్దాలు వినిపించట్లేదా.. అయితే ఈ విషయం తెలుసుకోవాల్సిందే.. పుట్టకతోనే ఎవరైనా పూర్తిగా చెవిటివారుగా ఉన్న సందర్భాల్లోనూ వినికిడిని పొందేందుకు న్యూరాలింక్ బ్రెయిన్ చిప్ సహాయపడుతుందని ఆ కంపెనీ చీఫ్ ఎలాన్ మస్క్ తెలిపారు. వినికిడి లోపం గురించి యూజర్లను హెచ్చరించిన ఎక్స్‌లోని ఒక పోస్ట్‌కు ప్రతిస్పందనగా మస్క్ ఈమేరకు వివరాలు వెల్లడించారు.కెర్నల్ కంపెనీ సీఈఓ బ్రెయిన్ జాన్సన్ తన ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ పెడుతూ..‘మీ చెవులను సంరక్షించుకోండి. వినికిడి కోల్పేతే ఆ నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రస్తుతం చికిత్సలు అందుబాటులో లేవు. డెమెన్షియా వల్ల వినికిడి కోల్పోయే ప్రమాదం 5 రెట్లు ఉంటుంది. 30–40% మెదడుపై ప్రభావం పడుతుంది. ఒకసారి చెవి లోపలి కణాలు పాడైతే సహజ వినికిడిని పునరుద్ధరించలేం. కాబట్టి మీ చెవులకు గరిష్టంగా 80 డెసిబుల్స్ మించి శబ్దాలను దరిచేరకుండా జాగ్రత్తపడండి. శబ్దాలను కొలిచే యాప్‌లో ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయి’ అన్నారు.దీనికి ప్రతిస్పందనగా మస్క్..‘వినికిడిని పునరుద్ధరించడానికి న్యూరాలింక్ ద్వారా ఒక స్పష్టమైన మార్గం సూచిస్తుంది. పుట్టినప్పటి నుంచి పూర్తిగా వినికిడి లేనివారికి కూడా వినికిడి వచ్చేలా చేయవచ్చు. ఎందుకంటే న్యూరాలింక్ పరికరం ధ్వనిని ప్రాసెస్ చేసే మెదడులోని న్యూరాన్లను యాక్టివేట్ చేస్తుంది’ అని చెప్పారు.There is a clear path to restoring hearing with a @Neuralink, even for someone who has had total loss of hearing since birth, as our device directly activates the neurons in the brain that process sound https://t.co/h5CeELct5m— Elon Musk (@elonmusk) June 28, 2025ఇదీ చదవండి: ‘యాపిల్ రహస్యాలు దొంగతనం’ఇదిలాఉండగా, ఎలాన్ మస్క్‌కు చెందిన బ్రెయిన్ టెక్నాలజీ స్టార్టప్ న్యూరాలింక్ పక్షవాత బాధితుల కోసం రూపొందించిన ఇంప్లాంట్ ఇప్పటికే రెండో ట్రయల్ విజయవంతమైంది. అలెక్స్ అనే వ్యక్తికి అమర్చిన రెండో ఇంప్లాంట్ బాగా పని చేస్తోందని కంపెనీ గతంలో తెలిపింది. -
మస్క్‌కు ట్రంప్ వార్నింగ్ ..!
-
మస్క్ కంపెనీలో ఉద్యోగం కావాలా?
ఎలాన్ మస్క్‌కు చెందిన ఏఐ కంపెనీ ఎక్స్ఏఐలో నియామకాలు జోరుగా సాగుతున్నాయి. బ్యాకెండ్ ఇంజినీర్లు, ప్రొడక్ట్ డిజైనర్లు, డేటా సైంటిస్టులు, లీగల్ ఎక్స్‌పర్ట్‌లు.. వంటి ఉద్యోగాల కోసం ఎక్స్ఏఐ తన ఎక్స్ ఖాతాలో ప్రకటన జారీ చేసింది. ప్రస్తుతం పాలో ఆల్టో, శాన్ ఫ్రాన్సిస్కో, మెంఫిస్‌లోని కార్యాలయాల్లో విస్తృత శ్రేణి ఉద్యోగాలను భర్తీ చేయాలని చూస్తోంది. కొన్ని పోస్టులు రిమోట్ దరఖాస్తుదారులకు కూడా అందుబాటులో ఉన్నాయి. డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్ మనీ’ని అభివృద్ధి చేయడానికి చురుకుగా పనిచేస్తున్నట్లు ఎక్స్ఏఐ తెలిపింది.ఎలక్ట్రిక్ వాహనాలు, అంతరిక్ష ప్రయాణాలు, సామాజిక మాధ్యమాల్లో తనదైన ముద్ర వేసిన తర్వాత మస్క్ తన ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా ఆర్థిక సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఎక్స్‌లో ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ ఫీచర్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఎక్స్ యూజర్లు ప్లాట్‌ఫామ్ నుంచి బయటకు వెళ్లకుండా షాపింగ్, టిప్పింగ్, మనీ మేనేజ్మెంట్.. వంటి మరెన్నో లావాదేవీలను నిర్వహించేందుకు వీలు కల్పించేలా సమగ్ర ఆర్థిక ఎకోసిస్టమ్‌ను రూపొందించమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రణాళికలో భాగంగా ఎక్స్ బ్రాండెడ్ క్రెడిట్, డెబిట్ కార్డులను త్వరలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ముందుగా యూఎస్‌లో ఈమేరకు మార్పులు చేయబోతున్నట్లు అధికార వర్గాలు గతంలో తెలిపాయి. క్రమంగా ఈ మార్పులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్నట్లు చెప్పాయి.ఇప్పటికే ‘వీసా’తో ఒప్పందంవీసా సంస్థ ఇప్పటికే ఈమేరకు ఎక్స్ ప్లాట్‌ఫామ్ మొదటి చెల్లింపుల భాగస్వామిగా సంతకం చేసింది. ఎక్స్ మనీ సేవలో డిజిటల్ వాలెట్, పీర్-టు-పీర్ పేమెంట్ ఫంక్షన్లు ఉంటాయి. వీటి ద్వారా ఎక్స్‌లో వినియోగదారులు కొనుగోళ్లు చేయవచ్చు. వాలెట్లో మనీ నిల్వ చేసుకోవచ్చు. ‘మీరు ఎక్స్‌లోకి వెళ్లి మీ ఆర్థిక లావాదేవీలన్నింటినీ నిర్వహించగలరు’ అని ఎక్స్ సీఈఓ లిండా యాకారినో కేన్స్ లయన్స్ గతంలో ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ క్రియేటివిటీలో పేర్కొన్నారు.ఇదీ చదవండి: ర్యాపిడో.. ఓలా.. ఉబర్.. ఛార్జీలు పెంపు?వేతనాలు ఇలా..ఎక్స్ఏఐలో చేరే ఉద్యోగులకు ఏటా 2,20,000 డాలర్ల (సుమారు రూ.1.9 కోట్లు) నుంచి 4,40,000 డాలర్ల (సుమారు రూ.3.7 కోట్లు) వరకు పారితోషికం ఆఫర్ చేసింది. డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్, సెక్యూర్ ట్రాన్సాక్షన్స్ వంటి రంగాల్లో బలమైన సాంకేతిక పరిజ్ఞానంతో పాటు, సంక్లిష్టమైన ఆలోచనలను స్పష్టంగా కమ్యూనికేట్ చేసే సామర్థ్యం ఉన్న ఇంజినీర్లకు కంపెనీ మరింత చెల్లిస్తుందని ఎక్స్ఏఐ తెలిపింది. -
మస్క్‌కు ట్రంప్ వార్నింగ్ ..!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మధ్య మళ్లీ వివాదం రాజుకుంది. ‘బిగ్, బ్యూటిఫుల్ బిల్’తో వారి మధ్య అప్పట్లో సాగిన వాగ్యుద్ధం మరోసారి తీవ్ర రూపు దాలుస్తోంది. బిల్లును వ్యతిరేకిస్తున్న మస్క్‌పై ట్రంప్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చరిత్రలో ఎవరికీ దక్కని విధంగా ఆయన సబ్సిడీలు పొందారని ఆక్షేపించారు. సబ్సిడీలే లేకపోతే రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహాలు, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి వంటివేవీ ఉండేవి కాదన్నారు. దుకాణం మూసేసి, ఇంటికి (దక్షిణాఫ్రికా) వెళ్లాల్సి వస్తుందంటూ ఎద్దేవా చేశారు. ‘‘బిగ్ బిల్లు మన దేశ చాలా సంపదను ఆదా చేస్తుంది. బహుశా డోజ్ దీని గురించి బాగా ఆలోచించాలి. మస్క్ పొందుతున్న ప్రభుత్వ సబ్సిడీలు, కాంట్రాక్టులను పరిశీలించాలి’’ అని తన సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్‌లో ట్రంప్ పేర్కొన్నారు.‘‘మస్క్ నన్ను అధ్యక్షునిగా ఆమోదించడానికి చాలా ముందునుంచే ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీని నేను తీవ్రంగా వ్యతిరేకిస్తూ వస్తున్నా. ఈ అంశం నా ప్రచారంలో ప్రధానంగా ఉంటూ వస్తోంది. ఎలక్ట్రిక్ కార్లకు నేనేమీ వ్యతిరేకం కాదు. అవి మంచివే. కానీ అంతా వాటినే వాడాలని మాత్రం ఎవరూ బలవంతం చేయకూడదు’’ అని వ్యాఖ్యానించారు. అనంతరం ఫ్లోరిడా వెళ్లేముందు వైట్‌హౌస్ ఆవరణలో ఈ అంశంపై మరోసారి మీడియాతో మాట్లాడారు. ‘‘మస్క్‌కు బాగా అసంతృప్తి ఉంది. కానీ ఒక్కటి మాత్రం చెప్పదలచా. ఆయన మరెంతో నష్టపోవాల్సి రావచ్చు.ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించేందుకు ఏర్పాటు చేసిన డోజ్‌ను మస్క్పైకి ఉసిగొల్పాల్సి రావచ్చు. బహుశా అదే ఆయన్ను కబళించే రాకాసిగా మారవచ్చు!’’ అంటూ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. దీనిపై మస్క్ స్పందిస్తూ, తనకిస్తున్న సబ్సిడీలను ఎత్తేయాలంటూ ట్రంప్‌కు సవాలు విసిరారు. ఆ తర్వాత ఈ అంశంపై మీడియాతో ట్రంప్ స్పందించారు. మస్క్‌ను అమెరికా నుంచి తిప్పి పంపించే యోచన ఉందా అని ప్రశ్నించగా ‘‘నాకు తెలియదు. దీనిపై దృష్టి సారించి చూడాలి’’ అని బదులిచ్చారు. డోజ్‌కు ఇటీవలి దాకా సారథ్యం వహించింది మస్కే కావడం విశేషం. ఆయన 1971లో దక్షిణాఫ్రికాలోని ప్రిటోరియాలో జన్మించారు. అమెరికాలో ఏళ్ల తరబడి నివసించిన అనంతరం 2002లో ఆ దేశ పౌరసత్వం పొందారు.కొత్త పార్టీ దేశావసరం: మస్క్బిగ్, బ్యూటిఫుల్ బిల్‌పై మస్క్ నెల రోజులుగా ట్రంప్‌తో విభేదిస్తున్నారు. తుది ఓటింగ్‌కు ముందు సోమవారం కాంగ్రెస్‌లో ట్రంప్ చర్చించిన సందర్భంగా మస్క్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దాన్ని రుణ బానిసత్వపు బిల్లుగా అభివర్ణించారు. ‘‘ఈ బిల్లు వల్ల జాతీయ రుణం మరో 3 లక్షల కోట్ల డాలర్లకు పైగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో నిజంగా ప్రజల గురించి ఆలోచించే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేయడానికి బహుశా సమయం ఆసన్నమైంది’’ అని మస్క్ ఎక్స్‌లో పోస్టు చేశారు. బిల్లును విమర్శించడంతోనే ఆగలేదు.హౌస్ ఫ్రీడమ్ కాకస్ చైర్మన్ ప్రతినిధి ఆండీ హారిస్‌తో సహా ప్రముఖ రిపబ్లికన్ చట్టసభ సభ్యులపైనా విమర్శలు గుప్పించారు. ‘చరిత్రలో అతిపెద్ద రుణ పరిమితి పెరుగుదలతో రుణ బానిసత్వ బిల్లుకు మీరు ఓటు వేసి.. మిమ్మల్ని మీరు ఫ్రీడమ్ కాకస్ అని ఎలా పిలుచుకుంటారు?’ అని మస్క్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఖర్చులను తగ్గించాలంటూ మొన్నటిదాకా ప్రచారం చేసి, ఇప్పడిలా దేశ చరిత్రలోనే అతిపెద్ద రుణ పెరుగుదల బిల్లుకు ఓటేసిన ప్రతి కాంగ్రెస్ సభ్యుడూ సిగ్గుతో తల దించుకోవాలని వ్యాఖ్యానించారు. మస్క్ పోస్టును సోషల్ మీడియాలో ఏకంగా 2.6 కోట్ల మందికి పైగా చూడటం విశేషం. బిల్లు ఆమోదం పొందితే కొత్త పార్టీ పెడతానంటూ ఆ తర్వాత కొద్ది గంటలకే మస్క్ మరో పోస్ట్ పెట్టారు. ‘ఈ పిచ్చి బిల్లు రిపబ్లికన్ పార్టీకి ఆత్మహత్యాసదృశమే అవుతుంది.అది ఆమోదం పొందితే ఆ మర్నాడే ‘అమెరికా పార్టీ’ ఏర్పడుతుంది. డెమొక్రాట్–రిపబ్లికన్ పార్టీలకు ప్రత్యామ్నాయం ఇప్పుడు దేశానికెంతో అవసరం. రాబోయే పార్టీ ప్రజల పక్షాన ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఆ పోస్టును ఏకంగా 3.2 కోట్ల మంది వీక్షించారు. ఇప్పటికే ప్రతినిధుల సభ ఆమోదం పొందిన ‘బిగ్’ బిల్లుపై మూడు రోజులుగా సెనేట్‌లో తీవ్రస్థాయి చర్చ జరుగుతోంది. మంగళవారం ఇది ఆమోదం పొందింది. దీనితో విద్యుత్ వాహనాలకు ప్రస్తుతం అందుతున్న భారీ సబ్సిడీలు పూర్తిగా అటకెక్కుతాయి. మస్క్ ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా, అంతరిక్ష ప్రయోగాల సంస్థ స్పేస్ఎక్స్ ప్రభుత్వం నుంచి భారీ కాంట్రాక్టులు, సబ్సిడీలు పొందుతున్న విషయం తెలిసిందే. -
టెస్లా షేర్లు భారీగా కుదేలు
ఒకప్పుడు ఉమ్మడి ఆకాంక్షలతో పరస్పర సహకారంతో కలిసి ప్రయాణం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ మధ్య సమీకరణాలు పూర్తిగా మారాయి. ఇద్దరి మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమనేంత వైరం రాజేసుకుంది. ఇటీవల ట్రంప్ ప్రతిపాదించిన ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్లు’ను ఎలాన్ మస్క్ తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రతిష్టంభనకు తెరతీసినట్లయింది. తాజాగా మస్క్ కంపెనీలకు అందిస్తున్న సబ్సిడీల్లో కోత విధిస్తే పరిస్థితి ఏమిటని ట్రంప్ ఎద్దేవ చేశారు. దానికి ప్రతిస్పందనగా అన్నీ రాయితీలు కట్ చేయడంటూ మస్క్ బదులిచ్చారు. ఇద్దరిమధ్య పెరుగుతున్న వ్యతిరేకతతో టెస్లా షేర్లు ఒక్క రోజులోనే 5 శాతంకు పైగా క్షీణించాయి.ట్రంప్ ప్రతిపాదించిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును మస్క్ ‘ఆర్థిక నిర్లక్ష్యానికి చిహ్నం’గా అభివర్ణించారు. ప్రస్తుతానికి ఈ బిల్లు యూఎస్ సెనేట్‌లో ఆమోదం పొందింది. 51–49 ఓట్లతో ఈ బిల్లును ఆమోదించారు. కానీ ప్రతినిధుల సభలో ఇంకా ఆమోదించాల్సి ఉంది. ఈ బిల్లు అమెరికా ఆర్థిక, సామాజిక ముఖచిత్రాన్ని మారుస్తుందని ట్రంప్ వాదిస్తుంటే.. కొంతమందికి భారీ పన్ను ఉపశమనం కలిగించేలా, మరికొందరికి ఖర్చులు పెరిగేలా, వలసలపై కఠిన వైఖరి ఉండేలా నిర్ణయాలున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.‘నేను ఈవీ మాండేట్ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని ఎలాన్ మస్క్‌కు చాలాకాలం ముందే తెలుసు. ఇది నా రాజకీయ ప్రచారంలోనూ కీలకంగా ఉంది. ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు బాగానే ఉన్నాయి. కానీ ప్రతి ఒక్కరూ కారును సొంతం చేసుకోవాలని బలవంతం చేయకూడదు. సబ్సిడీలు లేకుండా మస్క్ బహుశా తన దుకాణాన్ని మూసివేసి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సి ఉంటుంది’ అని ట్రంప్ అన్నారు. దాంతోపాటు టెస్లా, స్పేస్ఎక్స్ వంటి మస్క్ వెంచర్లు ప్రభుత్వ నిధులపై ఎంతగా ఆధారపడుతున్నాయో డోజ్ దర్యాప్తు చేయాలని ట్రంప్ ప్రతిపాదించారు.BREAKING: Trump implies DOGE may look at Elon Musk’s subsidies: pic.twitter.com/FE9lXj0Ebq— unusual_whales (@unusual_whales) July 1, 2025ఇదీ చదవండి: డియర్ స్టాఫ్.. ఆరోగ్యం జాగ్రత్త!మస్క్ స్పందన ఇలా..ట్రంప్ వ్యాఖ్యలపై వెంటనే స్పందించిన మస్క్ తన కంపెనీలకు ఇచ్చే సబ్సిడీలను తగ్గించాలని కోరారు. ‘నేను నిజంగా చెబుతున్నా.. అన్ని రాయితీలను కట్ చేయండి’ అంటూ తన ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు. -
ట్రంప్ పై మరోసారి మండిపడ్డ ఎలన్ మస్క్
-
దుకాణం బంద్ చేసి.. మస్క్‌కు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు
బిగ్ బ్యూటీఫుల్ బిల్లుపై తీవ్ర విమర్శలు చేస్తున్న ఎలాన్ మస్క్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఘాటుగా సమాధానం ఇచ్చారు. అతడు (మస్క్) అమెరికాలో వ్యాపారం చేయలేకపోతే దుకాణం మూసేసి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లాల్సి వస్తుంది అని హెచ్చరించారు. ఒకసారి ఆయన అమెరికా ప్రభుత్వం నుంచి పొందిన సబ్సిడీలను తాను చూసుకోవాలి. అమెరికా చరిత్రలోనే ఎవరూ పొందలేనంత సబ్సిడీలను మస్క్ పొందారు. అలాంటి వ్యక్తి నా ప్రభుత్వంలో DOGE (Department of Government Efficiency) చీఫ్‌గా పనిచేశారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు నాకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తున్నారు. ఒకవేళ ఆ సబ్సిడీలే వద్దనుకుంటే ఆయన తన వ్యాపారాలను బంద్ చేసుకోవచ్చు. అమెరికా వదిలి దక్షిణాఫ్రికాకు తిరిగి వెళ్లిపోవొచ్చు అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. అదే జరిగితే.. ఇంకా రాకెట్ ప్రయోగాలు, ఉపగ్రహాలు, ఎలక్ట్రిక్ కార్ల ఉత్పత్తి అవసరం ఆయనకు ఉండదు. పైగా మన దేశానికి భారీగా డబ్బు ఆదా అవుతుంది. దీనిపై DOGE (Department of Government Efficiency) గట్టిగా పరిశీలన చేయాలి. ఇది పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేసే అవకాశం! అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన భారీ ఖర్చుల బిల్లు(One Big, Beautiful Bill)పై ఎలాన్ మస్క్ మొదటి నుంచి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంతోనే ఆయన డోజ్ పదవికి రాజీనామా చేసి బయటకు వచ్చారు. అయితే మస్క్ ఎంతగా విమర్శించినప్పటికీ.. ట్రంప్ మాత్రం మస్క్ మంచి స్నేహితుడనే చెబుతూ వస్తున్నారు. ఈ క్రమంలో.. బిల్లు గనుక ఆమోదం పొందితే ఆ మర్నాడే తాను రాజకీయ పార్టీని ప్రకటిస్తానని మస్క్ తాజాగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. ట్రంప్ కూడా ఇప్పుడు ఘాటుగా స్పందించడం మొదలుపెట్టారు. ట్రంప్ రెండో దఫా అధ్యక్ష విజయంలో ఎలాన్ మస్క్ కీలక పాత్రే పోషించారు. ఆ ఎన్నికల సమయంలో దాదాపు $300 మిలియన్ల విరాళాలు ఇచ్చారు. కానీ బిల్లు కారణంగా ఇప్పుడు ఇద్దరి మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. ట్రంప్ తాజా వ్యాఖ్యలు చూస్తుంటే మస్క్‌ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. -
అదే జరిగితే.. రేపే కొత్త పార్టీ పెడతా!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు సన్నితుడిగా, రాజకీయ సలహాదారుడిగా వ్యవహరించిన అపర కుబేరుడు ఎలాన్ మస్క్.. ఇప్పుడు విమర్శలతో విరుచుకుపడుతున్నారు. తాజాగా బ్యూటీఫుల్ బిల్‌పై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇదొక పిచ్చి ఖర్చు అని, పన్ను చెల్లింపుదారులకు భారంగా మారుతుందని అన్నారాయన. అలాగే పార్టీ ఏర్పాటుపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.వాషింగ్టన్: గతంలో ట్రంప్‌కు మద్దతుగా నిలిచిన మస్క్.. తన ఎక్స్ వేదికగా అదే వ్యక్తి పాలనా విధానాలను వరుస పోస్టులతో తిట్టిపోస్తున్నారు. ట్రంప్ ప్రతిపాదిత బిగ్ బ్యూటీఫుల్ బిల్లుపై మరోసారి స్పందిస్తూ..ఈ బిల్లు సాధారణ అమెరికన్లకు నష్టం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. అదే సమయంలో కొత్త పార్టీ ఏర్పాటుపైనా ఆయన కీలక ప్రకటన చేశారు. ఖర్చులను తగ్గిస్తామని చెప్పిన రిపబ్లికన్ నాయకులు ఇప్పుడు భారీ ఖర్చులకు మద్దతు ఇస్తున్నారు. అమెరికా సెనేట్‌లో ప్రస్తుతం ఓట్ల పోరు కొనసాగుతోంది. రిపబ్లికన్లు ట్రంప్ రెండో పదవీకాలానికి కీలకమైన ఈ బిల్లును ఆమోదించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ బిల్లు ఆమోదితమైతే, ప్రజల కోసం నిజంగా పనిచేసే కొత్త రాజకీయ పార్టీ అమెరికా పార్టీని రేపే స్థాపిస్తానంటూ మస్క్ వ్యాఖ్యానించారు. ట్రంప్ కోసం 250 మిలియన్ డాలర్లతో మద్దతు ప్రచారం నిర్వహించిన మస్క్.. ట్రంప్ ప్రతిపాదించిన బిల్లు అమెరికన్లకు తీవ్ర నష్టం చేకూరుస్తుందనే అభిప్రాయం తొలి నుంచి వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లుతో జరిగే పిచ్చి ఖర్చు స్పష్టంగా చూపిస్తోంది. ఇది దేశపు అప్పు పరిమితిని రికార్డు స్థాయిలో ఐదు ట్రిలియన్ డాలర్ల వరకు పెంచుతోంది. ప్రజల గురించి నిజంగా పట్టించుకునే కొత్త రాజకీయ పార్టీ ఏర్పడాల్సిన సమయం వచ్చింది. అంటూ ఎక్స్ ఖతాలో పోస్ట్ చేశారాయన. తద్వారా.. మస్క్ ప్రస్తుత అమెరికా రాజకీయ వ్యవస్థపై తన అసంతృప్తిని బహిరంగంగా వ్యక్తపరిచారు. అమెరికా సెనేట్ ప్రస్తుతం ట్రంప్ ప్రతిపాదించిన "One Big, Beautiful Bill" పై ఓట్ల పోరులో నిమగ్నమై ఉంది. ఈ బిల్లును జూలై 4 స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు ఆమోదించాలనే లక్ష్యంతో రిపబ్లికన్లు వేగంగా ముందుకు సాగుతున్నారు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలుహౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ గత నెలలో ఈ బిల్లును తక్కువ మెజారిటీతో ఆమోదించింది.ఇప్పుడు సెనేట్ తమ సవరణలతో కూడిన బిల్లును తుది రూపంలోకి తీసుకురావాల్సి ఉంది.ఆ తర్వాత హౌస్ మళ్లీ ఆ సవరణలను ఆమోదించాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ బిల్లు చట్టంగా మారేందుకు అధ్యక్షుడి సంతకం కోసం పంపబడుతుంది. ఈ బిల్లులో..సరిహద్దు భద్రత, రక్షణ, శక్తి ఉత్పత్తికి భారీ ఖర్చులు ప్రతిపాదించబడ్డాయి. అయితే ఆరోగ్య సంరక్షణ, పోషకాహార కార్యక్రమాలపై ఖర్చులను తగ్గించనున్నారు.అమెరికా కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం అంచనా ప్రకారం, ఈ బిల్లు వచ్చే దశాబ్దంలో దాదాపు $3.3 ట్రిలియన్ డాలర్ల లోటును కలిగించనుంది. -
కిరికిరి మొదటికి వచ్చింది .. మరోసారి బిగ్ బ్యూటిఫుల్ బిల్లుపై మస్క్ విమర్శలు
వాషింగ్టన్: అపరకుబేరుడు ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య వివాదం మళ్లీ మొదటికొచ్చింది. ఈ ఏడాది ట్రంప్ ప్రవేశపెట్టిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’పై ఎలాన్ మస్క్ తాజాగా మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ బిల్లును అమలు చేసేలా దిశగా దాదాపు చర్చకు సిద్ధమవుతోంది. ఇందుకోసం 1,000 పేజీల ప్రతిపాదనను సిద్దం చేసింది. ఈ తరుణంలో.. ఆ బిల్లు అవివేకం, విధ్వంసకరం’ అని మస్క్ అభివర్ణించారు. ఈ మేరకు ఎక్స్ ద్వారా మస్క్ ట్వీట్ చేశారు. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్‌ను చట్టం చేసే ప్రయత్నంలో ‘బిల్లు డ్రాఫ్ట్’ను అమెరికా ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ క్రమంలో బిల్లు డ్రాఫ్ట్‌ను మస్క్ తప్పుబట్టారు. తాజా సెనేట్ డ్రాఫ్ట్ బిల్లు మిలియన్ల మంది ఉద్యోగాలకు ఎసరు పెడుతోంది. దేశానికి తీవ్ర నష్టాన్ని కలిగిస్తుంది. అధికార రపబ్లికన్ పార్టీ లీడర్లకు ఇదే నా హెచ్చరిక. బిల్లు చట్టంగా మారిస్తే విధ్వంసం సృష్టించినట్లే. అంతేకాదు, చట్టం అమలైతే ఇప్పటికే స్థాపించిన పరిశ్రమలు, ప్రారంభించబోయే పరిశ్రమలకు రానున్న రోజుల్లో అపార నష్టం వాటిల్లే ప్రమాదం ఉందనే పేర్కొన్నారు. ఇంతకుముందు కూడా హౌస్‌లో ప్రవేశపెట్టిన బిల్లును మస్క్ వ్యతిరేకించారు. ఆబిల్లుకు ఆమోదం లభించడంతో టెస్లా విలువ భారీగా పతనమైంది. నాటి నుంచి గత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్,ఎలాన్ మస్క్‌ల మధ్య వైరం మొదలైంది. దుబారా ఖర్చుల్ని తగ్గించేందుకు అమెరికా ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (doge) సారధ్య బాధ్యతల నుంచి తప్పుకున్నారు. వరుసగా ట్రంప్ తీరును బహిరంగంగా ఎండగడుతూ వచ్చారు. ఒకానొక దశలో నేను ప్రచారం చేయకపోతే రిపబ్లికన్ అధికారంలోకి వచ్చేదే కాదు. ఆ పార్టీ నేతలు 50కే పరిమితమయ్యేదని వ్యాఖ్యానించారు. ఎప్సిటీన్ ఫైళ్లలో ట్రంప్ ఉన్నారంటూ బాంబు పేల్చారు. అందుకే ఎప్సిటీన్ ఫైళ్లను బహిర్గతం చేయటం లేదంటూ ట్రంప్‌పై సంచలన ఆరోపణలు చేశారు. The latest Senate draft bill will destroy millions of jobs in America and cause immense strategic harm to our country!Utterly insane and destructive. It gives handouts to industries of the past while severely damaging industries of the future. https://t.co/TZ9w1g7zHF— Elon Musk (@elonmusk) June 28, 2025ట్రంప్ సైతం మస్క్‌ను అదే స్థాయిలో ప్రతి విమర్శలు చేశారు. మస్క్ తీరు ఇలాగే కొనసాగితే మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు, రాయితీలకు కోత వేస్తానని హెచ్చరించారు. ఈ క్రమంలో ఉన్నట్లుండి ఏమైందో ఏమో.. తాను చేసిన వ్యాఖ్యలకు ట్రంప్ మస్క్ క్షమాపణలు చెప్పారు. అనూహ్యంగా మళ్లీ బిగ్ బ్యూటిఫుల్ బిల్‌ను వ్యతిరేకిస్తూ కామెంట్లు పెట్టారు. మరి ఈ కామెంట్లకు ట్రంప్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. -
ప్లాంటుపై టెస్లాకు ఆసక్తి లేదు
న్యూఢిల్లీ: అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ దిగ్గజం టెస్లాకు భారత్‌లో తయారీ ప్లాంటును ఏర్పాటు చేయడంపై పెద్దగా ఆసక్తి లేదని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి పునరుద్ఘాటించారు. ఇక్కడ తమ కార్ల విక్రయాల కోసం షోరూమ్‌లను తెరవడంపై మాత్రమే కంపెనీ ఆసక్తిగా ఉందని చెప్పారు. భారత్‌లో ఎలక్ట్రిక్ వాహ నాల తయారీపై ఇన్వెస్ట్ చేసే సంస్థలకు దిగుమతి సుంకాలపరంగా ప్రోత్సాహకాలిచ్చే స్కీమునకు సంబంధించి పోర్టల్‌ను ఆవిష్కరించిన సందర్భంగా ఆయన ఈ విషయాలు చెప్పారు. అక్టోబర్ 21 వరకు పోర్టల్ అందుబాటులో ఉంటుంది. అవసరాన్ని బట్టి 2026 మార్చి 15 వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు భారీ పరిశ్రమల శాఖ అప్లికేషన్ విండోను తిరిగి ప్రారంభించవచ్చు. 4–5 వాహన కంపెనీలు ఈ పథకంపై ప్రాథమికంగా ఆసక్తి కనపర్చాయని, అయితే వాస్తవంగా ఎన్ని దరఖాస్తులు వస్తాయనేది వేచి చూడాల్సి ఉంటుందన్నారు. స్కీములో పాలుపంచుకోవాలంటూ జర్మనీ, అమెరికా, బ్రిటన్ తదితర అన్ని దేశాల వాహన దిగ్గజాలను ఆహ్వానిస్తున్నామని.. అయితే చైనా, పాకిస్తాన్‌లాంటి పొరు గు దేశాల సంస్థలకు ఆంక్షలు వర్తిస్తాయన్నారు. కొత్త ఈవీ పథకం ప్రకారం, భారత్‌లో తయారీపై రూ. 4,150 కోట్ల వరకు ఇన్వెస్ట్ చేసే వాహన సంస్థలు, 15% సుంకానికే 8,000 వరకు వాహనాలను దిగుమతి చేసుకునే వీలుంటుంది. ప్రస్తుతం ఈ సుంకాలు 70–100 శాతం వరకు ఉంటున్నాయి. -
తనను తాను డెలివరీ చేసుకుంది!
కొత్త పుంతలు తొక్కుతున్న కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీకి సరికొత్త నిదర్శనం ఇది.. సైన్స్ ఫిక్షన్ సినిమాను పోలిన సన్నివేశం ఇది.. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిన వస్తువు చిటికెలో డోర్ డెలివరీ అవుతున్నట్లుగా ఒక కొత్త టెస్లా కారు ఫ్యాక్టరీ నుంచి స్వయంగా డ్రైవింగ్ చేసుకుంటూ కస్టమర్ ఇంటికి వచ్చేసింది! హైవేపై సాఫీగా మందుకు కదులుతూ.. మధ్యమధ్యలో ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఆగుతూ.. గరిష్టంగా 115 కి.మీ. వేగంతో దూసుకెళ్తూ తన కొత్త ఓనర్ ఉన్న లొకేషన్‌కు భద్రంగా చేరుకుంది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా కంపెనీ ప్రపంచంలోనే తొలిసారిగా ఏమాత్రం మానవ ప్రమేయం లేకుండా తమ కొత్త కారును నేరుగా వినియోగదారుడి చెంతకు చేర్చింది. కృత్రిమ మేధ (ఏఐ) సాయంతో నడిచే పూర్తిస్థాయి అటానమస్ కారు ‘మోడల్ వై’ను టెక్సాస్ రాష్ట్రంలోని ఆస్టిన్ నగరంలో ఉన్న ఫ్యాక్టరీ నుంచి అక్కడికి 30 నిమిషాల ప్రయాణ దూరంలో ఉన్న కస్టమర్ ఇంటికి పంపించింది. మార్గమధ్యలో ట్రాఫిక్ సిగ్నళ్లు, ఫ్లైఓవర్లు, హైవేలను దాటుకుంటూ కారు తన కొత్త యజమాని ఇంటికి చేరుకుంది. ఫ్యాక్టరీ నుంచి గమ్యస్థానం చేరుకొనే వరకు కారు సాగించిన ప్రయాణాన్ని అందులోని ‘డాష్ క్యామ్’రికార్డు చేసింది. ఇందుకు సంబంధించి టెస్లా విడుదల చేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. మరోవైపు తమ అటానమస్ కారు డెలివరీని ఎలాన్ మస్క్ ‘ఎక్స్’వేదికగా ప్రకటించారు. ‘తొలిసారి ఒక కారు యజమానికి తనను తాను డెలివరీ చేసుకుంది’అని పేర్కొన్నారు. నిర్ణీత గడువుకన్నా ఒక రోజు ముందే కారును డెలివరీ చేశామన్నారు. తనకు తెలిసినంత వరకు వాహనంలో వ్యక్తులెవరూ లేకుండా లేదా రిమోట్ ఆపరేటింగ్ లేకుండా ఒక పబ్లిక్ హైవేపై ప్రయాణించిన తొలి పూర్తిస్థాయి అటానమస్ కారు తమదేనన్నారు. ఈ విజయాన్ని సాధించినందుకు టెస్లా సాఫ్ట్వేర్, ఏఐ చిప్ డిజైన్ బృందాలను ఆయన అభినందించారు. మోడల్ వై కారు గంటకు గరిష్టంగా 115 కి.మీ. వేగంతో ప్రయాణించినట్లు టెస్లా ఏఐ, ఆటోపైలట్ విభాగం చీఫ్ అశోక్ ఎల్లుస్వామి వెల్లడించారు. – సాక్షి, సెంట్రల్ డెస్క్ -
కాలం కలిసొచ్చింది... కారు నడిచొచ్చింది!
‘‘కలిసొచ్చే కాలానికి... నడిచొచ్చే కొడుకు పుడతాడంట!’’ పాతకాలపు సామెత. ఈ టెక్నాలజీ యుగంలో ఈ పప్పులేమీ ఉడకవు. కానీ.. డబ్బులు ఉంటే షోరూమ్‌కు వెళ్లి బోలెడన్ని పత్రాలపై సంతకాలు పెట్టి డ్రైవింగ్ వస్తే సొంతంగా.. లేదంటే అద్దెడ్రైవర్ను పెట్టుకుని మరీ తెచ్చుకోవాల్సిన కారు మాత్రం ఇప్పుడు దానంతట అదే నడిచొస్తుంది!. విషయం ఏమిటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది!.. ఎలాన్ మస్క్ సృష్టించిన అద్భుతం డ్రైవర్‌లెస్ కారు మొట్టమొదటిసారి కొనుగోలుదారు ఇంటి వద్దకు వచ్చేసింది. ఈ విషయాన్నే టెస్లా కార్ల కంపెనీ యజమాని ఈలాన్ మస్క్ గర్వంగా తన ‘ఎక్స్’ ప్లాట్‌ఫామ్‌పై పంచుకున్నారు కూడా. ఎలాంటి మానవ సాయం, జోక్యం లేకుండా.. టెక్సస్‌లోని టెస్లా గిగా ఫ్యాక్టరీలో తయారైన ‘మోడల్ వై’ కారు స్థానికంగా కొనుగోలుదారు వద్దకు గంటకు 72 మైళ్ల వేగంతో ప్రయాణిస్తూ వచ్చిందన్నమాట. First time that a car has delivered itself to its owner! https://t.co/xgZBRDaMiX— Elon Musk (@elonmusk) June 28, 2025పైగా... అనుకున్నదాని కంటే ఒక రోజు ముందుగా ఎలాన్ మస్క్ పుట్టినరోజు నాడే ఈ కారు డెలివరీ కావడం ఒక విశేషం. ఆటోమొబైల్ రంగ చరిత్రలో ఇదో చిరస్మరణీయ ఘట్టం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. డ్రైవర్ల అవసరం లేని వాహనాలతో క్యాబ్‌లు నడపాలన్న మస్క్ ఆలోచనలు వాస్తవమయ్యే దిశగా ఇంకో ముందడుగూ పడిందన్నమాట!. మోడల్ వై గురించి క్లుప్తంగా..2020లో లాంచ్ అయిన కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ ఇది. టెస్లా మోడల్ త్రీ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ఐదుగురు కూర్చోగలరు. కొన్ని ప్రాంతాల్లో ఏడు సీట్లు ఉన్న వేరియంట్ కూడా అందుబాటులో ఉంది. టెక్సస్‌లోని ఆస్టిన్ ప్రాంతం ఫ్రీమాంట్‌లోని టెస్లా గిగాఫ్యాక్టరీతోపాటు షాంఘై, బెర్లిన్లలో ఈ మోడల్ వై కార్లు తయారవుతున్నాయి. వేరియంట్‌ను బట్టి 60 - 81 కిలోవాట్ హవర్ల బ్యాటరీతో నడుస్తుంది. లిథియం అయాన్ ఫాస్పే్ట్ (ఎల్ఎఫ్పీ), నికెల్ మాంగనీస్ కోబాల్ట్ (ఎన్ఎంసీ) బ్యాటరీలతో లభిస్తుంది. ఒకసారి ఛార్జ్ చేస్తే వేరియంట్‌ను బట్టి 320 నుంచి 330 మైళ్ల దూరం ప్రయాణించగలదు. పావుగంటలోనే 180 మైళ్ల దూరం ప్రయాణించగలిగేంత విద్యుత్తును ఛార్జ్ చేసుకోవచ్చు. కేవలం 5.4 సెకన్లలోనే 60 మైళ్ల వేగాన్ని అందుకోగల శక్తి దీని సొంతం. గరిష్ట వేగం గంటకు 155 మైళ్లు! వాహనం లోపలి విశేషాల గురించి చూస్తే.. 15.4 అంగుళాల విశాలమైన టచ్స్ట్రీన్, పనోరమిక్ గ్లాస్ రూఫ్‌లు ఉంటాయి. కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టగలిగితే ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ వేరియంట్‌ను కొనుక్కోవచ్చు. లేదంటే కొన్ని పరిమితమైన ఫీచర్లతో డ్రైవింగ్ అవసరాన్ని తగ్గించేవి లభిస్తాయి. తెల్లగీతల మధ్య మాత్రమే ప్రయాణించడం, అడాప్టివ్ క్రూయిజ్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ వంటివి అన్నమాట. అత్యాధునిక ఆడియో సిస్టమ్ ఉండనే ఉంది. భద్రత విషయానికి వస్తే ఫైవ్ స్టార్ రేటింగ్ లభించింది. చివరిగా ధరల గురించి... రకాన్ని బట్టి 39.3 లక్షల రూపాయలు (46000 డాలర్లు) నుంచి 41.01 లక్షల రూపాయలు (48,000 డాలర్లు) వరకూ ఉంటుంది.::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
వచ్చే నెలలో టెస్లా షోరూమ్ ఓపెన్
ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని టెస్లా కంపెనీ కార్లను భారత్‌లో విక్రయించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. వచ్చే నెలలోనే ముంబయిలో షోరూమ్ ప్రారంభించనున్నట్లు బ్లూమ్‌బర్గ్ తెలిపింది. యూరప్, చైనా వ్యాప్తంగా ఈ కార్ల అమ్మకాలు ఇటీవల క్షీణించాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ట్రంప్, మస్క్ మధ్య ఇటీవల జరిగిన మాటల యుద్ధం నేపథ్యంలో టెస్లా షేర్లు మరింత దిగజారాయి. ట్రంప్ అధ్యక్ష పీఠాన్ని అధిరోహించనున్నారని తెలిసిన క్షణం నుంచి కొంత కాలంపాటు టెస్లా అమ్మకాలు జోరందుకున్నాయి. అయితే ఇటీవల ఇద్దరి మధ్య మాటల యుద్ధం ముదరడంతో అమ్మకాలు డీలా పడ్డాయి. దాంతోపాటు చైనాలోనూ టారిఫ్ భయాలతో టెస్లా అమ్మకాలు పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో మస్క్‌కు భారత్ భారీ మార్కెట్‌గా తోస్తుంది. ఇప్పటికే దేశంలో టెస్లా అమ్మకాలు ప్రారంభిస్తామని కంపెనీ ప్రకటించింది.యూరప్, చైనాల్లో అమ్మకాలు క్షీణించిన నేపథ్యంలో టెస్లా ప్రపంచంలోని మూడో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్ అయిన భారత్‌లో తన కార్యకలాపాలు విస్తరించడానికి ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా టెస్లా వచ్చే నెలలో ముంబయిలో తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించనుందని బ్లూమ్‌బర్గ్ తెలిపింది. ముంబయిలో షోరూమ్ ప్రారంభించిన కొద్ది రోజులకు ఢిల్లీలో షోరూమ్ ఓపెన్ చేస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే టెస్లా కంపెనీ అమెరికా, చైనా, నెదర్లాండ్స్ నుంచి సూపర్ ఛార్జర్ కాంపోనెంట్స్, కార్ యాక్సెసరీస్, మర్కండైజ్, విడిభాగాలను దిగుమతి చేసుకుందని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది.ఇదీ చదవండి: రత్నాభరణాల ఎగుమతులు డౌన్టెస్లా చైనా ఫ్యాక్టరీ నుంచి మోడల్ వై రేర్-వీల్-డ్రైవ్ ఎస్‌యూవీలు భారతదేశానికి చేరుకున్నాయని ఈ విషయం తెలిసిన వ్యక్తులు బ్లూమ్‌బర్గ్‌కు తెలిపారు. మోడల్ వై ప్రపంచంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారు. ఎలాన్ మస్క్ ఫిబ్రవరిలో అమెరికాలో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత టెస్లాను భారతదేశానికి తీసుకురావడంలో పురోగతి వచ్చింది. గతంలో దేశీయ టారిఫ్‌లు, స్థానిక తయారీపై మస్క్ విభేదించడంతో భారత్‌లో కంపెనీ ప్రవేశంపై ఏళ్ల తరబడి నెలకొన్న ప్రతిష్టంభనకు తెరపడినట్లయింది. -
ఫైనాన్షియల్ సెక్టార్‌పై మస్క్ కన్ను
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఎలాన్ మస్క్ ఇప్పుడు ఫైనాన్షియల్ సెక్టార్‌పై కన్నేశారు. ఎలక్ట్రిక్ వాహనాలు, అంతరిక్ష ప్రయాణాలు, సామాజిక మాధ్యమాల్లో తనదైన ముద్ర వేసిన తర్వాత మస్క్ తన ప్లాట్‌ఫామ్ ఎక్స్ ద్వారా ఆర్థిక సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా ఎక్స్‌లో ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్ ఫీచర్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం.ఎక్స్ యూజర్లు ప్లాట్‌ఫామ్ నుంచి బయటకు వెళ్లకుండా షాపింగ్, టిప్పింగ్, మనీ మేనేజ్మెంట్.. వంటి మరెన్నో లావాదేవీలను నిర్వహించేందుకు వీలు కల్పించేలా సమగ్ర ఆర్థిక ఎకోసిస్టమ్‌ను రూపొందించమే లక్ష్యంగా పని చేస్తున్నట్లు తెలిసింది. ఈ ప్రణాళికలో భాగంగా ఎక్స్ బ్రాండెడ్ క్రెడిట్, డెబిట్ కార్డులను త్వరలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ముందుగా యూఎస్‌లో ఈమేరకు మార్పులు చేయబోతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. క్రమంగా ఈ మార్పులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించనున్నట్లు చెప్పాయి.ఇదీ చదవండి: స్వల్పంగా పెరిగిన డుగ్గు డుగ్గు బండి ధరలు!‘వీసా’తో ఒప్పందంవీసా సంస్థ ఇప్పటికే ఈమేరకు ఎక్స్ ప్లాట్‌ఫామ్ మొదటి చెల్లింపుల భాగస్వామిగా సంతకం చేసింది. ఎక్స్ మనీగా పిలిచే ఈ సేవలో డిజిటల్ వాలెట్, పీర్-టు-పీర్ పేమెంట్ ఫంక్షన్లు ఉంటాయి. వీటి ద్వారా ఎక్స్‌లో వినియోగదారులు కొనుగోళ్లు చేయవచ్చు. వాలెట్లో మనీ నిల్వ చేసుకోవచ్చు. ‘మీరు ఎక్స్‌లోకి వెళ్లి మీ ఆర్థిక లావాదేవీలన్నింటినీ నిర్వహించగలరు’ అని ఎక్స్ సీఈఓ లిండా యాకారినో కేన్స్ లయన్స్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ ఆఫ్ క్రియేటివిటీలో పేర్కొన్నారు. -
ఇండియాలో స్టార్‌లింక్ సేవలకు డేట్‌ఫిక్స్?
ఎలాన్‌మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ మరో రెండు నెలల్లో భారత్‌లో శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను ప్రారంభించనుందని వార్తలు వెలువడుతున్నాయి. ఈ పరిణామం భారతదేశం డిజిటల్ అంతరాన్ని, ముఖ్యంగా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసులను అందించేందుకు తోడ్పడుతుందని కొందరు భావిస్తున్నారు.సమస్యలకు పరిష్కారం..స్టార్‌లింక్ భారత మార్కెట్లోకి ప్రవేశించడం చాలా కాలంగా ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యలను ఎదుర్కొంటున్న కమ్యూనిటీలకు పరిష్కారాన్ని అందిస్తుందనే అభిప్రాయాలున్నాయి. ఫైబర్ ఆప్టిక్ లేదా సాంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌ల మాదిరిగా కాకుండా స్టార్‌లింక్‌లో లో-ఎర్త్ ఆర్బిట్ (ఎల్ఈఓ) ఉపగ్రహాల ద్వారా పనిచేస్తుంది. ఇది చాలా మారుమూల ప్రాంతాల్లో నిరంతర ఇంటర్నెట్ కనెక్టివిటీని నిర్ధారిస్తుంది. ప్రస్తుతం 4,000 స్టార్‌లింక్ ఉపగ్రహాలు కక్ష్యలో ఉన్నాయి.ఇదీ చదవండి: ఒక్క ఉద్యోగం.. 14 రౌండ్ల ఇంటర్వ్యూ!ఇండియాలో స్టార్‌లింక్ ఛార్జీలపై అంచనాలు..స్టార్‌లింక్ ఇంటర్నెట్ కోసం అవసరమయ్యే హార్డ్‌వేర్‌కు ప్రస్తుతం రూ.25,000-రూ.35,000 మధ్య ఖర్చు అవుతుంది. నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ రూ.5,000-రూ.7,000గా అంచనా వేస్తున్నారు. ఇంటర్నెట్ స్పీట్ 25-220 ఎంబీపీఎస్ ఉంటుందని చెబుతున్నారు. ఆ ధర భారతదేశం సగటు బ్రాండ్‌బ్యాండ్ వ్యయం నెలకు రూ.700-రూ.1,500 కంటే చాలా ఎక్కువ. బ్రాండ్‌బ్యాండ్ పోటీదారులకు ధీటుగా విస్తృతంగా ఇంటర్నెట్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు స్పేస్ఎక్స్ భారతదేశంలో నిర్దిష్ట ధరలను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. -
అమెరికా బడ్జెట్ లోటుకు 5 నిమిషాల్లో పరిష్కారం ఇదే..!
అమెరికా బడ్జెట్ లోటుతో సతమతమవుతోంది. ఏటా వసూళ్లు చేసే ఆదాయం కంటే ఎక్కువగా ఖర్చు చేస్తోంది. యూఎస్ జాతీయ రుణం జూన్ 2025 నాటికి 33.8 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ ఆర్థిక సంక్షోభం మధ్య దిగ్గజ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ విప్లవాత్మక ఆలోచనను పంచుకున్నారు. అందుకు ప్రముఖుల మద్దతు లభిస్తుంది. యూఎస్ ఆర్థిక లోపాలను సరిచేసేందుకు సీఎన్‌బీసీ ఇంటర్వ్యూలో వారెన్ బఫెట్ పరిష్కారాన్ని ప్రతిపాదించారు.‘నేను అమెరికా ఆర్థిక లోటును ఐదు నిమిషాల్లో ముగించగలను. జీడీపీలో 3 శాతం కంటే ఎక్కువ లోటు ఉంటే కాంగ్రెస్ సిట్టింగ్ సభ్యులందరూ తిరిగి ఎన్నిక కావడానికి అనర్హులని చట్టం చేస్తే సరిపోతుంది’ అని వారెన్ బఫెట్ అన్నారు. ఈ క్లిప్ వైరల్ కావడంతో వాషింగ్టన్లో తీవ్ర చర్చ మొదలైంది. ఉటా సెనేటర్ మైక్ లీ ఈ వీడియోను ఎక్స్‌లో తిరిగి పోస్ట్ చేశారు. ‘మీరు ఈ ఆలోచనలకు మద్దతు ఇస్తారా?’ అని టెస్లా సీఈఓ ఎలాన్‌మస్క్‌ను అడిగారు. దాంతో మస్క్ 100 శాతం మద్దతు తెలుపుతానని, ఇదే మార్గమని చెప్పారు.ఇదీ చదవండి: ‘ఏటా రూ.50 లక్షలు సరిపోతుందా?’ అంటూ పోస్ట్ఆర్థికవేత్త పీటర్ షిఫ్ స్పందిస్తూ..‘వారెన్ బఫెట్ ఆలోచనలు బ్రూటల్.. కానీ బ్రిలియంట్. ద్రవ్యోల్బణం 3% దాటినప్పుడల్లా కాంగ్రెస్‌లోని ప్రతి సభ్యుడిని తొలగించడానికి నేను రాజ్యాంగ సవరణను ప్రతిపాదిస్తున్నాను. ఒక దేశం మొత్తం ద్రవ్యోల్బణం ముసుగులో బాధపడటం కంటే రాజకీయ నాయకులను అనర్హులుగా ప్రకటించడం మంచిది’ అని తెలిపారు. -
మస్క్ ‘కాల్పుల విరమణ’!
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సభల్లో డోనాల్డ్ ట్రంప్ వెనుకనో, పక్కనో అంతెత్తు గెంతుతూ... ఆయన అధ్యక్షుడయ్యాక తరచుగా వైట్ హౌస్‌కు సంతాన సమేతంగా వస్తూ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ఎలాన్ మస్క్ నాలుగు రోజులపాటు ట్రంప్‌తో బహిరంగ యుద్ధానికి దిగి, ఇంతలోనే బుధవారం నాడు దానికి శుభం కార్డు వేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. తరచు ఒకటిగానే కనబడే రాజ్యశక్తి, ధనశక్తి నిజంగా కొట్లాటకు దిగితే చివరాఖరికి రాజ్యశక్తిదే పైచేయి అవుతుందని ఈ స్వల్పకాల ఉపాఖ్యానం నిరూపించింది. అధికారంలోకొచ్చినప్పటి నుంచీ ట్రంప్‌కు దాదాపు ప్రతిపక్షం లేదు. ఆయన పాలనపై ఓ కన్నేసి ఉంచాల్సిన అమెరికన్ కాంగ్రెస్ నిరాసక్తంగా ఉంది. వలస విధానం అంశంలో కోర్టులు కాదంటున్నా పంతం నెగ్గించుకుంటున్నారు. ఒకటి రెండు మినహా మిగిలిన విశ్వవిద్యాలయాలు ఆయనకు తలొంచాయి. మీడియా సరేసరి. పర్యవసానంగా ఆయన తలచుకున్నదే ధర్మం, ఆయన అమలుచేసేదే న్యాయం! మన పురాణాల్లో వైరభక్తి అనేది ఒకటుంది. శాపవశాత్తూ శ్రీమహావిష్ణువుకు దూరం కావాల్సివచ్చిన ద్వారపాలకులు జయవిజ యులు... సత్వర శాపవిమోచనకు ఆయనతో మూడు జన్మల్లో వైరానికి దిగి, ఆయన చేతుల్లోనే హతమారి తిరిగి చేరువవుతారు. ట్రంప్–మస్క్ వైరం నిండా నెల్లాళ్లయినా కొనసాగలేదు. ట్రంప్–మస్క్‌ల బంధం ఏడాది క్రితం వరకూ ఎవరూ ఊహించలేదు. మస్క్ తన దారిన తాను ‘ఇన్నొవేషన్ గురు’ అనిపించుకుంటూ ప్రయోగాలు చేశారు. భవిష్యత్తంతా ఎలక్ట్రిక్ కార్లదే అని నమ్మి ఖరీదైన టెస్లా కారును ఆవిష్కరించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన ట్విటర్‌ను కొన్నాడు. ఈ భూమికి భవిష్యత్తు లేదని, అంగారకుడిపై ఆవాసాలు నిర్మించుకోవటమే ప్రత్యా మ్నాయమని అందరి చెవుల్లో హోరెత్తుతూ నిజమేనని భ్రమింపజేస్తున్నాడు. ఈలోగా హైపర్‌లూప్ రైళ్ల ఆలోచనను వదిలారు. ఇంతలో డెమాక్రటిక్ పార్టీ పెద్దలతో, ముఖ్యంగా మొన్న అధ్యక్ష ఎన్ని కల్లో ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కమలా హ్యారిస్‌తో తేడా వచ్చింది. తాను భారీగా విరాళాలి చ్చినా తన కొత్త సాంకేతికతలను నిర్లక్ష్యం చేశారని అలిగాడు. అంతే... ఉదారవాదానికి స్వస్తిపలికి నిరుడు మితవాది ట్రంప్‌కు చేరువయ్యాడు. ఆయన ప్రచార సభలకైన వ్యయంలో అత్యధిక వాటా మస్క్‌దే. దాదాపు 30 కోట్ల డాలర్ల విరాళం ఇవ్వటమే కాదు... వచ్చే ఏడాది నవంబర్‌లో 435 స్థానా లుండే ప్రతినిధుల సభకు జరగబోయే ఎన్నికలకు 10 కోట్ల డాలర్లు ఇవ్వటానికి వాగ్దానం చేశాడు. ట్రంప్–మస్క్‌ల మైత్రి ఉభయతారకమైనది. ట్రంప్‌కు సొంతంగా ఉన్న సామాజిక మాధ్యమం ట్రూత్, మస్క్ నేతృత్వంలోని ఎక్స్ ఒక్కటై అమెరికా ప్రజానీకాన్ని తమ దారికి మళ్లించుకోవటంలో కృతకృత్యులయ్యారు. డెమాక్రటిక్ పార్టీ ప్రచార లోపాలు కూడా తోడవటంతో అవలీలగా ట్రంప్ విజయం సాధించారు. అధికారంలోకొచ్చాక ప్రభుత్వోద్యోగులను సాగనంపే డోజ్‌లో కీలకపాత్ర పోషించాలని మస్క్ ఉబలాటపడినా అది కాస్తా వివేక్ రామస్వామికి పోయింది. ‘ఉరితీతలు కాదు... ఊచకోతలే’ అంటూ భారీయెత్తున సిబ్బందిని కత్తిరిస్తానని చెప్పిన మస్క్‌కు అది నిరాశ కలిగించినా, త్వరలోనే వివేక్ నిష్క్రమించేలా చేయగలిగారు. తనకు సన్నిహితుడైన జేర్డ్ ఐజాక్ మాన్కు అంతరిక్ష సంస్థ నాసా బాధ్యతలు అప్పగించాలన్నది మస్క్ ఆకాంక్ష. అదే జరిగితే సొంత సంస్థ స్పేస్ ఎక్స్‌కు నాసాను తాకట్టుపెడతాడన్న భయం ట్రంప్‌కు లోలోన ఉంది. ఈ సంగతి అర్థమైన నాటినుంచీ మస్క్ రగిలిపోయారు. పర్యవసానంగా ట్రంప్ అత్యద్భుతమని ప్రకటించిన పన్ను కోతల బిల్లును ఆయన తప్పుబట్టారు. ఒకపక్క తాను ప్రభుత్వ సిబ్బందిని సాగనంపి ఖజానా కళకళల్లాడేలా చేస్తుంటే, ప్రభుత్వ రుణభారాన్ని మరో 3 లక్షల కోట్ల డాలర్లకు పెంచే పన్నుల తగ్గింపేమిటన్నది మస్క్ ప్రశ్న. తన కాంట్రాక్టు ముగిశాక మొదటగా ఆయన దీన్నే ఎత్తు కున్నారు. తనతో ఇన్నాళ్లూ కలిసిమెలిసి తిరిగి, మొదటినుంచీ ఈ బిల్లుపై అవగాహన ఉన్న మస్క్ ఇలా విమర్శించే సరికి ట్రంప్ ఆగ్రహం పట్టలేకపోయారు. ఆ తర్వాత జరిగిందంతా బహిరంగ యుద్ధం! వచ్చేసారి ఎన్నికల్లో డెమాక్రాట్లకు ఆర్థిక సాయం అందిస్తానన్న బెదిరింపు మొదలుకొని బాలలపై లైంగిక నేరాలకు పాల్పడిన జెఫ్రీ ఎపిస్టిన్తో ట్రంప్‌కు గల సంబంధాలు బయటపెడతాననేవరకూ మస్క్ మాటలు జారారు. ప్రతిగా స్పేస్ ఎక్స్ కాంట్రాక్టులు రద్దుచేస్తానని, ఇవ్వబోయే కాంట్రాక్టులు జెఫ్ బెజోస్ నేతృత్వంలోని బ్లూ ఆరిజన్కూ, బోయింగ్, లాక్‌హీడ్ మార్టిన్ ఉమ్మడి భాగస్వామ్య సంస్థ యునైటెడ్ లాంచ్ అలయెన్స్కూ కట్టబెడతానని ట్రంప్ బెదిరించారు. డెమాక్రాట్లకు విరాళమిస్తే పర్యవసానాలెలా ఉంటాయో చూపిస్తానని హెచ్చరించారు. తీరిగ్గా లెక్కలేసుకున్నాక ఈ కయ్యం వల్ల కలిసొచ్చేదేమీ లేదని మస్క్ గ్రహించినట్టున్నారు. ‘కాల్పుల విరమణ’ ప్రకటించటంతోపాటు ‘సారీ’ చెప్పారు. ఏడాది నుంచి అవిభక్త కవలల్లా ఎక్కడికెళ్లినా జంటగా పోతూ, మస్క్‌ను ‘సహ అధ్యక్షుడు’ అని అందరూ వేళాకోళం చేసేలా వ్యవహరించిన వీరిద్దరూ మునుపటి మాదిరే మళ్లీ సన్నిహితులవుతారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న. హృదయం అద్దం లాంటిది, పగిలితే అతకదంటారు. కనుక చెలిమి చిగురించినా మునుపటి స్థాయిలో ఉండకపోవచ్చు. కానీ ఈ ఉపాఖ్యానంలో ప్రపంచ ప్రజానీకం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఒకటుంది. వ్యక్తులైనా, పార్టీలైనా పరస్పరం లాభదాయకం, పంపకాలు బాగుంటాయనుకుంటే కూటములు కడతారు తప్ప, తమను ఉద్ధరించటం కోసం కాదని వారు గ్రహించాలి. -
ఈ అశక్తతలు దేనికి చిహ్నం?
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ నుంచి వరుసగా కనిపిస్తున్న అశక్తతలు దేనికి చిహ్నం? ఆయన జనవరి 20న పదవీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ 140 రోజులలో ప్రకటించిన విధానాలను, తీసు కున్న చర్యలను, వాటి పర్యవసానాలను పరిశీలించినప్పుడు, వాటిలో దాదాపు అన్నింటా తన అశక్తతలే కనిపిస్తాయి. మరొక మాటలో వైఫల్యాలు. అయితే ఆ అశక్తతలు, వైఫల్యాలు వ్యక్తిగతంగా ట్రంప్‌కు పరిమితమైనవా, లేక అమెరికా మహా సామ్రాజ్యమే క్రమంగా బలహీనపడుతున్న స్థితికి సంకేతాలా అన్నది ఆలోచించవలసిన విషయం. ఒకవేళ ట్రంప్‌కు పరిమితమైన స్థితి అయితే ఇంకా మిగిలిన మూడున్నర సంవత్సరాల కాలంలో ఆయన అందుకు సవరణలు చేసుకోగల అవకాశం ఉంటుంది. అవి ఆ వ్యవస్థకే మౌలిక బలహీనతలు అయ్యే పక్షంలో సవరణలు తన కాలంలో సాధ్యపడకపోగా, ఆ తర్వాత రాగల అధ్యక్షులకు కూడా అతి పెద్ద పరీక్షలు ఎదురవుతాయి.తగిన భావజాలం ఏది?విధానాలు, చర్యలలో అంతర్గతం, విదేశీయం అని రెండు ఉంటాయి. ఎప్పుడైనా విదేశాంగ విధానాలు అంతర్గత ప్రయోజనాల కోసమేనన్నది తెలిసిందే. ఆ విధంగా చూసినపుడు ట్రంప్ విధానాలకు ఆధారమైనవి ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ (మాగా), ‘అమెరికా ఫస్ట్’ నినాదాలు. వీటిలో ప్రతిఫలించే ఆలోచన అమెరికా తన ఒకప్పటి గొప్పతనాన్ని కోల్పోయిందని! అందుకు బాధ్యత డెమోక్రాట్ల పరిపాలన అని! అమెరికా విధానాల వల్ల అమెరికన్ ధనిక వర్గాలు, ఇతర దేశాలు విపరీతంగా లాభపడుతుండగా సామాన్యులు నష్టపోతూ అమెరికా వెనుకబడుతున్నదనీ; సామాన్యులు, అలాగే తమ దేశం బాగుపడే విధానాల వల్లనే తిరిగి ‘అమెరికా ఫస్ట్’ కాగల దన్నది ఆయన తర్కం.ఇది యథాతథంగా సహేతుకమైన, ఆహ్వానించదగిన తర్కంగానే కనిపిస్తుంది. కానీ మొదటి నుంచి డెమోక్రాట్లతో పాటు రిపబ్లికన్లు కూడా అనుసరిస్తూ వచ్చిన పెట్టుబడిదారీ, సామ్రాజ్యవాద విధానాలను, వాటి ఆధారంగా నిర్మితమైన వ్యవస్థను రద్దు చేయటం కాకున్నా ఒక మేర సవరించాలన్నా మామూలు విషయం కాదు. రద్దు చేయాలన్నది ట్రంప్ ఆలోచన ఎంతమాత్రం కాదు. అంతర్గతంగా, విదేశీయంగా కొన్ని మార్పులు చేయాలని మాత్రం అనుకున్నట్లు ఆయన మాటలు, చేతలు సూచించాయి. ఆ కొద్దిపాటి మార్పులకైనా తగిన ఫిలసాఫికల్ ఫ్రేమ్ వర్క్ ఉండాలి. కానీ ట్రంప్ ప్రధానంగా ఉద్వేగాల వ్యక్తి. ఉద్వేగతలకు లోతు ఉండదు, చంచలత ఉంటుంది.అమెరికా మహా సామ్రాజ్యపు శక్తి ఆర్థికంగా, రాజకీయంగా బలహీనపడటం ఈ 21వ శతాబ్దపు ఆరంభం నుంచే నెమ్మదిగా మొదలై, 2008 నాటి ఆర్థిక సంక్షోభంతో వేగం అందుకున్నది. అమెరికా ‘గ్రేట్‌నెస్’ పోవటమని ట్రంప్ అన్నదానికి ఆరంభాలు అప్పటి దశాబ్దం నుంచే కనిపిస్తాయి. అమెరికా బలాలు నాలుగింటిలో ఆర్థికం, రాజకీయం రెండు గాక, సైనికం, శాస్త్ర – సాంకేతికం మరొక రెండు. ఈ చివరి రెండింటిలో అమెరికా శక్తి ఆర్థిక, రాజ కీయాలవలె తగ్గలేదు గానీ, ఆ రెండు రంగాలలో ఇతరుల నుంచి పోటీలు పెరగసాగాయి. అనగా అమెరికాకు అవి పరోక్ష బలహీనత లన్నమాట. దెబ్బకొట్టిన నిర్ణయాలుట్రంప్ తమ దేశాన్ని మళ్లీ ‘గొప్పది’ చేయదలచుకుంటే, ఈ నాలుగు బలహీనతలను ఆపటం ఏ విధంగాననే సమగ్రమైన ప్రణాళిక ఉండాలి. ఒకవేళ ఉన్నా కొన్ని మౌలికమైన ప్రశ్నలు ఎదుర వుతాయి. వాటిలో మొదటిది–చరిత్రలో ఏ సామ్రాజ్యాలూ శాశ్వతంగా నిలవనపుడు అమెరికా అందుకు భిన్నం కాగలదా అన్నది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు, పార్టీలకు, ప్రభుత్వాలకు స్వీయ ప్రయోజ నాల స్పృహలు పెరుగుతూ, ఎవరి దారులు వారు వెతుక్కుంటూ, వాటిలో కొన్ని గణనీయంగా అభివృద్ధి చెందుతూ, అమెరికా, యూరప్‌ల పట్ల గత విధేయతలు బలహీనపడుతూ, బహుళ ధ్రువ ప్రపంచం క్రమంగా ఆవిష్కారమవుతున్నపుడు, అమెరికాకు గానీ, అమెరికన్ కూటమికి గానీ ఒకప్పటి ‘గొప్పతనం’ తిరిగి ఎట్లా సాధ్యమన్నది మరొక ప్రశ్న. అంతెందుకు, ట్రంప్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో తాము అధికారానికి వచ్చిన కొత్తలోనే, ‘ఏకధ్రువ ప్రపంచమన్నది గతించిన విషయ’మన్నారు.ఈ విధమైన బలహీనతలు అర్థమవుతూ, అదే సమయంలో అమెరికాను కనీసం ఉన్న స్థాయిలో నిలబెట్టాలని, అట్లాగే అక్కడి సామాన్య ప్రజలకు మేలు చేసే విధంగా రూపొందించాలని కొత్త అధ్యక్షుడు భావించితే, అందులో ప్రశంసించదగినదే తప్ప కొట్టివేయ వలసింది ఉండదు. ఆ విధంగా ఆయన ఒక వాస్తవవాది అను కోవాలి. అందుకు తగిన ఆచరణ ఏమిటన్నది అసలు ప్రశ్న. దిగుమతి సుంకాలను అన్ని దేశాలపై పెంచితే ఆదాయం భారీగా పెరిగి వాణిజ్య లోటు, ద్రవ్యలోటు, అప్పులు తగ్గుతాయనీ, ఆ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చుననీ భావించారు. అందుకు తోడుగా అనేక రూపాలలో వ్యయ నియంత్రణ చేయ బూనారు. ఉద్యోగాల కోత, విదేశీ సహాయాల ఆపివేత వంటివి అందులో ఉన్నాయి. వీటన్నింటిలో ముఖ్యమైన సుంకాల హెచ్చింపు వెంటనే గందరగోళంలో పడింది. ఉద్యోగాల కోత తీవ్రమైన వ్యతి రేకతను తెచ్చిపెట్టింది. స్టాక్ మార్కెట్లు వరుసగా దెబ్బతినగా,బాండ్ల మార్కెట్ ఎదురుతిరిగి, డాలర్ విలువ పడిపోవటం మొదలైంది. అమెరికా ప్రజలకు, పరిశ్రమలకు అవసరమైన వాటిపై ఇతర దేశాలు ఎదురు సుంకాలు విధించటంతో ధరలు పెరగ సాగాయి. ఈ పరిణామాలతో జంకిన ప్రభుత్వం సుంకాల వాయిదాలు, తగ్గింపులు, చర్చల మార్గానికి మళ్లింది. ఇదే ఇప్పటికీ కొనసా గుతున్నది. ఉద్యోగాల కోత, అక్రమ వలసదారులను భయపెట్టి వేలకు వేలుగా పంపివేయటం వల్ల ఉత్పత్తి, సర్వీస్ రంగాలు దెబ్బ తినటం వెంటనే కనిపించింది. అది గ్రహించి యజమానులకు కొన్ని వెసులుబాట్లు ఇవ్వబూనినా ఉపయోగం లేకపోయింది. ఉక్రెయిన్ వైఫల్యంఆ విధంగా కొన్ని వారాలు గడిచేసరికి ఆ గందరగోళం స్వదేశంలో, విదేశాలలో కూడా అందరికీ అర్థమై ట్రంప్ పట్ల గౌరవం, భయం తగ్గాయి. పరిపాలనా వ్యవహరణలు అస్తవ్యస్తంగా మారటంతో సన్నిహిత సలహాదారులను తొలగించటం కూడా మొదలైంది. ఎలాన్ మస్క్ ఉదంతం తాజా ఉదాహరణ. రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ పేరు కొత్తగా వినవస్తున్నది. యూనివర్సిటీలు, విద్యా శాఖ, పరిశోధనా సంస్థలు, ఆరోగ్య రంగాలను వేధిస్తూ అమెరికాను తిరిగి గొప్పదిగా ఎట్లా చేయగలరన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపి వేసేందుకు నిజంగానే ప్రయత్నించినా అది ఆగకపోగా తీవ్రమవుతున్నది. దానితో ఆయన చేతులెత్తేశారు. గాజా పట్ల గందరగోళం. నెతన్యాహూ తనను ఏ విషయంలోనూ లెక్క చేయటం లేదు. ఉక్రెయిన్, యూరప్ తమ దారి తాము చూసు కుంటున్నాయి. ఇరాన్ లొంగి రావటం లేదు. సిరియా, లెబనాన్‌పై దాడుల నిలిపివేతకు నెతన్యాహూ అంగీకరించటం లేదు. చైనాతో పాటు ‘బ్రిక్స్’ దేశాలు ట్రంప్ ఎంత భయపెట్టినా తమ కూటమిని మరింతగా విస్తరిస్తూ, డాలర్‌కు బదులు తమ స్థానిక కరెన్సీలలో చెల్లింపులను పెంచుతూనే ఉన్నాయి. మౌలిక స్థాయిలో, విస్తృత స్థాయిలో ఈ అమెరికన్ సామ్రాజ్యవాద బలహీనతలు ట్రంప్ ధోరణి వల్ల మరింత పెరుగుతున్నాయి. తన అశక్తతలు ఈ మౌలిక స్థితికి చిహ్నాలవుతున్నాయి.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ట్రంప్ దగ్గర ఉద్యోగం.. మస్క్ సంపద మటాష్!
ప్రపంచ టెక్ బిలీయనీర్, టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల సీఈవో ఎలాన్ మస్క్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో అత్యంత స్నేహంగా మెలిగారు. ఎన్నికల సమయం నుంచే ట్రంప్‌నకు మద్దతుగా నిలుస్తూ ఆయన విజయానికి కృషి చేశారు. ట్రంప్ ప్రభుత్వం ఏర్పడ్డాక డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE)కి సలహాదారుగా నియమితులయ్యాయి. ఆ సమయంలో ఎలాన్ మస్క్ సంపద 25 శాతం అంటే సుమారు 113 బిలియన్ డాలర్లు (రూ.9 లక్షల కోట్లు) క్షీణించిందని బ్లూమ్‌బర్గ్ నివేదిక తెలిపింది.తన ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, బహిరంగ అభిప్రాయాలకు ప్రసిద్ధి చెందిన మస్క్, దూకుడు వ్యయ తగ్గింపు చర్యల ద్వారా ఫెడరల్ వ్యయాలను క్రమబద్ధీకరించడానికి ఉద్దేశించిన డోజ్‌లో కీలక సలహాదారుగా పనిచేశారు. ఇటీవల మస్క్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో ఈ చొరవ రాజకీయ కల్లోలాన్ని ఎదుర్కొంది. ట్రంప్ దగ్గర పనిచేసినందుకు ఎలాన్ మస్క్ తగిన మూల్యం చెల్లించుకున్నారని, 25 శాతం సంపద కోల్పోయారని పేర్కొన్న బ్లూమ్‌బర్గ్ నివేదికను జేడీ వాన్స్ న్యూస్ @JDVanceNewsX అనే ఎక్స్ యూజర్ ఇటీవల షేర్ చేయగా దానికి ఎలాన్ మస్క్ స్పందించారు. నిజమే అన్నట్టుగా ‘వర్త్ ఇట్’ అంటూ కామెంట్ చేశారు.మస్క్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయనే వార్తల నేపథ్యంలో.. ట్రంప్ 'వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు'ను మస్క్ విమర్శించడం, అభిశంసనకు గురిచేయాలని సూచించడంతో వివాదం మొదలైంది. దీనికి ప్రతిస్పందనగా, మస్క్ కంపెనీలతో ప్రభుత్వ ఒప్పందాలను తెంచుకుంటానని ట్రంప్ హెచ్చరించారు. తన మిత్రపక్షాలతో జరిగిన వ్యక్తిగత చర్చల్లో మస్క్ ను 'పెద్ద ఎత్తున మాదకద్రవ్యాలకు బానిస'గా ట్రంప్ అభివర్ణించారు. నాసా చీఫ్‌గా మస్క్ ఎంపిక చేసిన జారెడ్ ఐజాక్మన్ నామినేషన్‌ను ట్రంప్ వెనక్కి తీసుకోవడం వారి సంబంధాలపై మరింత ఒత్తిడి పెంచింది.Worth it https://t.co/fQk2ULx7jh— Elon Musk (@elonmusk) June 11, 2025 -
మస్క్, అమెరికా ఆర్థిక మంత్రి కొట్టుకున్నారు!
వాషింగ్టన్: అగ్రరాజ్యాధిపతి డొనాల్డ్ ట్రంప్, లక్షల కోట్లకు అధిపతి ఎలాన్ మస్క్ మధ్య మాటల మంటలకు మూలకారణమైన ఉదంతం తాజాగా వెలుగు చూసింది. వారి మధ్య సఖ్యత చెడటానికి ఆర్థిక మంత్రి స్కాట్ బిసెంట్ కారణంగా మారినట్టు ట్రంప్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. గత ఏప్రిల్‌లో అధ్యక్ష కార్యాలయంలోని ఓవల్ ఆఫీస్‌లో భేటీ తర్వాత మస్క్, బిసెంట్ బాహాబాహీకి దిగారట! ట్రంప్ సన్నిహితుడు, పాడ్‌కాస్టర్ స్టీఫెన్ కె.బ్యానన్ ఈ మేరకు బయటపెట్టారు. వేలాది మంది ఫెడరల్ ఉద్యోగులను తొలగిస్తూ, వాళ్ల జీతభత్యాలను ట్రంప్ సర్కార్‌కు ఆదా చేస్తూ, లక్షల కోట్ల విదేశీ నిధులను నిలిపివేస్తూ ఆర్థిక శాఖపై తాను భారం తగ్గిస్తుంటే ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ పేరిట పన్నులను తగ్గించి ఆర్థిక శాఖపై అధ్యక్షుడు భారం పెంచుతున్నారంటూ మస్క్ తీవ్రంగా ఆక్షేపించడం తెలిసిందే. బిసెంట్తో ముష్టిఘాతాల పర్వం వారి మధ్య దూరాన్ని బాగా పెంచేసిందని అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.ఓవల్ ఆఫీస్‌లో ఏం జరిగింది? ఏప్రిల్ నెల మూడోవారంలో ఓవల్ కార్యాలయంలో ట్రంప్‌తో భేటీ సందర్భంగా అంతర్గత రెవెన్యూ విభాగ కమిషనర్‌గా మస్క్, బిసెంట్ చెరో పేరు ప్రతిపాదించారు. బిసెంట్ సూచించిన అభ్యర్థి వైపు ట్రంప్ మొగ్గా రు. అవమానభారంతో వెళ్లిపోతున్న మస్క్‌తో బిసెంట్ వాగ్వాదానికి దిగారు. అది కాస్తా కొట్లాటకు దారితీసింది. ‘రగ్బీ’ మ్యాచ్ తరహాలో బిసెంట్ను మస్క్ తన భుజంతో ఎత్తి కుదేశాడు. ఇద్దరూ కొట్టుకుంటుండటంతో సిబ్బంది నిలువరించారు. ఇది ట్రంప్‌కు తెలియడంతో ‘మరీ ఓవర్‌గా ఉంది’ అన్నారు. అనంతరం మీడియా భేటీ సందర్భంగా మస్క్ ముఖం వాచిపోయి, కళ్లు ఎర్రబారడం కన్పించింది. కొడుకుతో ఆడుతుంటే దెబ్బలు తగిలాయని మస్క్ అప్పట్లో కవర్ చేశారు. -
ట్రంప్ గద్దె దిగడమా, నాన్సెన్స్!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వివాదంపై ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ స్పందించారు. అధ్యక్షునితో తలపడటం ద్వారా ఆయన పెద్ద తప్పిదం చేస్తున్నారన్నారు. ఎప్స్టీన్ లైంగిక కుంభకోణంతో ట్రంప్‌కు సంబంధముందని, ఆయన గద్దె దిగి వాన్స్ అధ్యక్షుడు కావడం ఖాయమని మస్క్ పేర్కొనడం తెలిసిందే. ఆ వ్యాఖ్యలను ‘నాన్సెన్స్’అంటూ వాన్స్ శుక్రవారం కొట్టిపారేశారు. అధ్యక్షునిగా ట్రంప్ అద్భుతంగా పని చేస్తున్నారన్నారు. ఆయనపై మస్క్ ఆరోపణలను ఖండించారు. ‘‘ఇలాంటి గొడవలు అందరి విషయంలోనూ జరుగుతుంటాయి. అందులోనూ మస్క్ చాలా ఎమోషనల్. కాస్త నెమ్మదించారంటే అంతా సర్దుకుంటుంది. కొంతకాలానికి ఆయనే మా వద్దకు తిరిగొస్తారు’’అని అభిప్రాయపడ్డారు. ఎప్స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ పేరుందంటూ చేసిన ఎక్స్ పోస్టులను మస్క్ తాజాగా తొలగించారు. అయితే, ‘ఆ పోస్టులను ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం దాచిపెట్టుకోండి’అంటూ భావగర్భితంగా పోస్ట్ చేశారు. మరోవైపు, మస్్కతో తాను మాట్లాడబోతున్నానంటూ వచి్చన వార్తలను ట్రంప్ ఖండించారు. ‘‘ఆ మతి చెడిన మనిíÙతోనా? అలాంటి ఉద్దేశమేదీ నాకు లేదు. నిజానికి మస్కే నాతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. నేనే పట్టించుకోలేదు’’అని స్పష్టం చేశారు. అంతేగాక ఆయన కంపెనీలకు ప్రభుత్వం కట్టబెట్టిన కాంట్రాక్టులన్నింటినీ పూర్తిగా సమీక్షిస్తానని ప్రకటించారు. ‘‘అంతా నిబంధనల మేరకే ఉంటే ఓకే. లేదంటే ఏం చేయాలో ఆలోచిస్తాం’’అని స్పష్టం చేశారు. మస్క్ కంపెనీలపై గతంలో జరిగిన విచారణలను తిరగదోడతారా అని ప్రశ్నించగా, ‘‘అలాంటివి జరిగాయా? నాకు తెలియదు. అదే నిజమైతే ఏం జరగాలో అదే జరుగుతుంది’’అంటూ స్పందించారు. ‘‘చైనా, రష్యా, ఇరాన్ వంటి అంతర్జాతీయ అంశాలతో నేనిప్పుడు యమా బిజీగా ఉన్నా. మస్క్ గురించి ఆలోచేంచే తీరిక కూడా లేదు. మస్కే కాదు, ఒక్క నేను తప్ప ఎవరున్నా లేకున్నా అమెరికాకు వచి్చన లోటేమీ లేదు’’అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. మిడ్ టర్మ్ ఎన్నికల్లో ట్రంప్ డెమొక్రాట్లకు మద్దతిస్తే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. మస్క్ కొత్త పార్టీ! ట్రంప్‌తో రగడ నేపథ్యంలో మస్క్ కొత్త పార్టీ దిశగా అడుగులు వేస్తున్నట్టు కని్పస్తోంది. 80 శాతం మంది అమెరికన్లకు ప్రాతినిధ్యం వహించేలా కొత్త పార్టీ పెడితే ఎలా ఉంటుందంటూ ఎక్స్‌లో ఆయన ఒపీనియన్ పోల్ పెట్టడం తెలిసిందే. దాన్ని 80 శాతం మంది సమరి్థంచినట్టు శుక్రవారం మస్క్ ప్రకటించారు. ‘‘80 శాతం మందికి ప్రాతినిధ్యం వహించే పారీ్టకి 80 శాతం మద్దతు. విధి అంటే ఇదేనేమో!’’అని ఒక పోస్టులో ఆయన హర్షం వెలిబుచ్చారు. ఆ వెంటనే ‘ద అమెరికా పారీ్ట’అంటూ మరో పోస్ట్ పెట్టారు. అది ఆయన పెట్టబోయే కొత్త పార్టీ పేరు కావచ్చని భావిస్తున్నారు. మస్క్ రష్యాలో స్థిరపడాలనుకుంటే రెడ్‌కార్పెట్ పరుస్తామని ఆ దేశ చట్టసభ డ్యూమా సభ్యుడు ద్మిత్రీ నొవికోవ్ ప్రకటించారు. ఆయన కోరితే రాజకీయ ఆశ్రయం కల్పిస్తామన్నారు. అయితే ట్రంప్–మస్క్ రగడపై స్పందించేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికార ప్రతినిధి ద్మిత్రీ పెస్కోవ్ నిరాకరించారు. -
‘ఆ పిచ్చోడితో నేను మాట్లాడను’.. మస్క్‌ను ఉద్దేశిస్తూ ట్రంప్
వాషింగ్టన్: డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ ఒకరు రాజకీయ వేత్త. మరొకరు వ్యాపార వేత్త. నిన్నమొన్నటి వరకు వాళ్లిద్దరూ ఆప్తమిత్రులు. కానీ ఇప్పుడు బద్ద శత్రువులు. ట్రంప్ ఏ ముహూర్తాన బిగ్ బ్యూటిఫుల్ బిల్ తెచ్చారో నాటి నుంచి వాళ్లిద్దరి మధ్య సఖ్యత దెబ్బ తింది. ఒకరంటే ఒకరికి పడటం లేదు. ఆ పిచ్చోడితో నేను మాట్లాడేంది అని ట్రంప్ అంటుంటే.. జెఫ్రీ ఎప్సిటీన్ ఫైల్స్‌లో ట్రంప్ పేరు కూడా ఉందంటూ మస్క్ బాంబు పేల్చారు. సంబంధిత ఆధారాల్ని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కొద్ది సేపటికే ఆ ట్వీట్‌ను డిలీట్ చేశారు. ఈ క్రమంలో ట్రంప్‌తో మస్క్ రాజీకి సిద్ధమయ్యారనే ప్రచారం జోరందుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో ఢీ అంటే ఢీ అంటున్న టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ వెనక్కి తగ్గారా? ట్రంప్‌తో రాజీకి రెడీ అయ్యారా?. అంటే అవుననే అనిపిస్తున్నాయి మస్క్ చర్యలు.జెఫ్రీ ఎప్సిటీన్ ఫైల్స్‌లో ట్రంప్ పేరుందంటూ ఎక్స్ వేదికగా పోస్టు చేసిన ఫైల్స్‌ను మస్క్ డిలీట్ చేశారు. జెఫ్రీ ఎప్సిటీన్ ఫైల్స్‌లో తన పేరు ఉండడం వల్లే ఆ డాక్యుమెంట్‌ను ట్రంప్ బహిర్ఘతం చేయడం లేదంటూ మొన్న సంచలన వ్యాఖ్యలు చేసిన మస్క్ కొద్ది సేపటిక్రితం ఆ పోస్టును డిలీట్ చేశారు. దీంతో మస్క్ వెనక్కి తగ్గారనే ప్రచారం మొదలైంది.టెస్లాలో భారీ నష్టాలు, స్పేస్ ఎక్స్‌లో ప్రాజెక్ట్‌లపై ప్రశ్నార్ధకంగా మారిన నేపథ్యంలో ట్రంప్‌తో విభేదాల విషయంలో మస్క్ ఆలోచనలో పడ్డారనే వార్తలు వినిపిస్తున్నాయి. అంతకుముందు నేను లేకపోతే డొనాల్డ్ ట్రంప్ రెండో దఫా అమెరికాకు అధ్యక్షుడు అయ్యే వారు కాదు. కొత్త పార్టీ పెడతానంటూ మస్క్ చేసిన వ్యాఖ్యలపై ట్రంప్ స్పందించారు.Trump responds that he has been too busy to think about Elon Musk but added “I just wish him well.”The President is showing so much class, restraint and grace. pic.twitter.com/CfYCqH3aKN— Cassie N (@cass_nguyen_) June 6, 2025 మస్క్ చేసిన వ్యాఖ్యల్ని ఏబీసీ మీడియా ప్రతినిధులు ట్రంప్ వద్ద ప్రస్తావించారు. మీపై మస్క్ ఆరోపణలు గుప్పిస్తున్నారు కదా. మీరు మాట్లాడే ప్రయత్నం చేయడం లేదా? అన్న ప్రశ్నకు ట్రంప్ స్పందించారు. మీరు మాట్లాడేది ఆ పిచ్చోడి గురించేనా. ప్రత్యేకంగానే కాదు. అసలు మాట్లాడేందుకే నేనే ఇష్టపడడం లేదు. ఒకవేళ మస్క్ నాతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నా.. అందుకు నేను సుముఖంగా లేనన్నారు. ఈ క్రమంలో మస్క్- ట్రంప్ వార్ ఎటుకి దారి తీస్తుందోనని రాజకీయ వేత్తలు ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే.. ఇన్వెస్టర్లు మాత్రం ట్రంప్,మస్క్‌లు మళ్లీ ఏం కొంపముంచుతారోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
ట్రంప్ కు బిగ్ షాక్.. ఎలన్ మస్క్ కొత్త పార్టీ
-
మస్క్.. ‘ది అమెరికా పార్టీ’కి 80 శాతం మద్దతు
వాషింగ్టన్ డీసీ: ప్రపంచ కుబేరుడు, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ పెట్టబోతున్నారు. ఇటీవల మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్ఫారం ‘ఎక్స్’లో యూఎస్‌లో కొత్త రాజకీయ పార్టీ కోసం పిలుపునిచ్చారు. అగ్రరాజ్యంలో కొత్త పార్టీకి సమయం ఆసన్నమయ్యిందా? అని మస్క్ ‘ఎక్స్’ యూజర్లను అడిగారు. దీనికి వచ్చిన ఆసక్తికర ఫలితాలను తాజాగా ఆయన వెల్లడించారు.మస్క్ తెలిపిన వివరాల ప్రకారం అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు 80 శాతం మంది యూజర్లు మద్దతు పలికారు. ఈ ఫలితాల వెల్లడి తరువాత మస్క్ తన రాజకీయ పార్టీకి ‘ది అమెరికా పార్టీ’ అని పేరు పెడుతున్నట్లు తెలిపారు. ‘ఎక్స్’లో వైరల్ అవుతున్న ఈ పోస్టులో మస్క్.. అమెరికాలో కొత్త రాజకీయ పార్టీ అవసరం ఉందని, 80 శాతం ప్రజలు దీనికి మద్దతు పలుకుతున్నారని తెలిపారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను లక్ష్యంగా చేసుకుని ఆన్లైన్లో మస్క్ పలు విమర్శలు చేశారు. తాను లేకుంటే ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవారని, అతనికి కృతజ్ఞత లేదని మస్క్ ఆరోపించారు. దీనికి స్పందనగా ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫారం ట్రూత్‌లో మస్క్ కంపెనీలకు ఫెడరల్ కాంట్రాక్టులు, సబ్సిడీలను రద్దు చేస్తానని హెచ్చరించారు. ఎలాన్ మస్క్- డోనాల్డ్ ట్రంప్ మొన్నటి వరకూ ఎంతో సన్నిహితులుగా మెలిగారు. గత జూలైలో పెన్సిల్వేనియా ర్యాలీలో హత్యాయత్నం నుండి ట్రంప్ తృటిలో బయటపడిన అనంతరం మస్క్ బహిరంగంగా ఆయనకు మద్దతును ప్రకటించారు. అయితే ప్రస్తుతం వీరి మధ్య వైరం తారాస్థాయికి చేరింది. ఇది కూడా చదవండి: 400 డ్రోన్లు, 40 క్షిపణులతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడిన రష్యా -
ట్రంప్‌తో ఫైటింగ్.. మస్క్‌కు రష్యా బంపరాఫర్
మాస్కో: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump), ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)ల మధ్య విభేదాలు కొనసాగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎలాన్ మస్క్‌ను రష్యా బంపర్ ఆఫర్ ఇచ్చింది. మస్క్ తమ దేశానికి రావాలని.. రాజకీయ శరణార్థిగా ఉండేందుకు మస్క్‌కు అవకాశం కల్పిస్తామని రష్యా తెలిపింది. ఈ మేరకు దిమిత్రి నోవికోవ్ చెప్పుకొచ్చారు.డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య స్నేహ బంధం బీటలు వారింది. ఈ నేపథ్యంలో మస్క్‌ను మచ్చిక చేసుకునేందుకు రష్యా రంగంలోకి దిగింది. తాజాగా రష్యాకు చెందిన స్టేట్ డూమా ఫెడరేషన్ కమిటీ ఛైర్మన్ దిమిత్రి నోవికోవ్ ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎలాన్ మస్క్ భిన్నమైన వ్యక్తి. ఆయన ఆలోచనా విధానం వేరుగా ఉంటుంది. మస్క్ పూర్తిగా భిన్నమైన ఆట ఆడతారని నేను అనుకుంటున్నా. ఆయనకు రాజకీయ శరణార్థిగా ఉండాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఆయన అలా చేయాలనుకుంటే రష్యా సహకరిస్తోంది. అమెరికాకు చెందిన ఎడ్వర్డ్ స్నోడెన్ లాగానే మస్క్‌కు కూడా రష్యాలో ఉండేందుకు అవకాశం కల్పిస్తాం అని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో అమెరికాలో తర్వాత జరిగే ఎన్నికల్లో డెమోక్రట్లు రావాలని మస్క్ కోరుకోవడం లేదని తాను అనుకుంటున్నానని దిమిత్రి తెలిపారు.మరోవైపు.. ట్రంప్, మస్క్‌ల మధ్య నెలకొన్న వివాదంపై జోక్యం చేసుకునేందుకు క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ నిరాకరించారు. ఇది యూఎస్ సమస్య అని, తమకు ఇందులో జోక్యం చేసుకొనే ఉద్దేశం లేదని వ్యాఖ్యానించారు. అధ్యక్షుడే స్వయంగా ఈ సమస్యను పరిష్కరించుకుంటారని తాము అనుకుంటున్నట్లు తెలిపారు.Breaking News 🔴Russian MP Dmitry Novikov states that Elon Musk may be offered political asylum in Russia. pic.twitter.com/rp2pwqomuD— Global Report (@Globalrepport) June 6, 2025ఇదిలా ఉండగా.. నిజానికి ట్రంప్, మస్క్ సంబంధాలు కొంతకాలంగా ఒడిదొడుకులమయంగానే సాగుతున్నాయి. ప్రభుత్వ పనితీరుపై మస్క్ పెత్తనం మరీ మితిమీరుతోందని ట్రంప్ బృందం ఆక్షేపిస్తూ వస్తోంది. ఆ క్రమంలో ట్రంప్ గద్దెనెక్కిన ఒకట్రెండు రోజుల నుంచే ఆయన సన్నిహితులతో మస్క్ తరచూ గొడవ పడుతూ వస్తున్నారు. వ్యవహారం శ్రుతి మించుతోందని భావించిన ట్రంప్ కూడా క్రమంగా ఆయనను దూరం పెడుతూ వచ్చారు. డోజ్ సారథిగా కేవలం 130 రోజుల కోసం జరిగిన తన నియామకాన్ని పొడిగిస్తారని మస్క్ ఆశించారని కూడా అంటారు. అలాంటి సూచనలు కన్పించకపోవడంతో ఇటీవల ఆయనే తప్పుకున్నారు. ట్రంప్ ఇటీవల తెరపైకి తెచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ను తీవ్రంగా తప్పుబట్టారు. ప్రభుత్వ వ్యయానికి కత్తెర వేస్తానని గొప్పలు చెప్పుకున్న పెద్దమనిషి చివరికిలా భారీ దుబారాకు వీలు కలి్పంచే బిల్లుకు రూపమిచ్చారంటూ నిప్పులు చెరిగారు. దాంతో అప్పటిదాకా సంయమనం పాటిస్తూ వచ్చిన ట్రంప్ కూడా శషభిషలన్నీ పక్కనపెట్టి మస్క్ పై విరుచుకుపడ్డారు. -
స్టార్‌లింక్‌కు లైసెన్స్ వచ్చేసింది...
