లెన్స్‌కార్ట్‌కు భారీ లాభాలు | Lenskart Solutions Posts Strong Profit Surge in Q3 FY26 | Sakshi
Sakshi News home page

లెన్స్‌కార్ట్‌కు భారీ లాభాలు

Feb 15 2026 8:16 AM | Updated on Feb 15 2026 8:18 AM

Lenskart Solutions Posts Strong Profit Surge in Q3 FY26

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసికంలో కళ్లద్దాల కంపెనీ లెన్స్‌కార్ట్‌ సొల్యూషన్స్‌ ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో కన్సాలిడేటెడ్‌ నికర లాభం భారీగా దూసుకెళ్లి రూ. 133 కోట్లకు చేరింది.

కొత్త కస్టమర్లు జత కలవడం, మార్జిన్లు మెరుగుపడటం, అంతర్జాతీయ బిజినెస్‌ పుంజుకోవడం ఇందుకు సహకరించాయి. గతేడాది(2024–25) ఇదే కాలంలో కేవలం రూ. 2 కోట్లు ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 38 శాతం జంప్‌చేసి రూ. 2,308 కోట్లను తాకింది. గత క్యూ3లో రూ. 1,669 కోట్ల టర్నోవర్‌ అందుకుంది. దేశీ ఆదాయం 40 శాతం, విదేశీ ఆదాయం 33 శాతం చొప్పున ఎగసినట్లు కంపెనీ పేర్కొంది.

ఈ కాలంలో పన్నుకు ముందు లాభం(పీబీటీ) రూ. 48 కోట్ల నుంచి మూడు రెట్లు బలపడి రూ. 161 కోట్లకు చేరింది. విదేశీ మార్కెట్ల నుంచి రూ. 33 కోట్ల పీబీటీ ఆర్జించగా.. గత క్యూ3లో ఇది రూ. 42 కోట్ల నష్టంగా నమోదైంది.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement