justice lisa gill
-
జస్టిస్ లీసా గిల్‌కు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి శుభాకాంక్షలు
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ లీసా గిల్‌కు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. న్యాయ రంగంలో విశిష్ట సేవలు, చారిత్రాత్మక తీర్పులు, న్యాయపరమైన నిబద్ధతతో మంచి పేరు సంపాదించిన ఆమె నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ న్యాయవ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.మహిళలపై జరుగుతున్న నేరాలు, డ్రగ్స్, గంజాయి సాగు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా వంటి సామాజిక సమస్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే సుమోటోగా స్వీకరించి ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని జగదీశ్వరరెడ్డి ఆ ప్రకటన లో విజ్ఞప్తి చేశారు.ఆమె పదవీకాలం న్యాయం, సమానత్వం, ప్రజా సంక్షేమం దిశగా చరిత్రాత్మకంగా నిలవాలని ఆకాంక్షిస్తూ మరోసారి అభినందనలు తెలిపారు ఒక సామాజిక కార్యకర్తగా తన బాధ్యత అని వ్యవస్థాపక అధ్యక్షులు, తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షులు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఒక ప్రకటన తెలిపారు. -
జస్టిస్ లీసా గిల్‌కు వైఎస్ జగన్ శుభాకాంక్షలు
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ లీసా గిల్‌కు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. లీసా గిల్ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అవ్వడం ఏపీ న్యాయవ్యవస్థకు గర్వకారణం. జస్టిస్ లీసా గిల్ తన పదవీకాలం విజయవంతంగా కొనసాగించాలని కోరుకుంటున్నానని వైఎస్ జగన్ పేర్కొన్నారు.ఇదీ జస్టిస్ లీసా గిల్ నేపథ్యం 1966 నవంబర్ 15న జన్మించారు. చండీగఢ్‌లోని సెక్టార్ 9లో ఉన్న కార్మెల్ కాన్వెంట్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేశారు. హ్యుమానిటీస్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. క్రిమినల్, సివిల్, సర్వీస్, రెవెన్యూ, రాజ్యాంగ పరమైన అనేక రకాల కేసులను ఆమె వాదించారు. చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతంతో పాటు పలు బోర్డులు, కార్పొరేషన్లకు ప్రాతినిధ్యం వహించారు. 2014 మార్చి 31న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. -
హైకోర్టు సీజేగా జస్టిస్ లీసా గిల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ నియమితులయ్యారు. ఈ మేరకు భారత రాష్ట్రపతి ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో జస్టిస్ గిల్ నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర న్యాయ శాఖ సంయుక్త కార్యదర్శి జగన్నాథ్ శ్రీనివాసన్ బుధవారం నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నెల 25 నుంచి ఆమె నియామకం అమల్లోకి వస్తుందని ఆ నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఈ నియామకంతో ఏపీ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ చరిత్ర సృష్టించారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ఈ నెల 24న పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో జస్టిస్ లీసా గిల్ సీజేగా నియమితులయ్యారు. జస్టిస్ గిల్ ప్రస్తుతం హైకోర్టులో నెంబర్ 2గా కొనసాగుతున్నారు. పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ గిల్.. గత నెల 6న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ప్రస్తుత సీజే జస్టిస్ ఠాకూర్ పదవీ విరమణ అనంతరం జస్టిస్ గిల్‌ను సీజేగా ప్రతిపాదిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం గతంలోనే సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 25న సీజేగా ఆమెతో గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రమాణం చేయిస్తారు.ఇదీ జస్టిస్ లీసా గిల్ నేపథ్యం 1966 నవంబర్ 15న జన్మించారు. చండీగఢ్‌లోని సెక్టార్ 9లో ఉన్న కార్మెల్ కాన్వెంట్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేశారు. హ్యుమానిటీస్ విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. పంజాబ్ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా ఎన్రోల్ అయ్యారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. క్రిమినల్, సివిల్, సర్వీస్, రెవెన్యూ, రాజ్యాంగ పరమైన అనేక రకాల కేసులను ఆమె వాదించారు. చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతంతో పాటు పలు బోర్డులు, కార్పొరేషన్లకు ప్రాతినిధ్యం వహించారు. 2014 మార్చి 31న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. -
ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లిసా గిల్ ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు: హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం ఏపీ హైకోర్టు ప్రాంగణంలో ప్రమాణ స్వీకార కార్యక్రమం జరిగింది. జస్టిస్ లీసా గిల్ చేత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆయన సమక్షంలో నూతన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ బాధ్యతలు స్వీకరించారు.ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి హైకోర్టు న్యాయమూర్తులు, బార్ కౌన్సిల్ సభ్యులు, న్యాయవాదులు, హైకోర్టు సిబ్బంది హాజరయ్యారు. నూతన న్యాయమూర్తి బాధ్యతలు చేపట్టడం పట్ల హైకోర్టు వర్గాలు, న్యాయవాదులు, సిబ్బంది జస్టిస్ లీసా గిల్‌కు శుభాకాంక్షలు తెలిపారు. కొత్త బాధ్యతల్లో ఆమె విజయవంతం కావాలని ఆకాంక్షించారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు ఏపీ హైకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ లీసా గిల్‌ను సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుత సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ త్వరలోనే రిటైర్ అవ్వనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి రిటైర్ అవ్వడానికి రెండు నెలల ముందే తదుపరి సీజేను ఖరారు చేయాలని కొలీజియం నిర్ణయించింది. జస్టిస్ లీసా గిల్ 2014 నుంచి చండీగఢ్ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు.


