breaking news
Jammu Kashmir
-
రుద్ర హెలికాప్టర్ని నడిపిన తొలి మహిళా పైలట్..!
సైన్యంలో చేరడం అంటే అంత ఆషామాషి కాదు. తీరా అందులో జాయిన్ అయ్యాక అక్కడ కఠిన శిక్షణను తట్టుకుని పూర్తి స్థాయిలో సక్సెస్ అవ్వడం మాటలు కాదు . అందులోనూ ఏవియేషన్ రంగంలో ఓ సాయుధ హెలికాప్టర్‌కి పైలట్‌గా వ్యవహరించడం అంటే..ఎన్ని సవాళ్లు ఎదుర్కొనలో చెప్పాల్సిన పనిలేదు. ఇంతవరకు అంతటి కష్టతరసాధ్యమైన బాధ్యతలను పురుషులే నిర్వర్తించారు. తొలిసారి అలాంటి విధుల్లో ఒక మహిళ రావడం ఇదే తొలిసారి. అలాంటి ఘనతను అందుకు "శర్మ జీ కి బేటి". గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆమె స్టోరీ ప్రేరణగా నిలిచింది. ఎవరామె..? ఈ రంగాన్ని ఎలా ఎంచుకుందంటే..రుద్ర హెలికాప్టర్‌ను నడిపిన భారత సైన్యం తొలి మహిళా పైలట్‌గా కెప్టెన్ హంస్జా శర్మ చరిత్ర సృష్టించారు. శర్మ కెరీర్ జర్నీలో తిరస్కరణలు, శస్త్ర చికిత్సలు ఉన్నాయి. జమ్మూలో పుట్టి పెరిగిన ఆమె నాసిక్‌లోని కంబాట్ ఆర్మీ ఏవియేషన్ శిక్షణా పాఠశాల (CAATS)లో తన శిక్షణా కోర్సులో అగ్రస్థానంలో నిలిచింది. ఉత్తమ పోరాట విమాన చోదకుడికి ఇచ్చే సిల్వర్ చిరుత ట్రోఫీని అందుకున్న తొలి అధికారిణి ఆమె. ఇది భారత ఆర్మీ ఏవియేషన్‌కు తొలి రికార్డు కూడా. ఈ ఏడాది రాజస్థాన్ ఆర్మీ డే పరేడ్‌లో 251 ఆర్మీ ఏవియేషన్ స్క్వాడ్రన్‌కు నాయకత్వం వహించడమే గాక హెలినా క్షిపణి వ్యవస్థను ప్రదర్శించింది.జమ్మూ నుంచి ఆర్మీ ఏవియేషన్ వరకు..మార్చి 9, 1998న జమ్మూలో జన్మించిన కెప్టెన్ శర్మ బర్నాయ్‌లోని సెయింట్ జేవియర్స్ కాన్వెంట్ స్కూల్లో తన పాఠశాల విద్యను పూర్తి చేసింది. ఆమె జమ్మూలోని పరేడ్ కళాశాల నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. తరువాత భారత సైన్యంలోకి ఎంపికయ్యే ముందు జమ్మూ విశ్వవిద్యాలయంలో జువాలజీ విభాగంలో చేరింది. అక్కడ నుంచి భారత సైన్యంలోకి చేరడానికి ఆమె పలు సవాళ్లు ఎదుర్కొంది. మొదటగా తాత్కలిక తిరస్కరణలను ఫేస్చేసింది. ఆ క్షణంతో తన కెరీర్ ముగిపోయిందనుకుంది. కానీ ఆమె అచంచలమైన సేవ, పట్టుదల మనస్తత్వం తిరిగి తన ఒంటిమీదకు యూనిఫాం వచ్చేలా చేశాయి. సింగిల్ మదర్ సంరక్షణలో..సీనియర్ జర్నలిస్ట్, సింగిల్ మదర్ రష్మి శర్మ తన పిల్లలను పెంచడానికి అన్నింటిని అమ్మేశానన్నారు. ప్రస్తుతం తన కూతురు హంసజ తనను ఉద్యోగం మానేయమని అంటుంది. అయితే తాను జర్నలిస్ట్‌ని కాబట్టి పనిచేస్తే..తనకు చేతనైనంత ఇతరులకు సాయం చేయగులుగుతానని అంటోందామె. తన కూతురు కూడా ఇతర సైనికురాలి లాంటిదేనని అన్నారు. వాళ్లు దేశం కోసం త్యాగం చేస్తే..తాను అలాంటి త్యాగాలే చేసిన తల్లినని ఆమె గర్వంగా చెప్పారు. తాను శత్రువుల ముందు ధైర్యంగా నిలబడి తగిన జవాబు ఇవ్వడానికి సాహసించే ప్రతిసైనికుడిని చూసి గర్విస్తున్నాని అన్నారామె. నిజానికి ఏఎల్హెచ్లో ప్రయాణించడం అంటే బహిరంగ ఆకాశంలో ప్రయాణించడం లాంటిదని, చాలా భయంగా ఉంటుందన్నారు. రాబోయే రోజుల్లో హంసజకు మరిన్ని బాధ్యతలు, సవాళ్లు ఎదరవ్వుతాయని..వాటన్నింటి ఆమె విజయవంతంగా ఎదుర్కొగలదని నమ్మకంగా చెప్పారు హంసజ తల్లి రష్మి శర్మ.(చదవండి: దేవకి అమ్మ 40 ఏళ్ల కృషి..'తపోవనం'!) -
కశ్మీర్లో విరుచుకుపడ్డ మంచు గడ్డలు.. వీడియో వైరల్
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో భారీగా మంచు కురుస్తోంది. ఏకధాటిగా కురుస్తున్న మంచు, శీతల గాలుల కారణంగా స్థానికులు గజగజా వణికిపోతున్నారు. బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. మరోవైపు.. కశ్మీర్‌లోని సోన్మార్గ్లో మంచు గడ్డలు విరిచిపడ్డాయి. దీంతో, అక్కడున్న టూరిస్ట్ రిసార్ట్ దెబ్బతిన్నది. దీనికి సంబంధించిన వీడియో సోషల మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. జమ్ముకశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన సోన్మార్గ్లో మంగళవారం రాత్రి తీవ్రస్థాయిలో హిమపాతం సంభవించింది. మంచు గడ్డలు, పెళ్లలు (అవలాంచీ) ఏర్పడ్డాయి. రాత్రి 10:12 గంటల సమయంలో సెంట్రల్ గందర్బల్ జిల్లాలోని రిసార్టుల మీద అవలాంచీ విరుచుకుపడ్డింది. దీనికి సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఉప్పెనలా అవలాంచీ భవనాలను కప్పేయడం ఇందులో కనిపిస్తోంది.అయితే, ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు. రిసార్టుల్లో ఉండేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రాంతంలో ప్రమాదకర అవలాంచీ సంభవించే అవకాశం ఉందని సోమవారం నాడే హెచ్చరికలు జారీ అయ్యాయి. 24 గంటలుగా సోన్‌మార్గ్‌తో పాటు కశ్మీర్ లోయలోని అనేక ప్రాంతాల్లో మోస్తరు నుండి భారీ హిమపాతం సంభవించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మరోవైపు.. హిమాలయాల పశ్చిమ ప్రాంతం మీదుగా వీస్తున్న గాలుల ప్రభావం వల్ల చలి అమాంతంగా పెరిగినట్లు భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. శ్రీనగర్, గుల్మార్గ్, పహల్గామ్, అనంతనాగ్, కార్గిల్, సోన్మార్గ్, కుప్వారా, పుల్వామా, బేతాబ్ వ్యాలీ, పట్నిటాప్, పూంఛ్, కిష్తవార్ ప్రాంతాల్లో రోడ్ల మీద రెండు నుంచి మూడు అడుగుల ఎత్తులో మంచు పేరుకుపోతోంది.Dapaan there's been an avalanche in Sonamarg. Praying for everyone's safety. 