క్యూ3 ఫలితాలే దిక్సూచి  | Q3 earnings, global trends to drive stock markets this week | Sakshi
Sakshi News home page

క్యూ3 ఫలితాలే దిక్సూచి 

Jan 19 2026 5:51 AM | Updated on Jan 19 2026 5:51 AM

Q3 earnings, global trends to drive stock markets this week

వారాంతాన పనితీరు వెల్లడించిన దిగ్గజాలు 

జాబితాలో రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌

ఇకపై భెల్, పీఎన్‌బీ, బీవోఐ, డీఎల్‌ఎఫ్, బీపీసీఎల్‌ 

ఇండిగో, పీఎన్‌బీ, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, అదానీ గ్రీన్‌ రెడీ 

ఈ వారం మార్కెట్ల ట్రెండ్‌పై విశ్లేషకుల అంచనాలు 

ఈ వారం దేశీ స్టాక్‌ మార్కెట్లలో ట్రెండ్‌ను ప్రధానంగా క్యూ3(అక్టోబర్‌–డిసెంబర్‌) ఫలితాలే నిర్దేశించనున్నాయి. ఫిబ్రవరి 1న ప్రకటించనున్న బడ్జెట్‌వైపు ఇన్వెస్టర్లు దృష్టి సారించనున్నప్పటికీ సమీపకాలంలో కార్పొరేట్‌ పనితీరు, గ్లోబల్‌ అంశాలు సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. వివరాలు చూద్దాం.. 

గత వారాంతాన ఇండెక్స్‌లను ప్రభావితం చేయగల బ్లూచిప్‌ కంపెనీలు ఈ ఆర్థిక సంవత్సరం(2025–26) మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించాయి. డైవర్సిఫైడ్‌ దిగ్గజం రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తోపాటు.. బ్యాంకింగ్‌ దిగ్గజాలు హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ క్యూ3 పనితీరు వెల్లడించాయి. ఈ ప్రభావం నేడు(19న) కనిపించనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ఇదేవిధంగా ఈ వారం మరిన్ని కంపెనీలు క్యూ3(అక్టోబర్‌–డిసెంబర్‌) ఫలితాలు విడుదల చేయనున్నాయి.

 ఈ జాబితాలో బీహెచ్‌ఈఎల్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్, డీఎల్‌ఎఫ్, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్, ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్, ఎల్‌టీఐమైండ్‌ట్రీ, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్, అదానీ గ్రీన్‌ ఎనర్జీ, ఏయూ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌ తదితరాలు చేరాయి. వీటితోపాటు పలు మిడ్, స్మాల్‌ క్యాప్‌ కౌంటర్లు ప్రకటించనున్న ఫలితాలపై ఇన్వెస్టర్లు దృష్టిపెట్టనున్నట్లు నిపుణులు తెలియజేశారు.  

ట్రంప్‌ ఎఫెక్ట్‌ 
యూఎస్‌ ప్రెసిడెంట్‌ ట్రంప్‌ వెనిజువెలా అధ్యక్షుడిని అరెస్ట్‌ చేయడంసహా.. ఇరాన్‌లో అంతర్యుద్ధానికి మద్దతు పలకడం, గ్రీన్‌ల్యాండ్‌ తమదేనంటూ ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళనలను పెంచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. దీంతో రక్షణాత్మక పెట్టుబడి సాధానాలుగా భావించే పసిడి, వెండి ధరలు రేసు గుర్రాల్లా పరుగు తీస్తున్నట్లు తెలియజేశారు. వెరసి రిస్క్‌ పెట్టుబడులు నీరసించే వీలున్నట్లు విశ్లేíÙంచారు. మరోపక్క యూఎస్‌తో భారత్‌ వాణిజ్య చర్చలు ఒక కొలిక్కిరాకపోవడం సైతం సెంటిమెంటును బలహీనపరుస్తున్నట్లు తెలియజేశారు. 

విదేశీ గణాంకాలు 
నేడు చైనా.. అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ4) జీడీపీ గణాంకాలు ప్రకటించనుంది. జూలై–సెప్టెంబర్‌(క్యూ3)లో ఎకానమీ 4.8 శాతం ఎగసింది. ఈ బాటలో డిసెంబర్‌ నెలకు పారిశ్రామికోత్పత్తి, రిటైల్‌ అమ్మకాల గణాంకాలు సైతం వెల్లడికానున్నాయి. పీపుల్స్‌ బ్యాంక్‌ ఆఫ్‌ చైనా వడ్డీ రేట్లపై స్పందించనుంది. ఇక మరోవైపు యూఎస్‌ క్యూ3 జీడీపీ వృద్ధి రేటు తుది గణాంకాలు విడుదలకానున్నాయి. ఈ నెల 17కల్లా నమోదైన నిరుద్యోగ గణాంకాలు ప్రకటించనుంది. వారం చివర్లో యూఎస్‌తోపాటు.. దేశీయంగా తయారీ, సరీ్వసుల రంగ పీఎంఐ ఇండెక్సులు విడుదలకానున్నాయి. కాగా.. 27 దేశాలతోకూడిన యూరోపియన్‌ యూనియన్‌తో స్వేచ్చా వాణిజ్య చర్చలు తుది దశకు చేరినట్లు వాణిజ్యం, పరిశ్రమల కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ వెల్లడించడం సానుకూల అంశమని నిపుణులు పేర్కొన్నారు. నెలాఖరుకల్లా ఒప్పందం ఖరారుకానున్నట్లు మంత్రి తెలియజేశారు.  

 – సాక్షి, బిజినెస్‌ డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement