మార్కెట్లో అత్యధిక ప్రజాదరణ పొందిన మోడల్ ఎక్స్, మోడల్ ఎస్ ఉత్పత్తిని నిలిపివేసినట్లు సీఈఓ ఎలాన్ మస్క్ ఇటీవల ధ్రువీకరించారు. ఇప్పుడు మరో కొత్త మోడల్ రానున్నట్లు రాయిటర్స్ నివేదించింది. ఎంట్రీ-లెవల్ మోడళ్ల కంటే చిన్నదిగా ఉంటుందని సమాచారం.
ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ టెస్లా, తన ప్రస్తుత ఎంట్రీ-లెవల్ మోడళ్ల కంటే చిన్నదిగా, చౌకైన కాంపాక్ట్ ఎలక్ట్రిక్ SUVని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం. రెండేళ్ల క్రితం ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని కంపెనీ యోచించినప్పటికీ.. అమల్లోకి త్వరలోనే రానున్నట్లు తెలుస్తోంది.
రాబోయే చిన్న, సరసమైన కారును కేవలం ఒక వేరియంట్‌లో మాత్రమే కాకుండా.. మోడల్ 3, మోడల్ వై కంటే భిన్నంగా ఉండేలా తయారు చేయనుంది. దీని బరువు 1.5 మెట్రిక్ టన్నులు ఉండేలా సిద్ధం చేయనున్నారు. ధరను తగ్గించడం కోసం.. చిన్న బ్యాటరీ ప్యాక్ అమర్చే అవకాశం ఉంది. అంటే ఈ కారు రేంజ్ కొంత తక్కువగా ఉంటుందన్నమాట.
ఇదీ చదవండి: హ్యుందాయ్ వైబ్ ఎడిషన్ లాంచ్: ధర ఎంతంటే?
టెస్లా కొత్త కారును షాంఘైలోని గిగాఫ్యాక్టరీలో ప్రారంభించనున్నారు. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగితే, చివరికి తయారీని యునైటెడ్ స్టేట్స్, యూరప్‌లకు విస్తరించే అవకాశం ఉంది. అయితే దీనిని ఎప్పుడు ప్రారంభించనున్నారు?, మొదటి ఎక్కడ విక్రయించనున్నారు? అనే విషయాలను సంస్థ అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.


