కలలు కల్లలైనా..అతడు చూపిన చొరవకు సెల్యూట్‌! | A Journey Left Unfinished, A Noble Gesture Fulfilled, Retire Donates ₹25 Lakh To Army Welfare | Sakshi
Sakshi News home page

కలలు కల్లలైనా..అతడు చూపిన చొరవకు సెల్యూట్‌!

Jun 13 2026 1:40 PM | Updated on Jun 13 2026 2:01 PM

Ex-banker His PF savings donates Rs 25 lakh to Indian Army Goes Viral

తాను తట్టకోలేని జీర్ణించుకోలేని భాధను అనుభవిస్తూ కూడా మంచి పనికి పూనుకున్నాడు. భార్యభర్తలు ఎంజాయ్‌ చేద్దాం అనుకుని మరి పొదుపు చేసిన మొత్తం..చివరికి అనుకోని పరిస్థితుల్లో ఆ భర్త విరాళంగా ఇచ్చాడు. అదీకూడా మాతృభూమి కోసం ప్రాణాలర్పించే యుద్దవీరుల కోసం ఆ సొమ్ముని ఇచ్చి తన పెద్దమనసుని చాటుకున్నాడు.

అతడే నాగ్‌పూర్‌కి చెందిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ ఉద్యోగి శ్రీకాంత్‌ సహస్రబుద్ధే.  తాను తన భార్య పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ నుంచి రిటైర్‌ అయ్యామని. తామిద్దరం ప్రపంచయాత్ర చేయాలనే ఉద్దేశ్యంతో పీఎఫ్‌, పొదుపు డబ్బుతో ప్లాన్‌ వేసుకున్నట్లు తెలిపారు. కానీ విధి మరోలా తలచి..తన భార్యను దూరం చేసిందన్నారు ఆవేదనగా శ్రీకాంత్‌. 

పదేళ్ల క్రితం తను చనిపోవడంతో ఆ యాత్ర చేయాలన్న ఆసక్తే పోయిందన్నారు. ఆమె మరణంతో తనకు ఎక్కడకు వెళ్లాలనిపించలేదన్నారు. అయితే ఒకరోజు అకోలాకు చెందిన ఒక వ్యక్తి భారత సైన్యానికి రూ. 1 కోటి విరాళం ఇచ్చినట్లు వాట్సాప్‌ మెసేజ్‌ చూశా. తాను అంత ఇవ్వలేను కానీ..దాచుకున్న పొదుపులోంచి రూ. 25 లక్షలు ఇవ్వగలని అనుకున్నా..అలా తన కలల యాత్ర కోసం ఆదా చేసిన పీఎఫ్‌ డబ్బులో సగం విరాళం ఇచ్చానని చెప్పుకొచ్చారు. 

బహుశా భార్యతో కలిసి ప్రయాణం చేస్తే కలిగే సంతోషం కంటే ఈ పని వల్ల లభిస్తుందేమోనన్న ఆశతో ఇలా చేశానని అన్నారు. పైగా ఆయన విరాళం ఇచ్చేటప్పుడు కన్నీళ్లు ఆగలేదన్నారు. తను తన భార్యను ఎంతలా మిస్‌ అవ్వుతున్నారో కూడా చెప్పారు. అంతేగాదు తన భార్య ఎంత మంచి మనిషో కూడా వివరించారు. నెటిజన్లు అతడి చర్యను అభినందిస్తూ..గొప్ప మనిషి..ఆయన చేసిన పనికి సెల్యూట్‌, ప్రతి ఒక్కరూ ఇలా చేయాలి అంటూ పోస్టులు పెట్టారు.

(చదవండి: నా కూతురు మాటలే కొండంత ధైర్యాన్ని ఇచ్చాయ్‌! భావోద్వేగంలో ఓ నాన్న..)

 


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement