breaking news
jobs
-
నిరుద్యోగులకు వయో ‘గండం’
సాక్షి,అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులతో ఆటలాడుతోంది. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ ఎన్నికల్లో ఊదరగొట్టి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చతికిల పడింది. ఏటేటా జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఉద్యోగాలిస్తామన్న హామీ గాల్లో కలిసిపోయింది. ఇక డీఎస్సీ–2025 అక్రమాలకు అడ్డాగా మారింది.స్పోర్ట్స్ డీఎస్సీలో ప్రతిభ ఉన్న వారిని పక్కనపెట్టి దొంగ సర్టిఫికెట్లు సమర్పించిన వారికి టీచర్ ఉద్యోగాలిచ్చేసింది. దీంతో నిరుద్యోగుల్లో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇకపై ఇచ్చే నోటిఫికేషన్లు పారదర్శకంగా ఉండాలని.. ప్రధానంగా వయో పరిమితిపై స్పష్టత ఇవ్వాలని యువత డిమాండ్ చేస్తోంది.నోటిఫికేషన్‌కు ముందే స్పష్టత ఇవ్వాల్సిందే.. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్లో భాగంగా సెపె్టంబర్ 15న విడుదల చేయనున్న ఉద్యోగ నోటిఫికేషన్ల విడుదలకు ముందే వయోపరిమితిపై క్లారిటీ ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండున్నరేళ్లు కావస్తున్నా నిరుద్యోగుల ప్రధాన సమస్య అయిన వయోపరిమితి పెంపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.నోటిఫికేషన్లు ఆలస్యం.. పెరుగుతున్న ఆందోళన.. ప్రభుత్వం నోటిఫికేషన్లు ఆలస్యం కావడంతో నిరుద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది. ఏళ్ల తరబడి కోచింగ్‌లు, రూమ్‌ల కోసం లక్షలాది రూపాయిలు ఖర్చు చేసి ఉద్యోగాల నోటిఫికేష్ల కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. చాలా మంది వయోపరిమితి దాటిపోయి ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో వయోపరిమితి పెంపు కోసం నిరీక్షిస్తున్నారు. అయినా సర్కారు దయ చూపడం లేదు. నిరుద్యోగుల ప్రధాన డిమాండ్లు ఇవే..47 ఏళ్లకు వయోపరిమితి పెంచాలి జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ప్రస్తుతం ఉన్న 42 సంవత్సరాల గరిçష్ట వయోపరిమితిని 47 సంవత్సరాలకు పెంచాలి. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ప్రస్తుత మంత్రి నారా లోకేశ్ నిరుద్యోగుల వయోపరిమితి సమస్యపై స్పందించి 44 ఏళ్లకు పెంచాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు కూడా 47 ఏళ్లకు వయోపరిమితి పెంచాలని ప్రభుత్వానికి లేఖ రాశారు. విపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల తరఫున వయోపరిమితి పెంచాలని డిమాండ్ చేసిన తెలుగుదేశం ఇప్పుడు అధికారంలో ఉన్న విషయాన్ని గుర్తించుకోవాలని నిరుద్యోగులు హితవు పలుకుతున్నారు.టెన్షన్లో పోలీస్ అభ్యర్థులు..: 2022లో చివరిసారిగా పోలీస్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అప్పటి నుంచి కొత్త నోటిఫికేషన్ కోసం వేలాది మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. ఏళ్ల తరబడి నోటిఫికేషన్ రాకపోవడంతో అనేకమంది అభ్యర్థులు వయోపరిమితి దాటిపోయింది. పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ తదితర యూనిఫాం సర్వీసుల అభ్యర్థుల వయోపరిమితిని 35 ఏళ్లకు సడలించాలి. ఐపీఎస్ పోస్టుకు 32 ఏళ్లు.. డీఎస్పీకి 30 ఏళ్లే...: యూపీఎస్సీ ద్వారా భర్తీ చేసే ఐపీఎస్ పోస్టుకు 32 ఏళ్ల వయోపరిమితి ఉంది. అయితే రాష్ట్రస్థాయిలో ఏపీపీఎస్సీ గ్రూప్–1 ద్వారా భర్తీ చేసే డీఎస్పీ పోస్టుకు 30 సంవత్సరాలే ఉందని.. ఈ అంశంపై పునఃపరిశీలించాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని అనేకమంది ప్రతిభావంతులైన అభ్యర్థులు వయోపరిమితి కారణంగా డీఎస్పీ పోస్టుకు దూరమవుతున్నారు. ఐపీఎస్‌కు 32 సంవత్సరాలు ఉన్నప్పుడు డీఎస్పీకి 30 సంవత్సరాల పరిమితి ఎందుకు? అని ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యత్యాసంపైనా ప్రభుత్వం సమీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. డీఎస్పీ పోస్టుకు వయో పరిమితి 32 ఏళ్లకు పెంచాలని అడుగుతున్నారు. తెలంగాణలో సడలింపు..: నిరుద్యోగుల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని తెలంగాణ ప్రభుత్వం వయోపరిమితి సడలింపులు కల్పించింది. పొరుగు రాష్ట్రంలో నిరుద్యోగుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని వయోపరిమితిపై నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమూ తమ డిమాండ్‌ను నెరవేర్చాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. -
డీఎస్సీపై నిజాయితీ నిరూపించుకోండి
సాక్షిప్రతినిధి, విజయనగరం: ‘డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు అమ్ముకున్నారు. ఇదే విషయాన్ని మేం ధైర్యంగా చెబుతున్నాం. అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపి నిజాయితీ నిరూపించుకోండి’ అని చంద్రబాబు ప్రభుత్వాన్ని శాసనమండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. శనివారం విజయనగరంలో వైఎస్సార్సీపీ జిల్లా విస్తతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీ అక్రమాలపై అసెంబ్లీలోను, బయట చాలెంజ్ చేస్తున్న విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శాసనమండలిలో ఎందుకు చాలెంజ్ చేయడం లేదని ప్రశ్నించారు. డీఎస్సీ నియామకాలపై తప్పుగా మాట్లాడితే కేసులు పెడతామంటూ అధికారులతో చెప్పించడం సిగ్గుచేటన్నారు. నారా లోకేశ్ నీతిమంతుడైతే తక్షణమే విచారణకు ఆదేశించాలన్నారు. 2006లో వోక్స్వ్యాగన్ అంశంలో తనపై ఆరోపణలు వచ్చాయని, తానే స్వయంగా సీబీఐ విచారణ జరిపించుకుని నిజాయితీని నిరూపించుకున్నట్టు గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వ పాలనలో పోలీస్ వ్యవస్థపై నమ్మకంపోవడం ప్రజాస్వామ్యంలో దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ప్రజా సమస్యలపై పోస్టులు పెడితే బెదిరింపులకు పాల్పడుతున్నారని, మహిళా కార్యకర్తలపై అసభ్యకర పోస్టింగ్‌లు పెట్టడం దారుణమన్నారు. టీడీపీ వారిపై ఎందుకు కేసులు పెట్టడం లేదని నిలదీశారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయకపోవడం దౌర్భాగ్యమన్నారు. ఈ పరిస్థితిలోనూ రైతులకు ఒక యూరియా బస్తా దొరకని పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలు విడ్డూరం: కన్నబాబుపార్టీ రీజినల్ కో–ఆర్డినేటర్, మాజీ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ.. రెండు రోజులపాటు నిర్వహించిన కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు సమీక్షలు కాదు ఫలితాలు కావాలంటూ వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ బాధ్యతగల ప్రతిపక్షంగా అదే చెబుతోందన్నారు. ఉదయం ఇచ్చిన పింఛన్ డబ్బులు సాయంత్రానికి మద్యం తాగేస్తున్నారని, ఎవరికి పింఛన్ ఇవ్వాలో, ఎవరికి ఇవ్వకూడదో వెరిఫై చేయాలని చెప్పడం వెనుక చంద్రబాబు ఉద్దేశం ఏంటని ప్రశ్నించారు. కొత్తగా పింఛన్లు ఇస్తామని రెండున్నరేళ్ల తరువాత ప్రకటించి, పింఛన్ల కోసం కుటుంబాలు విడిపోయాయా లేదా అని సర్వే చేయాలనడం సరికాదన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మద్యాన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకున్నా తప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు ఇంటింటికీ మద్యం సరఫరా చేసే పరిస్థితి తీసుకువచ్చారన్నారు. రాష్ట్రంలో విక్రయిస్తున్న ప్రతి 4 మద్యం బాటిళ్లలో ఒక నకిలీ బాటిల్ ఉంటోందన్నారు.డీఎస్సీలో పేకాట ఆడినవారికి ఉద్యోగాలిస్తామని చంద్రబాబు చెప్పడం విచారకరమన్నారు. దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్న చందంగా టీడీపీ కూటమి ప్రజాప్రతినిధులు క్రీడా అసోసియేషన్ల ప్రతినిధులుగా సర్టిఫికెట్లు జారీచేసి ఉపాధ్యాయ ఉద్యోగాలను అమ్ముకున్నారన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు గుడివాడ అమర్నా«థ్, పీడిక రాజన్నదొర, మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి, నియోజకవర్గ సమన్వయకర్తలు పాల్గొన్నారు. -
2030 నాటికి 20 లక్షల కొలువులు..!
భారత బ్యాటరీ పరిశ్రమ భారీగా ఉద్యోగాలను సృష్టించే దశలోకి ప్రవేశిస్తోంది. ఇప్పటివరకు లిథియం–అయాన్ సెల్ల దిగుమతి, అసెంబ్లింగ్‌పై ఆధారపడిన ఈ రంగం.. సెల్ తయారీ నుంచి బ్యాటరీ ప్యాక్‌ల తయారీ, రీసైక్లింగ్ వరకు పూర్తిస్థాయి పారిశ్రామిక వ్యవస్థగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలో 2029–30 నాటికి దేశీయ బ్యాటరీ పరిశ్రమ 15 లక్షల నుంచి 20 లక్షల ఉద్యోగాలను సృష్టించనుందని గ్లోబల్ స్టాఫింగ్ సంస్థ ‘అడెక్కో ఇండియా’ నివేదిక తెలిపింది.దేశంలోని 30కి పైగా క్లయింట్ కంపెనీల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అంచనాలను వెల్లడించింది. మొత్తం ఉద్యోగాల్లో సుమారు 25 శాతం ప్రత్యక్షంగా, 75 శాతం పరోక్షంగా ఉండనున్నాయి. ఈ రంగంలో నియామకాలు ఏటా 25–30 శాతం పెరగనున్నాయని అడెక్కో ఇండియా జనరల్ స్టాఫింగ్ డైరెక్టర్, హెడ్ దీపేష్ గుప్తా తెలిపారు. నాలుగు రాష్ట్రాల్లోనే 70 శాతానికి పైగా నియామకాలు గుజరాత్, కర్ణాటక, హర్యానా, తెలంగాణలో గిగాఫ్యాక్టరీల పెట్టుబడులు పెరుగుతుండటంతో బ్యాటరీ రంగ నియామకాల్లో 70 శాతానికి పైగా ఈ క్లస్టర్లలోనే కేంద్రీకృతం కానున్నాయి. రాష్ట్రాల వారీగా కర్ణాటక 24 శాతం, గుజరాత్ 22 శాతం, తెలంగాణ 18 శాతం, హర్యానా 14 శాతం వాటాతో ముందంజలో ఉండనున్నాయి. గిగాఫ్యాక్టరీల చుట్టూ కాంపోనెంట్ పార్కులు, బ్యాటరీ రీసైక్లింగ్ కేంద్రాలు, సరఫరాదారుల వ్యవస్థలు అభివృద్ధి చెందడంతో కొత్త నియామక అవసరాల్లో సుమారు 30 శాతం టైర్–2, టైర్–3 పారిశ్రామిక కారిడార్ల నుంచి వచ్చే అవకాశం ఉంది.నైపుణ్యం ఉన్నవారికి 40 శాతం వరకు అధిక వేతనాలుసాంప్రదాయ తయారీ, ఎల్రక్టానిక్స్ రంగాలతో పోలిస్తే.. బ్యాటరీ ఇంజనీరింగ్, ఎలక్ట్రో కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్, రీసైక్లింగ్ నైపుణ్యాలు ఉన్న నిపుణులకు 35 శాతం నుండి 40 శాతం వరకు అధిక వేతనాలు లభిస్తాయని నివేదిక స్పష్టం చేసింది. 2030 నాటికి దేశంలో వచ్చే మొత్తం ‘గ్రీన్ మ్యానుఫ్యాక్చరింగ్’ ఉద్యోగాల్లో 50 నుండి 60 శాతం వాటా లిథియం బ్యాటరీ తయారీ రంగానిదే కానుండటం విశేషమని అడెక్కో నివేదిక తెలిపింది.సెల్ తయారీకి పెద్దపీటమొత్తం నియామకాల్లో సెల్ తయారీ, బ్యాటరీ విడిభాగాల తయారీ విభాగం 42–45 శాతం వాటాతో అతిపెద్ద భాగంగా ఉండనుంది. బ్యాటరీ రీసైక్లింగ్, మెటీరియల్స్ రికవరీ కూడా కీలక ఉపాధి రంగాలుగా మారుతున్నాయి. ఈ విభాగంలో నియామకాలు ఏటా 25–30 శాతం పెరుగుతాయని అంచనా. ప్రస్తుతం దేశంలో బ్యాటరీ తయారీ సామర్థ్యం సుమారు 60 జీడబ్ల్యూహెచ్‌గా ఉండగా, 2026 చివరి నాటికి ఇది దాదాపు 100 జీడబ్ల్యూహెచ్‌కు చేరుతుందని అడెక్కో తెలిపింది. గుజరాత్, కర్ణాటక, హర్యానా, తెలంగాణలో రానున్న గిగాఫ్యాక్టరీ పెట్టుబడులతో ఈ రంగం అసెంబ్లింగ్ స్థాయి నుంచి పూర్తిస్థాయి పారిశ్రామిక ఎకోసిస్టమ్‌గా విస్తరించనుంది.రూ.18,100 కోట్ల ప్రభుత్వ మద్దతుఅడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్స్ (ఏసీసీ) తయారీకి సంబంధించిన పీఎల్ఐ పథకం కింద 50 జీడబ్ల్యూహెచ్ దేశీయ తయారీ సామర్థ్యం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.18,100 కోట్లు కేటాయించింది. మరో 5 జీడబ్ల్యూహెచ్ సామర్థ్యాన్ని ప్రత్యేక రసాయన సాంకేతికతలకు కేటాయించింది. ఈ స్థానికీకరణ ప్రక్రియ ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి దోహదపడటంతో పాటు, దిగుమతి చేసుకునే సెల్స్, శుద్ధి చేసిన ముడి పదార్థాలపై దేశం ఆధారపడటాన్ని తగ్గించనుందని కంపెనీ తెలిపింది. క్రిటికల్ మినరల్స్ మిషన్, క్వాడ్ క్రిటికల్ మినరల్స్ ఇనిషియేటివ్ ఫ్రేమ్‌వర్క్‌లో భారత్ భాగస్వామ్యం కూడా ఈ ప్రక్రియకు మద్దతుగా నిలుస్తున్నాయని పేర్కొంది.ఇదీ చదవండి: అసలు బ్రిక్స్‌లో ఏం చర్చిస్తారు? -
తెలంగాణలో పోలీస్ ఉద్యోగ అభ్యర్థులకు గుడ్‌న్యూస్..
తెలంగాణ: రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. కానిస్టేబుల్ పోస్టులకు గరిష్ఠ వయోపరిమితిని మరో మూడేళ్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే ఇచ్చిన ఏడేళ్ల వయోపరిమితి సడలింపునకు అదనంగా మరో మూడేళ్లు పెంచడంతో మొత్తం పదేళ్ల వరకు వయోపరిమితి సడలింపు అందుబాటులోకి వచ్చింది.తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేపట్టే నియామకాలకు ఈ సడలింపు వర్తించనుంది. పోలీస్ శాఖతో పాటు ఫైర్ సర్వీసెస్, జైళ్ల శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF)లోని కానిస్టేబుల్ పోస్టులకు ఇది వర్తించనుంది. అలాగే, కానిస్టేబుల్‌తో సమాన హోదా కలిగిన ఇతర పోస్టులకు కూడా ఈ అదనపు వయోపరిమితి సడలింపు వర్తిస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.దీంతో వయోపరిమితి కారణంగా ఇప్పటివరకు పోలీస్ ఉద్యోగాలకు దూరమైన పలువురు అభ్యర్థులకు మరోసారి అవకాశం లభించనుంది. ముఖ్యంగా గత కొంతకాలంగా పోలీస్ నియామకాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఈ నిర్ణయం ఊరటనివ్వగా, రాబోయే నియామకాల్లో అర్హత కలిగిన మరికొందరు అభ్యర్థులు పోటీ పడేందుకు అవకాశం ఏర్పడింది.అయితే ఈ అదనపు మూడేళ్ల సడలింపుకు కొన్ని మినహాయింపులు ఉన్నాయి. పోలీస్ శాఖలోని పీసీ డ్రైవర్ పోస్టులకు ఈ సడలింపు చెల్లదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దాంతో డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆయా పోస్టులకు సంబంధించిన వయోపరిమితి నిబంధనలను ప్రత్యేకంగా పరిశీలించాలి.ఈ వయోపరిమితి పెంపునకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం సెప్టెంబర్ 9, 2026న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఈ ఉత్తర్వులను జారీ చేశారు. ఇప్పటికే అమల్లో ఉన్న ఏడేళ్ల సడలింపునకు మరో మూడేళ్లు కలపడంతో మొత్తం పదేళ్ల వరకు సడలింపు లభించనుంది.దీంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పోలీస్, ఫైర్, జైళ్లు, ఎస్పీఎఫ్ విభాగాల్లో కానిస్టేబుల్, సమాన హోదా పోస్టులకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ప్రయోజనం చేకూర్చనుంది. దరఖాస్తు చేసే ముందు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్న వయస్సు, విద్యార్హతలు, శారీరక ప్రమాణాలు, ఇతర అర్హతలను అభ్యర్థులు తప్పనిసరిగా పరిశీలించాలని ప్రభుత్వం సూచించింది.ఇవి కూడా చదవండి: ఇందిరమ్మ టవర్స్ డిపాజిట్ వాపస్ -
‘బాబూ.. జాబులేవి?’ అని అడగడమే నేరమా?
సాక్షి, అమరావతి: ఇచ్చిన హామీలను నెరవేర్చా లని కాకినాడలో శాంతియుతంగా ర్యాలీ చేసిన నిరుద్యోగులపై కూటమి ప్రభుత్వం కక్ష పూరితంగా కేసులు పెట్టడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజమెత్తారు. హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే నేరమా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలను నెరవేర్చాలని నిరసన తెలిపిన నిరుద్యోగులపై కేసులు పెడతారా? అంటూ నిలదీశారు. ఇది కూటమి ప్రభుత్వం నిరంకుశ విధానానికి నిదర్శనమంటూ మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కూటమి ప్రభుత్వ చర్యలను ఎండగట్టారు. ఆయన ట్వీట్లో ఇంకా ఏమన్నారంటే... నిరుద్యోగ యువతపై కేసులా? మెగా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ కాకినాడలో శాంతియుతంగా నిరసన తెలిపిన నిరుద్యోగ యువతపై చంద్రబాబు నేతృత్వంలోని వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం పోలీసు కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. శ్యామ్, టి.రాజా, ఎం. గంగ సూరిబాబు, రాజేష్‌తో పాటు 20 మంది పోలీసు నిరుద్యోగులు చేసిన నేరమేమిటి? ‘బాబూ.. జాబులేవి?’ అని ప్రశ్నించడమేనా నేరం? ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వాలని అడగడం కూడా తప్పా? ప్రజలు తాము ఎన్నుకున్న ప్రభుత్వాన్ని శాంతియుతంగా ప్రశ్నించడం కూడా ఆంధ్రప్రదేశ్‌లో నేరంగా మారిందా?. అప్రజాస్వామిక వైఖరికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది చంద్రబాబూ?ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని, ప్రతి నిరుద్యోగికి నెలకు రూ.3 వేల భృతి ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని 20 లక్షల మంది నిరుద్యోగులకు ఈ లెక్కన ఏడాదికి రూ.7,200 కోట్లు, మూడేళ్లకు రూ.21,600 కోట్లు చెల్లించాలి. కానీ ఇటు ఉద్యోగాలు ఇవ్వకుండా, అటు నిరుద్యోగ భృతి చెల్లించకుండా యువతను మోసం చేసిన ఈ వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వం.. ఇప్పుడు తమ హక్కుల కోసం ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు పెడుతోంది.మెగా డీఎస్సీలో రోజుకొక మోసం బయటపడుతుంటే సమాధానం చెప్పలేక చంద్రబాబు, నారా లోకేశ్ ఇద్దరూ అణచివేత, నిర్బంధం, బెదిరింపులకు దిగుతున్నారు. అడ్డదారుల్లో ఉద్యోగాలు పొందిన వారిని కాపాడుతూ.. పారదర్శకంగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతున్న అర్హులైన నిరుద్యోగులను నేరస్తులుగా చూస్తున్నారు. కూటమి ప్రభుత్వం యువత పట్ల అనుసరిస్తున్న వ్యతిరేక విధానానికి, అప్రజాస్వామిక వైఖరికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది?. యువత ఆశలు, ఆకాంక్షలను ఏనాడూ చంద్రబాబు గౌరవించలేదు వెన్నుపోటు పార్టీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ నియామకాల్లో అక్రమాలు, ప్రశ్నాపత్రాల లీకేజీలు, నిబంధనలకు విరుద్ధమైన నియామకాలు పరిపాటిగా మారాయి. అవినీతి, రాజకీయ పైరవీలతో ఉద్యోగాలను పంచుకోవడంపైనే వెన్నుపోటు పార్టీ దృష్టి తప్ప.. రాష్ట్ర యువత ఆశలు, ఆకాంక్షలను ఏనాడూ గౌరవించలేదు. ప్రతిభకు పట్టం కట్టి, అర్హులకు నిష్పక్షపాతంగా ఉద్యోగాలు కల్పిం చాలన్న చిత్తశుద్ధి ఈ వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వానికి లేదు. నిరుద్యోగ యువతపై నమోదు చేసిన కేసులన్నింటినీ తక్షణమే, బేషరతుగా ఉపసంహరించాలి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మెగా పోలీస్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయాలి. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుంది. వారికి న్యాయం జరిగే వరకు పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తుంది’ అని మాజీ సీఎం వైఎస్ జగన్ హెచ్చరించారు. -
యంత్రాలు, ఆటోమేషన్ పెరిగాయ్.. మనషుల పరిస్థితి ఇదీ..
చైనాలో తయారీ రంగం వేగంగా మారిపోతుండటంతో ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయి. ఒకప్పుడు ప్రపంచానికి ప్రధాన తయారీ కేంద్రంగా ఉన్న చైనాలో ఇప్పుడు కర్మాగారాల్లో ఆటోమేషన్ పెరగడం, ఉత్పత్తి ప్రక్రియల్లో యంత్రాల వినియోగం అధికం కావడం వల్ల మనుషుల అవసరం తగ్గుతోంది.ఇటీవల చాంగ్జౌ షింగ్యూ ఆటోమోటివ్ లైటింగ్ సంస్థ 440 మంది కొత్త గ్రాడ్యుయేట్లను ఉద్యోగాల్లోకి తీసుకున్న కొద్దికాలానికే 107 మందిని తొలగించింది. ఈ ఘటన చైనాలో యువత ఎదుర్కొంటున్న ఉద్యోగ సంక్షోభాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది.చైనాలో యువ నిరుద్యోగం పెరగడానికి ఆటోమేషన్ ఒక్కటే కారణం కాదు. తయారీ రంగంలో ఉద్యోగాల తగ్గుదలతో పాటు విదేశాలకు ఉత్పత్తి కార్యకలాపాలు తరలిపోవడం, రియల్ ఎస్టేట్ రంగంలో మందగమనం వంటి అంశాలు కూడా ఉపాధి అవకాశాలపై ప్రభావం చూపుతున్నాయి.చైనా ఆర్థిక వ్యవస్థలో తయారీ రంగం బలంగానే ఉన్నప్పటికీ, గతంలో మాదిరిగా పెద్ద సంఖ్యలో కార్మికులకు ఉద్యోగాలు కల్పించే పరిస్థితి మారుతోంది. యంత్రాలు, ఆటోమేషన్ పెరుగుతున్న కొద్దీ ఉద్యోగాల స్వభావం మారడంతో యువతకు కొత్త నైపుణ్యాలు అవసరమవుతున్నాయి.చైనాలో ఏం జరుగుతోంది? చైనాలో ఈ ఏడాది 12.7 మిలియన్ల మంది కొత్త గ్రాడ్యుయేట్లు ఉద్యోగ మార్కెట్లోకి వచ్చారు. ఇది ఇప్పటివరకు నమోదైన అతిపెద్ద గ్రాడ్యుయేట్ల బ్యాచ్.16-24 ఏళ్ల యువతలో నిరుద్యోగిత మేలో 15.6 శాతానికి చేరింది. ఉద్యోగాల కోసం భారీగా దరఖాస్తులు చేస్తున్నా అవకాశాలు తక్కువగా ఉన్నాయి.చాంగ్జౌ జింగ్యూ ఆటోమోటివ్ లైటింగ్ సంస్థ 440 మంది కొత్త గ్రాడ్యుయేట్లను నియమించి, కొద్ది వారాలకే 107 మందిని తొలగించింది. ఈ ఘటన చైనాలో పెద్ద చర్చకు దారితీసింది.ఫ్యాక్టరీ కార్మికుల ఉద్యోగాలు తగ్గడానికి ఆటోమేషన్, తక్కువ వేతన దేశాలకు తయారీ కార్యకలాపాల తరలింపు, రియల్ ఎస్టేట్ సంక్షోభం ప్రధాన కారణాలుగా ఉన్నాయి.2021–2025 మధ్య రియల్ ఎస్టేట్ రంగం పతనం కారణంగా 14 మిలియన్లకు పైగా కార్మికులు నిర్మాణ రంగం నుంచి బయటకు వచ్చారు.చైనాలో గిగ్ వర్కర్ల సంఖ్య ఈ ఏడాది 320 మిలియన్లకు చేరవచ్చని అంచనా. గత ఏడాది ఇది 280 మిలియన్లుగా ఉంది.కృత్రిమ మేధస్సు కారణంగా గ్రాడ్యుయేట్లకు లభించే ప్రారంభ స్థాయి వైట్ కాలర్ ఉద్యోగాలు కూడా తగ్గుతున్నాయి.చైనా ప్రభుత్వం పాతబడిన విశ్వవిద్యాలయ కోర్సులను తొలగిస్తూ టెక్నాలజీ, ఏఐ ఆధారిత కోర్సులపై దృష్టి పెడుతోంది. అలాగే గ్రాడ్యుయేట్ల కోసం జాతీయ స్థాయిలో ఉద్యోగ నియామక కార్యక్రమాలు చేపట్టింది.చైనా తయారీ రంగంలో ఉద్యోగాలు తగ్గుతున్నా ఉత్పత్తి సామర్థ్యం తగ్గలేదని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ ఉత్పత్తిని తక్కువ మంది కార్మికులతో సాధించడం ఆటోమేషన్ ప్రభావానికి సంకేతం అని పేర్కొన్నారు.చైనా తయారీ ఉద్యోగాలు 2013లో 152 మిలియన్ల గరిష్ఠ స్థాయి నుంచి 134 మిలియన్లకు తగ్గాయి. ఇదే సమయంలో భారత్ తయారీ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది. -
ఇదే జరిగితే.. మరో పదేళ్లు మాత్రమే మనుషులకు ఉద్యోగం!
హ్యూమనాయిడ్ రోబోల భవిష్యత్తుపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే 10 సంవత్సరాల్లో ప్రపంచవ్యాప్తంగా కనీసం 100 కోట్ల హ్యూమనాయిడ్ రోబోలు వచ్చే అవకాశం ఉందని ఆయన అన్నారు.ఒక్కో రోబో సాధారణ మనిషి కంటే కనీసం ఐదు రెట్లు ఎక్కువ ఉత్పాదకత కలిగి ఉంటుందని మస్క్ పేర్కొన్నారు. అలా చూస్తే.. 100 కోట్ల రోబోలు కలిపి చేసే పని ప్రపంచంలోని మొత్తం మానవుల కంటే ఎక్కువగా ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. దీన్నిబట్టి చూస్తే మరో 10 ఏళ్లు మాత్రమే మనిషి ఉద్యోగం చేసుకోవడానికి అవకాశం ఉందని తెలుస్తోంది.గణనీయంగా పెరగనున్న రోబోలు!రోబోలు కేవలం పనులను చేయడం మాత్రమే కాకుండా.. ఇతర రోబోలను తయారు చేసే స్థాయికి చేరుకుంటాయని మస్క్ పేర్కొన్నారు. ఇలా ఒక రోబో మరిన్ని రోబోలను తయారు చేస్తే వాటి సంఖ్య చాలా వేగంగా పెరిగే అవకాశం ఉంటుంది. మొదట నెమ్మదిగా ప్రారంభమైన ఈ ప్రక్రియ తర్వాత వేగంగా విస్తరించే అవకాశం ఉందని మస్క్ వివరించారు.ఒక హ్యూమనాయిడ్ రోబో ఎంత ఉపయోగకరంగా ఉంటుందనేది ప్రధానంగా మూడు విషయాలపై ఆధారపడి ఉంటుందని మస్క్ చెప్పారు. మొదటిది ఏఐ సాఫ్ట్వేర్ ఎంత సమర్థంగా పనిచేస్తుంది, రెండోది రోబోలో ఉపయోగించే ఏఐ చిప్ సామర్థ్యం, మూడోది రోబోకు ఉండే మెకానికల్ నైపుణ్యం, ముఖ్యంగా చేతులతో వస్తువులను మనుషుల్లా పట్టుకోవడం, కదిలించడం వంటి సామర్థ్యం. ఈ మూడు అంశాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నందున రోబోల సామర్థ్యం కూడా భారీగా పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.టెస్లా 'ఆప్టిమస్'పై లక్ష్యంటెస్లా ఇప్పటికే ఆప్టిమస్ పేరుతో హ్యూమనాయిడ్ రోబోను అభివృద్ధి చేస్తోంది. ప్రమాదకరమైన, పదేపదే చేయాల్సిన లేదా మనుషులకు విసుగు కలిగించే పనులను ఈ రోబోలు చేయాలనేది టెస్లా లక్ష్యం. భవిష్యత్తులో ఆప్టిమస్ 10 లక్షల ఆప్టిమస్ రోబోలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రోబోలు భవిష్యత్తులో టెస్లా కంపెనీ విలువలో చాలా పెద్ద భాగాన్ని ఆక్రమించవచ్చని మస్క్ గతంలో కూడా చెప్పారు.హ్యూమనాయిడ్ రోబోల విషయంలో చైనా కూడా వేగంగా ముందుకు వెళ్తోంది. బీజింగ్‌లో జరిగిన వరల్డ్ హ్యుమానాయిడ్ రోబోట్ గేమ్స్‌లో రోబోలు మనుషులు నెలకొల్పిన కొన్ని రికార్డులను కూడా అధిగమించాయి. ముఖ్యంగా 100 మీటర్ల పరుగులో రెండు రోబోలు ఉసేన్ బోల్ట్ ప్రపంచ రికార్డు 9.58 సెకన్ల కంటే వేగంగా పరుగెత్తాయి. దీన్నిబట్టి చూస్తే.. హ్యూమనాయిడ్ రోబోల సామర్థ్యం ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో స్పష్టంగా అర్థమైపోతుంది.ముందు జాబితాలో చైనా2026 తొలి ఆరు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 19,100 హ్యూమనాయిడ్ రోబోలు షిప్మెంట్ అయ్యాయి. గత ఏడాది ఇదే సమయంలో కేవలం 5,100 యూనిట్లు మాత్రమే ఉండగా.. ఏడాది వ్యవధిలో ఈ సంఖ్య మూడు రెట్లకు పైగా పెరిగింది. ఈ ఏడాది మొత్తం షిప్మెంట్లు సుమారు 60,000 యూనిట్లకు చేరవచ్చని అంచనా. 2030 నాటికి ఈ సంఖ్య 5 లక్షలకు చేరే అవకాశం ఉందని పరిశోధనా సంస్థలు భావిస్తున్నాయి. ఇందులో చైనా కంపెనీల వాటా 97 శాతానికి పైగా ఉండటం విశేషం.ఎలాన్ మస్క్ అంచనా నిజమైతే.. రాబోయే దశాబ్దంలో హ్యూమనాయిడ్ రోబోలు పరిశ్రమలు, తయారీ రంగం, ప్రమాదకర పనులు, రోజువారీ సేవలు వంటి అనేక రంగాల్లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. అయితే.. అదే సమయంలో మనుషుల ఉద్యోగాలపై రోబోల ప్రభావం ఎంత ఉంటుంది? అనే ప్రశ్న కూడా ఎదురవుతోంది. ఒకవైపు రోబోలు ఉత్పాదకతను పెంచగలిగితే.. మరోవైపు కొన్ని పనులకు మానవుల అవసరం తగ్గే అవకాశం ఉంది. అందుకే మస్క్ చేసిన ఈ అంచనా కేవలం టెక్నాలజీ అభివృద్ధి గురించే కాకుండా.. భవిష్యత్తులో మనిషి-రోబో సంబంధం ఎలా ఉండబోతుందనే విషయంపై కూడా పెద్ద చర్చకు దారితీస్తోంది.Elon Musk says there will be at least a billion humanoid robots within ten years at five times human output, making them "more productive than all humans combined." pic.twitter.com/e5nzBVcJfd— Catch Up (@CatchUpFeed) September 5, 2026 -
ఉద్యోగుల భవిష్యత్తు.. RGV హెచ్చరిక!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ప్రముఖ దర్శకుడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలో.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల భవిష్యత్తులో ఉద్యోగాలు, మానవ ఆలోచనా సామర్థ్యం ఎలా మారవచ్చనే ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. టెక్నాలజీ అనేది మొదటి నుంచి మన జీవితాన్ని సులభతరం చేయడానికి వచ్చింది. శారీరక శ్రమను తగ్గించడం, సమయాన్ని ఆదా చేయడం, రోజువారీ విసుగు పుట్టించే పనులను మనకు దూరం చేయడం టెక్నాలజీ ప్రధాన ఉద్దేశం. ఇప్పుడు ఏఐ కూడా అదే పని చేస్తోంది.అయితే.. ఈసారి ఏఐ కేవలం మన చేతులతో చేసే పనులను కాకుండా.. మనం మెదడుతో చేసే పనులను కూడా చేయడం మొదలుపెట్టింది. ఇది ఇలాగే కొనసాగితే.. భవిష్యత్తులో ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశం ఉందని వర్మ పేర్కొన్నారు.మనిషికి రెండు బలాలుమనిషికి ప్రధానంగా రెండు బలాలు ఉన్నాయని రామ్ గోపాల్ వర్మ చెప్పారు. ఒకటి శారీరక శక్తి, అంటే.. కష్టపడి పనిచేయడానికి ఉపయోగించే కండరాల బలం. రెండోది మేధస్సు, అంటే.. ఆలోచించడం, నిర్ణయాలు తీసుకోవడం, కొత్త విషయాలను సృష్టించడం.పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత యంత్రాలు మనుషులు చేసే అనేక శారీరక పనులను చేయడం ప్రారంభించాయి. ఫ్యాక్టరీల్లో యంత్రాలు రావడంతో మనిషి చేయాల్సిన శారీరక శ్రమ తగ్గింది. ఇప్పుడు ఏఐ రావడంతో మనిషి చేసే మేధోపరమైన పనులు కూడా ఆటోమేట్ అవుతున్నాయని చెప్పారు.ఉద్యోగాలు వాళ్ల చేతుల్లోకి!ఇప్పటికే ఏఐతో రాయడం, డిజైన్లు రూపొందించడం, డేటాను విశ్లేషించడం, కోడింగ్ చేయడం, కస్టమర్ సపోర్ట్ ఇవ్వడం వంటి అనేక పనులు సాధ్యమవుతున్నాయి. భవిష్యత్తులో ఇవి మరింత పెరిగితే.. కొన్ని ఉద్యోగాల్లో మనుషుల అవసరం భారీగా అవకాశం ఉంది. అందుకే.. ఏఐ వల్ల ఉద్యోగాలు పోవడం కంటే, ఏఐని ఎవరైతే ఎక్కువ ఉపయోగిస్తున్నారో.. అలాంటి వాళ్ల చేతుల్లోకి ఉద్యోగాలు వెళ్ళిపోతాయని వర్మ వెల్లడించారు. పాత పద్దతులను అవలంబిస్తూ ముందుకు వెళ్లాలనుకునే వారికి భవిష్యత్తులో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు.చివరగా ''నువ్వు కోరుకునే విషయంలో జాగ్రత్తగా ఉండు.. అది నిజమైపోవచ్చు'' అని రామ్ గోపాల్ వర్మ అన్నారు. అంటే.. మనిషి ఎప్పుడూ శ్రమ తగ్గించుకోవాలని, ఎక్కువ ఖాళీ సమయం కావాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు ఏఐ ఆ కోరికను నిజం చేసే దిశగా వెళ్తోంది. కానీ ఆ కోరిక నిజమైతే?.. మన ఉద్యోగాలు, మన అవసరం, చివరకు మనిషిగా మన ప్రత్యేకత ఏమిటనే ప్రశ్నలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది.With A I , the first jobs to vanish will be of those who immediately don’t embrace it Technology has always been designed for our convenience , to save us from physical hardships and to save our time from wasting it on mundane tasks .. we all wish for more and more free time…— Ram Gopal Varma (@RGVzoomin) September 7, 2026 -
యూకే వీసా స్కామ్.. పోలీసుల అదుపులో ‘నందూస్ వరల్డ్’
సాక్షి,హైదరాబాద్: యూకే వీసా స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. లండన్‌లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ అమాయకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేసి పరారీలో ఉన్న ప్రముఖ యూట్యూబర్ నందనను శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (RGIA) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.విదేశీ ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడిన నందన దంపతులపై గతంలోనే కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమెపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. తాజాగా శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆమె కదలికలను గుర్తించిన ఇమ్మిగ్రేషన్ అధికారులు, పోలీసులు అప్రమత్తమై ఆమెను అదుపులోకి తీసుకున్నారు.లండన్‌లో పర్మినెంట్ ఉద్యోగాలు, భారీ వేతనాలు ఇప్పిస్తామని నందన దంపతులు పలువురికి ఆశ చూపారు. ఈ నకిలీ ఉద్యోగాల ఆశతో నిరుద్యోగుల నుంచి భారీ మొత్తంలో నగదు వసూలు చేసి మోసానికి పాల్పడినట్లు బాధితులు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదుల ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. లుకౌట్ నోటీసులు జారీ కావడంతో శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.ఎయిర్‌పోర్టులో అదుపులోకి తీసుకున్న అనంతరం, ఈ కేసుకు సంబంధించి తదుపరి విచారణ నిమిత్తం ఆమెను ఏపీలోని కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. ఈ మోసంలో ఆమె భర్త మధుకర్ పాత్రపై కూడా పోలీసులు లోతుగా ఆరా తీస్తున్నారు. నందనపై ఉన్న కేసులు, లుక్అవుట్ నోటీసుల ఆధారంగా పోలీసులు తదుపరి చట్టపరమైన చర్యలు చేపట్టడానికి సిద్ధమవుతున్నారు.👉ఇదీ చదవండి : నందూస్ వరల్డ్‌లో ఏం జరుగుతోంది? -
కొలువుల పేరిట దళారుల వల
యలమంచిలి రూరల్ (అనకాపల్లి జిల్లా): ఉమ్మడి విశాఖ జిల్లాలో నిరుద్యోగుల ఆశలను ఆసరాగా చేసుకుని కొందరు కేటుగాళ్లు అందినకాడికి దండుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్ఎస్డీసీ)పేరుతో గురుకుల విద్యాసంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని, రూ.25 వేలకు పైగా వేతనం వస్తుందని నమ్మించి వారివద్ద నుంచి రూ.లక్షల్లో వసూళ్లు చేసుకుంటున్నారు. ఒక్కో పోస్టుకు రూ.3.5 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మోసానికి ఏకంగా పీఎంశ్రీ లోగో, ఎన్ఎస్డీసీ లెటర్ హెడ్లను ఉపయోగించడంతో పాటు ఉమ్మడి జిల్లాలో గురుకుల పాఠశాలలను ఉపయోగించుకుంటున్నారు. నకిలీ నియామక పత్రాలతో వస్తున్న నిరుద్యోగులను తమ గురుకులాల్లో పని చేసేందుకు ప్రిన్సిపాళ్లు కూడా అనుమతిస్తుండడం కేటుగాళ్లకు మరింతగా కలిసి వస్తోంది. కొక్కిరాపల్లి గురుకులంలో వెలుగులోకి.. కొక్కిరాపల్లి డాక్టర్ అంబేడ్కర్ బాలికల గురుకులంలో ఇటీవల నకిలీ నియామక పత్రంతో ఓ యువతి ఆరోగ్య సహాయకురాలిగా విధుల్లో చేరారు. ఐదు రోజులుగా ఆమె గురుకుల పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు. మరో ఇద్దరు యువతులకు డిజిటల్ అసిస్టెంట్లుగా నకిలీ నియామకపత్రాలు ఇచ్చారు. వీరు తమకు గురుకులంలో విధుల్లో చేరినట్టు జాయినింగ్ రిపోర్టు ఇవ్వాలని అడగడంతో కొక్కిరాపల్లి గురుకులం ప్రిన్సిపాల్ అందుకు నో చెప్పారు. తాము ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వబోమని స్పష్టం చేయడంతో నియామకాలపై అనుమానం బలపడింది. ఇదే తరహాలో తాళ్లపాలెం బాలికల గురుకుల పాఠశాలలో కూడా ఇద్దరు యువతులను విధుల్లోకి అనుమతించినట్టు సమాచారం. ఉమ్మడి జిల్లాలో మిగతా గురుకులాల్లో కూడా పోస్టులు ఉన్నాయని నకిలీ ముఠా నిరుద్యోగులకు వల వేస్తున్నట్టు తెలుస్తోంది. ఎస్ఎస్ఏ, ఎన్ఎస్డీసీ పేరుతో.. సర్వశిక్ష అభియాన్, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మీ స్కూళ్లకు ఉచితంగా సిబ్బందిని అందిస్తామని, నియమించిన వారికి తామే వేతనాలు చెల్లిస్తామని ఓ ముఠా కొద్దిరోజుల క్రితం ఉమ్మడి జిల్లాలో గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లను నమ్మించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో తమ సంస్థ ఒప్పందం కుదుర్చుకుందని ప్రిన్సిపాళ్లకు చెప్పారు. హెల్త్, డిజిటల్ అసిస్టెంట్ల పోస్టులతో పాటు మరికొన్ని పోస్టుల్లో నియామకాలు చేపడతామని చెప్పారు. ఈ పోస్టులను సర్వశిక్ష అభియాన్ ఆధ్వర్యంలో నియమిస్తున్నట్టు నమ్మబలుకుతున్నారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఈ వ్యవహారానికి కొందరు వ్యక్తులను నియమించుకున్న ముఠా అనకాపల్లి జిల్లాలో నర్సీపట్నం ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేటు కళాశాల నిర్వాహకుడి ద్వారా పెద్దమొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఆ కళాశాల నిర్వాహకుడు జిల్లాలో ప్రైవేటు కళాశాలల యజమానులకు గురుకులాల్లో సర్వ శిక్ష అభియాన్ పోస్టుల భర్తీ చేస్తున్నట్టు చెబుతున్నాడు. అతని మాటలు నమ్మిన కొందరు తమకు తెలిసిన పూర్వ విద్యార్థులకు ఈ పోస్టుల విషయం చెబుతున్నారు. వెంటనే పోస్టుల కోసం బయోడేటా పంపించమంటున్న కేటుగాళ్లు.. ఆ వెంటనే ఆయా గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్ల చిరునామాతో ముద్రించిన ఆరు పేజీల నియామక పత్రాన్ని ఈ–మెయిల్, వాట్సాప్‌కు పంపించి సంబంధిత గురుకులానికి వెళ్లి విధుల్లో చేరాలని సూచిస్తున్నారు. నకిలీ నియామక పత్రాలతో వెళ్తున్న వారిని గురుకులాల ప్రిన్సిపాళ్లు వారిని అనుమతించడంతో.. మరికొందరు పోస్టుల కోసం ఆశపడి కేటుగాళ్లకు డబ్బు సమర్పించుకుంటున్నారు. -
ఇంగ్గిష్ వస్తే.. డబుల్ ఓకే.!
సాక్షి, అమరావతి: ఇంగ్లిష్.. కేవలం ఒక భాష కాదు. ఉన్నత విద్య, ఉద్యోగం, సాంకేతిక పరిజ్ఞానం, వ్యాపారం, ప్రపంచ మార్కెట్‌తో అనుసంధానానికి అదొక కీలక నైపుణ్యంగా మారింది. ముఖ్యంగా ఐటీ, ఐటీఈఎస్, హెల్త్‌కేర్, ఫైనాన్స్, హాస్పిటాలిటీ, రిటైల్, మీడియా వంటి రంగాల్లో ఇంగ్లిష్ లో మాట్లాడటం, రాయటం, చదవటం, అర్థం చేసుకోవటం తెలిసిన వారికి అవకాశాలు పెరుగుతున్నాయని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంగ్లిష్ నేర్చుకోవడం అంటే మాతృభాషను వదిలేయడం కాదు. అయితే భవిష్యత్తు ఉద్యోగ ప్రపంచంలో డొమైన్ నాలెడ్జ్, డిజిటల్ స్కిల్స్, సమస్య పరిష్కార సామర్థ్యంతోపాటు ఇంగ్లిష్ కమ్యూనికేషన్ ఉంటే అవకాశాల పరిధి మరింత విస్తరిస్తుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. అధ్యయనాలు ఏమి చెబుతున్నాయంటే.. » ఎడ్యుకేషనల్ టెస్టింగ్ సర్వీస్(ఈటీఎస్) 2026 గ్లోబల్ ఇంగ్లీష్ స్కిల్స్ రిపోర్ట్ ప్రకారం, ఆరి్టఫిíÙయల్ ఇంటెలిజెన్స్ కారణంగా కార్యాలయాల్లో ఆంగ్ల ప్రావీణ్యం అవసరం పెరుగుతోందని ప్రపంచవ్యాప్తంగా ఉన్న 81 శాతం మంది హెచ్ఆర్ అధికారులు చెబుతున్నారు. » ఈటీఎస్ విడుదల చేసిన భారత ఉద్యోగ మార్కెట్ విశ్లేషణ ప్రకారం 91 శాతం మంది భారతీయ యజమానులు ఉద్యోగ మార్కెట్లో పోటీ పెరగడంతో ఇంగ్లిష్ ప్రావీణ్యానికి డిమాండ్ పెరుగుతోందని తెలిపారు. అంతర్జాతీయ సహకారం కోసం ఇంగ్లీషు అవసరం పెరుగుతోందని 94 శాతం మంది భారతీయ హెచ్ఆర్లు పేర్కొన్నారు. » బ్రిటీష్ కౌన్సిల్, నేషనల్ స్కిల్స్ డెవలప్మెంట్ ఏజెన్సీకి సంబంధించిన పరిశోధనలో 21 ప్రధాన రంగాలను పరిశీలించగా.. సగానికిపైగా రంగాల్లో ఇంగ్లిష్ ను ముఖ్యమైన అదనపు నైపుణ్యంగా గుర్తించారు. ఐటీ, ఐటీఈఎస్, మీడియా, హాస్పిటాలిటీ, బ్యూటీ అండ్ వెల్నెస్, రిటైల్, ఫైనాన్షియల్ సర్వీసెస్, హెల్త్‌కేర్ వంటి రంగాల్లో ఇంగ్లిష్ ప్రాధాన్యం ప్రత్యేకంగా కనిపించింది. దాదాపు 47 శాతం భారతీయ గ్రాడ్యుయేట్లు ఇంగ్లిష్ భాష సరిగ్గా మాట్లాడలేకపోవడం కారణంగా పలు రంగాల్లో ఉద్యోగాలకు పూర్తిగా సిద్ధంగా లేరని అధ్యయనం అంచనా వేసింది. -
కదిలిన స్పోర్ట్స్ కోటా డొంక
కౌతాళం: కర్నూలు జిల్లాలో మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగాల భర్తీలో చోటు చేసుకున్న బాగోతాలు కలకలం రేపడంతో ఉలిక్కిపడ్డ ఉన్నతాధికారులు హడావుడిగా విచారణకు ఉపక్రమించారు. కౌతాళం మండలంలో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు పొందిన 24 మంది ఉపాధ్యాయులను మండల విద్యాధికారులు రామాంజినేయులు, శోభారాణి గురువారం విచారించి వారి సర్టిఫికెట్లను పరిశీలించారు. ఎంఈవో కార్యాలయానికి కాకుండా గోతులదొడ్డి పాఠశాల వద్దకు పిలిపించి అక్కడ రహస్యంగా విచారణ చేపట్టారు. వల్లూరు ఆదర్శ పాఠశాలలో ప్రభాకర్‌తో పాటు మిగతా నలుగురు ఉపాధ్యాయులు స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగం పొందిన వారే ఉన్నారు. కరా్టటక సరిహద్దు ప్రాంతమైన కౌతాళంలో నదీ తీర గ్రామాలనే స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు ఎంచుకోవడం గమనార్హం. వల్లూరు పాఠశాలలో ఐదుగురు ఉపాధ్యాయులు, కుంబళనూరులో ఐదుగురు, గుడికంబాలిలో ముగ్గురు, కాత్రికి పాఠశాలలో నలుగురు, మరళిలో ఇద్దరు, కరణిలో ఒకరు, కుంటనహాల్‌లో ఒకరు, చిరుతపల్లి పాఠశాలలో ముగ్గురు.. ఇలా సరిహద్దు గ్రామాలనే స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు ఎంపిక చేసుకున్నారు.జిల్లా ఫస్ట్ వచ్చినా ఉద్యోగం రాలేదు.. డీఎస్సీలో తన చిన్నాన్న కుమార్తె 70.18 మార్కులతో జిల్లా ఫస్ట్ ర్యాంక్ సాధించినా ఉద్యోగం ఇవ్వలేదని నదిచాగి ఎంపీటీసీ లింగన్నగౌడ్ పేర్కొన్నారు. తాళ్లూరు స్వాతికి టెట్‌లో 150కి 115 మార్కులు వచ్చాయన్నారు. కాల్ లెటర్ పంపించినా కర్నూలుకు వెళితే రిజెక్ట్ చేశారన్నారు. -
టెట్ ఫెయిలైనా టీచరే..!
కర్నూలు సిటీ: మెగా డీఎస్సీ 2025లో అక్రమాలు రోజుకొకటి వెలుగులోకి వస్తున్నాయి. స్పోర్ట్స్ కోటా కింద భర్తీ చేసిన పోస్టుల్లో పలువురు అర్హతలు లేకపోయినా తప్పుడు మార్గాల్లో ఉద్యోగాలు పొందినట్లు తెలుస్తోంది. కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం కౌతాళం మండలం వల్లూరు ఎంపీపీఎస్ స్కూల్లో మెగా డీఎస్సీ ద్వారా సెకండ్ గ్రేడ్ టీచర్‌గా ఎంపికై విధులు నిర్వహిస్తున్న ఈ.ప్రభాకర్ విద్యార్హతలపై మీడియా, సోషల్ మీడియాలో వి్రస్తృతంగా ప్రచారం జరగడంతో నాలుగైదు రోజులుగా ఆయన సెలవులో ఉన్నారు. కౌతాళం ఎంఈవో, కర్నూలు డీఈవో ఆఫీస్‌లో నిర్వహించిన విచారణలో టెట్ పరీక్షలో అర్హత మార్కులు సాధించకుండానే ఆయన టీచర్‌గా ఎంపికైనట్లు నిర్ధారణ అయ్యింది. జిల్లాలో 21 మంది స్పోర్ట్స్ జూడో కోటాలో టీచర్ పోస్టులు పొందారు. వీరిలో ఒకే సామాజిక వర్గానికి చెందిన ఏడుగురు ఉన్నారు. వీరంతా బంధువులు కావడం గమనార్హం. ఇక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు సమర్పించిన వారిలో అనర్హులు ఉన్నట్లు కొందరు అభ్యర్థులు కోర్టును సైతం ఆశ్రయించారు. టెట్ క్వాలిఫై కాకున్నా టీచర్‌గా ఎంపిక చేసిన శాప్.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో మెగా డీఎస్సీ ద్వారా 1,697 ఎస్జీటీ, 786 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు, 79 మున్సిపల్ టీచర్ పోస్టులు, 28 ట్రైబల్ వెల్ఫేర్ టీచర్ పోస్టులు భర్తీ చేశారు. స్పోర్ట్స్ కోటా కింద ఎస్జీటీ 48 (తెలుగు మీడియం), 3 పోస్టులు (ఉర్దూ మీడియం), లాంగ్వేజెస్ పోస్టులు 6, స్కూల్ అసిస్టెంట్ టీచర్లు గణితం 2, ఫిజికల్ సైన్స్ ఒక పోస్టు, బయోలాజికల్ సైన్స్ 2, సోషల్ స్టడీస్ 3, ఫిజికల్ ఎడ్యుకేషన్ 5 పోస్టులకు శాప్ అభ్యర్థులను ఎంపిక చేసి జిల్లా విద్యాశాఖకు పంపింది. ఆ జాబితాలో ఉన్న వారందరికీ పోస్టింగ్స్ ఇచ్చారు. వెల్దుర్తి మండలం రత్నపల్లికి చెందిన ఈ.ప్రభాకర్ వల్లూరు ఎంపీపీఎస్‌లో ఎస్జీటీ టీచర్‌గా పోస్టింగ్ పొందారు. ఆయన హాకీ క్రీడాకారుడుగా సర్టిఫికెట్ సమర్పించారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ పోస్టు పొందాలంటే టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. ప్రభాకర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో టెట్‌లో తప్పనిసరిగా 60 శాతం మార్కులు అంటే 75 మార్కులు సాధించాలి. కానీ డీఎడ్ తరువాత 2022లో రాసిన టెట్‌లో (హాల్‌టికెట్ నెంబరు: టీఈటీ 22265677) పేపర్–1 ఏలో ఆయనకు 65.4281 మార్కులు మాత్రమే వచ్చాయి. 2024లో (హాల్ టికెట్ నెంబరు: టీఈటీ 7240454497) 66.83274 మార్కులు సాధించారు. అదే ఏడాది మరోసారి నిర్వహించిన టెట్‌లో (హాల్ టికెట్ నెంబరు: టీఈటీ 241187876) ఆయన 61.81213 మార్కులు పొందారు. 2025లో నిర్వహించిన టెట్‌లో 51.7424 మార్కులు మాత్రమే వచ్చాయి. కానీ స్పోర్ట్స్ కోటాలో సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేసిన శాప్.. టెట్ 2022లో ఆయనకు వచ్చిన 65.4281 మార్కులకు అర్హుడిగా నిర్ధారిస్తూ ఎస్జీటీ పోస్టుకు ఎంపిక చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. బీసీలు టెట్‌లో 75 మార్కులు వస్తేనే అర్హులు. కానీ ప్రభాకర్‌కు కనీస అర్హత మార్కులు లేకున్నా టీచర్ పోస్టుకు శాప్ ఎంపిక చేయడం గమనార్హం. చర్యలకు డీఈవో సిఫారసు..! మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ పోస్టుకు ఎంపికైన ఈ.ప్రభాకర్ విద్యార్హత ధ్రువీకరణ పత్రాలను కర్నూలు డీఈఓ ఆఫీసులో డిప్యూటీ డీఈఓ శ్రీధర్‌బాబు, కల్లూరు ఎంఈఓ–2 వనజాకుమారి బుధవారం పరిశీలించారు. ప్రభాకర్ టెట్ పేపర్–1ఏలో అర్హత మార్కులు పొందలేదని, ఈ విషయాన్ని ఆయనే అంగీకరించారని, తదుపరి చర్యల నిమిత్తం సీసీఏ నిబంధనలను అనుసరించి పాఠశాల విద్య డైరెక్టర్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు అధికారులు వెల్లడించారు. అనర్హులను తొలగించాలి.. టెట్‌లో క్వాలిఫై కాని వ్యక్తిని మెగా డీఎస్సీలో టీచర్ ఉద్యోగానికి ఎంపిక చేసి అర్హులకు అన్యాయం చేసిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన వారితో పాటు మెగా డీఎస్సీలో ఎంపికైన వారందరి సర్టిఫికెట్లను క్షుణ్ణంగా పరిశీలించాలి. అర్హత లేని వారిని తొలగించి, అర్హులకు ఉద్యోగ అవకాశం కల్పించాలి. – కె.సతీష్, బహుజన టీచర్స్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి.. స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీపై ఎన్ని ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? మెగా డీఎస్సీపై సిట్టింగ్ జడ్జితో విచారించాలి. ఇన్ సర్వీస్ టీచర్లు తప్పనిసరిగా టెట్‌లో అర్హత పొందాల్సిందేనని చెబుతున్న ప్రభుత్వం మెగా డీఎస్సీలో అనర్హులను ఎలా ఎంపిక చేస్తుంది? స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్లన్నీ మరోసారి వెరిఫై చేయాలి. స్పోర్ట్స్ కోటా పోస్టుల భర్తీలో అక్రమాలకు వల్లూరు స్కూల్ టీచర్ ఉదంతమే ఉదాహరణ. – కె.భాస్కర్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు -
హోదాలా.. డోంట్ కేర్!
‘‘పుట్టామా.. ఇంజినీరింగ్, మెడిసిన్, సీఏ లాంటి చదువులు చదివామా? మంచి ఉద్యోగం సంపాదించామా... జీవితం సక్సెస్’’ ఇది ఒకప్పటి బతుకు ఫిలాసఫీ. కానీ జెన్–జీలు ఇలా కాదంటోంది తాజా అధ్యయనం. అంతర్జాతీయ విద్యా సంస్థ ఎమిరైటస్ ‘‘ఇండియాస్ జెన్–జీ ఔట్లుక్ 2026: రీ కాల్కులేటింగ్ ఎడ్యుకేషన్, ఆంబీషన్ అండ్ సక్సెస్’’ పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనం నవతరం గురించి పలు ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తెచ్చింది. 1997– 2012 మధ్య పుట్టిన వాళ్లను మనం జెన్–జీ అని పిలుస్తున్నాం కదా.. వీరు దేశంలోని ప్రధాన మెట్రోల్లోని 15 – 28 ఏళ్ల మధ్య వయసున్న సుమారు వెయ్యి మందిని ప్రశ్నించి వారి ఆశలు, ఆశయాలు, విజయానికి నిర్వచనాలను సేకరించింది. ముందు తరం నడిచిన బాటను కాదని కొత్త అడుగులు వేస్తున్న వారి గురించి స్థూలంగా..ఉద్యోగ ప్రస్థానం...మునుపటిలా చిన్న ఉద్యోగంతో మొదలుపెట్టి అంచలంచెలుగా పైకి ఎదగాలన్న సూత్రానికి వీరు విరుద్ధం. ఉద్యోగమిచ్చే మేనేజర్, జీఎం, వీపీ, చైర్మన్ వంటి హోదాల కంటే పనికి – జీవితానికి మధ్య బ్యాలెన్స్ ఉండాలనుకుంటున్న జెన్–జీలు సుమారు 74 శాతం. అసలు సక్సెస్ఫుల్ కెరియర్‌కు ఎగ్జిక్యుటివ్ లీడర్ కావాల్సిన అవసరమే లేదన్నది 65 శాతం మంది నమ్మకం. వీరి దృష్టిలో విజయం అంటే... నైపుణ్యాలు. అవసరానికి తగ్గట్టు మారిపోగలగడం. సంతృప్తినిచ్చే, అర్థవంతమైన పని.లోకలే మేలు...ఒకప్పుడు ఎంతో పాపులర్ అయిన విదేశీ చదువులపై జెన్–జీకి పెద్ద ఆశలేం లేవు. పెరిగిపోతున్న ఖర్చులు, వీసా నిబంధనల్లో వస్తున్న మార్పులు, చదువు తరువాత ఉద్యోగాలు వస్తాయన్న గ్యారంటీ లేకపోవడం వంటి కారణాల వల్ల నాణ్యమైన లోకల్ విద్యే మేలని 48 శాతం మంది అభిప్రాయపడ్డారు. కాలేజీ ముందునాటి చదువులు చదువుతున్న వారిలో 87 శాతం, కాలేజీల్లోకి అడుగుపెడుతున్న వారిలో 92 శాతం లోకల్ కోర్సులకు జై అంటున్నారు.విదేశీ విద్యా సంస్థలు స్థానికంగా అందించే కోర్సుల్లో చేరేందుకు అభ్యంతరం లేదని సుమారు 69 శాతం మంది చెబుతున్నారు. ఒకట్రెండు సెమిస్టర్లకు విదేశాలకు వెళతారా? అంటే అప్పటి వరకూ విదేశీ చదువులపై ఆసక్తి చూపని వారిలోనూ 12 శాతం మంది సై అంటూండటం విశేషం. -
ఏఐ దోస్తీ.. ఉద్యోగాలతో కుస్తీ
సాక్షి, అమరావతి: కృత్రిమ మేధ (ఏఐ) వినియోగం మామూలుగా లేదు. సమాచార సేకరణ, రచన, లెక్కలు, పరిశోధన, వైద్యం, విద్య, వ్యాపారం.. ఇలా దాదాపు ప్రతి రంగంలోకి చొచ్చుకుపోతోంది. ఏఐ అభివృద్ధి కొత్త అవకాశాలను సృష్టిసూ్తనే.. కొన్ని వర్గాలకు కొత్త సవాళ్లను కూడా తెస్తోందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి.ముందున్న భారత్‘పీపుల్ ఎట్ వర్క్–2026’ సర్వేలో 36 దేశాలకు చెందిన 39 వేలకు పైగా ఉద్యోగులను భాగస్వాముల్ని చేయగా.. ఏఐ వినియోగంలో ప్రపంచంలోనే భారత్ ముందంజలో ఉన్నట్టు అధ్యయన నివేదిక తేల్చింది. దేశంలో 80 శాతం మంది ఉద్యోగులు వారానికి పలుమార్లు ఏఐని ఉపయోగిస్తున్నారు. 41 శాతం మంది దాదాపు ప్రతిరోజూ వినియోగిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా రోజువారీ ఏఐ వినియోగం 20 శాతం మాత్రమే. అంటే భారత్‌లో వినియోగం ప్రపంచ సగటుకు రెట్టింపు కంటే ఎక్కువ. అలాగే 18 నుంచి 39 ఏళ్ల వయసున్న ఉద్యోగుల్లో నిత్యం ఏఐ వాడుతున్న వారి వాటా 43 శాతంగా ఉంది. మహిళల్లో ఇది 44 శాతం కాగా.. పురుషుల్లో 40 శాతం. పెద్దసంస్థల్లో రోజువారీ ఏఐ వినియోగం 54 శాతంగా ఉంది.ప్రపంచం మారుతోంది‘2026 ప్రపంచ ఏఐ ఉద్యోగాల సూచీ’ ప్రపంచంలోని 27 దేశాల్లో 100 కోట్లకు పైగా ఉద్యోగ ప్రకటనలను విశ్లేషించింది. ఏఐ నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలు మొత్తం ఉద్యోగ మార్కెట్ కంటే దాదాపు 8 రెట్లు వేగంగా పెరుగుతున్నాయి. ఏఐ నైపుణ్యాలు గల ఉద్యోగులకు సగటున 62 శాతం అధిక వేతనం లభిస్తున్నట్టు అధ్యయనం తెలిపింది. ఏఐని సమర్థవంతంగా ఉపయోగిస్తున్న సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య కూడా ఇతర సంస్థల కంటే వేగంగా పెరిగింది. అత్యధిక ఏఐ వినియోగం ఉన్న సంస్థల్లో ఉద్యోగుల సంఖ్య 52 శాతం పెరగ్గా.. తక్కువ వినియోగం ఉన్న సంస్థల్లో 36 శాతమే పెరిగింది. ఉత్పాదకతలోనూ స్పష్టమైన తేడా కనిపించింది.యువతకే ఎక్కువ దెబ్బ‘కృత్రిమ మేధ తాజా ఉపాధి ప్రభావాలు’ అనే అంశంపై స్టాన్‌ఫర్డ్ డిజిటల్ ఎకానమీ ల్యాబ్ చేసిన అధ్యయనం అమెరికాలో లక్షలాది ఉద్యోగుల వేతన సమాచారాన్ని పరిశీలించింది. ఏఐ ప్రభావం ఎక్కువగా ఉన్న ఉద్యోగాల్లో 22 నుంచి 25 ఏళ్ల యువత ఉపాధి, ఉండాల్సిన స్థాయితో పోలిస్తే 19 శాతం తక్కువగా ఉంది. 2025లో ఈ లోటు 15 శాతంగా ఉండగా.. 2026 జూన్ నాటికి 19 శాతానికి పెరిగింది. ముఖ్యంగా కొత్తగా ఉద్యోగాల్లోకి వచ్చే యువతకు నియామకాలు తగ్గడం ఈ ప్రభావానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.మనిషికి బదులు.. డిజిటల్ ఫ్రెండ్ఏఐ ప్రభావం ఉద్యోగాలకే పరిమితం కాదు. ‘కృత్రిమ మేధ సహచరులతో పరస్పర చర్య, మానసిక శ్రేయస్సు’–నేచర్ హ్యూమన్ బిహేవియర్, 2026 అధ్యయనంలో అమెరికాకు చెందిన 1,131 మంది ఏఐ వినియోగదారుల నుంచి సమాచారం సేకరించారు. వీరిలో 237 మంది పాల్గొన్న 4,664 సంభాషణల్లో 4,64,687 సందేశాలను కూడా పరిశీలించారు. ఏఐతో కొందరు వినియోగదారులు స్నేహపూర్వక, అనుబంధ భావాలను పెంచుకుంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఒంటరితనంతో ఇబ్బంది పడుతున్న వారికి ఏఐతో మాట్లాడటం తోడుగా అనిపిస్తోందని తేలింది. ఏఐతో పని వేగం పెరుగుతుంది. కొత్త ఉద్యోగాలు వస్తాయి. వైద్యం, విద్య, వ్యవసాయం, పరిశ్రమల్లో కొత్త పరిష్కారాలు అందుబాటులోకి వస్తాయి. అదే సమయంలో నైపుణ్యాలు లేని ఉద్యోగులు వెనుకబడటం, యువతకు తొలి ఉద్యోగ అవకాశాలు తగ్గడం, వ్యక్తిగత సమాచార భద్రత, తప్పుడు సమాచారం వంటి సమస్యలు కూడా పెరగవచ్చు. అందుకే ఏఐని మనిషికి ప్రత్యామ్నాయంగా కాకుండా.. మనిషి సామర్థ్యాన్ని పెంచే సాధనంగా చూడాలని నిపుణులు చెబుతున్నారు. రేపటి ప్రపంచంలో యంత్రంతో పోటీ పడే ఉద్యోగి కంటే.. యంత్రాన్ని సమర్థవంతంగా ఉపయోగించగల ఉద్యోగికే ఎక్కువ విలువ ఉంటుందని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. -
ఉద్యోగాల్లో కావాలి.. ‘కొత్త రిజర్వేషన్లు’!!
ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగాల్లో కొన్ని రిజర్వేషన్లు ఉన్నాయి. ఇందులో ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మహిళలు.. ఇలా రకరకాల రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. ప్రయివేటు ఉద్యోగాల విషయానికి వస్తే ఇక్కడ ఇలాంటి రిజర్వేషన్లు లేవు. అయితే కృత్రిమ మేధ (AI) విస్తృతంగా పెరుగుతూ ఉద్యోగాలను మింగేస్తున్న నేపథ్యంలో కొత్త రకం రిజర్వేషన్లు కావాలన్న భావనలు పెరుగుతున్నాయి. అవే ‘మానవ రిజర్వేషన్లు’.కృత్రిమ మేధ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఉద్యోగాల భవిష్యత్తుపై మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ (Bill Gates) కీలక ప్రతిపాదన చేశారు. సాంకేతికంగా ఏఐ చేయగలిగినప్పటికీ, కొన్ని ఉద్యోగాలను పూర్తిగా మనుషులకే కేటాయించే ‘హ్యూమన్ రిజర్వ్డ్’ (Human Reserved) కేటగిరీని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. ఇటీవల ప్రచురించిన దాదాపు 6,000 పదాల వ్యాసంలో గేట్స్ ఈ ఆలోచనను వెల్లడించారు.వేగంగా మారనున్న ఉద్యోగ ప్రపంచంఏఐ ప్రభావం గతంలోని కంప్యూటర్, ఇంటర్నెట్ వంటి సాంకేతిక మార్పుల కంటే వేగంగా ఉండొచ్చని గేట్స్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే డిజిటల్ వ్యవస్థల్లో ఏఐని అమలు చేసే అవకాశం ఉండటంతో, ఉద్యోగాల్లో మార్పులు దశాబ్దాల సమయం తీసుకోకపోవచ్చని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా ఎంట్రీ-లెవల్, మిడ్-లెవల్ ఉద్యోగాలు గణనీయంగా ప్రభావితమయ్యే ప్రమాదం ఉందన్నారు.కస్టమర్ సపోర్ట్, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్, డేటా విశ్లేషణ, రుణాల అంచనా వంటి అనేక పనులను భవిష్యత్తులో ఏఐ నిర్వహించే అవకాశం ఉందని గేట్స్ పేర్కొన్నారు. కేవలం ఉద్యోగాలు కోల్పోయిన వారికి మరో ఉద్యోగం కోసం శిక్షణ ఇవ్వడం మాత్రమే సరిపోదని, ప్రభుత్వాలు ముందుగానే ప్రణాళిక రూపొందించాలని సూచించారు.‘హ్యూమన్ రిజర్వ్డ్’ అంటే?గేట్స్ ప్రతిపాదించిన ఈ విధానం ప్రకారం, AI లేదా రోబోట్లు ఒక పనిని చేయగలిగినా.. సమాజం నిర్ణయిస్తే ఆ పనిని మనుషులకే పరిమితం చేయవచ్చు. ప్రకృతి రిజర్వ్‌లలో కొన్ని ప్రాంతాలను అభివృద్ధికి దూరంగా ఉంచినట్లే, కొన్ని ఉద్యోగాలను కూడా సాంకేతిక ఆటోమేషన్ నుంచి రక్షించాలన్నది ఈ ఆలోచన.ప్రత్యేకంగా వృద్ధుల సంరక్షణ, పిల్లల సంరక్షణ, విద్య, ఆరోగ్య సేవలు వంటి రంగాల్లో మానవ సంబంధాలు, భావోద్వేగం, నమ్మకం కీలకమని గేట్స్ అభిప్రాయపడ్డారు. తన తండ్రికి అల్జీమర్స్ వ్యాధి సమయంలో అందిన సంరక్షణను ఉదాహరణగా తీసుకున్న ఆయన.. కొన్ని సందర్భాల్లో మానవీయ స్పర్శకు ప్రత్యామ్నాయం ఉండకపోవచ్చని పేర్కొన్నారు.అయితే ప్రతి రంగంలోనూ AIని నిషేధించాలని ఆయన చెప్పలేదు. ఉదాహరణకు విద్య, వైద్యంలో AIని పూర్తిగా తొలగించడం కాకుండా, మనుషుల సామర్థ్యాన్ని పెంచే సాధనంగా ఉపయోగించవచ్చని సూచించారు. కొన్ని ఉద్యోగాలను శాశ్వతంగా, మరికొన్నింటిని కొంతకాలం మాత్రమే ‘హ్యూమన్ రిజర్వ్డ్’గా ఉంచే అవకాశం ఉండాలని గేట్స్ అభిప్రాయపడ్డారు.AI వినియోగంపై ‘టోకెన్ ట్యాక్స్’ఉద్యోగాలపై AI ప్రభావాన్ని తగ్గించేందుకు మరో ఆసక్తికరమైన ప్రతిపాదనను గేట్స్ చేశారు. AI టోకెన్లు, రోబోట్లపై పన్ను విధించాలని సూచించారు. ప్రస్తుతం ఒక ఉద్యోగిని నియమిస్తే కంపెనీ పేరోల్ పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. అదే పనిని రోబోట్ లేదా AI ద్వారా చేయిస్తే ఆ విధమైన పన్ను భారం ఉండకపోవడం వల్ల కంపెనీలు ఆటోమేషన్ వైపు వేగంగా వెళ్లే అవకాశం ఉందని ఆయన వాదించారు.ఈ పన్ను ద్వారా వచ్చే ఆదాయాన్ని ఉద్యోగాలు కోల్పోయిన వారికి రీ-స్కిల్లింగ్, శిక్షణ, సామాజిక భద్రతా కార్యక్రమాలకు వినియోగించవచ్చని గేట్స్ సూచించారు. AI వినియోగాన్ని పూర్తిగా అడ్డుకోవడం కాకుండా, మానవ కార్మికులను ఒక్కసారిగా భర్తీ చేసే వేగాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదన ఉందని తెలుస్తోంది.40 శాతం ఉద్యోగాలు రిజర్వ్ చేయొచ్చా?గేట్స్ చేసిన వ్యాఖ్యల్లో మరో అంశం కూడా చర్చనీయాంశంగా మారింది. అమెరికన్ మీడియా సంస్థ ఆక్సియోస్‌తో మాట్లాడిన సందర్భంగా, అత్యంత కఠినమైన రూపంలో అమలు చేస్తే ప్రారంభ దశలో దాదాపు 40 శాతం ఉద్యోగాలను ‘హ్యూమన్ రిజర్వ్డ్’గా ఉంచే అవకాశం ఉందని ఆయన ఊహించారు. అయితే ఇది తుది లక్ష్యం లేదా అధికారిక విధాన ప్రతిపాదన కాదని, ఇలాంటి సంఖ్యను నిర్ణయించడం కూడా చాలా క్లిష్టమని ఆయన అంగీకరించారు.ప్రభుత్వాలకు గేట్స్ సూచనAI ప్రభావాన్ని ఎదుర్కోవడానికి దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ కొత్త వ్యవస్థలు అవసరమని గేట్స్ చెబుతున్నారు. ఉద్యోగాలు మాత్రమే కాకుండా సైబర్ భద్రత, ఆరోగ్యం, విద్య, పిల్లలపై AI ప్రభావం, ఆర్థిక అసమానతలు వంటి అంశాలపైనా ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. AI ప్రయోజనాలు అందరికీ చేరాలంటే, దాని వల్ల ఏర్పడే నష్టాలను కూడా సమాజం ముందుగానే నిర్వహించాల్సిన అవసరం ఉందన్నది ఆయన వాదన. -
హోదాలా డోంట్ కేర్... ప్రశాంతతకే ఓటేస్తున్న ‘జెన్-జీ’
‘‘పుట్టామా..ఇంజినీరింగ్, మెడిసిన్, సీఏ లాంటి చదువులు చదివామా? మంచి ఉద్యోగం సంపాదించామా... జీవితం సక్సెస్’’ ఇది ఒకప్పటి బతుకు ఫిలాసఫీ. కానీ జెన్-జీలు ఇలా కాదంటోంది తాజా అధ్యయనం. అంతర్జాతీయ విద్యా సంస్థ ఎమిరైటస్ ‘‘ఇండియాస్ జెన్-జీ ఔట్లుక్ 2026: రీ కాల్కులేటింగ్ ఎడ్యుకేషన్, ఆంబీషన్ అండ్ సక్సెస్’’ పేరుతో నిర్వహించిన ఈ అధ్యయనం నవతరం గురించి పలు ఆసక్తికరమైన అంశాలను వెలుగులోకి తెచ్చింది. 1997- 2012 మధ్య పుట్టిన వాళ్లను మనం జెన్-జీ అని పిలుస్తున్నాం కదా.. వీరు దేశంలోని ప్రధాన మెట్రోల్లోని 15 - 28 ఏళ్ల మధ్య వయసున్న సుమారు వెయ్యి మందిని ప్రశ్నించి వారి ఆశలు, ఆశయాలు, విజయానికి నిర్వచనాలను సేకరించింది. ముందు తరం నడిచిన బాటను కాదని కొత్త అడుగులు వేస్తున్న వారి గురించి స్థూలంగా.మునుపటిలా చిన్న ఉద్యోగంతో మొదలుపెట్టి అంచలంచెలుగా పైకి ఎదగాలన్న సూత్రానికి వీరు విరుద్ధం. ఉద్యోగమిచ్చే మేనేజర్, జీఎం, వీపీ, ఛైర్మన్ వంటి హోదాల కంటే పనికి - జీవితానికి మధ్య బ్యాలెన్స్ ఉండాలనుకుంటున్న జెన్-జీలు సుమారు 74 శాతం. అసలు సక్సెస్ఫుల్ కెరియర్‌కు ఎగ్జిక్యుటివ్ లీడర్ కావాల్సిన అవసరమే లేదన్నది 65 శాతం మంది నమ్మకం. వీరి దృష్టిలో విజయం అంటే... నైపుణ్యాలు. అవసరానికి తగ్గట్టు మారిపోగలగడం. సంతృప్తినిచ్చే, అర్థవంతమైన పనిలోకలే మేలు...ఒకప్పుడు ఎంతో పాప్యులర్ అయిన విదేశీ చదువులపై జెన్-జీకి పెద్ద ఆశలేం లేవు. పెరిగిపోతున్న ఖర్చులు, వీసా నిబంధనల్లో వస్తున్న మార్పులు, చదువు తరువాత ఉద్యోగాలు వస్తాయన్న గ్యారెంటీ లేకపోవడం వంటి కారణాల వల్ల నాణ్యమైన లోకల్ విద్యే మేలని 48 శాతం మంది అభిప్రాయపడ్డారు. కాలేజీ ముందునాటి చదువులు చదువుతున్న వారిలో 87 శాతం, కాలేజీల్లోకి అడుగుపెడుతున్న వారిలో 92 శాతం లోకల్ కోర్సులకు జై అంటున్నారు. విదేశీ విద్యా సంస్థలు స్థానికంగా అందించే కోర్సుల్లో చేరేందుకు అభ్యంతరం లేదని సుమారు 69 శాతం మంది చెబుతున్నారు. ఒకట్రెండు సెమిస్టర్లకు విదేశాలకు వెళతారా? అంటే అప్పటి వరకూ విదేశీ చదువులపై ఆసక్తి చూపని వారిలోనూ 12 శాతం మంది సై అంటూండటం విశేషం.ఎందుకీ పోకడ...జెన్-జీలో వచ్చిన ఈ మార్పునకు చాలా కారణాల ఉన్నట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. ఐటీ కంపెనీల్లో రాత్రికి రాత్రి వేలమంది ఉద్యోగులకు లేఆఫ్‌లు పలుకుతున్న తీరు, వీసా నిబంధనల్లో తరచూ వస్తున్న మార్పులు, అన్ని రంగాల్లోకి ప్రవేశిస్తున్న కృత్రిమ మేధ వంటివి జెన్-జీ ఆలోచనలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. కొన్ని దశాబ్దాలుగా మంచి మార్కులు తెచ్చుకుని ఏదో ఒక ప్రొఫెషనల్ కోర్సు (ఇంజినీరింగ్, వైద్యం, సీఏ, ప్రభుత్వ ఉద్యోగాలు, ఎంబీఏ వంటివి) పూర్తి చేసి ఉద్యోగంలో స్థిరపడితే జీవితం సార్థకం అన్న భావన ఉండేదని, ఇప్పుడు ఈ పాత కెరీర్ మ్యాప్ పనిచేయడం లేదని ఈ అధ్యయనాన్ని నిర్వహించిన సంస్థ ఎమిరైటస్ సీఈవో దామెర అశ్విన్ చెబుతున్నారు.అయితే జెన్-జీ ఈ మార్గంలో ఎవరూ ఊహించనంత వేగంగా మార్పులు చేస్తోందని తెలిపారు. ఎప్పటికప్పుడు మారిపోతున్న నైపుణ్య అవసరాలను సంస్థలు అందుకోలేకపోతూంటే జెన్-జీలు ఈ మార్పులను పరిశీలిస్తూ తమనితాము మార్చుకుంటున్నారని, కొత్త నైపుణ్యాలతో కొత్త రకం ఉద్యోగ డిమాండ్లను అందుకునే ప్రయత్నం చేస్తున్నారని ఈ నివేదిక చెబుతోందన్నారు. ‘‘జెన్-జీ గురించి ప్రస్తుతం జరుగుతున్నంత చర్చ ఏ తరంపైనా జరిగి ఉండదేమో. కొందరు ఈ తరం పోకడలను చూసి ఆనందిస్తే.. అపార్థం చేసుకున్న వాళ్లూ చాలామందే ఉన్నారు. అంతేకాకుండా.. తక్కువ అంచనా వేసిన వాళ్లకూ కొదవేమీ లేదు. అందుకే అసలీ తరం ఏమనుకుంటోందో, ఏం చెప్పదలచుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేశాం’’ అని చెప్పారు. -
యువతకు ఉద్యోగావకాశాలు.. కుమారస్వామి కీలక వ్యాఖ్యలు!
దేశంలోని యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు కల్పించడంలో ఆటోమొబైల్ పరిశ్రమ కీలక పాత్ర పోషించాలని కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి. కుమారస్వామి పిలుపునిచ్చారు. దేశంలో చదువుకున్న యువతకు ఉద్యోగాలు లభించడం కష్టతరంగా మారింది అనేది వాస్తవమన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నిర్దేశించిన ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యాన్ని సాధించడంలో పట్టభద్రులకు ఉద్యోగావకాశాలు కల్పించడం ఎంతో కీలకమన్నారు.న్యూఢిల్లీలో జరిగిన ‘ఆటోమోటివ్ స్కిల్స్ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఏఎస్‌డీసీ) వార్షిక సదస్సు 2026’లో కుమారస్వామి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ... ‘‘ప్రతిరోజూ నన్ను కలుస్తున్న యువతను చూస్తే ఉద్యోగం పొందడం ఎంత కష్టంగా ఉందో అర్థమవుతోంది. చదువుకున్న పట్టభద్రులకు కూడా ఉపాధి లభించడం లేదు. ఆటోమొబైల్ పరిశ్రమకు చెందిన ప్రతినిధులు ఉద్యోగాల కల్పన అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని నా వ్యక్తిగత విన్నపం’’ అని కుమారస్వామి అన్నారు.కొత్త శకంలోకి ఆటో పరిశ్రమఈవీ మొబిలిటీ, ఆటోమేషన్, కనెక్టెడ్ టెక్నాలజీలు, అధునాతన తయారీ, ‘ఇండస్ట్రీ 4.0’ వంటి పరిణామాలతో భారత ఆటోమొబైల్ రంగం కొత్త శకంలోకి అడుగుపెడుతోందని మంత్రి తెలిపారు. ఈ నేపథ్యంలో దేశీయ అవసరాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను యువతకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. స్కిల్లింగ్, అప్‌స్కిల్లింగ్, ఉపాధి కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. భారత్ కేవలం పెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా కాకుండా ప్రపంచస్థాయి ఆటోమొబైల్ తయారీ, టెక్నాలజీ, మొబిలిటీ సొల్యూషన్స్ కేంద్రంగా ఎదుగుతోందని కుమారస్వామి అన్నారు.ఈవీ రంగానికి ప్రభుత్వ ప్రాధాన్యం పీఎం డ్రైవ్, పీఎల్ఐ ఆటో, పీఎల్ఐ ఏసీసీ వంటి పథకాల ద్వారా పటిష్టమైన ఈవీ (ఎలక్ట్రిక్ వాహన) వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నా రు. అయితే, తయారీ సామర్థ్యం పెరిగినంత మాత్రాన సరిపోదన్నారు. హై–వోల్టేజ్ సిస్టమ్స్, బ్యాటరీ టెక్నాలజీ, పవర్ ఎల్రక్టానిక్స్, అధునాతన డయాగ్నస్టిక్స్పై ప్రత్యేక పరిజ్ఞానం ఉన్న కొత్త తరం టెక్నీíÙయన్లు, ఇంజనీర్లు, నిపుణులు అవసరమని తెలిపారు.కొత్త టెక్నాలజీలను నిర్వహించడం, ఆధునిక వ్యవస్థలను మెయింటెయిన్ చేయడం, వేగంగా మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా పనిచేయడం, ఆవిష్కరణలు–ఉత్పాదకతకు తోడ్పడేలా యువతను సిద్ధం చేయాలని సూచించారు. ఆటోమొబైల్ రంగానికి ఉన్న మల్టీప్లయర్ ఎఫెక్ట్ కారణంగా ఇంజనీరింగ్, ఎల్రక్టానిక్స్, స్టీల్, ఆటో కాంపోనెంట్లు, లాజిస్టిక్స్, సాఫ్ట్వేర్, సేవల వంటి అనుబంధ రంగాల్లోనూ పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు సృష్టించవచ్చని కుమారస్వామి పేర్కొన్నారు. -
ఏఐలో మరో విప్లవం
సాక్షి, హైదరాబాద్ : వేగంగా దూసుకెళుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్.. మరో కొత్త ఉద్యోగ విప్లవాన్ని తీసుకొస్తోంది. కొంతకాలంగా ఏఐలో ఫార్వర్డ్ డిప్లాయిడ్ ఇంజనీర్ల (ఎఫ్‌డీఈ) ప్రాధాన్యం పెద్ద ఎత్తున పెరిగింది. ఇప్పటి వరకూ కార్పొరేట్ సంస్థల్లో కూర్చుని పనిచేసే ఉద్యోగాలే చూశాం. ఏఐ కస్టమర్ సంస్థలకు వెళ్లి, వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకొని, ఏఐ వల్ల ఎదురయ్యే సమస్యలను పరిష్కరించడమే ఎఫ్‌డీఈ ఉద్యోగాల ప్రత్యేకత. సమస్యను గుర్తించడం నుంచి కోడింగ్, సిస్టమ్ ఇంటిగ్రేషన్, టెస్టింగ్, ప్రొడక్షన్లో అమలు వరకు మొత్తం ప్రక్రియను పర్యవేక్షించే బాధ్యత తీసుకోవాలి. ఏఐ రంగంలో దీన్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్+కన్సల్టింగ్, ప్రొడక్ట్ డిప్లాయ్మెంట్గా భావిస్తారు. ఏఐ వాడకంలో అనేక సమస్యలు ఎదురవుతున్న నేపథ్యంలో లాస్ట్‌మైల్ వరకూ ఏడీఈలు పరిష్కారం చూపిస్తారు.ఎఫ్‌డీఈ బూమ్... అధ్యయనాల వెల్లడి..: ఏఐ శిక్షణ సంస్థ ఆంటోలాజైజ్ వెల్లడించిన సమాచారం ప్రకారం.. 2026 చివరి నాటికి ఎఫ్‌డీఈ నైపుణ్యం గల ఉద్యోగుల సంఖ్య పెద్ద ఎత్తున ఉండొచ్చు. 1,311 సంస్థల్లో దాదాపు 2.39 లక్షల ఎఫ్‌డీఈ నిపుణుల అవసరం ఉంటుంది. గడచిన ఆరు నెలల్లో 519 సంస్థలు ఈ తరహా ఉద్యోగుల కోసం ఆఫర్లు ఇచ్చాయి. 2028 నాటికి వందశాతం ఎఫ్‌డీఈ ఉద్యోగుల సంఖ్య పెరుగుతుందని ఐటీ సంస్థలు వెల్లడిస్తున్నాయి. టీసీఎస్ ఈ ఏడాది చివరి నాటికి 9 వేల మంది ఎఫ్‌డీఈ నిపుణుల అవసరం ఉంటుందని తన వార్షిక ప్రణాళికలో వెల్లడించింది. బిగ్‌డేటాతో ఏఐ వైపు మౌలిక వసతులు కల్పించుకుంటున్న 70 ప్రధాన సంస్థలు ఏఐ మోడల్స్ ఎంపిక, ప్రోటోటైప్, కోడింగ్, ఇంటిగ్రేషన్, భద్రత పరీక్షలు, ప్రొడక్షన్ అమలు వంటి వాటికి ఎఫ్‌డీఈ ఉద్యోగుల నియామకాన్ని కోరుకుంటున్నాయి. టెక్నాలజీ, సర్వీసెస్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ (టీఎస్ఐఏ) ఎఫ్‌డీఈ పాత్రపై లోతుగా అధ్యయనం చేసింది. ఏఐ వ్యవస్థ సాంకేతికంగా పనిచేస్తోంది. అయితే, సంస్థకు వాస్తవ వ్యాపార ప్రయోజనం అందడం లేదని టీఎస్ఏఐ గుర్తించింది. ఈ గ్యాప్‌ను భర్తీ చేయగలిగే వ్యవస్థ ఎఫ్డీఈలకే ఉంటుందని స్పష్టం చేసింది. ఎమర్జింగ్ కోర్సులకు ఆ నైపుణ్యం పెంచాలి..: కంప్యూటర్ సైన్స్, అనుబంధ ఎమర్జింగ్ కోర్సుల్లో అవసరమైన మార్పులు చేస్తేనే సరికొత్త ఏఐ ఉద్యోగాలు పొందే వీలుంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇంజనీరింగ్‌లో ప్రధానంగా తొమ్మిది సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్స్‌పై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. పైథాన్, జావా వంటి ప్రోగ్రామ్స్‌లో మెళకువలతోపాటు, ఎస్‌క్యూఎల్ డేటాబేస్‌పై పట్టు పెంచుకోవాలి. ఏపీఐలు, సిస్టమ్ ఇంటిగ్రేషన్‌పై ఇంజనీరింగ్ మొదటి ఏడాది నుంచే దృష్టి పెట్టాలి. క్లౌడ్ కంప్యూటింగ్‌పై ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. మెషిన్ లెర్నింగ్, జనరేటివ్ ఏఐను నిత్యం పరిశీలించాలి. డేటా ఎనాలసిస్, సిస్టమ్ డిజైన్, సైబర్ సెక్యూరిటీ వంటి ఎమర్జింగ్ టెక్నాలజీపై పూర్తి పట్టు సాధించాలి. ఇంజనీరింగ్ కాలేజీలు ఈ దిశగా ముందుకెళ్తేనే రేపటి తరానికి ఎఫ్‌డీఈలు తయారవుతారని నిపుణులు సూచిస్తున్నారు.కోడ్ ఒక్కటే లక్ష్యం కాకూడదు రాబోయే రోజుల్లో ఇంజనీరింగ్ విద్యలో కోడ్ రాయడం ఒక్కటే లక్ష్యం కాకూడదు. వాస్తవ సమస్యను గుర్తించి, ఏఐతో పరిష్కరించి, దాన్ని ఉత్పత్తి స్థాయిలో అమలు చేయడం అలవర్చుకోవాలి. అంతర్జాతీయంగా వస్తున్న మార్పులను గుర్తించాలి. అప్పుడే ఎఫ్‌డీఈ వంటి చాలెంజింగ్ ఉద్యోగాలు పొందే వీలుంటుంది. – సిద్ధిక్ రాథోడ్, ఏఐ సీనియర్ ఎనలిస్ట్, హైదరాబాద్ఎఫ్డీఈకు మంచి డిమాండ్ ఉంది సర్వీస్, ప్రొడక్ట్ బేస్డ్ సంస్థలన్నీ బిగ్‌డేటా సెంటర్స్‌పై ఆధారపడుతున్నాయి. దాదాపు 90 శాతం ఏఐతో మమేకమయ్యాయి. అయితే, సాంకేతికత వినియోగంలో సమస్యలు వస్తున్నాయి. ఆన్లైన్ ద్వారా కాకుండా, కస్టమర్ సంస్థ వద్దకే వెళ్లి, అక్కడి సిబ్బందితో మమేకమయ్యే వ్యవస్థను అన్ని సంస్థలూ కోరుకుంటున్నాయి. ఈ క్రమంలో ఎఫ్‌డీఈ ఉద్యోగాల సృష్టికి డిమాండ్ పెరుగుతోంది. – చోగన్ హస్లీ, యూఎస్‌లో ఏఐ సంస్థలో మేనేజర్ -
ఏఐలో అద్వితీయం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో పోటీ పెరుగుతున్న వేళ హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అమెరికా 6,900, చైనా 1600, భారత్ 710 ఏఐ స్టార్టప్‌లతో ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్న నేపథ్యంలో, దేశంలో బెంగళూరు తర్వాత రెండో అతిపెద్ద ఏఐ కేంద్రంగా హైదరాబాద్ ఎదుగుతోందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ మద్దతు, టాలెంట్ పూల్, పెట్టుబడులతో నగరం గ్లోబల్ ఏఐ హబ్‌గా మారే దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో 500కు పైగా ఏఐ స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి. 2015–25 మధ్య 160 స్టార్టప్‌లు 5 శాతం సంయుక్త వార్షిక వృద్ధిరేటుతో పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వ గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 900కు పైగా ఏఐ కంపెనీలు, 2 లక్షల మంది ఏఐ ఇంజనీర్లు ఉన్నారు. టీ–డేటా ప్లాట్ఫామ్లో 2026 జూలై నాటికి 3,000 ఏఐ సంస్థలు నమోదయ్యాయి. ఉద్యోగాల వెబ్సైట్ నివేదిక 2025 ప్రకారం ఏఐ/ఎంఎల్ ఉద్యోగాల్లో హైదరాబాద్‌లో 54 శాతం వృద్ధి నమోదైంది. ఢిల్లీ, ముంబైతో పోలిస్తే ఇక్కడ జీవన వ్యయం తక్కువ, పాలసీలు బలంగా ఉండటంతో స్టార్టప్‌లు పెద్ద సంఖ్యలో వస్తున్నాయని చెబుతున్నారు.గూగుల్, టీహబ్ కలిసి ‘ఏఐ–ఫస్ట్ స్టార్టప్ యాక్సిలరేటర్’ ప్రారంభించాయి. ఏటా పదివేల మంది విద్యార్థులకు శిక్షణ, బూట్‌క్యాంప్‌లు నిర్వహిస్తారు. వచ్చే ఏడాదిలో 200 కొత్త స్టార్టప్‌లు, రూ.50 కోట్ల ఫండింగ్ వచ్చే అవకాశం ఉంది.టీ – హబ్‌లో100 ఏఐ స్టార్టప్‌లు ఏకకాలంలో ఇంక్యుబేట్ అవుతున్నాయి. తెలంగాణ ఏఐ మిషన్ (టీ–ఏఐఎం), ఏఐ సిటీ, గూగుల్ హబ్ వంటి ప్రాజెక్ట్‌లతో రాబోయే రోజుల్లో హైదరాబాద్ భారత్‌కు ఏఐ రాజధానిగా, గ్లోబల్ టాప్ 20 డెస్టినేషన్‌గా అవతరించనుందని అంటున్నారు. -
8 లక్షలకు పైగా కేంద్ర ప్రభుత్వ జాబ్స్?
ఢిల్లీ: ప్రస్తుతం దేశాన్ని పీడిస్తున్న సమస్యలలో నిరుద్యోగం ప్రధానమైనది. ఏళ్ల తరబడి పెద్ద పెద్ద చదువులు చదివినా దానికి సరిపడా ఉద్యోగం దొరకక యువతంతా ఉద్యోగాల కోసం తల్లడిల్లిపోతున్నారు. పెద్దచదువులు చదివినా దాని సరిపడా ఉద్యోగం దొరకక చిన్నా చితక జాబ్‌తో సరిపెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నిరుద్యోగులకు ఒక గుడ్ న్యూస్ అందింది. దేశంలో కేవలం కేంద్ర ప్రభుత్వంలోనే ఎనిమిది లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలున్నట్లు కేంద్రం తెలిపింది.నీమచ్‌కు చెందిన ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ ఉద్యోగాల ఖాళీలపై ఆర్టీఐ దాఖలు చేశారు. దానికి బదులిస్తూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని పే రీసెర్చ్ యూనిట్ 2024 మార్చి 1 నాటి గణాంకాలను వివరాలను వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సివిలియన్ ఉద్యోగాల్లో ఏకంగా 8,23,656 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు తెలిపాయి. ఈ లెక్కల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రభుత్వ రంగ సంస్థలు PSUలను మినహాయించుకొని ఈ లెక్కలు ప్రకటించింది. ఇందులో అత్యధిక ఖాళీలు రక్షణ మంత్రిత్వ శాఖ సివిలియన్ విభాగంలో ఉన్నాయి. మొత్తం 5,56,248 పోస్టులు మంజూరై ఉండగా కేవలం 3,14,005 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో 2,42,243 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది మొత్తం మంజూరైన పోస్టుల్లో దాదాపు 43.5 శాతం. అయితే ఈ సంఖ్యలు సైన్యం, నేవీ, వైమానిక దళంలోని ఉద్యోగాలకు సంబంధించినవి కావని, కేవలం రక్షణ శాఖ సివిలియన్ ఉద్యోగాలకే సంబంధించినవని అధికారులు స్పష్టం చేశారు.రైల్వేలోదేశంలో అతిపెద్ద ప్రభుత్వ ఉద్యోగ సంస్థల్లో ఒకటైన రైల్వేల్లోనూ భారీగా ఖాళీలు ఉన్నాయి. రైల్వేల్లో 14,79,701 పోస్టులు మంజూరై ఉండగా 12,39,576 మంది మాత్రమే ఉద్యోగాల్లో ఉన్నారు. దీంతో 2,40,125 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. రైల్వేల్లోని ఖాళీలే ఆర్టీఐ ద్వారా వెల్లడైన మొత్తం ఖాళీల్లో దాదాపు 30 శాతం కావడం గమనార్హం. హోం మంత్రిత్వ శాఖఅంతర్గత భద్రత, పరిపాలనలో కీలకమైన కేంద్ర హోం మంత్రిత్వ శాఖలో 1,10,885 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ శాఖలో మొత్తం 11,18,233 పోస్టులు మంజూరై ఉండగా 10,07,348 మంది మాత్రమే పనిచేస్తున్నారు. రక్షణ శాఖ సివిలియన్ విభాగం, రైల్వేలు, హోం శాఖలను కలిపితే దాదాపు 5.93 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే మొత్తం ఖాళీల్లో దాదాపు మూడొంతులు ఈ మూడు ప్రధాన సంస్థల్లోనే ఉన్నాయి.పోస్టల్డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్స్‌లో 2,53,124 పోస్టులకు గాను 1,91,578 మంది పనిచేస్తున్నారు. దీంతో 61,546 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూలో 1,79,374 పోస్టులు మంజూరై ఉండగా 1,09,712 మంది మాత్రమే విధుల్లో ఉన్నారు. దీంతో 69,662 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇది మంజూరైన పోస్టుల్లో దాదాపు 39 శాతం కావడం విశేషం.వ్యవసాయంవ్యవసాయం, పశుసంవర్ధక రంగాల్లోనూ సిబ్బంది కొరత కనిపిస్తోంది. వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖలో 5,420 పోస్టులకు గాను 3,565 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో 1,855 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖలో 2,393 పోస్టులకు గాను కేవలం 1,015 మంది పనిచేస్తుండగా 1,378 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంటే ఈ శాఖలో దాదాపు 58 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి.పర్యావరణ శాఖపర్యావరణ శాఖలోనూ పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖలో 5,127 పోస్టులకు గాను 3,170 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో 1,957 పోస్టులు, అంటే దాదాపు 38 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖలో 6,302 పోస్టులకు గాను 3,684 మంది మాత్రమే పనిచేస్తుండగా 2,618 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.ఆరోగ్య రంగంఆరోగ్య రంగంలోనూ ఖాళీలు ఉన్నాయి. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో 27,427 పోస్టులకు గాను 25,845 మంది పనిచేస్తున్నారు. దీంతో 1,582 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆరోగ్య పరిశోధన శాఖలో 62 పోస్టులకు గాను కేవలం 28 మంది మాత్రమే పనిచేస్తుండగా 34 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఆయుష్ శాఖలో 432 పోస్టులకు గాను 199 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో 233 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.దేశంలోని శాస్త్ర, సాంకేతిక రంగాలకు చెందిన కీలక శాఖల్లోనూ ఖాళీలు ఉన్నాయి. అణుశక్తి శాఖలో 37,250 పోస్టులకు గాను 27,016 మంది మాత్రమే పనిచేస్తుండగా 10,234 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అంతరిక్ష శాఖలో 19,200 పోస్టులకు గాను 15,074 మంది పనిచేస్తున్నారు. దీంతో 4,126 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలో కూడా 1,681 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.దేశ అత్యున్నత పరిపాలనా కార్యాలయాల్లోనూ ఖాళీలు ఉండటం గమనార్హం. రాష్ట్రపతి సచివాలయంలో 803 పోస్టులు మంజూరై ఉండగా 516 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో 287 పోస్టులు, అంటే 35.74 శాతం ఖాళీగా ఉన్నాయి. ఇక ప్రధానమంత్రి కార్యాలయంలో (PMO) 441 పోస్టులకు గాను 315 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో 126 పోస్టులు, అంటే 28.57 శాతం ఖాళీగా ఉన్నాయి.ఈ భారీ ఖాళీలపై ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో నిరుద్యోగం, ప్రభుత్వ ఉద్యోగాల కోసం పోటీ పెరుగుతున్న సమయంలో ఇంత పెద్ద సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉండటం ఆందోళనకరమని పేర్కొన్నారు. యువతకు ఉపాధి కల్పించడంతో పాటు ప్రభుత్వ శాఖల పనితీరు మెరుగుపడేందుకు ఈ ఖాళీలను అత్యంత ప్రాధాన్యతతో, మిషన్ మోడ్‌లో భర్తీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. -
జెన్ ఏఐ కోత.. చేయూత
సాక్షి, హైదరాబాద్: మనదేశంలోని వ్యవసాయేతర ఉద్యోగాల్లో 8–12 శాతం మేర జనరేటివ్ ఏఐ (జెన్ ఏఐ) భర్తీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే సేవారంగం, విద్య, మీడియా, ఆర్థిక సేవలు, క్లరికల్ పనులపై అధిక ప్రభావం పడే అవకాశాలున్నాయి. శారీరక శ్రమతో కూడిన పనులు, నిర్మాణం వంటి రంగాలు ఏఐ ప్రభావం నుంచి సురక్షితంగా ఉంటాయని, రాబోయే దశాబ్దకాలంలో వార్షిక కార్మిక ఉత్పాదకత 0.4 శాతం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే సమయంలో 42–48 శాతం శ్రామిక శక్తికి ఇది సహాయకారిగా ఉంటుందని చెబుతున్నారు. తాజాగా గోల్డ్‌మన్ సాక్స్ విడుదల చేసిన ’జనరేటివ్ ఏఐ (జెన్ ఏఐ)–భారత లేబర్ మార్కెట్‌పై ప్రభావం’ పై విడుదల చేసిన నివేదికలో ఆయా అంశాలను పొందుపరిచింది. ఈ నివేదిక ప్రకారం ఏఐ ప్రభావం అన్ని రంగాలపై ఒకేలా ఉండదు, ఇది చాలా అసమానంగా ఉంటుందని తేలింది. ఇది పూర్తిగా ఉపాధి, ఉద్యోగాలు పోవడానికి దారితీయదని, దీని ద్వారా పనుల పునరి్వభజన జరుగుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నివేదిక ప్రకారం, ఏఐ వల్ల దేశంలో భారీగా ఉద్యోగాల నష్టం జరగదు. మరింత నాణ్యమైన, సృజనాత్మకమైన పనులపై దృష్టి పెట్టేందుకు ఇది దోహదపడుతుంది.ఏఐ వల్ల లబ్ధి పొందే రంగాలు... ⇒ ఫైనాన్షియల్ ఎనలిస్ట్‌ల బేసిక్ మోడలింగ్ పనులను ఏఐ వేగవంతం చేస్తుంది, తద్వారా వారు మరింత విలువైన విశ్లేషణలపై దృష్టి పెట్టవచ్చు ⇒ ఆరోగ్యం, విద్య... ఏఐ ఆధారిత రోగ నిర్ధారణ , డేటా అనలిటిక్స్, నాలెడ్జ్–బేస్డ్ పనుల ద్వారా ఈ రంగాలు భారీగా లాభపడతాయి ⇒ మీడియా,ఎంటర్టైన్మెంట్... క్రియేటివ్ పనులలో ఉత్పాదకత పెరుగుతుందిఏఐ ప్రభావం లేని రంగాలు... ⇒ శారీరక శ్రమతో కూడిన రంగాలు... నిర్మాణం, వస్త్ర పరిశ్రమ, మాన్యుఫ్యాక్చరింగ్, ప్లాంట్ ఆపరేటర్ల ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా లేదు. ఇక్కడ ఏఐ కంటే మానవ శ్రమకే డిమాండ్ పెరుగుతుందని నివేదిక పేర్కొంది. ⇒ కొత్త ఉద్యోగాల సృష్టి... గత సాంకేతిక విప్లవాలలాగే, ఏఐ కూడా కాలక్రమేణా సరికొత్త ఉద్యోగ విభాగాలు (ఉదాహరణకు: ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్లు, ఏఐ కంప్లయన్స్ అధికారులు) సృష్టిస్తుంది. నివేదికలోని ముఖ్యాంశాలు⇒ భారత్‌లోని వ్యవసాయేతర శ్రామిక శక్తి చేసే పనులలో 9% నుండి 17% పనులను జెనరేటివ్ ఏఐ సులభంగా ఆటోమేట్ చేయగలదు⇒ 8–12% ఉద్యోగాలు పూర్తిగా లేదా పాక్షికంగా ఏఐ ద్వారా భర్తీ అయ్యే ప్రమాదం ఉంది⇒ 42–48% ఉద్యోగాలకు ఏఐ ఒక అద్భుతమైన ఉత్పాదక సాధనంగా సహాయపడుతోంది⇒ మిగిలిన 40–50% శ్రామిక శక్తిపై ఏఐ ప్రభావం చాలా తక్కువగా ఉంటుందిఅత్యధిక రిస్క్ ఉన్న ఉద్యోగాలు ⇒ ఆఫీసుల్లో జరిగే రొటీన్, డేటా ఎంట్రీ, అడ్మిని్రస్టేటివ్ సపోర్ట్, క్లరికల్ పనులకు అత్యధికంగా 3% రిస్క్ ఉంది ⇒ కోడింగ్, బేసిక్ కంప్లయన్స్ చెక్స్ వంటి పునరావృతమయ్యే పనుల స్థానంలో ఏఐ వచ్చే అవకాశం ఉంది ⇒ కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్... బేసిక్ కస్టమర్ సర్వీస్ బాధ్యతలను ఏఐ చాట్బాట్లు భర్తీ చేయవచ్చు -
ఏపీ డీఎస్సీ ఉద్యోగాల అమ్మకాల్లో మరో కొత్త కోణం
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ ఉద్యోగాల అమ్మకాల్లో మరో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. రూ.14.5 లక్షలు బాధితురాలి నుంచి టీడీపీ నేతలు వసూలు చేశారు. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం కోసం రూ.14.5 లక్షలు వసూలు చేశారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి డీఎస్సీ బాధితురాలు రాధిక ఫిర్యాదు చేశారు. మంత్రి లోకేష్ కోటాలో ఉద్యోగం అంటూ మోసం చేశారని రాధిక ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పరీక్ష లేకుండా నాకు డీఎస్సీ ఉద్యోగం ఇస్తామన్నారు. టీడీపీ కార్యకర్తలు మెడికొండ జ్యోతి, అడపా భాను ప్రకాష్‌లు డబ్బులు తీసుకున్నారు. ఆ ఉద్యోగం వేరే వ్యక్తికి ఇచ్చి నన్ను మోసం చేశారు. ఆ వ్యక్తి దగ్గర కూడా డబ్బులు వసూలు చేశారు. పోలీసులకు ఫిర్యాదు చేశా.. 10 నెలలైనా చర్యలు లేవు. నన్ను చంపుతామని టీడీపీ నేతలు బెదిరిస్తున్నారు...ఎస్పీ ఆఫీస్‌కు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదు. స్కూల్ అసిస్టెంట్ సోషల్ పోస్ట్ ఇస్తామని మోసం చేశారు. నా దగ్గర ఆధారాలున్నా.. నిందితుడిని అరెస్ట్ చేయలేదు. నాకు జరిగిన మోసాన్ని వైఎస్ జగన్‌కు వివరించాను’’ అని రాధిక తెలిపారు. -
వెయిటర్ ఉద్యోగాలు కూడా పోతాయా?
ఏఐ రావడంతో చాలా టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను తొలగించాయి. ఇప్పటికి కూడా ఈ లేఆఫ్స్ పర్వం కొనసాగుతూనే ఉంది. ఇలాంటి సమయంలో.. ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఒక రోబో వెయిటర్ పని చేస్తోంది. దీంతో వెయిటర్ ఉద్యోగాలు కూడా పోతాయా? అనే సందేహం కలుగుతోంది.హర్యానాలోని ఒక డాబాలో రోబోట్ వెయిటర్ నేరుగా వినియోగదారుల టేబుళ్ల వద్దకే ఆహారాన్ని అందిస్తోంది . ముందుగా నిర్దేశించిన మార్గాన్ని అనుసరించడానికి వీలు కల్పించే నావిగేషన్ సిస్టమ్‌ను ఉపయోగించి, ఈ రోబోట్ స్వయంగా ఫుడ్ ట్రేలను నిర్దేశిత టేబుళ్లకు తీసుకువెళుతుంది. ఆర్డర్ సిద్ధమైన తర్వాత, సిబ్బంది ఆహారాన్ని దాని ట్రేలో ఉంచుతారు, మరియు ఆ రోబోటిక్ వెయిటర్ కేటాయించిన టేబుల్ వైపు బయలుదేరుతుంది.కస్టమర్లు ఆర్డర్ చేసిన ఫుడ్ రెడీ అయిన తర్వాత దాన్ని ట్రేలో పెట్టి రోబోపై ఉంచుతారు. ఆ తర్వాత అది తనకు కేటాయించిన టేబుల్ దగ్గరకు స్వయంగా వెళ్లి ఫుడ్‌ను తీసుకెళ్తుంది. ప్రత్యేకమైన నావిగేషన్ సిస్టమ్ సహాయంతో నిర్ణయించిన మార్గంలో కదులుతుంది. అవసరమైనప్పుడు రిమోట్ కంట్రోల్‌తో కూడా దీన్ని ఆపరేట్ చేస్తున్నారు.Waiter's Job Gone! At Resham Dhaba in Murthal Sonipat, customers are being served by a robot waiter instead of a human. The robot is delivering food directly to customers’ tables, leaving many visitors amazed. More Details: https://t.co/zpoJ4Q5isE#Murthal @robot pic.twitter.com/6tLohvY0mO— Vinod Katwal (@Katwal_Vinod) August 17, 2026ఆకట్టుకుంటున్న రోబో వెయిటర్ఫైబర్తో తయారు చేసిన రోబో బాడీ, కళ్లలో మెరిసే ఎల్ఈడీ లైట్లు దీనికి ప్రత్యేకమైన లుక్‌ను ఇస్తున్నాయి. ముఖ్యంగా ఎరుపు రంగులో వెలిగే లైట్లు చూసేందుకు ఆసక్తికరంగా ఉన్నాయి. రోబో డాబాలో తిరుగుతూ ఫుడ్ సర్వ్ చేయడంతో కస్టమర్లు దాన్ని వీడియోలు, ఫొటోలు తీస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.ఈ రోబో ఒకసారి ఛార్జ్ చేస్తే సుమారు 1.5 నుంచి 2 గంటల వరకు పనిచేస్తుంది. దీనిని బెంగళూరుకు చెందిన ఓ టీమ్ సహకారంతో ఈ రోబోను అభివృద్ధి చేశారు.వెయిటర్ ఉద్యోగాలు పోతాయా?ఇక ఉద్యోగాలు పోతాయా అనే విషయానికి వస్తే.. రెస్టారెంట్లు, హోటళ్లలో AI ఆధారిత రోబోట్లు క్రమంగా అడుగుపెడుతున్నాయి. కస్టమర్లకు ఆహారం తీసుకెళ్లడం, ఆర్డర్లు అందించడం, టేబుళ్లను గుర్తించడం వంటి పనులను ఇవి చేయగలుగుతున్నాయి. దీంతో భవిష్యత్తులో వెయిటర్ల ఉద్యోగాలు తగ్గిపోతాయా అనే చర్చ మొదలైంది. ముఖ్యంగా సిబ్బంది కొరత, నిర్వహణ ఖర్చులు ఎక్కువగా ఉన్న చోట్ల రోబోట్లను ఉపయోగించడం యజమానులకు ఆకర్షణీయంగా మారుతోంది.అయితే.. వెయిటర్ల ఉద్యోగాలు పూర్తిగా కనుమరుగయ్యే అవకాశం తక్కువ. ఎందుకంటే కస్టమర్లతో మాట్లాడటం, వారి అవసరాలను అర్థం చేసుకోవడం, సమస్యలను పరిష్కరించడం, వ్యక్తిగత సేవ అందించడం వంటి పనులను రోబోట్లు ఇప్పటికీ పూర్తిగా భర్తీ చేయలేవు. అందువల్ల రోబోట్లు వెయిటర్లను పూర్తిగా భర్తీ చేయడం కంటే, వారి పనిలోని కొన్ని సాధారణ బాధ్యతలను చేపట్టే అవకాశం ఎక్కువ. భవిష్యత్తులో వెయిటర్లు - రోబోట్లు కలిసి పనిచేసే విధానం పెరగవచ్చు. -
ఏఐతో సుఖపడతాం అనుకుంటే.. మోసపోయాం!
ఏఐ వస్తే ఉద్యోగుల పని తగ్గిపోతుందని.. రోజుకు గంటల తరబడి చేసే రొటీన్ పనుల నుంచి విముక్తి లభిస్తుందని టెక్ ప్రపంచం ఊదరగొట్టింది. కానీ కృత్రిమ మేధ (AI) అందుబాటులోకి వచ్చిన తర్వాత పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉందని సాఫ్ట్వేర్ ఉద్యోగులు చెబుతున్నారు. పని వేగంగా పూర్తవుతున్నా.. అదే సమయంలో మరింత పని అప్పగిస్తున్నారని, ఏఐ వల్ల పని గంటలు తగ్గకపోగా ఒత్తిడి పెరిగిందని వాపోతున్నారు.2023లో మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్.. భవిష్యత్తులో ఏఐ, యంత్రాల సాయంతో వారానికి మూడు రోజులే పని చేసే పరిస్థితి రావొచ్చని వ్యాఖ్యానించారు. సిలికాన్ వ్యాలీలోనూ ఇదే తరహా ఆశావహ అంచనాలు వినిపించాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఏఐ సాయంతో రొటీన్ పనులను త్వరగా పూర్తి చేసి.. మిగిలిన సమయాన్ని సృజనాత్మక, కీలకమైన పనులకు కేటాయించవచ్చని ప్రచారం జరిగింది.కానీ, వాస్తవ పరిస్థితి మాత్రం మరోలా ఉంది. ఏఐతో పని త్వరగా పూర్తవుతున్న కొద్దీ.. ఉద్యోగుల నుంచి అంతకంటే ఎక్కువ పని చేయాలని సంస్థలు ఆశిస్తున్నాయని పలువురు డెవలపర్లు చెబుతున్నారు. అంటే పని తగ్గించాల్సిన ఏఐ.. అదే సమయంలో పనిని పెంచే సాధనంగా మారిపోయిందన్నమాట.‘అదే 9 గంటలు.. కానీ పని ఎక్కువ’ఓ ప్రముఖ టెక్ కంపెనీలో పనిచేస్తున్న శుభమ్ మాట్లాడుతూ.. ఏఐ వల్ల పని వేగంగా పూర్తవుతున్నప్పటికీ, పని గంటలు మాత్రం తగ్గడం లేదని చెప్పారు. పైగా తక్కువ సమయంలో ఎక్కువ పని పూర్తి చేయగలుగుతున్నందున.. అదే వ్యవధిలో మరిన్ని పనులు అప్పగిస్తున్నారని తెలిపారు.బెంగళూరుకు చెందిన సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ అంకిత అనుభవం మరింత భిన్నంగా ఉంది. ఏఐ వల్ల ఒక పని సగం సమయంలో పూర్తవుతుందని మేనేజ్మెంట్ భావిస్తోందని.. దీంతో పని తగ్గడానికి బదులుగా లక్ష్యాలు పెరుగుతున్నాయని ఆమె చెబుతున్నారు. “ఏఐ ఉంటే పని 30 శాతం సమయంలోనే పూర్తవ్వాలి. కాబట్టి అదే సమయంలో మరింత పని చేయాలని మేనేజ్మెంట్ భావిస్తోంది” అని ఆమె వివరించారు.15-16 గంటల పని..ఏఐ వల్ల తన పని భారం గతంలో కంటే పెరిగిందని అంకిత చెబుతున్నారు. గత మూడు నెలలుగా రోజుకు 15-16 గంటలు పనిచేస్తున్నట్లు ఆమె తెలిపారు. దీనికి తోడు సంస్థలో ఏఐకి సంబంధించిన కొత్త టెక్నాలజీలు, శిక్షణ కార్యక్రమాలు, వర్క్‌షాప్‌లకు హాజరుకావాల్సి వస్తోందని చెప్పారు.అంటే.. ఏఐని ఉపయోగించడం నేర్చుకోవడానికి కూడా అదనపు సమయం కేటాయించాల్సి వస్తోంది. శిక్షణ పూర్తయిన తర్వాత మిగిలిన సమయంలో సాధారణ పనిని పూర్తి చేయాల్సి ఉంటుందని ఆమె అంటున్నారు.ఏఐ వాడండి.. కానీ టోకెన్లు పరిమితమే!మరో విచిత్రమైన పరిస్థితి కూడా ఉద్యోగులను ఇబ్బంది పెడుతోంది. ఏఐని విస్తృతంగా ఉపయోగించాలని మేనేజ్మెంట్లు కోరుతున్నప్పటికీ.. కొన్ని సంస్థలు ఏఐ టూల్స్ వినియోగానికి పరిమితులు విధిస్తున్నాయి.అంకిత పనిచేసే సంస్థలో నెలకు 250 డాలర్ల విలువైన ఏఐ టోకెన్లను మాత్రమే అందిస్తున్నట్లు ఆమె తెలిపారు. నెల మధ్యలోనే ఆ పరిమితి పూర్తయిపోతే.. ఏఐ సరిగా పనిచేయలేదని మేనేజ్మెంట్ నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయని చెప్పారు. ఏఐతో ఎక్కువ పని చేయాలి.. కానీ దానికి అవసరమైన ఏఐ వనరులు మాత్రం పరిమితమే అనే పరిస్థితి ఉద్యోగులకు కొత్త తలనొప్పిగా మారింది.ఏఐ చేసిన పని.. మళ్లీ మనమే సరిచేయాలి!ఏఐ కేవలం సాఫ్ట్వేర్ రంగానికే పరిమితం కాలేదు. గ్రాఫిక్ డిజైనర్ల వంటి ఇతర రంగాల్లోనూ దీని వినియోగం పెరిగింది. అయితే ఏఐ ఇచ్చిన ఫలితం ప్రతిసారీ కచ్చితంగా ఉండదని డిజైనర్లు చెబుతున్నారు. ఏఐతో పని వేగంగా పూర్తవుతున్నప్పటికీ.. తప్పులు వస్తే వాటిని గుర్తించి మాన్యువల్‌గా సరిచేయాల్సి వస్తోంది. దీంతో ఏఐ పని తగ్గించిందా? లేక పని చేసే విధానాన్ని మాత్రమే మార్చిందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.అమెజాన్ లాజిస్టిక్స్‌లోనూ ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నట్లు ఓ ఉద్యోగి తెలిపారు. దెబ్బతిన్న ప్యాకేజీలను గుర్తించేందుకు ఉపయోగిస్తున్న ఏఐ వ్యవస్థ కొన్ని సందర్భాల్లో సరిగ్గా ఉన్న ప్యాకేజీగా చూపిస్తోందని.. అప్పుడు మనుషులే మళ్లీ తనిఖీ చేసి నిర్ణయం తీసుకోవాల్సి వస్తోందని చెప్పారు.అయితే ఏఐ నిజంగా పనికిరాదా?అలా అని అందరూ ఏఐని వ్యతిరేకించడం లేదు. తెలివిగా ఉపయోగించగలిగితే ఏఐతో పని భారాన్ని తగ్గించుకోవచ్చని కొందరు ఉద్యోగులు అంటున్నారు. అయితే ఏఐనే మొత్తం పనిని చేసేస్తుందని భావిస్తే.. తప్పులను సరిచేయడం, ఫలితాలను తనిఖీ చేయడం వంటి అదనపు పనులు పెరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.ఇదంతా చూస్తే.. ఏఐపై మొదట్లో చేసిన ‘తక్కువ పని.. ఎక్కువ విశ్రాంతి’ అంచనాలు ఇప్పటివరకు నిజం కాలేదనే చెప్పాలి. పైగా ఏఐతో ఉత్పాదకత పెరిగే కొద్దీ ఉద్యోగులపై సంస్థల అంచనాలు కూడా పెరుగుతున్నాయి.మూడు రోజుల వర్క్‌వీక్ ఎక్కడ?ఏఐ కారణంగా భవిష్యత్తులో వారానికి మూడు రోజులే పనిచేసే పరిస్థితి రావచ్చన్న బిల్‌గేట్స్ అంచనాలకు భిన్నంగా.. ఏఐ యుగంలో మనుషులు మరింత బిజీగా మారొచ్చని ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ ఇటీవల వ్యాఖ్యానించారు.సూపర్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కూడా మనుషులు మరింత బిజీగా ఉంటారని.. ఎందుకంటే ఏఐతో సామర్థ్యం పెరిగే కొద్దీ మన అంచనాలు కూడా పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే.. ప్రస్తుత పరిస్థితిని ఒక్క మాటలో చెప్పాలంటే.. ఏఐ పని తగ్గిస్తుందని వచ్చింది.. కానీ పని చేసే వేగాన్ని పెంచి, చేయాల్సిన పనినే మరింత పెంచేసిందన్నమాట! -
నాలుగేళ్లుగా చేస్తున్న ఉద్యోగం.. అందుకే వదిలేసా!
ఈ రోజుల్లో కార్పొరేట్ జాబ్ చేసే చాలామంది ఏదైనా సొంతంగా స్టార్ట్ చేయాలని ఉద్యోగానికి రాజీనామా చేస్తుంటారు. ఇలాంటి కోవకు చెందిన ఒక మహిళ.. తాను ఎందుకు 9-5 ఉద్యోగాన్ని వదిలేసిందో వెల్లడించింది. దీనికి సంబంధించిన ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.డిజిటల్ క్రియేటర్ అయిన అర్పిత సాహు, ఇన్స్టాగ్రామ్ వీడియోలో.. చిన్నప్పటి నుంచి బాగా చదవాలి, మంచి డిగ్రీ తెచ్చుకోవాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, బాగా డబ్బు సంపాదిస్తూ బాధ్యతగా జీవించాలి అనే ఆలోచనతోనే ముందుకు సాగింది. కానీ.. కొంతకాలంగా తాను కోరుకునే జీవితం ఇదేనా అనే ప్రశ్న ఆమెను వెంటాడిందట. దీంతో ఇక తన కోసం కొంత సమయం కేటాయించుకోవాలని నిర్ణయించుకుంది.ఉద్యోగం వదిలేయడం అంత ఈజీగా ఏమీ అనిపించలేదని అర్పితా వెల్లడించింది. స్థిరమైన ఉద్యోగాన్ని వదిలిన తర్వాత ఏం జరుగుతుందో తెలియక కొంత భయంగా ఉందని, అదే సమయంలో కొత్త జీవితాన్ని మొదలుపెట్టబోతున్నాననే ఉత్సాహం కూడా ఉందని తెలిపింది. ఇన్నాళ్లూ ఇతరులు తన నుంచి ఏం ఆశించారో అదే చేస్తూ వచ్చానని, ఇప్పుడు మాత్రం తన మనసు ఏం కోరుకుంటుందో తెలుసుకోవడానికి తనకు తానే ఒక అవకాశం ఇచ్చుకున్నానని చెప్పింది.అర్పితా నిర్ణయంపై సోషల్ మీడియాలో చాలామంది స్పందించారు. కొందరు మాత్రం ఉద్యోగం వదిలేయడం వల్ల ఆర్థికంగా ఇబ్బందులు రావచ్చని, కెరీర్లో గ్యాప్ ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ.. ఎక్కువ మంది మాత్రం ఆమె తీసుకున్న నిర్ణయాన్ని అభినందించారు. తన మానసిక ప్రశాంతత, వ్యక్తిగత ఎదుగుదలకు ప్రాధాన్యం ఇస్తూ ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం ధైర్యమైన విషయమని పలువురు కామెంట్లు చేశారు. View this post on Instagram A post shared by Arpita Sahu | Travel • Fitness • Real Talk (@fit_wandererrr) -
AI భయం.. జుకర్‌బర్గ్ గుడ్‌న్యూస్!
ఏఐ వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. ఈ టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయా? అనే భయం చాలామందిలో ఉంది. అయితే మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ మాత్రం భవిష్యత్తులో ఉద్యోగాలకు కొరత ఉండదని అంటున్నారు.ఏఐ కొన్ని పనులను సులభంగా చేసినప్పటికీ.. అది మనుషులను పూర్తిగా భర్తీ చేయదు. కాబట్టి ఏఐ అనేది ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచే సాధనంగా మారుతుందని జుకర్‌బర్గ్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో చిన్న టీమ్‌లతోనే పెద్ద కంపెనీలను నడిపే పరిస్థితి రావచ్చు. కంపెనీల పరిమాణం తగ్గినా.. కొత్త రకాల వ్యాపారాలు, కొత్త ఉద్యోగాలు ఏర్పడతాయని ఆయన అన్నారు.అయితే.. అంత్రోఫిక్ సీఈఓ డారియో ఆమోడెయ్ మాత్రం ఏఐ వల్ల ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. లా, ఫైనాన్స్, కన్సల్టింగ్, అడ్మినిస్ట్రేషన్ వంటి రంగాల్లో పదేపదే చేయాల్సిన పనులను AI సులభంగా చేయగలదు. దీంతో కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి.. తక్కువ మంది ఉద్యోగులతోనే ఎక్కువ పని చేయించుకునే అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు. -
ఒకే ఇంట్లో కలి'విడి'గా!
బెంగళూరుకు చెందిన యువ దంపతులుమల్టీనేషనల్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగాపనిచేస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం మొదట్లో బాగానే అనిపించినా క్రమంగా ఇద్దరూ వేర్వేరు గదుల్లో, వేర్వేరు షిఫ్ట్‌లలో పనిచేయడం మొదలు పెట్టారు. అలసటకు గురై నిద్రపోయేవేళలోనే ఓ 10 నిమిషాలు మాట్లాడుకొనేవారు. అలా వారి మధ్య దూరం పెరగడంతో 6 నెలల క్రితం వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్‌కు చెందిన ఓ జంట సైతం స్టార్టప్ కంపెనీలో పని ఒత్తిడి, టార్గెట్లు, వారాంతాల్లోనూ పనివేళల వల్ల ఒకరికొకరు మాట్లాడుకోవడం బాగా తగ్గించేశారు. మానసిక వైద్యుడి వద్ద కౌన్సెలింగ్‌కు వెళ్తే కౌన్సెలర్ చెప్పిన మాట ఒక్కటే ‘‘మీరు భాగస్వాముల కంటే కొలీగ్స్‌లా ప్రవర్తిస్తున్నారు’’. భావోద్వేగపరంగా కనెక్ట్ కాకపోవడంతో ఇద్దరూ విడిగా ఉండాలని డిసైడయ్యారు. ఇది లీగల్‌గా విడాకులు కాదు.. ఎమోషనల్ విడాకులు! సాక్షి, హైదరాబాద్: భార్యాభర్తలిద్దరికీ తీరికలేని ఉద్యోగాలు.. ఉదయం నుంచి రాత్రి వరకు మీటింగ్‌లు, డెడ్లైన్లు... ఒకే ఇంట్లో ఉంటున్నా మాటలు కరువవుతున్న తీరు. ఆఫీసు కష్టాలు చెప్పుకుందామన్నా.. ఇంట్లో సంతోషాలు పంచుకుందామన్నా మెసేజ్‌లే దిక్కు. ఇదే ఇప్పుడు మె ట్రో నగరాల్లో పనిచేస్తున్న ఐటీ నిపుణుల కుటుంబాల్లో కనిపిస్తున్న విచిత్ర పరిస్థితి. అధికారికంగా విడాకులు తీసుకోకపోయినా దంపతుల మధ్య మనసులు మాత్రం దూరమవుతున్నాయి. దీన్నే వైద్య నిపుణులు సైలెంట్ డైవోర్స్ అంటున్నారు. కోవిడ్ తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ సంస్కృతి పెరగడంతో ఈ సమస్య మరింత తీవ్రమైందని అంటున్నారు. గతంలో ఆఫీస్‌కు వెళ్లి వచ్చే సరికి ఇంట్లో మాట్లాడుకునేందుకు సమయం ఉండేది. ఇప్పుడు 24 గంటలూ నాలుగు గోడల మధ్యఉన్నా కమ్యూనికేషన్ మాత్రం తగ్గిపోయింది. జాతీయ మానసిక ఆరోగ్య, నాడీ శా్రస్తాల సంస్థ 2025 సర్వే ప్రకారం మెట్రో నగరాల్లోని ఐటీ ఉద్యోగుల్లో 38 శాతం మంది వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల భాగస్వామితో గొడవలుపెరిగాయని చెప్పారు. బంధం పెంచుకుంటేనే.. సైలెంట్ డైవోర్స్‌కు పరిష్కారం చట్టంలో కాదు.. కమ్యూనికేషన్లో ఉందని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పని విధానం వల్ల ఇంట్లో ఉండేందుకు లభించిన సమయాన్ని భార్యాభర్తలు పరస్పరం తమ బంధాన్ని బలోపేతం చేసుకోవడంపై దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు. మాటల్లోనే పరిష్కారం.. ‘సైలెంట్ డైవోర్స్’సమస్యలతో చాలా జంటలు మా వద్దకు వస్తున్నాయి. భిన్న కుటుంబ నేపథ్యాలకు చెందిన దంపతుల్లో, భర్తకన్నా భార్య సంపాదనఎక్కువగా ఉన్న సందర్భాల్లో, సాంస్కృతిక తేడాలు ఉన్న వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగంలో పనిచేస్తున్న దంపతులు ఇలాంటి ఇబ్బందులను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. అలాంటి వారికి మా సలహా ఒకటే. దంపతులుమనసువిప్పి మాట్లాడుకుంటే సమస్యలకుపరిష్కారం లభిస్తుంది. సమస్యను తొలిదశలోనే గుర్తించి పరిష్కరించుకుంటే విడాకుల దాకా పరిస్థితి వెళ్లదు. – డా.సి. వీరేందర్, కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ -
మారుతున్న జాబ్ మార్కెట్.. వాళ్లకే ఉద్యోగాలు!
ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్లో ఊహకందని మార్పులు జరుగుతున్నాయి. కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. ఏఐ.. ఆటోమేషన్ వల్ల చాలా పనులు సులభంగా మారుతున్నాయి. కాబట్టి.. భవిష్యత్తులో ఉద్యోగం పొందడానికి కేవలం అనుభవం మాత్రమే సరిపోదు. కొత్త విషయాలను త్వరగా నేర్చుకునే సామర్థ్యం కూడా చాలా ముఖ్యం.ఎక్కువ అనుభవం ఉన్న వ్యక్తి కంటే.. కొత్త విషయాలను త్వరగా నేర్చుకునే వ్యక్తులకే ఎక్కువ ఉద్యోగావకాశాలు లభిస్తాయని విద్యావేత్త, రచయిత ప్రశాంత్ కిరాడ్ పేర్కొన్నారు. దీనికి కారణం.. స్కిల్స్ ఎప్పటికప్పుడు మారుతుండటమే అని వెల్లడించారు. కాబట్టి ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం చాలా అవసరం అని ఆయన అన్నారు.ఉద్యోగ ప్రపంచంలో మనగలగాలంటే.. ఏ స్కిల్స్ నేర్చుకోవాలి? అని మాత్రమే కాకుండా.. అవసరం వచ్చినప్పుడు కొత్త స్కిల్ ఎంత వేగంగా నేర్చుకోగలను అనే విషయాన్ని కూడా తప్పకుండా ఆలోచించాలి.అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే.. కొత్త స్కిల్ నేర్చుకున్న వెంటనే రిజల్ట్స్ రావాలని ఆశించకూడదు. కనీసం 90 రోజుల పాటు ప్రతిరోజూ ఫోకస్ పెట్టి ప్రాక్టీస్ చేసి, ఆ తర్వాత అది మనకు ఉపయోగపడుతుందా లేదా అని నిర్ణయించుకోవాలి. ప్రపంచం మారుతున్నప్పుడు.. మనం కూడా మారాలి.ఇదీ చదవండి: H-1B వీసాదారులకు అమెరికా బిగ్ షాక్! -
ఉద్యోగాలపై నందన్ నీలేకని కీలక వ్యాఖ్యలు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వల్ల రాబోయే రోజుల్లో.. భారతదేశంలో ఉద్యోగాల తీరు చాలా వరకు మారే అవకాశం ఉందని ఇన్ఫోసిస్ కో-ఫౌండర్ నందన్ నీలేకని అన్నారు. ముఖ్యంగా పెద్ద కంపెనీల్లో ఏఐ, ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాలు తగ్గే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.నిజానికి.. ఒక ఉద్యోగి చేసే పనిని చిన్న చిన్న టాస్కులుగా విభజించి వాటిలో కొన్నింటిని ఏఐతో చేయించుకోవడం పెద్ద సంస్థలకు సులభంగా ఉంటుంది. కాబట్టి.. భవిష్యత్తులో పెద్ద కంపెనీలు ఉద్యోగాలు కల్పించడం కంటే, ఉద్యోగాలను తొలగిస్తాయని నీలేకని అభిప్రాయపడ్డారు.అయితే.. చిన్న కంపెనీల పరిస్థితి కొంత భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఎక్కువగా ఉద్యోగావకాశాలు లభించే అవకాశం ఉంటుందని నీలేకని అన్నారు. దేశంలో లక్షల సంఖ్యలో చిన్న సంస్థలు ఉన్నాయి. ఇందులో పనితీరు, అవసరాలు ఒక్కో విధంగా ఉంటాయి. అందువల్ల వాటి మొత్తం కార్యకలాపాలను ఏఐతో ఆటోమేట్ చేయడం అంత సులభమైన విషయం కాదు. కాబట్టి చిన్న వ్యాపారాలు.. ఏఐ ప్రభావాన్ని కొంతవరకు తట్టుకుని నిలబడగలవు, ఉద్యోగాలను కల్పించగలవని ఆయన అన్నారు.ప్రస్తుతం దేశంలో సుమారు 1.5 లక్షల స్టార్టప్‌లు ఉన్నాయి. 2035 నాటికి ఈ సంఖ్య 10 లక్షలకు చేరే అవకాశం ఉందని నీలకేని అంచనా వేశారు. అయితే.. చిన్న వ్యాపారాలు పెరగాలంటే నిబంధనలు సులభంగా ఉండాలని, వారికి పెట్టుబడులు, రుణాలు, మార్కెట్లు సులభంగా అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. మరోవైపు ఉద్యోగుల విషయంలోనూ పరిస్థితులు మారుతున్నాయని చెప్పారు. ఒక కంపెనీలో చేరి ఏళ్ల పాటు అక్కడే పనిచేసే రోజులు క్రమంగా తగ్గిపోతున్నాయని, భవిష్యత్తులో ఉద్యోగులు తరచుగా కంపెనీలు మారే పరిస్థితి రావచ్చని అన్నారు.ఇదీ చదవండి: రియల్ ఎస్టేట్ కుప్పకూలుతుందా? -
‘అవును భాయ్.. నేను సాహెబ్ కాదు.. నేతాజీనే’
రాంచీ: జార్ఖండ్‌లోని మధ్యతరగతి కుటుంబాల పిల్లల కలల్లో ప్రభుత్వ ఉద్యోగం ప్రధాన లక్ష్యం. జేపీఎస్సీ , జేఎస్సీఎస్సీ వంటి నియామక పరీక్షల్లో విజయం సాధించి అధికారి కావాలని వేలాది మంది యువత కష్టపడుతున్నారు. అయితే ప్రశ్నాపత్రాల లీకులు, అక్రమాలు, పరీక్షల రద్దు, నియామకాలలో జాప్యం వంటి ఆరోపణలు వారి కలలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.అలాంటి వారిలో పాకూర్ జిల్లా ఇల్మీ గ్రామానికి చెందిన షహ్బాజ్ హుస్సేన్ ఒకరు. చిన్నప్పటి నుంచి ప్రతిభావంతుడైన షహ్బాజ్ పాఠశాలలో టాపర్‌గా నిలిచాడు. అనంతరం ఎంఎస్సీ, ఎంఎడ్లోనూ ఉత్తమ ప్రతిభ కనబరిచి విశ్వవిద్యాలయంలో రెండో ర్యాంకు సాధించాడు. అధికారి కావాలనే లక్ష్యంతో రాంచీకి వెళ్లి చిన్న లాడ్జిలో ఉంటూ జేపీఎస్సీ పరీక్షలకు సిద్ధమయ్యాడు. కానీ నియామక పరీక్షల్లో అక్రమాల ఆరోపణలు, ప్రశ్నాపత్రాల లీకులు, పరీక్షల రద్దు వంటి పరిణామాలు తన జీవితాన్ని మార్చేశాయని షహ్బాజ్ చెబుతున్నాడు.నియామకాల్లో పారదర్శకత కోసం జరుగుతున్న నిరసనల్లో పాల్గొంటున్న షహ్బాద్ తన స్వగ్రామానికి వెళ్లినప్పుడు అందరూ తనను ‘సాహెబ్’ అని కాకుండా ‘నేతాజీ వచ్చారు’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని వాపోతున్నారు. అయినప్పటికీ నిజం కోసం గొంతెత్తడంలో తాను వెనక్కి తగ్గబోనని స్పష్టం చేశారు. నిజం మాట్లాడితే నాయకుడని అంటారంటే..‘అవును భాయ్ నేను నేతాజీనే’ అని షహ్బాజ్ వ్యాఖ్యానించారు.ఆర్థిక, మానసిక ఒత్తిడిరాంచీలోని లాడ్జీల్లో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు అద్దె, భోజనం, పుస్తకాలు, ఇతర ఖర్చులను భరించడం కష్టంగా మారిందని షహ్బాజ్ తెలిపారు. గ్రామానికి వెళ్లిన ప్రతిసారీ ఇంకెంతకాలం? అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయని, వాటికి సమాధానం చెప్పడం బాధాకరంగా ఉంటుందని అన్నారు. అనిశ్చితి, ఒత్తిడి కారణంగా తనతో పాటు సిద్ధమవుతున్న పలువురు స్నేహితులు చదువును మధ్యలోనే వదిలి గ్రామాలకు తిరిగి వెళ్లిపోయారని పేర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో తానూ అన్నీ వదిలేసి ఇంటికి వెళ్లిపోవాలనిపించినా, తల్లిదండ్రుల నమ్మకం, చిన్ననాటి కలలు గుర్తుకొచ్చి మళ్లీ ముందుకు సాగుతున్నానని చెప్పారు.పారదర్శక నియామకాలకే డిమాండ్తాము వీధుల్లోకి రావడం అల్లర్లు సృష్టించడానికి కాదని, కష్టపడి చదివిన అభ్యర్థులకు న్యాయం జరగాలని మాత్రమే కోరుతున్నామని షహ్బాజ్ అన్నారు.నియామక పరీక్షలను పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని, అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అర్హులైన అభ్యర్థులకు సకాలంలో న్యాయం అందించాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. అక్రమాలపై విచారణ విశ్వసనీయంగా జరగాలని, వాస్తవాలు వెలుగులోకి రావాలని విద్యార్థులు ఆశిస్తున్నారని షహ్బాజ్ తెలిపారు. -
ఉద్యోగులకు షాకిచ్చిన మెయిల్!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. దిగ్గజ కంపెనీలు తమ పని విధానాన్ని మార్చుకుంటున్నాయి. ఒకప్పుడు ఉద్యోగులకు సహాయపడే టెక్నాలజీగా ఉన్న ఏఐ.. ఇప్పుడు కొన్ని ఉద్యోగాలనే భర్తీ చేసే స్థాయికి ఎదిగింది. ఈ ప్రభావం తాజాగా ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ వీసా(Visa)లో స్పష్టంగా కనిపించింది.సంస్థ ప్రపంచవ్యాప్తంగా దాదాపు 2,600 మంది ఉద్యోగులను తొలగించింది. ఇది మొత్తం ఉద్యోగుల్లో సుమారు 7 శాతం. ఈ నిర్ణయం భారత్‌లోని బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబై వంటి టెక్ సెంటర్లపైనా ప్రభావం చూపింది.షాకిచ్చిన మెయిల్జూలై 29 తెల్లవారుజామున కొంతమంది ఉద్యోగులకు.. ఉదయం 4 నుంచి 5 గంటల మధ్య ఈ-మెయిల్ వచ్చింది. ఆ మెయిల్ చూసిన తర్వాతే తమ ఉద్యోగం పోయిందని వారికి తెలిసింది. కొన్ని రోజుల్లోనే ఆఫీస్ సిస్టమ్‌లకు యాక్సెస్ నిలిపివేయడంతో పాటు, ల్యాప్‌టాప్‌లు, ఐడీ కార్డులను కూడా వెనక్కి తీసుకున్నారు.భారత్‌లో వీసాకు 3,500 మందికిపైగా ఉద్యోగులు ఉన్నప్పటికీ.. ఎంతమందిని తొలగించారనే విషయాన్ని కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు. అయితే.. ఒక టెక్నాలజీ టీమ్‌లో 28 మందిలో 10 మందిని తొలగించినట్లు సమాచారం. వీరిలో సీనియర్ డైరెక్టర్లు, ఇంజినీరింగ్ మేనేజర్లు కూడా ఉండటం గమనార్హం.చాలామంది అనుకునేలా కంపెనీ నష్టాల్లో లేదని వీసా స్పష్టం చేసింది. వ్యాపారం సజావుగానే సాగుతున్నప్పటికీ, భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా.. సంస్థను మార్చుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ప్రస్తుతం కంపెనీ దృష్టి మొత్తం ఏఐ మీదనే ఉంది.వీసా మాత్రమే కాదు!ఏఐ కారణంగా ఉద్యోగాల కోత విధిస్తున్న కంపెనీల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్, మెటా, ఒరాకిల్, సిస్కో, క్లౌడ్‌ఫ్లేర్, పేపాల్, అట్లాసియన్, స్టాండర్డ్ చార్టర్డ్ వంటి సంస్థలు కూడా ఉద్యోగులను తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. పేమెంట్స్ రంగంలో వీసాకు ప్రధాన ప్రత్యర్థి అయిన మాస్టర్‌కార్డ్ కూడా ఈ ఏడాది సుమారు 4 శాతం ఉద్యోగులను తగ్గించనున్నట్లు తెలిపింది. అలాగే అమెజాన్ వేల సంఖ్యలో కార్పొరేట్ ఉద్యోగాలను తగ్గించే దిశగా అడుగులు వేస్తోంది.ఇదీ చదవండి: జియో రీఛార్జ్.. బడ్జెట్ నుంచి యాన్యువల్ ప్లాన్స్ వరకు! -
వర్క్ ఫ్రమ్ హోమ్‌కు గుడ్‌బై.. ఉద్యోగి ముందు కొత్త సవాల్!
కరోనా తర్వాత కూడా చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని కొనసాగించాయి. అయితే.. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దీంతో సంస్థలన్నీ కూడా ఉద్యోగులను మళ్లీ ఆఫీసులకు పిలుస్తున్నాయి. ముందు పూర్తిగా ఇంటి నుంచి పని చేసే అవకాశం ఇచ్చిన ఓ కంపెనీ, ఇప్పుడు హైబ్రిడ్ వర్క్ మోడల్‌ను అమలు చేయడంతో ఓ ఉద్యోగి ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.మార్కెటింగ్ విభాగంలో పనిచేస్తున్న ఉద్యోగికి ఐదేళ్ల అనుభవం ఉంది. ఏడాదికి పైగా ఒక కంపెనీలో పనిచేస్తున్న అతను, ప్రారంభంలో రిమోట్ ఉద్యోగం కావడంతో చేరాడు. కానీ ఆ కంపెనీ తాజాగా వర్క్ పాలసీ మార్చి, వారానికి రెండు రోజులు ఆఫీస్‌కు రావాలని చెప్పింది.కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయం ఆ ఉద్యోగికి సమస్యగా మారింది. ఆఫీస్‌కు వెళ్లి రావడానికి రోజుకు దాదాపు 115 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోందని అతను తెలిపాడు. వారానికి రెండు రోజులు మాత్రమే అయినప్పటికీ.. ఈ ప్రయాణం వల్ల సమయం, శ్రమ రెండూ ఎక్కువగా ఖర్చవుతున్నాయని చెప్పాడు. దీనికి తోడు కంపెనీలో జీతాల పెంపు ప్రక్రియ ఎలా ఉంటుందో?, కూడా స్పష్టత లేదని పేర్కొన్నాడు.వర్క్ పాలసీలో మార్పు, కెరీర్ ఎదుగుదలపై అనిశ్చితి కారణంగా అతను కొత్త ఉద్యోగ అవకాశాలను వెతకడం ప్రారంభించాడు. మరో పూర్తిగా రిమోట్ ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్లే ముందు, ప్రస్తుత ఉద్యోగం ఎందుకు వదిలేయాలనుకుంటున్నానో?.. ఎలా చెప్పాలి అని నెటిజన్లను అడిగాడు.2 days of commuting, 115 km/day. Is this a valid reason for job change?by u/whoisthisonred in IndianWorkplaceఇంటర్వ్యూలో.. సాధారణంగా అడిగే ప్రశ్న ''మీరు కొత్త ఉద్యోగం ఎందుకు వెతుకుతున్నారు?''. ఈ ప్రశ్నకు ఎలా సమాధానం చెప్పాలో అనే విషయంలో సందేహం వచ్చింది. కేవలం ఎక్కువ దూరం ప్రయాణం కారణంగా.. ఉద్యోగం మారుతున్నట్లు చెప్పడం సరైనదేనా అని అడిగాడు.తర్వాత జరిగిన ఇంటర్వ్యూ గురించి కూడా అతను తన రెడ్దిట్ పోస్టు ద్వారా వివరించాడు. ప్రస్తుత కంపెనీలో లేఆఫ్స్ జరుగుతున్నాయని, అలాగే కొత్తగా ఏర్పాటు చేసిన ఆఫీస్ తన ఇంటి నుంచి చాలా దూరంలో ఉందని చెప్పాడు. రిమోట్ ఉద్యోగాలకే ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారని అడిగినప్పుడు, తనకు కేవలం ఇంటి నుంచి పని చేయడం మాత్రమే లక్ష్యం కాదని, రోజువారీ ప్రయాణం సులభంగా ఉండే మంచి పని వాతావరణం కావాలని స్పష్టం చేశాడు.ఈ విషయం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. కొంతమంది ఉద్యోగి ఎదుర్కొంటున్న సమస్యను అర్థం చేసుకున్నారు. ముఖ్యంగా ఢిల్లీ, గురుగ్రామ్, గ్రేటర్ నోయిడా వంటి ప్రాంతాల్లో ఎక్కువ దూరం ప్రయాణించడం చాలామంది ఉద్యోగులకు సాధారణ సమస్యగా మారిందని అభిప్రాయపడ్డారు. మరికొందరు మాత్రం.. జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఇప్పుడు రిమోట్ ఉద్యోగం దొరికినా, భవిష్యత్తులో ఆ కంపెనీ కూడా హైబ్రిడ్ విధానాన్ని తీసుకురాదనే గ్యారంటీ లేదని చెప్పారు. అందుకే కొత్త కంపెనీలో చేరే ముందు వర్క్ పాలసీపై పూర్తి స్పష్టత తీసుకోవాలని సూచించారు. -
నేటికీ ఇంటికే పరిమితం?
మహిళలు సాధికారత సాధించారని, అభివృద్ధిపథంలో ముందున్నారని మాటలు చెప్పేస్తుంటారు. కానీ నివేదికలు మాత్రం ఇవన్నీ ఉత్తిమాటలేనని తేటతెల్లం చేస్తున్నాయి. దేశంలోని అత్యంత అభివృద్ధి చెందిన నగరాల్లోనూ ఇంటి, సంరక్షణ బాధ్యతల భారం కేవలం మహిళలపైనే పడుతోందని జాతీయ గణాంక కార్యాలయం చేపట్టిన సర్వేలో తేలింది. భారత్‌లోని 46 అతిపెద్ద నగరాల్లో (మిలియన్ కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాల్లో) సుమారు 69 శాతం మంది మహిళలు కేవలం పిల్లల పెంపకం, ఇంటి పనుల కారణంగానే ఉద్యోగాలకి దూరంగా ఉంటున్నారని ఈ సర్వే తెలిపింది.⇒ 1% దేశవ్యాప్తంగా సామాజిక కారణాల వల్ల తాము ఉద్యోగానికి దూరంగా ఉంటున్నామని చెప్పిన మహిళలు ఒక్క శాతం కాగా, అలాగే పిల్లల సంరక్షణ ఇంటి బాధ్యతల కారణంగా తాము కూడా ఉద్యోగాలు చేయలేక΄ోతున్నామని చెప్పిన మగవారు కూడా ఒక్కశాతమే ఉండటం గమనార్హం.⇒ 30.7% ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే భారతదేశంలోని మహిళల ఉద్యోగ భాగస్వామ్యం అత్యల్పంగా 2025 నాటికి 30.7 శాతంగా నమోదైంది. అయితే ఈ మధ్యకాలంలో గణాంకాల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది.23%పెద్ద నగరాల్లో పురుషుల కంటే మహిళలు 23% తక్కువ సంపాదిస్తున్నారు. దేశంలో, ఈ ధోరణి నగరాల మధ్య మారుతూ ఉంది. ఉదాహరణకు హౌరాలోని 83% మంది మహిళలు తాము ఉపాధి రంగానికి దూరంగా ఉండటానికి పిల్లల సంరక్షణ, ఇంటి పనులే కారణమని తెలపగా, ఆ తర్వాత సూరత్ (81%), పింప్రి చించ్వాడ్ , భోపాల్ (78%), ధన్ బాద్ (77%) ఉన్నాయి. అదేవిధంగా ఆగ్రా (41%), కోటా (57%), హైదరాబాద్ (58%), అలాగే విశాఖపట్నం, శ్రీనగర్‌లలో (60%) ఈ శాతంగా నమోదు అయింది. అయితే కొయంబత్తూర్‌లో ఈ శాతం చాలా తక్కువగా (38%) ఉంది.10%16 శాతం మంది మహిళలు ఉన్నత చదువుల కోసం, 10 శాతం మంది ఆరోగ్యం, వయోపరిమితి వల్ల ఉద్యోగాలకు దూరంగా ఉంటున్నారు. మరోవైపు, ఉద్యోగాల్లో లేని పురుషుల్లో సగానికి పైగా (53%) మంది ఉన్నత చదువుల కోసమేనని చెప్పగా, 39 శాతం మంది ఆరోగ్యం, వయస్సుకు సంబంధించిన కారణాలను చూపారు.51%ఇతర పట్టణ ప్రాంతాలతో పోలిస్తే, నగరాల్లో మహిళలకు లభించే ఉద్యోగాల శాతం మెరుగ్గా ఉంది. పెద్ద నగరాల్లో 65 శాతం మంది మహిళలు వేతనంతో కూడిన రెగ్యులర్ ఉద్యోగాలు చేస్తుండగా, పట్టణాల్లో 51 శాతం మాత్రమే ఉంది. అలాగే నగరాల్లో 3 శాతం మంది మాత్రమే రోజువారీ వేతన కార్మికులుగా ఉండగా, పట్టణాల్లో 9%గా ఉన్నారు.రూ. 23,700/వేతనాల్లోనూ స్త్రీ, పురుషుల మధ్య అసమానత స్పష్టంగా కనిపిస్తోంది. పట్టణాల్లో పురుషులు నెలకు సగటున రూ. 30,700 సంపాదిస్తుండగా, మహిళలు మాత్రం నెలకు రూ. 23,700 మాత్రమే సంపాదిస్తున్నారు. అంటే 23 శాతం తక్కువ. కళ్యాణ్–డోంబివిలి, నవీ ముంబై, నాగ్‌పూర్ వంటి నగరాల్లో ఈ వ్యత్యాసం మరీ ఎక్కువగా ఉంది. అక్కడ మహిళలు పురుషుల సంపాదనలో దాదాపు సగం మాత్రమే పొందుతున్నారు. అయితే ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్) మాత్రం ఈ ట్రెండ్‌కు భిన్నంగా ఉంది. ఇక్కడ పురుషుల కంటే మహిళల సంపాదన ఎక్కువగా నమోదైంది.రూ. 16,160/స్వయం ఉపాధిలో పురుషుల నెలవారీ ఆదాయం (రూ. 33,880), మహిళల ఆదాయం (రూ. 16,160) కంటే రెట్టింపుగా ఉంది.49.5 గంటలుపట్టణ ప్రాంతాల్లోని కార్మికులు వారానికి సగటున 47.1 గంటలు పనిచేస్తుంటే, పది లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లోని కార్మికులు వారానికి 49.5 గంటలు పనిచేస్తున్నారు. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే పెద్ద నగరాల్లోని పురుష, స్త్రీ ఉద్యోగులిద్దరూ ఎక్కువ సగటు గంటలు పనిచేస్తున్నట్లు నమోదైంది.51.5 గంటలుఉద్యోగాలు చేసే మహిళలలో.. గుజరాత్‌లోని రాజ్‌కోట్ (51.5 గంటలు), తర్వాత హర్యానాలోని ఫరీదాబాద్ (50 గంటలు) నగరాలకు చెందిన మహిళలు ఆఫీస్‌లలో అత్యధిక సమయం పనిచేస్తున్నారు. -
అసలు సమస్య NEET కాదు.. ఆర్జీవీ సంచలన ట్వీట్!
విద్యారంగంలో ప్రస్తుతం అనేక సమస్యలు కనిపిస్తున్నాయి. ఎగ్జామ్ పేపర్ లీక్స్, పరీక్షల రద్దు, విద్యార్థుల ఒత్తిడి, ఆత్మహత్యలు వంటి అంశాలు తరచూ వార్తల్లో నిలుస్తున్నాయి. ఇవన్నీ.. విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. ఈ తరుణంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (RGV) సంచలన ట్వీట్ చేశారు. ప్రస్తుత సమస్య నీట్ (NEET) కాదు, అసలు సమస్య ఏఐ (AI) అని పేర్కొన్నారు.విద్య అంటే..గతంలో విద్య అంటే.. ఒక వ్యక్తికి అవసరమైన జ్ఞానాన్ని అందించి, ఉద్యోగానికి సిద్ధం చేయడం. డాక్టర్, ఇంజనీర్, లాయర్ వంటి వృత్తులకు కావాల్సిన విషయాలను నేర్చుకుని, ఒక స్థిరమైన జీవితాన్ని గడపడం అనేది చాలామంది లక్ష్యంగా పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారుతున్నాయి.ఒకప్పుడు సమాచారం పొందడం కష్టంగా ఉండేది. పుస్తకాలు, ఉపాధ్యాయులు, అనుభవజ్ఞుల ద్వారా మాత్రమే జ్ఞానం లభించేది. కానీ ఈ రోజు ఏదైనా సమాచారం కావాలంటే.. ఇంటర్నెట్, ఏఐ వంటి వాటిమీద ఆధారపడుతున్నారు. పెరిగిన టెక్నాలజీ కారణంగా.. ప్రపంచంలోని సమాచారం మన చేతుల్లోకి వచ్చేసింది. అయితే ఈ సమాచారంలో నిజమైన అంశాలు మాత్రమే కాకుండా.. తప్పుడు సమాచారం కూడా ఉంటుందని ఆర్జీవీ పేర్కొన్నారు.పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదుఏఐ అనేది కేవలం సమాచారాన్ని అందించడానికి మాత్రమే కాకుండా.. మనుషులు చేసే అనేక పనులను వేగంగా చేయగల స్థాయికి చేరుకుంటోంది. రాయడం, విశ్లేషించడం, కోడింగ్ చేయడం, డిజైన్ చేయడం వంటి పనుల్లో ఏఐ దూసుకెళ్తోంది. దీంతో భవిష్యత్తులో విద్యార్థులకు కేవలం పుస్తక జ్ఞానం మాత్రమే సరిపోదనే అభిప్రాయం బలపడుతోంది. దీన్నిబట్టి చూస్తే రానున్న రోజుల్లో ఏఐ తీవ్రత ఎలా ఉంటుందో అంచనా వేయడం చాలా కష్టమవుతుంది.NEET is not the issue A I isNEET leaks, cancelled exams, student suicides might leave bodies on the floor and parents screaming which might seem brutal in the way the system is being injuredAI does not wound the system.It rips its throat out.For centuries education had one…— Ram Gopal Varma (@RGVzoomin) July 27, 2026అందుకే.. విద్యార్థులు పుస్తక జ్ఞానంతో పాటు.. కొత్త నైపుణ్యాలను పెంపొందించుకోవాలి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకునే సామర్థ్యాన్ని పెంచుకోవాలని రామ్ గోపాల్ వర్మ అన్నారు. ఒకప్పుడు బాగా చదువు.. మంచి ఉద్యోగం సంపాదించు.. జీవితాంతం భద్రంగా ఉండు అనే ధోరణి ఉండేది. కానీ ఏఐ యుగంలో ఎప్పుడు ఉద్యోగం పోతుందో కూడా తెలియదు.ఉద్యోగాలు పోతాయా?ఇంజనీరింగ్, మెడిసిన్, లా, సీఏ, ఎంబీఏ వంటి కోర్సులు చదువుతున్న విద్యార్థుల భవిష్యత్తుపై కూడా చర్చ జరుగుతోంది. ఏఐ వల్ల కొన్ని పనులు ఆటోమేట్ అయ్యే అవకాశం ఉంది. అయితే దీని అర్థం ఈ రంగాల్లో ఉన్న ఉద్యోగాలు పూర్తిగా పోతాయని కాదు. కానీ ఆ రంగాల్లో పనిచేసే విధానం మారుతుంది. ఏఐని తమకు అనుకూలంగా ఉపయోగించుకునే వారికి ఎక్కువ అవకాశాలు లభించే అవకాశం ఉంది.ఈ మార్పులను దృష్టిలో పెట్టుకుని విద్యా వ్యవస్థ కూడా మారాల్సిన అవసరం ఉంది. విద్యార్థులకు ఏఐని ఎలా ఉపయోగించాలి, దానితో కలిసి ఎలా పని చేయాలి, సరైన నిర్ణయాలు ఎలా తీసుకోవాలి వంటి నైపుణ్యాలను తప్పకుండా నేర్పించాలి. తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్తును కేవలం ర్యాంకులు, మార్కులు, డిగ్రీలతో మాత్రమే అంచనా వేయకుండా, వారు మారుతున్న ప్రపంచానికి ఎంతగా సిద్ధంగా ఉన్నారో చూడాలి.ఇదీ చదవండి: కియోసాకి వ్యూహం.. రియల్ ఎస్టేట్‌లోకి ఎంట్రీ! -
ఒకే ఏడాదిలో 13 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. నాగేంద్రసాయి రికార్డు
సాధించాలనే బలమైన సంకల్పం, పట్టుదలే పెట్టుబడిగా శ్రమిస్తే సొంతం కాని విజయం లేదని నిరూపించాడు వైఎస్సార్ జిల్లా కేంద్రం కడప నగరానికి చెందిన యువకుడు లొమడ నాగేంద్రసాయి. తన తల్లిదండ్రుల ప్రోత్సాహాన్ని స్ఫూర్తిగా తీసుకుని, పట్టువిడవని విక్రమార్కుడిలా పోరాడి ఏకంగా ఒకే సంవత్సరంలో 13 కేంద్ర ప్రభుత్వ కొలువులు కైవసం చేసుకుని నేటి యువతకు ఆదర్శంగా నిలిచాడు. విద్యాభ్యాసంలో టాప్ కడప నగరంలోని రాజారెడ్డి వీధికి చెందిన అశ్వనికుమార్ (ఏపీఎస్ఆర్టీసీ పదవీ విరమణ పర్సనల్ ఆఫీసర్), రాజరాజేశ్వరి (పెండ్లిమర్రి జెడ్పీ హైస్కూల్ స్కూల్ అసిస్టెంట్)ల కుమారుడైన నాగేంద్రసాయి ప్రాథమిక విద్యాభ్యాసం నుంచే చదువులో ప్రతిభ కనబరిచాడు. కడప భారతి స్కూల్లో 1 నుంచి 7వ తరగతి, విద్యాధరి స్కూల్లో 8 నుంచి 10వ తరగతి (10వ తరగతిలో 9.7 జీపీఏ) చదివాడు. హైదరాబాద్ ఎన్ఆర్ఐ కళాశాలలో ఇంటర్ ఎంపీసీ పూర్తి చేసి 974 మార్కులు సాధించాడు. ఆ తర్వాత జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఉత్తమ ర్యాంకుతో పశ్చిమ బెంగాల్ లోని ప్రతిష్టాత్మక ఐఐటీ ఖరగ్‌పూర్‌లో ఇండస్ట్రియల్ అండ్ సిస్టమ్స్ ఇంజనీరింగ్‌లో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు (బీటెక్ + ఎంటెక్) పూర్తి చేశాడు. సాఫ్ట్‌వేర్‌పై కరోనా దెబ్బ.. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా.. నాగేంద్రసాయి చదువు ముగిసే సమయానికే ప్రపంచాన్ని కరోనా మహమ్మారి వణికించింది. ఆ తరుణంలో ఐటీ రంగం సంక్షోభంలో పడి, పలు కంపెనీలు చాలా మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులను కొలువుల నుంచి తొలగించాయి. ఎంతోమంది నిరుద్యోగులుగా మారడం కళ్లారా చూసిన సాయి.. ప్రైవేటు ఉద్యోగాల్లో భద్రత ఉండదని గ్రహించాడు. తన తల్లిదండ్రులిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో, వారి బాటలోనే నడవాలనే బలమైన బీజం అతని మనసులో నాటుకుంది. కరోనా తగ్గుముఖం పట్టే వరకు ఇంట్లోనే ఉండి స్వయంగా ప్రిపరేషన్ సాగించాడు. తొలి ఓటమి నేర్పన పాఠం మొదటిసారి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్ష రాసినప్పుడు కేవలం ఒకే ఒక ఉద్యోగానికి దరఖాస్తు చేయడం, నార్మలైజేషన్ ప్రక్రియ వల్ల స్కోర్ తగ్గడంతో తృటిలో ప్రభుత్వ కొలువును మిస్ చేసుకున్నాడు. ఈ తొలి ఓటమికి ఏమాత్రం కుంగిపోకుండా, తన లోపాలను సరిదిద్దుకుని మరింత పట్టుదలతో తదుపరి పరీక్షలకు సిద్ధమయ్యాడు. 2025లో కొలువుల జాతర ఆ తర్వాత 2025లో హైదరాబాద్‌లోని ఓ కోచింగ్ సెంటర్లో చేరుకుని.. నోటిఫికేషన్ పడిన ప్రతి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటూ కఠిన ప్రిపరేషన్ సాగించాడు. ఒక్కసారి లోపాలు తెలుసుకున్న నాగేంద్రసాయి, ఆ తర్వాత జరిగిన పరీక్షల్లో విశ్వరూపం ప్రదర్శించి ఒకే ఏడాదిలో వరుసగా 13 కేంద్ర ప్రభుత్వ కొలువులను సాధించి రికార్డు సృష్టించాడు. ప్రస్తుతం నాగేంద్రసాయి తాను సాధించిన ఉద్యోగాలలో అత్యుత్తమమైన దాన్ని ఎంచుకుని, తెలంగాణ రాష్ట్రం మహబూబ్‌నగర్ జిల్లాలో ఎంప్లాయిస్ స్టేట్ ఇన్య్సూరెన్స్ కార్పొరేషన్లో బ్రాంచ్ మేనేజర్ హోదాలో బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. కడప జిల్లా పేరును జాతీయ స్థాయిలో నిలిపిన నాగేంద్రసాయి ప్రతిభపై పలువురు విద్యావంతులు, ఉన్నతాధికారులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఒకే ఏడాదిలో సాధించిన 13 కేంద్ర ప్రభుత్వ కొలువులు ఇవే: ఎయిమ్స్ : సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్ఎయిమ్స్ , అప్పర్ డివిజనల్ క్లర్క్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్, అప్పర్ డివిజనల్ క్లర్క్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్–2స్టాఫ్ సెలక్షన్ కమిషన్, సర్వేయర్ ఆఫ్ సెలక్షన్ కమిషన్, అసిస్టెంట్ కమ్యూనికేషన్ ఆఫీసర్ ఆఫ్ సెలక్షన్ కమిషన్ , అప్పర్ డివిజనల్ క్లర్క్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, టెలికాం అసిస్టెంట్ ఆఫ్ సెలక్షన్ కమిషన్, ఫ్యూమిగేషన్ అసిస్టెంట్ ఆఫ్ సెలక్షన్ కమిషన్, సరై్వలెన్స్ అసిస్టెంట్ ఆఫ్ సెలక్షన్ కమిషన్, ఫీల్డ్‌మెన్ ఆఫ్ సెలక్షన్ కమిషన్, అసిస్టెంట్ అడ్మిని్రస్టేటర్ అండ్ హెచ్ఆర్ సెలక్షన్ కమిషన్, అసిస్టెంట్ విలేజ్ ఇండస్ట్రీ అడ్మినిస్ట్రేటర్.8నిరాశ పడొద్దు.. ఓపికతో శ్రమిస్తే కొలువు మీదే! ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే నైపుణ్యంతో పాటు ఎంతో ఓపిక, సహనం అవసరం. మొదటి ప్రయత్నంలోనే విజయం రాలేదని ఏమాత్రం కుంగిపోకూడదు. ఓటమిని ఒక పాఠంగా మార్చుకుని, పట్టుదలతో మళ్లీ మళ్లీ ప్రయతి్నంచాలి. అప్పుడే లక్ష్యాన్ని సులభంగా చేరుకోగలం. ప్రతిరోజూ క్రమం తప్పకుండా 10 నుంచి 12 గంటల పాటు ప్రిపరేషన్‌కు కేటాయించాలి. కేవలం చదవడం మాత్రమే కాదు, అన్ని సబ్జెక్టులపై సంపూర్ణమైన అవగాహన, పట్టు సాధించాలి. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు కుటుంబం, ముఖ్యంగా తల్లిదండ్రుల నుంచి లభించే మానసిక మద్దతు, ప్రోత్సాహం ఎంతో కీలకం. – లొమడ నాగేంద్రసాయి -
ఎస్సీ గురుకులంలో కొత్త కొలువులకు మంగళం!
సాక్షి, హైదరాబాద్: గురుకుల ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగ అభ్యర్థులకు తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) భారీ షాక్ ఇచి్చంది. కీలక ఉద్యోగాల భర్తీని డైరెక్ట్ రిక్రూట్మెంట్ (డీఆర్–నేరుగా భర్తీ) కేటగిరీ నుంచి తొలగించింది. కేవలం పదోన్నతుల ద్వారానే వీటిని భర్తీ చేయాలని నిర్ణయించింది. అదేవిధంగా ఇతర పోస్టుల్లోనూ పదోన్నతుల కోటాను భారీగా పెంచేసింది. ఈ మేరకు గురుకుల ఉద్యోగాల భర్తీ నిబంధనలను సవరిస్తూ టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ తాజాగా స్టాండింగ్ ఆర్డర్స్ జారీ చేసింది. గత నెలలో జరిగిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ సమావేశంలో ఈ అంశాలపై చర్చించిన సభ్యులు ఆరు రకాల ఉద్యోగ కేటగిరీల్లో డీఆర్ కోటా తగ్గించేలా ఎజెండాలోని 19వ అంశాన్ని ఆమోదించా రు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను సొసైటీ తాజాగా విడుదల చేసింది. డీఆర్ నుంచి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్, గ్రేడ్–2 ప్రిన్సిపల్ తొలగింపు గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాలు దాదాపు అన్నింటినీ నిర్దేశించిన కోటా మేరకు డీఆర్ పద్ధతిలో భర్తీ చేస్తున్నారు. తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) 2018లో ఏర్పాటు కాగా.. అప్పట్లోనే కొన్ని ఉద్యోగ కేటగిరీల్లో డీఆర్ కోటా తగ్గించారు. అది తీవ్ర వివాదాస్పదంగా మారింది. కానీ ఆ తర్వాత ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు వెలువడడంతో అభ్యర్థులు వాటికి సన్నద్ధమయ్యారు. అయితే తాజాగా డీఆర్ కేటగిరీ నుంచి కొన్ని కేటగిరీలను ఎస్సీ గురుకుల సొసైటీ తొలగించింది.డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ పోస్టులతో పాటు గ్రేడ్–2 ప్రిన్సిపల్ పోస్టులను డీఆర్ నుంచి తప్పించింది. గతంలో డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ పోస్టులను 30 శాతం పదోన్నతులు, 70 శాతం డీఆర్ పద్ధతిలో భర్తీ చేస్తుండగా.. తాజాగా 100 శాతం పదోన్నతుల ద్వారానే భర్తీ చేయనున్నారు. అదేవిధంగా గ్రేడ్–2 ప్రిన్సిపల్ పోస్టులను 70 శాతం పదోన్నతులు, 30 శాతం డీఆర్ పద్ధతిలో భర్తీ చేస్తుండగా... ఇప్పుడు వీటిని కూడా 100 శాతం పదోన్నతుల ద్వారానే భర్తీ చేయనున్నారు. మిగతా పోస్టుల భర్తీ ఇలా.. » డిగ్రీ లెక్చరర్ (డీఎల్) పోస్టులను ఇప్పటివరకు 30 శాతం పదోన్నతులు, 70 శాతం డీఆర్ ద్వారా భర్తీ చేస్తుండగా... ఇకపై 70 శాతం పదోన్నతులు, 30 శాతం డీఆర్ ద్వారా భర్తీ చేస్తారు. » జూనియర్ లెక్చరర్ (జేఎల్) పోస్టులను ఇప్పటివరకు 50 శాతం పదోన్నతులు, 50 శాతం డీఆర్ ద్వారా భర్తీ చేస్తుండగా... ఇకపై 70 శాతం పదోన్నతులు, 30 శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనున్నారు. » పోస్ట్రుగాడ్యుయేట్ టీచర్ (పీజీటీ), ఫిజికల్ డైరెక్టర్ గ్రేడ్–2 పోస్టులు గతంలో 50:50 నిష్పత్తిలో భర్తీ చేస్తుండగా... ఇకపై 70 శాతం ప్రమోషన్లు, 30 శాతం డీఆర్ పద్దతిలో భర్తీ చేస్తారు. » డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ పోస్టులను డిగ్రీ లెక్చరర్ల సీనియార్టీ జాబితా ఆధారంగా పదోన్నతులు కల్పించి భర్తీ చేస్తారు. » డిగ్రీ లెక్చరర్ పోస్టులకు జూనియర్ లెక్చరర్ సీనియార్టీ జాబితా ఆధారంగా పదోన్నతులు కల్పిస్తారు. జూనియర్ లెక్చరర్ పోస్టుల్లో పీజీటీ సీనియార్టీ జాబితాను పరిగణించి పదోన్నతి ఇస్తారు. అదేవిధంగా పీజీటీ పోస్టులను టీజీటీ సీనియార్టీ జాబితా ఆధారంగా, ఫిజికల్ డైరెక్టర్ గ్రేడ్–2 పోస్టులను పీఈటీ సీనియార్టీ ఆధారంగా పదోన్నతి కల్పిస్తారు. అందరూ పాటిస్తే నియామకాల్లో భారీ కోత సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీలు పలు అంశాలు, నిబంధనల్లో ఎస్సీ గురుకుల సొసైటీని అనుసరిస్తాయి. అత్యధిక విద్యా సంస్థలతో ముందు వరుసలో ఉండి ఎన్నో సంస్కరణలకు కీలకంగా పనిచేసిన ఎస్సీ గురుకుల సొసైటీ.. తాజాగా సర్వీసు నిబంధనల్లో మార్పులు చేసి తీవ్ర గందరగోళానికి గురిచేసిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవే నిబంధనలను ఇతర గురుకుల సొసైటీలు అనుసరిస్తే డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఉద్యోగాల సంఖ్య భారీగా తగ్గిపోతుందని అంటున్నారు. ప్రస్తుతం గురుకుల సొసైటీల్లో దాదాపు 10 వేల ఖాళీలు ఉన్నట్లు అంచనా కాగా, ఎస్సీ గురుకుల సొసైటీ నిబంధనలు ఎస్టీ, బీసీ, మైనార్టీ, జనరల్ గురుకుల సొసైటీలు కూడా అన్వయించుకుంటే దాదాపు 6 వేల ఉద్యోగాలు డీఆర్ కేటగిరీ నుంచి తొలగిపోయే అవకాశం ఉన్నట్లు సొసైటీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
రూ.23 లక్షల కోట్లు కాదు.. వచ్చింది రూ.6,962 కోట్లే
సాక్షి, అమరావతి, సాక్షి, న్యూఢిల్లీ: ఎక్కడ రూ.23 లక్షల కోట్లు..? ఎక్కడ రూ.6 వేల కోట్లు..? ఎక్కడైనా పొంతన ఉందా? పోనీ అవైనా పూర్తిగా వచ్చాయా అంటే అదీ లేదు! ‘‘రెండేళ్లలో రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చేశాయ్.. 25 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చేశాం.. దేశవ్యాప్తంగా వచ్చిన పెట్టుబడుల్లో 25 శాతం ఒక్క ఆంధ్రప్రదేశ్‌కే వచ్చేశాయ్..!’’ సీఎం చంద్రబాబు పదేపదే చెప్పే గొప్పలివీ! రెండు నెలల క్రితం ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడూ సేమ్ టూ సేమ్ బిల్డప్‌లు!! కానీ చంద్రబాబు సర్కారు చేసుకుంటున్న ప్రచారంలో డొల్లతనాన్ని పార్లమెంటు సాక్షిగా కేంద్ర ప్రభుత్వం బట్టబయలు చేసింది. ఇందులో అణువంతైనా నిజం లేదని కుండబద్ధలు కొట్టింది. దావోస్‌లో మీటింగ్‌లు.. పెట్టుబడుల ఆకర్షణ పేరుతో విదేశీ పర్యటనలు.. సింగపూర్ యాత్రలు.. విశాఖ వేదికగా సీఐఐ పెట్టుబడుల సమావేశం.. రూ.లక్షల కోట్ల పెట్టుబడులు.. అంటూ ప్రతి 15 రోజులకు ఒకసారి ఎస్ఐపీబీ ద్వారా చేసుకుంటున్న బూటకపు ప్రచారాలకు కేంద్ర ప్రభుత్వం తెర దించింది. లోక్‌సభ సాక్షిగా పెట్టుబడులపై వాస్తవ గణాంకాలను వెల్లడించింది. గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్‌కు కేవలం రూ.6,962 కోట్ల విలువైన 10 ప్రాజెక్టులు మాత్రమే వచ్చినట్లు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ స్పష్టం చేసింది. డీపీఐఐటీ, ఇన్వెస్ట్ ఇండియా లెక్కల ప్రకారం గత రెండేళ్లలో ఏపీకి మొత్తం పది ప్రాజెక్టులు రాగా అందులో కేవలం రెండు మాత్రమే నిర్మాణం పూర్తి చేసుకున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. మిగిలిన 8 ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నట్లు పేర్కొంది. ఈమేరకు వైఎస్సార్సీపీ లోక్‌సభా పక్షనేత పీవీ మిథున్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద మంగళవారం లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. ఇంకా ప్రతిపాదనలు, నిర్మాణాలు, అంచనాల దశలోనే.. గత రెండేళ్లలో ఏపీకి వచ్చిన ప్రాజెక్టుల మొత్తం పెట్టుబడి విలువ రూ.6,962 కోట్లని, వీటి ద్వారా సుమారు 22,167 ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని కేంద్రం పేర్కొంది. అయితే ఇవి ఇప్పటికే కల్పించిన ఉద్యోగాలు కావు. ఆ ప్రాజెక్టులు పూర్తయి, కార్యకలాపాలు ప్రారంభమైన తర్వాత వస్తాయని అంచనా వేసిన ఉద్యోగాలు మాత్రమే. వాస్తవంగా ఇప్పటివరకు ఎంత పెట్టుబడి వచ్చింది? ఎన్ని పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయి? ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు? అనే వివరాలను కేంద్రం తన సమాధానంలో వెల్లడించలేదు. వాస్తవాలు ఇలా ఉంటే.. రాష్ట్రంలోకి పెట్టుబడుల ప్రవాహం, లక్షలాది మందికి ఉద్యోగాలు ఇచ్చేశాం కాబట్టి ఎన్నికల హామీల్లో పేర్కొన్న నిరుద్యోగ భృతి ఇక ఇవ్వాల్సిన అవసరం లేదంటూ చంద్రబాబు సర్కారు నమ్మబలుకుతోంది. మొత్తంగా చంద్రబాబు సర్కారు చేస్తున్న భారీ పెట్టుబడులు, లక్షల ఉద్యోగాల ప్రచారానికి.. లోక్‌సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన వాస్తవ లెక్కలకు మధ్య భారీ వ్యత్యాసం ఉన్నట్లు స్పష్టమైంది. రెండేళ్లలో పూర్తయినవి రెండంటే రెండు పరిశ్రమల నిర్మాణాలు మాత్రమే కాగా మిగిలిన పెట్టుబడులు, ఉద్యోగాలన్నీ ఇంకా ప్రతిపాదనలు, నిర్మాణాలు, అంచనాల దశలోనే ఉన్నాయని కేంద్రం సమాధానంలో వెల్లడైంది.వైఎస్ జగన్ హయాంలో వచ్చినవే.. ఆంధ్రప్రదేశ్ మీదుగా వెళ్లే మూడు పారిశ్రామిక కారిడార్లలో కృష్ణపట్నం, ఓర్వకల్లు, కొప్పర్తిలను మేకిన్ ఇండియాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ నిధులతో ప్రపంచస్థాయి మౌలిక వసతులను కల్పిస్తున్నట్లు జితిన్ ప్రసాద తన సమాధానంలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మూడు బల్క్ డ్రగ్ పార్కుల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్ దక్కించుకుందని, ఎలక్ట్రానిక్స్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఈఎంసీ 2.0 కింద రాష్ట్రంలో పలు ప్రాజెక్టులు వచ్చాయని చెప్పారు. అయితే ఇవన్నీ మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో వచ్చినవే కావడం గమనార్హం. ఓర్వకల్లు వద్ద దేశంలో తొలి డ్రోన్ సిటీని అభివృద్ధి చేస్తున్నామని, దీని ద్వారా 40,000 ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. -
రూ.35 లక్షల జాబ్ ఆఫర్.. చివరికి రూ.6.5 లక్షలు!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా దూసుకెళ్తోంది. దాదాపు అన్ని రంగాల్లోనూ ఏఐ వల్ల పనులు సులభతరం అవుతున్నాయి. ఇలాంటి సమయంలో ఉద్యోగాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందనే ఆందోళన కూడా పెరుగుతోంది. తాజాగా ఓ యువ సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఎదుర్కొన్న అనుభవం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది.టైర్ 1.5 కాలేజీ నుంచి కొత్తగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఒక గ్రాడ్యుయేట్, క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా ఓ ప్రముఖ కంపెనీలో ఆరు నెలల ఇంటర్న్‌షిప్‌కు ఎంపికయ్యాడు. ఈ ఇంటర్న్‌షిప్‌లో మంచి పనితీరు కనబరిస్తే రూ.35 లక్షల వార్షిక ప్యాకేజీతో (35 LPA) ప్రీ-ప్లేస్మెంట్ ఆఫర్ (PPO) ఇస్తామని కంపెనీ తెలిపింది.మంచి ప్యాకేజీతో అవకాశం రావడంతో ఆ విద్యార్థి ఎంతో ఆశతో ఇంటర్న్‌షిప్ ప్రారంభించాడు. తన పూర్తి సామర్థ్యంతో పనిచేశానని, మేనేజర్ నుంచి కూడా మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చిందని అతను చెప్పాడు. అంతేకాకుండా, తనకు తప్పకుండా ప్లేస్మెంట్ ఆఫర్ వస్తుందని మేనేజర్ కూడా నమ్మకం కల్పించారని వెల్లడించాడు. కానీ.. చివరి సమయంలో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.ఇంటర్న్‌షిప్ ముగియడానికి కేవలం రెండు రోజుల ముందు కంపెనీ మొత్తం 90 మంది ఇంటర్న్‌లకు రిజెక్షన్ మెయిల్స్ పంపించింది. దీంతో రూ.35 లక్షల ఉద్యోగం వస్తుందని కలలు కన్న విద్యార్థుల ఆశలు ఒక్కసారిగా కూలిపోయాయి. ఆ కంపెనీ సాఫ్ట్వేర్ డెవలపర్ల స్థానంలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించేందుకు ఎక్కువగా పెట్టుబడులు పెట్టడం వల్లే ఈ నిర్ణయం తీసుకుందని ఆ టెక్కీ పేర్కొన్నాడు.ప్రస్తుతం తన చేతిలో ఉన్న ఏకైక అవకాశం క్యాంపస్ ప్లేస్మెంట్ ద్వారా వచ్చిన రూ.6.5 లక్షల ప్యాకేజీ మాత్రమేనని తెలిపాడు. కొత్త ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఫ్రెషర్లకు ఇంటర్వ్యూ అవకాశాలు కూడా రావడం లేదని తన బాధను వ్యక్తం చేశాడు.ఈ సంఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది నెటిజన్లు ఆ యువకుడికి మద్దతుగా నిలిచారు. ప్రస్తుతం ఉన్న ఉద్యోగ అవకాశాన్ని స్వీకరించి, అనుభవం సంపాదించిన తర్వాత మెరుగైన అవకాశాల కోసం ప్రయత్నించాలని కొందరు సూచించారు. మొదటి ఉద్యోగం ఎంత పెద్ద ప్యాకేజీతో వచ్చిందన్నది కాకుండా.. అక్కడ నేర్చుకునే విషయాలు కూడా కెరీర్లో కీలకమని కొందరు అభిప్రాయపడ్డారు. అయితే.. మరికొందరు మాత్రం కంపెనీ తీరును తప్పుబట్టారు. రూ.35 లక్షల ఆఫర్ పేరుతో ఇంటర్న్‌ల నుంచి ఎక్కువ కష్టపడేలా చేసి, చివరికి ఆఫర్‌ను వెనక్కి తీసుకోవడం సరైన విధానం కాదని అన్నారు. ఇలాంటి నిర్ణయాలు యువ ఉద్యోగుల నమ్మకాన్ని దెబ్బతీస్తాయని అభిప్రాయపడ్డారు.ఏఐ వల్ల ఉద్యోగుల ఎంత ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందో.. అనే విషయాన్ని ఈ సంఘటన కళ్లకు కట్టినట్లు చూపిస్తోంది. కొత్త అవకాశాలు వస్తున్నప్పటికీ, కొన్ని సంప్రదాయ ఉద్యోగాలపై ఏఐ ప్రభావం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి విద్యార్థులు, ఉద్యోగార్థులు కేవలం ఒకే నైపుణ్యంపై మాత్రమే ఆధారపడకుండా, ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలను నేర్చుకుంటూ తమను తాము అభివృద్ధి చేసుకోవడం చాలా అవసరం అని చెబుతున్నారు. -
ఏపీ ఉద్యోగులకు మరో ఎదురుదెబ్బ..?
-
చేతకానోడివి హామీలేందుకు ఇచ్చావ్.. చంద్రబాబు పై ఉద్యోగుల ఆగ్రహం
-
యువతకు అలర్ట్.. రాబర్ట్ కియోసాకి పోస్ట్!
బంగారం, వెండి, బిట్‌కాయిన్ గురించి చెప్పే 'రాబర్ట్ కియోసాకి' (Robert Kiyosaki) ఏఐ గురించి, ఉద్యోగాల గురించి వివరించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఎంత వేగంగా అభివృద్ధి చెందుతోందో.. దాని ప్రభావం ఉద్యోగాలపై కూడా అంతే వేగంగా కనిపిస్తోంది. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు ఏఐ టెక్నాలజీని తమ పనుల్లో ఉపయోగించడం మొదలెట్టేశాయి. దీన్నిబట్టి చూస్తే రాబోయే రోజుల్లో ఉద్యోగాలు గణనీయంగా తగ్గుతాయని నిపుణులు పేర్కొన్నారు. అమెరికా మాజీ వాణిజ్య శాఖ మంత్రి కూడా ఇదే విషయాన్ని వెల్లడించిందని కియోసాకి పేర్కొన్నారు.అమెరికా మాజీ వాణిజ్య శాఖ మంత్రి అభిప్రాయం ప్రకారం.. 25 నుంచి 35 ఏళ్ల మధ్య వయసున్న యువ ఉద్యోగులు రాబోయే కాలంలో ఏఐ ప్రభావానికి గుయారవుతారు. నిరుద్యోగం బాగా పెరిగిపోతుంది. అడ్మినిస్ట్రేటివ్, ఫైనాన్స్, డేటా విశ్లేషణ వంటివన్నీ కూడా ఏఐ చేతుల్లోకి వెళ్లిపోయే అవకాశం ఉంది. అనేక కంపెనీల సీఈఓలు కూడా ఈ మార్పుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.అమెరికా వద్ద ఏఐ అభివృద్ధికి కావలసిన స్పష్టమైన వ్యూహం ఉన్నప్పటికీ.. ఈ మార్పుల వల్ల ప్రభావితమయ్యే ఉద్యోగులను ఎలా సిద్ధం చేయాలనే దానికి కావాల్సిన ప్రణాళిక లేదని పేర్కొన్నారు. కాబట్టి యువత ఉద్యోగాల కోసం ప్రభుత్వాలు లేదా ఇతర కంపెనీల మీద ఆధారపడకుండా.. తమ భవిష్యత్తును తామే సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.జాబ్ చేస్తున్నవారు సైతం కేవలం ఒక ఉద్యోగంపై మాత్రమే ఆధారపడకుండా.. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం, ఏఐతో ఎలా కలిసి పనిచేయాలి అనే విషయాలను నేర్చుకోవాలి. అవసరమైతే సొంతంగా కొత్త ఆదాయ మార్గాలను అన్వేషించడం ముఖ్యమని చెబుతున్నారు. మొత్తం మీద ఏఐ ఉద్యోగాలకు ముప్పు తెస్తుందని స్పష్టంగా తెలుస్తోంది. -
బెంగళూరులో ‘టెక్కీ గణేశుడు’.. ఐటీ ఉద్యోగుల క్యూ!
దేశ ఐటీ రాజధానిగా పేరొందిన బెంగళూరులోని కోరమంగళలో ఉన్న శ్రీ ప్రసన్న గణపతి ఆలయం మరోసారి వార్తల్లో నిలిచింది. సోషల్ మీడియాలో ఈ ఆలయం ‘టెక్కీ గణేశుడు’ (Techie Ganesha)గా వైరల్ కావడంతో ఉద్యోగాలు, ప్రమోషన్లు, మంచి అప్రైజల్స్ కోసం ఐటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో ఆలయాన్ని సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో ఆలయంపై సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది.1979లో నిర్మించిన ఈ ఆలయం మొదట స్థానిక భక్తులకు ఆధ్యాత్మిక కేంద్రంగా ఉండేది. అయితే బెంగళూరు ఐటీ హబ్‌గా ఎదిగిన తర్వాత కోరమంగళ, హెచ్ఎస్ఆర్ లేఅవుట్, సర్జాపూర్, ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్ పరిసరాల్లో పనిచేసే సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇక్కడికి అధిక సంఖ్యలో రావడం ప్రారంభించారు. ఉద్యోగ మార్పు, జీతం పెంపు, ప్రమోషన్, కొత్త అవకాశాల కోసం గణపతిని దర్శించుకుంటే శుభఫలితాలు వస్తాయని చాలామంది విశ్వసిస్తుండటంతో ఈ ఆలయానికి ‘టెక్కీ గణేశుడు’ అనే పేరు ప్రాచుర్యం పొందింది.ఇటీవల బెంగళూరుకు చెందిన ఓ స్థానిక వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన రీల్‌తో ఈ ఆలయం మళ్లీ చర్చనీయాంశమైంది. ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే ఈ ఆలయం సోషల్ మీడియా ప్రచారం వల్ల ఇప్పుడు నిరంతరం రద్దీగా మారిందని ఆయన అభిప్రాయపడ్డారు. రీల్స్, వైరల్ పోస్టుల కారణంగా ఆలయ ప్రశాంతత దెబ్బతిందని, స్థానికులు ఎన్నాళ్లుగానో చూసిన వాతావరణం మారిపోయిందని పేర్కొన్నారు.అయితే నెటిజన్ల అభిప్రాయాలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. "దేవాలయానికి ఎక్కువ మంది రావడం మంచి విషయమే", "ప్రజలకు నమ్మకం ఉంటే వెళ్లనివ్వాలి", "భక్తిని ప్రశ్నించాల్సిన అవసరం లేదు" అని కొందరు వ్యాఖ్యానించగా, మరికొందరు మాత్రం "సోషల్ మీడియా హైప్ వల్ల ఆధ్యాత్మిక క్షేత్రాలు కూడా ట్రెండ్‌లుగా మారుతున్నాయి" అని అభిప్రాయపడ్డారు. మరో వినియోగదారు హైదరాబాద్‌లోని ‘వీసా బాలాజీ’గా ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ ఆలయాన్ని ఉదాహరణగా ప్రస్తావిస్తూ, ప్రత్యేక కోరికల కోసం ప్రసిద్ధి చెందిన ఆలయాలు దేశవ్యాప్తంగా ఉన్నాయని గుర్తు చేశారు. View this post on Instagram A post shared by RoadXRumble (@roadxrumble) -
రూ.2.3 కోట్ల జాబ్.. అందుకే వదిలేశాడు!
చదువు పూర్తయ్యాక మంచి ప్యాకేజీతో జాబ్ వస్తే ఎవరు మాత్రం వద్దనుకుంటారు. కానీ ఐఐటీ బాంబే నుంచి కంప్యూటర్ సైన్స్‌లో గోల్డ్ మెడల్ సాధించిన వివేక్ శర్మ అనే యువకుడు, అమెరికాలో లభించిన భారీ వేతన ఉద్యోగ అవకాశాన్ని తృణప్రాయంగా వదులుకున్నాడు. ఇంతకీ ఆ యువకుడు జాబ్ ఎందుకు వదులుకున్నాడు? దీనికి గల కారణాలు ఏమిటనేది ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.వివేక్‌కు శాన్ఫ్రాన్సిస్కోలోని ఒక స్టార్టప్ సంస్థ నుంచి సంవత్సరానికి దాదాపు 240000 డాలర్ల (సుమారు రూ.2.3 కోట్లు) వేతనంతో జాబ్ ఆఫర్ వచ్చింది. వీసా స్పాన్సర్షిప్, రీలొకేషన్ సౌకర్యాలు కూడా అందుబాటులో ఉండటంతో జీవితం ఉన్నత స్థాయికి చేరుకుంటుందని భావించాడు. అయితే.. అదే సమయంలో అతని తండ్రికి గుండెపోటు రావడం, తల్లి క్యాన్సర్‌తో బాధపడుతున్న పరిస్థితి ఏర్పడింది. ఈ క్లిష్ట పరిస్థితుల్లో కుటుంబాన్ని వదిలి విదేశాలకు వెళ్లడం కంటే తల్లిదండ్రుల పక్కన ఉండటం ముఖ్యమని భావించిన వివేక్, ఆ ఉద్యోగాన్ని వదులుకున్నాడు.Meet Vivek Sharma, a https://t.co/Ws1j7hoGgc Computer Science gold medalist from IIT Bombay, who left a $240,000-a-year (₹2.9 crore) US job to run a small grocery store beneath his house and take care of his parents by staying close to them.Coming from a simple… pic.twitter.com/7RwTepkL73— Vikas Alwys (@VikasAlwys) July 4, 2026జాబ్ వదులుకోవడంతో కుటుంబ ఆర్థిక పరిస్థితులు కఠినంగా మారడంతో, అతను తన ఇంటి కిందనే చిన్న కిరాణా దుకాణం ప్రారంభించాడు. ఈ వ్యాపారం ద్వారా కుటుంబ అవసరాలను తీర్చుకుంటూ, తల్లిదండ్రుల సంరక్షణను కొనసాగించాడు. ఐఐటీ బాంబే వంటి ప్రతిష్టాత్మక సంస్థలో చదివిన వ్యక్తి ఇలా సాధారణ వ్యాపారం చేయడం చాలామందిని ఆశ్చర్యానికి గురిచేసింది.పరిస్థితులు మెరుగుపడిన తర్వాత, వివేక్ తన పనిని విస్తరించాడు. దుకాణాన్ని నిర్వహించడంతో పాటు పేద పిల్లలకు కోడింగ్ బోధించడం, రాత్రిపూట ఫ్రీలాన్స్ సాఫ్ట్వేర్ ప్రాజెక్టులు చేయడం ప్రారంభించాడు. తన నైపుణ్యాన్ని సమాజ సేవకు ఉపయోగిస్తూ, కుటుంబ బాధ్యతలను కూడా నిర్వహించాడు.కొన్ని సంవత్సరాల తర్వాత అదే అమెరికన్ కంపెనీ మళ్లీ అతనిని సంప్రదించి, ఈసారి రిమోట్‌గా పని చేసే అవకాశం కల్పించినట్లు సమాచారం. దీంతో అతను తన స్వస్థలమైన కాన్పూర్‌లోనే ఉండి టెక్నాలజీ, బోధన, కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.ఇదీ చదవండి: జియో రూ.448 Vs ఎయిర్టెల్ రూ.469 ప్లాన్.. ఏది బెస్ట్? -
ఉద్యోగాలపై సైబర్ సెక్యూరిటీ దిగ్గజం నికేష్ అరోరా సంచలన వ్యాఖ్యలు
భారతీయ అమెరికన్ బిలియనీర్ సీఈఓ, సైబర్ సెక్యూరిటీ దిగ్గజం 'పాలో ఆల్టో నెట్వర్క్స్' (Palo Alto Networks) సీఈఓ నికేష్ అరోరా AI (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐ టెక్నాలజీ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, రాబోయే మూడేళ్లలో కార్పొరేట్ కంపెనీల్లోని కొన్ని కీలక విభాగాల్లో ఉద్యోగుల సంఖ్య సగానికి పడిపోయే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా మార్కెటింగ్, హెచ్ఆర్ (HR), ఫైనాన్స్ విభాగాలపై ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.అదే సమయంలో ఏఐ పరిజ్ఞానం ఉన్న ఉద్యోగులకు డిమాండ్ పెరుగుతోందని అన్నారు.సగానికిపైగా ఆ ఉద్యోగాలు మాయంఒక పాడ్‌కాస్ట్‌లో నికేష్ అరోరా మాట్లాడుతూ మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్ వంటి జనరల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ (G&A) విభాగాలలో ప్రాసెస్ మేనేజ్మెంట్ (నిర్వహణ ప్రక్రియలు) ఎక్కువగా ఉంటుందన్నారు. భవిష్యత్తులో రాబోయే అధునాతన ఏఐ అప్లికేషన్ల ద్వారా ఈ పనులను మరింత తెలివిగా, సులువుగా చేయవచ్చని పేర్కొన్నారు.ప్రస్తుతం కంపెనీలు వాడుతున్న సాస్ (SaaS - సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్) అప్లికేషన్లకు సొంత అభిప్రాయాలు ఉండవు. కానీ రాబోయే ఏఐ అప్లికేషన్లు స్వతంత్రంగా (Autonomous) వ్యవహరిస్తాయి. ఉదాహరణకు, ఒక మార్కెటింగ్ కాపీని చూసి అది బాగోలేదని చెప్తూ, బ్రాండ్‌కు తగినట్లుగా ఎలా మార్చాలో ఏఐ స్వయంగా సూచించగలదు. దీనివల్ల సగటు ఉద్యోగి మరింత స్మార్ట్‌గా పనిచేయగలుగుతాడు. ఫలితంగా, ఎక్కువ మంది ఉద్యోగుల అవసరం ఉండదు. ప్రస్తుతం తమ కంపెనీ మార్కెటింగ్ విభాగంలో ఉన్న 600 మంది సిబ్బందిని ఏఐ సహాయంతో సగానికి తగ్గించే యోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు.ఇదీ చదవండి: నాడు డెలివరీ బాయ్.. నేడు రెండు AI స్టార్టప్స్‌కు ఫౌండర్!డిమాండ్ ఉండే ఉద్యోగాలు ఏవి?ఏఐ యుగంలో కొన్ని ఉద్యోగాలు కోల్పోయినప్పటికీ, టెక్నికల్ , సేల్స్ లాంటి మరికొన్ని విభాగాలకు డిమాండ్ పెరుగుతుందని కూడా అరోరా చెప్పుకొచ్చారు. కంపెనీ ప్రొడక్ట్స్ చాలా బాగున్నప్పుడు, వాటిని ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మందికి చేరవేయడానికి సేల్స్, టెక్నికల్ సిబ్బంది అవసరం పెరుగుతుందన్నారు. అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ను సమర్థవంతంగా ఉపయోగించగలిగే (AI Savvy) ఉద్యోగులకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంటుంది.ఇదీ చదవండి: రూ. 10 లక్షలకు ముంచేశారు, రోజంతా స్టేషన్లోనే : నటి ఆవేదనఉద్యోగులకు హెచ్చరికప్రస్తుతం కార్పొరేట్ సంస్థల్లోని 90శాతం మంది ఉద్యోగులకు AIపై సరైన అవగాహన/పరిజ్ఞానం లేకపోవడమే అతిపెద్ద సవాలని నికేష్ అరోరా అభిప్రాయపడ్డారు. ఇది డార్విన్ సిద్ధాంతం లాంటి సమయం. ఇక్కడ ఎవరు అత్యుత్తమంగా రాణిస్తారో వారే నిలబడతారు. కాబట్టి ఉద్యోగులు స్వయంగా ఏఐ సాంకేతికతను నేర్చుకుని అప్డేట్ అవ్వాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: రూ. 10 లక్షలకు ముంచేశారు, రోజంతా స్టేషన్లోనే : నటి ఆవేదనఒకప్పుడు గూగుల్ సంస్థలో అత్యధిక జీతం తీసుకునే ఉద్యోగిగా రికార్డు సృష్టించిన నికేష్ అరోరా, ఐఐటీ (BHU) వారణాసి పూర్వ విద్యార్థి. ప్రస్తుతం ఆయన నేతృత్వం వహిస్తున్న పాలో ఆల్టో నెట్వర్క్స్ మార్కెట్ విలువ దాదాపు 287 బిలియన్ డాలర్లుగా ఉంది. కాగా గత రెండేళ్లుగా ఏఐ పునర్నిర్మాణం కారణంగా మెటా (Meta), అమెజాన్ (Amazon), ఒరాకిల్ (Oracle), కాగ్నిజెంట్ లాంటి వంటి దిగ్గజ సంస్థలు వేలాది మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే.ఇదీ చదవండి: అయోధ్యరాముడి విరాళాల గోల్మాల్ : స్పందించిన ఆర్ఎస్ఎస్ -
ఒకేసారి ముచ్చటగా మూడు ఉద్యోగాలు
పార్వతీపురం మన్యం: పట్టుదల, కృషి ఉంటే విజయాలు తప్పకుండా వరిస్తాయని నిరూపించింది నెల్లిమర్ల మండలంలోని మొయిద విజయరాంపురం గ్రామానికి చెందిన యువతి పతివాడ రమాదేవి. పోటీ పరీక్షలకు సిద్ధమైన ఆమె ఒకేసారి మూడు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగావకాశాలు సాధించి అందరి ప్రశంసలు అందుకుంటోంది. విజయనగరం మహారాజా కళాశాలలో బీఎస్సీ కంప్యూటర్స్ పూర్తి చేసిన రమాదేవి కొంతకాలంగా బ్యాంకింగ్ రంగ ఉద్యోగాలపై దృష్టి సారించి పోటీ పరీక్షలకు సిద్ధమైంది. ఇటీవల నిర్వహించిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, తెలంగాణ గ్రామీణ బ్యాంకు నియామక పరీక్షల్లో పాల్గొని మూడింటిలోనూ అర్హత సాధించింది. మూడు బ్యాంకుల్లో ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్లర్క్ ఉద్యోగంలో చేరాలని నిర్ణయించుకున్నట్లు రమాదేవి తెలిపింది. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన ఆమె అసాధారణ విజయం సాధించడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రమాదేవి తండ్రి వెంకటరమణ స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అసిస్టెంట్ సర్వేయర్‌గా విధులు నిర్వహిస్తుండగా..తల్లి రమణమ్మ గృహిణి..కుమార్తె సాధించిన విజయం తమకు గర్వంగా ఉందని వారు సంతోషం వెలిబుచ్చారు. యువతి రమాదేవి విజయం పట్ల ఎమ్మెల్సీ డాక్టర్ పెనుమత్స సూర్యనారాయణరాజు, గ్రామస్తులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేశారు. -
అక్కడ లేదు ఇక్కడ రాదు
సాక్షి, హైదరాబాద్: ఒరాకిల్, సిస్కో, మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి అమెరికాకు చెందిన ప్రముఖ టెక్నాలజీ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున ఉద్యోగులను ఇంటికి సాగనంపాయి. వీరిలో భారతీయులూ ఉన్నారు. పరాయి గడ్డ మీద దిగ్గజ కంపెనీల్లో పనిచేసి ఉపాధి కోల్పోయిన వీరు భారత్‌లో తిరిగి ఉద్యోగాలు పొందడానికి కష్టపడుతున్నారు. మంచి అనుభవం, అంతర్జా తీయ ప్రాజెక్ట్ ఎక్స్పోజర్, ఆధునిక సాంకేతిక నైపుణ్యాలున్నా కూడా చాలామంది తిరిగి వచ్చిన వెంటనే స్థిరమైన ఉద్యోగం పొందలేకపోతు న్నారు. ప్రపంచంలోనే అతిపెద్దదైన, 280 బిలియన్ డాలర్ల ఔట్సోర్సింగ్ పరిశ్రమలో మునుపెన్నడూ లేని మందగమనాన్ని ఇది ప్రతిబింబిస్తోంది.అక్కడేమో ఏడాదికి రూ. కోటిప్రత్యేక స్టాఫింగ్ సంస్థ ఎక్స్‌ఫెనో గణాంకాల ప్రకారం 2026లో ఇప్పటివరకు సుమారు 7,300 మంది అమెరికా నుంచి భారత్‌కు తిరిగి వచ్చారు. ఈ సంఖ్య 2025లో 15,100, అంతక్రితం సంవత్సరంలో 9,700గా ఉందని అంచనా. అంటే రెండున్నరేళ్లలో 32 వేల మందికిపైగా ఇంటిబాట పట్టారు. ఇప్పటికే దేశీయ జాబ్ మార్కెట్లో అవకాశాలు పరిమితంగా ఉన్నాయి. యూఎస్‌లో వీరు అధిక వేతనాలను అందుకున్నారు. రూ. కోటికిపైగా వార్షిక వేతనం అందుకున్నవాళ్లే అత్యధికం. ఇక్కడా అదే స్థాయి వేతనాలను వీరు ఆశిస్తున్నారు. దీంతో భారత్‌కు తిరిగివచ్చిన టెకీలకు ఉద్యోగాలు దొరకడం లేదు. కంపెనీలు నియామకాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తుండటంతో జూన్‌లో ఇది 28 నెలల కనిష్ట స్థాయికి చేరుకుంది. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో అవకాశాలున్నా.. అధిక ప్యాకేజీ డిమాండ్ చేస్తుండటంతో వీరి నియామకాలు ఆలస్యం అవుతున్నాయి. అమెరికాలో పనిచేసిన అనుభవంతో తిరిగి వచ్చే అభ్యర్థులు అక్కడి స్థాయికి దగ్గరగా జీతం కోరుతున్నారు. కానీ మన దేశంలోని సంస్థలు, ముఖ్యంగా స్టార్టప్స్, మధ్యస్థాయి కంపెనీలు అంతటి ప్యాకేజీలను ఇవ్వడానికి సిద్ధంగా లేకపోవడం సమస్యను పెంచుతోంది. ఒకవైపు అమెరికా నుంచి తిరిగివస్తున్న నిపుణులు.. మరోవైపు స్థానికంగా కొత్తగా ఉద్యోగాలు వెతుకుతున్న యువ టెకీలు.. ఈ రెండు వర్గాలకు సరిపడే వేగంతో నియామకాలు జరగడం లేదు.ఉద్యోగ సంక్షోభంఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా 204 టెక్ కంపెనీలు 1,21,516 మంది నిపుణులను తొలగించాయి. వీటిలో ఒక్క అమెరికాకు చెందిన మెటా, అమెజాన్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలలో లక్ష కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్నారు. వీరిలో ఎంతమంది హెచ్–1బీ వంటి నైపుణ్యం కలిగిన కార్మిక వీసాలపై ఉన్నారనేది స్పష్టత లేదు. నియామకాల్లో ఏఐ భారీ మార్పును సృష్టిస్తున్న సమయంలోనే ఈ ఉద్యోగ సంక్షోభం ఏర్పడింది. తిరిగి రావాలనుకునే హెచ్–1బీ కార్మికులకు సహాయపడే ఎక్స్‌హెచ్1బీ ప్లాట్ఫామ్లో ఐదు నెలల్లో 500–600 మంది సైన్ అప్ చేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తిరిగి వచ్చిన వారికి ఉద్యోగం కనుగొనడం మునుపటి కంటే చాలా కష్టంగా మారిందని స్టాఫింగ్ కంపెనీలు చెబుతున్నాయి. ‘చాలామంది అధిక వేతన శ్రేణిలో వస్తారు. ఇక్కడి వారితో సమానమైన నైపుణ్యాలను కలిగి ఉన్నారు. కాబట్టి ఉద్యోగం పొందడానికి నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాల్సిందే’ అని టీమ్‌లీజ్ తెలిపింది.ఫ్రాక్షనల్ సీఎక్స్ఓలకు...కొన్ని జీసీసీలు, స్టార్టప్స్ అనుభవజ్ఞులైన టాలెంట్‌ను తీసుకుంటున్నాయి. ముఖ్యంగా ప్రొడక్ట్ మేనేజ్మెంట్, డేటా, క్లౌడ్, ఏఐ, సైబర్‌సెక్యూరిటీ వంటి ప్రత్యేక నైపుణ్యాలున్న వారికి అవకాశాలు కొంత మెరుగ్గా ఉన్నాయి. అయితే అవి ఎక్కువగా సీనియర్ ప్రొఫెషనల్స్‌కే పరిమితం అవుతున్నాయి. అందుకే అమెరికా నుంచి వచ్చిన అనేకమంది టెకీలు కంపెనీలకు ‘ఓవర్ క్వాలిఫైడ్’గా కనిపిస్తున్నారు. అయితే నిర్దిష్ట రంగంలో ఒక దశాబ్దం లేదా అంతకంటే ఎక్కువ కాలం పని చేసిన వారికి జీసీసీల నుండి డిమాండ్ ఉంటోంది. ప్రాడక్ట్ కంపెనీల్లో పనిచేసిన అమెరికా రిటర్నీలకు ప్రాధాన్యత ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. స్టార్టప్‌లు, జీసీసీలలో హెచ్ఆర్, ఫైనాన్స్, మార్కెటింగ్, టెక్ విభాగాలలో తక్షణమే లీడర్షిప్ రోల్స్‌లో ఉద్యోగులు అవసరమైనందున ఫ్రాక్షనల్ సీఎక్స్ఓలకు డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. 2020 నుంచి పోలిస్తే ఫ్రాక్షనల్ సీఎక్స్ఓ రోల్స్ మూడు రెట్లు పెరిగాయని ‘టీమ్‌లీజ్’ చెబుతోంది. అదేస్థాయి నైపుణ్యం కోసం ఒకరిని పూర్తి సమయం నియమించుకోవడంతో పోలిస్తే ఇలాంటి రోల్స్‌తో కంపెనీలు సాధారణంగా 40–60 శాతం ఆదా చేస్తున్నాయి. పైగా ఈ రోల్స్‌ను చేపట్టడానికి సిద్ధంగా ఉన్న అనుభవజ్ఞులైన నిపుణుల కొరత ఉందని పరిశ్రమ చెబుతోంది. -
డీఏ పెంపు, లక్ష ఉద్యోగాలు : బెంగాల్లో బీజేపీ తొలి బడ్జెట్లో వరాల జల్లు
కోలకతా, సాక్షి: పశ్చిమ బెంగాల్లో బీజేపీ సర్కార్ తొలిసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. బెంగాల్ ప్రజలను ఆకట్టుకునేదిశగా లక్ష ఉద్యోగాలు, ఇందులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్,ఉద్యోగులకు డీఏ పెంపు లాంటి అనేక జనాకర్షక తాయిలాలను ప్రకటించింది. పశ్చిమ బెంగాల్ ఆర్థిక మంత్రి స్వపన్ దాస్‌గుప్తా సోమవారం ముఖ్యమంత్రి సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వపు మొట్టమొదటి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రాష్ట్ర రుణ భారాన్ని తగ్గించడం, ఆదాయ వసూళ్లను పెంచడం, మౌలిక సదుపాయాల ఆధారిత వృద్ధిని వేగవంతం చేయడంపై దృష్టి సారిస్తూ, ప్రభుత్వ ఆర్థిక ప్రాధాన్యతలను ఆయన వివరించారు."వికసిత్ భారత్" విజన్కుఅనుగుణంగానే "వికసిత్ బంగ్లా"అభివృద్ధి ఎజెండా ఉంటుందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. మునుపటి ప్రభుత్వం నుండి తమకు రూ. 8.15 లక్షల కోట్ల అప్పు వారసత్వంగా వచ్చిందని, అయితే ప్రస్తుతమున్న అన్ని సామాజిక సంక్షేమ పథకాలను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు.బడ్జెట్లోని ముఖ్యాంశాలు:లక్ష ఉద్యోగాలు : ప్రభుత్వ రంగంలో లక్ష ఖాళీలను భర్తీ చేయనున్నామనే ప్రకటన ప్రధానంగా నిలిచింది. ఇందులో 33 శాతం సీట్లను మహిళలకు కేటాయించారు. పోలీస్ శాఖలో 20వేల పోస్టులు, విద్యాశాఖలో 50,000 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయోపరిమితిలో ప్రస్తుతం ఉన్న ఐదేళ్ల సడలింపును మరో రెండేళ్లపాటు పొడిగించారు.ప్రభుత్వ ఉద్యోగుల కరవు భత్యాన్ని (DA) అక్టోబర్ నుండి 20శాతం పెంచనున్నారు.ప్రభుత్వ మరియు ప్రభుత్వ సాయం పొందే పాఠశాలల్లో చదువుకునే బాలికలకు రూ. 50,000 స్కాలర్షిప్ అందజేస్తారు.అలాగే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని అందిస్తున్న రాష్ట్రాల్లో ఇపుడిక బెంగాల్ కూడా చేరిపోయింది. ఇందు కోసం రూ. 550 కోట్లు కేటాయించారు. దీని కోసం త్వరలోనే 'పింక్ కార్డ్' (Pink Card) పథకాన్ని ప్రారంభించనున్నారు.అన్నపూర్ణ యోజన పథకం కోసం రూ. 36,000 కోట్లు కేటాయించారు.పీఎం ఆవాస్ యోజన కింద బెంగాల్లో మరో 25 లక్షల మందికి పీఎం ఆవాస్ ఇళ్లను నిర్మించి ఇస్తారు.ఉపాధి హామీ పథకం (MGNREGA) పని దినాలను 100 రోజుల నుండి 125 రోజులకు పెంచారు.వలస కార్మికులకు ఆయుష్మాన్ భారత్: వలస కూలీల కోసం ఆయుష్మాన్ భారత్ కార్డులను అందజేస్తారు. గిగ్ కార్మికుల (Gig workers) కోసం సంక్షేమ బోర్డును ప్రతిపాదించారు.కోల్‌కతా సమీపంలో సరికొత్త 'గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయం' (Greenfield airport) ఏర్పాటు కానుంది.ఎమ్మెల్యే నిధుల పెంపు: ఎమ్మెల్యే అభివృద్ధి నిధులను రూ. 70 లక్షల నుండి రూ. 1 కోటికి పెంచారు.AI మిషన్ ప్రారంభం, భూమి రికార్డుల డిజిటలైజేషన్, మైనింగ్ కార్యకలాపాల కోసం కేంద్రీకృత వేలం విధానంసివిక్ వాలంటీర్ల సంఖ్యలో 2000 పెంపు, గిరిజన విశ్వవిద్యాలయ ఏర్పాటు, కండక్టర్లకు వేతనం పెంపు రిటైర్డ్ జర్నలిస్టులకు రూ. 5,000 నెలవారీ పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించినట్టు ఆర్థికమంత్రి వెల్లడించారు. దీంతోపాటు రాజకీయ కారణాలతో జైలులో ఉన్న వారికి నెలకు రూ.10,000 అందించనున్నారు. సాంప్రదాయ బెంగాలీ చాపలు , జనపనారతో తయారు చేసిన ఫైల్లో ఈ బడ్జెట్‌ను తీసుకురావడం మరో విశేషం. ఇదీ చదవండి: అమెరికాలో తెలంగాణా విద్యార్థి అరుణ్ సాయి రెడ్డి హఠాన్మరణం -
జాబ్ కోసం పోతే.. షాకింగ్ అనుభవం!
జాబ్ మార్కెట్ కరోనా మహమ్మారి తర్వాత ఎన్నడూ లేనంత క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న అభ్యర్థులు వరుస తిరస్కరణలు, ఇంటర్వ్యూల తర్వాత స్పందన లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పూణేకు చెందిన ప్రణవ్ అనే యువకుడు ఎదుర్కొన్న అనుభవం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.ఉద్యోగం కోసం నిర్వహించిన వాక్-ఇన్ ఇంటర్వ్యూకు హాజరైన ప్రణవ్‌కు అక్కడ అనూహ్యమైన పరిస్థితి ఎదురైంది. సాధారణంగా ఇంటర్వ్యూల్లో అభ్యర్థి నైపుణ్యాలు, ప్రాజెక్టులు, అనుభవం గురించి ప్రశ్నలు అడుగుతారు. కానీ ఈ సంస్థలో హెచ్ఆర్ ప్రతినిధి మొదట అడిగిన ప్రశ్న మాత్రం అతడిని ఆశ్చర్యానికి గురి చేసింది. ''మీరు వచ్చే 6 నుంచి 8 నెలల వరకు జీతం లేకుండా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారా? ఆ తర్వాత మీ పనితీరు బాగుంటే జీతం ఇవ్వాలా వద్దా నిర్ణయిస్తాం'' అని అడిగినట్లు ప్రణవ్ వెల్లడించాడు.ఈ మాటలు విన్నప్పుడు వారు సరదాగా మాట్లాడుతున్నారని మొదట భావించినట్లు ప్రణవ్ చెప్పాడు. ఎన్నో సంవత్సరాలు చదివి, సాంకేతిక నైపుణ్యాలు నేర్చుకుని, ప్రాజెక్టులు చేసి, ఇంటర్వ్యూలకు సిద్ధమై వచ్చిన తర్వాత పూర్తి స్థాయి ఉద్యోగాన్ని జీతం లేకుండా చేయమని చెప్పడం తనకు షాక్‌గా అనిపించిందని పేర్కొన్నాడు.ప్రణవ్ అభిప్రాయం ప్రకారం.. ఇది సాధారణ ఇంటర్న్‌షిప్ లేదా ట్రైనింగ్ లాంటిది కాదు. ఇంటర్న్‌షిప్‌లలో కొన్నిసార్లు స్టైపెండ్ లేకపోవచ్చు లేదా తక్కువ మొత్తంలో చెల్లించవచ్చు. కానీ ఇక్కడ కంపెనీ పూర్తి స్థాయి ఉద్యోగం కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తూ జీతం లేకుండా పనిచేయాలని అడగడం అన్యాయమని అతను భావించాడు.ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ సంస్థలో సీఈఓ, హెచ్ఆర్ ప్రతినిధి మాత్రమే పనిచేస్తున్నట్లు తనకు కనిపించిందని, అయినప్పటికీ భారీ స్థాయిలో వాక్-ఇన్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించారని తెలిపాడు. ఉద్యోగాల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్న యువత పరిస్థితిని కొన్ని సంస్థలు తమ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశాడు.సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు కూడా తమ అనుభవాలను పంచుకున్నారు. పుణేలో ఇలాంటి అనేక స్టార్టప్‌లు ఉచిత శ్రమను పొందేందుకు ఉద్యోగాల పేరుతో అభ్యర్థులను ఆకర్షిస్తున్నాయని కొందరు వ్యాఖ్యానించారు. మరికొందరు, ఒక సంస్థ ఉద్యోగికి జీతం చెల్లించలేకపోతే అతడిని ఉద్యోగిగా కాకుండా భాగస్వామిగా పరిగణించి కంపెనీలో వాటా ఇవ్వాలని సూచించారు.went for a walk-in interview today. safe to say, it was my first and probably my last.like most job seekers, i reached the venue with some hope. the market is already tough, so you try every opportunity that comes your way.the first round wasn’t even technical. it was with… pic.twitter.com/gdwOluRRgb— Pranavvv (@pranvv27) June 18, 2026 -
పీఎం–వీబీఆర్‌వై కింద 70 లక్షల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన(పీఎం–వీబీఆర్‌వై) కింద దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 70 లక్షలకుపైగా ఉద్యోగాలను సృష్టించినట్లు ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఆయన శుక్రవారం 15 లక్షల మంది ఉద్యోగులు, యాజమాన్యాలకు రూ.2,400 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను బదిలీ చేశారు. ప్రభుత్వం, యువత, పరిశ్రమలు కలిసి పనిచేస్తే ఉద్యోగాల కల్పన అనేక రెట్లు పెరుగుతుందని ఈ సందర్భంగా చెప్పారు. పీఎం–వీబీఆర్‌వై పథకం కింద లబి్ధదారులకు సామాజిక భద్రత లభించిందని అన్నారు. కొత్త ఉద్యోగాలను సృష్టించే సంస్థలను లేదా యజమానులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారు. ఈ పథకం తొలిసారి ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువతకు, పరిశ్రమలకు మధ్య వారధిగా నిలుస్తుందని వెల్లడించారు. దేశమంతటా ఉపాధి కల్పనకు మద్దతు ఇస్తున్నామని, యువతకు సాధికారత కల్పిస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్తు కోసం మరింత బలమైన శ్రామిక శక్తిని నిర్మిస్తున్నామని ఉద్ఘాటించారు. మన యువత ఆకాంక్షలు, నైపుణ్యాలు, సామర్థ్యాలే ‘వికసిత్ భారత్’కు బాటలు వేస్తాయని వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో ప్రపంచ వృద్ధి, ఆవిష్కరణలను ముందుకు నడిపించడంలో భారత యువతదే కీలక పాత్ర అని అన్నారు. 21వ శతాబ్దంలో నైపుణ్యం, ఆవిష్కరణలను ప్రోత్సహించి, అత్యున్నత నాణ్యతా ప్రమాణాలను నెలకొల్పే దేశాలకే అవకాశాలు దక్కుతాయని ప్రధానమంత్రి స్పష్టంచేశారు. ఈ మూడు రంగాల్లో భారతదేశానికి తిరుగులేదన్నారు. పీఎం–వీబీఆర్‌వై పథకానికి ప్రభుత్వం రూ.99,446 కోట్లు కేటాయించింది. రెండేళ్లలో 3.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద తొలిసారిగా ఉద్యోగంలో చేరే ఉద్యోగులకు రూ.15,000 వరకు అందిస్తారు. ప్రతి కొత్త ఉద్యోగికి గాను యాజమాన్యానికి నెలకు రూ.3,000 వరకు అందజేస్తారు. కొత్త ఉద్యోగాలను సృష్టించేలా యాజమాన్యాలను ప్రోత్సహించాలన్నదే ఈ పథకం ఉద్దేశం. -
జస్ట్ ఒక్క గవర్నమెంట్ జాబ్ కొడితే చాలు అనుకున్నా..! కానీ..
