జస్టిస్ లీసా గిల్‌కు వైఎస్ జగన్‌ శుభాకాంక్షలు | YS Jagan extends best wishes to Justice Lisa Gill | Sakshi
Sakshi News home page

జస్టిస్ లీసా గిల్‌కు వైఎస్ జగన్‌ శుభాకాంక్షలు

Apr 23 2026 11:45 PM | Updated on Apr 23 2026 11:45 PM

YS Jagan extends best wishes to Justice Lisa Gill

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ లీసా గిల్‌కు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. లీసా గిల్ హైకోర్టుకు తొలి మహిళా ప్రధాన న్యాయమూర్తిగా నియామకం అవ్వడం ఏపీ న్యాయవ్యవస్థకు గర్వకారణం. జస్టిస్ లీసా గిల్ తన  పదవీకాలం విజయవంతంగా కొనసాగించాలని కోరుకుంటున్నానని వైఎస్ జగన్ పేర్కొన్నారు.


ఇదీ జస్టిస్‌ లీసా గిల్‌ నేపథ్యం 
1966 నవంబర్‌ 15న జన్మించారు. చండీగఢ్‌లోని సెక్టార్‌ 9లో ఉన్న కార్మెల్‌ కాన్వెంట్‌ స్కూల్‌లో పాఠశాల విద్య పూర్తి చేశారు. హ్యుమానిటీస్‌ విభాగంలో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. పంజాబ్‌ యూనివర్సిటీ నుంచి బీఏ, ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. 1990లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ అయ్యారు. పంజాబ్, హర్యానా హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ చేశారు. క్రిమినల్, సివిల్, సర్వీస్, రెవెన్యూ, రాజ్యాంగ పరమైన అనేక రకాల కేసులను ఆమె వాదించారు. చండీగఢ్‌ కేంద్ర పాలిత ప్రాంతంతో పాటు పలు బోర్డులు, కార్పొరేషన్లకు ప్రాతినిధ్యం వహించారు. 2014 మార్చి 31న పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement