breaking news
Pahalgam
-
ఆపరేషన్ మహాదేవ్: పహల్గాం నిందితుల ప్లాన్ బెడిసి కొట్టి.. చివరికి
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్రం ఆపరేషన్ మహాదేవ్‌తో పహల్గాం ఉగ్రవాదుల్ని హతమార్చింది. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ప్రతీకారంతో భారత్ ఆపరేషన్ మహాదేవ్ పేరుతో మిలటరీ ఆపరేషన్ చేపట్టింది.వాళ్లను హతమార్చింది. అయితే, తాజాగా భారత సైనికులు ఆపరేషన్ మహాదేవ్కు సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడింది సులేమాన్, అఫ్గానీ, జిబ్రాన్ ముగ్గురూ పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబా (LeT) సభ్యులు. ఉగ్రదాడి తర్వాత నిందితులు శ్రీనగర్‌లో తలదాచుకుంటున్నారు. ఈ క్రమంలో ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ మహాదేవ్లో భాగంగా నిందితుల కమ్యూనికేషన్ ట్రాక్ చేసింది.శ్రీనగర్ సమీపంలోని లిడ్వాస్ ప్రాంతంలో స్థావరాల్ని గుర్తించింది.అయితే, ఉగ్రవాదులు ఆపత్కాలకంలో స్థావరాల నుంచి పారిపోయేందుకు ఎనిమిది కిలోమీటర్ల సొరంగ మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ సొరంగాన్ని భారత సైన్యం గుర్తించింది. ఆపరేషన్ మహాదేవ్ ప్రారంభం తర్వాత తప్పించుకునేందుకు వీలు లేకుండా ఉగ్రవాదులు ఏర్పాటు చేసుకున్న ఎనిమిది కిలోమీటర్ల మేర నీటితో నింపింది. ఆ తర్వాతే లిడ్వాస్ ప్రాంతంలో ఏర్పాటు చేసుకున్న గుడారాలపై ఆకస్మికంగా బుల్లెట్ల వర్షం కురిపించింది. నిద్రపోతున్న పహల్గాం నిందితుల్ని మట్టుబెట్టింది. అనంతరం వారివద్ద నుంచి ఆయుధాలు,బుల్లెట్లను స్వాధీనం చేసుకుంది. ఆ బుల్లెట్లను.. పహల్గాంలో దాడికి ఉపయోగించిన బుల్లెట్లతో సరిపోల్చారు. ఉగ్రవాదుల మృతదేహాల వద్ద దొరికిన బుల్లెట్లు.. పహల్గాంలో మారణహోమం సృష్టించిన బుల్లెట్లతో 100శాతం సరిపోల్చినట్లు భారత సైన్యం నిర్ధారించింది. ఆపరేషన్ మహాదేవ్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా పార్లమెంటులో మాట్లాడుతూ.. ‘ఈ ముగ్గురు ఉగ్రవాదులు పహల్గాం దాడికి బాధ్యులే అని శాస్త్రీయంగా నిర్ధారించాం. దేశం ముందు నిజాన్ని ఉంచేందుకు అన్ని ఆధారాలు సేకరించాం’అని స్పష్టం చేశారు. -
‘ఆపరేషన్ సిందూర్’పై ప్రత్యేక చర్చలో ఎవరేమన్నారంటే..
మోదీకి ఆ ధైర్యం ఉందా? ‘‘పహల్గాం దాడి తర్వాత ప్రధాని మోదీ సొంత ప్రతిష్టను కాపాడుకోవడానికి సైనిక దళాలను వాడుకుంటున్నారు. భారత్–పాక్‌ను బెదిరించి కాల్పుల విరమణకు ఒప్పించానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలను తిప్పికొట్టే ధైర్యం మోదీకి లేదు. ఇందిరా గాందీకి ఉన్న ధైర్యంలో మోదీకి కనీసం 50 శాతం ఉన్నా ట్రంప్ వ్యాఖ్యలు తప్పు అని పార్లమెంట్లో చెప్పాలి. చైనా, పాకిస్తాన్ల కుట్రల గురించి కొన్ని నెలల క్రితమే లోక్‌సభలో హెచ్చరించా. ప్రభుత్వం నా మాట విని ఉంటే ఐదు యుద్ధ విమానాలను కోల్పోయేవాళ్లం కాదు. ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించగానే కొన్ని సున్నితమైన విషయాలను మన ప్రభుత్వం పాకిస్తాన్‌కు చేరవేసింది. సైనిక స్థావరాలపై దాడులు చేయడం లేదని, ఘర్షణ ఇష్టం లేదని చెప్పేసింది. అలా చేయడం లొంగిపోయినట్లు కాదా? కేవలం 30 నిమిషాల్లో మోదీ ప్రభుత్వం పాకిస్తాన్‌కు లొంగిపోయింది. పాకిస్తాన్ సైనిక స్థావరాలపై, గగనతల రక్షణ వ్యవస్థలపై దాడులు చేయకుండా భారత వైమానిక దళం చేతులు కట్టేసింది ఎవరు? మోదీ ప్రతిష్టను కాపాడే ప్రయత్నం జరిగింది. పహల్గాం బాధితుల రక్తంతో మోదీ చేతులు తడిశాయి. చైనా, పాకిస్తాన్ ఒక్కటి కాకుండా చూడాలని నాలుగు నెలల క్రితం నేను చెబితే చాలామంది ఎగతాళి చేశారు. మన విదేశాంగ విధాన వైఫల్యం వల్ల ఈ రెండు దేశాలు చేతులు కలిపాయి. ఆపరేషన్ సిందూర్‌లో పాకిస్తాన్‌తోపాటు చైనాతోనూ యుద్ధం చేయాల్సి వచ్చింది. పాకిస్తాన్‌కు చైనా అన్ని విధాలుగా సహకరించింది. యు ద్ధంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. పులిని వదిలిపెట్టాలి అనుకుంటే దానికి బంధనాలు విధించడం తగదు. శత్రువును ఓడించాలనుకుంటే పూర్తిగా ఓడించాలి. భారత్–పాక్ యుద్ధం తానే ఆపేశానని ట్రంప్ 29 సార్లు చెప్పారు. ‘మమ్మల్ని మీరు ఆపలేరు, కచి్చతంగా యుద్ధం కొనసాగిస్తాం’ అని ట్రంప్‌తో మన ప్రభుత్వ పెద్దలు ఎందుకు చెప్పలేకపోయారు. మనం ఇప్పుడు ప్రమాదకరమైన దశలో ఉన్నాం. చైనా–పాకిస్తాన్ల కూటమిని ఎదుర్కొంటున్నాం. సైనిక శక్తిని సక్రమంగా వాడుకోలేని ప్రధానమంత్రిని మనం ఇక భరించలేం. డొనాల్డ్ ట్రంప్ అబద్ధాలకోరు అని ధైర్యంగా చెప్పలేని ప్రధానిమంత్రిని భరించలేం. ఇందిరాగాంధీ చేసినట్లుగానే.. త్రివిధ దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చి, ‘పని పూర్తి చేసుకొని రండి’ అని చెప్పే ప్రధానమంత్రి ప్రస్తుతం మనకు కావాలి. పహల్గాం దాడికి సృష్టికర్త అయిన పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్‌కు వైట్‌హౌస్‌లో డొనాల్డ్ ట్రంప్ విందు ఇస్తే మోదీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం దారుణం’’ – లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అమిత్ షా రాజీనామా చేస్తారా? ‘‘నాయకత్వం అంటే ఏదైనా మంచి జరిగితే పేరు ప్రఖ్యాతలు కొట్టేయడం కాదు, తప్పు జరిగితే అందుకు బాధ్యత వహించాలి. జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాం«దీలతోపాటు నా తల్లి సోనియా గాంధీ పెట్టుకున్న కన్నీళ్ల గురించి మాట్లాడుతున్న హోంమంత్రి అమిత్ షా పాకిస్తాన్‌పై యుద్ధం అర్ధాంతరంగా ఎందుకు ఆపారో మాత్రం చెప్పడం లేదు. భద్రతాపరమైన లోపాలే పహల్గాంలో ఉగ్రవాద దాడికి కారణం. పాకిస్తాన్ దాడిలో మనం యుద్ధ విమానాలకు నష్టం జరగకపోతే ఆ విషయం పార్లమెంట్లో చెప్పడానికి ప్రభుత్వానికి భయం ఎందుకు? పహల్గాంలో నిఘా వైఫల్యానికి బాధ్యత ఎవరు తీసుకుంటారో చెప్పాలి. అమిత్ షా రాజీనామా చేస్తారా? లేక బాధ్యత వహిస్తారా? గతంలో జరిగిపోయిన విషయాలు పక్కనపెట్టి, ఇప్పుడు జరుగుతున్న దానిపై ప్రభుత్వం స్పందించాలి’’. – కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకగాంధీ వాద్రా ప్రభుత్వ వైఫల్యానికి గుర్తు ‘‘ఆపరేషన్ సిందూర్ మోదీ ప్రభుత్వ వైఫల్యానికి గుర్తు. పహల్గాం ఉగ్రవాద దాడికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. సాకులు చెప్పి తప్పించుకోవద్దు. ఎవరి ఒత్తిడితో కాల్పుల విరమణ పాటించారో చెప్పాలి. భారత విదేశాంగ విధానం పూర్తిగా కుప్పకూలింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో మన దేశం ఒంటరిగా మిగిలిపోయింది, ఎవరూ మనకు మద్దతుగా రాలేదు. భారతదేశ దౌత్య విధానంలో ఇదొక చీకటి దశ. పుల్వామా, పహల్గాం లాంటి ఉగ్రవాద దాడులు పునరావృతం కాకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరణ ఇవ్వాలి’’. – సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ప్రజలను పరాజితులను చేశారు ‘‘విశ్వగురు(నరేంద్ర మోదీ) దేశ ప్రజలను పరాజితులను చేశారు. ఆపరేషన్ సిందూర్ ఘోరంగా విఫలమైంది. శత్రువులను పూర్తిగా ఒడించకుండానే యుద్ధం విరమించడం ఏమిటి? విశ్వగురు ప్రధానమంత్రిగా ఉన్న దేశంలో ఉగ్రవాద దాడులు తరచుగా ఎందుకు జరుగుతున్నాయి? ఈ దాడుల నుంచి ప్రభుత్వం గుణపాఠాలు నేర్చుకోవడం లేదు’’. –డీఎంకే ఎంపీ కనిమొళి పాకిస్తాన్‌కు చేతకాకపోతే.. సాయం చేస్తాం ‘‘పాకిస్తాన్ సహా ప్రపంచమంతటా ఉగ్రవాదం అంతం కావాలని భారత్ కోరుకుంటోంది. పాక్ ఇకనైనా నిద్ర నుంచి మేల్కోవాలి. ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాలి. మీకు(పాక్) చేతకాకపోతే చెప్పండి మేము రంగంలోకి దిగుతాం. పాక్ ఆక్రమిత కాశీ్మర్(పీఓకే)ను ఎందుకు స్వాధీనం చేసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం ఆశ్చర్యంగా ఉంది. వారు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు స్వా«దీనం చేసుకోలేదో చెప్పాలి. పీఓకే ప్రజలు భారత పరిపాలనా వ్యవస్థలో భాగమయ్యే రోజు ఎంతో దూరంలో లేదు’’. – రాజ్యసభలో రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్సమగ్ర నివేదిక విడుదల చేయాలి ‘‘పహల్గాం ఉగ్రవాద దాడికి భద్రతాపరమైన లోపాలే కారణం. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇందుకు బాధ్యత వహించాలి, పదవికి రాజీనామా చేయాలి. భారత్, పాక్ యుద్ధాన్ని ఆపేశానంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదేపదే చెబుతున్నా ప్రధాని మోదీ నోరుమెదపడం లేదు. మూడో వ్యక్తి మధ్యవర్తిత్వాన్ని ప్రభుత్వం అంగీకరించిందా? హౌడీ మోదీ, నమస్తే ట్రంప్ వంటి కా>ర్యక్రమాలతో మనకు ఒరిగిందేమీ లేదు. వాటితో మన వ్యూహాత్మక ప్రయోజనాలకు ఏమాత్రం లాభం లేదు. ప్రపంచ నాయకులతో నరేంద్ర మోదీకి గొప్ప స్నేహ సంబంధాలున్నప్పటికీ పాక్‌తో యుద్ధం సమయంలో ఇండియాకు ఎవరూ మద్దతు ఇవ్వలేదు. పాక్ దురాగతాలను కనీసం అమెరికా కూడా బహిరంగంగా ఖండించలేదు. పాక్ ఓడిపోయే దశలో ఉన్నప్పుడు అనూహ్యంగా కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించారు. అమెరికా జోక్యం నిజమేనా? దీనిపై ప్రభుత్వం కచి్చతంగా సమాధానం చెప్పాలి? కార్గిల్ యుద్ధంపై అప్పటి ప్రభుత్వం సమగ్ర నివేదిక విడుదల చేసింది. అదే తరహాలో పహల్గాం దాడిపై మోదీ సర్కార్ నివేదిక ఇవ్వాలి’’. – రాజ్యసభలో విపక్ష నేత ఖర్గే మోదీ నరాల్లో రాజకీయాల ప్రవాహం ‘‘ప్రధాని నరేంద్ర మోదీ నరాల్లో సిందూరం ప్రవహించడం లేదు. కేవలం రాజకీయాలే ప్రవహిస్తున్నాయి. నిజంగా సిందూరమే ప్రవహిస్తే పహల్గాం ఉగ్రవాద దాడి జరిగేదే కాదు. మన ప్రజలను బలి తీసుకుంటున్న పాకిస్తాన్‌తో క్రికెట్ ఆడడం ఏమిటి? ఇదేనా మన విదేశాంగ విధానం?’’ – రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాగరికా ఘోష్ -
ఆ ముగ్గురూ పహల్గాం ముష్కరులే
న్యూఢిల్లీ: వేలాది మంది విచారణ. అనుమా నితులపై నిరంతర నిఘా. ఆశ్రయమిచ్చిన వారి నిర్బంధం. గత ఏప్రిల్ 22న పహల్గాంలో పాశవిక దాడికి పాల్పడి 26 మంది అమాయక పర్యాట కులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల కోసం ‘ఆపరేషన్ మహదేవ్’లో భాగంగా భద్రతా దళాలు నెలల తరబడి వేటాడిన తీరిది. శాటిలైట్ ఫోన్ సిగ్నల్స్ సాయంతో ఆనుపానులు చిక్కడంతో ఎట్టకేలకు వారి పాపం పండింది. సోమవారం జమ్మూ కశ్మీర్లో భద్రతా దళాల చేతుల్లో హతమ య్యారు. ఆ ముగ్గురూ పహల్గాం దాడిలో పాల్గొన్న ముష్కరు లేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. వారిని గుర్తించేందుకే నెలల సమయం పట్టిందని వెల్ల డించారు. సాంకేతికత, మానవ నిఘా సాయంతో ఉగ్రవాదులను కదలి కలను కనిపెట్ట గలిగినట్టు వివరించారు. ఆపరేషన్ సిందూర్‌పై మంగళవా రం లోక్‌సభలో ప్రత్యేక చర్చలో ఆ యన ప్రసంగించారు. ఆ పాశవిక దాడితో గాయ పడ్డ దేశ ప్రజల హృద యాలకు సాంత్వన చేకూ ర్చిన ఆపరేషన్ మహదేవ్ తాలూకు వివరాలను సభకు వెల్లడించారు. హతులైన ముగ్గురిని సులే మాన్ అలియాస్ ఫైజల్, అఫ్గాన్, జిబ్రాన్‌గా గుర్తించారు. వారంతా ఏ గ్రేడ్ ఉగ్రవాదులేనని తెలిపారు. సైన్యం తాలూకు 4 పారా మిలిటరీ బలగాలు, సీఆర్పీఎఫ్ జవాన్లు, జమ్మూ కశ్మీర్ పోలీసులు కలసి కట్టుగా ఆపరేషన్‌లో పాలుపంచుకున్నట్టు వివరించారు. పహల్గాం దాడికి పాల్పడ్డ ముష్కరులను ఏరివేసి జాతికి ఊరట కల్పించామని చెప్పారు. ‘‘ఇంత మంచి వార్త విని అధికార పక్షంతో పాటు విపక్షాలు ఆనందిస్తాయని ఆశించా. కానీ వారి ముఖాలన్నీ కళతప్పి కనిపిస్తున్నాయి’’ అంటూ ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ తప్పిదమే ‘పాక్’!ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమవుతూ వస్తోందని అమిత్ షా ఎద్దేవా చేశారు. దేశ సమస్యలన్నింటికీ కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమంటూ తూర్పారబట్టారు. పాక్ ఆక్రమిత భూభాగాలను స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అవకాశాలన్నింటినీ కాంగ్రెస్ ఎప్పటికప్పుడు కాలదన్నుతూ వచ్చిందని ఆరోపణలు గుప్పించారు. అలాంటి పార్టీకి మోదీ ప్రభుత్వం పాక్‌పై పూర్తిస్థాయిలో నిర్ణాయక చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించే నైతిక అర్హత కూడా లేదన్నారు. పహల్గాం దాడిలో పాక్‌కు క్లీన్చిట్ ఇచ్చేందుకు ఎక్కడ లేని ఉత్సాహమూ చూపిన చరిత్ర ఆ పార్టీది అంటూ మండిపడ్డారు. పహల్గాం దాడికి పాల్పడింది స్థానిక ఉగ్రవాదులే కావచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోం మంత్రి పి.చిదంబరం ఇటీవల కూడా వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. పీఓకేను స్వాధీనం చేసుకునే అవకాశం చేతికందిన వేళ సైనిక చర్యను కేంద్రం నిలిపేసిందా అంటూ కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగొయ్ సభలో ప్రశ్నించడంపై అమిత్ షా మండిపడ్డారు. ‘‘వాళ్లు ఏం నిరూపించాలని అనుకుంటున్నారు? ఎవరిని కాపాడాలనుకుంటున్నారు? ఇదంతా పాక్‌ను కాపాడేందుకు స్పష్టమైన కుట్రే’’ అంటూ తూర్పారబట్టారు. స్వాతంత్య్రం వచ్చిన వేళ దేశ విభజనను కాంగ్రెస్ వ్యతిరేకించి ఉంటే జమ్మూ కశ్మీర్లో అసలు ఉగ్ర భూతం జడలు విప్పేదే కాదన్నారు. ఉగ్రవాదానికి పాక్ తల్లివేరుగా మారిందంటూ దుయ్యబట్టారు. ఆ దేశం ఏర్పాటును కాంగ్రెస్ తాలూకు తప్పిదంగా అభివర్ణించారు. పాక్‌కు బుద్ధి చెప్పేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే జారవిడిచిందని ఆరోపించారు. ‘‘1948లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను మన సైన్యం పూర్తిగా విముక్తం చేసే సమయంలో నాటి కాంగ్రెస్ ప్రధాని నెహ్రూ ఏకపక్షంగా కాల్పుల విమరణ ప్రకటించారు. 1962 యుద్ధం వేళ అస్సాంను చైనా దఖలు పరుస్తున్నట్టు బాహాటంగా ప్రకటన చేశారు. పైగా ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ హోదా అవకాశాన్నీ కాలదన్నారు. 1971లో 90,000 మంది పాక్ సైనికులు భారత్‌కు లొంగిపోయారు. ఆ సంఖ్య నాటి పాక్ సైన్యంలో ఏకంగా 42 శాతం. అంతేగాక 15 వేల చదరపు కి.మీ. పాక్ భూభాగం కూడా మన అదుపులోకి వచ్చింది. అయినా పీఓకేను వెనక్కు తీసుకునేందుకు నాటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. సరికదా, ఆ యుద్ధంలో స్వాధీనం చేసుకున్న పాక్ భూభాగాన్ని కూడా పువ్వుల్లో పెట్టి వెనక్కిచ్చారు. ఇలాంటి చరిత్ర ఉన్నవాళ్లు, పహల్గాం దాడికి పాల్పడ్డవారిని ఎందుకు పారిపోనిచ్చారని నన్ను అడుగుతున్నారు. వారిని తుదముట్టించడం ద్వారా ఈ ప్రశ్నకు నా తరఫున భద్రతా దళాలే బదులిచ్చాయి. 1986లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాక్‌కు పారిపోయింది కూడా కాంగ్రెస్ ప్రధాని రాజీవ్ హయాంలోనే. 1993లో ఉగ్రవాదులు సయీద్ సలాహుద్దీన్, టైగర్ మెమన్, అనీస్ ఇబ్రహీం కస్కర్, 2007లో రియాజ్ భత్కల్, 2010లో ఇక్బాల్ భత్కల్ దేశం వీడి పారిపోయినప్పుడు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెసే. వీళ్లందరినీ ఎందుకు పారిపోనిచ్చారో విపక్ష నేత రాహుల్‌గాంధీ నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్నా’’ అని అన్నారు. -
ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేయడానికి ముహూర్తం కావాలా ఏంటి?: మోదీ
సాక్షి,న్యూఢిల్లీ: రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పిలుపుతో భారత్-పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఆ పార్టీ ఇతర ఎంపీలు చేస్తున్న వ్యాఖ్యలపై ప్రధాని మోదీ లోక్‌సభలో మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్‌ను ఆపమని ఏ ప్రపంచాది నేతలు చెప్పలేదని స్పష్టం చేశారు. మంగళవారం లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై కొనసాగుతున్న చర్చలో ప్రధాని మోదీ మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్‌పై లోక్‌సభలో జరుగుతున్న చర్చపై మోదీ మాట్లాడుతూ.. ఈ వర్షాకాల సమావేశాలు భారత్ విజయోత్సవానికి నిదర్శనం. ఆపరేషన్ సిందూర్ విజయానికి ప్రతీకగా విజయ్ ఉత్సవ్. మన సైనికులు ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపారు. ఆపరేషన్ సిందూర్‌ను దేశం మొత్తం విజయోత్సవాలు చేసుకుంటోంది. ఉగ్రస్థావరాలను మనసైన్యం నేలమట్టం చేసింది.140కోట్ల మంది భారతీయులు నాపై నమ్మకం ఉంచారు. సైన్యం వెనుక దేశ ఉంది. మతం కోణంలో పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. శత్రువుకు ఊహకు అందని విధంగా శిక్ష విధించాం. సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం.పాక్ బిత్తర పోయింది ‘పహల్గాం ఉగ్రదాడికి ప్రతీ కారం తీర్చుకుంటామని చెప్పాం.. చేసి చూపించాం. పాక్‌లోకి చొచ్చుకెళ్లి ఉగ్రస్థావరాల్ని ధ్వంసం చేశాం. పాక్‌లోని ఉగ్రవాదుల హెడ్ క్వార్టర్స్‌ను కూల్చేశాం. కలుగులో దాక్కున్న ముష్కరులకు పొగపెట్టిమరీ మట్టిలో కలిపాం. పథకం ప్రకారం ఆపరేషన్ సిందూర్. భారత్ ప్రతీకార చర్యలను చూసి పాక్ బిత్తర పోయింది. ఆపరేషన్ సిందూర్ ముందు పాక్ తేలిపోయింది.ఆపరేషన్ సిందూర్ ముందుకు బ్లాక్ మెయిల్స్ పనిచేయవని చూపించాం’ అని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌కు హెడ్‌లైనే గతి56 ఇంచ్‌ల చెస్ట్ ప్రధాని ఎక్కడా అంటూ కాంగ్రెస్ నాపై విమర్శలు చేసింది. పహల్గాం ఉగ్రదాడి విషయంలో కాంగ్రెస్ రాజకీయాలు చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత కాంగ్రెస్ నన్ను విమర్శించడమే పనిగా పెట్టుకుంది. ప్రపంచం మొత్తం కాంగ్రెస్‌ను కాదు.. దేశాన్ని సపోర్ట్ చేసింది. కాంగ్రెస్ హెడ్‌లైన్స్‌లో ఉండొచ్చు కానీ.. ప్రజల హృదయాల్లో నిలవలేదు. మాస్టర్ మైండ్‌కు నిద్ర కరువైందిఉగ్రవాదానికి ఊతం ఇస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని పాక్‌కు బదులిచ్చాం.మనం చేసిన దాడులనుంచి పాక్ ఎయిర్ బేస్‌లు ఇంకా కోలుకోలేదు. ఆపరేషన్ సిందూర్‌లో మన ఎయిర్‌ఫోర్స్ 100శాతం విజయం సాధించాయి. సిందూ నుంచి సిందూర్ వరకు పరాక్రమాన్ని ప్రదర్శించాం. ఆపరేషన్ సిందూర్ తర్వాత మాస్టర్ మైండ్‌కు నిద్ర కరువైంది. పాక్ ప్రాధేయపడిందిఉగ్రవాదులతో పాకిస్తాన్ బంధం బహిరంగ రహస్యమే. ఉగ్రవాదాన్ని అణిచి వేయడమే భారత్ లక్క్ష్యం. మన మిస్సైల్స్ పాక్ మూల మూలల్లోకి చొచ్చుకుని వెళ్లాయి. మనం ఆపరేషన్ సిందూర్‌తో స్పందిస్తామని పాక్ కలలో కూడా ఊహించలేదు. ఆపరేషన్ సిందూర్‌తో సైనికులు పాక్ ఉగ్రవాదుల్ని చీల్చి చెండాడారు. ఇక చాలు అంటూ డీజీఎంవో సమావేశంలో పాక్ ప్రాధేయపడింది. మన దాడులతో పాక్ కాళ్ల బేరానికి వచ్చింది. దయచేసి ఇంక దాడులు ఆపండి అంటూ ప్రాధేయపడింది."प्रहाराय सन्निहिताः, जयाय प्रशिक्षिताः"Ready to Strike, Trained to Win.#IndianArmy pic.twitter.com/M9CA9dv1Xx— ADG PI - INDIAN ARMY (@adgpi) May 6, 2025 ఆపరేషన్ సిందూర్: ట్రంప్ ప్రమేయం లేదుఆపరేషన్ సిందూర్‌ను ఆపమని ఏ ప్రపంచాది నేతలు మాకు ఫోన్ చేయలేదు. మే9న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నాకు ఫోన్ చేశారు.నేను బిజీగా ఉన్నాను. వాన్స్ చాలాసార్లు నాకు ఫోన్ చేశారు. పాక్ భారత్‌పై భారీ ఎత్తున మిస్సైళ్లతో దాడి చేయబోతోందని వాన్స్ నాకు చెప్పాడు. పాక్ దాడి చేస్తే తిప్పి కొడతామని చెప్పాను. పాక్ మూల్యం చెల్లించుకోక తప్పలేదు. ఆపరేషన్ సిందూర్ ఆన్‌లోనే ఉంది. పాక్ అజెండాను ఇంపోర్ట్ చేసుకునే పనిలో కాంగ్రెస్ ఉంది. ఆపరేషన్ సిందూర్ దాడి తాలూకా ఫొటోలు కావాలని కాంగ్రెస్ అడుగుతోంది. పాక్ మళ్లీ దుస్సహానికి పాల్పడితే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. మన దేశ సామర్ధ్యాలపై కాంగ్రెస్‌కు నమ్మకం లేదుఅధమ్ పూర్ బేస్‌పై దాడి అంటూ పాక్ అసత్య ప్రచారాలు చేసింది. ఆ మరుసటి రోజే నేను అక్కడి వెళ్లి మన సైనికుల్ని అభినందించారు. సుదీర్ఘ కాలం కాంగ్రెస్ దేశాన్నిపాలించింది. కానీ మనదేశ సామర్ధ్యాలపై కాంగ్రెస్‌కు నమ్మకం లేదు. పాక్ తప్పుడు వార్తల్ని కాంగ్రెస్ నేతలు ఇక్కడ ప్రచారం చేశారు. ఒక్క పాక్ మిసైల్ కూడా భారత్‌ను టచ్ చేయలేదు. ముమూర్తం కావాలా ఏంటి?ఆపరేషన్ మహాదేవ్‌పై ప్రధాని మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆపరేషన్‌లో భాగంగా భారత్ సైనికులు పహల్గాం ఉగ్రవాదుల్ని హతమార్చింది. నిన్న టెర్రరిస్టులను ఎందుకు చంపారని విపక్షాలు అడిగాయి. ఎన్నిగంటలు ఆపరేషన్ మహాదేవ్ చేపట్టారని అఖిలేష్ యాదవ్ అడిగారు. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టడానికి ఏమైనా ముమూర్తం కావాలా?కాంగ్రెస్‌ను పీవోకేను కోల్పోయాంకాంగ్రెస్ విధానం వల్ల పీవోకే విషయంలో భారత్ మూల్యం చెల్లించుకుంటోంది. కాంగ్రెస్ హయాంలో భారత్ పీవోకేని కోల్పోయింది. కాంగ్రెస్ వల్లే పీవోకే మనకు కాకుండా పోయింది.నెహ్రూ చేసిన తప్పులకు భారత్ ఇప్పటికీ మూల్యం చెల్లిస్తోంది.కాంగ్రెస్ వల్ల 33వేల చదరపు అడుగుల భూభాగాన్ని భారత్ కోల్పోయింది. కచ్చతీవును శ్రీలంకకు ఇందిర గిఫ్ట్‌గా ఇచ్చింది. పీవోకేను ఎప్పుడు వెనక్కి తెస్తారని అడుగుతున్నారు. పాక్‌కు నీళ్లు అప్పగించి భారత్‌లో సంకటస్థితి సృష్టించారు. సింధూ ఒప్పందం లేకుండా భారీ ప్రాజెక్ట్‌లు వచ్చేవి. నీళ్లు కాదు.. కాలువలు తవ్వేందుకు నెహ్రూ పాక్‌కు నిధులిచ్చారు. నెహ్రూ పాక్ అనుకూల విధానాలతో నిధి మనది.. నీళ్లు మనది పెత్తనం వాళ్లదా. నీళ్ల వివాదాల పరిష్కార బాధ్యతల్ని నెహ్రూ వరల్డ్ బ్యాంక్‌కు అప్పగించారు. -
జమ్మూకశ్మీర్ : శ్రీనగర్ లో ఎన్కౌంటర్
-
ఆపరేషన్ సిందూర్ అద్భుతం : వైఎస్ అవినాష్
సాక్షి,న్యూఢిల్లీ: జాతీయ భద్రతకు కేంద్రం తీసుకునే అన్ని చర్యలకు వైఎస్సార్సీపీ మద్దతిస్తుందని ఆ పార్టీ ఎంపీ వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. లోక్‌సభలో అపరేషన్ సిందూర్‌పై జరిగిన చర్చలో వైఎస్ అవినాష్ రెడ్డి మాట్లాడారు. పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. పాకిస్తాన్ చర్యలకు జవాబు దారి చేయాలి. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తుంది. పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి హకీమ్ స్వయంగా పాశ్చాత్య దేశాల కోసం ఉగ్రవాదులకు మద్దతిస్తున్నామని చెప్పాడు. వైఎస్సార్సీపీ జమ్మూ కాశ్మీర్ పౌరులకు సంఘీభావం ప్రకటిస్తోంది. అనేక సంవత్సరాల అస్థిర పరిస్థితుల మధ్య మళ్లీ ప్రజాస్వామ్యం పునరుద్ధరణ జరుగుతోంది. పహల్గాం దాడితో ఈ ప్రయత్నాలకు కొంత దెబ్బ తగిలింది. ఆపరేషన్ సిందూర్ విజయవంతంగా నిర్వహించారు. ఆపరేషన్ సిందూర్ అద్భుతంగా నిర్వహించిన భారత ఆర్మీని వైఎస్సార్సీపీ అభినందిస్తోంది. ఈ ఆపరేషన్ భారత రక్షణ సామర్థ్యానికి ఒక ప్రతీక. పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగానే ఆపరేషన్ సిందూర్ నిర్వహించారు. అత్యంత ఖచ్చితత్వంతో సైనిక బలగాలు పాకిస్తాన్‌లోని ఉగ్రస్తావరాలను ధ్వంసం చేశాయి. అంతర్జాతీయ నిబంధనలకు కట్టుబడి కేవలం ఉగ్రస్థావరాలపైనే దాడి జరిగింది. అరగంటలోపే మొత్తం ఆపరేషన్ పూర్తి చేశారు. డ్రోన్ సిస్టంలతో వ్యూహాత్మక లక్ష్యాలపై దాడులు విజయవంతంగా పూర్తి చేసింది. సంఖ్యాత్మక బలం కంటే సాంకేతికత ముఖ్యమని ఆపరేషన్ సిందూర్ చాటి చెప్పింది. సరిహద్దుల్లో నిరంతరం అప్రమత్తతతో సన్నద్ధంగా ఉండడం కీలకం. జాతీయ సార్వభౌమత్వాన్ని రక్షించడానికి రక్షణ బడ్జెట్‌ను పెంచడం మంచిదేనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆపరేషన్ సిందూర్ చర్చలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్పహల్గాం దాడి జరిగిన రోజు, కాల్పుల విరమణ జరిగిన రోజు ప్రధాని నరేంద్ర మోదీకి, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు మధ్య ఎలాంటి ఫోన్ కాల్ సంభాషణ జరగలేదు. కాల్పుల విరమణకు తానే కారణమన్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటనను తోసి పుచ్చారు.ఆపరేషన్ సింధూర్ దాడి తర్వాత పాకిస్తాన్ కాల్పుల విరమణకు ప్రతిపాదన చేసింది. స్వయంగా పాకిస్తాన్ డీజీఎంఓ కాల్ చేసి కాల్పుల విరమణ చేయాలని అడిగారు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ను సృష్టించినది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమే. కాంగ్రెస్ హయాంలోనే చైనాకు కాశ్మీర్ భూభాగం ధారా దత్తం చేశారు. కాంగ్రెస్ హయాంలోనే పాకిస్తాన్ చైనా కారిడార్ ఒప్పందాలు జరిగాయి.ఎంపీ గౌరవ్ గొగోయ్ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాక్‌పై భారత్ కాల్పుల విమరణకు ఎందుకు అంగీకరించిందో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కాకుండా ప్రధాని మోదీ సమాధానం చెప్పాలని లోక్‌సభలో కాంగ్రెస్ లోక్‌సభ ఎంపీ గౌరవ్ గొగోయ్ డిమాండ్ చేశారు. భారత్-పాక్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగేలా ఇరు దేశాలపై తాను ఒత్తిడి చేసినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 26సార్లు పాకిస్తాన్లను కాల్పుల విరమణకు బలవంతం చేశానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 26 సార్లు మాట్లాడారు. దీని వెనుక ఉన్న నిజం మాకు తెలుసుకోవాని అనుకుంటున్నాను అని వ్యాఖ్యానించారు. పాక్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) ఆర్థిక సహాయం అందించకుండా భారత్ ఎందుకు ఆపలేకపోయిందని ప్రశ్నించారు. పహల్గాం ఘటన జరిగి నెలలు గడుస్తున్నా.. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టకపోవడం,పాక్‌కు బుద్ధి చెప్పామంటూనే ఆపరేషన్ సిందూర్‌ను ఆపేయడం వంటి అంశాలపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ధీటుగా బదులిచ్చారు. ‘ఆపరేషన్ సిందూర్ ఆగలేదు.. గ్యాప్ ఇచ్చాం అంతే. పాక్, పాక్ ఆక్రమిత ఉగ్రవాదుల ఏరివేతే లక్క్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో దాయాది దేశం మన కాళ్ల బేరానికి వచ్చింది. భారత్ సైనికులు సింహాలు. దేశ రక్షణ సంబంధించిన అంశాలపై ప్రశ్నలు వేసే విషయంలో జాగ్రతగా ఉండాలి’ అంటూ ప్రతిపక్షాలకు రాజ్‌నాథ్ సూచించారు. ప్రజా సమస్యలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను ప్రభుత్వానికి అడగడం ప్రతిపక్షం పని. కొన్నిసార్లు, మన విమానాలను ఎన్ని కూల్చివేసారని మన ప్రతిపక్ష సభ్యులు అడుగుతూనే ఉంటారు. కానీ మన దళాలు ఎన్ని పాకిస్తాన్ విమానాలను కూల్చివేశామని వారు ఎప్పుడూ అడగరు. మీరు ప్రశ్నలు అడగాలనుకుంటే, ఈ ఆపరేషన్‌లో మన సైనికుల్లో ఎవరికైనా హాని జరిగిందా అని అడగండి? ఇలాంటి ప్రశ్నలకు మీ వద్ద సమాధానం ఉందా? లేదు’ అని అన్నారు.సోమవారం (జులై 28)లోక్‌సభలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆపరేషన్ సిందూర్‌పై రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడి హేయమైన చర్య.ఆపరేషన్ సిందూర్ పేరుతో సైనిక చర్య ప్రారంభించాం.ఆపరేషన్ సిందూర్ ద్వారా ప్రపంచానికి సత్తా చూపించాం.పహల్గాం ఉగ్రదాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మతం పేరు అడిగి మరి పర్యాటకుల్ని కాల్చి చంపారు మన ఆడబిడ్డలకు జరిగిన అన్యాయంపై ఊరుకునేది లేదు. పాక్,పీవోకేలోని పాక్ ఉగ్రవాదుల శిబిరాలపై దాడులు చేశాం. భారత సైన్యం వ్యూహాత్మకంగా ఉగ్రవాదుల శిబిరాలపై దాడి చేసింది. పాకిస్తాన్లో తొమ్మిది ఉగ్ర శిబిరాలపై దాడులు చేశాం. 100మందికిపైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాం.హిబ్జుల్,లష్కరే తోయిబా ఉగ్రశిబిరాల్ని నేలమట్టం చేశాం.టెర్రరిస్టుల ఇళ్లలోకి చొచ్చుకెళ్లీ మరి 22 నిమిషాల్లో వారి స్థావరాల్ని ధ్వంసం చేశాం.పాక్ ఉగ్రస్థావరాలపై దాడి జరిపిన తర్వాత ఆదేశ డీజీఎంవోకు సమాచారం అందించాం.పాక్ డ్రోన్లను భారత్ వాయిసేన కూల్చేసింది. పాక్‌లో సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా దాడి చేశాం.ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న సైన్యానికి నా సెల్యూట్.పాక్ దాడుల్లో భారత ఆయుధ సంపత్తికి ఎలాంటి నష్టం జరగలేదు.భారత నౌకా దళం కూడా పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పింది.పాక్‌ను ఆక్రమించుకోవడం ఆపరేషన్ సిందూర్ లక్ష్యం కాదు.తమ దేశంపై దాడులు వెంటనే ఆపాలని పాక్ కోరింది.మన దాడులతో పాక్ మన కాళ్ల బేరానికి వచ్చింది. ఆపరేషన్ సిందూర్ ముగియలేదు..గ్యాప్ ఇచ్చాం. ఆపరేషన్ సిందూర్ ఆపాలని మాపై ఎలాంటి ఒత్తిడి లేదు.బాధితులపై జరిగిన అన్యాయంపై ప్రతీకారం తీర్చుకున్నాం’ అని స్పష్టం చేశారు. -
ఆపరేషన్ మహదేవ్ పహల్గాం ఉగ్రదాడి మాస్టర్‌మైండ్ హతం
శ్రీనగర్: ‘పహల్గాం’ గాయానికి ప్రతీకారం మొదలైంది. దేశమంతటా ఆగ్రహావేశాలు రగిల్చిన ఆ దాడికి పాల్పడ్డ ఉగ్ర ముష్కరులకు కౌంట్‌డౌన్ మొదలైంది. పహల్గాం దాడి సూత్రధారి అయిన ఉగ్ర ముష్కరుడు హషీం మూసా అలియాస్ సులేమాన్ అలియాస్ ఆసిఫ్‌ను భద్రతా దళాలు సోమవారం మట్టుబెట్టాయి. జమ్మూ కశ్మీర్లో శ్రీనగర్ శివార్లలోని అటవీ ప్రాంతంలో ‘ఆపరేషన్ మహదేవ్’ పేరిట జరిపిన భీకర ఎన్కౌంటర్లో సులేమాన్‌తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను ఎలైట్ పారా కమెండో దళాలు కాల్చిపారేశాయి. వారిని జిబ్రాన్, హంజా అఫ్గానీగా గుర్తించారు. జిబ్రాన్ గతేడాది సోనామార్గ్‌లో టన్నెల్ ప్రాజెక్టు పనులు చేస్తున్న సిబ్బందిని పొట్టన పెట్టుకున్న ఉగ్ర ముఠా సభ్యుడని అధికార వర్గాలు వెల్లడించాయి. ఎన్కౌంటర్ ప్రాంతం నుంచి ఒక ఎం4 కార్బైన్, రెండు ఏకే రైఫిళ్లు, మందుగుండు, గ్రెనేడ్లు తదితరాలు స్వాధీనం చేసుకున్నా రు. ముష్కరుల మృత దేహాలను బలగాలు స్థానిక పోలీసులకు అప్పగించాయి. ఈ ముష్కరులకు సన్ని హితులైన మరో ఉగ్ర ముఠా సభ్యులు సైతం ఎన్కౌంటర్ ప్రాంతానికి సమీపంలోనే నక్కినట్టు బలగాలకు సమాచారం అందింది. దాంతో సమీప ప్రాంతాలన్నింటినీ దిగ్బంధించి జల్లెడ పడు తున్నారు. ‘ఆపరేషన్ మహదేవ్’ ఇంకా ముమ్మరంగా కొనసాగుతున్నట్టు సైనిక, స్థానిక పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. ఇందుకోసం భారీ సంఖ్యలో అదనపు బలగాలను మోహరించారు. సై న్యం, భద్రతా బలగాలు, కశ్మీర్ పోలీసు విభాగ సి బ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నా రు. ఆపరేషన్ మహదేవ్ ఇప్పట్లో ముగి యబోదని కశ్మీర్ జోన్ ఐజీ వీకే బిద్రీ స్పష్టం చేశారు..కునుకు తీస్తుండగానే...హషీం మూసా. అలియాస్ అబూ సులేమాన్. అలియాస్ ఆసిఫ్. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరే తయిబా టాప్ కమాండర్. పహల్గాం ఉగ్ర దాడి సూత్రధారి. ఆపరేషన్ మహదేవ్లో మన బలగాలు మట్టుబెట్టిన ముగ్గురు ముష్కరుల్లో అతి ముఖ్యుడు. అయితే ఇంతటి విజయం అంత తేలిగ్గా ఏమీ లభించలేదు. ఇందుకోసం సైన్యం అవిశ్రాంతంగా శ్రమించింది. సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీస్తో కలిసి ఏకంగా 14 రోజుల పాటు కలిసికట్టుగా, నిర్విరామంగా వేట సాగించింది. చివరికి శ్రీనగర్ శివార్లలోని అటవీ ప్రాంతంలో మూసా ముఠా ఆనుపానులు కనిపెట్టి ముప్పేట దాడి చేసింది. రెప్పపాటులో దాని కథ ముగించింది. జమ్మూ కశ్మీర్‌లోని లిడ్వాస్ ప్రాంతంలోని చినార్ కార్ప్స్ సైనిక విభాగం ఈ ఆపరేషన్‌ను ఆద్యంతం పర్యవేక్షించింది. అనంతరం ఘటనా స్థలిలో తీసిన డ్రోన్ ఫుటేజీని విడుదల చేసింది. అందులో ముగ్గురు ముష్కరుల మృతదేహాలు కనిపిస్తున్నాయి. వీరంతా లష్కరే, పాక్‌కే చెందిన మరో ఉగ్ర ముఠా జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులేనని తేలింది. పహల్గాం ఉగ్ర దాడి తమ పనేనని లష్కరే ప్రకటించుకోవడం తెలిసిందే. ఈ ముగ్గురిలో ముఖ్యుడైన మూసా దాడి సమయంలో తీరిగ్గా కునుకు తీస్తూ ఉండటం ఈ ఉదంతం మొత్తంలో కొసమెరుపు!అలా ఉచ్చు బిగించారు...నిజానికి ఆపరేషన్ మహదేవ్ రెండు రోజులుగా కొనసాగుతోంది. దట్టమైన దాచిగాం అడవుల లోతట్టు ప్రాంతం నుంచి అందని అనుమానాస్పద సిగ్నల్స్, కమ్యూనికేషన్‌తో బలగాలు అప్రమత్తమ య్యాయి. వాటి ఆధారంగానే అనుమానితుల జాడను కనిపెట్టగలిగాయి. ఆ వెంటనే సైనిక బృందాలు, ప్రత్యేక బలగాలు (ఎలైట్ ఫోర్సెస్) రంగంలోకి దిగి రెండు రోజులుగా పరిసరాలను జల్లెడ పడుతూ వచ్చాయి. ఆ క్రమంలో ఒక చెట్టు కింద తాత్కాలిక గుడారంలో విశ్రమిస్తున్న ముగ్గురు ఉగ్రవాదులను యాదృచ్చికంగా గుర్తించాయి. దాడిని ఏ మాత్రమూ ఊహించని ముష్కరులు టెంట్లో తీరిగ్గా కునుకు తీస్తూ కనిపించారు. సైనికులు వెంటనే తూటాల వర్షం కురిపించి వారిని హత మార్చారు. ఆపరేషన్‌ను పర్యవేక్షించిన అత్యున్నత స్థాయి అధికారి ఒకరు ఈ మేరకు ధ్రువీకరించారు.రూపం మార్చుకున్న మూసాఎట్టి పరిస్థితుల్లోనూ భద్రతా దళాలకు చిక్కొద్దనే ఉద్దేశంతో మూసా తన రూపాన్ని వీలైనంతగా మార్చుకున్నట్టు నిఘా వర్గాలు తెలిపాయి. ఆ క్రమంలో అతడు భారీగా బరువు కోల్పోయాడన్నారు. పహల్గాం దాడిలో పాల్గొంది ఈ ఉగ్రవాదులే.. మూసా(కుడివైపు చివర)అలాగే.. ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు సైన్యం ప్రకటించింది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ను తెలియజేస్తామని ఎక్స్ ద్వారా తెలియజేసింది. నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో ములనార్, హర్వాన్ ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. మరిన్ని బలగాలు ఆ ప్రాంతానికి చేరుకుంటున్నట్లు సమాచారం. OP MAHADEVContact established in General Area Lidwas. Operation in progress.#Kashmir@adgpi@NorthernComd_IA pic.twitter.com/xSjEegVxra— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) July 28, 2025 -
పహల్గాంకు ఉగ్రవాదులు ఎలా వచ్చారు?.. బోర్డర్లో భద్రత లేదా?
ఢిల్లీ: పార్లమెంట్లో ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు రంగం సిద్ధమైంది. కాసేపట్లో లోక్‌సభలో ఆపరేషన్ సిందూర్‌పై చర్చ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌పై మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం చేసిన వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు. ఆయన వ్యాఖ్యలపై పాకిస్తాన్‌కు కాంగ్రెస్ క్లీన్ చిట్ ఇచ్చిందని బీజేపీ ఆరోపించింది.అయితే, కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడిలో స్వదేశీ ఉగ్రవాదులే పాల్గొని ఉండవచ్చు. ఈ దాడికి పాల్పడిన హంతకులు పాకిస్తాన్ నుంచి వచ్చారని నిరూపించే ఆధారాలు ఎక్కడ. అవి కేంద్రం, ఇంటెలిజెన్స్ వద్ద ఉన్నాయా?. ఉగ్రవాదుల్ని గుర్తించారా? వారు ఎక్కడ నుంచి వచ్చారు? నా ఉద్దేశ్యం ప్రకారం వారు స్వదేశీ ఉగ్రవాదులు కావచ్చు. వారు పాకిస్తాన్ నుంచి వచ్చారని మీరు ఎందుకు అనుకుంటున్నారు? దానికి ఆధారాలు లేదు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఎన్ఐఏ విచారణను ప్రభుత్వం వెల్లడించడానికి ఇష్టపడటం లేదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు.ఇదే సమయంలో ఆపరేషన్ సిందూర్‌లో ప్రభుత్వం నష్టాలను దాచిపెట్టిందని చిదంబరం ఆరోపించారు. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్ ఎన్ని నష్టాలను చవిచూసినా, దానిని స్పష్టంగా చెప్పందని, యుద్ధంలో నష్టాలు అనివార్యమైనవని, ప్రభుత్వం నష్టాలను అంగీకరించాలని ఆయన చెప్పుకొచ్చారు. దీంతో, వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.P. Chidambaram, former UPA-era Home Minister and the original proponent of the infamous “Saffron Terror” theory, covers himself with glory yet again:“Have they (NIA) identified the terrorists or where they came from? For all we know, they could be homegrown terrorists. Why do… pic.twitter.com/c32I1KzqOg— Amit Malviya (@amitmalviya) July 27, 2025చిదంబరం వ్యాఖ్యలకు తాజాగా బీజేపీ నేత అమిత్ మాలవీయా ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. యూపీఏ హయాంలో హోంమంత్రిగా పనిచేసిన చిదంబరం అపఖ్యాతి పాలైన ‘కాషాయ ఉగ్రవాదం’ సిద్ధాంతానికి మూల ప్రతిపాదకుడు. మరోసారి తనను తాను కీర్తించుకున్నారు. ఇప్పుడు పాకిస్తాన్‌కి క్లీన్ చిట్ ఇవ్వడానికి కాంగ్రెస్ తొందరపడుతోంది. కాంగ్రెస్ నాయకులకు భారతదేశ ప్రతిపక్షం కన్నా ఇస్లామాబాద్ రక్షణ కోసం ఎందుకు మాట్లాడుతున్నారు? అని ప్రశ్నించారు. బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా మాట్లాడుతూ.. పార్లమెంట్లో చర్చకు ముందే కాంగ్రెస్ పాకిస్తాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చిందని ఘాటు విమర్శలు చేశారు.ఈ నేపథ్యంలో బీజేపీ నేతల వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఇమ్రాన్ మసూద్ స్పందిస్తూ.. చిదంబరం వ్యాఖ్యలు సరైనవే. పహల్గాం దాడి ఘటనలో స్వదేశీ ఉగ్రవాదులే పాల్గొన్నారు. సరే.. బీజేపీ నేతలు చెబుతున్నట్టు పాకిస్తాన్ ఉగ్రవాదులే ఈ దాడి చేస్తే.. మన సరిహద్దు ప్రాంతం భద్రత ప్రశ్నార్థకంగా ఉందా?. సరిహద్దులు భద్రంగా లేవా?. నిజంగా వారు సరిహద్దులు దాటి వస్తే.. సెక్యూరిటీ ఏం చేస్తోంది?. వారు ఎక్కడి నుంచి వచ్చారు.. ఎలా వెళ్లిపోయారు?. ఈ విషయం తెలుసుకునే హక్కు మాతో పాటు.. దేశ ప్రజలకు కూడా ఉంది అని అన్నారు. -
పహల్గాం దాడి, సిందూర్‌పై నేడు పార్లమెంటులో చర్చ
న్యూఢిల్లీ: వారం రోజులపాటు అంతరాయాల మధ్య నడిచిన పార్లమెంటు వర్షకాల సమావేశాల్లో నేటి నుంచి ఉత్కంఠభరితమైన చర్చ జరగనుంది. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్‌పై తలపడేందుకు ఉభయ సభల్లోని అధికార, ప్రతిపక్ష కూటములు సిద్ధమయ్యాయి. జాతీయ భద్రత, విదేశాంగ విధానం వంటి కీలక అంశాలు కావడంతో మాట్లాడేందుకు ఇరు పక్షాల అగ్ర నేతలు సిద్ధమవుతున్నారు. అధికార పక్షం నుంచి హోంమంత్రి అమిత్ షా, రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి తమ వైఖరిని స్పష్టం చేయనున్నారు. మంత్రులు అనురాగ్ ఠాకూర్, సుధాంషు త్రివేది, నిషికాంత్ దూబేలతోపాటు.. ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రపంచ దేశాలకు తమ వాదనను వినిపించిన ఎన్డీయే సభ్యులు సైతం మాట్లాడతారు. ఇక ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున్ ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ అఖిలేశ్ యాదవ్‌తో పాటు, ఇతర కీలక నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాదనలు వినిపించే అవకాశం ఉంది. భారత్–పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తానే తగ్గించానని, కాల్పుల విరమణకు మధ్యవర్తిత్వం తానే వహించానంటూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పదేపదే వ్యాఖ్యానించారు. దీనిని విదేశాంగశాఖ తోసిపుచ్చినా.. ట్రంప్ అవే వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం వైఖరిని ప్రతిపక్షాలు తప్పుబట్టాయి. ఇక, ప్రధాని మోదీ మౌనం వహించడంపై లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ సైతం విమర్శలు గుప్పించారు. మరోవైపు... కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ మాత్రం ఉగ్రవాద దాడి తర్వాత ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్యను పొగడ్తలతో ముంచెత్తారు. దీంతో పార్టీతో ఆయన సంబంధాలు దెబ్బతిన్నాయి. అయితే విదేశాలకు వెళ్లిన బృందాల్లో ఒక బృందానికి కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు జరిగే చర్చలో ప్రతిపక్షం నుంచి ఆయన మాట్లాడతారా? లేదా? అనే సంశయం నెలకొంది. విప్ జారీ చేసిన కాంగ్రెస్ ఆపరేషన్ సిందూర్‌పై సోమవారం నుంచి పార్లమెంట్లో చర్చ జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ లోక్‌సభ ఎంపీలకు విప్ జారీ చేసింది. వరుసగా మూడు రోజులపాటు తప్పనిసరిగా పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాలని ఆదేశించింది. ఆపరేషన్ సిందూర్‌పై పార్లమెంట్ దిగువ సభలో వాడీవేడిగా చర్చ జరిగే పరిస్థితి కనిపిస్తోంది. ఈ అంశంపై పార్లమెంట్లో కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, ఎస్.జైశంకర్ మాట్లాడుతారని తెలుస్తోంది. ప్రధాని మోదీ సైతం సభలో సమాధానం చెబుతారని సమాచారం. -
అయిననూ అనుమానించాల్సిందే!
పహెల్గామ్లో 26 మంది సాధారణ పౌరుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదుల దాడి వెనుక ఉన్నది ‘ద రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టీఆర్ఎఫ్) అని అమెరికా ప్రకటించింది. టీఆర్ఎఫ్ను విదేశీ ఉగ్రసంస్థగా, గ్లోబల్ టెర్రరిస్ట్‌గా తాము పరిగణిస్తున్నట్టు అమెరికా ప్రకటిస్తూ... అది లష్కరే తోయిబా సోదర సంస్థ అనీ, దాని మరో రూపమే టీఆర్ఎఫ్ అనీ, లష్కరే తోయిబా కనుసన్నల్లో విదేశాలలో పరోక్ష యుద్ధం చేసే సంస్థ అనీ యూఎస్ విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ‘ఈ చర్య... పహెల్గామ్ దాడికి తగిన న్యాయం చెయ్యడంలో అధ్యక్షుడు ట్రంప్ నిబద్ధతను వెల్లడిస్తోంది’ అని ఆ శాఖ వ్యాఖ్యానించడం గమనార్హం.ఇవాళ అమెరికా టీఆర్ఎఫ్ను గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌గా ప్రకటించడం అంటే... ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు భారత్ చేస్తున్న విజ్ఞప్తులకు అంతర్జాతీయ ఆమోదం, సహకారం లభించడానికి మార్గం సుగమం అయ్యిందని అర్థం. మన దేశం ఐక్యరాజ్యసమితి భద్రతాసమితి 1267 తీర్మానాన్ని అనుసరించి టీఆర్ఎఫ్ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా గుర్తించేలా చేయడానికీ, తద్వారా దానిపై ఆంక్షలు అమలు జరిపేలా చూడటానికీ అమెరికా ప్రకటనను ఉపయోగించుకోవచ్చు. దీంతో టీఆర్ఎఫ్ ఆగడాలకు కొంతవరకు అడ్డుకట్టపడే అవకాశం ఉంది. దానికి అందే నిధులు తగ్గిపోతాయి. ఇటీవలి కాలంలో భారత్‌కు లభించిన అతి పెద్ద దౌత్య విజయంగా నిపుణులు ఈ నిషేధాన్ని అభివర్ణిస్తున్నారు.అయితే తమ మనుగడకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఉగ్రవాద సంస్థలు పేర్లు మార్చుకుని తమ కార్యకలాపాలను యథాతథంగా నిర్వహించడం కొత్తకాదు. భావ సారూప్యం కలిగిన వివిధ రకాల వ్యక్తుల సహకారం రహస్యంగా అందుతున్నంత కాలం ఉగ్రసంస్థలను అంతమొందించడం సాధ్యం కాదు. ఈ మధ్యనే రాయచోటిలో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కారణంతో కొందరు వ్యక్తులను ఎన్ఐఏ అధికారులు అరెస్టు చెయ్యడం మనం చూశాం. వాళ్లు దశాబ్దాలుగా అదే ఊర్లో నివసిస్తున్నారు. వ్యాపారాలు చేస్తున్నారు. పైకి మామూలుగానే కనిపిస్తున్నారు. కానీ వాళ్ళ ఇంట్లో సోదాలు నిర్వహించిన పోలీసులు నిర్ఘాంతపోయే రీతిలో అక్కడ పేలుడు పదార్థాలు, తీవ్రవాద సాహిత్యం, తుపాకులు దొరికాయి. ఇటువంటివాళ్లను గుర్తించటం అంత తేలికేమీ కాదు. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా నిషేధం ఉన్నంత మాత్రాన, అమెరికా ఇవాళ కొత్తగా ఆ సంస్థను గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్‌గా ప్రకటించినంతమాత్రాన అలాంటి కార్యకలాపాలు రాత్రికి రాత్రే ఆగిపోతాయి అనుకోవటం ఒట్టి భ్రమ.మరొక గమనార్హమైన సంగతేమిటంటే అమెరికాను నమ్మదగిన దేశంగా భావించలేకపోవడం. ముఖ్యంగా ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటుందో, ఎప్పుడు మాట మారుస్తుందో చెప్పలేం. యూఎస్ ఎయిడ్ (యునైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్) సంస్థ భారతదేశంలో ప్రభుత్వాలను అస్థిరపరచడానికీ, తప్పుడు కథనాలను వ్యాపింపజేసేందుకు మీడియా సంస్థలను ప్రోత్సహించడానికీ నిధులను వెచ్చించిందనే సమాచారం ఉండనే ఉంది. అంతేకాదు, యూఎస్ ఎయిడ్ సంస్థ, నిషిద్ధ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు చెందిన ఆర్థిక విభాగం ఫతా–ఎ–ఇన్సానియత్ (ఎఫ్ఈఐ)కు నిధులు సమకూర్చిందన్న సంగతి కూడా ఆ మధ్య వెలుగు చూసింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో టీచర్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కోసం యూఎస్ ఎయిడ్ సంస్థ 7.5 కోట్ల డాలర్లను ఖర్చుచేస్తోంది. ఈ నిధుల్లో ఎక్కువ భాగం వివిధ మార్గాల్లో లష్కరే తోయిబాకి చేరుతున్నాయనేదీ ఒక విమర్శ. పహెల్గామ్ దాడి తర్వాత అమెరికా స్పందించాల్సినంత తీవ్రంగా స్పందించకపోవడం, ఆ తర్వాత కొన్ని రోజులకే పాక్ అత్యున్నత సైనికాధికారిని అధ్యక్ష భవనానికి విందుకు ఆహ్వానించి పొగడ్తలతో ముంచెత్తడం వంటి పరిణామాలను గమనించినప్పుడు అమెరికాను నమ్మవచ్చా అనే ప్రశ్న తలెత్తక మానదు.– శ్యాంప్రసాద్ రెడ్డి కోర్శిపాటియూట్యూబర్ -
పార్లమెంటు సమావేశాలు తొలిరోజే దుమారం
న్యూఢిల్లీ: ధూర్తదేశం పాక్‌పై భారత్ జరిపిన ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు తొలిరోజే తీవ్రస్థాయి వాదోపవాదాలతో మొదలయ్యాయి. పహల్గాం ఉదంతంలో కేంద్ర నిఘా వర్గాల ఘోర వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ ఆపరేషన్ సిందూర్‌పై వెనువెంటనే చర్చ మొదలెట్టాలన్న విపక్షాల డిమాండ్లు ఓవైపు.. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భం, కేసులను మోస్తున్న రాబర్డ్ వాద్రాపై అధికార పార్టీ ప్రతివిమర్శలతో తొలిరోజు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వేడెక్కాయి. బిహార్‌లో ఓటర్ల జాబితా విస్తృతస్థాయిలో సవరించడం, మణిపూర్‌లో జాతుల మధ్య వైరంపై అధికార, విపక్ష పార్టీల పరస్పర ఆరోపణలతో లోక్‌సభ, రాజ్యసభల్లో వాతావరణం ఓవైపు మరింత ఉద్రిక్తంగా మారినా.. కాలిన కరెన్సీ కట్టల వ్యవహారంలో అపకీర్తిని మూటగట్టుకున్న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన అంశంలో అంతా ఏకతాటి మీదకు రావడం విశేషం. అవినీతిమరకలు అంటుకున్న జడ్జీని న్యాయపీఠం నుంచి పక్కకు తప్పించే క్రతువులో పార్టీలకతీతంగా సభ్యులు ఒకేమాటపై నిలబడ్డ సందర్భానికీ పార్లమెంట్ వేదికైంది. తొలిరోజే నాలుగుసార్లు వాయిదాసోమవారం ఉదయం 11 గంటలకు ఉభయసభలు మొదలయ్యాయి. పహల్గాంలో అత్యంత పాశవికంగా ఉగ్రవాదులు చేసిన దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఇరు సభల్లో సభ్యులు నివాళులర్పించారు. అహ్మదాబాద్‌లో ఎయిర్ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో సజీవదహనమైన ప్రయాణికులకూ ఇరుసభల సభ్యులు నివాళిగా కొద్దిసేపు మౌనం పాటించారు. తర్వాత లోక్‌సభలో ప్రశ్నోత్తరాలను స్పీకర్ బిర్లా మొదలెట్టగానే విపక్ష సభ్యులు వెంటనే వెల్‌లోకి దూసుకొచ్చి ఆందోళనకు దిగారు. ప్రభుత్వ ఘోర నిఘా వైఫల్యం వల్లే పహల్గాం ఉదంతం చోటుచేసుకుందని, ఆపరేషన్ సిందూర్‌పై తక్షణం చర్చ జరపాలని డిమాండ్లుచేశారు. ఈ అంశంలో సభకు వచ్చి ప్రధాని మోదీ వివరణ ఇవ్వాలని సభ్యులు పట్టుబట్టారు. ‘‘ప్రశ్నోత్తరాల గంట ముగిశాకే మీకు మాట్లాడే అవకాశం ఇస్తా. క్వశ్చన్ అవర్ సజావుగా సాగనివ్వండి. మనల్ని ఎన్నుకున్న ప్రజల సమస్యలపై చర్చ జరగనివ్వండి. మీరు నినాదాలు ఇవ్వాలనుకుంటే బయటికెళ్లి ఇచ్చుకోండి’’ అని బిర్లా సూచించినా విపక్ష సభ్యులు వినిపించుకోలేదు. దీంతో సభను 12 గంటల దాకా వాయిదావేశారు. తర్వాత 12 గంటలకు సభ ఆరంభమైనా పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదు. మీరు ఎత్తిచూపిన అంశాలపై సుదీర్ఘ చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అప్పటిదాకా ఓపిక పట్టాలని రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కోరారు. సభావ్యవహారాల సలహా కమిటీ(బీఏసీ) ఎదుట విపక్ష సభ్యులు తమ వాదనల్ని మధ్యాహ్నం 2.30గంటలకు వినిపించవచ్చని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సూచించారు. అయినా విపక్షసభ్యులు వినిపించుకోలేదు. దీంతో అప్పుడు సభాధ్యక్షపీఠంపై కూర్చున్న జగదాంబికా పాల్ సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదావేశారు. తర్వాత సభ మొదలైనా ఎలాంటి మార్పులేదు. అప్పటి స్పీకర్ స్థానంలో కూర్చున్న సంధ్యా రాయ్ సభను మధ్యాహ్నం నాలుగు గంటలకు వాయిదావేశారు. నాలుగు గంటలకు సభ సమావేశమైంది. అప్పుడు కూడా విపక్షసభ్యులు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తమ నిరసనలతో సభను హోరెత్తించారు. ఇక చేసేదిలేక సభాధ్యక్ష స్థానంలో కూర్చున్న దిలీప్ సైకియా లోక్‌సభను మంగళవారానికి వాయిదావేశారు. ఇలా తొలిరోజే లోక్‌సభ నాలుగుసార్లు వాయిదాపడింది. రాజ్యసభ లోనూ ఇదే వాయిదా పర్వం కొనసాగింది. వచ్చే వారం సిందూర్‌పై చర్చపహల్గాంలో ఉగ్రదాది, ఆపరేషన్ సిందూర్, తదనంతర పరిణామాలపై విస్తృతస్థాయి చర్చకు కేంద్రప్రభుత్వం తన సమ్మతి తెలిపింది. వచ్చే వారం ఈ అంశాలపై సమగ్రస్థాయిలో లోక్‌సభలో చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రధాని మోదీ విదేశీ పర్యటనకు వెళ్తున్న కారణంగా ఈవారం ఆయన పార్లమెంట్‌కు రాలేరని, వచ్చే వారం ఆయన సమక్షంలోనే పార్లమెంట్లో చర్చ జరుగుతుందని తెలుస్తోంది. పార్లమెంట్ వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధులు ఈ విషయాలను విపక్ష నేతలకు తెలియజేశారని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు షిప్పింగ్ డాక్యుమెంట్ల సరళీకరణకు బాటలువేసే ‘ది బిల్స్ ఆఫ్ ల్యాడింగ్ బిల్లు– 2025’ కు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది. ఈ బిల్లు మార్చిలోనే లోక్‌సభ ఆమోదం పొందింది. -
చైనా యూటర్న్?.. పాక్‌కు షాక్.. అమెరికాకు మద్దతు?
న్యూఢిల్లీ: ఇంతకాలం పాకిస్తాన్‌కు మద్దతు పలుకుతూ, అమెరికాను వ్యతిరేకిస్తున్నట్లు కనిపించిన చైనా ఇప్పుడు తన పంథాను మార్చుకుంది. భారత్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ప్రతిస్పందనను చూసి, చైనా తన తీరు మార్చుకున్నట్లు కనిపిస్తోంది. తాజాగా పహల్గామ్ ఉగ్రదాడిని ఖండిచిన చైనా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తన కఠిన వైఖరిని పునరుద్ఘాటించింది.చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి లిన్ జియాన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ లష్కరే తోయిబా అనుబంధ సంస్థ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)ను ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించడాన్ని సమర్థించారు. ఉగ్రవాదానికి వ్యతిరేక సహకారాన్ని మరింతగా పెంచుకోవాలని ఆయన ప్రాంతీయ దేశాలకు పిలుపునిచ్చారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడికి టీఆర్ఎఫ్ బాధ్యత వహించింది. ఇది లష్కరే తోయిబాకు ప్రాక్సీ సంస్థ. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏప్రిల్ 25న ఈ దాడిని ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది.జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో 2025, ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడిలో 26 మంది మరణించారు. ఈ దాడికి ప్రతీకారంగా భారత్ మే 7న పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని ‘ఆపరేషన్ సిందూర్’ను ప్రారంభించింది. నాలుగు రోజుల పాటు సరిహద్దుల్లో డ్రోన్,క్షిపణి దాడులు సాగాయి. అనంతరం ఈ సంఘర్షణ ముగింపునకు భారత్- పాకిస్తాన్ ఒక అవగాహనకు వచ్చాయి. -
‘తన బిడ్డకు హాని జరిగితేనే అసీం మునీర్‌కు మా బాధ అర్థమవుతుంది’
సాక్షి,న్యూఢిల్లీ: మేం పడుతున్న బాధ ఎలా ఉంటుందో ఆసిమ్ మునీర్‌కు ఇప్పుడు అర్ధం కాదు. తన బిడ్డలకు ఏదైనా హాని జరిగితే అప్పుడు అర్ధమవుతుంది. ఈ మాటలన్నది మరెవరో కాదు. పహల్గాంలో లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్(The Resistance Front)ఉగ్రవాదులు ప్రదర్శించిన అంతులేని ఉన్మాదంలో కోల్పోయిన తొలి ప్రాణం లెఫ్టినెంట్ వినయ్ నార్వాల్ (26)తండ్రి రాజేష్ఈ ఏడాది ఏప్రిల్ 22న ప్రకృతి అందాలతో అలరారే పచ్చిక బయళ్లపై ముష్కరులు సృష్టించిన నరమేధంలో 26మంది టూరిస్టులు మరణించగా.. వారిలో లెఫ్టినెంట్ వినయ్ నార్వాల్ ఒకరు.ఏప్రిల్ 16న వివాహం చేసుకున్న 26 ఏళ్ల లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్..కేవలం ఆరు రోజుల్లోనే జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఆ దుర్ఘటన జరిగిన సమయంలో ఆయన భార్య హిమాన్షీ నర్వాల్. భర్త పార్థివ దేహం పక్కన కూర్చుని రోదిస్తున్న దశ్యాలు దేశ ప్రజల్ని కంటతడి పెట్టించాయి.ఈ దారుణ ఘటన దేశ ప్రజల్ని తీవ్రంగా కలిచివేసింది.అయితే,పహల్గాంలో మారణ హోమం సృష్టించిన టీఆర్ఎఫ్పై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గాం దాడికి బాధ్యత వహించిన టీఆర్ఎఫ్ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.అమెరికా ప్రకటనపై లెఫ్టినెంట్ నర్వాల్ తండ్రి రాజేష్ నర్వాల్ మీడియాతో మాట్లాడారు.ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయిన తన కుమారుడు వినయ్ నార్వాల్‌ను గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతరమయ్యారు. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కుమారుడు,కుమార్తెకు ఏదైనా హాని జరిగితే.. మేం పడుతున్న బాధ అర్థమవుతుంది.నా కొడుకు మరణంతో కుటుంబం మొత్తం మానసికంగా కృంగిపోయింది. నిద్రలేని రాత్రులు, మానసిక సమస్యలు వెంటాడుతున్నాయి. మానసికంగా అలసిపోయాం. రెండు మూడు గంటలకంటే ఎక్కువ నిద్రపోవడం లేదన్నారు..ఏదో బ్రతుకుతున్నాం అంటే బ్రతుకుతున్నాం’ అంటూ నిట్టూర్చారు. కాగా,పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాక్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది. భారత్ చేపట్టిన ఈ ఆపరేషన్‌లో పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ముజఫ్ఫరాబాద్, కోట్లి,బహావల్పూర్,రావలకోట్,చక్స్వారీ, భింబర్,నీలం వ్యాలీ,జెహ్లం చక్వాలపై దాడులు చేపట్టింది. ఈ దాడులతో పాక్ ఆర్ధికంగా,భారీ సంఖ్యలో ఉగ్రవాదులను కోల్పోయింది. -
పహల్గాం ఉగ్రదాడిపై అగ్రరాజ్యం అమెరికా కీలక ప్రకటన
-
టీఆర్ఎఫ్ ఓ ఉగ్ర సంస్థ
వాషింగ్టన్/న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్ర దాడికి పాల్పడిన లష్కరే తొయిబా జేబు సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ఎఫ్)ను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థగా అమెరికా ప్రకటించింది. టీఆర్ఎఫ్ను విదేశీ, అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అని పేర్కొంది. పహల్గాంలో 26 మందిని విచక్షణారహిత కాల్పులతో బలిగొన్న ఉగ్రవాద దాడికి స్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రకటించారు. ఇది జమ్మూకశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు తర్వాత పుట్టుకొచ్చిన లష్కరే జేబు సంస్థ. కశ్మీర్లో భద్రతా బలగాలపై, పౌరులపై పలు దాడులకు పాల్పడింది. లౌకిక సంస్థ ముసుగులో మతపరమైన దాడులను కొనసాగించింది. కశ్మీర్ లోయలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఈ సంస్థకు పాకిస్తాన్ నుంచి నిధులు, మద్దతు అందుతున్నాయి. పహల్గాం మారణకాండను 2008లో ముంబైలో లష్కరే జరిపిన దాడుల తర్వాత భారత్‌పై జరిగిన అత్యంత ప్రాణాంతక ఉగ్ర దాడిగా అమెరికా అభివర్ణించింది. కశ్మీర్ రెసిస్టెన్స్ అని కూడా పిలిచే టీఆర్ఎఫ్ పహల్గాం ఉగ్ర దాడి తన పనేనని తొలుత ప్రకటించింది. తర్వాత ఈ దాడి కారణంగా భారత్, పాక్ నడుమ ఉద్రిక్తతలు పెచ్చరిల్లడంతో ప్రకటనను వెనక్కు తీసుకుంది. స్వాగతించిన భారత్టీఆర్ఎఫ్ను ఉగ్ర సంస్థగా అమెరికా గుర్తించడాన్ని భారత్ స్వాగతించింది. ఉగ్రవాదంపై పోరులో భారత్, అమెరికా మధ్య సహకారాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. టీఆర్ఎఫ్ కార్యకలాపాలను, దానికి నిధులను అంతర్జాతీయ స్థాయిలో అడ్డుకునేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని వెల్లడించింది. ఉగ్రవాదాన్ని అస్సలు ఉపేక్షించకూడదన్న నినాదానికి భారత్ కట్టుబడి ఉందని, ఉగ్రవాద సంస్థలు, వారి ముసుగు సంస్థలు జవాబుదారీగా ఉండేలా చేయడానికి అంతర్జాతీయ భాగస్వాములతో కలిపి పని చేయడాన్ని కొనసాగిస్తామని తెలిపింది. ‘టీఆర్ఎఫ్ను విదేశీ, అంతర్జాతీయ ఉగ్ర సంస్థగా గుర్తించినందుకు అమెరికా విదేశాంగ శాఖను, మంత్రి రూబియోకు మా అభినందనలు. ఉగ్రవాదంపై పోరులో భారత్–అమెరికా సహకారానికి ఇది తాజా నిదర్శనం’’ అని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. గత ఏప్రిల్ 22న పహల్గాంలో ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడి 26 మంది అమాయక పర్యాటకులను పొట్టన పెట్టుకోవడం తెలిసిందే. దీనికి ప్రతిస్పందనగా మే 7న భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్, పీఓకేల్లోని తొమ్మిది ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసింది. ఇది ఇరు దేశాల నడుమ సాయుధ ఘర్షణకు దారితీయడం, పాక్ విజ్ఞప్తి మేరకు చివరికి కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం తెలిసిందే. -
Pahalgam Attack: పహల్గాం ఉగ్రదాడిలో కీలక పరిణామం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాంలో నరమేధంలోనూ ఉగ్రవాదులు ప్రదర్శించిన అంతులేని ఉన్మాదానికి 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఏడాది ఏప్రిల్ 22 పహల్గాం ఉగ్రదాడిపై దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులో పురోగతి లభించింది. కేంద్రం భద్రతా సంస్థల దర్యాప్తులో లష్కరే తోయిబా అనుబంధ సంస్థ టీఆర్ఎఫ్(The Resistance Front)ఉగ్రవాదులు కెమెరాలు అమర్చిన హెల్మెట్లు ధరించి 26మంది అమాయాకుల ప్రాణాల్ని బలి తీసుకున్నారు. ప్రాణాలు తీసే సమయంలో దాడిని వీడియో రికార్డు చేసుకున్నారు.అనంతరం, హింసాత్మక చర్యపై సంతోషం వ్యక్తం చేస్తూ.. టూరిస్టుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులకు రక్షణగా ఉన్న ముగ్గురు ఉగ్రవాదులు తుపాకుల్ని తెచ్చి వారికి ఇచ్చారు. ఆ తుపాకుల్ని గాల్లోకి ఎక్కుపెట్టి కాల్పులు జరిపి రాక్షసానందం పొందినట్లు ప్రత్యక్ష సాక్షి ఒకరు ఎన్ఐఏకి చెప్పినట్లు తెలుస్తోంది. ప్రకృతి అందాలతో అలరారే పచ్చిక బయళ్లపై ముష్కరులు సృష్టించిన నరమేధంలో మరణించిన 26మంది టూరిస్టులు మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, పంజాబ్, కేరళ, గుజరాత్, కర్ణాటక, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన టూరిస్టులు ఉన్నారు. వీరితో పాటు నేపాల్‌కు చెందిన ఓ పర్యాటకుడు, పహల్గాంకు చెందిన స్థానికుడు ముష్కరుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు.పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల వివరాలు సుశీల్ నాథ్యాల్ – ఇండోర్సయ్యద్ ఆదిల్ హుస్సైన్ షా – హపత్నార్, తహసిల్ పహల్గాంహేమంత్ సుహాస్ జోషి – ముంబైవినయ్ నార్వాల్ – హర్యానాఅతుల్ శ్రీకాంత్ మోని –మహారాష్ట్రనీరజ్ ఉదావాని – ఉత్తరాఖండ్బిటన్ అధికారి – కోల్కతాసుదీప్ నియుపానే – నేపాల్శుభం ద్వివేది – ఉత్తరప్రదేశ్ప్రశాంత్ కుమార్ సత్పతి – ఒడిశామనీష్ రంజన్ – బీహార్ఎన్. రామచంద్ర – కేరళసంజయ్ లక్ష్మణ్ లల్లీ – ముంబైదినేష్ అగర్వాల్ – చండీగఢ్సమీర్ గుహార్ – కోల్కతాదిలీప్ దసాలీ – ముంబైజే. సచంద్ర మోలీ – విశాఖపట్నంమధుసూదన్ సోమిశెట్టి – బెంగళూరుసంతోష్ జాఘ్డా – మహారాష్ట్రమంజు నాథ్ రావు – కర్ణాటకకస్తుబ గంటోవత్య – మహారాష్ట్రభరత్ భూషణ్ – బెంగళూరుసుమిత్ పరమార్ – గుజరాత్యతేష్ పరమార్ – గుజరాత్టగెహాల్యిగ్ – అరుణాచలప్రదేశ్శైలేష్భాయ్ హెచ్. హిమత్‌భాయ్ కళాథియా – గుజరాత్ఆపరేషన్ సిందూర్‌తో చావు దెబ్బ కొట్టిన భారత్పహల్గాం ఉగ్రదాడి ఘటనతో భారత్, పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల వేళ పాక్‌ను భారత్ దెబ్బకొట్టింది. ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యల్లో భాగంగా మే7న (మంగళవారం) అర్ధరాత్రి 1:44 గంటలకు ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్ (Pakistan)లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం (Indian Army) మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. ప్రపంచ దేశాల ముందు పాక్‌ను భారత్‌ను దోషిగా నిలబెట్టింది. -
Pahalgam Probe: పారిపోతూ ఉగ్రవాదులు కాల్పులు
న్యూఢిల్లీ: గత ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడిపై నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్ఐఏ)ముమ్మరంగా దర్యాప్తు చేస్తోంది. ఈ నేపధ్యంలో పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఘటనా స్థలంలో ఒక వ్యక్తిని ఉగ్రవాదులు ‘కల్మా’ పఠించాలని అడిగి, అతను అలా చేయగానే వదిలివేసినట్లు ఎన్ఐఏ విచారణలో తేలింది.దాడి అనంతం ఉగ్రవాదులు పారిపోతూ, గాలిలో కాల్పులు జరిపారని, భాధితులకు ఎవరూకూడా సాయం అందించకుండా ఉండేందుకే ఇలా చేసివుంటారని ఎన్ఐఏ వర్గాలు భావిస్తున్నాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన పర్వైజ్ అహ్మద్, బషీర్ అహ్మద్‌ల విచారణలో.. ఉగ్రవాదులు అక్కడి నుంచి తప్పించుకుంటున్నప్పుడు గాలిలో కాల్పులు జరిపారని వెల్లడయ్యింది.కాల్పులు జరిగిన ప్రదేశం నుండి ఎన్ఐఏ ఖాళీ బుల్లెట్లను స్వాధీనం చేసుకుంది. ఉగ్రవాదులు ఈ ఘటనకు ముందు అక్కడున్నవారి మతాన్ని తెలుసుకునేందుకు కల్మా చదవమన్నారని ప్రాణాలతో బయటపడిన వారు ఎన్ఐఏ అధికారులకు తెలిపారు. ఎన్ఐఏ ఇప్పటివరకూ లభ్యమైన ఆధారాల మేరకు ముగ్గురు ఉగ్రవాదులలో ఒకరిని పాకిస్తాన్‌కు చెందిన హషీమ్ ముసాగా గుర్తించింది. మిగిలిన ఇద్దరినీ గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే వీరు పహల్గామ్ దాడి కోసం భారత్‌లోనికి చొరబడినట్లు అనుమానిస్తున్నారు. -
వారి ఆదేశాలతోనే ఉగ్రదాడి.. ‘పహల్గామ్’పై సంచలన నివేదిక
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి పాకిస్తాన్‌కు చెందిన రాజకీయ నేతలు, సైనిక అధికారుల ఆదేశాల మేరకే జరిగిందని, ఇది పాక్ ఐఎస్ఐ, ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ)చేసిన కుట్ర అని భద్రతా వర్గాలు వెల్లడించాయి. కాగా ఈ ఉగ్రదాడి అనంతరం మే 7న పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై భారత్ ‘ఆపరేషన్ సింధూర్’పేరుతో ప్రతీకార దాడులు చేపట్టింది.పహల్గామ్ దాడికి విదేశీ ఉగ్రవాదులను మాత్రమే మోహరించాలని, పూర్తి గోప్యతను పాటించాలని, కశ్మీరీ ఉగ్రవాదులను తీసుకోవద్దని ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ .. లష్కర్ కమాండర్ సాజిద్ జట్‌కు నిర్దిష్ట ఆదేశాలు ఇచ్చిందని భద్రతా వర్గాలు తెలిపాయి. కొంతకాలంగా జమ్ముకశ్మీర్ ఉంటున్న విదేశీ ఉగ్రవాదుల ప్రమేయంతో ఈ దాడులకు పాల్పడాలని కూడా వారు సూచించారని సమాచారం. స్థానిక ఉగ్రవాదులు ఈ ఘటనలో పాల్గొనలేదని ఒక సీనియర్ అధికారి టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపారు.నిషేధిత లష్కరే తోయిబా సంస్థకు ప్రాక్సీ గ్రూప్ అయిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ఈ పహల్గామ్ దాడికి బాధ్యత వహించింది. దాడి చేసిన ఇద్దరూ పాకిస్తాన్ జాతీయులుగా భద్రతా దళాలు గుర్తించాయి. ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించారనే ఆరోపణలతో ఇద్దరు స్థానికులను అరెస్ట్ చేశారు. మే 7న ‘ఆపరేషన్ సిందూర్’తో భారత్ ఈ ఉగ్ర దాడికి ప్రతిస్పందించింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై బాంబు దాడులు చేసి, వందమంది ఉగ్రవాదులను అంతమొందించింది. -
యుద్ధానికి ఆయన వైఫల్యమే కారణం: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్
న్యూఢిల్లీ: పెహల్గాంలో ఉగ్రదాడి, ఆపై చోటు చేసుకున్న పరిస్థితులకు తాను కారణం కాదని, అది జమ్మూ-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వైఫల్యమేనని ఆ రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసలు పెహల్గామ్ ఉగ్రదాడికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కారణమన్నారు.కాగా, జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సోమవారం ఉదయం గోడ దూకి మహారాజా హరిసింగ్‌కు చెందిన డోగ్రా బలగాలు కాల్చిచంపిన వీరుల స్మారకంగా ఉన్న శ్మశానం గోడ దూకి లోపలికి వెళ్లి అక్కడ అమరవీరుల స్థూపాలకు నివాళులు అర్పించారు,. డోగ్రా బలగాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి 1931, జూలై 13వ తేదీన పలువురు అమరులయ్యారు. ఈ క్రమంలోనే వారికి కశ్మీర్‌లోని శ్మశాన వాటికలో స్మారక చిహ్నాలు ఏర్పాటు చేశారు. దీన్ని ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు. ఆదివారం(జూలై 13) సీఎం అబ్దుల్లాను ఇంటి నుంచి కదలకుండా ఒక బంకర్ ఏర్పాటు చేశారు. అయితే అది సోమవారం తీసేశారు. నేడు(జూలై 14) ఒమర్ అబ్దుల్లా ఒంటరిగా కారులో వెళ్లి ఆ అమరులకు నివాళులు అర్పించే యత్నం చేశారు. అక్కడ అబ్దుల్లాను పోలీసులు అడ్డుకునే యత్నం చేయడంతో గోడ దూకి వెళ్లి నివాళులర్పించి వచ్చారు. దీనిపై అబ్దుల్లా మాట్లాడుతూ.. రాష్ట్రంలో లెఫ్టినెంట్ గవర్నర్ పాలన నడుస్తోందంటూ మండిపడ్డారు. కేంద్ర నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చెప్పినట్లే ఇక్కడ నడుస్తోందన్నారు. అనాలోచిత నిర్ణయాలతో ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్లో పెహల్గాం ఉగ్రదాదాడికి, తర్వాత ఆపరేషన్ సింధూర్ వరకూ భారత్ వెళ్లడానికి ఎల్జీ మనోజ్ సిన్హా వైఫల్యమే కారణమన్నారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదాను తిరిగి పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. -
నీళ్లు నమిలిన క్వాడ్!