కొందరు సక్సెస్‌కి చిరునామాగా ఉంటారు. చాలామంది ఎంచుకున్న దాంట్లో సక్సెస్ అందుకోవడానికే నానా తంటాలు పడతూ ఉంటే..రాసిన అన్ని ప్రభుత్వ ఉద్యోగ నియామక పరీక్షల్లో ఉత్తీర్ణురాలవ్వడం అంటే..మాటలు కాదుకదా..!. అంత అంకితభావంతో, అంతలా ప్రిపేరవ్వడం నిజంగా మాటలు కాదు కదా..!. కానీ ఈ అమ్మాయ్ అలాంటి ఘనతనే సాధించింది.ఆ అమ్మాయే రాయ్‌పూర్‌కి చెందిన చారు పాండే. భారతదేశంలో ప్రభుత్వ నియామకానికి సంబంధించిన ఎన్నో కాంపిటీటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. అందులో ఉత్తీర్ణత సాధించలేక అభ్యర్థులు ఎంతలా ఇబ్బంది పడతుంటారో తెలిసిందే. అలాంటిది..అంత కఠినతరమైన ప్రభుత్వ నియమాక పరీక్షలన్నీ సులభంగా చేధించేసిందామె ఆమె. ఒకటి, రెండు కాదు ఏకంగా 19 సెంట్రల్ గవర్నెమెంట్ పరీక్షల్లో ఉత్తీర్ణురాలవ్వడం విశేషం. జస్ట్ 23 ఏళ్ల వయసుకే ఈ ఘనతను సాధించిన అమ్మాయిగా రికార్డు సృష్టించి..వార్తల్లో నిలిచింది. ఆమె రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ పరీక్షలు, ఎస్బీఐ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ సీజీఎల్, సీహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్ వంటి అనేక పరీక్షల్లో రాసింది. ఆమె చేసిన నిరంతర ప్రయత్నాలు చివరకు ఫలించి ఏకంగా 19 కేంద్ర ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడానికి దారితీసింది. ఈ మేరకు చారు పాండే మాట్లాడుతూ..19 కేంద్ర ప్రభుత్వ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించినందుకు తన కుటుంబం ఎంతో సంతోషంగా ఉందని పేర్కొంది. నిజం చెప్పాలంటే ఇన్ని పరీక్షలు రాస్తానని అస్సలు అనుకోలేదని చెబుతోంది. ఒక్క ప్రభుత్వ ఉద్యోగమైనా సంపాదించగలిగితే చాలు అనుకున్నా..కానీ ఏకంగా ఇన్ని పరీక్షల్లో విజయవంతమయ్యా అంటూ సంతోషంగా చెప్పుకొచ్చింది. తన గణిత నేపథ్యం కారణంగా తన పేరెంట్స్ టీచర్ లేదా లెక్చరర్ రంగంలోకి వెళ్లాలని ఆశించారు. ఈ నేపథ్యంలోనే ఇలా పోటీ పరీక్షలపై దృష్టి పెట్టానని చెప్పుకొచ్చింది. అయితే నెటిజన్లు కొందరు ఆమె పట్టుదలపి, కృషిని ప్రశంసించగా, మరికొందరు ఇన్ని రాసిందంటే..ఆమెకు ఎందులోనూ సరైన అభిరుచి లేదు..పైగా ఆ రంగంలోని వాళ్ల రిజర్వేషన్ ఈమె కారణంగా కోల్పోతేందంటూ మండిపడుతూ పోస్టులు పెట్టారు.#WATCH | Raipur, Chhattisgarh: Charu Pandey, starting her journey at 23 with the dream of a government job, has inspired lakhs of young aspirants by clearing 19 competitive exams, says, "... My family is very happy with this achievement of mine. I am receiving an award for… pic.twitter.com/Zo21tNMxPs— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 12, 2026 (చదవండి: కలలు కల్లలైనా..అతడు చూపిన చొరవకు సెల్యూట్!) -
AI వల్ల ఉద్యోగాలు పోతాయా..: లేటెస్ట్ రిపోర్ట్ ఇదే!
‘ఆఫీసు కార్యకలాపాల్లోకి ఆర్టిఫియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రాకతో ఉద్యోగాలు అంతరించిపోతాయనే ఆందోళనల్లో నిజం లేదు. ఏఐ వాడకంతో సరైన నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరిగి, సంస్థల ఉత్పాదకత మరింత పెరుగుతుంది’ అని హెచ్ఆర్, పేరోల్ సొల్యూషన్స్ సంస్థ ‘ఏడీపీ ఇండియా అండ్ సౌత్ ఈస్ట్ ఆసియా’ మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ గోయల్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఐదుగురు ఉద్యోగుల్లో ఒకరు రోజువారీ పనుల్లో ఏఐని ఉపయోగిస్తున్నారు. దైనందిన జీవితంలో సాంకేతికత ఎంత వేగంగా భాగమైందో ఈ గణాంకాలు నిరూపిస్తున్నాయని పరిశోధనా సంస్థ ‘ఏడీపీ రీసెర్చ్’ తాజాగా విడుదల చేసిన ‘పీపుల్ అట్ వర్క్ 2026’ నివేదిక తెలిపింది.అంతర్జాతీయంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఉద్యోగుల ఆలోచనా విధానాన్ని తెలుసుకునేందుకు ఏడీపీ రీసెర్చ్ సంస్థ 36 దేశాల్లోని 39,000 మందికి పైగా ఉద్యోగులపై ఈ వార్షిక గ్లోబల్ వర్క్‌ఫోర్స్ సర్వేను నిర్వహించింది.ఉత్పాదకతపై భిన్న అభిప్రాయాలుఏఐ వినియోగం పెరుగుతున్నప్పటికీ, ఉద్యోగుల ఉత్పాదకత విషయంలో కొంత అయోమయం నెలకొన్నట్లు ఈ నివేదిక వెల్లడించింది. ప్రతిరోజూ ఏఐని ఉపయోగించే వారిలో 30 శాతం మంది పనిలో పూర్తిగా నిమగ్నమైనప్పటికీ.. ఏఐ వాడని వారితో పోలిస్తే తాము తక్కువ ఉత్పాదకతతో ఉన్నట్లు భావిస్తున్నామని వారు చెప్పారు. నిత్యం చేసే సాధారణ పనులను ఏఐ చూసుకోవడం వల్ల, తమ సొంత పనితీరును అంచనా వేయడం కష్టంగా మారుతోందని ఉద్యోగులు భావిస్తుండటమే దీనికి కారణం.సాంకేతికత-స్కిల్స్ కీలకంవ్యాపార సంస్థల అధిపతులు కేవలం ‘తక్కువ మందితో ఎక్కువ పని’ అనే కోణంలో ఆలోచించకుండా, సాంకేతికతను, మానవ నైపుణ్యాలను ఎలా మేళవించాలనే దానిపై దృష్టి పెట్టాలని రాహుల్ గోయల్ సూచించారు. రోజు వారీగా పదే పదే చేసే పనులను ఏఐ సులువుగా పూర్తి చేస్తుంది.దీనివల్ల ఉద్యోగులకు సమయం కలిసివచ్చి, వారు నిర్ణయాలు తీసుకోవడం, సమస్యల పరిష్కారం, సమన్వయం వంటి మానవ మేధస్సుకు సంబంధించిన సృజనాత్మకత పనులపై మరింత దృష్టి పెట్టవచ్చు. నాలెడ్జ్ ఆధారిత రంగాల్లో ఉన్న ఉద్యోగులు తమ కెరీర్‌పై ధీమాగా ఉన్నారు. సమాచారాన్ని ప్రాసెస్ చేయడానికి సమయం వృథా చేయకుండా, అందుబాటులో ఉన్న డేటాను విశ్లేíÙంచి మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి ఏఐ ఒక సాధనంగా ఉపయోగపడుతుందని గోయల్ వివరించారు. -
రికార్డు అంటే మాదే..
సాక్షి, అమరావతి: అక్రమాలు, అవకతవకలతో డీఎస్సీ నియామక ప్రక్రియ చేపట్టి దాన్నే రికార్డుగా చంద్రబాబు సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటున్నారని మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ దునుమాడారు. మెగా డీఎస్సీ అని పేరుపెట్టి డబ్బా కొట్టుకుంటున్నారని విమర్శించారు. అసలు రికార్డు అంటే ఏమిటో చరిత్ర తెరిచి చూస్తే అర్థం అవుతుందన్నారు. రాష్ట్ర, దేశ చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా వైఎస్సార్సీపీ హయాంలో కేవలం నాలుగు నెలల వ్యవధిలో సచివాలయాల్లో కొత్తగా 1.30 లక్షల ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలను భర్తీ చేశామని గుర్తు చేశారు. ఒక్క తప్పు, ఎలాంటి లోపం లేకుండా నియామక ప్రక్రియ చేపట్టి చరిత్ర సృష్టించామన్నారు.ఒకే నోటిఫికేషన్ ద్వారా..2019 మే 30న నేను సీఎంగా ప్రమాణం చేస్తే.. ఆ తర్వాత 50 రోజుల్లోనే అంటే జూలై 19న జీవో ఇచ్చాం. జూలై 25 నుంచి 27 మధ్య నోటిఫికేషన్ విడుదలైంది. జూలై 27 నుంచి ఆగస్టు 10వరకూ అప్లికేషన్లు తీసుకున్నాం. సెప్టెంబరు 1 నుంచి 8 వరకూ పరీక్షలు నిర్వహించాం. 2,800 సెంటర్లలో 19 లక్షల మంది పరీక్షలు రాశారు. ఎక్కడా ఒక్క తప్పు కూడా జరగలేదు. ఎలాంటి లోపం లేకుండా, అందరి విశ్వాసాన్ని నిలబెడుతూ 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేశాం. అక్టోబరు రెండో తేదీ గాంధీ జయంతి నాటికి మొత్తం ప్రక్రియను పూర్తి చేశాం.మే 30 నుంచి అక్టోబర్ రెండో తేదీ మధ్య నాలుగు నెలల్లో అత్యంత పారదర్శకంగా, ఒక్క తప్పు జరక్కుండా, ఎలాంటి లోపం లేకుండా ఒక చరిత్ర సృష్టించాం. ఆ ఉద్యోగాలు పొందిన వాళ్లంతా ఇవాళ ప్రజలకు గ్రామంలోనే, మన ఇంటికే సేవలు అందిస్తున్నారు. రాష్ట్ర, దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో ఒకే నోటిఫికేషన్ ద్వారా ఏకకాలంలో 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసిన చరిత్ర మాదే అని గర్వంగా చెబుతున్నాం. అసలు రికార్డు అంటే అదీ. గ్రామ స్వరాజ్యం, సుపరిపాలన లక్ష్యంగా ఉద్యోగాల చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం రాశాం. ఎవరూ బద్దలు కొట్టలేని ఓ రికార్డును సృష్టించాం. -
ప్రశాంతత కోసం ఐటీ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం
భారతదేశంలో దశాబ్దాలుగా కొనసాగుతున్న ఉద్యోగ వలసల ధోరణిలో ఒక ఊహికందని, సంచలనాత్మక మార్పు చోటుచేసుకుంటోంది. నిన్నటివరకు మెట్రో నగరాల్లోని భారీ ప్యాకేజీలు, ఆకాశాన్ని తాకే జీతాల కోసం పరుగులు తీసిన యువ ఐటీ, కార్పొరేట్ నిపుణులు.. ఇప్పుడు రూట్ మార్చుకుంటున్నారు. మెట్రో నగరాల్లోని విపరీతమైన ట్రాఫిక్, కాలుష్యం, అధిక జీవన వ్యయంతో విసిగిపోయిన యువత.. భారీ జీతాల కంటే ప్రశాంతమైన జీవితానికే (క్వాలిటీ ఆఫ్ లైఫ్) ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నారు. ‘అడెక్కో ఇండియా’ నిర్వహించిన ‘ఎక్స్టర్నల్ డిస్రప్షన్స్ అండ్ వర్క్‌ఫోర్స్ ప్రొడక్టివిటీ రిపోర్ట్ 2026’ నివేదికలో వెల్లడైన ఈ నిజాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.జీతాల కంటే ప్రశాంతతకే ఓటుభారతదేశంలో ప్రతిష్టాత్మక కంపెనీలకు, మెరుగైన కెరీర్ ఎదుగుదలకు బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఎన్సీఆర్, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాలు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ వచ్చాయి. అయితే ‘అడెక్కో ఇండియా 2026’ నివేదిక ప్రకారం, 35 ఏళ్లలోపు వయసున్న యువ నిపుణులలో దాదాపు 50 నుంచి 55 శాతం మంది మెట్రో నగరాల్లోని భారీ జీతాల కంటే సొంత ఊర్లకు దగ్గరగా ఉండటం, ప్రశాంతమైన జీవన ప్రమాణాలకే మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా, భారతదేశ ప్రతిభావంతులైన శ్రామిక శక్తి (టాప్ టాలెంట్) ఇప్పుడు మెట్రోల సరిహద్దులు దాటి చిన్న నగరాల వైపు వేగంగా విస్తరిస్తోంది.చిన్న నగరాల్లో భారీగా పెరుగుతున్న ఉద్యోగాలుఈ మార్పు తాత్కాలికమైనది కాదని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. దేశంలోని మొత్తం ఫార్మల్ హైరింగ్ (ఉద్యోగ నియామకాల) వృద్ధిలో ఏకంగా 70 శాతం చిన్న నగరాల (నాన్-మెట్రోస్) నుంచే వస్తుండగా, మెట్రో నగరాల వాటా కేవలం 30 శాతానికి పడిపోయింది. ప్రస్తుతం భారతదేశంలోని రిమోట్ ఉద్యోగులలో 30-35 శాతం మంది టైర్-2, టైర్-3 నగరాల నుంచే పని చేస్తున్నారు. ముఖ్యంగా కోయంబత్తూర్, ఇండోర్, సూరత్, వడోదర, లక్నో వంటి నగరాలు నైపుణ్యం కలిగిన నిపుణులను, సరికొత్త ఉద్యోగ అవకాశాలను భారీగా ఆకర్షిస్తూ కొత్త హబ్‌లుగా అవతరిస్తున్నాయి.రంగాలవారీగా రిమోట్ ఉద్యోగాల జోరుయువత మానసిక స్థితిని అర్థం చేసుకున్న కార్పొరేట్ కంపెనీలు కూడా తమ వ్యూహాలను మార్చుకుంటున్నాయి. దాదాపు 40 శాతం సంస్థలు ఇప్పటికే ‘హబ్ అండ్ స్పోక్’ మోడల్‌ను అమలు చేస్తూ, ప్రధాన నగరాల్లో పెద్ద ఆఫీసులతో పాటు చిన్న పట్టణాలలో శాటిలైట్ కార్యాలయాలను ఏర్పాటు చేస్తున్నాయి. రంగాలవారీగా చూస్తే, టెక్నాలజీ (ఐటీ) రంగంలో రిమోట్, హైబ్రిడ్ నియామకాలు ఏడాది ప్రాతిపదికన 30 శాతం పెరిగాయి. బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో 20-25 శాతం, హెల్త్‌కేర్ రంగంలో 15-20శాతం, అలాగే ఈ-కామర్స్ అండ్ రిటైల్ రంగంలో 15-18 శాతం మేర హైబ్రిడ్ ఉద్యోగాలు వృద్ధి చెందాయి.వివిధ ప్రాంతాలకు శ్రామికశక్తి విస్తరణనగరాల్లో నిరంతరం తలెత్తుతున్న మౌలిక వసతుల లోపాలు, ప్రకృతి విపత్తులు ఈ వలసలను మరింత వేగవంతం చేస్తున్నాయి. దేశంలోని 97 శాతం మంది యజమానులు వాతావరణ మార్పులు, మౌలిక సదుపాయాల ఒత్తిడి, ప్రజారోగ్య సమస్యల వంటి బాహ్య అడ్డంకులను నిరంతరం ఎదుర్కొంటున్నట్లు నివేదిక పేర్కొంది. కేవలం ఒకే నగరంలో కేంద్రీకృతమవ్వడం వల్ల వరదలు, రవాణా వ్యవస్థల స్తంభన వంటి సమయాల్లో వ్యాపారాలు పూర్తిగా దెబ్బతింటున్నాయి. అందుకే సుమారు 95 శాతం కంపెనీలు తమ వ్యాపార కొనసాగింపు కోసం శ్రామిక శక్తిని వివిధ ప్రాంతాలకు విస్తరించడాన్ని (డిస్ట్రిబ్యూటెడ్ వర్క్‌ఫోర్స్) ప్రాధాన్యతగా ఎంచుకుంటున్నాయి.హైదరాబాద్, బెంగళూరులో..నగరాల్లో పెరుగుతున్న తీవ్ర ఒత్తిడి కారణంగా ఉద్యోగుల మానసిక స్థితి, ఉత్సాహం, ఉత్పాదకత దారుణంగా దెబ్బతింటున్నాయి. ఈ నివేదిక ప్రకారం, 42శాతం కంపెనీలు తమ ఉద్యోగులలో ఉత్సాహం తగ్గిందని, 40శాతం కంపెనీలు అబ్సెంటీయిజం (ఆఫీసులకు రాకపోవడం) పెరిగిందని తెలిపాయి. ఐటీ హబ్ బెంగళూరులో అత్యధికంగా 48శాతం మంది యజమానులు తమ ఉద్యోగుల మోరల్ పడిపోయినట్లు పేర్కొనగా, హైదరాబాద్ 44 శాతంతో రెండో స్థానంలో నిలిచింది. అలాగే, కాలుష్యం, వాతావరణ విపత్తుల కారణంగా ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో అత్యధికంగా 44 శాతం కంపెనీలు తాత్కాలికంగా కార్యకలాపాలను నిలిపివేయాల్సి వచ్చింది.భవిష్యత్ వ్యూహాలు, సవాళ్లుఈ సరికొత్త పరిణామాలపై అడెక్కో ఇండియా కంట్రీ మేనేజర్ సునీల్ చేమంకోటిల్ స్పందిస్తూ, ‘భారతదేశంలోని యజమానులు కేవలం విపత్తులను నిర్వహించడం లేదు, ప్రపంచంలోనే అత్యంత సంక్లిష్టమైన వర్క్‌ఫోర్స్ మార్కెట్లో రీసైలెన్స్ (స్థిరత్వం) ను తిరిగి నిర్వచిస్తున్నారు’ అని పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత విపత్తు నివారణ చర్యలలో కంపెనీలు తమ సామర్థ్యానికి 10 పాయింట్లకు గానూ కేవలం 5 పాయింట్లు మాత్రమే ఇచ్చుకోవడం గమనార్హం. రాబోయే రోజుల్లో మెట్రో నగరాల ఆర్థిక ప్రాముఖ్యత తగ్గకపోయినప్పటికీ, భారతదేశ ప్రతిభావంతుల భవిష్యత్తు మాత్రం చిన్న నగరాల వైపే నడవబోతోందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.ఇది కూడా చదవండి: ఇజ్రాయెల్ జైళ్లలో ఖైదీలపై కుక్కలను ఉసిగొల్పి.. -
పేటీఎంలో నియామకాల జోరు
భారతీయ డిజిటల్ చెల్లింపుల దిగ్గజం పేటీఎం సరికొత్త పునర్నిర్మాణ వ్యూహంతో ముందుకు సాగుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత ఉత్పత్తుల అభివృద్ధి, మర్చంట్ నెట్వర్క్ విస్తరణే లక్ష్యంగా కంపెనీ తన శ్రామిక శక్తిని సుమారు 10 శాతం మేర పెంచుకోవాలని నిర్ణయించింది. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. రాబోయే తొమ్మిది నెలల్లో (మార్చి 2027 నాటికి) కొత్తగా సుమారు 4,000 మంది ఉద్యోగులను నియమించుకోవడానికి కంపెనీ ప్రణాళికలు సిద్ధం చేసింది.అయితే, ఒకవైపు భారీ నియామకాలు చేపడుతూనే.. మరోవైపు అంతర్గత పునర్నిర్మాణంలో భాగంగా దాదాపు 400 మంది ఉద్యోగులను (మొత్తం సిబ్బందిలో 1 శాతం) తొలగించేందుకు సంస్థ సిద్ధమవడం కార్పొరేట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.కీలక అంశాలు..భారీ నియామకాలు: రాబోయే 9 నెలల్లో 4,000 మంది కొత్త సిబ్బంది రిక్రూట్మెంట్. ఇప్పటికే గత రెండు నెలల్లో 800 మందికి పైగా నియామకం పూర్తి.ఉద్యోగాల కోత: వార్షిక పనితీరు మదింపు ఆధారంగా ఎంపిక చేసిన విభాగాల్లో 400 మంది తొలగింపు.ప్రస్తుత ఉద్యోగుల సంఖ్య: ప్రస్తుతం కంపెనీలో 40,000 మందికి పైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. నూతన నియామకాలతో ఈ సంఖ్య మరింత పెరగనుంది.ప్రధాన దృష్టి: సీనియర్ లీడర్షిప్ పాత్రలతో పాటు.. ప్రొడక్ట్, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల బలోపేతం.సరికొత్త ప్లాన్2010లో విజయ్ శేఖర్ శర్మ స్థాపించిన పేటీఎం మొబైల్ రీఛార్జ్‌లతో ప్రారంభమై 2016 నోట్ల రద్దు తర్వాత దేశీయ ఫిన్‌టెక్ రంగంలో తిరుగులేని శక్తిగా ఎదిగింది. అయితే, గత రెండేళ్ల క్రితం పేటీఎం బ్యాంకింగ్ విభాగంపై భారతీయ రిజర్వ్ బ్యాంక్ కఠిన నిబంధనలు విధించడం, ఆపై లైసెన్స్ రద్దు చేయడంతో కంపెనీ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో దాదాపు 4,500 మందికి పైగా సిబ్బందిని తగ్గించుకోవాల్సి వచ్చింది.ఆ నియంత్రణ సవాళ్ల నుంచి కోలుకున్న పేటీఎం వరుసగా నాలుగు త్రైమాసికాల్లో లాభాలను నమోదు చేస్తూ మళ్లీ ట్రాక్‌లోకి వచ్చింది. ఇప్పుడు కంపెనీకి ఉన్న రిజిస్టర్డ్ వినియోగదారులను కేవలం చెల్లింపులకే పరిమితం చేయకుండా.. రుణాలు, పెట్టుబడి ఉత్పత్తులు, ఇతర ఆర్థిక సేవలను విస్తృతంగా అందించడంపై దృష్టి సారించారు.ఇదీ చదవండి: ఒక్కసారిగా తిరగబడిన బంగారం ధరలు -
మరోసారి 300 మందికి ఉచిత వీసాలు
మోర్తాడ్(బాల్కొండ): యూఏఈలో ఉపాధి పొందాలనుకునే వలస కార్మికులకు మరోసారి ఉచిత వీసాలను ఇప్పించేందుకోసం యూఏఈకి చెందిన ఏడీఎన్‌హెచ్, మన దేశానికి చెందిన జీటీఎం సంస్థలు రిక్రూట్మెంట్ మేళా నిర్వహణకు సన్నాహాలు చేస్తున్నాయి. క్లీనింగ్ విభాగంలో 300 మందికి ఉచిత వీసాలు ఇచ్చేందుకు ఈనెల 12న సిరిసిల్ల, జగిత్యాల, 13న నిజామాబాద్, ఆర్మూర్‌లలో ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు.21 ఏళ్ల వయసు నిండి 40 సంవత్సరాలలోపు వారు ఈ ఇంటర్వ్యూలకు అర్హులు. ఎంపికైన వారికి ఉచితంగా వీసాలు ఇచ్చి, విమాన చార్జీలను సైతం కంపెనీయే భరించనుంది. భారత కరెన్సీలో నెలకు రూ.24 వేల వేతనం చెల్లిస్తూ.. నివాసం, భోజన సదుపాయాన్ని ఏడీఎన్‌హెచ్ కంపెనీ సమకూర్చనుంది. వివరాల కోసం సిరిసిల్ల 83320 17122, జగిత్యాల 83320 42299, నిజామాబాద్ 86868 60999, ఆర్మూర్ 83320 13999 నంబర్లలో సంప్రదించాలి.ఈ సందర్భంగా జీటీఎం సంస్థ చైర్మన్ సతీష్‌రావు ‘సాక్షి’తో మాట్లాడుతూ ఉచితంగా వీసాలు జారీ చేసే అవకాశం తమ సంస్థకు రావడం ఎంతో విశేషం అన్నారు. వలస వెళ్లేవారిపై నయాపైసా భారం లేకుండా అన్ని వసతులు ఉచితంగా సమకూర్చడం తమ ప్రత్యేకత అని చెప్పారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
జాబ్ కోసం.. అమెజాన్ మాజీ ఉద్యోగి ఆవేదన!
గత కొన్నేళ్లుగా చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. దీనికి కారణాలు చాలానే ఉన్నప్పటికీ, ఏఐ ప్రధానమని వినిపిస్తోంది. అయితే.. జాబ్ పోతే ఏముందిలే.. ఇంకో జాబ్ వచ్చేస్తుంది అనేవారికి.. అమెజాన్ మాజీ ఉద్యోగి కథ తప్పకుండా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.ఇటీవల ఒక మాజీ అమెజాన్ ఉద్యోగి సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అయింది. దాదాపు ఎనిమిది నెలలుగా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఇంకా ఉద్యోగం దొరకలేదని ఆయన వెల్లడించడం.. టెక్నాలజీ రంగంలో ఉద్యోగ అవకాశాలపై పెద్ద చర్చకు దారితీసింది. ఈ సంఘటన ప్రస్తుతం ఉద్యోగ మార్కెట్లో నెలకొన్న పోటీని కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.ప్రముఖ ఈ-కామర్స్ అండ్ టెక్నాలజీ కంపెనీ అయిన అమెజాన్ సంస్థలో ఏడు సంవత్సరాల పాటు పనిచేశాడు. అయితే.. 2025 చివరి త్రైమాసికంలో కంపెనీ చేపట్టిన ఉద్యోగుల తొలగింపులలో భాగంగా ఆయన ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఉద్యోగం కోల్పోయిన వెంటనే.. ఆయనకు పెద్దగా సమస్య అనిపించలేదు. ఎందుకంటే ఆయన అనుభవం, నైపుణ్యాల కారణంగా అనేక ప్రముఖ సంస్థల నుంచి ఇంటర్వ్యూ కాల్స్ వచ్చాయి. అందులో అమెరికన్ ఎక్స్‌ప్రెస్, అగోడా, ఉబెర్, గూగుల్ వంటి సంస్థలు కూడా ఉన్నాయి.ఇంటర్వ్యూలలో తనకు కొంత నిరాశ ఎదురైంది. ఆ తరువాత కొంతకాలం ఉద్యోగ అన్వేషణ నుంచి విరామం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకున్న సమయంలో ఉద్యోగ మార్కెట్ పరిస్థితి అంతగా ప్రతికూలంగా కనిపించలేదు. కానీ.. కొంతకాలం తర్వాత తిరిగి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేయడం ప్రారంభించగా, పరిస్థితి పూర్తిగా మారిపోయిందని పేర్కొన్నాడు.2026 ఏప్రిల్ నుంచి మళ్లీ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ.. ఒక్క ఇంటర్వ్యూ కాల్ కూడా రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. జాబ్ కోసం తన బయోడేటాను నాలుగు నుంచి ఐదు సార్లు అప్డేట్ చేసుకున్నాడు. అప్లికేషన్ ట్రాకింగ్ సిస్టంకు అనుకూలంగా రెజ్యూమే రూపొందించి అప్లై చేసినప్పటికీ ఫలితం లేకపోయిందని చెప్పాడు. దీన్నిబట్టి చూస్తే ప్రస్తుత ఉద్యోగ మార్కెట్ ఎంత కఠినంగా మారిందో స్పష్టంగా అర్థమవుతోంది.ఇదీ చదవండి: రాత్రికి రాత్రే కంపెనీ క్లోజ్.. రోడ్డున పడ్డ సాఫ్ట్వేర్ ఉద్యోగులు!ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసే అనేక మంది తమ అనుభవాలను పంచుకున్నారు. కొంతమంది ఉద్యోగులు నెలల తరబడి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. మరికొందరు కంపెనీలు కొత్త నియామకాలను తగ్గించడం, నియామక ప్రక్రియలను నిలిపివేయడం, ఉద్యోగాల కోసం పోటీ మరింత పెరగడం వంటి సమస్యలను ప్రస్తావించారు. -
ఏఐ టూల్స్ తయారు చేసిన వారికే షాక్!
మెటా కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్న నేపథ్యంలో, అక్కడి ఉద్యోగాలపై కొత్త చర్చ మొదలైంది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్ ప్రకారం.. మెటా ఉద్యోగులను మొదట్లో AI ఆధారిత టూల్స్ తయారు చేయడానికి ప్రోత్సహించారని, తరువాతే కొన్ని టీమ్స్‌లో ఉద్యోగ కోతలు జరిగాయని ఆరోపించారు.మెటాలో ఒక ఏఐ వీక్ నిర్వహించారు. ఆ సమయంలో ఉద్యోగులు తమ సాధారణ పనుల నుంచి కొంత విరామం తీసుకుని, కొత్త AI టూల్స్, ఐడియాలపై ప్రయోగాలు చేయాలని సూచించారట. కొన్ని ప్రోటోటైప్స్ తయారయ్యాయని, వాటిని తర్వాత పెద్ద ప్రాజెక్టులుగా అభివృద్ధి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ ఐడియాలు రూపొందించడంలో సహకరించిన కొంతమంది ఉద్యోగులు తరువాత ఉద్యోగ కోతలకు గురయ్యారని సమాచారం.My wife just got laid off by Meta. We knew the writing was on the wall. But I want to give a little background. Meta a couple months back had a company-wide AI week. During this week Meta halted all day-to-day work and required all employees to familiarize themselves with AI.…— Julian ☽ (@julianblacks_) May 20, 2026మెటా కంపెనీ ఏఐపై ఎక్కువ దృష్టి పెట్టడం నిజమే.. అని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. సంస్థ తన నిర్మాణాన్ని మరింత సరళంగా మార్చి, సమర్థవంతమైన ఏఐ టీమ్స్‌ను తయారు చేస్తోంది. ఈ మార్పుల వల్ల కొన్ని విభాగాల్లో ఉద్యోగ కోతలు, పునర్వ్యవస్థీకరణలు జరిగాయి. అంతే కాకుండా.. మెటా ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ టెక్నాలజీలో కూడా భారీగా పెట్టుబడులు పెడుతోంది.ఇదీ చదవండి: రూ.50 వేల అప్పుతో మొదలై.. రూ.8,000 కోట్ల సామ్రాజ్యం!ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు.. టెక్ రంగంలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఒకవైపు ఉద్యోగులు ఏఐ టూల్స్ తయారీలో కీలక పాత్ర పోషిస్తుండగా, మరోవైపు అదే ఏఐ వల్ల వారి ఉద్యోగాలకే ముప్పు వస్తుందా? అనే ప్రశ్నలు పుడుతున్నాయి. ముఖ్యంగా ఇంజనీర్లు, డిజైనర్లు, అనలిస్టులు వంటి వైట్ కాలర్ ఉద్యోగాల్లో ఈ భయం ఎక్కువగా కనిపిస్తోంది. రానున్న రోజుల్లో ఇంకా ఎంతమంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందో చూడాలి. -
ఉద్యోగం పోయింది.. ఈఎంఐ కట్టలేని స్థితి నుంచి విజయం!
ఒకప్పుడు నెలకు రూ.5 లక్షల జీతం తీసుకుంటూ.. పెద్ద కంపెనీలో డైరెక్టర్ స్థాయిలో పనిచేసిన వ్యక్తి, ఒక్కసారిగా ఉద్యోగం కోల్పోయి జీవితంలో తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొన్నాడు. ఆ తరువాత ఎదురైన ఇబ్బందులే అతన్ని జీవితంలో సక్సెస్ సాధించేలా చేశాయి. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.గౌరవ్ కవాత్రా అనే వ్యక్తి 2018లో ఆయన ఒక చైనా మల్టీనేషనల్ కంపెనీలో డైరెక్టర్‌గా పనిచేశారు. ఆ సమయంలో నెలకు రూ.5 లక్షల జీతం ఉన్నప్పటికీ.. రూ. 2 కోట్ల హౌస్ లోన్ ఉండేది. ప్రతి నెల జీతం వస్తుండడంతో ఈఎంఐ చెల్లించడానికి ఇబ్బంది ఉండేది కాదు. ఇలాంటి సమయంలో అనుకోకుండా.. సంస్థ అతన్ని ఉద్యోగం నుంచి తొలగించింది.అనుకోకుండా ఉద్యోగం పోవడంతో కవాత్రాకు ఏం చేయాలో అర్థం కాకుండా పోయింది. జీవితంలో అత్యంత కష్టమైన రోజులు ప్రారంభమయ్యాయి. కొత్త ఉద్యోగం కోసం ఆయన అనేక ప్రయత్నాలు చేశారు. ఎన్నో తిరస్కరణలకు గురయ్యారు. నిరాశ, భయం, ఆర్థిక ఒత్తిడి కవాత్రాను మానసిక ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేసింది. ఇలాంటి సమయంలో రాత్రిళ్లు నిద్రపోయేవాడు కాదు. తీవ్ర ఆందోళనతో రోజుకు 12 నుంచి 15 సిగరెట్లు తాగేవాడు. ఆ అలవాటును మానుకోవడానికి ఆయనకు ఎనిమిదేళ్లు పట్టిందని చెప్పారు.ఉద్యోగం లేకుండా ఉన్నప్పుడు.. తన కుమార్తె అడిగిన కొన్ని ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పలేని పరిస్థితి వచ్చిందని కవాత్రా తన బాధను సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. పొరుగువారు.. ఇంట్లో కూర్చొని ఉన్న తనను చూసినప్పుడు తాను మరింత అవమానంగా ఫీలయ్యేవాడినని చెప్పారు.అయితే.. ఈ అనుభవం అతని జీవితానికి ఒక పాఠం నేర్పింది. పెద్ద కంపెనీలో ఉద్యోగం, అధిక జీతం ఇవన్నీ శాశ్వత భద్రత కాదని కవాత్రా గ్రహించారు. నేను నా జీవితాన్ని ఒక కార్పొరేట్ లోగోకు బానిసలా మార్చుకున్నాను, అని ఆయన అన్నారు. డిగ్రీలు ఒక స్థాయి వరకు మాత్రమే ఉపయోగపడతాయని, కానీ నైపుణ్యాలు జీవితాంతం విలువనిస్తాయని ఆయన గుర్తించారు.ఈ సంక్షోభం తర్వాత.. ఆయన తనలో కొత్త నైపుణ్యాలను అభివృద్ధి చేసుకున్నారు. మార్కెటింగ్ ఎలా చేయాలి, ప్రజలను ఎలా నిర్వహించాలి, వ్యాపారాన్ని ఎలా నడపాలి వంటి విషయాలను నేర్చుకున్నారు. క్రమంగా ఆయన కన్సల్టింగ్ రంగంలో అడుగుపెట్టి తన కెరీర్‌ను తిరిగి నిర్మించుకున్నారు.ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీ లేఆఫ్స్.. 8,000 మందిపై ప్రభావం!ప్రస్తుతం ఆయన దేశంలోని అనేక పెద్ద ప్రాజెక్టులకు సలహాదారుగా పనిచేసినట్టు చెబుతున్నారు. రూ.6,500 కోట్ల విలువైన ప్రాజెక్టులకు సలహాలు ఇచ్చారని, 19 రాష్ట్రాల్లో 65 కంపెనీలతో కలిసి పనిచేశారని పేర్కొన్నారు. ఒకప్పుడు ఉద్యోగం కోల్పోయిన వ్యక్తి, ఇప్పుడు అనేక మందికి మార్గదర్శకుడిగా మారడం.. ఆయన ప్రయాణంలో గొప్ప విజయం అనే చెప్పాలి. -
60 రోజుల్లో ఉద్యోగం : లేదంటే కౌంట్‌డౌన్ స్టార్ట్
అమెరికా టెక్ పరిశ్రమ వ్యాప్తంగా జరుగుతున్న తాజా ఉద్యోగ కోతలు టెక్ నిపుణులు గుండెల్లో గునపాల్లా దిగుతున్నాయి. ఉద్యోగం కోల్పోతే, దేశంలో నివసించే హక్కును కూడా కోల్పోవాల్సి వస్తుందేమోనన్న భయం వారిలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది. గత కొన్ని దశాబ్దాలుగా భారతీయ ఇంజనీర్లు , సాఫ్ట్వేర్ డెవలపర్లు అమెరికాలోని అతిపెద్ద టెక్ కంపెనీల నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు. క్లిష్టమైన కోడింగ్ రాశారు, ఎన్నో టీమ్స్‌ను నడిపించారు. ఫలితంగా విదేశాల్లో జీవితం ఎంతో సురక్షితమైనదని నమ్మారు. అక్కడ స్థిరనివాసం ఏర్పరచుకొని ఇళ్లు కొనుక్కున్నారు. కుటుంబాలను పెంచుకున్నారు. కట్ చేస్తే ఇప్పుడు, వేలాది మందికి వచ్చిన ఒకే ఒక్క ఈమెయిల్ అంతటినీ మార్చేస్తోంది. అమెరికాలో ఉద్యోగం పోవడం అనేది ఒక కౌంట్‌డౌన్ షురూ అయినట్టే.సిలికాన్ వ్యాలీలోని కంపెనీలు మరోసారి ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. మెటా (Meta) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వైపు తన వనరులను మళ్లిస్తూ దాదాపు 8వేల ఉద్యోగాలను తొలగించింది. అమెజాన్ కూడా పలు విడతల కోతల తర్వాత మరికొన్ని టీమ్స్ సైజ్ తగ్గిస్తోంది. టెక్ పరిశ్రమ ఏఐ, ఆటోమేషన్ వైపు మళ్లుతున్న నేపథ్యంలో లింక్డ్ఇన్ సైతం ఇటీవలి ఉద్యోగులపై వేటు వేసింది అమెరికాలోని మెజారిటీ భారతీయ టెక్ నిపుణులు H-1B వీసాలపై పనిచేస్తున్నారు. ఇవి నేరుగా వారి యజమానులతో (Employers) ముడిపడి ఉంటాయి. అమెరికా ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం, వీసా స్పాన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్న మరోయజమానిని వెతుక్కోవడానికి,సాధారణంగా 60 రోజులు మాత్రమే సమయం ఉంటుంది. ఒకవేళ వారు విఫలమైతే, దేశం విడిచి వెళ్లాల్సి ఉంటుంది. ఉద్యోగం కోల్పోవడం అంటే కేవలం వృత్తి పరమైన నష్టం మాత్రమే కాదు, ఇమ్మిగ్రేషన్, ఇంటి లోన్ల చెల్లింపులు, పిల్లల పాఠశాలల అడ్మిషన్లు, ఆరోగ్య రక్షణ, కుటుంబ నిర్ణయాలతో కూడిన రేస్‌లా మారుతుంది. ఇప్పటికే చాలా మంది భారతీయులు గ్రీన్ కార్డ్‌ల కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్నారు. కొందరికి అమెరికాలోనే పుట్టిన పిల్లలు ఉన్నారు. మరికొందరు తాము దీర్ఘకాలం అక్కడే ఉంటామనే నమ్మకంతో ఇళ్లు కొనుగోలు చేశారు. ఉద్యోగం పోవడంతో ఆ ప్లాన్లన్నీ రాత్రికి రాత్రే అనిశ్చితిలోకి వెళ్లిపోతున్నాయి.ఇక ఉద్యోగాలు కోల్పోయిన చాలామంది భారతీయ కార్మికులు అమెరికాలో మరికొంత కాలం కొనసాగడానికి తాత్కాలిక ప్రత్యామ్నాయాలను వెతుక్కోక తప్పని పరిస్థితి. దీనికి B-2 విజిటర్ వీసాకు మారడమే పరిష్కారం. తద్వారా మరో ఉద్యోగం వెతుక్కునే లోపు అక్కడ మరికొన్ని నెలలు ఉండే అవకాశం లభిస్తుంది.60 రోజుల H-1B నిబంధన అంటే ఏమిటి?యుఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (USCIS) నిబంధనల ప్రకారం, ఉద్యోగం కోల్పోయిన H-1B కార్మికులకు తమ తదుపరి నిర్ణయాన్ని చూసుకోవడానికి సాధారణంగా 60 రోజుల గ్రేస్ పీరియడ్ (లేదా వారి I-94 హోదా గడువు ముగిసే వరకు, ఏది ముందైతే అది) లభిస్తుంది. ఈ సమయంలో తమ వీసాను స్పాన్సర్ చేయడానికి సిద్ధంగా ఉన్న వేరే యజమానిని వెతుక్కోవచ్చు, వేరే వీసా కేటగిరీకి దరఖాస్తు చేసుకోవచ్చు లేదా అమెరికా విడిచి వెళ్లడానికి సిద్ధం కావచ్చు. ఈ 60 రోజుల గడువు సాధారణంగా ఉద్యోగి యొక్క చివరి పని దినం (Last working day) నుండి ప్రారంభమవుతుంది, అంతేకానీ చివరి జీతం బ్యాంక్ ఖాతాలో జమ అయినప్పటి నుండి కాదు అనేది గుర్తించాలి.సడన్‌గా ఉద్యోగాలు కోల్పోయిన విదేశీ నైపుణ్యం కలిగిన కార్మికులకు కొంత ఉపశమనం కలిగించడానికి ఈ నిబంధనను ప్రవేశపెట్టారు. కానీ వాస్తవానికి, టెక్ పరిశ్రమలోనే నియామకాలు మందగించినప్పుడు రెండు నెలల సమయం చాలా వేగంగా గడచిపోతుంది. కొత్త స్పాన్సర్‌ను కనుగొనడం, ఉద్యోగం రావడం, వీసా ట్రాన్స్ఫర్ అంత ఈజీకాదు. అందుకే ఉద్యోగాలు కోల్పోయిన వారు Form I-539 దాఖలు చేయడం ద్వారా తాత్కాలికంగా B-1 లేదా B-2 విజిటర్ వీసాకు మారాలని ఇమ్మిగ్రేషన్ నిపుణులు సలహా ఇస్తుంటారు.కెనడా, యూరప్ వైపు మొగ్గుదశాబ్దాలుగా అమెరికా అంటే కెరీర్ వృద్ధి, అధిక జీతాలు మరియు ప్రపంచ స్థాయి గుర్తింపునకు చిహ్నంగా ఉండేది. కానీ వరుస లేఆఫ్స్, వీసాపై ఆధారపడటం, ఇమ్మిగ్రేషన్‌పై వస్తున్న రాజకీయ విమర్శలు , AI ఆధారిత మార్పులు చాలా మంది నిపుణులను తమ భవిష్యత్తు గురించి పునరాలోచించుకునేలా చేస్తున్నాయి. ఈ ఒక్క ఏడాదిలోనే లక్షా పదివేలకు పైగా టెకీలు ఉద్యోగాలు కోల్పోయారు. 2025లో ఆమోదించిన H-1B పిటిషన్లలో అత్యధిక శాతం భారతీయులవే ఉన్నాయి. కానీ ప్రస్తుత అనిశ్చితి పరిస్థితుల్లో చాలా మంది భారతీయులు తమ 'అమెరికన్ డ్రీమ్' ఆశలను వదిలేసుకుంటున్న పరిస్థితి. ఇటీవలి ఒక 'బ్లైండ్' (Blind) పోల్ ప్రకారం, అమెరికాలోని భారతీయ నిపుణులలో దాదాపు సగం మంది తాము ఉద్యోగం కోల్పోతే భారతదేశానికి తిరిగి రావడానికి మొగ్గు చూపుతామని తెలిపారు. మరికొందరు కెనడా , యూరప్ వైపు చూస్తున్నారు... -
అమెరికాలో ఏఐపై పెరుగుతున్న వ్యతిరేకత!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రంగంలో అమెరికా ముందంజలో ఉంది. అయితే.. ఇక్కడి యువతలో ఏఐ పట్ల వ్యతిరేక భావనలు పెరుగుతున్నాయి. ఇది విచిత్రమైన పరిస్థితిలా కనిపించినప్పటికీ.. దీని వెనుక ఆర్థిక, సామాజిక, రాజకీయ కారణాలు ఉన్నాయి. ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే.. కేవలం AI గురించే కాకుండా, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్న దీర్ఘకాలిక మార్పులను కూడా పరిశీలించాలి.ఏఐ మీద వ్యతిరేఖ భావన ఏర్పడటానికి ప్రధాన కారణం.. కృత్రిమ మేధ వల్ల కంపెనీలు ఉద్యోగాల కోత. చాలా సంస్థలు ఏఐ టెక్నాలజీ కోసం ఉద్యోగాలు తగ్గిస్తున్నట్లు ప్రకటనలు కూడా చేశాయి. నిజానికి కంపెనీలు కూడా ఖర్చులు, ఆర్థిక మందగమనం, మార్కెట్ ఒత్తిడులు వంటివి ఎదుర్కొంటున్నాయి.AI కారణం అందుకే..సంస్థలు AIని కారణంగా చూపడం.. వాటికి రెండు విధాలుగా ఉపయోగపడుతోంది. ఒకటి.. ఉద్యోగాల కోతలను సమర్థించుకోవచ్చు. రెండోది.. మేము భవిష్యత్ టెక్నాలజీ వైపు అడుగులు వేస్తున్నాం.. అనే ఇమేజ్ పొందవచ్చు. దీంతో సాధారణ ప్రజల్లో ఏఐ అంటే ఉద్యోగాలను తీసేసే యంత్రం అనే భయం పెరుగుతోంది.ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే.. 2008-09 గ్లోబల్ ఫైనాన్షియల్ క్రైసిస్ తర్వాత ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అస్థిరత పెరిగింది. అప్పటి నుంచి ధనిక-పేద అంతరం, అప్పుల భారం, ఉద్యోగ భద్రతలేమి వంటి సమస్యలు మరింత తీవ్రమయ్యాయి. టెక్నాలజీ రంగం మాత్రమే వృద్ధి చెందుతున్నప్పటికీ, ఆ వృద్ధి సమాజంలోని అందరికీ సమానంగా ప్రయోజనం కలిగించలేదు.టెక్నాలజీ విప్లవంఒకప్పుడు స్మార్ట్‌ఫోన్ విప్లవం, ముఖ్యంగా ఐఫోన్ వచ్చిన తర్వాత మొబైల్ రంగం ప్రపంచాన్ని మార్చేసింది. కానీ ఆ టెక్నాలజీ విప్లవం కూడా ప్రపంచ ఆర్థిక సంక్షోభాన్ని అడ్డుకోలేకపోయింది. అదే విధంగా AI కూడా అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. AI ఉత్పాదకతను పెంచగలదు, కొత్త సేవలను సృష్టించగలదు. కానీ.. ప్రపంచ ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, రాజకీయ విభజనలు వంటి లోతైన సమస్యలను అది ఒక్కటే పరిష్కరించలేదు.How is it that in the US, the AI leader, a good part of the population, even a lot of college students, have come to hate AI? It does not help that companies are blaming job losses on AI, which is both convenient and as an added bonus, makes a company look visionary.The layoffs…— Sridhar Vembu (@svembu) May 19, 2026మరో ముఖ్యమైన అంశం ఏమిటంటే.. ప్రపంచం, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పడిన ఆర్థిక, రాజకీయ వ్యవస్థలనే అనుసరిస్తోంది. అమెరికా ఆధిపత్యం, గ్లోబల్ ట్రేడ్, డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ వంటివి దశాబ్దాలుగా ప్రపంచాన్ని నడిపించాయి. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ క్రమంగా బలహీనపడుతోంది. చైనా ఎదుగుదల, యుద్ధాలు, సరఫరా గొలుసు సమస్యలు, ఇంధన సంక్షోభాలు వంటివన్నీ కలిసి ప్రపంచాన్ని కొత్త దిశలోకి నెడుతున్నాయి.మార్పునకు అవకాశంచరిత్రను పరిశీలిస్తే.. ప్రతి టెక్నాలజీ విప్లవం మొదట్లో భయాలను సృష్టించింది. పరిశ్రమల విప్లవం సమయంలో కూడా యంత్రాలు ఉద్యోగాలను నాశనం చేస్తాయని భావించారు. కానీ తరువాత కొత్త రంగాలు, కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. AI విషయంలో కూడా అదే జరగవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, పరిశోధన రంగాల్లో AI భారీ మార్పులు తీసుకువచ్చే అవకాశం ఉంది అనేది వాస్తవం.ఇదీ చదవండి: భారత్ vs అమెరికా: ఇదీ.. వర్క్ కల్చర్‌లో తేడా! -
ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలిచ్చి మరీ..
సాంకేతిక ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విస్తృతి పాత ఉద్యోగాలను వేగంగా మార్చేస్తోంది. గ్లోబల్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ (సీఆర్ఎం) దిగ్గజం సేల్స్‌ఫోర్స్ ప్రస్తుతం ఏజెంటిక్ ఏఐ కార్యకలాపాల నేపథ్యంలో అంతర్గత పునర్నిర్మాణం, బడ్జెట్ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా సాంప్రదాయక విధుల్లో ఉన్న సుమారు 3,000 మంది ఉద్యోగులను కొత్త నైపుణ్యాలతో సేల్స్ విభాగంలోకి మళ్లించినట్లు కంపెనీ చీఫ్ డిజిటల్ ఎవాంజెలిస్ట్ వాలా అఫ్షర్ వెల్లడించారు. మే 18న తన తొలి అధికారిక భారత పర్యటనలో భాగంగా ముంబైలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.ఉద్యోగులకు రీ-స్కిల్లింగ్గతంలో మానవ వనరులు అవసరమైన కొన్ని తక్కువ ప్రభావం చూపే పనులను ఇప్పుడు ఏఐ ఏజెంట్లు సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయని వాలా అఫ్షర్ పేర్కొన్నారు. దీనివల్ల కంపెనీలో మిగిలిన ప్రతిభావంతులైన ఉద్యోగులను తొలగించకుండా వారికి తగిన శిక్షణ ఇచ్చి సేల్స్ ఫంక్షన్‌కు అనుగుణంగా మార్చినట్లు తెలిపారు.‘ఏఐ ఏజెంట్ల వినియోగం భారీగా పెరిగింది. ఇప్పటివరకు ఆయా పనులు నిర్వహించిన ఉద్యోగులకు రీ-స్కిలింగ్ అందించాం. బయటి నుంచి ఎవరినీ కొత్తగా నియమించుకోకుండానే అంతర్గత వ్యాపార విభాగాల నుంచే ఈ 3,000 మందిని సేల్స్ పాత్రల్లోకి డిప్లాయ్ చేశాం. ఈ ప్రక్రియ బడ్జెట్ వ్యయాలపై కూడా ప్రభావం చూపుతుంది. బడ్జెట్లు మారుతాయి. కొన్నిసార్లు నాయకత్వ శైలి మారుతుంది. దీనివల్ల మధ్యస్థాయి మేనేజ్మెంట్ తగ్గి కంపెనీ మరింత సమర్థంగా మారుతుంది. అందుకు అనుగుణంగా పర్ఫార్మెన్స్ ఇండికేటర్లను కూడా పునసమీక్షించుకోవాల్సి ఉంటుంది’ అని వాలా అఫ్షర్ చెప్పారు.2024లోనే కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో మార్క్ బెనియోఫ్ కోడింగ్, ఉత్పాదకత పెంపునకు ఏఐ సాధనాలే సరిపోతాయని, భవిష్యత్తులో ఎక్కువ మంది ఇంజినీర్లను నియమించుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చని స్పష్టం చేశారు. తాజా వ్యూహం దానికి అద్దం పడుతోంది. 2026 నాటికి ఆంత్రోపిక్ టోకెన్ల కోడింగ్ అవసరాల కోసమే కంపెనీ దాదాపు 300 మిలియన్ డాలర్ల వరకు ఖర్చు చేసే అవకాశం ఉందని బెనియోఫ్ అంచనా వేశారు.ఇదీ చదవండి: డాలర్ల కొరత.. 70 ఏళ్లలో 9 సార్లు! -
సంతలో సరుకులా స్పోర్ట్స్ కోటా ఉద్యోగాలు..
-
600 మీటర్ల దూరం.. అందుకే జాబ్ రిజెక్ట్!
ఈ మధ్యకాలంలో ఉద్యోగ నియామక ప్రక్రియలో విచిత్రమైన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఒక ఉద్యోగ అభ్యర్థికి వచ్చిన రిజెక్షన్ మెయిల్ అందరి దృష్టిని ఆకర్షించింది.సాధారణంగా కంపెనీలు అభ్యర్థిని తిరస్కరించేటప్పుడు.. క్వాలిఫికేషన్, స్కిల్స్ వంటివి చూస్తాయి. తమకు అవసరమైన స్కిల్ ఉన్నవారిని ఎంపిక చేసుకుంటాయి. లేకుంటే రిజెక్ట్ చేస్తాయి. కానీ.. అభ్యర్థి పనిచేసిన పాత ఆఫీస్ 600 మీటర్ల దూరంలో ఉండటం వల్ల రిజెక్ట్ చేస్తున్నట్లు కంపెనీ మెయిల్ ద్వారా వెల్లడించింది.కంపెనీకి సంబంధించిన భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఈ కారణం చదివిన తరువాత చాలా మంది ఆశ్చర్యపోయారు. సాధారణంగా కంపెనీలలో గోప్యత అనేది ఉద్యోగి బాధ్యత. కాబట్టి దీనికి కొన్ని సెక్యూరిటీ పాలసీలు ఉంటాయి. కానీ.. కేవలం భౌగోళిక దూరం ఆధారంగా ఉద్యోగిని తిరస్కరించడం అనేది చాలా మందికి అర్థం కాని విషయం అయ్యింది.సోషల్ మీడియాలో ఈ పోస్ట్ వైరల్ అయిన తరువాత, చాలామంది వినియోగదారులు దీనిపై తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కొందరు ఇది పాతకాలపు ఆలోచన అని విమర్శించారు. నేటి డిజిటల్ ప్రపంచంలో సమాచారం ఎప్పుడైనా, ఎక్కడైనా చేరవచ్చు. కాబట్టి, కేవలం ఆఫీసుల మధ్య దూరం ఆధారంగా గోప్యత భంగం కలుగుతుందని భావించడం సరైనది కాదని అన్నారు.ఇదీ చదవండి: టీసీఎస్ బాస్.. వేతనం రూ.28 కోట్లు! -
బీటెక్ ఒకప్పుడు గ్రేట్ ఇప్పుడు వేస్ట్! పనికి రాకుండా పోతున్న బీటెక్ డిగ్రీలు తప్పు కాలేజీలదే..
-
ఉద్యోగులపై నిఘా.. యువతి ఫైర్ (వీడియో)
భారతదేశంలో ఉద్యోగ సంస్కృతి మరింత కఠినమైపోతోందని, కొన్ని సంఘటనల ద్వారా తెలుస్తోంది. ఉద్యోగులు సరిగ్గా పనిచేయడం లేదని కంపెనీలు ఆరోపిస్తుంటే.. సంస్థలు ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తిడిని తెస్తున్నాయని ఎంప్లాయిస్ చెబుతున్నారు. ఈ తరుణంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో.. నెట్టింట హల్చల్ చేస్తోంది.గుర్లీన్ అనే మహిళకు, ఒక సంస్థ వర్క్ ఫ్రం హోమ్ ఉద్యోగ అవకాశాన్ని కల్పించినప్పటికీ.. కంపెనీ కఠినమైన పర్యవేక్షణ విధానాల కారణంగా తిరస్కరించింది. ఈ సంఘటన ఆధునిక ఉద్యోగ సంస్కృతి, ఉద్యోగుల గోప్యత, మరియు రిమోట్ వర్క్ భవిష్యత్తుపై అనేక ప్రశ్నలను లేవనెత్తింది.గుర్లీన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆ కంపెనీ ఉద్యోగులు పని చేస్తున్నంతసేపు కెమెరా (వెబ్‌క్యామ్) ఎప్పుడూ ఆన్‌లో ఉంచాలని నిబంధన పెట్టింది. అంతేకాకుండా.. ప్రతి 10 నిమిషాలకు ఉద్యోగి కంప్యూటర్ స్క్రీన్‌షాట్ తీసి పనితీరును కూడా సంస్థ పరిశీలిస్తుందని వెల్లడించింది.ఉద్యోగులపై ఇలాంటి నిరంతర నిఘా చాలా అసౌకర్యంగా అనిపిస్తుందని, ఒత్తిడి కలిగిస్తున్నదని గుర్లీన్ పేర్కొన్నారు. ఈ విధంగా ఉద్యోగికి శిక్షలాగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. View this post on Instagram A post shared by Gurleen (@sprinkleofgurleen_)వర్క్-ఫ్రం-హోమ్ విధానం అసలు ఉద్దేశం.. ఉద్యోగులకు సౌకర్యం, స్వేచ్ఛ, సమతుల్య జీవనశైలిని అందించడం. కానీ ఇలాంటి కఠినమైన పర్యవేక్షణ వల్ల ఉద్యోగులు భయంతో పనిచేయాల్సి వస్తుంది. ఇది మానసిక ఒత్తిడిని పెంచి, ఆత్మవిశ్వాసాన్ని తగ్గించే అవకాశం ఉంది. సంస్థలు మనుషులను నియమించుకుంటున్నాయా? లేక రోబోలను నియమించుకుంటున్నాయా? అని ఆమె ప్రశ్నించారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఉద్యోగులపై అధిక నిఘా పెట్టడం అనేది నమ్మకంలేని పని సంస్కృతికి సంకేతమని కొందరు అభిప్రాయపడ్డారు. మరికొందరు.. ఇంటి నుంచే పని చేసే ఉద్యోగాలు కార్యాలయంలో పని చేసే ఉద్యోగాల కంటే ఎక్కువ ఒత్తిడిగా మారుతున్నాయని పేర్కొన్నారు. మరికొందరు కంపెనీల విధానాలను సమర్ధించారు.ఇదీ చదవండి: ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతోంది! -
కొలువు తీరిన కొంత కాలానికే ఇంటికి!
అంతర్జాతీయ ఉద్యోగ మార్కెట్లో ఇప్పుడు చర్చంతా ‘జెన్ జీ’ గురించే. 1997 నుంచి 2012 మధ్య జన్మించి, ప్రస్తుతం కెరీర్ ప్రారంభించిన ఈ యువతరంపై కార్పొరేట్ ప్రపంచం భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తోంది. పుట్టినప్పటి నుంచే టెక్నాలజీతో సాన్నిహిత్యం ఉన్న ఈ తరంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కంపెనీలకు క్షేత్రస్థాయిలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. తాజాగా వెలువడిన నివేదికలు విస్తుపోయే నిజాలను బయటపెడుతున్నాయి.మూణ్ణాళ్ల ముచ్చటేనా?ప్రముఖ విద్యా, కెరీర్ సలహా సంస్థ ‘ఇంటెలిజెంట్’ నిర్వహించిన తాజా సర్వే ప్రకారం.. 60 శాతం మంది యజమానులు తాము నియమించుకున్న జెన్ జీ ఉద్యోగులను కేవలం కొద్ది నెలల్లోనే తొలగించారు. దాదాపు 1,000 మంది హైరింగ్ మేనేజర్ల అభిప్రాయాలను సేకరించగా ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.కొత్త గ్రాడ్యుయేట్లను నియమించుకోవడానికి ప్రతి ఆరుగురు యజమానుల్లో ఒకరు వెనకాడుతున్నారు.పనితీరు బాగోలేని 79% మంది జెన్ జీ ఉద్యోగులకు శిక్షణ (పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్లాన్) ఇచ్చినప్పటికీ అందులో 60% మంది చివరకు ఉద్యోగాలు కోల్పోయారు.74% మంది మేనేజర్లు ఇతర తరాల వారితో పోలిస్తే జెన్ జీతో పనిచేయడం అత్యంత కష్టమని సర్వేలో చెప్పారు.ఉద్వాసనకు దారితీస్తున్న ప్రధాన కారణాలుకారణంశాతం (సుమారుగా)చొరవ చూపకపోవడం50%ప్రొఫెషనలిజం లోపం46%బలహీనమైన కమ్యూనికేషన్ స్కిల్స్39%విమర్శలను తట్టుకోలేకపోవడం38%సమస్య పరిష్కార సామర్థ్యం లేకపోవడం34%వారానికి 20% మంది ఆలస్యంగా ఆఫీసుకు రావడం, కార్యాలయానికి తగని దుస్తులు ధరించడం, పని ఒత్తిడిని తట్టుకోలేకపోవడం వంటివి యజమానులను కలవరపెడుతున్నాయి.'స్నోఫ్లేక్' సిండ్రోమ్.. ఫీడ్‌బ్యాక్ అంటేనే భయం!యజమానులు ప్రధానంగా ఫిర్యాదు చేస్తున్న మరో అంశం.. విమర్శలను స్వీకరించలేకపోవడం. మేనేజర్లు ఇచ్చే నిర్మాణాత్మకమైన సలహాలను కూడా వీరు వ్యక్తిగత విమర్శలుగా భావిస్తున్నారని సర్వేలు చెబుతున్నాయి. అందుకే వీరిని సోషల్ మీడియాలో ‘స్నోఫ్లేక్’ అని పిలుస్తున్నారు. అంటే చిన్న విషయాలకే కుంగిపోయే మనస్తత్వం కలవారని అర్థం. తమ తొలగింపు ఉదంతాలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో షేర్ చేస్తూ కొందరు సానుభూతి పొందుతుంటే, మరికొందరు ఆఫీస్ కల్చర్‌ను తప్పుబడుతున్నారు.ఆధారపడటం పెరిగింది.. ఆత్రుత తగ్గింది!బ్యాంక్రేట్ సర్వే ప్రకారం.. దాదాపు 70% మంది జెన్ జీ యువత ఆర్థికంగా ఇంకా తమ తల్లిదండ్రులపైనే ఆధారపడుతున్నారు. దీనివల్ల కెరీర్లో ఎదగాలనే తపన, స్వతంత్రంగా ఉండాలనే ఆత్రుత వారిలో తగ్గడానికి కారణమవుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. తల్లిదండ్రులు తమ రిటైర్మెంట్ సేవింగ్స్ ఖర్చు చేస్తూ పిల్లలను ఆదుకోవడం వారి వృత్తిపరమైన ఎదుగుదలకు పరోక్షంగా అడ్డంకిగా మారుతోంది.నాణేనికి మరోవైపుజెన్ జీపై ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ భవిష్యత్తు వారిదే. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ప్రకారం, 2025 నాటికి ప్రపంచ శ్రామిక శక్తిలో 25% పైగా వీరిదే వాటా. టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై వీరికి ఉన్న పట్టు కంపెనీలకు ఎంతో కీలకం. అంతేకాకుండా, కేవలం జీతం కోసమే కాకుండా.. మానసిక ఆరోగ్యం, పని-జీవిత సమతుల్యత కోసం వీరు గళం విప్పుతున్నారు. పాతకాలపు కఠినమైన పని పద్ధతులను సవాలు చేస్తూ మరింత స్నేహపూర్వకమైన పని వాతావరణం కావాలని కోరుకుంటున్నారు.కంపెనీల అంచనాలు, కొత్త తరం ఆలోచనల మధ్య ఉన్న ఈ అంతరాన్ని పూడ్చకపోతే భవిష్యత్తులో నైపుణ్యం కలిగిన మానవ వనరుల కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. జెన్ జీ ఉద్యోగులు వృత్తిపరమైన క్రమశిక్షణను అలవర్చుకోవడంతో పాటు కంపెనీలు కూడా వారి మైండ్‌సెట్‌కు తగ్గట్టుగా తమ సంస్కృతిని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.ఇదీ చదవండి: కరెన్సీ మార్కెట్లో ఆర్బీఐ జోక్యం తగ్గాలి -
జెన్ జీ ఉద్యోగులపై ఆసక్తికర వ్యాఖ్యలు!
నేటి ఉద్యోగ ప్రపంచంలో 'జెన్ జీ' (Gen Z) తరం గురించి ఒక చర్చ జరుగుతోంది. కొంతమంది వ్యాపారవేత్తలు, యువత పనిపట్ల చాలా నిర్లక్ష్యంగా ఉంటారని, ఆఫీస్ రూల్స్ కూడా పాటించరని చెబుతున్నారు. దీనిపై యువ పారిశ్రామికవేత్త రోహిత్ ఆర్యన్ స్పందిస్తూ ట్వీట్ చేశారు. ఇందులో తన అనుభవాన్ని పంచుకుంటూ.. జెన్ జీ ఉద్యోగులు నిజానికి ఎంతో కష్టపడే వారు అని స్పష్టం చేశారు.''రెండు నెలల క్రితం ఒక జెన్ జీ యువతిని ఉద్యోగంలోకి తీసుకున్నాను. మొదట్లో నేను కూడా.. అందరూ చెప్పినట్లే ఈ తరం గురించి కొన్ని సందేహాలు పెట్టుకున్నాను. కానీ ఆమె పనితీరును దగ్గరగా గమనించిన తరువాత, తన అభిప్రాయం పూర్తిగా మారిపోయిందని వెల్లడించారు. ఆమె నిజాయితీగా పనిచేయడం, బాధ్యతగా వ్యవహరించడం, తన పనిపట్ల ఆసక్తి చూపించడం ఆయనను ఆకట్టుకున్నాయని వెల్లడించారు.జెన్ జీ ఉద్యోగులు పని చేయరని మాట తప్పు.. ఎందుకంటే వారు పని చేసే విధానం చాలా భిన్నంగా ఉంటుంది. పాత తరాల ఉద్యోగులు సంప్రదాయ పద్ధతుల్లో పనిచేయడాన్ని ఇష్టపడితే.. జెన్ జీ యువత కొత్త ఆలోచనలు, స్వేచ్ఛ, సౌకర్యవంతమైన వాతావరణాన్ని కోరుకుంటారు. వారు పని - వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యత ముఖ్యమని భావిస్తారు. ఇది వాళ్ల బలహీనత కాదు, మారుతున్న కాలానికి అనుగుణంగా వచ్చిన కొత్త దృక్పథం అని రోహిత్ ఆర్యన్ పేర్కొన్నారు.Hired a GenZ girl 2 months back, and honestly she works with full heart, super sincere. That whole "GenZ doesn't work hard" thing is totally wrong. You just need to understand how they work - their style, their way of communicating is a bit different, but that's completely fine.…— Rohit Aryan (@RohitAryannn) May 6, 2026జెన్ జీ ఉద్యోగులు తమ అభిప్రాయాలను స్పష్టంగా చెప్పడంలో ముందుంటారు. అవసరమైతే 'ఇది సరైనది కాదు' అని ధైర్యంగా చెప్పగలరు. కొందరు దీనిని అహంకారంగా భావించినా, వాస్తవానికి అది వారి ఆత్మవిశ్వాసానికి సూచిక. సరైన ప్రోత్సాహం, గౌరవం, అర్థం చేసుకునే నాయకత్వం లభిస్తే.. వారు సంస్థకు ఎంతో విలువైనవారిగా మారగలరని ఆయన అభిప్రాయపడ్డారు.ఇదీ చదవండి: 2008లోనే చూశాను.. రియల్ ఆస్తులు ఏవంటే?రోహిత్ ఆర్యన్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. చాలామంది ఆర్యన్ అభిప్రాయానికి మద్దతు తెలిపారు. తాము కూడా జెన్ జెడ్ ఉద్యోగులతో మంచి అనుభవాలు పొందామని చెప్పారు. సరైన మార్గదర్శనం, స్వేచ్ఛ, నమ్మకం ఇస్తే ఈ తరం అద్భుతమైన ఫలితాలు ఇస్తుందని పేర్కొన్నారు. -
డిగ్రీ ఉంటే సరిపోదు.. స్కిల్ ఉంటేనే జాబ్
ముంబై: నేటి తరం విద్యార్థుల వేతన అంచనాలకు, మార్కెట్లోని వాస్తవ పరిస్థితులకు మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది. పట్టభద్రులవుతున్న విద్యార్థుల్లో దాదాపు 73 శాతం మంది రూ.5 లక్షలకు మించి వార్షిక వేతనాన్ని (ఎల్పీఐ) ఆశిస్తుండగా.. కేవలం 40 శాతం మంది మాత్రమే ఆ లక్ష్యాన్ని సాధిస్తున్నారని ‘అన్‌స్టాప్ టాలెంట్ రిపోర్ట్ 2026’ వెల్లడించింది. దేశవ్యాప్తంగా 37 వేలకు పైగా విద్యార్థులు, 500 మందికి పైగా హెచ్ఆర్ ప్రతినిధుల నుంచి సేకరించిన అభిప్రాయాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.డిగ్రీ ‘ప్రీమియం’ కనుమరుగు: ఒకప్పుడు పెద్ద కోర్సులు చదివిన వారికి మాత్రమే దక్కే ‘అదనపు వేతన ప్రాధాన్యం’ క్రమంగా తగ్గుతోంది. ఎంబీఏ పూర్తి చేసిన వారిలో 30 శాతం మంది రూ. 10 లక్షల కంటే తక్కువ వార్షిక వేతనం పొందుతుండగా, ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లలో 39 శాతం మంది రూ. 7 లక్షల లోపు వేతనాలకే పరిమితమవుతున్నారు. దీనిని బట్టి వివిధ కోర్సుల మధ్య ఉన్న ‘వేతన అంతరం’ తగ్గుముఖం పడుతోందని స్పష్టమవుతోంది.విద్యార్థుల ఆలోచనా ధోరణిలో మార్పు: పెరుగుతున్న పోటీ, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు సైతం వాస్తవిక దృక్పథంతో ఆలోచిస్తున్నారు. మెరుగైన అభ్యాస అవకాశాలు, కెరీర్ వృద్ధి ఉంటే 90 శాతం మందికి పైగా విద్యార్థులు తక్కువ జీతానికైనా పనిచేసేందుకు మొగ్గు చూపుతున్నారు. అలాగే 82 శాతం మంది విద్యార్థులు తక్షణ ఆర్థిక స్థిరత్వం కోసం అదనపు ప్రయోజనాల (పెర్క్స్) కంటే చేతికి వచ్చే జీతానికే (ఇన్–హ్యాండ్ శాలరీ) ప్రాధాన్యత ఇస్తున్నారు.నైపుణ్యమే అసలైన ‘గేట్‌కీపర్’: ప్రస్తుత పోటీ ప్రపంచంలో నియామక ప్రమాణాలు పూర్తిగా మారిపోయాయి. ఒకప్పుడు కేవలం డిగ్రీ సర్టిఫికేట్లు చూసి ఉద్యోగాలిచ్చిన కంపెనీలు, ఇప్పుడు అభ్యర్థుల్లోని నైపుణ్యాలు (స్కిల్స్), కృత్రిమ మేధ (ఏఐ) సామర్థ్యాన్నే ప్రాతిపదికగా తీసుకుంటున్నాయి. సుమారు 64 శాతం మంది హెచ్ఆర్ ప్రతినిధులు ఏఐ/ఎంఎల్, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సాంకేతికతలపై పట్టున్న వారినే ‘ప్రీమియం టాలెంట్’గా గుర్తిస్తున్నారు. భవిష్యత్తులో ప్రాబ్లమ్ సాల్వింగ్ (49%), ఏఐ పరిజ్ఞానం (39%), ఎమోషనల్ ఇంటెలిజెన్స్ (30%) వంటి సామర్థ్యాలు ఉన్నవారికే అత్యధిక డిమాండ్ ఉంటుందని ఈ నివేదిక స్పష్టం చేస్తోంది.ఎంపిక ప్రమాణాలు మారాయి: భారత ఉద్యోగ విపణిలో అవకాశాలు తగ్గలేదు, కానీ ఒక నిర్మాణాత్మక మార్పు జరుగుతోంది. నైపుణ్యం, ఏఐ పరిజ్ఞానం ఉన్నవారికి మాత్రమే అవకాశాలు దక్కుతున్నాయి. బలమైన పునాదులతో పాటు ప్రాక్టికల్ నైపుణ్యాలు, ఏఐ ప్రావీణ్యం కలిగిన అభ్యర్థులే ఈ పోటీలో నిలబడతారు’’ అని అన్‌స్టాప్ వ్యవస్థాపకుడు, సీఈఓ అంకిత్ అగర్వాల్ విశ్లేషించారు. -
అందుకే అమెరికన్స్ ఉద్యోగాలు వదిలేస్తారు!
భారతీయులు ఒక ఉద్యోగంలో చేరితే, అది ఎంత కష్టమైన జాబ్ అయినా.. అంత సులభంగా వదులుకోరు. కానీ అమెరికన్స్ ఆలా కాదు. ఎలాంటి ఉద్యోగాన్ని అయినా తృణప్రాయంగా వదులుకుంటారు. దీనికి గల కారణం ఏమిటి?, భారతీయులు ఎందుకు ఉన్న ఉద్యోగాల్లోనే ఉండిపోతున్నారు? అనే ఆసక్తికరమైన విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం.అమెరికాలో స్వేచ్ఛ - భారతదేశంలో బాధ్యతఅమెరికాలో వ్యక్తిగత స్వేచ్ఛకు చాలా ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి వ్యక్తి తన జీవితాన్ని తన ఇష్టానుసారం తీర్చిదిద్దుకోవాలని భావిస్తారు. ఉద్యోగం వదిలేయడం కూడా ఒక వ్యక్తిగత నిర్ణయం. ఎవరూ దానిని తప్పుగా చూడరు. ఒకరు తమ ఆసక్తి కోసం, కొత్త వ్యాపారం కోసం లేదా కొంత విశ్రాంతి కోసం ఉద్యోగాన్ని వదిలేయడం అక్కడ సాధారణం.కానీ.. భారతదేశంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది. ఇక్కడ కుటుంబం, సమాజం చాలా ముఖ్యమైనవి. ఒక వ్యక్తి ఉద్యోగం అతని వ్యక్తిగత విషయం మాత్రమే కాదు, కుటుంబ గౌరవం, భవిష్యత్తు, ఆర్థిక స్థితితో కూడా అనుసంధానమై ఉంటుంది. కాబట్టి ఉద్యోగం వదిలేయడం అంటే కుటుంబంతో చర్చించి తీసుకునే నిర్ణయం.ఆర్థిక భద్రతఅమెరికాలో నిరుద్యోగ భృతి, సామాజిక భద్రత, క్రెడిట్ సిస్టమ్ వంటి సౌకర్యాలు ఉంటాయి. అందువల్ల ఉద్యోగం పోయినా లేదా వదిలేసినా కొంత భద్రత ఉంటుంది. కాబట్టి కొంత సమయంలో వారు మళ్లీ కొత్త అవకాశాలను పొందటానికి కొంత సమయం తీసుకుంటారు. నమ్మకంతో ఉంటారు.భారతదేశంలో చాలా మంది మధ్యతరగతి ప్రజలకు ఇలాంటి భద్రత ఉండదు. ఒక ఉద్యోగం కోల్పోతే ఆర్థికంగా కష్టాలు ఎదురవుతాయి. అందువల్ల ఉద్యోగం వదిలేయడం చాలా పెద్ద రిస్క్‌గా భావిస్తారు.ఉద్యోగ సంస్కృతిఅమెరికాలో ఉద్యోగాలు మారడం అనేది సర్వ సాధారణమైన విషయం. కొత్త కంపెనీలకు మారడం ద్వారా జీతం పెరగడం, కొత్త అవకాశాలు పొందడం జరుగుతుంది. ఇది వారి కెరీర్‌కు మంచిదిగా భావిస్తారు.భారతదేశంలో అయితే.. ఒకే సంస్థలో ఎక్కువ కాలం పనిచేయడం నమ్మకంగా భావిస్తారు. తరచుగా ఉద్యోగాలు మారితే స్థిరత్వం లేదు అని అనుకుంటారు. అందువల్ల చాలా మంది తమకు ఇష్టంలేని ఉద్యోగంలో కూడా సంవత్సరాలుగా కొనసాగుతారు.మనస్తత్వం - విలువలుభారతదేశంలో చాలా మంది పిల్లలు, తమ తల్లిదండ్రుల కష్టాలను చూసి పెరుగుతారు. అందువల్ల వారికి స్థిరమైన ఉద్యోగం అంటే చాలా విలువ ఉంటుంది. అది వారి జీవితంలో భద్రతకు ప్రతీకగా భావిస్తారు. కాబట్టి ఉద్యోగం వదిలేయడం అనేది దాదాపు ఉండదనే చెప్పాలి.ఇదీ చదవండి: నాడు మస్క్ పొమ్మన్నాడు.. నేడు రూ.19 వేలకోట్ల కంపెనీకి బాస్!అమెరికాలో చాలా మంది సౌకర్యవంతమైన పరిస్థితుల్లో పెరిగి ఉండటం వల్ల వారు తమ ఆసక్తులు, అభిరుచులను అనుసరించడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. వారికి భద్రత కంటే ప్యాషన్ చాలా ముఖ్యం.భయం!భారతదేశంలో ఫెయిల్యూర్ అంటే చాలా మంది భయపడతారు. ఉద్యోగం వదిలి.. కష్టాలపాలైతే సమాజం విమర్శిస్తుంది అనే భయం ఉంటుంది. అమెరికాలో అపజయాన్ని ఒక అనుభవంగా, నేర్చుకునే అవకాశంగా చూస్తారు. అక్కడ కొత్తగా ప్రారంభించడం గౌరవంగా భావిస్తారు.భారతదేశంలో కూడా ప్రస్తుతం ఉద్యోగం విషయంలో మార్పులు వస్తున్నాయి. యువత కొత్త అవకాశాలను అన్వేషిస్తున్నారు. దీంతో స్టార్టప్స్, ఫ్రీలాన్సింగ్ వంటి వాటి ప్రాముఖ్యత పెరుగుతోంది. మానసిక ఆరోగ్యంపై అవగాహన కూడా పెరుగుతోంది. వర్క్ - లైఫ్ బ్యాలన్స్ చేయడానికి చాలామంది ఇష్టపడుతున్నారు. -
డిగ్రీ కోసం రూ.కోటి.. 500 ఉద్యోగాలకు అప్లై చేసినా జాబ్ రాలేదు!
బ్రిటన్‌లో యువ ఉద్యోగార్థులు ఎదుర్కొంటున్న కష్టాలు ఎలా ఉంటాయనే విషయాన్ని 21 ఏళ్ల గ్రాడ్యుయేట్ ఖాలెద్ షరీఫ్ వెల్లడించారు. లండన్ శివార్లలోని కింగ్స్టన్ విశ్వవిద్యాలయం నుంచి డిజిటల్ మీడియా టెక్నాలజీలో డిస్టింక్షన్‌తో పట్టభద్రుడైనప్పటికీ, అతనికి ఉద్యోగం దొరకలేదు.ఖాలెద్ షరీఫ్ సుమారు 500 ఉద్యోగాలకు దరఖాస్తు చేసినా ఒక్కటి కూడా సాధించలేకపోవడం అతని నిరాశను పెంచింది. 100,000 పౌండ్లకు (రూ. కోటి కంటే ఎక్కువ) పైగా ఖర్చు పెట్టి డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కూడా అవకాశాలు లభించకపోవడం.. వ్యవస్థ లోపభూయిష్టంగా ఉందనే భావన కలిగించింది.ఈజిప్టులో జన్మించి, ఖతార్‌లో పెరిగి, 18 ఏళ్ల వయసులో లండన్‌కు వెళ్లిన షరీఫ్, బ్రిటిష్ రాజధాని తనకు వృత్తిపరంగా అవకాశాలను కల్పిస్తుందని ఆశించాడు. కానీ అతని ఆశలు ఫలించలేదు. కోవిడ్19 ప్రభావం, కృత్రిమ మేధస్సు (AI) అభివృద్ధి కూడా ఉద్యోగ అవకాశాల తగ్గుదలకు కారణమని అతను అభిప్రాయపడ్డాడు.కంపెనీలు ఖర్చులను తగ్గించడానికి ప్రయత్నిస్తూ కొత్త ఉద్యోగులను నియమించడాన్ని తగ్గిస్తున్నాయి. అయినప్పటికీ, సాధారణ ఉద్యోగం చేసుకోవడం కంటే తన చదువుకు తగ్గ ఉద్యోగం కావాలని అతను కోరుకుంటున్నాడు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఖాలెద్ వెనుకడుగు వేయలేదు. ఫ్రీలాన్స్ వీడియోగ్రాఫర్, ఫోటోగ్రాఫర్‌గా పనిచేస్తూ తన సృజనాత్మకతను కొనసాగిస్తున్నాడు.ఇదీ చదవండి: "దయచేసి రండి.. భరతమాతకు మీ ప్రతిభ అవసరం''అంతే కాకుండా.. ''జోక్'' అనే దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించి, తన ఆసక్తులను వ్యాపారంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతని అనుభవం ప్రకారం.. యూనివర్సిటీలో నేర్చుకున్నదానికంటే.. స్వయంగా నేర్చుకున్న నైపుణ్యాలే వృత్తిలో ఎక్కువ ఉపయోగపడుతున్నాయి. -
వేకువజామునే ఈమెయిల్స్.. 30వేల మందికి లేఆఫ్స్!
టెక్ దిగ్గజం ఒరాకిల్.. ఇటీవలి భారీ లేఆఫ్స్ ప్రకటించింది. ఈ కంపెనీ ప్రపంచవ్యాప్తంగా సుమారు 20,000 నుంచి 30,000 మందిని తొలగించింది. ఈ నిర్ణయాన్ని సంస్థ ఉద్యోగులకు.. తెల్లవారుజామున పంపిన ఈ-మెయిల్స్ ద్వారా తెలియజేసింది. ఈ కోతలు అమెరికా, భారతదేశం, కెనడా, లాటిన్ అమెరికా దేశాలలో జరిగాయి.దిగ్గజ కంపెనీ ఈ స్థాయిలో ఉద్యోగులను తొలగించడంతో.. టెక్ రంగంలో పెద్ద చర్చ మొదలైంది. తొలగింపులు ప్రభావం సీనియర్ ఉద్యోగుల మీద కూడా పడింది. అంటే చాలాకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులను కూడా ఒరాకిల్ తొలగించిందన్నమాట.దీనికి ఉదాహరణ.. ఒరాకిల్‌లో 33 ఏళ్లకు పైగా పనిచేసిన సీనియర్ సెక్యూరిటీ నిపుణురాలు నీనా లూయిస్‌ను కూడా తొలగించడం. ఈమె డేటాబేస్, సెక్యూరిటీ రంగాల్లో కీలక బాధ్యతలు నిర్వహించారు. ఆమె తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ, ఈ నిర్ణయం తనకు షాక్‌గా అనిపించిందని తెలిపారు.ఇలాంటి షాకింగ్ లేఆఫ్స్ కేవలం ఒరాకిల్‌లో మాత్రమే జరగలేదు. ఎందుకంటే మెటా, మైక్రోసాఫ్ట్, డిస్నీ, ఏఎస్ఎంఎల్ వంటి కంపెనీలు కూడా ఇదే బాటలో నడిచాయి. భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. దిగ్గజ సంస్థలు పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగించడానికి ప్రధాన కారణం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వినియోగం పెరగడం అని తెలుస్తోంది.ఏఐ టెక్నాలజీతో చాలా పనులు ఆటోమేటిక్‌గా జరుగుతున్నాయి. దీని వల్ల కంపెనీలకు తక్కువ ఖర్చుతో.. ఎక్కువ పనిని చేయడం సాధ్యమవుతోంది. ఫలితంగా, ఉద్యోగుల అవసరం తగ్గిపోతోంది. ముఖ్యంగా సాధారణ కోడింగ్, టెస్టింగ్, ఆపరేషన్స్ వంటి పనులు AI చేతిలోకి వెళ్లిపోతున్నాయి. ఇది ఉద్యోగ మార్కెట్‌పై పెద్ద ప్రభావం చూపుతోంది. కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న విద్యార్థులకు అవకాశాలు తగ్గిపోతున్నాయి. ఇదీ చదవండి: భారీగా బంగారం అమ్మేసిన రష్యా.. ఎందుకో తెలుసా?మరోవైపు.. ఎక్కువ జీతం తీసుకునే సీనియర్ ఉద్యోగులు కూడా కంపెనీలకు భారంగా మారుతున్నారు. అందువల్ల, కంపెనీలు తక్కువ జీతంతో పనిచేసే యువ ఉద్యోగులను లేదా AI టూల్స్‌ను ఉపయోగించడం వైపు మొగ్గుచూపుతున్నాయి. ఈ పరిస్థితులు ఉద్యోగులలో భయాన్ని రేకెత్తించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా.. మధ్యస్థాయి, సీనియర్ ఉద్యోగులు కూడా తమ పనితీరును AIతో మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఏర్పడింది. లేకపోతే ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడే అవకాశం ఉంది. -
డీఎస్సీలో ‘డీల్స్’!
డీఎస్సీలో స్థానికంగా మెరిట్ అభ్యర్థులను పక్కన పెట్టి.. నాన్–లోకల్ కోటాలో బయట జిల్లా వ్యక్తికి ఉద్యోగం ఇచ్చేశారు. నాన్ లోకల్లో పోటీపడే వారు స్థానికుల కంటే మెరిట్ జాబితాలో అగ్రస్థానంలో ఉండాలి. కానీ, సదరు ఉద్యోగి స్థానికుల కంటే రెండు స్థానాలు దిగువన ఉన్నప్పటికీ రాయలసీమ జిల్లాలో నాన్‌లోకల్ కోటాలో పోస్టు కట్టబెట్టేశారు. ఈ విషయం పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులకు తెలిసినా మిన్నకుండిపోయారు. సాక్షి, అమరావతి: రాష్ట్రంలో డీఎస్సీ–2025 పోస్టుల భర్తీలో అవినీతి, అక్రమాల దందా రాజ్యమేలింది. అర్హులకు తీవ్ర అన్యాయం చేస్తూ... నకిలీ ధ్రువపత్రాలతో అనర్హులకు చంద్రబాబు సర్కార్ ఉద్యోగాలు కట్టబెట్టినట్లు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ‘ముఖ్య’నేతకు బంధువుగా చెప్పుకుంటూ క్రీడాశాఖలో కీలక పదవిని అనుభవిస్తున్న వ్యక్తి ఈ వసూళ్ల దందాలో మాస్టర్ మైండ్‌గా వ్యవహరించినట్లు చెబుతున్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం కొందరు అభ్యర్థులతో డీల్ కుదుర్చుకుని ఒక్కొక్కరి నుంచి పోస్టును బట్టి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. మొత్తం రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకు దండుకున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకే జీవోలో అప్రాధాన్య నేషనల్ గేమ్స్‌ను చేర్చారని స్పష్టం చేస్తున్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ కంటే ముందే వ్యూహాత్మకంగా క్రీడా విధానం (స్పోర్ట్స్ పాలసీ) 2024–25 ప్రకటించి ఉపాధ్యాయ పోస్టులను అంగట్లో సరుకులు మాదిరిగా విక్రయించినట్లు పేర్కొంటున్నారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా 421 డీఎస్సీ పోస్టులను క్రీడా కోటాలో పరీక్ష లేకుండా భర్తీ చేయడం ఒక ఎత్తయితే.. భారీగా ముడుపులు తీసుకుని అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టడం మరో ఎత్తు. క్రీడా విధానం రూపకల్పన సమయంలో అక్రమాలకు తెర తీస్తూ జీవో నంబర్ 4లో స్పోర్ట్స్ ప్రాధాన్యతలను ఇవ్వడం.. డీఎస్సీ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇప్పుడు ఆ ప్రాధాన్యతలను మార్పు చేస్తుండటం తీవ్ర చర్చనీయాంశమైంది. తమ జీవితాలతో చంద్రబాబు సర్కారు గేమ్స్ ఆడిందని అభ్యర్థులు వాపోతున్నారు. సీబీఐతో విచారణకు డిమాండ్..కొన్ని క్రీడా సంఘాలను భయపెట్టి క్రీడాకారుల పోస్టులకు అనుగుణంగా అవసరమైన పత్రాలు రూపొందించడంలో మాస్టర్ మైండ్ చక్రం తిప్పారు. ఈ అవినీతి బాగోతాన్ని నడిపించడంలో క్రీడా ప్రాధికార సంస్థలోని ఓ డీఎస్డీవో రేయింబవళ్లు మాస్టర్‌మైండ్‌కు సహాయ సహకారాలు అందించారు. చిన్నాచితకా సర్టిఫికెట్లు ఉన్నవారికి ఉద్యోగాలు కట్టబెట్టేశారు. అందులోనూ రెండేసి డేట్ ఆఫ్ బర్త్‌లు ఉన్నా, సబ్ జూనియర్ స్థాయి నుంచి వరస క్రమంలో సర్టిఫికెట్లు లేకున్నా పోస్టులు ఇచ్చేశారు. ఐదు నుంచి పది పోస్టులు మినహా చాలావరకు క్రీడా కోటాలోనే భర్తీ చేయడం గమనార్హం. దీనిపై కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐతో సమగ్ర విచారణ చేయించి అక్రమార్కులను కఠినంగా శిక్షించాలని క్రీడాకారులు డిమాండ్ చేస్తున్నారు.ప్రతిభకు ప్రాధాన్యం ఎక్కడ?క్రీడా విధానం 2024–29లో భాగంగా క్రీడా కోటా రిజర్వేషన్లు కల్పిస్తూ చంద్రబాబు సర్కార్ జీవో 4 జారీ చేసింది. ఇందులో విచిత్రంగా సీనియర్ నేషనల్ విభాగం కంటే ‘నేషనల్ గేమ్స్’కు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇదంతా ముందస్తు పథకం ప్రకారం చేశారు. ఫెడరేషన్ల ఆధ్వర్యంలో జరిగే సీనియర్ నేషనల్స్ సర్టిఫికెట్‌కు అత్యధిక ప్రాధాన్యం ఉంటుంది. జాతీయ జట్టు ఎంపికలు సైతం వాటి ఆధారంగానే చేస్తారు. రెండేళ్లకు ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో నిర్వహించే ‘నేషనల్ గేమ్స్’ను పెద్దగా ఎవరూ పరిగణనలోకి తీసుకోరు. జాతీయ జట్ల ఎంపికలతో వీటికి సంబంధం ఉండదు. ఇందులో చాలా రాష్ట్రాలు తమ ప్రాతినిధ్యాన్ని సైతం పెద్దగా ప్రోత్సహించవు. అలాంటి ‘నేషనల్ గేమ్స్’ను చంద్రబాబు సర్కారు జీవో 4లో ప్రాధాన్యంగా పెట్టి డీఎస్సీ క్రీడా కోటాలో అక్రమాలకు తెర తీసింది. డీఎస్సీ నోటిఫికేషన్ కంటే ముందే క్రీడా కోటాలో పోస్టులను అమ్ముకునేందుకు ముఖ్యనేతకు బంధువుగా చెప్పుకునే ‘మాస్టర్‌మైండ్’ పక్కా స్కెచ్ వేశారు. కేవలం పోస్టులు అమ్ముకోవడం కోసమే జీవో 4లో నేషనల్ గేమ్స్‌ను చేర్చి.. వసూళ్ల దందా పూర్తి కావడంతో ఆ జీవోను సవరించి చేతులు దులుపుకొనే యత్నం చేస్తున్నట్టు సమాచారం.హైకోర్టు ఆదేశాలు బేఖాతర్...⇒ చంద్రబాబు సర్కారు జారీ చేసిన డీఎస్సీ–2025 నోటిఫికేషన్‌కు సంబంధించి పలు న్యాయవివాదాలు రేకెత్తాయి. డీఎస్సీ ప్రక్రియలో పలు లోపాలు ఉన్నాయని, పోస్టుల భర్తీలో తప్పులు దొర్లాయని పెద్ద ఎత్తున అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో డీఎస్సీపై 104కుపైగా కేసులు దాఖలయ్యాయి. రిజర్వేషన్లు అమలు, స్పోర్ట్స్ కోటాతో పాటు దరఖాస్తు దశలోనే పోస్టుల ప్రాధాన్యం తీసుకోవడం లాంటి వాటిల్లో తమకు అన్యాయం జరిగిందని కోర్టుకు ఫిర్యాదు చేశారు. కీలకమైన పోస్టుల ప్రాధాన్యంపై అప్పట్లో హైకోర్టు స్పందిస్తూ ప్రతిభ గల అభ్యర్థులు నష్టపోకుండా ఉన్నతమైన ఉద్యోగం పొందడం వారి హక్కు అని తీర్పునిచ్చింది. అయితే, ఆ తీర్పు ఇచ్చిన రోజే.. ఆర్డర్ కాపీ రాకుండా హడావుడిగా ఫలితాలను ప్రకటించి చంద్రబాబు సర్కారు పోస్టులను భర్తీ చేసింది. కాగా ‘మాస్టర్‌మైండ్’కు చెందిన ఓ అసోసియేషన్ నుంచి సర్టిఫికెట్లు పొందిన వారికి తగిన అర్హతలు లేకున్నా టీచర్ పోస్టులు కట్టబెట్టేశారు. అనంతరం ఆ మాస్టర్‌మైండ్ సన్మానం కూడా చేయించుకున్నారు. అయితే ఆ నియామక పత్రాలు ఇచ్చేలోగా ప్రతిభ గల కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో వెనక్కి తగ్గారు.⇒ విజయనగరం జిల్లాకు చెందిన ఓ వెయిట్ లిఫ్టర్ కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పోస్టల్ శాఖలో క్రీడా కోటాలో ఉద్యోగానికి అనర్హురాలిగా తేలింది. తప్పుడు జనన ధ్రువీకరణ పత్రాలతో మోసగించేందుకు యత్నించినట్లు గుర్తించడంతో విజయనగరం జిల్లాలో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే అనూహ్యంగా ఆమె ఏపీ డీఎస్సీ–2025లో క్రీడా కోటాలో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌గా ఎంపికైంది. దీనిపై సామాజిక కార్యకర్తలు ‘శాప్’కు సైతం ఫిర్యాదు చేశారు.⇒ విజయనగరానికి చెందిన మరో క్రీడాకారుడు జాతీయ స్థాయిలో అద్భుత ప్రతిభ కనబరిచి పతకాలు పొందారు. ఏపీ డీఎస్సీలో క్రీడా కోటాలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకుంటే నిర్ద్వందంగా తిరస్కరించారు. ఆ తర్వాత ఆయన పోస్టల్ శాఖలో అదే క్రీడా కోటాలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందారు. -
టెస్లా మాస్టర్ ప్లాన్.. అందుకే భారత్‌లో ఉద్యోగాలు!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సారథ్యంలోని టెస్లా కంపెనీ.. భారతదేశంలో నియామకాలను చేపడుతోంది. ఈ నియామకాలు కేవలం ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాలకు మాత్రమే కాకుండా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), హార్డ్‌వేర్ ఇంజనీరింగ్, సప్లై చైన్, ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ రంగాలలో కూడా తన స్థాయిని విస్తరించాలనే లక్ష్యంతో చేపడుతోంది.ముంబై, ఢిల్లీ, పూణే, కొచ్చి, బెంగళూరులలో టెస్లా తన నియామకాలు చేపడుతోంది. దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రమే ఉద్యోగావకాశాలు కల్పిస్తున్న విషయాన్ని గమనిస్తే.. కంపెనీ భారతదేశాన్ని కేవలం ఒక మార్కెట్‌గా కాకుండా, తన గ్లోబల్ టెక్నాలజీ, ఉత్పత్తి వ్యవస్థలో భాగస్వామిగా మార్చాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.భారీ పెట్టుబడులుటెస్లా ప్రస్తుతం ఏఐ, అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ రంగాల్లో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇవి ఏఎస్ఐసీ ఆర్టీఎల్ (ASIC RTL) డిజైన్ ఇంజనీర్లు, సైట్ రిలయబిలిటీ ఇంజనీర్లు వంటి ఉద్యోగాలు, అటానమస్ డ్రైవింగ్, రోబోటిక్స్ కోసం అవసరమైన సిస్టమ్స్ అభివృద్ధికి ఉపయోగపడతాయి. అంతే కాకుండా ఇవి డోజో సూపర్ కంప్యూటర్ వంటి శక్తివంతమైన కంప్యూటింగ్ వ్యవస్థలతో సంబంధం కలిగి ఉంటాయి. ఈ సిస్టం పెద్ద స్థాయి న్యూరల్ నెట్‌వర్క్‌లను ట్రైన్ చేయడానికి ఉపయోగపడతాయి.తయారీ రంగంలో టెస్లాటెస్లా బ్యాటరీ తయారీకి సంబంధించిన నికెల్ మాంగనీస్ కోబాల్ట్ (NMC), లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP), గ్రాఫైట్ వంటి పదార్థాలపై పని చేసే ఇంజనీర్లను నియమిస్తోంది. ఇది భారతదేశంలో తయారీ రంగాన్ని బలోపేతం చేయాలనే సంస్థ లక్ష్యాన్ని చూపిస్తోంది. వైర్ హార్నెస్, పవర్ డిస్ట్రిబ్యూషన్ వంటి భాగాల తయారీలో సరఫరాదారులతో కలిసి పని చేసే ఉద్యోగాలు కూడా ఉన్నాయి. ఇవి సరఫరా వ్యవస్థను స్థానికంగా అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అభివృద్ధి కోసంపీసీబీ లేఅవుట్ ఇంజనీర్ల నియామకం ద్వారా వాహనాల ఎలక్ట్రానిక్ వ్యవస్థలు, ఇన్ఫోటైన్మెంట్, కంప్యూటింగ్ హార్డ్‌వేర్ అభివృద్ధి జరుగుతుంది. అదే సమయంలో ఎంటర్ప్రైజ్ సాఫ్ట్వేర్ అభివృద్ధి కోసం కూడా ఉద్యోగాలు ఉన్నాయి. ఇది టెస్లా భారతదేశాన్ని తన గ్లోబల్ ఆపరేషన్లకు సాఫ్ట్వేర్ అభివృద్ధి కేంద్రంగా ఉపయోగించాలనే యోచనను సూచిస్తోంది.ఆపరేషన్స్, రిటైల్ప్రోటోటైప్ వాహనాలను నడిపి.. డేటా సేకరించే డ్రైవర్లు, అలాగే సేల్స్, సర్వీస్ ఉద్యోగులు నియామకాలు కూడా జరుగుతున్నాయి. ఇవి టెస్లా భారతదేశంలో తన రిటైల్ కార్యకలాపాలను ప్రారంభించడానికి చేస్తున్న ఏర్పాట్లను చూపిస్తున్నాయి. దీన్నిబట్టి చూస్తే టెస్లా భారతదేశంలో చేస్తున్న నియామకాలు కేవలం కార్ల అమ్మకాలకే పరిమితం కాకుండా, ఏఐ, తయారీ, హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, సరఫరా గొలుసు వంటి విభిన్న రంగాలలో సమగ్ర స్థాయిలో విస్తరించాలనే ప్రణాళికను తెలియజేస్తున్నాయి.ఇదీ చదవండి: TCS నాసిక్ కేసు: వెలుగులోకి ఊహకందని విషయాలు! -
ఐటీ ఉద్యోగులకు.. AI టెన్షన్..
-
జర్మనీలో జాబ్ కోసం ఇలా అప్లై చేసుకోండి
-
Oracle ఉద్యోగాల ఊచకోత వెనుక అసలు కథ
-
టీసీఎస్‌లో కొత్త ఉద్యోగాలు: ఈ ఏడాది ఎన్నంటే?
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరంలో ఫ్రెషర్స్ నియామకాలపై స్పష్టత ఇచ్చింది. FY27లో ఇప్పటికే 25,000 ఫ్రెషర్స్‌కు ఆఫర్లు ఇచ్చామని, మార్కెట్ డిమాండ్ పరిస్థితిని బట్టి మరిన్ని నియామకాలు చేపట్టే అవకాశముందని సంస్థ సీఈఓ కే కృతివాసన్ తెలిపారు.2026 ఆర్ధిక సంవత్సరంలో 44,000 మంది ఫ్రెషర్స్‌ను నియమించి, ప్రైవేట్ రంగంలో అత్యధిక నియామకాలు చేపట్టిన కంపెనీల జాబితాలో ఒకటిగా నిలిచిన టీసీఎస్.. ఈ ఏడాది నియామకాలను తగ్గించే అవకాశం ఉందని సమాచారం.FY26లో సంస్థ 12,000 మంది ఉద్యోగులను తొలగించినప్పటికీ, అది ఏఐ ప్రభావం వల్ల కాదని, ప్రాజెక్టుల అమలు విధానంలో మార్పులు రావడం వల్ల ముఖ్యంగా సీనియర్ స్థాయి ఉద్యోగుల అవసరం తగ్గినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు కృతి వాసన్ తెలిపారు. అయితే.. సంస్థ భవిష్యత్తులో పెట్టుబడులు పెట్టడం కొనసాగిస్తుందని, ప్రస్తుత వ్యాపార పరిస్థితి స్థిరంగా ఉందని, కొత్త ప్రాజెక్టులు విభిన్న రంగాలు, ప్రాంతాల్లో పెరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: వెండి రేటు జోరు: కేజీ రూ.2.65 లక్షలు! -
హార్ముజ్ సెగ: ఆగిన పొయ్యిలు.. నిలిచిన స్నానాలు!
న్యూఢ్లిలీ: సుదూర తీరంలో జరుగుతున్న యుద్ధం.. ఇప్పుడు మన వంటగదిపై, మన ఉద్యోగాలపై పెను ప్రభావం చూపుతోంది. ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన మార్గమైన ‘హార్ముజ్ జలసంధి’లో గత 37 రోజులుగా రాకపోకలు నిలిచిపోవడంతో ఇండియా నుంచి జపాన్ వరకు ఆసియా దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్ర సంక్షోభంలో చిక్కుకున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో 20 శాతం ఈ జల మార్గం గుండానే జరుగుతుండగా, అందులో ఏకంగా 90 శాతం ఆసియా దేశాలకే చేరుతుంది. ఇప్పుడు ఆ సప్లై చైన్ దెబ్బతినడంతో చమురు కొరత, ధరల పెరుగుదలతో సామాన్యుల దైనందిన జీవితం తలకిందులవుతోంది.భారత్‌పై తీవ్ర ప్రభావంమన దేశంలోని 60 శాతం ఎల్పీజీ అవసరాలు దిగుమతులపైనే ఆధారపడి ఉండగా, అందులో 90 శాతం హార్ముజ్ జలసంధి గుండానే రావాలి. సరుకు రవాణా నిలిచిపోవడంతో గ్యాస్ సిలిండర్ల డెలివరీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సిలిండర్ల కోసం జనాలు పంపిణీ కేంద్రాల వద్ద బారులు తీరుతున్నారు. గ్యాస్ కొరతతో బెంగళూరులో చాలా హోటళ్లు, రెస్టారెంట్లు పాక్షికంగా మూతపడ్డాయి. గుజరాత్లో ఇండస్ట్రియల్ గ్యాస్ దొరకక సిరామిక్ తయారీ యూనిట్లను నిలిపివేశారు. దీంతో ప్యాకేజింగ్, ప్రింటింగ్ రంగాలు దెబ్బతినడమే కాకుండా దాదాపు నాలుగు లక్షల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు.ఇరుగు పొరుగు దేశాల విలవిలశ్రీలంకలో మళ్లీ 2022 నాటి సంక్షోభ పరిస్థితులు పునరావృతమవుతున్నాయి. ఇంధనాన్ని ఆదా చేసేందుకు పని దినాలను కుదించి ఏకంగా బుధవారాన్ని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించారు. పాకిస్తాన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంధన ధరలను అదుపు చేసేందుకు ప్రధాని షెహబాజ్ షరీఫ్ దేశవ్యాప్తంగా (సింధ్ ప్రావిన్స్ మినహా) ‘స్మార్ట్ లాక్డౌన్’ విధించారు. రాత్రి 8 గంటలకే షాపింగ్ మాల్స్, 10 గంటలకల్లా రెస్టారెంట్లు, బేకరీలు, ఫంక్షన్ హాళ్లు తప్పనిసరిగా మూసి వేయాలని ఆదేశించారు.ఆసియాలో వింత పరిస్థితులుథాయ్లాండ్లో ఏసీ టెంపరేచర్ 26-27 డిగ్రీల మధ్యే ఉంచాలని, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని పాటించాలని సూచించారు. మయన్మార్‌లో ప్రైవేట్ వాహనాల కోసం ప్రత్యామ్నాయ ఇంధన విధానాలు ప్రవేశపెట్టారు. ఇక జపాన్, దక్షిణ కొరియాలో ముడి చమురు ఉత్పత్తి ‘నాఫ్తా’ రాక నిలిచిపోయి ప్లాస్టిక్ కవర్లకు తీవ్ర కొరత ఏర్పడింది. నీటిని వేడి చేయడానికి వాడే ఇంధనం రాకపోవడంతో, ఏకంగా పౌరులు తమ స్నానాలు చేసే ఫ్రీక్వెన్సీని తగ్గించుకోవాలని దక్షిణ కొరియా ప్రభుత్వం సూచించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.ఇది కూడా చదవండి: పట్టు కోసం ‘దీదీ’.. పక్కా వ్యూహంలో బీజేపీ -
AI ఏమి చేయలేదు.. ఈ ఉద్యోగాలు సేఫ్!
కృత్రిమ మేధస్సు (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న తరుణంలో.. దాదాపు అనేక రంగాల్లో భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా వైట్ కాలర్ ఉద్యోగాలలో (ఆఫీస్ పనులు చేసే ఉద్యోగాలు) ఏఐ ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. అనేక కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి AI సాధనాలను ఉపయోగించడం ప్రారంభించడంతో, ఉద్యోగాల కోతలు కూడా పెరిగాయి. దీనివల్ల చాలామంది ఉద్యోగులు తమ భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు.అయితే.. ఇదే సమయంలో బ్లూ-కాలర్ ఉద్యోగాలు (కార్మిక, నైపుణ్యాధారిత పనులు) మాత్రం ఏఐ ప్రభావానికి చాలా వరకు దూరంగా ఉన్నాయి. దీనికి సంబంధించిన ఒక ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.Paid the carpenter Rs. 900 for a 45 minute job installing some shelves and hanging a couple of paintings. Blue collar jobs are the future, skill based training for the youth should be prioritised over other obsolete degrees. No threat from AI either.— Bhandari ka Vyang (@GurugramDeals) April 5, 2026''కొన్ని అరలు బిగించి, రెండు పెయింటింగ్‌లు వేసిన 45 నిమిషాల పనికి వడ్రంగికి రూ. 900 చెల్లించాను. శారీరక శ్రమతో కూడిన ఉద్యోగాలే భవిష్యత్తు, కాలం చెల్లిన డిగ్రీల కంటే.. నైపుణ్య ఆధారిత శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఏఐ (ఏఐ) నుంచి కూడా ఎలాంటి ముప్పు లేదు'' అని ఒక ఎక్స్ యూజర్ పేర్కొన్నారు.దీన్నిబట్టి చూస్తే నైపుణ్య ఆధారిత పనులను ఏఐ కూడా ఏమి చేయలేదు అని స్పష్టమవుతోంది. దీనిపై పలువు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఎలక్ట్రిషియన్లు, కార్పెంటర్లు, ప్లంబర్లు వంటి వృత్తులు మంచి ఆదాయం కలిగినవని, అలాగే ఏఐ వల్ల ప్రమాదం తక్కువగా ఉంటుందని చాలామంది పేర్కొన్నారు. -
రూ.80 లక్షల ప్యాకేజ్.. అందులో రూ.40 లక్షలు కిడ్నాపర్లకు!
ఏదైనా ఒక కంపెనీ ఉద్యోగం ఆఫర్ చేసేటప్పుడు.. ఫ్యాకేజిలో హెల్త్ ఇన్సూరెన్స్ లేదా ఇతర ప్రయోజనాలను అందివ్వడం సర్వసాధారణం. కానీ ఆఫ్రికాకు చెందిన ఒక కంపెనీ మాత్రం 'కిడ్నాపింగ్ ఇన్సూరెన్స్' వెల్లడించింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూ.. కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.ఇక అసలు విషయానికి వస్తే.. వ్యాపారవేత్త అమన్ ధత్తర్వాల్తో, ప్రముఖ పాడ్‌కాస్టర్ కుశాల్ లోధా మాట్లాడుతూ.. ఒక ఆఫ్రికన్ కంపెనీ ప్లేస్మెంట్ల కోసం ఐఐఎంకు వచ్చి రూ.80 లక్షల ప్యాకేజీ ఆఫర్ చేసింది. కానీ అందులో రూ. 40 లక్షలు కిడ్నాపింగ్ ఇన్సూరెన్స్ కోసం కేటాయించిందని వెల్లడించాడు. అంటే ఆ డబ్బు కిడ్నాపర్ల కోసం అన్నమాట."ఈ సీటీసీ వర్సెస్ చేతికి అందే జీతం అనేది ఒక రకమైన మోసం అని నాకు అనిపిస్తోంది" అని లోధా అన్నారు. "ఈ కంపెనీ ఐఐఎం కలకత్తాకు వచ్చి, సంవత్సరానికి రూ. 80 లక్షలు ఇస్తామని ఆఫర్ చేసింది. పైగా ఇది ఆఫ్రికాకు చెందిన కంపెనీ. అక్కడ కిడ్నాప్‌లు చాలా సాధారణమని తెలుస్తోంది. కాబట్టి ఆ రూ. 80 లక్షల వార్షిక వేతనంలో, రూ. 40 లక్షలు జీతం కాగా.. మిగిలిన రూ. 40 లక్షలు కిడ్నాపింగ్ ఇన్సూరెన్స్. అంటే.. కంపెనీలో పనిచేసే ఉద్యోగి ఎప్పుడైనా కిడ్నాప్‌కు గురైతే.. రూ.40 లక్షలు కిడ్నాపర్లకు చెల్లించి విడిపించుకుంటుందన్న మాట. అయితే లోధా ఆ కంపెనీ పేరును వెల్లడించలేదు.ఇదీ చదవండి: 'ఒరాకిల్'లో ఉద్యోగం పోయినా లైఫ్ సెట్: ఈ ప్లానింగ్ మీకుందా?ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఒకవేళా కిడ్నాపర్లకు రూ.40 లక్షల కంటే ఎక్కువ డిమాండ్ చేస్తే?, ఆ తరువాత సంవత్సరం క్లెయిమ్ చేసుకోవాలా? అని కొందరు పేర్కొన్నారు. ఒకవేలా సన్నిహితులు కూడా ఆ డబ్బుకోసం ఉద్యోగిని కిడ్నాప్ చేయొచ్చు కదా అని ఇంకొందరు అన్నారు. -
బెంగళూరు ఐటీలో అలజడి.. 80 శాతం ఉద్యోగాలకు AI ఎసరు..
-
'ఒరాకిల్'లో ఉద్యోగం పోయినా లైఫ్ సెట్: ఈ ప్లానింగ్ మీకుందా?
ఓ సంస్థలో ఉద్యోగం కోల్పోయిన తరువాత.. చాలామంది ఉద్యోగులు భయపడతారు, బాధపడతారు. కానీ ఒరాకిల్ కంపెనీ తొలగించిన ఒక ఉద్యోగి మాత్రం ఇందుకు భిన్నం. ఉబెర్ డ్రైవర్‌గా పనిచేసుకుంటూ కుటుంబంతో సంతోషంగా ఉన్నారు. దీనికి సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నా సన్నిహితులలో ఒకరిని ఒరాకిల్ బెంగళూరు సంస్థ.. ఉద్యోగం నుంచి తొలగించింది. అతడు ఎలాంటి ఆందోళన, ఒత్తిడికి లోను కాకపోవడమే కాకుండా.. సోషల్ మీడియాలో కూడా ఆ విషయాలను వెల్లడించలేదు. జాబ్ కోల్పోయిన తరువాత వెంటనే తన సొంత ఊరైన భువనేశ్వర్‌కు తిరిగి వచ్చేశాడు.అయితే.. అతనికి రెండు జాయింట్ అకౌంట్స్ ఉన్నాయి. వాటిలో.. ఒక్కొక్కదానిలో రూ.15 లక్షల చొప్పున పోస్టల్ ఫిక్స్డ్ డిపాజిట్లు చేసుకున్నాడు. ఒకటి అతని తల్లిదండ్రుల పేరు మీద, మరొకటి అతని, అతని భార్య పేరు మీద ఉంది. అతని పిల్లల ఖాతాలో కూడా ఒకటి ఉంది. వీటన్నింటి ద్వారా అతనికి ప్రతి నెలా దాదాపు రూ.28,000 వడ్డీ వస్తుంది.పోస్టల్ ఫిక్స్డ్ డిపాజిట్లు కాకుండా.. అతనికి కొన్ని బ్యాంకులలో దాదాపు రూ.30 లక్షల విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఉన్నాయి, వీటి ద్వారా అతనికి నెలకు మరో రూ.15,000 వస్తుంది. అతను ఇప్పుడు తన తల్లిదండ్రులతో కలిసి సొంత ఇంట్లో నివసిస్తున్నాడు. అతనికి డ్రైవింగ్ వచ్చు, కాబట్టి అతను వెంటనే తనకు వీలైనప్పుడు ఉబెర్ డ్రైవర్‌గా పనిచేస్తూ మంచి సంపాదన పొందుతున్నాడు.ఇదీ చదవండి: ఆ రైల్వే స్టేషన్‌కు వెళ్లాలంటే.. పాస్‌పోర్ట్, వీసా ఉండాల్సిందే!అతనికి ఈఎంఐలు లేవు, ఏ మెట్రో నగర ఫ్లాట్‌కు లోన్స్ లేవు. అదే సమయంలో, అతను తన తల్లిదండ్రుల సహాయంతో ఒక చిన్న వ్యాపారాన్ని ప్రారంభించడానికి ప్రశాంతంగా ప్రణాళిక వేస్తున్నాడు. ఆయన ఎప్పుడూ ఇన్ఫ్లుయెన్సర్లను అనుసరించలేదు, SIPలు చేయలేదు, ఆర్థిక హడావుడికలకు దూరంగా ఉన్నారు. పూర్తిగా పాత పద్ధతుల మనస్తత్వం, స్థిరమైన ప్రక్రియ, క్రమశిక్షణ.కాబట్టి.. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ ముందుగానే ప్రణాళిక వేసుకోవాలి. జాబ్ ఉన్నా.. లేకున్నా మీ ఆర్ధిక క్రమ శిక్షణ మిమ్మల్ని కాపాడుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా, ఎల్లప్పుడూ చిరునవ్వుతో సిద్ధంగా ఉండటమే నేను నేర్చుకున్న అతిపెద్ద పాఠం అని నాయక్ సత్య అనే ట్విటర్ యూజర్ ఈ విషయాలు షేర్ చేశారు.One of my close friends was fired from Oracle Bangalore.No panic, no stress, and no crying on social media. He straight away came back to his hometown Bhubaneswar He had postal fixed deposits in two joint accounts ₹15 lakh each. One with his parents, and the other in his…— Nayak Satya (@NayakSatya_SG) April 5, 2026 -
డిగ్రీ మీ ఉద్యోగాన్ని కాపాడదు!.. ఏం చేయాలో తెలుసా?
ప్రపంచం వేగంగా మారుతోంది. గతంలో మాంద్యం, కరోనా మహమ్మారి వంటి పరిస్థితులు అన్ని రంగాలపై ఒకేలా ప్రభావం చూపలేదు. అదే విధంగా.. ప్రస్తుతం జరుగుతున్న AI కూడా ప్రతి ఉద్యోగాన్ని సమానంగా ప్రభావితం చేయదు. ఈ పరిస్థితుల్లో నిలబడే వారు ఎవరు అంటే?.. తమ ఉద్యోగాలను జాగ్రత్తగా ఎంపిక చేసుకున్నవారు. ముఖ్యంగా.. యంత్రాలు పూర్తిగా భర్తీ చేయలేని పనులను చేసే వారు భవిష్యత్తులో విజయవంతంగా ముందుకు సాగుతారు.AI సులభంగా చేసే పనులు➤డేటా ప్రాసెసింగ్➤ప్యాటర్న్ గుర్తింపు➤కంటెంట్ తయారీ➤నియమాల ప్రకారం పనిచేయడంవీటన్నింటిని ఏఐ సులభంగా చేయగలదు. అంటే.. ఇలాంటి ఉద్యోగాల్లో ఉన్నవారు ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం ఉత్తమం. లేదా కొత్త టెక్నాలజీ నేర్చుకోవడం మంచిది. లేకుంటే ఏ సమయంలో అయినా ఉద్యోగం కోల్పోవడానికి సిద్ధంగా ఉండాల్సిందే.AI చేయలేని పనులుAI ఎంత అభివృద్ధి చెందినా.. అన్ని రంగాల్లో, అన్ని పనులను చేస్తుందని అనుకోవడం పొరపాటు. కాబట్టి ఏఐ సమర్థవంతంగా చేయలేని పనులు కూడా ఉన్నాయి. ఈ జాబితాలో..భావోద్వేగ నైపుణ్యం: మనుషుల భావాలు అర్థం చేసుకోవడం, అనుభూతి చెందడం AIకు కష్టం.నిర్ణయాలు: నైతికత, అనుభవం, పరిస్థితుల ఆధారంగా తీసుకునే నిర్ణయాలు AIకి సవాలు.ఉన్నత స్థాయి క్రియేటివిటీ: “ఏం చేయాలి?” అనే ఆలోచన మనిషి దగ్గరే ఉంటుంది. కాబట్టి ఏఐ సొంతంగా ఆలోచించలేదు.అనూహ్య పరిస్థితుల్లో నైపుణ్యం: ఉదాహరణకు.. ఒక ప్లంబర్ పని. ప్రతిసారీ ఒకే సమస్య తలెత్తదు. ప్రతిసారీ కొత్త సమస్య పుడుతుంది.సురక్షితమైన ఉద్యోగాలు / AI ప్రభావం తక్కువగా ఉండే రంగాలు➜హెల్త్‌కేర్: డాక్టర్లు, నర్సులు, థెరపిస్టులు➜ట్రేడ్స్: ఎలక్ట్రిషియన్, ప్లంబర్, మెకానిక్➜మెంటల్ హెల్త్: కౌన్సిలర్, సైకాలజిస్టు➜AI రంగం: AI ఇంజనీర్, ప్రాంప్ట్ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ➜కాంప్లెక్స్ సర్వీసెస్: లాయర్లు, స్ట్రాటజిస్టులు➜క్రియేటివ్ రంగం: బ్రాండ్ స్ట్రాటజీ, కంటెంట్ డైరెక్షన్ఏఐ అధికంగా విజృంభిస్తున్న కాలంలో.. ఏ మాత్రం భయపడకుండా ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలి. ఈ రోజుల్లో కేవలం డిగ్రీ ఉంటే.. ఉద్యోగం సురక్షితంగా ఉంటుందనుకోవడం పొరపాటు. ఏఐ కూడా ఎదుర్కోలేని రంగాన్ని మీరు ఎంచుకోవాలి. అప్పుడే ముందుకు వెళ్లగలరు. -
ఉద్యోగం కోసం ఆఫీసుకు పోతే..: టెకీకి ఎదురైన అనుభవం!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా అభివృద్ధి చెందుతున్న.. ఈ కాలంలో టెక్నాలజీ రంగంలో పెద్ద మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవడం.. ఒక పెద్ద సమస్యగా మారింది. కంపెనీలు ఎక్కువగా ఏఐ టూల్స్, ఆటోమేషన్ వంటివాటిపై మొగ్గు చూపుతున్న కారణంగా.. చాలామంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగం పొందడం చాలా కష్టంగా మారింది.ఈ నేపథ్యంలో ఒక నిరుద్యోగ టెకీ.. పాతకాలపు విధానాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నాడు. అతని స్నేహితుడు నేరుగా కంపెనీలకు వెళ్లి ఉద్యోగం సెర్చ్ చేయమని సూచించడంతో.. దాన్నే ఫాలో అయ్యాడు. తాను ఉంటున్న నగరంలోనే ఏడు కంపెనీలను సందర్శించారు.మొదట రెండు పెద్ద కంపెనీలకు వెళ్లి ఉద్యోగం కోసం అడిగినప్పుడు, అక్కడి సిబ్బంది అతన్ని ఆశ్చర్యంగా చూసి, ఆన్లైన్లో అప్లై చేయమని చెప్పారు. అంతే కాకుండా అసలు వారు పేపర్ రెజ్యూమ్ తీసుకోలేదు. ఇంకో రెండు చిన్న కంపెనీలకు వెళ్లినప్పుడు, ఒక కంపెనీ ఆ జాబ్ పోస్ట్ చాలా కాలం క్రితం పెట్టారని, అది తప్పుగా మళ్లీ కనిపించిందని చెప్పారు. మరొక కంపెనీ అతని రెజ్యూమ్ తీసుకున్నప్పటికీ, ఆన్లైన్లో అప్లై చేయమని సూచించిందని అతడు పేర్కొన్నాడు.మిగిలిన మూడు కంపెనీల పరిస్థితి మరింత విచిత్రంగా ఉంది. రెండు కంపెనీలు అసలు అక్కడ లేవు. ఆఫీసులు ఖాళీగా ఉన్నాయి. చివరికి ఒక చోటకి అతను వెళ్లినప్పుడు, అది ఒక పెద్ద గది మాత్రమే ఉండి, అందులో ఇద్దరు వ్యక్తులు ల్యాప్‌టాప్‌లతో పని చేస్తూ కనిపించారు. వాళ్లను కంపెనీ గురించి అడిగితే.. వారు అయోమయంగా చూసి అతన్ని వెళ్లమని చెప్పినట్లు వెల్లడించాడు.ఇదీ చదవండి: ఒరాకిల్ భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు ప్రయోజనాలు!ఉద్యోగం సెర్చ్ చేస్తున్న క్రమంలో అతనికి ఎదురైన అనుభవాన్ని.. అతని సోషల్ మీడియాలో షేర్ చేసాడు. దీంతో ఆ పోస్ట్ చాలా వైరల్ అయింది. ఈ కాలంలో నేరుగా వెళ్లి ఉద్యోగం కోసం అడగడం ఉండదని.. ప్రస్తుతం ఎక్కువ కంపెనీలు ఆన్లైన్ రిక్రూట్మెంట్ పద్ధతులను అనుసరిస్తున్నాయని చాలామంది చెప్పారు. కొందరు మాత్రం అరుదుగా ఈ విధానం పనిచేసే అవకాశం ఉందని కూడా అభిప్రాయపడ్డారు. -
అసంఘటిత రంగంలో ఉపాధి మెరుగు
అసంఘటిత రంగంలో ఉపాధి అవకాశాలు 2025లో 6.18 శాతం పెరిగి 12,80,51,800కు చేరాయి. గతేడాది 74.52 లక్షల కొత్త అవకాశాలు వచ్చాయి. ఇందులో 35 లక్షల ఉపాధి అవకాశాలు ఇతర సేవల విభాగంలో ఏర్పడ్డాయి. ఈ వివరాలను అన్ఇన్కార్పొరేటెడ్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ (ఆసుసే) నిర్వహించిన సర్వేలో తెలిసింది. ఈ వార్షిక సర్వే వివరాలను కేంద్ర గణాంకాలు, ప్రణాళికల అమలు శాఖ విడుదల చేసింది. 2023 అక్టోబర్ చివరికి ఈ రంగలో ఉపాధి అవకాశాలు 12,05,99,800గానే ఉన్నాయి.అసంఘటిత రంగంలో సంస్థల సంఖ్య 7.34 కోట్ల నుంచి 7.92 కోట్లకు పెరిగింది. ముఖ్యంగా ఇతర సేవల విభాగంలో సంస్థల సంఖ్య 10.29 శాతం పెరిగింది. ఆ తర్వాత తయారీ రంగంలో 6.48 శాతం, వాణిజ్య విభాగంలో 6.18 శాతం చొప్పున కొత్త సంస్థలు అవతరించాయి. ఆర్థిక పనితీరును సూచించే స్థూల విలువ జోడింపు (జీవీఏ) 10.87 శాతం ఎగిసింది. ట్రేడ్ విభాగంలో 16.77 శాతం, తయారీలో 8.52 శాతం, సేవల విభాగంలో 7.36 శాతం మేర జీవీఏ వృద్ధి ఇందుకు దోహదం చేసింది. ఇతర సేవల విభాగం వాటా జీవీఏలో 42 శాతంగా ఉంటే, ట్రేడ్ విభాగం 37 శాతం, తయారీ 21 శాతం వాటా ఆక్రమిస్తున్నాయి. ఒక్కో కారి్మకుడి జీవీఏ (కార్మికుల ఉత్పాదకత) 2023–24లో ఉన్న రూ.1,49,742 నుంచి రూ.1,56,539కు చేరింది. అన్ఇన్కార్పొరేటెడ్ అంటే వ్యవసాయేతర రంగాల్లోని ప్రైవేటు సంస్థలతో కూడినది కావడం గమనార్హం. మహిళా సంస్థల్లో వృద్ధి..మహిళల ఆధ్వర్యంలోని సంస్థలు 2023–24లో 26.2 శాతంగా ఉంటే, 2025లో 27 శాతానికి పెరిగాయి. ఒక్కో ఉద్యోగికి చెల్లించే వేతనం గతేడాది 3.88 శాతం పెరిగింది. ముఖ్యంగా ట్రేడ్ విభాగంలో కారి్మకుల వేతనం అత్యధికంగా 8.5 శాతం పెరగడం గమనార్హం. ఇంటర్నెట్ను వినియోగించే సంస్థల సంఖ్య సైతం 26.7 శాతం నుంచి 39.4 శాతానికి పెరిగాయి. వ్యాపార నిర్వహణలో టెక్నాలజీ స్వీకరణను ఇది తెలియజేస్తోంది. దేశవ్యాప్తంగా 6,70,289 సంస్థల డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందించారు.ఇదీ చదవండి: హోటల్ బిల్లులో సర్వీస్ ఛార్జీ.. చెల్లించాలా? వద్దా? -
ఒక్క ఉద్యోగమూ పోదు.. దుబాయ్ కంపెనీ అధినేత హామీ
పశ్చిమాసియాలో నెలకొన్న తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో తమ ఉద్యోగుల భవిష్యత్తుపై నెలకొన్న ఆందోళనలకు దుబాయ్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, డానుబే గ్రూప్ వ్యవస్థాపకుడు రిజ్వాన్ సాజన్ తెరదించారు. తన సంస్థలో పనిచేస్తున్న 6,000 మందికి పైగా ఉద్యోగులకు ఆయన కొండంత అండగా నిలిచారు. ఈ క్లిష్ట సమయంలో ఎవరి ఉద్యోగానికి డోకా లేదని, అందరికీ సకాలంలో వేతనాలు అందుతాయని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు.కుటుంబంలా అండగా ఉంటాంఇటీవల ఇన్ స్టాగ్రామ్ వేదికగా రిజ్వాన్ సాజన్ స్పందిస్తూ భావోద్వేగపూరితమైన పోస్ట్ చేశారు. "మా 6,000 మందికి పైగా ఉద్యోగులు మమ్మల్ని విశ్వసించి, డానుబే గ్రూప్‌ను ఇటుక ఇటుక పేర్చి నిర్మించారు. నేడు వారికి అండగా నిలవడం నా కనీస బాధ్యత. మా గ్రూప్‌లో ఎటువంటి తొలగింపులు ఉండవు, అందరికీ జీతాలు సకాలంలో అందుతాయి" అని ఆయన ప్రకటించారు.ఈ నిర్ణయం పట్ల నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. "ఇది 6,000 మంది ఉద్యోగుల విషయం మాత్రమే కాదు, 6,000 కుటుంబాల జీవనాధారం. మీరు నిజమైన నాయకుడు" అంటూ నెటిజన్లు ఆయనను కొనియాడుతున్నారు.హార్డ్‌వేర్ షాప్ నుంచి బిలియనీర్ స్థాయికి..రిజ్వాన్ సాజన్ ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. 1993లో కేవలం కొన్ని వేల దిర్హామ్‌లతో దుబాయ్‌లో అడుగుపెట్టిన ఆయన, మొదట ఒక హార్డ్‌వేర్ దుకాణంలో పనిచేశారు. 1993లోనే 'డానుబే' పేరుతో చిన్న వ్యాపారాన్ని ప్రారంభించారు. 2014లో 'డానుబే ప్రాపర్టీస్'ను స్థాపించి రియల్ ఎస్టేట్ రంగంలో సంచలనం సృష్టించారు. ఆయన సంస్థ నేడు సుమారు 5.13 బిలియన్ దిర్హామ్‌ల వార్షిక ఆదాయాన్ని గడిస్తోంది. దుబాయ్‌తో పాటు భారత్, సౌదీ అరేబియా, ఒమన్, ఖతార్, చైనా దేశాలకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు.ఇటీవల దుబాయ్‌లో 55 అంతస్తుల వాణిజ్య టవర్‌ను నిర్మించి, దానికి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) పేరు పెట్టడం విశేషం. ఫోర్బ్స్ మిడిల్ ఈస్ట్ ప్రకటించిన "2025 టాప్ 10 అత్యంత ప్రభావవంతమైన రియల్ ఎస్టేట్ లీడర్స్" జాబితాలో రిజ్వాన్ సాజన్ చోటు సంపాదించుకున్నారు. సంక్షోభ సమయాల్లో కంపెనీలు వ్యయ నియంత్రణ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్న తరుణంలో, రిజ్వాన్ సాజన్ తీసుకున్న ఈ నిర్ణయం కార్పొరేట్ ప్రపంచంలో చర్చనీయాంశంగా మారింది. View this post on Instagram A post shared by Rizwan Sajan (@rizwan.sajan) -
'ఏఐ ఎంత ఎదిగినా.. వీళ్ల ఉద్యోగానికి డోకా లేదు'
అన్ని రంగాల్లోనూ ఏఐ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో.. చాలామంది ఉద్యోగాలు పోతాయేమో అనే భయం గుప్పెట్లో చిక్కుకున్నారు. దీనిపై కొందరు నిపుణులు మిశ్రమంగా స్పందించారు. ఇప్పుడు తాజాగా అమెరికాకు చెందిన రక్షణ సాంకేతిక సంస్థ పలాంటిర్ టెక్నాలజీస్.. సీఈఓ 'అలెక్స్ కార్ప్' ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో కృత్రిమ మేధస్సు (AI) యుగంలో కూడా ఎవరు ఎదుగుతారు? అనే విషయంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.ఏఐ వల్ల ఎంతమంది ఉద్యోగాలు కోల్పోయినా.. రెండు రకాల వ్యక్తులు మాత్రం భవిష్యత్తులో ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. మొదటివారు 'వృత్తి ఆధారిత నైపుణ్యాలు' కలిగిన వారు. ఉదాహరణకు మెకానిక్‌లు, ఎలక్ట్రిషన్లు, టెక్నీషియన్లు వంటి ప్రాక్టికల్ పనులు చేసే వ్యక్తులు. ఈ పనులను పూర్తిగా AI చేత భర్తీ చేయడం కష్టం.రెండవ వర్గం 'న్యూరోడైవర్జెంట్' వ్యక్తులు. అంటే న్యూరోడైవర్సిటీ అనే భావనకు చెందిన వారు. సాధారణంగా కాకుండా.. భిన్నంగా ఆలోచించే వారు, కొత్త మార్గాలను అనుసరించే వారు, సృజనాత్మకంగా సమస్యలను పరిష్కరించే వారు వీరందరూ ఈ వర్గంలోకి వస్తారని అలెక్స్ కార్ప్ పేర్కొన్నారు.సంప్రదాయ ఉద్యోగాలైన.. సాధారణ కోడింగ్, లా వర్క్, లేదా రీడింగ్, రైటింగ్ వంటి పనులను ఏఐ సులభంగా చేస్తుంది. అంటే ఈ రకమైన ఉద్యోగాలు చేసేవారు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. అంటే ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ రంగాల్లో పనిచేసేవారు.. తప్పకుండా నైపుణ్యాలను పెంచుకోవాల్సి ఉంటుంది.భవిష్యత్తులో ఎక్కువ ప్రాముఖ్యత పొందేది సృజనాత్మకత, ఒరిజినల్ ఆలోచన, కొత్తదనం సృష్టించే సామర్థ్యం మాత్రమే అని అలెక్స్ కార్ప్ పేర్కొన్నారు. మనం ఒక ఆర్టిస్ట్ మాదిరిగా ఆలోచించడం నేర్చుకోవాలి. విషయాలను భిన్న కోణాల్లో చూడగలగడం, కొత్త పరిష్కారాలను కనుగొనడం చాలా ముఖ్యం అవుతుంది. ఇలాంటి వాళ్లను ఏఐ కూడా ఏమీ చేయలేదు. కాబట్టి వృత్తి నైపుణ్యాలు కలిగిన వారు, భిన్నంగా ఆలోచించే వ్యక్తులు ఏఐ ప్రపంచంలో కూడా ముందంజలో ఉండే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు.ఇదీ చదవండి: వారంలో తారుమారు.. బంగారం ధరల్లో ఇంత మార్పా! -
రూ. 25 కోట్లు : జంట ఘరానా మోసం.. చివరికి
బెంగళూరులోకోర్టులో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి వందలాది మంది నిరుద్యోగులను మోసం చేసిన దంపతులను బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రతీ బాధితుడి నుంచి దగ్గరినుంచి లక్షల్లో వసూలు చేసిన సంగతి ఆలస్యంగా వెలుగులో కిచ్చింది. ఇలా కోట్ల రూపాయలు దండుకున్న వైనం దిగ్భ్రాంతి రేపింది.ఉద్యోగాల పేరుతో భారీ మోసానికి పాల్పడిన జేసన్ డిసౌజా, లవీనా దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వందలాది మంది నిరుద్యోగులను మోసం చేసి సుమారు రూ.25 కోట్ల మేర దండుకున్నారు.పోలీసులు అందించిన సమాచారం ప్రకారం నిరుద్యోగులు, ప్రైవేట్ రంగ ఉద్యోగులే లక్ష్యంగా వీరు వల విసిరారు. వివిధ కోర్టుల్లో 'డి-గ్రూప్' ఉద్యోగాలు ఇప్పిస్తామని వందలాదిమందిని నమ్మించారు. ఒక్కో బాధితుడి నుంచి రూ.10 లక్షల నుండి రూ. 25 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం.అంతేకాదు బాధితులను నమ్మించేందుకు జడ్జీల సంతకాలను ఫోర్జరీ చేయడమే కాకుండా, నకిలీ నియామక పత్రాలను (Appointment Orders) కూడా తయారు చేశారు. తమ నెట్ వర్క్‌ను విస్తరించుకునేందుకు పలువురు ఏజెంట్లను నియమించుకున్నారు. వీరి దందా కోసం నియమించుకున్న ఏజెంట్లు బాధితులను వెతికి పట్టుకుని, వారిని ఒప్పించి డబ్బులు వసూలు చేసేవారు. ఇందులో ఏజెంట్లు తమ కమిషన్ ఉంచుకుని మిగిలిన మొత్తాన్ని దంపతులకు ఇచ్చేవారు.డాక్యుమెంట్ వెరిఫికేషన్ పేరుతో బాధితులను ప్రైవేట్ హోటళ్లకు పిలిపించేవారు. అక్కడ నకిలీ ఆఫర్ లెటర్లను చూపించి ఇది అసలైన రిక్రూట్మెంట్ అని నమ్మించి డబ్బులు వసూలు మొత్తం గుంజేవారు. డబ్బులు తీసుకున్న తర్వాత బాధితులు ఉద్యోగం ఎప్పుడు వస్తుందని అడిగితే, రకరకాల సాకులు చెప్పి చివరకు ఫోన్ నంబర్లు మార్చేసేవారు. తాము నిండా మునిగిపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఈ మోసం వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో షాకింగ్ నిజం బయటపడింది. అదేంటి అంటే ఈ దంపతులు ఇదే తరహా ఉద్యోగ మోసాల కేసులో 2024లో కూడా అరెస్ట్ అయ్యారు. జైలు నుండి విడుదలైన తర్వాత మళ్లీ అదే దందాను మొదలుపెట్టారు. బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన CCB పోలీసులు వీరిని అరెస్ట్ చేసి. ఈ కుట్రలో ఇంకా ఎవరెవరి భాగస్వామ్యం ఉందనే విషయంపై విచారణ జరుపుతున్నారు. -
జాబులు దాచిపెట్టి క్యాలెండర్ విడుదల... ఏపీలో 22 నెలల్లో ఒక లక్ష 72 వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ.. కేవలం 10 వేల 60 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్
-
మిగులు పోస్టులెన్ని?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా ‘కొలువుల జాతర’ద్వారా చేపట్టిన నియామక పత్రాల పంపిణీ అనంతర పరిస్థితులపై సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) పరిశీలన చేపట్టింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత రెండేళ్ల కాలంలో పెద్దసంఖ్యలో ఉద్యోగాల భర్తీ చేపట్టిన సంగతి తెలిసిందే. గ్రూప్–1 నుంచి గ్రూప్–4 వరకు, టీచర్లు, లెక్చరర్లు, పోలీస్ విభాగాల్లో కానిస్టేబుల్ నుంచి సబ్ ఇన్స్పెక్టర్ వరకు, మెడికల్ ఆఫీసర్, నర్సు లు, ఫార్మాసిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్... ఇలా దాదాపు 70 వేల ఉద్యోగ ఖాళీలకు పరీక్షలు నిర్వహించి అర్హులకు నియామకపత్రాలను జారీ చేసి నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇందులో మెజార్టీ అభ్యర్థులకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా నియామకపత్రాలు పంపిణీ చేశారు. పత్రాలు అందుకున్న వారిలో ఎంతమంది ఉద్యోగాల్లో చేరారు? ఎంతమంది ఉద్యోగాలను వద్దనుకున్నారు? అందుకు ప్రధాన కారణాలను గుర్తించేందుకు జీఏడీ పరిశీలన ముమ్మరం చేసింది. ఇలా ఇవ్వండి... ఉద్యోగ ఖాళీల భర్తీకి వివిధ నియామక సంస్థలు నోటిఫికేషన్లు జారీ చేశాయి. ప్రధానంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీజీపీఎస్సీ), తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు, తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామకాల బోర్డు, తెలంగాణ వైద్య, ఆరోగ్య సర్వీసుల నియామకాల బోర్డు ద్వారా ఉద్యోగాల భర్తీ చేపట్టారు. అర్హత పరీక్షలు నిర్వహించిన నియామక సంస్థలు అర్హుల జాబితాలను సమర్పించడంతో నియామక పత్రాలను ప్రభుత్వం జారీ చేసింది. గడువులోగా రిపోర్టు చేయకుంటే సదరు ఉద్యోగావకాశాన్ని రద్దు చేయనున్నట్లు ఆయా అభ్యర్థులకు స్పష్టం చేసింది. ఇప్పటికే ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారుల నుంచి సమాచారం సేకరించిన జీఏడీ... ప్రత్యేక ఫార్మాట్ రూపొందించి ఉద్యోగాల్లో చేరిన, చేరని వారి వివరాలను ఆయా శాఖల నుంచి సేకరిస్తోంది. ఉద్యోగ కేటగిరీ, అర్హత సాధించిన అభ్యర్థి హాల్‌టికెట్ నంబర్, పేరు, జిల్లా/జోన్/మల్టీజోన్ కేటగిరీ, ఉద్యోగంలో చేరిన తేదీ, డిలీటెడ్ వేకెన్సీ తదితర వివరాలున్నాయి. ఉద్యోగంలో చేరకుంటే అందుకు గల కారణాన్నీ వివరించాలని సూచించింది. కొందరు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు అర్హత సాధించడంతో వారంతా మెరుగైన పోస్టును ఎంచుకున్నారు. ఇలాంటి వారి వివరాలను కూడా స్పష్టంగా ఇవ్వాలని చెప్పింది. ఈ సమాచారాన్ని అందించేందుకు ఆయా శాఖలు తర్జనభర్జన పడుతున్నాయి. ఖాళీలపై స్పష్టత ఎంతమంది కొలువుల్లో చేరారో తెలుసుకునేందుకు జీఏడీ ఒకవైపు చర్యలు చేపట్టగా... మరోవైపు శాఖల వారీగా ఖాళీల వివరాలను సమర్పించాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. దీంతో రెండు అంశాలకు వేర్వేరుగా సమాచారాన్ని ఆయా శాఖలు సిద్ధం చేశాయి. ఇటీవల జీఏడీ ఆధ్వర్యంలో ఉద్యోగాల్లో చేరికలకు సంబంధించి సమీక్షలు కూడా జరిగాయి. నియామకపత్రాలు అందించిన వాటిలో అన్ని కేటగిరీల్లో రిపోర్టింగ్ గడువు ముగిసింది. వచ్చే సోమవారం కల్లా ఆయా శాఖలు వివరాలను అందించాల్సి ఉంటుంది. గ్రూప్–1 కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తర్వాత తొలిసారిగా గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ గతేడాది పూర్తయింది. ప్రభుత్వం పలు ఆటంకాలను అధిగమించి ఒకేసారి 563 ఉద్యోగాలను భర్తీ చేసింది. తొలి నోటిఫికేషన్ కావడం... అందులోనూ పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయడం టీజీపీఎస్సీ పరపతికి గీటురాయిగా నిలిచింది. ప్రతిష్టాత్మకంగా భర్తీ చేసిన గ్రూప్–1 ఉద్యోగాల్లో ఎంతమంది అభ్యర్థులు చేరారనే అంశంపై కమిషన్ కూడా ఆయా శాఖలకు ప్రత్యేక ఫార్మాట్ పంపి సమాచారాన్ని సేకరిస్తోంది. -
యూఏఈలో ఉపాధి.. వీసా, విమాన టికెట్ ఉచితం
మోర్తాడ్(బాల్కొండ): యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)లో ఉపాధి విస్తరణకు ఏడీఎన్‌హెచ్, జీటీఎం సంస్థలు మరోసారి ఉచిత నియామకాల మేళా నిర్వహించనున్నాయి. కేటరింగ్ విభాగంలో ఇప్పటికే ఎంతో మందికి ఉచితంగానే వీసాలు, విమాన టికెట్లు అందించిన ఈ రెండు సంస్థలు.. మరో మూడు విభాగాల్లో ఉచిత వీసాలను జారీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి.తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు ఈ అవకాశం కల్పిస్తున్నాయి. గతంలో మాదిరిగా నిర్ణీత తేదీల్లో నియామకాల ర్యాలీలు కాకుండా వచ్చే దరఖాస్తులకు అనుగుణంగా ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జీటీఎం సంస్థ చైర్మన్ చీటీ సతీశ్‌రావు ‘సాక్షి’కి తెలిపారు. హెవీ, లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్లు, స్టీవార్డింగ్ సూపర్వైజర్లు, ఆఫీస్ బాయ్స్‌గా పని చేయాలనుకునే వారిని నేరుగా ఇంటర్వ్యూ చేస్తామన్నారు. వేతనం, అర్హతల వివరాలు.. హెవీ మోటార్ వెహికల్ డ్రైవర్లు, స్టీవార్డ్ సూపర్వైజర్లుగా ఎంపికైన వారికి నెలకు రూ.60 వేల చొప్పున, లైట్ డ్రైవర్లకు రూ.45 వేలు, ఆఫీస్ బాయ్స్‌కు రూ.25 వేల వరకు వేతనాలు చెల్లించనున్నారు. వసతి, భోజన సదుపాయాలు కంపెనీలు కల్పిస్తాయి. డ్రైవర్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు యూఏఈ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. స్టీవార్డ్ సూపర్వైజర్లుగా పని చేయాలనుకునేవారికి గతంలో గల్ఫ్‌లో పని చేసిన అనుభవం అవసరం. ఆఫీస్ బాయ్స్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు డిగ్రీ పాసై ఇంగ్లిష్ మాట్లాడగలగాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. మూడు రకాల పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు gulfjobsgtm @gmail.com మెయిల్‌కు వివరాలను పంపించాలని కంపెనీల ప్రతినిధులు సూచించారు. పూర్తి వివరాలకు జీటీఎం సంస్థ కార్యాలయాలు ఉన్న ఆర్మూర్ (83320 62299), నిజామాబాద్ (93916 61522), జగిత్యాల(83320 42299), సిరిసిల్ల(93916 61522)లలో సంప్రదించాలని పేర్కొన్నారు. -
ఏఐ ఆఫీసర్స్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మునుపెన్నడూ లేనివిధంగా వైట్–కాలర్ ఉద్యోగాలను తుడిచిపెట్టేస్తుందని టెక్ దిగ్గజాలు పదేపదే హెచ్చరిస్తున్నారు. ఈ భయాందోళనలు నిజమే అయినప్పటికీ ప్రముఖ ఆర్థిక సంస్థ మోర్గాన్ స్టాన్లీ విడుదల చేసిన నివేదిక భవిష్యత్తుపై స్పష్టమైన అంచనాను అందించింది. కృత్రిమ మేధ వల్ల అందరూ ముందస్తు పదవీ విరమణ చేయాల్సి వస్తుందని భావించాల్సిన అవసరం లేదని.. దానికి బదులుగా ఈ సాంకేతికత ఉద్యోగరంగ స్వరూపాన్ని మారుస్తుందని వెల్లడించింది. దీనివల్ల కొత్త తరం ఏఐ ఉద్యోగాలు పుట్టుకొస్తాయని, ఇందుకోసం ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని స్పష్టం చేసింది. – సాక్షి, స్పెషల్ డెస్క్మానవ శ్రమను భర్తీ చేయలేదుకొన్ని రకాల ఉద్యోగాలు యాంత్రీకరణ (ఆటోమేషన్) అయినప్పటికీ మరికొన్ని ఏఐ తోడ్పాటుతో మెరుగుపడతాయి. అలాగే పూర్తిగా సరికొత్త ఉద్యోగ అవకాశాలు పుట్టుకొస్తాయని నివేదిక నొక్కి చెప్పింది. చారిత్రక పరిణామాలను చూస్తే.. 150 ఏళ్లుగా విద్యుదీకరణ నుంచి ఇంటర్నెట్ వరకు చోటుచేసుకున్న ప్రధాన సాంకేతిక మార్పులు శ్రామిక శక్తిని సమూలంగా మార్చాయే తప్ప మానవ శ్రమను ఎప్పుడూ పూర్తిగా భర్తీ చేయలేదని మోర్గాన్ స్టాన్లీ పరిశోధకులు చెబుతున్నారు. 1980ల్లో స్ప్రెడ్‌షీట్స్ ప్రాచుర్యంలోకి వచ్చినప్పుడు అవి బుక్కీపింగ్ క్లర్కుల అవసరాన్ని తగ్గించాయి. కానీ అదే సమయంలో మరింత సంక్లిష్టమైన పనులపై దృష్టి సారించడానికి అనలిస్టులకు సమయాన్ని ఆదా చేశాయి. ఆర్థిక రంగంలో సరికొత్త రకాల ఉద్యోగాలకు పునాది వేశాయని నివేదిక వివరించింది. ఏఐ నిపుణుల కొరత.. మ్యాన్‌పవర్ గ్రూప్ నిర్వహించిన గ్లోబల్ టాలెంట్ షార్టేజ్ సర్వే ప్రకారం.. భారత్‌లో నైపుణ్యం కలిగిన కార్మికుల కొరత ఈ ఏడాది విపరీతంగా పెరిగింది. దేశంలో ఈ కొరత రేటు 82% నమోదుకాగా, ప్రపంచ సగటు 72 శాతంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతిభావంతుల కొరత ఎక్కువగా ఉన్న మార్కెట్లలో టాప్–4లో భారత్ నిలిచింది. మొదటిసారిగా సంప్రదాయ ఇంజనీరింగ్, ఐటీ నైపుణ్యాలను అధిగమించి ఏఐ సంబంధిత నిపుణులు దొరకడం కష్టతరంగా మారింది. ఏఐ లిటరసీ, ఏఐ మోడల్ డెవలప్మెంట్ అత్యంత అరుదైన నైపుణ్యాలుగా గుర్తించారు. ప్రపంచవ్యాప్తంగా 41 దేశాల నుంచి 39 వేలకుపైగా కంపెనీలు సర్వేలో పాలుపంచుకున్నాయి. ఇందులో భారత్ నుంచి 3,051 ఉన్నాయి. ‘ఏఐ నైపుణ్యాల కోసం డిమాండ్ పెరుగుతోంది. అలా అని ఈ నూతన సాంకేతికత ఉద్యోగాలను భర్తీ చేయడం లేదు. బదులుగా పని చేసే విధానాన్ని ప్రాథమికంగా మారుస్తోంది’అని నివేదిక తెలిపింది. భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కోగల సంసిద్ధత కలిగిన నిపుణులను కంపెనీలు నియమించుకుంటున్నాయి. రానున్న రోజుల్లో.. నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రిసెర్చ్ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. ఏఐ ప్రభావం ప్రస్తుతం చాలా తక్కువగా ఉంది. అమెరికా, బ్రిటన్, జర్మనీ, ఆ్రస్టేలియా దేశాల్లోని దాదాపు 6 వేల మంది ఉన్నతస్థాయి అధికారులను పరిశోధకులు సర్వే చేశారు. మూడేళ్లలో 90 శాతానికి పైగా కంపెనీల ఉపాధి లేదా ఉత్పాదకత స్థాయిల్లో ఎటువంటి మార్పు రాలేదని గుర్తించారు. అలాగే కార్మికుల ఉత్పాదకతపైనా కృత్రిమ మేధ ప్రభావం ఏమీ లేదని 89% మంది నివేదించారు. ప్రస్తుత ప్రభావం స్వల్పంగా ఉన్నప్పటికీ, భవిష్యత్తులో పని ప్రదేశాల్లో ఏఐ తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుందని ఈ సంస్థలు ఆశాభావంతో ఉన్నాయి. మూడేళ్లలో ఏఐ రాకతో ఉత్పాదకత 1.4%, ఉత్పత్తి 0.8% పెరుగుతుందని ఎగ్జిక్యూటివ్‌లు నమ్ముతున్నారు. 75% వ్యాపార సంస్థలు ఏదో ఒక రూపంలో కృత్రిమ మేధను ఉపయోగిస్తాయని భావిస్తున్నారు. ఎలాంటి ఉద్యోగాలంటే.. ఏఐ సాంకేతికతను అమలు, మార్గనిర్దేశం చేయడానికి కంపెనీలు ఎగ్జిక్యూటివ్ స్థాయి ’చీఫ్ ఏఐ ఆఫీసర్స్’ను నియమిస్తున్నాయి. డేటా నిబంధనలు, విధానాల పర్యవేక్షణ, సమాచార భద్రతపై దృష్టి సారించే ’ఏఐ గవర్నెన్స్’ పాత్రకు ముఖ్యంగా ఆరోగ్య సంరక్షణ వంటి సున్నితమైన రంగాల్లో భారీ డిమాండ్ పెరగనుంది. వినియోగదారులకు సంబంధించిన రంగాల్లో ఏఐ పర్సనలైజేషన్ స్ట్రాటజిస్ట్, ఏఐ సప్లై–చైన్ అనలిస్ట్ వంటి కొత్త ఉద్యోగ ప్రొఫైల్స్ పుట్టుకురానున్నాయి. అదేవిధంగా పారిశ్రామిక రంగంలో ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్ ఇంజనీర్స్, స్మార్ట్ గ్రిడ్ అనలిస్ట్ వంటి హోదాలు అందుబాటులోకి రావొచ్చు. సహజ భాషలను ఆధారంగా చేసుకుని కోడింగ్ టూల్స్ పెరగడం వల్ల ఐటీ రంగంలో హైబ్రిడ్ పాత్రల కొత్త శకం ప్రారంభం కావొచ్చని నివేదిక చెబుతోంది. -
ఏఐ వాడకం.. అప్పుడొచ్చింది ఒక సందేహం!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అన్ని రంగాల్లోనూ వేగంగా అభివృద్ధి చెందుతోంది. అయితే ఈ టెక్నాలజీపై ఎక్కువగా ఆధారపడటం వల్ల తన వ్యక్తిగత నైపుణ్యాలు తగ్గుతున్నాయేమో అనే అనుమానం కలుగుతోందని ఒక యంగ్ బ్యాక్ఎండ్ ఇంజనీర్ ఆందోళనల వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.టెక్ ప్రొఫెషనల్ 11 నెలలుగా బ్యాక్ఎండ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. తాను రోజువారీ ఆఫీస్ పనుల్లో ఎక్కువ భాగం ఏఐ టూల్స్ సహాయంతోనే పూర్తిచేస్తున్నాడు. ముఖ్యంగా కర్సర్ ఏఐ కోడ్ ఎడిటర్ & క్లౌడ్ ఏఐ అసిస్టెంట్ వంటివి కోడ్ రాయడంలో, APIలు రూపొందించడంలో మాత్రమే కాకుండా.. ఇతర సాంకేతిక పనులను పూర్తి చేయడంలో సహాయం చేస్తున్నాయి. ఈ టూల్స్ ఇచ్చిన సూచనల ప్రకారం పనులు పూర్తి చేస్తున్నానని అతను తెలిపాడు.ఇలాంటి సమయంలో అతనిలో ఒక సందేహం కలిగింది. సుమారు ఏడాదిగా పనిచేస్తున్నప్పటికీ.. నేను నిజంగా ఏమి నేర్చుకున్నాను. నేను ఇప్పటికే కొత్తగా ఉద్యోగంలో చేరిన వ్యక్తి మాదిరిగానే ఉన్నానని తన పోస్టులో పేర్కొన్నాడు. ఒకరోజు కర్సర్ ఏఐ సాంకేతిక సమస్య వల్ల పనిచేయకుండా పోయింది. అప్పుడు నేనే ఆ పనిని పూర్తి చేయాల్సి వచ్చింది. కానీ నేను ఏఐ సహాయం లేకుండా స్వతంత్రంగా పనిచేయలేకుండా పోతున్నానని, పని కష్టమవుతోందని వాపోయాడు.టెక్ రంగంలోకి ప్రవేశించడం తనకు అంత సులభం కాదని కూడా సోషల్ మీడియా పోస్టులో వివరించాడు. 2023లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి.. అనేక ఇంటర్వ్యూలు విఫలమైన తర్వాత 2025లో ఉద్యోగం సంపాదించాడు. ఇప్పుడు ఏఐ ఉపయోగించకుండా.. చేయాల్సిన పని కష్టం అయితే.. ఉద్యోగం బహుశా పోవచ్చు కూడా.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కర్సర్ లేకుండా పని చేయడం కష్టమే అని కొందరు సీనియర్లు సరదాగా కామెంట్ చేశారు. ప్రస్తుతం ఏఐ ఉపయోగిస్తూ.. పని సులభంగా ఉందని సంబరపడిపోయే వారికి ఇదొక హెచ్చరిక అని ఇంకొందరు చెబుతున్నారు. -
రూ.26 లక్షల ఉద్యోగం.. అందుకే వదిలేసా!