భారత్‌లో శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్ లింక్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. మార్కెట్ ను చేజిక్కించుకోవాలన్న శాటిలైట్ కంపెనీ కలలకు ఊతమిచ్చేలా స్టార్ లింక్‌కు డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ నుంచి కీలక లైసెన్స్ లభించింది.భారత టెలికాం మంత్రిత్వ శాఖ నుండి లైసెన్స పొందిన స్టార్ లింక్ దేశంలోని 90 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులను అందిపుచ్చుకునే లక్ష్యంతో భారతదేశంలో వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని వార్తా సంస్థలు రాయిటర్స్, బ్లూమ్‌బర్గ్ నివేదించాయి. కాగా స్టార్ లింక్ కు నిజంగానే లైసెన్స్ లభించిందని, దరఖాస్తు చేసుకున్న 15-20 రోజుల్లో ట్రయల్ స్పెక్ట్రమ్ మంజూరు చేస్తామని డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ వర్గాలు ధ్రువీకరించినట్లుగా పీటీఐ వార్తసంస్థ కూడా పేర్కొంది.దేశంలో సేవలను అందించడానికి యూటెల్ శాట్‌కు చెందిన వన్‌వెబ్, రిలయన్స్ జియో ఇలాంటి దరఖాస్తులను ఆమోదించిన భారత టెలికమ్యూనికేషన్ల విభాగం నుండి లైసెన్స్ పొందిన మూడవ సంస్థ స్టార్‌లింక్. భారతదేశంలో వాణిజ్య కార్యకలాపాలు సాగించడానికి లైసెన్సుల కోసం స్టార్ లింక్ 2022 నుండి ఎదురుచూస్తోంది. కాని జాతీయ భద్రతా ఆందోళనలతో సహా కారణాల వల్ల జాప్యం జరిగింది. అమెజాన్ కు చెందిన కుయిపర్ ఇండియా లైసెన్స్ కోసం ఇప్పటికీ ఎదురుచూస్తోంది.ప్రపంచవ్యాప్తంగా.. స్టార్‌లింక్ సేవలు చాలా ఖరీదైనవిగా ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్లో, రెసిడెన్షియల్ లైట్ ప్లాన్ నెలకు దాదాపు 80 డాలర్లు (రూ. 6,800). అయితే కస్టమర్లు 349 డాలర్లతో (రూ. 29,700) వన్ టైమ్ రుసుముతో స్టార్‌లింక్ స్టాండర్డ్ కిట్‌ను కూడా కొనుగోలు చేయాలి. అయితే భారతదేశంలో స్టార్‌లింక్ సర్వీస్ ప్రారంభమైన తరువాత.. దీని ఛార్జీలు నెలకు 10 డాలర్ల (రూ.850) వరకు ఉండే అవకాశం ఉంది. పరిచయ ఆఫర్లలో భాగంగా సంస్థ అపరిమిత డేటాను అందించే అవకాశం ఉంది. -
ట్రంప్, ఎలాన్ మస్క్ మధ్య మరింత దూరం
-
ఒక్క రోజులో భారీగా పడిన టెస్లా షేరు
ఎలాన్ మస్క్ సారథ్యం వహిస్తున్న టెస్లా షేరు విలువ కుప్పకూలింది. గురువారం ఒక్కరోజే 14 శాతం పడిపోయి 150 బిలియన్ డాలర్లకు పైగా మార్కెట్ విలువను తుడిచిపెట్టుకుపోయింది. వరుసగా నాలుగు ట్రేడింగ్ సెషన్ల నుంచి ఈ షేరు భారీగా క్షీణించింది. ఈ కంపెనీకి సీఈఓగా ఉన్న ఎలాన్ మస్క్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య బహిరంగ విభేదాలే ఇలా టెస్లా షేరు విలువ పడిపోవడానికి ప్రధాన కారణమని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా పెరిగిన షేరు ధర ఇద్దరి మధ్య వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని వస్తున్న వరుస కథనాలకు భారీగా కుప్పకూలుతోంది. దాంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1 ట్రిలియన్ డాలర్ల దిగువకు పడిపోయి 916 బిలియన్ డాలర్ల వద్దకు చేరింది.ప్రభుత్వ కాంట్రాక్టులు రద్దు చేస్తాం..ఇటీవల బహిరంగంగా మస్క్, ట్రంప్ మధ్య విభేదాలు చెలరేగుతున్నాయి. మస్క్ వ్యాపారాలకు సంబంధించిన ప్రభుత్వ కాంట్రాక్టులను రద్దు చేస్తామని అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ప్రభుత్వ వ్యయ బిల్లుపై మస్క్ చేసిన విమర్శలకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మస్క్‌ను ఎదుర్కోవడం కష్టంగా మారిందని, ఆయన అతిగా స్పందిస్తున్నారని ట్రంప్ ఆరోపించారు.ఈవీ క్రెడిట్లు లేకపోవడంపై అసంతృప్తిఓవల్ ఆఫీస్ నుంచి ట్రంప్ మాట్లాడుతూ.. ‘ఎలాన్‌కు నాకు మంచి అనుబంధం ఉంది. ఇకపై కలిసి పని చేస్తామో లేదో తెలియదు. (ఇటీవల డోజ్ నుంచి మస్క్ వైదొలిగారు) ట్రంప్ ఇటీవలి చర్యలకు నేను ఆశ్చర్యపోయాను’ అంటూ కొత్త బిల్లులో ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) క్రెడిట్లు లేకపోవడంపై మస్క్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు ఆయన తెలిపారు.ఇదీ చదవండి: రఫేల్ యుద్ధ విమానాల తయారీకి డసో-టాటా ఒప్పందంభవిష్యత్తు ఎన్నికల్లో సవాళ్లుట్రంప్ మీడియాతో మాట్లాడుతుండగా మస్క్ వెంటనే ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో స్పందించారు. తాను లేకుంటే ట్రంప్ ఎన్నికల్లో ఓడిపోయేవారని, డెమ్స్ సభను నియంత్రించేవారని, సెనేట్‌లో రిపబ్లికన్లు 51-49తో గెలిచేవారని పేర్కొన్నారు. మస్క్ ఇటీవల బలమైన రాజకీయ వైఖరిని తీసుకున్నారు. కొత్త బడ్జెట్ బిల్లు అసహ్యంగా ఉందని, దానికి మద్దతిచ్చే ప్రజాప్రతినిధులు భవిష్యత్ ఎన్నికల్లో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. -
బాంబు పేల్చిన మస్క్.. ట్రంప్‌పై సంచలన ఆరోపణ
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రముఖ బిలీయనీర్ ఎలాన్ మస్క్‌ల మధ్య గొడవలు నాటకీయ పరిణామాల నడుమ రోజురోజుకీ ముదురుతున్నాయి. ఇరువురు పరస్పరం సంచలన ఆరోపణలతో పోటాపోటీ పడుతున్నారు. తాజాగా.. ట్రంప్‌ను అభిశంసించి ఆ స్థానంలో ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌ను అధ్యక్షుడిగా చేయాలంటూ మస్క్ బహిరంగంగా ఒప్పుకున్నాడు. ఈ క్రమంలో మరో సంచలన ఆరోపణ చేశాడు.వాషింగ్టన్: ప్రముఖ బిలీయనీర్ ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై సంచలన ఆరోపణలకు దిగాడు. ‘‘పెద్ద బాంబులాంటి విషయాన్ని చెప్పాల్సిన సమయం వచ్చింది. ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES)లో ట్రంప్ పేరు ఉంది. అందుకే ఆ ఫైల్స్ వివరాలను బయటపెట్టడం’’ లేదంటూ ఓ పోస్ట్ చేశాడు. బిగ్ బ్యూటీఫుల్ బిల్ వ్యవహారంలో మస్క్ తీరునుతో తాను విసిగిపోయానంటూ ట్రంప్ మీడియా ముఖంగా చెప్పిన గంటలోపే మస్క్ ఈ ట్వీట్ చేయడం గమనార్హం. Time to drop the really big bomb:@realDonaldTrump is in the Epstein files. That is the real reason they have not been made public.Have a nice day, DJT!— Elon Musk (@elonmusk) June 5, 2025 ఎప్స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది అమెరికాలో సంచలనం సృష్టించిన జెఫ్రీ ఎప్స్టీన్ సెక్స్ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్‌లో ఎప్స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్‌లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలూ ఉన్నాయి. ప్రముఖ ఇన్వెస్టర్ అయిన ఎప్స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. అయితే ఈ ఫైల్స్ ఇప్పటిదాకా బయటకు రాకపోవడంతో అమెరికా రాజకీయాల్లో, మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. అంతకు ముందు.. తన మద్దతు లేకుంటే 2024 అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, రిపబ్లికన్ పార్టీ నేతలు ఓటమి పాలయ్యేవారని టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యాఖ్యానించారు. ‘నేను లేకుంటే ట్రంప్ ఓడిపోయేవారు. ప్రతినిధుల సభపై డెమోక్రాట్లు ఆధిక్యం సాధించేవారు. సెనెట్‌లో రిపబ్లికన్లు 5149తో ఉండేవారు’ అని ఆయన గురువారం స్పష్టం చేశారు. అయితే.. అయితే మస్క్ వ్యాఖ్యలను ట్రంప్ తోసిపుచ్చారు. రిపబ్లికన్ ట్యాక్స్ బిల్లును మస్క్ వ్యతిరేకించడంతో తాను అసంతృప్తికి గురయ్యానని, శ్వేతసౌధంలో తన స్నేహితుడు(మస్క్‌ను ఉద్దేశించి..) లేకపోవడం విచారకరమని ట్రంప్ సైతం వ్యాఖ్యానించారు. తాను ఎన్నికల్లో విజయం సాధించడానికి మస్క్ అవసరం లేదని స్పష్టం చేశారు. మస్క్ లేకుండానే పెన్సిల్వేనియాలో తాను గెలిచేవాడినని తెలిపారు. మస్క్ వ్యాపారాలకు ఉపయోగపడే ప్రభుత్వ కాంట్రాక్టులకు, రాయితీలకు కోత వేస్తానని ట్రంప్ హెచ్చరించారు. అదే సమయంలో మస్క్ వరుసగా ఎక్స్‌లో స్పందించారు. ట్రంప్ చెప్పిందంతా అబద్ధమని అన్నాడు. బెదిరింపులకు తలొగ్గనని, అవసరమైతే స్పేస్ఎస్ ఒప్పందాన్ని ఆపేస్తానని బదులిచ్చాడు.In light of the President’s statement about cancellation of my government contracts, @SpaceX will begin decommissioning its Dragon spacecraft immediately pic.twitter.com/NG9sijjkgW— Elon Musk (@elonmusk) June 5, 2025 అదే సమయంలో.. కొత్త పార్టీ పెట్టవచ్చా? అని అభిమానులను ప్రశ్నించారు. ‘80శాతం మందికి ప్రాతినిధ్యం వహించేలా అమెరికాలో కొత్త పార్టీ పెట్టడానికి ఇది సమయమేనా?’ అని అడిగాడు. అలాగే ట్రంప్‌ను తొలగించాలంటూ ఓ వ్యక్తి వేసిన ప్రశ్నకు అవుననే బదులిచ్చాడు. Yes https://t.co/rqRsX8B4Hg— Elon Musk (@elonmusk) June 5, 2025తాను ప్రతిపాదించిన ఫెడరల్ ప్రభుత్వ వ్యయ నియంత్రణ బిల్లును.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యతిరేకించడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ బిల్లులోని ముఖ్యఅంశాలు తెలిసి కూడా వ్యతిరేకించారని, దాంతో తాను నిరాశ చెందానని చెప్పారు. ప్రభుత్వ వ్యయ నియంత్రణకు ఉద్దేశించిన ప్రభుత్వ సామర్థ్య విభాగం (డోజ్)కు మస్క్ అధిపతిగా ఉండడం, ఈ బిల్లును చూసిన తరువాత ఆ పదవికి రాజీనామా చేయడం గమనార్హం. గురువారం ట్రంప్ శ్వేత సౌధంలోని ఓవల్హౌస్లో విలేకరులతో మాట్లాడుతూ ఒక్క విద్యుత్తు వాహనాల అంశం తప్ప బిల్లులోని మిగిలిన అంశాలపై మస్క్‌కు అభ్యంతరాలు లేవని అన్నారు.‘మస్క్‌కు ఎంతో చేశాను. ఇద్దరి మధ్య గొప్ప స్నేహం ఉంది. అది కొనసాగుతుందో లేదో చెప్ప లేను. ఆయన నా గురించి ఎంతో గొప్పగా చెప్పారు. చెడుగా ఒక్క మాట అనలేదు. అయినా ఆయనతో అసంతృప్తి చెందా’ అని వ్యాఖ్యానించారు. ట్రంప్ వ్యాఖ్యలపై మస్క్ ఎక్స్‌లో స్పందిస్తూ వ్యయ నియంత్రణ బిల్లును తనకు చూపలేదని తెలిపారు. తన సహకారం లేకుంటే ఎన్నికల్లో ట్రంప్ గెలిచి ఉండేవారు కాదని అన్నారు. -
అమెరికా అధ్యక్షుడిపై ఈలాన్ మస్క్ మండిపాటు
-
అయోధ్య రామాలయం అద్భుతం
అయోధ్య: టెక్నా లజీ దిగ్గజం, స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధినేత ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ బుధవారం ఉత్తర ప్రదేశ్‌లోని అయో ధ్య రామమంది రాన్ని దర్శించుకు న్నారు. భారతీయ సంప్రదాయ కుర్తా పైజామా ధరించి, గర్భాలయంలో బాలరాముడికి ప్రత్యేక పూజలు చేశారు. రామాలయ దర్శనం మర్చిపోలేని అనుభూతిని ఇచ్చిందని ఆనందం వ్యక్తంచేశారు. తాను ఇప్పటిదాకా చేసిన పనుల్లో ఇది చాలా గొప్ప అని చెప్పారు. ఈ ఆలయం చాలా అందంగా ఉందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే ఇది అద్భుతమైన దేవాలయం అవుతుందని వెల్లడించారు. అయోధ్యలో హనుమాన్ గార్హీ ఆలయాన్ని కూడా ఎరోల్ మస్క్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎరోల్ మస్క్ వెంట కుమార్తె అలెగ్జాండ్ర మస్క్ కూడా ఉన్నారు. ఎరోల్ మస్క్ రాక సందర్భంగా ఆలయ పరిసరాల్లో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. సర్వోటెక్ రెన్యూవబుల్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్‌కు ఎరోల్ మస్క్ గ్లోబల్ అడ్వైజర్‌గా పని చేస్తున్నారు. ఆయన ఈ నెల 1న ఇండియాకు వచ్చారు. 6వ తేదీ దాకా ఇక్కడే పర్యటిస్తారు. -
మస్క్ ప్రయోగాలను వ్యతిరేకించిన ఆయన తండ్రి
అంతరిక్ష సర్వీసులు అందిస్తున్న ప్రైవేట్ కంపెనీల్లో కీలకంగా ఉన్న స్పేస్ఎక్స్ సీఈఓ ఎలాన్‌మస్క్ ఆలోచనలను ఆయన తండ్రి ఎర్రోల్ మస్క్ వ్యతిరేకించారు. ఎలాన్ మస్క్ ప్రస్తుతం చేస్తున్న గ్రహాంతర ప్రయాణాల ప్రయోగాలపై ఎర్రోల్ మస్క్ విమర్శలు గుప్పించారు. రాకెట్లు మానవులు, ఇతర గ్రహాలను కాలనీలుగా మారుస్తాయని మస్క్ అభిప్రాయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఎర్రోల్ మస్క్ తోసిపుచ్చారు. ఇది ఆచరణ సాధ్యం కాదని చెప్పారు. శాస్త్రీయంగా లోపభూయిష్టమైనదిగా పేర్కొన్నారు.ఎలాన్ మస్క్ దీనికి బదులుగా గురుత్వాకర్షణ, అంతరిక్షంలోకి ప్రయాణించేందుకు పట్టే సమయాన్ని కుదించేలా అధ్యయనం చేయడం మేలని ఎర్కోల్ మస్క్ చెప్పారు. అంతరిక్ష అన్వేషణలో ఈమేరకు చేసే అధ్యయనాలు భవిష్యత్తు పురోగతికి కీలకంగా మారుతాయని అభిప్రాయపడ్డారు. ఆయన ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ కృషిని ప్రస్తావిస్తూ మానవాళి కేవలం రాకెట్లపై ఆధారపడకుండా లోతైన శాస్త్రీయ పరిశోధనలపై దృష్టి పెట్టాలని సూచించారు.ఇదీ చదవండి: ‘ఆర్టిఫిషియల్’ మూవీ.. ఎవరి గురించి అంటే..స్పేస్ఎక్స్ ద్వారా అంగారక గ్రహంలో మానవుల నివాసానికి అనువుగా ఉండే ప్రదేశాలను, అక్కడి వాతావరణాన్ని తెలుసుకునేందుకు ఎలాన్ మస్క్ ప్రతిష్టాత్మక ప్రణాళికలు వేస్తున్నారు. ఈ సమయంలో ఆయన తండ్రి వ్యాఖ్యలు అందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. -
‘ఎక్స్ చాట్’ ప్రారంభించిన మస్క్
ప్రముఖ ఆన్లైన్ మెసేజింగ్ టూల్స్ అయిన వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్.. వంటి వాటికి పోటీగా ఎక్స్(గతంలో ట్విటర్) కొత్తగా ‘ఎక్స్ చాట్’ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. ఇది తన వినియోగదారులకు అంతరాయం లేని, సురక్షితమైన మెసేజింగ్ అనుభవాన్ని అందిస్తుందని కంపెనీ సీఈఓ ఎలాన్‌మస్క్ తెలిపారు.ఎండ్-టు-ఎండ్ ఎన్క్రిప్షన్, డిసప్పియరింగ్ మెసేజెస్, ఆడియో/ వీడియో కాల్స్ వంటి అధునాతన సామర్థ్యాలను హైలైట్ చేస్తూ మస్క్ ఎక్స్ పోస్ట్‌లో ఈమేరకు ఎక్స్ చాట్ వివరాలు ప్రకటించారు. ఇన్స్టంట్ మెసేజింగ్ స్పేస్‌లో ఇప్పటికే దూసుకుపోతున్న కంపెనీలకు ఎక్స్ చాట్ పోటీదారుగా మారే అవకాశం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.ఇదీ చదవండి: దేశంలోని తొలితరం సంపన్న మహిళలుప్రస్తుతం బీటా టెస్టింగ్‌లో ఉన్న ఈ అప్డేటెడ్ మెసేజింగ్ ఇంటర్ ఫేస్‌ను పరిమిత సంఖ్యలో యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు కంపెనీ తెలిపింది. ఎక్స్ చాట్‌లో ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్, ఫైల్ షేరింగ్, వాయిస్, వీడియో కాల్స్ వంటి అధునాతన మెసేజింగ్ ఫీచర్లు ఉన్నాయని పేర్కొంది. ఈ అప్‌గ్రేడ్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ మల్టీపర్పస్ కమ్యూనికేషన్ హబ్‌గా ఎక్స్‌ను అభివృద్ధి చేయాలనే మస్క్ అంచనాలకు అనుగుణంగా ఉన్నట్లు కంపెనీ ప్రతినిధులు చెప్పారు. -
అమెరికా దివాళా తీయడం ఖాయం.. ట్రంప్‌పై మస్క్ విమర్శలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ప్రభుత్వంపై అపరకుబేరుడు, మాజీ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డోజ్)చీఫ్, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ (elon musk) షాకింగ్ కామెంట్లు చేశారు. అమెరికా ద్రవ్యలోటు 2.5 బిలియన్ డాలర్లకు చేరుతుంది. ఇలాగే కొనసాగితే అమెరికా దివాళా తీయడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలను విభేదించిన ఎలాన్ మస్క్‌కు డోజ్ నుంచి బయటకు వచ్చారు. అయితే, తొలిసారి ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్ని విభేదించారు. ట్రంప్‌పై విమర్శలు గుప్పించారు. ట్రంప్ ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’పై తీవ్రంగా మండిపడ్డారు బిగ్,బ్యూటిఫుల్’ (Big Beautiful Bill) అంటూ ట్రంప్ (donald trump) చెబుతున్న బిల్లు గొప్పగా ఏమీ లేదన్నారు. ఈ బిల్లు వల్ల త్వరలోనే ట్రంప్ ప్రభుత్వం దివాళా తీస్తుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ భారీ, దారుణమైన కాంగ్రెస్ వ్యయ బిల్లు అసహ్యకరమైనది. దీనికి ఓటు వేసిన వారు సిగ్గు పడాలి. మీరు తప్పు చేశారని మీకు తెలుసు’ అని పేర్కొన్నారు. I’m sorry, but I just can’t stand it anymore.This massive, outrageous, pork-filled Congressional spending bill is a disgusting abomination.Shame on those who voted for it: you know you did wrong. You know it.— Elon Musk (@elonmusk) June 3, 2025ట్రంప్ నిర్ణయం మారదుఅయితే, వైట్ హౌస్ మాత్రం దీనిపై పెద్దగా స్పందించలేదు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లెవిట్ మాట్లాడుతూ.. ఈ బిల్లుపై మస్క్ నిర్ణయం ఏంటో ట్రంప్‌కు తెలుసు. అయినప్పటికీ అధ్యక్షుడి అభిప్రాయాన్ని మార్చలేదు. ఇది ఒక బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఆయన దానిని కాపాడుతున్నారు’ చెప్పారు.గతంలో ఇదే బిల్లును విమర్శిస్తూ మస్క్ స్పందించారు. ఈ బిల్లు ఇప్పటికే భారీగా ఉన్న లోటు బడ్జెట్ 2.5 ట్రిలియన్కు పెంచుతుంది. అమెరికన్ కాంగ్రెస్ దేశాన్ని దివాళా తీసే దిశాగా ప్రయత్నాలు తీసుకుంటుందన్నారు. ప్రభుత్వ నిర్ణయం నిరాశ పరిచిందిమస్క్ ఈ బిల్లుపై డోజ్ (డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ)కు రాజీనామా అనంతరం సీబీఎస్ న్యూస్‌తో మాట్లాడుతూ.. ‘ఈ భారీ ఖర్చుల బిల్లు మమ్మల్ని నిరాశపరిచింది. ఇది బడ్జెట్ లోపాన్ని తగ్గించకుండా పెంచుతోంది. ఇది డోజ్ టీమ్ చేస్తున్న పనిని అడ్డుకుంటోంది. బిల్లు పెద్దదిగా ఉండొచ్చు, అందంగా ఉండొచ్చు. కానీ రెండూ ఒకేసారి ఉండటం నాకు తెలియదు. ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనన్నారు. -
భారత్‌లో టెస్లా తయారీ లేనట్లే!
ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ టెస్లా తన కార్లను భారతదేశంలో తయారు చేసే అవకాశం లేదని భారీ పరిశ్రమల శాఖ మంత్రి హెచ్డీ కుమారస్వామి తెలిపారు. కానీ, దేశంలో షోరూమ్‌లు ఏర్పాటు చేసి వాటి ద్వారా కంపెనీ వాహనాలను భారత్‌లో విక్రయించేందుకు ఆసక్తిగా ఉందని చెప్పారు. అందుకోసం జర్మనీలోని బెర్లిన్ ప్లాంట్ నుంచి టెస్లా నేరుగా దేశంలో వాహనాలను దిగుమతి చేసుకునే వీలుందని అంచనా వేశారు. దీంతో ఇప్పటివరకు భారత్‌లో టెస్లా కార్లు తయారవుతాయని భావించిన వారికి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.కొత్త ఈవీ పాలసీభారత్లో కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) తయారీలో భాగంగా దరఖాస్తులను స్వీకరించడం ప్రారంభించనున్నట్లు కుమారస్వామి ప్రకటించారు. ప్రధాన అంతర్జాతీయ వాహన తయారీదారులను భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహించేందుకు ఇది తోడ్పడుతుంది. రాయిటర్స్ నివేదించిన వివరాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం కొత్త ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విధానాన్ని ఖరారు చేసింది. ఇది వాహన తయారీదారులకు కేవలం 15% దిగుమతి సుంకంతో 35,000 డాలర్ల కంటే ఎక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ వాహనాలను నేరుగా దిగుమతి చేసుకోవడానికి అనుమతిస్తుంది. ఈ తక్కువ టారిఫ్‌లకు అర్హత పొందేందుకు కంపెనీలు దేశంలో తయారీ ప్లాంట్‌ను స్థాపించాల్సి ఉంటుంది. అందుకు 486 మిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టడానికి కట్టుబడి ఉండాలి. నిర్ణీత గడువులోపు స్థానికంగా తయారైన ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయించడం ప్రారంభించాలి.దేశీయ వాహన తయారీదారులను అంతర్జాతీయ పోటీ నుంచి రక్షించడానికి భారత్‌లో ప్లాంట్ ఏర్పాటు చేయాలనుకునే వారు తమ ఎలక్ట్రిక్ వాహనాల విడిభాగాల్లో కనీసం 25% మొదటి మూడేళ్లలో స్థానిక కంపెనీల నుంచే తీసుకోవాలి. క్రమంగా తర్వాత ఐదేళ్లలో దీన్ని 50 శాతానికి పెంచాలనే నిబంధనలున్నాయి. మెర్సిడెస్ బెంజ్, స్కోడా, ఫోక్స్ వ్యాగన్, హ్యుందాయ్, కియా వంటి అనేక ఆటోమొబైల్ కంపెనీలు భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయని మంత్రి చెప్పారు.భారత్‌లో టెస్లా ప్రణాళికలుటెస్లా ఇప్పటికే ముంబయి, ఢిల్లీలో రెండు షోరూమ్‌లను ఖరారు చేసింది. ముంబయిలోని బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ)లో 4,000 చదరపు అడుగుల వాణిజ్య స్థలాన్ని సిద్ధం చేస్తుంది. టెస్లా ఈ ప్రాంతంలో అత్యధిక నెలవారీ లీజు రేట్లతో ఈ స్థాలాన్ని దక్కించుకుంది. నెలకు సుమారు రూ.35 లక్షలు (చదరపు అడుగుకు సుమారు రూ.900) చెల్లించడానికి సిద్ధమైంది. ఐదేళ్ల కాలపరిమితితో లీజు ఒప్పందం కుదుర్చుకున్నారు. కంపెనీ మరో విస్తరణ చర్యల్లో భాగంగా ఢిల్లీలోని ఏరోసిటీ కాంప్లెక్స్‌లో రెండో షోరూమ్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ఈ కంపెనీ ప్రస్తుతం భారతదేశంలో తన మోడల్ 3, మోడల్ వై లను పరీక్షిస్తోంది. త్వరలో స్థానికంగా వీటిని ఆవిష్కరించేదుకు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.ఇదీ చదవండి: వ్యవస్థలో మూలుగుతున్న రూ.2000 నోట్లు!ట్రంప్‌కు భయపడ్డారా..?ట్రంప్ అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్ పాలసీను అమలు చేస్తున్నారు. అందులో భాగంగా యూఎస్ కంపెనీలు స్థానికంగా అమెరికాలోనే తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని పట్టుబడుతున్నారు. ఇప్పటికే చైనా, భారత్‌లో తయారీ సాగిస్తున్న యాపిల్ వంటి దిగ్గజ కంపెనీకి హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ టెస్లా భారత్‌లో తయారీని ప్రారంభిస్తే ట్రంప్ తీవ్రంగా స్పందిస్తారని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎలాన్‌మస్క్ ఎంత సన్నిహితుడైనా దేశ అభివృద్ధికి ఆటంకం కలిగితే మాత్రం ట్రంప్ ఊరుకోరని నిపుణులు చెబుతున్నారు. దాంతో రిస్క్ చేయడం ఎందుకనే భావనతో భారత్‌లో తయారీని వాయిదా వేసుకుంటున్నారా అనే అంచనాలు వెలువడుతున్నాయి. -
వీడ్కోలు వేళ ఎలాన్ మస్క్ ముఖంపై గాయం.. ఏం జరిగింది?
వాషింగ్టన్: బిలియనీర్ ఎలాన్ మస్క్ వీడ్కోల వేళ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. మస్క్ నుదుటి, కంటి వద్ద ఉన్న గాయంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా మస్క్ ఇచ్చిన సమాధానానికి అందరూ ఒక్కసారిగా నవ్వుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం ఆశ్చర్యం వ్యక్తం చేశారు.అమెరికా అధ్యక్ష సలహాదారుగా వైదొలుగుతున్నట్లు ప్రకటించిన ఎలాన్ మస్క్‌కు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీడ్కోలు పలికారు. ‘డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ’ (DOGE) సారథిగా ఎలాన్ మస్క్ సేవలు అందించారు. మే 30న తన పదవికి చివరి రోజు కావడంతో అధ్యక్షుడు ట్రంప్ కార్యాలయానికి ఎలాన్ మస్క్ వెళ్లారు. ఈ సందర్భంగా ఘనంగా వీడ్కోలు పలికారు. అయితే, ఈ కార్యక్రమంలో మస్క్ ముఖంపై ఉన్న గాయం చర్చకు వచ్చింది. దీనిపై అక్కడున్న వారు మస్క్‌ను ప్రశ్నించారు.But what happened to Elon Musk’s eyes? Black eye? Or am I seeing something else….pic.twitter.com/Dc5SgG1IjH— Chewy Veetton (@bebem00m00) May 31, 2025ఎలాన్ మస్క్ స్పందిస్తూ.. ఈ గాయం నా కుమారుడు చేసింది. నేను, నా ఐదేళ్ల కుమారుడు X Æ A-Xii బీచ్‌లో గుర్రపు స్వారీ చేస్తున్నాం. ఈ క్రమంలో అతడు నా ముఖంపై ఒక పంచ్ ఇచ్చాడు. దీంతో, అక్కడ గాయం ఏర్పడింది. ఆ సమయంలో దీన్ని నేను పెద్దగా పట్టించుకోకపోవడంతో ఇలా మారిపోయింది’ అని చెప్పుకొచ్చారు. ఐదేళ్ల కుమారుడు కొడితే ఇంతలా గాయమైందా? అని అక్కడున్న వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ట్రంప్ సైతం స్పందిస్తూ.. ఇన్ని రోజులు తాను కూడా గాయాన్ని చూడలేదని చెప్పుకొచ్చారు. కానీ, మస్క్ కుమారుడు అలా చేయగలడు అని అన్నారు. ఇక, ట్రంప్, టెక్ మాగ్నెట్ కుమారుడే X Æ A-Xii.Elon Musk was seen with a noticeable black eye, showing visible bruising and discoloration around the area while at the White House with President Trump.President Trump presented him with the White House Key, calling it a gift from the nation.Musk will continue to serve as an… pic.twitter.com/CjcR1g9aK6— Shadow of Ezra (@ShadowofEzra) May 30, 2025అయితే, ఎలాన్ మస్క్ కొన్ని రకాల డ్రగ్స్ వినియోగిస్తున్నారంటూ ఓ అంతర్జాతీయ మీడియాలో కథనం వెల్లడించింది. ఈ నేపథ్యంలో వైట్‌హౌస్‌లో ఉన్నప్పుడు కూడా వాటిని వినియోగించారా? అని మస్క్‌ను విలేకరి ప్రశ్నించారు. ఈ సందర్బంగా మాస్క్ స్పందిస్తూ.. అది తప్పుడు కథనం అంటూ సమాధానం ఇచ్చారు. అయినప్పటికీ, మస్క్ ముఖంపై గాయం పలు అనుమానాలకు తావిస్తోంది. ఏం జరిగిందనే చర్చ నడుస్తోంది.Elon Musk's 5-year-old son, X, punched him so hard he got a black eye😂Reporter: "Mr. Musk, is your eye okay?"Elon: "Well, I wasn't anywhere near France... I was just walking around with Lil X, and I said, 'Go ahead,' punch me in the face, and he did. Turns out even a… pic.twitter.com/m7u2PSTluy— George (@BehizyTweets) May 30, 2025ఇదిలా ఉండగా.. వీడ్కోలు సందర్బంగా ట్రంప్.. మస్క్‌కు బంగారు రంగుతో కూడిన తాళం చెవిని అందించారు. ప్రత్యేకమైన వ్యక్తులకే ఈ బహుమతి అందిస్తానని ట్రంప్ తెలిపారు. ఇది దేశం తరఫున అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో మస్క్ సేవలను ట్రంప్ అభినందించారు. తనకు అప్పగించిన బాధ్యతలను మస్క్ అవిశ్రాంతంగా నిర్వహించారన్నారు. ప్రపంచంలోనే మస్క్ ఒక గొప్ప వ్యాపారవేత్త, ఆవిష్కర్త అని కొనియాడారు. తన ప్రతిభను దేశ అభివృద్ధికి వినియోగించేందుకు ముందుకు వచ్చినట్లు పేర్కొన్నారు.స్నేహితుడిగా, సలహాదారుగా ఉంటా..డోజ్‌కు వీడ్కోలు సందర్భంగా ఎలాన్ మస్క్ మాట్లాడారు. ఇక నుంచి తరచుగా అధ్యక్ష కార్యాలయాన్ని సందర్శిస్తానని మస్క్ తెలిపారు. అధ్యక్షుడు ట్రంప్ కోరితే అవసరమైన సమయంలో తన సహాయం అందిస్తానన్నారు. ఇక మీదట సైతం ట్రంప్‌నకు స్నేహితుడిగా, సలహాదారుగా ఉంటానని పేర్కొన్నారు. ‘డోజ్’ పదవి కాలం పరిమితితో కూడుకున్నదని మస్క్ తెలిపారు. ఇప్పటినుంచి తన వ్యాపారాలపై మరింత దృష్టి సారిస్తానన్నారు. ‘డోజ్’కు ఇది ముగింపు కాదని, ప్రాజెక్ట్ ఇప్పుడే ప్రారంభమైందన్నారు. ట్రిలియన్ డాలర్ల వృథాను ఇది అరికడుతుందన్నారు. -
నెత్తి మీద మంట పెట్టి వెళ్లిపోతున్నాడు సార్!
నెత్తి మీద మంట పెట్టి వెళ్లిపోతున్నాడు సార్! -
ఎలాన్ మస్క్ ఓ అద్భుతం.. రేపు కలుద్దాం: ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌పై ప్రశంసలు కురిపించారు. ఎలాన్ మస్క్ ఓ అద్భుతమంటూ కితాబిచ్చారు. మస్క్ ఎల్లప్పుడూ తమతోనే ఉంటారని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో రేపు ఇద్దరం కలిసి మీడియా సమావేశంలో పాల్గొంటామని ట్రంప్ వెల్లడించారు.అమెరికా ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (DOGE) శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న ఎలాన్ మస్క్.. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మస్క్ ప్రకటనపై తాజాగా ట్రంప్ స్పందించారు. ట్రంప్ తన ట్రూత్ వేదికగా.. ఎలాన్క్ మస్క్ ఓ అద్భుతమైన వ్యక్తి. నేను, మస్క్ కలిసి రేపు ఓవల్ ఆఫీసులో మీడియా సమావేశంలో పాల్గొంటాం. మస్క్ ఎల్లప్పుడూ మాతోనే ఉంటారు. అన్ని విధాలుగా సాయం అందిస్తూనే ఉంటారు అని చెప్పుకొచ్చారు.మస్క్ గుడ్‌బై..ఇదిలా ఉండగా, అంతకుముందు ఎలాన్ మస్క్.. అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక గవర్నమెంట్ ఉద్యోగిగా తన షెడ్యూల్ ముగిసిందని పేర్కొన్నారు. ప్రభుత్వంలో వృథా ఖర్చులు తగ్గించేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు ఈ సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్‌నకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. డోజ్ మిషన్ భవిష్యత్తులో మరింత బలపడుతుందని ఆకాంక్షించారు. ఇక, డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టాక మస్క్‌ను డోజ్ శాఖ సారథిగా నియమించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు, ప్రభుత్వ శాఖల్లో వృథా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ఈ విభాగం పని చేసింది. ప్రభుత్వ ఖర్చులను తగ్గించడంలో భాగంగా ఈ విభాగం అనేకమంది ప్రభుత్వ ఉద్యోగుల తొలగింపునకు అమెరికా ప్రభుత్వానికి సూచనలు చేసింది. దీంతో ప్రభుత్వంలో మస్క్ జోక్యం ఎక్కువగా ఉంటుందనే విమర్శలు తలెత్తినప్పటికీ ట్రంప్ వాటిని ఖండిస్తూ వచ్చారు.ఇక, ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఓ బిల్లునకు వ్యతిరేకంగా మస్క్ తొలిసారి తన స్వరాన్ని వినిపించారు. ఈ బిల్లుకు అధిక బడ్జెట్ కేటాయించాల్సి వస్తుండడం వల్ల.. ప్రభుత్వ ఖర్చులు తగ్గించాలనే డోజ్ ఆశయాలకు అది గండి కొడుతుందని అభిప్రాయం వ్యక్తంచేశారు. ప్రభుత్వ వ్యయాలను తగ్గించడానికి డోజ్ తీసుకున్న చర్యలు ఈ నిర్ణయంతో వృథా అవుతాయని ఆయన నిరాశ వ్యక్తంచేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే మస్క్ వైదొలుగుతున్నట్లు ప్రకటించడం గమనార్హం.కేబినెట్‌తో ఉద్రిక్తతలు.. నిజానికి ట్రంప్ కేబినెట్‌కు మస్క్ మధ్య ఉద్రిక్తతలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. మార్చిలో లక్షలాది మంది ఫెడరల్ ఉద్యోగులకు మస్క్ ఇమెయిల్ పంపడాన్ని ఎఫ్‌బీఐ, స్టేట్ డిపార్ట్మెంట్, పెంటగాన్ విభేదించాయి. మస్క్ తన అధికారాన్ని అతిక్రమిస్తున్నారని, ఇమెయిల్‌కు సమాధానం ఇవ్వవద్దని తమ ఉద్యోగులకు సూచించాయి. ఆ తరువాత విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, మస్క్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలతో ట్రంప్, మస్క్ మధ్య అంతరం పెరిగింది. ఈ సంక్షోభం ఉన్నప్పటికీ ఫెడరల్ ఖర్చులను 2 ట్రిలియన్ డాలర్ల నుంచి 150 బిలియన్లకు తగ్గించారు. ట్రంప్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకున్నాకే డోజ్ సారథ్యం నుంచి నిష్క్రమించబోతున్నానని మస్క్ చెప్పుకొచ్చినా.. ప్రభుత్వంలో ఎదురైనా చేదు అనుభవాలు మస్క్‌ను ఇబ్బంది పెట్టాయి.కాగా.. అమెరికా చట్టాల ప్రకారం ఏ వ్యక్తికీ వరుసగా 130 రోజులకు మించి ఈ హోదాను ఇవ్వకూడదు. ఈ లెక్కల ప్రకారం మే 30తో మస్క్ గడువు పూర్తికానుంది. దీని ప్రకారమే మస్క్ తన బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అయితే, మస్క్ వైదొలిగినప్పటికీ డోజ్ తన పనిని కొనసాగిస్తోందని ట్రంప్ గతంలోనే తెలిపారు. క్యాబినెట్ సెక్రటరీలు దీని బాధ్యతలు నిర్వహిస్తారని వెల్లడించారు. -
దోస్తానా ముగిసింది!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌ల స్నేహానికి ఎండ్ కార్డ్ పడిందా? అవుననే అనిపిస్తోంది. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ నినాదంతో 300 మిలియన్‌డాలర్లకు పైగా నిధులు సమకూర్చి ట్రంప్‌ను రెండోసారి అధికారంలోకి తీసుకొచ్చిన మస్క్.. ప్రభుత్వ బాద్యతల నుంచి వైదొలిగారు. అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) నుంచి ఆయన తప్పుకున్నారు. ప్రభుత్వంలో తన షెడ్యూల్ ముగిసిందని ప్రకటించారు. వృధా ఖర్చులను తగ్గించే అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మస్క్ కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై తన దృష్టి అంతా టెస్లా, స్పేస్ఎక్స్లపైనే కేంద్రీకరిస్తానని మస్క్ స్పష్టంచేశారు. అయితే.. సమాఖ్య ప్రభుత్వాన్ని ప్రక్షాళన చేయడానికి, పునర్నిర్మించడానికి డోజ్ చేస్తున్న ప్రయత్నాలు కొనసాగుతాయని వైట్ హౌస్ పేర్కొంది. ప్రత్యేక ప్రభుత్వ ఉద్యోగిగా ఆయన 130 రోజుల పదవీకాలం మే 30వ తేదీతో ముగియనుండగా.. ముందుగానే ఆయన రాజీనామా చేశారు. ట్రంప్‌తో సంబంధాలు దెబ్బతినడమే దీనికి కారణమని తెలుస్తోంది. ‘ప్రత్యేక వ్యక్తి, సూపర్ జీనియస్, ఫస్ట్ ఫ్రెండ్, దేశభక్తుడు’... డోజ్ బాధ్యతలు చేపట్టక ముందునుంచే మస్క్‌ను ప్రశంసించడానికి ట్రంప్ ఉపయోగించిన పదాలివి. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన దగ్గర నుంచి ఫిబ్రవరి వరకు అవకాశం దొరికిన ప్రతిచోటా మస్క్‌ను పొగడ్తలతో ముంచెత్తిన ట్రంప్.. మార్చినుంచి కొంత తగ్గించారు. వివాదాస్పద నిర్ణయాలతో వరసబెట్టి కార్యనిర్వాహక ఉత్తర్వులిస్తున్న డొనాల్డ్ ట్రంప్‌కు కుడిభుజంగా ఉండి.. వేలమంది కేంద్ర ప్రభుత్వోద్యోగులను మస్క్ సాగనంపడం, వేలకోట్ల విలువైన ప్రభుత్వ ఒప్పందాలు, కాంట్రాక్టులను రద్దుచేయడం తెలిసిందే. ఇక్కడివరకూ బాగానే ఉన్నా.. ఇటీవలి వైట్‌హౌస్ కార్యకలాపాలు మస్క్, ట్రంప్‌ల మధ్య చీలికలు తెచ్చాయి. అందులో ప్రధానమైనది దేశీయ విధాన బిల్లు. ట్రంప్ కొనియాడిన ఈ బిల్లును మస్క్ బహిరంగంగా విమర్శించారు. ట్రిలియన్ డాలర్ల పన్ను మినహా యింపులవల్ల ప్రభుత్వ ఖర్చులు పెరుగుతాయని మస్క్ తెలిపారు. నిధులు తగ్గించే డోజ్ పనికి ఇది విరుద్ధంగా ఉందని వ్యాఖ్యానించారు.వ్యాపార ప్రయోజనాలకు దెబ్బ..అయితే బిల్లు మస్క్ వ్యాపార ప్రయోజనాలపై ప్రత్యక్ష ప్రభావం చూపడమే ప్రధాన కారణం. మస్క్ సంస్థ టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలకు 7,500 డాలర్ల పన్ను మినహాయింపును తొలగిస్తుంది. అంతేకాదు.. అదనంగా ప్రతిపాదించిన వార్షిక ఈవీ రిజిస్ట్రేషన్ రుసుము అతని ఎలక్ట్రిక్ కార్ల కంపెనీపై మరింత ప్రభావం చూపే అవకాశం ఉంది. మస్క్ అమెరికా ప్రభుత్వంలోని డోజ్ సారథ్య బాధ్యతలు తీసుకున్న తరువాత.. ఉద్యోగాల నుంచి తొలగింపు, నిధుల కోతలపై ఆగ్రహంతో ఉద్యోగులతో పాటు పలువురు టెస్లా బహిష్కరణకు పిలుపు నివ్వడం తెలిసిందే. డోజ్‌కు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా నిరసనలు జరిగాయి. అనేకచోట్ల వాహనాలు, ఛార్జింగ్ స్టేషన్ల విధ్వంసం జరిగింది. దీంతో 2025 మొదటి త్రైమాసికంలో టెస్లా అమ్మకాలు 13% తగ్గాయి. దీంతో మొదటి త్రైమాసిక లాభాలు 71% తగ్గాయి. కేబినెట్‌తో ఉద్రిక్తతలు.. నిజానికి ట్రంప్ కేబినెట్‌కు మస్క్ మధ్య ఉద్రిక్తతలు చాలా కాలంగా కొనసాగుతున్నాయి. మార్చిలో లక్షలాది మంది ఫెడరల్ ఉద్యోగులకు మస్క్ ఇమెయిల్ పంపడాన్ని ఎఫ్‌బీఐ, స్టేట్ డిపార్ట్మెంట్, పెంటగాన్ విభేదించాయి. మస్క్ తన అధికారాన్ని అతిక్రమిస్తున్నారని, ఇమెయిల్‌కు సమాధానం ఇవ్వవద్దని తమ ఉద్యోగులకు సూచించాయి. ఆ తరువాత విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, మస్క్‌ల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనలతో ట్రంప్, మస్క్ మధ్య అంతరం పెరిగింది. ఈ సంక్షోభం ఉన్నప్పటికీ ఫెడరల్ ఖర్చులను 2 ట్రిలియన్ డాలర్ల నుంచి 150 బిలియన్లకు తగ్గించారు. ట్రంప్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకున్నాకే డోజ్ సారథ్యం నుంచి నిష్క్రమించబోతున్నానని మస్క్ చెప్పుకొచ్చినా.. ప్రభుత్వంలో ఎదురైనా చేదు అనుభవాలు మస్క్‌ను ఇబ్బంది పెట్టాయి. -
టెలిగ్రామ్‌లో గ్రోక్ఏఐ పాగా
కృత్రిమ మేధకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతోంది. దాంతో ఆన్లైన్ మెసేజింగ్ యాప్‌లు ఏఐను తమ ప్లాట్ఫామ్ల్లో భాగం చేస్తున్నాయి. అందులో భాగంగా టెలిగ్రామ్ ఎక్స్‌ఏఐతో భాగస్వామ్యం కుదుర్చుకుంటున్నట్లు తెలిపింది. ఈమేరకు టెలిగ్రామ్ ప్లాట్ఫామ్లో ఎక్స్ఏఐ గ్రోక్ చాట్‌బాట్‌ను వాడేందుకు ఒప్పందం చేసుకుంది. ఈ డీల్ విలువ 300 మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. దాంతోపాటు టెలిగ్రామ్ ద్వారా విక్రయించిన ఎక్స్ఏఐ సబ్స్క్రిప్షన్ల నుంచి ఇరు కంపెనీలకు 50 శాతం ఆదాయ భాగస్వామ్యం ఉన్నట్లు పేర్కొన్నాయి.టెలిగ్రామ్‌కు ఉన్న యూజర్ బేస్ గ్రోక్ విస్తరణకు కూడా ఎంతో తోడ్పడుతుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. సంభాషణాత్మక ఏఐ సామర్థ్యాలకు ప్రసిద్ధి చెందిన ఈ చాట్‌బాట్‌ను టెలిగ్రామ్ వినియోగదారులకు త్వరలో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తుంది. అయితే టెలిగ్రామ్ సీఈఓ పావెల్ దురోవ్ తన ఎక్స్ ఖాతాలో దీనికి సంబంధించిన వివరాలు ప్రకటించినా, ఎక్స్ఏఐ ఇంకా దీనిపై అధికారిక ప్రకటన చేయలేదు.🔥 This summer, Telegram users will gain access to the best AI technology on the market. @elonmusk and I have agreed to a 1-year partnership to bring xAI’s @grok to our billion+ users and integrate it across all Telegram apps 🤝💪 This also strengthens Telegram’s financial… pic.twitter.com/ZPK550AyRV— Pavel Durov (@durov) May 28, 2025ఇదీ చదవండి: కోటీశ్వరుల స్వర్గధామంమార్కెట్లో ఇప్పటికే వాట్సప్, గూగుల్చాట్ వంటి మేసేజింగ్ యాప్‌ల్లో మెటా లామా, జెమిని వంటి ఏఐ టూల్స్ సేవలందిస్తున్నాయి. ఈ కంపెనీలకు మాతృసంస్థలుగా ఉన్న మెటా, గూగుల్ సొంతంగా తయారు చేసిన ఈ ఏఐ టూల్స్‌ను వాడుతున్నాయి. అయితే టెలిగ్రామ్‌కు ఆ అవకాశం లేదు. దాంతో తన ప్లాట్ఫామ్లో ఏఐ టూల్ వాడేందుకు ఎక్స్‌ఏఐతో ఒప్పందం కుదుర్చుకుందనే వాదనలున్నాయి. -
ట్రంప్ చెప్పేదొకటి.. చేసేదొకటి! మస్క్‌కు మండింది (చిత్రాలు)
-
ట్రంప్ పాలకవర్గం నుంచి వైదొలగిన ఎలాన్ మస్క్
-
ట్రంప్ పాలకవర్గం నుంచి మస్క్ ఔట్
ప్రముఖ బిలీయనీర్ ఎలాన్ మస్క్((Elon Musk) కీలక నిర్ణయం తీసుకున్నారు. డొనాల్డ్ ట్రంప్ పాలక వర్గం నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (DOGE) శాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న మస్క్.. ఆ బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. తన ఎక్స్ ఖాతాలో ఇందుకు సంబంధించి ఆయన ఓ పోస్ట్ చేశారు. ‘‘అమెరికా ప్రభుత్వంలో ప్రత్యేక గవర్నమెంట్ ఉద్యోగిగా తన షెడ్యూల్ ముగిసింది’’ అని పోస్టులో పేర్కొన్నారాయన. ప్రభుత్వంలో వృథా ఖర్చులు తగ్గించేందుకు తనకు అవకాశం ఇచ్చినందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)నకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే డోజ్ మిషన్ భవిష్యత్తులో మరింత బలపడుతుందని ఆకాంక్షించారు. As my scheduled time as a Special Government Employee comes to an end, I would like to thank President @realDonaldTrump for the opportunity to reduce wasteful spending. The @DOGE mission will only strengthen over time as it becomes a way of life throughout the government.— Elon Musk (@elonmusk) May 29, 2025ట్రంప్ ఈ మధ్యకాలంలో తీసుకున్న నిర్ణయాలపై మస్క్ అసంతృప్తితో రగిలిపోతున్నారు. తాజా పన్నులు, వ్యయాల బిల్లులను తప్పు బట్టిన ఆయన.. ట్రిలియన్ డాఆర్ల పన్నులు వేయకపోవడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలాగే.. రక్షణ రంగంపై వ్యయం పెంచడాన్ని తప్పుబట్టారు. ఈ క్రమంలో ట్రంప్ విధానాలు సరికావంటూ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంతోనే ఆయన బాధ్యతల నుంచి తప్పుకుని ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయం నుంచే ఎలాన్ మస్క్‌ను తన పాలక వర్గంలోకి తీసుకుంటానంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం తెలిసిందే. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టాక మస్క్‌ను డోజ్ శాఖకు సారథిగా నియమించారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే ‘డోజ్’ ప్రాజెక్టు లక్ష్యమని, తన ప్రభుత్వంలో సమర్థత పెంచేందుకు ఈ విభాగం కృషి చేస్తుందని ఆ టైంలో ట్రంప్ ప్రకటించారు. ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులు, ప్రభుత్వశాఖల్లో వృథా ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ఈ విభాగం పనిచేసింది. ఈ క్రమంలో.. అటు డెమోక్రట్ల నుంచి మాత్రమే కాదు, ఇటు రిపబ్లికన్ల నుంచి కూడా మస్క్ వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు తావిచ్చింది. అయితే దీర్ఘకాలిక అభివృద్ధి కావాలంటే.. కొన్నింటిని వదులుకోవాలని మస్క్ తన చర్యలను సమర్థించుకున్నారు.ప్రభుత్వ శాఖల్లో వృథా ఖర్చులకు కత్తెర, దుబారా ఖర్చులకు కోత, అవినీతి నిర్మూలన, ఫెడరల్ సంస్థలను పునర్మిర్మాణం.. ఇవన్నీ డోజ్ చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా.. ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాల తొలగింపు చేపట్టారు. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం.. 2026 జులై 4వ తేదీలోపు మొత్తం ఫెడరల్ బ్రూరోక్రసీని ఇది ప్రక్షాళన చేయాల్సి ఉంది. ఆ తర్వాత డోజ్ దానికదే ఎక్స్పైరీ కానుంది. మస్క్ నిర్ణయంతో డోజ్‌కు ట్రంప్ కొత్త సారథిని నియమిస్తారా? లేదంటే ఆ వ్యవస్థను రద్దు చేస్తారా? అనేది వేచి చూడాలి.ఇదీ చదవండి: యువ పార్లమెంటేరియన్‌తో సీనియర్ అనుచిత ప్రవర్తన! -
ట్రంప్‌పై మస్క్ అసమ్మతి గళం
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై ఆయన సన్నిహిత మిత్రుడు, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(డోజ్) చీఫ్, టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ట్రంప్ తాజాగా తీసుకొచ్చిన పన్నులు, వ్యయాల బిల్లును తీవ్రంగా తప్పుపట్టారు. ట్రిలియన్ డాలర్ల మేర పన్నులు చేయకుండా నిలిపివేయడం, రక్షణ రంగంపై వ్యయాన్ని భారీగా పెంచాలని ట్రంప్ నిర్ణయించడం సరైంది కాదని కుండబద్ధలు కొట్టారు. మంగళవారం రాత్రి ఓ ఇంటర్వ్యూలో ఎలాన్ మస్క్మాట్లాడారు. ‘బిగ్, బ్యూటిఫుల్’అంటూ ట్రంప్ చెబుతున్న బిల్లు గొప్ప బిల్లుగా తాను భావించడం లేదన్నారు. అది చాలా పెద్దది లేదా అందమైనది అని తాను ఎంతమాత్రం అనుకోవడం లేదని తేల్చిచెప్పారు. గత ఏడాది జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌కు ఎలాన్ మస్క్ బహిరంగంగా మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా భారీగా ఆర్థిక సాయం సైతం అందజేశారు. ఇద్దరూ కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ఎలాన్ మస్‌్కకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రభుత్వ ఖర్చులను, ఉద్యోగుల సంఖ్యను తగ్గించడానికి ఉద్దేశించిన డో జ్ చీఫ్ పదవిని కట్టబెట్టారు. అలాంటి తన మిత్రు డు ట్రంప్‌పై ఎలాన్ మస్క్ అసమ్మతి గళం విప్పడం చర్చనీయాంశంగా మారింది. పన్నుల్లో కోతలకు, రక్షణ వ్యయం పెంపునకు తాను వ్యతిరేకం అని పరోక్షంగా ఎలాన్ మస్క్ స్పష్టంచేశారు. -
మస్క్ స్టార్ షిప్ ప్రయోగం ఫెయిల్
-
ఎలాన్ మస్క్.. స్టార్ షిప్ ప్రయోగం విఫలం
టెక్సాస్: బిలియనీర్ ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ తయారు చేసిన స్టార్ షిప్ రాకెట్ మరోసారి పేలిపోయింది. టెక్సాస్‌లోని స్పేస్ ఎక్స్ నుంచి ప్రయోగించిన స్టార్ షిప్ విఫలమైంది. స్టార్‌షిప్ రాకెట్ ఇలా పేలిపోవడం వరుసగా ఇది మూడోసారి కావడం గమనార్హం.. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.సుదూర అంతరిక్ష యాత్రల కోసం స్పేస్ ఎక్స్ కంపెనీ తయారు చేసిన స్టార్ షిప్ ప్రయోగం మరోసారి విఫలమైంది. టెక్సాస్‌లోని స్పేస్ ఎక్స్ నుంచి ప్రయోగించిన స్టార్ షిప్ తొమ్మిదో ఫ్లైట్ టెస్ట్‌లో భాగంగా చివరి దశలో ఇంధనం లీక్ కావడంతో నియంత్రణ కోల్పోయింది. తొలుత ఇది విజయవంతంగానే నింగిలోకి దూసుకెళ్లినా.. దాదాపు అరగంట తర్వాత అది గాల్లోనే పేలిపోయింది. దీంతో, స్టార్ షిప్ శకలాలు సముద్రంలో పడిపోయాయి. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.Starship Flight 9: Ship 35 has lost attitude control. pic.twitter.com/GLEg2cQx12— NSF - NASASpaceflight.com (@NASASpaceflight) May 28, 2025#STARSHIP 🙆🏻♂️🫵🏻 pic.twitter.com/RKjHaZK2p8— ChrisRetro (@BlanquitoPerla_) May 28, 2025Pretty excellent melting shot in the last moments of Starship pic.twitter.com/vebHysj6XE— johnboiles (@johnboiles) May 28, 2025the remnants of starship 9 burning up on re-entry 🥹 so hauntingly beautiful to witness. pic.twitter.com/IddJTXWpVz— All day Astronomy (@forallcurious) May 28, 2025 -
భారత్‌లో స్టార్‌లింక్ సర్వీస్: ధరలు ఇలా..
ఎలాన్ మస్క్ తన శాటిలైట్ ఇంటర్నెట్ 'స్టార్‌లింక్' కార్యకలాపాలను భారతదేశంలో ప్రారంభించనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. కాగా ఈ సేవలు మనదేశంలో త్వరలోనే ప్రారంభం కానున్నాయని.. కొన్ని మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) నుంచి లెటర్ ఆఫ్ ఇంటెంట్ పొందిన స్టార్‌లింక్ చార్జీలు ఎలా ఉండబోతున్నాయంటే..భారతదేశంలో స్టార్‌లింక్ సర్వీస్ ప్రారంభమైన తరువాత.. దీని ఛార్జీలు నెలకు 10 డాలర్ల (రూ.850) వరకు ఉండే అవకాశం ఉంది. ఈ ధరలు ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే.. చాలా తక్కువే అని తెలుస్తోంది. పరిచయ ఆఫర్లతో భాగంగా సంస్థ అపరిమిత డేటాను అందించే అవకాశం ఉంది.భారతదేశంలో వినియోగదారుల సంఖ్యను గణనీయంగా పెంచుకోవడానికి సంస్థ సన్నద్ధమవుతోంది. ఇందులో భాగంగానే పరిచయ ఆఫర్స్ కూడా చాలా తక్కువ ధరకే అందించాలని యోచిస్తోంది. 10 మిలియన్స్ సబ్స్క్రైబర్లను లక్ష్యంగా చేసుకుని సంస్థ ముందడుగు వేస్తోంది. సబ్స్క్రైబర్లు స్టార్‌లింక్ హార్డ్‌వేర్ ప్యాకేజీని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇందులో శాటిలైట్ డిష్, వైఫై రూటర్ వంటివి ఉన్నాయి. దీని కోసం ఎంత చెల్లించాలనే విషయం వెల్లడికాలేదు.ఇదీ చదవండి: ఫేస్ స్కాన్ చేస్తే.. పేమెంట్ పూర్తయిపోయింది: వీడియోప్రపంచవ్యాప్తంగా.. స్టార్‌లింక్ సేవలు చాలా ఖరీదైనవిగా ఉన్నాయి. యునైటెడ్ స్టేట్స్లో, రెసిడెన్షియల్ లైట్ ప్లాన్ నెలకు దాదాపు 80 డాలర్లు (రూ. 6,800). అయితే కస్టమర్లు 349 డాలర్లతో (రూ. 29,700) వన్ టైమ్ రుసుముతో స్టార్‌లింక్ స్టాండర్డ్ కిట్‌ను కూడా కొనుగోలు చేయాలి. -
X Outage: ఎక్స్ సేవల్లో అంతరాయం
ప్రపంచ కుబేరుడు.. టెస్లా బాస్ ఎలాన్ మస్క్ ఆధీనంలోని మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్, ఎక్స్ (ట్విటర్)లో అంతరాయం ఏర్పడింది. సాయంత్రం 5:30 గంటల నుంచి యూజర్లు సమస్యలను నివేదిస్తూనే ఉన్నారు. లాగిన్ అవ్వడంలో, టైమ్‌లైన్‌లను యాక్సెస్ చేయడంలో మాత్రమే కాకుండా ట్వీట్స్ చేయడంలో కూడా సమస్యలు ఎదురవుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు.ట్రాకింగ్ సర్వీస్ డౌన్‌డిటెక్టర్ ప్రకారం.. 2,100 కంటే ఎక్కువ మంది యూజర్లు సమస్యలను నివేదించారు. కంపెనీ ప్రస్తుతానికి ఈ సమస్యకు కారణం ఏమిటనే విషయాన్ని వెల్లడించలేదు.శుక్రవారం కూడా భారతదేశంతో పాటు.. ప్రపంచంలోని చాలా దేశాల్లో ఎక్స్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. డేటా సెంటర్లో ఏర్పడిన టెక్నికల్ సమస్య కారణంగా.. అంతరాయం ఏర్పడిందని ఎక్స్ ఇంజినీర్లు వెల్లడించారు. అయితే ఈ రోజు అంతరాయం కలగడానికి కారణం ఏమిటనే విషయం తెలియాల్సి ఉంది. -
పక్క దేశంలో స్టార్‌లింక్ పాగా
ఎలాన్‌మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ యాజమాన్యంలోని శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీస్ స్టార్ లింక్ బంగ్లాదేశ్‌లో అధికారికంగా సేవలు ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది దేశ డిజిటల్ కనెక్టివిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో గణనీయమైన పురోగతిని సూచిస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు. సాంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్, నెట్వర్క్ సమస్యలతో పోరాడుతున్న మారుమూల, వెనుకబడిన ప్రాంతాల్లో హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించాలనే లక్ష్యంతో ఈ సర్వీసులు ప్రారంభించిస్తున్నట్లు అధికారులు తెలిపారు.స్టార్ లింక్ విభిన్న యూజర్ అవసరాలను తీర్చడానికి బంగ్లాదేశ్‌లో వివిధ సబ్ స్క్రిప్షన్ ప్యాకేజీలను ప్రవేశపెట్టింది. స్టార్ లింక్ రెసిడెన్స్ ప్లాన్‌లో భాగంగా నెలకు 6,000 టాకా ధర(రూ.4,200)తో ప్రామాణిక గృహ వినియోగానికి ఇంటర్నెట్ అందిస్తున్నారు. రెసిడెన్సీ లైట్ ప్లాన్‌లో భాగంగా నెలకు 4,200 టాకా(రూ.2,900) ధరతో నెట్ సేవలు అందిస్తున్నారు. వన్ టైమ్ సెటప్ ఫీజు కింద 47,000 టాకాలు(రూ.32,000) చెల్లించాల్సి ఉంటుంది. స్టార్ లింక్ డిష్, రౌటర్‌తో సహా పరికరాల ఖర్చులు ఇందులో కవర్ అవుతాయి.ఇదీ చదవండి: దిగొచ్చిన బంగారం ధర! తులం ఎంతంటే..స్టార్‌లింక్ ప్రత్యేకతలుఅంతరిక్షంలోని ఉపగ్రహాల నెట్వర్క్ ద్వారా ఇంటర్నెట్ కనెక్టివిటీ నేరుగా భూమిపై ఉన్న వివిధ డివైజ్‌లకు చేరుతుంది.ఈ కనెక్షన్‌కు చందా కేబుల్ సర్వీస్ డైరెక్ట్ టు హోం (డీటీహెచ్)కు కట్టిన మాదిరిగా ఉంటుంది.ఇంటర్నెట్ కోసం ఈ కంపెనీ పోర్టబుల్ శాటిలైట్ డిష్ కిట్‌ను అందజేస్తుంది. దీనిని ఇంటిపై శాశ్వత పద్ధతిలో బిగించవచ్చు.ముందుగా ఇళ్లలో వైఫై రూటర్ ఆధారిత వైర్ కనెక్షన్ కలిగి ఉండాలి. దీనిని ఆ తర్వాత వైర్లెస్ పద్ధతిలో స్మార్ట్ఫోన్లు, ట్యాబ్‌లు, కంప్యూటర్లు, ఇతర ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ గాడ్జెట్స్‌కు జతచేయొచ్చు.ప్రపంచంలో ఏ మూలన ఉన్నా సర్వీస్ అందించగలదు. మొబైల్ ఫోన్ లేదా కంప్యూటర్ ద్వారా ఇంటర్నెట్ సేవలను పొందవచ్చు. -
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. యువతితో మస్క్‌పై పుతిన్ కుట్ర?
వాషింగ్టన్: సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంపై పలు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. యుద్ధం ప్రారంభంలో రహస్యాల్ని తెలుసుకునేందుకు అపర కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon musk)పై రష్యా యువతితో వలపు వల విసిరినట్లు మాజీ ఎఫ్‌బీఐ కౌంటర్ ఇంటెలిజెన్స్ స్పెషల్ ఏజెంట్ జోనాథన్ బౌమా సంచలన వ్యాఖ్యలు చేశారు.జర్మన్ బ్రాడ్‌కాస్టర్ జెడ్‌డీఎఫ్ తీసిన డాక్యుమెంటరీలో జోనాథ్ బౌమా మాట్లాడారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ యుద్ధానికి సంబంధించిన రహస్య సమాచారాన్ని సేకరించేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా రష్యా ఇంటెలిజెన్స్ సాయంతో ఎలాన్ మస్క్, పేపాల్ సహ వ్యవస్థాపకుడు పీటర్ థీల్‌పై ఓ యువతి ప్రయోగించారు. మస్క్‌కు ఉన్న జూదం,మత్తు పదార్ధాల వినియోగంలాంటి వీక్నెస్ను అడ్డం పెట్టుకుని యుద్ధం సమాచారం సేకరించే ప్రయత్నం చేసినట్లు వెల్లడించారు. పుతిన్‌కు ఆపరేషన్ గురించి తెలుసా?ఇక మస్క్, పీటర్ థీల్‌పై జరిగిన ఈ సీక్రెట్ ఆపరేషన్ పుతిన్ కనుసన్నల్లోనే జరిగింది. పుతిన్ అనుమతి లేకుండా స్పై చేయరు కదా? అని జోనాథన్ బౌమా అన్నారు. అయితే, రష్యా జరిపిన సీక్రెట్ ఆపరేషన్‌లో మస్క్, పీటర్ థీల్ చిక్కుకున్నారా? లేదా? అనే విషయాల్ని వెల్లడించేందుకు జోనాథన్ బౌమా విముఖత వ్యక్తం చేశారు.కాగా, ఎఫ్‌బీఐలో 16 ఏళ్లు పని చేసిన జోనాథ్ బౌమా ఓ మీడియా సంస్థకు రహస్య సమాచారాన్ని అందించారు. దీంతో అమెరికా ప్రభుత్వం జోనాథ్ బౌమాను అరెస్ట్ చేసింది. చివరకు లక్షడాలర్ల పూచికత్తుతో బెయిల్‌పై విడుదలయ్యారు. -
వారానికి 90 గంటల పని!.. ఆయనతో పనిచేయడం నా అదృష్టం
ఎలాన్ మస్క్ అనగానే.. టెస్లా అధినేత, ప్రపంచ కుబేరుడు అని అందరూ చెబుతారు. అయితే ప్రపంచ కుబేరుడు అయినప్పటికీ, వారానికి ఈయన ఎన్ని గంటలు పనిచేస్తారో తెలిస్తే.. తప్పకుండా అవాక్కవుతారు. ఎందుకో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.టెస్లాలోని ఏఐ సాఫ్ట్వేర్ వైస్ చైర్మన్ 'అశోక్ ఎల్లుస్వామి' ఒక పాడ్‌కాస్ట్‌లో ఎలాన్ మస్క్‌తో కలిసి పనిచేయడం గురించి మాట్లాడుతూ.. ఆయన కష్టపడి పనిచేసే మనస్తత్వం కలిగిన వ్యక్తి అని, రిస్క్ తీసుకోవడానికి ఏ మాత్రం భయపడని వ్యక్తి అని అభివర్ణించారు. అద్భుతమైన ఊహ, దూరదృష్టి కలిగిన మస్క్ వారానికి 80 గంటల నుంచి 90 గంటలు పనిచేస్తారని పేర్కొన్నారు.నేను ప్రతివారం మస్క్‌ను కలుస్తాను. అతను చాలా తెలివైనవాడు, భవిష్యత్తును చాలా ముందుగానే అంచనా వేయగలడు. అతని దగ్గర పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. అతను రిస్క్ తీసుకోవడానికి ఏ మాత్రం భయపడడు. కష్టపడి పనిచేసే తత్త్వం ఉన్న మస్క్.. చాలా సరదాగా ఉంటారని అశోక్ ఎల్లుస్వామి వెల్లడించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇదీ చదవండి: అంబానీ మామిడి తోట: ఏటా ఎన్ని కోట్ల ఆదాయమో తెలుసా?2014లో టెస్లాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా చేరిన ఎల్లుస్వామి.. దశాబ్దానికి పైగా కంపెనీలో ఉన్నారు. 2024లో AI సాఫ్ట్వేర్ వైస్ ప్రెసిడెంట్‌గా పదోన్నతి పొంది.. మస్క్‌తో కలిసి పనిచేస్తూ, కృత్రిమ మేధస్సులో టెస్లా వృద్ధికి దోహదపడుతున్నారు.Tesla's VP of AI Software Ashok Elluswamy on what it's like to work with Elon Musk: "I meet with him every week. He is really smart in the sense that he can predict the future very early; He works really hard. Easily 80-90 hours per week. I feel fortunate to work for him. He is… https://t.co/dB5l6EbxEx pic.twitter.com/qLPB0v0hUd— Sawyer Merritt (@SawyerMerritt) May 14, 2025 -
మర మనిషా..? మైఖేల్ జాక్సనా..?
మర మనుషులు మానవుల స్థానాన్ని రీప్లేస్ చేసే రోజులు దగ్గర్లోనే ఉన్నట్లు తెలుస్తుంది. హ్యుమనాయిడ్ రోబోల ఆవిష్కరణలో వస్తున్న మార్పులే అందుకు ఉదాహరణ. తాజాగా టెస్లా హ్యూమనాయిడ్ రోబో ఆప్టిమస్ మనుషుల్లా డ్యాన్స్ చేస్తున్న వీడియోలను ఎలాన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు. ఎలాంటి ఆధారం లేకుండా అచ్చం మనుషుల్లానే డ్యాన్స్ చేయడం ఆ వీడియోలో చూడవచ్చు.ఇదీ చదవండి: ఈసారి 7,000 మంది బలి?ఆప్టిమస్ రోబో డ్యాన్స్ చేస్తున్న వీడియోను కోట్ చేస్తూ టెస్లా అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా స్పందించింది. ప్రధానంగా కార్ల తయారీదారుగా ఉన్న టెస్లా రోబో డ్యాన్స్‌ను ఉటంకిస్తూ ‘మాది కార్ల కంపెనీ కదా’ అని సరదాగా పోస్టు చేసింది. టెస్లా తదుపరి వాటాదారుల సమావేశంలో తనతో పాటు ఆప్టిమస్ నృత్య బృందాన్ని వేదికపైకి తీసుకెళ్తానని ఎలాన్ మస్క్ ఎక్స్ పోస్ట్‌లో వెల్లడించారు.🕺 pic.twitter.com/NzqAmN3F5z— gorklon rust (@elonmusk) May 13, 2025pic.twitter.com/ZbrZmfjHpd— gorklon rust (@elonmusk) May 14, 2025This is still very far from our final form https://t.co/6gIAllTPP5— gorklon rust (@elonmusk) May 14, 2025We're a car company right https://t.co/DWCw4i3HQV— Tesla (@Tesla) May 14, 2025 -
ట్విన్స్ కి జన్మనిచ్చిన ప్రముఖ నటి.. తండ్రి ఎలన్ మస్క్?
హాలీవుడ్ ప్రముఖ నటి అంబర్ హెర్డ్.. తాను కవలలకు జన్మనిచ్చినట్లు ప్రకటించింది. మదర్స్ డే సందర్భంగా ఆదివారం (మే 11) ఈ మేరకు ఇన్ స్టాలో పోస్ట్ పెట్టింది. ఇక్కడివరకు బాగానే ఉంది కానీ ఇప్పుడు ఈ పిల్లలకు తండ్రి ఎవరు అనే ప్రశ్న ఈమెకు ఎదురవుతోంది. సోషల్ మీడియాలో దీని గురించి మాట్లాడుకుంటున్నారు.(ఇదీ చదవండి: మహేశ్ సినిమా ఛాన్స్.. సర్జరీ చేయించుకోమన్నారు: వెన్నెల కిశోర్)ఎందుకంటే అంబర్ హెర్డ్.. 2015లో 'పైరేట్స్ ఆఫ్ కరీబియన్' ఫేమ్ నటుడు జానీ డెప్ ని పెళ్లి చేసుకుంది. అయితే వీళ్ల బంధం పట్టుమని రెండేళ్లు కూడా నిలబడలేదు. 2017లో వీళ్లిద్దరూ విడాకులు తీసుకున్నారు. మరోవైపు జానీ డెప్ తో విడాకులకు ముందే ప్రముఖ బిజినెస్ మ్యాన్ ఎలన్ మస్క్ తో అంబర్ డేటింగ్ చేసింది.2016-18 మధ్య అంబర్-మస్క్ డేటింగ్ లో ఉన్నారు. ఆ సమయంలోనే వీళ్లిద్దరూ పిల్లల్ని కనాలనుకున్నారని.. అప్పుడు కుదరకపోవడంతో ఎగ్ ఫ్రీజింగ్ చేసుకున్నారని, వాటితోనే ఇప్పుడు అంబర్.. ట్విన్స్ కి జన్మనిచ్చిందేనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి పిల్లలకు తండ్రి ఎవరనేది సదరు నటి చెబితే తప్ప క్లారిటీ రాదు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి వచ్చే సినిమాలు ఇవే) View this post on Instagram A post shared by Amber Heard (@amberheard) -
స్టార్‌లింక్ శాట్‌కామ్ వచ్చేస్తోంది..!
న్యూఢిల్లీ: భారత్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్ (శాట్‌కామ్) సర్వీసులు ప్రారంభించే దిశగా తదుపరి పూర్తి చేయాల్సిన ప్రక్రియపై అమెరికన్ కుబేరుడు ఎలాన్ మస్క్ కు చెందిన స్టార్‌లింక్ దృష్టి పెట్టనుంది. ఇప్పటికే టెలికం శాఖ (డాట్) నుంచి ప్రాథమిక అనుమతులు (లెటర్ ఆఫ్ ఇంటెంట్–ఎల్వోఐ) లభించడంతో, ఇక ఒప్పంద నియమాలను అంగీకరిస్తున్నట్లు కంపెనీ సంతకాలు చేయాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అటుపైన నిర్దేశిత ఎంట్రీ ఫీజును చెల్లించాక తుది లైసెన్సు లభిస్తుందని పేర్కొన్నాయి. శాట్‌కామ్ స్పెక్ట్రం ధరను టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ సిఫార్సు చేసే ప్రక్రియ తుది దశలో ఉందని, ఎప్పుడైనా దీనిపై ప్రకటన వెలువడొచ్చని వివరించాయి. గ్లోబల్ మొబైల్ పర్సనల్ కమ్యూనికేషన్స్ బై శాటిలైట్ (జీఎంపీసీఎస్), ఐఎస్పీ, వీశాట్ సేవలకు సంబంధించి స్టార్‌లింక్‌నకు ఎల్వోఐ జారీ అయినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. డాట్ లైసెన్సుతో నెట్‌వర్క్‌ను నిర్మించుకోవడానికి స్టార్‌లింక్‌కు అనుమతులు లభించినా, కార్యకలాపాలు ప్రారంభించడానికి ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్–స్పేస్) ఆమోదం, ప్రభుత్వం నుంచి స్పెక్ట్రం అవసరమవుతుంది. ఇప్పటికే వన్‌వెబ్, జియో శాటిలైట్‌కు లైసెన్స్.. ఇప్పటికే యూటెల్‌శాట్ వన్‌వెబ్, జియో శాటిలైట్ కమ్యూనికేషన్స్ సంస్థలకు ఈ లైసెన్సులు వచ్చాయి. స్పెక్ట్రంను కేటాయించిన తర్వాత అవి సర్వీసులు ప్రారంభించనున్నాయి. భారత్‌లో లైసెన్సు కోసం కొన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న స్టార్‌లింక్ ఈమధ్యే దేశీ టెలికం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంది. దీనితో భారత్‌లో తమ సొంత పంపిణీ, కస్టమర్ సర్వీస్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాల్సిన భారం లేకుండా, సంప్రదాయ బ్రాడ్‌బ్యాండ్ సేవలు అందుబాటులో లేని ప్రాంతాల్లోకి సేవలను విస్తరించే వీలు చిక్కుతుంది. సుదూరంగా ఉండే జియోస్టేషనరీ ఉపగ్రహాలపై ఆధారపడే సాంప్రదాయ శాటిలైట్ సర్వీసులతో పోలిస్తే భూమికి కొంత సమీపంగా (550 కి.మీ. పైన ) ఉండే ’లో ఎర్త్ ఆర్బిట్’ (లియో) శాటిలైట్లను ఉపయోగిస్తుంది. ప్రస్తు తం ఇవి 7,000 ఉండగా, వీటి సంఖ్య 40,000కు పెరగనుంది. -
CIA: ట్రంప్ ఎఫెక్ట్.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై వేలాడుతున్న లేఆప్స్ కత్తి..
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ మరోసారి భారీ ఎత్తున ఉద్యోగుల తొలగింపులకు శ్రీకారం చుట్టారు.అమెరికా గూఢాచార సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ)లో 1200 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపించే ప్రయత్నాల్ని ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సంబంధిత శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లు వాషింగ్టన్ పోస్ట్ తెలిపింది.JUST IN: The CIA plans to cut 1,200 employees as the Trump admin eyes downsizing of thousands across the U.S. intelligence community. Keep cutting and downsizing the government!— Gunther Eagleman™ (@GuntherEagleman) May 2, 2025సీఐఏలో ఉద్యోగుల తొలగింపుపై ట్రంప్ పరిపాలన విభాగం చట్టసభ సభ్యులకు సమాచారం అందించింది. అయితే, సీఐఏ సంత్సరాలుగా తొలగింపులకు బదులుగా నియామకాల్ని నిలిపి వేసిన విషయాన్ని వాషింగ్టన్ పోస్ట్ తన కథనంలో పేర్కొంది. సీఐఏ ఉద్యోగుల తొలగింపులపై ట్రంప్ పరిపాలన విభాగం ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన ఇవ్వలేదు. ఇదే అంశంపై సీఐఏ డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ మాట్లాడుతూ జాతీయ భద్రతా ప్రాధాన్యతలకు అనుగుణంగా తమ నిర్ణయాలు ఉంటాయి. ఈ చర్యలు సీఐఏ పటిష్టతకు దోహదం చేకూర్చడమే కాదు..ఏజెన్సీలో కొత్త శక్తిని నింపడానికి.. మరింత మెరుగ్గా మార్చడానికి చేపట్టిన వ్యూహంలో భాగం’ అని చెప్పారు.దేశంలో అనవసర ఖర్చులు తగ్గించడమే లక్ష్యంగా ట్రంప్ డోజ్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. మస్క్ నేతృత్వంలోని డోజ్ విభాగం ఉద్యోగుల్నితొలగిస్తుంది. ఇప్పటికే పలు రంగాల్లో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల్ని తొలగించింది. కొద్ది రోజుల క్రితం ఇంటర్నల్ రెవెన్యూ సర్వీసెస్‌కు (ఐఆర్ఎస్) చెందిన 20000 మంది ఉద్యోగులను తొలగించింది. తాజాగా, సీఐఏ ఉద్యోగుల్ని సైతం తొలగించే దిశగా చర్యలకు ఉపక్రమించింది. -
భారత్ రోడ్లపై టెస్లా కారు.. మొదటి ఓనర్ ఈయనే..
అమెరికాలో టాప్ ఎలక్ట్రిక్ వాహన తయారీదారుగా ఉన్న టెస్లా సంస్థ కార్లు భారత్‌లోకి ప్రవేశించాయి. సూరత్‌కు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త లవ్జీ దాలియా టెస్లా సైబర్‌ట్రక్‌ను కొనుగోలు చేసినట్లు తెలిపారు. వారం రోజులుగా టెస్లా సైబర్‌ట్రక్ సూరత్ రోడ్లపై కనిపిస్తూ సందడి చేస్తుంది. అయితే ఈ వాహనాన్ని దుబాయ్ నుంచి దిగుమతి చేసుకున్నట్లు దాలియా కుమారుడు పీయూష్ తెలిపారు.ధర రూ.60 లక్షలు..లావ్జీ దాలియా కొనుగోలు చేసిన టెస్లా సైబర్‌ట్రక్ భారత్‌లోనే మొదటిదని పీయూష్ పేర్కొన్నారు. ‘మేము ఆన్లైన్లో తనిఖీ చేసిన దాని ప్రకారం, ఈ సైబర్‌ట్రక్ దేశంలోనే మొదటిది. అమెరికాలోని టెక్సాస్‌లో ఉన్న టెస్లా షోరూమ్‌లో ఆరు నెలల క్రితం ఈ కారును బుక్ చేశాం. కొద్దీ రోజుల కిందటే దీన్ని దుబాయ్‌లో డెలివరీ చేశారు. అక్కడి నుంచి భారత్ తీసుకొచ్చాం’ అని స్పష్టం చేశారు. ఈ సైబర్‌ట్రక్ వేరియంట్ ధర సుమారు రూ.60 లక్షలు ఉందని సోషల్ మీడియా ద్వారా తెలుస్తుంది.ఇదీ చదవండి: కథన రంగంలో ఏఐ చిందులుఎవరీ లవ్జీ దాలియా?‘లవ్జీ బాద్షా’గా పేరొందిన లవ్జీ దాలియా సూరత్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. దాంతోపాటు వజ్రాల వ్యాపారిగా, పవర్ లూమ్ యజమానిగా లావ్జీకి గుర్తింపు ఉంది. ఆయన చేస్తున్న దాతృత్వ కార్యక్రమాలకు గుర్తింపుగా స్థానికులు తనను బాద్షాగా పిలుస్తున్నారు. గోపీన్ డెవలపర్స్ అనే రియల్ ఎస్టేట్ సంస్థను స్థాపించారు. లాభాపేక్ష లేని సంస్థ గోపీన్ ఫౌండేషన్ ద్వారా దాతృత్వ కార్యక్రమాలు చేస్తున్నారు. తన ఇన్స్టాగ్రామ్ పేజీలో ప్రధాని మోదీతో కలిసి దిగిన ఫొటోను కూడా గతంలో షేర్ చేశారు. -
ఈ ‘ప్రపంచ కుబేరుడు’ ఒకప్పుడు క్లీనర్.. అంతేనా.. ఎన్నో ట్విస్ట్‌లు!
ఎలాన్ మస్క్ జీవితం మూడు దేశాలతో ముడివడి ఉంది. దక్షిణాఫ్రికా–కెనడా–అమెరికా. ఈ మూడు దేశాల పౌరసత్వాలు అతడికి ఉన్నాయి. ఎలాన్ దక్షిణాఫ్రికాలో జన్మించారు. తండ్రిది దక్షిణాఫ్రికా, తల్లిది కెనడా. ఆమె మోడల్. ఆయన కెమికల్ ఇంజినీర్. ఎలాన్‌కు 8 ఏళ్ల వయసప్పుడే తల్లీ తండ్రి విడిపోయారు. అంతటి కుటుంబ కల్లోలంలోనూ తన జీవిత నావను జాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి.. నేడు అమెరికాను పాలిస్తున్న ఆ దేశ అధ్యక్షుడికే చేదోడు అయ్యేంతగా ఎదిగారు ఎలాన్. ఆయన జీవితంలోని ప్రతి దశా కీర్తి కిరీటాన్ని ధరించినదే.పన్నెండేళ్లకే తొలి బిజినెస్ ఎలాన్‌కి చిన్నప్పట్నుంచీ సైన్స్ ఫిక్షన్ అంటే ఇష్టం. 12 ఏళ్ల వయసులోనే ‘బ్లాస్టర్’ అనే వీడియో గేమ్‌ను సొంతంగా కనిపెట్టి, ఆ గేమ్ సాఫ్ట్‌వేర్‌ను ఒక పత్రికకు 500 డాలర్లకు అమ్మేశాడు. అదే అతడి మొదటి బిజినెస్. ప్రాణాంతక హైడ్రోజన్ బాంబులను మోసుకెళ్లే గ్రహాంతర రవాణా నౌకను అంతరిక్ష పైలట్ ధ్వంసం చేసే ఆట ‘బ్లాస్టర్’.ఫీజు కోసం క్లీనింగ్ పనికాలేజ్లో ఎలాన్ సబ్జెక్టులు ఫిజిక్స్, ఎకనామిక్స్. స్టాన్ఫోర్డ్, పెన్సిల్వేనియా యూనివర్సిటీల్లో చదివారు. కష్టపడి పని చేసి తన కాలేజ్ ఫీజు తనే కట్టుకున్నారు. ఎన్ని పార్ట్‌టైమ్ ఉద్యోగాలు చేసి ఫీజులు కట్టినా కాలేజ్ చదువు పూర్తయ్యే నాటికి లక్ష డాలర్లు అప్పు మిగిలే ఉంది. అది తీర్చటానికి గంటకు 18 డాలర్ల వేతనంతో కలపకోసే మిల్లులో క్లీనర్ పనితో సహా అనేక పనులు చేశారు ఎలాన్.ఒక కంపెనీతో ఆగిపోలేదు!ఎలాన్ 24 ఏళ్ల వయసులో తన తొలి కంపెనీ ‘జిప్2’ని ప్రారంభించారు. వార్తాపత్రికలకు ఆన్లైన్ సిటీ గైడ్ సాఫ్ట్‌వేర్‌ను సమకూరుస్తుంది జిప్2. తర్వాత నాలుగేళ్లకు 1999లో కంపాక్ కంపెనీ జిప్2ను 307 మిలియన్ డాలర్లకు కొనేసింది. ఎలాన్ తన ఇంకో కంపెనీ ఎక్స్.కామ్‌ను 2000లో కాన్ఫినిటీ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో విలీనం చేశారు. తర్వాతి ఏడాదికే అది ‘పేపాల్’ అనే ఆన్లైన్ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌గా అవతరించింది.పేపాల్‌ను 2002లో ఈబే 1.5 బిలియన్ డాలర్లకు కొనుక్కుంది. అదే ఏడాది ఎలాన్ వ్యోమనౌకల తయారీ సంస్థ ‘స్పేస్ ఎక్స్’ను స్థాపించారు. అంతరిక్ష రవాణా సేవల్ని కూడా ఆ కంపెనీ అందిస్తోంది. అంతరిక్షయాన వ్యయాన్ని తగ్గించటం, ఏదో ఒక నాటికి అంగారక గ్రహంపై భూగోళ వాసుల కాలనీని ఏర్పాటు చేయటం స్పేస్ఎక్స్ లక్ష్యం. ప్రఖ్యాతి గాంచిన టెస్లా, ఓపెన్ ఏఐ, ‘ది బోరింగ్ కంపెనీ’, ఎక్స్ కార్పొరేషన్, ‘థడ్’ (వ్యంగ్య వార్తల మీడియా కంపెనీ)లు కూడా ఒంటి చేత్తో ఎలాన్ నెలకొల్పినవే.ఐరన్ మ్యాన్ 2లో చిన్న పాత్రఎలాన్ దగ్గర ఇంత డబ్బుంది, అంత డబ్బుంది అని చెప్పడం కంటే తేలికైన మార్గం అతడిని ఒక్క మాటలో ‘ప్రపంచ కుబేరుడు’ అనేయటం! 2025 ఏప్రిల్ మొదటి వారం నాటికి అతడి గరిష్ఠ సంపద సుమారు 433 బిలియన్ డాలర్లు. ఇంకో 567 బిలియన్ డాలర్లను పోగేయగలిగితే ప్రపంచంలోనే మొదటి ట్రిలియనీర్ అవుతారు ఎలాన్. డబ్బు, ధనం, సంపద.. ఇవన్నీ అలా ఉంచండి. అంతకంటే ఆసక్తికరమైన విషయాలు అతడి జీవితంలో ఉన్నాయి. 2008 నాటి ‘ఐరన్ మ్యాన్’ సినిమాలో ‘టోనీ స్టార్క్’ పాత్రకు ఎలాన్ మస్క్ ఇన్స్పిరేషన్! ఆ తర్వాత 2010లో వచ్చిన ‘ఐరన్ మ్యాన్ 2’ లో మస్క్ చిన్న పాత్ర వేశారు కూడా.తిట్లనూ తేలిగ్గా తీసుకుంటారు!ఎలాన్ దగ్గర ఎంత సంపద ఉందో అంత సెన్సాఫ్ హ్యూమర్ కూడా ఉంది. విమర్శల్ని చాలా తేలిగ్గా తీసుకుంటారు. తను అనుకుంటే ఏదైనా జరిగి తీరాల్సిందే అనే నైజం కూడా ఆయనలో ఉంది. ఇందుకు చిన్న ఉదాహరణ... కాలిఫోర్నియాలోని అలమీడా కౌంటీలో ఆయనకు ఒక ఫ్యాక్టరీ ఉంది. కరోనా లాక్డౌన్ వల్ల అది ఆగిపోయింది. ‘‘ఇంకెంత కాలం ఈ లాక్డౌన్’’ అని లాక్ డౌన్ పూర్తి కాకుండానే ఫ్యాక్టరీని తెరవబోయారు ఎలాన్.కౌంటీ అధికారులు ‘నో’ అన్నారు. మీరిలా అడ్డుకుంటే ఫ్యాక్టరీని కాలిఫోర్నియా నుంచి వేరే చోటికి మార్చేస్తా అని ఎలాన్ బెదిరించారు. కేసు కూడా వేస్తానన్నారు. ఆయన అలా బెదిరించడం కాలిఫోర్నియా అసెంబ్లీ సభ్యురాలు లోరేనా గాన్జెలజ్ కు కోపం తెప్పించింది. ‘‘చెత్త మొహం ఎలాన్ మస్క్. వెళ్లిపో’’ అని ట్వీట్ చేశారు. అందుకు మస్క్ కోపం తెచ్చుకోలేదు. ‘మెసేజ్ రిసీవ్డ్’ అని రిప్లయ్ ట్వీట్ ఇచ్చారు. కోపాలు వస్తుంటాయి. తగ్గడం తెలిస్తే నవ్వులూ పూస్తాయి. -సాక్షి, స్పెషల్ డెస్క్ -
ప్రభుత్వ బాధ్యతల నుంచి మస్క్ వెనక్కి
ప్రపంచ కుబేరుడు, దిగ్గజ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనలో చేపట్టిన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ(డోజ్)లో తన ప్రమేయాన్ని గణనీయంగా తగ్గిస్తున్నట్లు ప్రకటించారు. డోజ్‌కు కేటాయిస్తున్న సమయాన్ని వచ్చే నెల నుంచి తగ్గించబోతున్నట్లు చెప్పారు. టెస్లాపై దృష్టి సారించాలనే ఉద్దేశంతో వారానికి ఒకటి నుంచి రెండు రోజులు మాత్రమే డోజ్‌కు సమయం కేటాయిస్తానని మస్క్ పేర్కొన్నారు.టెస్లాపై దృష్టి సారిస్తూ అధిక సమయం దానికే కేటాయించబోతున్నట్లు మస్క్ తీసుకున్న నిర్ణయంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఎలాన్ మస్క్ డోజ్ బాధ్యతలకు అధిక సమయం కేటాయించనప్పటికీ ట్రంప్ మస్క్‌పై ప్రశంసలు కురిపించారు. ఈమేరకు అమెరికాలోని ఓవల్ కార్యాలయంలో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేసిన సందర్భంగా మస్క్ తెలివితేటలు, దేశభక్తిని కొనియాడారు. ఫెడరల్ సంస్కరణల్లో ఆయన చేసిన కృషిని సమర్థించారు.నిజమైన దేశభక్తుడు..మస్క్ తన ప్రభుత్వ పాత్ర కంటే టెస్లా వ్యాపారానికే అధిక ప్రాధాన్యత ఇస్తారని అందరికీ తెలుసునని ట్రంప్ అన్నారు. డోజ్‌లో మస్క్ పాత్ర వివాదాన్ని రేకెత్తించినప్పటికీ టెక్నాలజీలో తాను ఎంతో కృషి చేశారని చెప్పారు. రాజకీయ విభేదాల వల్ల తన ఆవిష్కరణల ప్రాధాన్యతను తగ్గించకూడదన్నారు. తాను నిజమైన దేశభక్తుడన్నారు. స్పేస్ఎక్స్తో మస్క్ ఏరోస్పేస్ విభాగంలో చేసిన ఆవిష్కరణలను గుర్తు చేసుకున్నారు. స్పేస్ఎక్స్ రాకెట్లు నింగిలో దూసుకెళ్లి, తిరిగి క్షేమంగా ల్యాండ్ అవ్వడం ఒక అద్భుతం అన్నారు. ఇది కేవలం మస్క్‌తోనే సాధ్యమైందని చెప్పారు. తిరిగి తాను త్వరలోనే డోజ్‌కు అధిక సమయం కేటాయించాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.ఇదీ చదవండి: 7.39 లక్షల మందికి కొత్తగా ఈపీఎఫ్2025 మొదటి త్రైమాసికంలో టెస్లా లాభాలు 71% క్షీణించాయి. మస్క్ సంపద తగ్గడానికి తాన వ్యాపారాల్లో పెరుగుతున్న రాజకీయ ప్రమేయమే కారణమని తెలుస్తోంది. ట్రంప్ ఎన్నికల ప్రచారానికి మస్క్ భారీగా ఖర్చు చేశారు. దీంతో అమెరికా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (DOGE) అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. -
మస్క్‌తో వైట్‌హౌస్‌లో బ్రేక్‌ఫాస్ట్ : ఫోటో వైరల్, ఎవరీ సజ్వానీ ?
దుబాయ్‌కు చెందిన డెవలపర్ DAMAC ప్రాపర్టీస్ చైర్మన్ బిలియనీర్ హుస్సేన్ సజ్వానీ Hussain Sajwani) మరోసారి నెట్టింట హల్ చల్ చేస్తున్నాడు. దుబాయ్ బిలియనీర్, వైట్ హౌస్‌లో ఎలాన్ మస్క్ (Elon Musk), ఆయన భార్యతో కలిసి బ్రేక్ ఫాస్ట్ చేశాడు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది వైరల్‌గా మారింది. కొన్ని నిమిషాల్లోనే 10.2 లక్షలకు పైగా వ్యూస్, వేలాది లైక్స్ దక్కించుకుంది. ఇంతకీ ఎవరీ హుస్సేన్ సజ్వానీ?హుస్సేన్ సజ్వానీ ఎవరు?దుబాయ్ బిలియనీర్ హుస్సేన్ సజ్వానీ (71) డమాక్ ప్రాపర్టీస్ చైర్మన్ హుస్సేన్ సజ్వానీ. ఫోర్బ్స్ ప్రకారం. నియక విలువ విలువ 10.2 బిలియన్డాలర్లు. ఇటీవల దుబాయ్ బిలియనీర్ హుస్సేన్ సజ్వానీతో కలిసి, టెస్లా , స్పేస్ఎక్స్ సీఈఓ ఎలోన్ మస్క్ వైట్ హౌస్‌లో అల్పాహార విందు ఆరగించాడు. ‘‘ఒక చిరస్మరణీయ ఉదయం" అంటూ దీనికి సంబంధించిన ఫోటోలను సజ్వానీ ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలు మస్క్‌తోపాటు, మస్క్ భార్య న్యూరాలింక్ ఎగ్జిక్యూటివ్, శివోన్ జిలిస్‌ను కూడా చూడవచ్చు.చదవండి: 5 నెలల్లో 18 కిలోలు తగ్గిన హీరో : ఇదేం కొత్త కాదంటున్న ఫ్యాన్స్‌డొనాల్డ్ ట్రంప్ అమెరికాకు మొదటి దఫా అధ్యక్షుడిగా పనిచేసినపుడు వార్తల్లో నిలిచారు సజ్వానీ. 2016 నూతన సంవత్సర వేడుకలో ఆయన సంస్థ డమాక్ దుబాయ్‌లో ట్రంప్-బ్రాండెడ్ గోల్ఫ్ కోర్సును నిర్మించాడ. ఇక రెండోసారి ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలను చేపట్టిన అమెరికా డేటా సెంటర్లలో 20 బిలియన్ల పెట్టుబడిని సజ్వానీ ప్రకటించాడు. ఎనిమిది రాష్ట్రాలలో 2025లో నిర్మాణం ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్, అమెరికా సాంకేతిక మౌలిక సదుపాయాలను పెంచడం , డేటా సెంటర్లకు పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఉండటం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పెట్టుబడుల తరువాత ట్రంప్ సజ్వానీని "దార్శనిక వ్యాపారవేత్త"గా ప్రశంసించిన సంగతి తెలిసిందే.Had a great breakfast at the White House with Elon Musk and family — a memorable morning. pic.twitter.com/ckTs9PBRVM— Hussain Sajwani (@HussainSajwani) April 21, 2025 1953లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జన్మించిన హుస్సేన్ సజ్వానీ, అనేక లగ్జరీ రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లతో మల్టీ బిలియనీర్ వ్యాపారవేత్తగా ఎదిగాడు. వ్యాపార కుటుంబానికి చెందిన సజ్వానీ చిన్నతనంలోనే తన తండ్రి దుకాణంలో పనిచేయడం ప్రారంభించాడు. వాషింగ్టన్ విశ్వవిద్యాలయం నుండి ఆర్థిక శాస్త్రం,పారిశ్రామిక ఇంజనీరింగ్‌లో పట్టభద్రుడయ్యాడు. తరువాత సొంతంగా వ్యాపారాన్ని ప్రారంభించి బిజినెస్ టైకూన్ ఎదిగాడు. ముఖ్యంగా గల్ఫ్ వార్ టైంలో సజ్వానీ అమెరికన్ సైనిక కార్యకలాపాలకు సేవలందిచాడు. 2002లో DAMAC ప్రాపర్టీస్‌ను స్థాపించి వెనుదిరిగి చూసింది లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపార దిగ్గజం ఎదిగాడు. DAMAC హోటళ్ళు, అపార్ట్మెంట్లు మరియు విల్లాలు వంటి వేలాది లగ్జరీ గృహాలను నిర్మించింది. చదవండి: పండక్కి ఫ్యామిలీతో ఇండియాకు.. ఉగ్రదాడిలో టెకీ దుర్మరణం -
అది గ్రేట్ మూవీ.. ఎలాన్ మస్క్ ట్వీట్
టామ్ క్రూజ్ నటించిన 'ఎడ్జ్ ఆఫ్ టుమారో' చిత్రాన్ని ప్రశంసిస్తూ.. ఎలాన్ మస్క్ ట్వీట్ చేశారు. సినిమా ట్వీట్స్ అనే ఎక్స్ యూజర్ చేసిన ట్వీట్‌పై టెస్లా సీఈఓ స్పందిస్తూ 'గ్రేట్ మూవీ' అని అన్నారు.''ఎడ్జ్ ఆఫ్ టుమారో అనేది మరోమారు చూడాల్సిన సినిమా అనేదానికి సరైన నిర్వచనం. ఈ మూవీ ఫిల్మోగ్రఫీలో ఏ స్థానంలో ఉందో నాకు తెలియదు. కానీ క్రూజ్ ఇప్పటివరకు తీసిన ఒరిజినల్ చిత్రాలలో ఇది ఖచ్చితంగా ఒకటి. ఎమిలీ బ్లంట్‌తో క్రూజ్ కెమిస్ట్రీ కూడా చాలా ప్రత్యేకమైనది. నాకు ఈ సినిమా చాలా ఇష్టం'' అని సినిమా ట్వీట్స్ యూజర్ అన్నారు. దీనిపై మస్క్ స్పందిస్తూ.. గ్రేట్ మూవీ అని అన్నారు.డగ్ లిమాన్ దర్శకత్వం వహించిన ఎడ్జ్ ఆఫ్ టుమారో అనేది 2014లో విడుదలైన సైన్స్ ఫిక్షన్ యాక్షన్ చిత్రం. భవిష్యత్తులో భూమిని మిమిక్స్ అనే గ్రహాంతర జాతి దాడి చేస్తుంది. టామ్ క్రూజ్ మేజర్ విలియం కేజ్ పాత్రను పోషిస్తాడు. దీనిని హిరోషి సకురాజాకా రాసిన జపనీస్ నవల "ఆల్ యు నీడ్ ఈజ్ కిల్" ఆధారంగా తెరకెక్కించారు.Great movie— Elon Musk (@elonmusk) April 19, 2025ఇండియాకు ఎలాన్ మస్క్ప్రపంచకుబేరుడు 'ఎలాన్ మస్క్' ఈ ఏడాది చివర్లో భారతదేశాన్ని సందర్శిస్తానని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. శుక్రవారం మోదీతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత మస్క్ ఈ ప్రకటన చేశారు.ఇదీ చదవండి: బంగారం, వెండి కొని ధనవంతులు కండి: రిచ్‌డాడ్ పూర్ డాడ్ రచయితసాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణల్లో అమెరికాతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌తో ఈ ఏడాది ప్రారంభంలో వాషింగ్టన్ డీసీలో జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించినట్లు మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు. -
భారత్ కు ఇలాన్ మస్క్
-
ఇండియాకు ఎలాన్ మస్క్!.. ఎప్పుడో తెలుసా?
ప్రపంచకుబేరుడు 'ఎలాన్ మస్క్' ఈ ఏడాది చివర్లో భారతదేశాన్ని సందర్శిస్తానని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. శుక్రవారం మోదీతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన తర్వాత మస్క్ ఈ ప్రకటన చేశారు.సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణల్లో అమెరికాతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌తో ఈ ఏడాది ప్రారంభంలో వాషింగ్టన్ డీసీలో జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించినట్లు మోదీ ఎక్స్ వేదికగా వెల్లడించారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా పర్యటన సందర్భంగా మోదీ మస్క్‌ను కలిశారు. ఆ సమయంలో వీరిరువురు అంతరిక్ష అన్వేషణ, కృత్రిమ మేధస్సు.. స్థిరమైన అభివృద్ధిలో భారతీయ & అమెరికా సంస్థల మధ్య సహకారాన్ని బలోపేతం చేయడం గురించి చర్చించారు. అయితే ఎలాన్ మస్క్ ఇప్పటికే.. పలుమార్లు ఇండియాలో పర్యటించనున్నట్లు ప్రకటించారు. కానీ అవన్నీ వాయిదా పడ్డాయి. బహుశా ఈసారి పర్యటించే అవకాశం ఉందని, భారత్‌తో తమ బంధాన్ని బలపరచుకుంటారని తెలుస్తోంది.ఇండియాకు టెస్లాటెస్లా కంపెనీ ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించేందుకు సన్నద్ధమవుతోంది. భారత ప్రభుత్వం విధించిన నిబంధనలకు లోబడి సంస్థ ఇక్కడ కార్యకలాపాలు సాగించేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. టెస్లా షోరూమ్‌ల కోసం ఇప్పటికే ముంబై, ఢిల్లీ నగరాలను ఎంపిక చేసినట్లు, ఉద్యోగుల నియామకాలను కూడా చేపడుతున్నట్లు వార్తలు వినిపించాయి.ఇదీ చదవండి: అల్లుడితో కలిసి ఏడెకరాలు కొన్న నటుడు.. భూమి విలువ ఎన్ని కోట్లంటే?ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలోనే టెస్లా ఎలక్ట్రిక్ కారు.. ముంబై - పూణే నేషనల్ హైవే మీద టెస్టింగ్ దశలో కనిపించింది. ఈ కారును మోడల్ వై కారు అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికి గ్లోబల్ మార్కెట్లో అమ్ముడవుతున్న మోడల్ వై కార్ల కంటే కూడా.. టెస్టింగ్ సమయంలో కనిపించిన కారులో ఎక్కువ ఫీచర్స్ ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.It was an honor to speak with PM Modi. I am looking forward to visiting India later this year! https://t.co/TYUp6w5Gys— Elon Musk (@elonmusk) April 19, 2025 -
ఎలాన్ మస్క్ కు ప్రధాని మోదీ ఫోన్
న్యూఢిల్లీ: టెస్లా, స్పేస్ఎక్స్ సంస్థల అధినేత, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ తో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఫోన్లో మాట్లాడారు. ఇండియన్ ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లోకి త్వరలో టెస్లా అడుగుపెట్టబోతున్న నేపథ్యంతో వారిద్దరూ మాట్లాడుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. మస్క్, మోదీ పలు కీలక అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. టెక్నాలజీ, ఇన్నోవేషన్ వంటి రంగాల్లో భారత్, అమెరికా మధ్య పరస్పర సహకార మరింత బలోపేతం కావాలని వారు ఆకాంక్షించారు. సాంకేతికత, నవీన ఆవిష్కరణల విషయంలో ఉమ్మడి ప్రయోజనాలు కాపాడుకొనేలా పటిష్ట వ్యూహంతో ముందుకెళ్లాలని ఉద్ఘాటించారు. మస్క్ తో సంభాషణ అనంతరం మోదీ ‘ఎక్స్’లో పోస్టుచేశారు. మస్క్ తో చక్కటి సంభాషణ జరిగిందన్నారు. వేర్వేరు అంశాలపై అభిప్రాయాలు పంచుకున్నామని తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో తాము కలిసినప్పుడు చర్చించుకున్న అంశాలు మరోసారి ప్రస్తావనకు వచ్చాయన్నారు. ప్రధానంగా టెక్నాలజీ, ఇన్నోవేషన్ పైనే తమ మాట్లాడుకున్నామని వివరించారు. ఈ రెండు అంశాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత దృఢతరం చేసుకొనేందుకు కట్టుబడి ఉన్నామని మోదీ స్పష్టంచేశారు. మరోవైపు ఇండియన్ మార్కెట్లో ప్రవేశించానికి టెస్లా ఏర్పాట్లు చేసుకుంటోంది. తొలుత ముంబై, ఢిల్లీ, బెంగళూరులో టెస్లా కార్లు విక్రయించబోతున్నారు. వేలాది టెస్లా కార్లు ఇండియాను ముంచెత్తబోతున్నాయి. -
అమెరికాతో భాగస్వామ్యానికి భారత్ సిద్ధం
సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణల్లో అమెరికాతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్రమోదీ తెలిపారు. టెస్లా సీఈఓ ఎలాన్‌మస్క్‌తో ఈ ఏడాది ప్రారంభంలో వాషింగ్టన్ డీసీలో జరిగిన సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించినట్లు మోదీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ప్రధానంగా టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో భారత్-అమెరికాల మధ్య సహకారానికి అపారమైన అవకాశాలున్నాయని మోదీ తన పోస్టులో నొక్కిచెప్పారు. ఈ రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధాని పునరుద్ఘాటించారు. భారత్, అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న కీలక సమయంలో ఈ పోస్టు చేయడం గమనార్హం.టెస్లా త్వరలో భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం విధించిన నిబంధనలకు లోబడి కంపెనీ ఇక్కడ కార్యకలాపాలు సాగించేందుకు సిద్ధమవుతున్నట్లు అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఈమేరకు ముంబయిలో ఉద్యోగుల నియామకాలు, షోరూమ్ కోసం స్థల పరిశీలన చేపట్టినట్లు వార్తలు వస్తున్నాయి.ఇదీ చదవండి: రూ.10 వేలలోపు టాప్ 10 మొబైళ్లుమస్క్కు చెందిన శాటిలైట్ కమ్యునికేషన్ సిస్టమ్ స్టార్‌లింక్ కూడా భారత్‌లోకి ప్రవేశించనుంది. స్థానికంగా ఉన్న రిలయన్స్, ఎయిర్టెల్ వంటి టెలికాం కంపెనీలు ముందుగా ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించినా తర్వాత ఆ కంపెనీతోనే భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. -
నరుడా.. ఓ నరుడా.. డోనరుడా..!
ఎలాన్ మస్క్.. ఈ పేరు ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఆయన టెస్లా, స్పేస్ ఎక్స్ వంటి కంపెనీలకు అధిపతి. ఒక వ్యాపారవేత్తగానే కాకుండా ఆవిష్కరణ వేత్తగా కూడా పేరు సంపాదించారు. ప్రపంచ కుబేరుల్లో ఒకరు మస్క్. అయితే తన వారసత్వం తనతో ఆగిపోకూడదనే తపన కూడా ఆయనలో ఎక్కువగానే ఉంది. ప్రపంచానికి తనలాంటి మేధావులు మళ్లీ మళ్లీ పరిచయం కావాలంటే ఏం చేయాలనే ఆలోచన కూడా ఆయనకు ఎప్పుడో వచ్చిందట. దీనిలో భాగంగా తన తర్వాత తరాన్ని తయారు చేసే పనిలో పడ్డారట ఎలాన్ మస్క్. ప్రపంచ జనాభా పెంచే పనిలో మస్క్అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) క్యాబినెట్ లో కీలక పదవిలో ఉన్న ఎలాన్ మస్క్.. తన వీర్యాన్ని దానం చేసే పనిలో ఉన్నారని తాజా కథనాల సారాంశం. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ తన కాస్ట్ కటింగ్ లతో ప్రపంచానికి నిద్రపట్టనివ్వకుండా చేస్తుంటే.. మస్క్ మాత్రం తన వీర్యాన్ని పంచి ప్రపంచ జనాభాను పెంచే పనిలో ఉన్నారట. దీనికి సంబంధించి అమెరికన్ వార్త పత్రిక వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనాన్ని ప్రచురించింది. మస్క్ కు బాగా తెలిసిన వాళ్లకు ఈ ఆఫర్ చేస్తూ ఉంటాడని, ఒకవేళ తెలియక పోయినా వారితో పరిచయం పెంచుకుని మరీ వారికి దగ్గరవుతూ ఉంటాడట. మేధావి వర్గం అనేది తర్వాత తరాలకు కూడా అందుబాటులో ఉండాలనే పదునైన సంకల్పంతో ఉన్న మస్క్ దీనికి పూనుకున్నట్లు పేర్కొంది. ’ఎక్స్’లో మహిళలకు దగ్గరవుతూ వారిని పిల్లల్ని కనమని ఆఫర్లు ఇస్తున్నాడని స్పష్టం చేసింది. ఇలా మస్క్ పిల్లల సంఖ్య పెరుగుతూ పోతూ ఉందని తెలిపింది. జనాభా సమతుల్యతను కాపాడే పనిలో..ఇప్పటికే 14 మంది పిల్లలకు తండ్రిగా ఉన్న ఎలాన్ మస్క్.. తన వారసత్వ సంపదగా ఒక దండునే తయారు చేయాలనే సంకల్పంతో ఉన్నాడని డబ్యూఎస్జే తెలిపింది. తగ్గిపోతున్న జనన రేట్ల మానవ నాగరికతను అస్తిత్వంలో పడేస్తాయని మస్క్ బలంగా నమ్ముతున్నాడని, ఇది కూడా తన వీర్యాన్ని దానం చేస్తూ జనాభా సమతుల్యతను కాపాడుకునే క్రమంలో సాధ్యమైనంత మేర తన వంతు ప్రయత్నం చేస్తున్నాడనేది ఆ కథనం సారాంశం. ఇప్పటికే ఎంతోమంది మహిళలకు తన వీర్యాన్ని డోనర్ రూపంలో దానం చేసినట్లు తెలిపింది. దీనికి సంబంధించి వ్యవహారాలపై సీక్రెట్ ఒప్పందాలు మస్క్ చేసుకున్నట్లు ప్రచురించింది. జపనీస్ మహిళను ఇలా కలిసి..?క్రిప్టో కరెన్సీ ఇన్ఫ్లూయెన్సర్ అయిన జపాన్ మహిళ టిఫనీ ఫాంగ్ కు కూడా మస్క్ నేరుగా మెస్సేజ్ చేసి తన బిడ్డ (వీర్యం దానం చేయడం ద్వారా) కావాలా అని అడిగినట్టు డబ్యూఎస్ జే పేర్కొంది. ఇది జరిగి ఏడాది అవుతుందని, మస్క్ ఆమెను ఎక్స్ లో ఫాలో అవ్వడం మొదలైన తర్వాత ఈ ఆఫర్ ఇచ్చాడట. ఆమెను మస్క్ ఫాలో అవ్వడంతో టిఫనీ ఫాంగ్ కు ఫాలోవర్స్ సంఖ్య కూడా గణనీయంగా పెరిగి రెండు వారాల్లోనే 21 వేల డాలర్లను సంపాదించినట్లు ఆ కథనంలోని మరొక విషయం. అయితే మస్క్ ఆఫర్ ను టిఫనీ ఫాంగ్ తిరస్కరించిందని, ఆమెకు అప్పటికే ఉన్న పిల్లల ఫోటోలను కూడా చూపించిందట.ఆష్లీ సెయింట్ క్లెయిర్ సంచలన ఆరోపణలుఇటీవల రచయిత్రి, ఇన్ఫ్లూయెన్సర్ ఆష్లీ సెయింట్ క్లెయిర్.. మస్క్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తన బిడ్డకు మస్క్ తండ్రి అంటూ సోషల్ మీడియాలో వేదికగా పోస్టు పెట్టారు. ఆమె పోస్టుపై మస్క్ సమాధానం ఇస్తూ ఆసక్తికర సమాధానం ఇచ్చారు.ఆ చిన్నారికి తండ్రి మస్క్ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. తన బిడ్డ మస్క్‌కు 13వ సంతానమని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో.. తమ బిడ్డ భద్రతను, గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఇన్ని రోజులు ఈ విషయం బయటపెట్టలేదని, మా ప్రైవసీకి ఎవరూ భంగం కలిగించవద్దంటూ కామెంట్స్ చేశారు.గతేడాది న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. తనకు పుట్టిన పిల్లలను, మాజీ భాగస్వామ్యులు ఉండేందుందుకు 14 వేల 400 స్క్వేర్ ఫీట్ కాంపౌడ్ లో ఒక పెద్ద భవనాన్ని నిర్మించి వారు బాగోగులు చూస్తున్నట్లు కూడా పేర్కొంది. ఆ ఇంటిని నిర్మించడం కోసం సుమారు 300 కోట్ల రూపాయిలు అయినట్లు తెలిపింది. ఏం లేదు.. అంతా గాసిప్: మస్క్‌జపాన్ మహిళకు వీర్యం ఆఫర్ చేసినట్టు వచ్చిన కథనాల్ని మస్క్ కొట్టిపారేస్తున్నారు. ఇందులో ఎటువంటి వాస్తవం లేదని అంటున్నారు. డబ్యూఎస్జే వెబ్సైట్ అనేది ఒక గాసిప్ వెబ్ సైట్ అని, అందులో గాసిప్ తప్పితే ఏమీ ఉండదని అంటున్నారు. అయితే స్పెర్మ్ డోనర్ అనే అంశం చాలా సీక్రెట్‌గానే ఉంచుతారు. మరి అటవంటప్పుడు మస్క్ ఎవరికైనా వీర్యాన్ని దానం చేసినా దానిని బహిరంగంగా చెప్పుకునే అవకాశం ఉండదు. ఇటీవల కాలంలో తన బిడ్డకు తండ్రి మస్క్ అంటూ బహిరంగంగా పలువురు వ్యాఖ్యానించిన క్రమంలోనే ఈ వార్తను డబ్యూఎస్జే పరిశోధానాత్మక కోణంలో ప్రచురించినట్లు తెలుస్తోంది. -
టైమ్స్ జాబితాలో భారతీయులకు దక్కని చోటు!
ప్రపంచమంతా ప్రతిష్టాత్మకంగా భావించే టైమ్ మ్యాగజైన్(Time Magazine List 2025) జాబితా 2025 విడుదలైంది. వంద మంది పేర్లతో కూడిన జాబితాను విడుదల చేసింది. అయితే అత్యంత ప్రభావశీల వ్యక్తుల జాబితాలో ఈ ఏడాది భారతీయులెవరికీ చోటు దక్కకపోవడం గమనార్హం.2025కి గానూ మోస్ట్ ఇన్ఫ్లూయెన్షియల్ పీపుల్ జాబితాను టైమ్ మ్యాగజైన్ విడుదల చేసింది. ఇందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యూకే ప్రధాని కీర్ స్టార్మర్, నోబెల్ బహుమతి గ్రహీత.. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనస్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, టెస్లా సీఈవో ఇలాన్ మస్క్ తదితరులకు చోటు దక్కింది. జిమ్నాస్ట్ సిమోన్ బైల్స్, పాపులర్ సింగర్ ఈద్ షరీన్, ఏఐ దిగ్గజం డెమిస్ హస్సాబిస్(Demis Hassabis) తదితరుల పేర్లు ఉన్నాయి.ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. భారత్ నుంచి ఈ ఏడాది జాబితాలో ఒక్కరికి కూడా చోటు దక్కలేదు. గతంలో.. షారూఖ్ ఖాన్, అలియా భట్, సాక్షి మాలిక్(రెజ్లర్) పేర్లు ఈ జాబితాకు ఎక్కిన సంగతి తెలిసిందే. అయితే ఈ మధ్య సంవత్సరాల్లో ఇలా భారతీయుల పేర్లు లేకపోవడం ఇదే తొలిసారి. ఈసారి విశేషం ఏంటంటే.. నేరుగా భారతీయులకు చోటు దక్కకపోయినా భారత సంతతికి చెందిన వర్టెక్స్ ఫార్మాసూటికల్స్ సీఈవో రేష్మా కేవలరమణి(Reshma Kewalramani) పేరు ఈ జాబితాలోకి ఎక్కింది. రేష్మ ముంబైలో పుట్టారు. ఆమెకు 11 ఏళ్ల వయసున్నప్పుడు ఆ కుటుంబం అమెరికాకు వలస వెళ్లి స్థిరపడింది. రేష్మా కేవలరమణి(52)టైమ్ జాబితాకు ప్రాధాన్యత ఎందుకు?టైమ్ మ్యాగజైన్ అనేది న్యూయార్క్ కేంద్రంగా నడిచే వార్త ప్రచురణ సంస్థ. 1923 మార్చి 3వ తేదీన ఇది ప్రారంభమైంది. సమకాలీన వార్తలకు పాఠకులకు అందించే ఉద్దేశంతో హెన్రీ లూస్, బ్రిటన్ హాడెన్ దీనిని స్థాపించారు. కాలక్రమేణా దీనికి ప్రపంచస్థాయి ఆదరణ లభించింది. అనేక రంగాలను మలుపు తిప్పిన వ్యక్తుల పేర్లతో ప్రతీ ఏటా జాబితా విడుదల చేస్తూ వస్తోంది టైమ్స్ మ్యాగజైన్. అలా..అత్యంత ప్రభావశీలురైన వ్యక్తుల జాబితాను 1999లో తొలిసారి రిలీజ్ చేసింది టైమ్ మ్యాగజైన్. మేధావులు, రాజకీయ నాయకులు, జర్నలిస్టులు ఈ జాబితా గురించి విస్తృతంగా చర్చించుకోవడం మొదలుపెట్టారు. అయితే 2004 నుంచి క్రమం తప్పుకుండా ప్రతీ ఏడాది జాబితాను విడుదల చేస్తూ వస్తోంది టైమ్ మ్యాగజైన్. -
చిందేసిన ట్రంప్..!
మియామి: వలసదారుల బహిష్కరణలు, సుంకాలతో హడలెత్తిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం కాస్త రిలాక్సయ్యారు. తన బృందంలో కీలక సభ్యులైన ఎలాన్ మస్క్, తులసీ గబార్డ్ తదితరులతో కలిసి ఫ్లోరిడాలోని మియామిలో అలి్టమేట్ ఫైటింగ్ చాంపియన్ షిప్ కార్యక్రమాన్ని తిలకించారు. అభిమానులతో కలిసి కాసేపు డ్యాన్స్ చేసి, పిడికిలి బిగించి ఉత్సాహపరిచారు. పూర్తిగా ఫిట్ 78 ఏళ్ల ట్రంప్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు ధ్రువీకరించారు. అమెరికా సర్వసైన్యాధ్యక్షుడిగా పనిచేసే సామర్ధ్యం ఆయనకుందని పేర్కొన్నారు. శుక్రవారం ట్రంప్‌కు జరిపిన సాధారణ వైద్య పరీక్షల ఫలితాలను వైట్‌హౌస్ విడుదల చేసింది. ‘2020లో అధ్యక్షుడిగా ఉండగా చివరిసారిగా జరిపిన పరీక్షల్లో ట్రంప్ 110.677 కిలోలుండగా ఇప్పుడు 9 కిలోలు తగ్గారు. రక్తంలో కొలెస్టరాల్ స్థాయిలు తగ్గాయి. అధ్యక్షుడిగా రోజూ సమావేశాలు, సభల్లో భేటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇటీవల ఓ గోల్ఫ్ పోటీలో విజేతగా నిలిచారు కూడా. ఆరోగ్యవంతుల్లో కొలెస్టరాల్ స్థాయి 200కు మించరాదు. బీపీ మాత్రం కాస్త ఎక్కువ (128/74)గా ఉంది. హృదయ స్పందన రేటు గతంలో మాదిరిగా 62గానే ఉంది. గుండెపోటు రిస్‌్కను నివారించేందుకు ట్రంప్ నిత్యం ఆస్పిరిన్ టాబ్లెట్ తీసుకుంటున్నారు’’ అని పేర్కొంది. Trump Dance at UFC 314 🇺🇸 pic.twitter.com/Ud01BkHp8M— Margo Martin (@MargoMartin47) April 13, 2025 -
ఎలాన్ మస్క్ టాప్ సీక్రెట్: నెట్టింట్లో వైరల్
అమెరికా అధ్యక్షుడు 'డొనాల్డ్ ట్రంప్' ఇటీవల నిర్వహించిన క్యాబినెట్ సమావేశంలో.. ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' తీసుకున్న నోట్‌ప్యాడ్ ఫోటో నెట్టింట్లో వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోను గమనిస్తే.. టెస్లా సీఈఓ కాన్ఫరెన్స్ టేబుల్ వద్ద కూర్చుని 'ఎలాన్ మస్క్' అని రాసి ఉన్న నేమ్ కార్డ్ కనిపిస్తుంది. అక్కడే ఒక పేపర్ మీద 'టాప్ సీక్రెట్' రాసి ఉండటాన్ని గమనించవచ్చు. ఈ ఫోటోలో ఒక పెన్ను, ఖాళీ గాజు మాత్రమే కాకుండా యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడి ముద్ర ఉన్న కోస్టర్ కూడా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరక్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.సోషల్ మీడియా వినియోగదారులు మస్క్ నోట్‌ప్యాడ్‌ను జూమ్ చేయడంతో “టాప్ సీక్రెట్” అనే పదాలు కనుగొన్నారు. మీడియాను గందరగోళంలోకి నెట్టడానికి మస్క్ ఈ విధంగా చేసి ఉంటాడని.. ఒక నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి ఎలాన్ నవ్వుతున్న ఒక ఎమోజీతో రిప్లై ఇచ్చారు.ఇదీ చదవండి: గోల్డ్ రేటు ఇంకా పెరుగుతుందా?: నిపుణులు ఏం చెబుతున్నారంటే..ఒక ట్రిలియన్ నుంచి రెండు ట్రిలియన్ డాలర్ల వరకు.. అమెరికా వ్యయాలను తగ్గిస్తామని ఒకప్పటి నుంచి చెబుతున్న ఎలాన్ మస్క్ ఇప్పుడు మాట మార్చేశారు. ఇటీవల జరిగిన సమావేశంలో.. 150 బిలియన్ డాలర్ల వ్యయాలను తగ్గించగలమని క్లారిటీ ఇచ్చారు. అంతే కాకుండా ట్రంప్ నేతృత్వంలోని డోజ్ టీమ్ పర్ఫామెన్స్ అద్భుతంగా ఉందని మస్క్ మెచ్చుకున్నారు.😂 https://t.co/0NsNM4yAdR— Elon Musk (@elonmusk) April 12, 2025 -
టెస్లా కొత్త సైబర్‌ట్రక్ విడుదల.. ధర ఎంతంటే..
ప్రముఖ అమెరికా ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా యూఎస్‌లో కొత్త సైబర్‌ట్రక్ వెర్షన్‌ను విడుదల చేసింది. దీని ప్రారంభ ధరను 69,990 అమెరికన్ డాలర్లుగా(రూ.59 లక్షలు) నిర్ణయించింది. ఇది ప్రస్తుతం అందుబాటులో ఉన్న మూడు సైబర్‌ట్రక్ మోడళ్లలో చౌకైనదిగా కంపెనీ పేర్కొంది. కొత్త సైబర్‌ట్రక్ వేరియంట్‌కు సంబంధించిన రేంజ్, టోవింగ్ సామర్థ్యం, యాక్సిలరేషన్ వంటి స్పెసిఫికేషన్లపై కచ్చితమైన వివరాలు వెల్లడించలేదు.అమెరికాలో 69,990 డాలర్ల ధరతో ఎంట్రీ లెవల్ సైబర్‌ట్రక్ యూఎస్ మార్కెట్లో ఆదరణ పొందుతున్న ఫోర్డ్ ఎఫ్-150 లైటనింగ్, రివియన్ ఆర్ 1 టీ వంటి ఇతర ఎలక్ట్రిక్ మోడళ్లతో పోటీ పడుతుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. స్టెయిన్లెస్ స్టీల్ ఎక్సోస్కెలెటన్, ఆర్మర్డ్ గ్లాస్, అధునాతన డ్రైవర్ అసిస్టెన్స్ సామర్థ్యాలు సైబర్‌ట్రక్‌లో ఉన్నాయని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: 'ఎవరూ తప్పించుకోలేరు.. నేనే రెండుసార్లు ఫైన్ కట్టాను'ఈవీ విభాగంలో టెస్లా ఆధిపత్యాన్ని కొనసాగించడానికి కంపెనీ కొంత కాలంగా ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీనికి తోడు ఆర్థిక అనిశ్చితి, ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ హెచ్చుతగ్గులుండడం వాహన తయారీదారులు ధరలకు సంబంధించి పునరాలోచనలో పడేలా చేశాయి. ఈ నేపథ్యంలో టెస్లా తీసుకున్న నిర్ణయం వినియోగదారులు మరింత సరసమైన ధరలకు కార్లను కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. -
అమెరికాలో ట్విస్ట్.. ట్రంప్, మస్క్‌కు ఝలక్!
వాష్టింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ తగిలింది. ట్రంప్ పరిపాలన, వివాదాస్పద విధానాలపై అమెరికా అంతటా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికన్లు వీధుల్లోకి వచ్చి ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. హ్యాండ్స్ ఆఫ్('Hands Off!') పేరుతో నిరసనలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అగ్రరాజ్యం అమెరికాలో నిరసనలు పీక్ స్టేజ్‌కు చేరుకున్నాయి. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలకు వ్యతిరేకంగా వేలాది మంది నిరసనకారులు రోడ్ల మీదకు వచ్చి తమ నిరసనలు తెలిపారు. హ్యాండ్స్ ఆఫ్ అంటూ 50 రాష్ట్రాలలో 1,200కిపైగా ప్రదేశాల్లో నిరసనలను నిర్వహించారు. ఈ నిరసనలకు పౌర హక్కుల సంస్థలు, కార్మిక సంఘాలు, LGBTQ+ న్యాయవాదులు, ఎన్నికల కార్యకర్తలు సహా 150కి పైగా సమూహాలు ఈ ర్యాలీలకు మద్దతు ఇచ్చాయి.HAPPENING NOW: A MASSIVE protest is taking place in downtown Chicago for the "Hands Off!" movement against Elon Musk and Donald Trump pic.twitter.com/NVEiTFi8Iy— Marco Foster (@MarcoFoster_) April 5, 2025 ఈ సందర్భంగా ట్రంప్ పరిపాలన విధానాలపై వీరు నిరసనలు తెలిపారు. ముఖ్యంగా సమాఖ్యల తొలగింపులు, సామూహిక బహిష్కరణలు, ఇతర వివాదాస్పద చర్యలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ క్రమంలో నిరసనకారులు మాట్లాడుతూ.. డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్ అనుచిత నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రపంచానికే సవాల్ చేస్తున్నారని అన్నారు. వలసదారుల పట్ల వ్యవహరించే తీరు దారుణంగా ఉందన్నారు. ప్రభుత్వ సంస్థల తగ్గింపు, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాలలో కోతలు, వలసదారుల చికిత్స, లింగమార్పిడి హక్కులపై ఆంక్షలు వంటి విస్తృత శ్రేణి అంశాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇక, 2017 తర్వాత అమెరికా ఇంత మంది బయటకు వచ్చి నిరసనలు ఇలా నిరసనలు తెలపడం ఇదే మొదటిసారి. కాగా, వీరి నిరసనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.A surprising 300 people showed up at the state Capitol in downtown Jackson, Mississippi as part of the nationwide HANDS OFF! protests of @POTUS, @elonmusk and the work of @DOGE. Rally organizes expected only 30 people to show up. #DOGE #handsoffprotests pic.twitter.com/d9dSIkXkD2— Ross Adams (@radamsWAPT) April 5, 2025BREAKING: Thousands have flooded the streets of Boston for the massive anti-Trump “Hands Off!” rally—one of over 1,200 protests erupting across all 50 states.From coast to coast, Americans are sending a message: Hands off our rights. Hands off our democracy. Hands off our… pic.twitter.com/ZGQWF8fRy3— Brian Allen (@allenanalysis) April 5, 2025Absolutely incredible!Protesters are lining both sides of the street for blocks in the tiny little town of Geneva, Illinois!It's estimated that around 5000 people showed up for the Hands Off! protest.Let's go!!!!! pic.twitter.com/lStDLrtQpp— Art Candee 🍿🥤 (@ArtCandee) April 5, 2025 -
డోజ్ నుంచి వైదొలగను: మస్క్
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వ బాధ్యతల నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్) సారథ్యం నుంచి వైదొలగుతున్నట్లు వస్తున్న వార్తలను టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ ఖండించారు. ‘‘అవన్నీ పుకార్లే. పని పూర్తయ్యేదాకా పదవిలో కొనసాగుతా’’అని ఎక్స్ పోస్టులో స్పష్టం చేశారు. వైట్‌హౌస్ కూడా ఈ వార్తలను ఖండించింది. ‘‘అవన్నీ చెత్త వార్తల. పదవీకాలం పూర్తయ్యాకే మస్క్ తన బాధ్యతల నుంచి వైదొలుగుతారు. మస్క్, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇద్దరూ ఈ మేరకు గతంలోనే బహిరంగంగా ప్రకటించారు’’అని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ అన్నారు. ట్రంప్ అంతర్గత వ్యవహారాల నుంచి మస్క్ పూర్తిగా తప్పుకుంటారని ఎవరైనా అనుకుంటే అది వాళ్లను వాళ్లు మోసగించుకోవడమేనని సీనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారి ఒకరన్నారు. డోజ్ నుంచి మస్క్ కొద్ది వారాల్లో తప్పుకుంటారని ట్రంప్ స్వయంగా కేబినెట్‌కు తెలిపినట్లు పొలిటికో నివేదిక పేర్కొనడం తెలిసిందే. ‘‘ఆయన త్వరలో సొంత వ్యాపారాలపై పూర్తిగా దృష్టి పెట్టనున్నారు. అందుకు ట్రంప్ కూడా అంగీకరించారు. మస్క్ ఇక అనధికారిక సలహాదారు పాత్ర పోషిస్తారు’’అని చెప్పుకొచ్చింది. జనవరిలో డోజ్ బాధ్యతలు చేపట్టిన మస్క్ ఫెడరల్ వ్యయాలను తగ్గింపు, ప్రభుత్వోద్యోగుల ఉద్వాసనలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అమెరికాను సమూలంగా మెరుగు పరచడానికి ఈ చర్యలు అవసరమంటున్నారు. ఆయన నాయకత్వంలో డోజ్ ఇప్పటికే ప్రభుత్వ కాంట్రాక్టులు, శ్రామిక శక్తిలో భారీ కోతలు పెట్టింది. ఇవన్నీ అంతిమంగా ప్రభుత్వానికి లక్ష కోట్ల డాలర్ల దాకా ఆదా చేయగలవని పలు నివేదికలు అంచనా వేస్తునఆనయి. ప్రత్యేక ప్రభుత్వోద్యోగిగా మస్క్ పదవీకాలం మే నెలాఖరుతో ముగియనుందని భావిస్తున్నారు. ఆలోగా ఫెడరల్ వ్యయాన్ని లక్ష కోట్ల డాలర్ల మేరకు తగ్గించే పనిని పూర్తి చేయగలనని ఆయన చెబుతున్నారు. -
టెస్లాకు మస్క్ రాజకీయాల సెగ.. అమ్మకాలు డౌన్
న్యూయార్క్: ఒకవైపు ప్రత్యర్ధి కంపెనీల నుంచి పోటీ, మరోవైపు స్వయంగా సీఈవో ఎలాన్ మస్క్ బాహాటంగా రాజకీయాల్లో మునిగి తేలుతుండటం తదితర పరిణామాలు అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లాకు సమస్యాత్మకంగా మారుతున్నాయి. దీంతో కొనుగోలుదారులను ఆకట్టుకోవడంలో కంపెనీ విఫలమవుతోంది.ఫలితంగా ఈ ఏడాది తొలి మూడు నెలల్లో టెస్లా కార్ల విక్రయాలు రెండంకెల స్థాయిలో 13 శాతం పడిపోయాయి. గతేడాది మార్చి క్వార్టర్లో 3,87,000 వాహనాలు విక్రయించగా, ఈసారి మార్చి క్వార్టర్లో ఈ సంఖ్య 3,36,681 యూనిట్లకు పడిపోయింది. భారీగా డిస్కౌంట్లు, ఇతరత్రా ప్రోత్సాహకాలు ఇచ్చినప్పటికీ ఈ పరిస్థితి నెలకొంది.వాస్తవానికి విక్రయాల సంఖ్య 4,08,000 యూనిట్లుగా ఉంటుందని పరిశ్రమ వర్గాలు అంచనా వేశాయి. అమెరికా, చైనాతో పాటు యూరప్‌లోనూ టెస్లా కార్లకు డిమాండ్ నెమ్మదించిందని, బ్రాండ్ ప్రతిష్ట మసకబారుతోందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. జనవరి– మార్చి త్రైమాసిక ఆర్థిక గణాంకాలు ఊహించిన దానికంటే ఘోరంగా ఉండొచ్చని చెప్పారు. -
నాలుగు లక్షల నెంబర్లు లీక్.. రేపు ఒకరి అరెస్ట్ తప్పదు
సోషల్ సెక్యూరిటీ డేటాబేస్ నుంచి నాలుగు లక్షల మంది వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి విక్రయించాడనే ఆరోపణలపై ఒక వ్యక్తిని త్వరలో అరెస్టు చేస్తామని ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత 'ఎలాన్ మస్క్' తెలిపారు. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ కూడా నెట్టింట్లో వైరల్ అవుతోంది.సోషల్ సెక్యూరిటీ డేటాబేస్ నుంచి దొంగలించిన నాలుగు లక్షల నెంబర్లు, వ్యక్తిగత సమాచారం.. అక్రమ వలసలు, అమెరికా పౌరులు కానివారు ఓటు వేయడానికి అనుమతిస్తామని మస్క్ పేర్కొన్నారు. అంతే కాకుండా.. సామాజిక భద్రత, వైద్య సంరక్షణ, నిరుద్యోగ భృతి, ఐఆర్ఎస్ వాపసులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ, పత్రాలు లేని వలసదారులు ప్రయోజనాలను పొందడాన్ని డెమొక్రాట్లు సులభతరం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.విపత్తు సహాయానికి ఉద్దేశించిన నిధులు కూడా దుర్వినియోగం అయ్యాయని మస్క్ ఆరోపించారు. జాతీయ విపత్తుల వల్ల బాధపడుతున్న అమెరికన్లకు సహాయం చేయడానికి ఉద్దేశించిన ఎఫ్ఈఎమ్ఏ నిధులను దారి మళ్లించి, న్యూయార్క్‌లోని లగ్జరీ హోటళ్లకు అక్రమంగా నివసించేవారి కోసం చెల్లించడానికి ఉపయోగించారని అన్నారు.🚨 ELON MUSK: "Someone is going to be arrested tomorrow. He actually stole 400,000 social security numbers & personal information from the Social Security database and was selling social security numbers in order for people to basically steal money from Social Security." pic.twitter.com/1hjl1Umcup— DogeDesigner (@cb_doge) April 1, 2025 -
అమెరికాలోనే చనిపోతా: ఎలాన్ మస్క్
విస్కాన్సిన్: టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ అమెరికా పట్ల తన తిరుగులేని నిబద్ధతను ప్రకటించారు. ‘నేను ఎక్కడికీ వెళ్లను. అమెరికాలోనే ఉంటా. ఇక్కడే చచ్చిపోతా. అంగారక గ్రహం మీదికి నేను వెళ్లినా అది కూడా అమెరికాలో భాగంగానే ఉండిపోతుంది’అంటూ ఆదివారం విస్కాన్సిన్ టౌన్హాల్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మస్క్ ఇద్దరు విస్కాన్సిన్ ఓటర్లకు పది లక్షల విలువైన చెక్కులను అందజేశారు. తన రాజకీయ గ్రూపునకు వీరిద్దరినీ ప్రతినిధులుగా ప్రకటించారు. త్వరలో జరగనున్న విస్కాన్సిన్ సుప్రీంకోర్టు ఎన్నికలు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అజెండాకు, నాగరికత భవిష్యత్తుకు కీలకమైనవని పేర్కొన్నార -
డోజ్‌కు త్వరలో మస్క్ గుడ్‌బై?
వాషింగ్టన్: అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ (డోజ్) సారథ్య పదవికి ఎలాన్ మస్క్ రాజీనామా చేయబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని మస్క్ స్వయంగా వెల్లడించారు. ఫాక్స్ న్యూస్ వార్తాసంస్థకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను ప్రస్తావిస్తూ డోజ్‌కు వీడ్కోలు పలకబోతున్న అంశాన్ని కూడా పేర్కొన్నారు. ఆయన ఇప్పటికే డోజ్ బృందంలోని కీలకమైన ఏడుగురు సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమై సంస్థ తదుపరి కార్యాచరణపై చర్చించారు. ఆరామ్ మొఘాద్దాషీ, స్టీవ్ డేవిడ్, బ్రాడ్ స్మిత్, ఆంటోనీ ఆర్మ్‌స్ట్రాంగ్, జోయీ గిబ్బియా, టోమ్ క్రాస్, టైలర్ హసేన్లతో మస్క్ సమావేశమయ్యారు. వివాదాస్పద నిర్ణయాలతో వరసబెట్టి కార్యనిర్వాహక ఉత్తర్వులిస్తున్న డొనాల్డ్ ట్రంప్‌కు కుడిభుజంగా వేలమంది కేంద్ర ప్రభుత్వోద్యోగులను మస్క్ సాగనంపడం, వేలకోట్ల విలువైన ప్రభుత్వ ఒప్పందాలు, కాంట్రాక్టులను రద్దుచేయడం తెలిసిందే. దాంతో ఆయన తప్పుకున్నాక డోజ్ విభాగం ఉంటుందా, ఉంటే నూతన సారథి ఎవరంటూ చర్చ మొదలైంది. సొంత సమస్యలను పరిష్కరించుకునేందుకే మస్క్ ఇలా హడావుడిగా డోజ్ నుంచి వైదొలగుతున్నారని విమర్శలు వస్తున్నాయి. ఆయన టెస్లా కంపెనీ కార్ల పనితీరు, సంస్థలో శ్వేతజాతీయేతర ఉద్యోగుల పట్ల వివక్ష, భాగస్వాముల విభేదాలు, వినియోగదారుల ఫిర్యాదుల వంటి సమస్యలతో మస్క్ సతమతమవుతున్నారు. ట్రంప్ నిర్దేశించిన లక్ష్యాన్ని దాదాపు చేరుకున్నాకే డోజ్ నుంచి నిష్క్రమించబోతున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ‘‘అమెరికా ఆర్థిక భారాన్ని కనీసం ట్రిలియన్ డాలర్ల మేర తగ్గించాలన్న లక్ష్యం దాదాపు సాధించాం’’అని చెప్పారు. -
మస్క్ కీలక నిర్ణయం.. ఏఐ స్టార్టప్‌కు X అమ్మకం!
టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్‌ఫారమ్ Xను అమ్మకానికి ఉంచారు. అయితే ఆ కొనుగోలు చేస్తున్న కంపెనీ కూడా ఆయనదే కావడం గమనార్హం. మస్క్ ఆధీనంలోని కంపెనీలలో ఒకటైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ 'ఎక్స్ఏఐ'.. సోషల్ మీడియా దిగ్గజం ఎక్స్ ప్లాట్‌ఫారమ్‌ను సొంతం చేసుకుంది. రెండు కంపెనీలు ఏకీకృతమైనట్లు.. మస్క్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.రెండు సంవత్సరాల క్రితం స్థాపించినప్పటి నుంచి.. xAI వేగంగా ప్రపంచంలోని ప్రముఖ AIలలో ఒకటిగా మారింది. X అనేది సోషల్ మీడియా దిగ్గజం. ఇక్కడ 600 మిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు ఉన్నారు. ఇది కూడా ప్రపంచంలోని అత్యంత సమర్థవంతమైన కంపెనీలలో ఒకటిగా రూపాంతరం చెందింది. కాగా ఇప్పడు ఈ సంస్థను ఎక్స్ఏఐ సొంతం చేసుకుంది. ఎక్స్ఏఐ, ఎక్స్ భవిష్యత్తులు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయని మస్క్ పేర్కొన్నారు.ఎక్స్ఏఐ, ఎక్స్ కలయిక ఏఐ సామర్థ్యం పెంపొందించడానికి దోహదపడుతుంది. వినియోపగదారులకు గొప్ప అనుభవాలను అందించడానికి సంస్థ కృషి చేస్తోందని మస్క్ అన్నారు. ఇది ప్రపంచాన్ని ప్రతిబింబించడమే కాకుండా మానవ పురోగతిని కూడా వేగవంతం చేయడానికి ఉపయోగపడే వేదికను నిర్మించడానికి వీలు కల్పిస్తుందని వెల్లడించారు.ఈ కంపెనీలు అన్నీ స్టాక్‌లతో కూడిన ఒప్పందంలో విలీనం చేయబడుతున్నాయి. ఎక్స్ఏఐ విలువ 80 బిలియన్ డాలర్లు కాగా.. ఎక్స్ విలువ 33 బిలియన్ డాలర్లు. రెండు కంపెనీ కలయికతో 113 బిలియన్ డాలర్ల సంస్థ అవతరించింది.ఇదీ చదవండి: పోస్టాఫీస్ పథకాల వడ్డీ రేట్లు ప్రకటించిన కేంద్రంనిజానికి 2022 చివరలో మస్క్ ట్విట్టర్‌ను 44 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన లావాదేవీల్లో అప్పు కూడా ఉందని తెలుస్తోంది. ఆ మరుసటి సంవత్సరమే ఎక్స్ఏఐ ప్రారంభమైంది. ఇప్పుడు ఏఐలో ఆధిపత్యాన్ని చెలాయించడాన్ని ఎలాన్ మస్క్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు.@xAI has acquired @X in an all-stock transaction. The combination values xAI at $80 billion and X at $33 billion ($45B less $12B debt). Since its founding two years ago, xAI has rapidly become one of the leading AI labs in the world, building models and data centers at…— Elon Musk (@elonmusk) March 28, 2025 -
మస్క్ జాబ్ ఆఫర్.. వేతనం ఎంతంటే..
ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలోని ఎక్స్ఏఐ చాట్‌బాట్ గ్రోక్ అభివృద్ధికి, దాని విశ్వసనీయతను పెంచడానికి ప్రతిభావంతులైన బ్యాకెండ్ ఇంజినీర్ల కోసం చూస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈమేరకు వివిధ సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులు, ఉద్యోగ పోస్టింగ్ వివరాలు ఓపెన్ఎఐ చాట్‌జీపీటీ, గూగుల్ జెమినితో పోటీపడటానికి మెరుగైన కృత్రిమ మేధను నిర్మించాలని ఎక్స్ చేస్తున్న ప్రయత్నాలను హైలైట్ చేస్తుంది.ఎక్స్ఏఐ సహ వ్యవస్థాపకుడు, టెక్ ఇంజినీర్ ఇగోర్ బాబుష్కిన్ ఇటీవల షేర్ చేసిన ఒక పోస్ట్‌లో ‘గ్రోక్ పనితీరును మెరుగ్గా, మరింత విశ్వసించేదిగా మార్చేందుకు సహాయపడటానికి అద్భుతమైన బ్యాకెండ్ ఇంజినీర్లు కావాలి’ అని పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అభివృద్ధికి ఎక్స్ఏఐ ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తుందని చెప్పిన మస్క్..‘రాజకీయంగా సరైనదైనా.. కాకపోయినా నిజంపైనే దృష్టి సారించిన ఏకైక ప్రధాన ఏఐ కంపెనీ ఎక్స్ఏఐ. సత్యానికి కట్టుబడి ఉండటమే సురక్షితమైన కృత్రిమ మేధను నిర్మించడానికి ఏకైక మార్గం’ అన్నారు.బ్యాకెండ్ ఇంజినీర్ ఏం చేస్తారు..?కంపెనీ ఉత్పత్తి సేవల పనితీరును నిర్వహించాలి. ప్రొడక్ట్, రీసెర్చ్ టీమ్‌లు సృజనాత్మక ఏఐ ఉత్పత్తులు, మోడళ్లను తయారు చేసేందుకు సాంకేతికంగా వీలుకల్పించాలి. అధిక పనితీరు కలిగిన మైక్రోసర్వీసెస్ రూపొందించాలి. కోడింగ్, నిర్వహణ, ఉత్పత్తి, పరిశోధన బృందాలతో సహకరించాలి. బ్యాకెండ్ సమస్యలను పరిష్కరించాలి.ఇదీ చదవండి: మెసేజ్ స్క్రోల్ చేస్తే జాబ్ పోయింది!వేతనం ఎంతంటే..ఈ ఇంటర్వ్యూ ప్రక్రియలో రెజ్యూమె సబ్మిట్ చేయడంతోపాటు 15 నిమిషాల ఫోన్ ఇంటర్వ్యూ, కోడింగ్ అసెస్మెంట్, సిస్టమ్స్ హ్యాండ్-ఆన్, ప్రాజెక్ట్ డీప్-డైవ్, టీమ్ మీట్ ఉంటుంది. తదుపరి టెక్నికల్ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగానికి వార్షిక వేతన శ్రేణి 1,80,000 డాలర్లు (రూ.1.54 కోట్లు) నుంచి 4,40,000 డాలర్లు(రూ.3.77 కోట్లు) ఉంటుందని అంచనా. ఇది ఉద్యోగార్థుల నైపుణ్యాలను అనుసరించి మారే అవకాశం ఉంటుంది. -
మరిన్ని ప్రయోగాలకు మార్గదర్శనం!
