
సాక్షి,న్యూఢిల్లీ: మేం పడుతున్న బాధ ఎలా ఉంటుందో ఆసిమ్ మునీర్‌కు ఇప్పుడు అర్ధం కాదు. తన బిడ్డలకు ఏదైనా హాని జరిగితే అప్పుడు అర్ధమవుతుంది. ఈ మాటలన్నది మరెవరో కాదు. పహల్గాంలో లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్‌ఎఫ్(The Resistance Front)ఉగ్రవాదులు ప్రదర్శించిన అంతులేని ఉన్మాదంలో కోల్పోయిన తొలి ప్రాణం లెఫ్టినెంట్ వినయ్ నార్వాల్ (26)తండ్రి రాజేష్
ఈ ఏడాది ఏప్రిల్ 22న ప్రకృతి అందాలతో అలరారే పచ్చిక బయళ్లపై ముష్కరులు సృష్టించిన నరమేధంలో 26మంది టూరిస్టులు మరణించగా.. వారిలో లెఫ్టినెంట్ వినయ్ నార్వాల్ ఒకరు.

ఏప్రిల్ 16న వివాహం చేసుకున్న 26 ఏళ్ల లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్..కేవలం ఆరు రోజుల్లోనే జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ దుర్ఘటన జరిగిన సమయంలో ఆయన భార్య హిమాన్షీ నర్వాల్. భర్త పార్థివ దేహం పక్కన కూర్చుని రోదిస్తున్న దశ్యాలు దేశ ప్రజల్ని కంటతడి పెట్టించాయి.ఈ దారుణ ఘటన దేశ ప్రజల్ని తీవ్రంగా కలిచివేసింది.
అయితే,పహల్గాంలో మారణ హోమం సృష్టించిన టీఆర్‌ఎఫ్‌పై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గాం దాడికి బాధ్యత వహించిన టీఆర్‌ఎఫ్‌ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.
అమెరికా ప్రకటనపై లెఫ్టినెంట్ నర్వాల్ తండ్రి రాజేష్ నర్వాల్ మీడియాతో మాట్లాడారు.ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన తన కుమారుడు వినయ్ నార్వాల్‌ను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతరమయ్యారు. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కుమారుడు,కుమార్తెకు ఏదైనా హాని జరిగితే.. మేం పడుతున్న బాధ అర్థమవుతుంది.

నా కొడుకు మరణంతో కుటుంబం మొత్తం మానసికంగా కృంగిపోయింది. నిద్రలేని రాత్రులు, మానసిక సమస్యలు వెంటాడుతున్నాయి. మానసికంగా అలసిపోయాం. రెండు మూడు గంటలకంటే ఎక్కువ నిద్రపోవడం లేదన్నారు..ఏదో బ్రతుకుతున్నాం అంటే బ్రతుకుతున్నాం’ అంటూ నిట్టూర్చారు.
కాగా,పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది. భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫ్ఫరాబాద్, కోట్లి,బహావల్పూర్,రావలకోట్,చక్స్వారీ, భింబర్,నీలం వ్యాలీ,జెహ్లం చక్వాలపై దాడులు చేపట్టింది. ఈ దాడులతో పాక్ ఆర్ధికంగా,భారీ సంఖ్యలో ఉగ్రవాదులను కోల్పోయింది.