సాధారణంగా ఎక్కడైనా ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగంలో స్థిరపడాలని చాలామంది అనుకుంటారు. కానీ ఒక వ్యక్తి ఏడాదికి రూ. 26 లక్షలు వేతనం వచ్చే జాబ్ తృణప్రాయంగా భావించి వదులుకున్నారు. ఎందుకు వదులుకున్నారో వివరణ ఇస్తూ ఒక ట్వీట్ కూడా చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.వెబ్సైట్ డిజైనర్ అయిన పుష్కర్ సోషల్ మీడియా పోస్ట్‌లో, ఉద్యోగంలో చిక్కుకుపోవడం తనకు ఇష్టం లేదని, జీతం కంటే వ్యక్తిగత జీవితానికే అధిక ప్రాధాన్యం అని వెల్లడించారు.ఉద్యోగం వదులుకోవాలనుకున్నప్పుడు.. చాలాసార్లు ఆలోచించాను. ఒక వైపు నేను సరైన నిర్ణయం తీసుకున్నానా? అనే సందేహం, మరోవైపు ఉద్యోగంలో నేను చిక్కుకోకూడదనుకుంటున్నాను అనే భావన. మొత్తానికి ఫ్రీలాన్సింగ్ కోసం ఉద్యోగం వదులుకున్నాను. ఇది కూడా అంత స్థిరంగా ఉండదు. ఇందులో కూడా చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. కానీ నాకు ఒక విషయం ఖచ్చితంగా తెలుసు. నేను ఆ ఉద్యోగంలో ఉంటే.. ప్రతిరోజూ పశ్చాత్తాపపడేవాడిని. కాబట్టి నేను నా మనసును నమ్ముకుని బయటకు వచ్చేశాను.ముఖ్యంగా పెద్ద నగరాల్లో, నెలకు చేతికి వచ్చే జీతం తన జీవితాన్ని మార్చేది కాకపోవచ్చు, ముఖ్యంగా మధ్యప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామం నుంచి వచ్చినందున ఏడాదికి రూ. 26 లక్షలు చాలాపెద్ద మొత్తం అని పుష్కర్ అన్నారు. దీనిపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు.మీ మీద నమ్మకం ఉంచండి, మీకు ప్రతిఫలం లభిస్తుందని కొందరు చెబుతుంటే.. వ్యక్తి విలువలకు అనుగుణంగా ఉన్నంత వరకు రెండు ఎంపికలు మంచివేనని ఇంకొందరు చెబుతున్నారు. ''మీరు సరైన నిర్ణయం తీసుకున్నారని నేను భావిస్తున్నాను. సామ్రాజ్య నిర్మాణంలో రిస్క్ తీసుకోవడం ప్రధానం'' అని మరికొందరు చెబుతున్నారు.A few days ago, I walked away from a ₹26 LPA job right at the time of onboarding.Since then I’ve had very mixed feelings.One side of me says I made the right decision. I didn’t want to get trapped in a job.The other side keeps asking… what if this was a huge mistake?…— Pushkar @ Website Designer (@in_pushkar) March 5, 2026 -
2033 నాటికి 9 కీలక ఉద్యోగాలకు ఎసరు!
ఎవరు ఒప్పుకున్నా.. ఒప్పుకోకపోయినా సాంకేతిక విప్లవంలో కృత్రిమ మేధ కీలకంగా వ్యవహరిస్తోంది. అది కొన్ని కంపెనీలు, ఉద్యోగులకు వరంగా మారితే ఇంకొందరికి శాపంగా మారుతోంది. ఆర్పీజీ ఎంటర్ప్రైజెస్ ఛైర్మన్, ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా ఇటీవల ఎక్స్ వేదికగా తన అభిప్రాయాలు పంచుకున్నారు. ఏఐ కార్పొరేట్, సామాన్య వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది. 2028 నుంచి 2033 మధ్య కాలంలో కృత్రిమ మేధ ఏయే వృత్తులను కబళించబోతుందో ఆయన విశ్లేషించిన తీరు, ఉపాధి భవిష్యత్తుపై చర్చకు దారితీసింది. గోయెంకా అంచనా ప్రకారం వివరాలు కింది విధంగా ఉన్నాయి.తొలి దశ: 2028 - 2029 (సాంకేతిక, సేవా రంగాల్లో మార్పులు)ఈ రెండేళ్ల కాలంలో ఏఐ కేవలం ఉద్యోగులకు సహాయకారిగా మాత్రమే కాకుండా నిర్ణయాత్మక శక్తిగా ఎదుగుతుందని గోయెంకా పేర్కొన్నారు. అందులో..సాఫ్ట్వేర్ కోడర్లు (2028): ఒకప్పుడు సాఫ్ట్వేర్ ఇంజినీర్ల బృందాలు చేసే పనిని ఏఐ స్వతంత్రంగా చేయనుంది. కోడ్ రాయడం, బగ్స్ ఫిక్స్ చేయడం, సిస్టమ్ ఆప్టిమైజేషన్ వంటి పనులను ఏఐ స్వతంత్రంగా నిర్వహించడంతో డెవలపర్ల అవసరం గణనీయంగా తగ్గుతుంది.డ్రైవింగ్, లాజిస్టిక్స్ (2029): సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ విస్తరిస్తుంది. దీనివల్ల టాక్సీ డ్రైవర్లు, ట్రక్ డ్రైవర్లు, డెలివరీ ఏజెంట్ల ఉపాధికి గండం పొంచి ఉంది.బోధన రంగం (2029): క్లాస్రూమ్ బోధన స్థానంలో పర్సనలైజ్డ్ ఏఐ ట్యూటర్స్ వస్తారు. విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి 24/7 అందుబాటులో ఉండే ఈ వ్యవస్థలు సంప్రదాయ ఉపాధ్యాయ వృత్తికి సవాలుగా మారుతాయి.రెండో దశ: 2030 - 2032 (వృత్తి నిపుణులపై ప్రభావం)వైద్యులు, రోగ నిర్ధారణ (2030): రోగ నిర్ధారణ విషయంలో ఏఐ మానవ వైద్యుల కంటే వేగంగా, కచ్చితంగా ఫలితాలను ఇస్తుంది. మెడికల్ ఇమేజింగ్, హిస్టరీ అనాలిసిస్ వంటివి పూర్తిగా ఏఐ మయం అవుతాయి.కళాకారులు, సృజనాత్మకత (2030): సంగీతం, పెయింటింగ్, రైటింగ్, డిజైనింగ్ వంటి రంగాల్లో ఏఐ సృష్టించే కంటెంట్ ఆధిపత్యం చెలాయిస్తుంది. సృజనాత్మకత అనేది కేవలం మానవుల సొత్తు అనే భావన చెరిగిపోనుంది.న్యాయవాదులు (2031): లీగల్ రీసెర్చ్, ఒప్పంద పత్రాల తయారీ వంటి పనులను ఏఐ సెకన్లలో పూర్తి చేస్తుంది. దీనివల్ల జూనియర్ న్యాయవాదుల డిమాండ్ పడిపోతుంది.మాన్యుఫాక్చరింగ్ (2031): ఫ్యాక్టరీలు పూర్తిస్థాయి ఆటోమేషన్‌కు చేరుకుంటాయి. విశ్రాంతి అవసరం లేని రోబోలు ఉత్పత్తి రంగంలో మానవ శ్రమను పూర్తిగా భర్తీ చేస్తాయి.సర్జన్లు (2032): శస్త్రచికిత్సల్లో రోబోటిక్ కచ్చితత్వం పెరుగుతుంది. సర్జన్ల పాత్ర కేవలం పర్యవేక్షణకు మాత్రమే పరిమితం కావచ్చు.2033 (రక్షణ రంగం)గోయెంకా అంచనాల ప్రకారం 2033 నాటికి యుద్ధ తంత్రం కూడా మారిపోతుంది. మానవ సైనికుల కంటే ఏఐ ఆధారిత స్వయంప్రతిపత్త ఆయుధ వ్యవస్థలు నిఘా, వ్యూహాత్మక దాడులను నిర్వహిస్తాయి. ఇది అంతర్జాతీయ రక్షణ వ్యవస్థలను మార్చేయనుంది.భవిష్యత్తు మంత్రంమారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కొత్త నైపుణ్యాలను నేర్చుకోవాలి. మార్పును ఆహ్వానిస్తూ ఏఐని ఒక పనిముట్టుగా వాడుకోవడం నేర్చుకోవాలి. యంత్రాలు చేయలేని సృజనాత్మక, వ్యూహాత్మక నిర్ణయాల్లో రాణించాలి. ఉద్యోగాలు పోతాయనే భయం కంటే ఏఐ సృష్టించే కొత్త అవకాశాలను ఎలా అందిపుచ్చుకోవాలనేదే నేటి యువత ముందున్న అసలు సవాలు.ఇదీ చదవండి: ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య వార్‌కు కారణం ఇదే.. -
ఏఐ దెబ్బ: ‘లివ్‌స్పేస్’లో వెయ్యి మంది అవుట్!
న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఏ రంగాన్నీ విడిచిపెట్టడం లేదు. ప్రపంచాన్ని ఏఐ రాజ్యమేలుతున్న ప్రస్తుత తరుణంలో హోమ్ ఇంటీరియర్ రంగంలో అగ్రగామి స్టార్టప్ సంస్థ ‘లివ్‌స్పేస్’ సంచలన నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేధ వినియోగాన్ని పెంచి, కార్యకలాపాలను పూర్తిగా ఏఐ ఆధారితంగా మార్చే క్రమంలో భాగంగా భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. సుమారు 1,000 మంది సిబ్బందిని, అంటే సంస్థలోని 12 శాతం సిబ్బందిని ఇంటికి పంపినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి.కేకేఆర్ (కేకేఆర్) లాంటి దిగ్గజ సంస్థల పెట్టుబడులతో రూపుదిద్దుకున్న ఈ యూనికార్న్ స్టార్టప్‌లో 7,000 నుండి 8,000 మంది వరకు సిబ్బంది ఉన్నారు. తాజా పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో భాగంగా డిజైనింగ్, సేల్స్, ఆపరేషన్స్, మార్కెటింగ్ విభాగాలపై ఏఐ ప్రభావం తీవ్రంగా పడింది. ఖర్చులను తగ్గించుకోవడమే కాకుండా రాబోయే రోజుల్లో సంస్థను ‘ఏఐ-నేటివ్ ఏజెంటిక్’ ఆర్గనైజేషన్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నట్లు కంపెనీ వెల్లడించింది.ఈ పరిణామాలపై కంపెనీ ప్రతినిధి స్పందిస్తూ, ఇది కేవలం పొదుపు చర్య మాత్రమే కాదని, వనరులను వ్యూహాత్మకంగా పునఃకేటాయించడంలో భాగమేనని అన్నారు. సాంకేతికతకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చే సంస్థగా కార్యకలాపాలను పూర్తిస్థాయిలో ఆటోమేషన్ చేస్తున్నట్లు వివరించారు. గతంలో మానవ వనరులతో సాధ్యమయ్యే పనులను ఇప్పుడు అధునాతన ఏఐ ఏజెంట్లు చేపడుతున్నాయని, దీనివల్ల ప్రస్తుతం ఉన్న బృందాల పనితీరు కూడా మెరుగుపడుతుందని సంస్థ భావిస్తోంది.లివ్‌స్పేస్ చరిత్రలో ఉద్యోగుల తొలగింపు ఇది మొదటిసారి కాదు. గతంలో 2020లో 400 మందిని, 2023లో దాదాపు 100 మందిని ఆర్థిక లక్ష్యాల సాధనలో భాగంగా తొలగించింది. ఆర్థిక ఫలితాల పరంగా చూస్తే 2025 మార్చి నాటికి ముగిసిన ఆర్థిక సంవత్సరంలో లివ్‌స్పేస్ తన ఆదాయాన్ని గణనీయంగా పెంచుకుంది. మునుపటి ఏడాది 1,185 కోట్లుగా ఉన్న ఆదాయం, తాజాగా 23 శాతం వృద్ధి చెంది 1,460 కోట్ల రూపాయలకు చేరుకుంది. అదే సమయంలో సంస్థ తన నష్టాలను కూడా 416 కోట్ల నుండి 242 కోట్లకు తగ్గించుకోగలిగింది. సుమారు 500 మిలియన్ డాలర్ల నిధులను సేకరించి, ఒక బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగిన సంస్థగా ఎదిగినప్పటికీ, మారిన సాంకేతిక పరిస్థితుల దృష్ట్యా ఈ కీలక నిర్ణయం తీసుకుంది.మరోవైపు సంస్థ నాయకత్వంలోనూ కీలక మార్పు చోటుచేసుకుంది. లివ్‌స్పేస్ సహ వ్యవస్థాపకుడు సౌరభ్ జైన్ తన పదవికి రాజీనామా చేశారు. 2015లో తన స్టార్టప్ ‘డిజైన్అప్’ను లివ్స్పేస్లో విలీనం చేసిన నాటి నుండి సంస్థలో కీలక పాత్ర పోషించిన ఆయన, 2022లో చీఫ్ బిజినెస్ ఆఫీసర్‌గా బాధ్యతలు చేపట్టారు. దాదాపు 11 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం తర్వాత తన వ్యక్తిగత కారణాలతో సంస్థ నుండి నిష్క్రమిస్తున్నట్లు ఆయన తెలిపారు. సాంకేతిక పరిణామాల నేపథ్యంలో నాయకత్వ మార్పులు కూడా సహజంగానే జరుగుతున్నాయని ఈ సందర్భంగా సంస్థ పేర్కొనడం గమనార్హం. ఇది కూడా చదవండి: ‘మూన్ మిషన్’కు బ్రేక్..‘నాసా’ కీలక ప్రకటన -
గ్లోబల్ జాబ్స్‌కు సెగ, ఎంట్రీ లెవల్ జాబ్స్ డేంజర్లో : IMF చీఫ్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఏఐ ఆధారిత సాంకేతికల వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగులపై భారీ ప్రభావం పడుతుందని IMF చీఫ్ క్రిస్టాలినా జార్జివా (Kristalina Georgieva) హెచ్చరించారు. ప్రపంచ శ్రామిక శక్తిలో 40 శాతం, ముఖ్యంగా ఎంట్రీ-లెవల్ ఉద్యోగాలు ప్రమాదంలో పడిపోయాయని అంచనా వేశారు. ఈ మార్పు "కార్మిక మార్కెట్లకు సునామీ" లాంటిదనిఆమె అభివర్ణించారు.అంతర్జాతీయ ద్రవ్య నిధి మద్దతుగల అధ్యయనాలను ప్రస్తావిస్తూ, అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థలలో ఈ సంఖ్య 60 శాతం వరకు పెరగవచ్చు కానీ భారతదేశానికి 26 శాతం వద్ద స్థిరపడే అవకాశం ఉందని ఆమె అన్నారు. సులభంగా ఆటోమేట్ చేయగల (యంత్రాల ద్వారా చేయగలిగే) పనులు, అంటే కొత్తగా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు చేసే ప్రారంభ స్థాయి ఉద్యోగాల విషయంలో ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ భారత్ AI ని సరిగ్గా వినియోగించుకుంటే, దేశ GDP ఏటా 0.7 శాతం పెరిగే అవకాశం ఉందని, ఇది దీర్ఘకాలిక వృద్ధి లక్ష్యాలకు తోడ్పడుతుందని పేర్కొన్నారు.అలాగే ప్రజలను AI ఆర్థిక వ్యవస్థకు సిద్ధం చేయడానికి ప్రభుత్వం సరైన విధానాలను (Policymaking) రూపొందించాలని, కేవలం నైపుణ్యాలు నేర్చుకోవడమే కాకుండా వాటిని మార్చుకునే సౌలభ్యం (Flexibility) ఉండాలని ఆమె సూచించారు.ఇదీ చదవండి: జెఫ్రీ ఎప్స్టీన్ బాధితురాలి నోట సంచలన విషయాలుఇండియాపై ప్రశంసలుపన్నులు, కార్మిక మార్కెట్లలో భారత్ చేపట్టిన సంస్కరణలు నిర్మాణాత్మక దేశాన్ని మరింత పోటీతత్వంతో మార్చాయని ఆమె ప్రశంసించారు. భారత బ్యాంకింగ్ , కార్పొరేట్ రంగాలు బలంగా ఉన్నాయని, ఇది పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించిందన్నారు. అమెరికా నేతృత్వంలోని 'పాక్స్ సిలికా' (Pax Silica) వంటి వ్యూహాత్మక కూటముల్లో భారత్ చేరడం వల్ల, గ్లోబల్ సప్లై చైన్‌లో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని, ఇది AI వల్ల కలిగే నష్టాల నుండి రక్షణ కల్పిస్తుందని ఆమె వివరించారు. AI ని అందరికీ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. ఇదీ చదవండి: పురుషుల్లో క్షీణిస్తున్న‘Y’ క్రోమోజోమ్: షాకింగ్ విషయాలు వెల్లడి -
ఉద్యోగాలకు చలిగాలి
నిరుద్యోగం జనవరిలో 5 శాతానికి పెరిగింది. 2025 డిసెంబర్లో ఇది 4.8 శాతంగానే ఉంది. జాతీయ గణాంక కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 15 ఏళ్లకు మించిన వారికి సంబంధించి నిరుద్యోగం జనవరిలో పెరిగినట్టు తెలుస్తోంది. కార్మికుల భాగస్వామ్య రేటు (ఎల్ఎఫ్పీఆర్), జనాభాలో పనిచేసే వారి నిష్పత్తి (డబ్ల్యూపీఆర్) సైతం తగ్గడం గమనార్హం. గ్రామీణ ప్రాంతాల్లో సాగు కాలం ముగియడం వంటి సీజనల్ ప్రభావాలే ఎల్ఎఫ్పీఆర్, డబ్ల్యూపీఆర్ తగ్గడానికి కారణమని ఎన్ఎస్వో తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ రంగం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో పనులు, రవాణా, వ్యాపార కార్యకలాపాలు శీతాకాలంలో నిదానించగా, పట్టణాల్లో మాత్రం వాణిజ్య కార్యకలాపాలు స్థిరంగా ఉన్నాయి. గ్రామీణ నిరుద్యోగం గత డిసెంబర్లో 3.9 శాతంగా ఉంటే, జనవరిలో 4.2 శాతానికి పెరిగింది. పట్టణాల్లో నిరుద్యోగ రేటు 6.7 శాతం నుంచి 7 శాతానికి చేరింది. జనవరిలో కార్మికుల భాగస్వామ్య రేటు దేశవ్యాప్తంగా 55.9 శాతంగా నమోదైంది. డిసెంబర్లో ఇది 56.1 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కార్మికుల భాగస్వామ్య రేటు 59 శాతం నుంచి 58.7 శాతానికి తగ్గింది. పట్టణ ప్రాంతాల్లో ఇది 50.2 శాతం నుంచి 50.3 శాతానికి స్వల్పంగా మెరుగుపడింది.మహిళా కార్మికుల భాగస్వామ్య రేటు జనవరిలో 35.1 శాతంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో 39.7 శాతం కాగా, పట్టణాల్లో 25.5 శాతంగా ఉండడం గమనార్హం. జనాభాలో పనిచేసే వారి నిష్పత్తి (డబ్ల్యూపీఆర్) 2025 జూన్‌లో 53.3 శాతంగా ఉంటే, డిసెంబర్ నాటికి 56.7 శాతానికి మెరుగుపడగా.. 2026 జనవరిలో తిరిగి 56.2 శాతానికి బలహీనపడింది. గ్రామీణ ప్రాంతాల్లో పురుషులకు సంబంధించి డబ్ల్యూపీఆర్ 75.7 శాతంగా, మహిళలకు సంబంధించి 38 శాతంగా ఉంది. పట్టణాల్లో పురుషులకు సంబంధించి 70.5 శాతం, మహిళలకు సంబంధించి 23 శాతం చొప్పున నమోదయ్యాయి. -
'నైపుణ్యం' గజిబిజి
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమల్లోకి తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్‌కు సంబంధించిన మార్గదర్శకాల్లో (రూల్స్) నిర్దేశించిన ఉద్యోగాలు తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నాయి. ఇప్పటి వరకు అమలు చేసిన నిబంధనల్లో ఉండే ఉద్యోగాల సంఖ్యకు తాజాగా కోత పడగా... కొత్తగా నిర్దేశించిన ఉద్యోగాలు చాలావరకు రిపీట్ అయ్యాయి. కొన్నిచోట్ల ఉద్యోగం పేరును యంత్రాలు, పనిముట్ల పేర్లతో ప్రకటించడం.. మరికొన్ని చోట్ల అర్థం లేని పదాలను వినియోగించడంతో కార్మికులు, కార్మీక సంఘాల్లో తీవ్ర అయోమయం నెలకొంది. దేశంలో దశాబ్దాలుగా అమల్లో ఉన్న 29 కార్మీక చట్టాలను రద్దు చేస్తూ ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఆయా చట్టాల్లో మార్పులు చేసిన కేంద్ర ప్రభుత్వం గతేడాది నవంబర్ 21 నుంచి నాలుగు లేబర్ కోడ్లను అమల్లోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత ఈ లేబర్కోడ్ల అమలుకు సంబంధించిన మార్గదర్శకాలను గతేడాది డిసెంబర్ 30న వెల్లడించింది. ఇందులో షెడ్యూల్ ‘ఇ’లో అత్యంత కీలకమైన ఉద్యోగాల ఖరారు పూర్తిగా గజిబిజిగా మారింది. ప్రధానంగా అన్ స్కిల్డ్ కేటగిరీ ఉద్యోగాలే స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కేటగిరీలో కనిపిస్తున్నాయి. మరికొన్ని హైలీ స్కిల్డ్ కేటగిరీలోనూ దర్శనమిస్తున్నాయి. అన్నింటా ఇదే తరహా ఉద్యోగాలుండడం గమనార్హం. నైపుణ్యానికి ఏదీ ప్రామాణికం ? ఉద్యోగాల విభజన పూర్తిగా నైపుణ్యంపై ఆధారపడి ఉంటుంది. అందులో భాగంగానే ఉద్యోగాల విభజన నాలుగు కేటగిరీలుగా చేశారు. ఎలాంటి నైపుణ్యం లేని ఉద్యోగాన్ని అన్ స్కిల్డ్‌గా, నైపుణ్యం ఆధారంగా ఉద్యోగాన్ని సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్‌గా ఖరారు చేయాల్సి ఉంటుంది. తాజాగా వెల్లడించిన మార్గదర్శకాల్లో పేర్కొన్న ఉద్యోగాల్లో చాలా వరకు అన్‌స్కిల్డ్ కేటగిరీలో ఉన్నవే సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్ కేటగిరీల్లో పునరావృతమయ్యాయి. అంతే కాకుండా నైపుణ్యం ఆధారంగా ఖరారు చేసే ఉద్యోగాలు కూడా అన్‌స్కిల్డ్ కేటగిరీలోకి తీసుకొచ్చారు. ఇలా ప్రమాణాలు లేకుండా ఉద్యోగాలు నిర్ధారించడం అందోళనకు గురి చేస్తోంది. – అన్ స్కిల్డ్ కేటగిరీలో జంపర్మెన్, కామిన్, కలాస్, బ్రిడ్జి, ఎలక్ట్రికల్, మరెన్, మోప్లా, స్టోర్, స్టీమ్రోడ్, షేర్, రోలర్ సర్వే, టాల్‌బాయ్, డిస్మెంటలింగ్ స్టాక్స్, క్యారీయర్, స్ట్రైకర్, నంబర్ టేకర్ ఉద్యోగాలున్నట్టు మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. కానీ ఇప్పటి వరకు ఇలాంటివేవీ ఉద్యోగాల పేర్లు కావని కార్మీక సంఘాలు చెబుతున్నాయి. – సెమీ స్కిల్డ్ కేటగిరీలో అటెండెంట్, హెల్పర్, బ్రేకర్, అసిస్టెంట్, గేట్ కీపర్, హామర్మెన్, స్టాకర్, కీమెన్, కలాసి, లేబర్, మాలీ ఉద్యోగాలను పేర్కొనగా.. ఇవన్నీ అన్‌స్కిల్డ్ కేటగిరీలోనూ చూపించారు. – డ్రైవర్, వాహనం మెకానిక్ హెల్పర్ ఉద్యోగాన్ని అన్ స్కిల్డ్లో చేర్చారు. కోల్‌మైన్ ఉద్యోగం కూడా అన్ స్కిల్డ్లో చూపారు. వాస్తవానికి డ్రైవర్, కోల్‌మైన్ ఉద్యోగాలకు నైపుణ్యం అవసరం. కానీ ఇక్కడ నైపుణ్యం లేని కేటగిరీలో చూపారు. సిగ్నల్‌మెన్ గతంలో సెమీ స్కిల్డ్ కేటగిరీలో ఉంటే ఇప్పుడు అన్ స్కిల్డ్ కేటగిరీలోకి తీసుకొచ్చారు. – సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్ కేటగిరీలో ఒకే రకమైన ఉద్యోగాలున్నాయి. వాటిని ఏ విధంగా వర్గీకరించాలనే దానిపై స్పష్టత లేదు. కొన్ని ఉద్యోగాలకు మాత్రం గ్రేడ్–1, 2, 3, క్లాస్–ఏ, బీ వర్గాలుగా ప్రకటించారు. అయితే ఈ ఉద్యోగాలకు ఎలాంటి ప్రమాణాలు కావాలి...ఎంతటి నైపుణ్యం ఉండాలనేది ఎక్కడా ప్రస్తావించలేదు. – రోడ్ రోలర్, మెకానికల్ రోడ్ రోలర్, ట్రాన్స్ప్రేయర్, వర్క్, పర్మనెంట్ వే, గ్యాంగ్, టోపస్, మిల్్కవ్రైటర్, పంప్, డంపర్, ఎక్సావేటర్, ఫోర్క్ లిప్్టŠ, జనరేటర్, గ్రేడర్, ట్రాక్టర్, వైబ్రేటర్ పేర్లు వివిధ కేటగిరీ ఉద్యోగాల జాబితాలో ఉన్నాయి. వాస్తవానికి ఈ పేర్లు యంత్రాలకు సంబంధించినవి. వీటిని ఉద్యోగ కేటగిరీలో చేర్చిన కేంద్ర ప్రభుత్వం... ఇందుకు సంబంధించిన నైపుణ్యం, వివరణ ఎలాంటివి ప్రస్తావించలేదు. ఇక వృత్తిలో అనుభవానికి సంబంధించిన అంశాన్ని కూడా వివరించలేదు. అస్తవ్యస్తంగా ఉద్యోగాల జాబితా లేబర్ కోడ్స్ మార్గదర్శకాల్లో ఉద్యోగాలన్నీ అస్తవ్యస్తంగా ఇచ్చారు. ప్రతి అంశాన్ని పకడ్బందీగా రూపొందించి నిర్ధారించుకోవాలి. కానీ కొత్తగా వచ్చిన లేబర్ కోడ్స్ ఉద్యోగాల నిర్ధారణలో అధికార యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించింది. వస్తువులు, యంత్రాల పేర్లను ఉద్యోగాల్లో చేర్చారు. కొన్నిచోట్ల బ్రిటిష్ కాలంలో వినియోగించిన మాలీ, బెల్ఉమెన్ లాంటి పేర్లను కూడా ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో కామన్ లాంగ్వేజీని వినియోగించకపోవడంతో ఉద్యోగాలు తలకిందులయ్యాయి. వీటన్నింటినీ సవరించాలి. త్వరలో కేంద్ర ప్రభుత్వానికి ఐఎన్టీయూసీ తరపున సవరణ ప్రతిపాదనలు సమర్పిస్తాం. ఉద్యోగ కేటగిరీలు నాలుగు నుంచి ఏడుకు పెంచాలని డిమాండ్ చేస్తాం. – దేవసాని బిక్షపతి, ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి, కనీస వేతన సలహా బోర్డు మాజీ సభ్యుడు -
సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఆలోచించాల్సిందే!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనే అంశంపై దేశంలో విస్తృత చర్చ జరుగుతోంది. ఈ సమయంలో.. భారత ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు వీ. అనంత నాగేశ్వరన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.ఏఐ ఉద్యోగాలపైన ఎలాంటి ప్రభావం చూపిస్తుందో.. ఖచ్చితమైన అంచనాలు వేయడం కష్టం. అయినప్పటికీ.. దీని పురోగతి వల్ల కోడింగ్ వంటి ఉద్యోగాలు ప్రమాదంలో పడతాయని ఆయన హెచ్చరించారు. ఉద్యోగుల తొలగింపులకంటే ఎక్కువగా.. నియామకాలపై ఎక్కువ ప్రభావం చూపించే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇప్పటికే ఈ మార్పు కొంతకాలంగా మొదలైందని.. శ్రీధర్ వెంబు వంటి వారు కూడా ఏఐ సాధనాలు కోడింగ్‌లో చాలా బాగా ఉపయోగపడుతున్నాయని చెప్పిన మాటలు గుర్తు చేశారు.సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసేవారు తమ భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉందని అనంత నాగేశ్వరన్ అన్నారు. ఏఐ ప్రభావానికి గురికాని ఉద్యోగాలు కూడా ఉన్నాయని ఆయన వెల్లడించారు.ఇందులో టూరిస్ట్ గైడ్స్, కేర్ ఎకానమీ (వృద్ధులు, పిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారి సంరక్షణ), ఆరెంజ్ ఎకానమీ (సంస్కృతి, సృజనాత్మకత, కంటెంట్ ఆధారిత రంగాలు) ఉన్నాయని పేర్కొన్నారు.ఇదీ చదవండి: భారత్ - అమెరికా డీల్.. కేంద్ర మంత్రి కీలక ప్రకటన!రిజర్వ్ బ్యాంక్ డిప్యూటీ గవర్నర్ పూనమ్ గుప్తా మాట్లాడుతూ.. ఏఐ మొత్తం ఉద్యోగాలపై సానుకూల ప్రభావం చూపిస్తుందని పేర్కొన్నారు. కొన్ని ఉద్యోగాలు నశించినా, కొత్త అవకాశాలు కూడా ఏర్పడతాయని అన్నారు. ముఖ్యమైన సవాలు ఏమిటంటే.. ఈ మార్పును సక్రమంగా నిర్వహిస్తూ.. యువత సిద్ధంగా ఉండాలని తెలిపారు.#NDTVProfitConclave2026 | V. Anantha Nageswaran, Chief Economic Adviser to @TamannaInamdar on AI and its impact Co-presented by: @NSEIndiaCo-powered by: @LICIndiaForever & @apollotyres Special Partners: @Niva_Bupa, APIS & Adani AirportsEnergy Partner: @kpgroupgujarat NBFC… pic.twitter.com/2LBMuPNI54— NDTV (@ndtv) February 7, 2026 -
గ్రూప్స్ ‘నవ తరం’గాలు
సాధారణ పేద కుటుంబాల నుంచి వచ్చిన అభ్యర్థులు ఏపీపీఎస్సీ గ్రూప్స్‌లో జయకేతనం ఎగురవేశారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వీరు ప్రణాళికబద్ధంగా చదివి ఉద్యోగాలు సాధించారు. క్రమశిక్షణతో కూడిన తర్ఫీదు, ప్రిపరేషన్, కఠోర సాధనే తమను గెలుపు వాకిళ్లలో నిలబెట్టిందని సగర్వంగా ప్రకటించారు. – సాక్షి ఎడ్యుకేషన్ నా తండ్రి కూరగాయల వ్యాపారి ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్ మాక్ ఇంటర్వ్యూ సమయంలో అడిగిన కొన్ని ప్రశ్నలు సర్వీస్ కమిషన్ ఇంటర్వ్యూలో ఎదురవడం కలిసొచ్చింది. కోచింగ్ చాలాబాగా ఉపయోగపడింది. నా తండ్రి తెనాలిలో కూరగాయల వ్యాపారి. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నేను గ్రూప్–1లో డీఎస్పీ ఉద్యోగం సాధించా. ఆనందంగా ఉంది. – అడపాల ఓంకార వెంకట నాగేశ్వరరావు, గ్రూప్–1 విజేత, తెనాలి సి‘విల్ పవర్‌తో’.. సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి గ్రూప్–1 కోసం ప్రిపేర య్యాను. రెండేళ్ళపాటు మరో ప్రపంచం తెలీకుండా పూర్తిగా గ్రూప్–1 కోసమే శ్రమించా. ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో సివిల్స్ కోసం తీసుకున్న కోచింగ్ గ్రూప్–1 విజయానికి చాలా సహాయపడింది. – భారతాల ఉదయ్ శంకర్, ఏపీపీఎస్సీ గ్రూప్–1 విజేత స్టడీ సర్కిల్ ‘మిత్ర’లాభం గ్రూప్–1 మెయిన్స్‌లో ఎక్కువ మార్కులు స్కోర్ చేయడానికి ఆర్సీరెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్లో తీసుకున్న క్లాసులు బాగా హెల్ప్ అయ్యాయి. ఇంటర్వ్యూ సమయంలో సర్కిల్ అసిస్టెంట్ డైరెక్టర్ సంఘ మిత్ర సలహాలు పనికొచ్చాయి. – బి.నిఖిలశ్రీ, ఏపీపీఎస్సీ గ్రూప్–1, విజేత దృఢ ‘సంకల్పసిద్ధి’ ఏపీపీఎస్సీ గ్రూప్–1లో సత్తాచాటి డిప్యూటీ కలెక్టర్ పోస్టుకు ఎంపికయ్యా. ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్ ఇచ్చిన బలమైన మద్దతుతో దృఢ సంకల్పంతో ముందడుగు వేసి విజయం సాధించా. – విఖిలశ్రీ, గ్రూప్1 విజేత, ఎన్టీఆర్జిల్లా శిక్షణ.. మంచి ‘స్కోర్’ ఆర్సీ రెడ్డి ఇన్స్టిట్యూట్లో తీసుకున్న ప్రత్యేక శిక్షణ కలిసొచ్చి ంది. ప్రిలిమ్స్, మెయిన్స్‌లోనూ మంచి స్కోర్‌కు ఉపయోగపడింది. గ్రూప్–1లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ పోస్టుకు ఎంపికయ్యాను. –నరహరిశెట్టి భానుప్రకాష్, గ్రూప్–1 విజేత, అవనిగడ్డ, కృష్ణాజిల్లా 50మందికిపైగా ఆర్సీ స్టడీ సర్కిల్ అభ్యర్థుల విజయం హైదరాబాద్ ఆర్సీ రెడ్డి స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్న అభ్యర్థులు అత్యధికులు ఏపీపీఎస్సీ గ్రూప్1లో ఉద్యోగాలు సాధించారు. మేం సిలబస్‌తోపాటు ఎగ్జామ్ ఓరియెంటేషన్పైనా దృష్టిసారిస్తాం. సీనియర్ ఫ్యాకల్టీలు అందుబాటులో ఉన్నారు. 43 ఏళ్లుగా స్టడీసర్కిల్ నడుపుతున్నాం. మా సంస్థ అభ్యర్థులు వేయిమందికిపైగా ఇప్పటి వరకు సివిల్స్ టాపర్లుగా రాణించారు. గత వారంలో ప్రకటించిన ఏపీపీఎస్సీ గ్రూప్–2 ఫలితాల్లోనూ అత్యధిక శాతం మంది విజేతలు మా సంస్థ వారే. మా నాన్న ఆర్సీ రెడ్డి జీవితకాల కృషి ఫలితం ఈ ఇన్స్టిట్యూట్. ఆయన స్ఫూర్తిని మా చెల్లి దీప్తితో కలిసి ముందుకు తీసుకెళ్తున్నా. –బి.సంఘమిత్ర, ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ అసిస్టెంట్ డైరెక్టర్ -
జాతీయ మీడియా ముందు ఏపీ పరువు తీస్తున్నారు!
-
ఉద్యోగపర్వం-1.. అమ్మో సోమవారం!
ప్రతి ఉద్యోగికి ఆదివారం సెలవు కదా. మధ్యాహ్నం వరకు అంతా బాగానే ఉంటుంది. కానీ, సూర్యుడు అస్తమిస్తున్న కొద్దీ.. మెల్లగా గుండెల్లో ఏదో తెలియని ఆందోళన. రేపు సోమవారం! మళ్ళీ అదే ఆఫీసు, అదే మెయిళ్ళు, అవే మీటింగులు. దీన్నే మానసిక శాస్త్రవేత్తలు 'సండే నైట్ బ్లూస్' (Sunday Night Blues) అంటారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 80 శాతం మంది ఉద్యోగులు ఈ రకమైన ఒత్తిడికి గురవుతున్నారని సర్వేలు చెబుతున్నాయి. అసలు సెలవు రోజైన ఆదివారమే ఈ భయం ఎందుకు మొదలవుతుంది?అదో ముందస్తు హెచ్చరికమన మెదడు చాలా తెలివైనది. అది ప్రమాదాన్ని ముందే గుర్తిస్తుంది. ఆఫీస్ అనేది రోజూ ఒత్తిడిని, అవమానాన్ని లేదా నిర్లక్ష్యాన్ని రుచి చూపించే స్థలమైతే.. ఆదివారం రాత్రే మీ శరీరం 'అలర్ట్ మోడ్'లోకి వెళ్తుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, నిద్ర పట్టకపోవడం, చిరాకు పెరగడం.. ఇవన్నీ మీలో మానసిక రక్షణ (సైకాలజికల్ సేఫ్టీ) కరువైందని చెప్పడానికి సంకేతాలు. ఇది డ్రామా కాదు, మీ మనసు పడుతున్న ఆవేదన.నా వద్దకు వచ్చిన సురేష్ అనే ఐటీ ఉద్యోగి కథే దీనికి ఉదాహరణ. సురేష్ ప్రతి ఆదివారం సాయంత్రం ఆరుగంటల నుంచే చిరాకు పడటం మొదలుపెట్టేవాడు. ఫలితంగా భార్యాపిల్లలతో గొడవలు జరిగేవి. "సోమవారం ఆఫీసులో ఏం జరుగుతుందో అన్న ఊహే నన్ను చంపేస్తోంది" అని అతను వాపోయాడు.అతని దినచర్యను గమనించినప్పుడు, అతను శుక్రవారం సాయంత్రం తన డెస్క్ మీద పనులన్నీ చిందరవందరగా వదిలేసి వచ్చేవాడని తెలిసింది.నేను అతనికి'ఫ్రైడే క్లోజర్'టెక్నిక్ నేర్పించా. శుక్రవారం వెళ్లేముందే సోమవారం చేయాల్సిన పనులను లిస్ట్ రాసి, డెస్క్ క్లీన్ చేసి రావడం వల్ల అతని 'సండే భయం' 70 శాతం తగ్గిపోయింది.భయపెట్టేది పని కాదు.. చాలామంది ‘పని ఎక్కువగా ఉంది’ అని భయపడుతుంటారని అనుకుంటారు. కానీ లోతుగా ఆలోచిస్తే, భయపెట్టేది పని కాదు.. వర్క్ ప్లేస్ లో ఎదురయ్యే అనుభవం.• ఆఫీసులో తగిన గౌరవం లేకపోవడం, ఏ మాట్లాడితే ఎవరు తప్పుగా అర్థం చేసుకుంటారో అన్న భయం, ఎంత చేసినా "ఇంకా ఏదో తక్కువైంది" అనే విమర్శ,ప్రతిరోజూ మనల్ని మనం నిరూపించుకోవాల్సిన ఈ ఒత్తిడే సోమవారం భయంగా రూపాంతరం చెందుతుంది.• శని, ఆదివారాలు మనకు నచ్చినట్టు ఉంటాం. సోమవారం రాగానే మళ్ళీ ఎవరికో సమాధానం చెప్పాలి, ఎవరో ఇచ్చిన రూల్స్ పాటించాలి. మనస్వేచ్ఛకోల్పోతున్నామనేభావనసోమవారం భయంగా రూపాంతరం చెందుతుంది.• శుక్రవారం ఆఫీసు వదిలేటప్పుడు ఏదైనా పనిని సగం లోనే వదిలేస్తే, అది ఆదివారం రాత్రికి భూతంలా గుర్తుకొస్తుంది.దీన్నేZeigarnik Effectఅంటారు. • వారం అంతా పడ్డ కష్టానికి రెండు రోజుల సెలవు సరిపోవట్లేదనే అసంతృప్తి సోమవారం మీద ద్వేషంగా మారుతుంది.సోమవారాన్ని స్వాగతించడానికిచిట్కాలు...కేవలం ‘పాజిటివ్ గా ఆలోచించు’ అంటే ఈ సమస్య పోదు. దీనికి అసలు మూలాలను వెతకాలి.ఈ భయం పని భారం నుంచా? వ్యక్తుల నుంచా? లేక గౌరవ లోపం నుంచా? అనేది స్పష్టంగా తెలుసుకోండి.• శుక్రవారం ఆఫీస్ వదిలే ముందే సోమవారం పనుల లిస్ట్ రాసి పెట్టుకోండి. అప్పుడు అసంపూర్ణ పనులు మెదడును ఆదివారం వేధించవు.• చాలామంది బట్టలు ఉతకడం, ఇంటి సామాన్లు తేవడం వంటి పనులన్నీ ఆదివారం పెట్టుకుంటారు. దీనివల్ల మనసుకి విశ్రాంతి దొరకదు. వీలైతే శనివారమే ఈ పనులన్నీ ముగించేయండి. ఆదివారాన్ని మీకు నిజంగా ఆనందాన్నిచ్చే ఒక వ్యాపకానికికేటాయించండి.• చాలామంది ఆదివారం సాయంత్రం ఇంట్లోనే ఉండి సోమవారం ఆఫీస్ గురించి ఆలోచిస్తారు. అలా కాకుండా నచ్చిన సినిమా చూడటం, స్నేహితులతో మాట్లాడటం వంటివి ‘స్పెషల్ ప్లాన్’ చేస్తే మెదడు ఆందోళన నుండి మళ్లుతుంది.• మీకు నచ్చిన టిఫిన్ చేయడం లేదా ఆఫీసులో నచ్చిన కొలీగ్‌తో లంచ్ ప్లాన్ చేయడం వంటి చిన్న చిన్న సంతోషాలను సోమవారం కోసం దాచుకోండి.• శనివారం రాత్రి పొద్దుపోయి నిద్రపోయి, ఆదివారం మధ్యాహ్నం వరకు పడుకోవడం వల్ల మీ 'బాడీ క్లాక్' దెబ్బతింటుంది. ఇది సోమవారం ఉదయం మిమ్మల్ని మరింత నీరసంగా మారుస్తుంది. అందుకే నిద్రవేళలు మార్చకండి. • భయం మీ నియంత్రణ తప్పుతుంటే ఒక కోచ్ లేదా కౌన్సిలర్ సాయం తీసుకోవడం బలహీనత కాదు.. అది ఆత్మగౌరవం.సోమవారం అనేది కేవలం ఒక వారం ప్రారంభం మాత్రమే కాదు, మీ ప్రతిభను నిరూపించుకోవడానికి దొరికిన మరో అవకాశం. భయాన్ని పక్కన పెట్టి, సన్నద్ధతతో అడుగు వేయండి.రేపటి సోమవారం ఒక భారంగా కాక, ఒక అవకాశంగా మారాలని ఆశిస్తూ..-సైకాలజిస్ట్ విశేష్కెరీర్&మైండ్‌సెట్ కోచ్8019 000067www.psyvisesh.com -
హైదరాబాద్‌లో ఇప్పుడు హాట్ జాబ్స్ ఇవే..
హైదరాబాద్: దేశంలోని వృత్తి నిపుణులు నూతన ఏడాదిలో కొత్త అవకాశాల కోసం వేగంగా అడుగులు వేస్తున్నారు. లింక్డ్ఇన్ (LinkedIn) విడుదల చేసిన తాజా పరిశోధన ప్రకారం.. 2026 నాటికి 72 శాతం మంది ఉద్యోగ మార్పు కోసం ప్రయత్నిస్తున్నట్లు వెల్లడైంది. అయితే, టెక్నాలజీ వేగంగా మారుతున్న నేపథ్యంలో అవసరమైన నైపుణ్యాలు (38%), పెరుగుతున్న పోటీ మధ్య తాము ఎలా నిలదొక్కుకోవాలో (37%) తెలియక మూడింట ఒక వంతుకు పైగా నిపుణులు ఆందోళన చెందుతున్నారు.ఈ అనిశ్చితిని అధిగమించేందుకు వృత్తి నిపుణులకు దిశానిర్దేశం చేయాలనే ఉద్దేశంతో, లింక్డ్ఇన్ తన ‘జాబ్స్ ఆన్ ది రైజ్ 2026’ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం.. హైదరాబాద్‌లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఉద్యోగ పాత్రగా ‘ఏఐ ఇంజనీర్’ (AI Engineer) నిలిచింది. ఇది నగరం టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో బలమైన హబ్‌గా ఎదుగుతున్నదానికి నిదర్శనంగా నిలుస్తోంది.ఏఐ ఇంజనీర్ తరువాతి స్థానాల్లో మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ , సొల్యూషన్స్ అనలిస్ట్, వైస్ ప్రెసిడెంట్ – బిజినెస్ స్ట్రాటజీ, హ్యూమన్ రిసోర్సెస్ రిప్రజెంటేటివ్ వంటి ఉద్యోగ పాత్రలు చోటు దక్కించుకున్నాయి. ఇది హైదరాబాద్ జాబ్ మార్కెట్లో మార్కెటింగ్, బిజినెస్ స్ట్రాటజీ, పీపుల్ ఫంక్షన్స్‌తో పాటు ప్రత్యేక ప్రొఫెషనల్ రోల్స్‌లో కూడా వేగంగా వృద్ధి జరుగుతోందని సూచిస్తోంది.ఏఐపై ఆసక్తి ఉన్నా..లింక్డ్ఇన్ అధ్యయనం ప్రకారం.. భారతదేశంలోని 94 శాతం మంది నిపుణులు ఉద్యోగ వేటలో ఏఐని ఉపయోగించడానికి సౌకర్యంగా ఉన్నారు. అయితే, నియామక ప్రక్రియలో ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో, తమను తాము ఎలా ప్రత్యేకంగా నిలబెట్టుకోవాలో 48 శాతం మందికి స్పష్టత లేకుండాపోతోంది. అంతేకాదు, రిక్రూటర్ల దృష్టిని ఆకర్షించడంలో ఏఐ ఒక అడ్డంకిగా మారవచ్చని 54 శాతం మంది అభిప్రాయపడ్డారు.అయితే, ఈ ఆందోళనల మధ్య కూడా రిక్రూటర్–అభ్యర్థి మధ్య కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడంలో, సమాచారం లోపాలను తగ్గించడంలో ఏఐ కీలక పాత్ర పోషిస్తుందని 65 శాతం మంది నమ్ముతున్నారు.జాబ్ సెర్చ్‌ను ఈజీ చేస్తున్న లింక్డ్ఇన్ ఏఐ టూల్స్ఉద్యోగార్థుల అవసరాలకు అనుగుణంగా లింక్డ్ఇన్ పలు ఏఐ ఆధారిత టూల్స్‌ను అందిస్తోంది. అందులో ముఖ్యమైనది ‘ఏఐ-పవర్డ్ జాబ్ సెర్చ్’. ఈ ఫీచర్ ద్వారా యూజర్లు తమ మాటల్లోనే ఉద్యోగాలను వెతకగలుగుతున్నారు. అంతేకాదు, వారు ఎప్పుడూ ఊహించని కొత్త ఉద్యోగ అవకాశాలను కూడా ఇది పరిచయం చేస్తోంది.ప్రస్తుతం ఈ టూల్ ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్, పోర్చుగీస్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉంది. ఇప్పటికే రోజూ 13 లక్షల మందికి పైగా దీనిని ఉపయోగిస్తుండగా, వారానికి 2.5 కోట్లకుపైగా జాబ్ సెర్చ్‌లు ఈ ఫీచర్ ద్వారా జరుగుతున్నట్లు లింక్డ్ఇన్ వెల్లడించింది.అదేవిధంగా ‘జాబ్ మ్యాచ్’ ఫీచర్ ద్వారా తమ నైపుణ్యాలు, అర్హతలకు ఏ ఉద్యోగాలు సరిపోతాయో తెలుసుకొని, ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్న పాత్రలకే దరఖాస్తు చేసుకునే అవకాశం కలుగుతోంది.హైదరాబాద్‌లో టాప్ 10 ఉద్యోగాలు1. ఏఐ ఇంజనీర్ 2. మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ 3. సొల్యూషన్స్ అనలిస్ట్ 4. వైస్ ప్రెసిడెంట్ – బిజినెస్ స్ట్రాటజీ 5. హ్యూమన్ రిసోర్సెస్ రిప్రజెంటేటివ్ 6. మర్చండైజర్7. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనలిస్ట్ 8. ఫైనాన్స్ స్పెషలిస్ట్9. ప్రొక్యూర్మెంట్ స్పెషలిస్ట్10. సర్వీస్ డెలివరీ మేనేజర్ -
ముగిసిన ‘వైట్ కాలర్’ స్వర్ణయుగం
దశాబ్దాలుగా మధ్యతరగతి కుటుంబాలకు చెందిన ఉద్యోగార్థులకు ఐటీ, ఫైనాన్స్, బీపీఓ రంగాల్లోని వైట్ కాలర్ కొలువులే ఆర్థిక భరోసాకు ఆధారాలుగా నిలుస్తున్నాయి. కానీ, ఆ స్వర్ణయుగం ఇప్పుడు ముగిసిందని ప్రముఖ ఆర్థిక నిపుణుడు, మార్సెల్లస్ ఇన్వెస్ట్మెంట్ మేనేజర్స్ వ్యవస్థాపకుడు సౌరభ్ ముఖర్జీ హెచ్చరిస్తున్నారు. ఒకప్పుడు ఏటా 11 శాతం వృద్ధిని నమోదు చేసిన వైట్ కాలర్ ఉద్యోగాల మార్కెట్, ఇప్పుడు కేవలం 1 శాతం వృద్ధికి పడిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల జరిగిన ఓ పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో ఆయన భారతదేశ ఉద్యోగ భవిష్యత్తుపై విశ్లేషణ చేశారు.ఆవిరవుతున్న ఆశలు‘మారుతున్న సాంకేతిక పరిస్థితుల కారణంగా జీతం పొందే యుగం ముగిసింది. దశాబ్దాలుగా పట్టణ మధ్యతరగతి ప్రజలు తమ ఆర్థిక ఎదుగుదలకు స్థిరమైన కార్యాలయ ఉద్యోగాలుగా భావించే విభాగాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. టెక్ కంపెనీల్లో లే-ఆఫ్స్ (ఉద్యోగాల తొలగింపు), ఆటోమేషన్, కృత్రిమ మేధ (AI) విప్లవం కలిసి పాతకాలపు కొలువుల తీరును మార్చేస్తున్నాయి’ అన్నారు.‘ఐటీ రంగంలో టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజ కంపెనీలు ఏటా వేల సంఖ్యలో నియామకాలు చేపట్టేవి. కానీ ఇప్పుడు ఏఐ ద్వారా ఉత్పాదకత పెంచుకుంటూ, కొత్త నియామకాలను భారీగా తగ్గిస్తున్నాయి. ఎంట్రీ లెవల్ కోడింగ్, కస్టమర్ సపోర్ట్, అడ్మినిస్ట్రేటివ్ పనులు ఇప్పుడు సాఫ్ట్వేర్లే చేస్తున్నాయి. కేవలం టెక్ రంగమే కాదు.. ఫైనాన్స్, లీగల్, లాజిస్టిక్స్, మీడియా రంగాల్లో కూడా 2031 నాటికి ప్రస్తుతమున్న 25 శాతం ఉద్యోగాలు అదృశ్యమయ్యే ప్రమాదం ఉంది’ అని చెప్పారు.విద్యార్థులకు వేక్-అప్ కాల్ప్రస్తుత విద్యా విధానం, పాత కెరియర్ సూత్రాలను అంటిపెట్టుకున్న విద్యార్థులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందని ముఖర్జీ హెచ్చరించారు. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం వేచి ఉండటం ఇప్పుడు ఒక జూదం లాంటిదని అభిప్రాయపడ్డారు. ‘మీరు ఆటోమేట్ చేయలేని నైపుణ్యాలను నేర్చుకోకపోతే, రోజురోజుకు తగ్గిపోతున్న ఈ జాబ్ మార్కెట్లో నిరుద్యోగులుగా మిగిలిపోతారు’ అని సౌరభ్ ముఖర్జీ తెలిపారు.ఇప్పుడు ఏం చేయాలి?మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు ఏం చేయాలో ముఖర్జీ కొన్ని సూచనలు చేశారు.1. మానవ నైపుణ్యాలకు ప్రాధాన్యం: మెషీన్లు చేయలేని పనులైన సృజనాత్మకత, సమస్య పరిష్కారం, విమర్శనాత్మక ఆలోచన వంటి వాటిపై దృష్టి పెట్టాలి.2. అడాప్టబిలిటీ: ఏఐ, మెషీన్ లెర్నింగ్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి సాంకేతికతలను నేర్చుకోవడంతో పాటు వాటిని నిరంతరం అప్డేట్ చేసుకోవాలి.3. ఇతర నైపుణ్యాలు: కేవలం రెజ్యూమ్ ఉంటే సరిపోదు. ఫ్రీలాన్స్ ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు, రియల్‌టైమ్ అనుభవం చాలా అవసరం.4. నెట్వర్కింగ్: పరిశ్రమ నిపుణులతో కనెక్ట్ అవ్వడం ద్వారా మారుతున్న మార్కెట్ ట్రెండ్స్‌ను ముందే పసిగట్టాలి.ఇదీ చదవండి: మీ డబ్బు - మీ నిర్ణయం.. -
స్వీపర్‌గా నెలకు రూ.లక్ష : ఇండియన్ టెకీ ఇంట్రస్టింగ్ స్టోరీ
ఇండియాలో ఐటీ ఉద్యోగులకు కష్టాలు. రష్యాలో కార్మికులకు కొరత. ముఖ్యంగామునిసిపల్ మరియు ప్రజా నిర్వహణ సేవల రంగంలో రష్యా తీవ్ర కార్మిక కొరతను ఎదుర్కొంటోంది. అందుకే భారతదేశానికి చెందిన కొంతమంది పొట్టచేత పట్టుకొని అక్కడికి వాలిపోయారు. ఏం చేశామన్నది కాదు ముఖ్యం, గౌరవంగా ఎలా బతుకున్నామనేదే ముఖ్యం అని చాటి చెప్పారు. వీరిలో రైతులు, చిన్న చిన్న వ్యాపారస్తులుతోపాటుఒక టెకీ కూడా ఉండటం విశేషం. వీరంతా రష్యాలో వీధులను శుభ్రం చేసే ఉద్యోగంలో చేరారు. నెలకు జీతం ఎంతో తెలుసా?రష్యన్ మీడియా సంస్థ ఫోంటాంకా ప్రకారం భారతదేశానికి చెందిన 26 ఏళ్ల ముఖేష్ మండల్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. వృత్తిరీత్యా నిపుణుడే. కానీ ఇక్కడ ఉద్యోగం లేదు. అందుకే సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో వీధులను శుభ్రం చేసే పని కోసం కొన్ని నెలల క్రితం రష్యాకు వెళ్లిన 17 మంది భారతీయుల బృందంలో అతనూ ఒకడిగా మారిపోయాడు. ఇలా వెళ్లిన వారి వయస్సు 19 నుండి 43 సంవత్సరాల మధ్య .గత కొన్ని వారాలుగా, ముఖేష్ మండల్, ఇతర భారతీయ కార్మికులు నగరంలో పారిశుధ్య పనులకు బాధ్యత వహించే కొలోమ్యాజ్స్కోయ్అనే రహదారి నిర్వహణ సంస్థ ఆధ్వర్యంలో నగర రహదారులను శుభ్రం చేస్తున్నారు. వీరికి ఆహారం, దుస్తులు వసతి, రవాణాను ఖర్చులు భరిస్తుంది. ప్రతీ కార్మికుడికి నెలకు సుమారు 100,000 రూబుళ్లు సుమారుగా రూ. 1.1 లక్షల వేతనం. ఇదీ చదవండి: వీధి కుక్కల బెడద: నటి షర్మిలకు సుప్రీం స్ట్రాంగ్ కౌంటర్వీరంతా భారతదేశంలో విభిన్న వృత్తిపరమైన నేపథ్యాల నుండి వచ్చారు. కొందరు రైతులు కాగా, మరికొందరు తమ సొంత చిన్న వ్యాపారాలను నడిపినవారు. ఈ బృందంలో మాజీ వెడ్డింగ్ ప్లానర్లు, డ్రైవర్లు , ఆర్కిటెక్ట్‌లు కూడా ఉన్నట్లు సమాచారం. తన ప్రస్తుత పాత్ర గురించి ఫోంటాంకాతో మాట్లాడుతూ, మండల్ తనకు టెక్నాలజీ రంగంలో పనిచేసిన అనుభవం ఉందని ముఖేష్ చెప్పాడు.మండల్ మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం చేశారా లేదా మైక్రోసాఫ్ట్ టెక్నాలజీలను ఉపయోగించే సంస్థలలో పనిచేశాడా చేస్తే ఎంతకాలం పనిచేశాడు అనేదానిపై క్లారిటీ లేదు. స్థానిక మీడియాతో తన నిర్ణయం దీర్ఘకాలిక కెరీర్ ప్లాన్స్కంటే ఆర్థిక అవసరాల వల్లే తీసుకున్నానని మండల్ వెల్లడించారు వీధులను శుభ్రపరిచే పనిని చేపట్టడం గురించి అడిగినప్పుడు, “నేను భారతీయుడిని, ఒక భారతీయుడికి ఉద్యోగం ముఖ్యం కాదు. పనే దైవం. మీరు ఎక్కడైనా పని చేయవచ్చు, మరుగుదొడ్డిలో, వీధిలో, ఎక్కడైనా. ఇది నా ఉద్యోగం, నా కర్తవ్యం ,బాధ్యత, దీనిని సాధ్యమైనంత గొప్పగా చేయడమే’’ అని చెప్పాడు. అంతేకాదు తనకు తా రష్యాలో శాశ్వతంగా స్థిరపడాలనే ఉద్దేశ్యం లేదని కూడా చెప్పాడు. ఏడాది కాలం రష్యాలో ఉండి, కొంత డబ్బు సంపాదించి, ఆపై స్వదేశానికి తిరిగి వెడతాను అని వివరించారు. ఇదీ చదవండి: 498 ఏ, పొరిగింటి మహిళకు షాక్ : ఇలా కూడా కేసు పెట్టొచ్చా? టీనేజ్ లవర్స్ : 40 ఏళ్లకు 60లలో మళ్లీ పెళ్లి -
కొత్త ఏడాదిలో ఐటీ ఉద్యోగాలు ఇలా..
కొత్త ఏడాదిలో దేశీయంగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీ) ఉద్యోగుల నియామకాలకు సంబంధించి.. రాశి కన్నా వాసికే ప్రాధాన్యమివ్వనున్నాయి. పేరుకి పెద్ద సంఖ్యలో రిక్రూట్ చేసుకోవడం కాకుండా ప్రధానంగా కృత్రిమ మేధ (ఏఐ), క్లౌడ్, సైబర్ సెక్యూరిటీ తదితర విభాగాల్లో నైపుణ్యాలున్న వారినే నియమించుకోవడంపై దృష్టి పెట్టనున్నాయి. సిబ్బంది సంఖ్యను ఊరికే పెంచుకోవడం కన్నా ఆయా విభాగాల్లో సామర్థ్యాలున్న వారినే మరింతగా తీసుకోవాలని భావిస్తున్నాయి.ఉద్యోగాల కల్పన తీరుతెన్నులను ఈ ధోరణులు ప్రభావితం చేస్తాయని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం భారత్‌లో 1,800 జీసీసీలు ఉండగా, వాటిలో సుమారు 1.04 కోట్ల మంది ఉద్యోగులు ఉన్నారు. ఇతర రంగాలతో పోలిస్తే వారి జీతభత్యాలు 25–30 శాతం అధికంగా ఉంటున్నాయి. కొత్త ఏడాదిలో 120 పైచిలుకు మధ్య స్థాయి జీసీసీలు ఏర్పాటవుతాయని టీమ్‌లీజ్ వర్గాలు తెలిపాయి. ఇవి కొత్తగా సుమారు 40,000 వరకు ఉద్యోగాలను కల్పించవచ్చని వివరించాయి. భారీ జీసీసీల్లో దాదాపు 90 శాతం సెంటర్లు ప్రస్తుతం ఇన్నోవేషన్ హబ్‌లుగా కార్యకలాపాలు సాగిస్తున్నాయని తెలిపాయి.కొత్త ఏడాదిలో ఐటీ హైరింగ్ అప్..కొత్త సంవత్సరంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో మొత్తం మీద హైరింగ్ 12–15 శాతం పెరగవచ్చని ఐటీ స్టాఫింగ్ సంస్థ క్వెస్ కార్ప్ అంచనా వేస్తోంది. జీసీసీల్లో ఏఐ ఇంజనీరింగ్, క్లౌడ్ ప్లాట్‌ఫాంలకి డిమాండ్ నెలకొనడం ఇందుకు కారణమని పేర్కొంది. మరోవైపు, కొత్తగా రాబోయే వాటితో పాటు ఇప్పుడున్న జీసీసీలు కూడా విస్తరణ చేపట్టనున్నాయని ఏఎన్ఎస్ఆర్ అంచనా వేసింది. నూతన సంవత్సరంలో 80–110 కొత్త జీసీసీలు రావొచ్చని, 2,00,000కు పైగా ఉద్యోగాలు కల్పించవచ్చని తెలిపింది.పరిశ్రమ ఏటా 12–15 శాతం వృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఆదాయాలు 75 బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని పేర్కొంది. జీసీసీల్లో నియామకాలకు సంబంధించి వెళ్లిపోయిన ఉద్యోగుల స్థానాలను భర్తీ చేసుకోవడానికి చేపట్టే హైరింగ్ వాటా ఎక్కువగా ఉండొచ్చని నిపుణులు తెలిపారు. 2025లో నికరంగా 1,50,000 మందిని తీసుకోగా, 2026లో మరో 2,00,000 మందిని తీసుకోవచ్చని వివరించారు. అట్రిషన్ రేటు (ఉద్యోగుల వలసలు) 14–18 శాతం ఉంటోందని పేర్కొన్నారు. దీన్ని బట్టి చూస్తే జీసీసీల్లో స్థూల నియామకాలు 5,00,000 స్థాయికి చేరొచ్చని వివరించారు.ద్వితీయ శ్రేణి నగరాలు కీలకం..జీసీసీ విస్తరణ ప్రణాళికల్లో ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ ఏడాది ఐటీ నియామకాల్లో 13–15 శాతం వాటా వీటిది ఉంటుందని భావిస్తున్నారు. దీనితో కొత్త నిపుణులు లభించడంతో పాటు వ్యయాలు మరీ పెరగకుండా చూసుకోవడానికి కూడా కంపెనీలకు వెసులుబాటు లభిస్తుందని విశ్లేషకులు తెలిపారు. ఇప్పటికే 7 శాతం జీసీసీలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో సెంటర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆయా మార్కెట్లలో జాబ్ పోస్టింగ్స్ వార్షికంగా 20 శాతం మేర పెరిగినట్లు పేర్కొన్నారు. నిర్వహణ వ్యయాలు 20–30 శాతం తక్కువగా ఉండటంతో కొచ్చి, కోయంబత్తూర్, జైపూర్, ఇండోర్, మంగళూరులాంటి నగరాలు ప్రత్యామ్నాయాలుగా ఎదుగుతున్నాయని వివరించారు. -
ఉద్యోగం కంటే.. అదే అవసరం: కియోసాకి సలహా..
రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి.. ''ఉద్యోగ భద్రత కోసం పాఠశాలకు వెళ్లడం ఎందుకు పాత ఆలోచన'' అంటూ ఒక ట్వీట్ చేశారు. ఇది ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది.ఒకప్పుడు బాగా చదివితే.. మంచి ఉద్యోగం వచ్చేది.. జీవితాంతం భద్రత ఉంటుందనే నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు ఎంత పెద్ద కంపెనీలో ఉద్యోగం తెచ్చుకున్నా.. ఎప్పుడు జాబ్ నుంచి తీసేస్తారో తెలియదు. ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉద్యోగం చేసే వ్యక్తులకైనా.. ఊహకందని విధంగా లేఆఫ్ నోటీసులు వచ్చిన సందర్భాలు కోకొల్లలు.2025లో కంపెనీలు తొలగించిన ఉద్యోగులు➤యూపీఎస్: 48,000 ఉద్యోగాలు➤అమెజాన్: 30,000 ఉద్యోగాలు➤ఇంటెల్: 20,000 ఉద్యోగాలు➤వెరిజోన్: 15,000 ఉద్యోగాలు➤మైక్రోసాఫ్ట్: 6,000 ఉద్యోగాలు➤సేల్స్‌ఫోర్స్: 4,000 ఉద్యోగాలు➤జీఎం: 3,420 ఉద్యోగాలు➤ఐబీఎం: 2,700 ఉద్యోగాలు➤బోయింగ్: 2,500 ఉద్యోగాలు➤వాల్‌మార్ట్: 1,500 ఉద్యోగాలుఉద్యోగులను తొలగించిన కంపెనీల జాబితాలో చాలావరకు హైటెక్ కంపెనీలే ఉన్నాయి. ఇంకెక్కడ ఉద్యోగ భద్రత ఉంది. ఉద్యోగం కంటే.. మీ ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంచుకోండి. డబ్బు ఆదా చేయవద్దు. దీనికి బదులుగా బంగారం, వెండి, బిట్‌కాయిన్, ఇథీరియం వంటిని ఆదా చేయడి. అవే మిమ్మల్ని ధనవంతులను చేస్తాయని కియోసాకి పేర్కొన్నారు.ఇక్కడ కియోసాకి భావన ఏమిటంటే.. ఇంతపెద్ద ప్రైవేట్ కంపెనీ అయినా మీకు ఉద్యోగ భద్రత కల్పించదు. కాబట్టి ఉద్యోగంపై మాత్రమే ఆధారపడకుండా.. డబ్బు ఎలా పనిచేస్తుంది అన్న జ్ఞానం పెంచుకోండి. “డబ్బు సేవ్ చేయకండి” అని ఎందుకు అంటున్నారంటే.. డబ్బును బ్యాంకులో డబ్బు ఉంచితే విలువ తగ్గిపోతుందని (ద్రవ్యోల్బణం వల్ల) కియోసాకి అభిప్రాయం. కాబట్టి డబ్బును నేరుగా సేవ్ చేసుకోకుండా.. విలువ పెంచే వస్తువులలో పెట్టుబడిగా పెట్టాలి.ఇదీ చదవండి: అంబానీ ఫ్యామిలీ: ఎవరెంత చదువుకున్నారంటే..ఉద్యోగ భద్రత కోసం పాఠశాలకు వెళ్లడం ఎందుకు పాత ఆలోచన అనే విషయానికి వస్తే.. దీని అర్థం చదువు అవసరం లేదు అని కాదు. ధనవంతులు అవ్వడానికి కేవలం చదువే సరిపోతుంది అన్న ఆలోచనకు సంబంధించింది. అంటే.. చదువుతో పాటు, డబ్బు నిర్వహణపై అవగాహన కూడా అవసరం. అప్పుడే సంపన్నులవుతారు.WHY GOING TO SCHOOL for job security is an obsolete idea:LAY OFFS 20251: UPS 48,000 jobs2: AMAZON 30,000 jobs3: INTEL 20,000 jobs4: VERIZON 15,000 jobs5: MICROSOFT 6,000 jobs6: SALES FORCE: 4,000 jobs7: GM: 3,420 jobs8: IBM: 2,700 jobs9: BOEING…— Robert Kiyosaki (@theRealKiyosaki) January 4, 2026 -
ఉద్యోగాలకు పెరిగిన పోటీ!.. 9 కోట్లకు పైగా దరఖాస్తులు
న్యూఢిల్లీ: ఈ ఏడాది ఉద్యోగ మార్కెట్ మంచి వృద్ధిని చూసినట్టు అప్నా డాట్ కో ప్లాట్‌ఫామ్ వెల్లడించింది. 9 కోట్లకు పైగా ఉద్యోగ దరఖాస్తులు తన ప్లాట్‌ఫామ్‌పై నమోదైనట్టు ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే 29 శాతం అధికమని తెలిపింది. ముఖ్యంగా మహిళలు, ఫ్రెషర్స్ ఎక్కువగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసినట్టు పేర్కొంది. సేవల రంగంలో ఉద్యోగాలు మెట్రో నగరాల నుంచి ద్వితీయ, తృతీయ (టైర్–2, 3) నగరాలకు విస్తరించినట్టు తెలిపింది.2025లో 14 లక్షల ఉద్యోగాలకు సంబంధించి ఆప్నా డాట్ కో ప్లాట్‌ఫామ్‌పై పోస్టింగ్‌లు నమో దయ్యాయి. 2024తో పోల్చితే 15% పెరిగాయి. చిన్న మరియు మధ్య తరహా సంస్థలకు సంబంధించి 10 లక్షల ఉద్యోగాలు ఇందులో ఉన్నాయి. పెద్ద కంపెనీలకు సంబంధించి 4 లక్షల ఉద్యోగాల పోస్టింగ్‌లు నమోదయ్యాయి.14 లక్షల ఉద్యోగాలకు గాను 9 కోట్ల మంది దరఖాస్తు పెట్టుకున్నారు.దరఖాస్తు దారుల్లో 3.8 కోట్ల మంది మహిళలే ఉండడం గమనార్హం. అంటే 40 శాతంపైన అభ్యర్థులు మహిళలే ఉన్నట్టు తెలుస్తోంది. 2024తో పోల్చితే మహిళా దరఖాస్తుదారులు 36 శాతం పెరిగాయి.మహిళ దరఖాస్తుల్లో టైర్ 1 నగరాల నుంచి 2 కోట్లు రాగా, టైర్ 2, 3 నగరాల నుంచి 1.8 కోట్ల దరఖాస్తులు దాఖలయ్యాయి.మేనేజర్, లీడర్షిప్ రోల్స్‌కు మహిళల దరఖాస్తులు 2024తో పోల్చి చూస్తే 35 శాతం పెరిగాయి. 1.1 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. ఫైనాన్స్, హెల్త్‌కేర్, ఎడ్యుకేషన్, రిటైల్ రంగాల్లో ఉద్యోగాల కోసం మహిళలు ఎక్కువగా పోటీపడ్డారు.ఫ్రెషర్స్ (ఉద్యోగానికి కొత్త) నుంచి 2.2 కోట్ల ఉద్యోగ దరఖాస్తులు వచ్చాయి. 2024తో పోల్చితే ఫ్రెషర్ల దరఖాస్తులు 10% పెరిగాయి.టైర్–2, 3 నగరాల నుంచి ఎక్కువగా దరఖాస్తులు వచ్చాయి.అడ్మినిస్టేషన్, కస్టమర్ సపోర్ట్, ఫైనాన్స్, డిజిటల్ ఉద్యోగాలకు ఎక్కువ స్పందన వచ్చింది.ఆప్నా ప్లాట్‌ఫామ్‌పై 2025లో 73 లక్షల ఆర్టిఫీయల్ ఇంటెలిజెన్స్ ఇంటర్వ్యూలు చోటు చేసుకున్నాయి.సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఉత్పత్తి అభివృద్ధి, డేటా అనలిస్ట్, అకౌంటింగ్, డిజిటల్ మార్కెటింగ్, సేల్స్ ఉద్యోగాలకు సంబంధించి అభ్యర్థుల్లో సన్నద్ధత ఎక్కువగా కనిపించింది.గూగుల్, టెస్లా, స్విగ్గీ, మైక్రోసాఫ్ట్, జియో, ఫ్లిప్‌కార్ట్ ఉద్యోగార్థులకు ప్రాధాన్య కంపెనీలుగా నిలిచాయి. -
భారీగా జీతాల పెంపు ఈ రంగాల్లోనే..
భారతీయ కార్పొరేట్ రంగంలో ఉద్యోగుల జీతాల పెరుగుదల నిలకడగా కొనసాగుతోంది. కనీసం వచ్చే ఏడాదైనా వేతనాల పెంపు ఆశించినమేర ఉంటుందని కొందరు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ కన్సల్టింగ్ సంస్థ మెర్సర్ నిర్వహించిన ‘టోటల్ రెమ్యునరేషన్ సర్వే’ ప్రకారం, 2026 సంవత్సరంలో భారతదేశంలోని కంపెనీలు సగటున 9 శాతం వేతన పెంపును అమలు చేసే అవకాశం ఉంది. దాదాపు 1,500 కంటే ఎక్కువ సంస్థల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించారు.రంగాల వారీగా అంచనాలుఈ పెంపులో కొన్ని రంగాలు ఇతర విభాగాల కంటే మెరుగైన ప్రదర్శన కనబరుస్తున్నాయి. ఆటోమోటివ్, మ్యానుఫ్యాక్చరింగ్, ఇంజినీరింగ్ రంగాల్లో పనిచేసే ఉద్యోగుల వేతనాలు 9.5 శాతం పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. గ్లోబల్ కెపాసిటీ సెంటర్ల(జీసీసీ)లో పని చేసే ఉద్యోగులకు సుమారు 9 శాతం మేర పెంపు ఉంటుందని అంచనా.ఈ సందర్భంగా మెర్సర్ ఇండియా రివార్డ్స్ కన్సల్టింగ్ లీడర్ మాలతి కేఎస్ మాట్లాడుతూ..‘భారతదేశంలో మెరిట్ ఆధారిత వేతన పెంపు స్థిరంగా ఉండటం అనేది ఆర్థిక వాతావరణం పట్ల సంస్థల నమ్మకాన్ని సూచిస్తుంది. వ్యయ నియంత్రణ పాటిస్తూనే అగ్రశ్రేణి ప్రతిభావంతులను ఆకర్షించేందుకు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి’ అని చెప్పారు.ఇన్సెంటివ్లపై ఫోకస్ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో కంపెనీలు తమ రివార్డ్ విధానాల్లో మార్పులు చేస్తున్నాయి. కేవలం వార్షిక పెంపుపైనే కాకుండా స్వల్పకాలిక ప్రోత్సాహకాలపై కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. ఖర్చులను అదుపులో ఉంచుతూనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన ఉద్యోగులను నిలుపుకోవడానికి ఇది ఒక వ్యూహాత్మక చర్యగా నిపుణులు విశ్లేషిస్తున్నారు.నియామకాల్లో తగ్గుదల..వేతనాల పెంపు ఆశాజనకంగా ఉన్నప్పటికీ కొత్త నియామకాల విషయంలో కంపెనీలు కొంత అప్రమత్తత పాటిస్తున్నాయి. 2024లో 43 శాతంగా ఉన్న నియామక విస్తరణ ప్రణాళికలు 2026 నాటికి 32 శాతానికి తగ్గే అవకాశం ఉంది. సుమారు 31 శాతం కంపెనీలు నియామకాలపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఈ ఏడాదిలో అట్రిషన్ రేటు(ఉద్యోగులు సంస్థలను వదిలి వెళ్లే రేటు) గణనీయంగా తగ్గింది. 2023లో 13.1 శాతంగా ఉన్న అట్రిషన్ 2025 మొదటి అర్ధభాగం నాటికి 6.4 శాతానికి పడిపోయింది.ఇదీ చదవండి: సామాన్యుడికి ఆర్బీఐ ఈ ఏడాది గిఫ్ట్! -
నాలుగేళ్లలో 10 లక్షల ఉద్యోగాలు
ప్రపంచ టెక్ దిగ్గజం అమెజాన్ భారతదేశంలో తన విస్తరణ ప్రణాళికలను మరింత ముందుకు తీసుకెళ్లాలని యోచిస్తోంది. అందులో భాగంగా వచ్చే నాలుగేళ్లలో అంటే 2030 నాటికి దేశంలో అదనంగా 10 లక్షల ఉద్యోగ అవకాశాలను అందించేందుకు సిద్ధమవుతుంది. రానున్న రోజుల్లో కంపెనీ మొత్తం 35 బిలియన్ డాలర్ల (సుమారు రూ.3.14 లక్షల కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది. 2010లో భారత మార్కెట్లోకి అడుగుపెట్టినప్పటి నుంచి చేసిన సుమారు 40 బిలియన్ డాలర్ల పెట్టుబడికి ఇది అదనంగా ఉంటుంది.న్యూఢిల్లీలో జరిగిన ఆరో అమెజాన్ సంభవ్ సమ్మిట్‌లో ఈ మేరకు ప్రకటన వెలువడింది. కంపెనీ తన దీర్ఘకాలిక భారత వ్యూహాన్ని కొన్ని ప్రధాన విభాగాల్లో కేంద్రీకరించినట్లు చెప్పింది. ఏఐ నేతృత్వంలోని డిజిటలైజేషన్, భారతీయ ఎగుమతులను పెంచడం, ఉపాధి అవకాశాల విస్తరణపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు పేర్కొంది. ఇది భారతదేశం డిజిటల్, తయారీ ఎకోసిస్టమ్‌ల్లో తమ భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందని అమెజాన్ పేర్కొంది.డిజిటలైజేషన్, ఉద్యోగాలుకొన్నేళ్లుగా అమెజాన్ దేశంలో డిజిటల్ చెల్లింపు వ్యవస్థలు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను బలోపేతం చేస్తోంది. ఈ సమ్మిట్‌లో విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2024 వరకు భారత పరిశ్రమల్లో సుమారు 28 లక్షల ప్రత్యక్ష, పరోక్ష, కాలానుగుణ ఉద్యోగాలకు అమెజాన్ మద్దతు ఇచ్చింది. అంతేకాకుండా, ఈ ప్రయత్నాలు 1.2 కోట్ల చిన్న వ్యాపారాలను డిజిటలైజేషన్వైపు మళ్లించినట్లు చెప్పింది. ఈ క్రమంలో కొత్తగా ప్రకటించిన 10 లక్షల ఉద్యోగాల లక్ష్యం అమెజాన్ విస్తరిస్తున్న డెలివరీ నెట్‌వర్క్‌లు, తయారీ, ప్యాకేజింగ్, రవాణా, సర్వీసులకు ఎంతో తోడ్పడుతుందని పేర్కొంది.అమెజాన్ ఎమర్జింగ్ మార్కెట్ల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ అగర్వాల్ మాట్లాడుతూ.. ‘మిలియన్ల మంది భారతీయులకు ఏఐను అందుబాటులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాం. 2030 నాటికి మా ఈ-కామర్స్ ఎగుమతులను 80 బిలియన్ డాలర్లకు అంటే నాలుగు రెట్లు పెంచాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు.ఇదీ చదవండి: 16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం -
అసంఘటిత రంగంలో పెరిగిన ఉద్యోగాలు
ఈ ఏడాది జూలై–సెప్టెంబర్ త్రైమాసికంలో అసంఘటిత రంగ సంస్థల్లో (యూఎస్ఈ) ఉద్యోగాలు స్వల్పంగా పెరిగాయి. క్రితం క్వార్టర్లో 12,85,72,500గా ఉండగా సెప్టెంబర్ త్రైమాసికంలో 12,85,95,600కి చేరాయి. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్వో) విడుదల చేసిన సర్వే డేటాలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.తయారీ, వాణిజ్యం, ఇతర సర్వీసులు అనే మూడు వ్యవసాయేతర రంగాల గణాంకాలను ఇందులో పరిగణనలోకి తీసుకున్నారు. దీని ప్రకారం, ప్రత్యేకంగా చట్టబద్ధమైన సంస్థలుగా నమోదు చేసుకోని ఈ తరహా సంస్థల్లో ఉద్యోగాలు జనవరి–మార్చి క్వార్టర్లో నమోదైన 13,13,38,000తో పోలిస్తే రెండో ఏప్రిల్–జూన్ క్వార్టర్లో తగ్గాయి.ఈ రంగంలో ఇంటర్నెట్ వినియోగం జూన్ క్వార్టర్లో నమోదైన 36 శాతంతో పోలిస్తే సెప్టెంబర్ త్రైమాసికంలో 39 శాతానికి పెరిగింది. సెపె్టంబర్ త్రైమాసికంలో తయారీలో ఉపాధి పెరిగింది. -
తెలుగు గంగ ప్రాజెక్ట్.. ఏపీ హైకోర్టు సంచలన తీర్పు
సాక్షి, విజయవాడ: తెలుగు గంగ ప్రాజెక్ట్ నిర్వాసితుల ఉద్యోగ కల్పనపై ఏపీ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. తెలుగు గంగ ప్రాజెక్టు కోసం 40 ఏళ్ల క్రితం ప్రభుత్వం భూములు తీసుకుంది. నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామన్న ప్రభుత్వం.. ఇవ్వకపోవడంతో నిర్వాసితులు కోర్టును ఆశ్రయించారు.నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు చెప్పింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కి వెళ్లింది. సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై ప్రభుత్వ అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేసింది.ప్రభుత్వం హామీలిచ్చి నెరవేర్చబొమంటే కుదరదు అంటూ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇచ్చిన హామీలను నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత. ఇచ్చిన హామీలను నిర్దిష్ట కాల వ్యవధిలోపే నెరవేర్చాలి. ప్రభుత్వం సాంకేతిక, అర్థంలేని కారణాలు సాకుగా చెప్పటానికి వీల్లేదు. నిర్వాసితుల కోసం తెచ్చిన పథకాన్ని అమలు చేయాల్సిందే. నిజమైన స్ఫూర్తితో అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉంది..భూమి తీసుకున్నప్పుడు పునరావాసం కల్పించాల్సిందే. లేకపోతే ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోతారు. తెలుగు గంగ భూనిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వాలన్న ఉత్తర్వులు సబబే. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లో మేము జోక్యం చేసుకోం’’ అంటూ ధర్మాసనం తేల్చి చెప్పింది. -
ఉద్యోగంలో చేరిన మూడు గంటల్లో రాజీనామా!
ఉద్యోగులు తమ సమస్యలను, కొంతమంది తమ జాబ్ అనుభవాలను రెడ్డిట్‌లో పోస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా.. ఉద్యోగంలో చేరిన మూడు గంటల్లోనే.. ఉద్యోగానికి రాజీనామా చేశానని ఒక వ్యక్తి రెడ్డిట్‌లో పేర్కొన్నారు.నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చింది. నెలకు రూ. 12000 జీతం. కానీ ఉద్యోగంలో చేరిన మూడు గంటలలోనే రాజీనామా చేశాను, అని పేర్కొన్నారు. దీనికి కారణం రోజుకు 9 గంటల షిఫ్ట్ అని అన్నాడు. మొదట్లో ఈ పని చేయాలనుకున్నాను. కానీ ఈ జాబ్ నా సమయాన్ని మొత్తం వృధా చేస్తుందని వెల్లడించాడు. ఈ ఉద్యోగంతో కెరీర్లో నేను ఎదగలేనని గ్రహించాను. కాబట్టే ఉద్యోగాన్ని వదులుకున్నాను అని అన్నాడు.నేను పోటీ పరీక్షల కోసం సిద్దమవుతున్నాను. ఈ సమయంలో ఏదైనా పార్ట్ టైమ్ జాబ్ ఉంటే బాగుంటుందని సెర్చ్ చేసాను. మొదట్లో నేను ఇలాంటి ఉద్యోగానికి అప్లై చేసేటప్పుడు.. పార్ట్-టైమ్ గిగ్గా ఉంది. ఆ తరువాత అది ఫుల్ టైమ్ జాబ్ అని పేర్కొన్నారు. దీంతో ఉద్యోగానికి రాజీనామా చేశానని వెల్లడించాడు.ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు స్పందిస్తూ.. కొందరు మంచి నిర్ణయం తీసుకున్నావని ప్రశంసిస్తే, ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే ముందే అన్నీ సరిగ్గా చూసుకోవాలని ఇంకొందరు అన్నారు. -
షేక్ హసీనాకు మరణశిక్ష
ఢాకా/న్యూఢిల్లీ: బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో పాల్గొన్న స్వాతంత్య్రసమరయోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కేటాయింపుతో మొదలైన విద్యార్థుల ఉద్యమం చివరకు పదవీచ్యుత మహిళా ప్రధాని షేక్ హసీనాకు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్ మరణశిక్ష విధింపునకు దారితీసింది. జూలై 15న విద్యార్థుల సారథ్యంలో ఉవ్వెత్తున ఎగసిన ఆందోళనలను ఉక్కుపాదంతో అణచివేసి 1,400 మంది మరణాలకు హసీనా కారణమయ్యారంటూ దాఖలైన కేసులో ఆమెకు మరణశిక్ష విధిస్తూ ట్రిబ్యునల్ సంచలన తీర్పు వెలువరిచింది. ఈ మేరకు సోమవారం జస్టిస్ మొహమ్మద్ గులామ్ మోర్తుజా మజూందార్ సారథ్యంలోని ముగ్గురు సభ్యుల ప్రత్యేక ధర్మాసనం ఈ తీర్పు వెలువరించింది. కోర్టు గతంలోనే ఆమె పారిపోయిన నేరుస్తురాలిగా ప్రకటించింది. మానవత్వానికి వ్యతిరేకంగా ఆమె నిర్దయగా ఆదేశాలు జారీచేసి భద్రతబలగాల సాయంతో ఉద్యమాన్ని అణిచివేశారని, వందల మంది మరణాలకు ప్రధాన బాధ్యురాలు అని ప్రభుత్వం అందించిన సాక్ష్యాధారాలతో రూఢీ అయిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ‘‘ వందల మరణాలకు, ఉద్యమాన్ని అణచివేత వ్యూహాలకు కర్త, కర్మ, క్రియ హసీనాయే. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం చేస్తున్న విద్యార్థులపైకి ఆమెకు చెందిన పార్టీ కార్యకర్తలు విచక్షణారహితంగా దాడులకు తెగబడేలా ఆమె రెచ్చగొట్టే ప్రకటనలు ఇచ్చారు. దాడులు చేస్తున్న వారిని ఏమాత్రం కట్టడిచేయకుండా ఆమె మానవత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నారు. నిరసనబాటపట్టిన వేలాది మంది విద్యార్థులపై మారణాయుధాలు, హెలికాప్టర్లతో దాడులు చేయించారు’’ అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ఉద్యమకారులపై విచక్షణారహితంగా కాల్పులు జరపడం వంటి ఘటనలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న నాటి హసీనా ప్రభుత్వంలో హోం మంత్రి అసదుజ్జమాన్ ఖాన్‌కు సైతం కోర్టు మరణశిక్షను ఖరారుచేసింది. మాజీ పోలీస్ ఉన్నతాధికారి, ఇన్స్పెక్టర్ జనరల్ చౌదరి అబ్దుల్లా అల్–మమూన్కు ఐదేళ్ల శిక్ష విధించింది. ఆమెను అప్పగించాలన్న తాత్కాలిక సర్కార్గత ఏడాది ఆగస్ట్ 5న దేశం నుంచి పారిపోయి ఢిల్లీలో ఆశ్రయం పొందుతున్న అవామీ లీగ్ పార్టీ అధినేత్రి హసీనాను తమకు అప్పగించాలని భారత్‌ను బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం కోరింది. ఈ మేరకు బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ సోమవారం ఒక ప్రకటన విడుదలచేసింది. ‘‘ భారత్‌కు పారిపోయిన హసీనా, అసదుజ్జమాన్ ఖాన్ కమాల్‌లను వెంటనే బంగ్లాదేశ్ ఉన్నతాధికారులకు అప్పగించండి. గతంలో మన రెండు శాల మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒడంబడికను గౌరవించాల్సిందే. కోర్టు తీర్పుతో దోషులుగా నిర్ధారణ అయిన ఖైదీలను మాకు భారత ప్రభుత్వం అప్పగించాలి. దోషులు అని తేలాకకూడా వాళ్లను ఆశ్రయం కల్పించడం స్నేహపూర్వక చర్య అనిపించుకోదు. ఇలాంటి ధోరణి న్యాయబద్ధంకాదు’’ అని బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ ఆ ప్రకటనలో పేర్కొంది. ‘‘ఈ మేరకు మరోసారి భారత్‌కు అధికారికంగ లేఖ రాస్తాం. ఊచకోత కారకులకు ఇంకా ఆశ్రయం కల్పిస్తామని భారత్ మొండికేస్తే రెండుదేశాల మధ్య విరోధం పెరుగుతుంది’’ అని ప్రభుత్వ న్యాయ సలహాదారు అసిఫ్ నజ్రుల్ స్పష్టంచేశారు. దీనిపై భారత్ స్పందించింది. బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు పెద్దపీట వేస్తామని భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదలచేసింది.తీర్పు తర్వాత పలు చోట్ల ఘర్షణలుతమ పార్టీ చీఫ్ హసీనాకు మరణశిక్ష ఖరారుచేస్తూ తీర్పు వెలువడటంతో అవామీ లీగ్ పార్టీ కార్యకర్తలు రెచ్చిపోయారు. దేశవ్యాప్తంగా కీలక నగరాలు, పట్టణాల్లో ఆందోళనకు దిగారు. దీంతో పలు చోట్ల ఘర్షణలు జరిగాయి. ఆపద్ధర్మ ప్రభుత్వ అనుకూల వర్గాలు సైతం రోడ్లమీదకొచ్చాయి. ఢాకాలో హసీనా తండ్రికి చెందిన భవనాన్ని కూల్చేందుకు యత్నించగా పోలీసులు బాష్పవాయుగోళాలు ప్రయోగించారు. లాఠీచార్జ్ చేసి నిరసనకారులను చెదరగొట్టారు.ఉక్కు మహిళ నుంచి మరణశిక్ష దాకా..1947 సెప్టెంబర్ 28వ తేదీన నాటి తూర్పు పాకిస్తాన్లో హసీనా జన్మించారు. ఈమె తండ్రి షేక్ ముజిబుర్ రెహ్మాన్ 1971లో బంగ్లాదేశ్ విమోచన కోసం పోరాడి తర్వాత బంగ్లాదేశ్‌కు స్వాతంత్య్రం సిద్దించేలా కృషిచేవారు. తర్వాత బంగ్లాప్రజలు ఆయనను జాతిపితగా కీర్తించారు. ఢాకా యూనివర్సిటీలో ఈమె చదువుకున్నారు. 1968లో అణుశాస్త్రవేత్త ఎంఏ వాజెద్ మియాను పెళ్లాడారు. 1975లో సైనిక తిరగుబాటు వేళ తండ్రి, తల్లి, ముగ్గురు సోదరులు, ఇతర కుటుంబసభ్యులు హత్యకు గురయ్యారు. ఈ హత్యోదంతం తర్వాత ఈమె దేశ రాజకీయాల్లో అడుగుపెట్టారు. అప్పటికే దివంగత దేశాధ్యక్షుడు జివుర్ రెహ్మాన్ భార్య ఖలీదా జియా రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నారు. వీరిద్దరినీ బంగ్లాదేశ్ రాజకీయాల్లో పోరాడే బేగమ్‌లు అని పిలిచేవారు. 1996లో హసీనా తొలిసారిగా ప్రధానమంత్రి అయ్యారు. 2001లో ఓడినా 2008లో మళ్లీ పీఠం అధిరోహించారు. స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా అంశం గతేడాది చిలికిచిలికి గాలివానగా, విద్యార్థి మహోద్యమంగా మారడంతో హసీనా ప్రభుత్వం కూలిపోయింది. అప్పటి నుంచి ఆమె ఢిల్లీలోనే రహస్య జీవితం గడుపుతున్నారు.చట్టానికి ఎవరూ అతీతులు కారుతీర్పును స్వాగతిస్తూ యూనుస్ వ్యాఖ్యఢాకా: హసీనాకు పడిన మరణశిక్షను ముహమ్మద్ యూనుస్ సారథ్యంలోని తాత్కాలిక ప్రభుత్వం గట్టిగా సమర్థించింది. తీర్పును స్వాగతిస్తున్నట్లు యూనుస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘‘ ఈరోజు బంగ్లాదేశ్ వ్యాప్తంగా, దేశానికి ఆవల సైతం ప్రతిధ్వనించేలా దేశ న్యాయస్థానాలు అత్యంత స్పష్టమైన సందేశానిచ్చాయి. అధికారంలో ఉన్నా, లేకున్నా చట్టానికి ఎవరూ అతీతులు కారు అనే ప్రాథమిక సూత్రం ఇక్కడ వర్తిస్తుందని న్యాయస్థానం మరోసారి గుర్తుచేసింది. గత జూలై, ఆగస్ట్‌లో ఉద్యమం వేళ ప్రాణాలు కోల్పోయిన, వేధింపులకు గురైన, ఇప్పటికీ మనోవ్యథను భరిస్తున్న విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగేలా కోర్టు తీర్పు వెలువడింది. ఏళ్ల తరబడి కొనసాగిన అణిచివేతతో పెళుసుబారిన ప్రజాస్వామ్య పునాదుల పునరుద్ధరణకు మేం కృషిచేస్తాం’’ అని యూనుస్ వ్యాఖ్యానించారు.హసీనాపై మోపిన కీలక ఆరోపణలు1. హత్య, హత్యాయత్నం, నిరసనకారులను చిత్రహింసలకు గురి చేయడం. విద్యార్థులపై దాడులను ప్రోత్సహించడం, దాడులను ఏమాత్రం అడ్డుకోకపోవడం2. హలికాప్టర్లు, డ్రోన్ల సాయంతో నిరాయుధ విద్యార్థులపైకి మారణాయుధాలతో సైన్యం దాడిచేసేలా ఆదేశాలు ఇవ్వడం3. రంగ్‌పూర్‌లో బేగమ్ వర్సిటీ విద్యార్థి అబూ సయీద్‌ను అత్యంత దారుణంగా చంపేయడం4. ఆగస్ట్ 5న ఛంకార్పూర్లో ఆరుగురిని హత్యచేయడం, విద్యార్థులపై దాడి చేయాలని ప్రసంగాలు ఇవ్వడం5. ఆగస్ట్ 5న అషూలియాలో ఆరుగురు విద్యార్థులపై బుల్లెట్ల వర్షం కురిపించడం, తర్వాత ఆధారాల్లేకుండా తగలబెట్టడం రాజకీయ ప్రేరేపిత తీర్పు ఇదితీర్పుపై ఘాటుగా స్పందించిన హసీనాతీర్పుపై 78 ఏళ్ల హసీనా తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపిత తీర్పు. ప్రజాతీర్పు పొందని ఎన్నికల్లో గెలవని ఒక అనామిక ప్రభుత్వం ఒత్తిడితో వెల్లడైన తీర్పు ఇది. ప్రస్తుత ప్రభుత్వంలో తీవ్రస్థాయి భావజాలం ఏ స్థాయిలో తీర్పు కళ్లకుకడుతోంది. తీర్పు పూర్తిగా పక్షపాతధోరణితో, రాజకీయ కక్షతో వెలువర్చారు. ప్రజాస్వామ్యయుతంగా ప్రధానిగా ఎన్నికైన నన్ను, అవామీ లీగ్ రాజకీయశక్తిని నిర్వర్యీంచేసే కుట్ర ఇది. పారదర్శకంగా కేసు నడవని, సాక్ష్యాధారాలను పరిశీలించని ఇలాంటి ట్రిబ్యునళ్లు ఇచ్చిన తీర్పులకు నేను అస్సలు భయపడను. మొహమ్మద్ యూనుస్ తాత్కాలిక ప్రభుత్వం తమ చేతగానితనాన్ని ఈ తీర్పును సాకుగా చూపి అస్తవ్యస్తపాలనను అద్భుతంగా ఉందని చెప్పుకునే దుస్సాహసంచేస్తోంది’’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రూ.750 కోట్లతో ఇన్ఫోసిస్ కొత్త క్యాంపస్.. ఎక్కడంటే..
దేశంలో టాప్ ఐటీ సంస్థల్లో ఒకటైన ఇన్ఫోసిస్ ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో భారీ ఐటీ క్యాంపస్‌ను నిర్మిస్తోంది. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లో తన కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా కంపెనీ ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఇన్ఫోసిస్ నోయిడాలోని సెక్టార్-85లో 27.5 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తోంది.ఈ క్యాంపస్ నిర్మాణం మొదటి దశ కోసం ఇన్ఫోసిస్ సుమారు రూ.750 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ దశలో సుమారు 2.7 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్యాంపస్ నిర్మాణం ముగిసి, పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత దాదాపు 5,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా.🚨 Infosys is constructing a massive IT campus in Noida, Uttar Pradesh.(📹 -@theupindex) pic.twitter.com/QgswT8NDcv— Indian Tech & Infra (@IndianTechGuide) November 16, 2025భారతదేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఐటీ హబ్‌ల్లో ఒకటైన NCRలో తన ఉనికిని బలోపేతం చేసుకోవడానికి ఇది కంపెనీకి సహాయపడుతుంది. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, టెక్నలాజికల్ ఇన్నోవేషన్లకు ఒక కీలకమైన కేంద్రంగా ఈ క్యాంపస్ మారుతుందని అధికారులు చెప్పారు. ఈ భవనం LEED ప్లాటినం రేటింగ్ (పర్యావరణ అనుకూల భవనాలకు లభించే అత్యున్నత అంతర్జాతీయ ధ్రువీకరణ) లక్ష్యంగా చేసుకుంటుంది. అంటే, పర్యావరణ ప్రభావాన్ని తగ్గించడానికి, ఎనర్జీని సమర్థవంతంగా ఉపయోగించడానికి, ఉద్యోగులకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఈ క్యాంపస్ అత్యాధునిక సాంకేతికతతో రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు.ఇదీ చదవండి: సైనికుల ఆకలి తీర్చే మోనోరైలు -
వాణిజ్య ప్రతినిధులకు చుక్కెదురు!
సాక్షి, విశాఖపట్నం: లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు, లక్షల మందికి ఉద్యోగాలంటూ అంకెల గారడీతో రాష్ట్ర ప్రజల్ని మోసం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం.. భాగస్వామ్య సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన వాణిజ్య ప్రతినిధుల విషయంలోనూ అదే వైఖరి ప్రదర్శించింది. తమ వాణిజ్య, వ్యాపారాల్ని విస్తరించేందుకు అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో కొంత మంది పారిశ్రామికవేత్తలకు భాగస్వామ్య సదస్సులో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు ప్రకటించింది. బిజినెస్ టు బిజినెస్ (బీ–బీ) సెషన్ల కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించారు. 'ఇందులో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు రూ.3,500 నుంచి రూ.10,500 వరకు ఫీజు వసూలు చేశారు. దాదాపు 200 మంది వరకు బీ–బీలో రిజి్రస్టేషన్ చేసుకున్నారు. ఒక్కొక్కరు 8 నుంచి 10 మంది బిజినెస్ ప్రతినిధులతో బీ–బీ సెషన్లో మాట్లాడుకోవచ్చని ప్రభుత్వం చెప్పింది. తీరా భాగస్వామ్య సదస్సుకు వచ్చిన తర్వాత.. సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. ఇక్కడికొచ్చేసరికి ఒక్కరు కూడా కనిపించకపోవడంతో రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రతినిధులు విస్తుపోయారు. సమస్యలుంటే వెబ్సైట్లో ఫిర్యాదు చేసుకోవచ్చని చెప్పి.. సదస్సు ప్రారంభమయ్యే సమయానికి వెబ్‌సైట్‌నే మూసేశారు. దీంతో కొందరు వాణిజ్యవేత్తలు బీ–బీపై నిర్వాహకులను నిలదీశారు. ‘వెబ్సైట్ క్లోజ్ అయిపోయింది.. ఏమీ అనుకోవద్దు.. మీకోసం ఏర్పాటు చేసిన సెషన్ హాల్లో కూర్చోండి’ అంటూ తాపీగా సమాధానం చెప్పి జారుకున్నారు. 200 మంది వరకు రిజిస్ట్రేషన్ చేసుకుంటే.. అక్కడ మాత్రం కేవలం 20 టేబుల్స్.. ఒక్కో టేబుల్ దగ్గర నాలుగు కుర్చీలు మాత్రమే ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. అవి కూడా మరుగుదొడ్ల పక్కనే ఏర్పాటు చేయడంతో వచ్చినవారు కూడా ఇబ్బందులు పడ్డారు. జామర్ల కారణంగా ఇంటర్నెట్ కూడా పని చేయకపోవడంతో రిజిస్ట్రేషన్ చేసుకున్న వారి కోసం ప్రత్యేకంగా వైఫై క్యూఆర్ కోడ్లు ఇచ్చారు. వాటిని స్కాన్ చేస్తే ఎర్రర్ రావడంతో వారంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ విషయాలపై ఫిర్యాదు చేసేందుకు ప్రయత్నించినా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పారిశ్రామికవేత్తలు అసహనం వ్యక్తం చేస్తూ తిరిగి వెళ్లిపోయారు. -
విదేశీ ఉద్యోగులు ఉండాల్సిందే
న్యూయార్క్: విదేశీయులన్నా, హెచ్–1బీ వీసాలపై అమెరికాలో ఉద్యోగాలు చేసేవాళ్లన్నా అంతెత్తున లేచి గోలచేసే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తొలిసారిగా హెచ్–1బీ వీసాదారుల ప్రాధాన్యతను గుర్తించారు. అమెరికా ఆర్థికాభివృద్ధికి చోదకశక్తి అయిన పరిశ్రమలు, సాంకేతిక రంగంలో విదేశీ ప్రతిభావంతుల కీలకపాత్రను ఆయన తొలిసారిగా కొనియాడారు. విదేశీయుల ప్రతిభ ఖచ్చితంగా అమెరికాకు అవసరమని, హెచ్–1బీ వీసా ఉన్న విదేశీ వృత్తినిపుణులు అమెరికాకు అత్యావశ్యకమని ఆయన కుండబద్దలు కొట్టారు. అయితే అమెరికాలోని నైపుణ్యసంబంధ ఉద్యోగాలన్నీ హెచ్–1బీ వీసాదారులకే కేటాయించకుండా స్థానిక అమెరికన్లకు తగు ప్రాధాన్యతనివ్వాలని ఆయన వెనువెంటనే తనదైన శైలిలో మాట్లాడారు. బుధవారం ఫాక్స్‌న్యూస్ వార్తసంస్థ వ్యాఖ్యాత లారా ఇన్గ్రహామ్తో ప్రత్యేక ఇంటర్వ్యూలో డొనాల్డ్ ట్రంప్ పలు అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. లక్షలాది మంది విదేశీ కార్మీకులు వద్దు ‘‘ కేవలం స్థానిక అమెరికన్ కార్మీకులతో పని ముందుకు సాగదని నాకూ ఇప్పుడిప్పుడే బోధపడుతోంది. అమెరికాలోకి విదేశీ ప్రతిభ రావాల్సిందే. అలాఅని ఉద్యోగాలన్నీ లక్షలాది మంది విదేశీ కార్మికులతో నింపేస్తామంటే కుదరదు. స్థానికుల్లోనూ ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు. అయితే విదేశీయులకే ప్రత్యేకమైన అదనపు వృత్తి నైపుణ్యాలుంటే వాటిని స్థానిక అమెరికన్లు నేర్చుకోవాల్సిందే. స్థానికులకు నైపుణ్యం తప్పనిసరి. సెపె్టంబర్లో జార్జియా రాష్ట్రంలో దక్షిణకొరియాకు సంబంధించిన హ్యాందాయ్ ఫ్యాక్టరీల్లో అక్రమంగా అమెరికాకు వచ్చిన వలసదారులు కార్మీకులుగా పనిచేస్తున్నారు. వాళ్లను గుర్తించి అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ అధికారులు బహిష్కరించి స్వదేశానికి పంపేశారు. అయితే ఇక్కడ పెద్ద సమస్య వచ్చిపడింది. మేం పంపేసిన కార్మికులు బ్యాటరీలను తయారుచేయడంలో సిద్ధహస్తులు. బ్యాటరీల తయారీ అనేది అత్యంత సంక్లిష్టమైన, సమస్యాత్మకమైన ప్రక్రియ. అది అంత తేలికైన పని కానేకాదు. ఏమైనా తేడాలొస్తే పేలుళ్లు జరుగుతాయి. సమస్యలు మరింత పెద్దవవుతాయి. మేం బహిష్కరించిన బ్యాటరీ తయారీ కార్మికులు ఒక ఐదారు వందల మంది ఉంటారేమో. అలాంటి వాళ్ల నుంచి స్థానిక అమెరికన్లు వృత్తి మెళకువలను నేర్చుకోవాల్సిందే. ప్రతి రంగంలోనూ విదేశీ ప్రతిభావంతుల నుంచి స్థానిక అమెరికన్లు నైపుణ్యాలను నేర్చుకోవాలి’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. నిరుద్యోగులతో క్షిపణులు అసాధ్యం నిరుద్యోగులుగా ఖాళీగా ఉన్న వాళ్లను హఠాత్తుగా ఉద్యోగాల్లోకి తీసుకుంటే సానుకూల ఫలితాల కంటే తీవ్ర ప్రతికూల ఫలితాలే వస్తాయి. ఉదాహరణకు అమెరికాపై ఆసక్తితో ఏదైనా విదేశీ కంపెనీ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో ఒక రక్షణరంగ కర్మాగారం స్థాపించేందుకు ఆసక్తి కనబరచిందనుకుందాం. అలాంటప్పుడు వెంటనే మేం ఖాళీగా ఉన్న నిరుద్యోగ అమెరికన్లను ఆ కొత్త ఫ్యాక్టరీలో కొలువుల్లో కూర్చోబెట్టలేం. ఐదేళ్లుగా ఎలాంటి ఉద్యోగం చేయని వ్యక్తులను కార్మీకులుగా మార్చేసి ఏకంగా క్షిపణులను తయారుచేయించలేం’’అని ట్రంప్ వ్యాఖ్యానించారు. కొత్త హెచ్–1బీ వీసా ఫీజును అనూహ్యంగా ఒకేసారి 1,00,000 డాలర్లకు పెంచేసి అమెరికాకు విదేశీ వృత్తినిపుణులు రాకుండా పరోక్షంగా కట్టడి చర్యలను ఆరంభించిన ట్రంప్ రెండు నెలలు తిరక్కుండానే హెచ్1బీ అనుకూల వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
అంగన్వాడీ కొలువులకు వేచి చూడాల్సిందే..!
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కొలువుల భర్తీలో జాప్యం తప్పేలా లేదు. అంగన్వాడీల్లో టీచర్, హెల్పర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ మేరకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి ఫైలు పంపగా.. అక్కడా ఆమోదం లభించింది. దీంతో ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ప్రకటన జారీ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు నోటిఫికేషన్ వెలువడలేదు. రిజర్వేషన్లు ఖరారు కాకపోవడం ఇందుకు ఆటంకంగా నిలుస్తోంది. క్షేత్రస్థాయిలో నిర్దేశించిన ఖాళీలకు రిజర్వేషన్లు ఖరారు చేసిన తర్వాత జిల్లా కలెక్టర్లు ఆ మేరకు ప్రకటనలు విడుదల చేసి పోస్టులను భర్తీ చేస్తారు. కానీ రాష్ట్ర కార్యాలయం నుంచే రిజర్వేషన్లు ఖరారు కాకపోవడంతో నియామకాల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. దీంతో ఈ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న ఔత్సాహికులకు నిరాశే మిగులుతోంది. 14,236 ఖాళీలు రాష్ట్రవ్యాప్తంగా 35,700 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటి పరిధిలో 14,236 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మంత్రిత్వ శాఖ గుర్తించింది. ఇందులో అంగన్వాడీ టీచర్ కేటగిరీలో 6,399 ఖాళీలు ఉండగా, హెల్పర్ కేటగిరీలో 7,837 ఖాళీలున్నాయి. ఈ పోస్టులు శాశ్వత ప్రాతిపదికన కానప్పటికీ..రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారమే భర్తీ చేస్తారు. ఈ నేపథ్యంలో వీటికి రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. అయితే ఇందుకు న్యాయపరమైన చిక్కులు ఎదురు కావడంతో ఈ ప్రక్రియ దాదాపు 8 నెలలుగా అటకెక్కింది. ప్రధానంగా గిరిజన ప్రాంతాల్లో రిజర్వేషన్ల ఖరారు విషయంలో సమస్య తలెత్తింది. ఏజెన్సీ ప్రాంతాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో టీచర్లు, హెల్పర్ల పోస్టులను గిరిజనులు, ఆదివాసీలతో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించి.. ఈమేరకు చర్యలు చేపట్టింది. కానీ ఈ ప్రక్రియలో రిజర్వేషన్ల సీలింగ్ 50 శాతం మించడంతో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో ఈ రిజర్వేషన్ల అమలును న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. ఫలితంగా నియామకాల ప్రక్రియ ఎక్కడికక్కడ పెండింగ్‌లో ఉండిపోయింది. న్యాయపరమైన చిక్కులు ఎప్పుడు వీడేనో..! న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో మంత్రి సీతక్క ఇటీవల ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ నియామకాలు, సర్వీసు నిబంధనల్లో నిపుణులతో సుదీర్ఘంగా చర్చించారు. మరోవైపు న్యాయపరమైన చిక్కులను అధిగమించేందుకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలోని సీనియర్ అధికారులతో ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు.గిరిజన ప్రాంతాల్లో రిజర్వేషన్ల అమలు విషయంలో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాలను అధ్యయనం చేసి రిజర్వేషన్లకు సంబంధించిన నిబంధనలతో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఈ మేరకు ఆయా అధికారుల బృందం అధ్యయనం పూర్తి చేసి నివేదిక సైతం సమర్పించింది. కానీ కోర్టు ఉత్తర్వులు అమలులో ఉండడంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. కోర్టులో సానుకూల నిర్ణయం వెలువడితేనే నియామకాల విషయంలో ముందడుగు పడేందుకు అవకాశం ఉంటుంది. దీనికి సమయం పడుతుందని మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారంతా మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. -
హైరింగ్ ‘పండగ’!
ఈ ఏడాది పండగ సీజన్లో నియమాకల దుమ్మురేగిపోయింది. సానుకూల కన్జూమర్ సెంటిమెంట్‌కు తోడు ఆకర్షణీయమైన ప్రమోషన్లు, భారీగా విస్తరణ దన్నుతో 2025 ఆగస్ట్–అక్టోబర్ మధ్య భారీగా ఉద్యోగ కల్పన జరిగిందని హైరింగ్ సొల్యూషన్స్ సంస్థ అడెకో ఇండియా తాజా నివేదికలో పేర్కొంది. గతేడాది పండగ సీజన్‌తో పోలిస్తే మొత్తంమీద హైరింగ్ 17 శాతం పెరిగిందని, గిగ్, తాత్కాలిక జాబ్స్ 25 శాతం ఎగబాకినట్లు వెల్లడించింది. 2025 పండగ సీజన్ మూడు నెలల్లో 2.16 లక్షల గిగ్, తాత్కాలిక ఉద్యోగాలు లభించినట్లు అంచనా వేసింది. కాగా, తాత్కాలిక జాబ్స్ 37 శాతం వృద్ధి చెందగా, గిగ్ వర్కర్ల నియమాకాలు 15–20 శాతం పుంజుకున్నాయని నివేదిక తెలిపింది.‘ఈ ఏడాది పండగ హైరింగ్‌ను గమనిస్తే, కంపెనీల ఆర్థికపరమైన విశ్వాశం, గిగ్ ఎకానమీ అంతకంతకూ బలోపేతం అవుతోందనే దాన్ని ప్రతిబింబిస్తోంది. నియామకాల సంఖ్య, వేతన చెల్లింపులు గత మూడేళ్ల స్థాయిని అధిగమించాయి. తద్వారా కోవిడ్ తదనంతర సాధారణ స్థాయి తర్వాత అత్యంత పటిష్టమైన ఏడాదిగా 2025 నిలిచింది. ముఖ్యంగా రిటైల్, కస్టమర్ సపోర్ట్, లాజిస్టిక్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లలో భారీగా నియామకాలు జరిగాయి’ అని అడెకో ఇండియా డైరెక్టర్, జనరల్ స్టాఫింగ్ హెడ్ దీపేష్ గుప్తా పేర్కొన్నారు. నివేదికలో ఇతర ముఖ్యాంశాలివీ...రిటైల్, ఈ–కామర్స్, బీఎఫ్ఎస్ఐ, లాజిస్టిక్స్, ఆతిథ్య రంగాల్లో తాత్కాలిక ఉద్యోగాలు వెల్లువెత్తాయి.ప్రారంభ స్థాయి కొలువుల్లో వేతనాలు 12–15 శాతం పెరగ్గా, అనుభవంతో కూడిన విధుల్లో 18–22 శాతం వేతన వృద్ధి నమోదైంది.ప్రస్తుత పెళ్లిళ్ల సీజన్‌తో పాటు 2026 మార్చి వరకు హైరింగ్ జోరు కొనసాగే అవకాశం ఉంది. ముఖ్యంగా హాస్పిటాలిటీ, ట్రావెల్, లాజిస్టిక్స్, బీఎఫ్ఎస్ఐ రంగాల్లో డిమాండ్ జోరుగా ఉంది.ఈ కాలంలో హైరింగ్ వార్షికంగా 18–20 శాతం పెరగవచ్చని అంచనా. ఇందులో సగం ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నగరాల నుంచే జతయ్యే అవకాశం ఉంది.మొత్తం హైరింగ్‌లో దాదాపు 75–80 శాతం ముంబై, ఢిల్లీ–ఎన్సీఆర్, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై వంటి మెట్రో సిటీల నుంచే నమోదైంది. అయితే, ద్వితీయ శ్రేణి, వర్ధమాన నగరాల్లో గతేడాదితో పోలిస్తే ఉద్యోగాల డిమాండ్ 21–25 శాతం ఎగబాకింది. లక్నో, జైపూర్, కోయంబత్తూరు, భువనేశ్వర్, నాగపూర్, మైసూరు వంటి నగరాలు... మెట్రోలను మించి (14 శాతం వృద్ధి) 21 శాతం పెరుగుదలను సాధించాయి. మరోపక్క, కాన్పూర్, కొచ్చి, విజయవాడ, వారణాసితో సహా పలు కొత్త మార్కెట్లు తాత్కాలిక ఉద్యోగాలకు కేంద్రాలుగా ఆవిర్భవించాయి.రిటైల్, ఈ–కామర్స్ రంగాల్లో 28 శాతం హైరింగ్ పెరిగింది. లాజిస్టిక్స్, లాస్ట్–మైల్ డెలివరీ తదితర విధుల్లో తాత్కాలిక ఉద్యోగాలకు సంబంధించి 35–40 శాతం వృద్ధి నమోదైంది.బీఎఫ్ఎస్ఐ రంగంలో పండగ నియామకాలు 30 శాతం ఎగబాకాయి. ప్రధానంగా ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లో ఫీల్డ్ సేల్స్, క్రెడిట్ కార్డ్, పాయింట్ ఆఫ్ సేల్స్ (పీఓఎస్) కొలువులకు ఫుల్ జోష్ నెలకొంది.హాస్పిటాలిటీ, ట్రావెల్ రంగం కూడా బాగానే పుంజుకుంది. ఫ్రంట్–ఆఫీస్, ఈవెంట్, ఫుడ్ అండ్ బెవరేజెస్ సిబ్బందికి డిమాండ్ 25 శాతం మేర పెరిగింది. పండగ ప్రయాణాలకు తోడు, పెళ్లిళ్ల సీజన్ బుకింగ్స్ ఇందుకు దోహదం చేశాయి.ఇదీ చదవండి: బంగారం మాయలో పడొద్దు! -
ఆ నియామకం మీ హక్కు కాకున్నా... మీరు ఆ ఉద్యోగానికి అర్హులే!
మా అమ్మగారు ఒక ప్రభుత్వ కార్పొరేషన్లో పనిచేసేవారు. ఇంకో 3 సంవత్సరాలు సర్వీసు ఉండగానే ఆమె చనిపోయారు. ఇది జరిగి కూడా 2 ఏళ్ళు కావస్తోంది. మా నాన్నగారు చిన్న వ్యాపారస్తులు. ఆయనకి 68 ఏళ్లు. మా అమ్మగారు పోయాక మనస్తాపంతో ఆయన వ్యాపారం సరిగా చేయలేక΄ోతున్నారు. రేపో మాపోవ్యాపారం మూతపడేలా ఉంది. నేను డిగ్రీ చదివాను కానీ నిరుద్యోగిని. అందువల్ల మా అమ్మగారి ఉద్యోగం నాకు ఇవ్వవలసిందిగా దరఖాస్తు చేశాను. ఇది జరిగి ఏడాదిపైనే అయినప్పటికీ ఇంకా ఎటువంటి ఉత్తర్వులూ రాలేదు. సంబంధిత అధికారులను అడిగితే ఏదో ఒక కారణం చూపి ఆఫీసు చుట్టూ తిప్పుకుంటున్నారు కానీ ప్రయోజనం లేదు. మా అమ్మ గారి ఉద్యోగం నాకు వస్తుందా? –హరికృష్ణ, రాజమండ్రి సానుభూతి లేదా కారుణ్య నియామకం (Compassionate Appointment) అనేది మానవతా దృక్పథంతో ఇచ్చే తాత్కాలిక ఉపశమనం మాత్రమే కానీ, అది ఎవరి వారసత్వ హక్కు కాదని జస్టిస్ దీ΄ాంకర్ దత్తా, జస్టిస్ పీకే మిశ్రాలతో కూడిన ద్విసభ్య సుప్రీంకోర్టు బెంచ్ ఇటీవలే ఇచ్చిన ఒక తీర్పులో పేర్కొంది. అంతేకాక, సానుభూతి నియామకాలలో పరిగణించవలసిన అంశాలను, 10 న్యాయ సూత్రాలను కూడా సూచించింది. అందులో భాగంగా చెప్పిన కొన్ని ముఖ్యమైన సూత్రాలు : సానుభూతి నియామకం అనేది ప్రజా ఉ;eధికి (అందరికీ సమానంగా రావాల్సిన ఉద్యోగ అవకాశాలకు) ఒక మినహాయింపే తప్ప హక్కు కాదు.సానుభూతి నియామకం కోసం ప్రభుత్వం లేదా ఆ యాజమాన్యం/సంస్థ చట్టబద్ధమైన – నిర్దిష్టమైన నియమాలు, ఆదేశాలు జారీచేయాలి. అవి లేకుండా నియామకం చేయడం చట్టవిరుద్ధం. ఉద్యోగి అకస్మాత్తుగా మరణించడం లేదా ఆరోగ్య కారణాలతో పనిచేయలేకపోవడం (మెడికల్ అన్ ఫిట్) వల్ల కుటుంబం పడే ఆర్థిక సంక్షోభాన్ని తీరుస్తుందే తప్ప, ఇతర సందర్భాల్లో ఈ పథకం వర్తించదు. ఇలాంటి నియామకాలు ఆలస్యం కాకుండా త్వరగా ఇవ్వాలి, ఎందుకంటే కుటుంబం ఎదుర్కొనే కష్టాలకు తక్షణ ఉపశమనమే దీని ఉద్దేశ్యం. ∙ఇది ‘‘సైడ్ డోర్ ఎంట్రీ’’గా పరిగణించబడుతుంది కాబట్టి, నియమాలను కఠినంగా అమలు చేయాలి. ఇది శాశ్వత హక్కు కాదు. అభ్యర్థి సంబంధిత నియమాల్లో ఉన్న అర్హతలు తప్పనిసరిగా కలిగి ఉండాలి. ∙కుటుంబం నిజంగా ఆర్థిక ఇబ్బందుల్లో ఉందా లేదా అన్నదే ప్రధానం. కుటుంబ పరిస్థితిని పరిగణించకుండా ఇచ్చే నియామకాలు చట్టబద్ధం కావు. కారుణ్య నియామకం కోసం దరఖాస్తు ఆ ఉద్యోగి మరణం లేదా అశక్తత తర్వాత తక్షణమే ఇవ్వాలి. సంవత్సరాల తర్వాత దరఖాస్తు చేస్తే, ఆ కుటుంబానికి తక్షణ అవసరం లేదన్నట్టుగా పరిగణించాల్సి వస్తుంది. నియమాలు అనుమతిస్తే తప్ప, చిన్నవాడైన అభ్యర్థి పెద్దవాడయ్యేవరకు ఉద్యోగాన్ని అలాగే ఉంచరాదు. ఫ్యామిలీ పెన్షన్, ఆరోగ్య బీమా వంటి పెన్షన్ బెనిఫిట్ స్కీం కింద లభించే నెలవారీ చెల్లింపులు సానుభూతి నియామకానికి అడ్డం కావు.పైన చెప్పిన నియామకాల్లో మీకు ప్రతికూలంగా ఏమీ లేవు. ఆర్థికంగా కూడా మీకు ఇబ్బందులు ఉన్నట్లు ఉన్నాయి కాబట్టి, ఆ విషయాన్ని మీ దరఖాస్తులో ప్రస్తావించారనే అనుకుంటున్నాను. పైగా మీరు మీ అమ్మగారు మరణించిన వెంటనే దరఖాస్తు కూడా చేసుకున్నారు. పైన పేర్కొన్న నియమాలలో మీరు సరిపోకపోతే తప్ప, మీకు ఉద్యోగాన్ని తిరస్కరించే హక్కు ఆ సంస్థవారికి లేదు. ఒకవేళ ఇంకా ఆలస్యం చేస్తే, త్వరితగతిన మీ నియామకంపై నిర్ణయం తీసుకోవాలని కోరుతూ మీరు హైకోర్టును ఆశ్రయించటం ఉత్తమం.ఇదీ చదవండి: దిగుబడుల్లో అంతరాలెందుకుశ్రీకాంత్ చింతల, హైకోర్టు న్యాయవాదిమీకున్న న్యాయపరమైన సమస్యలు, సందేహాల కోసం sakshifamily3@gmail.comకు మెయిల్ చేయవచ్చు. -
లక్షల్లో వేతనాలు.. ఉంటే చాలు ఈ స్కిల్!
నేడు కృత్రిమ మేథ (ఏఐ) వాయు వేగంతో విస్తరిస్తోంది. ప్రతిరోజూ ఏదో ఒక సరికొత్త ఏఐ టూల్ పుట్టుకొస్తోంది. ప్రతి ఒక్క పనికి ఏఐ చాట్‌బాట్స్ అందుబాటులోకి వస్తున్నాయి. ఇవి చాలా తేలిగ్గా, తక్కువ వ్యయంతో అధిక సమర్థతతో పనిచేస్తున్నాయి. నలుగురు చేయాల్సిన పని ఒక్కరితోనే పూర్తవుతోంది. దీంతో ఇప్పుడు ప్రతి ఒక్క వృత్తిలో సమర్థత పెంపులో ఏఐ నైపుణ్యం అత్యంత ఆవశ్యకంగా మారుతోంది. ఏఐ వృత్తి పరంగా, వ్యక్తిగతంగా పని విధానాలను సమూలంగా మార్చివేస్తోంది. పని ప్రదేశాన్నే కాదు జీవన విధానాలనే మార్చివేస్తున్న కృత్రిమ మేథ నైపుణ్యం.. తాజా సర్వేల్లో టాప్ స్కిల్‌గా నిలుస్తోంది.ఏఐ స్కిల్ ఉన్న నిపుణుల కోసం కంపెనీలు అన్వేషణ సాగిస్తున్నాయి. కృత్రిమ మేథపై పట్టున్న వారికి లక్షల్లో వేతనాలు ఇచ్చేందుకు కూడా వెనుకాడటంలేదు. అందుకే ఇప్పుడు కెరీర్ పరంగా ఏఐ కీలక నైపుణ్యంగా మారింది.మరింత విస్తరణ దిశగామైక్రోసాఫ్ట్, మెటా, గూగుల్, ఓపెన్ ఏఐ వంటి పెద్ద టెక్ కంపెనీలు డేటా కేంద్రాలు, ఏఐ మౌలిక వసతులపై బిలియన్ల డాలర్లు వెచ్చిస్తున్నాయి. ఇది రాబోయే రోజుల్లో ఏఐ రంగం మరింతగా విస్తరిస్తుందనేందుకు నిదర్శనమని పేర్కొంటున్నారు. ఇంతటి భారీ స్థాయిలో ఏఐపై పెట్టుబడులు పెడుతున్న కంపెనీలు.. వీటి నిర్వహణకు అవసరమైన మానవ వనరుల నియామకాలు అదే స్థాయిలో చేపట్టనున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. అంటే భవిష్యత్తులో జాబ్ మార్కెట్లో కృత్రిమ మేథ కీలకమైన నైపుణ్యంగా మారనుంది. తాజా నివేదిక అంచనాలుద వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ‘ద ఫ్యూచర్ ఆఫ్ జాబ్ రిపోర్ట్–2025’ ప్రకారం.. అన్ని రంగాలను డిజిటల్ టెక్నాలజీ కమ్మేయనుంది. 2030 నాటికల్లా తమ వ్యాపారాలు పూర్తిగా డిజిటల్‌గా మారతాయని భావిస్తున్నట్లు 60 శాతం మంది పేర్కొనడం విశేషం. అత్యాధునిక సాంకేతికత ముఖ్యంగా ఏఐ అండ్ ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ 86 శాతం, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ 58 శాతం, ఎనర్జీ జనరేషన్, స్టోరేజ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ 41 శాతం డిజిటల్ మార్పులకు కారణం కానున్నాయి. డిజిటల్ టెక్నాలజీ విస్తరణతో ఏఐ, బిగ్‌డేటా, నెట్వర్క్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ నైపుణ్యాలకు భారీ డిమాండ్ ఏర్పడనుందని ఈ నివేదిక అంచనావేసింది.డిజిటల్ టెక్నాలజీ విస్తరణతో.. ఏఐ అండ్ మెషిన్ లెర్నింగ్ స్పెషలిస్ట్‌లు, బిగ్ డేటా స్పెషలిస్ట్‌లు, ఫిన్‌టెక్ ఇంజనీర్స్, సాఫ్ట్వేర్ అండ్ అప్లికేషన్ డవలపర్స్, అటానమస్ అండ్ ఈవీ స్పెషలిస్ట్‌లు తదితర ఉద్యోగాలకు డిమాండ్ నెలకొంటుందని తాజా పేర్కొంది. మరోవైపు క్లరికల్, సెక్రటేరియల్ ఉద్యోగాలు భారీగా తగ్గనున్నాయి. ముఖ్యంగా క్యాషియర్స్, టికెట్ క్లర్క్స్, డేటా ఎంట్రీ క్లర్క్స్, బ్యాంక్ టెల్లార్ కొలువుల్లో కోతపడనుంది.అత్యంత వేగంగా డిమాండ్ పెరుగుతున్న నైపుణ్యాల్లో ఏఐ అండ్ బిగ్ డేటా టాప్‌లో ఉన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. ఆ తర్వాతి స్థానాల్లో నెట్వర్క్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ, టెక్నాలజీ లిటరసీ నిలిచాయి. ఈ మూడు టెక్ నైపుణ్యాలతోపాటు 2025–2030 మధ్యకాలంలో సృజనాత్మక ఆలోచన (క్రియేటివ్ థింకింగ్) ఒత్తిళ్లను తట్టుకొనే సామర్థ్యం (రెజిలియెన్స్), సరళత్వం-చురుకుదనం (ఫ్లెక్సిబిలిటీ అండ్ ఎజిలిటీ), కుతూహలం (క్యూరియాసిటీ), జీవితాంతం నేర్చుకోవాలి అనే అభిలాష ఉన్న వారికి కంపెనీలు నియామకాల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నాయి.నిపుణుల కొరతఏఐ నిపుణుడిగా మారాలంటే.. ఐఐటీల్లో చదవాలి, టాప్ యూనివర్సిటీల నుంచి సర్టిఫికెట్లు ఉండాలి అనేది అపోహ మాత్రమే అంటున్నారు నిపుణులు.ఓ వైపు ఏఐ నైపుణ్యాలకు డిమాండ్ పెరుగుతుంటే.. మరోవైపు ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా నిపుణులు అందుబాటులో లేరని నివేదికలు పేర్కొంటున్నాయి. దీంతో మానవ వనరుల నైపుణ్యాలు, కంపెనీల అవసరాల మధ్య తీవ్ర అంతరం నెలకొంది. ఏఐ నిపుణుల కొరత తీర్చేందుకు పెద్ద ఎత్తున అప్‌స్కిల్లింగ్ చేపట్టాలని సూచిస్తున్నారు.ఏఐ రంగంలో ప్రవేశించాలనుకునే వారు వ్యక్తిగతంగా స్వీయ అసెస్మెంట్ చేసుకోవాలి. జాబ్ మార్కెట్లో డిమాండ్‌కు అనుగుణంగా తమలో నైపుణ్యాలు లేకుంటే వాటిని మెరుగుపరచుకునే దిశగా ప్రయత్నం చేయాలి. మొదట యూట్యూబ్ తదితర ఆన్లైన్ మార్గాల ద్వారా ప్రాథమిక అవగాహన పెంచుకోవాలి. ఆ తర్వాత బేసిక్ ఆన్లైన్ షార్ట్‌టర్మ్ కోర్సుల ద్వారా ప్రాథమిక అంశాలు నేర్చుకోవచ్చు. స్వయం, ఎన్పీటీఈఎల్ తదితర మార్గాల ద్వారా ఐఐటీలు వంటి ప్రముఖ ఇన్స్టిట్యూట్స్ అందిస్తున్న ఉచిత కోర్సుల ద్వారా ఏఐపై పట్టు పెంచుకొని జాబ్ మార్కెట్లో అవకాశాల కోసం అన్వేషించొచ్చు!!ఇదీ చదవండి: డిజిటల్ యుగంలో.. ఏఐ హవా! -
ఐదేళ్లలో.. 5 లక్షల ఉద్యోగాలు: నితిన్ గడ్కరీ
మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో.. వచ్చే ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలను స్థానిక పరిశ్రమలు సృష్టించాలని కేంద్ర మంత్రి 'నితిన్ గడ్కరీ' పేర్కొన్నారు. ఈ లక్ష్యం సవాలుతో కూడుకున్నదే అయినప్పటికీ, సాధించవచ్చని ఆయన అన్నారు. 'నాగ్‌పూర్ స్కిల్ సెంటర్' ప్రారంభోత్సవంలో గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు.ఐదేళ్లలో నైపుణ్య శిక్షణ.. ఐదు లక్షల ఉద్యోగాలను సృష్టించడం అనే లక్ష్యం చాలా పెద్దది అయినప్పటికీ లక్ష్యాన్ని చేసుకోవచ్చు. నాగ్‌పూర్‌లోని మల్టీ-మోడల్ ఇంటర్నేషనల్ కార్గో హబ్ అండ్ విమానాశ్రయంతో సహా.. పెద్ద ఎత్తున ఉద్యోగాలను అందించిన వివిధ ప్రాజెక్టుల ఉదాహరణలను ఆయన వివరించారు, ఇవి లక్ష ఉపాధి అవకాశాలను సృష్టించినట్లు గడ్కరీ పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు ఉద్యోగాల కోసం నగరాలకు వలస వెళ్లాల్సిన అవసరం లేకుండా.. వారికి శిక్షణ అందించడానికి నాగ్‌పూర్ నైపుణ్య కేంద్రాన్ని కోర్సులు ప్రారంభించాలని ఆయన సూచించారు.టాటా స్ట్రైవ్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (COO) అమేయా వంజరి మాట్లాడుతూ.. యువతకు ఉద్యోగాల కోసం పరిశ్రమ-సంబంధిత శిక్షణ అందించనున్నట్లు పేర్కొన్నారు. సంస్థ వందలాది మంది యువతకు ఉపాధి కల్పించడంలో సహాయపడుతుంది, గత 11 సంవత్సరాలలో 2.5 మిలియన్లకు పైగా విద్యార్థులు ఈ కార్యక్రమాల ద్వారా ప్రయోజనం పొందారని ఆయన వివరించారు.ఇదీ చదవండి: నియామకాలు మళ్లీ షురూ!.. సత్య నాదెళ్లమేము తయారీ, విద్యుత్, సౌర, ఐటీ, బ్యాంకింగ్ రంగాలలో రెండు నుంచి మూడు నెలల కోర్సులను రూపొందించాము. వీటి తర్వాత ఉద్యోగ శిక్షణ.. నియామక అవకాశాలు ఉంటాయి. ఈ అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని నేను నాగ్‌పూర్ యువతను కోరుతున్నానని అమేయా వంజరి అన్నారు. -
నియామకాలు మళ్లీ షురూ!.. సత్య నాదెళ్ల
ఇప్పటి వరకు ఉద్యోగులను తొలగిస్తున్న దిగ్గజ కంపెనీలు.. ఉద్యోగ నియమకాలను చేపట్టడానికి సిద్దమైనట్లు తెలుస్తోంది. ఈ తరుణంలో మైక్రోసాఫ్ట్ తన ఉద్యోగులను మళ్ళీ విస్తరించడానికి సిద్ధంగా ఉందని సీఈఓ సత్య నాదెళ్ల పేర్కొన్నారు.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో.. కంపెనీ మరింత వృద్ధి చెందడమే లక్ష్యంగా ఉద్యోగ నియామకాలను చేపట్టనున్నట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల.. బీజీ2 పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. కొత్తగా చేరే ఉద్యోగులకు ఏఐ గురించి బాగా అవగాహన ఉండాలని, వారికి మైక్రోసాఫ్ట్ 365 కోపైలట్, గిట్‌హబ్ ఏఐ కోడింగ్ హెల్పర్ వంటి వాటికి సంబంధించిన యాక్సెస్ ఇవ్వనున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులు ఏఐ సాయంతో.. మరింత వేగంగా పనిచేయడానికి కంపెనీ సన్నద్ధమవుతోంది స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ఉద్యోగం పోతుందన్న భయం: రోజుకు రెండు గంటలే నిద్ర!2025 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి.. మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల సంఖ్య 2,28,000గా ఉంది. అంటే అంతకు ముందు కంపెనీ సుమారు 15,000 మంది ఉద్యోగులను తొలగించింది. 2022 తరువాత కంపెనీ నియమాలను బాగా తగ్గించింది. అయితే ఇప్పుడు ఏఐ రంగంలో దూసుకెళ్లడానికి.. నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించుకోవాలని చూస్తోంది. అయితే ఎంత మందిని నియమించుకోనుందనే విషయాన్ని వెల్లడించలేదు. -
ప్రభుత్వ వర్సిటీల్లో హెచ్–1బీని ఆపేయండి
న్యూయార్క్: స్థానిక అమెరికన్లకే ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో ప్రాధాన్యత ఇవ్వాలంటూ తరచూ ప్రసంగాలిచ్చే అమెరికా అధ్యక్షుడి బాటలో ఫ్లోరిడా గవర్నర్ రాన్ డీశాంటిస్ పయనిస్తున్నారు. హెచ్–1బీ వీసాదారులకు ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో వివిధ ఉద్యోగాల్లో నియమించుకునే పద్ధతికి స్వస్తి పలకాలని వర్సిటీలకు ఆయన సూచించారు. ఇప్పటికే ఈ మేరకు ఫ్లోరిడా బోర్డ్ ఆఫ్ గవర్నర్స్‌ను ఆదేశించానని ఆయన చెప్పారు. బుధవారం యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాలో ఆయన ప్రసంగించారు. ‘‘ ఫ్లోరిడాలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో హెచ్–1బీ వీసాదారులు స్థానికులను తోసిరాజని అన్ని రకాల ఉద్యోగాలను కొల్లగొడుతున్నారు. హెచ్–1బీ వీసాదారులంతా ఒకరకంగా వలస కూలీలు. మధ్యలో బ్రోకర్ల సాయంతో ఇక్కడికొచ్చి బాగా సంపాదిస్తున్నారు. ఇదంతా పెద్ద కుంభకోణం. వర్సిటీల ఆడిటింగ్‌లో ఎన్నో అంశాలు వెలుగుచూశాయి. వర్సిటీల్లో విదేశీయులు అధ్యాపకులుగా, నిపుణులుగా, చివరకు స్విమ్కోచ్ అసిస్టెంట్‌గా ఉద్యోగాలు చేస్తున్నారు. ఇది మరీ హాస్యాస్పదంగా ఉంది. కనీసం స్విమ్కోచ్ అసిస్టెంట్ ఉద్యోగానికి కూడా అమెరికన్ పనికిరాడా?. ఇకనైనా వర్సిటీలు ఉద్యోగాల్లో అమెరికన్లను నియమించుకోవాలి’’ అని డీశాంటిస్ అన్నారు. -
'స్వీయ నిబద్ధతే' జీవిత సారం
సాధారణంగా ఇటువంటి సందర్భాల్లో వక్తలు మీ అంతరాత్మ ప్రబోధాన్ని వినండి, ఇష్టమైన వ్యాపకాన్నే చేపట్టండి, మీ భవిష్య త్తుకు ఆకాశమే హద్దు లాంటి మాటలు చెబుతూంటారు. విఫల మవడం కూడా ముఖ్య మని చెప్పే స్నాతకోపన్యాసాలను నేను ఇష్టపడతాను. కొన్నేళ్ళ క్రితం స్టీవ్ జాబ్స్ చేసిన ప్రసంగంతో ఈ ధోరణి మొదలైంది. కానీ మీరు స్టీవ్ జాబ్స్ అయితేనే వైఫల్యం కూడా గొప్పగా ఉంటుంది. లేదంటే కుంగదీస్తుంది. అందుకే విఫలం కాకపోవడమే మంచిది.ఏజెన్సీ మూమెంట్!వచ్చే రెండేళ్ళలో మీలో కొందరికి ఉద్యోగాలు రాకపోవచ్చు. కొందరికి అర్హతకు తగిన ఉద్యోగాలు దక్కకపోవచ్చు. జీవితానికి సరైన దిశా నిర్దేశం, ఒక ప్రణాళిక అంటూ లేకపోయాయని మీలో సగం మంది భావించవచ్చు. కానీ, ఇదంతా ఒక ప్రక్రియలో భాగమే! మీకు ఇష్టమైన వాటిని కనుగొనే, మీకవి నిజంగానే ఇష్టమైనవో కావో పరీక్షించే ప్రక్రియలో భాగం. మనందరం కొన్నింటిని ఇష్టపడతాం. కొందరు స్నేహితులను, కొన్ని సబ్జెక్టులను, కొన్ని కలలను, కొన్ని వృత్తిపరమైన లక్ష్యాలను ఇష్టపడతాం. కానీ, వాస్తవికత అనే గీటురాయిపై వాటిని పరీక్షించి చూసేంత వరకు, వాటి స్వాభావికత గురించి మీకు నిజంగా తెలి యదు. నేను గ్రాడ్యుయేట్ అయినపుడు, రచయిత కావాలనీ, కొన్నాళ్ళు టీచింగ్ చేపట్టాలనీ, నాటక రచయిత లేదా నవలా రచయిత కావాలనీ కోరుకున్నా. రాజకీయాల్లోకి ప్రవేశించాలనీ, పెళ్ళి చేసుకుని, పిల్లల్ని కనాలనీ కూడా అనుకున్నా.ఇరవై ఏళ్ళ ప్రాయంలోని మిగిలినవారి మాదిరిగానే, నేను కూడా నాకిష్టమైన వ్యాపకాలను పరీక్షించి చూసుకున్నాను. ఆ క్రమంలో కొత్తగా ఇష్టమైనవిగా తోచినవాటిని కూడా రుచి చూశాను. ఇది మాల్లో, ప్యాంటు, చొక్కా వేసుకుని సరిపోయాయో లేవో అద్దంలో చూసుకోవడం లాంటిదే. పదేళ్ళు గడిచే సరికి నాటక రచన కుదరని పనిగా తోచింది లేదా ఇష్టం పోయిందని చెప్పాలి. కొన్ని కొత్తవి దృష్టి పథంలోకి వచ్చాయి. రాజకీయాలకన్నా రచన మరింత ముఖ్యమైనదని తేల్చుకున్నా. నాకు ఇష్టమైన వాటిని ఒక కాగితంపై ప్రాధాన్యతా క్రమంలో రాసుకున్నా. ఎక్కువగా ఇష్టపడుతున్నవాటికి నా శక్తియుక్తులను వీలైనంత ఎక్కువగా వెచ్చించడం ప్రారంభించా. ఒక క్రమపద్ధతిలో ఆ జాబితాను సిద్ధం చేసుకునే సామర్థ్యాన్ని చూపారంటే, ‘ఏజెన్సీ మూమెంట్’కు వచ్చినట్లే. అంటే, రూపాంతరీకరణ గ్రహింపును సంతరించుకున్నట్లే! ఒక వ్యక్తి బాహ్య ఒత్తిడుల నుంచి బయటపడి, స్వీయ విచక్షణ ప్రమాణాలు, విలువలను ఆధారం చేసుకుని ఇష్టంతో కార్యాచర ణకు దిగడం ప్రారంభించడాన్ని ‘ఏజెన్సీ మూమెంట్’ అంటారు. వేరెవరో విజయాన్ని నిర్వచించిన సూత్రాలకు అనుగుణంగా మీకు మీరు మూస పోసుకోవడం మానేస్తారు. మీ సొంత ప్రమాణాలు మీకుంటాయి. ఇతరుల అభిప్రాయాలపై ఆధారపడటం మానే స్తారు. జీవితాన్ని మీదైన రీతిలో మలచుకోవడం ప్రారంభిస్తారు. చాలా మంది 30 ఏళ్ళకు కొద్ది ముందు ఆ స్థితికి చేరుకుంటారు. మరికొన్ని ఇతర ‘ఏజెన్సీ మూమెంట్లు’, తదనంతర జీవితంలో 53 లేదా 75 ఏళ్ళ వయసులో కలుగవచ్చు. మీకు ఇష్టమైన వ్యాప కాల ప్రాధాన్యతా క్రమం మారుతుంది. దాన్ని గ్రహించి, అందుకనుగుణంగా, సర్దుబాట్లు చేసుకోక తప్పదు. ఒకసారి ‘ఏజెన్సీ మూమెంట్లు’ సాధించాక, నిబద్ధత చూపడం మొదలుపెట్టవచ్చు.స్వేచ్ఛ వర్సెస్ నిబద్ధతమన సమాజం నిబద్ధతతో మెలగడాన్ని పెంపొందించే రకమై నది కాదు. దేనినైనా ఎంచుకునే స్వేచ్ఛను అట్టేపెట్టుకుంటాం, మరో వైపు దేన్నైనా కోల్పోతామేమో అనే భయంతో ఉంటాం. టిండర్, ఓకేక్యూపిడ్, ఇన్స్టాగ్రామ్, రెడిట్ వంటి డీకమిట్మెంట్ సాధనా లతో నిండిన సమాజంలో జీవిస్తున్నాం. ఒకదాని తర్వాత మరో దానికి వెంటవెంటనే వెళ్ళేవిధంగా మొత్తం ఇంటర్నెట్ మనల్ని పురిగొల్పుతుంది. మన ఏకాగ్రతను భగ్నం చేయడమే మన చేతిలోని ఫోన్ల పని. ఒక అంశంపై కనీసం 30 సెకన్లు కూడా దృష్టి పెట్టలేని వాళ్ళం, జీవితం పట్ల నిబద్ధత ఏమి చూపగలం? మీ స్వేచ్ఛకు మీరు ఎంత బాగా అడ్డుకట్ట వేసుకోగలుగుతారనే దానిపైనే జీవితంలో ఏదైనా నెరవేరడం లేదా నెరవేరకపోవడం ఆధారపడి ఉంటుంది. నిబద్ధతతో మెలగడమే ప్రాథమిక కర్తవ్య మనే సంగతిని 30 ఏళ్ళ ప్రాయంలో గ్రహిస్తాం. నిబద్ధతతో మెల గాల్సి ఉంటుందంటే, మొదట భయం వేయవచ్చు. కానీ, నిబద్ధత అంటే, ఏదైనా ఒకదాని పట్ల ఇష్టం ఏర్పడి, అది నెరవేరకపోయినా, జీవితంలో ముందుకు సాగే విధంగా, నడవడికను రూపొందించు కోవడమే! అది జీవిత భాగస్వామి, ఉద్యోగం, పని చేస్తున్న కంపెనీ ఏదైనా కావచ్చు. నిబద్ధత ఒక నైతిక కార్యాచరణఒక కెరీర్ లేదా ఒకేషన్ పట్ల బద్ధులమై ఉన్నామని 28–32 ఏళ్ళ మధ్యలో గ్రహిస్తాం. కానీ, కెరీర్ వేరు, ఒకేషన్ వేరు. కెరీర్‌ను మీరు ఎంచుకుంటారు, ఒకేషన్ మిమ్మల్ని ఎంచుకుంటుంది. ఫ్రాన్సిస్ పెర్కిన్స్ అనే యువతి 20వ ప్రాయం చివరలో ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ, అగ్ని ప్రమాదాన్ని చూశారు.వందలమంది మంటలకు ఆహుతయ్యారు. మంటల నుంచి రక్షించుకునే క్రమంలో పైనుంచి దూకేసి చనిపోయారు. తర్వాత, ఆమె తన జీవితం మొత్తాన్నీ కార్మికుల భద్రత, హక్కుల సాధనకు వెచ్చించారు. మనకు ప్రీతిపాత్రమైన దానిని అంతర్ దృష్టితో కనుగొనలేం. దీనిపై అధ్యయనాలు సాగాయి. మనలో ఎనభై శాతం మందికి ప్రీతిపాత్రమైనది అంటూ ఉండదు. బయటకు చూడటం ద్వారా, అవసరాలను చూసినపుడు ఆర్ద్రతతో స్పందించడం ద్వారా దాన్ని కనుగొనవచ్చు. భాగస్వామి లేదా పిల్లల పట్ల చూపించేది మరో నిబద్ధత. వివాహం 30 లేదా 40 లేదా 50 ఏళ్ళ సంభాషణ. అన్ని గొప్ప అంకిత భావాల మాదిరిగానే, ప్రేమ కూడా రెండు భిన్నమైన స్థాయు లలో సమాంతరంగా పనిచేస్తూ వస్తుంది. ఒకటి – సడలని వాస్తవి కత. రెండు– భావాతీత ఇంద్రజాలం. ఇంట్లోకి సరుకులు కొనడం, ఇల్లు శుభ్రం చేయడం, రాజీపడవలసి రావడం, తేలికపాటి బలహీనతలతో సర్దుకుపోవడం వంటివి ఈ కోవలోకి వస్తాయి. కవితాత్మకమూ, భావాతీతమూ, ఆదర్శవంతమూ, విశ్వజనీనమూ అయినది ప్రేమలోని మరో కోణం. చాలా భాగం వనరులు పరిమితమైనవి. మనం ఉపయోగించుకుంటున్న కొద్దీ అవి తరిగిపోతాయి. కానీ, ప్రేమ వేరు. ప్రేమిస్తున్న కొద్దీ మీరు ఇంకా ప్రేమించగలుగుతారు. ఒక బిడ్డను ప్రేమిస్తున్నంత మాత్రాన, మరో బిడ్డ పుడితే, ఆ రెండవ బిడ్డను తక్కువగా ఏమీ ప్రేమించరు. పంచుతున్న కొద్దీ ప్రేమ విస్తారమవుతుంది. ప్రేమలో ఉన్నవారు కష్టనష్టాలను తట్టుకునేందుకు కూడా సిద్ధపడతారు. రెండు వేర్వేరు నగరాల్లో ఉంటున్న యువతీ యువకులకు కలసి ఉండడంలో అర్థం లేదని చెప్పండి. వారు ఒప్పుకోరు. విడిపోయి సంతోషంగా ఉండటం కన్నా, కలసి ఉండి, కష్టసుఖాలు పంచుకునేందుకే ఇష్టపడ తారు. నిబద్ధతలో ఉండే గొప్ప అంశమది. నిబద్ధత ఒక నైతిక కార్యాచరణ. ఒక వృత్తిని నిర్వహించడం నైతిక చర్య. 30 లేదా 50 ఏళ్ళ వివాహ బంధానికి కట్టుబడి ఉండడం నైతిక చర్య. మాట ఇచ్చి నిల బెట్టుకోవడం నైతిక చర్య. ఒక మంచి, నైతిక వ్యక్తిగా పరిణమించడ మంటే, ప్రలోభాలను నియంత్రించలేకపోవడం కాదు. నిబద్ధతతో వ్యవహరించగల సామర్థ్యాన్ని ప్రదర్శించడం. -
పెరిగిన ఐటీ నియామకాలు: వీరికే డిమాండ్!
కొన్నాళ్లుగా దేశీ ఐటీ రంగంలో నియామకాలు నెమ్మదించినప్పటికీ కాస్త కుదురుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఫ్రెషర్లు, మిడ్-సీనియర్ స్థాయి నిపుణుల రిక్రూట్మెంట్ రూపంలో నియామకాల ధోరణులు మెరుగుపడినట్లు హెచ్ఆర్ సొల్యూషన్స్ సంస్థ ఎడెకో ఇండియా ఒక నివేదికలో తెలిపింది.గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంతో పోలిస్తే క్యాంపస్ నియామకాలు 25 శాతం మేర పెరిగినట్లు ఎడెకో ఇండియా డైరెక్టర్ సంకేత్ చెంగప్ప తెలిపారు. అలాగే, ఐటీ దిగ్గజాలు కీలకమైన ఇంజినీరింగ్, టెక్నికల్ సంస్థలతో హైరింగ్‌పై మళ్లీ సంప్రదింపులు జరుపుతున్నట్లు వివరించారు. ఇంజినీరింగ్, టెక్నికల్, ఏఐ ఉద్యోగాలకు డిమాండ్ 27 శాతం పెరిగింది. వేతన స్థాయులు కూడా 5 శాతం మేర పెరిగాయి. రెండో త్రైమాసికంలో ఐటీ కంపెనీల ఆర్థిక ఫలితాలు, ఉద్యోగులకు నెలకొన్న డిమాండ్‌ను బట్టి ఈ నివేదిక రూపొందింది.మరిన్ని విశేషాలు..➤చాలా వరకు క్యాంపస్ రిక్రూట్మెంట్ హైదరాబాద్, బెంగళూరు, పుణె, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లో జరుగుతోంది. విశాఖ, కోయంబత్తూర్, ఉదయ్‌పూర్, నాగ్‌పూర్‌లాంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో ప్లేస్మెంట్లు 7 శాతం పెరిగాయి.➤బెంచ్‌కే పరిమితం చేయకుండా ఫ్రెషర్ల నుంచి కూడా ఉత్పాదకత రాబట్టే విధమైన హైరింగ్‌కి కంపెనీలు ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముందు రిక్రూట్ చేసుకుని, తర్వాత శిక్షణనిచ్చే సంప్రదాయానికి భిన్నంగా, ముందుగానే క్యాంపస్‌లను సంప్రదించడం ద్వారా ట్రైనింగ్ ఇచ్చి ఆ తర్వాత నియమించుకోవడంపై దృష్టి పెడుతున్నాయి.➤ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్‌సెక్యూరిటీ, క్రాస్–డొమైన్ ఇంజినీర్స్, ఎంఆల్ఆప్స్ ఇంజినీర్స్, డేటా ఇంజినీరింగ్ వంటి విభాగాల్లో డిమాండ్–సరఫరా మధ్య 45–50 శాతం మేర వ్యత్యాసం ఉంటోంది. ఈ నేపథ్యంలో కంపెనీలు నాణ్యతకు ప్రాధాన్యమిస్తూ, డిమాండ్‌కి తగ్గట్లుగా హైరింగ్ చేపట్టడానికి మొగ్గు చూపుతున్నాయి.➤కంపెనీలు పెద్ద ఎత్తున రిక్రూట్ చేసుకోవడం కాకుండా, నైపుణ్యాలకే పెద్ద పీట వేస్తు న్నా యి. క్లౌడ్, డేటా, ఏఐ సామర్థ్యాలకు ప్రాధాన్యతనిస్తున్నాయి. క్యాంపస్ హైరింగ్ క్రమంగా పెరుగుతున్నప్పటికీ, మార్కెట్‌కి అవసరమైన ఇంజినీరింగ్ నైపుణ్యాలున్న వారు దొరకడం ప్రధాన సవాలుగా ఉంటోంది.➤భారీ టీమ్‌ల కన్నా అత్యంత ప్రభావవంతంగా, సత్ఫలితాలను చూపగలిగే చిన్న బృందాలను ఏర్పాటు చేసుకోవడంపై కంపెనీలు దృష్టి పెడుతున్నాయి. కుదుర్చుకోబోయే డీల్స్, డెలివరీ లక్ష్యాల ఆధారంగా మాత్రమే వేరే సంస్థల నుంచి నిపుణులను నియమించుకుంటున్నాయి.➤ఎడెకో గణాంకాల ప్రకారం డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్, డెలివరీ లీడర్షిప్ ఉద్యోగాలకు సంబంధించి మిడ్–సీనియర్ స్థాయి ఉద్యోగుల రిక్రూట్మెంట్ 42 శాతం పెరిగింది. మూడో త్రైమాసికంలో ఐటీ హైరింగ్ జోరు 45 శాతం స్థాయిలో స్థిరపడొచ్చని అంచనా.ఇదీ చదవండి: ఆర్బీఐ మార్గదర్శకాలు.. పేటిఎం ఆఫ్‌లైన్ బిజినెస్ బదిలీ! -
అమెరికా అణ్వాయుధ సిబ్బందికి లేఆఫ్స్
యూఎస్ ఫెడరల్ ప్రభుత్వం షట్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అణ్వాయుధాల రూపకల్పన, వాటి నిర్వహణ, వాటిని భద్రపరచడానికి బాధ్యత వహించే కీలక ఏజెన్సీ అయిన నేషనల్ న్యూక్లియర్ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్ (NNSA) సిబ్బందికి సామూహిక లేఆఫ్స్ తప్పవని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్వహణకు నిధులు లేకపోవడంతో ఏజెన్సీ తన ఉద్యోగుల్లో అధికశాతం మందిని తాత్కాలికంగా తొలగించవలసి వస్తుంది. దీంతో అమెరికా జాతీయ భద్రతపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.80 శాతం మంది ఉద్యోగులకు లేఆఫ్స్హౌస్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ ఛైర్మన్, రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు మైక్ రోజర్స్ శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ..‘NNSA వద్ద ఉన్న నిధులు త్వరలో అయిపోనున్నాయనే సమాచారం ఉంది. దీని కారణంగా ఏజెన్సీలోని ఉద్యోగుల్లో 80 శాతం మందిని తొలగించాల్సి ఉంటుంది’ అని హెచ్చరించారు. యూఎస్ ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ ఇటీవల ఓ సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్ఎన్ఎస్ఏపై షట్ డౌన్ ప్రభావాల గురించి మాట్లాడుతూ..‘త్వరలో ఏజెన్సీలో పని చేస్తున్న సుమారు పదివేల మందికి లేఆఫ్స్ ఇస్తాం. మా జాతీయ భద్రతకు వారు కీలకమైన సిబ్బంది. కానీ పరిస్థితుల ప్రభావం వల్ల ఈ చర్యలు తప్పడం లేదు’ అని తెలిపారు.జాతీయ భద్రతపై ఆందోళన?‘ఏజెన్సీలో చాలామంది ఉద్యోగులు దేశానికి సంబంధించిన ముఖ్యమైన వ్యూహాత్మక ఆస్తిని నిర్వహిస్తున్నారు. అందులో భద్రత, అత్యవసర సిబ్బంది విధుల్లో ఉంటారు. మేము ఇప్పటికే ఉన్న ఆయుధాగారాన్ని చెక్కుచెదరకుండా, సురక్షితంగా ఉంచబోతున్నాం. జాతీయ భద్రతపై ఎలాంటి ఆందోళన వద్దు’ అని రైట్ స్పష్టం చేశారు.ఇదీ చదవండి: ధన త్రయోదశి రోజున బంగారంపై పెట్టుబడా? -
ఏఐ ఎఫెక్ట్.. ఆ ఉద్యోగాలపై ప్రభావం: నితిన్ మిట్టల్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా.. ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని చాలామంది ఆందోళన చెందుతున్నారు. ఇది నిజమే అని కొందరు నిపుణులు కూడా చెబుతున్నారు. అయితే డెలాయిట్ గ్లోబల్ ఏఐ లీడర్ నితిన్ మిట్టల్ (Nitin Mittal).. ఈ ప్రశ్నకు తనదైన రీతిలో సమాధానం చెప్పారు.ఏఐ మన ఉద్యోగాలను తీసుకుంటుందా, ఉద్యోగులు.. ఉద్యోగాలను కోల్పోవాల్సి వస్తుందా? అనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, కస్టమర్ సపోర్ట్, కాల్ సెంటర్లు, కోడింగ్ వంటి కొన్ని ఉద్యోగాలు ఏఐకు ప్రభావితం కావడం అనివార్యం. అయితే ఏఐ కారణంగా కోల్పోయిన ఒక్క ఉద్యోగాన్ని కూడా నేను చూడలేదు. దాదాపు ఉద్యోగులంతా AIతో ఎలా కలిసి పనిచేయాలో నేర్చుకుంటున్నారని మిట్టల్ పేర్కొన్నారు.ఏఐ టెక్నాలజీలో నైపుణ్యం పెంచుకోవడానికి ఆసక్తి చూపనివారిని, ఖాళీ సమయాన్ని డూమ్స్క్రోలింగ్లో గడిపేవారినికి ట్రాన్స్ఫర్ చేసే అవకాశం ఉందని నితిన్ మిట్టల్ చెప్పారు. అంతే కాకుండా ఏఐ ఎవరూ ఊహించని ఉద్యోగాలను సృష్టిస్తుందని.. కాబట్టి ఇందులో తప్పకుండా నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.ఇదీ చదవండి: తారాస్థాయికి చేరిన బంగారం, వెండి: ధరలు పెరగడానికి కారణాలు! -
అమెరికా, చైనా తరువాత భారత్: నితిన్ గడ్కరీ
భారతదేశ ఆటోమొబైల్ పరిశ్రమ దినిదినాభివృద్ది చెందుతోంది. 2014లో రూ. 14 లక్షల కోట్లుగా ఉన్న ఈ పరిశ్రమ.. 2025 నాటికి రూ. 22 లక్షల కోట్లకు చేరిందని.. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) పేర్కొన్నారు. పుదుచ్చేరిలో గ్రేడ్ సెపరేటర్, రోడ్ల విస్తరణ పనులు, కొత్త రోడ్డు ప్రాజెక్టుకు పునాది వేసిన తర్వాత మంత్రి మాట్లాడుతూ.. జపాన్ను అధిగమించి మూడవ అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్‌గా ఇండియా అవతరించిందని అన్నారు.ఆటోమొబైల్ మార్కెట్ పరిమాణం పరంగా అమెరికా, చైనా తర్వాత దేశం ఇప్పుడు మూడవ స్థానంలో ఉంది. ఈ పరిశ్రమ 4.5 కోట్ల ఉద్యోగాలను సృష్టించింది. ఎగుమతి రంగానికి ఎంతో దోహదపడిందని గడ్కరీ స్పష్టం చేశారు.దేశంలో లాజిస్టిక్స్ ఖర్చు 16 శాతం నుంచి 10 శాతానికి తగ్గిందని, మెరుగైన రోడ్డు మౌలిక సదుపాయాల కారణంగా డిసెంబర్ నాటికి ఇది 9 శాతానికి తగ్గుతుందని నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.వివిధ స్థిరమైన పద్ధతులను అవలంబించడం గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. రోడ్ల నిర్మాణంలో మున్సిపల్ వ్యర్థాలను ఉపయోగిస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు 18 లక్షల టన్నుల మున్సిపల్ వ్యర్థాలను ఉపయోగించామని, రోడ్డు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు వ్యర్థాలను ప్రోత్సహించాలని మంత్రిత్వ శాఖ ప్రణాళిక వేసిందని అన్నారు.ఇదీ చదవండి: బేబీ బూమర్లు నష్టపోతారు!: రాబర్ట్ కియోసాకి -
రూ.15 వేల కోట్ల పెట్టుబడితో 14వేల ఉద్యోగాలు..
తైవానీస్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్‌కాన్ తమిళనాడులో రూ.15,000 కోట్ల తాజా పెట్టుబడిని ప్రకటించింది. ఈ ఇన్వెస్ట్‌మెంట్‌తో రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ రంగంలో భారీగా ఉద్యోగ కల్పన జరగనుందని కంపెనీ తెలిపింది. ఈ పెట్టుబడుల ద్వారా 14,000 ఉద్యోగాలు లభిస్తాయని సంస్థ అంచనా వేస్తుంది.ఫాక్స్‌కాన్ చేయబోయే పెట్టుబడి విలువ ఆధారిత ఎలక్ట్రానిక్స్ తయారీ, ఆర్ అండ్ డీ ఇంటిగ్రేషన్, ఏఐ నేతృత్వంలోని అధునాతన టెక్ కార్యకలాపాలు, బ్యాటరీ టెక్నాలజీలు వంటి అత్యాధునిక రంగాలపై కేంద్రీకృతమై ఉంటుందని కంపెనీ తెలిపింది. వీటిపై దృష్టి పెట్టడం ద్వారా కంపెనీ ఉత్పాదకత, ఆవిష్కరణల్లో ముందంజలో ఉండాలని చూస్తోంది.ఆమోదాలు వేగవంతం చేయడానికి..ఈ పెట్టుబడి ప్రకటనలో అత్యంత ముఖ్యమైన అంశం ‘గైడెన్స్ తమిళనాడు’. ఇది భారతదేశంలోని మొదటి ఫాక్స్‌కాన్ డెస్క్ అవుతుంది. కంపెనీ కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి, ఫాస్ట్ ట్రాక్ ఆమోదాలను వేగవంతం చేయడానికి, రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులను సమన్వయం చేయడానికి ఈ డెస్క్‌ను ఏర్పాటు చేయనున్నారు. తమిళనాడు పరిశ్రమల శాఖ ఈ ప్రాజెక్ట్‌కు పూర్తి మద్దతు ఇస్తుంది. సింగిల్ విండో ఫెసిలిటేషన్ ద్వారా ఆమోదాలను వేగవంతం చేస్తుంది. టాలెంట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లు, ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేషన్ మెకానిజమ్‌ల ద్వారా మానవ వనరుల అవసరాలను తీర్చడంలో కూడా ప్రభుత్వం సహకరిస్తుంది. ఫాక్స్‌కాన్ కంపెనీ ఇండియాలో యాపిల్ ఉత్పత్తులు తయారు చేస్తోంది.ఇదీ చదవండి: ముందుంది మొసళ్ల పండుగ! ఈరోజు కేజీ వెండి రూ.2 లక్షలు! -
ఎస్బీఐలో మహిళలకు అవకాశాలు
ఎస్బీఐ మరింత మంది మహిళలకు ఉపాధి కల్పించనుంది. 2030 నాటికి తన సిబ్బందిలో మహిళల భాగస్వామ్యాన్ని 30 శాతానికి పెంచుకునేందుకు గాను లింగ వైవిధ్యం దిశగా ఒక వ్యూహాన్ని రూపొందించుకున్నట్టు సంస్థ డిప్యూటీ ఎండీ, చీఫ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కిషోర్ కుమార్ ప్రకటించారు.‘‘కస్టమర్లకు సేవలు అందించే విభాగంలో (ఫ్రంట్‌లైన్) ఇప్పటికే మహిళల ప్రాతినిధ్యం 33 శాతంగా ఉంది. కానీ, మొత్తం సిబ్బందిలో మహిళల వాటా 27 శాతమే ఉంది. దీన్ని మరింత పెంచుకోనున్నాం. దాంతో లింగ వైవిధ్యం మరింత మెరుగుపడుతుంది’’అని చెప్పారు. ఎస్బీఐలో 2.4 లక్షల మందికి పైగా సిబ్బంది ఉన్నారు.బ్యాంకింగ్ రంగంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోంది. బ్యాంకులోని అన్ని స్థాయిల్లోనూ మహిళలు రాణించేలా చూసేందుకు బ్యాంకు కట్టుబడి ఉన్నట్టు కిషోర్ కుమార్ చెప్పారు. అలాగే, లక్ష్యిత కార్యక్రమాల ద్వారా నాయకత్వం, ఉద్యోగం–వ్యక్తిగత జీవితానికి మధ్య సమతుల్యతకు పలు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. -
ఉద్యోగం కోసం డిగ్రీ సరిపోదు!: లింక్డ్ఇన్ సీఈఓ కీలక వ్యాఖ్యలు
చదువుకుని ఒక డిగ్రీ తెచ్చుకుంటే.. వెంటనే ఉద్యోగంలో చేరిపోవచ్చని చాలామంది అనుకుంటారు. కానీ డిగ్రీ ఉంటేనే ఉద్యోగాలు త్వరగా లభిస్తాయని చెప్పలేమని లింక్డ్ఇన్ సీఈఓ 'ర్యాన్ రోస్లాన్స్కీ' (Ryan Roslansky) పేర్కొన్నారు.పరుగులు పెడుతున్న పోటీ ప్రపంచంలో కేవలం ఒక కాలేజీ డిగ్రీ సరిపోదు. నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలి. ముఖ్యంగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) గురించి చాలా నేర్చుకోవాల్సి ఉందని.. గత వారం కంపెనీ శాన్ ఫ్రాన్సిస్కో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ర్యాన్ రోస్లాన్స్కీ ఈ వ్యాఖ్యలు చేశారు.మార్పు అనేది చాలా ఉత్తేజకరమైన విషయం అని భావిస్తున్నాను. ఎందుకంటే ఉద్యోగ భవిష్యత్తు ఇకపై ఫ్యాన్సీ డిగ్రీలు ఉన్నవారికి లేదా మంచి కాలేజీలో చదువుకున్న వారికి మాత్రమే చెందదు. మారుతున్న కాలానికి అనుగుణంగా అలోచించి కొత్త టెక్నాలజీలను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నవారికి ఉద్యోగాలు లభిస్తాయని నా అంచనా అని అన్నారు.ఏఐ మనుషుల స్థానాన్ని భర్తీ చేస్తుందనే విషయాన్ని నేను నమ్మనని ర్యాన్ రోస్లాన్స్కీ అన్నారు. అయితే కమ్యునికేషన్, ఎవరితో అయినా మాట్లాడగలగడం వంటివి నేర్చుకోవాలి. స్కిల్స్ ఎప్పుడూ పెంచుకుంటూ ఉండాలి. మీరు ముందుకు సాగడానికి ప్రయత్నిస్తున్న ఏ పనిలోనైనా విజయం సాధించడానికి అవి చాలా కీలకం అని ఆయన అన్నారు.ఇదీ చదవండి: ముకేశ్ అంబానీ పర్సులో ఎంత డబ్బు ఉంటుందో తెలుసా?ఏఐ గురించి తెలుసుకోవడం లేదా నేర్చుకోవడం చాలా అవసరం. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏఐ నైపుణ్యాలు ఉన్న వ్యక్తికే పరిశ్రమల్లో ఉద్యోగాలు లభిస్తాయి. అంటే ఉద్యోగం కోసం ఏఐ ఒక సాధనంగా ఉపయోగపడుతుంది. ఉద్యోగ మార్కెట్ వేగంగా మారుతోంది. నిపుణులు నిరంతరం తమను తాము అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉందని చెబుతూనే ఉన్నారని ర్యాన్ రోస్లాన్స్కీ చెప్పారు. -
Andhra Pradesh: అదొక చరిత్ర
సాక్షి, అమరావతి : గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో 2019 అక్టోబర్ 2వ తేదీన దేశమంతటా రాష్ట్రం వైపు చూసిన పరిస్థితి.. ఎందుకంటే మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వపరిపాలనను సాకారం చేసిన రోజది. ప్రజలకు ఉన్న ఊళ్లోనే ప్రభుత్వ సేవలు అందించేలా చరిత్రలో ఇదివరకెన్నడూ లేని విధంగా, కనీ వినీ ఎరుగని రీతిలో గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ఏర్పాటు చేసిన రోజది. ఏకంగా 11,158 గ్రామ, 3,786 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి అందులో 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులను ఏర్పాటు చేశారు. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ఇంత మంది ఉద్యోగులను నియమించడం దేశ చరత్రలోనే జరగలేదు. చిన్న ఆరోపణ కూడా లేకుండా, అత్యంత పారదర్శకంగా ఈ నియామకాలు చేపట్టారు. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు, పట్టణాల్లో ప్రతి 100 ఇళ్లకు ఒక్కరి చొప్పున వలంటీర్లను నియమించారు. తద్వారా ప్రభుత్వ పథకాల లబ్ధిని ప్రజల ఇళ్ల ముంగిటకే తీసుకెళ్లారు. ఈ విధానం ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఇంత తక్కువ వ్యవధిలో రాష్ట్ర రూపు రేఖలు మార్చే పాలనతో విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. ఐదేళ్ల పాలనలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సహా వివిధ ప్రభుత్వ శాఖలలో ఏకంగా 6 లక్షలకు పైగా ఉద్యోగాలు కల్పించడం మరో రికార్డు. కాగా, చంద్రబాబు కూటమి ప్రభుత్వం కనీసం పదో తరగతి పరీక్షలు కూడా సక్రమంగా నిర్వహించలేక పోయిందని, డీఎస్సీ అంతా అవకతవకలేనని సోషల్ మీడియాలో ప్రజలు చర్చించుకుంటున్నారు. నేడు అంతా రివర్స్ » రాష్ట్రంలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు, లేదంటే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి అంటూ ఎన్నికల వేళ నమ్మబలికిన సీఎం చంద్రబాబు ఏ ఒక్కటీ ఇవ్వకపోగా.. గత ప్రభుత్వ కృషిని సైతం తన ఘనతగా చెప్పుకోవడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై గత 15 నెలలుగా ఊకదంపుడు ప్రసంగాలు, కాకి లెక్కలతో మభ్యపుచ్చిన చంద్రబాబు సాక్షాత్తూ శాసనసభ సాక్షిగా నిస్సిగ్గుగా అవే అబద్ధాలు వల్లె వేశారు. » తాను ఏకంగా 4.71 లక్షల ఉద్యోగాలు ఇచ్చేసినట్లు కళ్లార్పకుండా బడాయిలు చెప్పుకోవడంపై అందరూ విస్తుపోతున్నారు. ఇంతవరకూ కనీసం ఉత్పత్తి కూడా ప్రారంభించని కంపెనీల్లో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ రంగాల్లో 3,48,891 ఉద్యోగాలు ఇచ్చేసినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించుకున్నారు. » గత ప్రభుత్వ హయాంలో ఒప్పందాలు కుదుర్చుకున్న విశాఖ ఎనీ్టపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, రిలయన్స్ ఇండస్ట్రీస్ సీబీజీ ప్లాంట్లు, రెన్యూ, మిట్టల్, జేఎస్‌డబ్ల్యూస్టీల్, అదానీ, షిర్డీసాయి, గ్రీన్కో అమ్మోనియా తదితర ప్రాజెక్టులన్నీ తన ఖాతాలో వేసుకున్నారు. వాటిని రాష్ట్రానికి తామే తెచ్చినట్లుగా చంద్రబాబు సర్కారు ప్రచారం చేసుకోవడంపై పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర విస్మయం వ్యక్తమవుతోంది. » వైఎస్సార్సీపీ హయాంలో 2023లో విశాఖ కేంద్రంగా నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో ముఖేష్ అంబానీ, ఆదిత్య మిట్టల్ లాంటి పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఏపీలో రూ.13.11 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టుల ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే అవి ఇంకా ఉత్పత్తి ప్రారంభించక ముందే వాటి ద్వారా 3.48 లక్షల ఉద్యోగాలు వచ్చేశాయని చంద్రబాబు సర్కారు చెప్పుకోవడంపై ప్రజలు, పారిర్రామికవేత్తలు విస్తుపోతున్నారు. ఆ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ గత ప్రభుత్వంలోనే.. » కూటమి సర్కారు వచ్చాక ఇంత వరకు ఏ ఒక్కరూ కొత్తగా అధికారికంగా పూర్తి స్థాయి ప్రభుత్వ ఉద్యోగిగా విధుల్లో చేరకపోయినా 15 నెలల్లో 31,134 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేసినట్లు సీఎం చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. నిజానికి ఇందులో 6,100 కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్, ప్రిలిమనరీ, మెయిన్ ఎగ్జామ్స్ గత ప్రభుత్వ హయాంలోనే పూర్తయ్యాయి. దీనిపై కొంత మంది కోర్టుకు వెళ్లడంతో నియామక ప్రక్రియ నిలిచిపోయింది. ఇప్పుడు కోర్టు కేసులు పరిష్కారం కావడంతో కూటమి ప్రభుత్వం కేవలం నియామక పత్రాలు మాత్రమే జారీ చేసింది. » గత ప్రభుత్వం నిర్వహించిన పరీక్షలను సైతం చంద్రబాబు తమ ఘనతగా చెప్పుకుంటున్నారు. ఇదే రీతిలో గత ప్రభుత్వం జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసిన కూటమి సర్కారు పరీక్షల నిర్వహణలో న్యాయ వివాదాలు రేకెత్తిస్తూ సుదీర్ఘ కాలయాపన చేసింది. ప్రస్తుతం ఈ అంశం ఇంకా కోర్టు పరిధిలోనే ఉంది. ఇక గత ప్రభుత్వం వివిధ విభాగాల్లో నియమించిన ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించిన చంద్రబాబు సర్కారు.. కొత్త వారిని నియమించుకుని వాటిని కొత్త ఉద్యోగాలుగా చిత్రీకరిస్తోంది. స్విగ్గీ, జొమాటో, డోర్ డెలివరీ జాబ్స్..» జాబ్‌మేళాల ద్వారా 92,149 మందికి ఉద్యోగాలు కల్పించినట్లు సీఎం చంద్రబాబు ఘనంగా చెప్పుకున్నారు. జాబ్‌మేళాల జాబితా పరిశీలిస్తే అత్యధికంగా బ్యాంకులు, రుణ రికవరీ ఏజెంట్లు, బీమా ఏజెంట్లు, జొమాటో, స్విగ్గీ, అమెజాన్, బ్లింకిట్ లాంటి డోర్ డెలివరీ జాబ్స్, ఫార్మసీ షాపుల్లో ఉద్యోగాలే అత్యధికంగా ఉన్నాయి. తాత్కాలికంగా ఉపాధి కల్పించే వాటిని కూడా ప్రభుత్వం తాము కొత్తగా ఉద్యోగాలు ఇచి్చనట్లు ప్రచారం చేసుకోవడం చూసి విస్తుపోతున్నారు.» చివరికి చంద్రబాబు సర్కారు ప్రచార పిచ్చి ఏ స్థాయిలో ఉందంటే.. ఇతర రాష్ట్రాల్లోని ఐటీ కంపెనీల ఉద్యోగులు కొందరు ఏపీ నుంచి వర్క్ ఫ్రం హోమ్ విధానంలో పని చేస్తుంటే వారిని కూడా తమ ఖాతాలో వేసుకుని 5,500 మందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా ఉపాధి కల్పించినట్లు ఘనంగా చెప్పుకోవడం. -
మస్క్ కంపెనీలో జాబ్స్: జీతం ఎంతో తెలుసా?
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్.. ఏఐ కంపెనీ అయిన ఎక్స్ఏఐ (xAI) దాని చాట్‌బాట్ 'గ్రోక్' కోసం ఉద్యోగులను నియమించుకోవడానికి సిద్ధమైంది. వీడియో గేమ్‌ల కోసం.. వీడియో గేమ్స్ ట్యూటర్లను నియమించుకోనుంది. వీరు గ్రోక్‌కు గేమ్‌లను రూపొందించడం, కథలు చెప్పడం, యూజర్ ఆలోచనలకు సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వనున్నారు.గ్రోక్ టెక్స్ట్ ఆధారిత సంభాషణలకు పరిమితం చేయకుండా.. మరింత సృజనాత్మకంగా ఉండేలా ట్యూటర్స్ శిక్షణ ఇవ్వాల్సి ఉంది. కాబట్టి వీరు ఎక్స్ఏఐ సాఫ్ట్‌వేర్‌తో పని చేస్తారు. గేమ్ డిజైన్, కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత రంగాలలో అనుభవం ఉన్న అభ్యర్థుల కోసం కంపెనీ అన్వేషిస్తోంది. అయితే ఎన్ని ఉద్యోగాలు, ఎంతమందిని నియమించుకుంటారనే విషయం వెల్లడించలేదు.ఎంపికైన ఉద్యోగులు కాలిఫోర్నియాలోని ఆఫీసులో పనిచేయాల్సి ఉంటుంది. కానీ రిమోట్‌గా కూడా ఉద్యోగం చేసుకునే అవకాశం ఉంది. రిమోట్‌గా వర్క్ చేయాలనుకునే అభ్యర్థులకు సెల్ఫ్ డిసిప్లైన్, స్ట్రాంగ్ మోటివేషన్ వంటివి ఉండాలి. ఎంపికైన అభ్యర్థులు మొదటి రెండు వారాలు ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. ఆ తరువాత అనుకూలమైన టైమ్ ఎంచుకోవచ్చు.ఇదీ చదవండి: నాలుగు నిమిషాల మీటింగ్: ఉద్యోగం నుంచి తీసేశారు!జీతం & ప్రయోజనాలుఎంపికైన ఉద్యోగులకు జీతం గంటకు 45 డాలర్ల నుంచి 100 డాలర్ల వరకు ఉంటుంది. ప్రయోజనాలు దరఖాస్తుదారు నివసించే దేశంపై ఆధారపడి ఉంటాయి. ఫుల్ టైమ్ జాబ్ చేసే ఉద్యోగులకు మెడికల్ కవరేజ్ లభిస్తాయి. అయితే, పార్ట్-టైమ్ ఉద్యోగులకు ఇలాంటి ప్రయోజనాలు ఉండవు. -
'రూ.45 లక్షల వేతనం.. అందుకే వదిలేసా'
కొంతమంది ఎక్కువ జీతం కోసం పనిచేస్తే.. మరికొందరు ఉన్న జీతంతోనే సర్దుకుంటారు. గురుగ్రామ్‌కు చెందిన ఒక టెక్నీషియన్ ఇటీవల రెడ్డిట్‌లో చేసిన పోస్ట్.. జీతం కంటే పని - జీవిత సమతుల్యతకు ప్రాధాన్యత ఇవ్వడం గురించి చర్చకు దారితీసింది.నాకు రెండు ఆఫర్లు వచ్చాయి, ఒకటి ఏడాదికి 38 లక్షల ప్యాకేజీ. మరొకటి సంవత్సరానికి 45 లక్షల ప్యాకేజీతో భారతదేశంలోని అగ్రశ్రేణి ఓటీటీ ప్లాట్‌ఫామ్ నుంచి అని వినియోగదారు సోషల్ మీడియాలో పేర్కొన్నారు. అయితే నేను నా ప్రస్తుత స్థానం గుర్గావ్ నుంచి బెంగళూరుకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ (బెంగళూరులో) పని ఒత్తిడి ఎక్కువగా ఉంది. దీంతో నేను ఆ ఉద్యోగాన్ని వదులుకున్నాను. కానీ ఇప్పుడు తప్పు చేశానేమో అనే భావన గలుగుతోంది. నేను డబ్బును ఎంచుకోవాలా లేదా స్థిరత్వాన్ని ఎంచుకోవాలా? అని అన్నారు.రెడ్దిట్ తూజార్ తన కెరీర్ గురించి కూడా వెల్లడించారు. తాను ప్రారంభంలో రూ. 3.8 లక్షల ప్యాకేజితో ఉద్యోగంలో చేరినట్లు, ఆ తరువాత మూడు ఉద్యోగాలు మార్చినట్లు, దీని ఫలితంగా తన ప్రస్తుత వార్షిక జీతం పెరిగిందని పేర్కొన్నారు.ఇదీ చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్‌ను సమర్థించను: గూగుల్ మాజీ సీఈఓఈ పోస్టుపై నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఎక్కువ మంది.. టెక్నీషియన్ ఉద్యోగాన్ని వదులుకోవడం గురించి చింతించవద్దని.. మానసిక శ్రేయస్సుపై దృష్టి పెట్టాలని చెప్పారు. సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి డబ్బు సంపాదించాలని ఇంకొకరు అన్నారు. మీ జీతం పెరిగిన తరువాత.. పని సంస్కృతి & మీ కంపెనీ మిమ్మల్ని ఎలా చూస్తుందనే విషయాన్ని గమనించాలని ఇంకొకరు అన్నారు. -
బ్రిటన్ పౌరులకు డిజిటల్ ఐడీ కార్డులు
లండన్: బ్రిటన్ పౌరులకు త్వరలో డిజిటల్ ఐడీ కార్డులు రానున్నాయి. ప్రభుత్వ సేవలు పొందేందుకు, ఉద్యోగాలు సంపాదించేందుకు కూడా ఈ కార్డులు తప్పనిసరి కానున్నాయి. బ్రిటన్ పౌరులతోపాటు దేశంలో శాశ్వత నివాస అర్హత పొందిన విదేశీయులకు కూడా ఈ డిజిటల్ ఐడీ కార్డులు అందజేస్తామని బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తెలిపారు. ఈ కార్డుల వల్ల పౌరుల వ్యక్తిగత గోప్యతకు ఎలాంటి ప్రమాదం వాటిల్లదని పేర్కొన్నారు. పౌరులు భౌతికమైన కార్డులు తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదని, స్మార్ట్‌ఫోన్ లేని పౌరులు కూడా ఈ కార్డును అవసరమైన చోట వాడుకోవచ్చని వివరించారు. 20 ఏళ్ల క్రితమే వీటిని ప్రవేశపెట్టాలని ప్రయతి్నంచిన అప్పటి ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతతో వెనక్కి తగ్గింది. -
కంపెనీల నాయకత్వంలో అతివలకు అందలం
భారతీయ కంపెనీల్లో నాయకత్వ హోదాల్లో మహిళలకు ప్రాధాన్యం పెరుగుతోంది. తాజాగా మొత్తం కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లలో వారి ప్రాతినిధ్యం 20 శాతానికి చేరింది. భారత్‌లో మహిళలు ఉద్యోగం చేసేందుకు అత్యుత్తమ కంపెనీలపై వర్క్‌ప్లేస్ కల్చర్ కన్సల్టింగ్ సంస్థ అవతార్, టాలెంట్ సర్వీసెస్ సంస్థ సెరామౌంట్ నిర్వహించిన 10వ విడత అధ్యయనంలో ఇది వెల్లడైంది.ఈ అధ్యయనం ప్రకారం అత్యుత్తమ కంపెనీల్లో మహిళల ఉద్యోగుల వాటా 35.7 శాతం స్థాయిలో స్థిరంగా ఉంది. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించడంలో ప్రొఫెషనల్ సర్వీసుల రంగం (44.6 శాతం) ముందంజలో ఉంది. ఐటీఈఎస్ (41.7 శాతం), ఫార్మా (25 శాతం), ఎఫ్ఎంసీజీ (23 శాతం), తయారీ (12 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మహిళల అట్రిషన్ రేటు (ఉద్యోగం నుంచి తప్పుకోవడం) పురుషులతో దాదాపు సమానంగా 20 శాతం స్థాయిలో ఉంది. మెరుగైన ఉద్యోగావకాశాలు దక్కించుకోవడమే మహిళలు, పురుషుల అట్రిషన్కి ప్రధాన కారణంగా ఉంటోంది.అయితే, మహిళల విషయానికొస్తే పిల్లల సంరక్షణకంటే ఎక్కువగా ఆరోగ్యపరమైన సమస్యలే ఉద్యోగం నుంచి తప్పుకోవడానికి మరో కీలక కారణంగా నిలుస్తోంది. 2016లో కంపెనీల్లో మహిళల ప్రాతినిధ్యం సగటున 25 శాతంగా ఉండగా ప్రస్తుతం 35.7 శాతానికి పెరగడం, నాయకత్వ హోదాల్లో మహిళల వాటా 13 శాతం నుంచి 20 శాతానికి చేరడం మంచి పరిణామమని అవతార్ వ్యవస్థాపకురాలు సౌందర్య రాజేశ్ తెలిపారు. ఈ అధ్యయనానికి దేశవ్యాప్తంగా 365 కంపెనీల నుంచి దరఖాస్తులు రాగా 125 కంపెనీలకు జాబితాలో చోటు దక్కింది. ఆటోమోటివ్, కెమికల్స్, బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్), మీడియా, ఫార్మా తదితర రంగ సంస్థల నుంచి దరఖాస్తులు వచ్చాయి. మహిళలకు టాప్ 10 బెస్ట్ కంపెనీలు..మహిళలకు టాప్ 10 కంపెనీల జాబితాలో యాక్సెంచర్ సొల్యూషన్స్, ఏఎక్స్ఏ ఎక్స్ఎల్ ఇండియా బిజినెస్ సరీ్వసెస్, కెయిర్న్ ఆయిల్ అండ్ గ్యాస్ వేదాంత, ఈవై, కేపీఎంజీ ఇండియా, మాస్టర్‌కార్డ్, ఆప్టమ్ గ్లోబల్ సొల్యూషన్స్ ఇండియా, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియా, టెక్ మహీంద్రా, విప్రో సంస్థలు (అక్షర క్రమంలో) ఉన్నాయి. -
ప్రమాదంలో మహిళా ఉద్యోగాలు!: ఐక్యరాజ్యసమితి హెచ్చరిక
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) కారణంగా.. చాలామంది ఉద్యోగాలు కోల్పోతారని పలువురు నిపుణులు చాలా రోజుల నుంచి చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా ఏఐ వల్ల ఉద్యోగాలు కోల్పోయేవారిలో మహిళలే ఎక్కువ ఉన్నారని ఐక్యరాజ్యసమితి 'జెండర్ స్నాప్‌షాట్ 2025' నివేదికలో వెల్లడించింది.ఏఐ కారణంగా.. ప్రపంచ వ్యాప్తంగా సుమారు 28 శాతం మహిళలు ఉద్యోగాలు కోల్పోతారు. ఈ ప్రమాదంలో పడే పురుష ఉద్యోగులు 21 శాతం మాత్రమే అని ఐక్యరాజ్యసమితి నివేదించింది.తప్పుల నుంచి నేర్చుకోకపోతే..ఐక్యరాజ్యసమితి 'జెండర్ స్నాప్‌షాట్ 2025' (Gender Snapshot 2025) నివేదిక.. ప్రస్తుత అసమానతలను కూడా హైలైట్ చేసింది. ప్రపంచ టెక్ వర్క్‌ఫోర్స్‌లో మహిళలు 29%, టెక్ లీడర్లలో కేవలం 14% మాత్రమే ఉన్నారని వెల్లడించింది. ప్రపంచం కొత్త అంతరాయాన్ని ఎదుర్కొంటోంది. మనం గతంలో జరిగిన తప్పుల నుంచి నేర్చుకోకపోతే.. భవిష్యత్తులో అసమానత మరింత ఎక్కువవుతాయని హెచ్చరించింది.జెండర్ అంతరాన్ని తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని ఐక్యరాజ్యసమితి పిలుపునిచ్చింది. ''ఇది 343 మిలియన్ల మహిళలకు, బాలికలకు ప్రయోజనం చేకూరుస్తుంది. 30 మిలియన్ల మందిని తీవ్ర పేదరికం నుంచి బయటపడేస్తుంది, 42 మిలియన్లకు ఆహార భద్రతను మెరుగుపరుస్తుంది. 2030 నాటికి ప్రపంచ వృద్ధిలో 1.5 ట్రిలియన్ డాలర్లకు దారితీస్తుందని నివేదికలో హైలైట్ చేసింది''.మహిళలు శ్రామిక శక్తిలో చేరడానికి.. విద్య, కెరీర్స్, కుటుంబ జీవితాన్ని సమతుల్యం చేసుకోవడానికి సహాయం చేయడంలో అనేక దేశాలు నిజమైన పురోగతి సాధించాయి. సౌదీ అరేబియా శ్రామిక శక్తిలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడానికి.. సంరక్షణ సంబంధిత అడ్డంకులను తగ్గించడానికి చట్టపరమైన & విధాన సంస్కరణలను ప్రవేశపెట్టింది. ఫలితంగా, మహిళల భాగస్వామ్యం రెండింతలు పెరిగి, 2017లో 17 శాతం నుంచి 2024 మూడవ త్రైమాసికం నాటికి 35.4 శాతానికి పెరిగింది.ఇదీ చదవండి: తిరిగి వచ్చేయండి.. భయంతో జీవించవద్దు: శ్రీధర్ వెంబు -
ఇది ఓ కార్పొరేట్ ఉద్యోగి క(ఖ)ర్మ!
కార్పొరేట్ ప్రపంచం చాలా చిత్రమైంది. ఒక పైసా ఖర్చు మిగిల్చేందుకు వంద రూపాయలు తగలేసేందుకూ సిద్ధం. ఇది కూడా అట్లాంటి వ్యవహారమే. కంపెనీ ఊరూ, పేరు తెలియదు కానీ.. సామాజిక మాధ్యమం రెడిట్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం...అతడో సాఫ్ట్వేర్ ఇంజినీర్. ఏళ్లుగా అదే కంపెనీలో పనిచేస్తున్నాడు. గాడిద చాకిరీ చేస్తున్నానని తనే చెప్పుకున్నాడు కూడా. ఈమధ్యే వార్షిక ఇంక్రిమెంట్ల ప్రహసనం ముగిసింది. ఊహించినట్టుగానే జీతం జానెడే పెరిగింది. ‘‘జీతం కనీసం పది శాతమైనా పెంచండి సారూ’’ అంటూ పైవాళ్లకు మెయిల్ పెట్టాడు. పైనున్న మేనేజర్.. ఆ పైనున్న హెచ్ఆర్ వాళ్లు ఏమనుకున్నారో.. ఎలా ఆలోచించారో తెలియదు కానీ.. ‘‘ఠాట్.. పది శాతం పెంచమంటావా’’ అంటూ హూంకరించారు.‘‘నిన్ను ఉద్యోగం లోంచి పీకేశాం. ఫో’’ అనేశారు. కంపెనీ కదా.. ఆమాత్రం పైచేయి చూపడంలో ఆశ్చర్యం ఏమీ లేదు. ఆఫ్ట్రాల్ ఒక ఉద్యోగి విజ్ఞప్తిని మన్నిస్తే.. అందరూ మీదపడిపోతారు అనుకుని ఉంటుంది. తొలగించనైతే తొలగించారు కానీ.. అప్పటివరకూ ఆ ఇంజినీర్ చేసే పని? అర్జెంటుగా ‘‘సిబ్బంది కావలెను’’ అన్న సందేశం వెళ్లిపోయింది. హడావుడిగా మెయిళ్లు అటు ఇటూ కదిలాయి. బోలెడంత మందిని ఇంటర్వ్యూలకు పిలిచారు. చివరకు ఆరు మందిని సెలెక్ట్ చేశారు. మంచి ప్యాకేజీలతో వారి జీతాలూ ఫిక్స్ చేసేశారు. ఆ ఒక్కడు చేసే పనిని వీరందరూ కలసికట్టుగా చేయడం మొదలుపెట్టారు కొనసాగిస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల వ్యవహారం ఇలా ఉంటుందన్నమాట.పది శాతం పెంపును నిరాకరించి ఉద్యోగంలోంచి తొలగించిన ఆ ఉద్యోగి ఆరేళ్లపాటు కంపెనీకి సంబంధించిన కీలకమైన బ్యాకెండ్ వ్యవస్థను ఒంటిచేత్తో నడిపిస్తున్నాడట. ముందుగా చెప్పినట్లు గాడిద మాదిరిగా ఆ బాధ్యతంతా తలపై మోసుకుని కష్టపడినా.. సహోద్యోగుల కంటే తక్కువ జీతం వస్తూండటంతో ఉండబట్టలేక జీతం పది శాతం పెంచమని అడిగాడట. ఇక లాభం లేదనుకుని కంపెనీ పనులపై శ్రద్ధ తగ్గించేశాడు. ఇతగాడి ఖర్మానికో, పుణ్యానికో అప్పుడే కంపెనీలో ఒక కొత్త డైరెక్టర్ వచ్చి చేరాడు. ఆఫీసుకు సక్రమంగా రావడం లేదన్న మిషతో ఉద్యోగంలోంచి తీసేశాడు. ఫలితం.. ఒకరి స్థానంలో ఆరుగురికి జీతాలు సమర్పించుకోవాల్సి రావడం. ‘‘పదిశాతం పెంచేసి ఉంటే గొడవే ఉండకపోవను. అయితే ఒక్కటి. ప్రపంచంలో న్యాయం అనేది ఇంకా ఉంది అనేందుకు ఇదో నిదర్శనం’’ అని ఆ ఉద్యోగి తన రెడిట్ పోస్టులో రాసుకోవడం అక్షర సత్యం అనిపిస్తుంది! ఏమంటారు? -
TG: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. కొత్త ఉద్యోగాల భర్తీ
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ నిరుద్యోగులకు శుభవార్త. తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు (TSLPRB) మొత్తం 1,743 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో డ్రైవర్స్ ,శ్రామిక్‌లు (Shramiks) పోస్టులు ఉన్నాయి. వాటి వివరాల్ని పరిశీలిస్తే..డ్రైవర్స్ పోస్టులు – 1000 ఖాళీలుఅర్హతలు: రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన ఎస్ఎస్ఈ లేదా సమానమైన పరీక్షలో ఉత్తీర్ణత.పురుషులు,మహిళలు ఇద్దరూ అర్హులు.వయస్సు పరిమితి: సాధారణంగా 18 నుండి 30 సంవత్సరాలు.వయస్సు సడలింపు:ఎస్సీ,ఎస్సీ,బీసీ,ఈడబ్ల్యూఎస్: 5 సంవత్సరాలుమాజీ సైనికులకు: 3 సంవత్సరాలుఎంపిక విధానం:ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్డ్రైవింగ్ టెస్ట్వెయిటేజ్ మార్కులుకనీస అర్హత మార్కులుశ్రామిక్ పోస్టులు – 743 ఖాళీలుఅర్హతలు: ఐటీఐ ఉత్తీర్ణత పురుషులు,మహిళలు అర్హులు.వయస్సు పరిమితి: 18 నుండి 30 సంవత్సరాలు.వయస్సు సడలింపు:ఎస్సీ,ఎస్సీ,బీసీ,ఈడబ్ల్యూఎస్: 5 సంవత్సరాలుమాజీ సైనికులకు: 3 సంవత్సరాలుఎంపిక విధానం:వెయిటేజ్ మార్కులుకనీస అర్హత మార్కులుదరఖాస్తు వివరాలు: ఆన్లైన్ దరఖాస్తు: టీఎస్ఎల్పీఆర్బీ అధికారిక వెబ్సైట్దరఖాస్తు ప్రారంభ తేదీ:అక్టోబర్ 8, 2025 ఉదయం 8 గంటలకుదరఖాస్తు ముగింపు తేదీ :అక్టోబర్ 28, 2025 సాయంత్రం 5 గంటలకుఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్ర రవాణా శాఖలో ఉద్యోగాలు పొందాలనుకునే అభ్యర్థులకు ఇది గొప్ప అవకాశం. అర్హతలు కలిగిన అభ్యర్ధులు అధికారిక పోర్టల్‌ను సందర్శించాల్సి ఉంటుంది. -
రూ.80 లక్షల కోట్ల పెట్టుబడులు.. 1.5 కోట్ల ఉద్యోగాలు
న్యూఢిల్లీ: రాబోయే రోజుల్లో భారత్‌లోకి రూ. 80 లక్షల కోట్ల పెట్టుబడులు రానున్నాయని కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్ తెలిపారు. 1.5 కోట్ల పైగా ఉద్యోగాల కల్పన జరగనుందని వివరించారు. దేశీయంగా మారిటైమ్ రంగంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయని, భవిష్యత్తులో ప్రపంచ మారిటైమ్ సూపర్‌పవర్‌గా భారత్ ఎదగనుందని పేర్కొన్నారు.కేంద్రం తలపెట్టిన సాగరమాల ప్రోగ్రాంతో 2035 నాటికి రూ. 5.8 లక్షల కోట్ల విలువ చేసే 840 ప్రాజెక్టులు సిద్ధమవుతున్నాయని సోనోవాల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే రూ. 1.41 లక్షల కోట్ల విలువ చేసే 272 ప్రాజెక్టులు పూర్తయినట్లు పేర్కొన్నారు. రూ. 76,000 కోట్లతో మహారాష్ట్రలో ఏర్పాటవుతున్న వాధ్వాన్ పోర్టు అంతర్జాతీయంగా టాప్ 10 కంటైనర్ పోర్టుల్లో ఒకటిగా నిలుస్తుందని సోనోవాల్ వివరించారు. దీనితో 12 లక్షల పైచిలుకు ఉద్యోగాల కల్పన జరుగుతుందని మంత్రి చెప్పారు. -
తయారీలో సంస్కరణలు రావాలి
దీర్ఘకాలిక కోణంలో భారత్‌లో గణనీయంగా వ్యాపార అవకాశాలు ఉన్నాయని అపోలో హెల్త్‌కో చైర్పర్సన్, పరిశ్రమల సమాఖ్య సీఐఐ ప్రెసిడెంట్ శోభనా కామినేని తెలిపారు. వీటిని అందిపుచ్చుకునేందుకు వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసే దిశగా తయారీ రంగంలో సంస్కరణలు ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.అమెరికా విధించిన విపరీతమైన టారిఫ్‌ల వల్ల అనిశ్చితులు తలెత్తాయని ఆమె తెలిపారు. మరింత మెరుగ్గా రాణించేందుకు ఏం చేయాలనేది లోతుగా ఆలోచించేందుకు ఈ పరిస్థితులను ఉపయోగించుకోవాలని వివరించారు. కృత్రిమ మేథ వినియోగం పెరుగుతుండటంతో ఉద్యోగాలు పోతాయనే భయం ప్రజల్లో నెలకొందని మెసేజింగ్ యాప్ వాట్సాప్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె చెప్పారు. మనం 4 ట్రిలియన్ ఎకానమీగా ఎదిగినా, జీడీపీ మూడింతలు పెరిగినా, అందరికీ ఉద్యోగాలు దొరక్కపోతే సామాన్యుడికి ఏం ప్రయోజనం దక్కుతుందనేది ఆలోచించాల్సిన అవసరం ఉందని శోభన చెప్పారు.ఉద్యోగాలు కల్పించడమనేది ప్రతి చిన్న, పెద్ద వ్యాపారాల బాధ్యత అని తెలిపారు. భారత్‌లో ప్రతిభావంతులకు కొదవలేదని, ఏఐ సొల్యూషన్స్‌ను రూపొందించడంలో మన దేశం ప్రపంచానికి సారథ్యం వహించాలని పేర్కొన్నారు. మరోవైపు, తమ యాప్ ద్వారా ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెచ్చే దిశగా ఆంధ్రప్రదేశ్ తర్వాత మరో మూడు రాష్ట్రాల ప్రభుత్వాలతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వాట్సాప్ మాతృ సంస్థ మెటా కంట్రీ హెడ్ (ఇండియా) అరుణ్ శ్రీనివాస్ తెలిపారు. -
యూఎస్‌లో శ్రామిక కొరతను అందిపుచ్చుకునేలా..
ఐటీ జాబ్స్ కాకుండా విదేశీయుల కోసం యూఎస్‌లో చాలానే ఉద్యోగాలు ఉన్నాయి. యూఎస్‌లో పెరుగుతున్న శ్రామిక కొరత దృష్ట్యా భారత యువతకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయో.. వాటిని ఎలా అందిపుచ్చుకోవాలో తెలుసుకుందాం. ఐటీ కాకుండా అమెరికాలో ప్రస్తుతం నర్సింగ్, హాస్పిటాలిటీ (హోటల్ నిర్వహణ), స్కిల్డ్ ట్రేడ్ ఉద్యోగాలు (వెల్డింగ్, ఎలక్ట్రీషియన్ వంటివి), వ్యవసాయ రంగాల్లో భారతీయ యువతకు అవకాశాలు ఉన్నాయి.కొన్ని సంస్థల సర్వేల ప్రకారం.. భారతదేశంలో 18-40 సంవత్సరాల వయసు గల జనాభా 60 కోట్ల మంది ఉన్నారు. సగటు వయసు 30 ఏళ్లలోపు ఉంది. ఇప్పటికే విదేశాల్లో ఉన్న భారతీయ కార్మికులు ప్రతి సంవత్సరం 130 బిలియన్ డాలర్లు స్వదేశానికి పంపుతున్నారు. మెరుగైన వ్యవస్థలతో ఇది 2030 నాటికి సంవత్సరానికి 300 బిలియన్ డాలర్లకు పెరుగుతుందనే అంచనాలు ఉన్నాయి. ఇదిలాఉండగా, ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు తీవ్ర కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అగ్రశ్రేణి టాలెంట్ హబ్‌గా ఎదగడానికి భారత్‌కు అవకాశం ఉంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన యూఎస్ వంటి దేశాల్లో వృద్ధాప్య జనాభా పెరుగుతోంది. అందుకు తగినట్లుగా యువ జనాభా అంతంతమాత్రంగానే ఉంది. ఈ వ్యత్యాసాన్ని భారత్ భర్తీ చేస్తుంది.యూఎస్‌లో ఐటీయేతర ఉద్యోగ అవకాశాలునర్సింగ్, ఆరోగ్య సంరక్షణ: అమెరికాలో ఆరోగ్య సంరక్షణ రంగంలో నర్సులకు, ఇతర ఆరోగ్య నిపుణులకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది.హాస్పిటాలిటీ (హోటల్ నిర్వహణ): హోటల్ నిర్వహణ, క్యాటరింగ్ వంటి హాస్పిటాలిటీ రంగాల్లో కూడా భారతీయ యువతకు అవకాశాలు లభిస్తాయి.నైపుణ్యం కలిగిన ట్రేడ్ ఉద్యోగాలు: వెల్డర్లు, ఎలక్ట్రీషియన్లు, ప్లంబర్లు, గృహ నిర్మాణ కార్మికులు.. వంటి నైపుణ్యం కలిగిన ట్రేడ్‌ల్లో కూడా అమెరికాలో కొరత ఉంది. దీనికి తగిన శిక్షణ పొందిన వారికి ఉద్యోగాలు దొరుకుతాయి.వ్యవసాయం: అమెరికా వ్యవసాయ రంగంలో కూడా వివిధ రకాల ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.ప్రస్తుతం అమెరికా వీసా విధానాలు కఠినతరం కావడంతో ముఖ్యంగా హెచ్-1బీ వీసా వంటి వాటికి ఎంతో పోటీ ఉంది. భారత యువత వీటిని అందిపుచ్చుకోవడానికి సంబంధిత రంగాల్లో నైపుణ్యం పెంచుకోవాలి. విద్యార్హతలు సంపాదించాలి. అమెరికా వీసా నిబంధనలను అర్థం చేసుకుని దానికి అనుగుణంగా దరఖాస్తు ప్రక్రియలను జాగ్రత్తగా పూర్తి చేయాల్సి ఉంటుంది.వీసా విధానాలువీసా పేరుఉపయోగం / లక్ష్యంH‑2Aవ్యవసాయ రంగంలో సీజనల్ వర్కర్ల కోసం ఈ వీసా పని చేస్తుంది.H‑2Bవ్యవసాయేతర సీజనల్ / తాత్కాలిక ఉద్యోగాలు (హాస్పిటాలిటీ, రెస్టారెంట్లు, పార్క్స్, రిసోర్ట్స్ మొదలైనవి)L‑1కంపెనీ ఇంటర్నల్ ట్రాన్స్ఫర్, మేనేజ్మెంట్, ఎగ్జిక్యూటివ్ లేదా స్పెషలైజ్డ్ నాలెడ్జ్ వర్కర్లుO‑1అత్యుత్తమ ప్రతిభ (ఆర్ట్స్, అథ్లెటిక్స్, బిజినెస్, ఎడ్యుకేషన్, సైన్సెస్) ఉన్నవారికీ ఇదీ చదవండి: సెస్‌ల లక్ష్యం నీరుగారుతోందా? -
ఉద్యోగంలో చేరి రెండు రోజులే.. జాబ్ నుంచి తీసేసారు
ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికీ చాలా ప్లాన్స్ ఉంటాయి. ఎక్కువ శాలరీ తెచ్చుకోవడానికి కంపెనీలను సైతం మారుస్తూ ఉంటారు. అలాంటి సమయంలో ఉద్యోగమే పోతే?, వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడం అసాధ్యమే. ఇలాంటి ఘటనే ఇటీవల వెలుగులోకి వచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.కంపెనీలో చేరిన రెండు రోజులకే ఉద్యోగం నుంచి తొలగించిన తమ బాధాకరమైన అనుభవాన్ని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాను గుర్గావ్లోని ఒక చిన్న కంపెనీలో ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా రెండు సంవత్సరాలు పనిచేసానని.. ఈ ఏడాది జూలైలో సాకేత్‌లోని ఫుడ్ బేస్డ్ కంపెనీలో చేరాను పేర్కొన్నాడు. ఉద్యోగంలో చేరిన రెండో రోజు.. ఆ కంపెనీ బాస్ మరిన్ని బాధ్యతలు చేపట్టగల మేనేజర్ చూస్తున్న కారణంగా.. నన్ను తొలగించారు. చేసేదేమీ లేక నేను ఆఫీసు నుంచి వెళ్ళిపోయాను.ఆ కంపెనీ నుంచి బయటకు వెళ్ళిపోయిన తరువాత ఉద్యోగం కోసం ఎదురు చూస్తూనే ఉన్నాను. కానీ ఎక్కడా ఉద్యోగం దొరకలేదని పేర్కొన్నారు. ఇది మానసికంగా నన్ను ఎంతగానో బాధిస్తోంది. నేను ఇప్పుడు నా మునుపటి కంపెనీకి కూడా వెళ్లలేకపోతున్నాను. ఎందుకంటే నా స్థానంలో కంపెనీ మరొకరిని నియమించుకుంది. ఇప్పుడు నాకు ఏమి చేయాలో తోచడం లేదని, నాకు ఎవరైనా సహాయం చేయగలరా అని అడిగారు.ఇదీ చదవండి: ఇప్పుడంతా ఇదే ట్రెండ్!.. అద్భుతాలు చేస్తున్న బనానా ఏఐసోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టుపై పలువురు నెటిజన్లు తమదైన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. ఉద్యోగం నుంచి తొలగించాలంటే.. చట్టపరమైన పరిణామాలు ఉండాలి?, మిమ్మల్ని అన్యాయంగా తొలగించారు కాబట్టి.. మీరు న్యాయవాదిని సంప్రదించండి అని ఒకరు సలహా ఇచ్చారు. వేచి ఉండండి, తప్పకుండా మంచి ఉద్యోగం లభిస్తుందని మరొకరు అన్నారు. ఉద్యోగాలకు దరఖాస్తు చేస్తూ ఉండండి, ఇంటర్యూలు విఫలమైనా బాధపడకండి అని ఇంకొకరు సలహా ఇచ్చారు. -
భారత్‌లో నిరుద్యోగ రేటు ఇలా..
వరల్డ్ ఎకనమిక్ ఫోరం ప్రకారం జీ20 కూటమి దేశాల్లో చూస్తే.. భారత్‌లోనే నిరుద్యోగ రేటు అత్యంత కనిష్టంగా 2 శాతం స్థాయిలో ఉందని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి 'మన్సుఖ్ మాండవీయ' తెలిపారు. వేగవంతమైన ఆర్థిక వృద్ధికి అనుగుణంగా వివిధ రంగాల్లో గణనీయంగా ఉద్యోగాల కల్పన జరిగిందని ఆయన వివరించారు. ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజనలాంటి స్కీములు కూడా ఇందుకు దోహదపడ్డాయని పేర్కొన్నారు.నేషనల్ కెరియర్ సర్వీస్ (ఎన్సీఎస్) పోర్టల్ ద్వారా యువతలో ఉద్యోగ నైపుణ్యాలను పెంపొందించేందుకు, ఉద్యోగావకాశాలను మెరుగుపర్చేందుకు క్లాసిఫైడ్స్ ఆన్లైన్ సైట్ ‘క్వికర్’, డిజిటల్ మెంటార్షిప్ ప్లాట్‌ఫాం’ మెంటార్ టుగెదర్’తో కార్మిక శాఖ అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు. ఉద్యోగార్థులకు తగిన ఉద్యోగావకాశాలు దక్కేందుకు ఈ భాగస్వామ్యాలు తోడ్పడగలవని ఆయన పేర్కొన్నారు.ఇదీ చదవండి: 'ఈ రంగాలు లేకుంటే అమెరికాలో ఉద్యోగాలు సున్నా'మెంటార్ టుగెదర్ భాగస్వామ్యంతో తొలి ఏడాదిలో 2 లక్షల మంది యువతకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజె తెలిపారు. మరోవైపు క్వికర్ జాబ్స్ని ఎన్సీఎస్కి అనుసంధానించడం వల్ల పోర్టల్‌కి ప్రతి రోజూ 1,200 జాబ్ లిస్టింగ్‌లు జతవుతాయని పేర్కొన్నారు. ఎన్సీఎస్ ప్లాట్‌ఫాంలో 52 లక్షల పైగా సంస్థలు, 5.79 కోట్ల ఉద్యోగార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. ప్రస్తుతం పోర్టల్‌లో 44 లక్షల పైచిలుకు వేకెన్సీలు అందుబాటులో ఉన్నాయి.Opportunities. Guidance. Growth.Today, @NCSIndia signed MoUs with @mentortogether and Quikr to enhance job access and career guidance for our Yuva Shakti. Through this, Mentor Together will offer expert mentorship and career guidance, while Quikr will bring 1,200+ daily job… pic.twitter.com/nFwWNSZcF2— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) September 8, 2025 -
99 శాతం నిరుద్యోగులవుతారు.. ప్లాన్ బి ఉండదు
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) చాలా రంగాల్లో ఉద్యోగాలను భర్తీ చేస్తుందని, తద్వారా నిరుద్యోగుల సంఖ్య ఎక్కువవుతుంది పలువురు నిపుణులు చెబుతూనే ఉన్నారు. ఇప్పుడు తాజాగా లూయిస్విల్లే యూనివర్సిటీ కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసర్ 'రోమన్ యాంపోల్స్కీ' (Roman Yampolskiy) సంచలన వ్యాఖ్యలు చేశారు.రోమన్ యాంపోల్స్కీ ప్రకారం.. కృత్రిమ మేధస్సు (AI) 2030 నాటికి 99 శాతం మంది కార్మికులను నిరుద్యోగులుగా చేస్తుందని అన్నారు. ప్రపంచంలోని చాలా కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకోవడానికి.. ఆదాయాన్ని పెంచుకోవడానికి ఏఐ వ్యవస్థలనే ఉపయోగించుకుంటారని హెచ్చరించారు.కోడింగ్ ఉద్యోగులు, ప్రాంప్ట్ ఇంజనీర్లు మాత్రమే కాకుండా.. చాలా రంగాల్లోని ఉద్యోగాలని ఏఐ భర్తీ చేస్తుంది. మనం ఇంతకు ముందు ఎన్నడూ చూడని స్థాయిలో నిరుద్యోగం ఉన్న ప్రపంచాన్ని చూడబోతున్నాము. నేను 10 శాతం నిరుద్యోగం గురించి చెప్పడం లేదు. 99 శాతం ఉద్యోగాలు కోల్పోతారని చెబుతున్నానని ప్రొఫెసర్.. ది డైరీ ఆఫ్ ఎ సిఇఓ పాడ్‌కాస్ట్‌లో పేర్కొన్నారు. 2027 నాటికి 'ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్' (ఏజీఐ) వచ్చే అవకాశం ఉందని అన్నారు.ఇదీ చదవండి: అమెరికాతో కలిసి పనిచేయాలి: అశ్విని వైష్ణవ్ఏజీఐ వచ్చిన మూడేళ్ళ తరువాత.. ఏఐ సాధనాలు, హ్యుమానాయిడ్ రోబోలు వస్తాయి. కంపెనీలు మనుషులకు ప్రత్యామ్నాయంగా వీటిని నియమించుకునే అవకాశం ఉందని అన్నారు. దీనివల్ల కార్మిక మార్కెట్ కూలిపోతుందని చెప్పారు. "అన్ని ఉద్యోగాలు ఆటోమేటెడ్ అవుతాయి, అప్పుడు 'ప్లాన్ బి' ఉండదు. మీరు తిరిగి శిక్షణ పొందలేరు" అని రోమన్ యాంపోల్స్కీ అన్నారు. -
ఏఐతో ఉద్యోగాలు పోతాయా?
కృత్రిమ మేధ(ఏఐ)తో గణనీయంగా ప్రయోజనాలు ఉంటాయని, పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కూడా పెరుగుతాయని కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి పీయుష్ గోయల్ చెప్పారు. లేటెస్ట్ ఏఐ, చాట్‌జీపీటీ వెర్షన్లను ఉపయోగించాలని తన కార్యాలయంలోని సిబ్బందికి కూడా తాను సూచించినట్లు ఆయన పేర్కొన్నారు. కొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో భారత్ ఎల్లప్పుడూ ముందుంటుందని పరిశ్రమ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి చెప్పారు.ఏఐలాంటి టెక్నాలజీలతో ఉద్యోగాలు పోతాయనే వారి గురించి పెద్దగా పట్టించుకోనక్కర్లేదని ఆయన పేర్కొన్నారు. ఏఐని అనైతికంగా ఉపయోగిస్తే తలెత్తే సమస్యలను అరికట్టడానికి మానవ జోక్యం తప్పనిసరిగా అవసరమవుతుంది కాబట్టి, ఆ విధంగా ఉద్యోగాలు పెరుగుతాయని మంత్రి చెప్పారు. కాబట్టి దీన్నొక గొప్ప అవకాశంగా పరిగణించి, అందిపుచ్చుకోవాలని ఆయన వివరించారు.ఏఐని అనైతికంగా ఉపయోగించడం వల్ల స్వల్పకాలికంగా కొన్ని సమస్యలు తలెత్తినప్పటికీ దీర్ఘకాలికంగా భారత్‌కి ఇది మేలే చేస్తుందన్నారు. డేటా, డాక్యుమెంట్ల భద్రత రీత్యా చాట్‌జీపీటీ, డీప్‌సీక్‌లాంటి టూల్స్‌ను ఆఫీస్ కంప్యూటర్లు, డివైజ్‌లలో డౌన్లోడ్ చేయొద్దని ఫిబ్రవరిలో కేంద్ర ఆర్థిక శాఖ తమ అధికారులకు ఆదేశించింది. అయితే, ఈ కొత్త టెక్నాలజీతో ఒనగూరే ప్రయోజనాలరీత్యా దీని వినియోగంపై ప్రభుత్వ విభాగాల్లో నిషేధమేమీ లేదంటూ మార్చిలో కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ రాజ్యసభకు తెలిపారు. కానీ భద్రత, గోప్యతను దృష్టిలో ఉంచుకుని ఉపయోగించాల్సి ఉంటుందని వివరించారు.ఇదీ చదవండి: అమెరికాతో వాణిజ్య ఒప్పందాలపై చర్చలు -
భారత్‌పై టారిఫ్‌ల ఎఫెక్ట్: కంపెనీల దివాళా, లక్షల ఉద్యోగాలు ఉష్కాకి!!
సాక్షి,న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ టారిఫ్ విధింపులపై ప్రముఖ భారత మార్కెట్ నిపుణులు అజయ్ బగ్గా హెచ్చరికలు జారీ చేశారు. నేటి నుంచి అమల్లోకి వచ్చిన కొత్త టారిఫ్‌లతో సంస్థలు దివాళా తీయడం, వాటిల్లో పనిచేస్తున్న సిబ్బంది ఉద్యోగాలు కోల్పోయేందుకు దారితీయనుందని అన్నారు. రష్యా నుంచి ముడిచమురు కొంటున్న భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా 50శాతం విధించిన అదనపు సుంకాలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ తాజా పరిణామాలపై మార్కెట్ నిపుణులు అజయ్ బగ్గా స్పందించారు.అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై భారత్ 50శాతం టారిఫ్ చెల్లిస్తోంది. వీటివల్ల భారత్‌పై కొంతకాలం ప్రతికూల ప్రభావం పడుంది. పలు సంస్థలు దివాళా తీయోచ్చు. షార్ట్ టర్మ్ ఉద్యోగాలు ప్రమాదంలో పడే అవకాశం ఉందనే అంచనా వేశారు.అదనపు టారిఫ్ కారణంగా భారత్ ఉత్పత్తి రంగంపై 30 నుంచి 40 బిలియన్ల నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని అజయ్ బగ్గా అభిప్రాయం వ్యక్తం చేశారు. దీని ఫలితంగా సమీప భవిష్యత్తులో భారతదేశ జీడీపీ 0.5 శాతం నుంచి 1శాతం వరకు తగ్గుతుంది. రూ.5.25 లక్షల కోట్లు నష్టం వాటిల్లనుంది. అలా అని పరిస్థితులు ఇలాగే స్థిరంగా ఉంటాయా? అని ప్రశ్నిస్తే.. లేదనే సమాధానం చెబుతున్నారు. రష్యా నుంచి ముడిచమురు కొంటున్న భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా ఆగస్టు 7న నుంచి 25శాతం అదనపు సుంకాలు విధించింది. నేటి నుంచి మరో 25శాతం అదనపు సుంకాలు.. మొత్తంగా 50శాతం అదనపు సుంకాలు చెల్లిస్తూ భారత్ ప్రపంచంలోనే అత్యధిక పన్ను చెల్లిస్తున్న దేశాల జాబితాలో చేరినట్లైంది.ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధం కొనసాగేందుకు రష్యా నుంచి భారత్ ముడిచమురు కొనుగోళ్లే కారణమని ట్రంప్ ఆరోపించారు. ఆ కొనుగోళ్లను ఆపకపోతే భారత్ ఎగుమతులపై సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. అయితే, ట్రంప్ హెచ్చరికల్ని భారత్ భేఖాతరు చేసింది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను కొనసాగిస్తూ వస్తోంది. ఈ క్రమంలో భారత్ నిర్ణయంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదనపు టారిఫ్ చెల్లించాలని ప్రకటించారు. దీంతో అమెరికా విధించిన అదనపు సుంకాలు నేటినుంచి అమల్లోకి వచ్చాయి. ఆ దేశ కాలమానం ప్రకారం.. మంగళవారం అర్ధరాత్రి దాటాక బుధవారం తెల్లవారుజామున 12.01 గంటల (భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.30 గంటలు) నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో గతంలో విధించిన 25 శాతానికి అదనంగా మరో 25 శాతం కలిపి భారత్ ఎగుమతులపై 50శాతం భారం పడుతోంది.