🙏🏻 pic.twitter.com/aIqALHSq21— Basharat Rehan🇵🇸 (@BasharatRehan1) January 28, 2026శ్రీనగర్‌లో భారీగా మంచు కురుస్తున్న కారణంగా శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 50 విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఈ మేరకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా(AAI) ఓ ప్రకటన విడుదల చేసింది. విమానాశ్రయంలో వాతావరణం ప్రతికూలంగా ఉందని, మంచు కురుస్తూనే ఉందని ఏఏఐ పేర్కొంది. దీంతో శ్రీనగర్‌కు రావాల్సిన 25.. అక్కడి నుంచి బయలుదేరాల్సిన మరో 25 విమానాలను రద్దు చేసినట్లు తెలిపింది. విమానాల రద్దు కారణంగా అక్కడికి వెళ్లిన అనేక మంది పర్యాటకులు శ్రీనగర్‌లోనే చిక్కుకుపోయారు. -
కశ్మీర్లో జైషే టాప్ కమాండర్ హతం
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవ్యతిరేక ఆపరేషన్లలో భద్రతా బలగాలు కీలక విజయం సాధించాయి. కథువా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో జైషే మహమ్మద్‌కు చెందిన కరుడుగట్టిన విదేశీ ఉగ్రవాదిని హతమార్చాయి. బిల్లావర్‌లోని పర్హెటర్ ప్రాంతంలో ఆర్మీ, సీఆర్పీఎఫ్ల సంయుక్త ఆపరేషన్‌లో జేషే కమాండర్ ఉస్మాన్ అలియాస్ అబూ మవియాను మట్టుబెట్టినట్లు జమ్మూ ఐజీ భీమ్ సేన్ టుటి తెలిపారు. మారుమూల గ్రామంలోని ఓ ఇంటిపై బలగాలు దాడి చేయగా లోపల దాక్కున్న ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ సందర్భంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఉస్మాన్ హతమయ్యాయని చెప్పారు. ఘటనలో అత్యాధునిక ఎం4 ఆటోమేటిక్ రైఫిల్‌తోపాటు పెద్ద మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామగ్రి కూడా పట్టుబడ్డాయన్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు చేపట్టిన కార్డన్ సెర్చ్ సందర్భంగా ఓ విదేశీ ఉగ్రవాదిని చంపేసినట్లు ఆర్మీ ఎక్స్‌లో తెలిపింది. ఆ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోందని కూడా వెల్లడించింది. ఈ నెల 7, 13వ తేదీల్లో కహోగ్, నజోట్ అటవీ ప్రాంతాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో ఉస్మాన్ తప్పించుకున్నాడని పేర్కొంది. పాకిస్తాన్‌కు చెందిన ఇతడు రెండేళ్ల క్రితం దొంగచాటుగా సరిహద్దులు దాటి కశ్మీర్లోకి ప్రవేశించాడు. ఉథంపూర్– కథువా ప్రాంతంలో కార్యకలాపాలు సాగిస్తున్న జేషే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా మారాడు. గణతంత్ర దినోత్సవం సమీపిస్తున్న నేపథ్యంలో బలగాలు ఆదివారం ఆపరేషన్ త్రాషి–ఇ పేరుతో కూంబింగ్ చేపట్టాయి. ఆదివారం ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక పారాట్రూపర్ నేలకొరగ్గా, ఏడుగురు జవాన్లకు గాయాలయ్యాయి. నాలుగు రోజులపాటు ఎలాంటి పరిణామాలు చోటుచేసుకోలేదు. గురువారం ఎదురుకాల్పుల సమయంలో ఉస్మాన్ మరికొందరు దట్టమైన అటవీ ప్రాంతాన్ని అవకాశంగా మల్చుకుని పరారయ్యారు. -
పరేడ్‌లో దళనాయకి
26 ఏళ్ల సిమ్రన్ బాలా 77వ భారత గణతంత్ర ఉత్సవాలకు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు. జమ్ము కాశ్మీర్ అసిస్టెంట్ కమాండెంట్‌గా పని చేస్తున్న సిమ్రన్ బాలాఆల్ మేల్ సీఆర్పీఎఫ్ దళానికి జనవరి 26న జరిగే పరేడ్‌లోనాయకత్వం వహించనున్నారు. సిమ్రన్ బాలా స్ఫూర్తిబాట....త్రివిధ దళాలలో నారీ శక్తి తేజం దేశానికి చాటడానికి గత కొన్నేళ్లుగా రిపబ్లిక్ డే వేడుకలు వేదిక అవుతున్నాయి. ఈసారి కూడా నారీ శక్తికి అలాంటి గౌరవమే దక్కనుంది. జనవరి 26న జరగనున్న 77వ గణతంత్ర దినోత్సవంలో 26 ఏళ్ల సిమ్రన్ బాలా ఈసారి చరిత్ర సృష్టించనున్నారు. జమ్ముకూ శ్రీనగర్‌కూ సరిగ్గా 150 కిలోమీటర్ల దూరంలో ఉండే రాజౌరీ పట్టణంలో సి.ఆర్.పి.ఎఫ్. అసిస్టెంట్ కమాండెంట్ అయిన సిమ్రన్ బాలా కర్తవ్య పథ్‌లో జరిగే గ్రాండ్ పరేడ్‌లో ‘సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్’ (సి.ఆర్.పి.ఎఫ్.) పురుష కవాతు బృందానికి నాయకత్వం వహించనున్నారు. ఈ ఘనత పొందిన మొదటి మహిళా అధికారిణి బాలా. సరిహద్దులో పుట్టి పెరిగి..రాజౌరి జిల్లాలోని నౌషెరాలో జన్మించిన బాలా బాల్యమంతా ఘర్షణలను, అలజడులనే చూశారు. సరిహద్దుల్లో కాల్పులు, నిరంతర భద్రతా సవాళ్లను చూస్తూ పెరిగారు. సైనికుల క్రమశిక్షణ, విధి నిర్వహణ, సేవ... తమ రోజువారీ జీవితంలో భాగమైన వాతావరణం చూస్తుండటంతో దేశానికి సేవ చేయాలనే లోతైన సంకల్పం చిన్ననాడే ఆమెలో నాటుకుంది. దాంతో అదే లక్ష్యంగా ప్రయత్నించి సి.ఆర్.పి.ఎఫ్.లో అధికారిగా చేరారు. సి.ఆర్.పి.ఎఫ్. మొదటి మహిళా అధికారి ఆమే కావడం విశేషం.దేశస్థాయిలో 82వ ర్యాంకు సాధించి...రాజనీతి శాస్త్రంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన సిమ్రన్ యూపీఎస్సీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ పరీక్షకు సిద్ధమయ్యారు. 