కొరిటెపాడు(గుంటూరు): జిల్లా వ్యాప్తంగా శనివారం నుంచి మంగళవారం వరకు వరుసగా నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. 24వ తేదీన నాలుగో శనివారం, 25న ఆదివారం సెలవు. ఇక 26న రిపబ్లిక్ డే సందర్భగా సోమవారం అధికారికంగా సెలవు ఉంటుంది. దేశ వ్యాప్తంగా బ్యాంకుల సమ్మె కారణంగా 27న మంగళవారం కూడా బ్యాంకులు మూతపడనున్నట్లు బ్యాంక్ ఉద్యోగ సంఘాలు తెలిపాయి. సమ్మె విరమణకు జాతీయ స్థాయిలో చర్చలు జరుగుతున్నందున ఇంకా స్పష్టత లేదన్నారు. ఇప్పటికైతే అన్ని బ్యాంకుల ఉద్యోగులు సమ్మెకు వెళ్లాలని పిలుపునిచ్చినట్లు తెలిపాయి.


