ఇరాన్‌లో భారతీయుల ఆచూకీ గల్లంతు.. కథ సుఖాంతం | 3 Indians missing in Iran rescued by cops in Tehran | Sakshi
Sakshi News home page

ఇరాన్‌లో భారతీయుల ఆచూకీ గల్లంతు.. కథ సుఖాంతం

Jun 4 2025 10:02 AM | Updated on Jun 4 2025 2:54 PM

3 Indians missing in Iran rescued by cops in Tehran

టెహ్రాన్‌: ఇరాన్‌లో గల్లంతైన ముగ్గురు భారతీయుల ఆచూకీ లభ్యమైందని భారత్‌లోని ఇరాన్‌ రాయబార కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ట్వీట్‌ చేసింది.

ఇస్లామిక్‌ రిపబ్లిక్‌ మెహార్‌ న్యూస్‌ ప్రకారం.. భారత్‌లోని పంజాబ్‌కు చెందిన ఓ వ్యక్తి నిర్భందానికి గురయ్యాడు. ట్రెహాన్‌లో స్థానిక ట్రావెల్‌ కంపెనీ బాధితుడికి ఆస్ట్రేలియాలో ఉన్నత ఉద్యోగాలు, అత్యధిక శాలరీ ఇప్పిస్తామంటూ నమ్మించింది. టెహ్రాన్‌ నుంచి ఆస్ట్రేలియాలి వెళ్లాల్సి ఉంది. కానీ వాళ్లు మోసపోయారు. మోసగాళ్లు వారిని నిర్బందించారు. 
 

 చిత్ర హింసలకు గురి చేశారు. బాధితుల బంధువులకు వీడియో కాల్‌లో భారీ మొత్తంలో డిమాండ్‌ చేశారు. డబ్బులు ఇస్తే వదిలేస్తామని, లేదంటే ప్రాణాలు తీస్తామని హెచ్చరించారు. దీంతో ఆందోళన గురైన బాధిత కుటుంబ సభ్యులు కేంద్రం, ఇరాన్‌లోని భారత దౌత్య కార్యాలయాలనికి ఫిర్యాదు చేశారు. ఘటనపై భారత ఎంబసీ స్పందించింది. ఇరాన్ అధికారులను వెంటనే చర్యలు తీసుకోవాలని కోరింది.

భారత్‌ రాయబార కార్యాలయంలో విజ్ఞప్తితో రంగంలోకి దిగిన ఇరాన్‌ పోలీసులు సీక్రెట్‌ ఆపరేషన్‌ నిర్వహించారు. దక్షిణ టెహ్రాన్‌లోని వరమిన్‌లో బందీలుగా ఉన్న బాధితుల్ని సురక్షితంగా రక్షించారు.  ఇదే విషయాన్ని వారి కుటుంబ సభ్యులకు, భారత ప్రభుత్వానికి సమాచారం అందించడంతో కథ సుఖాంతమైంది. త్వరలో బాధితులు భారత్‌కు రానున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement