అమెరికా, వెనెజులాకు మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలో.. ప్రపంచ కుబేరుడు, టెస్లా బాస్ 'ఎలాన్ మస్క్' కీలక ప్రకటన చేశారు. స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను వెనిజులా ప్రజలకు ఉచితంగానే అందిస్తున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
'స్టార్‌లింక్ ఫిబ్రవరి 3 వరకు వెనెజులా ప్రజలకు ఉచిత బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందిస్తుంది, ఇది నిరంతర కనెక్టివిటీని నిర్ధారిస్తుంది' అని స్టార్‌లింక్ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించగా.. మస్క్ 'వెనెజులా ప్రజలకు మద్దతుగా' అని పేర్కొన్నారు.
In support of the people of Venezuela 🇻🇪 https://t.co/JKxOFWsikP
— Elon Musk (@elonmusk) January 4, 2026
వెనెజులా అధ్యక్షుడు నికొలస్ మదురోపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైనిక చర్యకు ఆదేశాలు జారీ చేయడంతో.. అమెరికా సైన్యం మదురోను, ఆయన సతీమణి సిలియా ఫ్లోరెస్‌ను ఎత్తుకొచ్చింది. ఈ పరిణామం తరువాత మస్క్ ఫ్రీ స్టార్‌లింక్ సర్వీస్ అందిస్తున్నట్లు చేసిన చర్చనీయాంశంగా మారింది.
వెనెజులా దేశంలో ప్రస్తుతం సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ప్రజలకు కనెక్టివిటీని పెంచేందుకు మస్క్ స్టార్‌లింక్ సేవలను ఉచితంగా అందించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్నెట్ సౌకర్యానికి అంతరాయం ఏర్పడకుండా ఉండేందుకు, మారుమూల గ్రామాల్లో మొబైల్ టవర్లు పనిచేయనప్పుడు స్టార్‌లింక్ సేవలను ఉపయోగించుకోవచ్చు.
ఇదీ చదవండి: 70/10/10/10 ఫార్ములా: ఇలా పొదుపు చేస్తే.. నెల మొత్తం హ్యాపీ!


