ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ లిసా గిల్‌ ప్రమాణ స్వీకారం | Justice lisa gill took oath as the chief justice of the andhra pradesh high court | Sakshi
Sakshi News home page

justice Lisa Gil: ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్‌ లిసా గిల్‌ ప్రమాణ స్వీకారం

Mar 13 2026 11:23 AM | Updated on Mar 13 2026 11:45 AM

Justice lisa gill took oath as the chief justice of the andhra pradesh high court

ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు: హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఏపీ హైకోర్టు ప్రాంగణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. జస్టిస్ లీసా గిల్ చేత  హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు.  ఆయన సమక్షంలో నూతన న్యాయమూర్తి జస్టిస్‌ లీసా గిల్‌ బాధ్యతలు స్వీకరించారు.

ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ సభ్యులు, న్యాయవాదులు, హైకోర్టు సిబ్బంది హాజరయ్యారు. నూతన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టడం పట్ల హైకోర్టు వర్గాలు, న్యాయవాదులు, సిబ్బంది జస్టిస్ లీసా గిల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త బాధ్యతల్లో ఆమె విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

 సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు 
ఏపీ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్‌ను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ త్వరలోనే రిటైర్ అవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి రిటైర్ అవ్వడానికి రెండు నెలల ముందే తదుపరి సీజేను ఖరారు చేయాలని కొలీజియం నిర్ణయించింది. జస్టిస్ లీసా గిల్ 2014 నుంచి చండీగఢ్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు.  

Advertisement
 
Advertisement
Advertisement