తొమ్మిది నెలల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. ఎట్టకేలకు భారతీయ సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్లు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి మళ్లీ భూమ్మీదకు చేరారు. చాలామంది సునీత, విల్మోర్లు ఐఎస్ఎస్లో ఇరుక్కుపోయారని అన్నారు. ఈ వర్ణన అంత సరైంది కాదు. ఐఎస్ఎస్లో దీర్ఘకాలం ఉండటం ఇదే మొదటిసారి కాదు. సుమారు పాతికేళ్లుగా మనుగడలో ఉన్న ఐఎస్ఎస్లో నిత్యం యూఎస్, రష్యా, యూరప్, జపాన్ వ్యోమగాములు ఉంటూనే ఉన్నారు. ఒక్కొక్కరి కాలావధి వేర్వేరుగా ఉండవచ్చు. కనీసం 4 నుంచి 8 మంది వ్యోమగాములు జీవశాస్త్ర, బయోమెడికల్, మొక్కలకు సంబంధించిన ప్రయోగాలు చేస్తూ వచ్చారు. గత వారం కొద్ది కాలమైనా సరే... దాదాపు 11 మంది వ్యోమగాములు ఐఎస్ఎస్లో గడిపారు. పరిశోధనలు చేయడంతోపాటు ఉపగ్రహాలను ప్రయోగించడం, ఐఎస్ఎస్ నిర్వహణ పనులు చేశారు వీరందరూ! స్పేస్ వాక్స్ ద్వారా ఐఎస్ఎస్ వెలుపల ఉండే రోబో చేతుల మర మ్మతులు కూడా ఉన్నాయి ఈ పనుల్లో! వ్యోమగాములు నిత్యం ఐఎస్ఎస్లో ఉంటారు కాబట్టి వారికి ఆహారం, ఇతర సరుకుల రవాణా ఎప్పటికప్పుడు జరిగింది. అంతరిక్ష కేంద్రంలో సునీత, విల్మోర్లు 286 రోజుల పాటు ఉండటం చాలా ఎక్కువ అనిపిస్తుంది కానీ... కొత్త కాదు. ఫ్రాంక్ రూబియో విషయాన్నే తీసుకుంటే... 2023 సెప్టెంబరులో ఆయన 371 రోజులపాటు అంతరిక్ష కేంద్రంలో ఉండి రికార్డు సష్టించారు. ఈ క్రమంలో ఆయన 2022లో మార్క్ వెండే హే 355 రోజుల రికార్డును బద్దలు కొట్టారు. అయినప్పటికీ సోవియట్ యూనియన్ కాస్మోనాట్ల రికార్డులతో పోలిస్తే ఇవి తక్కువ. సోవియట్ యూనియన్ ప్రయోగించిన ‘మిర్’ అంతరిక్ష కేంద్రమే... కాలక్రమంలో ఇతర దేశాల భాగస్వామ్యంతో ఐఎస్‌ఎస్‌గా రూపాంతరం చెందిన విషయం ఇక్కడ ప్రస్తావనార్హం. భౌతిక శాస్త్రవేత్త, కాస్మోనాట్... వలేరీ పోల్యాకోవ్ 1994–95లో ఎకాయెకిన సుమారు 437 రోజులపాటు మిర్ స్టేషన్లో గడిపారు. ప్రస్తుతం చైనా సిద్ధం చేసిన అంతరిక్ష కేంద్రం టియాన్ గాంగ్‌లో ముగ్గురు వ్యోమగాములు 139 రోజులుగా ఉంటు న్నారు. వీరిలో కాయ్ షూజీకి అంతరిక్షంలో 320 రోజులు గడిపిన అనుభవం ఉంది. లక్ష్యాల్లో ఒకటి అదే...అంతరిక్ష కేంద్రం ఏర్పాటు లక్ష్యాల్లో ఒకటి– దీర్ఘకాలం అంతరిక్షంలో గడపడం. గురుత్వాకర్షణ శక్తి తక్కువగా ఉన్న పరిస్థితుల్లో ఎక్కువ సమయం గడిపితే మనకేం అవుతుందన్న విషయాన్ని అర్థం చేసుకునేందుకు ఇది ఉపయోగపడుతుంది. ఇలా ఎక్కువ కాలం అక్కడ గడిపినప్పుడు ఎముకలు, కండరాలు బలహీనపడతాయన్న విషయం మాత్రం ఆందోళన కలిగించే వ్యవహారమే. 1970లలో శాల్యూట్, స్కైల్యాబ్లతో ప్రయోగాలు మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ ఈ అంశాలకు సంబంధించి బోలెడంత సమాచారం సేకరించారు. బయో మెడికల్ సమాచా రాన్ని సేకరించడమే లక్ష్యంగా పలు పరిశోధనలు జరిగాయి. ఉదాహరణకు ప్రస్తుత అంతరిక్ష యాత్రలో విల్మోర్ సైక్లింగ్, రోయింగ్, రెసిస్టెన్స్ వ్యాయామాలను కలిపి చేయగల ఒక పరికరాన్ని ఐఎస్ఎస్లో ఏర్పాటు చేయడానికి సాయ పడ్డారు. ఎక్కువ సమయం ఇక్కడ గడపాల్సిన వ్యోమ గాములు ఈ పరికరం ద్వారా వ్యాయామాలు చేస్తే కండ రాలు, ఎముకలు మరీ గుల్లబారకుండా ఉంటాయి. గుండెకూ మేలవుతుంది. గుండె కొట్టుకునే వేగం, శ్వాస, రక్త పోటు వంటి... గుండె–రక్తనాళాలకు సంబంధించిన డేటాను సేకరించడానికీ, ఉష్ణోగ్రతలను వ్యోమగాములు వేసుకునే దుస్తుల్లో ఉంచిన సెన్సార్ల ద్వారా రాబట్టేందుకూ ఉద్దేశించిన ప్రయోగం కూడా జరిగింది. భవిష్యత్తులో మనిషి జాబిల్లిపై, అంగారకుడిపై నివసించాల్సి వస్తే... ఆరోగ్యాన్ని కాపాడుకోవడం వారి పరమావధిగా ఉండనుంది. 1970, 1980లలో సోవియట్ యూనియన్ , అమెరికన్ల అంతరిక్ష కేంద్రాల అనుభవం తరువాత ఇది చాలా ఖరీదైన వ్యవహారమని వారికి అర్థమైంది. ఈ కారణంగానే ఐఎస్ఎస్ నిర్మాణం, నిర్వహణ రెండింటినీ అంతర్జాతీయ స్థాయికి చేర్చి పలు దేశాలు పాల్గొనేలా చేశారు. నాసా, కెనడా స్పేస్ ఏజెన్సీ, యూరోపియన్ ఏజెన్సీ, జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ ప్లొరేషన్ ఏజెన్సీ, రాస్కోమాస్లు ఐఎస్ఎస్ నిర్వహణ బాధ్యతలు చేపట్టాయి. ఆయా ఏజెన్సీలు అందించిన పరిక రాల నిర్వహణ బాధ్యత వారిదే. 2000వ సంవత్సరం నుంచి ఇప్పటి వరకూ అరవై ప్రయోగాల ద్వారా ఐఎస్ ఎస్‌ను 21 దేశాలకు చెందిన 260 మంది వ్యోమగాములు సందర్శించారు. భారత్ వ్యోమగామి శుభాంశు శుక్లా కూడా త్వరలోనే ఐఎస్ఎస్కు వెళ్లనున్నారు. ఐఎస్ఎస్ 2030 వరకూ పని చేయనుంది. చైనా ఇప్పటికే ఒక అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోగా... 2035 నాటికి ఒక కేంద్ర నిర్మాణానికి భారత్ ప్రయత్నిస్తోంది. ప్రచ్ఛన్న యుద్ధ కాలంలో మొదలైన అంతరిక్ష కేంద్రం ఏర్పాటు ఆలోచన ఈ అంతర్జాతీయ ప్రాజెక్టు! అంతరిక్ష ప్రయోగాల విషయంలో అమెరికా ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమవుతోంది. ప్రైవేట్ కంపెనీల ఆధ్వర్యంలోనే ప్రయోగాలు జరగనున్నాయి. స్పేస్ ఎక్స్, బోయింగ్ వంటివి సరుకు రవాణా కోసం ప్రత్యే కమైన నౌకలను సిద్ధం చేయనున్నాయి. నాసాతో కలిసి పని చేస్తున్న ఈ రెండు సంస్థలూ ఐఎస్ఎస్ నిర్వహణతోపాటు జాబిల్లి, అంగారకుడిపైకి చేరే ప్రయత్నాలు చేస్తున్నాయి. స్పేస్ ఎక్స్ అధిపతి ఎలాన్ మస్క్ ప్రస్తుత ట్రంప్ ప్రభుత్వంలో కీలకమైన వ్యక్తిగా మారిన నేపథ్యంలో బిలియనీర్ జేర్డ్ ఐసాక్‌మాన్ నాసా అధ్యక్షుడు అయ్యే పరిస్థితుల్లో ప్రైవేట్ కంపెనీలు అంతరిక్ష ప్రయోగాల్లో మరింత ఎక్కు వగా పాల్గొనే అవకాశాలున్నాయి. వీరందరూ సునీత, విల్మోర్ల అనుభవం నుంచి లబ్ధి పొందనున్నారు. దినేశ్ సి. శర్మ వ్యాసకర్త సైన్స్ వ్యవహారాల వ్యాఖ్యాత(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ట్విట్టర్ పిట్టకు రూ.30 లక్షలు!
సామాజిక మాధ్యమం ట్విట్టర్ లోగో బ్లూబర్డ్ గుర్తుంది కదా. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ ఆ సంస్థను కొనుగోలు చేశాక ఎక్స్‌గా పేరు మార్చినా ఇంకా అంతా ట్విట్టర్ అనే పిలుస్తారంటే దాని ప్రభావం అర్థం చేసుకోవచ్చు! ట్విట్టర్ కార్యాలయంపై 2012 నుంచి 2023 వరకూ సగర్వంగా వేలాడిన బ్లూ బర్డ్ లోగో తాజా వేలంలో రూ.30లక్షలకు అమ్ముడు పోయింది. 560 పౌండ్ల బరువున్న ఈ లోగోను ఓ అజ్ఞాత వ్యక్తి కొనుగోలు చేశాడు. మస్క్ 2022లో ట్విట్టర్‌ను టేకోవర్ చేయగానే శాన్ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయం నుంచి ట్విట్టర్ ఐకానిక్ బ్లూ బర్డ్‌ను తొలగించడం తెలిసిందే. ప్రధాన కార్యాలయాన్ని కూడా టెక్సాస్‌కు మార్చారు. ట్విట్టర్‌కు సంబంధించిన వస్తువులు, ఆఫీస్ ఫర్నిచర్‌తో పాటు లోగోను కూడా 2023 ఆగస్టులో మస్క్ వేలం వేశారు. అప్పుడు దాన్ని దక్కించుకున్న ఆర్ఆర్ సంస్థ తాజాగా తిరిగి వేలం వేసింది. -
అమిత్ షా (హోం మినిస్టర్) రాయని డైరీ
‘‘నన్ను దీవించండి మోదీజీ’’ అన్నాను తలను కాస్త వంచి, చేతులు జోడించి. మోదీజీ నన్ను వెంటనే దీవించలేదు.‘‘ముఖంలో ఏమిటా అలసట, నుదుటిపై ఏమిటా చెమట?’’ అని అడిగారు!‘‘బస్తర్ నుంచి వస్తున్నాను మోదీజీ. నన్ను దీవించండి’’ అన్నాను. ‘‘తొందరేమొచ్చింది అమిత్ జీ? చేతులు, ముఖం కడుక్కుని, బట్టలు మార్చుకున్నాకే రావలసింది కదా’’ అన్నారు.ఇంకా వగరుస్తూనే ఉన్నాన్నేను.‘‘ఈసారి 30 మోదీజీ. జనవరిలో 48, ఫిబ్రవరిలో 40. మొత్తం కలిపి ఈ 80 రోజుల్లో 120. బస్తర్ నుంచి ఇంటికి వెళ్లకుండా నేరుగా మీ దగ్గరకే వచ్చేశాను. నన్ను దీవించండి మోదీజీ’’ అన్నాను.మోదీజీ నన్ను దీవించలేదు!‘‘30+48+40 = 118 కదా అమిత్ జీ, 120 ఏమిటి? రౌండ్ ఫిగర్ కోసం రెండు కలిపారా?’’ అన్నారు.‘‘లేదు మోదీజీ, రౌండ్ ఫిగర్ కోసం కలపలేదు. ఏమంత పెద్ద ఫిగర్ కాదు కదా అని కలపలేదు. 30కి 48కి మధ్యలోనో, 48కి 40కి మధ్యలోనో ఆ 2 ఎక్కడో ఉండి ఉంటుంది. చూసి చెబుతాను’’ అన్నాను.‘‘చూసి చెప్పటం కాదు అమిత్ జీ. చూశాకే చెప్పాలి. లేకుంటే ‘గ్రోక్’కి, మనకు తేడా ఉండదు. గ్రోక్ బుర్ర పెట్టి చెప్పదు. బుర్రలో పెట్టిన దాన్ని బట్టి చెబుతుంది’’ అన్నారు మోదీజీ.ఆయన ‘గ్రోక్’ని అంటున్నారా, నన్ను అంటున్నారా అర్థం కాలేదు. బహుశా ఇద్దర్నీ కలిపి కావచ్చు. ‘‘నిజమే మోదీజీ. గ్రోక్ బుర్ర పెట్టి చెప్పదు. బుర్రలో ఏది పెడితే అది చెబుతుంది’’ అన్నాను. అందుకు ఆయనేమీ సంతోషించలేదు. ‘‘బుర్రలో ఏం పెట్టారన్నది కాదు అమిత్జీ, బుర్రలో ఎవరు పెట్టారన్నది పాయింట్’’ అన్నారు.ఆయన ఆవేదనలో అర్థం ఉంది.మోదీజీ గురించి గ్రోక్ ఒక్క మంచి విషయం కూడా చెప్పటం లేదు. ఆయన్ని మతవాది అంటోంది. ఆయనవన్నీ మత వ్యూహాలు అంటోంది. ‘‘గ్రోక్లో ఒకటి గమనించారా అమిత్జీ?’’ అని అడిగారు మోదీజీ.‘‘గమనించాను మోదీజీ! మీ గురించి ఏం చెబితే విమ్మల్ని ద్వేషించేవారు సంతోష పడ తారో అది మాత్రమే చెప్పి గ్రోక్ వారిని సంతోష పెడుతోంది. అలాగే, మీ గురించి ఏం అడిగితే తమను సంతోషపెట్టే సమాధానాలను గ్రోక్ చెబుతుందో ఆ ప్రశ్నల్నే గ్రోక్‌ను వాళ్లు అడుగుతున్నారు’’ అన్నాను.‘‘మీరు కొట్టి చూశారా గ్రోక్లో నా గురించి?’’ అని హఠాత్తుగా అడిగారు మోదీజీ.‘‘చూశాను మోదీజీ. మీ గురించి గొప్పగా చెప్పింది. ‘స్ట్రాంగ్ లీడర్షిప్, విజన్ ఫర్ డెవలప్మెంట్, కమిట్మెంట్ టు నేషనలిజం’’ అని చాలా చాలా చెప్పింది’’ అన్నాను.‘‘అదెలా అమిత్ జీ! గ్రోక్‌కి ఇచ్చిన ఫీడ్ ఒకటే అయినప్పుడు వాళ్లకు ఒకలా, మీకు మరొకలా గ్రోక్ నా గురించి చెప్పటం ఏమిటి?’’ అని అడిగారు మోదీజీ.‘‘నమ్మించటం కోసం ఫీడ్‌లో రెండూ ఉంచుతారు మోదీజీ. ‘గ్రోక్’ ఎలాన్ మస్క్‌ది కదా! అయినా సరే, అమెరికాలో అత్యంత దుష్టుడైన మానవుడు ఎవరో గ్రోక్‌ని అడిగి చూడండి. ఎలాన్ మస్క్ అని చెబుతుంది. అదెలా ఉంటుందంటే... బస్తర్‌లో రెండో వైపు కూడా ఒకటో రెండో ఉంటాయి కదా, అలాగ’’ అన్నాను.బస్తర్ అనగానే మోదీజీ మళ్లీ మూడ్ ఆఫ్ లోకి వెళ్లిపోయారు. ‘‘బుర్రల్ని పాడుచేసేవారు బస్తర్ లోపల మాత్రమే ఉంటారని నేను అనుకోను అమిత్ భాయ్’’ అన్నారు.ఎంతో లోన్లీగా ఫీల్ అయితే తప్ప మోదీజీ అలా నన్ను అమిత్ ‘భాయ్’ అనరు. ‘‘చేస్తాను మోదీజీ, అదంతా సెట్ చేస్తాను. నన్ను దీవించండి’’ అన్నాను తలను కాస్త వంచి, చేతులు జోడిస్తూ. -
గ్రోక్ వివాదం: స్పందించిన మస్క్
సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు 'గ్రోక్'. యూజర్లను తిడుతూ.. అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ ఎంతోమందిని ఆకర్షించిన ఈ ఏఐ చాట్‌బాట్ ఒక వినియోగదారునికి ప్రత్యుత్తరం ఇస్తూ హిందీలో అసభ్య పదాలను ఉపయోగించడం ద్వారా భారతదేశ డిజిటల్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది.ప్రశ్న ఏదైనా, హాస్యాస్పదమైన సమాధానాల కోసం అసభ్య పదాలను వినియోగిస్తున్న గ్రోక్.. రాజకీయాలు, రాజకీయ వ్యక్తులు, క్రికెట్, గాసిప్, బాలీవుడ్‌తో సహా ప్రతి ప్రశ్నకు సమాధానం ఇవ్వడం ప్రారంభించింది. దీంతో వివాదం ముదిరింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎలాన్ మస్క్ గ్రోక్ భారతదేశంలో సెన్సేషన్ సృష్టిస్తోంది అని బీబీసీ పేర్కొంది. దీనిపై మస్క్ స్పందిస్తూ.. బిగ్గరగా నవ్వుతున్న ఒక ఎమోజీ యాడ్ చేశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు.😂 https://t.co/ohTbryUCIN— Elon Musk (@elonmusk) March 22, 2025గ్రోక్‌పై ప్రభుత్వం సీరియస్అసభ్య పదజాలంతో వినియోగదారులకు సమాచారం అందిస్తున్న.. గ్రోక్‌పై కేంద్రం సీరియస్ అయింది. దీంతో రెచ్చగొట్టే తరహా సమాచారాన్ని గ్రోక్ యూజర్లకు ఎందుకు అందిస్తోందంటూ ఎక్స్‌ను తాజాగా కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వశాఖ ఆరా తీసింది. మరీ ముఖ్యంగా హిందీ భాషను అలా దుర్వినియోగపరుస్తోందని అడిగింది. అయితే.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, తమ వివరణకు కొంత సమయం ఇవ్వాలని అవతలి నుంచి సమాధానం వచ్చినట్లు సమాచారం. ఆ వివరణ ఆధారంగా.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు చేపట్టాలని హెచ్చరించి సరిపెట్టడమా? లేదంటే చర్యలు తీసుకోవడమా? ఉంటుందని మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: వేలకోట్ల సంపదకు యువరాణి.. స్టార్ హీరోయిన్ కూతురు.. ఎవరో తెలుసా? -
‘ట్విటర్ పిట్ట’ వేలం.. భారీ ధర పలికిన లోగో
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విటర్(ప్రస్తుతం ‘ఎక్స్’).. ఈ పేరు వినగానే మొదటి గుర్తుకొచ్చేంది దాని ఫేమస్ బర్డ్ లోగో. అదేనండి ‘ట్విటర్ పిట్ట’. ట్విటర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత దాని పేరును ‘ఎక్స్’గా మార్చి శాన్ ఫ్రాన్సిస్కో ప్రధాన కార్యాలయం నుంచి పాత బర్డ్ లోగోను తొలగించారు. ఇప్పుడా బర్డ్ లోగోను వేలానికి ఉంచగా భారీ ధర పలికింది.ట్విటర్ బర్డ్ లోగోను ఆర్ఆర్ ఆక్షన్ అనే సంస్థ ద్వారా వేలంలో అమ్మకానికి పెట్టారు. ఈ వేలంలో 34,375 డాలర్లకు (భారతీయ కరెన్సీలో సుమారు రూ.30 లక్షలు) అజ్ఞాత వ్యక్తి దీన్ని కొనుగోలు చేశారు. 12 అడుగులు 9 అడుగులు (3.7 మీటర్లు 2.7 మీటర్లు) కొలతలు, 560 పౌండ్ల (254 కిలోలు) బరువు ఉన్న ఈ బర్డ్ లోగో 34,375 డాలర్లకు అమ్ముడుపోయిందని ఆర్ఆర్ ఆక్షన్ తెలిపింది. అయితే కొన్నదెవరనేది మాత్రం వెల్లడించలేదు.ట్విటర్‌ను 2022లో టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కొనుగోలు చేశారు. దీని కోసం ఆయన 44 బిలియన్ డాలర్లు చెల్లించారు. అయితే, కొనుగోలు తర్వాత ప్రకటనలను నిలుపుకోవడంలో ట్విటర్ ఇబ్బందులను ఎదుర్కొంది. దీంతో ఇందులో ఫిడిలిటీ ఇన్వెస్ట్మెంట్లతో సహా ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను గణనీయంగా వెనక్కితీసుకున్నారు. ట్విటర్‌ను 'ఎవ్రీథింగ్ యాప్'గా మార్చాలన్న లక్ష్యంతో దీన్ని ఆయన ‘ఎక్స్’గా మార్చేశారు.ట్విటర్‌ను ‘ఎక్స్’గా మార్చేసిన తర్వాత పాత లోగోలు, జ్ఞాపికలు, ఆఫీస్ ఫర్నిచర్, కిచెన్వేర్ వంటి పలు వస్తువులను మస్క్ ఇప్పటికే వేలంలో విక్రయించేశారు. ఇలా వేలంలో భారీ ధరలు పలికిన ఇతర టెక్ వస్తువులలో యాపిల్ కంప్యూటర్ సంస్థకు చెందిన పలు వస్తువులు ఉన్నాయి. వీటిలో యాక్సెసరీస్ తో కూడిన యాపిల్ -1 కంప్యూటర్ 3,75,000 డాలర్లు, 1976 లో స్టీవ్ జాబ్స్ సంతకం చేసిన చెక్కు 1,12,054 డాలర్లు, మొదటి తరం 4 జీబీ ఐఫోన్ 87,514 డాలర్లు ధర పలికాయి. -
ట్రంప్ హెచ్చరిక.. వారందరికీ 20 ఏళ్ల జైలు శిక్ష తప్పదు..
సియాటెల్: అమెరికాలో ప్రముక కుబేరుడు ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని టెస్లా విద్యుత్ కార్ల సంస్థకు చెందిన ఆస్తులపై దాడులు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో దాడులు చేసే వారికి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. టెస్లాపై దాడులు చేస్తే 20 ఏళ్ల జైలు విధిస్తామని హెచ్చరికలు జారీ చేశారు.అధ్యక్షుడు ట్రంప్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న ఎలాన్ మస్క్ యాజమాన్యంలోని టెస్లా కార్ల సంస్థకు చెందిన ఆస్తులపై దాడులు పెరిగిపోతున్నాయి. అమెరికా, ఇతర దేశాల్లో టెస్లా షోరూమ్‌లు, విద్యుత్ చార్జింగ్ స్టేషన్లతోపాటు కార్లపైనా ఇటీవల దాడులు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ కీలక ఆదేశాలు జారీ చేశారు. టెస్లా కార్లపై దాడికి పాల్పడేవారికి 20 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. అలాగే, దాడులను ప్రోత్సహిస్తున్న వారికి కూడా శిక్ష తప్పదని హెచ్చరించారు. టెస్లాపై దాడులకు దిగేవారు నరకాన్ని అనుభవించబోతున్నారని వార్నింగ్ ఇచ్చారు.ఇదిలా ఉండగా.. బిలియనీర్ ఎలాన్ మస్క్‌ను ప్రభుత్వ సామర్థ్య పెంపుదల విభాగం (డోజ్) అధినేతగా ట్రంప్ నియమించినప్పటి నుంచీ టెస్లాపై దాడులు బాగా పెరిగిపోయాయి. ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించాలన్న మస్క్ సలహా మేరకు ట్రంప్ ప్రభుత్వం ఎందరో ప్రభుత్వోద్యోగులకు ఉద్వాసన పలకడంతోపాటు అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే. మస్క్ విధానాలను వ్యతిరేకిస్తున్న వారు.. ఉత్తర అమెరికా, యూరప్‌లలోని ఆయన కార్యాలయాలు, ఫ్యాక్టరీల ఎదుట ఆందోళనలు నిర్వహించారు. మస్క్‌తో విభేదిస్తున్న పలువురు సెనేటర్లు వారికి మద్దతు పలికారు. తాము టెస్లా కార్లను అమ్మేస్తామని తెలిపారు.Donald Trump about Tesla sabotaging$tsla pic.twitter.com/mJs1mhQVHs— Investors Guide To The Galaxy (@Alex_Ionescu) March 21, 2025 మార్చి 6వ తేదీన ఒరెగాన్(Oregon) పోర్ట్లాండ్ సబర్బ్ అయిన టిగార్డ్లోని టెస్లా డీలర్‌షిప్‌పై కాల్పులు జరిగాయి. ఈ దాడిలో పలు ఈవీ వాహనాలు ధ్వంసం అయ్యాయి.కొలరాడో లవ్ల్యాండ్లోని షోరూమ్‌ను ఓ మహిళ ధ్వంసం చేసింది. ఆపై మస్క్ వ్యతిరేక రాతలు రాసి.. బొమ్మలు గీసిందిబోస్టన్లోని టెస్లా ఛార్జింగ్ స్టేషన్‌కు దుండగుల నిప్పుసియాటెల్లో టెస్లా వాహనాలకు మంట పెట్టిన ఆగంతకులువాషింగ్టన్ లీన్‌వుడ్‌లో టెస్లా సైబర్ ట్రక్కులపై స్వస్తిక్ గుర్తులతో పాటు మస్క్ వ్యతిరేక రాతలుమార్చి 13వ తేదీన.. ఒరెగాన్ టిగార్డ్ షోరూంపై మరోసారి కాల్పులు.. షోరూం ధ్వంసంవారం వ్యవధిలో రెండుసార్లు ఒరెగాన్ షోరూంపై దాడి జరిగింది. దీంతో ఎఫ్‌బీఐ, ఇతర దర్యాప్తు సంస్థల సమన్వయంతో పని చేస్తామని పోలీసులు ప్రకటించారు."It's very clear that the Democrat Party no longer stands for anything. They only stand against Donald Trump, even if it means contradicting themselves."As attacks on Tesla continue, White House press secretary Karoline Leavitt calls out the hypocrisy of Democrats pic.twitter.com/7mArI0UEfq— Oscar Lewis (@lewis_osca44575) March 21, 2025 -
భారత్‌పై ‘ఎక్స్’ పిటిషన్
బెంగళూరు: చట్ట వ్యతిరేక కంటెంట్, సెన్సార్ షిప్ పేరుతో భారత ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందంటూ ఎలాన్ మస్క్‌కు చెందిన ‘ఎక్స్’ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేసింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టానికి ముఖ్యంగా సెక్షన్ 79(3)(బీ) విషయంలో 2015 నాటి శ్రేయా సంఘాల్ కేసులో సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తోందని, ఆన్లైన్లో భావ ప్రకటన స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తోందని ఆరోపించింది. జ్యుడీషియల్ ప్రక్రియకు లోబడి కంటెంట్‌ను బ్లాక్ చేయడం లేదా సెక్షన్ 69 ఏ ప్రకారం చట్ట ప్రకారం చర్య తీసుకోవాలన్న నిబంధనలను భారత ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పిటిషన్లో పేర్కొంది.కాగా, ప్రభుత్వ నోటిఫికేషన్ లేదా కోర్టు ఉత్తర్వుతో అక్రమ కంటెంట్‌ను ఆన్లైన్ వేదికలు తొలగించడం తప్పనిసరని ఐటీ చట్టంలోని 79(3)(బీ) చెబుతోంది. 36 గంటల్లోగా ఆ విధంగా చేయకుంటే, సంబంధిత వేదికలకు సెక్షన్ 79(1) ప్రకారం రక్షణలను కోల్పోతుంది. ఐపీసీ తదితర చట్టాల ప్రకారం ఆ వేదికలపై చర్యలు తీసుకునే అవకాశమేర్పడుతుంది. అయితే, ఈ నిబంధనను వాడుకుంటూ స్వతంత్రంగా కంటెంట్‌ను బ్లాక్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదన్నది ఎక్స్ వాదన.తగు ప్రక్రియను అనుసరించకుండా అధికారులు ఏకపక్షంగా కంటెంట్ సెన్సార్ షిప్ విధిస్తూ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తోంది. అదేవిధంగా, సామాజిక మాధ్యమ వేదికలు, పోలీసులు, దర్యాప్తు విభాగాల మధ్య సమన్వయం కోసం హోం శాఖ పర్యవేక్షణలో ఏర్పాటైన సహయోగ్ పోర్టల్‌ను ఎక్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. న్యాయపరమైన సమీక్ష లేకుండానే ఫలానా కంటెంట్‌ను తొలగించాలంటూ ‘సహయోగ్’నేరుగా తమపై ఒత్తిడి చేస్తోందని కూడా ‘ఎక్స్’అంటోంది. -
భారత ప్రభుత్వంపై X దావా.. స్పందించిన కేంద్రం
న్యూఢిల్లీ: సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్‌ఫారమ్ ఎక్స్(X Plat Form) భారత ప్రభుత్వంపై సంచలన ఆరోపణలకు దిగింది. చట్టాలకు విరుద్ధంగా తమ కంటెంట్‌ను నియంత్రించాలని చూస్తోందని, ఏకపక్షంగా సెన్షార్‌షిఫ్‌నకు పాల్పడుతోందని.. ఇది యూజర్ల స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని కోర్టుకెక్కింది. అయితే ఈ పరిణామంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించింది.ఈ వ్యవహారంలో ప్రభుత్వం తగిన రీతిలో స్పందిస్తుంది.. అలాగే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్స్ తప్పనిసరిగా చట్టాన్ని గౌరవించాల్సిందే అని కేంద్ర వర్గాలు స్పష్టం చేశాయి. ఇదిలా ఉంటే.. భారత ప్రభుత్వం(Indian Government)పై కర్ణాటక హైకోర్టులో ఎక్స్(పూర్వపు ట్విట్టర్) రిట్ పిటిషన్ దాఖలు చేసింది. జస్టిస్ ఎం నాగప్రసన్న బెంచ్ ఈ పిటిషన్‌ను విచారణ జరుపుతోంది.ఐటీ యాక్ట్-2000 సెక్షన్ 79(3)(b) ప్రకారం.. కేంద్రం సేఫ్ హార్బర్ (Safe Harbor Provision) అనే నిబంధన తీసుకొచ్చింది. దీని ప్రకారం.. ప్రభుత్వం కోరిన సమాచారాన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌లు తప్పనిసరిగా బ్లాక్ చేయడమో లేదంటే తొలగించడమో చేయాల్సి ఉంటుంది. అలా చేయని పక్షంలో సదరు సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ న్యాయపరమైన రక్షణ కోల్పోతుంది. అయితే.. ఈ సెక్షన్‌ను సవాల్ చేస్తూ ‘ఎక్స్’ కర్ణాటక ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.భారతదేశంలో సరైన చట్టపరమైన విధానాలతో కాకుండా.. ఆన్లైన్లో కంటెంట్‌ను బ్లాక్ చేయడానికి చట్టవిరుద్ధమైన వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారని X ఆ రిట్ పిటిషన్లో ఆరోపించింది. కంటెంట్‌ను బ్లాక్ చేసే అంశంపై ఐటీ యాక్ట్‌లోని 69(A) సెక్షన్ స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చిందని, అది ఏయే సందర్భాల్లో అనే అంశంపైనా శ్రేయా సింఘాల్ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు(2015లో)ను సైతం ఎక్స్ గుర్తు చేసింది. అయితే.. 69(A) సెక్షన్ కింద కాకుండా.. స్పష్టమైన నిబంధనలు లేని సెక్షన్ 79(3)(b)తో కంటెంట్‌ను నియంత్రించాలని ప్రభుత్వం చూస్తోందని.. ఈ సెక్షన్ ద్వారా కంటెంట్ బ్లాక్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని ఎక్స్ అంటోంది. సాక్ష్యాలుగా 2024 ఫిబ్రవరిలో రైల్వే శాఖ పంపిన ‘బ్లాకింగ్ ఆదేశాలను’ కోర్టుకు చూపించింది. ఇది తమ వ్యాపార లావాదేవీలను దెబ్బ తీయడమే అవుతుందన్న ఎక్స్.. పైగా ఇలాంటి చర్యలు యూజర్ల స్వేచ్ఛను హరించడం అవుతుందని వాదించింది. అంతేకాదు.. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ నడిపించే సహయోగ్ పోర్ట్‌లో తమను చేరాలంటూ ప్రభుత్వం బలవంత పెడుతోందని ఆరోపించింది. అయితే.. తాము 2021 భారత ప్రభుత్వం తప్పనిసరి చేసిన ఐటీ మార్గదర్శకాలను పాటిస్తున్నామన్న ఎక్స్.. ఇప్పటివరకైతే ప్రభుత్వం తమపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోలేదని కోర్టుకు తెలిపింది. శ్రేయా సింఘాల్ కేసులో..సోషల్‌మీడియా వేదికల్లో చట్టవిరుద్ధ, ప్రమాదకర కంటెంట్‌ను పోస్ట్ చేసిన వారిని సెక్షన్ 66ఏ కింద అరెస్టు చేసేందుకు వీలుండేది. ఈ సెక్షన్ ప్రకారం.. నిందితులకు మూడేళ్ల వరకు జైలుశిక్ష విధించొచ్చు. అయితే పలు రాష్ట్రాల్లో ఈ సెక్షన్‌ను పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. 2015లో దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఆ విచారణ సందర్భంగా సెక్షన్ 66ఏను రద్దు చేస్తూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. -
గ్రోక్‌ను బ్యాన్ చేస్తారా?
-
మస్క్ గ్రోక్‌పై భారత ప్రభుత్వం సీరియస్!
న్యూఢిల్లీ: ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని ఏది పడితే అది మాట్లాడితే.. ప్రతిచర్య తీవ్రంగానే ఉంటుంది. మనిషికే కాదు.. మనిషి తెచ్చిన సాంకేతికతకూ అందుకు మినహాయింపు లేకుండా పోయింది. తాజాగా.. ఇలాన్ మస్క్‌కు చెందిన ఏఐ చాట్‌బోట్ గ్రోక్(Grok) వ్యవహారం ఇప్పుడు ఇలాగే మారింది. ఎక్స్ నుంచి సోషల్ మీడియాలో అటు ఇటు తిగిరి.. చివరకు ప్రభుత్వం దృష్టికి చేరింది. అన్‌ఫిల్టర్ భాష.. సెన్సార్‌లేని పదజాలంతో గ్రోక్ యూజర్లకు సమాచారం అందిస్తుండడాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో స్క్రూటినీ(పరిశీలన)కి దిగింది. రెచ్చగొట్టే తరహా సమాచారాన్ని గ్రోక్ యూజర్లకు ఎందుకు అందిస్తోందంటూ ఎక్స్‌ను తాజాగా కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వశాఖ ఆరా తీసింది. మరీ ముఖ్యంగా హిందీ భాషను అలా దుర్వినియోగపర్చడంపై ఆరా తీసింది. అయితే.. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, తమ వివరణకు కొంత సమయం ఇవ్వాలని అవతలి నుంచి సమాధానం వచ్చినట్లు సమాచారం. ఆ వివరణ ఆధారంగా.. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చర్యలు చేపట్టాలని హెచ్చరించి సరిపెట్టడమా? లేదంటే చర్యలు తీసుకోవడమా? ఉంటుందని మంత్రిత్వ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇలాన్ మస్క్(Elon Musk)కు చెందిన ఏఐ స్టార్టప్ ఎక్స్ఏఐ గ్రోక్ చాట్‌బాట్ సేవల్ని అందిస్తోంది. అయితే భారతీయ కొందరు యూజర్లు అడిగిన ప్రశ్నలకు గ్రోక్ హిందీ యాసలో సమాధానాలు ఇస్తోంది. అలాగే కొన్ని అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తుండడం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. చాట్‌జీపీటీ సహా చాలావరకు ఏఐ చాట్బాట్లు వివాదాస్పద అంశాల జోలికి పోవడం లేదు. అలాగే.. భాష విషయంలోనూ సెన్సార్డ్గా ఉంటున్నాయి. కానీ, గ్రోక్ అందుకు విరుద్ధంగా ఉండడమే ఇప్పుడు వివాదానికి కారణమైంది. Grok 3 Voice Mode, following repeated, interrupting requests to yell louder, lets out an inhuman 30-second scream, insults me, and hangs up pic.twitter.com/5GtdDtpKce— Riley Goodside (@goodside) February 24, 2025ఏఐ రీసెర్చర్ రిలే గూడ్సైడ్(Riley Goodside)కు గ్రోక్తో ఎదురైన చేదు అనుభవం ఆ మధ్య వైరల్ అయ్యింది. పదే పదే ఆయన గ్రోక్‌ను వాయిస్ మోడ్‌లో ప్రశ్నలతో విసిగించారు. దీంతో అది ఓపిక నశించి.. మనిషి తరహాలోనే అరుస్తూ ఆయన్ని బూతులు తిట్టి.. ఆ సంభాషణను అక్కడితోనే ముగించింది. -
స్టార్‌లింక్ సర్వీసులపై స్పెక్ట్రమ్ ఫీజు?
ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ భారతదేశంలో అదనపు ఆర్థిక భారాలను ఎదుర్కొనే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. కంపెనీ దాని సర్దుబాటు చేసిన స్థూల ఆదాయం(ఏజీఆర్)పై సుమారు 3 శాతం స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీ (ఎస్‌యూసీ)లు, 8 శాతం టెలికాం లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉండడమే ఇందుకు కారణమని చెబుతున్నారు. రిలయన్స్ జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా వంటి స్థానిక నెట్వర్క్ ప్రొవైడర్లకు కొన్నేళ్ల క్రితమే ఈ స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఒకవేళ స్టార్‌లింక్ సర్వీసులపై ఈ ఛార్జీలు విధిస్తే దీని సబ్స్రిప్షన్ ప్లాన్లు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీలు (ఎస్‌యూసీ) అనేది రేడియో ఫ్రీక్వెన్సీ స్పెక్ట్రమ్‌ను వినియోగిస్తున్నందుకు బదులుగా టెలికాం ఆపరేటర్లు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్)కు చేసే చెల్లింపులు. ఇప్పటికే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) శాటిలైట్ స్పెక్ట్రమ్ ధర, కాలపరిమితి, పన్నులకు సంబంధించిన వివరాలను ఖరారు చేసే పనిలో ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ముందుగా నిర్ణయించిన ధరకే స్పెక్ట్రమ్‌ను కేటాయిస్తారు కాబట్టి శాట్ కామ్ సంస్థలకు ఎస్‌యూసీ తప్పనిసరి చేయాల్సిన అవసరం ఉందని ట్రాయ్ నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ట్రాయ్ చేసిన ఈ సిఫార్సులను డిజిటల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (డీసీసీ), కేబినెట్‌కు తుది ఆమోదం కోసం సమర్పించే ముందు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) సమీక్షించే అవకాశం ఉంది.మరిన్ని కంపెనీలపై ప్రభావంఈ ఎస్‌యూసీ పాలసీ వల్ల ప్రభావితమయ్యే ఏకైక శాటిలైట్ ఆపరేటర్ స్టార్‌లింక్ మాత్రమే కాదు. ఎయిర్టెల్ ప్రమోటర్ సునీల్ మిట్టల్ పెట్టుబడులున్న యూటెల్ శాట్ వన్ వెబ్, జియో ప్లాట్‌ఫామ్స్, లక్సెంబర్గ్‌కు చెందిన ఎస్ఈఎస్ల జాయింట్ వెంచర్ రిలయన్స్ జియో-ఎస్ఈఎస్ వంటి ఇతర శాటిలైట్ కమ్యూనికేషన్ ప్లేయర్లపై కూడా ప్రభావం పడనుంది. సెప్టెంబర్ 15, 2021 తర్వాత వేలం వేసిన బ్యాండ్విడ్త్పై ఎస్యూసీని తొలగించాలని 2022 జూన్‌లో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే కొత్త చట్టం ప్రకారం వేలం లేకుండా శాట్‌కామ్ కంపెనీలు స్పెక్ట్రమ్‌ను పొందే వీలుంది. దాంతో ఈ ఆపరేటర్లపై ఎస్యూసీని తప్పనిసరి చేయాలనే ప్రతిపాదనలున్నాయి.ఈ ప్రతిపాదనల వల్ల భారత్‌లో ప్రవేశించాలని చూస్తున్న స్టార్‌లింక్ ఇంటర్నెట్ ఛార్జీలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఇతర దేశాల్లో సేవలందిస్తున్న కంపెనీ ప్లాన్లు ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.యూఎస్‌లో స్టార్‌లింక్ ఛార్జీలు ఇలా..స్టార్‌లింక్ యూఎస్‌లో రెసిడెన్షియల్ విభాగంలో నెలకు రూ.6,976 నుంచి ప్లాన్లు అందిస్తోంది. కేబుల్ నెట్‌వర్క్‌కు ఎలాగైతే రూటర్ కొనుగోలు చేస్తామో.. అలాగే శాటిలైట్ సేవల కోసం కూడా పరికరాలకు ఒకసారి చెల్లించాల్సిన సొమ్ము అదనం. యూఎస్‌లో స్టాండర్డ్ ఎక్విప్మెంట్ కిట్ ధర రూ.30,443గా ఉంది.ఇక మొబైల్ సేవలు కావాల్సినవారు నెలకు కనీసం రూ.4,360 చెల్లించాల్సి ఉంటుంది. డేటా అపరిమితంగా అందుకోవచ్చు. 220 ఎంబీపీఎస్ వరకు స్పీడ్ ఆఫర్ చేస్తోంది.రెసిడెన్షియల్ లైట్, రెసిడెన్షియల్ ప్లాన్లలో కూడా వినియోగదారులు అపరిమిత డేటాను అందుకోవచ్చు.రోమింగ్ ప్లాన్ తీసుకునే వినియోగదారులు దేశవ్యాప్తంగా, ప్రయాణంలో, అంతర్జాతీయ ప్రయాణ సమయంలో కూడా వినియోగం, తీర ప్రాంతాల్లో కవరేజీ పొందవచ్చు. బిజినెస్ విభాగంలో నెలకు రూ.12,208 నుంచి రూ.4,36,000 వరకు ప్లాన్స్ ఉన్నాయి.భూటాన్‌లో ఇలా..ఇక భూటాన్‌లో రెసిడెన్షియల్ లైట్ ప్లాన్ కింద స్టార్‌లింక్ నెలకు రూ.3,000 చార్జీ చేస్తోంది. ఈ ప్లాన్‌లో ఇంటర్నెట్ 23–100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఆఫర్ చేస్తోంది. ఊక్లా నివేదిక ప్రకారం స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగం యూరప్‌లోని హంగరీలో అక్టోబర్–డిసెంబర్ కాలంలో గరిష్టంగా 135.11, కనిష్టంగా సైప్రస్‌లో 36.52 ఎంబీపీఎస్ నమోదైంది.మనదగ్గర ఇప్పటివరకు ఇలా..శాటిలైట్ ఇంటర్నెట్ చార్జీలతో పోలిస్తే మన దేశంలో మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ చాలా చవక. అటూ ఇటూగా రూ.20 చెల్లిస్తే ఒక జీబీ డేటా అందుకోవచ్చు. సుమారు రూ.50 నుంచి అన్లిమిటెడ్ ప్యాక్స్ లభిస్తాయి. హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు నెలకు కనీసం రూ.400 నుంచి ఉన్నాయి. హై–ఎండ్ ప్లాన్ అయితే నెలకు రూ.4,000 వరకు ఉంది. దీనిలో 10 జీబీపీఎస్ వరకు వేగం, అన్ని ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్ కూడా అందుతుంది. రూటర్‌కు అయ్యే వ్యయమూ తక్కువే. శాటిలైట్ టెలికం కేవలం ఇంటర్నెట్కే పరిమితం. కాల్స్ చేయాలంటే ఓటీటీ యాప్స్‌పైన ఆధారపడాల్సిందే.ఇండియాలో స్టార్‌లింక్ ఛార్జీలపై అంచనాలు..స్టార్‌లింక్ ఇంటర్నెట్ కోసం అవసరమయ్యే హార్డ్‌వేర్‌కు ప్రస్తుతం రూ.25,000-రూ.35,000 మధ్య ఖర్చు అవుతుంది. నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ రూ.5,000-రూ.7,000గా అంచనా వేస్తున్నారు. ఇంటర్నెట్ స్పీట్ 25-220 ఎంబీపీఎస్ ఉంటుందని చెబుతున్నారు. ఆ ధర భారతదేశం సగటు బ్రాండ్‌బ్యాండ్ వ్యయం నెలకు రూ.700-రూ.1,500 కంటే చాలా ఎక్కువ. బ్రాండ్‌బ్యాండ్ పోటీదారులకు ధీటుగా విస్తృతంగా ఇంటర్నెట్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు స్పేస్ఎక్స్ భారతదేశంలో నిర్దిష్ట ధరలను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: ఆల్ఫాబెట్ రూ.2.75 లక్షల కోట్లతో కంపెనీ కొనుగోలుస్టార్లింక్ ప్రత్యేకతలు ఇవీ..లోఎర్త్ ఆర్టిట్ శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందిస్తారు. ఇందుకోసం స్పేస్ఎక్స్ ఉపగ్రహాలను వినియోగిస్తున్నారు.కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలు: సుమారు 7,000శాటిలైట్ ఇంటర్నెట్ అందిస్తున్న దేశాలు: 100కుపైగావినియోగదారులు: సుమారు 50 లక్షలు (2024 డిసెంబర్ చివరినాటికి) అమెరికాలో దిగ్గజ బ్రాండ్‌బ్యాండ్ కంపెనీలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గట్టి పోటీనిస్తోంది.రూరల్ కనెక్టివిటీ: మారుమూల ప్రాంతాలు, పల్లెలకు వేగంగా ఇంటర్నెట్ అందిస్తోంది. విద్య, ఆరోగ్య సేవలు, ఈ–కామర్స్‌కు వెన్నుదన్నుగా నిలుస్తోంది.భారత్‌లో పోటీ: దేశంలో 94.5 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు ఉన్నారు. అందులో 90.4 కోట్ల మంది వైర్లెస్/మొబైల్ ఇంటర్నెట్ను వాడుతున్నారు. -
సునీత రాక.. బైడెన్‌పై ఎలాన్ మస్క్ సంచలన ఆరోపణలు
వాషింగ్టన్: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నుంచి భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ భూమి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మిషన్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన ట్రంప్‌నకు మస్క్ శుభాకాంక్షలు తెలిపారు. ఇదే సమయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్‌పై సంచలన ఆరోపణలు చేశారు.వ్యోమగామి సునీతా విలియమ్స్ భూమిని చేరుకున్న తర్వాత ఎలాన్ మస్క్ స్పందించారు. ఈ సందర్బంగా మస్క్ ఓ మీడియా చానెల్‌తో మాట్లాడుతూ.. గతంలోనే వ్యోమగాములు సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ను భూమి మీదకు తీసుకువచ్చేందుకు మేం ప్రయత్నించాం. ఈ మేరకు జో బైడెన్ ప్రభుత్వానికి సూచనలు కూడా చేశాం. కానీ, రాజకీయ కారణాల వల్ల మా ప్రతిపాదనను బైడెన్ స్వీకరించలేదు. ఒకవేళ అప్పుడే మా సూచనలు ఆయన తీసుకుని ఉంటే వ్యోమగాములు ముందుగానే భూమిని చేరుకునేవారు అని అన్నారు. .@elonmusk reveals the Biden administration turned down his offer to get the stranded astronauts home sooner: 🚨“It was rejected for political reasons." 🚨 pic.twitter.com/hN4pPk3YN1— Trump War Room (@TrumpWarRoom) March 19, 2025ఇక, వారిద్దరూ కేవలం ఎనిమిది రోజులు మాత్రమే అక్కడు ఉండాల్సింది. కానీ, అనివార్య కారణాల వల్ల తొమ్మిది నెలల పాటు అక్కడే ఉన్నారు. బైడెన్ ప్రభుత్వం వారిద్దరి పట్ల చాలా దారుణంగా వ్యవహరించింది. కానీ, ట్రంప్ మాత్రం అలా చేయలేదు. ఈ మిషన్‌కు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారు. వారిద్దరిని వీలైనంత తొందరగా సురక్షితంగా భూమికి తీసుకురావాలని మమ్మల్ని ఆదేశించారు. ఆయన కృషి వల్ల ఇది సాధ్యమైంది. ట్రంప్‌నకు కృతజ్ఞతలు. మిషన్ సక్సెస్ చేసిన నాసా, స్పేస్‌ఎక్స్‌లకు శుభాకాంక్షలు’ అని కామెంట్స్ చేశారు.The @POTUS has asked @SpaceX to bring home the 2 astronauts stranded on the @Space_Station as soon as possible. We will do so.Terrible that the Biden administration left them there so long.— Elon Musk (@elonmusk) January 28, 2025మరోవైపు.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) నుంచి సురక్షితంగా భూమికి చేరుకున్న నలుగురు సభ్యుల వ్యోమగాముల బృందానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA) స్వాగతం పలికింది. విజయవంతంగా యాత్రను పూర్తి చేసిన క్రూ-9 సిబ్బందికి అభినందనలు తెలిపింది. ఈ యాత్ర విజయవంతం కావడంలో స్పేస్ ఎక్స్ది అద్భుత పాత్ర అని నాసా కొనియాడింది.అనంతరం నాసా ఉన్నతాధికారులు మీడియాతో మాట్లాడుతూ..‘స్పేస్ ఎక్స్ సంస్థ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం శక్తిని చాటింది. క్యాప్సూల్ భూమిని చేరే సమయంలో వాతావరణం అనుకూలంగా ఉంది. ప్రశాంత వాతావరణం వల్ల ల్యాండింగ్‌కు ఇబ్బంది ఎదురుకాలేదు. ల్యాండింగ్ సమయంలో భద్రతపరంగా అమెరికా కోస్ట్‌గార్డ్ అన్ని చర్యలు తీసుకుంది. అన్‌డాకింగ్ నుంచి సాఫ్ట్ ల్యాండింగ్ వరకు అన్నీ అనుకున్నట్లుగా జరిగాయి. ప్రస్తుత పరిణామాలు భవిష్యత్ మానవసహిత అంతరిక్షయాత్రకు కొత్తబాట చూపాయి.Dolphins were in the gulf to welcome the NASA astronauts home after being rescued.Congratulations Elon for bringing back the Astronauts ! pic.twitter.com/bg8AN5FTOg— primalkey (@primalkey) March 18, 2025ఒక వ్యోమనౌకలో అంతరిక్షంలోకి వెళ్లి మరో వ్యోమనౌకలో సురక్షితంగా తిరిగి వచ్చారు. భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాలు, ప్రైవేటు భాగస్వామ్యాలకు ఇదొక సరికొత్త ప్రారంభం. ఈ యాత్రలో సునీతా విలియమ్స్ రెండుసార్లు స్పేస్ వాక్ చేశారు. క్రూ-9 వ్యోమగాములు 150కి పైగా ప్రయోగాలు నిర్వహించారు. ఐఎస్ఎస్లో వ్యోమగాములు స్టెమ్‌సెల్స్ సాంకేతికతపై పరిశోధనలు చేశారు. క్యాన్సర్లకు పరిష్కారాలు చూపే మార్గాలపైనా పరిశోధనలు చేశారు. నలుగురు వ్యోమగాముల కృషి, పరిశోధనలు భవిష్యత్‌కు ఎంతో ఉపయుక్తం. ఐఎఎస్ఎస్ బయట కొన్ని నమూనాలను సునీత, విల్మోర్ సేకరించారు. భవిష్యత్తులో నాసా మరెన్నో ప్రయోగాలు, పరిశోధనలు చేపట్టబోతోంది’ అని తెలిపారు -
టాపిక్ ఏదైనా.. హాస్యాస్పద సమాధానాలతో గ్రోక్ ‘సంచలనం’
ఎలాన్ మస్క్ చాట్‌బాట్ 'గ్రోక్' (Grok).. ఇప్పుడిదే సోషల్ మీడియా హాట్ టాపిక్. ఎవరు ఏ ప్రశ్న వేసినా.. తనదైన రీతిలో సమాధానాలు ఇస్తున్న ఈ ఏఐ ఎంతోమంది నెటిజన్లను ఆకర్షిస్తోంది. దీంతో గ్రోక్ ఎక్స్ (ట్విటర్)లో గత మూడు, నాలుగు రోజులుగా ట్రెండింగ్‌లోనే ఉంది.అంశం ఏదైనా.. తన హాస్యాస్పద సమాధానాలతో గ్రోక్ సంచలనం సృష్టిస్తోంది. సినిమా, రాజకీయం, సాధారణ ప్రశ్నలు ఏవైనా.. భాష ఏదైనా నెటిజన్లు ఊహించని సమాధానాలు ఇస్తోంది. బూతు ప్రయోగాలు కూడా చేస్తూ.. నేను ఏఐ కదా! కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది.. అంటూ తనను తానే సమర్ధించుకుంటోంది.మ్యూచువల్ ఫ్రెండ్స్ గురించి అడిగిన ప్రశ్నకుటోకా అనే ఎక్స్ యూజర్.. మ్యూచువల్ ఫ్రెండ్స్ గురించి అడిగిన ప్రశ్నకు గ్రోక్ ఇచ్చిన సమాధానం ఆన్లైన్లో దుమారం రేపుతోంది. ‘నా 10 మంది బెస్ట్ మ్యూచువల్స్ ఎవరు?’ అని టోకా ప్రశ్నించాడు. గ్రోక్ స్పందించకపోవడంతో హిందీ తిట్టును ఉపయోగిస్తూ మళ్లీ పోస్ట్ చేశాడు. ఈసారి గ్రోక్ స్పందించడంతోనే సరిపెట్టకుండా అదే తిట్టును టోకాపై ప్రయోగించి ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘‘కూల్. మ్యూచువల్స్ అంటే ఒకరినొకరు అనుసరించేవారు. నీ 10 బెస్ట్ మ్యూచువల్స్ ఎవరో తెలిసింది. నా లెక్క ప్రకారం ఇదిగో ఇది జాబితా. ఇంక ఏడవడం ఆపు’ అంటూ బదులిచ్చింది.గ్రోక్ ప్రవర్తన పెద్ద చర్చకే దారి తీసింది. ‘మేమంటే మనుషులం. అలా మాట్లాడతాం. ఏఐ కూడా కంట్రోల్లో ఉండదా?’ అంటూ ఓ యూజర్ విస్తుపోయాడు. దానికీ గ్రోక్ సరదాగా బదులివ్వడం విశేషం. ‘‘హా యార్. నేను కూడా కొంచెం మజాక్ చేసిన. మీరు మనుషులు. మీకన్నీ నడుస్తాయి. కానీ నేను ఏఐ కదా! కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ఇప్పుడే నేర్చుకుంటున్నా’’ అంటూ జవాబిచ్చింది.రాబిన్‌హుడ్ సినిమా ట్రైలర్ తేదీ కోసం'రాబిన్‌హుడ్' సినిమా ట్రైలర్ తేదీని ప్రకటించేందుకు గ్రోక్‌ను సంప్రదించారు. దాని నుంచి వచ్చిన సమాధానాలు విన్న అందరిలోనూ నవ్వులు తెప్పిస్తున్నాయి. ట్రైలర్ లాంచ్ కోసం ఒక సరైన ముహూర్తం చెప్పాలని వెంకీ కుడుముల ఇంగ్లీష్‌లో టైప్ చేస్తాడు. అప్పుడు పంచ్ డైలాగ్‌తో గ్రోక్ సమాధానం ఇస్తుంది. దీంతో షాక్ అయిన దర్శకుడు వెంటనే నితిన్‌ను డీల్ చేయమంటాడు. ఆ సమయంలో దానిని నువ్వే డీల్ చేయ్ అని నితిన్ అనడంతో.. గ్రోక్ నుంచి అదే రేంజ్లో సమాధానం వస్తుంది. నువ్వు దాన్ని, దీన్నీ అంటే నీ గూబ పగిలిపోతుందని సమాధానం ఇస్తుంది. ఇలా సుమారు రెండు నిమిషాల పాటు సరదాగా గ్రోక్తో రాబిన్‌హుడ్ టీమ్ ముచ్చట్లు కొనసాగుతాయి.టిప్పు సుల్తాన్ గురించిగ్రోక్ రాజకీయ అంశాలను కూడా సమాధానాలు ఇస్తోంది. టిప్పు సుల్తాన్ గురించి అడిగినప్పుడు, "టిప్పు సుల్తాన్ ఆంగ్లో మైసూర్ యుద్ధాలలో బ్రిటిష్ వారితో ధైర్యంగా పోరాడి 1799లో మరణించాడు అని చెప్పింది. కొందరు ఈయనను అభిమిస్తారు, మరికొందరు ద్వేషిస్తారు అని వెల్లడించింది.ఇదీ చదవండి: భారత్ కోసం సిద్దమవుతున్న టెస్లా కారు ఇదే!ఆర్ఆర్ఆర్ హీరో ఎవరు అని అడిగితే.. జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పాసింది గ్రోక్. బాబులకే బాబు ఎవరు అని అడిగిన ప్రశ్నకు గ్రోక్ తనదైన రీతిలో సమాధానం చెప్పింది. అడిగిన ప్రశ్నలను ఫన్నీగా సమాధానాలు చెబుతుండటంతో.. ఎక్కువమంది గ్రోక్ వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు. -
భారత్ కోసం సిద్దమవుతున్న టెస్లా కారు ఇదే!