అమెరికాలో బుధవారం జరిగిన చతుర్భుజ కూటమి (క్వాడ్) దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం అనుకున్న విధంగానే కశ్మీర్‌లోని పెహల్గామ్లో మొన్న ఏప్రిల్ 22న ఉగ్రవాదులు దాడిచేసి 26 మందిని పొట్టన బెట్టుకున్న ఉదంతాన్ని తీవ్రంగా ఖండించింది. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనటంలో సహకరించుకోవటానికి సిద్ధంగా ఉన్నామని ఉమ్మడి ప్రకటన తెలియజేసింది. ‘ఇందుకు కారకులైనవారినీ, దాడిలో పాల్గొన్నవారినీ, వారికి ఆర్థికంగా సహకరించినవారినీ ఎలాంటి జాప్యం లేకుండా శిక్షించటానికి ఐక్యరాజ్యసమితి దేశాలన్నీ తోడ్పడాల’ని సూచించింది. క్వాడ్ వంటి కూటములు ఏర్పడటం వెనకుండే ధ్యేయం సంక్షోభ సమయాల్లో సమష్టిగా అడుగు మందుకేయటం కోసమే. కానీ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తున్నా ఆ దేశాన్ని వేలెత్తి చూపటానికీ, అటువంటి కార్యకలాపాలు మానుకోవాలని హెచ్చరించటానికీ కూటమిలోని మిగతా మూడు దేశాలూ సిద్ధంగా లేవంటే క్వాడ్ ఆవిర్భావానికి గల ప్రాతిపదికే ప్రశ్నార్థకంగా మిగిలినట్టు లెక్క. పెహల్గామ్ ఘటన అనంతరం మన దేశం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడిచేసింది. దానికి ప్రతిగా పాకిస్తాన్ సైన్యం మనపై క్షిపణులతో, డ్రోన్లతో దాడికి దిగాక మన దళాలు వాటిని తిప్పికొట్టడంతోపాటు అక్కడి వైమానిక స్థావరాలను ధ్వంసం చేశాయి. ఇరు దేశాల మధ్యా ఇది పూర్తి స్థాయి యుద్ధంగా పరిణమించే సూచనలు కనబడ్డాయి. కారణాలేమైతేనేం...నాలుగు రోజుల అనంతరం కాల్పుల విరమణకు ఇరు దేశాలూ అంగీకరించాయి. ప్రపంచ దేశాలన్నీ ఈ పరిణామాలను ఎంతో ఆందోళనతో గమనించాయి. కానీ ఉమ్మడి ప్రకటన పాక్ పేరెత్తి ఖండించకుండా మర్యాదపూర్వకంగా, లౌక్యంగా మాట్లాడితే ఒరిగేదేమిటి? క్వాడ్ ఈనాటిది కాదు. పద్దెనిమిదేళ్ల క్రితం జపాన్ ద్వారా మన దేశాన్ని ఒప్పించి ఈ కూటమి ఏర్పాటుకు నాంది పలికింది అమెరికాయే. 2007లో కూటమి ఏర్పాటుపై చర్చించటానికి నాలుగు దేశాలూ సమావేశమైనప్పుడే చైనా ఉరిమింది. తనకు వ్యతిరేకంగానే ఈ కూటమి ఏర్పడుతున్నదంటూ నిష్టూరానికి పోయింది. ఏడాది గడవకముందే జపాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పడి కూటమి నుంచి తప్పుకొంటున్నట్టు ప్రకటించింది. 2008లో ప్రభుత్వం మారి ఆస్ట్రేలియా సైతం నిష్క్రమిస్తున్నట్టు తెలియజేసింది. ఇలాంటి పరిస్థితుల్లో 2017లో తిరిగి క్వాడ్‌కు జీవం పోసింది అప్పటి ట్రంప్ ప్రభుత్వమే. అప్పటికల్లా దక్షిణ చైనా, తూర్పు చైనా సముద్ర జలాల్లో చైనా కార్యకలాపాలు పెరిగాయి. ‘అన్నీ నేనే... అంతా నాదే’ అంటూ పగడాల దిబ్బలు, ఇసుక మేటలు చైనా తన ఖాతాలో వేసుకుంది. అంతటితో ఊరుకోక స్ప్రాట్లీ దీవుల చుట్టూ ఏడు కృత్రిమ దీవుల నిర్మాణం ప్రారంభించింది. ఇది జపాన్‌తో పాటు ఆస్ట్రేలియానూ... ఆ రెండు దేశాలకూ అన్ని విధాలా అండగా ఉంటున్న అమెరికానూ చికాకు పెట్టిన పర్యవసానంగానే క్వాడ్ మళ్లీ పురుడు పోసుకుంది. సారాంశంలో ఇది అమెరికా, చైనాల మధ్య జరిగే ఆధిపత్య పోరులో భాగంగా వచ్చింది. అందులో మనల్ని భాగస్వాముల్ని చేసి తన వివాదాన్ని మనకు కూడా అంటించిన అమెరికా మనకు సమస్య వచ్చినప్పుడు మాత్రం మనవైపుండదని పెహల్గామ్ రుజువు చేసింది. మరి ఇలాంటి కూటములు పెట్టి ప్రయోజనమేమిటి? విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి కన్వల్ సిబల్ అన్నట్టు పాకిస్తాన్‌తో మిగిలిన మూడు సభ్య దేశాలకూ, ముఖ్యంగా అమెరికాకూ స్నేహ సంబంధాలుండటం వల్ల ఉమ్మడి ప్రకటనలో నేరుగా దాన్ని ప్రస్తావించటానికి మొహమాటపడి ఉండొచ్చు. మరి అదే పరిస్థితి మనకు ఉండదా? మనకూ, పాకిస్తాన్‌కూ వున్న వైషమ్యాలపై క్వాడ్ పెట్టేనాటికే మిగిలిన మూడు దేశాలకూ అవగాహన ఉండాలి. మరి ఎందుకు కలుపుకొన్నట్టు? ఇలాంటి పరిస్థితి తలెత్తగలదని ఆనాడు తెలియదా?భూగోళంలో ఏమూల ఉగ్రవాదం ఉన్నా దాన్ని నిర్మూలించేదాకా వదలబోమని, దానిపట్ల దయాదాక్షిణ్యాలుండబోవని 2001లో తాను చేసిన శపథం అమెరికాకు గుర్తుందా? క్వాడ్ కూటమి సమావేశానికి ముందు మన విదేశాంగ మంత్రి జైశంకర్ మూడు దేశాల విదేశాంగ మంత్రులతో విడివిడిగా భేటీ అయ్యారు. పెహల్గామ్, తదనంతర పరిణామాలపై వారితో చర్చించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ తీరును వివరించారు. బహుశా దాని పర్యవసానంగా కనీసం పెహల్‌గామ్‌ను ప్రకటనలో ప్రస్తావించి చర్య తీసుకోవాలన్న డిమాండైనా చేశారు. లేకుంటే దానికి కూడా దిక్కు లేకపోయేదేమో! పాకిస్తాన్ ఎన్ని తప్పుడు పనులకు పాల్పడుతున్నా అమెరికాకు ఆ దేశమంటే మోజు. ‘రెండు దేశాలనూ బెదిరించి యుద్ధం ఆపాన’ని గొప్పలు పోయిన ట్రంప్, ఆ తర్వాత వారం గడవకుండా ఆ దేశ ఆర్మీ చీఫ్‌తో భేటీ అయి పొగడ్తలతో ముంచెత్తారు. చైనాతో మనకు సరిహద్దు వివాదాలున్న సంగతి నిజమే. ఆ విషయంలో మన దేశం రాజీ పడకుండా చర్చలు సాగిస్తోంది. దురాక్రమణకు ప్రయత్నించినప్పుడల్లా ఎదుర్కొంటున్నది. క్వాడ్ ఉనికిలోకి రాకముందునుంచీ అది కొనసాగుతోంది. పరస్పరం సహకరించుకోవటానికీ, ఎదగటానికీ కూటములు అవసరం. అధునాతన సాంకేతికతల్లో తోడ్పడే అత్యంత కీలకమైన ఖనిజాల, ఇతర వనరుల సరఫరాపై చైనా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఎవరిపైనా ఆధారపడకుండా ఎదిగేందుకు, సరఫరాలకు అంతరాయం ఏర్పడకుండా చూసేందుకూ సమష్టిగా కృషి చేయాలని క్వాడ్ తీర్మానించటం హర్షించదగ్గదే. ఈ ఏడాది చివరిలో క్వాడ్ దేశాధినేతల శిఖరాగ్ర సదస్సు మన దేశంలో జరుగుతున్న నేపథ్యంలో కూటమి భాగస్వాముల్లో మరింత సదవగాహన, సమన్వయం అవసరమని... కీలక సమయాల్లో నిర్మొహమాటంగా ఉండటం ముఖ్యమని తెలుసుకుంటే మంచిది. -
‘పహల్గామ్’ ముష్కరులపై తక్షణ చర్యలకు ‘క్వాడ్’ డిమాండ్
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని ఆలోచింపజేసింది. ఉగ్రవాదంపై వ్యతిరేక పోరాటాన్ని మరింత వేగవంతం చేయాల్సిన అవసరాన్ని గుర్తు సింది. తాజాగా అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియాల భాగస్వామ్య కూటమి క్వాడ్(క్యూయూఏడీ)పహల్గామ్ ఉగ్రదాడిపై ఒక ప్రకటన చేసింది. పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్నవారిని, వారికి సహకరించినవారిని తక్షణం న్యాయస్థానం ముందు నిలబెట్టాలని కోరింది. BREAKING: QUAD condemns Pahalgam terror attack; says,'perpetrators, organizers, and financiers of this reprehensible act to be brought to justice without any delay' pic.twitter.com/zCA06YkMqZ— Sidhant Sibal (@sidhant) July 2, 20252025, ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మృతిచెందారు. ఐక్యరాజ్యసమితి సభ్య దేశాలన్నీ ఈ చర్యను ఖండించాయి. ‘క్వాడ్’ సరిహద్దు ఉగ్రవాదంతో సహా అన్ని రకాల ఉగ్రవాద చర్యలను, హింసాత్మక తీవ్రవాద చర్యలను ఖండిస్తుందని, ఉగ్రవాదంపై పోరాటానికి నిబద్ధతను పునరుద్ఘాటిస్తుందని ఆ ప్రకటనలో పేర్కొంది. పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి బాధితుల కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేస్తున్నామని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నామని ‘క్వాడ్’ ఆ ఉమ్మడి ప్రకటనలో పేర్కొంది. పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్నవారి విషయంలో ఎటువంటి జాప్యం లేకుండా వారిని న్యాయస్థానం ముందు నిలబెట్టాలని ‘క్వాడ్’ నేతలు కోరారు.ఇది కూడా చదవండి: ‘అందుకు ఇజ్రాయెల్ ఓకే’: గాజాలో కాల్పుల విరమణపై ట్రంప్ -
ప్రతిపక్షాన్ని చులకన చేస్తే ప్రజలు సహించరు
రాయిచూర్: ప్రతిపక్ష పార్టీలను అల్పంగా భావిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ వైఖరిని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తప్పుబట్టారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం ఏర్పాటైన అఖిలపక్ష భేటీకి రెండు సందర్భాల్లోనూ ప్రధాని మోదీ రాకపోవడం ప్రతిపక్షాలంటే ఆయనకున్న గౌరవం ఏపాటిదో తెలుస్తోందని వ్యాఖ్యానించారు. అఖిలపక్ష భేటీకి దేశవ్యాప్తంగా ఉన్న నాయకులంతా రాగా, ప్రధాని మోదీ ఎందుకు హాజరుకాలేదని ప్రశ్నించారు. బదులుగా బిహార్‌లో ఎన్నికల ప్రచార ర్యాలీకి వెళ్లారని ఎత్తి చూపారు. ఇలాంటి వైఖరిని ప్రజలు హర్షించరని, ముఖ్యంగా దేశ యువత సహించబోదని ఆయన హెచ్చరించారు. దేశం ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కర్ణాటకలోని రాయిచూర్‌లో సోమవారం జరిగిన బహిరంగం సభలో ఖర్గే ప్రసంగించారు. ‘కశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు పొట్టన బెట్టుకున్నారు. ప్రతీకారంగా మన సైన్యం పాక్ భూభాగంపై దాడి జరిపి ఉగ్రవాదులను ఏరిపారేసింది. యావత్తూ దేశం, సైనిక బలగాలు ఏకమై దేశానికి రక్షణగా నిలవగా, కొందరు వ్యక్తులు మాత్రం ఇదంతా తమ ఘనతేనని చెప్పుకుంటున్నారు’అని ఖర్గే పేర్కొన్నారు. ఆ వ్యక్తులు ఆర్మీలో కెపె్టన్, కల్నల్, లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేసిన వారైతే దేశం కోసం పోరాడినందుకు గాను మనం ప్రశంసించి ఉండేవారం. కానీ, అలాంటిదేమీ లేకుండానే గొప్పలు పోతున్నారు’అని మోదీ సర్కారుపై పరోక్షంగా విమర్శలు కురిపించారు. మళ్లీ ట్రంపే అమెరికా అధ్యక్షుడిగా రావాలంటూ అమెరికాలో నినదించిన ప్రధాని మోదీ..మన వస్తు వులపై భారీగా ట్యాక్సులు విధించినా ఒక్క మాటకూడా మాట్లాడలేదని ఆరోపించారు. -
రెండేళ్లుగా ‘పహల్గామ్’ ముష్కరులు యాక్టివ్?
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడిపై దర్యాప్తు సంస్థలు తమ విచారణను కొనసాగిస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఈ ముష్కరులకు సంబంధించిన పలు విషయాలు వెలుగు చూస్తున్నాయి. జమ్మూ ప్రాంతంలో రెండేళ్లుగా యాక్టివ్‌గా ఉన్న ఈ ముష్కరులు.. భారత భద్రతా దళాలపై జరిగిన మూడు ప్రధాన దాడులలో పాల్గొన్నారనే అనుమానాలున్నాయి. పహల్గామ్ దాడి వెనుక ఉన్న ఉగ్రవాదుల జాడను భద్రతా సంస్థలు సేకరించాయి. ఈ ఉగ్రవాదులు పూంచ్‌లోని డెహ్రా కి గలి (డీకేజీ) ద్వారా భారత్‌లోనికి చొరబడి 2022 చివర లేదా 2023 ప్రారంభం నుండి జమ్ముకశ్మీర్ అంతటా తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడయ్యింది. జమ్ము ప్రాంతంలో ఒక సంవత్సరానికి పైగా చురుకుగా ఉన్న ఈ బృందం 2024 ద్వితీయార్థంలో భారత భద్రతా దళాలపై దాడులకు తెగబడిందని తెలుస్తోంది.ఈ ముష్కరుల బృందం తొలిసారిగా 2023 డిసెంబర్ 21న పూంచ్‌లోని సురాన్‌కోట్‌లోని బుఫ్లియాజ్ ప్రాంతంలో జరిగిన దాడిలో పాల్గొంది. నాటి దాడిలో నలుగురు భారత ఆర్మీ సైనికులు మరణించారు. 2024 మేలో బక్రాబల్ మొహల్లా వద్ద భారత వైమానిక దళ కాన్వాయ్‌పై జరిగిన మెరుపుదాడిలోనూ వీరి ప్రమేయం ఉందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది. పూంచ్‌లోని దట్టమైన అడవులు, పర్వత ప్రాంతాలలో నెలల తరబడి కార్యకలాపాలు సాగించిన ఈ బృందం 2024లో కశ్మీర్‌కు తన స్థావరాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. పహల్గామ్ దాడికి ముందు వీరు సమావేశమయ్యారని దర్యాప్తులో వెల్లడయ్యింది. ఇది కూడా చదవండి: ఇరాన్‌కు రష్యా సహకారం?.. విమర్శలపై పుతిన్ ఆగ్రహం -
విజయ్ దేవరకొండపై అట్రాసిటీ కేసు
గచ్చిబౌలి: టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండపై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో అట్రాసిటీ కేసు నమోదైంది. ఏప్రిల్ 26న జరిగిన తమిళ హీరో సూర్య చిత్రం రెట్రో ప్రీ రిలీజ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న విజయ్ దేవరకొండ పహల్గామ్ ఉగ్ర దాడి అంశాన్ని ప్రస్తావించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ‘కశ్మీర్ మనదే.. కశ్మీర్ ప్రజలు మనవాళ్లే.. 500 ఏళ్ల క్రితం ట్రైబల్ యుద్ధం చేసిన రీతిలో పాకిస్తాన్ భారత్‌పై యుద్ధం చేస్తోంది.కానీ పాకిస్తాన్‌పై భారత్ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. తిండి, నీళ్లు లేక వాళ్ల ప్రజలే పాకిస్తాన్‌పై యుద్ధం చేస్తారు’అని విజయ్ దేవరకొండ వ్యాఖ్యానించారు. అయితే ‘500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ చేసినట్లుగా’అనే వ్యాఖ్యలు తమ మనోభావాలు గాయపరిచాయంటూ ట్రైబల్ కమ్యూనిటీస్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్‌కుమార్ నాయక్ అలియాస్ అశోక్ రాథోడ్ ఈ నెల 17న రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేయగా, న్యాయ సలహా తీసుకున్న పోలీసులు.. విజయ్ దేవరకొండపై శనివారం అట్రాసిటీ కింద కేసు నమోదు చేశారు. -
పెహల్గామ్ ఉగ్రదాడి కేసులో కీలక పురోగతి
-
‘పహల్గామ్’ ఉగ్రవాదులకు ఆశ్రయం.. ఇద్దరు అరెస్ట్
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడిలో భాగస్వామ్యం కలిగిన ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరిని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)ఆదివారం అరెస్టు చేసింది. వీరిని పహల్గామ్కు చెందిన పర్వైజ్ అహ్మద్ జోథర్, బషీర్ అహ్మద్ జోథర్‌లుగా గుర్తించింది. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబా (ఎల్ఈటీ)తో సంబంధం కలిగిన ముగ్గురు సాయుధ ఉగ్రవాదులకు వీరు ఆశ్రయం కల్పించడంలో పాటు వారికి ఆహారం, ఇతర సదుపాయాలు కల్పించారని ఎన్ఐఏ ఒక ప్రకటనలో తెలిపింది.దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఉగ్రదాడి కేసుపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ దాడికి ముందు హిల్ పార్క్ ప్రాంతంలోని ఈ ఉగ్రవాదులను నిందితులు దాచి ఉంచారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. విచారణ సమయంలో పర్వైజ్, బషీర్ ఈ ఉగ్రదాడిలో పాల్గొన్నవారి గుర్తింపులను వెల్లడించారని, వారు పాకిస్తానీ జాతీయులని నిర్ధారించారని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. పర్యాటకులను వారి మతపరమైన గుర్తింపు ఆధారంగా ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఇది ఇటీవలి కాలంలో ఈ ప్రాంతంలో జరిగిన భారీ ఉగ్రదాడులలో ఒకటిగా నిలిచింది. చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం, 1967లోని సెక్షన్ 19 కింద వీరిద్దరినీ అరెస్టు చేశారు. ఏప్రిల్ 22న పహల్గామ్లోని బైసరన్ లోయలో పాకిస్తాన్ ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపి, 26 మందిని పొట్టనపెట్టుకున్నారు. ఈ దాడుల్లో16 మంది గాయపడ్డారు.ఇది కూడా చదవండి: అమెరికా అంతటా హై అలర్ట్.. ఇరాన్‌పై దాడుల ఫలితం -
Ladakh ఆనందాల పర్యటనపై అనుమానాల ముసురు
నగరంలో చాలా మందికి వేసవి సీజన్ పూర్తవ్వగానే టూర్స్ గురించిన టాపిక్స్‌పై చర్చలు పూర్తవుతాయి. కొంతమందికి మాత్రం అప్పుడే మొదలవుతాయి. అలాంటి వారిలో లద్దాఖ్ ప్రియులు ముందుంటారు. అయితే పహల్గామ్ దాడి తదనంతర పరిణామాల వల్ల పర్యాటకుల సంఖ్యలో కొంత మార్పు కనిపిస్తోంది. బైకర్స్, కార్లలో టూర్ వెళ్లే వారు ఇప్పటికే తమ తమ ప్లాన్స్ పూర్తిచేసుకునే దిశగా కదులుతున్నారు. అయితే వివిధ రకాల మార్గాల ద్వారా వెళ్లే పర్యాటకుల తాకిడి మాత్రం బాగా తగ్గిందని సమాచారం. -సాక్షి, సిటీబ్యూరో సోషల్ మీడియా కేంద్రంగా.. లద్దాఖ్‌ను తరచూ సందర్శించే ఉత్తరాది వాసి రట్టన్ ధిల్లాన్, లద్దాఖ్ లోని ముఖ్యపట్టణమైన లేహ్ ఖాళీగా ఉన్నట్లు చూపించే వీడియోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ‘గత 10 సంవత్సరాలుగా లేహ్‌ను సందర్శిస్తున్నా.. ఇంత తక్కువ మంది పర్యాటకులు ఉన్న లెహ్ పట్టణాన్ని ఎప్పుడూ చూడలేదు. ఇది లద్దాఖ్ అంటే నమ్మడం కష్టం’ అంటూ ఆయన తన అనుభవాన్ని వెల్లడించారు. ఇది చూసిన పలువురు నెటిజన్లు లద్దాఖ్ ప్రస్తుత పరిస్థితికి తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తూ.. ది తాత్కాలికమేనని తిరిగి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. జూన్ నెలలోనే ఎందుకు?పహల్గామ్ ఉగ్రవాద దాడి తరువాత, జమ్మూ కశ్మీర్‌లోని పర్యాటక రంగం దెబ్బతింది. హోటళ్ళు, రిసార్టులు హౌస్బోట్లు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ పరిణామాలతో ఈ ప్రాంతంలోని పొరుగు ప్రాంతాల్లో, ముఖ్యంగా దాని ప్రక్కనే ఉన్న కేంద్రపాలిత ప్రాంతమైన లద్దాఖ్‌లో కూడా కనిపిస్తోంది. అయితే మరోవైపు యువత మాత్రం తగ్గేదే లేదంటూ రైడర్స్ గ్రూపుల ద్వారా టూర్‌కు ప్లాన్ చేస్తున్నారు.సాధారణంగా లద్దాఖ్ ప్రాంతం చలికాలంలో మంచు తీవ్రంగా ఉంటుంది. మంచుతో కప్పబడిపోయే రహదారుల వల్ల ప్రయాణం కష్టతరమవడం, మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రత వల్ల శారీరక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ సమయాన్ని ఎవరూ ఎంచుకోరు.. అదే మే నెల నుంచి అక్టోబరు వరకూ ఈ ప్రాంతంలో వాతావరణం పూర్తి పొడిగా ఆహ్లాదకరంగా ఉంటుంది. దీంతో అద్భుతమైన వైవిధ్యభరితమైన లద్దాఖ్ అందాలను సందర్శించడానికి ఉవ్విళ్లూరుతుంటారు. మరోవైపు ఈ సీజన్లో దేశంలోని మిగిలిన ప్రాంతాలు వర్షాలతో పర్యటనలకు అంత అనుకూలంగా ఉండకపోవడం కూడా లద్దాఖ్‌ను ఈ సీజన్లో అత్యంత అనువైన ఎంపికగా మార్చింది అనొచ్చు.అయితే నగరంనుంచి ఏటా ఈ సమయానికి లద్దాఖ్ ప్రయాణానికి హుషారుగా సిద్ధమయ్యే బైకర్లు ప్రస్తుతం కొంత తటపటాయిస్తున్నారని నగరానికి చెందిన బైకర్ సదాశివరెడ్డి అన్నారు. తీవ్రవాద దాడి అనంతరం సెక్యూరిటీ పటిష్టం కావడంతో పాటు ఇతరత్రా ఇబ్బందులపై బైకర్స్ సందేహంతో ఉన్నారని, అయితే ఇప్పటికే కొందరు బయలుదేరారు కాబట్టి.. వారిని చూసి మరికొందరు కూడా అదే బాట పట్టవచ్చని చెప్పారాయన. లద్దాఖ్ అనేది బైకర్స్‌కి స్వర్గధామం లాంటిది అంటున్న ఆయన.. ఏటా కేవలం 3, 4 నెలల పాటు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశాన్ని వదులుకోరని అంటున్నారు. బైకర్లలో సందిగ్ధం..అయినా తగ్గేదేలే..: అయితే నగరం నుంచి ఏటా ఈ సమయానికి లద్దాఖ్ ప్రయాణానికి హుషారుగా సిద్ధమయ్యే బైకర్లు ప్రస్తుతం కొంత తటపటాయిస్తున్నారని నగరానికి చెందిన బైకర్ సదాశివరెడ్డి అన్నారు. తీవ్రవాద దాడి అనంతరం సెక్యూరిటీ పటిష్టం కావడంతో పాటు ఇతరత్రా ఇబ్బందులపై బైకర్స్ సందేహంతో ఉన్నారని, అయితే ఇప్పటికే కొందరు బయలుదేరారు కాబట్టి.. వారిని చూసి మరికొందరు కూడా అదే బాట పట్టవచ్చని చెప్పారాయన. లద్దాఖ్ అనేది బైకర్స్‌కి స్వర్గధామం లాంటిది అంటున్న ఆయన.. ఏటా కేవలం 3, 4 నెలల పాటు మాత్రమే అందుబాటులో ఉండే అవకాశాన్ని వదులుకోరని అంటున్నారు. ప్రభావం ఉన్నా.. పుంజుకుంటోంది.. దేశంలో మరే ప్రాంతంలో చూడలేని అనేక అద్భుతమైన ప్రకృతి విశేషాలు ఇక్కడ చూడొచ్చు. ఈ ప్రాంతం అక్కడి ప్రకృతి సౌందర్యం అలవాటైతే మళ్లీ మళ్లీ వెళ్లకుండా ఉండడం కష్టం. అందుకే దేశవ్యాప్తంగా లద్దాఖ్ చాలా కాలం నుంచి అనేక మందికి అభిమాన టూరిస్ట్ ప్లేస్‌గా మారింది. బైక్ రైడర్లకైతే మరింత ఇష్టం ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు కార్లు, ఇతర వాహనాల ద్వారా వెళ్లేవారు పెరిగారు. Hard to believe this is Ladakh in June right in the middle of peak season. I’ve been visiting Leh for the past 10 years and have never seen the town this quiet and deserted, with so few tourists around. Looks like Pahalgam incident has had a huge impact! Hoping things… pic.twitter.com/0uc3sPIS3q— Rattan Dhillon (@ShivrattanDhil1) June 11, 2025గత నెలతో పోలిస్తే మెరుగైందంటున్న టూర్ ఆపరేటర్లు: గత ఐదారేళ్లుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. ఒకప్పుడు బైక్ రైడర్‌గా లద్దాఖ్‌కు వెళ్లడం అలవాటైన నేను ఆ తర్వాత టూర్ ఆపరేటర్‌గా మారాను. గత పదేళ్లుగా పర్యాటకుల్ని తీసుకెళుతున్నా. తీవ్రవాద దాడి వల్ల సాధారణంగా మే నెల కల్లా ఊపందుకోవాల్సిన పర్యాటకుల సంఖ్య జూన్ నెలకు గానీ పుంజుకోలేదు. ఏదేమైనా ఈ నెలలో పరిస్థితి పూర్తి ఆశాజనకంగా కనిపిస్తోంది. – శ్రవణ్ కొన్నేరు, మ్యాడ్ ఓవర్ లద్దాఖ్ చదవండి: ఉద్ధండ ఆర్టిస్టులు : ప్రతి రూపాయి చిన్నారుల చదువుకే.. -
మీ ప్రమేయం లేదు.. ఇక మీదట ఉండబోదు కూడా!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ షాకిచ్చారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాక్ యుద్ధాన్ని తానే అడ్డుకున్నానని ట్రంప్ ప్రకటించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఇరు దేశాల ఉద్రిక్తతలు చల్లారడంలో ఎవరి ప్రమేయం లేదని.. ఇక మీదట కూడా ఉండబోదని ట్రంప్‌నకు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. న్యూఢిల్లీ: జీ-7 సదస్సు వేదికగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రధాని మోదీ భేటీ జరగాల్సి ఉంది. అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో తన పర్యటనను కుదించుకుని ట్రంప్ వెళ్లిపోయారు. ఈ తరుణంలో ఇరు దేశాల అధినేతలు ఫోన్ ద్వారా అరగంట మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా పహల్గాం ఉగ్రదాడి.. దానికి ప్రతిగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ వివరాలను మోదీ ట్రంప్‌కు వివరించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలోనే.. మోదీ ట్రంప్‌తో మాట్లాడుతూ.. పహల్గాం, ఆపరేషన్ సిందూర్ పరిణామాల సమయంలో భారత్-అమెరికా మధ్య ఏ స్థాయిలోనూ వాణిజ్య ఒప్పందం గురించి చర్చలు జరగలేదు. భారత్-పాకిస్తాన్ మధ్య అమెరికా మధ్యవర్తిత్వానికి అంశంపైనా చర్చలు కూడా జరగలేదు. కాల్పుల విరమణ ఒప్పందానికి సంబంధించి భారత్పాక్ మధ్య మిలిటరీ స్థాయి చర్చలు జరిగాయి. పాక్ అభ్యర్థన మేరకే ‘ఆపరేషన్ సిందూర్’ను నిలిపివేశాం. ఇప్పుడు, ఎప్పుడూ.. భారత్ ఇతరుల మధ్యవర్తిత్వాన్ని అంగీకరించబోదనే విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌నకు మోదీ స్పష్టంగా చెప్పారు. ఈ విషయంపై భారత్‌లో పూర్తి రాజకీయ ఏకాభిప్రాయం ఉందని అన్నారాయన. దీనికి ట్రంప్ ఉగ్రవాదంపై భారత్ జరిపే పోరునకు అమెరికా మద్ధతు ఉంటుందని తెలిపారు. ట్రంప్-మోదీ మధ్య ఫోన్ కాల్ సంభాషణ సారాంశాన్ని కేంద్ర విదేశాంగశాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియాకు వివరించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఫోన్ కాల్ ద్వారా ట్రంప్ మోదీకి సంతాపం తెలియజేశారని, ఆ తర్వాత ఇద్దరూ మాట్లాడుకోవడం ఇదేనని మిస్రీ తెలిపారు. అయితే కెనడా పర్యటన ముగిచుకుని వెళ్లే క్రమంలో అమెరికాకు రావాలంటూ ట్రంప్ మోదీని ఆహ్వానించగా.. షెడ్యూల్ ప్రకారం తాను రాలేనని మోదీ తెలిపినట్లు సమాచారం. భారత్‌లో జరిగే క్వాడ్ తదుపరి సమావేశం కోసం ట్రంప్‌ను మోదీ ఆహ్వానించారు. దీన్ని అంగీకరించిన అమెరికా అధ్యక్షుడు.. భారత్‌లో పర్యటించేందుకు ఉత్సుకతతో ఉన్నానని తెలిపారుఇదిలా ఉంటే.. భారత్-పాక్ మధ్య యుద్ధాన్ని తానే ఆపినట్లు ట్రంప్ ప్రకటించుకోవడం భారత రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ ప్రకటనపై స్పష్ట త ఇవ్వాలని ప్రతిపక్షాలు సైతం డిమాండ్ చేశాయి కూడా. -
అది ప్రతీ భారతీయుని ఆత్మపై దాడి: ‘జీ7’లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రపంచమంతా ఐక్యంగా ముందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కెనడాలో జరుగుతున్న జీ7 శిఖరాగ్ర సమావేశాల్లో పాల్గొన్న ఆయన ఉగ్రవాద ముప్పును ఎదుర్కోవడంలో ద్వంద్వ ప్రమాణాలను వర్తింపజేయయడం తగదని సూచించారు. జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్ర దాడిని ప్రస్తావిస్తూ, ఈ ఘటనను భారతదేశంపైన, మానవత్వంపైన జరిగిన దాడిగా అభివర్ణించారు. ఉగ్రవాదంపై ద్వంద్వ ప్రమాణాలకు చోటు ఉండకూడదని, ఏప్రిల్ 22న జరిగిన ఉగ్రదాడి ప్రతి భారతీయుడి ఆత్మపై జరిగిన దాడి అని ప్రధాని అన్నారు. ఉగ్రవాదానికి బహిరంగంగా మద్దతు ఇస్తున్న దేశాలకు ప్రతిఫలం లభిస్తున్నదన్నారు. ఉగ్రవాదం మానవాళికి శత్రువని, ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టే అన్ని దేశాలకు అది ఆటంకంగా నిలుస్తున్నదని ప్రధాని పేర్కొన్నారు.ప్రపంచ శాంతి, శ్రేయస్సు కోసం ప్రపంచమంతా స్పష్టమైన విధానంతో ముందుకు కదలాలని, అలాకాదని ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే ఏ దేశమైనా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ప్రధాని మోదీ అన్నారు. పశ్చిమ ఆసియా దేశాలు అనిశ్చితి, సంఘర్షణలతో తల్లడిల్లిపోతున్నాయిని, ఆయా దేశాల్లో ఆహారం, ఇంధనం, ఎరువులు,ఆర్థిక సంక్షోభాలు ఎదురవుతున్నాయన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి వీటిని ప్రపంచ వేదికపైకి తీసుకురావడాన్ని భారత్ తన బాధ్యతగా భావిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: నేడు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌తో ట్రంప్ భేటీ -
మానవత్వంపై పాక్ దాడి
కాట్రా: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్తాన్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. పహల్గాంలో పర్యాటకులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా మానవత్వంపై, కశ్మీర్ గుర్తింపుపై దాడి చేసిందని నిప్పులు చెరిగారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడం, ప్రజల మధ్య ఘర్షణలు సృష్టించడం, కశ్మీర్ ప్రజల జీవనోపాధిపై దెబ్బకొట్టి నోటిదగ్గర ముద్ద లాగేసుకోవడమే పాకిస్తాన్ అసలు లక్ష్యమని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ శుక్రవారం జమ్మూకశ్మీర్‌లో రియాసీ జిల్లాలోని కాట్రాలో పర్యటించారు. రూ.46,000 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. 272 కిలోమీటర్ల ఉధంపూర్–శ్రీనగర్–బారాముల్లా రైల్వేలింక్(యూఎస్బీఆర్ఎస్) ప్రాజెక్టులో భాగమైన చినాబ్ రైల్వే బ్రిడ్జితోపాటు అంజి వంతెన ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. త్రివర్ణ పతాకం చేతబూని చినాబ్ బ్రిడ్జిపై కాసేపు నడిచారు. అనంతరం వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించారు. చినాబ్, అంజి వంతెనలపై వందేభారత్ రైలులో ప్రయాణించారు. పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత మోదీ జమ్మూకశ్మీర్‌లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఈ సందర్భంగా కాట్రాలో భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. మన పొరుగు దేశం మానవత్వం, సామాజిక సామరస్యం, ఆర్థికాభివృద్ధికి ముమ్మాటికీ వ్యతిరేకమని ఆరోపించారు. పేదలు పిడికెడు అన్నం తినడం కూడా ఆ దేశానికి ఇష్టం లేదని విమర్శించారు. పర్యాటక రంగం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సృష్టించడమే కాకుండా ప్రజల మధ్య ఐక్యత పెంచుతుందని తెలిపారు. పర్యాటక రంగాన్ని నాశనం చేసి, కశ్మీర్ ప్రజల పొట్టకొట్టాలని చూసిందని పాకిస్తాన్‌పై మండిపడ్డారు. ప్రధాని మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే.. జమ్మూకశ్మీర్‌లో శాంతి సౌభాగ్యాలు ‘‘రూ.46,000 కోట్ల విలువైన ప్రాజెక్టులతో జమ్మూకశ్మీర్ అభివృద్ధి మరింత వేగం పుంజుకుంటుంది. శాంతి సౌభాగ్యాలు విలసిల్లుతాయి. జమ్మూకశ్మీర్ ప్రగతిని అడ్డుకోవడానికి పాకిస్తాన్ పదేపదే కుట్రలు సాగిస్తోంది. గత కొన్నేళ్లుగా రికార్డు స్థాయిలో పర్యాటకులు వస్తుండడం పొరుగు దేశానికి కంటగింపుగా మారింది. అందుకే పహల్గాంలో దాడులకు పాల్పడింది. ఇక్కడ పర్యాటక రంగం కుప్పకూలితే స్థానికులు ఉపాధి కోల్పోతారు. పర్యాటకంపై వచ్చే ఆదాయంతో జీవిస్తున్న పేద కుటుంబాలు రోడ్డున పడతాయి. పహల్గాంలో ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు అదిల్ హుస్సేన్ షా ధైర్యంగా ఎదుర్కొంనేందుకు ప్రయత్నించాడు. గుర్రంపై పర్యాటకులను తీసుకెళ్తూ వచి్చన డబ్బులతో కుటుంబాన్ని పోషించుకొనే ఆ యువకుడు ముష్కరుల దాడిలో బలైపోవడం నన్ను కలచివేసింది. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను ఎగదోస్తున్న పాకిస్తాన్‌కు ఆపరేషన్ సిందూర్‌తో గట్టిగా బుద్ధి చెప్పాం. ఇకపై ఆపరేషన్ సిందూర్ పేరు విన్నప్పుడల్లా పాకిస్తాన్‌కు సిగ్గుచేటైన పరాజయమే గుర్తుకొస్తుంది. బడి పిల్లలపై బాంబు దాడులా? పహల్గాంలో ఉగ్రవాద దాడి జరగ్గానే వేగంగా స్పందించాం. మనం తీసుకున్న చర్యలను పాకిస్తాన్ సైన్యం గానీ, ఉగ్రవాద ముఠాలు గానీ ఊహించలేకపోయాయి. పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించి, ఉగ్రవాదులు మౌలిక సదుపాయాలను, వైమానిక స్థావరాలను నిమిషాల వ్యవధిలోనే శిథిలాలుగా మార్చేశాం. దశాబ్దాలపాటు నిర్మించుకున్న స్థావరాలను నేలమట్టం చేశాం. మన సైనిక శక్తిని తట్టుకోలేక పాకిస్తాన్ సైన్యం ఆక్రోశంతో పూంచ్‌తో పాటు సరిహద్దు జిల్లాల్లో దాడులకు దిగింది. స్కూల్‌కు వెళ్లే పిల్లలపై బాంబులు విసిరింది. స్కూళ్లు, ఆసుపత్రులు, ఆలయాలు, మసీదులు, గురుద్వారాలపై దాడులకు పాల్పడింది. మన దేశంలో ప్రజలంతా బాధితులకు అండగా నిలిచారు. పాకిస్తాన్ దాడుల్లో మరణించినవారి కుటుంబాలను ఆదుకుంటాం. ఉద్యోగాలు కలి్పస్తాం. ఆర్థిక సాయం అందిస్తాం. బాంబు దాడుల్లో దెబ్బతిన్న ఇళ్లకు పరిహారం చెల్లిస్తాం. యువత కలలు సాకారం జమ్మూకశ్మీర్‌లో ప్రజలు గతంలో ఉగ్రవాదానికి అలవాటు పడిపోయారు. ఎంతో మంది తమ కలలు వదిలేసుకోవాల్సి వచ్చింది. హింసాకాండను అంతా తమ తలరాత అనుకున్నారు. కానీ, కేంద్రంలో మా ప్రభుత్వం వచి్చన తర్వాత ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జమ్మూకశ్మీర్ యువత మళ్లీ కలలు కంటున్నారు, వాటిని సాకారం చేసుకుంటున్నారు. జనంతో కిక్కిరిసిపోయిన మార్కెట్లు, సందడితో వెలిగిపోతున్న షాపింగ్ మాల్స్, సినిమా హాళ్లను ప్రత్యక్షంగా చూస్తూ సంబర పడుతున్నారు. ఇక్కడ ఎంబీబీఎస్ సీట్లు 500 నుంచి 1,300కు చేరాయి. పహల్గాం లాంటి దాడులతో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. జమ్మూకశ్మీర్ అభివృద్ధిని ఎవరూ ఆపలేరు. జమ్మూకశ్మీర్ యువత కలలను ఛిద్రం చేయాలనుకుంటే అంతకంటే ముందు మోదీని ఎదుర్కోవాలన్న సంగతిని ప్రత్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఉగ్రవాదానికి మర్చిపోలేని గుణపాఠం నేర్పాలని జమ్మూకశ్మీర్ యువత నిర్ణయించుకున్నారు. ఉధంపూర్–శ్రీనగర్–బారాముల్లా రైల్వే లైన్ ప్రాజెక్టు నూతన, సాధికార జమ్మూకశ్మీర్‌కు ప్రతీక. భారత నవశక్తికి ఉదాహరణ. చినాబ్, అంజి వంతెనలు జమ్మూకశ్మీర్ సౌభాగ్యానికి గవాక్షాలుగా నిలుస్తాయి. ఇక్కడి మెగా మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు జమ్మూకశ్మీర్ అభివృద్ధి ప్రయాణంలో కీలక మైలురాళ్లు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి అని తరచుగా అంటుంటాం. రైల్వే ప్రాజెక్టుతో అది వాస్తవ రూపం దాలి్చంది’’ అని ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇంజనీరింగ్ అద్భుతం.. చినాబ్ వంతెన → జమ్మూకశ్మీర్‌లో చినాబ్ నదిపై నిర్మించిన రైల్వే వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే ఆర్చి బ్రిడ్జిగా రికార్డుకెక్కింది. రూ.1,486 కోట్ల వ్యయంతో ఎనిమిదేళ్లలో ఈ వంతెన నిర్మించారు. → ఇదొక ఇంజనీరింగ్ అద్భుతంగా అని చెప్పొచ్చు. చినాబ్ నదీ గర్భం నుంచి దీని ఎత్తు 359 మీటర్లు. పారిస్‌లోని ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు అధికం.→ చినాబ్ బ్రిడ్జి పొడవు 1.32 కిలోమీటర్లు. అన్ని రకాల వాతావరణ పరిస్థితులు, భూకంపాలు, బాంబు పేలుళ్లు, భీకర గాలులను తట్టుకోగలదు. 100 కిలోమీటర్ల వేగంతో రైళ్లు ప్రయాణించవచ్చు. ఈ వంతెన నిర్మాణానికి 2002లో అనుమతి లభించింది. 2017లో పనులు మొదలయ్యాయి. → ఈ వంతెన నిర్మాణం కంటే ముందే 26 కిలోమీటర్ల అప్రోచ్ రోడ్లు, 400 మీటర్ల పొడవైన సొరంగం నిర్మించారు. → చినాబ్ బ్రిడ్జితో జమ్మూ, శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయం తగ్గిపోతుంది. దీని జీవిత కాలం 120 ఏళ్లు. తీగల వంతెన అంజి బ్రిడ్జి → అంజి వంతెనకు ఎన్నో విశిష్టతలు ఉన్నాయి. చినాబ్ బ్రిడ్జి తర్వాత ఇది రెండో అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి. ఇండియాలో అత్యంత ఎత్తయిన కేబుల్ రైల్వే బ్రిడ్జి ఇదే. నదీ గర్భం నుంచి దీని ఎత్తు 196 మీటర్లు. 2017 జనవరిలో నిర్మాణం ప్రారంభమైంది. → చినాబ్‌కు ఉప నది అయిన అంజి నదిపై నిర్మించారు. ఇది తీగలతో అనుసంధానమైన వంతెన. నిర్మాణానికి పూర్తిగా ఉక్కు ఉపయోగించారు. → దీని మొత్తం పొడవు 725 మీటర్లు. ప్రధాన వంతెన పొడవు 473 మీటర్లు. 82 మీటర్ల నుంచి 295 మీటర్ల పొడవైన 96 ఉక్కు తీగలతో ఈ వంతెన నిర్మాణం పూర్తయ్యింది. ఆయనకు ప్రమోషన్, నాకు డిమోషన్ జమ్మూకశ్మీర్‌కు సాధ్యమైనంత త్వరగా రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రధాని మోదీని కోరారు. కాట్రా సభలో ఆయన మాట్లాడుతూ ఈ అంశాన్ని లేవనెత్తారు. గతంలో పూర్తిస్థాయి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న తాను ఇప్పుడు కేంద్ర పాలిత ప్రాంతానికి ముఖ్యమంత్రిగా పని చేస్తున్నానని సరదాగా వ్యాఖ్యానించారు. ‘‘2014లో మోదీ తొలిసారి ప్రధానమంత్రి అయిన తర్వాత జమ్మూకశ్మీర్‌కు వచ్చారు. కాట్రా రైల్వే స్టేషన్ ప్రారంభించారు. అప్పట్లో నేను జమ్మూకశ్మీర్‌కు ముఖ్యమంత్రిగా పని చేస్తున్నా. మోదీ ప్రస్తుతం మూడోసారి ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు. అప్పట్లో మనోజ్ సిన్హా రైల్వే శాఖ సహాయ మంత్రిగా ఉండేవారు. ఆయన ఇప్పుడు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా ఎదిగారు. మనోజ్ సిన్హాకు ప్రమోషన్, నాకు డిమోషన్ లభించాయి. నాకు త్వరలో పదోన్నతి కలి్పస్తారని ఆశిస్తున్నా’’ అని ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. -
పహల్గామ్ లో పాక్ ఉగ్రదాడికి కారణం అదే.. మోదీ కీలక వ్యాఖ్యలు
-
దాచటం దేశభక్తిని చాటడమా?
దేశభక్తి ఎంత అవసరమో, స్వప్రయోజనాల కోసం ఆ భావనను మితిమీరిన స్థాయికి తీసుకెళ్లి చూడటం అంత అనర్థదాయకం. ‘ఆపరేషన్ సిందూర్’ క్రియాశీలకంగా మే 10న ముగిసిన 20 రోజులకు 31వ తేదీన ఈ విషయం బాగా స్పష్టమైంది. ఆ రోజున భారతదేశపు త్రివిధ దళాధిపతి, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సి.డి.ఎస్.) జనరల్ అనిల్ చౌహాన్ సింగపూర్‌లో ‘బ్లూమ్‌బర్గ్’ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ, ‘ఆపరేషన్ సిందూర్’లో భారత వైమానిక దళం యుద్ధ విమానాలు కూలిన మాట నిజమేనని ఎట్టకేలకు అంగీకరించారు. దానితో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా సుడిగాలిలా చర్చ చెలరేగింది. రఫేల్ కూలిందనగానే కలకలంయుద్ధాలు జరిగినపుడు రెండు వైపులా నష్టాలు ఏదో ఒక మేర వాటిల్లటం సహజం. అమెరికా వంటి అత్యంత శక్తిమంతమైన దేశం సైతం చిన్న చిన్న దేశాల చేతిలో నష్టపోయిన ఉదంతాలు అనేకం ఉన్నాయి. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మన యుద్ధ విమానాల నష్టాల వార్తలు ప్రపంచమంతటా వ్యాపించిపోయినా, అలాంటిదేమీ జరగలేదంటూనే వచ్చింది. పైగా, పహల్గామ్ దురంతం, ఆపరేషన్ సిందూర్‌ల దరిమిలా దేశంలో పెల్లుబికిన దేశభక్తి రాజకీయ ప్రయో జనంగా మారుతుండగా, దాన్ని అంతులేని విధంగా పొందేందుకు రకరకాల ప్రయత్నాలు జరిగాయి. యుద్ధ విమానాల నష్టాలను దాచి పెట్టటం వాటిలో ఒకటి. మే 6–7 తేదీల మధ్య ‘ఆపరేషన్’ మొదలై పాకిస్తాన్‌లోని ఉగ్ర వాద స్థావరాలపై భారత వైమానిక దాడులు విజయవంతంగా జరి గాయి. ఆ వెంటనే పాకిస్తాన్ సైన్యం తాము ఆ దాడి సమయంలో భారత్‌కు చెందిన 5 విమానాలను (మర్నాడు ఆరుకు పెంచారు) కూల్చివేశామని ప్రకటించింది. వాటిలో భారత్‌కు ఫ్రాన్స్ సరఫరా చేసిన రఫేల్ విమానాలు మూడు, రష్యా నుంచి వచ్చిన మిగ్‌లు రెండు, మరొకటి ఉన్నాయని పాకిస్తాన్ కనీస వివరాలు కూడా ఇచ్చింది. ఆ వార్త ప్రపంచం అంతటా సంచలనంగా మారింది.అందుకు కారణం మిగ్‌ల కన్నా ఎక్కువగా రఫేల్ విమానాలు కూలి పోవటం! రఫేల్ విమానాలకు ఉన్న పేరు, మనం వాటిని ఖరీదు చేసినప్పుడు వర్ణించిన వాటి శక్తి సామర్థ్యాల గురించి తెలిసిందే.అందువల్ల, మరీ ముఖ్యంగా పాక్ వైమానిక బలం సాధారణమైన దనే అభిప్రాయం మనలో ఉన్నందున, పాకిస్తాన్ ప్రకటన నమ్మ శక్యం కానిదయింది. గమనించవలసిందేమంటే, ఆ ప్రకటనకు భారత సైన్యం అవునని గానీ, కాదని గానీ స్పందించకపోవటం. ‘వ్యూహాత్మక పొరపాటు’గా ఒప్పుకోలుమరొకవైపు ప్రపంచ వార్తా సంస్థలు విచారణలు మొదలుపెట్టి భారత్ విమానాలు కూలిన మాట నిజమని ధ్రువీకరించాయి. మొద టైతే ఒక రఫేల్ విమానం కూలిన మాట వాస్తవమేనని స్వయంగా రఫేల్ ఉత్పత్తిదారైన ఫ్రెంచ్ దస్సాల్ట్ కంపెనీ తెలియజేసింది. ఆ వెంటనే అమెరికన్ ఇంటిలిజెన్స్ ధ్రువీకరించింది. ఇంతకూ రఫేల్‌ను కూల్చగలిగిన పాకిస్తాన్ యుద్ధ విమానాలు, క్షిపణులు ఏవి అనే విచారణను పాశ్చాత్య మీడియా సంస్థలు, నిఘా సంస్థలు జరిపినప్పుడు, అవి చైనా నుంచి పాకిస్తాన్ కొనుగోలు చేసిన జె–35 విమానాలని తేలింది. దానితో అందరూ ఉలిక్కిపడ్డారు. ఎందుకంటే చైనా స్వయంగా గత 40 ఏళ్లుగా ఎవరితోనూ వైమానిక యుద్ధాలు చేయలేదు. వారు ఆ విమానాలను విక్రయించిన మరే దేశమూ యుద్ధం చేయలేదు. కనుక వారి ఆయుధాల శక్తి ప్రపంచానికి డాక్యు మెంట్లలో చదవటం తప్ప ప్రత్యక్షంగా తెలియదు. ఆ శక్తి ఏమిటో ఇపుడు ప్రదర్శితం కావడంతో జె–35ను ఉత్పత్తి చేసిన చెంగ్దూ కంపెనీ స్టాక్స్ 48 గంటలలో 40 శాతం పెరగగా, దస్సాల్ట్ స్టాక్స్ 10 శాతానికి పైగా పడిపోయాయి. జె–35 కొనుగోలుకు వేర్వేరు దేశాల నుంచి ఆసక్తి వ్యక్తం అయింది. అయితే స్వయంగా ఆ కంపెనీ గానీ, చైనా గానీ ఎటువంటి వ్యాఖ్యలూ చేయలేదు. ‘ఆపరేషన్ సిందూర్’ మే 10న ఆగే నాటికి ఇదీ పరిస్థితి.వైమానిక నష్టాల గురించి విదేశాలలో ఎన్నెన్ని కథనాలు వెలు వడుతున్నా, ఆ నష్టాలు తాము చేసినట్లు పాకిస్తాన్ పదే పదే ప్రకటి స్తున్నా, భారత ప్రభుత్వం మౌనం వహించింది. మే 11న భారత త్రివిధ దళాధిపతులు మీడియా పమావేశం నిర్వహించారు. ఒక విలేఖరి ప్రశ్నకు సమాధానంగా ఎయిర్ ఆపరేషన్స్ డైరెక్టర్ జనరల్ అయిన ఎయిర్ మార్షల్ ఎ.కె. భారతి – ‘‘యుద్ధంలో నష్టాలు సర్వ సాధారణం. యుద్ధం ఇంకా సాగుతున్నందున నేను ఆ వివరాల్లోకి వెళ్లబోను’’ అన్నారు. అదే ప్రశ్నను విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీకి వేయగా, ‘‘ఆ విషయాలు నాకు తెలియవు. కచ్చితమైన వివరాలను తగిన సమయంలో వెల్లడిస్తాము’’ అని జవాబిచ్చారు. ఆ మాటల అంతరార్థం తెలిసిపోతున్నా ప్రభుత్వం మాత్రం ఆ విషయం మాట్లాడేందుకు నిరాకరిస్తూనే పోయింది. ఆ 11వ తేదీ నుంచి 31 వరకు 20 రోజుల పాటు నష్టాల వివరాలు ప్రపంచానికంతా తెలి శాయి. సింగపూర్‌లో అయినా జనరల్ చౌహాన్, విమానాలు కూలా యన్నారు గాని ఎన్ని కూలాయో పేర్కొనలేదు. ఇక సైన్యాధికారులు 11న గాని, 31న గాని, మనం లక్ష్యాలను ఛేదించామా లేదా, దాడి సమయంలో జరిగిన వ్యూహాత్మక పొరపాటును గ్రహించి దిద్దుబాటు చేసుకున్నామా లేదా అనేవే ప్రధానమని అంటూ దాటవేయ బూనారు. ప్రభుత్వ విధానం అది గనుక వారినేమీ అనలేము. దేశభక్తిని ప్రేరేపించే ప్రయత్నాలు!ఏ యుద్ధంలోనూ ఏ దేశం కూడా సమగ్రమైన వివరాలు వెల్లడించదు. అందులో రక్షణపరమైన అంశాలు కొన్ని ఇమిడి ఉంటాయి గనుక! కానీ, ప్రస్తుత సందర్భంలోæపలు వివరాలు వెల్లడై సంచలనంగా మారుతున్నపుడు, మనం వాస్తవాలను అనవసరంగా దాచి పెడుతున్నామనే అభిప్రాయం ఏర్పడుతూ ప్రతిష్ఠకు భంగం వాటిల్లు తున్నప్పుడు, వాస్తవాలు ఏమిటని ప్రతిపక్షాలు పలుమార్లు ప్రశ్నిస్తున్నప్పుడు, పార్లమెంటరీ కమిటీలో ప్రస్తావించి ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నపుడు ఇది సాధారణ పరిస్థితుల వంటిది కాబోదు. కేంద్ర ప్రభుత్వం ఈ వాస్తవాలను గుర్తించి అందుకు తగినట్లు వ్యవహరించటానికి బదులు, వాస్తవాలు ప్రజలకు తెలిస్తే వారిలో దేశభక్తి తగ్గుతుందనీ, అది తగ్గితే రాజకీయ ప్రయోజనాలకు నష్టం వాటిల్లుతుందనీ అన్నట్లుగా ఉండిపోయింది.ఇది చాలదన్నట్లు సింధూ నదీ జలాల ఒప్పందం, పీఓకేలను మోదీ ప్రభుత్వం బలంగా ముందుకు తెచ్చింది. ఈ లక్ష్యాలు నెరవేరటం ఆచరణలో ఎంత సాధ్యమన్నది అలా ఉంచి, పనిలో పనిగా వాటి పేరిట కూడా దేశభక్తిని స్థాయి పెంచి రాజకీయంగా లబ్ధి పొందాలన్న యోచన మాత్రం ప్రస్తుత ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తున్నది. ఉగ్రవాదాన్ని, దాని ప్రోత్సాహకులను దెబ్బతీయాల నటం వరకు నిర్వివాదమైన విషయం. ఇటువంటి సందర్భాలలో ప్రజల దేశభక్తి అత్యంత సహజం. అదేవిధంగా యుద్ధాలు జరిగి నపుడు ఏదో ఒక మేరకు రెండు వైపులా నష్టాలు అనివార్యం. అంతి మంగా చూడ వలసింది పైచేయి సాధించి లక్ష్యాలను ఆ మేరకు నెరవేర్చుకున్నామా లేదా అనేది మాత్రమే. ‘క్రికెట్ మ్యాచ్‌లో పోయిన వికెట్లు ముఖ్యం కాదు, తుది ఫలితం ముఖ్యం’ అంటూ ఆఖరికి జనరల్ చౌహాన్ వెల్లడించిందీ అదే! విషయాన్నంతా రాజ కీయ స్వప్రయోజనాల కోసం వినియోగించదలుచుకొని, రకరకాల పద్ధతులలో వాస్త వాలను దాచేందుకు ప్రభుత్వం మితిమీరి వ్యవహ రించటం సరి కాదు. ‘అతి సర్వత్ర వర్జయేత్’ అనే హితవు భారతీయ సంస్కృతిలో ఊరకనే రాలేదు.టంకశాల అశోక్‌వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
పహల్గాం ఉగ్రదాడి తర్వాత.. తొలిసారి జమ్మూకశ్మీర్ పర్యటనకు ప్రధాని మోదీ
సాక్షి,ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్ పర్యటన ఖరారైనట్లు తెలుస్తోంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారి ఈ నెల 6న (జూన్6) జమ్మూకశ్మీర్‌లో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా చీనాబ్ రైల్వే బ్రిడ్జీని ప్రారంభించనున్నారు. పర్యటనలో భాగంగా ఉగ్రవాదం అణిచివేతపై మోదీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.మోదీ తన పర్యటనలో సెమీ హై స్పీడ్ ట్రైన్ వందే భారత్‌ను వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. తద్వారా జమ్మూకశ్మీర్ జాతీయ రహదారిపై ప్రయాణికులు ఇబ్బందులు తొలగనున్నాయి.PM Modi is expected to inaugurate the Chenab Bridge—the world’s highest railway bridge—during his upcoming visit to Jammu and Kashmir on June 6, 2025.@DrJitendraSingh shared this update on platform X.Watch as @anchoramitaw, @MohitBhatt90 & @ShreyaOpines bring us more details. pic.twitter.com/3IZtoq9LIT— TIMES NOW (@TimesNow) June 3, 2025 దీంతో పాటు ఈ మార్గమధ్యంలో చీనాబ్ నది (Chenab River)పై నిర్మించిన బ్రిడ్జ్‌ను ప్రారంభించనున్నారు. కశ్మీర్‌ను భారత్‌లోని మిగతా ప్రాంతాలతో అనుసంధానించేందుకు చేపట్టిన ఉధంపుర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను నిర్మించారు. నదీగర్భం నుంచి 359 మీటర్ల ఎత్తునున్న ఈ రైల్వే వంతెన పొడవు 1,315 మీటర్లు. -
ఎవరీ శర్మిష్టా పనోలి.. ఆమె విడుదల కోసం ప్రపంచ దేశాల నుంచి మోదీకి విజ్ఞప్తులు
న్యూఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ సమయంలో బాలీవుడ్ సెలెబ్రిటీలపై విమర్శలు చేస్తూ, మతసామరస్యాన్ని దెబ్బతీసేలా వీడియో పోస్టు చేసిన కేసులో 22ఏళ్ల సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్,న్యాయ విద్యార్థిని శర్మిష్టా పనోలిని (Sharmistha Panoli) పోలీసులు అరెస్ట్ చేశారు. బెయిల్ తిరస్కరించిన కోర్టు ఆమెకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. ఆమెను అరెస్ట్ చేసేందుకు పోలీసులు 1500 కిలోమీటర్లు ప్రయాణించడం, ప్రపంచంలోని పలు దేశాల్లోని ఆమెను విడుదల చేయాలంటూ ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేయడంతో శర్మిష్టా పనోలి చర్చాంశనీయంగా మారారు. ఇంతకీ ఈ శర్మిష్టా పనోలి ఎవరు? శర్మిష్టా పనోలి ఎవరు?శర్మిష్టా పనోలి పుణె న్యాయ విద్యార్థిని. పూణేకి చెందిన లా కాలేజీలో నాలుగో సంవత్సరం న్యాయవాద విద్యను అభ్యసిస్తున్నారు. ఓ వైపు చదువుతూనే మరోవైపు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్గా శర్మిష్టా రాణిస్తున్నారు. ఇన్‌స్టాలో 94,000 మందికిపైగా ఫాలోవర్స్‌ను సొంతం చేసుకున్న న్యాయ విద్యార్థిని రాజకీయ, సామాజిక అంశాలపై అభిప్రాయం వ్యక్తం చేయడంలో పేరు సంపాదించారు.వివాదాస్పద వీడియోలో ఏమన్నారంటే?అయితే ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్రదాడిపై (2025 Pahalgam attack) ప్రతీకారం తీర్చుకుంటూ భారత్ ఆపరేషన్ సిందూర్‌తో (Operation Sindoor) సైనిక చర్యకు దిగింది. పాక్‌ను చావు దెబ్బ కొట్టింది. ఇదే అంశంపై ఓ పాక్ యూజర్.. శర్మిష్టాను పలు ప్రశ్నలు సంధించాడు. సదరు యూజర్ వేసిన ప్రశ్నలపై శర్మిష్ఠ పోనోలి ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆపరేషన్ సిందూర్‌కు సంబంధించి పలు అంశాలపై అభిప్రాయం వ్యక్తం చేస్తూ.. పహల్గాం ఉగ్రదాడితో మౌనం వహించడంపై బాలీవుడ్ సెలెబ్రిటీలతో పాటు యూట్యూబర్ రణవీర్ అల్లాహ్బాదియాపై విమర్శలు గుప్పించారు. Kolkata, West Bengal: Kolkata Police arrested a law student Sharmistha Panoli from Pune in Gurgaon for allegedly hurting religious sentiments through social media posts on Operation Sindoor. She was brought to Kolkata on transit remand and produced before the Alipore CJM Court.… pic.twitter.com/jxDpcVSzlJ— IANS (@ians_india) May 31, 2025ఆ విమర్శలు మిస్‌ఫైర్ అయ్యాయి. శర్మిష్ట చేసిన వ్యాఖ్యల్ని నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో శర్మిష్ట నెటిజన్లను క్షమాపణలు కోరారు. అనంతరం, ఆ వీడియోను డిలీట్ చేశారు. అయినప్పటికీ, కోల్‌కతా పోలీసులు శర్మిష్టాపై చర్యలకు ఉపక్రమించారు. విద్యార్థినిగా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్గా మతసామరస్యాన్ని దెబ్బతీయడం, సామాజిక కలహాలు సృష్టించేలా ప్రేరేపించడంపై కేసు నమోదు చేశారు. 1500 కిలోమీటర్లు ప్రయాణించిన పోలీసులు కోర్టు ఆదేశాలకు అనుగుణంగా సుమారు 1500 కిలోమీటర్లు ప్రయాణించి గురుగ్రామ్‌లో అదుపులోకి తీసుకుని అలిపూర్ కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన కోర్టు ఆమెకు బెయిల్ నిరాకరించించింది. జూన్ 13 వరకు జ్యుడీషియల్ కస్టడీలోకి పంపింది. విచారణ సందర్భంగా శర్మిష్టా తరఫున న్యాయవాది, అన్ని డిజిటల్ ఆధారాలు ఇప్పటికే సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. కస్టడీ అవసరం లేదని వాదించారు. కోర్టు ఆ వాదనల్ని ఖండించింది. జ్యుడీషియల్ కస్టడీ విధించింది. Free the brave Sharmishta Panoli!It’s a disgrace for the freedom of speech that she was arrested. Don’t punish her for speaking the truth about Pakistan and Muhammad. Help her @narendramodi! @AmyMek #Sharmishta#IStandwithSharmishta #ReleaseSharmistha #FreeSharmishta pic.twitter.com/YhGSLhuyr2— Geert Wilders (@geertwilderspvv) May 31, 2025మోదీజీ శర్మిష్టా పనోలిని రక్షించండిశర్మిష్టా పనోలి అరెస్టుపై వివాదం రాజుకుంది. ప్రపంచంలోని పలు దేశాల నుంచి ఆమెను విడుదల చేయాలంటూ ప్రధాని మోదీకి పలువురు విజ్ఞప్తులు పంపుతున్నారు. శర్మిష్టా పనోలి అరెస్టుపై డచ్ పార్లమెంట్ సభ్యుడు గీర్ట్ వైల్డర్స్ ప్రధాని మోదీకి ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. కోల్‌కతా పోలీసుల తీరు వాక్ స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉంది. ఆమెను రక్షించండి.ఎంతో ధైర్యవంతురాలైన శర్మిష్టను విడుదల చేసేలా ప్రధాని మోదీ అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. ప్రపంచంలో అందరి దృష్టి శర్మిష్టపైనే ఉందంటూ ఆమె ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. -
మహిళలు కన్నెర్ర చేస్తే ముష్కరులకు మూడినట్లే
భోపాల్: పాకిస్తాన్ ఉగ్రవాదులు, వారి వెనుక ఉన్న సూత్రధారులు భారత నారీశక్తిని సవాలు చేసి స్వయంగా వినాశనాన్ని కొనితెచ్చుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. పహల్గాం ఉగ్రవదాడిలో భార్యల కళ్లెదుటే భర్తలు చనిపోయారని అన్నారు. మన ఆడబిడ్డలు కన్నెర్ర చేస్తే ముష్కరులకు మూడినట్లేనని తేల్చిచెప్పారు. ఉగ్రవాదంపై పోరాటంలో దేశ చరిత్రలో ‘ఆపరేషన్ సిందూర్’ అత్యంత విజయవంతమైన ఆపరేషన్ అని స్పష్టంచేశారు. పహల్గాంలో ఉగ్రవాదులు కేవలం రక్తం పారించలేదని... మన సంస్కృతిపై దాడి చేశారని, మన దేశాన్ని విచ్చిన్నం చేసేందుకు కుట్రలు సాగించారని మండిపడ్డారు. రాణి అహిల్యాబాయి హోల్కర్ 300వ జయంతి సందర్భంగా శనివారం మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ‘మహిళా సశక్తికరణ్ మహా సమ్మేళన్’ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత మన సైనిక దళాలు పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి ఉగ్రవాదుల అడ్డాలను నేలమట్టం చేశాయని అన్నారు. ముష్కరుల ఇళ్లలోకి చొరబడి మరీ అంతం చేయగలని నిరూపించినట్లు తెలిపారు. ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని పేర్కొన్నారు. మరోసారి భారత్‌పై దాడికి పాల్పడే సాహసం చేస్తే ఉగ్రవాదులు, వారి పోషకులు భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని మరోసారి స్పష్టంచేశారు. వీరత్వానికి ప్రతీక సిందూరం ఉగ్రవాదులను ప్రయోగించి దొంగచాటు యుద్ధాలు చేద్దామనుకుంటే కుదరని పాకిస్తాన్‌కు తేల్చిచెప్పారు. తుపాకీ తూటాలకు ఫిరంగి గుండ్లతో బదులిస్తామని ఘాటుగా హెచ్చరించారు. మన సంప్రదాయంలో సిందూరం మహిళా శక్తికి ప్రతీక అని, రామభక్త హనుమాన్ సైతం సిందూరం ధరిస్తారని తెలిజేశారు. ఇప్పుడు సిందూరం వీరత్వానికి, ఉగ్రవాదంపై ప్రతిఘటనకు గుర్తుగా మారిందన్నారు. మహిళల సాధికారత కోసం నారీశక్తి వందన్ అధినియం బిల్లు తీసుకొచ్చామని అన్నారు. ప్రస్తుతం పార్లమెంట్లో 75 మంది మహిళా ఎంపీలు ఉన్నారని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని వివరించారు. ఆపరేషన్ సిందూర్‌లో మహిళలదే కీలక పాత్ర అసిస్టెంట్ కమాండెంట్ నేహా భండారి నేతృత్వంలో బీఎస్ఎఫ్ మహిళా దళం ప్రదర్శించిన ధైర్యసాహసాలను ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ దళం ఆపరేషన్ సిందూర్ సమయంలో జమ్మూకశ్మీర్‌లోని అఖ్నూర్లో ఫార్వర్డ్ పోస్టులను పాకిస్తాన్ దాడుల నుంచి విజయవంతంగా కాపాడిందని వెల్లడించారు. రక్షణ శాఖలో భారతీయ మహిళల శక్తి సామర్థ్యాలు ప్రపంచం తిలకిస్తోందని అన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో మహిళా జవాన్లు కీలక పాత్ర పోషించారని తెలిపారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీ(ఎన్డీఏ)లో 17 మంది తొలి బ్యాచ్ మహిళా కేడెట్లు విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకోవడం చరిత్రాత్మక ఘట్టమని అభివర్ణించారు. -
ఉగ్రవాద విష సర్పాన్ని నలిపేస్తాం
కారాకాట్/కాన్పూర్: ఉగ్రవాదం ఒక విష సర్పమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అది మరోసారి మనవైపు తల ఎత్తిచూస్తే, కలుగులోంచి బయటకు లాగి, కాలితో నలిపి చంపేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. పహల్గాం ఉగ్రవాద దాడి వెనుక ఉన్న కుట్రదారుల స్థావరాలను మన సైనిక దళాలు శిథిలాలుగా మార్చేశాయని చెప్పారు. మన అమ్ములపొదిలో ఆపరేషన్ సిందూర్ కేవలం ఒక బాణం అని తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటం ఆగదని, ఆపే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. శుక్రవారం బిహార్‌లోని కరాకాట్ పట్టణంలో రూ.48,520 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ ప్రారంభించారు. అలాగే ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో రూ.47,600 కోట్ల విలువైన 15 మెగా అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. మరికొన్నింటికి శంకుస్థాపన చేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాల లబి్ధదారులకు సరి్టఫికెట్లు, చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా రెండుచోట్లా బహిరంగ సభల్లో ప్రసంగించారు. గత నెలలో పహల్గాంలో ఉగ్రదాడి జరిగిన మరుసటి రోజే బిహార్‌లోని మధుబని జిల్లాలో పర్యటించానని, ముష్కరులను కలలో కూడా ఊహించలేని రీతిలో శిక్షిస్తానంటూ ప్రజలకు మాట ఇచ్చానని గుర్తుచేశారు. ఆ మాట నిలబెట్టుకొని, మళ్లీ బిహార్‌లో అడుగు పెట్టానని పేర్కొన్నారు. మన ఆడబిడ్డలు ధరించే సిందూరం శక్తి ఏమిటో పాకిస్తాన్‌తోపాటు మొత్తం ప్రపంచం చూíసిందన్నారు. ప్రధాని మోదీ ఇంకా ఏం చెప్పారంటే... అణు బాంబులకు భయపడం ‘‘పాకిస్తాన్ సైన్యం రక్షణలో భద్రంగా ఉన్నట్లు ఉగ్రవాదులు భావించేవారు. కానీ, వారిపై దాడిచేసి మోకాళ్లపై నిలబెట్టాం. పాకిస్తాన్ వైమానిక స్థావరాలు, సైనిక కేంద్రాలను ధ్వంసం చేశాం. ఇది నవ భారతం. మన శక్తి ఏమిటో అందరికీ తెలుస్తోంది. ఉగ్రవాదులకు మరింత బాగా అర్థమవుతోంది. దేశ రక్షణ కోసం సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. బిహార్‌లోని సరన్ జిల్లాకు చెందిన బీఎస్ఎఫ్ ఎస్ఐ మొహమ్మద్ ఇంతియాజ్ జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులపై పోరాడుతూ అమరుడయ్యాడు. బీఎస్ఎఫ్ జవాన్లు దేశమాత సేవలో తరిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో స్వదేశీ ఆయుధ బలాన్ని, మేక్ ఇన్ ఇండియా శక్తిని ప్రదర్శించాం. బ్రహ్మోస్ క్షిపణులు పాకిస్తాన్ భూభాగంలోకి ప్రవేశించి, విధ్వంసం సృష్టించాయి. మనం కొడుతున్న దెబ్బలు తట్టుకోలేక యుద్ధం ఆపాలంటూ పాకిస్తాన్ వేడుకుంది. ఆపరేషన్ సిందూర్ ముగియలేదు. అణు బాంబులకు భారత్ భయపడదు. శత్రువుల వద్దనున్న అణ్వాయుధాలను బట్టి నిర్ణయాలు తీసుకొనే రోజులు పోయాయి. ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో మన సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాం. ముష్కరులపై ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడి చేయాలో సైనికులే నిర్ణయించుకుంటారు. ఉగ్రవాదులను, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే ప్రభుత్వాలను ఇకపై ఒక్కటిగానే పరిగణిస్తాం. మావోయిజం అంతమయ్యే రోజు దగ్గర్లోనే.. దేశానికి శత్రువులైన వారందరిపైనా మన పోరాటం కొనసాగుతోంది. వారి సరిహద్దులో ఉండొచ్చు లేదా దేశం నడి»ొడ్డున ఉండొచ్చు. హింస, అశాంతిని ప్రేరేపించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. గతంలో నక్సలైట్ల అరాచకాల వల్ల బిహార్ ప్రజలు భయంభయంగా బతికారు. నక్సలైట్ల కారణంగా అభివృద్ధి ఆగిపోయింది. పిల్లల చదువులు దెబ్బతిన్నాయి. రోడ్లు వేస్తున్న కారి్మకులను కూడా హత్య చేశారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం పట్ల నక్సలైట్లకు ఏమాత్రం విశ్వాసం లేదు. 2014లో కేంద్రంలో అధికారంలోకి వచి్చన తీవ్రవాద నిర్మూలనపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాం. మా కృషి ఫలితంగా దేశంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య 125 నుంచి 18కి పడిపోయింది. రోడ్లు నిర్మిస్తున్నాం, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాం. మావోయిజం పూర్తిగా అంతమయ్యే రోజు దగ్గర్లోనే ఉంది. శాంతి, సౌభాగ్యం, విద్య ప్రతి గ్రామానికీ చేరుకుంటాయి’’ అని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. ‘పహల్గాం’ బాధిత కుటుంబానికి పరామర్శ పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన శుభం ద్వివేది కుటుంబ సభ్యులను ప్రధానమంత్రి పరామర్శించారు. కాన్పూర్‌లోని చాకేరి ఎయిర్‌పోర్టులో వారిని కలుసుకున్నారు. మోదీని చూసి వారంతా బోరున విలపించారు. ఈ సందర్భంగా మోదీ సైతం తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆందోళన వద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని శుభం ద్వివేది కుటుంబానికి భరోసా కల్పించారు. -
మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నా.. పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని మోదీ
పాట్నా: పహల్గాం నిందితుల్ని మట్టిలో కలిపేస్తానని ఆరోజు మాట ఇచ్చా.. ఇచ్చిన మాట ప్రకారం ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదాల్ని హతమార్చాం’ అని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం ప్రధాని మోదీ బీహార్‌లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారి బీహార్‌లో పర్యటించిన సమయంలో మీకు హామీ ఇచ్చా. పహల్గాం ఉగ్రదాడికి పాల్పడింది. వాళ్ల వెనకున్నది ఎంతటి వారినైనా ఉపేక్షించబోనని. మీకు మాట ఇచ్చినట్లుగా ఆపరేషన్ సిందూర్‌తో పహల్గాం ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపాం. ఆ నాడు మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుని బీహార్ గడ్డపై అడుగుపెట్టా. #WATCH | Karakat, Bihar | Prime Minister Narendra Modi says, "... Pakistan and the world have seen the power of India's daughters' Sindoor... The world has seen the unprecedented valour and courage of the BSF during Operation Sindoor... While performing the sacred duty of serving… pic.twitter.com/38eFvCPtww— ANI (@ANI) May 30, 2025ఆపరేషన్ సిందూర్‌లో మన దళాలు నిమిషాల వ్యవధిలో మెరుపు వేగంతో వారిని అణిచేశాయి. పాక్ ఉగ్రస్థావరాల్ని నేలమట్టం చేయడమే కాదు, నిమిషాల వ్యవధిలోనే పాక్ వైమానిక స్థావరాల్ని ధ్వంసం చేశాయి. పాకిస్తాన్‌తోపాటు ప్రపంచ దేశాలు ఆపరేషన్ సిందూర్ పవర్‌ని చూశాయి. ఉగ్రవాదంపై మా పోరు ఆగదు. ఆపరేషన్ కగార్తో మావోయిస్టుల చరిత్ర ముగిసిపోతుంది. చాలా జిల్లాలు మావోయిస్టుల ప్రభావం నుంచి బయటపడ్డాయి. ఇది నయా భారత్. ఇదే భారత్‌కు కొత్త బలం అని పునరుద్ఘాటించారు.ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపేస్తాం.. పహల్గాం ఉగ్రదాడి తర్వాత బీహార్‌లో ప్రధాని మోదీ ‘‘మిత్రులారా.. బిహార్ గడ్డపై నుంచి మొత్తం ప్రపంచానికి చెబుతున్నా. ఉగ్రవాదులు, వారికి మద్దతిస్తున్నవారిని మట్టిలో కలిపేస్తాం. వాళ్లు ఎక్కడ దాగి ఉన్నా సరే గుర్తించి, బంధించి, శిక్షిస్తాం. ప్రపంచం అంచుల దాకా వారిని వేటాడుతాం. కలలో కూడా ఊహించలేని విధంగా శిక్ష విధిస్తాం. ఉగ్రవాదులెవరూ తప్పించుకోలేరు. ముష్కర మూకలను చట్టం ముందు నిలబెట్టడం తథ్యం. 140 కోట్ల మంది భారతీయుల సంకల్పం కుట్రదారుల వెన్నువిరచడం ఖాయం.శిక్ష తప్పనిసరిగా ఉంటుందన్న సంగతి గుర్తుంచుకోవాలి. ఈ విషయంలో మన దేశమంతా ఒకే మాటపై ఉంది. మానవత్వాన్ని విశ్వసించే వారంతా మన వెంటే ఉన్నారు. ఉగ్రవాదుల హేయమైన చర్య మనసున్న ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తు్తన్నా. వారికి దేశమంతా మద్దతుగా నిలుస్తోంది. ఎవరూ అధైర్యపడాల్సిన పని లేదు. ఈ ప్రతికూల సమయంలో మనకు అండగా నిలిచిన ప్రపంచ దేశాల నేతలకు, ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని ప్రధాని మోదీ అన్నారు. -
‘మా నీరు మాకు కావాల్సిందే’.. సింధూ నదీ జలాల ఒప్పందంపై పాక్ ఆర్మీ చీఫ్
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్‌ను దెబ్బ కొడుతూ భారత్ తీసుకున్న నిర్ణయాల్లో సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేత ఒకటి. ఆ ఒప్పందంపై పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అసిమ్ మునీర్ స్పందించారు. సింధు జల ఒప్పందం (IWT) తన దేశానికి రెడ్ లైన్ అని అభివర్ణించారు. నీటి సమస్యపై ఇస్లామాబాద్ (పాక్ రాజధాని) ఎప్పటికీ రాజీపడదు’ అని ప్రకటించారు.పాకిస్తాన్లో జరిగిన వివిధ యూనివర్సిటీల వైస్ ఛాన్సిలర్లు, ప్రిన్సిపల్స్, సీనియర్ ఉపాధ్యాయులు, విద్యావేత్తలతో జరిగిన సమావేశంలో అసిమ్ మునీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మునీర్ మాట్లాడుతూ.. రెడ్‌లైన్ అనేది పాకిస్తాన్ నీరు. 24 కోట్ల పాకిస్తానీయుల కనీస హక్కు. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీపడబోమంటూ భారత్ సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేతపై గురించి ప్రస్తావించారు.గత నెల ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పాకిస్తాన్ ముష్కరులు అమాయకులైన టూరిస్టుల ప్రాణాలు తీశారు. ఈ దుర్ఘటనలో మొత్తం 25 మంది ప్రాణాలు కోల్పోయారు. అందుకు పాకిస్తాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాక్ ఆటకట్టించేందుకు ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టింది. ఏప్రిల్ 7న పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో పాక్ ఉగ్రవాదుల స్థావరాల్ని నేలమట్టం చేసింది. వందల మంది పాక్ ఉగ్రవాదుల్ని మట్టిలో కలిపింది. అదే సమయంలో భారత్- పాక్ మధ్య 1960లో సింధు నదీ జలాల పంపిణీ ఒప్పందాన్ని నిలిపివేసింది. దీంతో పాకిస్తాన్లో నీటి యుద్ధాలు మొదలయ్యాయి. తాగేందుకు,వ్యవసాయం చేసేందుకు, నిత్యవసరాలకు వినియోగించుకునేందుకు నీరు లేకపోవడంతో ఇబ్బంది పడుతున్నామంటూ పాక్ పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తూ తీసిన వీడియోలో సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వంపై అసమ్మతి మొదలైంది. ఆ అసమ్మతిని చల్లార్చేందుకు భారత్‌కు లేఖ రాసింది. తీవ్రంగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నానమని, సింధూ జలాల విషయంలో భారత్ తీసుకున్న నిర్ణయంలో పునసమీక్షించుకోవాలని ప్రాధేయపడింది. భారత్ మాత్రం సున్నితంగా తిరస్కరించింది. పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదానికి మద్దతు విరమించుకునే వరకు ఆంక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. -
ఆపరేషన్ సిందూర్ ఆగదు: ప్రధాని మోదీ
గాంగ్టక్/అలీపూర్‌ద్వార్: ఉగ్రవాదులకు, వారి వెనుక ఉన్న అసలైన కుట్రదారులకు తగిన గుణపాఠం నేర్పడానికి ప్రారంభించిన ఆపరేషన్ సిందూర్ ఆగదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తేల్చిచెప్పారు. ముష్కర మూకలను కోలుకోలేని రీతిలో దెబ్బకొట్టడం ఖాయమని అన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు. ప్రధాని మోదీ గురువారం సిక్కిం రాష్ట్ర 50వ అవతరణ దినోత్సవంలో వర్చువల్‌గా పాల్గొన్నారు. అనంతరం పశ్చిమ బెంగాల్, బిహార్‌లో పర్యటించారు. పలు మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో గత నెలలో జరిగిన ఉగ్రదాడి భారతీయ ఆత్మ, ఐక్యత, మానవత్వంపై జరిగిన దాడిగా ప్రధాని అభివర్ణించారు. ఈ దాడి పట్ల నిర్ణయాత్మకంగా స్పందించామని, ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదులకు తగిన రీతిలో గట్టిగా బుద్ధి చెప్పామని అన్నారు. పాకిస్తాన్ భూభాగంలో ముష్కరుల స్థావరాలు, మౌలిక సదుపాయాలు, వైమానిక కేంద్రాలను ధ్వంసం చేశామని చెప్పారు. ఉగ్రవాదంపై పోరాటంలో మనదేశం మొత్తం ఐక్యంగా ఉందని పునరుద్ఘాటించారు. దేశంలో మతపరంగా ప్రజల మధ్య చిచ్చు పెట్టాలన్న లక్ష్యంతోనే పహల్గాంలో కుట్రపూరితంగా పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేశారని ప్రధాని ఆరోపించారు. మన ఆడబిడ్డల సిందూరాన్ని తుడిచేస్తే చివరకు ఏం జరుగుతుందో చేసి చూపించామని స్పష్టంచేశారు. సిక్కిం రాష్ట్రం భారత్‌కు గర్వకారణమని అన్నారు. ఇక్కడి ప్రజలు ప్రజాస్వామ్యం పట్ల సంపూర్ణ విశ్వాసం చూపుతున్నారని ప్రశంసించారు. ప్రతికూల వాతావరణం కారణంగా ఈ వేడుకలకు తాను స్వయంగా హాజరు కాలేకపోవడం బాధగా ఉందన్నారు. సిక్కిం రాష్ట్రం ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తే లేదు ఉగ్రవాద ఉత్పత్తి కర్మాగారంగా మారిన పాకిస్తాన్ భూభాగంలోకి మూడుసార్లు ప్రవేశించి దాడులు చేశామని ప్రధాని మోదీ చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లోని అలీపూర్‌ద్వార్ జిల్లాలో రూ.1,010 కోట్ల విలువైన సిటీ గ్యాస్ పంపిణీ ప్రాజెక్టుకు ఆయన పునాదిరాయి వేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో ప్రసంగించారు. ఆపరేషన్ సిందూర్‌ను ప్రస్తావించారు. బెంగాలీ సంస్కృతికి సిందూర్‌తో భావోద్వేగ అనుబంధం ఉందన్నారు. దుర్గా పూజ సమయంలో ఇక్కడి మహిళలు ‘సిందూర్ ఖేలా’ వేడుక నిర్వహించుకుంటారని తెలిపారు.బెంగాల్లో రాక్షస పాలన పశ్చిమ బెంగాల్లో అరాచక పాలన సాగుతోందని ప్రధాని నరేంద్ర మోదీ నిప్పులు చెరిగారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో హింస, అవినీతి పెచ్చుమీరిపోయాయని మండిపడ్డారు. రాష్ట్రంలో రాక్షస ప్రభుత్వం రాజ్యమేలుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసలు ఇక్కడ చట్టబద్ధమైన పాలన ఉందా? అని ప్రశ్నించారు. బెంగాల్ ప్రజలు సంక్షోభాల్లో చిక్కుకున్నారని, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తంచేశారు. తృణమూల్ కాంగ్రెస్‌కు బెంగాల్ అభివృద్ధి పట్ల చిత్తశుద్ధి లేదని విమర్శించారు. బెంగాల్లో కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు కాకుండా మమతా బెనర్జీ సర్కారు అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు.పాట్నాలో మోదీ భారీ రోడ్ షో బెంగాల్ పర్యటన అనంతరం ప్రధాని మోదీ బిహార్ రాజధాని పాట్నాకు చేరుకున్నారు. పాట్నా ఎయిర్‌పోర్టులో నూతన టెర్మినల్ భవనాన్ని ప్రారంభించారు. అలాగే కొత్త సివిల్ ఎన్క్లేవ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. గురువారం సాయంత్రం పాట్నాలో భారీ రోడ్‌షోలో మోదీ పాల్గొన్నారు. ఎయిర్‌పోర్టు సమీపంలోని అరణ్య భవన్ నుంచి బీర్చంద్ పటేల్ మార్గ్‌లోని రాష్ట్ర బీజేపీ కార్యాలయం దాకా ఈ రోడ్‌షో జరిగింది. శుక్రవారం బిహార్, ఉత్తరప్రదేశ్‌లో పలు కార్యక్రమాల్లో ప్రధానమంత్రి పాల్గొంటారు. -
ప్రపంచం మొత్తం నేనెందుకు ఫేమసో తెలుసా.. పాక్ ర్యాలీలో ఉగ్రవాది
ఇస్లామాబాద్: మిని స్విట్జర్లాండ్‌గా పేర్కొందిన పహల్గాంలో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడి వెనుక మాస్టర్ మైండ్ లష్కరే తోయిబా కమాండర్ సయిఫుల్లా కసూరి హస్తం ఉన్నట్లు తేలింది. సైఫుల్లా కసూరి మరోవెరో కాదు లష్కరే తోయిబా చీఫ్,భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్ కొడుకే.పాకిస్తాన్ తన అణు పరీక్షల వార్షిక స్మారకోత్సమైన యూమ్-ఎ-తక్బీర్‌ను పురస్కరించుకుని పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ (PMML) నిర్వహించిన ఈ ర్యాలీలో రాజకీయ నాయకులే కాదు సయిఫుల్లా కసూరి, ఇతర మోస్ట్ వాంటెండ్ టెర్రరిస్టులు సైతం పాల్గొన్నారు.Lashkar-e-Taiba (LeT) chief Hafiz Saeed's son with Pak Punjab Assembly MLAs openly inciting violence against India.Does anyone need more proof that Pakistan is a rogue state ? pic.twitter.com/NCtLXJTtxd— Zubair Alvi (@Alvi_Zubair45) May 29, 2025పంజాబ్ ప్రావిన్స్‌లోని కసూర్‌లో జరిగిన ర్యాలీలో కసూరి మాట్లాడుతూ,‘పహల్గామ్ ఉగ్ర దాడి సూత్రదారి నేనేనని అందరూ నన్ను నిందిస్తున్నారు. ఇప్పుడు నా పేరు ప్రపంచం మొత్తం మార్మోగుతోంది’ అంటూ భారత్‌కు వ్యతిరేకంగా స్లోగన్లు వినిపించారు.ఈ ర్యాలీలో భారతదేశ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ జాబితాలో 32వ స్థానంలో ఉన్న తల్హా సయీద్ సైతం ఉన్నారు. నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. పహల్గాం ఉగ్రదాడిపై భారత్ ఆపరేషన్ సిందూర్‌తో పాక్‌ను చావుదెబ్బ తీసింది. పాకిస్తాన్లో ఉగ్రమూకలకు ట్రైనింగ్ ఇచ్చే సెంటర్లను భూస్తాపింతం జరిగింది. ఆపరేషన్ సిందూర్‌లో హతమైన హై-ప్రొఫైల్ ఉగ్రవాదుల్లో ముదస్సిర్ అహ్మద్ ఒకరు.తాజాగా, కసూర్ ర్యాలీలో మాట్లాడిన సైఫుల్లా కసూరి పంజాబ్ ప్రావిన్స్‌లోని అల్హాఅబాద్‌లో ఆస్పత్రులు, భవనాలు నిర్మిస్తామని చెప్పడం గమనార్హం. -
‘పహల్గామ్’ ఎఫెక్ట్: అక్రమ నివాసితుల ఏరివేత
న్యూఢిల్లీ: భారత్‌లో అక్రమంగా తలదాచుకుంటున్న విదేశీయులపై ప్రభుత్వం నిఘా మరింతగా పెంచింది. జమ్ముకశ్మీర్(Jammu and Kashmir)లోని పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన అనంతరం ఈ చర్యలను ముమ్మరం చేసింది. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వచ్చి భారత్‌లో నివాసం కొనసాగిస్తున్న వారిపై సంబంధిత అధికారులు ఓ కన్నేసి ఉంచారు. వీరి చర్యలను గమనిస్తూ, నిందితులుగా తేలినవారిపై కొరఢా ఝుళిపిస్తున్నారు.మరోవైపు బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి పరిస్థితుల్లో పలువులు బంగ్లాదేశీయులు అక్రమంగా భారత్‌కు తరలివచ్చి, ఇక్కడ తలదాచుకుంటున్నారు. గడచిన 6 నెలల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగా ఢిల్లీలో అక్రమంగా ఉంటున్న 770 మంది బంగ్లాదేశీయులను వారి దేశానికి తరలించారు. ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్ర దాడిలో 26 మంది మృతి చెందిన విషయం విదితమే. నాటి నుంచి ఇప్పటివరకూ పోలీసులు రాజధాని వ్యాప్తంగా నిర్వహించిన తనిఖీల్లో 470 మంది బంగ్లాదేశ్ వలసదారులను, మరో 50 విదేశీయులను గుర్తించారు, వారిలో బంగ్లాదేశకు చెందిన వారిని అగర్తలాకు విమానంలో తరలించి, భారత భూ సరిహద్దు ద్వారా బంగ్లాదేశ్‌కు పంపించారు.బంగ్లాదేశ్(Bangladesh) నుంచి అక్రమంగా వచ్చిన వలసదారులను, రోహింగ్యాలను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ధృవీకరణ ప్రక్రియ చేపట్టాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆదేశించిందని ఢిల్లీ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. 2024, నవంబర్ 15, 2025 ఏప్రిల్ 20 మధ్య కాలంలో 220 మంది అక్రమ వలసదారులను, 30 మంది గడువు దాటి దేశంలోనే ఉంటున్న విదేశీయులను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారని సమాచారం. కాగా ‘పహల్గామ్’ ఘటన తర్వాత కొంత అత్యవసర పరిస్థితి ఏర్పడిందని, వెరిఫికేషన్ డ్రైవ్‌లు నిర్వహించి, బంగ్లాదేశ్ వలసదారులను, రోహింగ్యాలను అదుపులోకి తీసుకోవాలని డిప్యూటీ కమిషనర్లకు ఆదేశాలు అందాయని పోలీసులు తెలిపారు. మరోవైపు బంగ్లాదేశ్, మయన్మార్ నుండి వచ్చిన అక్రమ వలసదారుల ఆధారాలను ధృవీకరించడానికి రాష్ట్రాలకు 30 రోజుల గడువు ఇచ్చారు. వారి పత్రాలు ధృవీకరణ పొందకపోతే వారిపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అక్రమ వలసదారుకు సౌకర్యాలు కల్పించి, వారు భారత్‌లో స్థిరపడటానికి ఏర్పాట్లు చేసిన వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్లు నమోదు చేశాయి.ఇది కూడా చదవండి: పాక్‌కు దమ్ము లేదు.. అందుకే ఉగ్రవాదులను పంపుతోంది: ప్రధాని మోదీ -
పెరుగుతున్న చైనా ప్రాబల్యం
పహల్గామ్లో ఉగ్రదాడిపై భారత్ స్పందించిన తీరు, తదనంతర పరిణా మాలు ప్రాంతీయ భౌగోళిక రాజకీయాల్లో మౌలికంగా తీసుకొచ్చిన మార్పులేమీ లేకపోవచ్చు. కానీ, దక్షిణాసియాలో రూపు దిద్దుకుంటున్న ప్రాబల్య సమతూకానికి సంబంధించి అవి కొన్ని ముఖ్యమైన దృక్కోణాలను బయటపెట్టాయి. ఈసారి భారత్–పాకిస్తాన్ల మధ్య నెలకొన్న తాజా సైనిక ప్రతిష్టంభన మునుపటి దృష్టాంతాలకు భిన్నమైంది. భారత్ –పాక్‌ల మధ్య సైనిక ఘర్షణ పరస్పరం అణ్వాయుధాలను ప్రయో గించుకోగల స్థితికి చేరుతోందని అమెరికా పొరపడింది. ఘర్షణ తీవ్ర రూపం దాల్చకుండా రెండు దేశాల నాయకులకూ రాత్రికి రాత్రి అమె రికా ఫోన్లు చేసి ఉండవచ్చు. కానీ, ఒకటి మాత్రం స్పష్టం. ఇది ప్రాంతీయ ఆధిపత్య సమతూకపు స్థితిగతులను మార్చి వేసింది. సూటిగా చెప్పాలంటే, దక్షిణాసియాను అత్యంత ప్రభావితం చేయగలి గిన శక్తిగా అమెరికా స్థానాన్ని చైనా ఆక్రమించిందని చెప్పడం సబబు.ఇండియాకు గట్టి మద్దతివ్వని రష్యాప్రపంచవ్యాప్తంగా అత్యంత బలమైన సైనిక శక్తిగా అమెరికా ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ, భౌగోళిక రాజకీయాలను ప్రభా వితం చేయగల అవకాశం సదరు దేశపు శక్తితోపాటు అభిమతంపైన కూడా ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం ఈ ప్రాంతానికి సంబంధించి స్పష్టమైన వ్యూహాత్మక ప్రయోజనం అమెరికాకు కొరవడినట్లుగా కని పిస్తోంది. ఫలితంగా, ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని శాసించగల శక్తిగా ఉన్న అమెరికా ఇపుడు నామమాత్రపు పాత్రధారి స్థాయికి కుంచించుకుపోయింది. అటూఇటూగా వాషింగ్టన్ స్థానాన్ని బీజింగ్ ఆక్ర మించింది. ఆర్థికంగా బలమైన దేశంగా ఉన్న చైనా దౌత్యపరమైన యుక్తిని ప్రదర్శిస్తూ ఆయుధాల సరఫరాదారుగా, మధ్యవర్తిగా ఈ ప్రాంతపు పరిణామాలను నిర్దేశించగల స్థితిలో ఉంది. ప్రాంతీయ సైనిక ఘర్షణలు, దౌత్యపరమైన ప్రతిష్టంభనలు, రాజకీయ వాద వివాదాలకు తీర్పరిగా వ్యవహరించాలని చైనా కోరు కుంటోంది. ఇటీవల పాక్‌కు అందించినట్లుగానే హైటెక్ ఆయుధాల సరఫరా ద్వారా, లేదా దౌత్యపరంగా ప్రత్యక్షంగా జోక్యం చేసు కోవడం, ఆర్థికపరమైన ఒత్తిడిని తీసుకురావడంతో అది ఆ యా పను లను చక్కబెట్టాలని భావిస్తోంది. దక్షిణాసియా, ఇండో–పసిఫిక్‌లో పెరుగుతున్న చైనా ప్రాబల్యం ఇప్పటికే కనిపిస్తోంది. కానీ, అది సైనికపరంగా వత్తాసు ఇస్తానని పాక్‌కు చెప్పడం, తాజా భారత–పాక్ ఘర్షణలో ప్రధానాంశం.అలాగే, భారతదేశానికి వ్యూహాత్మక భాగస్వామిగా అండగా నిలవడంలో రష్యా సామర్థ్యం తగ్గిన సంగతిని గమనించవలసిఉంది. ఇటీవలి ప్రతిష్టంభనలో రష్యా వైఖరి సాధారణంగా ఇతర దేశాలు చూపే మాదిరిగానే ఉంది. అది భారతదేశానికి బాహాటంగా మద్దతు ప్రకటించలేదు. పాకిస్తాన్ పేరును నేరుగా ప్రస్తావించలేదు సరికదా, భారత సైనిక చర్యలకు ఆమోదం కూడా తెలుపలేదు. ‘‘ఉగ్రవాద చర్యలను రష్యా తీవ్రంగా ఖండిస్తోంది. అవి ఏ రూపంలో వ్యక్తమైనా వ్యతిరేకిస్తోంది. ఈ రాక్షసత్వంపై సమర్థంగా పోరాడటా నికి మొత్తం ప్రపంచ దేశాలన్నీ ఏకోన్ముఖంగా ప్రయత్నాలు సాగించవలసిన అవసరం ఉందని భావిస్తోంది’’ అని రష్యా విదేశీ వ్యవ హారాల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఘర్షణలు మరింత ముదరకుండా సంయమనం పాటించవలసిందని రష్యా రెండు పక్షాలనూ కోరింది. ఒక రకంగా, రష్యా–ఉక్రెయిన్ల మధ్య ఘర్షణ సందర్భంలో భారత్ ఏం చెప్పిందో, భారత్–పాక్ ఘర్షణపై రష్యా అదే చెప్పింది. రష్యా–పాశ్చాత్య దేశాల మధ్య భారత్ సమతూకం పాటించినట్లు గానే, భారత్–చైనాల మధ్య సమతూకం పాటించేందుకు రష్యా ప్రయత్నించింది. దక్షిణాసియాలో రష్యాకున్న ప్రయోజనాలు పరిమితమే కావచ్చు. కానీ, ఇస్లామాబాద్‌తో బీజింగ్ అంటకాగుతోంది. బీజింగ్‌తో సన్నిహితంగా మెలిగే మాస్కో, తీరా చైనా ప్రయోజనాలు పణంగా ఉన్నపుడు భారతదేశానికి వీలైనంత తక్కువ సహాయాన్నే అందిస్తుంది. దానర్థం – భారత్ ప్రాంతీయ ప్రయోజనాలకు భంగం కలిగించాలని రష్యా కోరుకుంటోందని కాదు. చైనా ప్రయోజనాలను తక్కువ చేసేదిగా కనబడటం రష్యాకు ఇష్టం లేదు. ఏమైతేనేం, అది పాకిస్తాన్‌కే ప్రయోజనకారి అవుతుంది. రష్యాతో ఉన్న దోస్తీని ఉపయోగించుకుని చైనా నడవడికలో మార్పు తేగలమని మనం ఒకప్పుడు అనుకున్న రోజులున్నాయి. బహుశా ఇప్పుడు భారత దేశంతో రష్యాకున్న మైత్రిని నిగ్రహించగల శక్తి తనకుందని చైనా చాటుకోవడాన్ని మనం చూస్తున్నాం. రష్యా పట్ల భారత ఆసక్తి సన్నగిల్లుతున్నట్లుగానే, భారత్ పట్ల రష్యా ఆసక్తి కూడా రంగు, రుచి కోల్పోతోంది. ఇది మనం అంగీకరించక తప్పని వాస్తవం. క్షీణిస్తున్న ఈ స్నేహ బంధాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు ఉన్న మార్గాలను మనం గుర్తించవలసి ఉంది. ఒంటరిగానే పోరాడగలగాలి!ఇక భారతదేశానికున్న బాహ్య సమతూక (అంటే ఇతర దేశాలతో చెప్పించడం లేదా వాటిని పావులుగా వాడుకునేందుకు ఉన్న) అవకాశాలు అంతర్నిహితంగా పరిమితంగానే ఉండటం ఇటీ వలి ప్రతిష్టంభనలో వెలుగు చూసిన మరో గణనీయమైన అంశం. దక్షిణాసియాలో అణు యుద్ధం సంభవించవచ్చనే (అటువంటి అవకాశం లేశ మాత్రంగానే ఉన్నప్పటికీ) భయాలు అంతర్జాతీయంగా భారతదేశంతో స్నేహంగా మెలిగే చాలా దేశాలకున్నాయి. ఘర్షణలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని మనం ఉక్రెయిన్ విషయంలో చెబుతూ వస్తున్నాం. పాశ్చాత్య దేశాలు ఇప్పుడు అదే పల్లవి అందుకుంటున్నాయి. ఇతరుల సంక్షోభ సమయాల్లో మనం ఎలా వ్యవహరిస్తామో వారూ మన పట్ల అలానే వ్యవహరిస్తారని ఇటీవలి పరిణామాలు వెల్లడిస్తున్నాయి. ఎటువంటి సైనిక కూటమిలోనూ చేరకూడదని మనం ఉద్దేశపూర్వకంగానే నిర్ణయించుకుని ఉండవచ్చు. బహుశా, అది సక్రమమైన నిర్ణయమే కావచ్చు కూడా! కానీ, దాని పర్యవసానాలను కూడా మనం దృష్టిలో ఉంచుకోవాలి. మన యుద్ధాలను మనమే చేయాలి. అందుకు అనుసరించవలసిన విధానం స్పష్టమవుతూనే ఉంది. జాతీయ భద్రత సన్నద్ధతకు గణనీయమైన మొత్తాలను వెచ్చించడం ద్వారా మనం మొదట అంతర్గత సమతూకానికి ప్రయత్నించాలి. ప్రైవేటు సంస్థలు రక్షణ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు మరింత ప్రోత్సాహం, అనువైన వాతావరణం అవసరం. స్థానిక, అంతర్జాతీయ భాగస్వాముల ద్వారా రక్షణ సామగ్రిని ఉత్పత్తి చేసుకోవాలి.ఉగ్రవాదంపై మనం స్పందించే తీరు ఇకపై ఇదే మాదిరిగా ఉండబోతోందని లిఖితపూర్వకంగా కాకపోయినా ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేసింది కనుక, ఆపరేషన్ సిందూర్‌ను వివిధ కోణాల నుంచి నిష్పక్షపాతంగా మదింపు చేసేందుకు ఒక ఉన్నత స్థాయి కర్తవ్య నిర్వహణ బృందాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. భవిష్యత్తులో పాటించవలసిన రక్షణ సన్నద్ధత, నిఘా, వ్యూహ్మాతక కమ్యూనికేషన్లు, ఇతర కీలక అంశాలపై ఈ బృందం అవసరమైన చర్యలను సూచిస్తుంది. ఇటీవలి పరిణామాలను నిష్పాక్షికంగా పరిశీ లించి, భవిష్యత్తుకు వ్యూహాత్మక దిశా నిర్దేశాలు చేసేందుకు కార్గిల్ సమీక్షా కమిటీ తరహాలో పహల్గామ్ సమీక్షా కమిటీని ఏర్పాటు చేసేందుకు సమయం ఆసన్నమైంది. చివరగా, ఇంత తీవ్రతతో కూడిన ఈ తరహా సైనిక ప్రతిష్టంభనలు దేశపు విశాల వ్యూహాత్మక లక్ష్యాలను కూడా పక్కనపెట్టేవిధంగా మన దృష్టిని మళ్ళించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. నేటి భారతదేశం దక్షిణాసియాకు మాత్రమే పరిమితమై ఉండలేదు. కేవలం పాక్ పైనే మన దృష్టినంతటినీ నిలిపి ఉండలేం. ఇప్పటికే పరిమితంగా ఉన్న రాజకీయ, దౌత్య, సైనిక వనరులను ఇతర విశాల లక్ష్యాల వైపు మళ్ళించడానికి లేకుండా సతమతమవుతున్నాం. పాక్‌నే బూచిగా చూస్తూ కూర్చుంటే ఆ సామర్థ్యాలు మరింత పరిమిత మవుతాయి. పాక్ నుంచి తరచూ ఎదురుకాగల ఉద్రిక్తతల వలయంలో చిక్కుకుపోకుండా నిలవడమే భారత్ ముందున్న అతి పెద్ద వ్యూహాత్మక సవాల్!హ్యాపీమాన్ జాకబ్ వ్యాసకర్త జేఎన్‌యూలో ఇండియా విదేశాంగ విధాన బోధకులు (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు తెలిసి..కన్నీళ్లు ఆగలేదు!
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీగా భారత్ మే7న ఆపరేషన్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. భారత్ ఉగ్రవాదాన్ని మట్టుబెట్టడమే లక్ష్యంగా చేపట్టిన ఈ ఆపరేషన్ గురించి విని పహల్గాం బాధితులు హర్షం వ్యక్తం చేశారు. ఒక్కొక్కరూ ఒక్కో రీతీగా భారత ప్రధాని నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలియజేశారు. తాజాగా ఆ పహల్గాం ఉగ్రదాడి నుంచి త్రుటిలో తప్పించుకున్న భారత సంతతి సింగపూర్ మహిళ వైశాలి భట్ మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈమేరకు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశ సందేశాన్ని తీసుకెళ్తున్న ప్రతినిధి బృందంతో సింగపూర్‌లో ఉన్న బీజేపీ ఎంపీ హేమాంగ్ జోషితో జరిగిన సంభాషణలో..ఇలా మోదీకి కృతజ్ఞతలు తెలిపారు వైశాలి భట్. నాటి సంఘటనను గుర్తు చేసుకుంటూ..ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి గంటన్నర ముందు తన భర్తతో కలిసి బైసారన్ లోయ నుంచి బయలదేరామని చెప్పారు. ఆ తర్వాత ఆ భయంకరమైన ఉగ్రదాడి గురించి వార్తల్లో విని భయాందోళనలకు లోనైనట్లు తెలిపారు. తాము తృటిలో ఆ దాడి నుంచి తప్పించుకున్నామని తెలిసి..వొళ్లు గగుర్పొడించిందన్నారు. అయితే తాము ఈ ఉగ్రదాడిపై తక్షణమే భారత ప్రభుత్వం చర్ తీసుకుంటుందని ఆశించా..కానీ రోజుల గడిచేకొద్ది నిరాశ వచ్చేసిందని చెప్పారు. కానీ మే7న భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టినట్లు విన్నానో..వెంటనే కళ్ల వెంబడి నీళ్లు వచ్చేశాయన్నారు. అస్సలు ఎంతలా కంట్రోల్ చేసుకుందామన్నా ఆగలేదంటూ భావోద్వేగంగా మాట్లాడారు. నాటి భయంకరమై ఉగ్రదాడిలో తమ ప్రియమైన వారిని కోల్పోయిన ఎన్నో కుటుంబాల ఆక్రందనే ఈ ఆపరేషన్ సిందూర్ అని అన్నారామె. పైగా దీనికి సిందూర్ అని పేరు పెట్టడం సముచితంగా ఉంది. మహిళ నుదిట కుంకుమన చెరిపేసి వికృత ఆనందం పొందిని ఉగ్రవాదులపై ఉక్కుపాదంలా ఈ ఆపరేషన్ సిందూర్ ప్రతిధ్వనించిందని చెప్పారామె. నాటి ఘటనలో పురుషులను మాత్రమే చంపి వారి భార్యలను వితంతువులుగా మార్చినందుకు గానూ భారత ప్రభుత్వం సిందూర్ పేరుతోనే ఈ ఆపరేషన్ని చేపట్టడం ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాముఖ్యతను సంతరించుకుందని అన్నారు వైశాలి భట్. కాగా, ఏప్రిల్ 22న పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకులను బలిగొన్న ఉగ్రదాడికి ప్రతిగా ఆపరేషన్ సిందూర్ పేరుతో.. భారత త్రివిధ దళాలు ఉగ్రమూకల్ని, వారి మౌలిక సదుపాయల్ని, స్థావరాలని మట్టుబెట్టింది.(చదవండి: రేపు పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో భారత్ మాక్ డ్రిల్) -
రేపు పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో భారత్ మాక్ డ్రిల్
సాక్షి,ఢిల్లీ: ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ మరోసారి కవ్వింపు చర్యలకు పాల్పడింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారీ ఎత్తున పాకిస్తాన్ తన సైన్యాన్ని భారీ ఎత్తున మొహరించింది. దీంతో భారత్ అప్రమత్తమైంది. రేపు (మే29న) పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో భారత్ మాక్ డ్రిల్ నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూలో మాక్ డ్రిల్‌ను నిర్వహించనుంది. అయితే, మాక్ డ్రిల్ జరిగే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇప్పటికే మాక్ డ్రిల్ నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లను పూర్తి చేసింది. The grand welcome for the #PakistanArmy in Pakistan Occupied Jammu & Kashmir. pic.twitter.com/znELGTYUN7— Lt Col Vikas Gurjar 🇮🇳 (@Ltcolonelvikas) May 27, 2025 ఇదే తరహా మాక్ డ్రిల్ ఈ నెల ప్రారంభంలో జరిగింది. ఏప్రిల్ 22న మినీ స్విట్జర్లాండ్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్ మే 6, 7 తేదీల మధ్య పాక్‌పై భారత్ ఆపరేషన్ సిందూర్‌ను నిర్వహించింది. BIG BREAKING NEWS 🚨 India to conduct mock drills tomorrow in 4 states, UT.Mock drills will be conducted in Gujarat, Rajasthan, Punjab, and Jammu and Kashmir tomorrow.The drills will be held in districts bordering Pakistan.This comes weeks after India launched ‘Operation… pic.twitter.com/GbWJkDB1nr— Times Algebra (@TimesAlgebraIND) May 28, 2025 భారత్ ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించడానికి కొన్ని గంటల ముందు, మే 7న హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MHA) దేశవ్యాప్తంగా ఆపరేషన్ అభ్యాస్ పేరుతో మాక్ డ్రిల్‌ను నిర్వహించించింది. ఆపరేషన్ అభ్యాస్ కొన్ని వారాల తర్వాత ఈ గురువారం పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో మరోసారి కేంద్రం మాక్ డ్రిల్ నిర్వహించనుంది. కాగా, భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరడంతో కేంద్ర హోంశాఖ సంక్షోభ సమయంలో పౌరులు ప్రాణాలు ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించడమే మాక్ డ్రిల్ ఉద్దేశం. ఇటీవల పాకిస్తాన్‌పై భారత్ చేపట్టిన మిలటరీ ఆపరేషన్ ఆపరేషన్ సిందూర్ ముందు కంటే 1971లో పాకిస్తాన్‌తో పోరాడాల్సి రావడం, అంతకుముందు 1962,1965 యుద్ధ సమయంలో మాక్ డ్రిల్ జరిగింది. మళ్లీ దాదాపూ 50ఏళ్ల తర్వాత పౌరుల భద్రత దృష్ట్యా కేంద్రం ఆపరేషన్ సిందూర్‌కు ముందు మాక్ డ్రిల్స్ చేపట్టింది. -
‘వహ్ సీఎం సాబ్’.. పహల్గాంలో కేబినెట్ భేటీ
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అరుదైన పని చేశారు. ఉగ్రవాదంతో దెబ్బ తిన్న పహల్గాం పట్టణ పర్యాటకాన్ని పునరుద్ధరించే చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో.. ఏకంగా పహల్గాంలోనే మంగళవారం ప్రత్యేక కేబినెట్ భేటీ (Pahalgam Cabinet Meeting) నిర్వహించి దేశానికి బలమైన సందేశం పంపించారు.అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం పట్టణంలోని బైసరన్ లోయ(Baisaran Valley)లో ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నా సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు చెలరేగిపోయారు. ఈ ఘటనలో 26 మంది టూరిస్టులు దుర్మరణం పాలయ్యారు. అయితే.. ఈ దాడి ప్రభావం జమ్ము కశ్మీర్ పర్యాటకంపై తీవ్రంగా పడింది. ఘటన జరిగిన సాయంత్రం నుంచే పర్యాటకులు తిరుగు ముఖం పట్టడం ప్రముఖంగా చర్చనీయాంశమైంది. ఆ సమయంలో సీఎం ఒమర్ అబ్దుల్లా(CM Omar Abdullah) సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పర్యాటకుల భద్రతకు అక్కడి ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ.. తాకిడి మాత్రం పెద్దగా ఉండడం లేదు. దీంతో పర్యాటకాన్నే నమ్ముకున్న వేల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి.ఈ నేపథ్యంలో.. పర్యాటకులను ఆహ్వానిస్తూ ఇవాళ ఆయన పహల్గాంలోనే కేబినెట్ భేటీ నిర్వహించారు. ‘‘ఉగ్రదాడి తర్వాత పహల్గాం ప్రజలు ధైర్యంగా ఉన్నారు. వాళ్లను అభినందించడానికే ఈ సమావేశం. ప్రభుత్వంలో ఉన్నామని ఏదో మొక్కుబడిగా ఇక్కడికి మేం రాలేదు. ఉగ్రవాదుల పిరికి పంద చర్యలకు.. కశ్మీర్ పర్యాటకం, అభివృద్ధి రెండూ ఆగిపోవని చెప్పడానికే వచ్చాం’’ అని అన్నారాయన. అంతకు ముందు.. పహల్గాంలోని టూరిస్టు ప్రాంతాల్లో ఆయన తిరిగారు. ఆ ఫొటోలు వైరల్‌కాగా.. వహ్ సీఎం సాబ్ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.ఇదీ చదవండి: సారీ మేడమ్.. ఏదో ఏమోషన్లో అనేశా! -
కశ్మీరీలతో ఇలాగేనా వ్యవహరించేది?
మనలో చాలా మందికి పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి, ఆపరేషన్ సిందూర్, 4 రోజుల ‘యుద్ధం’ గురించి ఎక్కువగానే తెలుసు. తెలుసుకోవడం మనం ఒక పనిగా పెట్టుకున్నాం. కానీ ఈ కాలంలో జరిగిన ఇతర వాస్తవాలు చాలా బాధ కలిగిస్తున్నాయి. ఏప్రిల్ 27, మే 8 మధ్య భారతదేశ వ్యాప్తంగా వివిధ రకాలుగా 184 ముస్లిం వ్యతిరేక దాడులు జరిగాయని పౌర హక్కుల రక్షణ సంఘం నివేదించింది. వాటిలో 19 విధ్వంసక చర్యలు, 39 దాడులు, 42 వేధింపుల సంఘటనలు, 84 ద్వేషపూరిత ప్రసంగ సంఘటనలు ఉన్నాయి. వీటిలో 106 దాడులు పహల్గామ్ ద్వారా ‘ప్రేరేపితం’ అని అంచనా. వీటిలో ఎక్కువ భాగం ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలలో జరిగాయి.కశ్మీరీలను, ఇతర ముస్లింలను లక్ష్యంగా చేసుకోవడం సర్వసాధారణం కాబట్టి ఈ వాస్తవాలు మనకు తెలియలేదా? అవి మన అసహనం, నిరాశ, కోపానికి బాక్సింగ్ బ్యాగులుగా మారాయా? పత్రికలు వాటిని ఎందుకు నివేదించవు? వాటి గురించి తెలుసు కోవడానికి మనం ఎందుకు ప్రయత్నించడం లేదు?కశ్మీర్లో ఏమి జరిగిందో పరిశీలించండి. కేవలం అనుమానం ఆధారంగా, ఎటువంటి ప్రక్రియా లేకుండా, బుల్డోజర్ న్యాయంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ఉల్లంఘించి, ఉగ్రవాదులుగా చెప్పబడుతున్న వారి ఇళ్లను కూల్చివేశారు. చట్ట పాలనను అనుసరించే ప్రజాస్వామ్య దేశంగా భారతదేశం తనను తాను చెప్పు కోవడాన్ని ఇది అపహాస్యం చేయడం లేదా?అంతే కాదు. బహుశా 2,000 మందిని అనుమానంతో అరెస్టు చేశారు. పాశ్చాత్య పత్రికలు వారిలో అనేక మందిని హింసించారని నివేదించాయి. ముగ్గురు మరణించినట్లు తెలుస్తోంది. ఇది కశ్మీరీలు, ముస్లింలు అనే కారణంగా కశ్మీరీ ముస్లింల పట్ల అనుమానాస్పద దృక్పథంతో వ్యవహరించడమేనని అనిపించడం లేదా?కశ్మీరీలు ఎలా స్పందించారు?ఇప్పుడు, కశ్మీరీలు పహల్గామ్ ఘటన పట్ల ఎలా స్పందించారో పోల్చి చూద్దాం. హోటల్ బుకింగ్‌లు లేని వారికి పడకలు అందించ డానికి మతాధికారులు మసీదులను తెరిచారు. విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల నుండి ఛార్జీలు వసూలు చేయడానికి ట్యాక్సీ డ్రైవర్లు నిరాకరించారు. బాధితుల పట్ల సానుభూతి వ్యక్తం చేయడా నికి దుకాణాలు, హోటళ్ళు, కళాశాలలు, పాఠశాలలు మూసివేయడంతో పూర్తి హర్తాళ్ జరిగింది. అధికారంలో ఉన్నా, లేదా ప్రతిపక్షంలో ఉన్నా అన్ని రాజకీయ పార్టీలూ ఉగ్రవాదులను ఖండిస్తూ ర్యాలీలు నిర్వహించాయి. దీని గురించి మనకు వివరంగా తెలియాలి కానీ మనకు తెలియలేదు. లేదా దీని గురించి చాలా తక్కువగా చెప్పడం జరిగింది. ఎందుకు? కచ్చితంగా కశ్మీర్ నుండి మనం వినాలనుకున్న, వినవలసిన సందేశం ఇది కాదా?లోయలోని కశ్మీరీల ప్రవర్తనకు పూర్తి విరుద్ధంగా, భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలలో కశ్మీరీలను ఎలా చూశారో పరిశీలిద్దాం. పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో కశ్మీరీ విద్యార్థులను కొట్టారు. వారు తమ ప్రాణాలు కాపాడుకోవడం కోసం పారిపోవలసి వచ్చింది. ముస్సోరీలో, దశాబ్దాలుగా అక్కడ పనిచేస్తున్న‘షాల్ వాలాస్’ బల వంతంగా ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళవలసి వచ్చింది. అయినప్పటికీ ఈ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు వారిని ఏమాత్రం పట్టించుకోకుండా కనిపించాయి. మళ్ళీ ప్రశ్నిస్తున్నాను... ఎందుకు? వీరు మీలాగే, నాలాగే హక్కులతో కూడిన భారత పౌరులు కాదా?బహుశా, అన్నింటికంటే ఘోరంగా, అధికార స్థానాల్లో ఉన్నవారు కశ్మీరీలనూ, ముస్లింలనూ రక్షించడానికి బదులుగా దాడి చేయడాన్ని ఎంచుకున్నారు. ‘కశ్మీర్లో జరిగిన దాడి హిందువులపై జరిగిన దాడి. మేము కూడా అదే విధంగా స్పందిస్తాం. కశ్మీరీలపై మాత్రమే కాదు, భారతదేశంలోని ప్రతి ముస్లింపైనా’ అని హిందూ సేన అధ్యక్షుడు విష్ణు గుప్తా వ్యాఖ్యానించారు. మధ్యప్రదేశ్ గిరిజన వ్యవహారాల మంత్రి విజయ్ షా, కల్నల్ సోఫియా ఖురేషీని ‘ఉగ్రవాదుల సోదరి’ అన్నారు. అయినా వీరంతా తప్పించుకున్నారు. వారిని ఏ రకంగానూ హెచ్చరించలేదు. వారిని కచ్చితంగా శిక్షించలేదు.ఇప్పుడు నేను రాసిన దాని గురించి ఆలోచించండి. ముస్లింలపై ప్రధానంగా దాడులు జరిగిన రాష్ట్రాలు ఏవి? అక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఏవి? ఏ పార్టీ సభ్యులు లేదా సైద్ధాంతిక మద్దతుదారులు అలా వ్యవహరించారో మీకే తెలుస్తుంది.అదేమీ రహస్యం కాదు. నిజానికి, ఇది కొట్టొచ్చినట్టుగా కనబడుతోంది.ఇదీ నాగరిక పద్ధతి!దేశ విభజన తర్వాత హత్యలు తారస్థాయికి చేరుకున్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ 1947 అక్టోబర్ 15న రాష్ట్ర ముఖ్యమంత్రులకు రాసిన లేఖ నుండి నన్ను ఉటంకించనివ్వండి: ‘మన దగ్గర ముస్లిం మైనారిటీ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారు కోరుకున్నా, వేరే చోటికి వెళ్లలేరు. వారు భారతదేశంలోనే నివసించాలి’. తరువాత స్పష్టంగా ఇలా జోడించారు: ‘పాకిస్తాన్ నుండి ఏదైనా రెచ్చగొట్టడం జరిగినా... మనం ఈ మైనారిటీతో నాగరిక పద్ధతిలో వ్యవహరించాలి.’ఆ సలహా 80 సంవత్సరాల క్రితం ఉన్నంత సందర్భోచితంగానే ఇప్పుడు కూడా లేదా? మిస్టర్ మోదీ నుండి మనం వినవలసిన సందేశం ఇది కాదా? పైగా ప్రధానమంత్రి మౌనం వ్యూహాత్మక ప్రతిస్పందన అని చాలామంది విశ్వసిస్తున్నట్లయితే మనం ఎలాంటి దేశంగా మారాం?కరణ్ థాపర్ వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్ -
సంచలన నివేదిక, భారత్ టార్గెట్‌గా.. అణ్వాయుధాలను అప్డేట్ చేస్తున్న పాక్
వాషింగ్టన్: ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్ పహల్గాంలో పర్యటకులపై జరిగిన ఉగ్రదాడికి, ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన నేపథ్యంలో అమెరికా డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (డీఐఏ) సంచలన నివేదికను విడుదల చేసింది. భారత్ తన అస్తిత్వానికి పాక్ ముప్పుగా భావిస్తుందని, అందుకే దాయాది దేశం తన అణ్వాయుధాలను ఆధునీకరిస్తుందనేది డీఐఏ నివేదిక సారాంశం. 2025 worldwide threat assessment report పేరుతో డీఐఏ రిపోర్టును విడుదల చేసింది. అందులో భారత్‌ను ఇప్పటికీ పాక్ తన అస్తిత్వానికి ముప్పుగా పరిగణిస్తున్నట్లు తెలిపింది. భారత సైనిక శక్తిని దృష్టిలో ఉంచుకొని.. అణ్వాయుధాల అభివృద్ధి సహా సైనిక ఆధునీకరణ ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇందులో భాగంగా పాక్ విదేశీ సరఫరాదారుల, మధ్యవర్తుల ద్వారా భారీ విధ్వంసాలను సృష్టించే పదార్థాలను weapons of mass destruction (WMDs) సంపాదిస్తుందని, ఆ అణు పదార్ధాలతో పాటు, అందుకు కావాల్సిన సాంకేతికతను చైనా నుండి పొందుతుందని తెలిపింది. వీటి ట్రాన్స్ఫర్ హాంకాంగ్, సింగపూర్, టర్కీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాల ద్వారా జరుగుతోందని హైలెట్ చేసింది. భారత్‌పై అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక డీఏఐ తన నివేదికలో పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్.. పాక్‌లోని ఉగ్రస్థావరాలపై క్షిపణులతో దాడిచేసింది. మే 7 నుండి 10 వరకు రెండు దేశాలూ క్షిపణులు, డ్రోన్లు, ఇతర ఆయుధాలతో పరస్పర దాడులకు పాల్పడ్డాయి. మే 10 నాటికి రెండు సైనిక బలగాలు పూర్తి కాల్పుల విరమణపై అంగీకరించాయి’ అని డీఐఏ తన నివేదికలు తెలిపింది. -
పాకిస్తాన్‌కు అసదుద్దీన్ ఒవైసీ స్ట్రాంగ్ వార్నింగ్
మనామా: దాయాది దేశం పాకిస్తాన్‌పై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ ఓ విఫల దేశమని ఘాటు విమర్శలు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదం కారణంగా ప్రపంచమే ముప్పును ఎదుర్కొంటోందన్నారు. ఇదే సమయంలో భారత ప్రభుత్వం.. ప్రతీ భారతీయుడి ప్రాణాలను రక్షించడానికి అన్న చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.ఒడిశా బీజేపీ ఎంపీ బైజయంత్ పాండా నేతృత్వంలో వచ్చిన ఏడుగురు సభ్యుల అఖిల బృందం శనివారం బహ్రెయిన్‌కు చేరుకుంది. ఈ బృందంలో హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కూడా ఉన్నారు. ఈ సందర్బంగా బహ్రెయిన్‌లో ఎంపీ అసద్ మాట్లాడుతూ.. ‘చాలా సంవత్సరాలుగా భారత్ ఎదుర్కొంటున్న ముప్పును ప్రపంచానికి తెలియజేసేలా మా ప్రభుత్వం మమ్మల్ని ఇక్కడికి పంపింది. దురదృష్టవశాత్తు పాకిస్తాన్ కారణంగా మేము చాలా మంది అమాయకుల ప్రాణాలను కోల్పోయాం. పాకిస్తాన్ ఉగ్రవాద గ్రూపులను ప్రోత్సహించడం, వారికి సహాయం చేయడం, స్పాన్సర్ చేస్తోంది. ఇలాంటి కార్యక్రమాలను పాకిస్తాన్ ఆపకపోతే ఉగ్రవాద సమస్య తొలగిపోదు.ప్రతీ భారతీయుడి ప్రాణాలను రక్షించడానికి మా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. ఒకవేళ పాకిస్తాన్ ఏదైనా దుస్సాహసానికి పాల్పడితే భారత్ మరింత దూకుడుగా వ్యవహరించేందుకు, మర్నిని దాడులు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఈసారి ప్రతిదాడి మామూలుగా ఉండదు. పాకిస్తాన్‌కు సరైన బుద్ధి చెబుతాం. ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయంతో ముందుకు వెళ్తోంది. పాకిస్తాన్ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నప్పటకీ భారత్ సంయమనం పాటించింది. పహల్గాంలో జరిగిన ఉగ్రవాది విషయమై అందరూ ఆలోచించండి. ఆరు రోజుల క్రితం వివాహం చేసుకున్న ఒక మహిళ ఏడో రోజున వితంతువు అయ్యింది. కేవలం రెండు నెలల క్రితం వివాహం చేసుకున్న మరో మహిళ కూడా ఈ దాడిలో తన భర్తను కోల్పోయింది. ఇలాంటి దారుణాలు పాకిస్తాన్ వల్లే జరుగుతున్నాయి.మేమంగా వేరువేరు రాజకీయ పార్టీలకు చెందినప్పటికీ దేశం విషయంలో ఏకాభిప్రాయంతో ఉన్నాం. రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ.. దేశ సమగ్రత విషయానికి వస్తే అందరం ఒక్కటయ్యాం. పాకిస్తాన్‌ను FATF గ్రే లిస్ట్‌లోకి తీసుకురావడంలో బహ్రెయిన్ ప్రభుత్వం మాకు సహాయం చేస్తుందని నేను ఆశిస్తున్నాను. అంటూ చెప్పుకొచ్చారు.#WATCH | Manama, Bahrain: During an interaction with the prominent personalities, AIMIM MP Asaduddin Owaisi says, "...Our govt has sent us over here...so that the world knows the threat India has been facing since last so many years. Unfortunately, we have lost so many innocent… pic.twitter.com/ckukFxpGAc— ANI (@ANI) May 24, 2025ఇదిలా ఉండగా.. రాజకీయంగా భిన్నమైన అభిప్రాయాలను కలిగిన ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ, బీజేపీ నేత నిశికాంత్ దూబేలు ఒక అంశంలో కలిసి పనిచేయాల్సి రావడం ప్రాధాన్యాన్ని సంతరించకుంది. భిన్న ధ్రువాలుగా ఉండే ఈ ఎంపీలు పాకిస్తాన్ ఉగ్రవాద ఉన్మాదాన్ని ఎండగట్టేందుకు పాక్ దుర్మార్గాలను వివరించేందుకు సౌదీ అరేబియాతో పాటు కువైట్, బహ్రెయిన్ దేశాల పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. -
‘భర్తల ప్రాణాల కోసం వేడుకోకుండా.. ఉగ్రవాదులపై తిరగబడాల్సింది’
భివానీ: పహల్గాం ఉగ్ర దాడిపై బీజేపీ నేతల నోటిదురుసు తగ్గడం లేదు. మంత్రుల స్థాయి నేతలే మతిలేని వ్యాఖ్యలు చేసి కోర్టులతో మొట్టికాయలు తింటున్నా కనువిప్పు కలగడం లేదు. పహల్గాం దాడిలో మహిళల కళ్లముందే వారి భర్తలను ముష్కరులు కర్కశంగా కాల్చి చంపడం తెలిసిందే. అలా సర్వం కోల్పోయి వితంతువులుగా మిగదిలిన వారినుద్దేశించి హరియాణాకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు రాంచందర్ జంగ్రా శనివారం దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.బీజేపీ ఎంపీ రాంచందర్ జంగ్రా తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘భర్తలను చంపొద్దని ఉగ్రవాదులను వేడుకునే బదులు వారిపై తిరగబడాల్సింది. కానీ వారిలో యోధుల స్ఫూర్తి లోపించింది. ఉగ్రవాదులకు చేతులు జోడించారు. పర్యాటకులంతా అగ్నివీరుల్లాగా వారిని ప్రతిఘటిస్తే ప్రాణనష్టం బాగా తగ్గేది’ అంటూ కామెంట్స్ చేశారు. రాణీ అహల్యాబాయి మాదిరిగా మన సోదరీమణుల్లో సాహస స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరముందంటూ హితోక్తులు పలికారు. జంగ్రా వాచాలతపై రాజకీయ దుమారం రేగుతోంది. ఆయన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమంటూ కాంగ్రెస్ నేతలు దీపీందర్‌సింగ్ హుడా, సుప్రియా శ్రీనేత్, సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ తదితరులు మండిపడ్డారు.महिलाओं का उपहास उड़ाना तो बीजेपी का कर्म और धर्म दोनों बन चुका है।इसी क्रम में भाजपा के सांसद रामचंद्र जांगरा देश के गृहमंत्री की विफलता का ठीकरा शहीदों की पत्नी के सिर फोड़ना चाह रहे हैं।उनका कहना है कि उन महिलाओं को भी साथ में शहीद हो जाना चाहिए था।pic.twitter.com/vL2x97ePQU— Uttar Pradesh Congress Sevadal (@SevadalUTP) May 25, 2025ఇదిలా ఉండగా.. ఇటీవలే భారత సైనికాధికారిణి కర్నల్ సోఫియా ఖురేషీపై బీజేపీ నేత, మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. విజయ్ షా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘వాళ్లు (ఉగ్రవాదులు) మన సోదరీమణుల సిందూరాన్ని తుడిచేసి వితంతువుల్ని చేశారు. వాళ్ల (ఉగ్రవాదుల) మతానికి చెందిన సోదరిని సైనిక విమానంలో మోదీజీ పాక్‌కు పంపించి పాఠం నేర్పించారు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదాన్ని రేకెత్తించాయి. ఆయన మంత్రి పదవిపై వెంటనే వేటువేయాలని కాంగ్రెస్ నేతలు ప్రధానికి విజ్ఞప్తిచేశారు. అనంతరం, జరిగిన పరిణామాల తర్వాత సదరు మంత్రి తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు. అది ‘భాషా పరమైన తప్పిదమే’ తప్ప ఏ మతాన్నీ కించపరచాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఇండియన్ ఆర్మీకి, సోదరి కర్నల్ సోఫియా ఖురేషీకి, యావత్ దేశ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నట్లు ఓ వీడియోను విడుదల చేశారు. -
భర్తల ప్రాణాల కోసం వేడుకోకుండా... ఉగ్రవాదులపై తిరగబడాల్సింది
భివానీ: పహల్గాం ఉగ్ర దాడిపై బీజేపీ నేతల నోటిదురుసు తగ్గడం లేదు. మంత్రుల స్థాయి నేతలే మతిలేని వ్యాఖ్యలు చేసి కోర్టులతో మొట్టికాయలు తింటున్నా కనువిప్పు కలగడం లేదు. పహల్గాం దాడిలో మహిళల కళ్లముందే వారి భర్తలను ముష్కరులు కర్కశంగా కాల్చి చంపడం తెలిసిందే. అలా సర్వం కోల్పోయి వితంతువులుగా మిగదిలిన వారినుద్దేశించి హరియాణాకు చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు రాంచందర్ జంగ్రా శనివారం దిగజారుడు వ్యాఖ్యలు చేశారు. ‘‘భర్తలను చంపొద్దని ఉగ్రవాదులను వేడుకునే బదులు వారిపై తిరగబడాల్సింది. కానీ వారిలో యోధుల స్ఫూర్తి లోపించింది. ఉగ్రవాదులకు చేతులు జోడించారు. పర్యాటకులంతా అగి్నవీర్ల వారిని ప్రతిఘటిస్తే ప్రాణనష్టం బాగా తగ్గేది’’ అన్నారు. రాణీ అహల్యాబాయి మాదిరిగా మన సోదరీమణుల్లో సాహస స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరముందంటూ హితోక్తులు పలికారు. జంగ్రా వాచాలతపై రాజకీయ దుమారం రేగుతోంది. ఆయన వ్యాఖ్యలు అత్యంత అభ్యంతరకరమంటూ కాంగ్రెస్ నేతలు దీపీందర్‌సింగ్ హుడా, సుప్రియా శ్రీనేత్, సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ తదితరులు మండిపడ్డారు. -
పాక్–ఉగ్రవాదం లంకె.. సిందూర్‌తో బట్టబయలు: షా
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్ర దాడికి ప్రతిగా భారత వైమానిక దళం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌కు ఉగ్రమూకలతో అంటకాగుతున్న విషయం మరోసారి బట్టబయలైందని హోం మంత్రి అమిత్ షా చెప్పారు. మన బలగాలు పాక్‌తోపాటు పీవోకేలో 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశాక ఆ దేశం కొన్ని పౌర, సైనిక లక్ష్యాలపై మాత్రం దాడి చేయగలిగిందన్నారు. అనంతరం, మన ఆర్మీ సరిహద్దుల ఆవల 100 కిలోమీటర్ల దూరం చొచ్చుకెళ్లి పాక్ వైమానిక సామర్యా్ధన్ని తీవ్రంగా దెబ్బతీయగలిగిందని చెప్పారు. సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు. -
మోదీపై రాహుల్ ఘాటు విమర్శలు.. జైశంకర్‌కు కొత్త పేరు
సాక్షి,ఢిల్లీ: కేంద్రంలో ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంపై ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశ విదేశాంగ విధానం కుప్పకూలిందని వ్యాఖ్యానించారు.ఈ మేరకు గురువారం రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ప్రధాని మోదీపై ఆపరేషన్ సిందూర్‌పై ప్రధాని మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. ఉగ్రవాదంపై పాకిస్తాన్ ప్రకటనను ఎందుకు నమ్మారు?.కెమెరాల ముందు మాత్రమే మీ రక్తం ఎందుకు మరుగుతోంది. భారత దేశ గౌరవం విషయంలో మీరు ఎందుకు రాజీ పడ్డారు. పహల్గాం ఉగ్రదాడిపై భారత్‌కు మద్దతిస్తూ.. పాకిస్తాన్‌ను ఏ ఒక్క దేశం ఎందుకు ప్రశ్నించలేదు. భారత్-పాక్‌ల మధ్య మధ్యవర్తిత్వం వహించమని ట్రంప్‌ను ఎవరు అడిగారు?’ అని నొక్కాణించారు.मोदी जी, खोखले भाषण देना बंद कीजिए।सिर्फ इतना बताइए:1. आतंकवाद पर आपने पाकिस्तान की बात पर भरोसा क्यों किया?2. ट्रंप के सामने झुककर आपने भारत के हितों की कुर्बानी क्यों दी?3. आपका ख़ून सिर्फ़ कैमरों के सामने ही क्यों गरम होता है?आपने भारत के सम्मान से समझौता कर लिया! pic.twitter.com/HhjqbjDsaB— Rahul Gandhi (@RahulGandhi) May 22, 2025 ఈ సందర్భంగా దేశ విదేశాంగ విధానం కుప్పకూలిందని ఆరోపిస్తూ ఆ శాఖను నిర్వర్తిస్తున్న కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి ఎస్. జై శంకర్‌కు రాహుల్ కొత్త పేరు పెట్టారు. జైశంకర్ కాదని..జైచంద్ జైశంకర్ అని విమర్శించారు. జై శంకర్ అంతర్జాతీయ మీడియాతో మాట్లాడిన వీడియోను ట్యాగ్ చేస్తూ.. తాను పైన అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. Will JJ explain:• Why has India been hyphenated with Pakistan?• Why didn’t a single country back us in condemning Pakistan?• Who asked Trump to “mediate” between India & Pakistan?India’s foreign policy has collapsed. https://t.co/m8q2lAFRm4— Rahul Gandhi (@RahulGandhi) May 23, 2025ఆపరేషన్ సిందూర్ తర్వాత పరిణామలపై కాంగ్రెస్ నేతలు కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్‌ను జైచంద్ జైశంకర్ అని సంబోధిస్తూ విమర్శిస్తున్నారు.దీంతో జైచంద్ జైశంకర్ పేరు ఎందుకు పెట్టారా అని పలువురు నెటిజన్లు ఆరాతీస్తున్నారు. ప్రముఖ కవి పృథ్వీరాజ్ రాసో రాసిన ఓ కవిత నుంచి ఈ పేరును తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆ కవితలో రాజ్‌పుత్ పాలకుడు జైచంద్, మరొక రాజ్‌పుత్ పాలకుడు పృథ్వీరాజ్ చౌహాన్‌కు వ్యతిరేకంగా ముహమ్మద్ ఘోరీతో పొత్తు పెట్టుకున్నట్లు చెప్పబడింది. రాహుల్‌పై బీజేపీ విమర్శలుఅయితే, రాహుల్ కామెంట్స్‌పై బీజేపీ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా విమర్శలు గుప్పించారు.ఆపరేషన్ సిందూర్ సమయంలో ఆయన నిర్లక్ష్య ప్రకటనలు చేశారు. ఆ ప్రకటనతో రాహుల్ గాంధీ స్వభావం ఎలాంటిదో చెబుతోంది. రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ అంటే పడకపోవచ్చు. కానీ రాహుల్ గాంధీ ప్రధానమంత్రిపై ఉపయోగించిన భాష దురదృష్టకరం’ అని మండిపడ్డారు.ఆపరేషన్ సిందూర్ ఎంత విజయవంతమైందో మనందరికీ తెలుసు. ప్రతి భారతీయుడు దాని గురించి గర్వపడుతున్నాడు.ప్రపంచం మొత్తం ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వాన్ని అభినందిస్తోంది. మన ధైర్య సాయుధ దళాలను ప్రపంచవ్యాప్తంగా ప్రశంసిస్తున్నారు. ఉగ్రవాదులను మాత్రమే కాకుండా ఉగ్రవాదాన్ని నిర్మూలించేలా ఆపరేషన్ సిందూర్‌తో సంకేతం పంపించామని’ భాటియా సూచించారు. -
మందుగుండైన సిందూరం: ప్రధాని మోదీ
బికనెర్/జైపూర్: పహల్గాం ఉగ్రవాద దాడికి కేవలం 22 నిమిషాల్లో సరైన జవాబు ఇచ్చామని, ఉగ్రవాదుల శిబిరాలను నేలమట్టం చేశామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. పవిత్ర సిందూరం మందుగుండుగా(గన్‌పౌడర్) మారితే ఏం జరుగుతుందో మన శత్రువులతోపాటు ప్రపంచం మొత్తం చూసిందని అన్నారు. భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదులను ఎగదోస్తున్న పాకిస్తాన్‌ను మోకాళ్లపై కూర్బోబెట్టామని, మన సైనిక దళాలు అపూర్వ ధైర్యసాహసాలు ప్రదర్శించాయని, ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతం చేశాయని ప్రశంసించారు. ప్రధాని మోదీ గురువారం రాజస్తాన్‌లో పర్యటించారు. పాకిస్తాన్ సరిహద్దులోని బికనెర్ జిల్లాలో పలు అభివృద్ధి ప్రాజెక్టులు ప్రారంభించారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం ఆయన బహిరంగ సభలో ప్రసంగించడం ఇదే మొదటిసారి. ఏప్రిల్ 22న జరిగిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతిస్పందనగా 22 నిమిషాల్లోనే 9 అతిపెద్ద ఉగ్రవాద స్థావరాలను నాశనం చేశామని వెల్లడించారు. తన సిరల్లో రక్తం బదులు వేడివేడి సిందూరం ప్రవహిస్తోందని వ్యాఖ్యానించారు. భారత్‌లో జరిగే ప్రతి ఉగ్రదాడికి పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని తీవ్రంగా హెచ్చరించారు. ప్రధానమంత్రి మోదీ ఇంకా ఏం మాట్లాడారంటే... అణ్వాయుధాలకు భారత్ భయపడదు ‘‘ఉగ్రవాద దాడికి భారత్ ప్రతిస్పందనను ప్రతీకార చర్యగా చూడొద్దు. ఇదొక కొత్త రకమైన న్యాయం. ఇది ఆపరేషన్ సిందూర్. ఇది ఆగ్రహం కాదు.. దేశ శక్తి సామర్థ్యాలకు ప్రతీక. ఇది నూతన భారతదేశం. పాకిస్తాన్‌తో వ్యాపారం, వాణిజ్యం జరిపే ప్రసక్తే లేదు. పొరుగు దేశంతో ఇకపై చర్చలంటూ జరిగితే కేవలం ఉగ్రవాదులు, పాక్ ఆక్రమిత కశీ్మర్(పీఓకే)పైనే జరుగుతాయి. అణ్వాయుధాలు చూపించి బెదిరిస్తామంటే ఇక్కడ బెదిరిపోయే వాళ్లు ఎవరూ లేరు. అణ్వస్త్రాల ముప్పు చూసి భారత్ భయపడదు. దేశంలో ఇకపై ఉగ్రదాడులు జరిగితే ఎలా బదులివ్వాలో మాకు బాగా తెలుసు. ముష్కర మూకలకు అర్థమయ్యే రీతిలోనే బుద్ధి చెప్తాం. ఉగ్రవాదులపై ఎప్పుడు, ఎక్కడ, ఎలా దాడులు చేయాలో మన సైనిక దళాలే నిర్ణయిస్తాయి. మన జవాన్లకు ఆ స్వేచ్ఛ ఉంది. ఉగ్రవాద దాడుల కుట్రదారులను, పాక్ ప్రభుత్వ అండతో చెలరేగిపోతున్న ఉగ్రవాదులను వేర్వేరుగా చూడం. వారందరినీ ఒక్కటిగానే పరిగణిస్తాం. ఆపరేషన్ సిందూర్ నుంచి ఈ మూడు సూత్రాలు తీసుకున్నాం. పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదుల ఆటలు ఇకపై సాగవు. ఐసీయూలోకి చేరిన పాక్ ఎయిర్‌బేస్ బికనెర్ జిల్లాలోని నాల్ ఎయిర్‌బేస్‌పై దాడి చేయడానికి పాకిస్తాన్ సైన్యం ప్రయత్నించింది. కానీ, మన ఎయిర్‌బేస్‌కు ఎలాంటి నష్టం జరగలేదు. పాక్ చర్యకు బదులుగా మన సైన్యం పాకిస్తాన్‌లోని రహిమ్యార్ ఖాన్ ఎయిర్‌బేస్‌పై దాడికి దిగింది. దాంతో అది చాలావరకు ధ్వంసమైంది. ప్రస్తుతం ఐసీయూలో ఉంది. ఎప్పుడు బయటకు వస్తుందో ఎవరికీ తెలియదు. భారత్‌పై ప్రత్యక్ష యుద్ధంలో పాకిస్తాన్ ఎప్పటికీ నెగ్గలేదు. భారత్‌తో తలపడినప్పుడల్లా పరాజయమే చవిచూసింది. అందుకే ప్రత్యక్షంగా ఎదుర్కొనే సత్తా లేక ఉగ్రవాదాన్ని ఆయుధంగా వాడుకుంటోంది. దొంగదెబ్బ తీయాలని చూస్తోంది. 2019లో బాగల్కోట్ వైమానిక దాడుల తర్వాత రాజస్తాన్‌లో మాట్లాడుతూ మన దేశాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ తలవంచనివ్వబోనని ప్రతిజ్ఞ చేశా. అదే రాజస్తాన్ గడ్డపై దేశ ప్రజలకు మరో మాట చెబుతున్నా. మన ఆడబిడ్డల సిందూరం తుడిచేయాలని చూసే ఉగ్రవాదులను ఏరిపారేస్తాం. మన రక్తం పారించాలని కుట్రలు చేస్తే ప్రతి రక్తం బొట్టుకు ముష్కరులు మూల్యం చెల్లించక తప్పదు’’ అని మోదీ స్పష్టం చేశారు.ఉగ్రవాదులను ఎగుమతి చేసినంత కాలం భిక్షం ఎత్తుకోవాల్సిందే!‘‘ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ అమాయకులను హత్య చేస్తూ మన దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టించాలన్నదే పాక్ ఎత్తుగడ. కానీ, ఇక్కడ భరతమాత సేవకుడు మోదీ ఉన్నాడు. తలెత్తుకొని నిల్చున్నాడు. మోదీ మనసు ప్రశాంతంగానే ఉండొచ్చు.. అతడి రక్తం మాత్రం సెగలు కక్కుతోంది. ఉగ్రవాదులను ఎగుమతి చేసినంత కాలం పాకిస్తాన్‌కు పూట గడవదు. భిక్షం ఎత్తుకోవాల్సిందే. ఇండియా నుంచి ప్రవహించే నదుల్లో వాటా కూడా దక్కదు. భారతీయుల రక్తంతో ఆటలాడితే అందుకు చెల్లించే మూల్యం ఊహించనంతగా ఉంటుందని పాకిస్తాన్ గుర్తుంచుకోవాలి. ఉగ్రవాద భూతాన్ని కూకటివేళ్లతో సహా పెకిలించి వేయడమే మన సంకల్పం. దీన్నుంచి మనల్ని ప్రపంచంలోని ఏ శక్తి కూడా వేరుచేయలేదు. పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో మన సంకల్పాన్ని ఇతర దేశాలకు తెలియజేయడానికే అఖిలపక్ష బృందాలను పంపించాం. పాకిస్తాన్ అసలు రూపాన్ని మొత్తం ప్రపంచానికి చూపిస్తాం’’ అని ప్రధాని మోదీ వివరించారు. 103 అమృత్ భారత్ స్టేషన్లు ప్రారంభం ప్రధానమంత్రి మోదీ దేశవ్యాప్తంగా 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లను గురువారం వర్చువల్‌గా ప్రారంభించారు. 18 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 86 జిల్లాల్లో రూ.1,100 కోట్లతో రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్లుగా అభివృద్ధి చేశారు. అభివృద్ధి చెందిన భారత్ కోసం ఆధునిక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశంలో రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టుల ఆధునీకరణ కోసం గత 11 ఏళ్లుగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. దేష్ణోక్ స్టేషన్లో బికనెర్–ముంబై ఎక్స్‌ప్రెస్ రైలును పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అలాగే రైల్వేలు, రహదారులు, విద్యుత్, నీటి సరఫరా, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలకు సంబంధించిన రూ.26,000 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రారంభించి, జాతికి అంకితం ఇచ్చారు. మరికొన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. అంతకు ముందు బికనెర్ జిల్లాలోని ప్రఖ్యాత కర్ణి మాత ఆలయాన్ని ప్రధాని మోదీ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఆలయం ఎలుకలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఎటు చూసినా ఎలుకలే కనిపిస్తుంటాయి. భక్తులు వాటిని పవిత్రంగా భావిస్తారు. -
పాక్ ఆర్మీ చీఫ్ మునీర్‌పై జైశంకర్ సంచలన ఆరోపణ
ఢిల్లీ: దాయాది దేశం పాకిస్తాన్‌పై భారత విదేశాంగమంత్రి జైశంకర్ సంచలన ఆరోపణలు చేశారు. పహల్గాం దాడితో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు సంబంధం ఉందని అన్నారు. పహల్గాం దాడికి పాకిస్తాన్ నేతల జిహాదీ మైండ్ సెట్ కారమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.కేంద్ర విదేశాంగశాఖ మంత్రి జై శంకర్ డెన్మార్క్, నెదర్లాండ్స్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్బంగా తాజాగా జైశంకర్ మీడియాతో మాట్లాడుతూ..‘కాల్పుల విరమణ ఒప్పందంపై భారత్, పాక్ మధ్య మాత్రమే చర్చలు జరిగాయి. ఈ ఒప్పందంపై భారత్, పాక్ కలిసి చర్చించుకున్నాయి. ఆపరేషన్ సిందూర్ గురించి భారత్ అనేక దేశాలకు సమాచారం ఇచ్చిందని, అందులో అమెరికా కూడా ఉందని స్పష్టం చేశారు. అయితే, కాల్పుల విరమణ ఒప్పందం చేసింది తానేనని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించిన విషయం తెలిసిందే.External Affairs Minister Dr S Jaishankar in Copenhagen, #Denmark, meets Indian community representatives.📍EAM also met his Danish counterpart, Lars Løkke Rasmussen, and says, Denmark’s strong solidarity and support in combating terrorism has been truly commendable.… pic.twitter.com/ZSV2bHHs7V— IndSamachar News (@Indsamachar) May 22, 2025 ఇదే సమయంలో పహల్గాం దాడితో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు సంబంధం ఉంది అని చెప్పుకొచ్చారు. అలాగే, కశ్మీర్ భారతదేశంలో భాగమే. ఏ దేశం కూడా తమ భూభాగంలో కొంత భాగం గురించి చర్చించదు. కశ్మీర్‌లోని ఒక ప్రాంతం మాత్రమే పాకిస్తాన్ పరిధిలో ఉంది. వారు ఎప్పుడు దానిని ఖాళీ చేస్తారో అనే విషయమై.. మేము వారితో చర్చించాలనుకుంటున్నాము అని అన్నారు.EAM S. Jaishankar in Netherlands Kashmir is part of India No country ever negotiates part of its territory One area is under Pakistan We would like to discuss with them when they will vacate it @CNNnews18— Siddhant Mishra (@siddhantvm) May 22, 2025మరోవైపు.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు పదోన్నతి ఇవ్వడంపై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. ఆసిఫ్ మునీర్‌కు ఫీల్డ్ మార్షల్‌గా పదోన్నతి ఇవ్వడమనేది పూర్తిగా తన నిర్ణయమేనని షరీఫ్ వెల్లడించారు. ఇదిలా ఉండగా.. ఆపరేషన్ సిందూర్‌ను ఎదుర్కోవడంలో మునీర్ వైఫల్యం చెందినా ప్రమోషన్ ఇచ్చారని సోషల్ మీడియాలో ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. -
‘పహల్గామ్’కు నెల.. ముష్కరుల వేటలో ఎన్ఐఏ
పహల్గామ్: జమ్ముకశ్మీర్‌లోని పహల్గామ్(Pahalgam)లో ఏప్రిల్ 22న 25 మంది పర్యాటకులను, ఒక స్థానికుడిని హతమార్చిన ఉగ్రవాదుల కోసం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ముమ్మరంగా గాలిస్తోంది. ఈ దాడి జరిగి నేటికి (మే 22)కు నెలరోజులయ్యింది. ఈ ఘటన భారత్ - పాకిస్తాన్ మధ్య శత్రుత్వాన్ని మరింతగా పెంచింది.ఈ దాడి జరిగిన దరిమిలా జమ్ముకశ్మీర్ పోలీసుల నుంచి ఫిర్యాదు అందుకున్న ఎన్ఐఏ ప్రస్తుతం సాక్షులను విచారిస్తోంది. అలాగే అందుబాటులో ఉన్న డేటాను పరిశీలిస్తోందని సమాచారం. ఈ దాడిలో పాకిస్తాన్‌కు చెందిన ఐదుగురు ఉగ్రవాదుల హస్తం ఉన్నదని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపధ్యంలో సంబంధిత అధికారులు ముగ్గురు ఉగ్రవాదుల(terrorists) స్కెచ్లను విడుదల చేశారు. వారి గురించిన సమాచారం ఇచ్చిన వారికి రూ. 20 లక్షల రివార్డును ప్రకటించారు. మరోవైపు ఎన్ఐఏ అధికారులు ఇప్పటివరకూ ఫోన్ ఆపరేటర్లు, దుకాణదారులు, ఫోటోగ్రాఫర్లు, సాహస క్రీడలలో పనిచేసేవారితో సహా 150 మంది స్థానికులను విచారించారని ఒక అధికారి తెలిపారు.ఈ ఘటనకు 15 రోజుల ముందు ఆ ప్రాంతంలో అకస్మాత్తుగా దుకాణాన్ని మూసివేసిన దుకాణదారుడిని కూడా ఎన్ఐఏ విచారించింది. కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ డంప్ డేటాను సేకరించింది. వీటిలో అధికంగా బాధితుల కుటుంబ సభ్యులు, పర్యాటకులు తీసిన వీడియోలు, ఫొటోలు ఉన్నాయి. ఇవి దాడి చేసినవారు ఎక్కడి నుండి వచ్చారో, ఎక్కడికి వెళ్లిపోయారో తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని ఒక అధికారి తెలిపారు. 2019 పుల్వామా దాడి(Pulwama attack) దర్యాప్తు సమయంలో ఎన్ఐఏ త్రీడీ మ్యాపింగ్‌ను తయారు చేసింది. ఇప్పుడు కూడా అదే తరహా మ్యాపింగ్‌తో దర్యాప్తు సాగిస్తోందని సమాచారం. మరోవైపు జమ్ముకశ్మీర్ పోలీసులు భారీ స్థాయిలో దాడులు నిర్వహించి, వందలాది మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. దీని గురించి పోలీసు అధికారి ఒకరు మాట్లాడుతూ రెండు రోజుల పాటు దాడులు నిర్వహించి, పలువురిని అదుపులోనికి తీసుకుని విచారించామన్నారు. వారిలో చాలా మందిని విడుదల చేశామని కూడా తెలిపారు. కాగా దాడి జరిగిన దరిమిలా భద్రతా సంస్థలు.. ఈ ఘాతుకానికి పాల్పడిన ముష్కరుల పాదముద్రలను గుర్తించగలిగాయని ఒక అధికారి తెలిపారు.ఇది కూడా చదవండి: ప్రమాదం బారిన జీవవైవిధ్యం -
స్లీపర్ సెల్స్ సంగతి తేల్చండి
సాక్షి, అమరావతి: పహల్గాం ఉగ్రదాడి అనంతరం కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర డీజీపీకి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్లీపర్ సెల్స్‌ను గుర్తించే విషయంలో విచారణ జరపాలని డీజీపీని ఆదేశించింది. రాష్ట్రంలో స్లీపర్స్ సెల్స్‌కు సంబంధించి తదుపరి విచారణ నాటికి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని తేల్చిచెప్పింది.ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేశారు.స్లీపర్ సెల్స్ ఉన్నా పట్టించుకోవడం లేదుపహల్గాం ఉగ్రదాడి తరువాత దేశవ్యాప్తంగా 20వేల మంది స్లీపర్ సెల్స్ రహస్యంగా పాకిస్థాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్నారని హైకోర్టు న్యాయవాది సూరపరెడ్డి గౌతమి, వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరుకి చెందిన ఎ.శివకుమార్ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లలో పేర్కొన్నారు. వీరిలో 1,200 మంది ఏపీలోని నంద్యాల, గుంటూరు, వైఎస్సార్ తదితర జిల్లాల్లో ఆశ్రయం పొందుతున్నారని, ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు నివేదికలిచ్చినా రాష్ట్ర హోంశాఖ, డీజీపీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై జస్టిస్ హరినాథ్ ఇటీవల విచారణ జరిపారు. గౌతమి తరఫున కోనపల్లి నర్సిరెడ్డి, శివకుమార్ తరఫున బూదాటి జ్ఞానేంద్ర కుమార్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పహల్గాం ఉగ్రదాడి తరువాత కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేశాయని తెలిపారు. దేశవ్యాప్తంగా 20వేల మంది స్లీపర్ సెల్స్ ఉన్నట్టు, వారంతా పాకిస్తాన్ ఐఎస్ఐ కోసం పనిచేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చాయని న్యాయవాది నర్సిరెడ్డి పేర్కొన్నారు. ఏపీలో పోలీసు యంత్రాంగం ఈ హెచ్చరికలను పట్టించుకోవడం లేదన్నారు. ఉగ్రమూకలకు సహకరిస్తున్న వారి విషయంలో చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం దారుణంగా విఫలమైందన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో విచారణ నిమిత్తం జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు తగిన ఆదేశాలు జారీ చేయాలని కోర్టును అభ్యర్థించారు.ఎన్ఐఏకు నోటీసులుఈ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ)కు నోటీసులు జారీ చేశారు. పిటిషనర్లు సమర్పించిన వివరాలను పరిగణనలోకి తీసుకుని, స్లీపర్స్ సెల్స్ విషయంలో విచారణ జరిపి నివేదికను తమ ముందుంచాలని డీజీపీని ఆదేశించారు. బాంబు పేలుళ్లు సృష్టించేందుకు కుట్ర పన్నారంటూ విజయనగరానికి చెందిన సిరాజ్ ఉర్ రెహమాన్, తెలంగాణకు చెందిన సమీర్‌లను పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. -
పాక్‌కు బుద్ధి చెప్పడంలో ప్రధాని వెనకడుగు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: పహల్గాం దాడి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్‌కు బుద్ధి చెప్పడంలో ప్రధాని మోదీ వెనకడుగు వేశారని.. అదే ఇందిరమ్మ హయాంలో ఉగ్రవాదుల ముసుగులో భారత పౌరులపై దాడులకు తెగబడిన పాక్‌కు గట్టి గుణపాఠం చెప్పారని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకుని సచివాలయం ముందు ఆయన విగ్రహానికి రేవంత్ పుష్పాంజలి ఘటించారు. రాజీవ్ వర్ధంతి రోజున ‘ఉగ్రవాద వ్యతిరేక దినం’గా పాటిస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేస్తూ.. ఉగ్రవాదంపై పోరాటం చేయడం ప్రతి భారతీయుడి దృఢ సంకల్పమన్నారు. దేశ భద్రత, సమగ్రతను కాపాడే విషయంలో రాజకీయాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వానికి, భారత వీర జవాన్లకు ఎప్పుడూ అండగా నిలబడతామని చెప్పారు. కశ్మీర్లో పర్యాటకులపై కాల్పుల ఘటన, ఆపరేషన్ సిందూర్ సందర్భంగా పోరాటం చేస్తున్న వీర సైనికులకు అండగా తెలంగాణ ప్రభుత్వం మొట్టమొదటగా సంఘీభావ ర్యాలీ నిర్వహించిందని గుర్తుచేశారు. నాడు ఇందిర అంగీకరించలేదు...: ఉగ్రవాదులను నిర్మూలించడంలో ఇందిరమ్మ ఆదర్శంగా నిలిచారని, నాడు యుద్ధం సందర్భంగా ఆమెరికా లేదా ఇతర దేశాల మధ్యవర్తిత్వాన్ని ఆమె అంగీకరించలేదని రేవంత్‌రెడ్డి చెప్పారు. భారత దేశ భద్రతను కాపాడుకోవడంలో ఎవరి సూచనలు, మధ్యవర్తిత్వం అక్కర్లేదని స్పష్టంగా చెప్పారన్నారు. ట్రంప్ చెబితే కాల్పుల విరమణ చేసిన పరిస్థితి ఇప్పటి కేంద్ర ప్రభుత్వానిదని ఎద్దేవా చేశారు. కశ్మీర్ ఘటనలపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాందీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతోపాటు అందరం కేంద్రానికి, పోరాటం చేస్తున్న వీర జవానులకు అండగా నిలబడ్డామన్నారు. –చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. రాహుల్‌పై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాలకు తావివ్వకుండా దేశ ప్రయోజనాలకే ప్రాధాన్యతనివ్వాలని పిలుపునిచ్చారు. దేశ సమగ్రతను కాపాడటంలో కృషిచేసిన మహాత్మాగాందీ, ఇందిరా గాందీ, రాజీవ్ గాందీ, బీఆర్ అంబేడ్కర్, పీవీ నరసింహారావు విగ్రహాలతో ఈ ప్రాంతం భారతీయులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పారు. దేశాభివృద్ధిలో రాజీవ్ గాంధీ పాత్ర మరువలేనిదని కొనియాడారు. ఓటు హక్కును 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించి యువతకు ఓటు హక్కు కల్పించారని, ఆధునిక సాంకేతిక నైపుణ్యంతో 21వ శతాబ్దంవైపు దేశాన్ని నడిపించారని గుర్తుచేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌తోపాటు పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. -
గూఢచర్యం జాడలివిగో!
