2026లో జీతాల పెరుగుదల.. ఈ రంగాల వారికే ఎక్కువ! | 2026 Salary Growth Forecast, Corporate India To See 9.1 Percent Salary Hike In 2026, Skills Based Pay On The Rise | Sakshi
Sakshi News home page

2026లో జీతాల పెరుగుదల.. ఈ రంగాల వారికే ఎక్కువ!

Feb 23 2026 3:09 PM | Updated on Feb 23 2026 3:56 PM

Corporate India To See 9 1 Percent Salary Hike In 2026

ఈవై ఇండియా విడుదల చేసిన ఫ్యూచర్ ఆఫ్ పే నివేదిక ప్రకారం.. ఈ ఏడాది (2026) కార్పొరేట్ ఇండియా సగటు జీతం 9.1 శాతం ఉంటుంది. ఇది ఉద్యోగ విఫణిలో చోటుచేసుకుంటున్న మార్పులను, ముఖ్యంగా నైపుణ్యాల ఆధారిత వేతన విధానాల పెరుగుదలను స్పష్టంగా తెలియజేస్తోంది.

జీతాల పెరుగుదల విషయంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ముందంజలో ఉండనున్నాయి. ఇవి గరిష్టంగా 10.4 శాతం వరకు జీతాలను హైక్ చేయనున్నాయి. ఆ తరువాత ఆర్థిక సేవల రంగం సుమారు 10 శాతం, ఈ-కామర్స్ రంగంలో 9.9 శాతం, జీవవిజ్ఞాన శాస్త్రాలు & ఔషధ రంగాల్లో 9.7 శాతం వరకు జీతాల పెరుగుదల ఉంటుంది.

ఉద్యోగాల తొలగింపులు విషయానికి వస్తే.. 2024లో ఇది 17.5 శాతం ఉంది, ఇది 2025కి 16.4 శాతానికి చేరింది. దీన్నిబట్టి చూస్తే.. ఉద్యోగలు తొలగింపులు సంఖ్య కొంత తగ్గినట్లు తెలుస్తోంది. కాగా ఉద్యోగాలను స్వచ్చందంగా వదిలిపెట్టి రాజీనామా చేస్తున్నవారి సంఖ్య 80 శాతం ఉందని నివేదిక చెబుతోంది. అంటే వీరు తొలగింపుల కారణంగా కాకుండా, మెరుగైన అవకాశాల కోసం ఉద్యోగాలను మార్చుతున్నారు. ఉద్యోగులను ఎక్కువగా తొలగించిన రంగాల్లో ప్రొఫెషనల్ సర్వీసెస్ & ఐటీ రంగాలు ముందు వరుసలో ఉన్నాయి.

నైపుణ్యాలను ఆధారంగా చేసుకుని వేతనం చెల్లించడానికి కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఏఐ, జనరేటివ్ ఏఐ, మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ & క్లౌడ్ కంప్యూటింగ్ వంటి రంగాల్లో నైపుణ్యం కలిగిన వారికి అదనపు వేతనం లభిస్తుంది. ఇదే సమయంలో వేరియబుల్ పే ప్రాధాన్యత కూడా పెరుగుతోంది. 2025లో స్థిర వేతనంలో వేరియబుల్ పే వాటా 16.1 శాతానికి పెరిగింది. 2024లో ఇది 14.8 శాతం మాత్రమే ఉండేది. అంటే కంపెనీలు పనితీరు ఆధారంగా ప్రోత్సాహకాలు ఇవ్వడంపై దృష్టి పెడుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement