
రాంచీ: పహల్గాం ఉగ్రదాడిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖర్జున్ ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు.
జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో కాంగ్రెస్ పార్టీ సంవిధాన్ బచావో ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు.
పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రానికి మూడురోజుల ముందే సమాచారం అందింది. నిఘూవర్గాల హెచ్చరికలతో ప్రధాని మోదీ కశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారు. పర్యాటకులకు మాత్రం భద్రత కల్పించలేకపోయారు’అని ఆరోపించారు.
Watch: Congress President Shri @kharge addresses the Samvidhan Bachao Rally in Ranchi, Jharkhand. https://t.co/wRfrg2XD99
— Congress (@INCIndia) May 6, 2025