గూఢచర్యానికి నిర్దిష్టమైన రూపురేఖలుండవు. దాన్ని సకాలంలో గుర్తించటం, కట్టడి చేయటం ఆషామాషీ కాదు. మన వేషభాషలతోనేవుంటూ, నిత్యం మనతో సన్నిహితంగా మెలగుతూ ప్రాణ ప్రదమైన మన రహస్యాలను బయటికి చేరేసేవారిని ఆనవాలు కట్టడం అంత సులభం కూడా కాదు. పహల్గామ్లో గత నెల 22న అమాయక పౌరులు 26 మందిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నాక మన త్రివిధ దళాలు పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడులు నిర్వ హించి దాదాపు వందమందిని మట్టుబెట్టాయి. సింధూ నదీజలాల ఒప్పందంనుంచి వెనక్కి రాదల్చుకున్నట్టు ప్రకటించటంతోసహా అనేక అంశాల్లో పాకిస్తాన్‌కు ఇన్ని దశాబ్దాలుగా అందుతున్న ప్రయోజనాలను మన దేశం నిలుపుచేసింది. దానికి అనుబంధంగా దేశంలో అధికార, విపక్షాల మధ్య వాగ్యుద్ధాలు సాగటం, పహల్గామ్లో భద్రతాలోపాలపై ప్రశ్నించినవారినీ, జవాబుదారీ తనాన్ని కోరినవారినీ ఉగ్రవాద సమర్థుకులుగా ముద్రేయటం మొదలైంది. ఇది అవాంఛనీయమైన పరిణామం. ఈ నేపథ్యంలో నిఘానేత్రాల కళ్లుగప్పి కీలకమైన సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరేస్తున్న 11 మందిని గుర్తించి అరెస్టు చేయటం కీలక మలుపు. అరెస్టయినవారిలో చాలామంది మధ్యతరగతి యువత. వారిలో జ్యోతి మల్హోత్రా అనే యువతి పాకిస్తాన్ గూఢచారి సంస్థలకు కీలకమైన సమా చారం అందించిందన్నది పోలీసుల అభియోగం. సామాజిక మాధ్యమాల సందడి పెరిగాక ఒక కొత్త తరం బయల్దేరింది. విచక్షణా జ్ఞానం లోపించటం, లోతైన సమాచారం లేకుండానే దేనిపైన అయినా అభిప్రాయాలు ఏర్పర్చుకోవటం, ఆధారాలున్నాయా లేదా అనేదాంతో నిమిత్తం లేకుండా సమాచారాన్ని వ్యాప్తిచేయటం, సామాజిక మాధ్యమాలపై మోజున్న యువతరానికి అలవాటుగా మారింది. సెల్‌ఫోన్‌తో దేన్నయినా చిత్రించటం, వెనకా ముందూ ఆలోచించకుండా అందరికీ చేరేయటం రివాజైంది. మనం కూడా ఏదో ఒకటి చేయాలన్న కుతూహలంతో మొదలై, అందరికన్నా ఎక్కువమంది వీక్షకుల్ని ఆకట్టుకోవటం లక్ష్యంగా మారటం, ప్రముఖ వ్యక్తిగా గుర్తింపు పొందటం, ప్రశంసలు, వాటి వెంబడే ఆదాయం మొదలవుతుంది. ఇక ఆ వ్యామోహం నుంచి వెనక్కిరావటం వాళ్లవల్ల కాదు. తాము చేసే పని ఏ మంచికి హాని చేస్తుందో, ఏ చెడును ప్రోత్సహిస్తుందో గ్రహించేంత సామర్థ్యం లేకపోవటం సామాజిక మాధ్యమాల్లో పాపులర్ అయిన అత్యధిక యువతలో కనబడే ప్రాథమిక లక్షణం. ఇలాంటివారిని ఆకట్టుకుని, వీరితో సంబంధ బాంధవ్యాలు నెరపి దగ్గరకావటం పొరుగు దేశ గూఢచార సంస్థలకు సులభం. జ్యోతి మల్హోత్రా విషయంలో జరిగింది అదే. ఆమె తగిన పత్రాలను సమర్పించి ప్రభుత్వానికి తెలిసే విధంగానే పాకిస్తాన్ వెళ్లింది. అక్కడ వేర్వేరు వ్యక్తుల్ని కలిసింది. పాకిస్తాన్ జాతీయ దినోత్సవంలో పాల్గొన్నది. అక్కడున్నవారిని పరిచయం చేసింది. వారితో మాట్లాడించింది. విదేశాలకు పోవటం, అక్కడి ప్రాంతాలను సందర్శించటం, వారితో సంభాషించటం వగైరాలు సహజంగానే సాధారణ వీక్షకులకు ఎంతో ఆసక్తి అనిపిస్తాయి. జ్యోతి నిర్వహించే యూట్యూబ్ చానెల్‌కు దాదాపు 4 లక్షలమంది చందాదార్లుండటం, ఫేస్బుక్లో 3 లక్షలమందిపైగా ఆమె ఎప్పటికప్పుడు పెట్టే వీడియోలను వీక్షించటం, ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు లక్షన్నరమంది చూడటం ఇందువల్లే. తమ అరకొర పరిజ్ఞానంతో గంటల తరబడి దేనిపైన అయినా అనర్గళంగా మాట్లాడటం నచ్చటంవల్లే ఇన్నేసి లక్షలమంది వారిని అనుసరిస్తుంటారు. శత్రు దేశాల మధ్య యుద్ధాలు సరిహద్దుల్లోనే జరగవు. అవి కేవలం సైనికుల మధ్యే సాగవు. అనేక రూపాల్లో నిరంతరం కొనసాగుతుంటాయి. కనీసం జ్యోతి ప్రభుత్వానికి తెలిసేవిధంగా పాకిస్తాన్ వెళ్లింది. కానీ చడీచప్పుడూ లేకుండానే శత్రుదేశానికి అత్యంత కీలకమైన సమాచారాన్ని చేరేసేవారుంటారు. పాకిస్తాన్ హైకమిషన్‌లో ఇటీవల వరకూ పనిచేసి బహిష్కరణకు గురైన డానిష్ అనే ఉద్యోగి అడిగిన సమాచారమంతా ఆమె అందించిందని నిఘా వర్గాలంటున్నాయి. ఆ పని చేయటం పర్యవసానంగా తోటి పౌరులే ప్రమాదాల్లో చిక్కుకుంటారని, అది దేశద్రోహమని వారికి అనిపించదు. డబ్బుకు ఆశపడటం ఒక్కటే ఇలాంటి కార్యకలాపాలకు కారణం అనుకోవటానికి లేదు. వేరే దేశానికి చెందినవారు వీడియోలను చూడటం, పొగడ్తలు గుప్పించటం, తమ ప్రాంతాలకొచ్చి అక్కడి విశేషాలను కూడా చూపాలని అడగటం వగైరాలు వారిని ఆకర్షిస్తాయి. తమ ఘనత అంతర్జాతీయ స్థాయికి చేరుకుందన్న భ్రమ వారిని నిలకడగా ఆలోచించనీయదు. గూఢచర్యం కేవలం అవతలి దేశాన్ని నష్టపరచటానికో, చికాకుపరచటానికో పరిమితం కాదు. వారి ఆయుధాగారాల్లో వచ్చి చేరుతున్న రక్షణ సామగ్రి సామర్థ్యం ఏమిటో, ఎక్కడెక్కడ వారి సైనిక స్థావరాలు పనిచేస్తున్నాయో తెలుసుకోవటంతోపాటు పారిశ్రామిక, ఆర్థిక, పరిశోధనారంగాల్లో ఆ దేశం ఏం చేస్తున్నదో సమాచారాన్ని సేకరిస్తుండటం గూఢచారుల పని. పహల్గామ్లో ఉగ్రదాడి తర్వాత ఎక్కడ మన వైఫల్యం వున్నదో, అందుకు కారణమేమిటో తెలుసుకునే పనిలో ప్రభుత్వం తలమునకలై వుండగా దేశభక్తి పేరిట కొందరు మత విద్వేషాలను రెచ్చగొట్ట జూశారు. ఇప్పుడు పట్టుబడినవారి నేపథ్యం గమనిస్తే ఫలానా మతంవారే దేశద్రోహానికి పాల్పడతారన్నది ఎంత బూటకమో తెలుస్తుంది. శత్రువు కీలకమైన సమాచారాన్ని ఒడుపుగా తస్కరించగలుగుతున్నాడంటే నిస్సందేహంగా అది మన వైఫల్యం. దాన్ని కప్పిపుచ్చి అసత్యాలు ప్రచారం చేయటానికి బదులు, లోపాలను సరిదిద్దుకుని పటిష్టమైన వ్యవస్థలు రూపొందించటం వర్తమాన అవసరం. -
నీటి వివాదం.. పాక్ హోంమంత్రి ఇంటికి నిప్పు
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ను దెబ్బ కొడుతూ భారత్ తీసుకున్న కఠిన నిర్ణయాల్లో సింధూ నదీ జలాలతో ముడిపడిన అంశం ఒకటి. భారత్ తీసుకున్న నిర్ణయంతో పాకిస్తాన్ సింధ్ ప్రావిన్స్‌లో నిరసనలు మిన్నంటాయి. నీళ్లు లేకపోవడంతో పాక్ ప్రజలు ఎదురు తిరిగారు. పాక్ హోంమంత్రి జియా ఉల్ హసన్ ఇంటిని తగలబెట్టారు.ఈ సంఘటన భద్రత, ప్రజల ఆగ్రహాన్ని అదుపు చేయడంలో ప్రభుత్వ సామర్థ్యంపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నీటి కటకటతో నిరసనకారులు హోమంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిరంగంగా ఏకే 47 గన్నుతో గాల్లోకి కాల్పులు జరుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. పాకిస్తాన్లో నీటి సంక్షోభంసింధు నది నుండి నీటిని మళ్లించి,పంజాబ్‌కు నీటి సరఫరాను పెంచేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం కాలువను నిర్మించాలని యోచిస్తోంది. కానీ సింధ్‌లోని స్థానికులు ప్రభుత్వ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం వల్ల తమ వ్యవసాయ భూములకు,తాగునీటికి ముప్పు వాటిల్లుతుందని,ఇప్పటికే నీటి కొరతను ఎదుర్కొంటున్నామని ఈ ప్రాజెక్ట్ పరిస్థితిని మరింత దిగజార్చుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అంతేకాదు,ఐఎంఎఫ్ ఒత్తిడితో పంటలకు కనీస మద్దతు ధర (MSP) నిలిపివేయడంకార్పొరేట్ వ్యవసాయం కోసం వారసత్వ భూములను బలవంతంగా సేకరించడంలాభం కోసం పాకిస్తాన్ సైన్యం సైతం వ్యవసాయంలో భాగస్వామ్యం కావడం.. వంటి అంశాలపై పాక్ ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికింది. తాజాగా, ప్రభుత్వ తీరును నిరసిస్తూ స్థానికులు జాతీయ రహదారిని దిగ్బంధించడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నంతో అక్కడ నిరసనలు మిన్నంటాయి. పోలీసులు భారీ ఎత్తున మోహరించి ఆందోళనకు దారితీసింది. ఇది ఘర్షణలకు దారితీసింది. ఈ హింసాత్మక ఘటనలో ఇద్దరు పౌరులు మరణించారు.పోలీసు అధికారులతో సహా అనేక మంది గాయపడ్డారు. నిరసనకారులు మోరోలోని హోంమంత్రి ఇంటిపై కూడా దాడి చేసి తగలబెట్టారు. House of Sindh Interior Minister Ziaul Hasan🇵🇰 pic.twitter.com/hQdD02tBBj— ARIKA🇮🇳🚩 (@nidhisj2001) May 21, 2025పోలీసు చర్యకు ఆదేశించినందుకు స్థానికులు మంత్రిపై మండిపడుతున్నారు. నీటి కొరత కారణంగా సింధ్ విధ్వంసానికి దారితీసే విధానాలకు ఆయన మద్దతు ఇస్తున్నారని ఆరోపించారు. నిరసనకారులు ఆసుపత్రిలో గాయపడిన పోలీసు అధికారులపై దాడి చేయడంతో మరింత ఉద్రిక్తతకు దారి తీసింది. నిరసనకారులు యూరియా ఇతర ఎరువులతో వెళ్తున్న ట్రక్కులను దోచుకుని ఆపై వాటిని తగలబెట్టారు.స్పందించిన పాక్ ప్రభుత్వంఈ ఆందోళనపై పాక్ ప్రభుత్వం స్పందించింది. సింధ్‌లో భద్రతను బలోపేతం చేసే దిశగా పారామిలిటరీ దళాలను మోహరించారు. దాడులలో పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. పహల్గాం ఉగ్రదాడితో పహల్గాంలో పర్యటకులపై ఉగ్రదాడి అనంతరం సింధూ జలాల ఒప్పందం నుంచి వైదొలుగుతున్నట్లు భారత్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దాదాపు తొమ్మిదేళ్లపాటు విస్తతస్థాయి చర్చల తర్వాత 1960 సెప్టెంబర్ 19వ తేదీన నాటి భారత ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ అధ్యక్షుడు అయూబ్‌ఖాన్‌లు ఈ చరిత్రాత్మక ఒప్పందంపై సంతకాలు చేశారు.ఈ డీల్ ప్రకారం సింధు ఉప నదుల్లో తూర్పున పారే రావి, బియాస్, సట్లెజ్ నదులపై భారత్ కు హక్కులు లభించాయి. సింధూ నదితోపాటు దాని పశ్చిమ ఉపనదులైన జీలం, చీనాబ్‌లపై పాకిస్తాన్‌కు హక్కులు దక్కాయి. ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్‌కు బుద్ధి చెప్పేందుకు సింధూ నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసింది.దీంతో పాక్‌లో నీటి సమస్య ఉత్పన్నమవుతున్నాయి. -
ISI ఏజెంట్ జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
-
పాక్‌పై దౌత్య యుద్ధానికి బృంద సారథులు వీరే
సాక్షి, న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రవాద దాడి అనంతరం ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌ను చావుదెబ్బ కొట్టిన భారత్ దౌత్యపరంగానూ బుద్ధి చెప్పడానికి సిద్ధమైంది. పాక్ అరాచకాలను, భారత్‌కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ఎగదోస్తున్న తీరును ప్రపంచ దేశాలకు వివరించనుంది. ఇందుకోసం పలు పార్టిల నేతలు, ఎంపీలు, దౌత్యవేత్తలతో ఏడు బృందాలను ఏర్పాటు చేసింది. ఒక్కో బృందం నాలుగు నుంచి ఐదు దేశాల్లో పర్యటించనుంది. విపక్షాల నుంచి శశి థరూర్ (కాంగ్రెస్), కనిమొళి (డీఎంకే), సుప్రియా సూలే (ఎన్సీపీ–పవార్), అధికార ఎన్డీఏ కూటమి నుంచి రవిశంకర్ ప్రసాద్, బైజయంత్ పాండా (బీజేపీ), సంజయ్ కుమార్ ఝా (జేడీయూ), శ్రీకాంత్ షిండే (శివసేన–షిండే) వాటికి సారథ్యం వహిస్తారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ శనివారం ఈ మేరకు వెల్లడించింది. బృందాల్లో సభ్యులుగా అనురాగ్ ఠాకూర్, అపరాజితా సారంగి, మనీశ్ తివారీ, అసదుద్దీన్ ఒవైసీ, అమర్ సింగ్, రాజీవ్ ప్రతాప్ రూడీ, సమిక్ భట్టాచార్య, బ్రిజ్‌లాల్, సర్ఫరాజ్ అహ్మద్, ప్రియాంక చతుర్వేది, విక్రమ్‌జిత్ సాహ్నీ, సస్మిత్ పాత్ర, భువనేశ్వర్ కలితాతో పాటు కేంద్ర మాజీ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తదితరులు ఉంటారు. వారంతా ఈ నెలాఖర్లో ఐరాస భద్రతా మండలితో పాటు పలు కీలక దేశాల్లో పర్యటిస్తారు.ఏ బృందం ఏ దేశానికి... శశి థరూర్: అమెరికా, పనామా, గయానా, బ్రెజిల్, కొలంబియా సుప్రియా సూలే: ఈజిప్‌్ట, ఖతర్, ఇథియోపియా, దక్షిణాఫ్రికా కనిమొళి: రష్యా, స్పెయిన్, గ్రీస్, స్లొవేనియా, లాతి్వయా సంజయ్ కుమార్ ఝా: జపాన్, సింగపూర్, దక్షిణ కొరియా, మలేషియా, ఇండోనేసియా రవిశంకర్ ప్రసాద్: ఈయూ, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, డెన్మార్క్ బైజయంత్ పండా: సౌదీ అరేబియా, కువైట్, బహ్రెయిన్, అల్జీరియా శ్రీకాంత్ షిండే: యూఏఈ, లైబీరియా, కాంగో, సియెర్రా లియోన్ -
‘ట్రైలర్ మాత్రమే చూశారు.. పాక్ తీరు మారకపోతే పూర్తి సినిమా చూపిస్తాం’
గాంధీనగర్: ఆపరేషన్ సిందూర్ (operation sindoor) ముగియలేదు. ట్రైలర్ మాత్రమే చూశారు. పాక్ తీరు మార్చుకోకపోతే సినిమా చూపిస్తాం’ అంటూ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (rajnath singh) హెచ్చరికలు జారీ చేశారు. శుక్రవారం గుజరాత్‌లోని భుజ్ ఎయిర్ బేస్‌లో ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న ఎయిర్ వారియర్స్‌తో రాజ్‌నాథ్ భేటీ అయ్యారు. ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న ఎయిర్ వారియర్స్‌పై ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం, ఆయన మీడియా మాట్లాడారు. పాకిస్తాన్‌పై భారత్ విజయానికి ఎయిర్‌బేస్ సాక్ష్యం.పహల్గాం దాడి, ఆ తర్వాత ఆపరేషన్ సిందూర్‌ను ప్రపంచమంతా చూసింది. పాకిస్తాన్లో ఉగ్రశిబిరాలను ధ్వంసం చేశాం. బ్రహ్మోస్ మిస్సైల్ పవరేంటో పాకిస్తాన్‌కు చూపించాం. బోర్డర్ దాటకుండానే పాక్ ఉగ్ర శిబిరాలను నాశనం చేశాం. పాకిస్తాన్ ముఖ్య ఉగ్ర కేంద్రాన్ని ధ్వంసం చేశాం. నయా భారత్ ఎంటో ప్రపంచానికి తెలిసింది.మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మసూద్ అజహార్‌కు పాక్ రూ.14కోట్లు ఇచ్చింది. ప్రపంచానికి మన సత్తా ఏంటో కళ్లకు కట్టేలా చూపించాం. మన వాయిసేన అసమాన ప్రతిభ కనబర్చి ప్రత్యర్థులను వణికించింది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఫండింగ్ చేస్తోంది. ఇది ఒక ట్రైలర్ మాత్రమే.. పాక్‌కు అసలు సినిమా ముందుంది’ అంటూ రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. Addressing the brave Air Warriors at the Air Force Station in Bhuj (Gujarat). https://t.co/3TGhBlyxFH— Rajnath Singh (@rajnathsingh) May 16, 2025 -
ఆపరేషన్ సిందూర్‌కి ముందు ట్రంప్,పాక్‌ల మధ్య చీకటి ఒప్పందం?
వాష్టింగన్: పహల్గాంలో ఉగ్రదాడి, ఆ దాడిపై భారత చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్’కు ముందు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. పాకిస్తాన్ ప్రభుత్వంతో జరిపిన ఓ చీకటి ఒప్పందం బట్టబయలైంది. ఆ చీకటి ఒప్పందానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌కు సైతం సంబంధం ఉండడం మరింత అనుమానాలకు తెరతీసింది. అమెరికాకు చెందిన ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ కంపెనీ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్, పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ మధ్య జరిగింది. పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నెల రోజుల వయసున్న (అప్పటికి ఏర్పాటు చేసి నెలరోజులే) క్రిప్టో కౌన్సిల్‌తో కుదుర్చుకున్న ఈ కంపెనీలో ట్రంప్ కుమారులు ఎరిక్ ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్, అల్లుడు జారెడ్ కుష్నర్ కలిపి 60శాతం వాటా ఉంది. గత నెలలో వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్, పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్‌తో ఒప్పందం చేసుకున్నారని తెలిపే లెటర్ ఆఫ్ ఇంటెంట్ సైతం ఉంది.ఆఘమేఘాల మీదఈ ఒప్పందం తర్వాత వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ సంస్థకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చేలా కొద్ది రోజుల వ్యవధిలోనే పాకిస్తాన్ క్రిప్టో కౌన్సిల్ తమ సలహాదారుగా బైనాన్స్ వ్యవస్థాపకుడు ఛాంగ్‌పెంగ్ జావోను పాక్ ప్రభుత్వం నియమించింది. ఘన స్వాగతం పలికిన ఆసిమ్ మునీర్ ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా నుంచి పాకిస్తాన్‌కు వచ్చిన ఓ ప్రతినిధి బృందానికి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ స్వయంగా ఆ అమెరికన్ బృందానికి నాయకత్వం వహించింది మరెవరో కాదు ట్రంప్ అత్యంత సన్నిహితుడు,వ్యాపార భాగస్వామి స్టీవ్ విట్కాఫ్ కుమారుడు జాకరీ విట్కాఫ్. జాకరీ విట్కాఫ్ ప్రస్తుతంప్రస్తుత మిడిల్ ఈస్ట్‌కు అమెరికా ప్రత్యేక రాయబారిగా ఉన్నారు. జాకరీ విట్కాఫ్ బృందం పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్‌తో రహస్య సమావేశం సైతం నిర్వహించింది. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో ఈ ఒప్పందం ప్రకారం, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థలో బ్లాక్‌చైన్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం, ఆస్తుల టోకనైజేషన్, స్టేబుల్‌కాయిన్ అభివృద్ధి, డిసెంట్రలైజ్డ్ ఫైనాన్స్ పై పైలట్ ప్రాజెక్టులకు అనుమతి లభించనుంది. దీని ద్వారా పాకిస్తాన్లో డిజిటల్ ఫైనాన్స్ విస్తరణతో పాటు బ్యాంకింగ్, క్రెడిట్, ఇన్సూరెన్స్, పెట్టుబడులు, పెన్షన్ వంటి సేవల్ని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చేలా ఒప్పందం జరిగినట్లు సమాచారం. పాక్-ట్రంప్ చీకటి ఒప్పందంపై అనుమానంపహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఈ ఒప్పందంపై ప్రశ్నలు ఉత్పన్నం కావడంతో, వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ ఓ ప్రకటన విడుదల చేసింది. పాకిస్తాన్ ప్రభుత్వంతో తాము కుదుర్చుకున్న ఒప్పందానికి వెనుక ఎలాంటి దురుద్దేశాలు లేవని స్పష్టం చేసింది. అయితే, ఈ ఒప్పందంపై అటు ట్రంప్ కుటుంబం, ఇటు వైట్ హౌస్ ఎలాంటి ప్రకటన చేయలేదు. -
ఉగ్రవాది కథ.. తల్లి ప్రేమ వద్దంది.. యమలోకం రమ్మంది!
శ్రీనగర్: ఆపరేషన్ సిందూర్ (operation sindoor) తర్వాత జమ్మూకశ్మీర్ (jammu and kashmir)లో ఉగ్రవేట మళ్లీ జోరందుకుంది. రెండురోజుల్లో ఆరుగురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుపెట్టాయి. మొన్న సోపియాన్‌లో ముగ్గురు లష్కరే తోయిబా ముష్కరులను ఎన్కౌంటర్ చేసింది. తాజాగా పుల్వామాలో ముగ్గురు జైహే మహ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. త్రాల్లో జరిగిన ఓ ఎన్ కౌంటర్లో డ్రోన్ చిత్రీకరించిన వీడియోలో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అయితే, వీరిలో ఉగ్రవాది ఆమిర్ నజీర్ వని ఎన్‌కౌంటర్‌కు కొన్ని నిమిషాల ముందు తన తల్లి ఫోన్ చేశాడు. వారి మధ్య జరిగిన భావోద్వేగ సంభాషణ వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.📞 ఆమీర్ నజీర్ వని,అతని తల్లికి మధ్య జరిగిన వీడియోకాల్ సంభాషణ:ఆమీర్: ఏకే 47 పట్టుకుని.. అమ్మా... నువ్వు ఎలా ఉన్నావు? తల్లి (ఎడుస్తూ): బేటా, నీవెక్కడ ఉన్నావు?"ఆమీర్: ఇక్కడ ఓ బిల్డింగ్ బేస్మెంట్లో దాక్కున్నాను. భద్రతా బలగాలు దగ్గరకు వస్తున్నాయి తల్లి: బేటా, వాళ్లకి లొంగిపో.. ప్రాణాలు కాపాడుకో.. నిన్ను చూడాలని ఉందిఆమీర్: తల్లి మాటలు పట్టించుకోలేదు. ‘ఆర్మీని ముందుకు రానివ్వండి… వారి సంగతి చూస్తా’ అంటూ ఫోన్ కట్ చేశాడు.అనంతరం,ఆసిఫ్ అహ్మద్ షేక్ సోదరికి వీడియో కాల్ చేశాడు. ఆమె తన సోదరుడు ఆసిఫ్ అహ్మద్ షేక్ గురించి ఆరా తీసింది. ఆసిఫ్ తన వద్దే ఉన్నాడని చెప్పాడు. అది విన్న ఆమె భయ్యా మీరంతా లొంగిపోయి ప్రాణాలు కాపాడుకోండి అని చెప్పగా.. నవ్వాడు. తామే ఆర్మీ పని పడుతామంటూ వివరించాడు. వీడియో కాల్ చేసిన కొద్ది సేపటికే భారత భద్రతా బలగాలు డ్రోన్ సాయంతో బేస్మెంట్లో నక్కిన ఉగ్రవాదుల్ని హతమార్చాయి.Mother pleads son Amir Nazir Wani, a Jaish-e-Mohammed (#JeM) terrorist to surrender before the Tral encounter began. He spoke to his mother and sister. #encounter #tral #pulwama #jammuandkashmir pic.twitter.com/t18ZsqDs7f— Madhuri Adnal (@madhuriadnal) May 15, 2025 గురువారం ఉదయం త్రాల్ ప్రాంతంలో నదీర్ గ్రామంలో ముష్కరులు నక్కినట్లుగా భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో బలగాలు కార్డన్ సెర్చ్ చేపట్టాయి. ఈ క్రమంలో కొన్ని గంటలపాటు హోరాహోరీగా ఎదురు కాల్పులు జరిగాయి. ఎట్టకేలకు ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు అసిఫ్ అహ్మద్ షేక్,ఆమీర్ నజీర్ వని, యావర్ అహ్మద్ భట్‌గా హతమయ్యారు. ఈ కాల్పులు జరిగే సమయంలో ఉగ్రవాది ఆమీర్ నజీర్ వని నిర్మాణంలో ఉన్న బేస్మెంట్లోకి వెళ్లి దాక్కున్నాడు. అయితే, అతడి ఆచూకీ కనుగొనేందుకు భద్రతా బలగాలు డ్రోన్ కెమెరాల్ని రంగంలోకి దించాయి. ఉగ్రవాది ఒక పిల్లర్ చాటున నక్కినట్లుగా దీనిలో స్పష్టంగా కనిపిస్తోంది. డ్రోన్ విజువల్ సాయంతో దళాలు అతన్ని మట్టుపెట్టాయి. ఈ ముగ్గురు ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతానికి చెందిన వారే. -
డ్రోన్ ఫుటేజ్.. ఉగ్రవాదుల్ని ఎంత క్లియర్‌గా రికార్డు చేసిందో..!
పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం మరో ఉగ్రదాడికి విఫలయత్నం జరిగింది. రెండు రోజుల క్రితం పలువురు ఉగ్రవాదులు జమ్మూ కశ్మీర్ లో మరో కిరాతకానికి పాల్పడే ప్రయత్నంలో దాన్ని మన నిఘా వర్గాలు పసిగట్టి వారిని హతమార్చాయి. మంగళవారం జమ్మూ కశ్మీర్ లో ముగ్గురు ఉగ్రవాదులు.. మన భద్రతా దళాల చేతిలో హతమయ్యారు. వారిని లష్కరే తోయిబాకి చెందిన ముగ్గురు ఉగ్రవాదులుగా భావిస్తున్నారు.జమ్మూ కశ్మీర్ లోని అవంతిపోరాలో ఉగ్రవాదులు తమ పన్నాగానికి సిద్ధమైన సమయంలో దాన్ని భారత భద్రతా బలగాలు తిప్పికొట్టి వారిపై కాల్పులు జరిపి హతమార్చాయి. అయితే భద్రతా బలగాల కాల్పుల్లో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో.. ఒక ఉగ్రవాది పహల్గాం దాడి అనుమానిత ఉగ్రవాదిగా భావించినా దానిపై క్లారిటీ రాలేదు. ఇదిలా ఉంచితే, ఈ ఘటనకు సంబంధించి ఇక్కడ డ్రోన్ ఫుటేజ్ ఒకటి బయటకొచ్చింది.तो ऐसे अपने वीर जवानों ने आतंकी को जहन्नुम पहुंचाया ।#TralEncounter pic.twitter.com/FCkDRqeYe3— Manish Yadav (@itsmanish80) May 15, 2025ఒక కాంక్రీట్ పిల్లర్ కింద ఉగ్రవాదులు తమ రైఫిల్స్ ను సరిచేసుకుంటున్న సమయంలో డ్రోన్ దానిని రికార్డు చేసింది. మరొక వీడియోలో విరిగిన షెడ్ లో గుమిగూడి ఉన్న మరి కొందరు కనిపించారు. దీనికి సంబంధించి కొన్ని ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇక గడిచిన రెండురోజుల్లో ఆరుగురు ఉగ్రవాదులు.. భారత బలగాల చేతిలో హతమయ్యారు.అయితే వీరంతా పోలీసులు, సైన్యం సంయుక్తంగా చేస్తున్న ఆపరేషన్ తర్వాత తప్పించుకునే క్రమంలో ఓ ఇంట్లో ఆశ్రయం పొంది ఒక్కొక్కరుగా బయటకొస్తున్నారు. ఇలా 48 గంటల్లో ఆరుగురు ఉగ్రవాదులు బయటకొచ్చి భద్రతా బలగాల చేతుల్లో హతమయ్యారు. -
‘నవాజ్ షరీఫ్ కనుసన్నుల్లోనే పాక్ సైనిక దాడులు’
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్‌పై భారత్ ప్రతీకారం తీర్చుకుంది. పాక్‌ను కోలుకోలేని విధంగా చావుదెబ్బ తీసింది. అయితే ఆపరేషన్ సిందూర్ జరిగే సమయంలో భారత్‌పై పాక్ సైనిక దాడికి దిగింది. ఆ దాడికి వ్యూహ రచన చేసింది పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) అధ్యక్షుడు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ అంటూ ఆ పార్టీ సీనియర్ నేత, పంజాబ్ రాష్ట్ర సమాచార శాఖ మంత్రి ఆజ్మా బుఖారీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆజ్మా బుఖారీ బుధవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆపరేషన్ సిందూర్ జరిగే సమయంలో భారత్‌పై పాక్ సైనిక దాడికి దిగింది. పాక్ సైన్యం.. భారత్‌పై ఎలా దాడి చేయాలనే ప్లాన్ మొత్తం నవాజ్ షరీఫ్ పర్యవేక్షణలో జరిగింది. ఆయన చిన్న స్థాయి నాయకుడు కాదు.. ఆయన చేసిన పనే ఆయన గురించి చెబుతుంది’ అని అజ్మా బుఖారీ వ్యాఖ్యానించారు. ఇటీవల భారత్ మే 7న ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్లో బీభత్సం సృష్టించింది. ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. వాళ్లకు శిక్షణ ఇచ్చే స్థావరాల్ని ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో, పాకిస్తాన్.. భారత్‌పై మే 8, 9, 10 తేదీల్లో భారత సైనిక స్థావరాలపై ప్రతిదాడికి ప్రయత్నించింది. అయినప్పటికీ భారత్ శక్తి, యుక్తులు ముందు అవి తేలిపోయాయి. దీంతో పాకిస్తాన్ సైన్యంపై ప్రతిపక్షాలు, నెటిజన్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ తరుణంలో ఆజ్మా బుఖారీ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
మొన్న గుజరాత్ .. నేడు రాజస్థాన్!
జైపూర్: దేశంలో అక్రమ వలస దారుల ఏరివేత కార్యక్రమం మరింత పుంజుకుంది.. భారత్‌లో అక్రమంగా నివసిస్తున్న ఇతర దేశస్తులను వెనక్కి పంపించే ప్రయత్నం చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. దీనిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వాలు అక్రమ వలసదారుల్ని ఏరివేసే పనిలో పడ్డాయి. ఇటీవల గుజరాత్ లో అక్రమంగా ఉంటున్న వెయ్యి మందికి పైగా బంగ్లాదేశీయులను వెనక్కి పంపించగా, తాజాగా రాజస్తాన్ లో కూడా వెయ్యికి పైగా బంగ్లాదేశ్ కు చెందిన అక్రమ వలసదారుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.వీరిని ప్రస్తుతం తమ దేశానికి పంపించే యత్నం చేస్తున్నారు. రాజస్తాన్ లోని 17 జిల్లాల్లో జల్లెడ పడితే 1,008 మంది బంగ్లాదేశీయులు దొరికారు. ఒక్క సిల్కార్ జిల్లాలోనే 394 మంది అక్రమ బంగ్లాదేశీయులు ఉండటం గమనార్హం. వీరందర్నీ ఇప్పుడు దేశం దాటించే పనిలో పడ్డాయి ఎయిర్ ఫోర్స్, బీఎస్ఎఫ్ సిబ్బంది.పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్ లో ఉండే అక్రమ వలసదారుల్ని ఏరివేస్తున్నారు. ప్రధానంగా అక్రమంగా ఉండే పాకిస్తానీయులిపై వెంటనే ఆ దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ నుంచి వచ్చి భారత్ లో అక్రమంగా స్థిరపడిన వారు వేలల్లో పోలీసులకు పట్టుబడుతున్నారు. #WATCH | Rajasthan: First batch of Bangladeshi nationals, who were living illegally in India, and were caught in the past few days were brought to Jodhpur today. They are being deported to Bangladesh. pic.twitter.com/hLqKxDSlb5— ANI (@ANI) May 14, 2025 ఇది కూడా చదవండి:జల్లెడ పడితే.. ‘చీమల దండులా’ బయటకొచ్చారు! -
కర్నల్ సోఫియా ఖురేషీపై మంత్రి వ్యాఖ్యలు.. హైకోర్టు సీరియస్, చర్యలకు ఆదేశాలు
భోపాల్: ఆపరేషన్ సింధూర్‌పై ( Operation Sindoor) మీడియా బ్రీఫింగ్లో పాల్గొన్న కల్నల్ సోఫియా ఖురేషీపై (Colonel Sofiya Qureshi)పై మధ్యప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారి తీశాయి. ఈ వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్లను సుమోటోగా స్వీకరించిన మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కల్నల్ సల్మాన్ ఖురేషీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి విషయ్ షాపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించింది.కర్నల్ సోఫియా ఖురేషీని ఉద్దేశిస్తూ మంత్రి విజయ్ షా వ్యాఖ్యలు మంత్రి విజయ్ షా (Kunwar Vijay Shah) మంగళవారం మౌలో జరిగిన ఓ సాంస్కృతిక కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఉగ్రవాదులు మన సోదరీమణుల సింధూరాన్ని తుడిచేశారు. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ సైనిక విమానంలో వాళ్ల (ఉగ్రవాదులు) మతానికి చెందిన సోదరిని పాక్‌కు పంపించి అదే రీతిలో పాఠం నేర్పించారు’ అని అన్నారు.అయితే, విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై దాఖలైన పిటిషన్లపై మధ్యప్రదేశ్ హైకోర్టు విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా.. జబల్పూర్ హైకోర్టు న్యాయమూర్తులు అతుల్ శ్రీధరన్, అనురాధ శుక్లాతో కూడిన ధర్మాసనం కల్నల్ సల్మాన్ ఖురేషీపై విజయ్ షా చేసిన వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.‘విజయ్ షా చేసిన వ్యాఖ్యలు అత్యంత ప్రమాదకరమైనవి, తక్కువ చేయడమేనన్న అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇలాంటి వ్యాఖ్యలు ముస్లింలను వేర్వేరుగా చూడాలనే భావనను ప్రోత్సహించడమే కాకుండా, ఎవరు ముస్లిం అయితే వాళ్లు దేశభక్తులు కాదనే భ్రమను కలించేందుకు దారితీస్తాయి. ఇది భారత రాజ్యాంగంలో ఐకమత్యం,సోదర భావం అనే మౌలిక విలువలకు విరుద్ధం’అని వ్యాఖ్యానించిందిఈ సందర్భంగా నిజాయితీ, శ్రమ, క్రమశిక్షణ, త్యాగం, నిస్వార్థత, స్వభావం, గౌరవం, దైర్యం వంటి విలువలకు ప్రతీక సాయుధ దళాలు’ అని ప్రశంసలు కురిపించింది. ఇలా దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న వారిపట్ల మంత్రి విజయ్ షా చేసిన వ్యాఖ్యల్ని ఖండించింది.India Pakistan News: MP Court Orders FIR Against BJP Leader Over Colonel Sofiya Qureshi Remark#DNAVideos | #IndiaPakistanTensions | #MadhyaPradesh | #BJP | #sofiyaqureshi For more videos, click here https://t.co/6ddeGFqedQ pic.twitter.com/W0kMjYhATB— DNA (@dna) May 14, 2025 -
దేశానికి సేవ చేయాలని కలగన్నాడు..కానీ, పెళ్లైన నాలుగునాళ్లకే
పహల్గామ్ ఉగ్రదాడి అనేక కుటుంబాల్లో అంతులేని శోకాన్ని నింపిండి. తాజాగా BSF కానిస్టేబుల్ రాంబాబు సింగ్ అసువులు బాశాడు. మే 9, 2025న ఇండో-పాక్ సరిహద్దులో తన ధైర్య సైనికుల సోదరులతో కలిసి పోరాడుతున్న క్రమంలో జమ్మూ కాశ్మీర్లో ప్రత్యర్థుల కాల్పులకు గురయ్యాడు. తీవ్రంగా గాయపడిన అతను మే 13న తుదిశ్వాస విడిచాడు. దీంతో అతని కుటుంబం తీవ్ర విషాదంలో మునిగి పోయింది.నాలుగు నెలల క్రితం వివాహంబోర్డర్ సెక్యూరిటీ దళానికి చెందిన రాంబాబు సింగ్ బీహార్‌లోని సివాన్ జిల్లాకు చెందినవాడు. ఏప్రిల్ 22న జరిగినపహల్గామ్ దాడి, 26 మంది అమాయకుల చనిపోయిన తరువాత కేంద్ర ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ సిందూర్'లో పోరాడుతూ అమరుడైనాడు. రాంబాబు మృతదేహాన్ని మే 14, 2025న అతని గ్రామం వాసిల్పూర్కు తీసుకువచ్చారు. గ్రామస్తులందరూ అమరసైనికుడికి కన్నీటి నివాళులర్పించారు. ఆర్మీ అధికారులు , జిల్లా అధికారుల అంత్యక్రియలకు హాజరయ్యారు. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కూడా వీర జవాన్‌కు నివాళులర్పించారు.#WATCH | Siwan, Bihar | Mortal remains of BSF Jawan Rambabu Singh, who lost his life in the line of duty due to cross-border shelling from Pakistan, brought to his native village in Siwan. pic.twitter.com/iShgQ0J1Dh— ANI (@ANI) May 14, 2025 #WATCH | Patna, Bihar | Mortal remains of BSF Jawan Rambabu Singh, who lost his life in the line of duty due to cross-border shelling from Pakistan, brought to Patna.RJD leader Tejashwi Yadav pays tribute to him. pic.twitter.com/RBGOMOUNF2— ANI (@ANI) May 14, 2025ఆపరేషన్ సిందూర్లోరాంబాబు సింగ్ ముందు వరుసలో నిలబడి అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించాడు. చిన్నప్పటినుంచీ దేశానికి సేవ చేయాలనేకోరికతో సైనికుడిగా బాధ్యతల్లో చేరాడు. ఆ జవాన్ నాలుగు నెలల క్రితం (2025, ఫిబ్రవరి) వివాహమైంది. ఆ తర్వాత వివాదాస్పద ప్రాంతానికి బదిలీ అయ్యాడు. దేశంకోసం పోరాడుతూ ప్రాణాలర్పించిన అమరవీరుడి మరణ వార్త రాంబాబు సింగ్ గ్రామం మొత్తాన్ని దిగ్భ్రాంతికి, దుఃఖానికి గురిచేసింది. తన భర్త మరణం తనను తీవ్రంగా కలిచి వేసిందిని, కానీ చాలా గర్వంగా ఉందంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవలే రాంబాబు తండ్రి మరణించారు. ఇదీ చదవండి: 2027లో సుప్రీంకోర్టు చరిత్రలోనే రికార్డు సృష్టించనున్నది ఎవరో తెలుసా?రాంబాబు సింగ్ త్యాగాన్ని దేశం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటుంది అంటూ జవాను మరణంపైబీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంతాపాన్ని వ్యక్తం చేశారు. అమరవీరుడి బంధువులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.చదవండి: లగ్గం..షరతుల పగ్గం! పెళ్లికాని ప్రసాదుల కష్టాలు ఇంతింత కాదయా!పహల్గామ్ దాడి , 'ఆపరేషన్ సిందూర్'జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్లోని బైసరన్‌లో అమాయక పౌరులపై గుర్తు తెలియని ముష్కరులు కాల్పుల్లో 26 మంది మరణించారు. ఈ దాడికి ప్రతిస్పందనగా, మే 7, 2025 తెల్లవారుజామున రక్షణ మంత్రిత్వ శాఖ 'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్తాన్ మరియు పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడి చేసింది. -
నీళ్ల కోసం ఇక పాక్ కాళ్లబేరం!
ఇండియా, పాకిస్తాన్ మే 10న కాల్పులను విరమించాయి. దీనికి అమెరికా చొరవ చూపి నట్టుగా వార్తలొచ్చాయి. ఏప్రిల్ 22 పహల్ గామ్ దాడి నుంచి మే 10 కాల్పుల విరమణ వరకు గడచిన ఈ స్వల్పకాలంలో ఇరు దేశాల సంబంధాలు మౌలికంగా కొత్త రూపు సంతరించుకున్నాయి. ఉగ్రదాడికి ముందు ఇండియా–పాకి స్తాన్ సంబంధాలు ఎలా ఉండేవో ముందుగా తెలుసుకోవాలి. రెండు దేశాల నడుమ పరిష్కారం కాని సమస్యలపై ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ, కాల్పుల విరమణ సజావుగా కొనసాగుతోంది. సింధూ నదీ జలాల ఒప్పందానికి (ఇండస్ వాటర్ ట్రీటీ– ఐడబ్ల్యూటీ) ఇండియా కట్టుబడి ఉంది. పరిమిత కాల పర్యటనలకు వీలుగా అటారీ–వాఘా సరిహద్దు తెరిచే ఉంటోంది. రాజధానుల్లో హై కమిషనర్లు మినహా సీనియర్ దౌత్యాధికారులు పనిచేస్తున్నారు. ఏదో ఒకరోజు కశ్మీర్ మీద చర్చలు సాధ్యమేనన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఉగ్రదాడి మరునాడు, అంటే ఏప్రిల్ 23న, సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ఇండియా ప్రకటించింది. అటారీ– వాఘా సరిహద్దును మూసేసింది. రక్షణ సహాధి కారుల పోస్టులను రద్దు చేసింది. ఈ క్రమంలో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ భగ్నమైంది. పాకిస్తాన్ ఒకడుగు ముందుకేసి 1972 సిమ్లా ఒప్పందం రద్దు చేస్తానని బెదిరించింది. ఉగ్రవాదాన్ని అంతం చేస్తేనే నీళ్లు!కట్ చేస్తే... మే 11న అకస్మాత్తుగా వైరాలు నిలిచిపోయాయి. మళ్లీ కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. దీంతో మారిన పరిస్థి తులు ఏవి? దీని తర్వాతా మారనివేమిటి? మే 10న రెండు దేశాల డీజీఎంఓ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్)లు టెక్నికల్ అగ్రిమెంటు కుదుర్చుకున్నారు. దీని ప్రకారం, నియంత్రణ రేఖ (లైన్ ఆఫ్ కంట్రోల్–ఎల్ఓసీ) పొడవునా కాల్పులు జరగవు. డ్రోనులు, క్షిపణులు ప్రయోగించుకోరు. ఇతర లాంగ్ రేంజ్ ఆయు ధాల ప్రయోగం జరగదు. పరస్పర సైనిక దాడులు నిలిచిపోతాయి. ఇక కాల్పుల విరమణ ఒప్పందం వమ్ము చేయలేనివి ఏమిటో చూద్దాం. ఏప్రిల్ 23న ఇండియా, ఆ తర్వాత పాకిస్తాన్ తీసుకున్న చర్యలను మే 10 ఒప్పందం రద్దు చేయలేదు. ఇది టెక్నికల్ స్థాయి పత్రం తప్ప రాజకీయ ఒప్పందం కాదు. డీజీఎంఓలకు రాజకీయ ఒప్పందాలు చేసుకునే అధికారం లేదు. వీటిని విదేశీ వ్యవహారాల శాఖలు మాత్రమే కుదుర్చుకోగలవు. మరో విధంగా చెప్పాలంటే, ఏప్రిల్ 22 నాటి పరిస్థితిని ఇరు దేశాలూ పునరుద్ధరించలేదు. అందుకే, ఇండియా, పాకిస్తాన్ నడుమ ఇప్పుడున్నది నయా స్టేటస్ కో! అంటే, ఐడబ్ల్యూటీ ఇక ముందు కూడా నిలుపుదలలోనే ఉంటుంది. సింధు జలాలు ఇండియా ఇష్టానుసారం ప్రవహిస్తాయి. ఈ జలాల గణాంకాలను పాకిస్తాన్‌తో పంచుకోవడానికి ఇండియా సుముఖంగా లేదు. దాయాది దేశ ఆర్థిక వ్యవస్థను, అంతర్గత రాజకీయాలను దీర్ఘ కాలంలో ఈ నిర్ణయం తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. ఐడబ్ల్యూటీ నిలిపివేత ఇండియా–పాకిస్తాన్ దౌత్య సంబంధాల రూపురేఖలను మౌలికంగా మార్చేసిన తీవ్ర చర్య. పాక్ టెర్రరిజానికి స్వస్తి పలికితే తప్ప సింధు జలాల ఒప్పందాన్ని పునరుద్ధరించబో మని ఇండియా తేల్చిచెప్పింది. ఏకపక్షంగానో, లేదా ద్వైపాక్షిక చర్చల అనంతరమో దీన్ని పునరుద్ధరించడం పూర్తిగా ఇండియా చేతిలో ఉంది. మే 10 కాల్పుల విరమణ ఒప్పందం పరిధిలోకి ఈ అంశం రాదు.భవిష్యత్ చర్చల్లో పాకిస్తాన్ మెడలు వంచడానికి ఈ ఐడబ్ల్యూటీ సస్పెన్షన్ గొప్ప అస్త్రం అని చెప్పాలి. పాకిస్తాన్‌కు సింధూ బేసిన్ నీళ్లు కావాలంటే, టెర్రరిజం విషయంలో ఇండియా డిమాండ్లకు అది తలొగ్గాల్సిందే. కశ్మీర్ అనేది భావోద్వేగాలకు సంబంధించిన అంశం. అయితే, పాకిస్తాన్ ప్రజలకు నీరు జీవన్మరణ సమస్య. పాకిస్తాన్ ఇకముందు కూడా కశ్మీర్ పాట పాడుతుంది. కానీ, ఐడబ్ల్యూటీ విషయంలో ఇండియాను సానుకూలం చేసుకోడమే మున్ముందు వారి అసలు లక్ష్యం అవుతుంది. ఉభయ పక్షాల చర్చల్లో కశ్మీర్ అంశం ప్రాముఖ్యం కోల్పోతుంది. దాని స్థానంలో ఐడబ్ల్యూటీ కీలకాంశంగా మారుతుంది. మరో విధంగా చెప్పాలంటే, ఇండియా తీసు కున్న ఐడబ్ల్యూటీ సస్పెన్షన్ అనే ఒకే ఒక్క చర్యతో... ఇరు దేశాల సంబంధాల్లో ఇప్పటి వరకు కేంద్రబిందువుగా ఉన్న కశ్మీర్ స్థానాన్ని ఇప్పుడు నీరు ఆక్రమించింది. నిగ్రహం బాధ్యత పాక్ మీదే...1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం అనంతరం, 1972లో సిమ్లా ఒప్పందంపై సంతకాలు చేసినప్పుడు కూడా ఇండియా ఇలానే వ్యవహరించింది. యుద్ధం ముందు ఉన్న ప్రాదేశిక స్థితిని (1965 యుద్ధానంతరం మాదిరిగా) యథాతథంగా అంగీకరించలేదు. కశ్మీర్ సరిహద్దు పేరును ‘కాల్పుల విరమణ రేఖ’ నుంచి ‘నియంత్రణ రేఖ’ (ఎల్ఓసీ)గా మార్చింది. ఇలా చేయడం ద్వారా కశ్మీర్లో తృతీయ పక్షం జోక్యాన్ని వ్యతిరేకించగలిగింది. అప్పటి నుంచి జమ్ము– కశ్మీర్లో యూఎన్ పరిశీలకుల ఉనికి నామమాత్రమైంది. సారాంశం ఏమిటంటే, పహల్గామ్ ఉగ్రదాడి, దాని పర్యవ సానాలు ఇండియా–పాకిస్తాన్ సంబంధాలను రెండు విధాలుగా ప్రభావితం చేశాయి. మొదటిది: పాకిస్తాన్ కోరుకున్నట్లు కశ్మీర్ అంశం కొంతవరకు అంతర్జాతీయ సమాజం దృష్టిని ఆకర్షించింది. అయితే ద్వైపాక్షిక చర్చల నుంచి కశ్మీర్‌ను తప్పించడంలో ఇండియా విజయం సాధించింది. పాకిస్తాన్ ఇప్పుడు సర్వశక్తులూ ఐడబ్ల్యూటీ మీదే కేంద్రీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాకిస్తాన్‌కు నీళ్లు కావాలి.ఇండియాకు టెర్రరిజం అంతం కావాలి. ఇప్పటి వరకు, టెర్రరిజం అంతానికి పాకిస్తాన్ అంగీకరించాలంటే ఇండియా కశ్మీర్‌పై చర్చలు జరపాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడది మారింది.రెండవది: ఇరు దేశాల నడుమ సంఘర్షణ తలెత్తినప్పుడు, వైరాన్ని ఉప–సాంప్రదాయిక (సబ్–కన్వెన్షనల్) స్థాయిని దాటనివ్వ లేదని ఇండియా తన చర్యలు, ప్రతిచర్యల ద్వారా చాటిచెప్పింది. భవిష్యత్తులో మాత్రం ఇది కుదరదని, సబ్–కన్వెన్షనల్ దాడులకు సాంప్రదాయిక స్థాయిలోనే ప్రతి చర్యలు ఉంటాయని ప్రకటించింది. అంటే, ఇండియాతో పూర్తిస్థాయి యుద్ధం వద్దనుకుంటే, ఉప–సాంప్రదాయిక స్థాయిలోనూ పోరు ప్రారంభించకుండా నిగ్రహం పాటించాల్సిన బాధ్యత పాకిస్తాన్ మీదే ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే, టెర్రరిజానికి ఇక సాంప్రదాయిక యుద్ధంతోనే జవాబు చెబుతామని ఇండియా స్పష్టం చేయగలిగింది. ఇందుకోసం భారీ మిలిటరీ సంక్షోభం ఉత్పన్నమై అనేక మంది బలి కావలసి రావడం దురదృష్టకరం. వైరి దేశం ఉగ్ర దాడులకు తెగబడ కుండా నిరోధకత సాధించడానికి, దాన్ని కొనసాగించడానికి ఈ పాటి మూల్యం చెల్లించక తప్పదు.హ్యాపీమాన్ జాకబ్ వ్యాసకర్త జేఎన్‌యూలో ఇండియా ఫారిన్ పాలసీ బోధకులు (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
ధైర్యమే కాదు... అంతులేని త్యాగం కూడా...
కశ్మీర్‌లోని పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఇండియన్ ఆర్మీ.. పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై దాడులు చేసింది. ఈ దాడుల్లో పలువురు ఉగ్రవాదులు హతమయ్యారు. అయితే ఆ తర్వాత ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోవడం తెలిసిందే. కాగాపాక్ కుట్రలను దీటుగా ఎదుర్కొన్న ఇండియన్ ఆర్మీపై ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు ప్రశంసలు కురిపించారు.తాజాగా హీరోయిన్ ఆలియా భట్ కూడా ఇండియన్ ఆర్మీపై, సైనికుల మాతృమూర్తులపై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ భావోద్వేగమైనపోస్ట్ పెట్టారు. ‘‘గత కొన్ని రాత్రులు భిన్నంగా అనిపించాయి. ఒక దేశం ఊపిరి బిగబట్టినప్పుడు గాలిలో ఒక విధమైన నిశ్శబ్దం ఉంటుంది. కొద్ది రోజులుగా మనం ఆ నిశ్శబ్దాన్ని అనుభవించాం. మనం ఇళ్లలో హాయిగా నిద్రపోతున్నామంటే బోర్డర్లో ఉన్న సైనికులు చీకటిలో నిలబడి, తమ ప్రాణాలను అడ్డుగా పెట్టి మన నిద్రను కాపాడుతున్నారు.ఆదివారం మనమంతా మదర్స్ డేను సంతోషంగా చేసుకున్నాం. ఆ సమయంలో దేశ రక్షణ కోసం హీరోలను పెంచిన తల్లుల గురించి ఆలోచించకుండా ఉండలేకపోయా. వారిది కేవలం ధైర్యం మాత్రమే కాదు... అంతులేని త్యాగం కూడా. ఈ ప్రతి యూనిఫామ్ వెనుక నిద్రపోని ఒక తల్లి కూడా ఉంటుంది. తన బిడ్డకు ఏ రాత్రీ జోలపాటలా ఉండదని ఆ తల్లికి తెలుసు. ప్రాణాలు కోల్పోయిన సైనికులను తలచుకుని మనం దుఃఖిస్తున్నాము.అనిశ్చితి... ఒత్తిడితో కూడిన ఆ నిశ్శబ్దం ఏ క్షణమైనా బద్దలు కావొచ్చు. కానీ... ప్రతి రాత్రి ఉద్రిక్తతలు లేని ప్రశాంతతను కోరుకుంటున్నాం. ప్రార్థనలు చేస్తూ, కన్నీళ్లు దిగమింగుకుంటున్న ప్రతి తల్లిదండ్రులకు ప్రేమను పంపుతున్నాం... ఎందుకంటే మీ బలం ఈ దేశాన్ని మీరు ఊహించినదానికంటే ఎక్కువగా కదిలిస్తుంది. మన రక్షకుల కోసం, భారతదేశం కోసం కలిసి నిలబడదాం.. ‘జైహింద్’’ అంటూపోస్ట్ చేశారు ఆలియా భట్. -
పహల్గాం దాడి అనుమానిత ఉగ్రవాది హతం
-
జమ్మూకశ్మీర్ ఎన్కౌంటర్.. ముగ్గురు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. షోపియాన్ జిల్లాలో మంగళవారం భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో లష్కరే తోయిబాకి చెందిన ముగ్గురు ఉగ్రవాదులు హతయ్యారు. అయితే భద్రతా బలగాల కాల్పుల్లో హతమైన ముగ్గురు ఉగ్రవాదుల్లో.. ఒక ఉగ్రవాది పహల్గాం దాడి అనుమానిత ఉగ్రవాదేనన్న అనుమానం నెలకొంది. మరోవైపు, పహల్గామ్ ఉగ్రవాద దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల గురించి సమాచారం అందించాలని ప్రజలను కోరుతూ పోలీసులు జమ్మూకశ్మీర్‌లోని షోపియన్ జిల్లా అంతటా పోస్టర్లను అతికించారు. ఈ పాకిస్తానీ ఉగ్రవాదుల గురించి నిర్ధిష్ట సమాచారం అందించిన వారికి రూ.20 లక్షల బహుమతి అందిస్తామని పోస్టర్లలో పేర్కొన్నారు.ఈ క్రమంలో ఉగ్రవాదులపై సమాచారం అందుకున్న భద్రతా బలగాలు షోపియాన్ జిల్లాలో మొహరించారు. తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ తనిఖీల్లో ఓ ప్రాంతంలో నక్కి ఉన్న ఉగ్రవాదులపై భద్రతా దళాలు కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఓ ఉగ్రవాది హతమయ్యాడు. మరో ఇద్దరు ఉగ్రవాదుల కోసం వేటని ముమ్మరం చేశాయి. #BREAKING: J&K Police has pasted Posters across Shopian district of Jammu & Kashmir urging people to provide information of those terrorists involved in Pahalgam terror attack.Rs 20 lakh reward to the person who will provide any information about these Pakistani terrorists. pic.twitter.com/zjV7VUWtFb— Aditya Raj Kaul (@AdityaRajKaul) May 13, 2025 -
ముక్కలు చేయడమే మార్గం!
క్రమం తప్పకుండా జరుగుతున్న భారీ ఉగ్ర వాద దాడులు భారత్, పాకిస్తాన్ సంబంధాలను ఘోరంగా దెబ్బతీశాయి. సాధారణంగా, ప్రతి పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ పదవీకాలంలో కనీసం ఒక్కసారైనా ఇలాంటి దాడులు జరుగుతాయి. ఎక్కువకాలం సైనిక నాయకత్వ స్థానంలో ఉన్న వ్యక్తి, పౌర అధికారంపై మరింతగా నియంత్రణ సాధించాల్సిన అవసరం ఉందని భావించినప్పుడు లేదా అతని బలగాలు దేశంలో గౌరవాన్ని కోల్పోతున్నప్పుడు ఉగ్రవాద దాడులు చోటు చేసుకుంటాయి. భారతదేశం నుండి సైనిక ముప్పు ఉందన్న ప్రచారం కంటే పాకిస్తాన్ ప్రజలను మరేదీ కలిపి ఉంచదు. పైగా వరదలు, కరవులు, ఉగ్రవాద ఘటనలతో సహా పాకిస్తాన్ లో జరిగే ప్రతిదానికీ భారతదేశంపైనే నిందలు మోపుతూ వస్తారు.భారతదేశం మన పాకిస్తాన్‌ను నాలుగు ముక్కలు చేయాలని చూస్తోందనీ, దాన్ని రక్షించే ఏౖకైక శక్తి పాక్ సైన్యమే అనీ పాక్ ప్రజలకు తొలి నుంచీ నేర్పించారు. భారత్ సహన పరిమితిని దాటిన ప్రతి ఉగ్రవాద ఘటన తర్వాత, పాకిస్తాన్ సాధారణ వ్యాఖ్యలను పునరావృతం చేస్తుంటుంది. వారి మంత్రులు దీనిని భారతదేశం ప్రారంభించిన ‘తప్పుడు’ ఆపరేషన్ అని, లేదంటే ఇది కశ్మీర్ ‘స్వాతంత్య్ర సమరయోధుల’ పని అని గావుకేకలు పెడతారు. తమ గడ్డపైనే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తున్నామనే ఆరోపణను వారు నిరంతరం తిరస్కరిస్తారు. పైగా ఉగ్రవాదానికి అత్యంత ప్రభావి తమైన దేశం తమదే అని వాపోతుంటారు. అయితే దాదాపు ప్రతి ప్రపంచ స్థాయి ఉగ్రవాద ఘటనకూ పాకిస్తాన్‌తో సంబంధం ఉందనీ, ఐక్యరాజ్యసమితి ప్రకటించిన ఉగ్రవాదులలో అత్యధికులు పాక్‌లోనే ఆశ్రయం పొందారనీ ప్రపంచానికి తెలుసు.ఎన్నని సహిస్తాం?కథ పునరావృతమవుతుంది. పైగా విసుగు పుట్టిస్తుంది. బహిరంగ అంతర్జాతీయ దర్యాప్తునకు పాక్ వైపు నుంచి ఎప్పుడూ హామీ ఉంటుంది, కానీ ఈ ప్రతిపాదనను ఎవరూ నమ్మరు. ముంబై ఉగ్ర దాడి సూత్రధారులలో ఒకరైన తహవ్వుర్ రానాను అమెరికా ఇటీవలే భారతదేశానికి అప్పగించింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత కూడా ముంబై ఉగ్రవాద దాడులపై ఇంకా దర్యాప్తు చేయవలసి వస్తోంది. ఉగ్రవాద నాయకులపై పాకిస్తాన్ ఎప్పటికీ చర్య తీసు కోదు. ఎందుకంటే వారే పాక్ ప్రధాన ఆస్తులు. పహల్గామ్ ఉగ్ర దాడిపై దర్యాప్తు కూడా దశాబ్దాలుగా నిగూఢంగా ఉండిపోతుంది. దావూద్ ఇబ్రహీమ్ ఉనికిని అది ఎల్లప్పుడూ ఖండిస్తూ వచ్చింది. అయినప్పటికీ ప్రతి ప్రపంచ సంస్థకూ పాకిస్తాన్ లో అతని బహుళ నివాసాల గురించి తెలుసు. దీనికి విరుద్ధంగా, ప్రతీకారం తీర్చు కుంటామని ఇండియా బెదిరిస్తే, వారు అకస్మాత్తుగా తమ భూ భాగంపై ఉగ్రవాద కార్యకలాపాలలో భారతదేశ ప్రమేయం ఉందని ఇష్టారాజ్యంగా అబద్ధాలాడతారు.ప్రజల మద్దతు పొందాలనే ఆశతో, సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేయడంపై భారతదేశాన్ని పాక్ బెదిరించడం ప్రారంభించింది. దాని ఆనకట్టలు భారతీయ రక్తంతో నిండిపోతా యని రెచ్చ గొట్టేంత వరకు వెళ్ళింది. చరిత్ర గమనిస్తే, భారత ప్రభు త్వాలు రావల్పిండిని నియంత్రించడంపై ప్రపంచ మద్దతు కోరుతూ పాకిస్తాన్ ఉగ్రవాద దాడులపై తీవ్ర విమర్శ చేస్తూ వచ్చాయి. కానీ అది ఎప్పుడూ పని చేయలేదు. దీనికి విరుద్ధంగా, తరచుగా విరామాలతో కూడిన ఉగ్రవాద దాడులకు పాక్ తలుపులు తీసింది. 2001 అక్టోబర్‌లో జమ్మూ–కశ్మీర్ శాసనసభపై దాడి, ఆ తర్వాత అదే సంవత్సరం డిసెంబర్లో పార్లమెంటుపై దాడి, 2002 సెప్టెంబర్‌లో అక్షరధామ్‌పై దాడి, 2003 ఆగస్టులో ముంబై బాంబు దాడులు, ఆ తర్వాత 2005 అక్టోబర్‌లో ఢిల్లీలో బహుళ బాంబు దాడులు, 2006 జూలైలో ముంబై రైలు దాడులు, 2008 నవంబర్‌లో ముంబైలో జరిగిన ఉగ్రవాద దాడి కొన్ని ఉదాహరణలు. బాలాకోట్‌పై జరిగిన దాడి తర్వాత మాత్రమే భారత్ సందేశం అంతటా వినిపించింది. కానీ సరిహద్దులు దాటి భారత్ చేసిన బాలాకోట్ సర్జికల్ దాడి కూడా పాకిస్తాన్‌ను నిరోధించడంలో విఫలమైంది. ఎందుకంటే భారత్ దాడిలో సంభవించిన ప్రాణనష్టాన్ని పాక్ దాచగలిగింది. కారణం... హతమార్చబడిన వారు ఉగ్రవాదులు!పెద్ద మార్పు ఉండదు!సింధూ నదీ జలాల ఒప్పందాన్ని నిలుపుదల చేసిన ప్రభావం ఇస్లామాబాద్‌కు బాగా తెలుసు. వారి నాయకత్వాన్ని అది భయ పెట్టింది. కానీ, ఇది అంతర్జాతీయ చట్టానికి విరుద్ధమని చెప్పడం తప్ప వారికి వేరే పరిష్కారం లేదు. భారతదేశం తన నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని వారు ఇక ఒప్పించలేరు. రెండు దేశాల మధ్య సంబంధాలు శాంతియుతంగా ఉండాలనే ముందస్తు షరతు పైనే ఈ ఒప్పందంపై సంతకం చేశారనేది వాస్తవం. మరోవైపున అఫ్గానిస్తాన్‌కు భారతదేశం సన్నిహితం కావడం పాకిస్తాన్లో ఆందోళనలను మరింత పెంచింది. ముఖ్యంగా పాకిస్తాన్ తన బలగాలను భారత సరిహద్దుకు తరలించినప్పుడల్లా బలోచ్ లిబరేషన్ ఆర్మీ, తెహ్రీక్ ఎ తాలిబన్ పాకిస్తాన్ ఈ అంతరాన్ని బాగా ఉపయోగించు కుంటాయి. అంతర్జాతీయ సరిహద్దు, నియంత్రణ రేఖ వెంట పాకి స్తాన్ తన సైన్యాన్ని మోహరించి ఉంచినంత కాలం, వారి ఆర్థిక వ్యవస్థపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే భారత్ ఎదుర్కొంటున్న సమస్య ఏమిటంటే, అది ఏ సైనిక చర్య తీసుకున్నా, పెద్దగా మార్పు ఉండదు. పాక్‌లో కొత్త ఆర్మీ చీఫ్ వచ్చి తనవంతుగా ఏదైనా చేయాలని భావించే వరకు, పాకిస్తాన్ ఉగ్రవాదానికి తక్కువ స్థాయిలో మద్దతు ఇస్తూనే ఉంటుంది. తర్వాత, మరొక ఘటన జరుగుతుంది. కథ పునరావృతమవుతూ ఉంటుంది. పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదం నుండి భారతదేశాన్ని రక్షించడానికి ఏకైక పరిష్కారం దాని బాల్కనైజేషన్ మాత్రమే (అంటే ఒక దేశం లేదా ప్రాంతాన్ని బహుళ చిన్న, శత్రు యూనిట్లుగా విభజించే ప్రక్రియ). దీని కోసం, పాకిస్తాన్ నుండి స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న సమూహాలకు భారతదేశం తన మద్దతును ఇవ్వాలి.హర్ష కక్కడ్ వ్యాసకర్త భారత సైన్యంలో రిటైర్డ్ మేజర్ జనరల్(‘ద స్టేట్స్‌మన్’ సౌజన్యంతో) -
చావుదెబ్బ తిన్నా, విజయోత్సవ ర్యాలీ అంటూ హడావుడి చేసిన అఫ్రిది.. వైరల్ వీడియో
గత వారం రోజులుగా పాక్‌తో జరిగిన యుద్దంలో భారత్ పైచేయి సాధించిన విషయం తెలిసిందే. శనివారం ఇరు దేశాలు కాల్పుల విరమణకు అంగీకరించడంతో యుద్దం ముగిసింది. సీస్ ఫైర్ ఒప్పందం తర్వాత కూడా పాక్ కొన్ని గంటల పాటు భారత్‌పై దాడులకు తెగబడింది. ఎట్టకేలకు నిన్నటి నుంచి పాక్ అన్నీ మూసుకుని కామ్‌గా కూర్చుంది. యుద్దానికి పుల్‌స్టాప్ పడిన తర్వాత పైచేయి సాధించిన భారత్ ఎలాంటి గొప్పలకు పోకుండా తమ పని తాము చేసుకుని పోతుండగా.. భారత దళాల చేతిలో చావుదెబ్బ తిన్న పాకిస్తాన్ మాత్రం హడావుడి చేస్తుంది. Shahid Afridi leading a so called 'victory rally' in Karachi. - Just like their army, everyone is delusional. pic.twitter.com/OnHRvmbzax— Mufaddal Vohra (@mufaddal_vohra) May 12, 2025భారత్‌పై యుద్ధం గెలిచామని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ గొప్పలు చెప్పుకోగా.. తాజాగా ఆ దేశ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది ఓ అడుగు ముందుకేసి కరాచీలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియోలో అఫ్రిది కారు పైకప్పుపైకి ఎక్కి ఏదో సాధించామన్నట్లు ఫోజులు కొడుతూ కనిపించాడు. అతని వెనుక పలువురు పాకిస్తాన్ జెండాలతో కనిపించారు. ఈ వీడియోపై భారతీయులు భగ్గుమంటున్నారు. చావు దెబ్బ తిన్నా సిగ్గులేకుండా విజయోత్సవ ర్యాలీ ఎలా జరుపుకుంటారంటూ కామెంట్లు చేస్తున్నారు.ఈ ర్యాలీ సందర్భంగా అఫ్రిది భారత్‌పై నోరు పారేసుకున్నట్లు తెలుస్తుంది. భారత సైన్యమే ముందుగా పాక్‌పై దాడి చేసిందని అఫ్రిది అన్నాడట. భారత దాడులను పాక్ బలగాలు తిప్పికొట్టాయని బిల్డప్ ఇచ్చాడట. భారత ప్రధాని మోదీని ఉద్దేశించి కూడా అవాక్కులు చవాక్కులు పేలాడట. దయ్యాలు వేదాలు వల్లించినట్లు తాము శాంతికాముకులమని ప్రకటించుకున్నాడట.అఫ్రిది భారత్‌పై, భారత సైన్యంపై కొద్ది రోజుల కిందట కూడా ఇలాంటి చెత్త వాగుడే వాగాడు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత ఓ టెలివిజన్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత ఆర్మీని కించపరిచే వ్యాఖ్యలు చేశాడు. భారత సైన్యం వైఫల్యం కారణంగానే పహల్గామ్ ఉగ్రదాడి జరిగిందని అన్నాడు. కశ్మీర్లో 8 లక్షల మందితో కూడిన పటిష్టమైన సైన్యం ఉన్నప్పుడు ఈ దాడి ఎలా జరిగిందని ప్రశ్నించాడు. దీని అర్థం మీరంతా పనికిరాని వాళ్లనేగా అంటూ భారత సైన్యంపై అవాక్కులు చవాక్కులు పేలాడు.తమ సైన్యం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు భారత్ పాకిస్తాన్‌పై నిందలు వేస్తోందని ఆరోపించాడు. భారత్‌లో చిన్న టపాసు పేలినా పాక్‌ను నిందించడం పరిపాటిగా మారిందని విమర్శించాడు. దమ్ముంటే ఈ దాడిలో పాక్ ప్రమేయాన్నిఆధారాల సహా నిరూపించాలని సవాల్ విసిరాడు.కాగా, ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో గల ప్రశాంత బైసరన్ లోయలో పాక్ ఉగ్రమూకలు కాల్పులకు తెగబడి 26 మంది పర్యాటకులను పొట్టన పెట్టుకున్నారు. ఈ దాడి తర్వాత భారత్ ఆపరేషన్ సిందూర్ పేరిట పాక్‌లో తలదాచుకున్న ఉగ్రమూకలపై దాడి చేసింది. భారత్ దాడులకు పాక్ బదులిచ్చే ప్రయత్నం చేయగా.. భారత బలగాలు వారికి తగు రీతిలో బుద్ది చెప్పాయి. -
ఆపరేషన్ సిందూర్ : 17 మంది బంగారు తల్లులు, అదో భావోద్వేగం!
టెర్రరిస్టులను మట్టుబెట్టేందుకు కేంద్రం ప్రభుత్వం చేపట్టిన సైనిక చర్య, ఆపరేషన్ సిందూర్ ఉగ్రమూకలకు చుక్కలు చూపింది. కోట్లాదిమంది భారతీయులకు ప్రేరణగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఉత్తర ప్రదేశ్‌లోని ఒక మెడికల్ కాలేజీలో ఉత్సాహకరమైన పరిణామం చోటు చేసుకుంది.గత నెలలో పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారం తీర్చుకొనేందుకు పాకిస్తాన్‌పై భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఉత్సాహంతోనే తన బిడ్డలకు సిందూర్ పేరు పెట్టుకునేందుకు చాలామంది దంపతులు ముందుకొచ్చారు. మే 10 -11 తేదీలలో కుషినగర్ మెడికల్ కాలేజీలో రెండు రోజుల వ్యవధిలో జన్మించిన 17 మంది నవజాత బాలికలకు వారి కుటుంబ సభ్యులు సిందూర్ అని పేరు పెట్టుకున్నారు. ఈ విషయాన్ని ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్కే షాహి సోమవారం పిటిఐకి తెలియజేశారు.ఇది తమకు గర్వకారణమంటూ తల్లిదండ్రులను సంతోసం ప్రకటించారు. "పాకిస్తాన్‌కు తగిన సమాధానం ఇచ్చినందుకు" తాము ఈ నిర్ణయం తీసుకున్నామంటూ భారత సాయుధ దళాలను ప్రశంసించారు. "పహల్గామ్ దాడి తరువాత, భర్తలను కోల్పోయిన అనేక మంది వివాహిత మహిళల జీవితాలు నాశనమయ్యాయి. దానికి ప్రతిస్పందనగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ నిర్వహించింది. దీనికి గర్విస్తున్నాజ ఇప్పుడు, సిందూర్ అనేది ఒక పదం కాదు, ఒక భావోద్వేగం. కాబట్టి మా కుమార్తెకు సిందూర్ అని పేరు పెట్టాలని నిర్ణయించుకున్నాము" ఇటీవల ఆడ శిశువుకు జన్మనిచ్చిన కుషినగర్ నివాసి అర్చన షాహి అన్నారు. ఆమె భర్త అజిత్ షాహి కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 26 మంది అమాయకులను చంపినందుకు భారతదేశం ప్రతీకారం తీర్చుకున్నప్పటి నుండి, తన కోడలు కాజల్ గుప్తా తన నవజాత శిశువుకు సిందూర్ అని పేరు పెట్టాలని కోరుకుంటుందని పద్రౌనాకు చెందిన మదన్ గుప్తా అన్నారు.ఇదీ చదవండి: రూ. 2 లక్షలతో మొదలై రూ. 8,500 కోట్లకు, ఎవరీ ధీర"ఆ విధంగా, మేము ఈ ఆపరేషన్‌ను గుర్తుంచుకోవడమే కాకుండా ఈ రోజును పండగలా జరుపుకుంటాం" అని మిస్టర్ గుప్తా పిటిఐకి చెప్పారు. భతాహి బాబు గ్రామానికి చెందిన వ్యాసముని కూడా ఇలాంటి నిర్ణయం తీసుకున్నాడు, తమ నిర్ణయం తమ కుమార్తెలో ధైర్యాన్ని నింపుతుందని చెప్పాడు."నా కూతురు పెద్దయ్యాక, ఈ పదం అర్థాన్ని , పరమార్థాన్ని’ తెలుసుకుంటుంది. భారతమాత పట్ల విధేయత కలిగిన మహిళగా ఉంటుంది’’ అన్నారు. ఏప్రిల్ 22న దక్షిణ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని ప్రసిద్ధ పర్యాటక పట్టణం పహల్గామ్ సమీపంలోని బైసారన్ గడ్డి మైదానంలో ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో ఇరవై ఆరు మంది మరణించగా, చాలామంది గాయపడ్డారు. పహల్గామ్ ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత-కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడానికి భారత సైన్యం మే 7న ఆపరేషన్ సిందూర్‌ను ప్రారంభించింది. ముఖ్యంగా మహిళా అధికారిణులు కర్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ ఈ ఆపరేషన్‌తో సంచలనం రేపడం విశేషం.ఇదీ చదవండి:138 కిలోల నుంచి 75 కిలోలకు : మూడంటే మూడు టిప్స్‌తో -
ఆపరేషన్ సిందూర్‌పై అలహాబాదియా వివాదాస్పద పోస్ట్
న్యూఢిల్లీ: పాడ్‌కాస్టర్ రణ్వీర్ అలహాబాదియా మరో వివాదంలో చిక్కుకున్నాడు. ‘పాకిస్తానీ అన్నదమ్ములారా, అక్కచెల్లెలారా’ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన రణ్వీర్.. వ్యతిరేకంగా విమర్శలు వెల్లువెత్తడంతో పోస్ట్‌ను తొలగించాడు. పహల్గాం ఉగ్రవాదాడి అనంతరం.. పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలు లక్ష్యంగా భారత్ ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. దీనిపై యూట్యూబర్ రణ్వీర్ అలహాబాదియా ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశాడు. ‘‘ప్రియమైన పాకిస్తానీ సోదర సోదరీమణులారా.. ఇది రాయడం వల్ల మరో వివాదానికి ఆహ్వానం పలుకుతానని నాకు తెలుసు. చాలా మంది భారతీయులు నాపై ద్వేషం చిందిస్తారు. అయితే.. చాలా మంది భారతీయుల్లా నా హృదయంలో మీ మీద ద్వేషం లేదు. ఎందుకంటే మీలో చాలా మంది మాలాగే శాంతిని కోరుకుంటున్నారు. తరువాత ఎప్పుడైనా మేము మిమ్మల్ని కలిసినప్పుడు మమ్మల్ని ప్రేమతో స్వాగతిస్తారు. మేం ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్నాం అనిపిస్తే క్షమించేయండి. మిమ్మల్ని కలిసినప్పుడు భారతీయులు కచ్చితంగా మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. కానీ, ఇప్పుడు రెండు దేశాల్లో మీడియా చానళ్లు అబద్ధాలను ప్రచారం చేస్తున్నాయి. ఇరుదేశాల్లోని ప్రజలు శాంతిని కోరుకుంటున్నారు. సరిహద్దుల్లో ఉండే ప్రజలు క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. కానీ.. పాకిస్తాన్ ఆర్మీ, ఐఎస్ఐ కలిసి పెంచి పోషిస్తున్న ఉగ్రవాదాన్ని అంతం చేయాలని భారత్ కోరుకుంటోంది. ఉగ్రవాదాన్ని ఆర్మీ పెంచి పోషిస్తుందనడానికి మూడు ఉదాహరణలున్నాయి. ఒకటి.. ఇన్నేళ్లలో పట్టుబడిన ఉగ్రవాదులంతా పాకిస్తాన్‌వారే. రెండోది.. జైషే మహ్మద్ చీఫ్ సోదరుడు హఫీజ్ అబ్దుర్ రవూఫ్ అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించారు. దానికి పాక్ మిలిటరీ అధికారులు కూడా హాజరయ్యారు. మూడోది.. పాక్ రక్షణ శాఖా మంత్రి ఖవాజా ఆసిఫ్ స్కై న్యూస్‌తో మాట్లాడుతూ టెర్రరిజాన్ని పాక్ ప్రభుత్వమే పెంచి పోషిస్తోందని అంగీకరించాడు. అయినా.. పాకిస్తాన్ ప్రజల పట్ల మాకు సానుభూతి ఉంది. ఈ ఆపరేషన్ భారతీయులు, పాకిస్తానీయుల మధ్య యుద్ధం కాదు. భారత్.. పాకిస్తాన్ మిలిటరీ, ఐఎస్ఐపై చేస్తున్నది. శాంతి కొనసాగుతుందని ఆశిస్తున్నా’’ అని పోస్టులో పేర్కొన్నాడు. రణ్వీర్ పోస్టుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఆయన భారత ప్రజల మనోభావాలను దెబ్బతీయడమే కాదు, భారత ఆర్మీని కూడా అవమానించాడని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్‌కు బహిరంగంగా మద్దతిస్తున్నాడని మండిపడ్డారు. దీంతో.. ఆయన పోస్టును డెలిట్ చేశారు. రణ్వీర్ అల్లహాబాదియా ఇలా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం మొదటిసారి కాదు. తల్లిదండ్రుల గురించి అనుచిత జోకులు వేసినందుకు ఈ ఏడాది ప్రారంభంలో అన్ని వైపుల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. -
అన్నివిధాలా పైచేయి
న్యూఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్తాన్‌తో నాలుగు రోజుల పాటు జరిగిన ఘర్షణలో సైనికంగా, రాజకీయంగా, మానసిక భావోద్వేగపరంగా భారత్ పూర్తిగా పైచేయి సాధించినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు ఆదివారం అభిప్రాయపడ్డాయి. పాకిస్తాన్ గడ్డ పైనుంచి భారత్‌కు వ్యతిరేకంగా కుట్రలు సాగిస్తే శిక్ష తప్పదన్న స్పష్టమైన సంకేతాలను ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చారని తెలిపాయి. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా ఉగ్రవాద సంస్థల ప్రధాన కేంద్రాలు, కీలక స్థావరాలు, శిక్షణ కేంద్రాలు, మౌలిక సదుపాయాలను భారత సైన్యం ధ్వంసం చేయడం తెలిసిందే. లష్కరే తొయిబా, జైషే మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన తొమ్మిది స్థావరాలు నామరూపాల్లేకుండా పోయాయి. ముష్కరులను మట్టిలో కలిపేస్తామన్న మాటను మోదీ నిలబెట్టుకున్నారని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఉగ్రవాదుల ఇళ్లల్లో దూరి మరీ బుద్ధి చెప్తామని హెచ్చరించినట్టుగానే పాక్‌తో పాటు పాక్ ఆక్రమిత కశీ్మర్ (పీఓకే)లో సైన్యం చేసిన దాడుల్లో 100 మందికిపైగా ఉగ్రవాదులు హతమయ్యారు. వారిలో అత్యంత కరడుగట్టిన ఉగ్రవాదులూల ఉన్నారు. ముష్కరులను వారి సొంత గడ్డపైనే దెబ్బకొట్టడంలో విజయం సాధించామయని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ‘సింధూ’ ఒప్పందం నిలిపివేతపై పాక్ హాహాకారాలు పాక్ ఉగ్రవాదులను వారి సొంత దేశంలోనే మట్టుబెట్టడగలమన్న సంగతి ఆపరేషన్ సిందూర్ ద్వారా తేలిపోయింది. ఇది భారతీయులకు భావోద్వేగభరిత విజయంగా పరిగణిస్తున్నారు. ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా చావుదెబ్బ కొట్టగలమని సైన్యం నిరూపించింది. పహల్గాం దాడి తర్వాత సింధూ నది జలాల ఒప్పందాన్ని భారత ప్రభుత్వం నిలిపివేసింది. దానిపై పాక్ హాహాకారాలు చేసినా పట్టించుకోలేదు. 1960 నుంచి నిరాటంకంగా కొనసాగుతూ వచ్చిన ఒ ప్పందం ఒక్కసారిగా ఆగిపోవడం పాక్‌కు మింగుడుపడడం లేదు. ప్రపంచ దేశాలకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండాపోయింది. ఇది భారత్‌కు అతిపెద్ద రాజకీయ విజయమని నిపుణులు పేర్కొంటున్నారు. సీమాంతర ఉగ్రవాదాన్ని పూర్తిగా ఆపేదాకా ఈ ఒప్పందాన్ని నిలిపివేస్తామని పాకిస్తాన్‌కు భారత్ తేల్చిచెప్పింది. -
శాంతితోనే స్థిరమైన అభివృద్ధి
ఇరుదేశాల మధ్య చెలరేగిన ఉద్రిక్తతలు కాల్పుల విరమణ ఒప్పందంతో కొంతలో కొంత చల్లబడినప్పటికీ, దక్షిణాసియా అభివృద్ధికి శాశ్వత శాంతి నెలకొనాల్సి ఉంది. దీనికి కావాల్సిన రాజకీయ నాయకత్వ కొరత ఉందన్నది కాదన లేని నిజం. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) నుండి ఉత్పన్నమయ్యే సీమాంతర ఉగ్రవాద దాడులపై తాను ఎలా స్పందిస్తాను అనే అంశాన్ని భారతదేశం సరికొత్తగా నిర్వచించింది. సింపుల్‌గా చెప్పాలంటే భారత్ తిరిగి దాడి చేస్తుంది. దీని ప్రకారమే భారత వైమానిక దళం పాకిస్తాన్‌లోని వివిధ లక్ష్యాలను గురి చూసి కొట్టి తన పనిని పూర్తి చేసింది. పహెల్గామ్లో జరిగిన దారుణమైన, విషాదకరమైన, మత తత్వ ఉగ్రవాద దాడులకు ప్రతిస్పందనగా, భారతదేశం పీఓకేలోని ఉగ్రవాద శిబిరాలను మాత్రమే కాకుండా పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై కూడా దాడి చేసింది. పాకిస్తాన్‌పై ఒత్తిడి తేవడానికి అవసరమైన వరుస చర్యలను చేపట్టడం ద్వారా భారత్ ముందడుగువేసింది. దీనిపై రాజకీయ పరంగా దేశంలో విస్తృత స్థాయిలో ఐక్యత ఏర్పడింది.కొత్త యుగానికి నాంది పలకాలి!అయితే, భారతదేశమైనా, పాకిస్తాన్ అయినా తమను తాము తీవ్రంగా గాయపరచుకోకుండా పూర్తి స్థాయి సైనిక యుద్ధాన్ని చేపట్టలేవని, చేపట్టినా దాన్ని కొనసాగించలేవని అన్ని పక్షాలకూ స్పష్టంగా తెలిసిపోయి ఉండాలి. ఇరుదేశాల మధ్య యుద్ధంలో ఓడిపోయిన వారు వాస్తవానికి– భారత్, పాక్ ప్రజలే! ఒక పక్షాన్ని మరొక పక్షం అనుమానించిన ప్రతిసారీ ఈ రెండు దేశాలూ పరస్పర దాడులకు పాల్పడతాయనే అభిప్రాయం ఇప్పుడు స్థిరపడింది. తన భూభాగంలో జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై జరిగిన దాడిలో 25 మంది మరణించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, పహెల్గామ్ ఉగ్రవాద దాడికి పాకిస్తాన్ కార ణాన్ని వివరించింది. అంతర్జాతీయ సమాజం ప్రతిస్పందనలను పరి శీలిస్తే కొన్ని దేశాలు మాత్రమే ఒక పక్షం కథనాన్ని నమ్మడానికి సిద్ధంగా ఉన్నాయి. సంఘటనలపై భారతీయ కథనానికి ఎక్కువ మంది మద్దతుదారులు ఉన్నప్పటికీ, పాకిస్తాన్ కూడా తనదైన మద్దతుదారులను కూడగట్టింది.రెండు దేశాల ముందు ఉన్న సవాలు, నిజానికి భారత ఉపఖండం అంతటా ఇప్పుడు ఉన్న సవాలు – గత శతాబ్దంలో ఉనికిలోకి వచ్చిన అనేక దేశాలు కూడా ప్రాంతీయ, దేశీయ శాంతికి, అభివృద్ధికి చెందిన కొత్త యుగానికి నాంది పలికే నాయకత్వాన్ని కనుగొనడమే! విచార కరంగా, దక్షిణాసియాలో అలాంటి రాజకీయ నాయకత్వ కొరత ఉంది. వలసవాదం నుండి విముక్తి పొందినప్పటి నుండి ఈ ప్రాంతం స్వీయ చరిత్ర, భౌగోళిక పరిస్థితులు, గత చరిత్రలతో అంతర్గత పోరాటాల కారణంగా వెనుకబడి ఉంది.పొరుగు సంబంధాలు కీలకందక్షిణాసియా విషాదం ఏమిటంటే, ఈ ప్రాంతంలోని పలు దేశాలలో చాలా మందికి తమ బండిని ప్రపంచంలోని మిగిలిన ప్రాంతాలకు తీసుకెళ్లవచ్చుననీ, పొరుగువారితో సంబంధాలను మెరుగు పర్చుకోకుండానే అభివృద్ధిని కొనసాగించవచ్చుననీ నమ్మకం ఉంది. గత పావు శతాబ్దంలో భారతదేశపు విశ్వసనీయ ఆర్థిక పనితీరు, తన పొరుగువారితో ప్రబలంగా ఉన్న వివాదాలను పరిష్కరించకుండానే ఎదగడాన్ని భారత్ కొనసాగించగలదని చాలా మంది నమ్మేలా చేసింది. కొంతవరకు, అది సాధ్యమైంది. అయితే, భారతదేశం దీర్ఘకా లిక యుద్ధంలోకి లాగబడితే అది కూడా ఆర్థికంగా దెబ్బతింటుంది. చెలరేగిన ఘర్షణ వాతావరణపు దుమ్ము కాస్తా అణిగి, ‘యుద్ధం పొగమంచు’ నుండి బయటపడిన తర్వాత, రెండు దేశాలలోని రాజకీయ నాయకత్వం ప్రాంతీయ భద్రత అంటే ఏమిటో సుదీర్ఘంగా పరిశీలించాలి. స్థిరమైన ఆర్థిక అభివృద్ధి కోసం ప్రాంతీయ వాతావ రణాన్ని తప్పకుండా నిర్వచించాలి. భూభాగం గురించిన నిరంతర వివాదాల ద్వారా ఎవరి ప్రయోజనాలు నెరవేరుతాయి? ప్రతి దేశంలోనూ, ప్రాంతం అంతటా మతపరమైన ప్రాంతీయ విభజనల నుండి ఎవరు ప్రయోజనం పొందుతారు?సరిహద్దుకు ఇరువైపులా గొప్ప వ్యూహకర్తల జ్ఞానం ఉన్నప్పటికీ, నేడు ఏ పక్షమూ ప్రాంతీయ శాంతి, భద్రత కోసం కొత్త చట్రాన్ని నిర్వచించలేకపోయింది. ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి, ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2000–2007 కాలంలో చివరిసారిగా ఒక ప్రయత్నం జరిగింది. పాకిస్తాన్ అధ్య క్షుడు పర్వేజ్ ముషారఫ్ కొంతకాలం వారి చొరవతో ముందుకు సాగారు. కానీ ఆయన త్వరలోనే పదవీచ్యుతుడయ్యారు. అప్పటి నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన ప్రభుత్వం శాంతి భద్రతలకు సంబంధించి ‘మన్మోహన్ – ముషారఫ్’ ఫార్ములాను తిరస్కరించింది.ఈ రోజు ఆ ఫార్ములా గురించి ప్రస్తావిస్తే ఎగతాళి చేస్తున్నారు. అయినా సరే... దీనిని తప్పక ప్రస్తావించాలి. అమెరికా, చైనా, జర్మనీ తర్వాత భారత ఆర్థిక వ్యవస్థ నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి సిద్ధంగా ఉంది. జపాన్ను అధిగమించింది. స్వదేశంలో ఎదుర్కొంటున్న సవాళ్లు, భారత వృద్ధి ప్రక్రియలో లోపాలు ఉన్నప్పటికీ, భారతదేశం అభివృద్ధి చెందడం కొనసాగించడానికీ, ప్రపంచాన్ని అనుకూలమైన నిబంధనలతో నిమగ్నం చేయడానికీ తప్పక అవకాశం ఉంది.నియంత్రణ రేఖే సరిహద్దుభారతదేశం తన సొంత పొరుగు ప్రాంతాన్ని సురక్షితం చేసుకోకుండా అలా చేయగలదని భావించడం చాలా మంది సమకాలీన విశ్లేషకులు, వ్యూహకర్తల ఊహ మాత్రమే! భారత్ పొరుగు దేశాలు పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక భారతదేశానికి చెప్పడానికి ప్రయత్నిస్తున్నది ఏమిటంటే, వారు భారత్ నుండి ఎటువంటి ప్రయో జనాలనూ పొందకపోతే ఈ వృద్ధి వ్యయాలు పెరుగుతాయి. మోదీ ప్రభుత్వం పాటించిన గత దశాబ్దపు భారత విధానం ఏమిటంటే, కష్టాల్లో ఉన్న పొరుగువారిపై భారీ ఖర్చులను విధించడమే. ఇది స్వల్పకాలిక ప్రయోజనాలను అందించవచ్చు కానీ దాని పర్యవస నాలు భారత్ కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.మేము పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంటామని భారత్ ప్రదర్శించే రాజకీయ ధైర్యం, కశ్మీర్‌ను స్వాధీనం చేసుకోవడం గురించిన పాకిస్తాన్ వాక్చాతుర్యానికి చెల్లిపోతుంది. కానీ రెండూ ఎప్పటికీ జరగవు! సిమ్లా ఒప్పందం, లాహోర్ డిక్లరేషన్, మన్మో హన్–ముషారఫ్ ఫార్ములా ముఖ్య ఉద్దేశ్యం అదే! అన్ని ప్రధాన శక్తులు – అమెరికా, రష్యా, చైనా – నియంత్రణ రేఖ వాస్తవానికి అంతర్జాతీయ సరిహద్దు అనే ఆలోచనను సమర్థించాయి. నేడు రెండు దేశాలలోని ప్రముఖులు అలాంటి పరిష్కారాన్ని తిరస్కరిస్తున్నారు. అయితే, క్షేత్రస్థాయిలో వాస్తవికత నుండి తప్పించుకునే అవకాశం లేదనీ, ఈ వాస్తవికత అందరికీ పెనుభారంగా మారవచ్చనీ ఇరువైపులా ఉన్న వాస్తవికవాదులకు తెలుసు.సంజయ బారు వ్యాసకర్త సెంటర్ ఫర్ ఎయిర్ పవర్ స్టడీస్ వ్యవస్థాపకుడు,భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మీడియా సలహాదారు -
సిందూరం ఎక్కడ అని ప్రపంచం అడుగుతోంది
కశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఘటన యావత్ భారతదేశాన్ని కలచివేసింది. ఈ ఘటనకు ప్రతీకారంగా పాకిస్తాన్‌పై భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పహల్గాం ఘటన, ఆపరేషన్ సిందూర్‌లపై ఇప్పటికే పలువురు ప్రముఖ నటీనటులు స్పందించారు. తాజాగా ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ‘‘భార్యతో కలిసి వేసవి సెలవుల కోసం పహల్గాం వెళ్లిన భర్తను ఉగ్రమూక కాల్చి చంపింది.తన భర్తను చంపవద్దని ఆ భార్య ఎంతగానో ఏడుస్తూ, ప్రాధేయపడినా ఆ ఉగ్ర ఉన్మాది వినలేదు. ఆమె కళ్ల ముందే భర్తను అతి కిరాతకంగా కాల్చి చంపాడు. ఆమెను విధవరాలని చేశాడు. భర్త మరణాన్ని తట్టుకోలేని ఆ భార్య... తనను కూడా చంపేయమని అడిగినా... ‘నిన్ను చంపను... వెళ్లి చెప్పుకో..’ అని ఆ రాక్షసుడు అన్నాడు. నా కుమార్తెలాంటి ఆమె మానసిక స్థితి చూస్తుంటే .. ‘ఆమె వద్ద చితాభస్మం ఉన్నా... సిందూరం ఎక్కడ అని ప్రపంచం అడుగుతోంది’ అని మా నాన్న (హరివంశ్ రాయ్ బచ్చన్) రాసిన ఓ పద్యంలోని వాక్యం నాకు గుర్తొచ్చింది. అందుకే నేను నీకు సిందూరం ఇస్తున్నా... అపరేషన్ సిందూర్... జై హింద్... భారత సైన్యమా... ఎప్పటికీ ఆగకు... వెనకడుగు వేయకు’’ అంటూ భావోద్వేగమైన ΄పోస్ట్‌ను షేర్ చేశారు అమితాబ్ బచ్చన్. -
పాక్‌కు ఐఎంఎఫ్ రుణంపై విమర్శల వెల్లువ
న్యూయార్క్: పాకిస్తాన్ దన్నుతో ఉగ్రవాదులు పహల్గాంలో అనాగరిక దాడులకు తెగబడినందుకే సైనిక చర్య చేపట్టామని భారత్ ఓవైపు అంతర్జాతీయ సమాజానికి చెబుతుంటే మరోవైపు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) అదే దాయాదిదేశానికి భారీ సాయం చేయడం వివాదాస్పదమైంది. ఆపరేషన్ సిందూర్‌లో హతమైన ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు జరపడంతో ఉగ్ర, పాక్ దోస్తీ బట్టబయలైన సమయంలోనే ఇంటర్నేషన్ మానిటరీ ఫండ్ ఇలా నిధులు ఇవ్వడమేంటని పలువురు అంతర్జాతీయ ఆర్థికరంగ నిపుణులు విమర్శలు గుప్పించారు. పాకిస్తాన్‌కు మరో 1 బిలియన్ డాలర్లు అంటే దాదాపు రూ.8,540 కోట్లు వెంటనే ఇచ్చేందుకు ఐఎంఎఫ్ శుక్రవారం అంగీకరించడమే ఈ విమర్శలకు అసలు కారణం. ఇటీవలే మరో 1.1 బిలియన్ డాలర్ల విడుదలకు ఐఎంఎఫ్ పచ్చజెండా ఊపడంతో మొత్తంగా పాకిస్తాన్‌కు 2.1 బిలియన్ డాలర్ల నిధుల వరద పారనుందని తెలుస్తోంది. వాతావరణ సంబంధ ప్రాజెక్టులు, పనుల నిమిత్తం పాకిస్తాన్ ఈ నిధులను కోరగా రుణంగా అందజేసేందుకు ఐఎంఎఫ్ ఒప్పుకుంది. అయితే ప్రజాపనుల నిమిత్తం నిధులు ఇస్తున్నాసరే, ఉద్రిక్తతల వేళ నిధుల విడుదల సహేతుకంగా లేదని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తంచేశారు. ఇప్పటికే పరస్పర సైనిక చర్యల కారణంగా ఆయుధాల సేకరణ అనేది పాకిస్తాన్‌కు అత్యంత ప్రాధాన్యమైన అంశంగా మారింది. ఈ సమయంలో ఒకేసారి వేల కోట్ల రూపాయల నిధులు వచి్చపడితే వాటిని సంబంధిత లక్ష్యం కోసం కాకుండా సైనిక సన్నద్ధత, ఆయుధాల కొనుగోలు కోసం దురి్వనియోగం చేసే ప్రమాదముందని నిపుణులు ఆందోళన వెలిబుచ్చారు. సమకాలీన పరిస్థితులను, కనీసం భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న తాజా పరిస్థితులను బేరీజు వేసుకుని అయినా నిధుల విడుదలపై ఐఎంఎఫ్ పునరాలోచన చేస్తే బాగుండేదని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. అభ్యంతరం తెలిపిన భారత్ పాకిస్తాన్‌కు అదనపు నిధుల విడుదల(ఈఎఫ్ఎఫ్)పై శుక్రవారమే ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సమావేశం జరిగింది. రెసీలెన్స్ అండ్ సస్టేనబిలిటీ ఫెసిలిటీ పథకంలో భాగంగా పాక్‌కు అదనపు నిధులు ఇవ్వడంపై సమావేశం నిర్వహించారు. ఇందులో సభ్యదేశంగా భారత్ పాల్గొని ఉద్రిక్తత వేళ పాక్‌కు రుణవితరణ ఆపాలని డిమాండ్చేసింది. అయితే ఇక్కడ ఐక్యరాజ్యసమితి, భద్రత మండలి తరహాలో ఓటింగ్‌లో గైర్హాజరు వంటి అవకాశం ఉండదు. కేవలం అభ్యంతరం మాత్రమే వ్యక్తంచేయగలం. దీంతో గతంలో ఒప్పుకున్న 7 బిలియన్ డాలర్ల రుణాల్లో భాగంగా కొంతమేర నిధుల విడుదల చేయాలని ఎగ్జిక్యూటివ్ బోర్డ్ నిర్ణయించింది. సైనిక చర్యలో మునిగిన దేశానికి నిధులెలా ఇస్తారని భారత మాజీ విదేశాంగ కార్యదర్శి కన్వాల్ సిబాల్ తప్పుబట్టారు. ఐఎంఎఫ్ తన చేతులకు అనవసరంగా రక్తం అంటించుకుంటోందని యశ్వంత్ దేశ్‌ముఖ్ విమర్శించారు. పాక్ తన ఆర్థిక సంస్కరణల ఊసే మర్చిపోయి మారణాయుధాల కొనుగోళ్లకు ఈ నిధులను కేటాయించడం ఖాయమని ‘అబ్జర్వ్ రీసెర్చ్ ఫౌండేషన్’లో నిపుణుడు సుశాంత్ సరీన్ అన్నారు. గత 35 సంవత్సరాల్లో పాకిస్తాన్ ఇలా 28 రుణాలు, ఇతర కార్యక్రమాలకు సంబంధించి ఐఎంఎఫ్‌తో ఒప్పందాలు కుదుర్చుకుంది. కానీ వాటిని సవ్యంగా అమలుచేసిన చరిత్ర ధూర్తదేశానికి లేదని భారత్ ప్రకటించింది. పాకిస్తాన్ భారత్‌పై బాంబులేస్తున్న వేళ ఈ రుణవితరణ ఏవిధంగా హేతుబద్ధం అనిపించుకుంటుందని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘రుణగ్రస్త పాకిస్తాన్‌ను ఐఎంఎఫ్ నిధుల సాయంతో ఒడ్డున పడేయట్లేదు. మరింతగా నెత్తుటేర్లు పారించేందుకు సాయపడుతోంది. ఇలా హంతక పాకిస్తాన్‌కు అంతర్జాతీయ సంస్థలు ఇంకెన్నాళ్లు నిధులిస్తాయి?’అని ప్రవాసంలో గడుపుతున్న అఫ్గానిస్తాన్ మహిళా ఎంపీ మరియం సోలాయ్మన్ఖిల్ అన్నారు. -
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఐదుగురు హతం!
న్యూఢిల్లీ: పహల్గాం పాశవిక ఉగ్రదాడికి ప్రతిస్పందనగా లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్ ఉగ్ర స్థావరాలను భారత్ మే 7వ తేదీ అర్ధరాత్రి తర్వాత దాడిచేయడం తెల్సిందే. పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్తాన్ గడ్డపై జరిపిన ఈ క్షిపణి దాడుల్లో తొమ్మిది కీలకమైన ఉగ్ర స్థావరాలు నేలమట్టమై కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్రం గతంలో ప్రకటించింది. అయితే ఈ దాడుల్లో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులైన ఐదుగురు సైతం చనిపోయినట్లు కేంద్రం సంబంధిత వివరాలను శనివారం వెల్లడించింది. జైషే మహమ్మద్ ఉగ్రసంస్థ చీఫ్ మసూద్ అజార్ ఇద్దరు బావమరుదులతో పాటు లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో కీలక ఉగ్రవాది, మరో ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టినట్లు భారత అధికారులు ప్రకటించారు. ఈ మేరకు జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ ఆర్మీ సీనియర్ ఉన్నతాధికారులు, పోలీసులు సిబ్బంది హాజరయ్యారు. పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్సు మహిళా ముఖ్యమంత్రి మర్యం నవాజ్ తరఫున అధికారులు పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించిన ఫొటోలు మీడియాలో దర్శనమిచ్చాయి. దీంతో ఉగ్రసంస్థలతో పాక్ ప్రభుత్వ చెలిమి మరోసారి బహిరంగంగా బట్టబయలైంది. ఆ ఐదుగురు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల గురించి క్లుప్తంగా..మొహమ్మద్ యూసుఫ్ అజార్ భారతసర్కార్ గతంలో తయారుచేసిన మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో 21వ నంబర్‌గా మొహమ్మద్ యూసుఫ్ అజార్ పేరు ఉంది. దాదాపు 50 ఏళ్లకుపైబడిన వయస్సుండే ఇతను జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు బావమరిది. 1999 డిసెంబర్లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఐసీ–814 విమానం హైజాక్ ఉదంతంలో ఇతను కీలక సూత్రధారి. 1998లో అబ్దుల్ లతీఫ్ అనే వ్యక్తిద్వారా తప్పుడు పాస్‌పోర్ట్‌తో భారత్‌లోకి వచ్చాడు. జైషేకు చెందిన బహావల్పూర్ ప్రధాన స్థావరంలో కొత్త ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చే బాధ్యతలను యూసుఫ్ చూసుకునేవాడు. యూసుఫ్ కుటుంబం సైతం అదే స్థావరప్రాంగణంలో నివసిస్తోంది. ఇతనికి ఉస్తాద్ జీ, మొహమ్మద్ సలీమ్, ఘోసీ సాహెబ్ వంటి మారు పేర్లు ఉన్నాయి. ఆయుధాలను ఎలా వాడాలో యువతకు శిక్షణ ఇస్తాడు. జమ్మూకశ్మీర్‌లో పలు ఉగ్రదాడులకు పథకరచన చేశాడు. ఇతనికి వ్యతిరేకంగా ఇంటర్‌పోల్ గతంలోనే రెడ్‌నోటీస్ ఇచి్చంది. ఇతడిని తమకు అప్పగించాలని 2002లోనే భారత్ పాకిస్తాన్‌ను కోరింది. అజార్‌ను జమ్మూ జైలు నుంచి తప్పించేందుకు పలుమార్లు ప్లాన్లు వేసి విఫలమయ్యాడు. చివరకు భారత ఎయిర్‌పోర్టులో భద్రతావైఫల్యాలు ఉన్నట్లు పసిగట్టి హైజాక్ ప్లాన్‌ను అమలుచేశాడు. హైజాక్ జరిగిన 26 ఏళ్ల తర్వాత సూత్రధారిని భారతబలగాలు అంతం చేశాయి. హఫీజ్ మొహమ్మద్ జమీల్ఇతను కూడా జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు పెద్ద బావమరిది. యూసుఫ్‌కు ఇతను అన్నయ్య అవుతాడు. జైషేకు చెందిన మర్కాజ్ సుభాన్ అల్లాహ్‌లోని అతిపెద్ద శిక్షణా కేంద్రానికి ముహమ్మెద్ జమీల్ ఇన్చార్జ్గా ఉన్నాడు. యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షితులను చేసి, టెర్రరిస్ట్‌లుగా మార్చాల్సిన ప్రధాన బాధ్యత ఇతనిదే. జైషే ఉగ్రసంస్థలో కీలకమైన వ్యక్తి. జైషే సంస్థ కోసం నిధులను సేకరించడంలోనూ అత్యంత చురుగ్గా ఉంటాడు. ముదస్సార్ ఖదియాన్ ఖాస్ లష్కరే తోయిబా ఉగ్రసంస్థలో ముదస్సార్ ఖదియాన్ ఖాస్ అత్యంత కీలకమైన వ్యక్తి. ఇతనికి అబూ జుందాల్ అనే మారుపేరు ఉంది. సరిహద్దు నుంచి కేవలం పాతిక కిలోమీటర్ల దూరంలో ఉన్న మురిద్కేలోని మర్కాజ్ తైబా ఉగ్రస్థావరానికి ఇతనే సారథ్యం వహిస్తున్నాడు. ముంబైదాడుల్లో ప్రాణాలకు తెగించి పోలీసులు పట్టుకున్న ఉగ్రవాది అజ్మల్ కసబ్ ఈ స్థావరంలోనే శిక్షణ పొందాడు. మే 7 అర్థరాత్రి తర్వాత భారత దాడుల్లో ఖదియాన్ హతమయ్యాడు. ఈ వార్త తెల్సి పాకిస్తాన్ సైన్యం ఉలిక్కిపడింది. వెంటనే ఇతని అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో జరిపించింది. లష్కరే ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ సారథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో అంత్యక్రియలు జరిగాయి. ఆర్మీ చీఫ్ మునీర్ తరఫున లెఫ్టినెంట్ జనరల్, పోలీస్‌విభాగం తరఫున పంజాబ్ ప్రావిన్సు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ హాజరయ్యారు. పాకిస్తాన్ ఆర్మీ అధికారులు ఇతని మృతదేహం వద్ద సైనికవందనం చేసిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమిచ్చాయి. దీంతో పాక్ ఆర్మీ, ఉగ్రసంస్థలకు మధ్య ఉన్న సత్సంబంధాలు ఇతని అంత్యక్రియల వీడియోతో మరోసారి ప్రపంచానికి తెల్సివచ్చాయి. ఖలీద్ అలియాస్ అబూ అకాషా లష్కరే తోయిబా ఉగ్రసంస్థ కమాండర్ అయిన ఖలీద్ అలియాస్ అబూ అకాషా సైతం ఈ దాడుల్లో హతమయ్యాడు. జమ్మూకశ్మీర్‌లో పలు ఉగ్రదాడులతో ఇతని ప్రత్యక్ష సంబంధం ఉంది. అఫ్గానిస్తాన్ నుంచి లష్కరే తోయిబా కోసం ఆయుధాలను అక్రమంగా తీసుకొచ్చేవాడు. ఇతని అంత్యక్రియలు పాకిస్తాన్‌లోని ఫైసలాబాద్‌లో ప్రభుత్వ లాంఛనాలతో జరిగాయి. పాక్ ఆర్మీ సీనియర్ అధికారులు, పోలీస్‌విభాగం తరఫున పైసలాబాద్ డెప్యూటీ కమిషనర్ ఈ ఖనన క్రతువులో పాల్గొన్నారు. మొహమ్మద్ హసన్ ఖాన్ జమ్మూకశ్మీర్‌లో వేర్వేరు ఉగ్రదాడులకు సమన్వయం చేయడంలో, సహాయసహకారాలు అందించడంలో మొహమ్మద్ హసన్ ఖాన్ కీలక పాత్ర పోషించాడు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని జైషే మొహమ్మద్ ఉగ్రస్థావర నిర్వహణ బాధ్యతలను చూసుకునే సీనియర్ ఉగ్రవాది ముఫ్తీ అస్ఘర్ ఖాన్ కశ్మీరీ కుమారుడే ఈ హసన్ ఖాన్. -
పాక్ ఫేక్ ప్రచార సారథి... ఓ ఉగ్రవాది కొడుకు
లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధురి. భారత్‌పై పాకిస్తాన్ సాగిస్తున్న గోబెల్స్ ప్రచారానికి సారథి. పాక్ ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్పీఆర్) డైరెక్టర్ జనరల్. పహల్గాం ఉగ్ర దాడి నుంచీ భారత్‌పై పథకం ప్రచారం దాయాది తలపెట్టిన తప్పుడు ప్రచారానికి కర్త, కర్మ, క్రియ అన్నీ చౌధురే. అతను ఓ ఉగ్రవాది కుమారుడు కావడం విశేషం. ఉగ్రవాదంతో విడదీయలేని రీతిలో పెనవేసుకు పోయిన పాకిస్తాన్ బంధానికి నిలువెత్తు నిదర్శనం. దారితప్పిన సైంటిస్టు చౌధురి తండ్రి సుల్తాన్ బషీరుద్దీన్ మెహమూద్. అవడానికి అణు శాస్త్రవేత్త. పాక్ అణ్వాయుధ పిత అబ్దుల్ ఖదీర్ఖాన్తో కలిసి అణుబాంబు తయారీలో కీలక పాత్ర పోషించాడు. యురేనియం శుద్ధి తదితరాల్లో చురుగ్గా వ్యవహరించాడు. అందుకోసం గ్యాస్ సెంట్రిఫ్యూజ్ టెక్నాలజీని నెదర్లాండ్స్ నుంచి తస్కరించాడు. కానీ నిజానికి అతనో కరడుగట్టిన మతోన్మాది. అంతకుమించి పేరుమోసిన ఉగ్రవాది. నరనరానా భారత విద్వేషాన్ని నింపుకున్న వ్యక్తి. ఐరాస భద్రతా మండలి ప్రకటిత అంతర్జాతీయ ఉగ్రవాదుల జాబితాలో ఉన్నాడు. పాక్ అణ్వాయుధ పరిజ్ఞానాన్ని దాదాపుగా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్‌కాయిదా చేతిలో పెట్టిన ధూర్తుడు. అప్పటి అల్‌కాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌కు అత్యంత సన్నిహితుడు. బషీర్ చేసిన ఈ నిర్వాకం అప్పట్లో పాశ్చాత్య దేశాలకు పెద్ద సంకటంగా మారింది. అలాంటి వ్యక్తి కొడుకైన చౌధురి భారత్‌తో సైనిక సంఘర్షణ గురించి పాక్ తరఫున నాలుగు రోజులుగా అధికారికంగా బయటి ప్రపంచానికి చెబుతున్నాడు! ఓ అంతర్జాతీయ ఉగ్రవాది కొడుకే పాక్‌కు అంతర్జాతీయ గొంతుకగా మారాడు. ‘మాది ఉగ్రవాద బాధిత దేశం’అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నాడు. అంతేగాక అధికారికంగానూ, ఆన్‌లైన్‌లోనూ భారత్‌పై ఇబ్బడిముబ్బడిగా ఫేక్ న్యూస్ ప్రచారం వ్యాప్తి చేస్తున్నాడు. చౌధురి తీరును పాక్ ప్రజలు కూడా ఛీదరించుకుంటున్నారు. భారత సైన్యం చేతిలో పాక్ రోజూ చావుదెబ్బలు తింటున్నా అతను మాత్రం ఆ వాస్తవాలను పూర్తిగా కప్పిపుచ్చి లేనిపోని గొప్పలకు పోతున్నాడంటూ మండిపడుతున్నారు. డీఎన్ఏలోనే ఉగ్రవాదం లెఫ్టినెంట్ జనరల్ చౌధురి తండ్రి బషీర్‌ను 2001లో ఐరాస అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. బిన్‌లాడెన్ ఉగ్ర కార్యకలాపాలకు ఆర్థికంగా, వ్యూహాత్మకంగా దన్నుగా నిలుస్తున్నాడని స్పష్టంగా పేర్కొంది. అంతర్జాతీయ ఒత్తిడితో మరో దారిలేక అదే ఏడాది పాక్ ఐఎస్ఐ అతన్ని అరెస్టు చేసింది. అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ బషీర్‌ను స్వయంగా విచారించింది. బిన్‌లాడెన్‌ను కలిసినట్టు దర్యాప్తులో అతను అంగీకరించాడు. 2009లో ప్రభుత్వ విధుల నుంచి తప్పించింది. ముసుగు తొలగిపోవడంతో బషీర్ మరింత రెచ్చిపోయాడు. ఉమ్మా తమీరీ నౌ (యూటీఎన్) అనే స్వచ్ఛంద సంస్థ ముసుగులో ఓ ఉగ్ర సంస్థను స్థాపించాడు. రసాయన, జీవాయుధాలతో పాటు ఏకంగా అణ్వాయుధాలను గురించి లాడెన్‌కు, తాలిబన్లకు కావాల్సిన సమాచారం అందించడం మొదలుపెట్టాడు. తాలిబన్ల నాటి చీఫ్ ముల్లా ఒమర్‌తో తరచూ భేటీ అయ్యేవాడు. మునీర్.. ఓ మతోన్మాది పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీం మునీర్‌ది కూడా పూర్తిగా జిహాదీ నేపథ్యమే. ఆయన తండ్రి సయ్యర్ సర్వర్ మునీర్ ఓ మదర్సాలో ఇస్లాం బోధకుడు. ఆ ఛాయల్లో పెరిగిన మునీర్ కూడా కరడుగట్టిన మతోన్మాదిగా మారాడు. నరనరానా భారత వ్యతిరేకతను నింపుకున్నాడు. 2019లో జమ్మూలోని పుల్వామాలో 40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని పొట్టన పెట్టుకున్న ఆత్మాహుతి ఉగ్ర దాడికి మునీరే వ్యూహకర్త. అప్పట్లో పాక్ నిఘా విభాగం ఐఎస్ఐ చీఫ్‌గా ఆ దాడిని దగ్గరుండి పర్యవేక్షించాడు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
Himanshi Narwal: ఆ వీరుడి ఆత్మకు సంపూర్ణ శాంతి
-
ఈ ముక్క ఏదో పహల్గాం దాడికి ముందు చెప్పాల్సిందేమో సార్..!
ఈ ముక్క ఏదో పహల్గాం దాడికి ముందు మన టెర్రరిస్టులకు చెప్పాల్సిందేమో సార్..! -
'ఆపరేషన్ సిందూర్'పై నోరెత్తని బాలీవుడ్ ప్రముఖులు
పహల్గామ్లో 26 మంది భారతీయులను కాల్చి చంపిన ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకునేందుకు 'ఆపరేషన్ సిందూర్'ను భారత్ ప్రారంభించింది. పాక్‌లోని 9 ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసిన భారత్ 100 మందికి పైగానే ఉగ్రవాదులను మట్టుపెట్టింది. ఈ క్రమంలోనే పాక్ ఆర్మీ మరోసారి తన వక్రబుద్ధి చూపించింది. జమ్మూ ఎయిర్‌పోర్టుతో పాటు జైసల్మేర్ విమానాశ్రయం లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగింది. వాటిని భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. దీంతో మన సైనికులపై చాలామంది సినీ ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. భారత్ మాతాకీ జై అంటూ టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు నటీనటులు పోస్టులు పెడుతున్నారు. కానీ హిందీ చిత్రపరిశ్రమలో టాప్ హీరోలుగా ఉన్న అమితాబ్ బచ్చన్, షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి వారు కనీసం తమ మద్ధతు ఇస్తూ ఒక్క పోస్ట్ కూడా చేయలేదు. దీంతో వారి అభిమానులు కూడా విమర్శలు చేస్తున్నారు. దేశాన్ని కాపాడుతున్న సైనికులకు కనీసం కృతజ్ఞతలు చెప్పడానికి కూడా వారికి మనసు రావడం లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. సైఫ్ అలీఖాన్ కూడా ఆపరేషన్ సిందూర్‌పై ఎలాంటి పోస్ట్ చేయలేదు. దీంతో ఆయనపై కూడా విమర్శలు వస్తున్నాయి. ఏదైన ఒక సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించి దానిని వెంటనే తమ సోషల్‌మీడియాలో షేర్ చేసి కోట్ల రూపాయాలు సంపాధిస్తారు. అలాంటిది దేశంలో ఇంత జరుగుతున్నా కూడా కనీసం మన ఆర్మీ కోసం మద్ధతుగా ఒక్క పోస్ట్ కూడా పెట్టలేదంటూ నెటిజన్లు భగ్గుమంటున్నారు. దేశ ప్రజల పట్ల, మన ఆర్మీ పట్ల వారికి ఉన్న గౌరవం ఏపాటిదో సులభంగా అర్థం అవుతుంది అంటూ వారు చెప్పుకొస్తున్నారు. -
పిల్లలకు సిందూర్ పేరు
కతిహార్: పహల్గాం ఉగ్రదాడిలో మరణించినవారికి నివాళిగా చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ను యావత్ భారతం స్వాగతించింది. అయితే.. ఆ పేరుపై ట్రేడ్‌మార్క్ కోసం వ్యాపారవేత్తలు పోటీ పడుతుంటే.. ప్రజలు మాత్రం ఆ ఆపరేషన్‌ను మరింత గుర్తుండిపోయేలా చేసుకుంటున్నారు. పాక్‌లో ఉగ్రవాదుల స్థావరాలపై దాడులు జరిపిన బుధవారం రోజే పుట్టిన తమ బిడ్డలకు ఆపరేషన్ పేరు పెట్టుకుంటున్నారు. అమ్మాయిలయితే సిందూరి అని, అబ్బాయికయితే సిందూర్ అని పేరు పెట్టుకుంటున్నారు. బిహార్‌లో ఉన్న కతిహార్ జిల్లాలోని ఓ చిన్న ఆసుపత్రిలో కుందన్ కుమార్ మండల్ తన కూతురుకు సిందూరి పేరు పెట్టాడు. భారత సాయుధ దళాల ఆపరేషన్ పట్ల సంతోషం వ్యక్తం చేసిన కుందన్.. ఆ పేరు తన కూతురుకు పెట్టుకోవడం గర్వంగా ఉందన్నారు. ఒక్క కుందన్మాత్రమే కాదు.. ఆ పేరు పెట్టినందుకు కుటుంబమంతా సంతోషంగా ఉంది. ఆసుపత్రి సిబ్బంది కూడా ఈ పేరును ఆమోదించారు. పెరిగి పెద్దయ్యాక అమ్మాయి తన పేరు వెనుక ఉన్న ప్రాముఖ్యతను, చరిత్రను తెలుసుకుంటుందని కుటుంబం ఆశిస్తోంది. ఒక్క కుందన్ మాత్రమే కాదు.. బిహార్‌లోని ఓ ఆస్పత్రిలో 12 మంది ఈ పేరు పెట్టుకున్నారు. ‘ఆపరేషన్ సిందూర్’జరిపిన రోజు పుట్టిన 12 మంది పిల్లలకు ముజఫర్‌పూర్‌లో ఈ పేరే పెట్టుకున్నారు. రెండు ఆనందాలు కలిసి వచ్చాయని సంబరపడిపోతున్నారు. పెద్దయ్యాక తమ పిల్లలను సైన్యంలో చేరి్పస్తామని అంటున్నారు. కన్హారా నివాసి హిమాన్షు రాజ్ కూడా తన కూతురికి ‘సిందూరి’అని నామకరణం చేశాడు. ‘సిందూరి’పేరు కుటుంబానికి గర్వకారణంగా మారింది. జాఫర్పూర్కు చెందిన పవన్ సోనీతన కొడుకుకి సిందూర్ అని పేరు పెట్టాడు. ‘సిందూర్’కేవలం పేరు కాదు.. అదొక గర్వమని చెబుతున్నారు. -
ఆర్మీలో చేరతా.. ఉగ్రవాదులను మట్టుబెడతా..
బాలాసోర్: ‘భారత సైన్యంలో చేరి పాక్ ఉగ్రవాదులను అంతమొందించాలనుకుంటున్నా’పహల్గాం దాడిలో తండ్రిని కోల్పోయిన ఓ బాలుని కోరిక ఇది. తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి సైన్యంలో చేరాలని నిర్ణయించుకున్నానని తొమ్మిదేళ్ల తనూజ్ కుమార్ సత్పతి గురువారం వెల్లడించాడు. అంతేకాదు.. ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం వస్తే.. తనలా ఏ బిడ్డా తండ్రిని కోల్పోకుండా చూడాలని చెబుతానన్నాడు. తనూజ్ తండ్రి ప్రశాంత్ సత్పతి పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మరణించారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం వారి కుటుంబాన్ని మీడియా కలవగా.. తనూజ్ మాట్లాడాడు. ‘‘నేనూ, అమ్మ బుధవారం ఉదయం నుంచి వార్తలు చూస్తూనే ఉన్నాం. పాక్ ఉగ్ర స్థావరాలపై దాడి మాకు చయాలా సంతృప్తినిచ్చింది. మన సైన్యాన్ని చూసి గరి్వస్తున్నా’’అని తెలిపాడు. అంతేకాదు.. సైన్యం మొదటి నుంచి తనకు, తన తల్లికి అండగా ఉందని తనూజ్ చెప్పారు. ‘‘కొండపై నుంచి కిందకు వస్తుండగా ఉగ్రవాదులు కాల్పులు జరిపారని చెప్పాడు. ‘‘నాన్న వెంటనే పడిపోయాడు. నేను, అమ్మ అతని దగ్గరికి పరిగెత్తాం. తల నుంచి రక్తస్రావం అవుతోంది. నీళ్లు కావాలా అని అమ్మ అడగ్గానే.. అవునన్నాడు. నీళ్లు ఇచ్చాను’’అని పహల్గాంలో జరిగిన భయానక పరిస్థితులను తనూజ్ గుర్తు చేసుకున్నాడు. తనూజ్ పెద్దరికంగా మాట్లాడుతుండటంపై అతని తల్లి ప్రియా దర్శిని ఆందోళన వ్యక్తం చేసింది.‘‘అతను అకస్మాత్తుగా తన బాల్యాన్ని కోల్పోయినట్లు కనిపిస్తున్నాడు. పిల్లలు క్రమంగా పరిణితి చెందాలి. భగవంతుడు నా కొడుకును ఆశీర్వదించాలి’’అని ఆమె కోరుకున్నారు. -
Operation Sindoor: భయాందోళనలలో విదేశీ క్రికెటర్లు
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత దళాలు ఇవాళ (మే 8) పాకిస్తాన్‌లోని రావల్పిండి క్రికెట్ స్టేడియంపై డ్రోన్లతో దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడి కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో భాగంగా ఇవాళ జరగాల్సిన పెషావర్ జల్మీ, కరాచీ కింగ్స్ మ్యాచ్ రద్దైంది. ఈ లీగ్‌లో మున్ముందు జరగాల్సిన మ్యాచ్‌లపై కూడా నీలినీడలు కమ్ముకున్నాయి.ఈ దాడి అనంతరం పీఎస్ఎల్ 2025 ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు బిక్కుబిక్కుమంటున్నారు. ఈ లీగ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా, యూఎస్ఏ, వెస్టిండీస్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ తదితర దేశాలకు చెందిన దాదాపు 40 మంది క్రికెటర్లు పాల్గొంటున్నారు. పహల్గామ్ ఉగ్రదాడుల నేపథ్యంలో భారత్ పాక్‌పై కన్నెర్ర చేయడంతో పీఎస్ఎల్ ఆడుతున్న విదేశీ క్రికెటర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. భారత్ దాడుల తీవ్రతను పెంచిన తర్వాత చాలామంది విదేశీ ఆటగాళ్లు స్వదేశాలకు వెళ్లిపోవాలని భావిస్తున్నారు. అయితే పాక్‌లో విమానాశ్రయాలు మూత పడటంతో వారు ఎటూ వెళ్లలేకపోతున్నారు. ఈ లీగ్‌లో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ లాంటి స్టార్ క్రికెటర్లు పాల్గొంటున్నారు.PSL 2025 ఆడుతున్న విదేశీ ఆటగాళ్లు..ఇస్లామాబాద్ యునైటెడ్: ఆస్ట్రేలియా - మాథ్యూ షార్ట్, రిలే మెరిడిత్, బెన్ డ్వార్హుయిస్; న్యూజిలాండ్ - కాలిన్ మున్రో; దక్షిణాఫ్రికా - రాస్సీ వాన్ డెర్ డస్సెన్; యూఎస్ఏ - ఆండ్రీస్ గౌస్; వెస్టిండీస్ - జాసన్ హోల్డర్కరాచీ కింగ్స్: ఆఫ్ఘనిస్తాన్ - మొహమ్మద్ నబీ; ఆస్ట్రేలియా - డేవిడ్ వార్నర్, బెన్ మెక్‌డెర్మాట్; ఇంగ్లాండ్ - జేమ్స్ విన్స్; న్యూజిలాండ్ - టిమ్ సీఫెర్ట్, ఆడమ్ మిల్నే, కేన్ విలియమ్సన్.లాహోర్ ఖలందర్స్: బంగ్లాదేశ్ - రిషద్ హొస్సేన్; ఇంగ్లాండ్ - సామ్ బిల్లింగ్స్, టామ్ కుర్రాన్; నమీబియా - డేవిడ్ వైస్; శ్రీలంక - కుసల్ పెరెరా; న్యూజిలాండ్ - డారిల్ మిచెల్, జింబాబ్వే - సికందర్ రజా.ముల్తాన్ సుల్తాన్స్: ఆస్ట్రేలియా - ఆష్టన్ టర్నర్; ఇంగ్లాండ్ - డేవిడ్ విల్లీ, క్రిస్ జోర్డాన్; న్యూజిలాండ్ - మైఖేల్ బ్రేస్‌వెల్; వెస్టిండీస్ - గుడకేష్ మోటీ, షాయ్ హోప్, ఐర్లాండ్ - జోష్ లిటిల్.పెషావర్ జల్మీ: ఆఫ్ఘనిస్తాన్ - నజీబుల్లా జద్రాన్; ఆస్ట్రేలియా - మాక్స్ బ్రయంట్, బంగ్లాదేశ్ - నహిద్ రానా, ఇంగ్లాండ్ - టామ్ కోహ్లర్-కాడ్మోర్; దక్షిణాఫ్రికా - లిజాడ్ విలియమ్స్, వెస్టిండీస్ - అల్జరీ జోసెఫ్.క్వెట్టా గ్లాడియేటర్స్: న్యూజిలాండ్ - ఫిన్ అలెన్, మార్క్ చాప్మన్, కైల్ జామీసన్; దక్షిణాఫ్రికా - రిలీ రోసౌ; వెస్టిండీస్ - అకేల్ హోసేన్ -
పాకిస్థాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఢిల్లీ: ‘ఆపరేషన్ సిందూర్’ గురించి భారత రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పలు విషయాలను పంచుకున్నారు. తాజాగా జరిగిన అఖిలపక్ష భేటీలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు. ఈ సమావేశంలో త్రివిధ దళాలను అఖిలపక్ష నేతలతో పాటు ఆయన అభినందించారు. ఆపై మీడియా సమావేశం నిర్వహించారు. భారత్ చేసిన మెరుపుదాడిలో దాదాపు 100 మంది ఉగ్రవాదలు మరణించారని ఆయన తెలిపారు. అయితే, ఆపరేషన్ సిందూర్ ఇంకా పూర్తి కాలేదని.. కొనసాగుతోందని ఆయన వెల్లడించారు. పాకిస్థాన్ తీరు మార్చుకోకుంటే తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు.POK ప్రాంతంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలను ఇండియన్ ఆర్మీ పూర్తిగా ధ్వంసం చేసిందని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. ఈ క్రమంలో ఆపరేషన్ సిందూర్‌లో పాల్గొన్న సైన్యంపై రాజ్‌నాథ్‌సింగ్ అభినందనలు తెలిపారు. భారత్ చేసిన దాడిలో పాక్ పౌరలకు ఎలాంటి నష్టం జరగలేదన్నారు. తాము కేవలం ఉగ్రవాదులను మాత్రమే టార్గెట్ చేశామని ఆయన వెల్లడించారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఔట్సోర్సింగ్ చేస్తోందని ఆయన విమర్శించారు.భారత్ వద్ద నైపుణ్యం పొందిన సైన్యంతో పాటు బలమైన ఆయుధాలు ఉన్నాయని గుర్తుచేశారు. సైనికులు చూపిన సాహసాలకు దేశం గర్విస్తుందన్నారు. భారత రక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలని ప్రధాని మోదీ పదేళ్ల క్రితం చెప్పారని గుర్తుచేశారు. రక్షణ పరికరాల కోసం తీవ్రంగా శ్రమించామన్నారు. నేడు భారత్ ఉత్పత్తి చేస్తున్న రక్షణ పరికరాలు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పొందాయన్నారు. భారత రక్షణ రంగంలో క్వాలిటీ, క్వాంటిటీని పెంచుతూ వచ్చామన్నారు. -
Operation Sindoor: ఈ ఒక్క ఫొటో చాలు: సానియా మీర్జా పోస్ట్ వైరల్
‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) నేపథ్యంలో భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా (Sania Mirza) సోషల్ మీడియాలో స్పందించిన తీరు వైరల్ అవుతోంది. ఈ దేశ ఐక్యతకు ఇదే సరైన నిదర్శనం అంటూ ఆమె పంచుకున్న ఫొటో నెటిజన్ల మనసు దోచుకుంటోంది. కాగా జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ ఉగ్రదాడికి బదులు తీర్చుకునేందుకు భారత సైన్యం ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టిన విషయం తెలిసిందే. ఇరవై ఆరు మంది అమాయకుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న ముష్కరులకు మెరుపు దాడులతో మన సైన్యం సమాధానమిచ్చింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని దాదాపు తొమ్మిది స్థావరాలను ధ్వంసం చేసింది. తద్వారా ఉగ్రవాదాన్ని సహించేది లేదని మరోసారి భారత్ స్పష్టమైన సందేశాన్ని దాయాదికి అందించింది.పేరు సరిగ్గా సరిపోయిందంటూఇక ఈ ఆపరేషన్‌కు సిందూర్ అనే పేరు సరిగ్గా సరిపోయిందంటూ బాధిత కుటుంబాలతో పాటు యావత్ భారతావని ప్రశంసిస్తోంది. అమాయకపు ఆడపడుచుల నుదిటి సిందూరం చెరిగేపోయేలా పాశవిక దాడికి తెగబడిని ఉగ్రవాదులకు ‘రక్త సిందూరం’తో సమాధానమిచ్చారని.. ఇది సరైన నివాళి అని ఉద్వేగానికి లోనవుతున్నారు.మహిళా శక్తి, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకలుగాఅదే విధంగా.. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన ప్రెస్మీట్లో మిలిటరీ బ్రీఫింగ్‌కు ఇద్దరూ మహిళా సైనికాధికారులు నాయకత్వం వహించడం కూడా జాతి హృదయాలు ఉప్పొంగేలా చేసింది. కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్... భారత దేశపు మహిళా శక్తి, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకలుగా తాము చేపట్టిన ఆపరేషన్ గురించి వివరిస్తూ ఉంటే భారతీయల గుండెలు గర్వంతో నిండిపోయాయి.ఈ ఒక్క ఫొటో చాలువాళ్లిద్దరు అలా చెరోవైపు ప్రెస్ మీట్లో కూర్చుని ఐక్యతకు ప్రతీకలా నిలిచిన తీరు నిజమైన దేశభక్తుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది. ఈ దృశ్యాన్ని ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ.. ‘‘ఈ శక్తివంతమైన ఫొటో.. మనమంతా ఒక్కటే జాతి అనేందుకు నిలువెత్తు నిదర్శనంలా నిలిచింది’’ అని సానియా మీర్జా పేర్కొన్నారు.మరోవైపు.. సరిహద్దుల్లో తీవ్రవాదులను తుదముట్టించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై క్రీడాలోకం హర్షం వ్యక్తం చేసింది. తాజా ఘటనపై పలువురు క్రీడాకారులు స్పందిస్తూ మన దేశ ఘనతను కీర్తించారు. ఏకత్వంలో నిర్భీతిఇక టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్.. ‘ఏకత్వంలో నిర్భీతి. ఎల్లలెరుగని బలం. మన ప్రజలే మన దేశానికి బలం. మనమంతా ఒక్కటే. ప్రపంచంలో తీవ్రవాదానికి చోటు లేదు. జైహింద్’ అంటూ వ్యాఖ్యానించాడు. పేసర్ షమీ, మాజీ క్రికెటర్లు సెహ్వాగ్, రైనా, ఇర్ఫాన్ పఠాన్, శిఖర్ ధావన్ కూడా ఇదే తరహాలో స్పందించారు.‘మీపై ఎవరైనా రాళ్లు విసిరితే మీరు పూలు విసరండి. అయితే అది పూలకుండీతో సహా విసరండి’ అని సెహ్వాగ్ ట్వీట్ చేయగా, ‘ప్రతికూల పరిస్థితులను కూడా భారత సైన్యం తమకు అనుకూలంగా మార్చుకొని విజయం సాధించింది. ప్రమాదకర సమయంలో వారి ధైర్యాన్ని చూసి గర్విస్తున్నాం’ అని షమీ స్పందించాడు.బాక్సింగ్‌లో ఒలింపిక్ పతక విజేత విజేందర్ సింగ్ ‘భారత్ మాతాకీ జై’ అని ట్వీట్ చేయగా... పఠాన్, సైనా నెహ్వాల్ ‘జైహింద్’ అంటూ మద్దతు పలికారు. ‘మన సైనికులు కేవలం భయపెట్టడంతో ఆగిపోరు. వారు ఏదైనా చేసి చూపిస్తారు’ అని బాక్సర్ నిఖత్ జరీన్ పేర్కొంది. మన సైనికుల భద్రత గురించి తాను ప్రార్థన చేస్తున్నట్లు ఒలింపియన్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ వెల్లడించింది.చదవండి: సరైన సమాధానం.. సాక్ష్యం కనబడుతోందా?.. ఆపరేషన్ సిందూర్‌పై స్పందనలు -
ఆపరేషన్ సిందూర్.. తొలిసారి స్పందించిన పాక్ ప్రధాని
ఇస్లామాబాద్: పహల్గాంలో ఉగ్రదాడులకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్ పేరుతో ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు చేసింది. ఈ దాడుల్లో దాదాపు 100 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం. ఇక, ఆపరేషన్ సిందూర్‌పై పాకిస్తాన్ ప్రధాని షెహబాబ్ షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తొలిసారి స్పందించారు. పాకిస్తాన్ జాతినుద్దేశించి ప్రసంగించిన షరీఫ్..తమ దేశంపై జరిగిన దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామన్నారు. భారత్ ధీటుగా సమాధానం ఎలా ఇవ్వాలో తమ దేశానికి, తమ బలగాలకు తెలుసు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. పాక్ సాయుధ దళాలకు దేశం మొత్తం అండగా నిలుస్తుందన్నారు. మనం వెనక్కి తగ్గుతున్నామని వారు (భారత్) అనుకుంటోంది. కానీ, ఇది ధైర్యవంతుల దేశమని వారు మరచిపోయారు అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. పాకిస్తాన్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత దళాలు బాంబుల వర్షం కురిపించాయి. జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని నేలమట్టం చేశాయి. విజయవంతంగా జరిపిన ఈ ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జైషే ముఠాకు చెందిన ఓ స్థావరంపై జరిపిన దాడిలో 14 మంది మృతిచెందినట్లు సమాచారం. ఇందులో 10 మంది మసూద్ కుటుంబసభ్యులే ఉన్నారు. మసూద్ అజార్ సోదరి - ఆమె భర్త, మసూద్ మేనల్లుడు - అతడి భార్య, మేనకోడలు, ఐదుగురు చిన్నారులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఈమేరకు జైషే వర్గాలను ఉటంకిస్తూ కథనాలు పేర్కొన్నాయి. వీరితో పాటు అజార్ అత్యంత సన్నిహితులు కూడా నలుగురు మరణించినట్లు సమాచారం. అయితే, దీనిపై అధికారిక ప్రకటన లేదు.Shehbaz Sharif says Pakistan will Retaliate & Avenge the blood🤣~ He is stammering. Unable to read the script given by Pakistan Army. Multiple CUTS just in 30 seconds. This is not Shehbaz. This is Asif Munir. This is Pakistan Army. P*gets have gone mad. pic.twitter.com/WbwQz83KPw— The Analyzer (News Updates🗞️) (@Indian_Analyzer) May 7, 2025మరోవైపు, ఉగ్రస్థావరాలపై భారత సైనిక చర్య నేపథ్యంలో పాకిస్థాన్ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా రెడ్ అలర్ట్ ప్రకటించింది. అన్ని ఆసుపత్రుల సిబ్బంది అత్యవసర విధుల్లో ఉండాలని ఆదేశించింది. దేశవ్యాప్తంగా 48 గంటలపాటు గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, బుధవారం సాయంత్రానికి ప్రధాన మార్గాల్లో విమాన రాకపోకలను పునరుద్ధరిస్తున్నట్లు వెల్లడించింది. ఇస్లామాబాద్, పంజాబ్‌లలో విద్యాసంస్థలు మూసివేసింది. దేశవ్యాప్తంగా భద్రతా బలగాలను సిద్ధంగా ఉంచింది. -
Jammu and Kashmir: దశాబ్దాలుగా నరమేధమే
అందాల కశ్మీరం ఉగ్రవాదులతో దశాబ్దాలుగా అగ్నిగుండంగా మారింది. 2000 నుంచి అక్కడ జరిగిన దాడులకు 700 మందికి పైగా భద్రతా సిబ్బంది, పౌరులు బలయ్యారు. వాటిలో ముఖ్యమైనవి.. 2000 మార్చి 21: అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత్‌లో పర్యటిస్తున్న వేళ టెర్రరిస్టులు చెలరేగిపోయారు. అనంత్‌నాగ్ జిల్లా చట్టీసింగ్పురా గ్రామంలో 36 మంది సిక్కులను కాల్చి చంపారు. ∙ 2000లోనే అమర్నాథ్ యాత్రికులపై పహల్గాం బేస్ క్యాంప్ వద్ద జరిగిన ఉగ్ర దాడిలో 32 మంది మరణించారు. ∙ 2001లో 13 మంది, 2002లో 11 మంది అమర్నాథ్ యాత్రికులను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. ∙ 2001 అక్టోబర్ 1న జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ప్రాంగణంపై జరిగిన ఆత్మాహుతి దాడికి 36 మంది బలయ్యారు. ∙ 2002లో జమ్మూ–శ్రీనగర్ హైవేపై ఉగ్రవాదులు అమర్చిన మందుపాతర పేలి నలుగురు భద్రతా సిబ్బందితో పాటు 19 మంది మరణించారు. ∙ 2003లో పుల్వామా జిల్లా నందిమార్గ్‌లో 24 మంది కశ్మీరీ పండిట్లను ఉగ్రవాదులు పొట్టన పెట్టుకున్నారు. ∙2014: ఉరిలో ఆత్మాహుతి దాడికి దిగి 17 మంది సైనికులను పొట్టన పెట్టుకున్నారు. ∙2015: కథువా పోలీస్ స్టేషన్‌పై దాడిలో ఆరుగురు పోలీసులు మరణించారు. ∙2016: ఉరిలో సైనిక క్యాంపుపై దాడికి తెగబడి 18 మంది సిబ్బందిని పొట్టన పెట్టుకున్నారు. ∙2017లో అమర్నాథ్ యాత్ర నుంచి తిరిగొస్తున్న భక్తులపై కాల్పుల్లో 18 మంది మరణించారు. ∙2019: పుల్వామాలో సీఆరీ్పఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడికి 40 మంది జవాన్లు బలయ్యారు. ∙2025 ఏప్రిల్ 22: బైసారన్‌లో 26 మంది పర్యాటకులను కాల్చిచంపారు. -
Operation Sindoor: యుద్ధ స్వరం... ఆ ఇద్దరు
‘ఆపరేషన్ సిందూర్’ ఒక సంచలనమైతే... ప్రెస్మీట్లో మిలిటరీ బ్రీఫింగ్ చేసిన ఇద్దరు మహిళా సైనికాధికారులు మరో సంచలనం. ఆ ఇద్దరు... చెప్పకనే ఎన్నో చెప్పారు. వారిలో మతాలకతీతమైన జాతీయ సమైక్యత కనిపించింది. ఎలాంటి అవరోధాలనైనా అధిగమించి జయించే మహిళాశక్తి కనిపించింది. ఆపరేషన్‌కు ‘సిందూర్’ అని పేరు పెట్టడం ప్రతీకాత్మకం. ఐక్యత, మత సామరస్యానికి సంబంధించిన శక్తిమంతమైన సందేశాన్ని తెలియజేసేలా ఇద్దరు మహిళా అధికారులు బ్రీఫింగ్‌కు నేతృత్వం వహించాలి అనే నిర్ణయం కూడా ప్రతీకాత్మకమైనదే. ప్రపంచ ఆసక్తి ఇప్పుడు రెండు పేర్లపై కేంద్రీకృతమైంది. కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్...భారత చరిత్రలో తొలిసారి ఇద్దరు మహిళా అధికారులు భారీ సైనిక చర్యపై అధికారిక విలేకరుల సమావేశానికి నాయకత్వం వహించారు. ఉగ్రవాదాన్ని గట్టిగా ఎదుర్కోవాలనే దేశ సంకల్పాన్ని మాత్రమే కాకుండా సాయుధ దళాల్లో పెరుగుతున్న మహిళల బలానికి వారు ప్రతీకలుగా కనిపించారు. ‘ఆపరేషన్ సిందూర్’ వివరాలను పంచుకోవడానికి నిర్వహించిన విలేకరుల సమావేశానికి కల్నల్ సోఫియా ఖురేషీ, భారత వైమానికి దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికాసింగ్ నేతృత్వం వహించిన నేపథ్యంలో వారి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి సర్వత్రా మొదలైంది. ‘పహల్గామ్లో ఇరవై ఆరుమందిప్రాణాలను బలిగొన్నారు. ఉగ్రవాద బాధితులకు న్యాయం చేసేందుకే ఆపరేషన్ సిందూర్ ప్రారంభించాం’ అన్నారు సోఫియా ఖరేషీ. పాక్, పాక్ ఆక్రమిత జమ్ము కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకొని విజయవంతంగా దాడి చేసినట్లు ఆమె తెలియజేశారు. సంక్షోభ పరిస్థితుల్లో సైన్యం, ప్రజల మధ్య కమ్యూనికేషన్‌ను కొనసాగించడంలో ప్రొఫెషనల్ ఆఫీసర్స్ పాత్రను వింగ్ కమాండర్ వ్యోమికాసింగ్ వివరించారు.ఆ ఇల్లు సైనిక శిబిరంఅది ఇల్లు అనడం కంటే... చిన్నపాటి సైనిక శిబిరం అంటే బాగుంటుంది! కొట్ట వచ్చినట్లు కనిపించే మిలిటరీ క్రమశిక్షణ ఒకవైపు...‘ఆ యుద్ధంలో ఏం జరిగిందో తెలుసా?’‘ఒక వీర సైనికుడి గురించి చెబుతాను విను..’ ఇలాంటి విశేషాలు మరోవైపు. గుజరాత్‌లోని వడోదరాకు చెందిన ఖురేషిది సైనిక కుటుంబ నేపథ్యం. తాత, తండ్రీ సైన్యంలో పనిచేయడమే తాను సైన్యంలో పనిచేయాలనుకోవడానికి కారణం. బలం. ‘మహారాజా షాయాజీరావు యూనివర్శిటీ’లో బయోకెమిస్ట్రీలో పీజీ చేసిన ఖురేషి 1999 లో షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా భారత సైన్యంలో చేరారు.చరిత్ర సృష్టించి...పుణెలో జరిగిన ‘ఎక్సర్సైజ్ ఫోర్స్ 18’లో పద్ధెనిమిది దేశాల సైనికులు పాల్గొన్నారు. ఈ విశిష్ట కార్యక్రమంలో భారత సైన్యానికి చెందిన బృందానికి నాయకత్వం వహించి చరిత్ర సృష్టించారు ఖురేషీ. అంతేకాదు.. ‘ఎక్సర్సైజ్ ఫోర్స్ 18’లో పాల్గొన్న 18 బృందాలలో ఆమె ఏకైక మహిళా కమాండర్.గర్వించదగిన కాలంఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక చర్యల్లో భాగంగా కాంగోలో ఆరేళ్లు పనిచేశారు ఖురేషీ. అక్కడ ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఇరు వర్గాల మధ్య కాల్పుల విరమణను పర్యవేక్షించారు. ఒకవైపు శాంతిపునరుద్ధరణ ప్రయత్నాలు చేస్తూనే, మరోవైపు సేవాకార్యమ్రాలకుప్రాధాన్యత ఇచ్చేవారు.‘ఘర్షణాత్మక ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు చేసిన ప్రయత్నాలు నాకు గర్వకారణం’ అంటారు ఖురేషీ.ఖురేషీలోని నాయకత్వ లక్షణాలు, చొరవ, ధైర్యసాహసాలను అప్పటి ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ బిపిన్ రావత్ గుర్తించారు. ‘సైన్యంలో పురుష, మహిళా అధికారులు అనే తేడా లేదు. జెండర్ప్రాతిపదికన కాకుండా బాధ్యతను భుజాన వేసుకునే సామర్థ్యం, నాయకత్వ లక్షణాల వల్లే ఆమె ఎంపిక జరిగింది’ అన్నారు రావత్. భారత పార్లమెంట్ పై ఉగ్రవాదుల దాడి తర్వాత చేపట్టిన ‘ఆపరేషన్ పరాక్రమ్’లో ఖురేషీ కీలక పాత్ర పోషించారు. ఆమె ధైర్యసాహసాలకు గాను జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ ప్రశంసలు అందుకున్నారు. కుటుంబ నేపథ్యం ఖురేషీకి సైన్యంలో పనిచేయాలనే లక్ష్యాన్ని ఇచ్చింది. విద్యానేపథ్యం విమర్శనాత్మక ఆలోచన దృష్టిని ఇచ్చింది. సమస్య పరిష్కారానికి శాస్త్రీయ దృష్టిని అందించింది. ఆకాశ పుత్రికఆకాశంలో కనిపించే విమానాలను చూస్తూ అందరు పిల్లల్లాగే చప్పట్లు కొడుతూ తెగ సంతోషించేది వ్యోమికా సింగ్. ఆ సంతోషానికి లక్ష్యం కూడా తోడైంది. ఆకాశంలో దూసుకు పోవాల్సిందే!‘నేను ఆరవ తరగతిలో ఉన్నప్పుడే పైలట్ కావాలనుకున్నాను. ఆకాశాన్ని సొంతం చేసుకోవాలనుకున్నాను. మా పేర్ల అర్థాల గురించి క్లాసులో మాట్లాడుకుంటున్నప్పుడు వ్యోమిక... నీ పేరుకు అర్థం ఆకాశ పుత్రిక అని అరిచారో ఎవరో. దీంతో పైలట్ కావాలనే కోరిక మరింత బలపడింది’ అని ఒక టీవీ షోలో బాల్య జ్ఞాపకాన్ని గుర్తుచేసుకున్నారు వ్యోమికా సింగ్.ఎన్సీసీ పునాదిపై...ఇంజినీరింగ్ చేస్తున్నప్పుడు ఎన్సీసీలో చేరిన వ్యోమికాకు సైనిక క్రమశిక్షణ అలవడింది. భారత వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్‌గా తన కలను నిజం చేసుకున్న వ్యోమిక 2019లో ఫ్లయింగ్ బ్రాంచ్‌లో శాశ్వత కమిషన్ హోదా పొందారు. తన కుటుంబంలో సాయుధ దళాల్లో చేరిన మొదటి వ్యక్తిగా వ్యోమిక గుర్తింపు పొందారు.జమ్మూకశ్మీర్, ఈశాన్యప్రాంతాలతో సహా అత్యంత కఠినమైన భూభాగాల్లో చేతక్, చీతాలాంటి హెలికాప్టర్లు 2,500 గంటలకు పైగా నడిపిన అనుభవం ఆమెకు ఉంది. 2021లో 21,650 అడుగుల ఎత్తులో ఉన్న మణిరంగ్ పర్వతారోహణ యాత్రలో పాల్గొన్నారు. కమాండర్ వ్యోమికా సాహసాన్ని, అంకితభావాన్ని చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌తో సహా సీనియర్ డిఫెన్స్ అధికారులు గుర్తించారు. 2020లో అరుణాచల్‌ప్రదేశ్‌లో కీలక రెస్క్యూ ఆపరేషన్‌కు నేతృత్వం వహించి, విపత్కర పరిస్థితుల్లో ఉన్న పౌరులను సురక్షితప్రాంతాలకు తరలించారు. ఈశాన్య భారతంలో వరద సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొన్నారు. విపత్కర పరిస్థితులు ఎదురైనా చెరగని చిరునవ్వు ఆమె సొంతం. ప్రకృతి కల్లోలాలకు వెరవకుండా బాధితులకు అండగా ఉండడం ఆమె నైజం. ఆ ఇద్దరు... ది స్ట్రెంత్ ఆఫ్ ఇండియాకల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. వివిధ పార్టీల నేతలు వీరిని అభినందించారు. ‘ఇది కేవలం బ్రీఫింగ్ మాత్రమే కాదు. సాహసోపేతమైన ప్రకటన. ప్రతి యుద్ధంలో, ప్రతి మిషన్‌లోనూ మహిళలు ముందుండి నడిపిస్తారు’ అని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ట్వీట్ చేశారు. ‘విలేకరుల సమావేశంలో ఎవరు ఉన్నారో గుర్తుంచుకోండి. వారు... ఇండియన్ ఆర్మీకి చెందిన కల్నల్ సోఫియా ఖురేషీ, వైమానికి దళానికి చెందిన వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. భుజం భుజం కలిపి ఒకే జెండాను మోస్తున్నారు. ఇది భారతదేశం. ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. ఐక్యత, శాంతి ముందు విద్వేషానికి మాటలు ఉండవు’ అని యాక్టివిస్ట్, రైటర్ గుర్మెహర్ ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. -
గతానికి భిన్నంగా...
ఏప్రిల్ నెల చివరలో జమ్మూ–కశ్మీర్‌లోని పహల్గామ్లో 26 మంది నిరాయుధులను దారుణంగా హత్య చేసినందుకు ప్రతీకారంగా, మే 7 ఉదయం పాకిస్తాన్లో ఉగ్రవాదులకు స్థావరంగా ఉన్న తొమ్మిది ప్రదేశాలపై భారత సైన్యం దాడి చేసింది. పహల్గామ్ ఘాతుక చర్యకు సమాధానం ఇచ్చి తీరుతామని దేశ రాజకీయ నాయకత్వం స్పష్టం చేయడంతో సైనిక దాడి తప్పదని తేలిపోయింది. అయితే, పాక్ ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడి జరగడం ఇదే మొదటి సారి కాదు, కానీ సరిహద్దు రేఖలు మారుతున్నాయని సూచించే లక్షణాలు ‘ఆపరేషన్ సిందూర్’లో ఉన్నాయి.సరిహద్దును దాటి...పాకిస్తాన్లో ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై చివరి ప్రధాన దాడి 2019 ఫిబ్రవరిలో చోటు చేసు కుంది. ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లోని బాలాకోట్‌ను అప్పుడు భారత వైమానిక దళం లక్ష్యంగా చేసుకుంది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్ కేంద్ర బిందువైన పంజాబ్ ప్రావిన్స్‌లోని ప్రదేశాలపై భారతీయ సైన్యం దాడికి దిగింది. 1971 యుద్ధంలో పాకిస్తాన్ సైన్యం లొంగిపోయిన తర్వాత,భారత వాయుసేన నియంత్రణ రేఖను దాటడం ఇదే మొదటిసారి. దక్షిణ పంజాబ్‌లోని బహావల్పూర్లో జైష్–ఎ–మొహమ్మద్ ప్రధాన కార్యాలయం ఉంది. పంజాబ్‌లోని మరొక ప్రదేశం మురీద్కే! ఇక్కడ లష్కరే తోయిబా చాలా కాలంగా ఉనికిలో ఉంది. అయితే కశ్మీర్లో వాస్తవ సరిహద్దును గుర్తించే ఎల్ఓసీకీ, పాకిస్తానీ పంజాబ్‌కు మధ్య వ్యత్యాసం ఏమిటంటే, స్థిరపడిన అంతర్జాతీయ సరిహద్దు. సూటిగా చెప్పాలంటే, ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై దాడులకు చెందిన భౌగోళిక ప్రాంతం ఇప్పుడు విస్తరించింది. ప్రతీకారం తీర్చుకునే విషయంలో పాకిస్తాన్‌లోని ఏ ప్రదేశం కూడా భారత్ లక్ష్యాలకు దూరంగా లేదని తాజా దాడులు స్పష్టంగా సందేశమిస్తున్నాయి.1971 నాటి యుద్ధంలోని ముఖ్యాంశాలలో ఒకటి, భారత సైన్యంలోని త్రివిధ బలగాలూ పాల్గొనడమే! నాటి యుద్ధంలో పూర్తి విజయం సాధించడానికి త్రివిధ దళాలు కలిసి పనిచేశాయి. ఆపరేషన్ సిందూర్‌లో కూడా మూడు దళాలూ పాల్గొన్నాయని ప్రభుత్వం తెలిపింది. వనరులను అత్యంత సమర్థంగా ఉపయోగించుకోవడానికి సైన్యం దీర్ఘకాలిక లక్ష్యంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ థియేటర్ కమాండ్లకు ఇది శుభ సూచకం.నిజానికి భారతదేశం నుండి ప్రతిస్పందన అని వార్యం అయింది. అయినా భారీ స్థాయి దళాల కదలికల ద్వారా భారత్ ప్రతిస్పందన ఉంటుందని చెప్పే సూచన లేవీ లేవు. పాకిస్తాన్ వైపు మాత్రం వారు ప్రతిస్పందన కోసం సిద్ధమవుతున్నప్పుడు గణనీయ స్థాయిలో దళాల కదలిక కనిపించింది. అదే సమయంలో భారత్ సంయమన మార్గాన్ని ఎంచుకుంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో జరిగిన దాడుల్లో ఏవీ పాకిస్తాన్ సైన్యాన్ని లక్ష్యంగా చేసుకోలేదు. ఈ దాడిని ఉగ్రవాద మౌలిక సదుపాయాల నిర్మూలనకే పరిమితం చేశారు. దాడుల తర్వాత కూడా ప్రభుత్వం తన మీడియా ప్రకటనలో భారతదేశం తీవ్ర స్థాయి యుద్ధంలోకి వెళ్లకుండా ఉండాలనుకుంటున్నట్లు స్పష్టంగా సూచించింది.ప్రతిదాడి చేయడానికి ముందు, భారతదేశం తాను అనుకున్న విధంగా ప్రతీకారం తీర్చుకోవడానికి గణనీయమైన స్థాయిలో అంతర్జాతీయ మద్దతును సాధించింది. చైనా మాత్రమే దీనికి మినహాయింపు. అదే సమయంలో, అంతర్జాతీయ ప్రధాన శక్తులు వాణిజ్య యుద్ధంతో పాటుగా పశ్చిమాసియాలో, ఉక్రెయిన్‌లో దీర్ఘకాలిక సంఘర్షణ సవాలును ఎదుర్కొంటున్నాయి. కాబట్టి ఇరుదేశాల మధ్య ఘర్షణలు ఒక స్థాయికి మించి పెరగకూడదని అవి ఆశిస్తున్నాయి.వికసిత భారత్, రుణ సంక్షోభ పాక్‌భారతదేశం మూడు దశాబ్దాలకు పైగా జమ్మూకశ్మీర్‌లో పాకిస్తాన్ ప్రాయోజిత ఉగ్రవాదంతో పోరాడు తోంది. ఈ క్రమంలో రెండు దేశాలలోనూ, వేర్వేరు ఆర్థిక పథాల్లో అభివృద్ధి జరుగుతోంది. భారత్ తన ఆర్థిక సరళీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన 1991 నాటికి, పాకిస్తాన్ తలసరి జీడీపీ భారత్ కంటే ఎక్కువగా ఉంది. తాజాగా ప్రపంచ బ్యాంకు డేటా ప్రకారం, 2023లో పాకిస్తాన్ తలసరి జీడీపీ 1,365 డాలర్లు కాగా, భారత్ జీడీపీ 82 శాతం ఎక్కువగా 2,481 డాలర్ల వద్ద ఉంది. అంటే రెండు దేశాల ఆర్థిక పథాలు వాటి వ్యూహాత్మక ఎంపికలను ప్రభావితం చేశాయి.భారత్ ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే మార్గంలో ఉంది. ‘బ్రెగ్జిట్’ తర్వాత అది బ్రిటన్‌తో చేసుకున్న అత్యంత ముఖ్యమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని ఇటీవలే ముగించింది. మరోవైపు, పాకిస్తాన్ ఒక రుణ సంక్షోభం నుండి మరొక రుణ సంక్షోభానికి గురవుతూ, ఐఎమ్ఎఫ్ ఆపన్న హస్తం కోసం విజ్ఞప్తి చేస్తోంది. అది దాదాపు చైనా కాలనీగా మారింది. ఈ నేపథ్యంలో రెండు దేశాలు ఎంచుకున్న ఎంపికలనూ, పాకిస్తాన్ ఎదుర్కొంటున్న సార్వభౌమాధికారపు నిరంతర బలహీనతనూ పరిశీలించడం అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో జనరల్ అసీమ్ మునీర్‌కు అది ఎంతో ఉపయోగకరంగా ఉండవచ్చు.సంజీవ్ శంకరన్ వ్యాసకర్త ‘మనీ కంట్రోల్’ ఒపీనియన్స్–ఫీచర్స్ ఎడిటర్ -
దృఢసంకల్పంతో...
పహల్గామ్ ఉగ్రదాడికి భారత్ తగిన ప్రతీకారం తీర్చుకుంది. కుటుంబాల విచ్ఛిన్నమే లక్ష్యంగా పురుషులను మాత్రం ఎన్నుకుని... వారి మతం అడిగి మరీ భార్యల ఎదుటే భర్తలను ఉగ్రవాదులు చంపిన వైనం దేశాద్యంతం ప్రకంపనలు సృష్టించింది. ఇది కేవలం ఒక హింసాత్మక ఘటన కాదు. మానసిక యుద్ధ తంత్రం. ఈ విషయంపై భారత్ ఆచితూచి స్పందించింది. ఉద్రేకాలకు పోలేదు. కచ్చితమైన, వ్యూహాత్మకమైన, సమన్వయ యుతమైన మిలిటరీ ప్రతిచర్యకు దిగింది. నిఘా వర్గాల అంచనాలను ఒకటికి రెండుసార్లు పరిశీలించి మరీ ‘ఆప రేషన్ సిందూర్’ను నిర్వహించారు. పహల్గామ్ దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదు లకు, పాకిస్తాన్‌లోని వారి గురువులను రూఢి చేసుకునేంతవరకూ అత్యంత ఓరిమితో వ్యవహరించారు. మిలటరీ భాషలో ఈ ఓరిమిని క్రమశిక్షణ అనాలి. మరోవైపు పాకిస్తాన్ యథావిధిగా పహల్గామ్ దాడి తరువాత సరిహద్దుల్లో తన పదాతి దళాలను పెంచుకుని భారత మిలిటరీ ప్రతిచర్య కోసం ఎదురు చూసింది. అయితే భారత్ ఈసారి తన వ్యూహాన్ని మార్చుకున్న విషయం పాక్‌కు తెలియలేదు.బయటకు కనిపించని అసలు వ్యూహంఏదో జరగబోతోందన్న సంకేతాలు రెండు వారాలుగా కనిపిస్తున్నా కచ్చితంగా ఏమిటన్నది చివరి క్షణం వరకూ బయటపడలేదు. ప్రధాని కేబినెట్ సమావేశాలు, ప్రతిపక్ష నేతలతోనూ మంతనాలు జరిపారు. భద్రతాదళ ఉన్నతాధికారులు, రక్షణ శాఖ మంత్రి అందరూ చర్చల్లో పాల్గొన్నారు. దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్స్కూ ఏర్పాట్లు పూర్తిస్థాయిలో జరిపారు. బయటకు కనిపించిన ఈ వ్యూహం వెనుక అసలైన ప్రతీకార చర్య చోటు చేసుకుంది. అణుబాంబుల బెదిరింపులతో మన ఆలోచనలను పక్కదారి పట్టించేందుకు జరిగిన విఫల యత్నాన్ని కూడా భారత్ అధిగమించింది. భారత రక్షణ దళాలు నియంత్రణ రేఖకు (ఎల్ఓసీ) ఆవల తొమ్మిది కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపాయి. ఇది భారత సత్తాను, కృత నిశ్చయాన్ని చాటే ప్రణాళికా బద్ధమైన ప్రతిదాడి. యుద్ధాల్లో ప్రతీకాత్మకతకు ప్రాముఖ్యం ఉంటుంది. మానసిక యుద్ధాల్లో మరీ ఎక్కువ. అందుకే అనూహ్యంగా ఇద్దరు మహిళా సైనికాధికారులు కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీతో కలిసి ఆపరేషన్ సిందూర్ గురించిన అధికారిక ప్రక టన వెలువరించారు. విదేశీ వ్యవహారాల శాఖ కార్య దర్శితో ఇద్దరు మహిళ సైనికాధికారులు పాల్గొనడం పాకిస్తాన్‌తో పాటు ప్రపంచ దేశాలన్నింటికీ బలమైన సంకేతం పంపినట్లు అయ్యింది. భారత్‌కు తన గౌర వాన్ని కాపాడుకోవడం ఎలాగో తెలుసు అన్న సందే శాన్ని స్పష్టం చేసింది. అయితే, నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ కాల్పులు జరుపుతూనే ఉంది. భారత్ వీటికి అంతే స్థాయిలో ప్రత్యుత్తరమూ ఇస్తోంది. దురదృష్టవశాత్తూ ఈ క్రమంలో భారత పౌరులు కొందరు ప్రాణాలు కోల్పోయారు. ఒకటి మాత్రం వాస్తవం: నిష్క్రియతో శాంతిని పొందలేమ న్నది అందరూ గుర్తించాలి.మునీర్‌పై విమర్శలుఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అసీమ్ మునీర్‌పై విమర్శలు వెల్లువెత్తు తున్నాయి. పాకిస్తాన్ భద్రతాంశాల విశ్లేషకురాలు అయేషా సిద్దిఖా ఆయన్ని ‘ఆలోచన లేని జనరల్’గా అభివర్ణించారు. మతానికి మాత్రమే కట్టుబడిన జనరల్‌కు వాస్తవిక కార్యాచరణ ప్రణాళికల గురించి ఏమీ తెలియదని విమర్శించారు. జనరల్ జియా–ఉల్ హక్, పర్వేజ్ ముషారఫ్‌ల మాదిరిగా తానూ ఏదో పేరు సంపాదించాలన్న తాపత్రయం ఆయనలో కనబడుతోంది. జియా, ముషారఫ్ ఇద్దరూ విభ జనకు ముందు భారత్‌లో పుట్టిన వారే. వాళ్లు సిద్ధాంతానికి వ్యూహాన్ని జోడించగల సమర్థులు. మునీర్ మతాన్ని, మాటలనే నమ్ముకున్నారు.ప్రస్తుతం జరుగుతున్నది రెండు సరిహద్దుల మధ్య యుద్ధం కాదు. సైద్ధాంతికమైనది. త్యాగమంటే ఏమిటో చెప్పేది. నష్టానికి దేశాలు న్యాయం పొందడం ఎలాగో చెప్పేది. ఆపరేషన్ సిందూర్ అన్న పేరు కేవలం ప్రతీకాత్మకమైంది మాత్రమే కాదు. భారతీయ సంప్రదాయంలో కుంకుమ బొట్టుకు ఉన్న ప్రాశస్త్యం తెలియంది కాదు. పహల్గామ్లో ఉగ్రవాదులు కుటుంబంలోని భర్తలే లక్ష్యంగా కాల్పులు జరిపారు. అందుకే మహిళల నుదుటి బొట్టును కాపాడేందుకే ఈ దాడులు చేసిందన్న సంకేతాన్ని భారత్ పంపింది. బెదిరింపులు, బుల్లెట్లు భారత సంకల్పాన్ని దెబ్బతీయలేవని, అణ్వాయుధాల పేరుచెప్పినా ఇక వదిలేది లేదన్నది ఆపరేషన్ సిందూర్ ఇచ్చే స్పష్టమైన సందేశం. మరి ఈ దాడులకు పాక్ స్పందించకుండా ఉంటుందా? కచ్చితంగా స్పందిస్తుంది. కాకపోతే ఎప్పుడు, ఎలా అన్నది వేచి చూడాలి. ఇందుకు భారత రక్షణ దళాలు పూర్తి సన్నద్ధంగానే ఉన్నాయి. పాక్ కవ్వింపులకు దిగితే గట్టి సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగానే ఉన్నట్లు ఇండియా స్పష్టమైన సంకే తాలిచ్చింది. అంతేకాదు... ఇదేదో పరిస్థితిని మరింత జటిలం చేసుకునేందుకు మాత్రం కాదనీ, పొరుగు దేశం తన హద్దుల్లో తానుండటం మేలన్న సంకేతాన్ని ఇచ్చేందుకేననీ స్పష్టం చేసింది. హద్దు మీరితే అంతే గట్టి సమాధానం దొరుకుతుందన్న హెచ్చరిక కూడా అందులో ఉంది. మనోజ్ కె. చన్నన్ వ్యాసకర్త భారత సైన్యంలో లెఫ్ట్‌నెంట్ కల్నల్ (రిటైర్డ్) -
అదనుచూసి పదునైన పాఠం!
తీరికూర్చుని భారత్‌తో పెట్టుకుంటే ఏమవుతుందో జగడాలమారి పాకిస్తాన్‌కూ, దాని కీలుబొమ్మలైన ఉగ్రమూకలకూ తెలిసొచ్చి ఉండాలి. 2016 నాటి ‘ఉరి’ సర్జికల్ దాడులు, 2019 నాటి బాలాకోట్ వైమానిక దాడులకు అనేక రెట్లు అధికంగా మంగళవారం అర్ధరాత్రి దాటాక ‘ఆపరేషన్ సిందూర్’ సంకేతనామంతో మన త్రివిధ దళాలు పకడ్బందీ సమన్వయంతో పాకిస్తాన్‌లోనూ, ఆక్రమిత కశ్మీర్ లోనూ తొమ్మిది చోట్ల గంటసేపు సాగించిన క్షిపణి దాడులు పాక్ సైన్యాన్నీ, ఉగ్రమూకల్నీ గుక్క తిప్పుకోనీయకుండా చేశాయి. ఉగ్రవాదుల శిక్షణ కేంద్రాలూ, వారి ఆయుధ గిడ్డంగులూ, ఇతరేతర అవసరాలకు వినియోగిస్తున్న బహుళ అంతస్తుల భవంతులూ లక్ష్యంగా మొత్తం 24 చోట్ల సాగించిన దాడుల్లో 70 మంది వరకూ ఉగ్రవాదులు మరణించగా, మరో 60 మంది గాయపడ్డారని చెబు తున్నారు. ఉగ్రవాద ముఠాలైన జైషే మొహమ్మద్ (జేఈఎం), లష్కరే తోయిబా(ఎల్ఈటీ) ప్రధాన కార్యాలయాలు రెండూ కుప్పకూలాయని సమాచారం. జేఈఎం చీఫ్ మసూర్ అజర్ సోదరితోసహా అతగాడి కుటుంబానికి చెందిన పదిమంది హతమయ్యారని కూడా చెబుతున్నారు. జరిగిన నష్టాన్ని కప్పెట్టే ఎత్తుగడతో అయిదు భారత్ విమానాలను కూల్చామంటూ పాక్ స్వోత్కర్షలకు పోతోంది. సంప్రదాయానికి భిన్నంగా ఈసారి పాక్ లోలోపలివరకూ చొచ్చుకెళ్లి దాడులు సాగించిన తీరూ, ఒక్క క్షిపణి కూడా గురితప్పకుండా శత్రుమూకలపై చండ్రనిప్పులు కురిపించిన విధానం మన త్రివిధ దళాల పకడ్బందీ అంచనాలకూ, పదునైన వ్యూహచతురతకూ దర్పణాలు. పాక్ గడ్డపై గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఉగ్రశిబిరాల ఆనుపానుల్ని శత్రునేత్రానికి చిక్కని విధంగా గత పక్షం రోజులుగా మానవ రహిత విమానాలతో జల్లెడపట్టాకే ఈ దాడులు జరిగాయి. పహల్గామ్ సమీపంలో అకారణంగా, అన్యాయంగా నిరాయుధ భారత పౌరులను గురిచూసి కాల్చిచంపటానికి కిరాయిమూకల్ని పంపి కొన్నిరోజులుగా పాకిస్తాన్ మురుస్తోంది. దీనిపై నిలదీస్తే షరా మామూ లుగా సాక్ష్యాలడుగుతోంది. గత నెల 22న పహల్గామ్ సమీపంలో ఉగ్రవాద ముఠా 26 మందిని పొట్టనబెట్టుకున్నప్పటి నుంచీ భారత ప్రజ ప్రతీకారంతో రగిలిపోతోంది. కంటికి కన్ను సిద్ధాంతం పాటించి గట్టి దెబ్బతీయాల్సిందేనన్న అభిప్రాయం అలుముకుంది. ఈ నేపథ్యంలో మన దళాల దాడులు విజయవంతం కావటం అందరినీ సాంత్వన పరుస్తుందనటంలో సందేహం లేదు.అనుకోని పరిణామాలు తలెత్తితే అనుసరించాల్సిన పద్ధతులపై పౌరులకు అవగాహన కల్పించటానికి బుధవారం మాక్ డ్రిల్ జరగటం, అంతకుముందు రోజు రాత్రే మన త్రివిధ దళాలు దాడులు చేయటం గమనిస్తే వర్తమానం ఎంత జటిలంగా ఉన్నదో అర్థమవుతుంది. ఇది మనం కోరుకున్నది కాదు. మన ప్రమేయం లేకుండా వచ్చిపడిన విపత్తు. అకారణంగా మనపై రుద్దిన సంక్లిష్ట సమస్య. దీనికి దీటుగా స్పందించకపోతే ఉగ్రదాడులకు అంతూ పొంతూ ఉండదు. కనుకనే పహల్గామ్ మారణకాండ గురించి తెలియగానే ప్రధాని నరేంద్ర మోదీ సౌదీ పర్యటనను రద్దుచేసుకుని వెను దిరిగారు. ఆ వెంటనే మంత్రివర్గ సహచరులతో, త్రివిధ దళాల అధిపతులతో వరస సమాలోచనలు సాగించారు. ఎప్పుడు, ఎక్కడ ఎలా దాడులు సాగించాలో, తీవ్రత ఏ స్థాయిలో వుండాలో మీరే నిర్ణ యించండంటూ మన దళాలకు అధికారం ఇచ్చారు. పర్యవసానంగానే పాక్ ప్రాపకంతో చెలరేగి పోతున్న ఉగ్రముఠాలకు గట్టి సమాధానం వెళ్లింది. ఈ దాడులకు చాలాముందే ఇతరేతర నిర్ణ యాలు తీసుకున్నారు. సింధూ నదీజలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్టు ప్రకటించ టంతోపాటు ఇండియా పలు చర్యలు తీసుకుంది. దీన్నంతటినీ గమనిస్తున్నవారికి మన దేశం సైనిక చర్యకు కూడా వెనకాడబోదని పక్షం రోజుల క్రితమే అర్థమైంది. యుద్ధం దేనికీ పరిష్కారం కాకపోవచ్చు. చర్చలే అంతిమంగా ఎంతటి జటిల సమస్యనైనా పరిష్కరిస్తాయన్న సిద్ధాంతం కూడా సరైనదే కావొచ్చు. కానీ పొరుగు పచ్చగావుంటే ఓర్వలేక నిష్కారణంగా దాడులకు దిగే నైజాన్ని శాంతిప్రవచనాలతో ఎదుర్కొనటం సాధ్యమేనా? ఒకపక్క పహల్గామ్ దాడులతో సంబంధం లేదంటూనే గత కొన్ని రోజులుగా అధీనరేఖ వద్దా, అంత ర్జాతీయ సరిహద్దు వద్దా పాక్ ఎలాంటి కవ్వింపూ లేకుండా కాల్పులకు దిగుతోంది. ఈ దాడుల కారణంగా ఒక్క బుధవారంనాడే పూంఛ్ జిల్లా గ్రామాల్లో 12 మంది పౌరులు బలయ్యారు. తన దుష్ట పన్నాగాలను కప్పిపుచ్చటానికి భద్రతామండలిలో పాకిస్తాన్ అమాయకత్వం నటిస్తూ భారత్ తీసు కుంటున్న వరస చర్యలకు వ్యతిరేకంగా తీర్మానం చేయించాలని విఫలయత్నం చేసింది. రేపో మాపో అది నేరుగా సైన్యాన్ని రంగంలోకి దించి ప్రతీకారం పేరిట చెలరేగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. ఉగ్రముఠాల ద్వారా మారణహోమానికి పాల్పడటం కన్నా ఒకరకంగా ఇది మంచిదే. భారత్ బెదిరిపోయి సైనిక దాడుల ఆలోచన మానుకుంటుందన్న తప్పుడు ఆలోచనతో కొన్ని రోజులుగా అది అణుబాంబు బెదిరింపులకు కూడా తెగించింది. ఆ దుస్సాహసానికి పూనుకుంటే చేజేతులా స్వీయవినాశనాన్ని కొనితెచ్చుకున్నానని పాక్ పశ్చాత్తాపపడే రోజు ఎంతో దూరంలో ఉండదు. ఈ కష్టకాలంలో దేశ ప్రజానీకం కుల మత భేదాలు మరిచి కలిసికట్టుగా ఉండటం అత్య వసరం. ఇదే అదనుగా నాలుగు ఓట్ల కోసమో, మరికొన్ని సీట్ల కోసమో ప్రజల్లో వైషమ్యాలు సృష్టించాలని చూసే అవాంఛనీయ శక్తుల్ని అందరూ సకాలంలో పోల్చుకుని దూరం పెట్టడం, తగిన బుద్ధి చెప్పటం ఎంతో అవసరం. మనలోని సమష్టితత్వమే ఎంతటి విపత్తునైనా ఎదుర్కొనే ధైర్యాన్ని స్తుంది. విజయాన్ని మన చేతికందిస్తుంది. -
అక్కడ జరిగిందేమిటి?.. మీరు చేస్తున్నదేమిటి?
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయకుల్ని ప్రాణాలు పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదుల వేరివేత లక్ష్యంగా భారత్ ‘ ఆపరేషన్ సిందూర్’ నిర్వహించింది. పాక్ లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మెరుపు దాడి చేసిన భారత్.. 90 మంది వరకూ టెర్రర్ మూకలను మట్టుబెట్టింది. అయితే భారత్ విజయవంతంగా పూర్తి చేసిన ఆపరేషన్ సిందూర్ పై చైనా మీడియా విషం కక్కింది. చైనాలోని గ్గోబల్ టైమ్స్’ అనే మీడియా సంస్థ ఆపరేషన్ సిందూర్ భారత్ విమానాలను పాక్ కూల్చిందంటూ తప్పుడు ప్రచారాన్ని మొదలుపెట్టింది. కొన్ని పాత ఫోటోలను జత చేసి వాటిని ప్రస్తుత ఆపరేషన్ సిందూర్ కు ఆపాదించింది. దీనిపై చైనాలోని భారత్ ఎంబాసీ కార్యాలయం తీవ్రంగా స్పందించింది. అక్కడ జరిగింది ఏమిటి.. మీరు చేస్తున్నదేమిటి అంటూ మండిపడింది ఒక విషయాన్ని వార్త రూపంలో ప్రచురించేటప్పుడు వాస్తవాలను తెలుసుకోవాలని, దానికి మూలాలను అన్వేషించి వార్తలు వేయాలని గ్లోబల్ టైమ్స్ కు చురకలంటించింది. అక్కడా ఆపరేషన్ సిందూర్ తో ఉగ్రస్థావరాలే లక్ష్యంగా భారత్ దాడులు చేసి విజయవంతంగా దాన్ని పూర్తి చేస్తే మీరు దాన్ని వక్రీకరించడం తగదంటూ హితవు పలికింది. కాగా, ఉగ్రవాదుల స్థావరాలే లక్ష్యంగా ఇండియన్ ఆర్మీ బుధవారం అర్ధరాత్రి చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ దాయాది పాకిస్థాన్‌కు భయం పుట్టిస్తోంది. ప్రధానంగా జైషే మహ్మద్, లష్కరే తోయిబా ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకొని వాటిని కూల్చివేసింది. విజయవంతంగా జరిపిన ఈ ‘ఆపరేషన్ సిందూర్’లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్‌కు చావు దెబ్బ తగిలినట్లు సమాచారం. జైషే ముఠాకు చెందిన ఓ స్థావరంపై జరిగిన దాడిలో 14 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. ఇందులో 10 మంది మసూద్ కుటుంబసభ్యులు హతమయ్యారు. -
నేలరాల్చిన 'సిందూరం'తోనే బదులు..! ఆదిపరాశక్తులే స్వయంగా..
ఏప్రిల్ 22న జరిగిన పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది మరణించిన కొన్ని వారాల తర్వాత మే 7 బుధవారం తెల్లవారుజామున భారతదేశం ఆపరేషన్ సిందూర్ చేపట్టి బదులిచ్చింది. నాడు ఆ విషాదకర ఘటనలో మోదీకి చెప్పు అంటూ మహిళా పర్యాటకుల ముందే వారి భర్తలను కడతేర్చారు. వారి ఆక్రందనలు వినిపించేలా నేలరాల్చిన ఆ మహిళ 'సిందూరం' పేరుతోనే ఆపరేషన్ చేపట్టి ఉలిక్కిపడేలా సమాధానమిచ్చింది భారత్. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఆరోజు ఆనందంగా గడపాలని వచ్చిన మహిళలకు కన్నీళ్లు మిగిల్చితే..ఈ ఆపరేషన్ పేరుతో సైనిక మహిళా శక్తితోనే సమాధానం చెప్పడం విశేషం. అంతేగాదు ఉగ్రమూకల్ని ఎలా మట్టుబెట్టామన్నది మీడియా ముందు వెల్లడించారు కూడా. మరీ ఆ ఆదిపరాశక్తులు ఎవరు? ఏవిధంగా ఈ ఆపరేషన్ని విజయవంతంగా ముగించారు తదితర విశేషాలు చూద్దామా..!వారే వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషీలు. ఈ సిందూర్ ఆపరేషన్ వారి నేతృత్వంలోనే విజయవంతంగా ముగిసింది. ఈ ఇద్దరు భారత సశస్త్ర దళాల్లో సీనియర్ మహిళా అధికారులు. ఈ సిందూర్ ఆపరేషన్‌కి సంబంధించిన సశస్త్ర దళాలకు నాయకత్వం వహించింది వీరిద్దరే. సోఫియా ఖురేషీ ఆర్మీ కల్నల్ హోదాలో ఆపరేషన్ సిందూర్‌కు ముందుండి నాయకత్వం వహించగా, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ పైలట్‌గా భారత వైమానిక దళానికి నాయకత్వం వహించారు. సోఫియా భూమిపై సైన్యంతో విధ్యంసం సృష్టించగా, వ్యోమికా సింగ్ ఆకాశం నుంచి వైమానిక దాడులు నిర్వహించారు. ఈ ఇరువురి మహళా అధికారుల నేతృత్వంలో భారత ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ బలగాలు పాకిస్థాన్ (Pakistan)లోని ఉగ్రస్థావరాలపై మెరుపులు దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో మొత్తం 9 ఉగ్ర స్థావరాలతో సహా పాక్‌లో ఉన్న టెర్రర్ ఇండక్షన్లు, ట్రైనింగ్ సెంటర్లను కూడా మట్టుబెట్టింది. అంతేగాదు విజయవంతంగా ముగిసిన ఈ ఆపరేషన్ గురించి ప్రపంచానికి తెలియజేయడమే గాక భారతదేశ రక్షణ దళాలలో మహిళల పాత్రను హైలెట్ చేసింది. సాహసాలకు కేరాఫ్ అడ్రస్ ఇరువురు..ఇక్కడ సోఫియా కుటుంబం మొత్తం సైనిక సేవలతో ముడిపడి ఉంది. అంతేగాదు సోఫియా ఫోర్స్ 18 అనే బహుళ జాతీయ సైనిక విన్యాసంలో భారత సైన్యం తరఫున ఒక దళానికి నాయకత్వం వహించిన తొలి మహిళా అధికారిగా చరిత్ర సృష్టించారు.సోఫియా యూఎన్ శాంతి పరిరక్షక కార్యకలాపాలలో ఆరు సంవత్సరాలు సేవలందించారు.ఐక్యరాజ్యసమితి మిషన్‌లో (2006) గణనీయమైన సేవలు అందించారువ్యోమిక తన పేరుకు తగ్గట్టే పైలట్ కావాలనే రంగాన్ని ఎంచుకుని సైన్యంలో చేరారామె. అంతేగాదు తన కుటుంబంలో ఆర్మీలో చేరిన తొలి వ్యక్తిగా వ్యోమిక పేరుగడించింది. డిసెంబర్ 18న, ఆమెకు శాశ్వత కమిషన్ లభించి, హెలికాప్టర్ పైలట్‌గా ఐఏఎఫ్‌లో ఆమె ప్రయాణం అధికారికంగా ప్రారంభమైంది. భారత్‌లో అత్యంత సవాలుతో కూడిన భూభాగాలలో చేతక్, చిరుత వంటి విమానాలను నడిపారామెఇప్పటివరకు 2,500కు పైగా ఫ్లయింగ్ గంటలు పూర్తి చేశారు.2020లో అరుణాచల్‌ప్రదేశ్‌లో కీలకమైన రెస్క్యూ మిషన్‌కు నాయకత్వం వహించింది2021లో త్రివిధ దళాల మహిళా ఎక్సపిడిషన్‌లో పాల్గొన్నారుహర్షం వ్యక్తం చేసిన పహల్గాం బాధితులు..ఆ ఆపరేషన్ గురించి వినగానే కళ్లల్లో నీళ్లు వచ్చేశాయన్నారు పహల్గామ్ బాధితులు. మా కుంకుమను నేలరాల్చిన వారికి అదే పేరుతో ఆపరేషన్ చేపట్టి మట్టికరిపించినందుకు ప్రభుత్వానికి హృదయపూర్వక కృతజ్ఞతలని గద్గద స్వరంతో అన్నారు. ఈ ఆపరేషన్ సిందూర్‌తో ప్రధాని మోదీ ఉగ్రవాదాన్ని అంతం చేస్తారని గట్టిగా విశ్వసిస్తున్నాం అని ధీమాగా చెప్పారు.(చదవండి: Operation Sindoor: మన కుమార్తెల సిందూరమే.. ఆపరేషన్ సిందూర్.. పహల్గాం బాధితుల రియాక్షన్) -
ప్రధాని మోదీ విజయరహస్యం ఇదే..!
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ యుద్ధ వ్యూహాలపైనే చర్చ నడుస్తోంది. ఎంత కఠినమైన సమయంలో కూడా తనలోని గాంభీర్యాన్ని ముఖంలో కనిపించనీయకుండా. పైకి తనపని తాను చేసుకుంటూ వ్యూహాలను సిద్ధం చేసుకుంటూ ఉండటమే మోదీ శైలి. అవతలి వాడికి అవకాశమివ్వడం, అవతలివాడిని మాట్లాడనీయడం మోదీకి తెలిసిన మరో విద్య. అది చెడు కానంతవరకే మోదీ భరిస్తారు.. ఒకవేళ అవతలి వాళ్ల నుంచి ప్రమాదం పొంచి ఉందన్న సమయంలో మాత్రం మోదీ వ్యవహరశైలి భిన్నంగా ఉంటుంది. ప్రపంచ వ్యాప్తంగా విశేష అభిమానం సందపాదించుకున్న మోదీ యుద్ధ వ్యూహాలను చూసి ప్రపంచ మిలిటరీ వ్యూహకర్తలు, విశ్లేషకులు నివ్వెరపోతున్నారు.ఎడమవైపు సంజ్ఞ చేస్తారు కుడివైపుకు తిరుగుతారు.. ఇది మనకు మోదీ ప్రసంగంలో తరుచు కనిపిస్తూ ఉంటుంది. మరి మోదీ వ్యూహాలు కూడా ఇలానే ఉంటాయి. ప్రస్తుతం పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై దాడులే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కూడా ఇదే కోవలోకి వస్తుంది. పాకిస్తాన్ ఉగ్రస్థావరాలపై దాడులే కాకుండా ఆ దేశ కవ్వింపు చర్యలకు గట్టిగా బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో తలపెట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవతమైంది. గత కొన్నేళ్లుగా మోదీ యుద్ధ తంత్రాలను దాయాది దేశం పాకిస్తాన్ పసిగట్టలేకపోతోంది.బాలాకోట్, "ఆపరేషన్ సింధూర్" రెండింటికీ ముందు, ప్రధాని మోదీ బాడీ లాంగ్వేజ్ బహిరంగ ప్రదర్శనే గాక ఆయన ప్రసంగాలు కూడా ప్రశాంతంగా కనిపించాయి. మోదీ అసలు ఉద్ధేశాన్ని బహిర్గత పరచలేదు. ఈ రెండు సమయాల్లోనూ సూదిమొనంత కచ్చితత్వంతో తాను చేయబోయే అ దాడులను,కాయన అమాయక మొహం వెనక దాచిపెట్టారు.బాలాకోట్ దాడి వ్యూహం తరహాలోనే, ఈసారి కూడా ప్రధాని మోదీ వ్యూహాలు పాకిస్తాన్‌ను నివ్వెరపరచాయ్. దాడికి ముందు ప్రశాంతమైన బాడీ లాంగ్వేజ్‌తో మాస్టర్‌మైండ్ యుద్ధతంత్రంతో. ఆపరేషన్ సింధూర్ కు ముందు ప్రదర్శించిన వైఖరి.. బాలకోట్‌కు ముందు ఆయన ప్రదర్శించిన వైఖరి పాకిస్తాన్‌ను అయోమయంలో పడేసింది.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒక వైపు చూపించి.. మరో వైపు నుంచి.. మధ్యందిన మార్తాండుని వలే అనన్యసామాన్యమైన శక్తితో శత్రువుపై పిడుగులు కురిపించే కళలో ప్రావీణ్యం సంపాదించినట్లే ఉంటుంది.. 2019లో బాలకోట్ దాడులకు ముందు ఆయన ప్రయాణ ప్రణాళికతో పాటు ఆయన ప్రసంగం, ప్రస్తుత "ఆపరేషన్ సింధూర్" సందర్భంగా ఆయన వ్యూహాలు.. యుద్ధతంత్రంలో మాస్టర్‌క్లాస్‌లు.. శత్రువును అచేతనం చేసి.. మూగబోయేలా చేశాయి.ఒకసారి చేస్తే యాదృచ్ఛికం కానీ మళ్ళీమళ్ళీ పునరావృతం చేయడమంటే.. ప్రపంచమనే వేదికను నివ్వెరపరచడమే. ఇది మోదీకే సాధ్యమైన యుద్ధతాండవం. అని నిస్సంకోచంగా చెప్పొచ్చు. రెండు దాడులకు మధ్య ఉన్న సారూప్యతలను పరిశీలిస్తే.. అవి కచ్చితంగా ఆశ్చర్యచకితుల్ని చేసే విధంగా ఉంటాయి. బాలకోట్ దాడికి ముందు ప్రధాని మోదీ ప్రదర్శించిన తంత్రం నుండి ఎలాంటి పాఠం నేర్చుకోనందుకు పాకిస్తాన్ తన చెప్పుతో తననే కొట్టుకుంటుంది.బాలకోట్ కు 48 గంటల ముందు2019 ఫిబ్రవరి 26న.. తెల్లవారుఝామున భారతదేశం బాలకోట్ పై దాడి చేసింది. కానీ, ఆ దాడికి ముందు 48 గంటలు, మోదీ షెడ్యూల్ అంతా యథావిధిగా జరిగింది.ఫిబ్రవరి 25న, ఆయన న్యూఢిల్లీలో జాతీయ యుద్ధ స్మారక చిహ్నాన్ని జాతికి అంకితం చేశారు. భారత సాయుధ దళాల పరాక్రమం గురించి ఆయన మాట్లాడినప్పటికీ, పాకిస్తాన్ ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్‌లోని జిహాదిస్ట్ మౌలిక సదుపాయాలపై రాబోయే దాడి గురించి ఎటువంటి సూచన ఇవ్వలేదు.నిన్న(మంగళవారం, మే 6వ తేదీ) రాత్రి 9 గంటలకు, భారత విమానాలు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, ప్రధాని మోదీ న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. భారతదేశం యొక్క ఆకాంక్షలు, అభివృద్ధి, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దాని సంకల్పం గురించి మోదీ మాట్లాడారు. ఆందోళన సూచించే ఒక్క ముడత కూడా అతని నుదిటిపై కనిపించలేదు. ప్రసంగంలో సందేహాస్పదమైన అంశాలకు ఏమాత్రం చోటివ్వలేదు.తుఫాను ఎదురైనప్పుడు ప్రశాంతత, అగ్ని గుండంలోనూ ధైర్యంగా నిలబడగలగడం గొప్ప నాయకుడి లక్షణాలు అని మనస్తత్వవేత్తలు అంటారు. ప్రధానమంత్రి మోదీ నాయకత్వం.. వారు సూచించే నాయకత్వ అంచనాలకు సరిపోవడం చూసి.. వారు నాయకత్వానికి ఇచ్చిన భాష్యం సరైందేనని భావిస్తారు.మోదీ వ్యూహాలు అర్థం కాలేదు,..చరిత్ర నుండి పాఠాలు నేర్చుకోకపోతే, అవే తప్పులను పునరావృతం చేస్తారు. బాలాకోట్‌కు ముందు ప్రధాని మోదీ తీరును పాకిస్తాన్ విశ్లేషించి ఉంటే.. మే 6వ తేదీ రాత్రి నియంత్రణ రేఖ వెంబడి తొమ్మిది లక్ష్యాలపై భారత్ దాడి చేసినప్పుడు ఆ దేశం ఎంతో కొంత ప్రతిఘటించే ఉండేది, కానీ మోదీ వ్యూహాలు అర్ధం కాకపోవడంతో పాకిస్తాన్ చూస్తూ ఉండిపోయింది.బాలకోట్‌కు ముందు ప్రధాని మోదీ వైఖరికి సంబంధించి కచ్చితత్వానికి ప్రతిరూపంగానే నిలుస్తుంది. దాడులకు కొన్ని గంటల ముందు, ఆయన ఒక మీడియా కార్యక్రమంలో పాల్గొని 2047 నాటికి భారతదేశం ఆర్థికంగా గొప్ప దేశంగా ఎదగాలనే ఆకాంక్షల గురించి మాట్లాడారు.30 నిమిషాల పాటు జరిగిన ఆనాటి తన ప్రసంగంలో.. ఏమాత్రం ఆందోళన కానీ ఒత్తిడి లేని వ్యక్తిలా ప్రశాంతంగా ఆయన మాట్లాడారు, జోకులు వేస్తూ, భారతదేశంలో ఉగ్రవాద దాడులకు మద్దతు ఇచ్చినందుకు పొరుగువారిని విమర్శించడం వినడానికి ప్రేక్షకులు ఆసక్తిగా కనిపించినప్పటికీ, పాకిస్తాన్ అనే పదాన్ని మాత్రం ఒక్కసారి కూడా పలకలేదు. ఆ సందర్బంగా మోదీ బాడీ లాంగ్వేజ్‌ను పరిశీలిస్తే ఎలాంటి అంచనాకు రాలేం.భారతదేశం అంతటా యుద్ధ విన్యాసాలు ప్రకటించడం అతిపెద్ద తంత్రం.. ప్రధానమంత్రి మోదీ ఇప్పటికీ తన దేశాన్ని సైనిక చర్యకు, దాని పరిణామాలకు సిద్ధం చేస్తున్నారని సూచిస్తుంది. కానీ, ఇది పాకిస్తాన్‌కు విలాసవంతమైన సమయం ఉందనే భ్రమను కలిగించడానికి ఒక వ్యూహం మాత్రమే అని ఉదయాన్నే తేలింది.యుద్ధ కళలో నిష్ణాతులు ఏమంటారంటే.. మీకు మీ శత్రువు గురించి పూర్తిగా తెలిస్తే, యుద్ధంలో ఓటమికి చాలా తక్కువ అవకాశం ఉంటుందని చెబుతారు. పాకిస్తాన్‌ను మోదీ పూర్తిగా చదివేశారు... కానీ ఆయన్ను అంచనా వేయడంలో పాక్ మళ్లీ ఫెయిల్ అయ్యింది. అందుకే గెలుపు ప్రతీసారి మోదీనే వరిస్తుంది. -
దేశవ్యాప్తంగా ఆపరేషన్ అభ్యాస్
అనూహ్య పరిస్థితులను దీటుగా ఎదుర్కొనేందుకు, యుద్ధ సన్నద్ధతను పూర్తిస్థాయిలో చాటేందుకు.. దేశవ్యాప్తంగా సివిల్ డిపెన్స్ మాక్ డ్రిల్ జరిగింది. దాదాపు 54 ఏళ్ల అనంతరం దేశవ్యాప్తంగా పౌర రక్షణ, సన్నద్ధత విన్యాసాలు నిర్వహించారు. 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ (సీడీడీ) పరిధిలో ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరిట ఈ డ్రిల్స్ జరిగాయి. మాక్ డ్రిల్స్‌లో భాగంగా వైమానిక దాడుల హెచ్చరికలతో సైరన్లు వినిపించాయి.👉హైదరాబాద్, విశాఖ సహా 244 ప్రాంతాల్లో మాక్ డ్రిల్👉సికింద్రాబాద్, గోల్గొండ, కంచన్‌బాగ్ డీఆర్డీఏ, మౌలాలీలోని ఎన్ఎఫ్సీలో డిఫెన్స్ బృందాల మాక్ డ్రిల్👉విశాఖ వన్ టౌన్లో మాక్ డ్రిల్👉వైమానిక దాడులపై అవగాహన కల్పించేందుకు మాక్ డ్రిల్👉ఎక్కడెక్కడ జరిగాయంటే..దేశవ్యాప్తంగా మొత్తం 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ (సీడీడీ) పరిధిలో ఎంపిక చేసిన 259 చోట్ల మాక్‌డ్రిల్స్ జరిగాయి. వీటిలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి మెట్రోలు కూడా ఉన్నాయి. 100కు పైగా సీడీడీలను అత్యంత సున్నితమైనవిగా గుర్తించి ‘ఎ’ కేటగిరీలో చేర్చారు. వాటి పరిధిలో సూరత్, వడోదర, కాక్రపార్ (గుజరాత్), కోట (రాజస్తాన్), బులంద్‌షహర్ (యూపీ), చెన్నై, కల్పకం (తమిళనాడు), తాల్చెర్ (ఒడిశా), ముంబై, ఉరన్, తారాపూర్ (మహారాష్ట్ర), ఢిల్లీ ఉన్నాయి.మాక్‌డ్రిల్ వల్ల ప్రజలు ఎవరూ భయపడొద్దు: సీవీ ఆనంద్సైరన్ మోగగానే ప్రజలు సురక్షిత ప్రాంతాల్లోకి వెళ్లాలిఇళ్లలో ఉన్నవాళ్లు ఇళ్లలోనే ఉండాలిబయట ఉన్నవాళ్లు సమీప భవనాల్లోకి వెళ్లాలి👉ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ అప్రమత్తం చేసింది.👉ఈ నేపథ్యంలో శాంతిభద్రతల పై సీఎం సమీక్ష నిర్వహించారు.👉ఆపరేషన్ అభ్యాస్ ద్వారా ప్రజలను అప్రమత్తం చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.👉జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగు ప్రాంతాల్లో మరికాసేపట్లో మాక్ డ్రిల్ నిర్వహించనున్నాం👉సాయంత్రం 4 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అలర్ట్ చేస్తాం.👉4 గంటలకు సైరన్ మోగగానే మాక్ డ్రిల్ ప్రారంభమవుతుంది.👉హైదరాబాద్, విశాఖ సహా 244 ప్రాంతాల్లో మాక్ డ్రిల్👉ఆపరేషన్ అభ్యాస్ పేరిట మాక్ డ్రిల్ నిర్వహణ👉సాయంత్రం 4 గంటల నుంచి 4.30 వరకు మాక్ డ్రిల్👉హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్👉సికింద్రాబాద్, గోల్గొండ,కంచబాగ్ డీఆర్డీఏ, మౌలాలీలోని ఎన్ఎఫ్సీలో డిఫెన్స్ బృందాల మాక్ డ్రిల్ 👉మోగనున్న పోలీస్ సైరన్, ఇండస్ట్రియల్ సైరన్లు -
Masood Azhar: ఆపరేషన్ సిందూర్‌పై జైషే చీఫ్ మసూద్ అజహర్ ఓవరాక్షన్
ఇస్లామాబాద్: ఆపరేషన్ సిందూర్‌పై జైషే మహ్మద్ ఉగ్ర ముఠా అధినేత మసూద్ అజహర్ లేఖ విడుదల చేశారు. ప్రధాని మోదీ అన్ని రకాల యుద్ధ నియమాలను ఉల్లంఘించారు. ఆపరేషన్ సిందూర్‌పై నాకు భయం లేదు. నిరాశ లేదు. విచారం లేదని పేర్కొన్నారు. ప్రధాని మోదీ, భారత్‌ను నాశనం చేస్తానంటూ లేఖలో ఓవరాక్షన్ చేశారు.ఆపరేషన్ సిందూర్‌లో జైషే మమ్మద్ స్థావరం పూర్తిగా నేలమట్టమయ్యింది. నామ రూపాల్లేకుండా పోయింది. ఇద్దరు మహిళా అధికారులు ఎవరీ కల్నల్ సోఫియా ఖురేషీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లు నాయకత్వం వహించిన ఆపరేషన్ సిందూర్‌లో మసూద్ అజహర్ కుటుంబలో 14 మంది మృతి చెందారు. మసూజ్ అజహార్ సోదరి,బావ,మేనల్లుడు సైతం ఉన్నారు. -
4 డ్రోన్లు వచ్చాయి.. నేలమట్టం చేశాయి: పాక్ ప్రత్యక్ష సాక్షి
పహల్గాం ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. దాయాది దేశంలోని ఉగ్ర తండాలను నేలమట్టం చేసింది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్ర మూకల ఆట కట్టించింది. ఇండియా దెబ్బకు పాకిస్థాన్‌తో పాటు పీఓకేలో 9 ఉగ్రవాద శిబిరాలు నామరూపాల్లేకుండా పోయాయి. 80 మందికి పైగా ముష్కరులు మట్టికరిచారు. ఆపరేషన్ సిందూర్‌ను యావత్ భారత్ ముక్త కంఠంతో ప్రస్తుతిస్తోంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌కు సరైన గుణపాఠం చెప్పారంటూ ఇండియన్ ఆర్మీని కీరిస్తున్నారు.కేవలం 25 నిమిషాల్లో ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా ముగించింది ఇండియన్ ఆర్మీ. పాకిస్తాన్‌లోని మురిడ్కేలో ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం జరిపిన దాడిని చూసిన ఒక స్థానికుడు 'ఆపరేషన్ సిందూర్' గురించి రాయిటర్స్ వార్తా సంస్థకు వివరించాడు. తాను నాలుగు డ్రోన్లను చూశానని వెల్లడించాడు. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత పెద్ద పేలుడు శబ్దం వినబడటంతో తాము నిద్ర నుంచి మేలుకున్నామని, అప్పుడే డ్రోన్ దాడులను (Drone Attack) ప్రత్యక్షంగా చూశామని చెప్పాడు."రాత్రి 12:45 గంటల ప్రాంతంలో మేము నిద్రపోతుండగా ముందుగా ఒక డ్రోన్ వచ్చింది. ఆ తర్వాత మరో మూడు డ్రోన్లు వచ్చాయి. అవి మసీదులపై దాడి చేశాయి. ప్రతిదీ ధ్వంసమైంది" అని మురిడ్కేకు చెందిన స్థానికుడు ఒకరు రాయిటర్స్‌తో అన్నారు. కాగా, భారత భద్రతా బలగాలు చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో లష్కరే తోయిబా, జైషే మహ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాదులు హతమయ్యారు. పాకిస్తాన్లో 4, పీఓకేలో 9 ఉగ్రవాద శిబిరాలను ఇండియన్ ఆర్మీ (Indian Army) ధ్వంసం చేసింది.తగిన సమాధానం ఇస్తాం: పాక్ఆపరేషన్ సిందూర్‌ను "నిర్లక్ష్యమైన యుద్ధ చర్య"గా పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ అభివర్ణించారు. "తగిన సమాధానం" ఇవ్వడానికి తమ దేశానికి పూర్తి హక్కు ఉందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి), అంతర్జాతీయ సరిహద్దు వెంబడి పాకిస్తాన్ భారీగా కాల్పులు జరిపింది. దీనికి భారత భద్రతా దళాలు దీటుగా జవాబిచ్చాయి. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. కశ్మీర్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారు. సరిహద్దు వెంబడి ప్రాంతాల్లో ఉన్నవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను కోరారు.చదవండి: ఎవరీ కల్నల్ సోఫియా, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్? -
హ్యాపీ దివాళీ, హ్యాపీ మిడ్ నైట్ సన్‌రైజ్.. పాకిస్తాన్‌పై ఫన్నీ కామెంట్స్
పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పీవోకేతో పాటు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు జరిపింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్టు వెల్లడించింది. ఈ దాడిలో దాదాపు 80 మంది చనిపోయినట్టు సమాచారం. ఇక, భారత దళాల దాడుల నేపథ్యంలో పాకిస్తాన్లో అర్ధరాత్రి కూడా సూర్యోదయంలా కనిపించింది. భారత మెరుపు దాడుల కారణంగా వెలుగులు బయటకు వచ్చాయి.భారత్ ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారతీయులు సంబరాలు చేసుకుంటున్నారు. పాకిస్తాన్‌కు తగిన బుద్ది చెప్పారంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు.. పహల్గాంలో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులు కూడా కేంద్రం నిర్ణయం, ఈ ఆపరేషన్ పట్ల ధన్యవాదాలు చెబుతున్నారు. ఉగ్రవాదులను ఏరివేసేందుకు మరిన్ని దాడులు చేయాలని వ్యాఖ్యలు చేస్తున్నారు. Sunrise in Pakistaan at 2am.Credits to INDIAN ARMED FORCES🇮🇳.#OperationSindhoor pic.twitter.com/CecgCPHNrD— BJP Karnataka (@BJP4Karnataka) May 7, 2025ఇదిలా ఉండగా.. భారత దాడుల సందర్భంగా పాకిస్తాన్లో పరిస్థితులపై సోషల్ మీడియా వేదికగా పలువురు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. అర్థరాత్రి రెండు గంటలకే పాకిస్తాన్లో సూర్యోదయం వచ్చిందని కర్ణాటక బీజేపీ ట్విట్టర్లో ఫన్నీ పోస్టును పెట్టింది. ఇక, పలువురు నెటిజన్లు వీడియోలు ఫోస్టు చేస్తూ దివాళి ముందే వచ్చేసిందనే సినిమా డైలాగ్‌తో పోస్టులు చేస్తున్నారు.📍Bahawalpur, #Pakistan after #IndianAirStrikes #OperationSindoor #Indi pic.twitter.com/slfSIUuNRo— Mahalaxmi Ramanathan (@MahalaxmiRaman) May 7, 2025 Sunrise 2Am in pakistan #OperationSindhoor pic.twitter.com/4CX0VAsS11— ashvani_says (@AshtabThe37483) May 7, 2025 🇮🇳 Indian Govt scheduled a mock drill, but #IndianArmy conducted the drill in Pakistan! #OperationSindoor hits terror camps hard! Jai Hind! Jai Bharat Mata! We are not in danger—WE ARE THE DANGER! 💪 #IndiaPakistanWar #IndianAirForce #Airstrike #OperationSindhoor pic.twitter.com/cle936dCsE— United_Hindu (@Laxmi_Tweets_9) May 7, 2025“So many Nations have Suffered due to terrorism . Terrorism is not a Challenge to a nation , it’s a challenge to humanity” 🇮🇳❤️#OperationSindoor #JaiHind #mockdrills pic.twitter.com/iSLiIQ09de— Tanay (@tanay_chawda1) May 6, 2025Happy Diwali, Pakistan Indian army 🔥Jai Hind 🇮🇳#OperationSindoor pic.twitter.com/grYxrv26WZ— Vishal (@VishalMalvi_) May 6, 2025Is anyone asking for proof of #OperationSindoor?pic.twitter.com/DJi849T4Ah— Vijay Patel (@vijaygajera) May 7, 2025पहलगाम पर भारत का पैग़ाम - छेड़ोगे तो छोड़ेंगे नहीं।प्रधानमंत्री मोदी जी ने कहा भारत की आत्मा पर हमला करने वालो को कड़ी सज़ा मिलेगी।भारत आतंकवाद को उसकी जड़ से उखाड़ फेकने में सक्षम भी है और संकल्प बद्ध भी है।मिटा देंगे आतंकवाद का नासूर - #OperationSindoor pic.twitter.com/JcMHuVBUgY— PANKAJ THAKKAR (Modi Ka Parivar) (@pankajthakkarr) May 7, 2025 -
ఆపరేషన్ సిందూర్.. స్పందించిన నెల్లూరు మధుసూదన్ కుటుంబ సభ్యులు
సాక్షి, నెల్లూరు: పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై భారత్ ప్రతీకార చర్యల నేపథ్యంలో పహల్గాం బాధిత మధుసూదన్ కుటుంబ సభ్యులు స్పందించారు. ఉగ్రవాదులు అనేవారు లేకుండా భారత్ మరింత గట్టిగా బుద్ధి చెప్పాలి అని వ్యాఖ్యానించారు. అలాగే, ఉగ్రవాదుల చేతిలో మరెవరో ప్రాణాలు కోల్పోకుండా భారత్ చర్యలు తీసుకోవాలని అన్నారు.భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై నెల్లూరుకు చెందిన మధుసూదన్ రావు కుటుంబ సభ్యులు స్పందించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రావు తల్లి పద్మావతి మాట్లాడుతూ..‘ఎన్ని యుద్దాలు చేసినా.. నా కొడుకును తీసుకురాలేరు. నా కడుపు కోత ఏ తల్లి పడకుండా ఉగ్రవాదులను అంతం చేయాలి. నా కొడుకు అమాయకుడు, మా కుటుంబానికి ఉగ్రవాదులు తీరని ద్రోహం చేశారు. ఉగ్రవాదుల చేతిలో మరెవరో ప్రాణాలు కోల్పోకుండా భారత్ చర్యలు తీసుకోవాలి అని అన్నారు.మధుసూదన్ సోదరి విజయలక్ష్మి మాట్లాడుతూ..‘పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలపై భారత దాడులు చేయడం మా కుటుంబానికి ఊరట కలిగిస్తోంది. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న అన్నని కోల్పోవడం మా కుటుంబానికి తీరని లోటు. ఇప్పటికి కూడా ఆ షాక్ నుంచి మేము తేరుకోలేకపోతున్నాం అని ఆవేదన వ్యక్తం చేశారు.మధుసూదన్ మామ వెంకట సుబ్బయ్య మాట్లాడుతూ..‘ఉగ్రవాదాన్ని రూపుమాపేందుకు భారత్ మరింత పటిష్ట చర్యలు తీసుకోవాలి. అమాయక టూరిస్టులను పొట్టనపెట్టుకున్న వారిని గట్టిగా శిక్షించాలి అని డిమాండ్ చేశారు. -
ఐసీసీ టోర్నీల్లోనూ పాక్‌తో మ్యాచ్‌లు వద్దు: గంభీర్
టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) కీలక వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) టోర్నీల్లోనూ భారత్ పాకిస్తాన్‌తో మ్యాచ్‌లు ఆడాల్సిన అవసరం లేదని పేర్కొన్నాడు. కాగా సరిహద్దు వివాదాల నేపథ్యంలో టీమిండియా-పాకిస్తాన్ (IND vs PAK) మధ్య పుష్కర కాలంగా ద్వైపాక్షిక క్రికెట్ సిరీస్‌లు జరగడం లేదన్న విషయం తెలిసిందే.. అయితే ఐసీసీ టోర్నీలలో మాత్రం ఇరు జట్లూ తలపడుతున్నాయి.ఇప్పుడు దీనికి కూడా ఫుల్స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉందని గంభీర్ అభిప్రాయపడ్డాడు. భారత్, పాక్ సరిహదుల్లో తీవ్రవాదం ముగిసేవరకు ఇరు జట్ల మధ్య ఆటలకు ప్రాధాన్యత లేదని అతను అన్నాడు. అప్పటిదాకా ఎలాంటి ఆటలు అవసరం లేదుఈ విషయంలో బీసీసీఐ మాత్రమే కాదు, భారత ప్రభుత్వమే తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని గంభీర్ వ్యాఖ్యానించాడు. ‘నా అభిప్రాయం ప్రకారం ఇరు దేశాల మధ్య పరిస్థితులు మెరుగుపడే వరకు అసలు ఎలాంటి ఆటలు అవసరం లేదు.గతంలోనూ ఈ అభిప్రాయాన్ని వెల్లడించాను. నా దృష్టిలో క్రికెట్ మ్యాచ్, బాలీవుడ్ సినిమాలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలేవీ భారత సైనికులు లేదా భారత పౌరుల ప్రాణాలకంటే ముఖ్యం కాదు. మ్యాచ్‌లు జరుగుతుంటాయి.సినిమాలు వస్తూ పోతూ ఉంటాయి. గాయకులు వేదికలపై పాడుతూనే ఉంటారు. కానీ మీ ఆత్మీయులను కోల్పోయిన బాధను ఏదీ తగ్గించలేదు’’ అని గంభీర్ ఉద్వేగభరితంగా మాట్లాడాడాడు. ఆసియా కప్ గురించి చెప్పలేనుఅదే విధంగా.. ‘‘ఈ ఏడాది జరిగే ఆసియా కప్ గురించి నేను ఏమీ చెప్పలేను. అది పూర్తిగా ప్రభుత్వ నిర్ణయం. వారు ఏం చెబితే దానిని పాటిస్తాం’ అని గంభీర్ స్పష్టం చేశాడు. కాగా ఇటీవల జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదులు పాశవిక దాడికి తెగబడిన విషయం విదితమే. బైసరన్ లోయలో పర్యాటకులపై కాల్పులు జరిపి ఇరవై ఆరు మంది అమాయకులను పొట్టనబెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్ తీవ్ర స్థాయిలో మండిపడింది. సింధు జలాల ఒప్పందం రద్దు సహా అనేక ఆంక్షలు విధించింది. ఆపరేషన్ సింధూర్తాజాగా ఉగ్రవాద శిబిరాలపై మెరుపు దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో పాకిస్తాన్లో నాలుగు, పీవోకేలోని ఉగ్రవాద శిబిరాలే లక్ష్యంగా ఐదు ప్రాంతాల్లో భారత సైన్యం దాడులకు దిగింది. దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఇంటెలిజెన్స్ వర్గాల సహకారంతో భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. లక్ష్యాలను ఖచ్చితంగా ఛేదించేందుకు డ్రోన్లు, ఇతర ఆయుధాలు వాడినట్లు భారత భద్రతా వర్గాలు పేర్కొన్నాయి.చదవండి: Virat Kohli: అందుకే టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్‌గా తప్పుకొన్నా -
మన కుమార్తెల సిందూరమే.. ఆపరేషన్ సిందూర్.. పహల్గాం బాధితుల రియాక్షన్
ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్ర దాడి ఘటనకు భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలపై భారత ఆర్మీ మెరుపు దాడులు చేసింది. భారత్ దాడుల్లో దాదాపు 80-90 మంది ఉగ్రవాదులు హతమైనట్టు తెలుస్తోంది. భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌పై పహల్గాం బాధిత కుటుంబ సభ్యులు కూడా స్పందిస్తున్నారు. ఆపరేషన్ ప్లాన్ చేసిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెబుతున్నారు. మరోవైపు.. దేశ ప్రజలు సైతం.. ఆపరేషన్ సిందూర్ పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.ఆపరేషన్ సిందూర్‌పై శుభమ్ ద్వివేది తండ్రి సంజయ్ ద్వివేది స్పందిస్తూ..‘భారత ఆర్మీకి సెల్యూట్ చేస్తున్నా. ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు. నేను ఉదయం నుంచి నిరంతరం వార్తలు చూస్తూనే ఉన్నా. ఈ సందర్భంగా దేశ ప్రజల బాధను విని పాక్ ఉగ్రస్థావరాలపై ఎటాక్ చేసినందుకు కృతజ్ఞతలు. ఉగ్రవాదులపై దాడి చేస్తున్నట్లు వార్తలను విన్నప్పటినుంచి మా కుటుంబం మొత్తం ఎంతో సంతోషంగా ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు.సంతోష్ జగ్దలే భార్య ప్రగతి జగ్దలే స్పందిస్తూ.. ఈ ఆపరేషన్ పేరు వినగానే నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మన కుమార్తెల సిందూరం తుడిచిపెట్టిన ఉగ్రవాదులకు ఇదే సరైన సమాధానం. ఈ సందర్భంగా ప్రభుత్వానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెబుతున్నా’ అని అన్నారు.#WATCH | Pune | #OperationSindoor | "I cried a lot on hearing the name of the operation . It is a real tribute and justice to those who were killed by terrorists," says Asavari Jagdale, daughter of Santosh Jagdale, who was killed in Pahlagam terror attack pic.twitter.com/L6Wh7HivHM— ANI (@ANI) May 7, 2025సంతోష్ జగ్దలే కుమార్తె అశ్విరి స్పందిస్తూ..‘పాకిస్తాన్లో తొమ్మిది స్థానాల్లో వారిపై భారత ఆర్మీ ఎదురుదాడికి దిగింది. ఇది నిజంగా భిన్నమైన అనుభూతి. ఈ ఆపరేషన్‌కు పెట్టిన పేరే అందుకు నిదర్శనం. మా కన్నీళ్లు ఆగలేదు. ఉగ్రవాదుల వల్ల సోదరీమణులు తమ సిందూరం కోల్పోయినందున వారికి గుర్తుగా ఈ దాడులకు నామకరణం చేశారుఆనందంతో కూడిన కన్నీళ్లు ఆగవు. మేం ఇంతటి బాధలోనూ ఆనందపడుతున్నాం. ప్రధాని మోదీ తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటారు’ అని అన్నారు. -
Operation Sindoor: ‘ఆపరేషన్ సింధూర్’ అంటే ఏమిటి?
delhi: పహల్గాం ఉగ్ర దాడితో రగిలిపోతున్న భారత్.. పాకిస్తాన్‌పై ప్రతీకారం తీర్చుకుంది. ‘ఆపరేషన్ సింధూర్’ (Operation Sindoor) మంగళవారం అర్ధరాత్రి పాక్ ఉగ్ర శిబిరాలపై మెరుపు దాడి చేసింది. తాజా సమాచారం మేరకు ఆపరేషన్ సింధూర్‌లో 80 మంది టెర్రరిస్టులు మృతి చెందినట్లు అంచనా. అయితే ఈ దాడికి ముందే విజయం కోసం సాధన.. దాడికి సిద్ధం..! అంటూ ఇండియన్ ఆర్మీ ఓ హింట్ కూడా ఇచ్చింది. నిమిషాల వ్యవధిలో పాక్‌పై దాడికి దిగింది. ఈ మెరుపు దాడికి ‘ఆపరేషన్ సిందూర్’ అని పేరు పెట్టింది.పాక్‌పై ప్రతీకారం తీర్చుకున్న వేళ ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సిందూర్ అని పేరు ఎందుకు పెట్టిందనే అంశంపై చర్చ కొనసాగుతోంది. సింధూరం అనేది దుర్గా, శక్తి దేవతలతో సంబంధం కలిగి ఉందని నమ్ముతారు. అలాగే సింధూరం ధరించిన వారికి దుర్గాదేవి రక్షణగా నిలుస్తుందని విశ్వసిస్తారు. పురాణాల ప్రకారం.. సింధూరాన్ని మొదటగా శివుడు ఉపయోగించాడు. వివాహ సమయంలో పరమ శివుడు పార్వతి దేవి నుదుటిన సింధూరం పెట్టాడు. అప్పటి నుంచి ఈ సంప్రదాయం ప్రతి హిందూ వివాహంలో భాగంగా మారింది. ఈ ఆచారం భర్తల పట్ల భార్యలకు ఉన్న గౌరవం, విధేయతను తెలియజేస్తుంది. ఈ సింధూరం భార్యలు.. భర్తలను కాపాడే పవిత్ర సంకేతం మాత్రమే కాదు. ఓ యోధుని తలపై ధరించే గర్వ తిలకం కూడా. This video captures the moment an Indian missile hit Bahawalpur, Pakistan, during 'Operation Sindoor' — a series of retaliatory attacks for last month’s Pahalgam bombing that killed 26 people, which India blames on Pakistan. pic.twitter.com/9g0yzHhYVB— Al Jazeera English (@AJEnglish) May 6, 2025సింధూరం భారతీయ సాంస్కృతికలో వివాహ తత్వానికి మాత్రమే కాదు, ధర్మ యుద్ధానికి కూడా చిహ్నం. రాజపుత్‌లు, మరాఠా యోధులు యుద్ధానికి వెళ్లే ముందు ధరించే తిలకం అది. ఇప్పుడు అదే తిలకం రూపంలో భారత్.. పాక్ ఉగ్ర శిబిరాలపై దాడి చేసినట్లు ప్రపంచానికి తెలిపింది. ఇది కేవలం ప్రతీకార దాడి కాదు. ఇది నీతికోసం, ధర్మంకోసం, దేశ ప్రజల రక్షణ కోసం చేసిన ఓ చర్యకు ప్రతీకగా నిలుస్తోంది. దేశాన్ని కుదిపేసిన వినయ్ నర్వాల్ ఘటన ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో సేదదీరుతున్న పర్యాటకులను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్నారు. ముఖ్యంగా జంటల్లో పురుషులను వేరు చేసి.. వారిని మతం అడిగి మరీ కాల్చి చంపారు. ఉగ్రవాదులు మొదట ప్రాణం తీసింది నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్‌నే. వినయ్ నర్వాల్ దంపతులకు పెళ్లై అప్పటికి ఆరు రోజుల క్రితమే. టెర్రరిస్టులు వినయ్‌ను హత్య చేయగా.. అతడి మృతదేహం వద్ద గుండెలవిసేలా రోదిస్తున్న హిమాన్షి నర్వాల్ చిత్రం దేశం మొత్తాన్ని కదిపేసింది. ఈ ఉగ్రదాడిలో భర్తలను కోల్పోయిన మహిళల ప్రతీకారానికి చిహ్నంగా దీని చూడొచ్చు. దెబ్బకు దెబ్బ తీసిందిఉగ్రవాదులు మతం ఆధారంగా ప్రాణాలు తీస్తామని సంకేతాలిస్తే.. భారత్ అదే దారిలో నడిచింది. దెబ్బకు దెబ్బ తీసింది. ఆపరేషన్ సిందూర్ పేరుతో అగ్నితో, ఆగ్రహంతో, ధర్మ యుద్ధాన్ని ప్రకటించింది. భారత ప్రజల హృదయాలను తాకేలా, ప్రపంచానికి స్పష్టమైన సంకేతంగా నిలిచింది. -
భారత్ మెరుపు దాడులపై స్పందించిన ట్రంప్, పాక్
పహల్గాం ఉగ్రదాడికి కౌంటర్‌గా పాక్ ఉగ్రస్థావరాలపై భారత్ మెరుపుదాడులకు దిగింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో ఏకంగా తొమ్మిది చోట్ల దాడులు చేసినట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. పాకిస్థాన్‌లోని ఉగ్రవాద స్థావరాలపై తాము దాడులు చేసినట్టు ప్రపంచ దేశాలకు భారత ఉన్నతాధికారులు వివరించారు. అమెరికా, రష్యా, యూకే, సౌదీ అరేబియా, యూఏఈ వంటి దేశాలకు భారత్ సమాచారం ఇచ్చింది. దాడికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో భారత్ చేసిన మెరుపు దాడులపై పాక్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు.దాడులపై స్పందించిన పాక్ ప్రధాని, ఆర్మీభారత్ తమ దేశంపై దాడులు చేసినట్లు పాక్ సైన్యం ప్రకటించింది. ఈమేరకు పాక్ లెప్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌదరీ ఒక లేఖ విడుదల చేశారు. పాక్, భారత్ సరిహద్దులకు కొద్ది దూరంలో ఉన్న బహవల్పూర్,కొట్లీ, ముజఫరాబాద్ వంటి ప్రాంతాల్లో ఈ దాడులు జరిగినట్లు ఆయన తెలిపాడు. అయితే, ఈ దాడుల్లో ముగ్గురు మరణించారని పాక్ ప్రకటించింది.అయితే, పదికిపైగా చనిపోయినట్లు తెలుస్తొంది. సుమారు 15మందికి తీవ్రమైన గాయాలైనట్లు పాక్ ఆర్మీ తెలిపింది. ఈ దాడికి పాల్పడిన భారత్‌పై తాము కూడా ప్రతీకారం తీర్చుకుంటామని పాక్ ప్రకటించింది. ఇప్పుడు భారత్ తాత్కాలిక సంతోషంతో ఉండొచ్చు.. కానీ, శాశ్వత దుఃఖంతో తాము భర్తీ చేస్తామని పాక్ లెప్టినెంట్ జనరల్ అన్నాడు. ఇదే సమయంలో పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా స్పందించారు.పాకిస్తాన్‌లోని ఐదు ప్రదేశాలపై మోసపూరిత శత్రువు పిరికి దాడి చేసింది. భారతదేశం విధించిన ఈ యుద్ధోన్మాద చర్యకు బలవంతంగా స్పందించే హక్కు పాకిస్తాన్‌కు పూర్తిగా ఉంది. దానికి గట్టిగా ప్రతిస్పందన ఇవ్వబడుతుంది. మొత్తం దేశం పాకిస్తాన్ సాయుధ దళాలకు అండగా నిలుస్తుంది. శత్రువును ఎలా ఎదుర్కోవాలో పాకిస్తాన్, ఆర్మీకి బాగా తెలుసు. శత్రువు తన దుర్మార్గపు లక్ష్యాలలో విజయం సాధించడానికి మేము ఎప్పటికీ అనుమతించము.' అని ఆయన తెలిపారు.స్పందించిన అమెరికా అధ్యక్షుడుభారత్, పాక్ దేశాల మధ్య పరిస్థితిని జాగ్రత్తగా తాము గమనిస్తున్నట్లు అమెరికా జాతీయ భద్రతా సలహాదారు మార్కో రూబియో రియాక్ట్ అయ్యారు. ఆపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇలా స్పందించారు. 'ఇరు దేశాల మధ్య పరిస్థితిలు చాలా దారుణంగా ఉన్నాయి. భారత్, పాక్‌లు దశాబ్దాలుగా ఘర్షణ పడుతున్నాయి. ఉద్రిక్తతలు ఇరు దేశాలు తగ్గించుకోవాలి. ఇదొక హేయమైన చర్య. రెండు శక్తివంతమైన దేశాలు రోడ్లపైకి వచ్చి ఘర్షణ పడాలని ఎవరూ కోరుకోరు. ప్రపంచానికి శాంతి కావాలి, ఘర్షణలు వద్దు' అని ట్రంప్ అన్నారు.Happy Diwali, Pakistan Indian army 🔥Jai Hind 🇮🇳#OperationSindoor pic.twitter.com/grYxrv26WZ— Vishal (@VishalMalvi_) May 6, 2025 -
సన్నద్ధతకు సంసిద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: మాక్‌డ్రిల్స్‌కు సర్వం సిద్ధమైంది. అనూహ్య పరిస్థితులను దీటుగా ఎదుర్కొనేందుకు, యుద్ధ సన్నద్ధతను పూర్తిస్థాయిలో చాటేందుకు దేశమంతా ఒక్కటవుతోంది. దాదాపు 54 ఏళ్ల అనంతరం దేశవ్యాప్తంగా పౌర రక్షణ, సన్నద్ధత విన్యాసాలు జరగనున్నాయి. పట్టణాల నుంచి గ్రామస్థాయి దాకా వాటిలో ప్రజలంతా చురుగ్గా భాగస్వాములు కానున్నారు. 6.5 లక్షల మందికి పైగా వలెంటీర్లు ఈ క్రతువులో వారికి సాయపడనున్నారు. 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ (సీడీడీ) పరిధిలో బుధవారం సాయంత్రం నాలుగింటి నుంచి రాత్రి దాకా ‘ఆపరేషన్ అభ్యాస్’ పేరిట ఈ డ్రిల్స్ జరుగుతాయి. దేశవ్యాప్తంగా అణు విద్యుత్కేంద్రాలు, రిఫైనరీలు, కీలక కేంద్ర ప్రభుత్వ సంస్థలున్న, రక్షణపరంగా సున్నితమైన ప్రాంతాలను సీడీడీలుగా 2010లో కేంద్రం నోటిఫై చేసింది. వీటిలో చాలావరకు రాజస్తాన్, పంజాబ్, జమ్మూ కశీ్మర్, పశి్చమబెంగాల్, ఈశాన్య రాష్ట్రాల్లో నెలకొని ఉన్నాయి. సున్నితత్వాన్ని బట్టి వాటిని మూడు కేటగిరీలుగా వర్గీకరించారు. ఢిల్లీ, చెన్నై వంటి నగరాలు అత్యంత సున్నితమైన కేటగిరీ 1లో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, విశాఖపట్నం డ్రిల్స్‌కు వేదిక కానున్నాయి. వాటిని సున్నితమైనవిగా పేర్కొంటూ కేటగిరీ 2లో చేర్చారు.కేంద్రం సమీక్ష పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ దేశవ్యాప్త డ్రిల్స్ సన్నద్ధతను కేంద్ర హోం శాఖ మంగళవారం సమీక్షించింది. డ్రిల్స్ విధివిధానాలు తదితరాలపై కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ సారథ్యంలో ఉన్నతస్థాయి సమావేశంలో లోతుగా చర్చించారు. రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో పాటు రక్షణ, పోలీసు విభాగాల అత్యున్నత స్థాయి అధికారులు భేటీలో పాల్గొన్నారు. డ్రిల్స్‌లో విద్యార్థులు, ఎన్సీసీ కాడెట్లు, యువతతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు, ఆస్పత్రుల సిబ్బంది, రైల్వే, మెట్రో ఉద్యోగులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు.ఎక్కడికక్కడ పోలీసు, సైనిక సిబ్బంది వారితో సమన్వయం చేసుకోనున్నారు. 1971 తర్వాత రక్షణపరంగా దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్స్ జరుగుతుండటం ఇదే తొలిసారి. అప్పుడు కూడా పాక్‌తో యుద్ధ నేపథ్యంలోనే ఈ కసరత్తు నిర్వహించారు. అంతకుముందు 1962, 1965ల్లో కూడా చైనా, పాక్‌తో పూర్తిస్థాయి యుద్ధం సందర్భంగా మాక్ డ్రిల్స్ జరిపారు. మంగళవారం అన్ని రాష్ట్రాల్లోనూ మాక్ డ్రిల్స్ సన్నాహక కసరత్తులు పోలీసు తదితర బృందాల పర్యవేక్షణలో ముమ్మరంగా జరిగాయి. విద్యార్థులు, యువత మొదలుకుని ప్రజలంతా పెద్ద సంఖ్యలో వాటిలో పాల్గొన్నారు.డ్రిల్స్ ఇలా...⇒ మాక్ డ్రిల్స్‌లో భాగంగా వైమానిక దాడుల హెచ్చరికలతో సైరన్లు విని్పస్తాయి. ⇒ వెంటనే పరిసర ప్రాంతాల పౌరులంతా క్షణాల్లో అప్రమత్తమై సురక్షిత ప్రాంతాలకు తరలాలి. వీలైన చోట్ల బంకర్లు, సబ్‌వేలు, అండర్‌గ్రౌండ్ మెట్రో తదితర చోట్ల తలదాచుకోవాలి. ⇒ ఈ కసరత్తులో యువత, విద్యార్థులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కాడెట్లు మొదలుకుని హోం గార్డుల దాకా అందరినీ భాగస్వాములను చేస్తారు. ⇒ కీలక సంస్థలు, మౌలిక సదుపాయ వ్యవస్థలను దాడుల నుంచి కాపాడుకోవడం, అవి శత్రువు కంటపడకుండా జాగ్రత్త పడటం తదితరాల్లో జాతీయ, రాష్ట్ర విపత్తు నిర్వహణ, అగి్నమాపక తదితర బృందాలు వారికి శిక్షణ ఇస్తాయి. ⇒ బ్లాకౌట్ వంటివి చోటుచేసుకుంటే ఎలా స్పందించాలో, స్వీయరక్షణతో పాటు పౌరులను కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తాయి. ⇒ రాత్రి 7.30 నుంచి 10 నిమిషాల పాటు క్రాష్ బ్లాకౌట్ ‘లైట్లను ఆపేయడం) కసరత్తు జరుగుతుంది. ⇒ డ్రిల్స్ కోసం హాట్‌లైన్, రేడియో కమ్యూనికేషన్ వంటివాటిని వైమానిక దళ లింకులతో అనుసంధానిస్తారు. ⇒ కంట్రోల్ రూమ్స్, షాడో కంట్రోల్ రూమ్స్ విపత్తులకు ఎలా స్పందిస్తాయో పరీక్షిస్తారు. ⇒ డ్రిల్స్ నిమిత్తం స్పందన బృందాలన్నింటికీ ఇప్పటికే కోడ్ వర్డ్స్ కేటాయించారు. ⇒ ఎప్పుడేం చేయాలో పేర్కొంటూ టైమ్‌లైన్‌ను కూడా స్పష్టంగా నిర్దేశించారు. ⇒ వైమానిక దాడుల హెచ్చరిక వ్యవస్థల సమర్థతను డ్రిల్స్ ద్వారా పరిశీలించనున్నారు. ⇒ కేంద్ర హోం శాఖ పౌర రక్షణ నిబంధనలు (1968) సెక్షన్ 19 ప్రకారం మాక్ డ్రిల్స్ నిర్వహిస్తున్నారు. ఇవి అందుబాటులో ఉంచుకోవాలి⇒ మాక్ డ్రిల్స్‌కు పౌరులు పూరిస్థాయిలో సన్నద్ధం కావాలి. ⇒అత్యవసర చికిత్స నిమిత్తం మెడికల్ కిట్లు, కరెంటు కోత తదితరాల కోసం టార్చిలు, క్యాండిళ్లు వెంట ఉంచుకోవాలి. అలాగే వీలైనంత నగదు కూడా దగ్గరుంచుకోవాలి. ⇒ వీటిపై పౌరులను అప్రమత్తం చేయాల్సిందిగా అధికారులను కేంద్ర హోం శాఖ ఆదేశించింది. ⇒ ఢిల్లీ, పశ్చిమబెంగాల్ సహా పలు రాష్ట్రాల్లో పౌర రక్షణ బృందాలు ఇప్పటికే చురుగ్గా పని చేస్తున్నాయి. ⇒ అయితే ఇవన్నీ స్వచ్ఛంద స్వభావంతో కూడిన బృందాలే.ఎక్కడెక్కడ?దేశవ్యాప్తంగా మొత్తం 33 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 244 సివిల్ డిఫెన్స్ డిస్ట్రిక్ట్స్ (సీడీడీ) పరిధిలో ఎంపిక చేసిన 259 చోట్ల మాక్‌డ్రిల్స్ జరుగుతాయి.⇒ వీటిలో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై వంటి మెట్రోలు కూడా ఉన్నాయి.⇒ 100కు పైగా సీడీడీలను అత్యంత సున్నితమైనవిగా గుర్తించి ‘ఎ’ కేటగిరీలో చేర్చారు. వాటి పరిధిలో సూరత్, వడోదర, కాక్రపార్ (గుజరాత్), కోట (రాజస్తాన్), బులంద్‌షహర్ (యూపీ), చెన్నై, కల్పకం (తమిళనాడు), తాల్చెర్ (ఒడిశా), ముంబై, ఉరన్, తారాపూర్ (మహారాష్ట్ర), ఢిల్లీ వంటివి ఉన్నాయి.ఈసారి తగ్గేదే లే! ⇒ ఉరి, బాలాకోట్ మాదిరిగా కాదు ⇒ త్వరలో బాహాటంగా భారీ ‘ఆపరేషన్’ ⇒ ఆ రాజకీయ సందేశమే డ్రిల్స్ లక్ష్యం2016లో సర్జికల్ స్ట్రైక్స్. 2019లో బాలాకోట్ వైమానిక దాడులు. ఉగ్రవాద దుశ్చర్యలకు గతంలో మోదీ సర్కారు ప్రతిస్పందనలు. రెండూ సైలెంట్‌గా నిర్వహించిన అండర్ కవర్ ఆపరేషన్లే. ఉరి, పుల్వామా ఉగ్ర చర్యలతో పోలిస్తే ‘పహల్గాం’ దాడి పరిస్థితి పూర్తి భిన్నం. 26 మంది అమాయక పర్యాటకులను ముష్కరులు అతి కిరాతకంగా పొట్టన పెట్టుకున్నారు. ఒక్కొక్కరినీ మతం అడిగి పిట్టల్లా కాల్చేసి పైశాచికత్వం ప్రదర్శించారు. అంతేగాక ‘పోయి మోదీకి చెప్పుకోండి’ అంటూ కేంద్రానికి సూటిగా సవాలు విసిరారు. దాడిని తలచుకుని భారతీయులంతా ఆగ్రహంతో రగిలిపోతున్నారు.ఈసారి కొట్టబోయే దెబ్బ జన్మలో మర్చిపోలేని విధంగా ఉండాలని కోరుతున్నారు. అందుకే ఈసారి భారత ప్రతి చర్య పూర్తి భిన్నంగా ఉండటం ఖాయమంటున్నారు. బాహాటంగా, అత్యంత భారీ స్థాయిలో సైనిక చర్య ఉండనుందని స్పష్టమైన సంకేతాలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో యుద్ధ సన్నద్ధత, పౌర అవగాహన కోసం దేశవ్యాప్త మాక్ డ్రిల్స్ నిర్ణయం సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న దాయాదికి గట్టి రాజకీయ సందేశమివ్వడమే దీని లక్ష్యమని చెబుతున్నారు. ఉగ్రవాదానికి, దానికి తల్లివేరు వంటి పొరుగు దేశానికి బుద్ధి చెప్పే విషయంలో దేశమంతా ఒక్కతాటిపై ఉందని ప్రపంచానికి చాటేందుకే మోదీ సర్కారు ఈ చర్య చేపట్టినట్టు తెలుస్తోంది. భారత ‘ఆపరేషన్’కు పాక్ స్పందనను బట్టి ఒకవేళ యుద్ధం వంటి పరిస్థితులు తలెత్తినా అందుకు దేశమంతా సంసిద్ధంగా ఉందని చాటడం కూడా ఈ డ్రిల్స్ ఉద్దేశమని రక్షణ రంగ పరిశీలకులు భావిస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఫ్లాష్ ఫ్లాష్: పాక్‌లోని ఉగ్ర శిబిరాలపై భారత్ దాడి..30 మంది ఉగ్రవాదుల హతం
పహల్గాం దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. మంగళవారం అర్ధరాత్రి దాటిన తరువాత ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట పీవోకేతో పాటు పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ వైమానిక దాడులు జరిపింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినట్టు వెల్లడించింది. ఈ దాడిలో దాదాపు 30 మంది ఉగ్రవాదులు మృతి చెందారని భారత సైన్యం చెప్తున్నారు. కానీ కేవలం 8 మంది మాత్రమే మృతి చెందారని పాకిస్తాన్ అంటుంది. మొత్తం 55 మందికి పైగా గాయపడ్డారు.పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని కోట్లి, ముజఫరాబాద్, పంజాబ్‌లోని బహవల్పూర్తో పాటు లాహోర్ లోని ఒక ప్రదేశంపై భారత్ క్షిపణి దాడులు జరిపింది. ఈ సందర్భంగా ‘ఎయిర్ టు సర్ఫేస్’ మిసైళ్లను ప్రయోగించారు. దాడి అనంతరం ‘న్యాయం జరిగింది.. జైహింద్’ అంటూ భారత్ సైన్యం ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఇవి సర్జికల్ స్ట్రైక్స్ కాదు. భారత భూభాగంనుంచే అత్యంత కచ్చితత్వంతో చేసిన దాడులని వెల్లడించింది. పహల్గాందాడిలో ఉగ్రవాదులు పురుషులను మాత్రమే ఎంచుకుని కాల్చి చంపి ఎందరో మహిళల నుదుటి సిందూరం తుడిచేసిన కారణంగానే ఆపరేషన్‌కు ‘సిందూర్’ అని నామకరణం చేశారు. మసూద్ అజర్, హఫీజ్ సయీద్ ప్రధాన స్థావరాలు లక్ష్యంగా ఈ దాడులు జరిగాయని తెలుస్తోంది. భారత దాడి అనంతరం పాకిస్తాన్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. విమానాశ్రయాలు మూసివేశారు. కాగా దాడులను ధృవీకరించిన పాకిస్తాన్ ప్రతీకార దాడులు చేస్తామంటూ ప్రకటించింది. అర్ధరాత్రి 1:44కు ఈ దాడులు జరిగినట్టు ఎక్స్‌లో అధికారికంగా పోస్ట్ చేసిన భారత సైన్యం. దాడి అనంతరం భారత్ మాతాకీ జై అంటూ ఎక్స్‌లో పోస్ట్ పెట్టిన రాజ్‌నాద్ సింగ్. అయితే దాడుల పై పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని రక్షణ శాక పేర్కొంది. ఈ దాడులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ.भारत माता की जय!— Rajnath Singh (@rajnathsingh) May 6, 2025కాగా భారత్ దాడుల అనంతరం పాకిస్తాన్ ఎదురు దాడులు చేయగా వాటిని భారత సైన్యం తిప్పి కొడుతుంది. -
ఇది ఐక్యతా సమయం
గత వారం ఓ రోజు ఉదయం 6 గంటల తర్వాత నా మొబైల్లో నోటిఫికేషన్ పింగ్ అయింది. నా స్నేహితుడి కొడుకు నుండి ఒక సందేశం వస్తున్నట్లు నేను చూశాను. పహల్గామ్లో జరిగిన సంఘటనల గురించి అతను కలత చెందాడు. సంఘటన తర్వాత వెంటనే ఎటువంటి ప్రతీకార చర్యా తీసుకోనందుకు మన ప్రభుత్వంపై అతడు అసహనం వ్యక్తం చేశాడు. ప్రభుత్వం తక్షణ చర్య తీసుకోవడానికి తీవ్రస్థాయిలో మీడియా ప్రచారాన్ని నడపటం ద్వారా నా వంతు కృషి నేను చేస్తానని అతను ఆశించాడు. నేను షాక్ అయ్యాను. చిన్నప్పటి నుండి అతడు నాకు తెలుసు. దేశంలోని ఉత్తమ పాఠశాలల్లో అతను చదువుకున్నాడు. ఇంజనీరింగ్ డిగ్రీని సాధించాడు. ఇన్ స్టిట్యూట్ నుండి పట్టభద్రుడయ్యే ముందు, అతనికి ఓ బహుళజాతి సంస్థ ఉద్యోగం ఆఫర్ కూడా ఉండేది. ఉన్నత స్థాయికి ఎదిగాడు. నేడు కార్పొరేట్ వర్గాల ఆకర్షణీయమైన సర్కిల్లో ఉంటున్నాడు. తన తెలివితేటలు, జ్ఞానం వల్ల మంచి గుర్తింపు, గౌరవం పొందాడు. అందుకే తాను ప్రకటించిన విద్వేష భావానికి నేను పెద్దగా కలత చెందలేదు. తనను ప్రశాంతంగా ఉండమని సలహా ఇచ్చాను. ప్రభుత్వాన్ని విశ్వసించమని నచ్చ చెప్పాను. సరైన సమయం వచ్చినప్పుడు, ప్రపంచం భారత్ నుండి పూర్తి స్థాయి చర్యను వీక్షిస్తుందని చెప్పాను. 1971లోనూ భారతదేశంలో ఇలాంటి యుద్ధ సన్నద్ధతే పెరుగుతూ వచ్చిందని అతనికి గుర్తు చేశాను. తిరుగులేని వ్యూహకర్త మానెక్ షా!అప్పటి ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ, ఆర్మీ చీఫ్ జనరల్ శ్యామ్ మానెక్ షాను పిలిపించారు. ‘‘తూర్పు పాకిస్తాన్ పై భారత సైన్యం వెంటనే దాడి చేసి, దాన్ని స్వతంత్ర దేశంగా, బంగ్లాదేశ్‌గా మార్చడానికి సహాయం చేయగలదా?’’ అని ఆమె అడిగారు. అద్భు తమైన వ్యూహకర్త మానెక్ షా. కొన్ని నెలల్లో రుతుపవనాలు రాను న్నాయని ప్రధానితో చెప్పారు. వర్షాకాలంలో, బంగ్లాదేశ్‌లోని పొలాలు చిత్తడి నేలలుగా మారతాయి. అందువల్ల అలాంటి సమయంలో దాడి చేయడం అంటే అది పెద్ద ఎత్తున సైనికుల మరణానికి దారితీస్తుందని వివరించారు. దాంతో మానెక్ షా తొందరపాటు ఆదేశాలు జారీ చేయబోవడం లేదని నిర్ధారణ అయింది. అనంతరం, తొమ్మిది నెలలపాటు జాగ్రత్తగా వేసుకున్న ప్రణాళిక, సమన్వయం, కచ్చితమైన వ్యూహం తర్వాత, భారత దళాలు తూర్పు పాకిస్తాన్‌పై దాడి చేసినప్పుడు, శత్రువు ఓడిపోవడమే కాకుండా, 90,000 మందికి పైగా పాక్ సైనికులు భారత్‌కు లొంగిపోయారు. మానవాళి చరిత్రలో, ఇంత పెద్ద సైనిక దళం ఎప్పుడూ ప్రత్యర్థికి లొంగి పోలేదు. 1971 డిసెంబర్ 16న, భారత సైన్యం తన అత్యుత్తమ ఘడియను ఆస్వాదిస్తూ, మన సైనిక చరిత్రలో ఒక సువర్ణ అధ్యా యాన్ని లిఖిస్తున్న సమయంలో బంగ్లాదేశ్ ఆవిర్భవించింది.1971ని తలపిస్తున్న మంతనాలుప్రస్తుత ప్రధాని కూడా భారత సాయుధ దళాలకు పాక్‌పై తగిన చర్య తీసుకోవడానికి అధికారం ఇచ్చారు. నెంబర్ 7 – లోక్ కల్యాణ్ మార్గ్, నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్‌లలో వ్యూహాత్మక సమావేశాలు జరిగాయి. సైనిక చర్యలు ఆర్థిక, దౌత్యపరమైన పర్యవసానాలను కలిగి ఉంటాయి. కనీస ప్రాణనష్టంతో త్వరిత విజయాన్ని సాధించడానికి, శక్తిమంతమైన మిత్రులు మద్దతు ఇవ్వడానికి లేదా నిర్ణాయక సమయంలో కనీసం తటస్థంగా ఉండటానికి కొన్ని నిబద్ధతలు అవసరం. 1991లో మొదటి గల్ఫ్ యుద్ధంలో సంకీర్ణ సైన్యానికి నాయకత్వం వహించిన యు.ఎస్. జనరల్ నార్మన్ స్క్వార్జ్కోఫ్, ‘‘మీరు శాంతిలో ఎంత ఎక్కువ చెమట చిందిస్తే, యుద్ధంలో అంత తక్కువ రక్తస్రావం అవుతుంది...’’ అని అన్నారు.రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ అమెరికా సహా వివిధ దేశాలలో తమ సమ ఉజ్జీలతో ముమ్మరంగా చర్చలు జరుపుతున్నారు. ఈ చర్చలు 1971ని గుర్తుకు తెస్తున్నాయి. ఆనాడు మానెక్ షా, నావికాదళ, వైమానిక దళ అధిపతులు యుద్ధా నికి సిద్ధమవుతుండగా, ఇందిరా గాంధీ కూడా నమ్మకమైన దౌత్య భాగస్వాముల కోసం వెతికే పనిలో పడ్డారు. భారతదేశం అప్పటికి కొంతకాలం క్రితం పాశ్చాత్య జోక్యానికి వ్యతిరేకంగా హామీ కోసం నాటి సోవియట్ యూనియన్‌తో కీలక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. తరువాత, యుద్ధ సమయంలో బంగాళాఖాతంలో అమెరికన్ సిక్స్త్ ఫ్లీట్ కనిపించడం, దాన్ని ఎదుర్కోవడానికి సోవి యట్ జలాంతర్గాములు రావడం వంటి సంఘటనలు భారతదేశపు దౌత్యపరమైన మాస్టర్ స్ట్రోక్ (పైఎత్తు)ను ధ్రువీకరించాయి. నేడు రెండూ అణ్వాయుధ శక్తులే!నేటి పరిస్థితి కూడా అంతే ప్రమాదకరమైనది. ట్రంప్ 2.0 యుగంలో ఇది మరింత క్లిష్టంగా మారింది. ఎటువంటి భావజాలం లేకుండా, సోషల్ మీడియా నిరంతర చూపు కింద నడిచే భౌగోళిక రాజకీయాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. 1971లో మాది రిగా కాకుండా భారతదేశం, పాకిస్తాన్ రెండూ ఇప్పుడు అణ్వాయుధ శక్తులు. మనకు మద్దతు ఇవ్వడానికి ఇప్పుడు సోవియట్ యూనియన్ లేదు. ఏదైనా సహాయం అందించే పరిమిత సామర్థ్యంతోనే రష్యా ఇప్పుడు ఉక్రెయిన్ తో పోరాడుతోంది, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి వ్యాఖ్యలు బీజింగ్ జాగరూకతా వైఖరిని వెల్లడిస్తున్నాయి: ‘‘సంఘర్షణ అనేది భారత్ లేదా పాకిస్థాన్ ప్రాథమిక ప్రయోజనాలకు నష్టం చేస్తుంది..’’ అని వాంగ్ వ్యాఖ్యానించారు. అయితే చైనా సానుభూతి పాక్ వైపు ఉంది. ప్రపంచంలోని ఏకైక అగ్రరాజ్యమైన అమెరికా, మిశ్రమ సంకేతాలను పంపుతోంది. ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ ప్రకటనను పరిగణించండి: ‘‘పహల్గామ్ దాడి పట్ల భారత్ విస్తృత ప్రాంతీయ సంఘర్షణకు దారితీయని విధంగా ప్రతిస్పంది స్తుందని మేము ఆశిస్తున్నాము’’ అన్నారాయన. ప్రమాదకరంగా సోషల్ మీడియా!ప్రభుత్వం చేతులు కట్టివేయడం, దాని ఎంపికలను పరిమితం చేయడం వంటి సంక్లిష్టతలను గ్రహించకుండా, లెక్కలేనన్ని స్వరాలు సోషల్ మీడియాలో ఇప్పుడు ఉగ్రదాడి పట్ల, పాక్ పైన నిరంతరం మండిపడుతున్నాయి. సర్జికల్ స్ట్రయిక్స్ అయినా, లేదా బాలాకోట్ వైమానిక దాడి అయినా సరే, తన మాటను నిలబెట్టుకోవడంలో ప్రధాని మోదీకి ఉన్న విశ్వసనీయతను వారు విస్మరిస్తున్నారు.దాంతో మన సోషల్ మీడియా కార్యకలాపాలు శత్రువులకు ఫిరంగి మేతగా మారాయి. ఎవరైనా సరే, ప్రభుత్వ పక్షాన నిశ్శబ్దంగా నిలబ డాల్సిన సమయం ఇది. అనవసరమైన వాగ్వాదాలకు పాల్పడకుండా ఉండాల్సిన సమయం ఇది. మతతత్వపు విష బీజాలు నాటడానికి కొందరు ఈ పరిస్థితిని మలచుకుంటున్నారు. కొన్ని రోజుల క్రితం బృందావన్‌లో ఆలయ సేవలో పాల్గొన్న ముస్లింలను బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ బాంకే బిహారీ ఆలయం ముందు ఒక మూక నిరసన తెలిపింది. అయితే ఆలయ ట్రస్ట్... స్పష్టంగా ప్రతిస్పందించింది. ఆ ముస్లింలు శతాబ్దాలుగా శ్రీకృష్ణుని దుస్తులను తయారు చేస్తున్నారని ట్రస్ట్ నిర్వాహకులు నొక్కి చెప్పారు.ఐక్యంగా ముందుకు సాగాలిఉగ్రవాద దాడిని జమ్మూ – కశ్మీర్ అసెంబ్లీ ఏప్రిల్ 29న ఏకగ్రీవంగా ఖండించింది. దేశంలోని మిగిలిన ప్రాంతాలకు సంఘీభావం తెలిపింది. లోయలో ఉగ్రవాదం అంతం ప్రారంభమైందని శాసన సభ్యులు భావిస్తున్నారు. ద్వేషపూరిత వ్యక్తులు అలాంటి సంఘీభావ ప్రదర్శనను విస్మరించడమే కాకుండా, దేశవ్యాప్తంగా అనేక మసీదులు మొన్నటి ఉగ్రవాద దాడిని ఖండించడాన్ని సులువుగా మరచి పోతారు. ఇప్పుడు పాకిస్థాన్‌ను బహిరంగంగా ఖండించని ముస్లిం నాయకుడు లేడు. ద్వేషం, విభజన రాజకీయాలతో రెచ్చగొట్టడం కాకుండా, అందరూ ప్రభుత్వంతో కలిసి నిలబడి సామాజిక ఐక్యత కోసం పనిచేయాల్సిన సమయం ఇది!శశి శేఖర్ వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
మా దేశం నీళ్లు ఇక మావే: ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: ఇక నుంచి భారత్‌కు చెందిన నీళ్లు దేశ ప్రయోజనాలకు మాత్రమే ఉపయోగించబడతాయని ప్రధాని నరేంద్ర మోదీ నొక్కి చెప్పారు. భారత నీళ్లు ఇప్పటివరకూ బయటకు వెళ్లాయని, ఇక నుంచి అది ఉండదన్నారు. మన నీళ్లు- మన హక్కు అంటూ ప్రధాని మోదీ స్సష్టం చేశారు. పాకిస్తాన్ కు సింధు జలాల నిలిపివేత అంశంపై స్పందించిన మోదీ.. మన నీళ్లు ఇక నుంచి మన అవసరాలకు మాత్రమే వినియోగిస్తామన్నారు.చీనాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ ఆనకట్ట నుండి పాకిస్తాన్‌కు నీటి ప్రవాహాన్ని నిలిపివేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో జీలం నదిపై ఉన్న కిషన్‌గంగా ప్రాజెక్ట్ నుండి ప్రవాహాలను తగ్గించడానికి సన్నాహాలు చేస్తున్న తరుణంలో ప్రధాని మోదీ ఈ ప్రకటన చేశారు.కాగా, ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణ తలపిస్తోంది. ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్ భూ భాగం నుంచే జరిగిందేనని బలంగా నమ్ముతున్న భారత్.. ఆ మేరకు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరి బిక్కిరి చేసే యత్నాలను ఇప్పటికే భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్ పౌరులు భారత్ ను విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాల దగ్గర్నుంచి పలు నిషేధాజ్ఞల్ని భారత్ అమలు చేస్తూ వస్తోంది. సింధూ జలాలను పాక్‌కు వెళ్లకుండా నిలిపివేయడం, భారత్‌లో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖుల యూట్యూబ్ చానెళ్ల నిలిపివేత, భారత్ జలాల్లోకి పాక్ ఓడలు రాకుండా నిషేధం, పాక్ దిగుమతులపై నిషేధం ఇలా పలు రకాలైన ఆంక్షలతో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.అంతు చూస్తాం..ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తామని మూడు రోజుల క్రితం మరోసారి హెచ్చరించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. మానవాళికి ఉగ్రవాదం అనేది అతి పెద్ద వినాశనకారి అని పేర్కొన్న మోదీ.. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఉగ్రదాడి తర్వాత మోదీ మాట్లాడుతూ.. పహల్గామ్ పై ఘటనకు బాధ్యులైన వారిని ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రస్తక్తే లేదన్నారు. వారిని మట్టిలో కలిపేస్తామంటూ మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మరోసారి ఉగ్రచర్యలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు. -
పహల్గామ్ ఘటన: ‘మీరేం మాట్లాడుతున్నారో తెలుస్తుందా?’
రాంచీ: పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రానికి మూడురోజుల ముందే సమాచారం అందిందని, . నిఘా వర్గాల సమాచారంతో ప్రధాని నరేంద్ర మోదీ కశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే చేసిన ఆరోపణలను బీజేపీ ఖండించింది. ఇది భద్రతా దళాల నైతిక సామర్థ్యాన్ని తగ్గించే ప్రయత్నమంటూ జార్ఖండ్ బీజేపీ అధికార ప్రతినిధి తుహిన్ సిన్హా మండిపడ్డారు. కాంగ్రెస్ చేసిన ఆ వాదనకు ఎటువంటి ఆధారం లేదని ఆయన ధ్వజమెత్తారు. దీనిపై బీజేపీ జార్ఖండ్ చీఫ్ బాబులాల్ మరాండ్ సైతం స్పందించారు. భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితిలు చోటు చేసుకున్న తరుణంలో ఈ తరహా వ్యాఖ్యలు సమంజసం కాదన్నారు. అసలు కాంగ్రెస్ పెద్దలు ఏం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? అంటూ నిలదీశారు. ఉగ్రవాదం, పాకిస్తాన్‌పై పోరాటం కీలక దశలో ఉన్నప్పుడు ఖర్గే ఈ వ్యాఖ్యలు చేయడం కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ చేస్తున్న దాడిగా ఆయన పేర్కొన్నారు.ఉగ్రవాదంపై, పాకిస్తాన్ పై పోరులో దేశం మొత్తం కలిసే ఉందని ఒకవైపు చెబుతూనే, మరొకవైపు ఈ వ్యాఖ్యలు ఏమిటంటూ మాజీ కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ చీఫ్ గా ఉన్న ఖర్గే ఇలా వ్యాఖ్యానించడం నిజంగా సిగ్గుచేటన్నారు.కాగా, జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో కాంగ్రెస్ పార్టీ సంవిధాన్ బచావో ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు. పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రానికి మూడురోజుల ముందే సమాచారం అందింది. నిఘూవర్గాల హెచ్చరికలతో ప్రధాని మోదీ కశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారు. పర్యాటకులకు మాత్రం భద్రత కల్పించలేకపోయారు’అని ఆరోపించారు. -
పహల్గాం ఘటన.. రేపు కేంద్ర కేబినేట్ కీలక సమావేశం
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్-పాకిస్థాన్‌ల మధ్య పరిస్థితులు భగ్గుమంటున్నాయి. ప్రతిదాడి కోసం భారత్ పక్కాగా ప్రణాళికలు రెడీ చేస్తుంది. ఈ తరుణంలో మే 7న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినేట్ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో సరిహద్దుల్లో భద్రతా పరిస్థితులతో పాటు పలు విషయాలపై చర్చించనున్నారు. ఇప్పటికే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో ప్రధాని మోదీ 48 గంటల్లోనే రెండుసార్లు భేటీ అయిన విషయం తెలిసిందే. అనంతరం జరగనున్న ఈ కేబినేట్ మీటింగ్‌పై అందరిలో ఆసక్తిని కలిగిస్తుంది.ఉగ్రదాడి జరిగిన సమయం నుంచి దేశంలో పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. పాక్ విషయంలో భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనని ప్రపంచదేశాలు అన్నీ ఆసక్తిగా గమనిస్తున్నాయి. దేశ భద్రతపై ప్రధాని మోదీ గత కొన్ని రోజులుగా వరుస భేటీలు నిర్వహిస్తుండటంతో పాక్‌లో అలజడి రేగుతుంది. ఇలాంటి సమయంలో మరోసారి కేబినేట్ సమావేశం జరగనుంది. అందులో దాయాది దేశానికి ఎలా బుద్ధి చెప్పాలి వంటి అంశాల గురించి చర్చించనున్నారు. భారత్‌పై పాక్ వైమానిక దాడులకు దిగితే ఎలా వ్యవహరించాలి..? ప్రజలు ఆందోళనకు గురికాకుండా ఎలాంటి సూచనలు చేయాలి..? దేశంలో అత్యవసరమైన కీలకమైన కర్మాగారాలు ఎక్కడ ఉన్నాయి..? ఏదైనా ప్రమాధం జరిగితే హుటాహుటిన ప్రజల్ని తరలించే మార్గాలు ఏంటి..? వంటి అంశాలు చర్చకు రానున్నాయి.ప్రధాని మోదీ ఇప్పటికే రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అజిత్ ధోవల్‌తో పాటు హోంమంత్రి అమిత్‌షాలతో వరుసగా సమావేశాలు నిర్వహించారు. ఉగ్రదాడి జరిగిన వెంటనే మోదీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినేట్ కమిటీ (సీసీఎస్) పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. దీనిలో భాగంగా సింధూజలాల ఒప్పందంపై ఆంక్షలు. దౌత్య సంబంధాల తగ్గింపు, అటారీ సరిహద్దు మూసివేత, పాక్ జాతీయుల వీసా రద్దు, గగనతలాన్ని మూసివేయడం వంటి నిర్ణయాలను భారత్ తీసుకుంది. -
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సంచలన ఆరోపణలు
-
‘పహల్గాం ఉగ్రదాడి గురించి కేంద్రానికి ముందే తెలుసు’.. ఖర్గే సంచలన ఆరోపణలు
రాంచీ: పహల్గాం ఉగ్రదాడిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖర్జున్ ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు.జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో కాంగ్రెస్ పార్టీ సంవిధాన్ బచావో ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు.పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రానికి మూడురోజుల ముందే సమాచారం అందింది. నిఘూవర్గాల హెచ్చరికలతో ప్రధాని మోదీ కశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారు. పర్యాటకులకు మాత్రం భద్రత కల్పించలేకపోయారు’అని ఆరోపించారు. Watch: Congress President Shri @kharge addresses the Samvidhan Bachao Rally in Ranchi, Jharkhand. https://t.co/wRfrg2XD99— Congress (@INCIndia) May 6, 2025 -
Mock drill: తెలుగు రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ జరిగే ప్రాంతాలు ఇవే.. చూసేయండి!
ఢిల్లీ: భారత్-పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం దేశంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లోని ముఖ్య ప్రదేశాలలో సివిల్ మాక్ డ్రిల్ నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు ఏయే ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించాలో అన్నీ రాష్ట్రాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేస్తోంది.ఈ మాక్ డ్రిల్‌పై మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో అన్నీ రాష్ట్రాల సెక్రటరీలు,డీజీపీలు,ఫైర్ డీజీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఏ ప్రాంతాల్లో ఎలా మాక్ డ్రిల్ నిర్వహించాలో ఉన్నతాధికారులకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో దాడులకు అవకాశం ఉన్న జిల్లాలు మూడు కేటగిరీలుగా విభజించింది. కేటగిరి 1లో దేశ రాజధాని ఢిల్లీ , తారాపూర్ అణు కేంద్రంకేటగిరి 2 లో విశాఖపట్నం, హైదరాబాద్ప్రధాని నివాసం, త్రివిధ దళాల హెడ్ క్వార్టర్స్ ఉండడంతో ఏ కేటగిరిలో ఢిల్లీ ప్రాంతాలు ఉన్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో గుర్తించబడిన సివిల్ డిఫెన్స్ జిల్లాల జాబితాను కేంద్రం విడుదల చేసింది. 1. అండమాన్ & నికోబార్ ద్వీపాలు Category-II: పోర్ట్ బ్లెయిర్2. ఆంధ్ర ప్రదేశ్Category-II: హైదరాబాద్, విశాఖపట్నం3. అరుణాచల్ ప్రదేశ్ Category-II: • ఆలోగ్ (వెస్ట్ సియాంగ్) • ఇటనగర్ • తవాంగ్ • హయులింగ్ • Category-III: బొమ్డిలా4. అస్సాం Category-II: • బోంగైగావోన్ • డిబ్రూగఢ్ • ధుబ్రి • గోల్పారా • జోర్హాట్ • శిబ్‌సాగర్ • టిన్సుకియా • తేజ్‌పూర్ • డిగ్బోయ్ • దిలీజన్ • గువహాటి (డిస్పూర్) • రంగియా • నమ్రుప్ • నజీరా • నార్త్-లక్ష…26.ఒరిస్సా (ఒడిశా)Category-II: • టాల్చర్ Category-III: • బలాసోర్ • కోరాపుట్ • భువనేశ్వర్ • గోపాల్పూర్ • హిరాకుడ • పారాదీప్ • రౌర్కెలా • భద్రక్ • ధేంకనాల్ • జగత్సింగ్పూర్ • కేండ్రాపాడా27. పుదుచ్చేరి Category-II:పుదుచ్చేరి28. పంజాబ్Category-II: • అమృత్సర్ • భటిండా • ఫిరోజ్‌పూర్ • గుర్దాస్పూర్ • హోషియార్పూర్ • జలంధర్ • లుధియానా • పటియాలా • పఠాన్‌కోట్ • అడాంపూర్ • బర్ణాలా • భాఖ్రా-నంగళ్ • హల్వారా • కొఠ్‌కాపూర్ • బటాలా • మోహాలి (ససనగర్) • అబోహర్Category-III: • ఫరీద్పూర్ • రోపర్ • సంగ్రూర్29. రాజస్థాన్Category-II: • కోటా • రావత్భాటా • అజ్మీర్ • అల్వార్ • బార్మేర్ • భరత్పూర్ • బీకానేర్ • బుండీ • గంగానగర్ • హనుమాన్‌గఢ్ • జైపూర్ • జైసల్మేర్ • జోధ్‌పూర్ • ఉదయ్‌పూర్ • సికార్ • నాల్ • సూరత్‌గఢ్ • అబూ రోడ్ • నసీరాబాద్ (అజ్మీర్) • భివారీ Category-III: • ఫులేరా (జైపూర్) • నాగౌర్ (మెర్టా రోడ్) • జాలోర్ • బేవార్ (అజ్మీర్) • లాల్‌గఢ్ (గంగానగర్) • సవాయ్ మాధోపూర్ • పాలి • భిల్వారా👉రేపటి మాక్ డ్రిల్ సందర్భంగా ఎదురయ్యే పరిణామాలుఎలక్ట్రిసిటీ బ్లాక్ అవుట్మొబైల్ సిగ్నల్స్ నిలిపివేతట్రాఫిక్ దారి మళ్లింపుప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు చర్యలుపబ్లిక్ అనౌన్స్మెంట్స్👉యుద్ధం తరహా ఎమర్జెన్సీలో పోలీసులు, పారా మిలిటరీ వ్యవహరించే విధానంసివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ సందర్భంగా ప్రజలు వ్యవహరించాల్సిన విధానంఆందోళనకు గురికాకుండా ప్రశాంతంగా ఉండడం. స్థానిక గా ఇచ్చే సూచనలు పాటించాలివదంతులను వ్యాపింప చేయొద్దు సోషల్ మీడియాలో వచ్చే ఫేక్ న్యూస్ నమ్మవద్దుకరెంటు లేక పోయినా, ఇంటర్నెట్ పనిచేయకపోయినా ఆందోళనకు గురికావద్దు అధికారిక సమాచారం కోసం ప్రభుత్వ చానల్స్, రేడియోను మాత్రమే వినాలిప్రజలు, అధికారులు తమ తమ బాధ్యతలు గుర్తెరిగి మెలగాలిమార్క్ డ్రిల్స్ కేవలం ప్రజల సన్నద్ధత కోసమే తప్ప... ఆందోళన కు గురిచేయడం లక్ష్యం కాదు 👉రేపటి మాక్ డ్రిల్ నిర్వహించే విధానం ఇదే...ఎయిర్ రైడ్ సైరన్స్ : ప్రజల అప్రమత్తత కోసం ఎయిర్ రైడ్ సైరన్స్ మోగిస్తారు. వైమానిక దాడుల నుంచి రక్షించుకునేందుకు సురక్షిత ప్రదేశాలకి వెళ్ళాలిక్రాష్ బ్లాక్ ఔట్స్: నగరాలలో సంపూర్ణంగా విద్యుత్ నిలిచిపోతుంది. వైమానిక దాడుల సమయంలో నగరాలను గుర్తించకుండా ఉండేందుకు ఈ ఎత్తుగడ అమలు. 1971 యుద్ధ సమయంలో బ్లాక్కౌట్ ఎత్తుగడను ఉపయోగించిన భారత్ కీలక సంస్థలు, ప్రాజెక్టుల రక్షణ: కమ్యూనికేషన్ టవర్స్, పవర్ ప్లాంట్స్, మిలిటరీ ఏరియాస్ ను గుర్తించకుండా ముందు జాగ్రత్త చర్యలు తరలింపు చర్యలు: హై రిస్క్ జోన్లలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలింపు. ఈ డ్రిల్ ద్వారా రెస్పాన్స్ టైం , లాజిస్టిక్స్ ఇష్యూస్ ను గుర్తించడం పౌరులకు శిక్షణ: పాఠశాలలు, కాలేజీలు, కార్యాలయాలు కమ్యూనిటీ సెంటర్లలో శిక్షణ. సురక్షిత ప్రాంతాలను గుర్తించడం, ఫస్ట్ ఎయిడ్ చేయడం ఎలా, ఎమర్జెన్సీ సమయంలో ఆందోళనకు గురికాకుండా ఉండడం అంశాలపై శిక్షణ -
భారత్ మాపై దాడి చేసేది అప్పుడే.. పాక్ మాజీ దౌత్వవేత్త సంచలన ట్వీట్!
ఇస్లామాబాద్: 1971లలో నాటి భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో భారత్ మాక్ డ్రిల్స్ నిర్వహించింది. 1971 తర్వాత ఇలాంటి డ్రిల్స్ బుధవారం జరగనుంది. ఈ తరుణంలో పాకిస్తాన్ మాజీ దౌత్వవేత్త (హైకమిషనర్) అబ్దుల్ బాసిత్ సంచలన ట్వీట్ చేశారు. రష్యా విక్టరీ డే తర్వాత భారత్.. పాకిస్తాన్‌పై దాడి చేసే అవకాశం ఉందని ట్వీట్లో పేర్కొన్నారు. వచ్చే వారం,11,12వ తేదీలలో దాడి చేయొచ్చనే అభిప్రాయం వ్యక్తం చేశారు. India will likely carry out its limited misadventure against Pakistan after Victory Celebrations in Russia. Perhaps on 10-11 May.— Abdul Basit (@abasitpak1) May 6, 2025మరోవైపు, పాక్‌పై దాడి చేసేందుకు భారత్ సర్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ముహూర్తం దాదాపుగా ఖరారైంది. సరిహద్దులకు ఆవలివైపు నుంచి ఉగ్ర దాడులను పనిగట్టుకుని ఎగదోస్తున్న దాయాదికి బుద్ధి చెప్పేందుకు రంగం సిద్ధమైంది. ఈ వారాంతంలోపు ఎప్పుడైనా పాక్‌పై భారీ స్థాయి ‘ఆపరేషన్’ జరగవచ్చని కేంద్ర ప్రభుత్వ అత్యున్నత వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ సోమవారం కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ సన్నద్ధతను సరిచూసుకునేందుకు బుధవారం పలురకాల మాక్ డ్రిల్స్ నిర్వహించాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది.1971 తర్వాత ఇలాంటి డ్రిల్స్ జరగనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం! అప్పుడు కూడా పాక్‌తో యుద్ధం నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నారు. డ్రిల్స్‌లో భాగంగా వాయుదాడుల సైరన్లు మోగించి అప్రమత్తం చేస్తారు. ప్రజలను ఉన్నపళంగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు చేపడతారు. ఈ విషయమై ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రణాళికలను తక్షణం అప్డేట్ చేసుకోవాలని కేంద్ర హోం శాఖ పేర్కొంది.ఈ మేరకు రాష్ట్రాలకు అడ్వైజరీ జారీ చేసింది. డ్రిల్స్‌లో భాగంగా సమర్థమైన పౌర రక్షణ చర్యలు చేపట్టడంలో ప్రజలకు, ముఖ్యంగా యువతకు శిక్షణ ఇవ్వనున్నారు. పహల్గాం ఉగ్ర దాడుల వంటివి జరిగితే దీటుగా ఎదుర్కోవడం ఎలాగో నేర్పిస్తారు. స్వీయరక్షణ చర్యలతో పాటు విద్యుత్ సరఫరా బ్లాకౌట్ వంటివి జరిగితే తక్షణం ఎలా స్పందించాలో, కీలక మౌలిక వనరుల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో వివరిస్తారు. -
పౌరులను అప్రమత్తం చేయాలని రాష్ట్రాలకు కేంద్రం కీలక ఆదేశాలు
-
యుద్ధానికి సిద్ధం!.. నేడు కేంద్ర హోంశాఖ కీలక సమీక్ష
ఢిల్లీ: యుద్ధ సన్నద్ధతపై కేంద్ర హోంశాఖ నేడు కీలక సమీక్ష నిర్వహించనుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రాల అధికారులు హాజరుకానున్నారు. అన్ని రాష్ట్రాల్లో యుద్ధ అప్రమత్తతకు కేంద్రం పిలుపునిచ్చింది. ఈ క్రమంలో యుద్ధ సన్నద్ధతపై కీలక సమీక్ష చేపట్టనుంది. రేపు(బుధవారం) అన్ని రాష్ట్రాల్లో సివిల్ మాక్ డ్రిల్స్ చేయాలని సోమవారం కేంద్రం ఆదేశించించిన సంగతి తెలిసిందే. సుమారు 244 జిల్లాల్లో మాక్ డ్రిల్స్‌కు సంబంధించిన ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ సమీక్షించనుంది.కాగా, సరిహద్దులకు ఆవలివైపు నుంచి ఉగ్ర దాడులను పనిగట్టుకుని ఎగదోస్తున్న దాయాదికి బుద్ధి చెప్పేందుకు రంగం సిద్ధమైంది. ఈ వారాంతంలోపు ఎప్పుడైనా పాక్‌పై భారీ స్థాయి ‘ఆపరేషన్’ జరగవచ్చని కేంద్ర ప్రభుత్వ అత్యున్నత వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్ నిన్న (సోమవారం) కీలక నిర్ణయం తీసుకుంది. యుద్ధ సన్నద్ధతను సరిచూసుకునేందుకు బుధవారం పలురకాల మాక్ డ్రిల్స్ నిర్వహించాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది.1971 తర్వాత ఇలాంటి డ్రిల్స్ జరగనుండటం ఇదే తొలిసారి కావడం విశేషం! అప్పుడు కూడా పాక్‌తో యుద్ధం నేపథ్యంలోనే ఈ చర్యలు తీసుకున్నారు. డ్రిల్స్‌లో భాగంగా వాయుదాడుల సైరన్లు మోగించి అప్రమత్తం చేస్తారు. ప్రజలను ఉన్నపళంగా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించడం వంటి చర్యలు చేపడతారు. ఈ విషయమై ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రణాళికలను తక్షణం అప్డేట్ చేసుకోవాలని కేంద్ర హోం శాఖ పేర్కొంది.కాగా, దేశ రక్షణకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ నిన్న (సోమవారం) కీలక సమీక్షలు నిర్వహించారు. పహల్గాం ఉగ్ర దాడికి ప్రతి చర్య ఎలా ఉండాలన్నదే వాటి ఏకైక ఎజెండా అని తెలుస్తోంది. రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్‌కుమార్‌సింగ్‌తో ఆయన భేటీ అయ్యారు. సైనిక సన్నద్ధతకు సంబంధించిన పలు అంశాలను అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. కొద్ది రోజులుగా త్రివిధ దళాధిపతులతో ప్రధాని ఒక్కొక్కరుగా సమావేశం కావడం తెలిసిందే. పహల్గాంకు బదులు తీర్చుకునే పూర్తి బాధ్యతలను మోదీ వారికే అప్పగించారు. -
భారత్‌కే మా మద్దతు
న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టంచేశారు. పహల్గాంలో పర్యాటకులను పొట్టనపెట్టుకున్న ఉ గ్రవాదులను, వారి మద్దతు దారులను చట్టం ముందు నిలబెట్టి, కఠినంగా శిక్షించాల్సిందేనని తేల్చి చెప్పారు. అత్యంత హేయమైన ఈ దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నా మని తెలిపారు. బాధిత కుటుంబాలకు పుతిన్ సానుభూతి ప్రకటించారు. ఆయన సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్లో మాట్లాడారు. పహల్గాం ఉగ్రవాద దాడిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఉగ్రవాదంపై రాజీలేని పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు ఈ సందర్భంగా నిర్ణయానికొచ్చారు. ఉగ్రవాదం ఎక్కడ, ఏ రూపంలో ఉన్నాసరే నామరూపాల్లేకుండా చేయాల్సిందేనని పునరుద్ఘాటించారు. భారత్–రష్యా మధ్య ప్రత్యేక, విశేషమైన వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నామని మోదీ, పుతిన్ పేర్కొన్నారు. రష్యా ‘విక్టరీ డే’ 80వ వార్షికోత్సవం సందర్భంగా పుతిన్‌తోపాటు రష్యా ప్రజలకు మోదీ శుభాకాంక్షలు తెలియ జేశారు. ఈ ఏడాది జరగబోయే ఇండియా–రష్యా ద్వైపాక్షిక సదస్సుకు హాజరు కావాలని ప్రధానమంత్రి ఆహ్వానించగా, పుతిన్ అందుకు అంగీకరించారు. -
ఉగ్రవాదులకు స్థానిక స్లీపర్‌సెల్స్ సాయం?
శ్రీనగర్: పహల్గాంలోని బైసారన్‌లో ముష్కరుల కర్కశకాండ వెనుక స్థానిక స్లీపర్‌సెల్స్ హస్తం దాగుందని నిద్రాణంగా ఉండే ఉగ్ర బృందంలోని మాజీ సభ్యుడు ఒకరు వెల్లడించారు. జాతీయ మీడియాకు తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను ఇలాంటి పలు విషయాలను పంచుకున్నాడు. ‘‘స్థానికంగా ఉండే వాళ్ల నుంచి కనీస సహకారం లేకుండా ఇంతటి దాడి చేయడం అసాధ్యం. దాడిచేసిన లష్కర్ ఉగ్రవాదులతో కనీసం ఐదారుగురు స్థానిక స్లీపర్‌సెల్ సభ్యులు సాయపడి ఉంటారు. సాధారణంగా ఇలాంటి దాడుల్లో కనీసం నెల రోజుల ముందే స్లీపర్ సెల్ సభ్యులను దాడిచేయబోయే ఉగ్రవాదులు సంప్రదిస్తారు. దాడి ఎలా చేయాలి? ఎటు వైపు తప్పించుకోవాలి?లాంటివన్నీ ముందే ప్లాన్ చేస్తారు’’అని మాజీ స్లీపర్‌సెల్ సభ్యుడు చెప్పాడు. ‘‘ఒకవేళ నేనే స్వయంగా శ్రీనగర్‌లో దాడిచేయాలనుకుంటే గుడ్డిగా శ్రీనగర్‌కు వెళ్లను. ముందుగా శ్రీనగర్‌లో దాడిచేయబోయే చోట తరచూ ఎంతమంది భద్రతా సిబ్బంది ఉంటారు అనే ఖచ్చితమైన అంచనా ఉండాలి. ఆ ప్రాంతంపై నాకు అవగాహన ఉండాలి. ఈ అవగాహన మనకు స్లీపర్‌సెల్స్ సభ్యులు కల్పిస్తారు. భద్రతా బలగాలు ఎంత మంది ఉండొచ్చు, దాడికి సఫలమయ్యే అవకాశాలు లాంటివన్నీ వాళ్లే చెప్తారు. తర్వాత ఉగ్రవాదులు రంగంలోకి దిగుతారు. బైసారన్లోనూ ఇదే జరిగి ఉంటుంది’’అని అన్నాడు.గతంలో జైలుకు వెళ్లి.. ఇతను గతంలో స్లీపర్‌సెల్‌లో పనిచేసిన నేరానికి కొన్నేళ్లు జైలులో గడిపి బయటికొచ్చాడు. ‘‘స్లీపర్‌సెల్ సభ్యులు దాడి చేయరు. దాడి చేయబోయే ఉగ్రవాదులకు ఆర్మీ కదలికలపై నిఘా సమాచారం అందిస్తారు. ఉగ్రవాదులకు ఆహారం, ఇతర అత్యయిక అవసరాలు తీరుస్తారు. నేను కూడా గతంలో 2–4 ఏళ్లు స్లీపర్‌సెల్ సభ్యునిగా పనిచేశా. ఉగ్రవాదులకు కావాల్సినవి అందించా. రాత్రిళ్లు తిరిగి సమాచారం సంపాదించి ఇచ్చా. నేను ఇచ్చిన సమాచారంతో వాళ్లు ఎన్నో దాడులు చేశారు’’అని చెప్పాడు. గ్రనేడ్ దాడి ప్రయత్నంలో భద్రతా బలగాలు ఇతడిని అరెస్ట్‌చేశారు. నేరం నిరూపణ అయ్యాక కొంతకాలం జైలు శిక్ష అనుభవించి విడుదల అయ్యాడు. ‘‘ఆనాడు నేను మైనర్‌గా ఉండబట్టే విడుదలయ్యా. అది నా అదృష్టం. లేదంటే ఎప్పటికీ నేను విడుదలకాకపోయే వాడినేమో’’అని అతను అన్నాడు. ‘‘2015 కాలంలో నన్ను ఉగ్రవాదులు రిక్రూట్ చేసుకున్నారు. అప్పట్లో ఫేస్బుక్, వాట్సాప్ యాప్‌లపై నిఘా అంతగా లేదు. అందుకే ఫేస్బుక్లో నాకు మెసేజ్‌లు పంపేవాడు. కొంతకాలానికి నిఘా పెరగడంతో బీబీఎం యాప్‌కు మారా. ఈ యాప్‌లో చేసే వీడియో, వాయిస్ కాల్స్‌ను ఎవరూ కనిపెట్టలేరు’’అని అతను చెప్పాడు. ఉగ్రవాదులతో పనిచేయడం 110 శాతం తప్పు ‘‘స్లీపర్‌సెల్ సభ్యునిగా ఉంటూ చిట్టడవిలోకి వెళ్లి ఉగ్రవాదులకు ఆహారం అందించి రావడం నా తొలి పని. తర్వాతర్వాత ఒక చోట ఉన్న వస్తువును రహస్యంగా మరో చోటుకు చేర్చాల్సి వచ్చేది. నాకు ఈ పనులు పురమాయించే ఉగ్రవాదిని భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అయితే నేను నమ్మకస్తుడినా కాదా అని నిర్ధారించుకునేందుకు నాపై కూడా నిఘా కొనసాగేది. ఇప్పుటికీ నా స్నేహితుల్లో ఇద్దరు ఉగ్రవాదులుగా కొనసాగుతున్నారు. మరో 13–14 మంది స్నేహితులు ఉగ్రవాదులుగా మారి భద్రతా బలగాల ఎన్కౌంటర్లలో చనిపోయారు. ఏ విధంగా చూసినా ఉగ్రవాదులతో కలిసి పనిచేయడం 110 శాతం తప్పు. నా పదేళ్లగతాన్ని చూసుకుంటే అసలు నేనింకా బతికే ఉండటం ఆశ్చర్యంగా అనిపిస్తుంది’’అని అతను చెప్పాడు. -
ఉగ్రబుద్ధిపై వక్రభాష్యం!
పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన రోజు నేను అమెరికాలో ఉన్నాను. సాధారణంగా నేను టెలివిజన్ వార్తలు చూడను, కానీ ఈ మారణహోమం మాతృభూమిలో జరుగుతున్నప్పుడు వేల మైళ్ల దూరంలో ఉండవలసి వచ్చింది. మూడు దశాబ్దాలుగా నా రిపోర్టింగ్ బీట్ కూడా ఇదే. ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకున్న 26 మంది కశ్మీర్ పర్యాటకులను ఘోరంగా చంపిన ఘటనపై ఆదుర్దాతో నేను హోటల్లో టీవీ ఛానెళ్లు, వార్తాపత్రికలు వెతికాను.‘ఘర్షణ’గా మాత్రమే చూపారు!నిజానికి ఈ అనాగరిక దాడి జరిగిన రోజు అమెరికా ఉపాధ్య క్షుడు జె.డి. వాన్ ్స భారతదేశంలోనే ఉన్నారు కాబట్టి దాడిపై అమెరి కన్ మీడియా ఆసక్తి చూపించాల్సి ఉంది. పైగా, ఉగ్రవాదులు తమ ప్రణాళికను వాన్ ్స రాకకు ముందే ముగించారు. వారి ఆ కార్యా చరణను 25 ఏళ్ల నాటి పూర్వఘటన నుండి తీసుకున్నారు. 2000లో నాటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఢిల్లీలో అడుగు పెట్టినప్పుడు కశ్మీర్ లోయలోని చిట్టిసింగ్‌పురా గ్రామంలో 36 మంది సిక్కులను ఉగ్రవాదులు ఊచకోత కోశారు. అప్పటిలాగే ఇప్పుడు కూడా, కశ్మీర్ సమస్యపై మరింతగా అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించడం ఉగ్ర వాదుల లక్ష్యం. కానీ ఆ సమయంలోనే జరిగిన ఒక ప్రముఖ ఘటన కారణంగా భారత్‌లో ఉగ్రదాడిపై అమెరికా దృష్టి దాదాపుగా కను మరుగై పోయింది. ఆశ్చర్యకరంగా, అమెరికా నెట్‌వర్క్‌లలో అందు బాటులో ఉన్నదంతా పోప్ ఫ్రాన్సిస్ అస్తమయం గురించి గంటల తరబడి కార్యక్రమాలు మాత్రమే. కొన్ని వార్తా పత్రికలలో ఉగ్రదాడిపై నివేదికలు లోపలి పేజీలలో క్లుప్తంగా ఉన్నాయి. ఈ దాడి ఘటనను అమెరికన్ మీడియా దాదాపుగా ఒక సాధారణ భద్రతకు సంబంధించిన ‘ఘర్షణ’గా మాత్రమే చూపింది.పశ్చిమాన లోపించిన ప్రస్తావననేను భారతదేశానికి తిరిగి రావాలని త్వరపడుతున్నాను. జరి గిన దాడి భారత్ నుండి తీవ్రమైన సైనిక ప్రతిస్పందనకు దారి తీయవచ్చని, నేను కలిసిన వారికి వివరించాను. ఇది యుద్ధ చర్య అని నొక్కి చెప్పాను. భారతదేశం తదనుగుణంగానే స్పందించవచ్చునని కూడా అనుకున్నాను. నేను ఇలా చెబుతున్నప్పుడు చాలామంది సహోద్యోగులు, స్నేహితులు నన్ను ప్రశ్నార్థకంగానే చూశారు. వారు చూస్తుండే టీవీ, ప్రింట్ లేదా డిజిటల్ మీడియాలలో పహల్గామ్ ఉగ్రవాద దాడి గురించి ప్రస్తావన చూడలేదు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘ప్రతిదాడి స్వభావం, లక్ష్యం, ప్రతిస్పందన సమయం’పై నిర్ణయం తీసుకోవడానికి సాయుధ దళాలకు ‘పూర్తి స్వేచ్ఛ’ ఇచ్చేశారు. దీంతో, భీతిల్లిపోయిన పాక్, తదుపరి 24–36 గంటల్లోనే భారత్ దాడి జరగవచ్చని ప్రకటించేంతవరకు వెళ్లింది. ఒక పాకిస్థాన్ మంత్రి బహిరంగంగానే బెదిరింపు ప్రకటన చేశారు. ‘‘అణ్వాయుధా లను అలంకరణ కోసం తయారు చేయలేదు’’ అని కఠినంగా అన్నారు. ‘సాయుధ దాడి..’ అని రాశారు! ఇప్పటికైనా ప్రపంచ మీడియా అంతా ఈ దాడికి సంబంధించిన భౌగోళిక రాజకీయ ఫలితం గురించి ఆలోచిస్తుందని మీరు అనుకుంటారు కదా! కానీ అలాంటిదేమీ లేదు. ఉగ్రదాడిపై కవరేజ్ నామ మాత్రంగానే ఉంది. ఇంకా దారుణంగా, ప్రారంభ రోజుల్లో ప్రచురి తమైన కొన్ని వార్తా నివేదికలను చూస్తే, పాశ్చాత్య వార్తాపత్రికల లోపలి పేజీలలో ఈ దాడి ఘటనపై ఉపయోగించిన భాష వారి స్వంత కథను వినిపించింది. అదేమిటంటే – జరిగిన దాడి ఘటనకు ‘ఉగ్రవాదం’ అనే పదాన్ని ఉపయోగించడానికి తీవ్రంగా నిరాకరించడం! దానికి బదులుగా, సాయుధులు, తీవ్రవాదులు వంటి మూస పోత పదాలతో ఎప్పటిలాగే వర్ణించారు.సైనిక దుస్తులు ధరించిన ఉగ్రవాదులు గుంపులోని పురుషులను ఒక్కొక్కరిగా చంపేశారు, కానీ వారు హిందువులా లేదా ముస్లింలా అని అడిగిన తర్వాత మాత్రమే చంపారని ప్రత్యక్ష సాక్షుల కథనాలు వెల్లడిస్తున్నాయి. ఉగ్రవాదులతో పోరాడి వారి తుపాకీని లాక్కోవడా నికి ప్రయత్నించిన స్థానిక కశ్మీరీపై కూడా తూటాలు గుప్పించారు.ఇది ‘ఉగ్రవాదం’ అనిపించలేదా?!లష్కరే తోయిబాకి నీడలాగా ఉన్న ‘ది రెసిస్టెన్ ్స ఫ్రంట్’ ఈ దాడికి తక్షణ బాధ్యత వహించింది. తరువాత, పాకిస్థాన్‌పై ఒత్తిడి పెరగడంతో వారు సైబర్ హ్యాక్ ద్వారా ఈ ప్రకటన జరిగిందని మాట మార్చారు! లష్కర్ తోయిబా ఇంతకు మునుపే అమెరికా అధికారికంగా విడుదల చేసిన ఉగ్రవాద సంస్థల జాబితాకెక్కింది. ముంబైలో జరిగిన 26/11 ఉగ్రవాద దాడిలో ఆరుగురు అమెరికన్లు మరణించారు. పాకిస్థాన్‌లో దాక్కున్న ప్రదేశం నుండి ఒసామా బిన్ లాడెన్ ను అమెరికా బయటకు తీసుకెళ్తే అమెరికన్లు ఎలా భావిస్తారు? దీన్ని కూడా వారు సాయుధుల చర్య గానే వర్ణిస్తారా?చివరికి ఇప్పుడు భారతదేశం ‘చర్యకు ప్రతి చర్య’ సూత్రం ప్రాతిపదికన ప్రతీకార చర్యకు సిద్ధమవుతుండగా, పశ్చిమ దేశాలు స్పందించడం ప్రారంభించాయి. వాషింగ్టన్ నుండి కొన్ని ప్రకటనలు సంఘీభావం ప్రకటించాయి. పహల్గామ్ ఘటనకు కారణమైన ఉగ్ర వాదులను శిక్షించడంలో భారత్‌కు పాకిస్థాన్ సహకరించాలని వాన్ ్స కోరుతూనే, భారతదేశం ‘పెద్ద ప్రాంతీయ సంఘర్షణ’కు దారితీయని విధంగా స్పందిస్తుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు.భారతదేశ సైనిక పరమైన చర్యల ఎంపికలకు అమెరికన్లు అడ్డంకులు కల్పించే అవకాశం లేదు. కానీ 2023 అక్టోబర్ 7 తర్వాత ఏ అమెరికన్ రాజకీయ నాయకుడూ ఇజ్రాయెల్‌తో ఇలా (ఉద్రిక్తతలు తలెత్తకుండా ఒకరికొకరు సహకరించుకోవాలని) చెప్పి ఉండక పోవచ్చు. యెమెన్ లోని హౌతీలపై తాము నిరంతరం బాంబు దాడి చేస్తూ మరొకవైపు భారతదేశం సైనిక సంయమనం పాటించాలని అమెరికా నేతలు కోరటాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఇప్పటికీ వారి తీరులో భారీ ద్వంద్వ వైఖరి ఉందనే చెప్పాలి.కశ్మీర్ లోపల... కశ్మీర్ వెలుపలా.!పహల్గామ్ ఉగ్రవాద దాడి స్థానికంగా జరిగిన ‘భద్రతా సంఘ టన‘ కాదనీ; అది భారత్, పాక్‌ల మధ్య కొనసాగుతున్న ఏదో ఒక రకమైన ‘వివాదానికి’ సంబంధించిన మరొక అభివ్యక్తి కాదని ప్రపంచం ఇంకా అర్థం చేసుకోనే లేదు. కశ్మీర్‌లోనూ, కశ్మీర్ వెలుపల కూడా పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఆయుధంగా ఉపయోగించుకుంటోందని 26/11 ముంబై దాడులు గుర్తు చేస్తూనే ఉంటాయి. ఈసారి మాత్రం ఒక నమూనా మార్పు జరిగింది. భారతదేశం పాకిస్థాన్ యుద్ధం అంచున ఉన్నాయి. కానీ ఈ సంఘర్షణ... అది తలెత్తిన రోజు నుండే పాశ్చాత్య మీడియా, పాశ్చాత్య ప్రభుత్వాల దృష్టి నుంచి తప్పిపోయింది. ఉగ్రదాడి గురించి వారు తప్పుగా నివేదించారు, తప్పుగా అర్థం చేసుకున్నారు.బర్ఖా దత్‌వ్యాసకర్త జర్నలిస్టు, రచయిత్రి -
Mock drills: భారత్‌లో మాక్ డ్రిల్.. 1971భారత్-పాక్ యుద్ధ సమయంలో
ఢిల్లీ: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతున్న వేళ రాష్ట్రాలకు కేంద్రం కీలక సూచనలు జారీ చేసింది. 1971లో భారత్-పాకిస్తాన్ యుద్ధ సమయంలో సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ జరిగింది. అదే సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్‌ను బుధవారం (మే7న) నిర్వహించాలని కేంద్ర హోంశాఖ సూచించింది. సోమవారం ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, హోంశాఖ కార్యదర్శి, రక్షణ శాఖ కార్యదర్శితో ప్రధాని మోదీ సమావేశమయ్యారు. సమావేశం అనంతరం కేంద్రం రాష్ట్రాలకు ఈ ఆదేశాలు చేయడం గమనార్హం.అయితే, మాక్ డ్రిల్ నిర్వహించాలని భారత్ - పాకిస్తాన్ సరిహద్దు రాష్ట్రాలైన పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్‌లకు కేంద్రం హోం శాఖ సూచించింది. పౌరుల రక్షణ కోసం మే 7న మాక్ డ్రిల్ నిర్వహించాలని ఆదేశించింది. Ministry of Home Affairs has asked several states to conduct mock drills for effective civil defence on 7th May.Following measures will be undertaken1.Operationalization of Air Raid Warning Sirens2. Training of civilians, students, etc, on the civil defence aspects to… pic.twitter.com/DDvkZQZw3A— DD News (@DDNewslive) May 5, 2025శత్రువుల వైమానిక దాడి సమయంలో తమను తాము రక్షించుకునే విధానం పై పౌరులు, విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలని తెలిపింది. ఎయిర్ రైడ్ సైరన్స్ పనితీరు పరీక్షించడం, సైరన్ ఇచ్చి ప్రజలను ఎలా అప్రమత్తం చేయాలనే అంశంపై మాక్ డ్రిల్ నిర్వహణ ఉంటుంది. వీటితో పాటు క్రాష్ బ్లాక్ అవుట్ రిహార్సల్స్, కీలకమైన సంస్థల ముందస్తు రక్షణ కోసం తీసుకోవాల్సిన చర్యలు, తరలింపు చర్యల సన్నద్ధత ఉండనుంది. గత ఆదివారం ఫిరోజ్‌పూర్ కంటోన్మెంట్ ప్రాంతంలో 30 నిమిషాల పాటు బ్లాక్ ఔట్ రిహార్సల్స్ జరిగాయి. బ్లాక్ ఔట్ రిహార్సల్స్ భాగంగా రాత్రి 9 నుంచి 9:30 వరకు అన్ని లైట్లు, వాహనాల లైట్లు ఆపివేసి ఉంచారు. -
రక్షణశాఖ డేటాను పాక్ హ్యాక్ చేసిందా?
న్యూఢిల్లీ: పాకిస్తాన్ సైబర్ నేరగాళ్లు మరోసారి భారత్ ను టార్గెట్ చేస్తూ హ్యాకింగ్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న తరుణంలో పాక్ హ్యాకర్లు ఒక ప్రకటన చేశారు. తాము భారత రక్షణశాఖ సైట్లను లక్ష్యంగా చేసుకుని డేటాను హ్యాక్ చేసినట్లు స్పష్టం చేశారు.మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్, మనోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్‌కు చెందిన సున్నితమైన డేటాను అపహరించినట్లు పాకిస్తాన్ సైబర్స్ ఫోర్స్ అనే హ్యాండిల్ పోస్ట్ చేసినట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. సైబర్ దాడుల ద్వారా భద్రతా సిబ్బంది లాగిన్ పాస్వర్డ్ వంటి సున్నితమైన సమాచారాన్ని హ్యాకర్లు రాబట్టేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.కొన్ని రోజులుగా పాకిస్తాన్ నుంచి హ్యాకింగ్ ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ దాడులను గుర్తించడానికి సైబర్ సెక్యూరిటీ నిపుణులు అప్రమత్తంగా ఉంటున్నారు. , ఇలాంటి దాడులను నివారించడానికి మరిన్ని భద్రతా చర్యలను పెంచుతున్నామని చెప్పారు. అయితే తమ వెబ్ సైట్ లో డేటాను పాక్ హ్యాక్ చేసినట్లు వార్తలను నోహర్ పారికర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ అండ్ అనాలిసిస్ ఖండించింది. అందులో వాస్తవం లేదని పేర్కొంది. -
ఎవరీ బీజేపీ లీడర్?..భద్రతా దళాలతో మంచులో రన్నింగ్! వీడియో వైరల్
న్యూఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న వేళ.. ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బీజేపీకి చెందిన సీనియర్ నాయకుడు భద్రతా సిబ్బందితో మంచులో పరుగెడుతూ దాని వెనుక బ్యాక్ గ్రౌండ్లో ఓ బాలీవుడ్ సాంగ్ ప్లే అవుతున్న వీడియో ఇప్పుడు విశేషంగా వార్తల్లో నిలిచింది.ఎవరీ బీజేపీ లీడర్?రవీందర్ రైనా.. బీజేపీలో సీనియర్ నాయకుడు. జమ్మూ కశ్మీర్ బీజేపీ మాజీ చీఫ్, మాజీ ఎమ్మెల్యే ఈయన. అయితే ఎప్పుడు వార్తల్లో పెద్దగా కనిపించని రవీందర్ రైనా.. ఒక్కసారిగా హాట్ టాపిక్ గా నిలిచారు. ఒక బృదం భద్రతా బలగాల్ని వెంట బెట్టుకుని ఆయన కూడా మంచులో పరుగెడుతూ కనిపించారు. దీనికి సంబంధించిన షార్ట్ వీడియోను ఆదివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఇప్పుడు అది వైరల్ గా మారింది.#JaiHind 🇮🇳🔥🔥🔥 pic.twitter.com/vH4XYKkrpI— Ravinder Raina (@RavinderRaina) May 4, 2025 మండిపడ్డ కాంగ్రెస్‌దీనిపై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. భద్రతా బలగాల్ని ఈ తరహాలో ఉపయోగించుకుంటారా అంటూ మండిపడింది. ఈ వీడియోపై సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా ష్రినాతే ధ్వజమెత్తారు. పహల్గామ్ దాడి తర్వాత దేశం అంతా తీవ్ర శోకంలో ఉంటే ఇలా చేయడం సమంజసం కాదంటూ విమర్శించారు. పహల్గామ్ ఉగ్రదాడిలో కొంతమంది తన కుమారుల్ని కోల్పోగా, మరికొంతమంది తల్లిదండ్రుల్ని, పలువురు భర్తల్ని కోల్పోయారు. మరి ఈయన అయితే మంచి రిథమ్ లో ఉన్నారు. రీల్స్ షూటింగ్ చేసుకుంటున్నారు. భద్రతా సిబ్బందిని దుర్వినియోగం చేస్తున్నారు. ఇది నిజంగా సిగ్గు పడాల్సిన చర్య’ అంటూ మండి పడ్డారు. -
ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్
-
భారత్‌కు అండగా ఉంటాం: రష్యా
న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ఫోన్ చేసి మాట్లాడారు. పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారత్-పాకిస్తాన్ ల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ.. భారత్ కు అండగా ఉంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్ స్పష్టం చేశారు. ఈ మేరకు సోమవారం మోదీకి ప్రత్యేకంగా ఫోన్ చేసిన పుతిన్.. ఉగ్రవాదాన్ని అరికట్టడంలో భారత్ కు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ఏప్రిల్ 22వ తేదీన పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు మృతిచెందడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు పుతిన్,. ఈ విషయాన్ని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రన్ ధీర్ జైశ్వాల్ ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు. ఉగ్రవాదంపై భారత్ చేస్తున్న పోరుకు రష్యా అండగా ఉంటుందని హామీ ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దారుణమైన దాడికి పాల్పడిన వారిని, వారి మద్దతుదారులను చట్టం ముందుకు తీసుకురావాలని పుతిన్ నొక్కి చెప్పినట్లు స్సష్టం చేశారుఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణ తలపిస్తోంది. ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్ భూ భాగం నుంచే జరిగిందేనని బలంగా నమ్ముతున్న భారత్.. ఆ మేరకు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరి బిక్కిరి చేసే యత్నాలను ఇప్పటికే భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్ పౌరులు భారత్ ను విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాల దగ్గర్నుంచి పలు నిషేధాజ్ఞల్ని భారత్ అమలు చేస్తూ వస్తోంది. సింధూ జలాలను పాక్‌కు వెళ్లకుండా నిలిపివేయడం, భారత్‌లో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖుల యూట్యూబ్ చానెళ్ల నిలిపివేత, భారత్ జలాల్లోకి పాక్ ఓడలు రాకుండా నిషేధం, పాక్ దిగుమతులపై నిషేధం ఇలా పలు రకాలైన ఆంక్షలతో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తాం..ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తామని రెండురోజుల క్రితం మరోసారి హెచ్చరించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. మానవాళికి ఉగ్రవాదం అనేది అతి పెద్ద వినాశనకారి అని పేర్కొన్న మోదీ.. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఉగ్రదాడి తర్వాత మోదీ మాట్లాడుతూ.. పహల్గామ్ పై ఘటనకు బాధ్యులైన వారిని ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రస్తక్తే లేదన్నారు. వారిని మట్టిలో కలిపేస్తామంటూ మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మరోసారి ఉగ్రచర్యలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు. -
భారత్‌పై యుద్ధానికి.. పాకిస్తాన్ మరో మిసైల్ ప్రయోగం
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ల మధ్య యుద్ధ భయాలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో పాకిస్తాన్ ఫతహ్ అనే సర్ఫేస్-టు-సర్ఫేస్ మిసైల్‌ను పరీక్షించింది. 120 కిలోమీటర్ల రేంజ్ శత్రు స్థావరాల్ని నిర్విర్యం చేస్తుందని పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది. ఇంటర్-సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ISPR) విడుదల చేసిన ప్రకటనలో ఈ మిసైల్ టెస్ట్ ప్రధానంగా మిస్సైల్ హార్డ్‌వేర్,సాఫ్ట్వేర్ పనితీరును పరీక్షించడం, అలాగే మిసైల్‌లో ఉపయోగించిన ఆధునిక నావిగేషన్ వ్యవస్థ, ఖచ్చితత్వాన్ని నిర్ధారించడమే దీని ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. ఈ ప్రయోగానికి రెండ్రోజుల ముందు పాకిస్తాన్ 450 కిలోమీటర్ల రేంజ్‌అబ్దాలి వెపన్ సిస్టమ్ మిసైల్‌ను పరీక్షించినట్టు ప్రకటించింది.కొనసాగుతున్న ఉద్రిక్తత ఈ మిలటరీ చర్యలు పాకిస్తాన్-భారతదేశాల మధ్య పెరిగుతున్న ఉద్రిక్తతల మధ్య జరుగుతున్నాయి. ఏప్రిల్ 22న పహల్గాం ఉగ్ర దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాకిస్తాన్ ఆధారిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా అనుబంధ గ్రూప్ ఈ దారుణానికి ఒడిగట్టింది. పాక్‌పై భారత్ ఆంక్షలుదీనికి ప్రతిగా, భారత్.. పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటుంది. ఇండస్ వాటర్ ట్రీటీని నిలిపివేయడం, పాకిస్తాన్ పౌరులకు జారీ చేసిన వీసాలను రద్దు వంటి చర్యలు ఉన్నాయి. మరోవైపు, పాకిస్తాన్ తరచూ నియంత్రణ రేఖ (LoC) వద్ద కాల్పులకు పాల్పడుతుండగా, భారత్ కూడా గట్టి ప్రతిస్పందన ఇస్తోంది.ఏక్షణంలోనైనా పాక్‌పై భారత్ దాడిప్రధానమంత్రి మోదీ భారత సైన్యానికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. ఈ నిర్ణయంతో భారత సైన్యం పాకిస్తాన్‌పై ఏ క్షణంలో మెరుపు దాడి చేసే దిశగా సన్నాహాలు కొనసాగిస్తోంది. -
ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ పంచాయతీ
-
ట్రోలింగ్‌పై సీరియస్
పహల్గాం ఉగ్రదాడిలో 26మంది అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. వాళ్లలో.. నేవీ అధికారి అయిన తన భర్త వినయ్ నర్వాల్ మృతదేహం వద్ద భార్య హిమాన్షి కన్నీరుమున్నీరైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే అదే సోషల్ మీడియాలో ఇప్పుడు ఆమెపై విపరీతంగా ట్రోలింగ్ నడుస్తోంది. ఆ ట్రోలింగ్‌పై జాతీయ మహిళా కమిషన్(NCW) తీవ్రంగా స్పందించింది.న్యూఢిల్లీ: నేవీ అధికారి వినయ్ భార్య హిమాన్షిపై నడుస్తున్న సోషల్ మీడియా ట్రోలింగ్‌పై జాతీయ మహిళా కమిషన్ స్పందించింది. జమ్ము కశ్మీర్ పహల్గాం ఉగ్ర దాడిలో ఎంతో మంది చనిపోయారు. లెఫ్టినెంట్ వినయ్ అగర్వాల్‌ను మతం అడిగి మరీ ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. ఈ దాడితో యావత్ సమాజం దిగ్భ్రాంతికి గురైంది. అయితే వినయ్ భార్య హిమాన్షిని సోషల్ మీడియాలో కొందరు టార్గెట్ చేయడం దుర్మార్గం.కేవలం ఆమె తన అభిప్రాయం తెలియజేసినందుకే ఇలా ట్రోలింగ్ చేయడం దారుణం. ఆమె వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకుని అలా కామెంట్లు చేయడం సరికాదు అని ఎన్సీడబ్ల్యూ ఎక్స్ ఖాతాలో ఓ పోస్ట్ చేసింది. దేశంలో ఉన్న ప్రతీ మహిళా గౌరవాన్ని, ఔనత్యాన్ని కాపాడడమే మహిళా కమిషన్ ఉద్దేశమని పేర్కొంది. మరోవైపు.. కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ కూడా తన సోషల్ మీడియా ఖాతాలో ఈ ఉదంతంపై స్పందించారు. నేవీ అధికారి వినయ్ నర్వాల్ స్మారకార్థం నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. తనకు ముస్లింలు లేదా కశ్మీరీలపై ఎలాంటి ద్వేషం లేదని... శాంతి, న్యాయం మాత్రమే కోరుకుంటున్నానని ఉద్వేగభరితంగా పేర్కొన్నారు. ప్రస్తుతం దేశ ప్రజల్లో నెలకొన్న ఆగ్రహాన్ని తాను అర్థం చేసుకున్నానని, అయితే ప్రజలు ముస్లింలకు గానీ, కశ్మీరీలకు గానీ వ్యతిరేకంగా మారడాన్ని తాను కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. "మేము శాంతిని మాత్రమే కోరుకుంటున్నాం. కచ్చితంగా మాకు న్యాయం జరగాలి" అని ఆమె అన్నారు. మత ఘర్షణలకు ముగింపు పలకాలని విజ్ఞప్తి చేస్తూ, తన భర్త వినయ్ నర్వాల్ కూడా ఇదే ఆకాంక్షించేవారని ఆమె తెలిపారు. ఈ వ్యాఖ్యలకు గానూ సోషల్ మీడియాలో ఆమెను కొందరు నిందిస్తూ పోస్టులు చేయసాగారు.గురుగ్రామ్‌కు చెందిన హిమాన్షి పీహెచ్డీ స్కాలర్. కేవలం కొద్ది వారాల క్రితమే, ఏప్రిల్ 16న ఆమెకు నేవీ అధికారి వినయ్ నర్వాల్‌తో వివాహం జరిగింది. ఏప్రిల్ 19న రిసెప్షన్ అనంతరం, వారు హనీమూన్ కోసం కశ్మీర్‌లోని పహల్గామ్కు వెళ్లారు. అయితే, ఏప్రిల్ 22న వారు సేదతీరుతున్న సమయంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో వినయ్ నర్వాల్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భర్త మృతదేహం వద్ద హిమాన్షి కన్నీరుమున్నీరైన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వినయ్ నర్వాల్ అంత్యక్రియలను హర్యానాలో సైనిక లాంఛనాలతో నిర్వహించారు. పలువురు రాజకీయ ప్రముఖులు హిమాన్షిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. భర్త శవపేటిక వద్ద హిమాన్షి సెల్యూట్ చేసిన దృశ్యాలు పలువురిని కదిలించాయి. जम्मू-कश्मीर के पहलगाम में हुए आतंकी हमले में देश के अनेक नागरिकों की हत्या कर दी गई थी। इस हमले में अन्य लोगों के साथ लेफ्टिनेंट विनय नरवाल जी से उनका धर्म पूछकर उन्हें गोली मार दी गई थी। इस आतंकी हमले से पूरा देश आहत व क्रोधित है। लेफ्टिनेंट विनय नरवाल जी के मृत्यु के पश्चात…— Vijaya Rahatkar (@VijayaRahatkar) May 4, 2025 -
మైసూరులో పాకిస్తానీ మహిళ
మైసూరు(కర్ణాటక): మైసూరులో పాకిస్తాన్‌కు చెందిన మహిళ స్వదేశానికి వెళ్లలేక ఇబ్బందులు పడుతోంది. పాకిస్తాన్లో ఉన్న తన భర్త పిలుచుకుపోతాడని ఆమె భారత్– పాకిస్తాన్ సరిహద్దులకు వెళ్లింది, కానీ భర్త రాకపోవడంతో ఒంటరిగా వెళ్లలేక ఉస్సూరంటూ మైసూరుకు తిరిగి వచ్చింది. మైసూరులో నివాసం వివరాలు.. మైసూరులోని ఉదయగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో పాకిస్తాన్‌కు చెందిన మహిళ ముగ్గురు పిల్లలతో కలిసి ఉంటోంది. 10 సంవత్సరాల క్రితం పాకిస్తాన్ వ్యక్తితో వివాహమైంది. కొన్ని సంవత్సరాల పాటు భర్తతో కలిసి పాకిస్తాన్లో జీవించింది, పిల్లలు కూడా అక్కడే పుట్టారు. కొన్ని కారణాల వల్ల ఆమె, పిల్లలతో కలిసి మైసూరుకు వచ్చి ఉంటోంది. పహల్గాంలో ఉగ్రవాదుల మారణహోమం తరువాత పాకిస్తాన్ పౌరులందరూ వారి దేశానికి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం తెలిసిందే. ఫలితంగా ఆ మహిళ పాకిస్తాన్‌కు వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంది. భర్తకు ఫోన్ చేయగా పిల్లలతో కలిసి సరిహద్దుల వద్దకు రా, నేను వచ్చి తీసుకెళ్తాను అని చెప్పాడు. ఆమె పిల్లలను వెంటేసుకుని సరిహద్దులకు వెళ్లింది. భర్తకు కాల్ చేయగా ఫోన్ స్విచాఫ్ అని వచ్చింది. మళ్లీ మైసూరుకు తిరిగి వచ్చింది. ఆమె విజిటర్స్ వీసాతో మైసూరులో ఉంటోంది. -
ఐరాసలో నేడు పాక్-భారత్ పంచాయితీ
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితిలో నేడు కీలక పరిణామం చోటు చేసుకోనుంది. భద్రతా మండలి(UN Security Council)లో భారత్-పాక్‌ల మధ్య నెలకొన్న ఉద్రిక్తతల గురించి చర్చించబోతున్నారు. తద్వారా.. అంతర్జాతీయ సమాజం ముందు ఇరు దేశాల తమ తమ వాదనలు వినిపించే అవకాశం దక్కింది.ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్ అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం పట్టణంలోని బైసరన్ లోయలో 26 మంది పర్యాటకుల్ని ఉగ్రవాదులు బలిగొన్నారు. ఇది పాక్‌పనేనని నిర్ధారించుకున్న భారత్.. అన్ని రకాల ఆంక్షలతో ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఈ క్రమంలో.. పాక్ కూడా కౌంటర్ ఆంక్షలు విధిస్తోంది. మరీ ముఖ్యంగా భారత్ సింధు జలాలను నిలిపివేయడాన్ని ‘‘యుద్ధం’’గానే పాక్ భావిస్తోంది.ఈ క్రమంలో ఈ పరిణామాలపై ఆదివారం పాక్ విదేశాంగ ప్రతినిధి ఒకరు స్పందించారు. భారత్ దూకుడుగా వ్యవహరిస్తూ తమను(పాక్)ను ఇబ్బంది పెడుతోందని, రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తోందని అన్నారు. మరీ ముఖ్యంగా సింధు జలాల ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత్ అక్రమంగా వ్యవహరిస్తోందని, ఈ విషయాలన్ని భద్రతా మండలి సమావేశంలో లేవనెత్తుతామని అన్నారాయన.మరోవైపు.. భద్రతా మండలి పహల్గాం దాడిని ఖండించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సోమవారం నాటి సమావేశానికి ముందు మండలి ప్రతినిధులు ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై స్పందించారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా తాము వ్యతిరేకిస్తామని.. అదే సమయంలో ఆ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై ఆందోళన చెందుతున్నామని అన్నారు. -
కేవలం 4 రోజుల్లో చేతులెత్తేయడమే!
పహల్గాం ఉగ్రదాడిపై భారత్ ప్రతీకార చర్యలతో పాకిస్తాన్ ఉక్కిరిబిక్కిరవుతోంది. ఏ క్షణాన ఎలా విరుచుకుపడుతుందోనని బిక్కుబిక్కుమంటోంది. దీటైన ప్రతిస్పందన, అవసరమైతే అణుబాంబులు అంటూ పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోపల మాత్రం వణికిపోతోంది. భారత్‌ను ఎలాగోలా నిలువరించండంటూ అరబ్ దేశాలను బామాలుతోంది. ఇందుకు కారణాలు లేకపోలేదు. పాక్ సాయుధ సన్నద్ధత, ఆయుధ సంపత్తి అత్యంత దారుణంగా ఉన్నట్టు అక్కడి మీడియానే చెబుతోంది. ఇప్పటికిప్పుడు భారత్‌తో యుద్ధానికి తలపడాల్సి వస్తే పాక్ కేవలం నాలుగు రోజులు మాత్రమే ఎంతో కొంత పోరాడగలదని, తర్వాత చేతులెత్తేయడం మినహా మరో మార్గం లేదని తెలుస్తోంది. నిండుకున్న మందుగుండు భూతల యుద్ధంలో కీలకమైన శతఘ్నులు, మోరా్టర్లు, తుపాకుల్లో వాడే అన్నిరకాల మందుగుండూ పాక్ వద్ద దాదాపు ఖాళీ అయినట్టు తెలుస్తోంది. సైన్యం వద్ద కేవలం నాలుగు రోజులకు సరిపడే నిల్వలు మాత్రమే ఉన్నాయి. పాక్‌కు ప్రధానంగా మందుగుండు సరఫరా చేసే సంస్థలు ఇప్పుడు గాజా, ఇజ్రాయెల్ యుద్ధం, ఉక్రెయిన్ యుద్ధాలకు మందుగుండు సరఫరాలో బిజీగా ఉన్నాయి. దాంతో పాక్ అవసరాలను తీర్చే నాథుడే లేకుండా పోయాడు.అంతర్జాతీయంగా మందుగుండుకు ఇప్పుడున్న డిమాండ్ నేపథ్యంలో వాటిని కొనే స్తోమత, ఆర్థిక బలం కూడా పాక్‌కు లేవు. దీనికితోడు దేశీయంగా మందుగుండు, ఆయుధాలను తయారు చేసే పాక్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తీవ్ర ముడిసరుకుల కొరతను ఎదుర్కొంటోంది. పైగా దాని సాంకేతికత పాత తరానిది కావడంతో పెద్దగా పనికొచ్చే పరిస్థితి కూడా లేదు. ఉక్రెయిన్‌తో గత ఒప్పందం మేరకు ఆ దేశానికి పాక్ ఇటీవలి దాకా భారీగా మందుగుండు సరఫరా చేసింది. తీరా ఇప్పుడు సొంత అవసరాలకు సరిపడా నిల్వల్లేక తెగ తిప్పలు పడుతోంది. యుద్ధమే వస్తే ప్రస్తుత మందుగుండు నిల్వలు 96 గంటల్లోపే ఖాళీ అవుతాయని పాక్‌లోని విశ్వసనీయ సైనిక వర్గాలు వెల్లడించాయి.హోవిట్జర్లకూ మందుగుండు కొరతే పాక్ ఎం109 హోవిట్జర్లలో ఉపయోగించే 155 ఎంఎం షెల్స్, బీఎం–21 మలి్టపుల్ రాకెట్ లాంచింగ్ వాహనాల్లో వాడే 122 ఎంఎం రాకెట్లకు కూడా తీవ్ర కొరత ఏర్పడింది. ఉక్రెయిన్ యుద్ధం మొదట్లో ఆ దేశానికి పాక్ 155 ఎంఎం షెల్ మందుగుండు ఎడాపెడా ఎగుమతి చేసింది. దాంతో వాటి నిల్వలు భారీగా తగ్గిపోయాయి. మౌంటెడ్ గన్ సిస్టమ్(ఎంజీఎస్) వ్యవస్థలో వాడే మందుగుండునూ ఉక్రెయిన్‌కు భారీగా ఇచ్చేసింది. అవీ తగ్గిపోవడంతో గాబరా పడుతోంది. ఈ పరిస్థితుల్లో భారత్ గనుక అధునాతన ఆయుధాలతో సరిహద్దు దాటి వస్తే నిలువరించేందుకు శతఘ్నులు మందుగుండుతో సిద్ధంగా లేవని మే 2న జరిగిన పాక్ స్పెషల్ కోర్ కమాండర్స్ భేటీలో సైన్యాధికారులు ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.కాలూచేయీ కూడదీసుకుంటూ...అందుబాటులో ఉన్న కొద్దిపాటి మందుగుండును వీలైనంతగా భారత సరిహద్దులకు పాక్ తరలిస్తోంది. అక్కడ ఇప్పటికే మందుగుండు నిల్వ చేసి పెట్టుకుందని విశ్వసనీయ సమాచారం. మందుగుండు కొరతను గతంలో కూడా పాక్ ప్రభుత్వ వర్గాలే ఒప్పుకున్నాయి. యుద్ధం వస్తే ఎదుర్కోవడానికి సరిపడా ఆయుధాలు కూడా లేవని నాటి పాక్ ఆర్మీ చీఫ్ ఖమర్ జావేద్ బజ్వా వాపోయారు. దీర్ఘకాలం పాటు యుద్ధం చేయడం పాక్ దళాలకు అసాధ్యమని కుండబద్దలు కొట్టారు. గగనతలంలో యుద్ధ విమానాలు, డ్రోన్లతో ఎంతగా పోరాడినా భూభాగాన్ని కాపాడుకోవడమే యుద్ధాల్లో కీలకం. కానీ నేవీ, ఎయిర్‌ఫోర్స్‌తో పోలిస్తే పాక్ ఆర్మీ పాటవం, సన్నద్ధత అత్యంత అధ్వానమని తెలుస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అవే ఉద్రిక్తతలు
న్యూఢిల్లీ/ఇస్లామాబాద్: అవే ఉద్రిక్తతలు. అదే ఉత్కంఠ. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఏమాత్రం చల్లారడం లేదు. దాయాది కవ్వింపు చర్యలు ఆగడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం వరుసగా పదో రోజూ కాల్పులకు తెగబడింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం దాకా జమ్మూ కశ్మీర్లో కుప్వారా, పూంచ్, రాజౌరీ, మేంధార్, నౌషేరా, సుందర్బనీ, అఖూ్నర్ తదితర 8 ప్రాంతాల్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. వాటిని సైన్యం గట్టిగా తిప్పికొట్టింది. వైమానిక దళాధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్‌ప్రీత్ సింగ్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. పహల్గాం ఉగ్రదాడి అనంతర పరిణామాలు, భారత్–పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై చర్చించారు.నావికా దళాధిపతి చీఫ్ అడ్మిరల్ దినేశ్ కె.త్రిపాఠితో సమావేశమైన 24 గంటల్లోపే ఎయిర్ చీఫ్ మార్షల్‌తో మోదీ మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఉగ్రదాడులపై ప్రతీకారం విషయంలో సైనిక దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్లు ప్రకటించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో, భారత వాయుసేనతో త్వరలో ఘర్షణ జరగవచ్చంటూ పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ కొత్త పల్లవి అందుకున్నారు. తమ గగనతలంలోకి చొరబడేందుకు ప్రయత్నించిన భారత రఫేల్ యుద్ధ విమానాలను అడ్డుకున్నట్టు చెప్పుకున్నారు. మరోవైపు మిత్ర దేశాల మద్దతు కూడగట్టేందుకు పాక్ ప్రయత్నిస్తోంది. తుర్కియేకు చెందిన భారీ యుద్ధనౌక ఆదివారం కరాచీ తీరం చేరుకుంది. ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్‌పై దాడికి తెగబడ్డ వారికి త్వరలో మర్చిపోలేని రీతిలో సమాధానం చెప్పి తీరతామని పునరుద్ఘాటించారు. ‘‘సైనికులను కాపాడటం నా బాధ్యత. ప్రధాని మోదీ పట్టుదల అందరికీ తెలుసు. ప్రజలు కోరుతున్నది ఆయన నాయకత్వంలో జరిగి తీరుతుంది’’ అని ప్రకటించారు.దీర్ఘకాల సెలవులు రద్దుఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల సిబ్బందికి దీర్ఘకాల సెలవులు రద్దు చేస్తూ మ్యునీíÙయన్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్) ఆదేశాలు జారీ చేసింది. ఎంఐఎల్ పరిధిలో 12 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలున్నాయి. సైన్యానికి అవసరమైన ఆయుధాలు వాటిలో తయారవుతాయి. ఆయుధ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికే సెలవులు రద్దు చేసినట్లు ఎంఐఎల్ అధికారి ఒకరు చెప్పారు. భద్రతా మండలికి పాక్ పహల్గాం దాడిని అడ్డు పెట్టుకొని భారత్ తమను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తోందని పాక్ వాపోయింది. దీనిపై ఐరాస భద్రతా మండలిని ఆశ్రయిస్తామని పాక్ ప్రకటించింది. వీలైనంత త్వరగా భద్రతామండలి భేటీ జరిగేలా చూడాలని ఐరాసలోని తమ శాశ్వత ప్రతినిధి, రాయబారి అసీం ఇఫ్తికార్‌ను పాక్ విదేశాంగ శాఖ ఆదేశించింది. ‘‘సింధూ జల ఒప్పందం నిలిపివేత ప్రాంతీయ శాంతిభద్రతలకు దెబ్బ. భారత్ వైఖరిని అంతర్జాతీయ సమాజానికి వివరిస్తాం’’ అని చెప్పుకొచి్చంది. భద్రతా మండలిలో పాక్ తాత్కాలిక సభ్యదేశం.నేడు పాక్ పార్లమెంట్ ప్రత్యేక భేటీ భారత్‌తో ఉద్రిక్తతలపై చర్చించేందుకు పాక్ పార్లమెంట్ సోమవారం సాయంత్రం ప్రత్యేకంగా సమావేశం కానుంది. సింధూ ఒప్పందం నిలిపివేత వంటి అంశాలపైనా చర్చిస్తామని ఎంపీలు తెలిపారు.మళ్లీ ‘అణు’ ప్రేలాపనలు పాక్ మరోసారి అణు ప్రేలాపనలకు దిగింది. పాక్‌లోని కొన్ని భూభాగాలపై భారత్ త్వరలో దాడి చేయనున్నట్లు తమకు సమాచారముందని రష్యాలో ఆ దేశ రాయబారి మొహమ్మద్ ఖలీద్ జమాలీ చెప్పుకొచ్చారు. ‘‘దాడికి దిగితే భారత్‌కు గట్టిగా బదులిస్తాం. అణ్వాయుధాలు సహా సర్వశక్తులూ ప్రయోగిస్తాం’’ అని హెచ్చరించారు. యుద్ధం జరిగితే పాక్ కచ్చితంగా అణ్వాయుధాలు ప్రయోగిస్తుందన్నారు. భారత్‌పై అణు బాంబులు ప్రయోగిస్తామని పాకిస్తాన్‌మంత్రి హనీఫ్ అబ్బాసీ కొన్ని రోజుల క్రితం హెచ్చరించిన సంగతి తెలిసిందే. -
భారత్-పాక్ ఉద్రిక్తతల వేళ.. రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు
ఢిల్లీ: పహల్గామ్ ఉగ్రదాడితో భారత్-పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పాక్‌తో యుద్ధం తప్పదని వార్తలు వస్తున్న వేళ.. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది జరిగి కచ్చితంగా జరిగి తీరుతుందంటూ తేల్చి చెప్పారు. అందుకు తాను హామీ ఇస్తున్నానన్నారు. ఢిల్లీలో జరిగిన సంస్కృతి జాగరణ్ మహోత్సవ్ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారాయన.‘‘మోదీ వర్కింగ్ స్టైల్, అంకితభావం గురించి అందరికీ తెలుసు. మన దేశంపై దాడి చేసిన వారికి తగిన బుద్ధి చెప్పడం నా బాధ్యత’’ అంటూ కేంద్ర రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. భారత్‌ను దెబ్బతీయడానికి దుస్సాహసం చేసిన వారికి ధీటైన రీతిలో సమాధానం ఇస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. మరో వైపు, భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల వేళ.. ప్రధాని మోదీ.. జాతీయ భద్రతా సలహాదారు, ఎయిర్‌చీఫ్ మార్షల్ ఏపీ సింగ్‌తో తాజాగా సమావేశమయ్యారు. ఈ నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది.ఇక, సరిహద్దుల్లో ఉద్రిక్తత కారణంగా ప్రధాని మోదీ.. వరస భేటీలు అవుతున్నారు. ఇప్పటికే త్రివిధ దళాల అధికారులతో భేటీ అయ్యారు. ఇదిలా ఉండగా.. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సైనిక దళాలకు ఆయుధాలను సరఫరా చేసే మ్యునిషన్స్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన రెండు ఆయుధ కర్మాగారాల సిబ్బందికి సెలవులు రద్దు చేశారు. మహారాష్ట్రలోని చంద్రపుర్ జిల్లా కర్మాగారంతోపాటు మధ్యప్రదేశ్‌లోని జబల్పుర్ జిల్లా ఖమరియాలో ఉన్న ఆర్డినన్స్ ఫ్యాక్టరీ సిబ్బందికి శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. -
అదే జరిగితే.. భారత్‌కు పాక్ మరోసారి అణు బెదిరింపులు
మాస్కో: పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపడుతున్న చర్యలు.. పాక్‌ను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ఈ క్రమంలో మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తోంది. తాజాగా రష్యాలోని పాక్ దౌత్యవేత్త మహమ్మద్ ఖలీద్ జమాలీ అణు బూచిని భారత్‌కు చూపించి బెదిరించే యత్నం చేశారు. ఒక వేళ న్యూఢిల్లీ తమపై దాడి చేస్తే.. అణ్వాయుధాలు సహా పూర్తి శక్తిని వినియోగిస్తామని పేర్కొన్నారు. రష్యా ఛానల్ ఆర్టీకి ఇంటర్వ్యూ ఇస్తూ.. భారత్‌కు చెందిన బాధ్యతారాహిత్య మీడియా నుంచి వస్తున్న ప్రకటనలు మమ్మల్ని తప్పనిసరిగా స్పందించేలా చేస్తున్నాయి. ఇటీవల లీకైనట్లు చెబుతున్న పత్రాల్లో భారత్ కొన్ని చోట్ల కచ్చితంగా దాడులు చేయబోతున్నట్లు తెలిసింది. ఆ దేశంతో యుద్ధం విషయానికి వస్తే ప్రజల మద్దతుతో మా సంప్రదాయ, అణు బలంతో పూర్తిస్థాయిలో స్పందిస్తాం’’ అని జమాలీ పేర్కొన్నారు. గత వారం ఆ దేశ రైల్వేశాఖ మంత్రి హనీఫ్ అబ్బాసీ మాట్లాడుతూ తమ వద్ద ఉన్న ఘజన్నవీ, ఘోరీ, షహీన్ క్షిపణులు, 130 అణ్వాయుధాలు భారత్ కోసమే ఉంచినట్లు ప్రకటించారు. పాక్ ప్రేరిత ఉగ్రవాదులు పహల్గాంలోని బైసరన్ లోయలో దాడి చేసి 26 మంది అమాయకుల ప్రాణాలు తీయడం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ టెర్రరిస్టులు పాక్ జాతీయులని తేలింది. దీంతో భారత్ ప్రతిచర్యలకు దిగింది. ఇప్పటికే సింధుజలాల ఒప్పందాన్ని నిలిపివేసి ఇస్లామాబాద్‌కు భారత్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఉగ్రవాదులు, ఆ మూకలకు మద్దతు ఇచ్చే వారిపై చర్యలు తీసుకొనే విషయంలో భద్రతా దళాలకు ప్రధాని మోదీ పూర్తి స్వేచ్ఛను ఇచ్చారు. ఎక్కడ, ఎప్పుడు ఎలా దెబ్బకొట్టాలో వారే నిర్ణయిస్తారన్నారు. సైనిక చర్య కూడా ఉండొచ్చన్న ఆందోళనతో.. యుద్ధం వస్తే తాము అణ్వాయుధాలు వాడతామంటూ పాక్ ప్రకటనలు గుప్పిస్తోంది. -
కొలంబో విమానాశ్రయంలో పహల్గామ్ ఉగ్రదాడి అనుమానితుల అరెస్టు
-
పహల్గాం ఉగ్రదాడి.. చెన్నై నుంచి కొలంబో.. విమానంలో అనుమానితులు?
కొలంబో: పహల్గాంలో కాల్పులు జరిపిన ఉగ్రవాదులు కొలంబో చేరుకున్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. కొలంబో ఎయిర్‌పోర్టులో భారీ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. చెన్నై నుంచి కొలంబో వెళ్లిన విమానంలో ఎయిర్పోర్ట్ సిబ్బంది, స్థానిక పోలీసులు తనిఖీలు చేపట్టారు. భారత్ నిఘా వర్గాల సమాచారంతో సోదాలు చేపట్టారు. శ్రీలంక ఎయిర్‌లైన్స్ చెందిన యూఎల్ 122 విమానంలో చేపట్టిన విస్తృత తనిఖీల్లో ఆరుగురు అనుమానితులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. పహల్గాం దాడితో సంబంధాలున్నట్లు అనుమానం వ్యక్తమవుతున్నాయి.కాగా, పహల్గాం ఉగ్రదాడిపై ఎన్ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఇప్పటివరకు 3వేల మందికి పైగా ఎన్ఐఏ విచారించింది. ఇప్పటికే 90 మంది ఓవర్ గ్రౌండ్ వర్కర్లపై కేసులు నమోదుచేసింది. 100కుపైగా ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. రేపు(ఆదివారం) కేంద్ర హోంశాఖకు నివేదిక ఇవ్వనుంది. ఈ కేసులో భాగంగా 2023లో రాజౌరీలో జరిగిన ఉగ్రదాడి కేసులో అరెస్టయిన ఇద్దరు వ్యక్తుల్ని ప్రశ్నించింది. ప్రస్తుతం జమ్ములోని కోట్ భల్వాల్ జైల్లో ఉన్న లష్కరే తోయిబా ఓవర్ గ్రౌండ్ వర్కర్స్ నిస్సార్ అహ్మద్, ముస్తాక్ హుస్సేన్‌ను విచారించింది. పహల్గాం ఉగ్రదాడిలో వీరికి సంబంధాలు ఉన్నాయా? అనే అనుమానంతోనే వారిని ఎన్ఐఏ అధికారులు విచారించినట్లు సమాచారం.పహల్గాం దాడి ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తులోపలు సంచలన విషయాలు వెలుగులో వస్తున్నాయి. ఈ దాడి వెనుక పాకిస్థాన్‌కు చెందిన నిషేధిత ఉగ్రసంస్థ లష్కరే తోయిబా, పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ హస్తం ఉన్నట్లు ప్రాథమిక నివేదికలో పేర్కొంది. లష్కరే తోయిబా ఉగ్రవాదులే ఈ దాడికి పాల్పడినట్లు తేల్చింది. ఈ దాడికి పాకిస్థాన్‌లోని లష్కరే ప్రధాన కార్యాలయంలోనే ప్లాన్ చేసినట్లు ఎన్ఐఏ వెల్లడించింది. -
ఉగ్రవాదుల్నే కాదు.. వారి మద్దతుదారుల అంతు కూడా చూస్తాం: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: ఉగ్రవాదుల్ని, వారి మద్దతు దారుల అంతు చూస్తామని మరోసారి హెచ్చరించారు భారత ప్రధాని నరేంద్ర మోదీ. మానవాళికి ఉగ్రవాదం అనేది అతి పెద్ద వినాశనకారి అని పేర్కొన్న మోదీ.. ఉగ్రవాదాన్ని అంతం చేయడమే లక్ష్యంగా పని చేస్తామన్నారు. ఉగ్రదాడి తర్వాత మోదీ మాట్లాడుతూ.. పహల్గామ్ పై ఘటనకు బాధ్యులైన వారిని ఏ ఒక్కరినీ వదిలిపెట్టే ప్రస్తక్తే లేదన్నారు. వారిని మట్టిలో కలిపేస్తామంటూ మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాజాగా మరోసారి ఉగ్రచర్యలకు సంబంధించి హెచ్చరికలు జారీ చేశారు.ఈరోజు (శనివారం) అంగోలా అధ్యక్షుడు మాన్యుయెల్ గొంకాల్వ్స్ లౌరెంకోతో కలిసి జాయింట్ ప్రెస్ కాన్పరెన్స్ లో పాల్గొన్న మోదీ.. ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు. నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మాన్యుయెల్ గొంకాల్వ్స్ లౌరెంకో భారత్ కు వచ్చిన సంగతి తెలిసిందే.ఉగ్రదాడి అనంతరం భారత్, పాకిస్తాన్ ల మధ్య యుద్ధ వాతావరణ తలపిస్తోంది. ఈ ఉగ్రవాద చర్య పాకిస్తాన్ భూ భాగం నుంచే జరిగిందేనని బలంగా నమ్ముతున్న భారత్.. ఆ మేరకు ఆంక్షలు విధిస్తూ వస్తోంది. పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేసి ఉక్కిరి బిక్కిరి చేసే యత్నాలను ఇప్పటికే భారత్ ప్రారంభించింది. పాకిస్తాన్ పౌరులు భారత్ ను విడిచి వెళ్లిపోవాలనే ఆదేశాల దగ్గర్నుంచి పలు నిషేధాజ్ఞల్ని భారత్ అమలు చేస్తూ వస్తోంది. సింధూ జలాలను పాక్‌కు వెళ్లకుండా నిలిపివేయడం, భారత్‌లో పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖుల యూట్యూబ్ చానెళ్ల నిలిపివేత, భారత్ జలాల్లోకి పాక్ ఓడలు రాకుండా నిషేధం, పాక్ దిగుమతులపై నిషేధం ఇలా పలు రకాలైన ఆంక్షలతో పాక్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది టూరిస్టులు అసువులు బాసిన నేపథ్యంలో భారత్ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ కు ఒకవైపు హెచ్చరికలు పంపుతూనే, ఏ క్షణంలో ఏం జరిగిన భారత బలగాలు సిద్ధంగా ఉండాలనే స్వేచ్ఛను కూడా వారికి అప్పగించింది. దాంతో పాకిస్తాన్ ఏమైనా కవ్వింపు చర్యలకు పాల్పడి యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తే అందుకు బదులు తీర్చుకునేందుకు భారత్ సిద్ధంగా ఉంది. -
పాకిస్తాన్ ఓడలపై భారత్ నిషేధం
ఢిల్లీ: పాకిస్తాన్‌కు భారత్ వరుస షాకులిస్తోంది. ఇవాళ పాకిస్తాన్ ఓడలపై కేంద్రం నిషేధం విధించింది. ఈ మేరకు డైరెక్టర్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ నోటిఫికేషన్ విడుదల చేసింది.ఆ నోటిఫకేషన్‌లో పాకిస్తాన్ జెండా ఉన్న ఏ ఓడ భారత జలాలలోకి, పోర్టుల్లోకి ప్రవేశించవద్దని ఆదేశించింది. భారత ఓడలేవి పాకిస్తాన్ పోర్టుల్లోకి వెళ్ళొద్దని సూచించింది. భారత్ ఆస్తులను, కార్గో , మౌలిక సదుపాయాలను రక్షించే క్రమంలో ఓడరేవుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చర్యలు తీసుకున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. ఈ నిషేధం తక్షణమే అమల్లోకి వస్తుందని వెల్లడించింది. పాకిస్తాన్ విమానాలకు ఇప్పటికే గగనతలం నిషేధం విధించింది భారత్. తాజాగా సముద్ర మార్గాన్ని సైతం బ్యాన్ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇలా పాక్ అన్ని మార్గాల్లో నిషేధం విధిస్తూ అష్ట దిగ్బంధనం చేసే ప్రయత్నాల్ని భారత్ కొనసాగిస్తోంది. -
పహల్గాం ఉగ్రదాడి: పాకిస్తాన్‌కు ప్రధాని మోదీ మరో షాక్
ఢిల్లీ : పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. పాకిస్తాన్ ఎగుమతులు, దిగుమతులపై నిలిపివేస్తున్నట్లు ప్రధాని మోదీ సర్కార్ అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వుల్ని జారీ చేసింది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ ఆర్థిక మూలాలను చావు దెబ్బ తీసే ప్రయత్నాల్ని భారత్ ముమ్మరం చేసింది. తాజాగా పాకిస్తాన్ అధికారిక, అనధికారిక దిగుమతులు, ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. జాతీయ భద్రత దృష్ట్యా ఈ పరిమితిని విధించింది. అయితే, ఈ నిషేధం నుంచి మినహాయింపు పొందాలంటే భారత ప్రభుత్వం ముందస్తు అనుమతి అవసరం’ అని వాణిజ్య మంత్రిత్వ శాఖ శనివారం విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది.ఏప్రిల్ 22న జమ్మూ కశ్మీర్ పహల్గాంలో ఉగ్రవాదులు అమానుషంగా 26 మంది టూరిస్టుల ప్రాణాల్ని బలితీసుకున్నారు. ఈ దాడి తర్వాత భారత్,పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నాటి నుంచి వరుస కఠిన నిర్ణయాలతో పాకిస్తాన్‌ను భారత్ దెబ్బకు దెబ్బ తీస్తోంది. ముందుగా సరిహద్దు దాటిన ఉగ్రవాదం అని పేర్కొంటూ సింధు జల ఒప్పందాన్ని భారత్ రద్దు చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ జాతీయుల అన్ని వీసాలను రద్దు చేసింది. పాక్ పౌరులు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. భారత గగనతలంలో పాక్ విమానాలపై నిషేధం విధించింది. భారత్‌లో పాక్ దేశ మీడియా,సోషల్ మీడియా అకౌంట్స్‌పై బ్యాన్ విధించింది. ఇప్పుడు పాకిస్తాన్‌పై వాణిజ్య యుద్ధం ప్రకటించింది. విదేశీ వాణిజ్య విధానంలో మార్పులు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని నోటిఫికేషన్లో పేర్కొన్న కేంద్రం పేర్కొంది. -
అభిమాని కోరికను ‘పహల్గాం’ఘటనతో పోల్చిన సింగర్.. కేసు నమోదు!
కాన్సర్ట్ మధ్యలో పహల్గాం దాడి గురించి ప్రస్తావించినందుకుగానూ ప్రముఖ సింగర్ సోనూ నిగమ్(Sonu Nigam) చిక్కుల్లో పడ్డారు. అతని వ్యాఖ్యలతో కన్నడిగుల మనోభావాలు దెబ్బతిన్నాయని, భాషా విద్వేషాన్ని రెచ్చగొట్టారని ఆరోపిస్తూ సోను నిగమ్‌పై కర్ణాటక రక్షణ వేదిక (KRV)బెంగళూరు నగర జిల్లా అధ్యక్షుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంతకీ సోనూ నిగమ్ చేసిన వ్యాఖ్యలు ఏంటి? కన్నడ ప్రజలు అతనిపై ఎందుకు అసహజం వ్యక్తం చేస్తున్నారు?కన్నడ పాటలోనే పాడాలిబాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్‌కి సంగీత ప్రపంచంలో ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీలోనే ఎక్కువ పాటలు పాడినప్పటికీ..తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ..ఇలా అన్ని ప్రాంతాల్లోనూ ఆయన పాటలకు అభిమానులు ఉన్నారు. తుళు, మైథిలీ, నేపాలి భాషల్లోనూ ఆయన పాటలు ఆలపించారు. ఆయన నిర్వహించే సంగీత కచేరీకి వేలాది మంది సంగీత ప్రియులు హాజరవుతుంటారు. తాజాగా ఆయన బెంగళూరులో కాన్సర్ నిర్వహించారు. సోనూ నిగమ్ వేదికపై పాటలు పాడుతున్న సమయంలో ఓ అభిమాని కన్నడ భాషలో పాడాలంటూ డిమాండ్ చేశారు. ఆ అభిమాని పదే పదే అదే కోరడం..గట్టిగా అరవడంతో సోనూ నిగమ్ సహనం కోల్పోయాడు. పాటలు పాడడం ఆపేసి కన్నడ ప్రేక్షకుల గురించి మాట్లాడారు. కన్నడ భాష అంటే తనకు కూడా ఇష్టమేనని..కానీ ఆ అభిమాని ఆ భాషలోనే పాడాలని బెదిరించడం తనకు నచ్చలేదన్నారు. ఈ సందర్భంగా ఆయన పహల్గాం ఉగ్రదాడి ఘటన గురించి ప్రస్తావించారు. ‘కన్నడ..కన్నడ..కన్నడ.. పహల్గాం దాడికి ఇలాంటి వ్యాఖ్యలే కారణం. ఇప్పుడు మీరు ఏం చేశారో అలాంటి కారణంగా ఆ దాడి జరిగింది. డిమాండ్ చేసే ముందు కనీసం మీ ముందు ఎవరున్నారో చూడండి’ అని ఘాటుగా స్పందించారు.Look at this shameless #SonuNigam Riduculing a fan for requesting him to sing a Kannada song in Bengaluru and Blaming Languages for the Terrorist attack.., off-late its become fashion to blame Kannada for these Hindi jihadis for everything.When u have no seed to question the… pic.twitter.com/pw2w9vjj8h— Prathap ಕಣಗಾಲ್💛❤️ (@Kanagalogy) May 1, 2025 సింగర్‌పై కన్నడ ప్రజలు అసహనంసోనూ నిగమ్ భాషను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసినప్పటికీ కొంతమంది తమ మనోభావాలు దెబ్బతినేలా ఆయన మాట్లారంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కర్ణాటక రక్షణ వేదికతో పాటు మరికొంత మంది కన్నడ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే అదే కాన్సర్ట్‌లో సోనూ నిగమ్ కన్నడ ప్రేక్షకులపై తనకున్న అభిమానాన్ని వెల్లడించారు. నేను అన్నిభాషల్లో పాటలు పాడాను కానీ.. ఎక్కువగా కన్నడలోనే మంచి పాటలు పాడాను. ఇక్కడి ప్రజలు నాపై చూపించే ప్రేమ వెలకట్టలేనిది. నన్ను మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా అనుకోవడం నాకు దక్కిన గొప్ప గౌరవం. నేను ఎక్కడ కాన్సర్ట్ నిర్వహించిన అక్కడకి కన్నడ ప్రజలు వస్తారు. వారి కోసం ఆ భాషలో పాటలు పాడుతాను. కానీ ఆ అభిమాని నన్ను కన్నడ భాషలోనే పాడాలని బెదిరించడం నా మనసుని నొప్పించింది’ అని సోనూ నిగమ్ అన్నారు. ಸೊನು ನಿಗಮ್ ವಿರುದ್ದBNS 352(1)BNS 352(2)BNS 353 ಅಡಿಯಲ್ಲಿ ಘಟನೆ ನಡೆದ ವ್ಯಾಪ್ತಿಯ ಆವಲಹಳ್ಲಿ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ದೂರು ದಾಖಲಿಸಲಾಗಿದೆ. 24 ಗಂಟೆಯ ಒಳಗೆ FIR ದಾಖಲಿಸುವುದಾಗಿ ಪೊಲೀಸರು ಹೇಳಿದ್ದಾರೆ.ನಾಳೆ ಘಟನೆ ನಡೆದ ಈಸ್ಟ್ ಪಾಯಿಂಟ್ ಕಾಲೇಜಿನ ವಿರುದ್ದ ಪ್ರತಿಭಟನೆ ನಡೆಯಲಿದೆComplaint Filed Against Sonu NigamA… pic.twitter.com/Nx6gb6hqxo— ಅರುಣ್ ಜಾವಗಲ್ | Arun Javgal (@ajavgal) May 2, 2025 -
భారత్‌తో దాయాది యుద్ధం.. బలం కోసం పాక్ ప్రధాని కొత్త ఎత్తులు!
ఇస్లామాబాద్: పహల్గాం ఉగ్ర దాడిలో కారణంగా ఈ పాకిస్తాన్‌పై భారత్ తీవ్ర ఆగ్రహంతో ఉంది. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా, పాక్ ఆర్మీ సైనికులు ఈ ఘటనలో భాగం కావడంతో దాయాదిపై దాడులకు భారత్ ప్లాన్ చేస్తోంది. సరిహద్దుల్లో పాక్ కవ్వింపు చర్యలకు చెక్ పెడుతూ.. ఎప్పటికప్పడు భారత్ బలగాలు యుద్దానికి సిద్ధమవుతున్నాయి. దీంతో, భారత్ చర్యలపై భయంతో వణికిపోతున్న పాక్.. రక్షణ కోసం ప్రయత్నాలు చేస్తోంది. గల్ఫ్ దేశాలతో పాక్ ప్రధాని మంతనాలు జరుపుతున్నారు.వివరాల ప్రకారం.. పహల్గాం ఘటన తర్వాత పాకిస్తాన్‌కు భారత్ భయం పట్టుకుంది. భారత్ ఎప్పుడు, ఎలా దాడి చేస్తుందో తెలియక భయంతో వణికిపోతోంది. మరోవైపు.. దాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. అనేక దేశాలు భారత్‌కు మద్దతుగా నిలిచాయి. భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా మద్దతు ఇస్తామని అగ్రరాజ్యం అమెరికా సైతం చేతులు కలిపింది. దీంతో, పాకిస్తాన్‌కు మరింత ఆందోళన పెరిగింది. ఈ నేపథ్యంలో పాక్ సర్కార్.. ప్రపంచ దేశాల సాయం చేతులు చాస్తోంది. సాయం చేయాలని పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మంతనాలు జరుపుతున్నారు.నేతలతో పాక్ ప్రధాని చర్చలు..తాజాగా ప్రధాని షహబాజ్ షరీఫ్.. ఐక్యరాజ్యసమితి చీఫ్ ఆంటోనియో గుటెర్రస్‌తో మాట్లాడి రెండు దేశాల మధ్య ఘర్షణను తగ్గించాలని కోరారు. ఉద్రిక్తతలు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే, భారత్‌పై ఒత్తిడి తీసుకురావాలని అరేబియా, యూఏఈతో సహా ఇతర గల్ఫ్ దేశాధినేతలతో భేటీ అయ్యారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాయబారి హమర్ ఒబైద్ ఇబ్రహీం అల్ జాబీతో పాక్ ప్రధాని సమావేశమయ్యారు. కువైట్ రాయబారి నాసన్ రెహ్మన్ జాసన్‌ను కూడా పాక్ ప్రధాని కలిసి విజ్ఞప్తి చేశారు.Chinese Ambassador in Pakistan, H.E Jiang Zaidong calls on Prime Minister Muhammad Shehbaz Sharif in Islamabad.May 1, 2025. pic.twitter.com/wmJlR2b0gk— Prime Minister's Office (@PakPMO) May 2, 2025ఈ మేరకు పాక్ పీఎంఓ ఓ ప్రకటనలో.. పాకిస్తాన్‌లోని సౌదీ రాయబారి నవాఫ్ బిన్ సయిద్ అల్ మాలికితో షహబాబ్ సమావేశమైన ఫొటోను విడుదల చేసింది. ఈ సందర్బంగా దక్షిణాసియాలో శాంతి, స్థిరత్వం కోసం పాకిస్తాన్ కృషి చేస్తుందని ప్రధాని పునరుద్ఘాటించారని తెలిపింది. ఇదిలా ఉండగా.. భారత్ దాడుల నేపథ్యంలో పాకిస్తాన్ ఇప్పటికే చైనా, రష్యాలను అభ్యర్థించింది. ఈ దాడిపై నిష్పక్షపాత విచారణకు సహకరిస్తామని పాక్ చెప్పుకొచ్చింది.Ambassador of UAE to Pakistan H.E. Hamad Obaid Ibrahim Salem Al-Zaabi called on Prime Minister Muhammad Shehbaz Sharif.May 2, 2025. pic.twitter.com/c2KGCrKvbB— Prime Minister's Office (@PakPMO) May 2, 2025పాక్‌కు మద్దతిచ్చే దేశాలు ఇవే..ఇక, పాకిస్తాన్‌పై భారత్ దాడులు చేస్తే.. దాయాది కొన్ని దేశాలు మద్దతుగా నిలిచే అవకాశం ఉంది. చైనా, టర్కీ, అజర్ బైజాన్, బంగ్లాదేశ్, కొన్ని ముస్లిం లీగ్ దేశాలు పాక్‌కు అండగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కశ్మీర్ విషయంలో పాకిస్తాన్‌కు టర్కీ సైతం మద్దతు తెలిపింది. ఐక్యరాజ్యసమితిలో పాకిస్తాన్ కు మద్దతుగా పలుమార్లు టర్కీ నిలిచింది. భారత్‌తో వైరం కారణంగా చైనా.. పాక్‌కు అండగా ఉండనుంది. ప్రస్తుతం భారతదేశంలో అంతగా సఖ్యతలేని బంగ్లాదేశ్ కూడా పాక్‌కు మద్దతుగా నిలిచి అవకాశం కనిపిస్తున్నట్లు అంతర్జాతీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్ రాజకీయ సంక్షోభంలో భాగంగా అక్కడ మారిన ప్రభుత్వం భారత్ కు అనుకూలంగా లేదు. కనుక ఈ దాయాది దేశం కూడా మనకు వ్యతిరేకంగా నిలిచి అవకాశం ఉంటుంది. -
మోదీ.. నాకు ఆత్మాహుతి బాంబు ఇవ్వండి.. పాక్‌పై దాడి చేస్తా: కర్ణాటక మంత్రి
బెంగళూరు: పహల్గాం ఘటన నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఉగ్రదాడికి భారత్ ప్రతీకారం తీర్చుకోవాలని దేశ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో కర్ణాటక మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పాకిస్తాన్‌పై యుద్ధం చేసేందుకు తనకొక సూసైడ్ బాంబ్ (Suicide Bomb) ఇవ్వాలన్నారు. తాను ఆ బాంబును పాకిస్తాన్‌పై వేస్తానని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి.కర్ణాటక మంత్రి, కాంగ్రెస్ నాయకుడు బీజడ్ జమీర్ అహ్మద్‌ఖాన్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘పహల్గాం దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. అమాయక ప్రజలపై జరిగిన అమానవీయ చర్య ఇది. పాకిస్తాన్ (Pakistan) ఎప్పటికీ భారత్‌కు శత్రు దేశమే. ఆ దేశంతో మనకు ఎలాంటి సంబంధాలు లేవు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా అంగీకరిస్తే.. ఆ దేశంపై యుద్ధాన్ని ప్రారంభించేందుకు నేను సిద్ధం. ఆత్మాహుతికి నాకొక బాంబు ఇవ్వండి. బాంబ్ ఇస్తే దానిని తీసుకుని పాక్‌పై దాడి చేస్తాను. ఇలాంటి సమయంలో ప్రతీ భారతీయుడు ఐక్యంగా నిలబడాలని, జాతి భద్రతకు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరుతున్నాను’ అంటూ కామెంట్స్ చేశారు. అలాగే, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడేందుకు మనమంతా ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఇక, ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #WATCH | Karnataka Minister BZ Zameer Ahmed Khan says, "...We are Indians, we are Hindustanis. Pakistan never had any relations with us. Pakistan has always been our enemy...If Modi, Amit Shah and the Central government let me, I am ready to go to battle. (02.05.2025) pic.twitter.com/HdYiZcYBIC— ANI (@ANI) May 3, 2025ఇదిలా ఉండగా.. పహల్గాం దాడి ఉద్రిక్తతల నేపథ్యంలో గురువారం నాటి పాకిస్తాన్ సైనిక విన్యాసాలకు భారత సైన్యం ధీటుగా బదులిచ్చింది. నడిరోడ్డుపైనా యుద్ధవిమానాల ల్యాండింగ్, టేకాఫ్ జరిపి వాయుసేన సత్తా చాటింది. అత్యంత అధునాతన శత్రు భీకర రఫేల్‌తో పాటు సుఖోయ్–30, ఎంకేఐ, మిరాజ్–2000, మిగ్–29, జాగ్వార్, సీ–130జే సూపర్ హెర్క్యులస్, ఏఎన్–32 విమానాలతో పాటు ఎంఐ–17 వీ5 హెలికాప్టర్లను కూడా ఈ అధునాతన ఎయిర్ర్‌స్టిప్‌పై ల్యాండింగ్, టేకాఫ్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్ జిల్లాలోని గంగా ఎక్స్‌ప్రెస్‌వే ఈ ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలకు వేదికైంది.📍Shahjahanpur: The Indian Air Force (IAF) is conducting take-off and landing exercises on the Ganga Expressway in Uttar Pradesh — even at night #GangaExpressway #aircraft #AirForce #IndiaPakistan #ind pic.twitter.com/nN8EyzpNQl— Geopolitics news (@rat92553) May 3, 2025పగటి పూటే గాక అవసరమైతే కారుచీకట్లోనూ నిర్భీతిగా యుద్ధవిమానాలను రోడ్లపై కూడా దింపగలమని వాయుసేన నిరూపించింది. 594 కిలోమీటర్ల పొడవైన గంగా ఎక్స్‌ప్రెస్ వేలో జలాలాబాద్ సమీపంలోని పిరూ గ్రామం వద్ద నిర్మించిన 3.5 కిలోమీటర్ల పొడవైన ఎయిర్‌స్టిప్‌పై శుక్రవారం రాత్రి ఎయిర్‌ఫోర్స్ యుద్ధవిమానాలు ఇలా ల్యాండై అలా టేకాఫ్ తీసుకున్నాయి. తద్వారా దేశంలో పగలు, రాత్రి తేడా లేకుండా అన్నివేళలా ఫైటర్జెట్ల ల్యాండింగ్, టేకాఫ్‌కు అనువైన తొలి ఎక్స్‌ప్రెస్‌వే గా ఈ మార్గం నిలిచింది. అందుకు క్యాట్–2 ఇన్స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టమ్ సాంకేతికతను వినియోగించారు. మంచు, వర్షం, పొగమంచు, తక్కువ దృగ్గోచరత వంటి సందర్భాల్లోనూ ల్యాండింగ్, టేకాఫ్ సాధ్యమయ్యేలా ఎక్స్‌ప్రెస్ వేలో ఎత్తయిన, అనువైన ప్రదేశంలోనే స్ట్రిప్‌ను నిర్మించారు. వరదలు, భూకంపం వంటి విపత్తుల వేళ సైన్యాన్ని వెంటనే రంగంలోకి దించడానికీ ఈ స్ట్రిప్ ఉపయోగపడనుంది. అత్యంత తక్కువ ఎత్తులో దూసుకొస్తూ ల్యాండింగ్‌నూ పరీక్షించారు.उत्तर प्रदेश: शाहजहांपुर (Indian Air Force)शाहजहांपुर Ganga Expressway पर भारत वायु सेना की Exercise जारी है।यहाँ राफेल जैसे युद्धक विमानों की भीड़ है। pic.twitter.com/khEHUDrCzD— Shubhangi Pandit (@Babymishra_) May 3, 2025 -
వణుకుతున్న పాకిస్తాన్. భారత్‌ను నిలువరించాలని అరబ్ దేశాలను వేడుకుంటున్న పాకిస్తాన్. తమకు ఉగ్రచరిత్ర ఉందని అంగీకరించిన బిలావల్ భుట్టో
-
వణుకుతున్న దాయాది
ఇస్లామాబాద్/వాషింగ్టన్/శ్రీనగర్/న్యూఢిల్లీ: భార త ‘పహల్గాం ప్రతీకార’ప్రయత్నాలు చూసి పాకిస్తాన్ బెదిరిపోతోంది. ఉద్రిక్తతలను ఎలాగైనా తగ్గించేలా భారత్‌ను ఒప్పించాలంటూ అరబ్ దేశాలను ఆశ్రయించింది. సౌదీ అరేబియా, యూఈఏ, కువైట్ తదితర దేశాలకు పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్ శుక్రవారం ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. పాక్‌లోని ఆ దేశాల రాయబారులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. దక్షిణాసియాలో సుస్థిరతనే కోరుతున్నామంటూ శాంతి వచనాలు వల్లెవేశారు. పహల్గాం దాడితో పాక్‌కు ఏ సంబంధమూ లేదంటూ పాతపాటే పాడారు.పాక్‌లో చైనా రాయబారి జియాంగ్ జైడాంగ్‌తో కూడా షహబాజ్ భేటీ అయ్యారు. ఉగ్రవాదంపై పోరుతో భారత్‌కు తాము పూర్తిస్థాయిలో దన్నుగా నిలుస్తామని అమెరికా పునరుద్ఘాటించింది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీకి తమ పూర్తి మద్దతుందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి టామీ బ్రూస్ స్పష్టం చేశారు. భారత్, పాక్ మధ్య నెలకొన్న పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్టు చెప్పారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈ విషయమై నిర్ణాయక వ్యాఖ్యలు చేశారు. పాక్ భూభాగం నుంచి మారణకాండకు దిగుతున్న ఉగ్రవాదులను వెదికి పట్టుకోవడంలో భారత్‌కు సహకరించాలని దాయాదికి హితవు పలికారు.‘‘ఇరుదేశాల మధ్య పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయి. అవి రెండు అణుదేశాల ప్రాంతీయ యుద్ధంగా మారొద్దన్నదే మా ఉద్దేశం. ఏం జరుగుతుందో చూద్దాం’’అని గురువారం ఫాక్స్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అభిప్రాయపడ్డారు. పహల్గాం దాడి సమయంలో వాన్స్ కుటుంబంతో పాటు భారత్‌లోనే ఉండటం తెలిసిందే. దాయాదుల మధ్య ఉద్రిక్తతలు తగ్గాలని బ్రిటన్ ఆకాంక్షించింది. పహల్గాం దాడిని హౌస్ ఆఫ్ లార్డ్స్ తీవ్రంగా ఖండించినట్టు పేర్కొంది. వాటిని నిరసిస్తూ బ్రిటన్‌లో కొద్ది రోజులుగా శాంతియుత ఆందోళనలు జరుగుతున్న వైనం కూడా సభలో చర్చకు వచ్చినట్టు పేర్కొంది. అదేమీ రహస్యం కాదు: బిలావల్ పాక్ ఉగ్రవాదులకు ఆశ్రయంగా మారడం నిజమేనని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్పర్సన్ బిలావల్ భుట్టో కూడా అంగీకరించారు. మూడు దశాబ్దాలుగా పాక్ ఉగ్రవాదాన్ని పెంచి పోషించిందని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇటీవల అంతర్జాతీయ మీడియా సాక్షిగా అంగీకరించడం తెలిసిందే. దీనిపై స్కై న్యూస్ ఇంటర్వ్యూలో బిలావల్ ఈ మేరకు స్పందించారు. రక్షణ మంత్రి వ్యాఖ్యలతో ఏకీభవిస్తారా అని ప్రశ్నించగా, ‘అది పెద్ద రహస్యమేమీ కాదు. పాక్‌ది ఉగ్రవాద గతమే’’అంటూ పాక్ నిర్వాకాన్ని బాహాటంగా అంగీకరించారు. అయితే దానివల్ల దేశం ఎంతగానో నష్టపోయిందని వాపోయారు.‘‘ఉగ్రవాదం పాక్‌కే కాదు, అంతర్జాతీయ సమాజానికి కూడా పెనుబెడదగా పరిణమించింది. పాక్ దశలవారీగా ఉగ్రవాదానికి మద్దతిస్తూ వచ్చింది. మా సమాజం ఇస్లామీకరణ, సైనికీకరణ దశల గుండా సాగింది. వీటన్నింటివల్లా మేం నష్టపోతూ వచ్చాం. అయితే వాటినుంచి పాఠాలు నేర్చుకున్నాం. సింధూ పరివాహక నదులకు భారత్ నీరు వదలకుంటే రక్తం పారుతుందంటూ బిలావల్ ఇటీవల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. తన ఉద్దేశం అది కాదని ఆయన తాజాగా చెప్పుకొచ్చారు. ‘‘నీటిని ఆపడాన్ని యుద్ధ చర్యగానే పరిగణిస్తామని మా ప్రభుత్వమే చెప్పింది. యుద్ధం జరిగితే పారేది రక్తమేగా. అదే నేనూ చెప్పా’’అన్నారు. మరోవైపు సింధూ జల ఒప్పందం నిలుపుదలను నిరసిస్తూ భారత్‌కు దౌత్య నోటీసులివ్వాలని పాక్ యోచిస్తోంది. ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికల మీదా లేవనెత్తేందుకు సిద్ధమవుతోంది. హాకింగ్‌కు విఫలయత్నాలు పాక్ ప్రేరేపిత హాకర్ గ్రూపులు భారత వెబ్సైట్లపై శుక్రవారం మరోసారి భారీగా సైబర్ దాడులకు దిగాయి. జమ్మూలోని ఆర్మీ స్కూల్స్, రిటైర్డ్ సైనికుల ఆరోగ్య సేవలు తదితరాలకు సంబంధించిన సైట్లను హాక్ చేసేందుకు విఫలయత్నం చేశాయి. సైబర్ గ్రూప్ హోక్స్1337, నేçషనల్ సైబర్ క్రూ పేరిట దాడులు జరిగినట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ‘‘పాక్‌తో పాటు పలు పశ్చిమాసియా దేశాలు, ఇండొనేసియా, మొరాకో తదితర చోట్ల నుంచి ఈ సైబర్ దాడులు జరిగాయి. వాటికి పాల్పడ్డ పలు సంస్థలు ఇస్లామిక్ భావజాలానికి మద్దతు పలుకుతున్నట్టు చెప్పుకున్నాయి. వాటన్నింటినీ సమర్థంగా తిప్పికొట్టాం’’అని తెలిపాయి. పహల్గాం దాడి నుంచీ ఈ తరహా దాడులు విపరీతంగా పెరిగిపోయినట్టు వెల్లడించాయి. ఇదంతా పాక్ హైబ్రిడ్ యుద్ధతంత్రంలో భాగమని అనుమానిస్తున్నారు. ఐదు సెక్ట్టర్లలో కాల్పులుపాక్ వరుసగా ఎనిమిదో రోజు కాల్పుల విరమణకు తూట్లు పొడిచింది. జమ్మూ కశ్మీర్లో ఐదు జిల్లాల వెంబడి నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి గురువారం రాత్రి కూడా కాల్పులకు తెగబడింది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, నౌషేరా, అఖూ్నర్ ప్రాంతాల్లో ఎలాంటి కవ్వింపులూ లేకుండానే పాక్ దళాలు తేలికపాటి ఆయుధాలతో కాల్పులకు దిగినట్టు సైన్యం అధికార ప్రతినిధి వెల్లడించారు. ‘‘తొలుత ఉత్తర కశ్మీర్లో కుప్వారా, బారాముల్లా జిల్లాల్లో మొదలైన కాల్పులు జమ్మూ ప్రాంతంలోని పూంచ్, అఖ్నూర్ సెక్టర్లకు విస్తరించాయి.అనంతరం నౌషేరాలోని సుందర్బనీ, జమ్మూ జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు గుండా పర్గ్వాల్ సెక్టర్లోనూ కాల్పులకు తెగబడ్డాయి. వాటిని భారత సైన్యం దీటుగా తిప్పికొట్టింది’’అని తెలిపారు. ఉద్రిక్తతలు మరింత పెరగవచ్చన్న అంచనాల నేపథ్యంలో జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దు గ్రామాల ప్రజలు సురక్షితంగా తలదాచుకునేందుకు యుద్ధ ప్రాతిపదికన కమ్యూనిటీ, వ్యక్తిగత బంకర్లను సిద్ధం చేసుకుంటున్నారు.కథువా, సాంబా, రాజౌరీ, పూంచ్ జిల్లాల్లో ఇంకా పంటకోతలు జరగాల్సి ఉంది. పాక్‌తో భారత్ 3,323 కి.మీ. మేరకు సరిహద్దును పంచుకుంటోంది. ఇందులో 2,400 కి.మీ. మేరకు అంతర్జాతీయ సరిహద్దు గుజరాత్ నుంచి జమ్మూ దాకా విస్తరించింది. 740 కి.మీ. నియంత్రణ రేఖ, యాక్చ్యువల్ గ్రౌండ్ పొజిషన్ లైన్ (ఏజీపీఎల్)తో పాటు మరో 110 కి.మీ. సియాచిన్ ప్రాంతంలో విస్తరించి ఉంది. -
పాక్‌పై ఫైనాన్షియల్ స్ట్రైక్స్!
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్లో సర్జికల్ స్ట్రైక్స్ చేసి డజన్లకొద్దీ ముష్కరులను అంతమొందించిన భారత ఇప్పుడు పహల్గాం దాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ ఆర్థిక మూలాలపై కోలుకోలేని దెబ్బ కొట్టాలని కంకణం కట్టుకుంది. అందులోభాగంగా విదేశీ నిధులను పాక్ సర్కార్ ఉగ్ర కార్యకలాపాలు, సీమాంతర ఉగ్రవాదం, ఇతర చీకటి పనులను కేటాయిస్తోందని నిరూపించడం ద్వారా విదేశీ సాయం నిలిచిపోయేలా చేయాలని భారత్ యోచిస్తోంది.ఇందుకోసం ఫైనాన్సియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్)పై భారత్ తీవ్ర స్థాయిలో ఒత్తిడిచేయనుంది. ఈ టాస్‌్కఫోర్స్‌కు చెందిన ‘గ్రే’జాబితాలోకి చేరితే ఆయా దేశాలకు అంతర్జాతీయ సాయం, నిధుల మంజూరు, విదేశాల మద్దతు, విదేశీ పెట్టుబడులు రావడం చాలా కష్టమవుతుంది. దీనికితోడు ఇప్పటికే అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ ద్వారా పాకిస్తాన్‌కు రాబోయే వందల కోట్ల విలువైన నిధులను అడ్డుకుని పాక్‌ను ఆర్థిక కష్టాల కడలిలో ముంచాలని మోదీ సర్కార్ తీవ్రంగా శ్రమిస్తోంది. గతంలో పాక్‌పై గ్రే లిస్ట్ కొరడా విదేశీ నిధులను పూర్తిగా దేశాభివృద్ధికి కోసం కేటాయించకుండా అందులో కొంత మొత్తాలను ఉగ్ర సంబంధ కార్యకలాపాలకు వెచ్చించినట్లు పాకిస్తాన్‌పై ఆరోపణలు వచ్చాయి. ఇవి నిజమని తేలడంతో పాక్‌ను 2018 జూన్‌లో ఎఫ్ఏటీఎఫ్ తన గ్రే లిస్ట్‌లో పెట్టింది. దీంతో విదేశీ సాయం అందక పాక్ తీవ్ర ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కొంది. దీంతో బుద్ధి తెచ్చుకున్న పాకిస్తాన్ తన ఉగ్రకార్యకలాపాలకు నిధుల్లో కోత పెట్టింది. పలువురు ఉగ్రవాదులను అరెస్ట్‌చేసింది.దీంతో ఎట్టకేలకు 2022 అక్టోబర్‌లో గ్రే జాబితా నుంచి పాకిస్తాన్‌కు విముక్తి లభించింది. ఇప్పుడు సైతం ఇలాగే పాకిస్తాన్‌ను గ్రే జాబితాలోకి చేర్చేలా ఎఫ్‌ఏటీఎఫ్‌పై మోదీ సర్కార్ ఒత్తిడిని పెంచింది. ఎఫ్ఏటీఎఫ్లో 40 సభ్యదేశాలున్నాయి. వీటిలో భారత్ తన అత్యంత స్నేహశీల దేశాల ద్వారా ఈ పని ముగించాలని చూస్తోంది. ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీ సమావేశాలు ఏటా ఫిబ్రవరి, జూన్, అక్టోబర్‌లో జరుగుతాయి. ఈ జూన్ సెషన్లో ఈ మేరకు మద్దతు కూడగట్టేందుకు మిత్రదేశాలతో భారత్ ఇప్పటికే సంప్రదింపులు మొదలెట్టినట్లు వార్తలొచ్చాయి. ఐఎంఎఫ్పైనా కేంద్రం ఒత్తిడిస్వదేశంలో ధరల పెరుగుదల, నిరుద్యోగం, తగ్గిపోయిన విదేశీ పెట్టుబడులతో సమస్యల సుడిగుండంలో చిక్కుకున్న పాకిస్తాన్ దేశ పాలన కోసం తరచూ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థపై ఆధారపడుతోంది. దీంతో వచ్చే మూడేళ్లలో 7 బిలియన్ డాలర్లు ఇచ్చేందుకు ఐఎంఎఫ్ ఒప్పుకుంది. ఈ నిధులొస్తే పాక్ వాటిని ఉగ్రకార్యకలాపాలకు దుర్వినియోగం చేయనుందని భారత్ ఐఎంఎఫ్ ఎదుట ఆందోళన వ్యక్తంచేయనుంది. భారత వాదన నెగ్గితే ఈ నిధులు ఆగిపోవడమో, తగ్గిపోవడమో జరగొచ్చు. నిధుల విస్తరణపై మే 9వ తేదీన ఐఎంఎఫ్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్, పాక్ ఉన్నతాధికారుల మధ్య తొలి సమీక్ష సమావేశం జరగనుంది.పాకిస్తాన్‌కు నిధుల మంజూరుపై పునరాలోచన చేస్తే మంచిదని ఇతర అంతర్జాతీయ బహుళజాతి సంస్థలు, సంఘాలను సైతం భారత్ కోరబోతోంది. ప్రజాపనుల రుణాలు, సాంకేతిక సహకారానికి సంబంధించి మొత్తంగా 764 పనులకు గాను ఏకంగా 43.7 బిలియన్ డాలర్ల నిధులను పాక్‌కు ఇచ్చేందుకు ఆసియా అభివృద్ధి బ్యాంక్ నిర్ణయించింది. ఇప్పటికే 9.13 బిలియన్ డాలర్ల రుణాలిచ్చింది. నాలుగు నెలల క్రితం ప్రపంచ బ్యాంక్ సైతం పాకిస్తాన్‌కు 20 బిలియన్ డాలర్ల రుణం ఇచ్చేందుకు అంగీకరించింది. -
ఇప్పుడు మనం ఏం చేయాలి?
సిసలైన ఉద్వేగాలు సాటి మనుషులకు అర్థమవుతాయి. ఉద్వేగాలలోని నిజాయితీ ఉద్దేశాలలో ఉండదు. ‘పహల్గామ్’ ఘటన తరువాత ఏర్పడిన ఉద్వేగాలనూ, ఉద్దేశాలనూ కాస్త ముందు వెనుకలుగా వేరు చేసి మనమంతా ఒక్కటిగా శత్రువును ఎదుర్కొందాం అనే సందేశాన్ని ఇవ్వడంలో దేశవాసులు దాదాపు సఫలీకృతమయ్యారనే చెప్పాలి. అయితే అదంత సులువు కాలేదు. ఉద్దేశాలున్నవారు వాట్సప్‌లలో మునివేళ్లను కదిలించినంత వేగంగా ఉద్వేగాలున్నవారు కదిలించలేకపోయారు. అయినప్పటికీ వేగంగా మేలుకొని జవాబు చెప్పడానికి ప్రయత్నించారు. ఇందుకు అల్లాహ్‌కు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే.ఏప్రిల్ 22న కశ్మీర్ పహల్గామ్ (pahalgam) ఉగ్రదాడిలో 26 మంది అమాయక పర్యాటకులు మరణించారన్న వార్త వినగానే ముందు మనిషిగా, తర్వాత ముస్లింగా ఎంతో బాధను, ఆందోళనను అనుభవించాను. దేశంలోని కోట్ల ముస్లింలు ఇటువంటి పాశవిక దాడికి తీవ్రంగా నాలాగే బాధ పడ్డారు. మతం అడిగి ఇలాంటి దాడి చేశారన్న వార్త వారిని వేదనలో, విషాదంలో ముంచెత్తింది. ఈ తీవ్ర ఘటన తాలూకు విషాదాన్ని అనుభవించాలా, లేకుంటే తమకు ఏ సంబంధమూ లేకపోయినా జరిగే విద్వేష ప్రచారానికి కలత పడాలా అనే ఆందోళనలో వారు తల్లడిల్లారు. అయితే ఎవరైతే చావు నోటి వరకూ వెళ్లి వచ్చారో వారే ఈ పరిస్థితిని కుదుట పరచగలిగారు. మానవీయత ఉన్న కశ్మీరీలు తమ ప్రాణాలకు వారి ప్రాణాలను ఎలా అడ్డు పెట్టి కాపాడారో చెప్పిన కథనాలు దేశ ప్రజలకూ, ముఖ్యంగా ముస్లింలకూ ఊరటనిచ్చాయి.కశ్మీర్ (Kashmir) విషయంలో భారత్–పాకిస్తాన్ల మధ్య చాలా కాలంగా సాగుతున్న వైరం లెక్కలేనంత మందిని బలిదీసుకున్నా గత దాడులన్నీ సైన్యంపై జరిగితే, ఈసారి పర్యాటకులపై హిందూ మతం పేరిట జరిగింది. ఈ దాడి వెనుక ఉగ్రవాదుల ప్రధాన ఉద్దేశం దేశాన్ని సంక్షోభంలోకి నెట్టడం, కశ్మీర్‌ను ప్రపంచ దృష్టికి తీసుకురావడం. ఈ ఉగ్రచర్యకు పాల్పడినవారు, వారికి ఆర్థిక సాయం అందించినవారు, స్పాన్సర్లు.. పహల్గామ్ అమాయకుల ప్రాణాలను బలిదీసుకోవడంలో పాత్ర పోషించినవారే. వారందరినీ ఈ దాడికి జవాబుదారీగా చేసి, న్యాయస్థానం ఎదుట నిలబెట్టాలి.మతం అడగడం సిగ్గుచేటుప్రపంచంలోని ఏ మతగ్రంథం కూడా ప్రజలను చంపమని చెప్పలేదు. ఈ ఉగ్రదాడిలో బాధితుడి మతాన్ని అడగడం, అతను హిందువా, ముస్లిమా అని గుర్తించడానికి కల్మా పఠించమనడం సిగ్గుచేటు. శాంతిని కోరే భారతీయ ముస్లింలు ఇలాంటి నీచత్వాన్ని ఏ మాత్రం హర్షించరు. నిజమైన మానవుడంటే ప్రాణాలను కాపాడేవాడే కానీ ప్రాణాలను తీసేవాడు కాదు. ఖురాన్ లోని సూరహ్ అల్–మాయిదా వచనం 5:32 ‘ఒక అమాయకుడిని చంపేవాడు మొత్తం మానవాళిని చంపినట్లే’ అని చెబుతుంది. ఈ సూరహ్ కరుణ, సానుభూతి, బలహీనుల రక్షణను ప్రోత్సహిస్తుంది. తాను ముస్లిం అని చెప్పుకొనే వ్యక్తి ఈ భూమిపై ఏ మానవుడినీ చంపడు.భారతదేశ ప్రజలు కోరుకునేది మత విద్వేషాలు కాదు. భారతదేశం ప్రపంచంలోని అన్ని దేశాల శరణార్థులను స్వీకరించిందే తప్ప, ఈ దేశం నుండి ఏ వ్యక్తిని ఇతర ప్రాంతాలకు శరణార్థిగా పంపలేదు. అదే ఈ దేశానికున్న ఘనత. ఇది గొప్ప ఆధ్యాత్మిక ప్రేమగల దేశం. ప్రపంచంలోని ఇతర దేశాల్లో నివసిస్తున్న ముస్లింలతో పోలిస్తే భారతదేశంలో ముస్లింలకు అత్యున్నత గౌరవం, రక్షణ దొరుకుతున్నాయి. ఉగ్రవాదంపై పోరాటంలో ఇక్కడి ముస్లింల పాత్ర ఇప్పుడు కీలకంగా మారింది.ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏ మతాన్నీ కలవరపెట్టకుండా, ద్వేషించకుండా నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించవచ్చు. రాజకీయ నాయకుల ప్రసంగాలు, మీడియా వ్యాఖ్యలను ఒక తటస్థ స్థితికి తేవాలి. సమస్యకు పరిష్కారం వెతకాలి. అన్ని మతాల ఆధ్యాత్మిక నాయకులు, సాధువులు, ముస్లిం, హిందూ మతాధికారులు, అన్ని మత పాఠశాలలు, ఇతర విద్యాసంస్థల అధిపతులు, ఉపాధ్యాయులు ఇందులో భాగం కావాలి. అన్ని మతాలను ప్రేమించడం ద్వారా ప్రజల్లో ఐక్యత, ఉమ్మడి విలువలను తీసుకురావాలి. ప్రభుత్వాన్నో, ఫలానా రాజకీయ పార్టీనో విమర్శించి చేతులు దులుపుకోకుండా ఉగ్రవాదాన్ని బలంగా ఎదుర్కోవడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవడమే ఇప్పుడు మన ముందున్న బాధ్యత.దేశం ఇలాంటి విపత్కర పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో మీడియా దేశంలోని భిన్నవర్గాలను బలోపేతం చేయాలి. అంతేకానీ రాజకీయ పార్టీలు, మతాల పేరుతో వర్గాలను విభజించకూడదు. ముస్లింల వల్లే తాము బతికి ఉన్నామని చెప్పిన బాధితుల కుటుంబాల మాటలను మీడియా కూడా ప్లే చేయాలి. దురదృష్టవశాత్తు కొన్ని మీడియా సంస్థలు ఇలా చేయడం లేదు. పౌర హక్కులు, మానవ హక్కుల కార్యకర్తల్లాగే ఇప్పుడు మతస్వేచ్ఛ కార్యకర్తలు అవసరం. మత విద్వేషాన్ని ఆపేందుకు వారి తోడ్పాటు కావాలి.చదవండి: ఉగ్రవాదంపై పోరులో ఏకమైన దేశంభారత్–పాక్ అణుశక్తిని కలిగి ఉన్న దేశాలు. ఒకసారి యుద్ధం మొదలైందంటే ఇది ఎక్కడ ముగుస్తుందో తెలియదు. అందుకే యుద్ధకాంక్షను ఆపి, శాంతి వైపు చర్చలు జరపాలి. స్నేహపూర్వక దేశాలతో కూర్చుని ఈ సమస్యను పరిష్కరించాలి. యుద్ధమనేది అంతిమ పరిష్కారం. ఉగ్రదాడిలో అమాయకులు తమ ప్రాణాలు కోల్పోయారు. ఆ అమరవీరులకు వందనం చేద్దాం. భారతం చెప్పిందే మన సందేశం. కౌరవులు, పాండవుల మధ్య ఏ ఫిర్యాదులైనా ఉండొచ్చు... బయటి శత్రువుకు మేము నూటా ఐదుగురం అన్నాడు ధర్మరాజు. బయట శత్రువు కన్నెత్తి చూస్తే ఈ దేశంలోని అన్ని మతాల వారు ఐక్యమై సింహాల్లా గర్జించగలరని చాటడమే ఇప్పుడు కావలసింది. జై భారత్. జై హింద్.- జహారా బేగం సామాజిక కార్యకర్త, యూఎస్ఏ