2023 మేలో మొదటి ప్రయత్నంలోనే దేశస్థాయిలో 82వ ర్యాంకును సాధించి సి.ఆర్.పి.ఎఫ్.లో చేరారు. గురుగ్రామ్‌లో అకాడమీలో కఠినమైన శిక్షణ పొందాక ఛత్తీస్‌గఢ్‌లోని ‘బస్తారియా బెటాలియన్’లో మొదటి ఆపరేషనల్ పోస్టింగ్‌లో చేరి నక్సల్ వ్యతిరేక కార్యకలాపాలకు బాధ్యత వహించే యూనిట్లో పని చేశారు. ప్రస్తుతం రాజౌరిలో అసిస్టెంట్ కమాండెంట్‌గా ఉన్నారు.గొప్ప అనుభూతిగ్రాండ్ పరేడ్‌లో సి.ఆర్.పి.ఎఫ్. పురుషుల కవాతు బృందానికి మహిళా అధికారిగా నాయకత్వం వహించే అవకాశం సిమ్రాన్ కు సులభంగా ఏం దక్కలేదు. పరేడ్ రిహార్సల్స్‌లో అత్యుత్తమ ప్రదర్శన, శిక్షణ, ఫీల్డ్ పోస్టింగ్‌లలో విశిష్ట రికార్డు సొంతం కావడం వల్లే ఆమెకు ఈ అవకాశం దక్కింది. ఇంటెన్సివ్ పరేడ్ రిహార్సల్స్ సమయంలో ఆమె విశ్వాసం, డ్రిల్, కమాండ్ సామర్థ్యాలలో కచ్చితత్వం ఇతరుల కంటే మెరుగ్గా ఉండేలా చేసిందని పైఅధికారులు ప్రశంసించారు. తనకు ఈ బాధ్యత ఇచ్చిన మరుక్షణం నుంచి తాను పొందుతున్న అనుభూతి మాటల్లో వర్ణించలేనిదని సిమ్రాన్ బాలా అన్నారు.బాలికలకు స్ఫూర్తిగా..సిమ్రన్ బాలా పుట్టిపెరిగిన రాజౌరి, పూంచ్ జిల్లాల్లో ప్రస్తుతం హర్షాతిరేకాలు వెల్లివిరుస్తున్నాయి. ఆమె గురించి అందరూ గొప్పగా చెప్పుకుంటున్నారు. నేటి బాలికలకు ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని, రక్షణ రంగంలో కెరీర్లను ఎంచుకోవడానికి మహిళలకు ఆమె మార్గదర్శిగా నిలిచారని ఊరి పెద్దలు మెచ్చుకుంటున్నారు. ‘సిమ్రాన్ లాగే మేము కూడా యూనిఫాం ధరించి భారతమాతకు సేవ చేయాలనుకుంటున్నాము’ అని ఆమె స్వస్థలానికి చెందిన యువతులు అంటుండటం ఆమె చేసిన కృషికి అద్దం పడుతోంది. -
జమ్ము కశ్మీర్లో భూకంపం
భూకంపంతో జమ్ము కశ్మీర్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. సోమవారం ఉదయం భూ ప్రకంపనలు లఢాఖ్‌లోని లేహ్‌తో పాటు కశ్మీర్ ప్రజలను వణికించాయి. ఇళ్లలో, కార్యాలయాల్లో ఉన్నవారు బయటకు పరుగులు తీశారు. ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం సంభవించలేదని సమాచారం. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం, ఈ భూకంపం ఉదయం 11:51 గంటలకు సంభవించింది. లేహ్ ప్రాంతంలో భూకంపం కేంద్రం నమోదు కాగా.. 171 కిలోమీటర్ల లోతులో భూకంపం పుట్టింది. రిక్టర్ స్కేల్‌పై 5.7 తీవ్రత నమోదైంది. ఈ ప్రకంపనలు జమ్ము కశ్మీర్ రీజియన్ అంతటా ప్రభావం చూపాయి. అప్రమత్తమైన అధికారులు జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు సూచించారు. Earthquake tremors felt in Jammu and Kashmir. https://t.co/JvDujditvy— AsiaWarZone (@AsiaWarZone) January 19, 2026అత్యంత సున్నితమైన హిమాలయ ప్రాంతం భూకంపాలకు నెలవు కూడా. అయితే ఆదివారం.. అఫ్ఘనిస్తాన్‌లో 4.1 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఇవాల్టి ప్రకంపనలు తాత్కాలికంగానే ఉన్నప్పటికీ, ఆఫ్టర్‌షాక్స్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
అయోధ్య రామాలయం వద్ద భద్రతా వైఫల్యం
లక్నో: అయోధ్య రామమందిరం వద్ద భద్రతా వైఫల్యం బయటపడింది. కశ్మీర్‌కు చెందిన ఓ వ్యక్తి ఆలయంలోకి చొరబడి నమాజ్ చేసే ప్రయత్నం చేశాడు. అప్రమత్తమైన సిబ్బంది అతన్ని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయోధ్య పోలీసుల అదుపులో ఉన్న సదరు వ్యక్తిని.. ప్రస్తుతం నిఘా వర్గాలు అతన్ని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం జరిగిన కాస్త ఆలస్యంగా వెలుగులోకి రాగా.. భద్రతా నిర్వహణపై భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయోధ్య పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. జమ్ము కశ్మీర్ సోఫియాన్ జిల్లాకు చెందిన అహ్మద్ షేక్(55) అజ్మీర్ వెళ్తున్నట్లు ఇంట్లో చెప్పి బయల్దేరాడు. అయితే అనూహ్యంగా శుక్రవారం సాయంత్రం అయోధ్య రామ మందిర కాంప్లెక్స్‌లోకి ప్రవేశించాడు. ఆపై సీతమ్మ మండపం దగ్గర నమాజ్ చేసేందుకు ప్రయత్నించాడు. కాంప్లెక్స్ దగ్గర కాపలాగా ఉండే సిబ్బంది అది గమనించి అతన్ని నిలువరించారు. ఆ సమయంలో అతను నినాదాలు చేసినట్లు తెలుస్తోంది. ఆపై పోలీసులకు అప్పగించగా.. విచారణ జరుపుతున్నారు. సున్నితమైన అంశం కావడంతో.. అతన్ని నిఘా ఏజెన్సీలకు అప్పగించారు. లోపలికి వెళ్లే టైంలో అతని బ్యాగులో కిస్మిస్, జీడిపప్పు మాత్రమే కనిపించాయని తనిఖీ సిబ్బంది చెబుతున్నారు. అయితే అతను అజ్మీర్ అని చెప్పి అయోధ్యకు ఎందుకు వచ్చాడు? ఎలా వచ్చాడు? తదితర అంశాలపై దృష్టిసారించాయి. రామ మందిర ట్రస్ట్ నిర్వాహకులు ఈ ఘటనపై స్పందించేందుకు నిరాకరించారు. అయోధ్య రామాలయం దేశంలో అత్యాధునిక భద్రతా వ్యవస్థ కలిగిన ఆలయాల్లో ఒకటి. అలాంటి చోట ఈ ఘటన జరగడం చర్చనీయాంశంగా మారే అవకాశం లేకపోలేదు. వచ్చే వారం అయోధ్య రామమందిర ప్రాంగణంలో జరగబోయే మకర సంక్రాంతి వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ లోపు ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది. -
చెలరేగిన ‘టీమిండియా’ స్టార్లు.. 63 పరుగులకే ఆలౌట్!
