రికార్డు దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలు | PSBs are on track to post record combined profits exceeding 2 lakh cr | Sakshi
Sakshi News home page

రికార్డు దిశగా ప్రభుత్వ రంగ బ్యాంకుల లాభాలు

Feb 8 2026 9:15 PM | Updated on Feb 8 2026 9:16 PM

PSBs are on track to post record combined profits exceeding 2 lakh cr

భారత ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) అద్భుతమైన ఆర్థిక ప్రగతితో పటిష్టంగా ఉన్నాయని ఆర్థిక సేవల కార్యదర్శి ఎం.నాగరాజు ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ బ్యాంకుల ఉమ్మడి లాభం రూ.2 లక్షల కోట్ల మార్కును దాటుతుందని ఆయన అంచనా వేశారు.

ఆర్థిక బలం - వృద్ధి గణాంకాలు

తాజాగా ఓ సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన బ్యాంకింగ్ రంగ వృద్ధిని విశ్లేషించారు. ‘ఈ ఏడాది ప్రభుత్వ రంగ బ్యాంకుల రుణ వృద్ధి 12 శాతంగా నమోదైంది. డిపాజిట్ల వృద్ధి కూడా 10 శాతం వద్ద ఆశాజనకంగా ఉంది. 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.1.05 లక్షల కోట్లు ఉన్న లాభం, 2023-24లో రూ.1.41 లక్షల కోట్లకు, 2025 ఆర్థిక సంవత్సరంలో రూ. 1.78 లక్షల కోట్లకు చేరింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధభాగంలోనే దాదాపు రూ. 1 లక్షల కోట్లు లాభాన్ని బ్యాంకులు ఆర్జించాయి’ అన్నారు.

‘ఆర్‌బీఐ పటిష్టమైన పర్యవేక్షణలో మన బ్యాంకింగ్ వ్యవస్థ చాలా సురక్షితంగా ఉంది. అంతర్జాతీయ అంశాలు మన బ్యాంకులపై ప్రతికూల ప్రభావం చూపుతాయని ఆందోళన చెందడం లేదు’ అని నాగరాజు పేర్కొన్నారు.

ఇదీ చదవండి: భారత్-యూఎస్‌ ట్రేడ్‌ డీల్‌పై రైతు సంఘాల ఆగ్రహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement