రిలయన్స్‌కి వెనెజులా చమురు | Reliance Secures US License for Direct Venezuelan Crude Imports | Sakshi
Sakshi News home page

రిలయన్స్‌కి వెనెజులా చమురు

Feb 15 2026 8:40 AM | Updated on Feb 15 2026 11:21 AM

Reliance Secures US License for Direct Venezuelan Crude Imports

న్యూఢిల్లీ: వెనెజులా నుంచి ముడి చమురు నేరుగా దిగుమతి చేసుకునేందుకు దేశీ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కి అమెరికా నుంచి లైసెన్సు లభించింది. కంపెనీకి చెందిన జామ్‌నగర్‌ రిఫైనరీకి అనువైన ఈ క్రూడాయిల్‌ని డిస్కౌంటు రేటుకు పొందడం వల్ల రిలయన్స్‌ రిఫైనింగ్‌ మార్జిన్లు మరింత మెరుగుపడతాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.

ఇప్పటివరకు ట్రేడర్ల ద్వారా మాత్రమే విక్రయించడానికి అమెరికా అనుమతిస్తూ వస్తోంది. తాజాగా జనరల్‌ లైసెన్సు ఇవ్వడం వల్ల ఇప్పటికే ఆయిల్‌ని వెలికితీసిన సంస్థ నుంచి నేరుగా కొనుగోలు చేసేందుకు వీలవుతుంది. వాస్తవానికి 2019–20 వరకు వెనెజులా నుంచి రిలయన్స్‌ క్రూడాయిల్‌ని కొనుగోలు చేసింది. ఆ దేశంపై అమెరికా ఆంక్షలతో కొన్నాళ్లు నిలిపివేసి, వాటిని సడలించాక 2024లో కొనుగోలు చేసింది.

మళ్లీ ఈ ఏడాది ట్రేడర్ల ద్వారా వెనెజులా ఆయిల్‌ అమ్మకాలు ప్రారంభమయ్యాక 2 మిలియన్‌ బ్యారెళ్ల ముడిచమురును కొనుగోలు చేసింది.  వెనెజులా అధ్యక్షుడు నికొలస్‌ మదురోను బంధించిన తర్వాత ఆ దేశ ఇంధన రంగంపై ఆంక్షలను అమెరికా సడలించింది.

Advertisement
 
Advertisement
Advertisement