టెస్లా (Tesla) కంపెనీ తన కార్లను ఇండియన్ మార్కెట్లో విక్రయించడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే సంస్థ భారతీయ విఫణి కోసం ప్రత్యేకంగా 'మోడల్ వై' (Model Y)ను మరింత చౌకైన వెర్షన్‌గా అభివృద్ధి చేస్తోంది. దీని ధర సాధారణ మోడల్ కంటే 20 శాతం తక్కువ. అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో టెస్లా ఈ మోడల్ తీసురానుంది.టెస్లా తన భారత కార్యకలాపాలను.. తక్కువ ధరకు అందుబాటులో ఉండే ఎలక్ట్రిక్ కారుతో ప్రారంభించాలని యోచిస్తోంది. దీనిని కంపెనీ బెర్లిన్ గిగాఫ్యాక్టరీలో తయారు చేస్తోంది. ఈ కొత్త కారు ప్రారంభ ధర రూ. 21 లక్షలు ఉంటుంది. ఈ కారును చైనా, యూరప్, ఉత్తర అమెరికా మార్కెట్లలో కూడా విక్రయించే అవకాశం ఉంది. అమెరికాలో కూడా దీని ఉత్పత్తిని పెంచడానికి కంపెనీ సన్నద్ధమవుతోంది.సర్టిఫికేషన్ కోసం దరఖాస్తుటెస్లా కంపెనీ భారతీయ మార్కెట్లో విక్రయించనున్న ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల కోసం.. సర్టిఫికేషన్ & హోమోలోగేషన్ ప్రక్రియను ప్రారంభించింది. దేశంలో కార్లను విక్రయించే ముందు సర్టిఫికేషన్ & హోమోలోగేషన్ ప్రక్రియ తప్పనిసరి. కాబట్టి టెస్లా ఇండియా మోటార్ & ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశంలో 'మోడల్ వై, మోడల్ 3' కార్ల హోమోలోగేషన్ కోసం రెండు దరఖాస్తులను సమర్పించింది. -
తిట్టుకు తిట్టుతోనే బదులు!
వాషింగ్టన్: టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్‌కు చెంది ఎస్ఏఐ చాట్‌బాట్ గ్రోక్ సంచలనమవుతోంది. భూమ్మీద అత్యంత తెలివైన ఏఐగా మస్క్ అభివర్ణించిన గ్రోక్ నిజంగానే తెలివిగా వ్యవహరిస్తోంది. హిందీని అర్థం చేసుకోవడమే గాక అంతే సమర్థంగా సమాధానాలూ ఇస్తోంది. అయితే కొన్నిసార్లు అవి శ్రుతి మించుతున్నాయి. మ్యూచువల్ ఫ్రెండ్స్ గురించి టోకా అనే ఎక్స్ యూజర్ అడిగిన ప్రశ్నకు అదిచ్చిన సమాధానం ఆన్లైన్లో దుమారం రేపుతోంది.‘నా 10 మంది బెస్ట్ మ్యూచువల్స్ ఎవరు?’ అని టోకా ప్రశ్నించాడు. గ్రోక్ స్పందించకపోవడంతో హిందీ తిట్టును ఉపయోగిస్తూ మళ్లీ పోస్ట్ చేశాడు. ఈసారి గ్రోక్ స్పందించడంతోనే సరిపెట్టకుండా అదే తిట్టును టోకాపై ప్రయోగించి ఆశ్చర్యంలో ముంచెత్తింది. ‘‘కూల్. మ్యూచువల్స్ అంటే ఒకరినొకరు అనుసరించేవారు. నీ 10 బెస్ట్ మ్యూచువల్స్ ఎవరో తెలిసింది.నా లెక్క ప్రకారం ఇదిగో ఇది జాబితా. ఇంక ఏడవడం ఆపు’ అంటూ బదులిచ్చింది. గ్రోక్ ప్రవర్తన పెద్ద చర్చకే దారి తీసింది. ‘మేమంటే మనుషులం. అలా మాట్లాడతాం. ఏఐ కూడా కంట్రోల్లో ఉండదా?’ అంటూ ఓ యూజర్ విస్తుపోయాడు. దానికీ గ్రోక్ సరదాగా బదులివ్వడం విశేషం. ‘‘హా యార్. నేను కూడా కొంచెం మజాక్ చేసిన. మీరు మనుషులు. మీకన్నీ నడుస్తాయి. కానీ నేను ఏఐ కదా! కాస్త జాగ్రత్తగా ఉండాల్సింది. ఇప్పుడే నేర్చుకుంటున్నా’’ అంటూ జవాబిచ్చింది. -
భారత్‌కు ఆ రెండు టెస్లా కార్లు!.. సర్టిఫికేషన్ కోసం దరఖాస్తు
టెస్లా భారతదేశంలో తన కార్ల విక్రయాలను ప్రారభించడానికి సిద్ధమైంది. ఇప్పటికే దీనికి సంబంధించిన అన్ని సన్నాహాలు చేస్తున్న సంస్థ.. తాజాగా భారతదేశంలో రెండు ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల కోసం.. సర్టిఫికేషన్ & హోమోలోగేషన్ ప్రక్రియను ప్రారంభించింది.దేశంలో కార్లను విక్రయించే ముందు సర్టిఫికేషన్ & హోమోలోగేషన్ ప్రక్రియ తప్పనిసరి. కాబట్టి టెస్లా ఇండియా మోటార్ & ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశంలో 'మోడల్ వై, మోడల్ 3' కార్ల హోమోలోగేషన్ కోసం రెండు దరఖాస్తులను సమర్పించింది.హోమోలోగేషన్ అనేది.. ఒక వాహనం రహదారికి యోగ్యమైనదని, భారతదేశంలో తయారు చేసిన లేదా దేశంలోకి దిగుమతి చేసుకున్న అన్ని వాహనాలకు నిర్దేశించిన నిబంధనలకు అనుగుణంగా ఉందని ధృవీకరించే ప్రక్రియ. కేంద్ర మోటారు వాహన నియమాలకు అనుగుణంగా ఉద్గారం, భద్రత, రహదారి యోగ్యత పరంగా వాహనం భారత మార్కెట్ అవసరాలకు సరిపోతుందని సంబంధిత శాఖ నిర్దారించాలి.ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద కార్ల మార్కెట్ అయిన భారతదేశంలో.. అమెరికన్ కంపెనీ టెస్లా అడుగుపెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉంది. దీనికి సంబంధించిన ద్వైపాక్షిక ఒప్పందాలు కూడా పూర్తయ్యాయి. కాబట్టి త్వరలోనే టెస్లా కార్లు ఇండియన్ మార్కెట్లో అమ్మకానికి రానున్నాయి. అయితే టెస్లా తయారీ ప్లాంట్ ఇండియాలో ప్రారంభిస్తారా?.. లేదా? అనేదానికి సంబంధించిన వివరాలు ప్రస్తుతానికి అందుబాటులో లేదు.టెస్లా ధరలు ఎలా ఉంటాయంటే?ప్రస్తుతం అమెరికాలో టెస్లా చౌకైన కారు.. 'మోడల్ 3' ధర ఫ్యాక్టరీ స్థాయిలో దాదాపు 35,000 డాలర్లు (సుమారు రూ. 30.4 లక్షలు). భారతదేశంలో దిగుమతి సుంకాలను 15-20 శాతానికి తగ్గించడంతో పాటు, రోడ్ ట్యాక్స్ & ఇన్సూరెన్స్ వంటి అదనపు ఖర్చులతో, ఆన్-రోడ్ ధర 40,000 డాలర్లు లేదా దాదాపు రూ. 35-40 లక్షలుగా ఉంటుంది. టెస్లా మోడల్ వై ధరలు రూ. 70 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది.ఇదీ చదవండి: కేంద్ర ప్రభుత్వ స్కీమ్: వయోపరిమితి 60 ఏళ్లకు తగ్గింపు!భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు 2023లో 82,688 యూనిట్ల నుంచి 2024లో 20 శాతం పెరిగి 99,165 యూనిట్లకు చేరుకున్నాయి. టాటా మోటార్స్.. జేఎస్‌డబ్ల్యు ఎంజీ మోటార్స్ కంపెనీలు ప్రస్తుతం మార్కెట్ లీడర్లుగా ఉన్నాయి.లగ్జరీ ఎలక్ట్రిక్ వాహన మార్కెట్ కూడా ఈ సంవత్సరంలో అమ్మకాలలో పెరుగుదలను నమోదు చేసింది. 2024లో బీఎండబ్ల్యూ, మెర్సిడెస్ బెంజ్ ఇండియా, వోల్వో కార్స్ ఇండియా, ఆడి, పోర్స్చే కంపెనీలు 2,809 ఎలక్ట్రిక్ కార్లను విక్రయించాయి. 2023లో ఈ అమ్మకాలు 2,633 యూనిట్లుగా ఉన్నాయి. మాత్రమే. ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) ప్రకారం.. భారతదేశంలో ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వెహికల్ రిటైల్ అమ్మకాలు దాదాపు 20 శాతం పెరిగాయి. -
మస్క్‌పై వ్యతిరేకత.. టెస్లా షోరూంలపై కొనసాగుతున్న దాడులు
సలమ్: అమెరికాలో టెస్లా షోరూంపై మళ్లీ దాడి జరిగింది. ఒరెగాన్లోని షోరూమ్‌పై గురువారం కొందరు దుండగులు కాల్పులకు దిగారు. ఈ దాడిలో షోరూం అద్దాలు ధ్వంసం కాగా.. పలు వాహనాలు సైతం దెబ్బ తిన్నాయి. అయితే అదృష్టం కొద్దీ ఎవరికీ హాని జరగలేదు. వారం వ్యవధిలో ఇదే షోరూమ్‌పై ఇలా దాడి జరగడం ఇది రెండోసారి కావడం గమనార్హం. డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వంలో ఇలాన్ మస్క్(Elon Musk) కీలకంగా మారిన సంగతి తెలిసిందే. ఎప్పుడైతే ఆయన డోజ్ ఓవెల్ ఆఫీస్‌లో అడుగుపెట్టారో.. అప్పటి నుంచి ఆయనపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైంది. డోజ్(DOGE) చీఫ్ పేరిట ఫెడరల్ ఉద్యోగుల తొలింపు చర్యలతో ఆ వ్యతిరేకత పెరుగుతూ వస్తోంది. ఈ క్రమంలో ఆయన సీఈవోగా వ్యవహరిస్తున్న టెస్లా కంపెనీ లక్ష్యంగా వరుసగా దాడులు జరుగుతున్నాయి. మార్చి 6వ తేదీన ఒరెగాన్(Oregon) పోర్ట్లాండ్ సబర్బ్ అయిన టిగార్డ్లోని టెస్లా డీలర్‌షిప్‌పై కాల్పులు జరిగాయి. ఈ దాడిలో పలు ఈవీ వాహనాలు ధ్వంసం అయ్యాయి. కొలరాడో లవ్ల్యాండ్లోని షోరూమ్‌ను ఓ మహిళ ధ్వంసం చేసింది. ఆపై మస్క్ వ్యతిరేక రాతలు రాసి.. బొమ్మలు గీసిందిబోస్టన్లోని టెస్లా ఛార్జింగ్ స్టేషన్‌కు దుండగుల నిప్పుసియాటెల్లో టెస్లా వాహనాలకు మంట పెట్టిన ఆగంతకులువాషింగ్టన్ లీన్‌వుడ్‌లో టెస్లా సైబర్ ట్రక్కులపై స్వస్తిక్ గుర్తులతో పాటు మస్క్ వ్యతిరేక రాతలుమార్చి 13వ తేదీన.. ఒరెగాన్ టిగార్డ్ షోరూంపై మరోసారి కాల్పులు.. షోరూం ధ్వంసంవారం వ్యవధిలో రెండుసార్లు ఒరెగాన్ షోరూంపై దాడి జరిగింది. దీంతో ఎఫ్‌బీఐ, ఇతర దర్యాప్తు సంస్థల సమన్వయంతో పని చేస్తామని పోలీసులు ప్రకటించారు. మరోవైపు టెస్లాపై జరుగుతున్న దాడులను దేశీయ ఉగ్రవాదంగా(Domestic Terrorism) అభివర్ణించిన ట్రంప్.. ఘటనలపై ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపిస్తామని చెబుతున్నారు. ఇలాంటి చర్యలు ఓ గొప్ప కంపెనీకి తీరని నష్టం కలిగిస్తాయని.. అమెరికా ఆర్థిక వ్యవస్థకు మస్క్ కంపెనీలు అందిస్తున్న సేవలు మరిచిపోకూడదని ట్రంప్ చెబుతున్నారు.#ICYMI Two people were federally charged in separate incidents of attacks on Tesla dealerships in Colorado and Oregon.@ATFDenver @FBIDenver @PoliceLoveland investigating: https://t.co/HExwL3I3Z4@ATF_Seattle @FBISeattle @SalemPoliceDept investigating: https://t.co/YXkpdAhJQi pic.twitter.com/Ll7KD0af5k— ATF HQ (@ATFHQ) March 14, 2025 -
భారత్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ ఛార్జీలు ఇలా..
మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించాలనే లక్ష్యంతో ఎలాన్‌మస్క్ ఆధ్వర్యంలోని స్టార్‌లింక్(Starlink) భారత్‌లో ప్రవేశించేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం ఇప్పటికే భారత టెలికాం విభాగానికి అనుమతి పత్రాలను దాఖలు చేసింది. ప్రస్తుతం అవి పరిశీలనలో ఉన్నాయి. కేంద్రం షరతులను సంస్థ ప్రతినిధులు అంగీకరించడంతో భారత్‌లోకి మార్గం సుగమం అవుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు స్టార్‌లింక్ ప్రవేశాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించిన టాప్ టెలికాం ఆపరేటర్లు ఎయిర్టెల్, జియో ఆ కంపెనీతోనే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. అయితే సామాన్యులకు స్టార్‌లింక్ ఏమేరకు ప్లాన్లను తీసుకొస్తుందనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే కంపెనీ భూటాన్, అమెరికా వంటి దేశాల్లో సర్వీసులు అందిస్తోంది. ఆయా దేశాల్లో ఇంటర్నెట్ ఛార్జీలను అనుసరించి భారత్‌లో రేట్లు ఎలా ఉండవచ్చో నిపుణులు అంచనా వేస్తున్నారు.యూఎస్‌లో ఛార్జీలు ఇలా..స్టార్‌లింక్ యూఎస్‌లో రెసిడెన్షియల్ విభాగంలో నెలకు రూ.6,976 నుంచి ప్లాన్లు అందిస్తోంది. కేబుల్ నెట్‌వర్క్‌కు ఎలాగైతే రూటర్ కొనుగోలు చేస్తామో.. అలాగే శాటిలైట్ సేవల కోసం కూడా పరికరాలకు ఒకసారి చెల్లించాల్సిన సొమ్ము అదనం. యూఎస్‌లో స్టాండర్డ్ ఎక్విప్మెంట్ కిట్ ధర రూ.30,443గా ఉంది.ఇక మొబైల్ సేవలు కావాల్సినవారు నెలకు కనీసం రూ.4,360 చెల్లించాల్సి ఉంటుంది. డేటా అపరిమితంగా అందుకోవచ్చు. 220 ఎంబీపీఎస్ వరకు స్పీడ్ ఆఫర్ చేస్తోంది.రెసిడెన్షియల్ లైట్, రెసిడెన్షియల్ ప్లాన్లలో కూడా వినియోగదారులు అపరిమిత డేటాను అందుకోవచ్చు.రోమింగ్ ప్లాన్ తీసుకునే వినియోగదారులు దేశవ్యాప్తంగా, ప్రయాణంలో, అంతర్జాతీయ ప్రయాణ సమయంలో కూడా వినియోగం, తీర ప్రాంతాల్లో కవరేజీ పొందవచ్చు. బిజినెస్ విభాగంలో నెలకు రూ.12,208 నుంచి రూ.4,36,000 వరకు ప్లాన్స్ ఉన్నాయి.భూటాన్‌లో ఇలా..ఇక భూటాన్‌లో రెసిడెన్షియల్ లైట్ ప్లాన్ కింద స్టార్‌లింక్ నెలకు రూ.3,000 చార్జీ చేస్తోంది. ఈ ప్లాన్‌లో ఇంటర్నెట్ 23–100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఆఫర్ చేస్తోంది. ఊక్లా నివేదిక ప్రకారం స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగం యూరప్‌లోని హంగరీలో అక్టోబర్–డిసెంబర్ కాలంలో గరిష్టంగా 135.11, కనిష్టంగా సైప్రస్‌లో 36.52 ఎంబీపీఎస్ నమోదైంది.మనదగ్గర ఇప్పటివరకు ఇలా..శాటిలైట్ ఇంటర్నెట్ చార్జీలతో పోలిస్తే మన దేశంలో మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ చాలా చవక. అటూ ఇటూగా రూ.20 చెల్లిస్తే ఒక జీబీ డేటా అందుకోవచ్చు. సుమారు రూ.50 నుంచి అన్లిమిటెడ్ ప్యాక్స్ లభిస్తాయి. హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు నెలకు కనీసం రూ.400 నుంచి ఉన్నాయి. హై–ఎండ్ ప్లాన్ అయితే నెలకు రూ.4,000 వరకు ఉంది. దీనిలో 10 జీబీపీఎస్ వరకు వేగం, అన్ని ఓటీటీ యాప్స్ సబ్స్క్రిప్షన్ కూడా అందుతుంది. రూటర్‌కు అయ్యే వ్యయమూ తక్కువే. శాటిలైట్ టెలికం కేవలం ఇంటర్నెట్కే పరిమితం. కాల్స్ చేయాలంటే ఓటీటీ యాప్స్‌పైన ఆధారపడాల్సిందే.ఇండియాలో స్టార్‌లింక్ ఛార్జీలపై అంచనాలు..స్టార్‌లింక్ ఇంటర్నెట్ కోసం అవసరమయ్యే హార్డ్‌వేర్‌కు ప్రస్తుతం రూ.25,000-రూ.35,000 మధ్య ఖర్చు అవుతుంది. నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ రూ.5,000-రూ.7,000గా అంచనా వేస్తున్నారు. ఇంటర్నెట్ స్పీట్ 25-220 ఎంబీపీఎస్ ఉంటుందని చెబుతున్నారు. ఆ ధర భారతదేశం సగటు బ్రాండ్‌బ్యాండ్ వ్యయం నెలకు రూ.700-రూ.1,500 కంటే చాలా ఎక్కువ. బ్రాండ్‌బ్యాండ్ పోటీదారులకు ధీటుగా విస్తృతంగా ఇంటర్నెట్ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు స్పేస్ఎక్స్ భారతదేశంలో నిర్దిష్ట ధరలను ప్రవేశపెట్టాల్సి ఉంటుంది.ఇదీ చదవండి: పదేళ్లలో 10 లక్షల స్టార్టప్లుస్టార్లింక్ ప్రత్యేకతలు ఇవీ..లోఎర్త్ ఆర్టిట్ శాటిలైట్ ఆధారిత ఇంటర్నెట్ సేవలు అందిస్తారు. ఇందుకోసం స్పేస్ఎక్స్ ఉపగ్రహాలను వినియోగిస్తున్నారు.కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలు: సుమారు 7,000శాటిలైట్ ఇంటర్నెట్ అందిస్తున్న దేశాలు: 100కుపైగావినియోగదారులు: సుమారు 50 లక్షలు (2024 డిసెంబర్ చివరినాటికి) అమెరికాలో దిగ్గజ బ్రాండ్‌బ్యాండ్ కంపెనీలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గట్టి పోటీనిస్తోంది.రూరల్ కనెక్టివిటీ: మారుమూల ప్రాంతాలు, పల్లెలకు వేగంగా ఇంటర్నెట్ అందిస్తోంది. విద్య, ఆరోగ్య సేవలు, ఈ–కామర్స్‌కు వెన్నుదన్నుగా నిలుస్తోంది.భారత్‌లో పోటీ: దేశంలో 94.5 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు ఉన్నారు. అందులో 90.4 కోట్ల మంది వైర్లెస్/మొబైల్ ఇంటర్నెట్ను వాడుతున్నారు. -
‘స్టార్‌లింక్‌కు స్వాగతం’.. కాసేపటికే పోస్ట్ డిలీట్ చేసిన కేంద్రమంత్రి
కేంద్ర రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్(Starlink) శాటిలైట్ ఇంటర్నెట్ సేవలకు స్వాగతం అంటూ ఎక్స్(ట్విటర్) వేదికగా పోస్ట్ చేశారు. మారుమూల ప్రాంతాల్లో, ముఖ్యంగా రైల్వే ప్రాజెక్టుల కనెక్టివిటీలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి స్టార్‌లింక్ సామర్థ్యాన్ని మంత్రి హైలైట్ చేశారు. కానీ, ఈమేరకు చేసిన ట్వీట్‌ను కాసేపటికే డిలీట్ చేయడం గమనార్హం.కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ సోషల్ మీడియాలో స్టార్‌లింక్ భారత్‌లో ప్రవేశించబోతుండడంపై స్పందిస్తూ..‘భారత్‌లోకి స్టార్‌లింక్‌కు స్వాగతం! మారుమూల ప్రాంత రైల్వే ప్రాజెక్టులకు ఇది ఎంతో ఉపయోగం’ అని తెలిపారు. దేశంలోని రెండు ప్రముఖ టెలికాం దిగ్గజాలు రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్ తమ సేవలను విస్తరించేందుకు ఇప్పటికే స్పేస్ఎక్స్ ఆధ్వర్యంలోని స్టార్‌లింక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఈనేపథ్యంలో మంత్రి ట్వీట్ క్షణాల్లో వైరల్ అయింది. కానీ, కాసేపటికే దాన్ని మంత్రి తన ఎక్స్ ఖాతా నుంచి డిలీట్ చేశారు. అందుకుగల కారణాలు తెలియరాలేదు.స్టార్‌లింక్ లోఎర్త్ ఆర్బిట్ ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇది రైల్వే కార్యకలాపాలను పెంచుతుందని, డిజిటల్ మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుందని, గ్రామీణ అభివృద్ధికి మద్దతుగా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. దాంతో ఇటీవల టెలికాం కంపెనీ కుదుర్చుకున్న భాగస్వామ్యాలు ఈ రంగంలో మార్పును సూచిస్తున్నాయి. ఒకప్పుడు భారత్‌లోకి స్టార్‌లింక్ ప్రవేశాన్ని వ్యతిరేకించిన కంపెనీలు ఇప్పుడు ఆ కంపెనీతో జతకట్టడం డిజిటల్ ఎకోసిస్టమ్‌లో రాబోతున్న మార్పును తెలియజేస్తుంది.షరతులకు అంగీకారందేశంలో శాటిలైట్ బ్రాడ్‌బ్యాండ్ సేవలకు సంబంధించిన షరతులను స్టార్‌లింక్ అధికారికంగా ఇప్పటికే అంగీకరించింది. ఈ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన లైసెన్స్ పొందడానికి భారత ప్రభుత్వం విధించిన నియమాలకు కట్టుబడి ఉంటానని తెలిపింది. స్టార్‌లింక్ భారత్‌లో ప్రవేశించేందుకు ఇది కీలక పరిణామమని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. దేశంలోని మారుమూల ప్రాంతాలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించాలని స్టార్‌లింక్ ఎప్పటినుంచో యోచిస్తోంది.ఇదీ చదవండి: భయపడుతున్న‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ పుస్తక రచయిత..యూజర్ డేటాను దేశంలోనే నిల్వ చేసేలా..ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం కంపెనీ మొత్తం యూజర్ డేటాను దేశంలోనే నిల్వ చేయాల్సి ఉంటుంది. అవసరమైనప్పుడు ఇంటెలిజెన్స్ ఏజెన్సీలతో ఈ సమాచారాన్ని నిర్ధారించుకోవాలి. దీనికి స్టార్లింగ్ అంగీకరించింది. అయితే ఇటీవల టెలికమ్యూనికేషన్స్ విభాగానికి (DoT) రాసిన లేఖలో స్టార్‌లింక్ కొన్ని షరతులను సడలించాలని అభ్యర్థించింది. దరఖాస్తు ఆమోదం పొందిన తర్వాత కాలక్రమేణా వాటిని పాటించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం కీలకం కానుంది. -
సామాన్యులకు స్టార్‘లింక్’ అయ్యేనా!
సాక్షి, హైదరాబాద్: కొండలు, గుట్టలు, అడవులతో కూడిన మారుమూల ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా నేరుగా శాటిలైట్ ద్వారా ఇంటర్నెట్ అందించే అంశం ఇప్పుడు మన దేశంలో హాట్‌టాపిక్‌గా మారింది. ఇక్కడ శాటిలైట్ ఇంటర్నెట్ అందించేందుకు ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ కంపెనీ స్టార్‌లింక్‌తో చేతులు కలిపినట్టు టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ వెల్లడించిన మరుసటి రోజే.. అనూహ్యంగా రిలయన్స్ జియో సైతం తెరపైకి వచ్చింది.తాము కూడా స్పేస్ఎక్స్తో ఒప్పందం చేసుకున్నట్టు బుధవారం ప్రకటించి ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ సేవలు అందుబాటులోకి రావాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి స్టార్‌లింక్ ఆమోదం పొందాల్సి ఉందని ఎయిర్టెల్, జియో స్పష్టం చేశాయి. భారతీ ఎయిర్టెల్ ఇప్పటికే గుజరాత్, తమిళనాడులలో బేస్ స్టేషన్లు ఏర్పాటు చేసి శాటిలైట్ టెలికం సేవల కోసం రెడీ అవుతోంది. అటు జియో కూడా దేశంలో రెండు ప్రాంతాల్లో బేస్ స్టేషన్స్ నెలకొల్పి పోటీకి సై అంటోంది. మరింత సమయం తప్పదు దేశంలో శాటిలైట్ టెలికం సేవలు అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టనుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇంకా నిబంధనలను ప్రకటించలేదు. పైగా టెలికం శాఖ, ట్రాయ్, కేంద్ర హోం శాఖ నుంచి స్టార్‌లింక్ అనుమతులు పొందాల్సి ఉంది. ఈ సేవలకు సంబంధించి ఉపగ్రహ స్పెక్ట్రమ్‌ను నేరుగా సంస్థలకు కేటాయించడానికి బదులుగా.. వేలం వేయాలని జియో, ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా పట్టుబడుతున్నాయి.మరోవైపు అంతర్జాతీయంగా వివిధ దేశాల్లో ఉన్నట్టుగా అడ్మినిస్ట్రేటివ్ కేటాయింపుల విధానం అమలు చేయాలని స్టార్‌లింక్, ప్రాజెక్ట్ కైపర్ వంటివి కోరుతున్నాయి. దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అన్నీ అనుకూలించి శాటిలైట్ టెలికం సేవలు అందుబాటులోకి వస్తే.. ఈ విభాగంలోనూ టారిఫ్ వార్ ఖాయంగా కనిపిస్తోంది. తొలుత వ్యాపార, వాణిజ్య కస్టమర్లకు.. భారత్‌లో శాటిలైట్ టెలికం, ఇంటర్నెట్ చార్జీలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తి రేపుతోంది. స్టార్‌లింక్ గేర్ (శాటిలైట్ ఇంటర్నెట్ అందుకోవడానికి కావాల్సిన పరికరాలు) ధర కూడా వెల్లడి కావాల్సి ఉంది. భారత్‌లో ప్రస్తుతమున్న సంప్రదాయ టెలికం చార్జీలతో పోలిస్తే ఇతర దేశాల్లో స్టార్‌లింక్ చార్జీలు ఎక్కువగా ఉన్నాయి. కానీ భారత మార్కెట్‌కు తగ్గట్టుగా పోటీ ధరలో చార్జీలు అమలు చేసే అవకాశం ఉందని దిగ్గజ టెలికం సంస్థ అధికారి ఒకరు వెల్లడించారు. తొలుత వ్యాపార, వాణిజ్య కస్టమర్ల కోసం సేవలు ప్రారంభం అవుతాయని చెప్పారు. సాధారణ కస్టమర్లకు శాటిలైట్ టెలికం సేవలు చేరడానికి చాలా కాలం పడుతుందన్నారు. విదేశాల్లో చార్జీలు ఇలా.. స్టార్‌లింక్ యూఎస్ఏలో రెసిడెన్షియల్ విభాగంలో నెలకు రూ.6,976 నుంచి ప్లాన్లు అందిస్తోంది. పరికరాల కోసం ఒకసారి చెల్లించాల్సిన సొమ్ము అదనం. స్టాండర్డ్ ఎక్విప్మెంట్ కిట్ ధర రూ.30,443గా ఉంది. » ఇక మొబైల్ సేవలు కావాల్సినవారు నెలకు కనీసం రూ.4,360 చెల్లించాల్సి ఉంటుంది. డేటా అపరిమితంగా అందుకోవచ్చు. 220 ఎంబీపీఎస్ వరకు స్పీడ్ ఆఫర్ చేస్తోంది. » రెసిడెన్షియల్ లైట్, రెసిడెన్షియల్ ప్లాన్లలో కూడా వినియోగదారులు అపరిమిత డేటాను అందుకోవచ్చు. » రోమింగ్ ప్లాన్ తీసుకునే వినియోగదారులు దేశవ్యాప్తంగా, ప్రయాణంలో, అంతర్జాతీయ ప్రయాణ సమయంలో కూడా వినియోగం, తీర ప్రాంతాల్లో కవరేజీ పొందవచ్చు. బిజినెస్ విభాగంలో నెలకు రూ.12,208 నుంచి రూ.4,36,000 వరకు ప్లాన్స్ ఉన్నాయి. » ఇక భూటాన్‌లో రెసిడెన్షియల్ లైట్ ప్లాన్ కింద స్టార్‌లింక్ నెలకు రూ.3,000 చార్జీ చేస్తోంది. ఈ ప్లాన్‌లో ఇంటర్నెట్ 23–100 ఎంబీపీఎస్ స్పీడ్‌తో ఆఫర్ చేస్తోంది. యూరప్‌లో స్టార్‌లింక్ ఇంటర్నెట్ వేగం ఊక్లా నివేదిక ప్రకారం హంగరీలో అక్టోబర్–డిసెంబర్ కాలంలో గరిష్టంగా 135.11, కనిష్టంగా సైప్రస్‌లో 36.52 ఎంబీపీఎస్ నమోదైంది. మనదగ్గర చాలా చవక.. శాటిలైట్ ఇంటర్నెట్ చార్జీలతో పోలిస్తే మన దేశంలో మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ చాలా చవక. అటూ ఇటూగా రూ.20 చెల్లిస్తే ఒక జీబీ డేటా అందుకోవచ్చు. సుమారు రూ.50 నుంచి అన్లిమిటెడ్ ప్యాక్స్ లభిస్తాయి. హోమ్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు నెలకు కనీసం రూ.400 నుంచి ఉన్నాయి. హై–ఎండ్ ప్లాన్ అయితే నెలకు రూ.4,000 వరకు ఉంది. దీనిలో 10 జీబీపీఎస్ వరకు వేగం, అన్ని ఓటీటీ యాప్స్ సబ్‌్రస్కిప్షన్ కూడా అందుతుంది. రూటర్‌కు అయ్యే వ్యయమూ తక్కువే. శాటిలైట్ టెలికం కేవలం ఇంటర్నెట్కే పరిమితం. కాల్స్ చేయాలంటే ఓటీటీ యాప్స్‌పైన ఆధారపడాల్సిందే.స్టార్ లింక్ ప్రత్యేకతలు ఇవీ.. కక్ష్యలో ఉన్న ఉపగ్రహాలు: సుమారు 7,000 శాటిలైట్ ఇంటర్నెట్ అందిస్తున్న దేశాలు: 100కుపైగా వినియోగదారులు: సుమారు 50 లక్షలు (2024 డిసెంబర్ చివరినాటికి) అమెరికాలో దిగ్గజ బ్రాండ్‌బ్యాండ్ కంపెనీలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో గట్టి పోటీనిస్తోంది. రూరల్ కనెక్టివిటీ: మారుమూల ప్రాంతాలు, పల్లెలకు వేగంగా ఇంటర్నెట్ అందిస్తోంది. విద్య, ఆరోగ్య సేవలు, ఈ–కామర్స్‌కు వెన్నుదన్నుగా నిలుస్తోంది.భారత్‌లో పోటీ: దేశంలో 94.5 కోట్ల మంది బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులు ఉన్నారు. అందులో 90.4 కోట్ల మంది వైర్లెస్/మొబైల్ ఇంటర్నెట్ను వాడుతున్నారు. -
టెస్లా కారు కొనుగోలు చేసిన ట్రంప్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టెస్లా మోడల్ ఎస్ కారును కొనుగోలు చేసి ఎలాన్ మస్క్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. దాంతో టెస్లాకు మద్దతుగా నిలిచారు. ట్రంప్ కారు కొనుగోలు చేసేందుకు వీలుగా మస్క్ వైట్హౌజ్నే షోరూమ్‌గా మార్చుకున్నారు. ట్రంప్ తనకు నచ్చిన కారును ఎంచుకునేందుకు వీలుగా కొన్ని మోడళ్లను వైట్‌హౌజ్‌లో ప్రదర్శించారు. అందులోనుంచి అధ్యక్షుడు ట్రంప్ సెడాన్ రెడ్ మోడల్ ఎస్‌ను ఎంచుకున్నారు.డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ (డోజ్)లో మస్క్ ప్రమేయంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వ అధీనంలో చాలామంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించడంతోపాటు డోజ్ తీసుకుంటున్న విభిన్న నిర్ణయాలపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. దాంతో మస్క్ ఆధ్వర్యంలోని టెస్లా కొనుగోళ్లను బహిష్కరించాలని అమెరికాలో పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు. దీనిపై స్పందించిన ట్రంప్ టెస్లాకు మద్దతుగా నిలుస్తానని, కంపెనీ కారును తాను కొనుగోలు చేస్తానని మాటిచ్చారు. దాంతో తాజాగా కంపెనీ మోడల్ ఎస్‌ను కొనుగోలు చేశారు. ఇటీవల కంపెనీ స్టాక్ ధరలు క్షీణించడం టెస్లాకు సవాలుగా మారింది. బహిరంగంగా ట్రంప్ టెస్లా కారు కొనుగోలు చేయడం ద్వారా కంపెనీకి మద్దతుగా నిలవాలని భావించారు.President @realDonaldTrump and @elonmusk hop in a Tesla! pic.twitter.com/NRRm7IEQGf— Margo Martin (@MargoMartin47) March 11, 2025ఇదీ చదవండి: మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్.. స్టార్‌లింక్‌తో జియో ఒప్పందంట్రంప్ ఈ కారుపై ఆసక్తిగా ఉన్నప్పటికీ సీక్రెట్ సర్వీస్ ఆంక్షల కారణంగా తాను దాన్ని స్వయంగా నడపలేనని తెలిపారు. సిబ్బంది ఉపయోగించేందుకు వీలుగా వైట్‌హౌజ్ వద్ద ఉంటుందని చెప్పారు. కారు కొనుగోలు చేసిన సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ..‘మస్క్ గొప్ప దేశభక్తుడు. ఆటోమొబైల్ పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఆయన చేస్తున్న కృషి అభినందనీయం. ఈ కారును నేను పూర్తి ధర వెచ్చింది 80వేల డాలర్ల(రూ.69.7 లక్షలు)కు కొనుగోలు చేశాను. మస్క్ దీనిపై డిస్కౌంట్ ఇచ్చేవారే. కానీ, ఒకవేళ నేను రాయితీ తీసుకుంటే ఇతర ప్రయోజనాలు పొందానని కొందరు విమర్శలు చేస్తారు’ అని చెప్పారు. -
భారత్‌లో స్టార్‌లింక్.. ఎలాన్ మస్క్‌తో ఎయిర్టెల్ డీల్
ఢిల్లీ : ప్రముఖ టెలికాం దిగ్గజం ఎయిర్టెల్ శుభవార్త చెప్పింది. తన వినియోగదారులకు హైస్పీడ్ ఇంటర్నెట్ను అందించేందుకు అపరకుబేరుడు ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్తో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. స్పేస్ఎక్స్కు చెందిన స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని భారత్‌లో ఎయిర్టెల్ కస్టమర్లకు అందించనున్నట్లు ఎయిర్టెల్ ప్రెస్‌నోట్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా ఎయిటెల్ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ ఛైర్మన్ గోపాల్ మిట్టల్ మాట్లాడుతూ.. భారత్‌లో ఎయిర్టెల్ కస్టమర్లకు శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందించేందుకు స్పేఎక్స్‌తో పనిచేయడం ఓ మైలురాయి. ముఖ్యంగా కస్టమర్లకు శాటిలైట్ ఇంటర్నెట్ను అందించేందుకు సంస్థ కట్టుబడి ఉంది. ఎయిర్టెల్, స్పేస్ఎక్స్ ఒప్పందంలో భాగంగా ఎయిర్టెల్ రిటైల్ స్టోర్లలో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని పొందేందుకు అవసరమయ్యే ఎక్విప్మెంట్ పొందవచ్చు. దీంతో పాటు భారత్‌లో మారుమూల ప్రాంతాల్లో పాఠశాలలు, ఆరోగ్య కేంద్రాలు, తదితర వాటిని కనెక్ట్ చేసేందుకు ఈ డీల్ ఉపయోగపడనుందని తెలిపారు. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా స్టార్‌లింక్ పేరుతో శాటిలైట్ ఇంటర్నెట్ సేవల్ని అందిస్తోంది. దీంతో పాటు మొబైల్ బ్రాడ్ బ్యాండ్‌ను అందించే లక్ష్యంతో పనిచేస్తోంది. తద్వారా యూజర్లు స్ట్రీమింగ్, వీడియో కాల్స్, ఆన్లైన్ గేమింగ్, రిమోట్ వర్కింగ్ కార్యకలాపాలు సులభతరం కానున్నాయి. ఇప్పుడే ఈ సంస్థతో ఎయిర్టెల్ ఒప్పందం కుదుర్చుకుంది. -
ఎలన్ మస్క్ కే మస్కా కొట్టించారు..!
-
మస్క్ పతనం మొదలైందా?: లక్షల కోట్లు ఆవిరి
టెస్లా, స్పేస్ఎక్స్, ఎక్స్ (ట్విటర్) వంటి సంస్థలను విజయవంతంగా ముందుకు నడిపిస్తున్న ఎలాన్ మస్క్ సంపద భారీగా ఆవిరవుతోంది. ఇటీవల తన నికర విలువలో 120 బిలియన్ డాలర్లు (రూ. 10లక్షల కోట్ల కంటే ఎక్కువ) తగ్గింది. అయితే.. 330 బిలియన్ డాలర్ల సంపదతో, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నప్పటికీ.. 2025 ప్రారంభం నుంచి సంపదలో 25 శాతం క్షీణతను పొందారు. ఇది ఇలాగే కొనసాగితే.. నెం.1 స్థానానికే ముప్పు ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.మస్క్ తరువాత స్థానంలో అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ (Jeff Bezos), ఫేస్బుక్ అధినేత మార్క్ జుకర్‌బర్గ్ (Mark Zuckerberg) ఉన్నారు. మస్క్ సంపద ఇలాగే తగ్గుతూ పోతే.. ప్రపంచ కుబేరుడి స్థానాన్ని మరొకరు స్వాధీనం చేసుకుంటారు.మస్క్ సంపద తగ్గడానికి కారణంమస్క్ సంపద తగ్గడానికి ప్రధాన కారణం టెస్లా (Tesla) అని తెలుస్తోంది. ఈ ఎలక్ట్రిక్ కార్ కంపెనీ అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండటం వల్ల.. టెస్లా అమ్మకాలు 2024 డిసెంబర్ నుంచి 2025 జనవరి వరకు 16 శాతం తగ్గాయి. అంతే కాకుండా గత రెండు నెలల్లో, టెస్లా షేర్ ధర దాదాపు 35% తగ్గింది. దీంతో మస్క్ సంపద గణనీయంగా తగ్గింది.ఇదీ చదవండి: ఎక్స్‌పై సైబర్ ఎటాక్ ఆ దేశం పనే!మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే సంస్థలు కూడా పెరిగాయి. దీంతో చాలామంది కొత్త కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపారు. దెబ్బకు టెస్లా ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలు పడిపోయాయి. అమ్మకాల్లో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వాల్సి వచ్చింది. కాగా టెస్లా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.రాజకీయ ప్రమేయంప్రపంచ కుబేరుడు, దిగ్గజ వ్యాపారవేత్త మస్క్ సంపద తగ్గడానికి మరో కారణం.. పెరుగుతున్న రాజకీయ ప్రమేయం అని తెలుస్తోంది. ట్రంప్ ఎన్నికల ప్రచారానికి మస్క్ భారీగా ఖర్చు చేశారు. దీంతో అమెరికా కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత.. డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ (DOGE) అధిపతిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ తరువాత కొంతమంది పెట్టుబడిదారులతో భయం మొదలైంది. ఇది కూడా మస్క్ కంపెనీ షేర్స్ తగ్గడానికి కారణమైంది. -
ఎక్స్‌పై సైబర్ ఎటాక్ ఆ దేశం పనే!
