
టెస్లా అధినేత.. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk) వికీపీడియాకు పోటీగా.. గ్రోకీపీడియా (Grokipedia) లాంచ్ చేయనున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం దీని బీటా వెర్షన్ రెండు వారాల్లో ప్రారంభమవుతుందని ఆయన తన ఎక్స్ ఖాతాలో తెలిపారు.
గ్రోకీపీడియాను.. మస్క్ ఏఐ కంపెనీ ఎక్స్ఏఐ (xAI) రూపొందిస్తోంది. ''గ్రోకిపీడియా ప్రపంచంలోనే అతిపెద్ద, అత్యంత ఖచ్చితమైన జ్ఞాన వనరుగా మారబోతోంది'' అని ఒక ఎక్స్ యూజర్ చేసిన పోస్టుకు.. మస్క్ రిప్లై ఇచ్చారు. అయితే ఈ గ్రోకీపీడియాకు సంబంధించిన ఫీచర్లను గురించి అధికారికంగా వెల్లడించలేదు. నిజాలను వెల్లడించానికే ఈ ఫ్లాట్‌ఫామ్‌ను రూపొందిస్తున్నట్లు సమాచారం.
Version 0.1 early beta of Grokipedia will be published in 2 weeks https://t.co/M6VrGv8zp5
— Elon Musk (@elonmusk) October 5, 2025
Exactly https://t.co/Ia38jMbJoj
— Elon Musk (@elonmusk) October 5, 2025