
టెక్నాలజీ రంగంలో.. ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈఓ 'ఎలాన్ మస్క్' మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు. ఇందులో భాగంగానే ఈయన తన ఏఐ వీడియో జనరేషన్ ప్లాట్‌ఫామ్ గ్రోక్ ఇమాజిన్‌కు సంబంధించిన కొత్త వెర్షన్ 0.9ని ప్రవేశపెట్టారు. ఈ కొత్త వెర్షన్.. ఇప్పటికే రియాలిటీగా కనిపించే వీడియోలను సృష్టించగల సామర్థ్యంతో యూజర్లను తెగ ఆకట్టుకుంది.
ఇండియన్ కంటెంట్ క్రియేటర్ ప్రశాంత్.. ప్రముఖ హాలీవుడ్ చిత్రం ఐరన్ మ్యాన్ నుంచి ఒక సన్నివేశాన్ని.. రీక్రియెట్ చేసి తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసారు. ఇక్కడ కనిపించే వ్యక్తి మస్క్‌ను పోలి ఉన్నారు. వీడియో మొత్తం ఎడారి ప్రాంతం కనిపిస్తుంది. వీడియో షేర్ చేస్తూ.. ''గ్రోక్ ఇమాజిన్ 0.9 సినిమా నిర్మాణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దింది. ఐకానిక్ ఐరన్ మ్యాన్ దృశ్యాన్ని తిరిగి ఊహించుకున్నాను. ఇందులో విజువల్ క్వాలిటీ, ఆడియో జనరేషన్ వంటివి నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇది అద్భుతమైన మోడల్'' అని అన్నారు. దీనిపై మస్క్ స్పందిస్తూ.. 'గ్రోక్ ఇమాజిన్ వెర్షన్ 0.9 నాట్ బ్యాడ్' అని అన్నారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. గ్రోక్ 0.9 వెర్షన్ ఇంత అద్భుతంగా ఉంటే.. 1.0 ఎలా ఉంటుందో అని ఒకరు అన్నారు. గ్రోక్ రాబోయే రోజుల్లో మరిన్ని అద్భుతాలను సృష్టిస్తుందని ఇంకొకరు అన్నారు.
Not bad for Grok Imagine version 0.9 … https://t.co/ihIzdVOylj
— Elon Musk (@elonmusk) October 9, 2025