విజయ్ హజారే ట్రోఫీ 2025-26లో భాగంగా జమ్మూ కశ్మీర్‌తో మ్యాచ్‌లో బెంగాల్ పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. ప్రత్యర్థి జట్టును 63 పరుగులకే ఆలౌట్ చేశారు. దేశీ వన్డే టోర్నీ గ్రూప్-బిలో భాగంగా జమ్మూ కశ్మీర్‌తో బుధవారం నాటి మ్యాచ్‌లో టాస్ గెలిచిన బెంగాల్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.శుభారంభం అందించిన షమీకెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ నమ్మకాన్ని నిలబెడుతూ బెంగాల్ బౌలర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. జమ్మూ కశ్మీర్ టాపార్డర్‌లో ఓపెనర్ కమ్రాన్ ఇక్బాల్ (0)ను డకౌట్ చేసి.. టీమిండియా వెటరన్ పేసర్ మొహమ్మద్ షమీ శుభారంభం అందించాడు.షమీకి తోడుగా టీమిండియా స్టార్లు ఆకాశ్ దీప్, ముకేశ్ కుమార్ నిప్పులు చెరుగుతూ జమ్మూ కశ్మీర్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. వన్‌డౌన్‌లో వచ్చిన మురుగన్ అశ్విన్ (0)ను ఆకాశ్ దీప్ వికెట్ల ముందు దొరకబుచ్చుకోగా.. ఓపెనర్ శుభం ఖజూరియా (12)ను ముకేశ్ వెనక్కి పంపాడు.చెలరేగిన ముకేశ్, ఆకాశ్ఇక యావర్ హసన్ (1) రూపంలో షమీ తన రెండో వికెట్ తీయగా.. కెప్టెన్ పారస్ డోగ్రా (19) సహా అబ్దుల్ సమద్ (8), యుధ్వీర్ సింగ్ చరక్ (7) వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మరోవైపు.. ముకేశ్ కుమార్.. రిధమ్ శర్మ (7), అబిద్ ముస్తాక్ (2), అకిబ్ నబీ దార్ (0)లను పెవిలియన్‌కు పంపాడు.మొత్తంగా షమీ రెండు వికెట్లు తీయగా.. ఆకాశ్ దీప్, ముకేశ్ కుమార్ చెరో నాలుగు వికెట్లతో చెలరేగి.. జమ్మూ కశ్మీర్ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించారు. ఫలితంగా 20.4 ఓవర్లలో కేవలం 63 పరుగులు చేసి జమ్మూ కశ్మీర్ ఆలౌట్ అయింది. కాగా బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న షమీ, ముకేశ్ కుమార్ చాన్నాళ్లుగా టీమిండియాకు దూరం కాగా.. ఆకాశ్ దీప్ ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా జూలైలో చివరగా భారత జట్టుకు ఆడాడు. చదవండి: బీసీసీఐ యూటర్న్!.. షమీకి గోల్డెన్ ఛాన్స్! -
చలించిన ఉత్తరాది
రాంచీ/న్యూఢిల్లీ/రాజౌరీ/జమ్మూ: ఉత్తర భారత దేశంలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగి పోయింది. అటు జమ్మూ కశ్మీర్‌లోని ఎత్తయిన ప్రాంతాల్లో హిమపాతం కారణంగా కీలక రహదారులు మూతపడగా, ఇటు జార్ఖండ్‌లో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో వాతావరణ శాఖ ’ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. మరోవైపు, దట్టమైన పొగమంచు ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లీలో విమాన సర్వీసులు స్తంభించి, ప్రయా ణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.జార్ఖండ్‌లో ‘ఆరెంజ్, ఎల్లో అలర్ట్’జార్ఖండ్ రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువకు పడిపోవడంతో.. భారత వాతావరణ శాఖ ఆదివారం ’ఎల్లో అలర్ట్’ ప్రకటించింది. దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. గర్వా, పలాము, లాతేహార్, చత్రా, హజారీబాగ్ జిల్లాల్లో సోమవారం ఉదయం 8.30 గంటల వరకు దట్టమైన పొగమంచు కురిసే అవకాశం ఉండటంతో వాతావరణ శాఖ ’ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. గర్వా, పలాము, చత్రా, లాతేహార్, లోహర్దగా జిల్లాలకు చలి తీవ్రత దృష్ట్యా ఎల్లో అలర్ట్ జారీ చేసింది.విమానాలకు తీవ్ర ఆటంకందేశ రాజధాని ఢిల్లీని దట్టమైన పొగమంచు కమ్మేయడంతో విమాన ప్రయాణాలు అస్తవ్యస్తమయ్యాయి. ఆదివారం మంచు కారణంగా దృశ్యమానత లోపించడంతో ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విమాన సర్వీసులు నిలిచిపోయాయి. దాదాపు 105కు పైగా విమానాలు రద్దయ్యాయి. ఫైట్‌రాడార్24 వెబ్సైట్ వివరాల ప్రకారం.. సుమారు 450 విమానాలు ఆలస్యంగా నడిచాయి. సగటున ప్రతి విమానం 36 నిమిషాల పాటు ఆలస్యంగా నడిచింది. కాగా, విమానాశ్రయ కార్యకలాపాలు సాఫీగానే సాగుతున్నాయని ’డైల్’ సంస్థ ఎక్స్ వేదికగా ఆదివారం సాయంత్రం ప్రకటించింది. సాధారణంగా ఈ విమానాశ్రయం రోజుకు దాదాపు 1,300 విమానాల రాకపోకలను నిర్వహిస్తుంది. కొన్ని రోజులుగా ఢిల్లీతో పాటు ఉత్తరాదిలోని ఇతర ప్రాంతాల్లో దట్టమైన పొగమంచు కారణంగా విమాన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుండటం తెలిసిందే.కశ్మీర్‌ను కలిపే మార్గాల్లో నిలిచిన రాకపోకలుజమ్మూ కశ్మీర్‌లోని ఎత్తయిన ప్రాంతాల్లో మోస్తరు హిమపాతం కారణంగా కశ్మీర్ లోయను కలిపే ప్రత్యామ్నాయ మార్గాలైన ’మొఘల్ రోడ్డు’, ’సింథాన్ టాప్’ రహదా రులపై ఆదివారం ట్రాఫిక్‌ను నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, లోయను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించే ఏకైక కీలక మార్గమైన 270 కిలోమీటర్ల జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారిపై రాకపోకలు యధావిధిగా కొనసాగుతున్నాయి. సుమారు ఒకటిన్నర నెలల సుదీర్ఘ పొడి వాతావరణం తర్వాత కురిసిన జల్లుల మధ్య ఇక్కడ ట్రాఫిక్ సాఫీగానే సాగుతోంది.ముగ్గురు వ్యాపారుల్ని రక్షించిన పోలీసులుపీర్ కీ గలీ ప్రాంతంలో చిక్కుకుపోయిన ముగ్గురు టీ వ్యాపారులను పోలీసులు, బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సిబ్బంది సంయుక్త ఆపరేషన్ చేపట్టి రక్షించారు. తమను రక్షించాలంటూ వారు సోషల్ మీడియాలో పోస్టు చేసిన వీడియో ద్వారా విజ్ఞప్తి చేయడంతో అధికారులు వెంటనే స్పందించారు. ‘ప్రతికూల వాతావరణం, తక్కువ దృశ్యమానత ఉన్నప్పటికీ, పోలీస్ బృందం వేగంగా స్పందించి సమన్వయంతో వారిని సురక్షిత ప్రాంతానికి తరలించింది. ప్రస్తుతం వారు క్షేమంగా ఉన్నారు’.. అని పోలీస్ ప్రతినిధి తెలిపారు. -
ఐరాసలో పాక్ పరువు తీసిన భారత్
పాకిస్థాన్ మరోసారి తన కుటిల బుద్ధిని చాటుకుంది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి సమావేశంలో జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రస్తావించింది. అయితే.. దీనికి భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్ అందుకు గట్టిగానే బదులిచ్చారు. పాక్ దృష్టి అంతా భారత్‌కు ముప్పు తలపెట్టడంపైనే ఉందని.. మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను జైలుకు పంపి.. అతడికి విరోధి అయిన అసీమ్ మునీర్‌కు సర్వాధికారాలు ఇచ్చిన ఘనత ఆ దేశానికే దక్కుతుందని చురకలంటించారు.ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో లీడర్షిప్ ఫర్ పీస్ అనే అంశంపై జరిగిన ఓపెన్ డిబేట్లో పాకిస్థాన్ మరోసారి జమ్మూకశ్మీర్ అంశాన్ని లేవనెత్తింది. అయితే ఇది ద్వైపాక్షిక సమస్య అయినప్పటికీ, పాకిస్థాన్ ప్రతి అంతర్జాతీయ వేదికను భారత్‌పై దుష్ప్రచారం చేయడానికి వినియోగిస్తోందని భారత ప్రతినిధి పర్వతనేని హరీశ్ తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్, లడఖ్ భారతదేశానికి విడదీయరాని భాగాలు. వాటిపై పాకిస్థాన్‌కి ఎలాంటి హక్కు లేదు. పాకిస్థాన్ అంతర్జాతీయ ఉగ్రవాద కేంద్రంగా మారి.. గత దశాబ్దాలుగా భారత్‌పై ఉగ్రదాడులు జరిపింది. పాక్ ఉగ్రవాదాన్ని పోషిస్తుందనడానికి.. 2025 ఏప్రిల్‌లో పహల్గాం ప్రాంతంలో జరిగిన దాడి ఉదాహరణ అని అన్నారాయన. అంతటితో ఆగకుండా.. పాకిస్థాన్‌లోని రాజకీయ పరిస్థితులను కూడా ఆయన ఎత్తిచూపారు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను జైలుకు పంపి, అతనికి విరోధి అయిన ఆర్మీ చీఫ్ అసీమ్ మునీర్ చేతుల్లో సర్వాధికారాలు పెట్టింది. ఇది ఆ దేశపు ప్రజాస్వామ్య విలువలను గౌరవించే ప్రత్యేక పద్ధతి అని హరీశ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఇది ఆ దేశంలో ప్రజాస్వామ్యం ఎంత బలహీనంగా ఉందో, సైన్యం ఎలా రాజకీయ వ్యవస్థను నియంత్రిస్తుందో ప్రపంచానికి చూపించిందని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యల సమయంలో పాక్ ప్రతినిధులు కాస్త అసౌకర్యానికి గురైనట్లు కనిపించింది. VIDEO | New York: Permanent Representative of India to the United Nations, Parvathaneni Harish (@AmbHarishP), delivered India's statement at the Open Debate on ‘Leadership for Peace’ in the UN Security Council."India had entered into the Indus Waters Treaty, 65 years ago, in… pic.twitter.com/hMRWESj0xQ— Press Trust of India (@PTI_News) December 16, 2025 -
లష్కరే ఉగ్రవాదులే పహల్గాం దాడి సూత్రధారులు
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్ లోయలో అమాయక పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడి ఘటనలో లష్కరే తోయిబా(ఎల్ఈటీ) సభ్యులను సూత్రధారులుగా పేర్కొంటూ జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) తొలి చార్జ్‌షీట్ సోమవారం దాఖలుచేసింది. దారుణోదంతం జరిగిన దాదాపు 8 నెలలకు పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపాక బలమైన సాక్ష్యాధారాలతో సమగ్రస్థాయిలో ఎన్ఐఏ 1,597 పేజీల చార్జ్‌షీట్‌ను ప్రత్యేక న్యాయస్థానంలో సమరి్పంచింది. పాక్‌లో ఉంటున్న ఉగ్ర హ్యాండర్ హబీబుల్లాహ్ మాలిక్ అలియాస్ సాజిద్ జాట్‌ను ప్రధాన కుట్రదారుగా ఎన్ఐఏ పేర్కొంది. పహల్గాం దాడికి వ్యూహరచన, ఉగ్రవాదులను పాక్ ఆక్రమిత కశ్మీర్ మీదుగా భారత్‌లోకి పంపించడం, వారి రహస్య బస వంటివన్నీ జాట్ ప్లాన్ ప్రకారమే జరిగాయని చార్జ్‌షీట్‌లో ఎన్ఐఏ వెల్లడించింది. మొత్తంగా రెండు ఉగ్ర సంస్థలు, ఆరుగురు ఉగ్రవాదులను చార్జ్‌షీట్‌లో ఎన్ఐఏ పేర్కొంది. పహల్గాం పరిధిలోని ప్రఖ్యాత బైసారన్ లోయలో ఏప్రిల్ 22న దాడికి పాకిస్తాన్‌లోని లష్కరే తోయిబా, దాని అనుబంధ ‘ది రెసిస్టెంట్ ఫ్రంట్’ఉగ్రవాదులు ఏ విధంగా వ్యూహం పన్నారు? దాడికుట్రను ఏ విధంగా అమలుపరిచారు? సూత్రధారులు ఎవరు? ఎవరెవరు దాడి చేశారు? దాడిలో పాక్ పాత్ర వంటి సమగ్ర అంశాలను అభియోగపత్రంలో ఎన్ఐఏ సవివరంగా ప్రస్తావించింది. ముగ్గురు పాకిస్తానీ ఉగ్రవాదులు సులేమాన్ షా, హబీబ్ తాహిర్ అకా జిబ్రాన్, హమ్జా అఫ్గానీల పేర్లనూ చార్జ్‌షీట్‌లో చేర్చారు. ఆపరేషన్ మహదేవ్ పేరిట చేపట్టిన గాలింపు చర్యలవేళ భద్రతాబలగాలు ఈ ముగ్గురిని అంతమొందించడం తెల్సిందే. ఉగ్రవాదులకు స్థానిక బస, ఆహారం, రవాణా సదుపాయాలు కల్పిచిన పర్వేజ్ అహ్మద్, బషీర్ అహ్మద్‌ల పేర్లనూ చార్జ్‌షీట్‌లో చేర్చారు. భారతీయ న్యాయసంహిత, ఆయుధాల చట్టం, చట్టవ్యతిరేక కార్యకలాపాల(నిరోధక)చట్టాల్లోని పలు సెక్షన్ల ప్రకారం 2 ఉగ్రసంస్థలు, పలువురు ఉగ్రవాదుల చార్జ్‌షీట్ వేశారు. ఏప్రిల్ 22నాటి అమానవీయ దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. -
ఆసియాలోనే పొడవైన స్కై డ్రాగ్ లిఫ్ట్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లోని ప్రముఖ పర్యా టక ప్రాంతం గుల్మార్గ్లో ఆసియాలోనే అత్యంత పొడవైన స్కై డ్రాగ్ లిఫ్ట్ ఏర్పాటైంది. దీనిని శనివారం సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రారంభించారు. స్కైయింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా పేరున్న గుల్మార్గ్లో దీనివల్ల స్కైయింగ్ మౌలికవసతులు మరింతగా మెరుగయ్యాయని సీఎం చెప్పారు. అంతర్జాతీయ వింటర్ స్పోర్ట్స్ మ్యాప్‌లో గుల్మార్గ్ కూడా చేరినట్లయిందని చెప్పారు. బారాముల్లా జిల్లా కొంగ్డొరి వద్ద రూ.3.65 కోట్ల ఖర్చుతో ఏర్పాటు చేసిన ఈ స్కై డ్రాగ్ లిఫ్టు పొడవు 726 మీటర్లు. పైన వేలాడుతున్న కదిలే బార్‌ను పట్టుకుని బోర్డుపై నిలబడిన వ్యక్తిని ఇది ఎత్తయిన ప్రదేశంపైకి లాక్కెళుతుందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం ఒమర్ అబ్దుల్లా గుల్మార్గ్లోని అఫ్ఫర్వాత్లో ఏర్పాటైన ప్రపంచంలోనే ఎత్తయిన రివాల్వింగ్ మల్టీపర్సస్ హాల్‌ను కూడా ప్రారంభించారు. గుల్మార్గ్, చుట్టుపక్కల ప్రాంతాల్లో రూ.17 కోట్లతో నెలకొల్పిన పలు పర్యాటక ప్రాజెక్టులను ప్రారంభించారు. అదేవిధంగా, వింటర్ ట్రెయినింగ్ వసతులను మెరుగుపరిచే లక్ష్యంతో ఇంటిగ్రేటెడ్ స్కైయింగ్ ట్రెయినింగ్ అడ్వంచర్ టూరిజమ్ సెంటర్‌ను, ఇంటిగ్రేటెడ్ స్కై ట్రెయినింగ్ కోర్సులను కూడా ఆయన ప్రారంభించారు. జమ్మూకశ్మీర్ పర్యాటక రంగంలో గుల్మార్గ్కు ప్రముఖ స్థానం ఉందని సీఎం ఒమర్ చెప్పారు. పూర్తిస్థాయిలో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అ త్యాధునిక, అత్యంత నాణ్యమైన మౌలిక వసతుల కల్పనకు నిరంతరం పెట్టుబడుల అవసరముందని తెలిపారు. దీనివల్ల ఏడాదంతా పర్యాటక రంగ అవకాశాలుండటంతోపాటు స్థానిక యువతకు ఉపాధి లభిస్తుందని చెప్పారు. -
పైసలేవి మేడం?
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు విచిత్రమైన సన్నివేశం ఎదురైంది. శనివారం జరిగిన హిందుస్తాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ ఇందుకు వేదికైంది. అందులో నిర్మల మాట్లాడుతూ జమ్మూ కశ్మీర్ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఎంతగానో కృషి చేస్తున్నారని ప్రశంసించారు. ‘కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాక అక్కడ ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. కానీ జమ్మూ కశ్మీర్‌కు అతి కీలకమైన పర్యాటకం ’బయటి’ పరిస్థితుల వల్ల పూర్తిగా పడకేసింది‘ అని అన్నారు. తర్వాత అదే సదస్సులో ఒమర్ మాట్లాడుతూ, అసలు జమ్మూ కశ్మీర్లో డబ్బులు ఎక్కడున్నాయి మేడమ్ అంటూ నిర్మలను ప్రశ్నించారు. కశ్మీరం ఇప్పుడు మీ కాసులకు చెప్పలేనంతగా కటకటలాడుతోందని ఆవేదన వెలిబుచ్చారు. తమ ప్రాంత ప్రయోజన కోసం కేంద్రంతో సఖ్యంగా ఉంటే తప్పేమిటని విపక్షాలను, తన విమర్శకులను ప్రశ్నించారు. అందుకోసం పాలక బీజేపీతో జట్టు కట్టాల్సి అవసరం ఏమీ లేదని స్పష్టం చేశారు. -
పీఓకేతో విదేశీ వాణిజ్యం కాదు.. అంతరాష్ట్రమే: హైకోర్టు
శ్రీనగర్: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే)లో వాణిజ్యం విషయమై జమ్ముకశ్మీర్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎల్ఓసీ భారత్‌లో భాగమే కాబట్టి నియంత్రణ రేఖ ద్వారా విభజించిన కశ్మీర్‌లోని రెండు ప్రాంతాల మధ్య వాణిజ్యాన్ని దిగుమతి-ఎగుమతి కాకుండా అంతర్-రాష్ట్ర వాణిజ్యంగా పరిగణిస్తామని హైకోర్టు స్పష్టం చేసింది. కాగా, ఫిబ్రవరి 14, 2019న జరిగిన పుల్వామా కారు బాంబు దాడిలో 40 మంది పారామిలిటరీ సిబ్బంది మరణించిన తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య ఘర్షణల కారణంగా ఎల్ఓసీలో భారత్ వాణిజ్యాన్ని నిలిపివేసింది. 2017లో జీఎస్టీ అమలు ప్రారంభమైనప్పటి నుండి 2019లో వాణిజ్యం నిలిపివేసే వరకు ఎల్ఓసీ గుండా జరిగిన వాణిజ్యంలో ఇన్వర్డ్, అవుట్‌వర్డ్ సరఫరాల కోసం, శ్రీనగర్‌లోని సీజీఎస్టీ సూపరింటెండెంట్ కేంద్ర వస్తువులు, సేవల పన్ను చట్టం 2017 కింద తమకు జారీ చేసిన షోకాజ్ నోటీసులను పిటిషనర్లు సవాలు చేశారు.దీంతో, జమ్ముకశ్మీర్ హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్బంగా జస్టిస్ సంజీవ్ కుమార్, జస్టిస్ సంజయ్ పరిహార్ ధర్మాసనం..‘ప్రస్తుతం పాకిస్తాన్ వాస్తవ నియంత్రణలో ఉన్న ప్రాంతం జమ్ముకశ్మీర్‌లో భాగమే. అందువల్ల, ప్రస్తుత కేసులో, సరఫరాదారుల స్థానం, వస్తువుల సరఫరా స్థలం అప్పటి జమ్ము కశ్మీర్‌లోనే ఉన్నాయి. అందువల్ల, పన్ను కాలంలో పిటిషనర్లు ప్రభావితం చేసిన క్రాస్-ఎల్ఓసీ వాణిజ్యం అంతరాష్ట్ర వాణిజ్యం తప్ప మరొకటి కాదు. రాష్ట్రంలోని రెండు ప్రాంతాల మధ్య జరిగే క్రాస్-ఎల్ఓసీ వాణిజ్యం అంతర్గత వాణిజ్యం మాత్రమే. ఇది వస్తువుల దిగుమతి లేదా ఎగుమతి కాదు’ అని స్ఫష్టం చేసింది.2008లో భారత్, పాకిస్తాన్ మధ్య కశ్మీర్‌లోని ఉరి, జమ్మూలోని పూంచ్ పాయింట్ల ద్వారా క్రాస్-ఎల్ఓసీ వాణిజ్యం ప్రారంభమైనప్పుడు వాణిజ్యాన్ని విలువ ఆధారిత పన్నులు 2005 ద్వారా నిర్వహించారు. ఈ చట్టం వాణిజ్యాన్ని సున్నా-పన్ను వాణిజ్యంగా మార్చింది. ఇది కరెన్సీ మార్పిడి లేకుండా వస్తు మార్పిడి ప్రాతిపదికన జరిగింది. 2017లో జీఎస్టీ అమలులోకి వచ్చినపుడు ఇది ఈ వాణిజ్యానికి పన్ను మినహాయింపును అందించలేదు. అయితే, పిటిషనర్లు క్రాస్-ఎల్ఓసీ వాణిజ్యాన్ని జీరో రేటెడ్ అమ్మకంగా పరిగణించడం కొనసాగించారు. తమ రిటర్న్‌లో వారి క్రాస్-ఎల్ఓసీ లావాదేవీలను సూచించలేదు. అమ్మకపు పన్ను చెల్లించలేదు. దీంతో వారికి షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పిటిషనర్లు కోర్టులో సవాలు చేశారు. -
ఢిల్లీ దాడులు.. ఫరూక్ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తండ్రి, మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో మళ్లీ ఉగ్రదాడులు జరుగుతున్న నేపథ్యంలో మరో ఆపరేషన్ సింధూర్ జరిగే అవకాశం ఉంటుందేమోనని అన్నారు. ఇదే సమయంలో ఇటీవల ఢిల్లీ బాంబు దాడిపై స్పందిస్తూ.. ఆ వైద్యులు ఈ మార్గాన్ని ఎందుకు ఎంచుకోవాల్సి వచ్చింది?. దీనికి కారణం ఏమిటి? అని ప్రశ్నించారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.ఇటీవల జరిగిన ఢిల్లీ బాంబు పేలుడు ఘటన, ఫరీదాబాద్‌లో ఉగ్ర సంబంధాలు ఉన్న వైద్యులను అరెస్ట్ చేసిన వ్యవహారంపై మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా తాజాగా స్పందించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో దాడి కోసం వైద్యులు ఆ మార్గాన్ని ఎందుకు ఎంచుకున్నారు?. కారణం ఏమిటి? అనే ప్రశ్నలను బాధ్యులను అడగాలి. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలి. అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. ఉగ్రదాడుల నేపథ్యంలో దేశంలో మరో ఆపరేషన్ సిందూర్ వంటి కార్యక్రమం జరగకూడదని ఆశిస్తున్నాను.ఆపరేషన్ సిందూర్ వల్ల ఏమీ రాలేదు. మనవాళ్లు 18 మంది మరణించారు. రెండు దేశాలు (భారత్, పాకిస్తాన్) తమ సంబంధాలను మెరుగుపరుచుకోవాలని తాను ఆశిస్తున్నాను. అదొక్కటే ఏకైక మార్గమని ఆయన పేర్కొన్నారు. స్నేహితులను మార్చవచ్చు, కానీ పొరుగువారిని మార్చలేమంటూ మాజీ ప్రధాని వాజ్‌పేయి చెప్పిన మాటలను తాను పునరావృతం చేయాలనుకుంటున్నానని పేర్కొన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఆయన వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్‌తో స్నేహమేంటి? అని ప్రశ్నలు సంధిస్తున్నారు.మరోవైపు.. శ్రీనగర్ పోలీస్ స్టేషన్లో పేలుడు ఘటనపై ఫరూక్ అబ్దుల్లా స్పందిస్తూ.. అధికారులు పేలుడు పదార్థాలను సరిగా నిర్వహించలేదు. ఇది మనం చేసుకున్న తప్పు. పేలుడు పదార్థాల గురించి అవగాహన ఉన్నవారు వాటిని ఎలా నిర్వహించాలో అధికారులతో మాట్లాడి ఉండాల్సింది. అలా చేయకుండా వారే స్వయంగా నిర్వహించడానికి ప్రయత్నించారు అని విమర్శించారు. జరిగిన నష్టాన్ని అందరూ చూశారు. ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారని ఆయన విచారం వ్యక్తం చేశారు. అక్కడ ఇళ్లకు చాలా నష్టం జరిగిందన్నారు. -
పేలుడు ఘటనపై ఊహాగానాలు వద్దు: జమ్ము కశ్మీర్ డీజీపీ
సాక్షి, ఢిల్లీ: జమ్ము కశ్మీర్‌లోని నౌగం పోలీసు స్టేషన్ వద్ద జరిగిన పేలుడు ఘటనపై ఎలాంటి ఊహాగానాలు వద్దు అంటూ డీజీపీ నలిన్ ప్రభాత్ చెప్పుకొచ్చారు. ఈ ఘటన దురదృష్టకరం అని వ్యాఖ్యానించారు. ఈ ప్రమాద ఘటనలో తొమ్మిది మంది చనిపోయినట్టు ధృవీకరించారు. దర్యాప్తు కొనసాగుతోందన్నారు.జమ్ముకశ్మీర్ డీజీపీ నలిన్ ప్రభాత్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ..‘నౌగాం పోలీస్ స్టేషన్ ఓపెన్ ఏరియాలో పేలుడు పదార్థాలు ఉంచాం. ప్రొసీజర్ ప్రకారం ఫోరెన్సిక్ నిపుణులకు అప్పగించాం. గత రెండు రోజుల నుంచి ప్రొసీజర్ కొనసాగుతోంది. శాంపిల్ ప్రాసెసింగ్ చాలా జాగ్రత్తగా నిర్వహించారు. పేలుడు పదార్థాలకు సున్నితమైన గుణం ఉంది. అయినప్పటికీ దురదృష్టవశాత్తు రాత్రి 11:20 గంటలకు ప్రమాదం జరిగింది. దీనిపై ఎలాంటి ఊహాగానాలు వద్దు. ఇదొక దురదృష్టకర ఘటన. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయారు. ముగ్గురు ఎఫ్ఎస్ఎల్ నిపుణులు మృతిచెందారు. 27 మంది పోలీసులు గాయపడ్డారు. పేలుడు కారణంగా పోలీసు స్టేషన్ చుట్టుపక్కల ఇల్లు దెబ్బతిన్నాయి. ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నాము’ అని చెప్పుకొచ్చారు. DGP J&K addresses the media at PCR Kashmir with recent events.@JmuKmrPolice pic.twitter.com/zFmCA0uJ9k— newspointJ&K (@NewspointjK) November 15, 2025 -