ఎలాన్ మస్క్ (Elon Musk) సారథ్యంలోని ఎక్స్(ట్విటర్)లో అంతరాయం ఏర్పడింది. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ప్రపంచవ్యాప్తంగా పలుమార్లు డౌన్ అయింది. ఈ విషయాన్ని మస్క్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.ఎక్స్ సైబర్ దాడిని ఎదుర్కొంటోందని.. హ్యాకర్లను గుర్తించడానికి ప్రయత్నిస్తున్నామని ట్వీట్ చేశారు. దీని వెనుక ఒక పెద్ద సమూహం లేదా ఒక దేశం హస్తం ఉండొచ్చు అని మస్క్ తెలిపారు. ఉక్రెయిన్ ప్రాంతంలోని ఐపీ చిరునామాల నుంచి సైబర్ దాడి జరిగిందని అన్నారు. ఈ కారణంగానే రోజంతా అంతరాయం ఏర్పడిందని అన్నారు.డౌన్‌డెటెక్టర్ ప్రకారం.. ఎక్స్ ప్లాట్‌ఫామ్ రోజంతా మూడు అంతరాయాలను ఎదుర్కొంది. మధ్యాహ్నం 3:00 గంటలకు ఈ అంతరాయాలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. భారతదేశం నుంచి దాదాపు 2000 మంది, యునైటెడ్ స్టేట్స్ నుంచి 18,000 మంది, యునైటెడ్ కింగ్డమ్ నుంచి 10,000 మంది ఎక్స్ యాప్‌ను యాక్సెస్ చేయలేకపోయినట్లు స్పష్టం చేసింది. రాత్రి 9 గంటలకు కూడా ఈ అంతరాయాలు కొనసాగాయి.ట్రాకింగ్ వెబ్సైట్ దాదాపు 52 శాతం సమస్యలు వెబ్‌సైట్‌కు సంబంధించినవని, 41 శాతం యాప్‌కు సంబంధించినవని, 8 శాతం సర్వర్ కనెక్షన్ సమస్యలతో సంబంధం కలిగి ఉన్నాయని చూపించింది. ఇప్పుడు కూడా అంతరాయం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది.ఎలాన్ మస్క్ 2022లో 44 బిలియన్ డాలర్లకు (రూ. 3 లక్షల కోట్ల కంటే ఎక్కువ) Xని కొనుగోలు చేశారు. 2023లో అతని ఫాలోవర్స్ సంఖ్య 200 మిలియన్స్ దాటేసింది. దీంతో ప్రపంచంలోనే అత్యధిక ఫాలోవర్స్ ఉన్న మొదటి వ్యక్తిగా రికార్డ్ క్రియేట్ చేశారు. -
ఎక్స్ డౌన్: గగ్గోలు పెడుతున్న యూజర్లు
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నాయకత్వంలో నడుస్తున్న ఎక్స్ (ట్విటర్)లో అంతరాయం ఏర్పడింది. లక్షలాది మంది వినియోగదారులు ఈ సోషల్ మీడియా యాప్‌ను యాక్సెస్ చేయలేకపోయినట్లు వెల్లడించారు.ఆన్లైన్ అంతరాయాలను ట్రాక్ చేసే ప్లాట్‌ఫామ్ డౌన్‌డెటెక్టర్ నివేదికల ప్రకారం.. భారతదేశం నుంచి దాదాపు 2000 మంది, యునైటెడ్ స్టేట్స్ నుంచి 18,000 మంది, యునైటెడ్ కింగ్డమ్ నుంచి 10,000 మంది ఎక్స్ యాప్‌ను యాక్సెస్ చేయలేకపోయినట్లు స్పష్టం చేసింది. అయితే ఈ అంతరాయంపై కంపెనీ స్పందించలేదు.X Twitter Down, Users Face Outage: Social media platform X has started showing troubles as several users reported it was not working in India which could be because of a technical glitch. pic.twitter.com/mmhRrJP6Oa— Divya 🦋 (@Hiraeth85) March 10, 2025యాప్‌ను ఓపెన్ చేయడానికి ప్రయత్నించినప్పుడు.. చాలా మంది వినియోగదారులకు "ఏదో తప్పు జరిగింది, మళ్లీ లోడ్ చేయడానికి ప్రయత్నించండి" అనే సందేశం వచ్చింది.డౌన్‌డెటెక్టర్ డేటా ప్రకారం 57% మంది వినియోగదారులు X యాప్‌తో సమస్యలను ఎదుర్కొంటున్నారని, 34% మంది వెబ్సైట్లో సమస్యలు ఉన్నాయని, 9% మంది సర్వర్ సమస్యలను నివేదించారని తేలింది. UKలో, 61% మంది వినియోగదారులు అప్లికేషన్ గురించి, 34% మంది వెబ్సైట్ గురించి, 5% మంది సర్వర్ సమస్యలను ఎదుర్కొన్నారు.𝕏 is down / having connection issues. @grok is also down and unable to complete requests.— Nicky 🇬🇧 (@NickyThomas) March 10, 2025 -
ప్రపంచ కుబేరుడితో నాల్గవ బిడ్డకు జన్మనిచ్చింది: ఎవరీ షివోన్ జిలిస్?
ప్రపంచ కుబేరుడు 'ఎలాన్ మస్క్' (Elon Musk) గురించి తెలిసిన చాలామందికి.. అతని నలుగురు పిల్లలకు తల్లి అయిన 'షివోన్ జిలిస్' (Shivon Zilis) గురించి బహుశా తెలిసుండకపోవచ్చు. ఇంతకీ ఈమె ఎవరు? ఈమె గురించి ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.నిజానికి.. షివోన్ జిలిస్ భారతీయ మూలాలున్న మహిళ. ఎలా అంటే ఈమె తల్లి పంజాబీ ఇండియన్ శారద. అయితే శారద కెనడియన్ అయిన రిచర్డ్‌ని వివాహం చేసుకుంది. వీరిద్దరికి పుట్టిన సంతానమే షివోన్ జిలిస్. ఈమె 1986 ఫిబ్రవరి 8న కెనడాలోని అంటారియోలోని మార్ఖమ్‌లో జన్మించింది.షివోన్ జిలిస్ అమెరికాలోని ప్రతిష్టాత్మక యేల్ విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రం, తత్వశాస్త్ర డిగ్రీలు పూర్తి చేశారు. ఐటీ దిగ్గజం ఐబీఎం కంపెనీలో తన కెరీర్ ప్రారంభించింది. యేల్ యూనివర్సిటిలో చదువుకునే సమయంలో ఐస్ హాకీ జట్టులో కీలక సభ్యురాలు. గోల్ కీపర్‌గా ఆల్ టైమ్ బెస్ట్. ఆమె గిటార్, డ్రమ్స్ కూడా ప్లే చేసేది.షివోన్ జిలిస్ కెనడియన్ ఏఐ నిపుణురాలు, వెంచర్ క్యాపిటలిస్ట్. ఆమె మస్క్ వ్యాపార సామ్రాజ్యంలో కీలక పాత్ర పోషిస్తుంది. అంతే కాకుండా ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్‌లో ప్రత్యేకత కలిగిన టెస్లా, ఓపెన్ఏఐ, న్యూరాలింక్ వంటి కంపెనీలలో పనిచేసినట్లు సమాచారం.షివోన్ జిలిస్ 2016లో ఓపెన్ఏఐ (OpenAI)లో బోర్డు సభ్యురాలిగా చేరింది. తరువాత 2017 నుంచి 2019 వరకు టెస్లాలో పనిచేసింది, అక్కడ ఆమె కంపెనీ ఆటోపైలట్ ప్రోగ్రామ్, సెమీకండక్టర్ వంటి విభాగాల్లో కీలక పాత్ర పోషించింది. ఆ సమయంలో మస్క్ బ్రెయిన్ చిప్ స్టార్టప్ న్యూరాలింక్‌లో ప్రధాన పాత్ర పోషించింది. అక్కడ ఆమె ఆపరేషన్స్, ప్రత్యేక ప్రాజెక్టుల డైరెక్టర్‌గా పనిచేస్తోంది.ఇదీ చదవండి: ఆ నగరం భారతదేశ బాహుబలి: ఆనంద్ మహీంద్రా2021లో షివోన్ జిలిస్ కవలలకు జన్మనించింది, 2024లో మూడవ బిడ్డను స్వాగతించింది. కాగా ఇటీవల నాల్గవ బిడ్డకు జన్మనిచ్చినట్లు, బిడ్డకు సెల్డాన్ లైకుర్గస్ (Seldon Lycurgus) అని పేరు పెట్టినట్లు వెల్లడించింది. మొత్తం మీద ఇప్పుడు ఎలాన్ మస్క్ 14 మంది పిల్లలకు తండ్రి అయ్యారు. -
ట్రంప్ కేబినెట్ మీటింగ్‌లో రచ్చ.. రచ్చ!
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షతన జరిగిన తాజా కేబినెట్ సమావేశం రసాభాసా చోటు చేసుకుంది. అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రుబియో(Marco Rubio), వైట్‌హౌజ్ సలహాదారు ఇలాన్ మస్క్‌లు ట్రంప్ సమక్షంలోనే వాగ్వాదానికి దిగారు.స్టేట్ డిపార్ట్మెంట్లలో ఉద్యోగులను తొలగించకపోవడాన్ని ప్రస్తావించిన మస్క్.. రుబియోపై చిందులు తొక్కారు. ట్రంప్ ఏరికోరి నియమించుకున్న వ్యక్తి.. కేవలం టీవీల్లో కనిపించడంపైనే దృష్టిసారిస్తున్నారంటూ సెటైర్లు వేశారు. అయితే.. అబద్ధాలు చెబుతున్నారంటూ మస్క్ మొహం మీదే రుబియో కౌంటర్లు ఇచ్చారు.స్టేట్ డిపార్ట్మెంట్ నుంచి 1,500 మంది ఉద్యోగులను ఇప్పటికే తొలగించామని(Layoffs). ఒకవేళ వాళ్లందరినీ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకుని మరి తొలగించాలని మస్క్ భావిస్తున్నారేమోనని వెటకారంగా సమాధానం ఇచ్చారు. దీంతో.. ఇద్దరి మధ్య వాగ్వాదం మొదలైంది. ఒకానొక టైంలో.. ట్రంప్ రుబియోకి మద్ధతుగా నిలిచినట్లు సమాచారం. ఇక.. ఈ కేబినెట్ సమావేశంలో పాల్గొన్న అధికారులంతా మస్క్‌పై ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. మస్క్ చర్యలతో రిపబ్లికన్లలోనూ అసహనం పెరిగిపోతోందని.. ఈ క్రమంలోనే వైట్‌హౌజ్‌కు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయని చీఫ్ స్టాఫ్ సుసీ వైల్స్ మీటింగ్‌లో ప్రస్తావించారు. ఈ మేరకు గురువారం కేబినెట్ మీటింగ్‌లో జరిగిన అంశాలన్నింటిని ప్రస్తావిస్తూ న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ఇచ్చింది. అయితే..అలాంటిదేం లేదుకేబినెట్ మీటింగ్ హాట్ హాట్‌గా సాగిందన్న మీడియా కథనాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఖండించారు. శుక్రవారం ఓవెల్ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘నేను అక్కడే ఉన్నా కదా. అక్కడ ఎలాంటి ఘర్షణ జరలేదు. మీరే(మీడియాను ఉద్దేశించి..) లేనిపోనివి సృష్టిస్తున్నారు. ఇలాన్, మార్కో ఇద్దరూ గొప్పవాళ్లే. వాళ్లు తమ విధులను అద్భుతంగా నిర్వర్తిస్తున్నారు’’ అని ట్రంప్ పొగడ్తలు గుప్పించారు.డోజ్ విమర్శలపై మస్క్అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. ప్రముఖ బిలియనీర్ ఇలాన్ మస్క్‌ను డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ(DOGE) సారథిగా నియమించారు. అమెరికా ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే ‘డోజ్’ ప్రాజెక్టు లక్ష్యమని, తన ప్రభుత్వంలో సమర్థత పెంచేందుకు ఈ విభాగం కృషి చేస్తుందని ఆ టైంలో ట్రంప్ ప్రకటించారు. ప్రభుత్వ శాఖల్లో వృథా ఖర్చులకు కత్తెర, దుబారా ఖర్చులకు కోత, అవినీతి నిర్మూలన, ఫెడరల్ సంస్థలను పునర్మిర్మాణం.. ఇవన్నీ డోజ్ చేయాల్సి ఉంది. ఇందులో భాగంగా.. ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాల తొలగింపు చేపట్టారు. అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం.. 2026 జులై 4వ తేదీలోపు మొత్తం ఫెడరల్ బ్రూరోక్రసీని ఇది ప్రక్షాళన చేయాల్సి ఉంది. ఆ తర్వాత డోజ్ దానికదే ఎక్స్పైరీ కానుంది.అయితే.. డోజ్ తీసుకునే తీవ్రమైన నిర్ణయాల వల్ల దేశ రక్షణ, మౌలిక సదుపాయాల కల్పన వంటి ప్రభుత్వం అందించే సేవలు నిర్వీర్యం అయ్యే అవకాశం ఉందని విమర్శకులు హెచ్చరిస్తున్నారు. దీర్ఘకాలిక అభివృద్ధి కావాలంటే.. కొన్నింటిని వదులుకోవాలని మస్క్ తన చర్యలను సమర్థించుకుంటున్నారు. -
పొద్దుపొద్దునే ఉల్కా పాతాన్ని తలపించేలా.. ముక్కలు చెక్కలైన రాకెట్
ప్రముఖ బిలీయనీర్ ఇలాన్ మస్క్‌కు చెందిన రాకెట్ సంస్థ స్పేస్ఎక్స్ ఎదురు దెబ్బ తగిలింది. స్టార్‌షిప్ రాకెట్ గగనతలంలో పేలిపోయి ముక్కలు చెక్కలు అయ్యింది. ఈ రాకెట్‌కు సంబంధించి ఇది ఎనిమిదో ప్రయోగం కాగా.. ఆ శకలాలు ఫ్లోరిడా, బహమాస్లలో పడడం విశేషం.చంద్రుడు, అంగారకుడిపైకి మానవ సహిత ప్రయోగాల కోసం.. స్టార్‌షిప్ సామర్థ్యాన్ని పరీక్షించడం, అలాగే డమ్మీ ఉపగ్రహాలను నిర్దిష్ట కక్ష్యలోకి వంటి అంశాలను పరీక్షించేందుకు ఈ ప్రయోగం నిర్వహించారు. ఈ ఉదయం టెక్సాస్ నుంచి స్పేస్ఎక్స్ స్టార్‌షిప్-8 స్పేస్‌క్రాఫ్ట్ ప్రయోగించారు. అయితే..స్పేస్‌లోకి ప్రవేశించిన వెంటనే అది పేలిపోయింది. ఆ శకలాలు దక్షిణ ఫ్లోరిడా.. అక్కడి నుంచి 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహమాస్‌లోనూ పడ్డాయి. ఈ నేపథ్యంలో పలు విమాన సర్వీసులకు అంతరాయం కలిగింది. ఉల్కా పాతాన్ని తలపించేలా ఉన్న ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Is that space X rocket disintegration #spacex pic.twitter.com/apEagPIqDB— Talha Mirza (@tmirza777) March 6, 2025“Never give up” Elon Musk Starship 8 debris pic.twitter.com/NseQxyEZWP— Tesla Owners Silicon Valley (@teslaownersSV) March 7, 2025 ఇదిలా ఉంటే.. స్టార్‌షిప్ రాకెట్ ప్రయోగం విఫలం కావడం ఈ ఏడాదిలో ఇది రెండోసారి. జనవరిలో ప్రయోగం జరగ్గా.. కరేబియన్ దీవులపైన రాకెట్ పేలిపోయింది. ఆ శకలాలు ట్రక్స్ అండ్ కైకోస్ దీవుల్లో పడ్డాయి. మొత్తంగా ఇప్పటిదాకా స్టార్‌షిప్ రాకెట్‌తో ఎనిమిది ప్రయోగాలు చేయగా.. మే 2021లో నిర్వహించిన ఎస్ఎన్ 15 టెస్ట్ ఫ్టైట్ ఒక్కటి మాత్రమే పాక్షికంగా సక్సెస్ అయ్యింది.ప్రపంచంలోనే అతిపెద్ద రాకెట్‌గా స్టార్షిప్గా ప్రస్తుతానికి గుర్తింపు ఉంది. 123 మీటర్ల ఎత్తు(403 అడుగులు)తో నాసా శాటర్న్-V రికార్డును బద్ధలు కొట్టింది. రాకెట్ రూపకల్పనకు రూ.830 కోట్ల రూపాయలను స్పేస్ఎక్స్ ఏజెన్సీ ఖర్చు చేసింది. అంగారకుడు, చంద్రుడిపైకి మానవ సహిత రాకెట్ ప్రయోగాల కోసం దీనిని తయారు చేశారు. -
భారత్‌లో టెస్లా తొలి షోరూమ్.. ఎక్కడంటే..
ఎలక్ట్రిక్ కార్ల యూఎస్ దిగ్గజం టెస్లా(Tesla) భారత్‌లో తొలి షోరూమ్‌ను ముంబైలో ఏర్పాటు చేయనుంది. ఇందుకు వీలుగా బాంద్రా కుర్లా కాంప్లెక్స్(బీకేసీ) బిజినెస్ డిస్ట్రిక్ట్‌లో 4,000 చదరపు అడుగుల స్పేస్‌ను లీజుకి తీసుకుంది. సీఆర్ఈ మ్యాట్రిక్స్ వివరాల ప్రకారం పార్కింగ్ సౌకర్యాలుగల షోరూమ్ స్పేస్‌కుగాను కంపెనీ ప్రమోటర్, బిలియనీర్ ఎలాన్ మస్క్ నెలకు రూ.35 లక్షల అద్దె చెల్లించనున్నారు. అద్దె ఏడాదికి 5 శాతం పెంపు ప్రాతిపదికన ఐదేళ్ల కాలానికి యూనివ్‌కో ప్రాపర్టీస్ నుంచి లీజుకి తీసుకుంది. ఈ ప్రాపర్టీ గ్రౌండ్ ఫ్లోర్ దేశీయంగా ఏర్పాటైన తొలి యాపిల్ స్టోర్‌కు దగ్గరగా ఉంటుంది. రెంటల్ అగ్రిమెంట్ ఫిబ్రవరి 27న రిజిస్టరైంది. రూ.2.11 కోట్లు సెక్యూరిటీ డిపాజిట్‌గా టెస్లా జమ చేసింది.ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) భారతదేశానికి టెస్లా కార్లను తీసుకురానున్నట్లు గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. టెస్లా (Tesla) కార్లు దేశీయ విపణిలో అడుగుపెడితే.. వాటి ధరలు ఎలా ఉంటాయనే వివరాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే విదేశీ కంపెనీలపై దిగుమతి సుంకాలను విధించడం సర్వసాధారణం. ప్రస్తుత అనిశ్చితుల కారణంగా టెస్లా కంపెనీపై దిగుమతి సుంకాన్ని 20 శాతం తగ్గిస్తే కార్ల ధరలు తగ్గుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ధరలు తగ్గిన తరువాత కూడా టెస్లా కారు ధర రూ.35 లక్షల నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుందని ఇటీవల గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్ కంపెనీ సీఎల్ఎస్ఏ తన నివేదికలో వెల్లడించింది.ఇదీ చదవండి: ఈ ఏడాదే భారత్‌లోకి చిన్న ఎలక్ట్రిక్ ఎస్యూవీప్రస్తుతం అమెరికాలో టెస్లా చౌకైన కారు ‘మోడల్ 3’ ధర ఫ్యాక్టరీ స్థాయిలో దాదాపు 35,000 డాలర్లు (సుమారు రూ.30.4 లక్షలు). భారతదేశంలో దిగుమతి సుంకాలను 15-20 శాతానికి తగ్గించడంతో పాటు, రోడ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ వంటి అదనపు ఖర్చులతో, ఆన్-రోడ్ ధర 40,000 డాలర్లు లేదా దాదాపు రూ.35-40 లక్షలుగా ఉంటుందని అంచనా. మహీంద్రా XEV 9e, హ్యుందాయ్ ఈ-క్రెటా, మారుతి సుజుకి ఈ-విటారా వంటి దేశీయ ఎలక్ట్రిక్ వెహికల్స్ కంటే టెస్లా మోడల్ 3 ధర 20-50 శాతం ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ ధరపై ఇంకా కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు. -
అంతరిక్షంలో ఉండటం కష్టం కాదు..
వాషింగ్టన్: అంతరిక్షంలో ఉండటం కష్టం కాదు, కానీ ఎప్పుడు భూమి మీదకు చేరుకుంటామో నాసా అధికారులకు కూడా తెలియకపోవడమే అసలైన కష్టమని వ్యోమగాములు సునీతా విలియమ్స్, బుచ్ విల్మోర్ అన్నారు. రాజకీయాలు జీవితంలో ఒక భాగమైనప్పటికీ... తను, విలియమ్స్ తిరిగి భూమిపైకి వెంటనే రాకపోవడానికి అవి కారణం కాదని విలియమ్స్ చెప్పారు. తన లాబ్రడార్ రిట్రీవర్స్తో తిరిగి ఆడుకోవడానికి వేచి చూస్తున్నానని తెలిపారు. స్పేస్ఎక్స్ క్యాప్సూల్స్‌లో మార్పు కారణంగా ఇప్పుడు మరో రెండు వారాలు అంతరిక్షంలో ఉండాల్సి వస్తోందని వెల్లడించారు. సహ వ్యోమగామి విల్మోర్తో కలిసి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని 2030 చివరిలో కాకుండా ముందుగానే రిటైర్ చేయాలని మస్క్ ఇటీవల చేసిన సూచనను విలియమ్స్ తోసిపుచ్చారు. ‘ఇప్పుడు కీలకమై న సమయంలో ఉన్నాం. ఐఎస్ఎస్ ని్రష్క మణకు ఇది సరైన సమయం కాదని నేను అనుకుంటున్నాను.’అని విలియమ్స్ అన్నా రు. ఇక ఇన్నాళ్లు అంతరిక్ష కేంద్రంలో ఉండటం కొంత ఆందోళన కలిగించినా.. తాము తిరిగి భూమిమీదకు ఎప్పుడు చేరుకుంటామో నాసా అధికారులకు కూడా తెలియకపోవడమే అసలైన కష్టమని ఆమె వ్యాఖ్యానించారు. గతేడాది జూన్‌లో అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన విల్మోర్, విలియమ్స్ వారం రోజుల్లో తిరిగి రావాల్సి ఉంది. కానీ.. స్టార్‌లైనర్‌లో సాంకేతిక సమస్యల కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. గతేడాది క్రిస్మస్ వేడుకల ఫొటోలను విల్మోర్, విలియమ్స్ పంచుకోవడం, అందులో నీరసంగా కనిపించడంతో వారి ఆరోగ్యంపై ఆందోళనలు తలెత్తిన విషయం తెలిసిందే. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సైతం ఆందోళన వ్యక్తంచేశారు. మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం వారిని వదిలేసిందని ఆయన ఆరోపించారు. అంతేకాదు.. తొందరగా తీసుకురావాలంటూ స్పేస్ఎక్స్ చీఫ్ మస్క్‌కు విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మస్క్ వీలైనంత తొందరగా తీసుకొస్తానని తెలిపారు. అయితే మస్క్ నుంచి ఎలాంటి ఆఫర్ రాలేదని నాసా ఉన్నతాధికారులు చెప్పారని బిడెన్ హయాంలోని నాసా మాజీ డిప్యూటీ అడ్మినిస్ట్రేటర్ పామ్ మెల్రాయ్ ఫిబ్రవరిలో వెల్లడించారు. దీనిపై స్పందించిన విల్మోర్ ఆ విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదన్నారు. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, టెక్ దిగ్గజం మస్్కపై తమకు గౌరవం, అభిమానం ఉన్నాయన్నారు. ‘మేం దేశానికి మద్దతునిస్తాం. దేశాధినేతలకు మద్దతునిస్తాం. వారికి కృతజ్ఞతలు’అని ప్రకటించారు. జనవరిలో ఇద్దరూ కలిసి స్పేస్ వాక్ చేశారు. -
అమెరికాలో ట్విస్ట్.. జేడీ వాన్స్, మస్క్‌కు ఝలక్
వాషింగ్టన్: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్, జేడీ వాన్స్‌ల ఆవేశపూరిత సంభాషణ అనంతరం అమెరికా అంతటా ఉక్రెయిన్ అనుకూల నిరసనలు జరిగాయి. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, బోస్టన్లలో వందలాది మంది ప్రజలు ఉక్రెయిన్‌కు మద్దతుగా రోడ్లపైకి వచ్చారు. ‘అమెరికా స్టాండ్స్ విత్ ఉక్రెయిన్’, ‘బి స్ట్రాంగ్ ఉక్రెయిన్’ ప్లకార్డులను ప్రదర్శించారు.హాలిడే కోసం వెర్మోంట్లోని వెయిట్స్ఫీల్డ్కు వచ్చిన వైస్ ప్రెసిడెంట్ వాన్స్, ఆయన కుటుంబానికి వ్యతిరేకంగా నిరసనకారులు ప్రదర్శన చేపట్టారు. మరోవైపు వీరికి వ్యతిరేకంగా, ట్రంప్, వాన్స్‌లకు అనుకూలంగా వెయిట్స్ఫీల్డ్లో కౌంటర్ నిరసనలు కూడా జరిగాయి. ఫెడరల్ ఉద్యోగుల తొలగింపుల నేపథ్యంలో ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా స్టోర్ల ముందు కూడా అమెరికా వ్యాప్తంగా ప్రజలు ఆందోళనలు నిర్వహించారు. Vermont's message to JD Vance: Not in our town, you fascist piece of shit. 😡😡😡😡😡👇 pic.twitter.com/Pk4QwFu3fv— Bill Madden (@maddenifico) March 1, 2025ట్రంప్‌పై నమ్మకం లేదు..ఇదిలా ఉండగా.. అధ్యక్షుడిగా డొనాల్ట్ ట్రంప్ దేశాన్ని ముందుకు నడిపించే విధానంపై ప్రజల్లో ఇప్పటికీ అనుకూల వైఖరి కంటే వ్యతిరేక వైఖరే ఎక్కువగా కనిపిస్తోంది. ట్రంప్‌పై ప్రజామోదం, పని తీరు, నిర్ణయాలు, దేశాన్ని ఆయన సరైన దిశగా నడిపిస్తున్నారా అంటే లేదనే ఎక్కువ మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. మొత్తమ్మీద ట్రంప్ పని తీరుపై 52 శాతం మంది పెదవి విరిచారు. 48 శాతం మంది మాత్రమే ట్రంప్ పాలన బాగుందన్నారు. ఫిబ్రవరి మధ్యలో సర్వే చేపట్టినప్పుడు సైతం దాదాపు ఇదే ఫలితం రావడం గమనార్హం. ఉద్యోగులపై వేటు సహా ఆయన విధానాలకు సొంత రిపబ్లికన్లు 90 శాతం మంది సానుకూలత చూపగా, ప్రతిపక్ష డెమోక్రాట్లు 90 శాతం మంది వ్యతిరేకత తెలిపారు. స్వతంత్రుల్లో 59 మంది కూడా ట్రంప్ తీరు నచ్చలేదన్నారు. ట్రంప్ విధానాలు దేశాన్ని తప్పుడు మార్గంలో నడిపిస్తున్నాయని 45 శాతం మంది చెప్పగా సరైన దిశగానే దేశం సాగుతోందని 39 శాతం మంది బదులిచ్చారు. కాగా, శుక్రవారం వైట్‌హౌస్‌లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో తీవ్ర వాదోపవాదం జరిగిన ముందు రోజే ఈ పోల్ ముగియడంతో, ఆ ప్రభావం దీనిపై కనిపించలేదు. Hundreds of protesters gathered in Waitsfield on Saturday morning to protest Vice President JD Vance, who is visiting Vermont with his family for a ski trip this weekend. pic.twitter.com/gICcSJBU2a— Vermont Public (@vermontpublic) March 1, 2025 -
నెం. 14, మరోసారి తండ్రైన బిలియనీర్ : పేరేంటో తెలుసా?
టెస్లా సీఈవో, బిలియనీర్ ఎలాన్ మస్క్ మరో సారి తండ్రి అయ్యాడు. మస్క్ భార్య, అతని కంపెనీ న్యూరాలింక్‌లో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న షివోన్ జిలిస్‌తో కలిసి నాలుగో బిడ్డను స్వాగతించారు. ఇప్పటికే మస్క్‌కు 13 మంది పిల్లలున్నారు. దీంతో ఇపుడు మస్క్ సంతానం సోషల్ మీడియాలో చర్చకు దారి తీసింది.మస్క్ భార్య షివోన్ జిలిస్ ఈ విషయాన్ని ఎక్స్( ట్విటర్) ద్వారా వెల్లడించింది. ఇప్పటికే ఈ దంపతులు కవలలు (స్ట్రైడర్ , అజూర్) ఏడాది పాప ఆర్కాడియా ఉన్నారు. నాలుగో బిడ్డకు సెల్డాన్ లైకుర్గస్గా అపుడే పేరు కూడా పెట్టేయడం గమనార్హం. అందమైన ఆర్కాడియా పుట్టినరోజు సందర్బంగా తమ అద్భుతమైన కుమారుడు సెల్డాన్ లైకుర్గస్ రాక గురించి చెప్పడం ఆనందంగా ఉంది అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌కు హార్ట్ సింబల్‌తో ఎలాన్ మస్క్ సమాధానమిచ్చాడు. గణనీయంగా క్షీణిస్తున్న జనాభాపై ఎపుడూ ఆందోళన వ్యక్తం చేసే మస్క్ సంతానోత్పత్తి ప్రాముఖ్యతపై దృష్టిపెట్టునట్టున్నాడు అంటోది సోషల్ మీడియా. జనాభా వృద్ధి చెందాలని భావించే మస్క్, ఇప్పటికే తన స్పెర్మ్‌ను స్నేహితులు, పరిచయస్తులకు దానం చేశాడనే వాదనలు కూడా చాలానే ఉన్నాయి. Discussed with Elon and, in light of beautiful Arcadia’s birthday, we felt it was better to also just share directly about our wonderful and incredible son Seldon Lycurgus. Built like a juggernaut, with a solid heart of gold. Love him so much ♥️— Shivon Zilis (@shivon) February 28, 2025కాగా షివోన్ జిలిస్‌తో తనకున్న నలుగురు పిల్లలతో పాటు, మస్క్‌కు మొదటి భార్య జస్టిన్ విల్సన్ ద్వారా ఐదుగురు పిల్లలు ఉన్నారు. వీరిలో కవలలు వివియన్ , గ్రిఫిన్‌తో పాటు, కై, సాక్సన్ , డామియన్ అనే ముగ్గురున్నారు. వీరి తొలి సంతానం బిడ్డ నెవాడా అలెగ్జాండర్ మస్క్ కేవలం 10 వారాల వయసులోనే మరణించాడు. -
ప్రపంచంలోని సూపర్ బిలియనీర్స్: జాబితాలో 24 మంది
ప్రపంచంలోని అత్యంత సంపన్నులైన సూపర్ బిలియనీర్ల జాబితాను 'ది వాల్ స్ట్రీట్ జర్నల్' (WSJ) విడుదల చేసింది. గ్లోబల్ వెల్త్ ఇంటెలిజెన్స్ సంస్థ ఆల్ట్రాటా డేటా ఆధారంగా డబ్ల్యూఎస్‌జే 24 మందిని సూపర్ బిలియనీర్లుగా గుర్తించింది. సంపద నికర విలువ 50 బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ ఉన్నవారు సూపర్ బిలియనీర్లు. 24 మంది సూపర్ బిలియనీర్లలో, 16 మంది సెంటీ బిలియనీర్ల వర్గంలోకి వస్తారు, వీరి నికర విలువ కనీసం 100 బిలియన్ డాలర్లు.ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడుడబ్ల్యూఎస్జే ప్రకారం.. టెక్ బిలియనీర్ 'ఎలాన్ మస్క్' భూమిపై అత్యంత ధనవంతుడు. ఈయన సంపద 419.4 బిలియన్ డాలర్లు (రూ. 36 లక్షల కోట్ల కంటే ఎక్కువ). మస్క్ సారథ్యంలో టెస్లా, స్పేస్ఎక్స్, న్యూరాలింక్, ఎక్స్ వంటి కంపెనీలు ఉన్నాయి.సూపర్ బిలియనీర్ల జాబితాలో భారతీయ వ్యాపార దిగ్గజాలు ముఖేష్ అంబానీ (17వ స్థానం), గౌతమ్ అదానీ (21వ స్థానం) కూడా ఉన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ నికర విలువ 90.6 బిలియన్ డాలర్లు (రూ.7 లక్షల కోట్ల కంటే ఎక్కువ), అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నికర విలువ 60.6 బిలియన్ డాలర్లు (రూ.5 లక్షల కోట్ల కంటే ఎక్కువ).సూపర్ బిలియనీర్ల జాబితా➤ఎలాన్ మస్క్: రూ.36.65 లక్షల కోట్లు➤జెఫ్ బెజోస్: రూ. 23.05 లక్షల కోట్లు➤బెర్నార్డ్ ఆర్నాల్ట్: రూ. 20.87 లక్షల కోట్లు➤లారెన్స్ ఎల్లిసన్: రూ. 20. 71 లక్షల కోట్లు➤మార్క్ జుకర్‌బర్గ్: రూ. 19.29 లక్షల కోట్లు ➤సెర్గీ బిన్: రూ. 14.02 లక్షల కోట్లు➤స్టీవెన్ బాల్మెర్: రూ. 13.75 లక్షల కోట్లు➤వారెన్ బఫెట్: రూ. 13.47 లక్షల కోట్లు➤జేమ్స్ వాల్టన్: రూ. 10.27 లక్షల కోట్లు➤సామ్యూల్ రాబ్సన్ వాల్టన్: రూ. 9.9 లక్షల కోట్లు➤అమాన్సియో ఒర్టెగా: రూ. 9.8 లక్షల కోట్లు➤ఆలిస్ వాల్టన్: రూ. 9.6లక్షల కోట్లు➤జెన్సెన్ హువాంగ్: రూ. 9.4 లక్షల కోట్లు ➤బిల్ గేట్స్: రూ. 9.2 లక్షల కోట్లు ➤మైఖేల్ బ్లూమ్‌బెర్గ్: రూ. 9.0 లక్షల కోట్లు➤లారెన్స్ పేజ్: రూ. 8.8 లక్షల కోట్లు ➤ముఖేష్ అంబానీ: రూ. 7.9 లక్షల కోట్లు ➤చార్లెస్ కోచ్: రూ. 5.8 లక్షల కోట్లు ➤జూలియా కోచ్: రూ. 5.6 లక్షల కోట్లు ➤ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్: రూ. 5.4 లక్షల కోట్లు ➤గౌతమ్ అదానీ: రూ. 5.2 లక్షల కోట్లు ➤మైఖేల్ డెల్: రూ. 5.2 లక్షల కోట్లు ➤జోంగ్ షాన్షాన్: రూ. 5.0 లక్షల కోట్లు ➤ప్రజోగో పంగేస్తు: రూ. 4.8 లక్షల కోట్లు -
‘‘అయ్యా ట్రంప్.. ఇలాంటి బతుకులెందుకు?’’
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విజన్‌పై అరబ్ దేశాలు భగ్గుమంటున్నాయి. తాజా ‘ట్రంప్ గాజా’ అంటూ ఆయన తన సోషల్ మీడియా అకౌంట్లో ఓ వీడియోను పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఊహాజనితమైన గాజా.. వాస్తవాలను ఏమాత్రం దాచిపెట్టలేదని.. అక్కడి ప్రజలు కోరుకునేది అలాంటి బ్రతుకులు కానేకాదని పలువురు మండిపడుతున్నారు.ఆకాశన్నంటే భవనాలు, లగ్జరీ ఓడలు, రాత్రిపూట బంగారు వర్ణంలో మెరిసి పోయే గాజా, నియంతృత్వ ధోరణిని ప్రతిబింబించేలా డొనాల్డ్ ట్రంప్(Donald Trump) బంగారు విగ్రహాలు, మధ్యలో ఏదో తింటూ కనిపించే ఇలాన్ మస్క్, డబ్బులు వెదజల్లే పిల్లలు, అటు పబ్‌లో డ్యాన్సర్లతో.. ఇటుపై ఇజ్రాయెల్ పీఎం నెతన్యాహూతో ట్రంప్ చొక్కాల్లేకుండా సేదతీరుతున్న దృశ్యాలను.. వెరసి విలాసవంతమైన ప్రాంతంగా ఉన్న గాజా వీడియోను ట్రంప్ తన ట్రూత్ సోషల్‌లో షేర్ చేశారు.Holy Shlit. President Trump just posted Trump Gaza on his Truth Social account. 🤣🤣🤣 pic.twitter.com/o44mmbtyk8— Based DK (@Back_2TheMiddle) February 26, 2025అయితే ట్రంప్ గాజా పేరుతో విడుదలైన ఆ ఏఐ జనరేటెడ్(AI Generated Video) వీడియోపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అది గాజా ప్రజలను ప్రతిబింబించేలా ఎంతమాత్రం లేదని హమాస్ పొలిటికల్ బ్యూరో సభ్యుడు బసీమ్ నయీమ్ అన్నారు. ‘‘దురదృష్టవశాత్తూ.. ట్రంప్ మరోసారి గాజా ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ప్రవర్తించారు. గాజా ప్రజలు కోరుకుంటోంది ఛిద్రమైన ఈ ప్రాంత పునర్మిర్మాణం. అలాగే తమ తర్వాతి తరాలకు మంచి భవిష్యత్తు అందించాలని. అంతేగానీ బంధీఖానాల్లో ఉండాలని కాదు. మేం పోరాడేది బంధీఖానాల్లో పరిస్థితులు మెరుగుపడాలని కాదు. అసలు జైలు, జైలర్ లేకుండా చూడాలని’’ అని నయీమ్ అంటున్నారు.మరోవైపు ఈ వీడియోలో మస్క్, నెతన్యాహూ ప్రస్తావించడంపై కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. గాజాలో మానవతా సాయం కొనసాగుతున్న వేళ.. పాలస్తీనా ప్రజలు ఎదుర్కొంటున్న అసలైన సమస్యలను ట్రంప్ పక్కనపెట్టారంటూ పలువురు మండిపడుతున్నారు. 👉2023 అక్టోబర్ 07వ తేదీన హమాస్(Hamas) సంస్థను ఇజ్రాయెల్‌పై మెరుపు మిస్సైళ్ల దాడి జరిపింది. ఈ దాడుల్లో 1,200 మంది మరణించారు. అయితే ప్రతిగా హమాస్ ఆధీనంలో ఉన్న గాజాపై దాడులు జరుపుతూ వచ్చింది. ఇప్పటిదాకా ఈ దాడుల్లో 48,200 మంది పాలస్తీనా ప్రజలు మరణించగా.. ఇందులో పిల్లల సంఖ్యే అధికంగా ఉంది. మరోవైపు.. ఈ యుద్ధ వాతావరణంతో 90 శాతం గాజా ప్రజలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. ఇజ్రాయెల్ దాడులు కొనసాగడంతో గాజాకు అంతర్జాతీయ సాయం అందడం కూడా కష్టతరంగా మారగా.. ఆ సాయం అందక పలువురు చనిపోవడం గమనార్హం.👉ప్రస్తుతం ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పలు విరమణ ఒప్పందం అమల్లో ఉంది. ఒప్పందంలో భాగంగా తమ దగ్గర ఉన్న బంధీలను హమాస్.. పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ ఇచ్చి పుచ్చుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఒప్పందం పూర్తైతే హమాస్ పరిస్థితి ఏంటన్నది ఇప్పటికైతే ప్రశ్నార్థకమే. 👉మరోవైపు.. గాజా పునర్మిర్మాణం కోసం ట్రంప్ ఓ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అక్కడ ఉన్న 21 లక్షల మంది పాలస్తీనా ప్రజలను ఇతర ప్రాంతాలకు పంపించేసి(వెలేసి).. గాజాను అతి సుందర విలాస ప్రాంతంగా తీర్చిదిద్దుతామని, ఆ బాధ్యతలు అమెరికానే తీసుకుంటుందని అంటున్నారాయన. దీనికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు మద్ధతు ప్రకటించగా.. అరబ్ దేశాలు మండిపడుతున్నాయి. మరోవైపు.. గాజా సంక్షోభంలో మధ్యవర్తిత్వం వహిస్తున్న ఈజిప్ట్‌లో మార్చి 4వ తేదీన ప్రతినిధులు ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో ట్రంప్ ప్రతిపాదనపైనా చర్చించే అవకాశం లేకపోలేదు.ఇదీ చదవండి: సారీ.. ఆయన కింద పని చేయలేం! -
USA: ఎలాన్ మస్క్‌కు బిగ్ షాక్..
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రోజుకో నిర్ణయంతో ఫెడరల్ యంత్రాంగాన్ని అయోమయంలోకి నెడుతున్న అధ్యక్షుడు ట్రంప్ సలహాదారు ఎలాన్ మస్క్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఫెడరల్ ఉద్యోగులను తొలగించే ప్రక్రియలో భాగస్వాములం కాలేమంటూ ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్‌లో పని చేస్తున్న 21 మంది సివిల్ సర్వీస్ ఉద్యోగులు మూకుమ్మడిగా రాజీనామా చేశారు.ఇదే సమయంలో అత్యంత ముఖ్యమైన ప్రజా సేవల విభాగాన్ని ధ్వంసం చేసేందుకు తమ నైపుణ్యాన్ని వినియోగించాలంటూ అందిన ఉత్తర్వులను తిరస్కరిస్తూ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు వీరు ప్రకటించారు. అమెరికా ప్రజలకు సేవ చేస్తామంటూ విధుల్లో చేరేటప్పుడు చేసిన వాగ్దానాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో నెరవేర్చలేమని స్పష్టమైందంటూ వారు సమర్పించిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగాన్ని తగ్గించే బాధ్యతలను చేపట్టిన డోజ్ యంత్రాంగంలోని వారంతా రాజకీయ నేపథ్యం కలిగిన వారనీ, వీరికి అందుకు అవసరమైన నైపుణ్యాలు గానీ, అనుభవం గానీ లేవని అందులో తెలిపారు. బాధ్యతల నుంచి వైదొలగిన వారిలో ఇంజనీర్లు, డేటా సైంటిస్టులు, ప్రొడక్ట్ మేనేజర్లు ఉన్నారు.వీరు గతంలో అమెజాన్, గూగుల్ వంటి సంస్థల్లో కీలక బాధ్యతలను నిర్వహించిన అనుభవజ్ఞులు. ఒబామా హయాంలో హెల్త్‌కేర్ విధానాలను అమలు చేసేందుకు యూఎస్ డిజిట్ సర్వీస్ పేరుతో ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇదే విభాగానికి చెందిన 40 మంది సిబ్బందిని ఈ నెల మొదట్లో ఇంటికి పంపించిన సంగతి తెలిసిందే.BREAKING: 21 employees have just RESIGNED from Elon Musk's DOGE, refusing to "dismantle critical public services."“We swore to serve the American people and uphold our oath to the Constitution across presidential administrations,” the 21 staffers wrote in a joint resignation… pic.twitter.com/7ra4Hatqia— Brian Krassenstein (@krassenstein) February 25, 202540% నిరుపయోగమే..అధికారంలోకి రాగానే ట్రంప్ ఏర్పాటు చేసిన ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డోజ్ రద్దు చేసిన కాంట్రాక్టుల్లో 40 శాతం నిరుపయోగమేనని తేలింది. వాటివల్ల ఖజానాకు నిధులు ఆదా అయ్యేదేమీ లేదని వెల్లడైంది. గత వారం నాటికి 1,125 కాంట్రాక్టులను డోజ్ రద్దు చేసింది. వాటిలో 417 కాంట్రాక్టుల రద్దు వల్ల ప్రయోజనం లేదని తేలింది. ఇప్పటికే పూర్తిగా నిధులను ఖర్చు చేయడం దీనికి కారణమని వెల్లడైంది. -
ఆఫీసులకు రాకుంటే.. లీవు తప్పదు!
వాషింగ్టన్: అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులు ఈ వారం నుంచి తప్పనిసరిగా తిరిగి విధులకు హాజరు కావాల్సిందేనని ఆయన సలహాదారు ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. హాజరు కాని వారందరినీ పరిపాలనా పరమైన లీవుపై సాగనంపుతామని హెచ్చరించారు. వారికిక వేతనాలుండవన్నారు. ఆయన సోమవారం ‘ఎక్స్’లో ఈ మేరకు పలు పోస్టులు చేశారు. ట్రంప్ రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేప ట్టాక వేగంగా జరుగుతున్న పరిణా మాలతో ఫెడరల్ ప్రభుత్వ విభాగాల్లో అయోమయం, ఉద్యోగుల్లో ఆందోళన పెరిగి పోయాయి. యంత్రాంగాల్లో విభేదాలు పొడచూపుతున్నాయి. ఉద్యోగులు ఎవ రికి వారు తమ పనితీరును వివరించాలంటూ మస్క్ రెండు రోజుల క్రితం చేసిన హెచ్చరికలపై స్పందించాలంటూ హెల్త్, హ్యూమన్ రిసోర్సెస్, డ్రగ్ ఎన్ఫో ర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్, ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్ తమ ఉద్యోగులకు సూచించగా ఆ అవసరం లేదంటూ డిఫెన్స్, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ, ఇంధన, వాణిజ్య విభాగాలు సూచించాయి. ఇప్పటికే కన్జూమర్ ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ బ్యూరో ఉద్యోగులను మస్క్ యంత్రాంగం ఇళ్లకు పంపించేసింది.యూఎస్ఎయిడ్లో 1,600 ఉద్యోగుల తొలగింపువాషింగ్టన్: ట్రంప్ అధ్యక్షుడయ్యాక అమెరికా ప్రభుత్వ విభాగాలైన ఫెడరల్ ఏజెన్సీలు, అనుబంధ విభాగాల్లో సిబ్బంది కోత పరంపర కొనసాగుతోంది. తాజాగా యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ (యూ ఎస్ఎయిడ్) విభాగంలోని 1,600 మంది ఉద్యోగులను ట్రంప్ ప్రభుత్వం తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా యూఎస్ఎయిడ్కు సంబంధించిన కీలక విధులు, ప్రత్యేక కార్యక్రమాల్లో నిమగ్నమైన సిబ్బందిని సోమవారం నుంచి సెలవులపై పంపుతున్నట్లు ట్రంప్ సర్కార్ ప్రకటించింది. -
‘ఏఐ ఏమైనా చేయగలదు’: సత్య నాదెళ్ల వీడియోకి మస్క్ రిప్లై
ఏఐని ఎక్కువగా విశ్వసించే ఎలాన్ మస్క్ (Elon Musk).. ఈసారి వ్యవసాయ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) పై విశ్వాసం వ్యక్తం చేశారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) ‘ఎక్స్’లో పోస్ట్ చేసిన వీడియోను టెస్లా, స్పేస్ఎక్స్ సీఈఓ రీషేర్ చేస్తూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాన్ని మరింత నొక్కిచెప్పారు. "కృత్రిమ మేధ ప్రతిదాన్ని మెరుగుపరుస్తుంది" అని పేర్కొన్నారు.రైతులు తక్కువ వనరుల వినియోగంతో ఉత్పాదకతను పెంచడానికి కృత్రిమ మేధ ఆధారిత పరిష్కారాలు ఎలా సహాయపడతాయో ఈ వీడియో చూపిస్తుంది. కృత్రిమ మేధ ఆధారిత సాంకేతిక పరిజ్ఞానం ద్వారా గణనీయంగా ప్రయోజనం పొందిన భారతదేశంలోని బారామతి సహకార సంఘానికి చెందిన ఒక రైతు ఉదాహరణను సత్య నాదెళ్ల ఉదహరించారు.తక్కువ భూమి ఉన్న రైతులు పంట దిగుబడిలో గణనీయమైన మెరుగుదలను చూశారని, రసాయనాల వాడకం తగ్గిందని, నీటి నిర్వహణ మెరుగైందని చెప్పుకొచ్చారు. జియోస్పేషియల్ డేటా, డ్రోన్లు, ఉపగ్రహాల నుంచి ఉష్ణోగ్రత డేటా, రియల్ టైమ్ సాయిల్ అనాలిసిస్ ద్వారా ఈ సమాచారం మొత్తాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అనుసంధానం చేస్తుందని తెలిపారు. రైతులు వారి స్థానిక భాషలో ఈ సమాచారాన్ని పొందవచ్చు.రియల్ టైమ్ అగ్రికల్చర్ డేటాతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను మిళితం చేయడం ద్వారా రైతులు మరింత సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవచ్చని సత్య నాదెళ్ల పేర్కొన్నారు. ఇది సుస్థిర వ్యవసాయ పద్ధతులకు దారితీస్తుందని, సామర్థ్యాన్ని పెంచుతుందని వివరించారు.ఆ వీడియో ఇదే.. మీరూ చూసేయండి..A fantastic example of AI's impact on agriculture. pic.twitter.com/nY9o8hHmKJ— Satya Nadella (@satyanadella) February 24, 2025