జస్ట్‌ ఒక్క గవర్నమెంట్‌ జాబ్‌ కొడితే చాలు అనుకున్నా..! కానీ.. | Chhattisgarh Girl Charu Pandey Makes History By Qualifying 19 Govt Job Exams At Age 23, Check Out Story Inside | Sakshi
Sakshi News home page

జస్ట్‌ ఒక్క గవర్నమెంట్‌ జాబ్‌ కొడితే చాలు అనుకున్నా..! కానీ ఏకంగా 19..

Jun 13 2026 2:29 PM | Updated on Jun 13 2026 4:09 PM

Woman clears 19 central government exams Goes Viral

కొందరు సక్సెస్‌కి చిరునామాగా ఉంటారు. చాలామంది ఎంచుకున్న దాంట్లో సక్సెస్‌ అందుకోవడానికే నానా తంటాలు పడతూ ఉంటే..రాసిన అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో ఉత్తీర్ణురాలవ్వడం అంటే..మాటలు కాదుకదా..!. అంత అంకితభావంతో, అంతలా ప్రిపేరవ్వడం నిజంగా మాటలు కాదు కదా..!. కానీ ఈ అమ్మాయ్‌ అలాంటి ఘనతనే సాధించింది.

ఆ అమ్మాయే రాయ్‌పూర్‌కి చెందిన చారు పాండే. భారతదేశంలో ప్రభుత్వ నియామకానికి సంబంధించిన ఎన్నో కాంపిటీటివ్‌ ఎగ్జామ్స్‌ ఉన్నాయి. అందులో ఉత్తీర్ణత సాధించలేక అభ్యర్థులు ఎంతలా ఇబ్బంది పడతుంటారో తెలిసిందే. అలాంటిది..అంత కఠినతరమైన ప్రభుత్వ నియమాక పరీక్షలన్నీ సులభంగా చేధించేసిందామె ఆమె. 

ఒకటి, రెండు కాదు ఏకంగా 19 సెంట్రల్‌ గవర్నెమెంట్‌ పరీక్షల్లో ఉత్తీర్ణురాలవ్వడం విశేషం. జస్ట్‌ 23 ఏళ్ల వయసుకే ఈ ఘనతను సాధించిన అమ్మాయిగా రికార్డు సృష్టించి..వార్తల్లో నిలిచింది. ఆమె రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ పరీక్షలు, ఎస్బీఐ, ఐబీపీఎస్‌, ఎస్‌ఎస్సీ సీజీఎల్‌, సీహెచ్‌ఎస్‌ఎల్‌, ఎంటీఎస్‌ వంటి అనేక పరీక్షల్లో రాసింది. ఆమె  చేసిన నిరంతర ప్రయత్నాలు చివరకు ఫలించి ఏకంగా 19 కేంద్ర ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి దారితీసింది. 

ఈ మేరకు చారు పాండే మాట్లాడుతూ..19 కేంద్ర ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించినందుకు తన కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది. నిజం చెప్పాలంటే ఇన్ని పరీక్షలు రాస్తానని అస్సలు అనుకోలేదని చెబుతోంది. ఒక్క ప్రభుత్వ ఉద్యోగమైనా సంపాదించగలిగితే చాలు అనుకున్నా..కానీ ఏకంగా ఇన్ని పరీక్షల్లో విజయవంతమయ్యా అంటూ సంతోషంగా చెప్పుకొచ్చింది. 

తన గణిత నేపథ్యం కారణంగా తన పేరెంట్స్‌ టీచర్‌ లేదా లెక్చరర్‌ రంగంలోకి వెళ్లాలని ఆశించారు. ఈ నేపథ్యంలోనే ఇలా పోటీ పరీక్షలపై దృష్టి పెట్టానని చెప్పుకొచ్చింది. అయితే నెటిజన్లు కొందరు ఆమె పట్టుదలపి, కృషిని ప్రశంసించగా, మరికొందరు ఇన్ని రాసిందంటే..ఆమెకు ఎందులోనూ సరైన అభిరుచి లేదు..పైగా ఆ రంగంలోని వాళ్ల రిజర్వేషన్‌ ఈమె కారణంగా కోల్పోతేందంటూ మండిపడుతూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: కలలు కల్లలైనా..అతడు చూపిన చొరవకు సెల్యూట్‌!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement