నా కూతురు మాటలే కొండంత ధైర్యాన్ని ఇచ్చాయ్‌! భావోద్వేగంలో ఓ నాన్న.. | How a daughter inspired her 44-year-old laid-off dad to launch a startup | Sakshi
Sakshi News home page

నా కూతురు మాటలే కొండంత ధైర్యాన్ని ఇచ్చాయ్‌! భావోద్వేగంలో ఓ నాన్న..

Jun 13 2026 12:29 PM | Updated on Jun 13 2026 2:48 PM

How a daughter inspired her 44-year-old laid-off dad to launch a startup

ఇటీవల కాలంలో లేఆఫ్స్‌ ఎంత కామన్‌గా అయిపోయాయో తెలిసిందే. ఉద్యోగ భద్రత కంటిమీద కునుకులేకుండా చేస్తున్న పరిస్థితులు ఇవి. అలాంటి స్థితిని ఎలా హ్యాండిల్‌ చేసి..సులభంగా మన కెరీర్‌ని పునర్నిర్మించుకోగలమో చెప్పే కథ ఇది. అందుకు కుటుంబ మద్దతు తోడైతే తిరుగే ఉండదంటున్నాడు ఈ వ్యక్తి. అంతేగాదు తన బంగారు తల్లే ఈ సమస్య నుంచి బటయపడేలా కొండంత స్టైర్యాన్ని ఇచ్చింది అంటున్నాడు ఈ నాన్న. 

అందుకు సంబంధించిన విషయం నెట్టింట వైరల్‌గా మారింది. హిమాన్షు ఝా అనే పారిశ్రామిక వేత్త తన జాబ్‌ పోయి ఏడాది అయిన సందర్భంగా.. నాటి తన పరిస్థితి గురించి వివరించాడు. తన కెరీర్‌లోని అత్యంత గడ్డుపరిస్థితిని ఆ ఏడాదిలో చవిచూశానంటూ..నాటి ఘటనను గుర్తుతెచ్చుకున్నాడు. ఆకస్మికంగా చక్కటి కార్పొరేట్‌ ఉద్యోగం కోల్పోవడంతో.. ఒక్కసారిగా తన పరిస్థితి తలకిందులైనట్లు అనిపించిందని చెప్పుకొచ్చాడు. 

ఏం చేయాలో దిక్కుతోచని ఆ స్థితిలో తన భార్య, కూతురు ఎలా తన మద్దతుగా నిలిచారో చెబుతూ వారిని ప్రశంసలతో ముంచెత్తాడు. ఆ కష్ట సమయంలో మన స్నేహితులు, బంధువులు ఎలా దూరమవుతారో, అలాగే మనకెంతో ప్రియమైన వారు ఎలా అండగా నిలబడతారో మనకు తెలుస్తుంది. అంతేగాదు ఉద్యోగం కోల్పోవడంతో ఐదు పాఠాలను నేర్చుకున్నానంటున్నాడు. ఆ సమయంలో తన కుమార్తెతో గడుపుతూ ఆ బాధను మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నప్పుడూ.. ఆమె ఇక ఇప్పుడు మీకు నచ్చింది చేయండి నాన్న అంది. 

అప్పుడే అర్థమైంది జాబ్‌ పోవడం అంతం కాదు, కెరీర్‌లో ఎదురయ్యే ఎదురుదెబ్బ అంతిమం కాదని తెలుసుకోగలిగనంటున్నాడు. ఏ వయసులోనేనా మళ్లీ తిరిగి ప్రారంభించి నిలదొక్కుకోవచ్చు..అందుకు గుండె నిండా ధైర్యం కావాలి. అది ఉంటే చాలు..చతికిల పడినా..రాకెట్‌లా తిరిగి దూసుకుపోగలమని అవగతమైందని చెప్పుకొచ్చాడు హిమాన్షు. ఇది అప్పటి వరకు ఉన్న సౌకర్యవంతమైన స్థితి నుంచి బయటకు నెట్టి..స్ట్రాంగ్‌గా మరింత బలంగా నిలబడేందుకు అంకురార్పణ అవుతోందంటున్నాడు. తన కూతురు చెప్పినట్లుగా 44 ఏళ్ల వయసులో నా కలను అనుసరించి  స్టార్టప్‌ ప్రారంభించి, వ్యవస్థాపకుడిగా మారానని చెప్పాడు. 

నచ్చిన పనిచేయి నాన్న అంటూ మాట్లాడిన మాటలు..చాలా సాధారణమైనవిగా కనిపిస్తున్నా..ధైర్యాన్ని ఎలా ప్రదర్శించాలో నేర్చించిందామె. ఈ పరిస్థితి.. ఎవరు మనకు ఆప్తులు..ఎవరు శత్రువులో కూడా తెలియజేస్తుంది. అలాగే దీంతోపాటు..అతిపెద్ద ఆస్తి ఆరోగ్యం అని దానిపై సదా దృష్టిపెట్టమని కోరాడు. ఏళ్ల తరబడి కార్పొరేట్‌ లైప్‌ బిజీలో, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేశానని తెలుసుకున్నా..అంతర్గత శాంతికి ప్రయత్నించి మరీ.. నిలదొక్కుకునే ప్రయత్నం చేశానని రాసుకొచ్చాడు. అలాగే ఎక్కువగా భయపడే ఉద్యోగ తొలగింపు భయం..ఒక్కోసారి మిమ్మల్ని స్ట్రాంగ్‌గా మార్చే అధ్యయంగా కూడా మారుతుందని నమ్మకంగా చెబుతూ..తన పోస్ట్‌ని ముగించాడు హిమాన్షు. 

నెటిజన్లు కూడా ఆయన మాటలకు మద్దతు తెలుపుతూ..ముందుకు సాగకుండా..రాబోయేదాన్ని స్వీకరించకుండా, గతాన్ని పట్టుకుని వేళాడటమే తప్పు..మీకు అంతా మంచే జరుగుతుంది సార్‌ అని అభినందిస్తూ పోస్టులు పెట్టారు. ఇలాంటి పరిస్థితులనే ఎదుర్కొంటున్న వారు ఈ వ్యక్తి స్ఫూర్తినే తీసుకుంటూ...ముందుకు సాగండని హితవు పలుకుతున్నాడు హిమాన్షు.

(చదవండి: ఆటో డ్రైవర్‌ నుంచి రూ. 900 కోట్ల కంపెనీ రేంజ్‌కి..! జస్ట్‌ దేశీ బ్రాండ్‌తోనే.)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement