అలిగిన పిఠాపురం వర్మ.. అధికారులపై ఆగ్రహం | TDP Leader Varma Expresses Anger On Pithapuram Municipal Officials For Disrespecting CM Photo, More Details Inside | Sakshi
Sakshi News home page

అలిగిన పిఠాపురం వర్మ.. అధికారులపై ఆగ్రహం

Mar 13 2026 2:41 PM | Updated on Mar 13 2026 3:33 PM

Tdp Leader Varma Expresses Anger On Pithapuram Municipal Officials

సాక్షి, కాకినాడ జిల్లా: పిఠాపురం మున్సిపల్ అధికారులపై టీడీపీ నేత వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశుద్ధ కార్మికుల శిక్షణ కార్యక్రమం మధ్యలో నుంచి వర్మ అలిగి వెళ్లిపోయారు. ఫ్లెక్సీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో పెద్దదిగా.. సీఎం చంద్రబాబు ఫోటో  చిన్నదిగా వేశారంటూ వర్మ రగిలిపోయారు. చంద్రబాబుకు గౌరవం లేనప్పుడు ఇక్కడ ఉండమంటూ వర్మ అసహనం వ్యక్తం చేశారు. వర్మ అసహనంతో జనసేన నేతలు మౌనంగా ఉండిపోయారు.

పిఠాపురంలో జనసేన, టీడీపీ మధ్య రాజకీయం రచ్చ రచ్చగా మారుతోంది. కాగా, గత ఏడాది.. వర్మ సంచలన ట్వీట్‌ కలకలం రేపిన సంగతి తెలిసిందే.. ‘కష్టపడి సాధించే విజయానికి గౌరవం’ అంటూ తన ఎక్స్‌ హ్యాండిల్‌లో విడుదల చేసిన వీడియో దుమారం రేపింది. పవన్‌ కల్యాణ్‌ గెలుపు కోసం తాను చేసిన ఎన్నికల ప్రచారాలన్నీ కలిపి వీడియోగా రూపొందించి, పోస్టు చేశారు. ఆ వీడియోలో ఎక్కడా పవన్‌ కల్యాణ్‌ ఫొటో కూడా లేకపోవడం సంచలనంగా మారింది.

ఇదిలా ఉండగా, తన సోషల్‌ మీడియా అకౌంట్‌ను మూడేళ్లుగా హైదరాబాద్‌కు చెందిన సోషల్‌ ప్లానెట్‌ సంస్థ నిర్వహిస్తోందని.. తన ఎక్స్‌ అకౌంట్‌లో వచ్చిన వీడియోతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని వర్మ తన అకౌంట్‌లో పోస్టు పెట్టారు. తన ప్రమేయం లేకుండా సోషల్‌ ప్లానెట్‌ సంస్థ తప్పుడు వీడియో పోస్టు చేసిన విషయం తెలుసుకుని, వెంటనే డిలీట్‌ చేయించానని, తన పర్మిషన్‌ లేకుండా తప్పుడు వార్తలు పోస్టు చేస్తే తగిన చర్యలు తీసుకుంటానని పేర్కొన్నారు. అలాగే, పిఠాపురం నియోజకవర్గంలో యథేచ్ఛగా జనసేన నేతలు ఇసుక దందా చేస్తున్నారంటూ గతంలో వర్మ సాక్ష్యాలతో సహా బయటపెట్టిన సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement