మౌలిక రంగం మందగమనం  | Core infra sectors growth slows down to 4percent in January | Sakshi
Sakshi News home page

మౌలిక రంగం మందగమనం 

Feb 22 2026 5:28 AM | Updated on Feb 22 2026 5:28 AM

Core infra sectors growth slows down to 4percent in January

జనవరిలో వృద్ధి 4 శాతమే 

న్యూఢిల్లీ: కీలక మౌలిక రంగాల్లో పనితీరు జనవరిలో చెప్పుకోతగ్గ స్థాయిలో నిదానించింది. వృద్ధి 4 శాతానికి పరిమితమైంది. గతేడాది జనవరిలో వృద్ధి రేటు 5.1 శాతం కాగా, గత డిసెంబర్‌లోనూ 4.7 శాతం స్థాయిలో ఉండడం గమనించొచ్చు. ముఖ్యంగా మడి చమురు, సహజ వాయువు ఉత్పత్తి తగ్గిపోవడం వృద్ధిపై ప్రభావం చూపించింది. రిఫైనరీ ఉత్పత్తుల వృద్ధి సైతం ఫ్లాట్‌గా నమోదైంది. 

ఇక బొగ్గు ఉత్పత్తి 3.1 శాతానికి పరిమితమైంది. 2025 జనవరిలో బొగ్గు ఉత్పత్తి 4.6 శాతంగా ఉంది. సిమెంట్‌ ఉత్పత్తి 10.7 శాతం వృద్ధికి తగ్గింది. 2025 జనవరిలో ఇది 14.3 శాతం పెరగడం గమనార్హం. ఎరువులు, స్టీల్, విద్యుదుత్పత్తి గతేడాది జనవరితో పోలి్చతే సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. 

ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్‌ నుంచి జనవరి వరకు ఎనిమిది కీలక మౌలిక రంగాల వృద్ధి 2.8 శాతానికి తగ్గింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 4.5 శాతంగానే ఉంది. ఎనిమిది రంగాలకు గాను ఏడింటిలో వృద్ధి తగ్గుముఖం పట్టినట్టు ఇక్రా ముఖ్య ఆర్థికవేత్త అదితినాయర్‌ పేర్కొన్నారు.  ఈ ప్రకారం పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి 2025 డిసెంబర్‌లో ఉన్న 7.8 శాతం నుంచి ఈ ఏడాది జనవరిలో 5.5 శాతానికి తగ్గొచ్చని అంచనా వేశారు.    

Advertisement
 
Advertisement
Advertisement