భారీ ఉగ్రకుట్ర భగ్నం
శ్రీనగర్/ఫరీదాబాద్: దేశంలో భారీ మారణ హోమం సృష్టించేందుకు పన్నాగం పన్నిన ఒక ముష్కరమూక గుట్టుమట్లను మూడు రాష్ట్రాల పోలీసు బృందం విజయవంతంగా ఛేదించింది. గత పక్షం రోజులుగా జమ్మూకశ్మీర్, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లో కొనసాగుతున్న ముమ్మర సోదాలు, దాడుల్లో ఏకంగా 2,913 కేజీల పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఏకే–56 రైఫిల్, ఏకే క్రిన్కోవ్ పిస్టల్, ఒక చైనీస్ స్టార్ పిస్టల్, ఇటలీ తయారీ బెరెట్టా పిస్టల్, ఒక సబ్‌మెషీన్ గన్, బుల్లెట్లు, మందుగుండుతోపాటు పేలుడు సంబంధ ముడి సరుకులు, రసాయనాలు, మండే ధాతు వులు, ఎలక్ట్రానిక్ సర్క్యూట్లు, బ్యాటరీలు, వైర్లు, రిమోట్ కంట్రోల్స్, టైమర్లు, వాకీటాకీ, మెటల్ షీట్లను పోలీసులు స్వాధీనంచేసుకున్నారు. నేరమయ డాక్యుమెంట్లతోపాటు ఐఈడీ వంటి పేలుడుపదార్థాల తయారీ విధాన పత్రాలను పోలీసులు పట్టుకెళ్లారు. ఇటీవలికాలంలో ఇంత మొత్తంలో పేలుడు పదార్థాలను కశ్మీర్, హరియాణా, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర పోలీసుల సంయుక్త బృందం స్వాధీనం చేసుకోవడం ఇదే తొలిసారి. జైషే మొహమ్మద్, అన్సార్ ఘజ్వాత్–ఉల్–హింద్ ఉగ్రసంస్థలతో సంబంధాలున్న ముగ్గురు వైద్యులుసహా మొత్తం ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్‌చేశారు. వీళ్లలో ఒక మహిళా డాక్టర్ సైతం ఉండటం గమనార్హం. వీళ్లకు సంబంధించిన నివాసాలు, అద్దె ఇళ్లు, స్థలాల్లో సోదాల తర్వాత భారీ ఎత్తున పేలుడుపదార్థాల జాడను పోలీసులు కనుగొన్నారు. 350 కేజీల పేలుడు పదార్థం, అసాల్ట్ రైఫిల్, హ్యాండ్‌గన్ జాడను ఆదివారమే కనిపెట్టగా సోమవారం 2,563 కేజీల పేలుడు పదార్థాలను పట్టుకున్నారు. జమ్మూకశ్మీర్‌తోపాటు హరియాణాలోని ఫరీదాబాద్, ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లలో జరిగిన విస్తృతస్థాయి దాడుల్లో వీళ్లందరినీ అరెస్ట్‌చేశారు. అరెస్టయిన ఎనిమిది మందిలో ఏడుగురు కశ్మీరీలే కావడం గమనార్హం. అరిఫ్ నిసార్ దార్ అలియాస్ సాహిల్, యాసిర్ ఉల్ అష్రఫ్, మఖ్సూద్ అహ్మద్ దార్ అలియాస్ షాహీద్(నౌగమ్), మౌల్వీ ఇర్ఫాన్ అహ్మద్( షోపియాన్), జమీర్ అహ్మద్ అహంగీర్ అలియాస్ ముత్లాషా(వకురా), డాక్టర్ ముజామిల్ అహ్మద్ ఘనీ అలియాస్ ముసేబ్(పుల్వామా), డాక్టర్ ఆదిల్(కుల్గామ్)లతోపాటు లక్నోకు చెందిన వైద్యురాలు షాహీన్‌ను పోలీసులు అరెస్ట్‌చేశారు. అత్యంత గౌరవప్రద వైద్యవృత్తిలోని నిపుణులు, విద్యార్థులను ఉగ్రవాదంలోకి దింపి ముష్కరులు వైట్‌కాలర్ ఉగ్రనెట్‌వర్క్‌ను సృష్టించగా దాని గుట్టుమట్లను విజయవంతంగా ఛేదించామని సోమవారం జమ్మూకశ్మీర్ పోలీసు విభాగం ప్రకటించింది. పోస్టర్లతో మొదలై.. అరెస్ట్‌ల దాకా..కశ్మీర్‌కు చెందిన ఒక డాక్టర్ అరెస్ట్‌తో ఈ మొత్తం నెట్వర్క్ అంశం వెలుగులోకి వచ్చింది. కుల్గాంలోని వాన్‌పురాకు చెందిన డాక్టర్ ఆదిల్ అహ్మద్ రాటర్ భారత భద్రతాబలగాలను బెదిరిస్తూ శ్రీనగర్, బాన్‌పొరా నౌగామ్సహా పలుచోట్ల అక్టోబర్ 19న పోస్టర్లు అంటించాడు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా ఇతడిని గుర్తించి పోలీసులు నవంబర్ ఏడో తేదీన అరెస్ట్‌చేశారు. అతడిని విచారించగా కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లోని ప్రభుత్వ వైద్యకళాశాలలో ఆదిల్‌కు చెందిన లాకర్‌ను తెరవగా అందులో ఏకే–47 రైఫిల్ లభించింది. మరింతగా విచారించగా ముజామిల్ ఘనీ షకీల్ అనే మరోవైద్యుడు సైతం ఈ ఉగ్రకుట్రలో భాగస్వామి అని తేలింది. తర్వాత అతడినీ అరెస్ట్‌చేశారు. షకీల్ ఇచ్చిన సమాచారంతో హరియాణాలోని ఫరీదాబాద్‌లో మూడేళ్లుగా అద్దె కడుతున్న ఒక లాడ్జ్‌లోని గదిలో పోలీసు బృందం ముమ్మర తనిఖీలుచేసి 8 పెద్ద, 4 చిన్న సూట్ కేసులు, ఒక బకెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిల్లో ఏకంగా 2,563 కేజీల ఐఈడీ పేలుడుపదార్థాలున్నాయి. దీనిని అమ్మోనియం నైట్రేట్, పొటాషియం నైట్రేట్, సల్ఫర్‌గా భావిస్తున్నారు. వాస్తవానికి షకీల్ కశ్మీర్‌లోని పుల్వామాలోని కోలీవాసి. ప్రస్తుతం ఇతను హరియాణాలోని ఆల్–ఫలాహ్ మెడికల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో సీనియర్ డాక్టర్‌గా పనిచేస్తున్నాడు.ఢిల్లీలో మతవిద్వేషాలు రెచ్చగొట్టడమే మా లక్ష్యంఢిల్లీ–జాతీయ రాజధాని ప్రాంతం(ఎన్సీఆర్) లో మత కల్లోలాలు, విధ్వంసం సృష్టించడమే లక్ష్యంగా దాడులతో తెగబడాలని పాకిస్తాన్, కశ్మీర్‌లోని హ్యాండ్లర్ల నుంచి ఆదేశాలు వచ్చాయని అరెస్టయిన షకీల్, ఆదిల్ విచారణలో బయటపెట్టారు. అయితే ఏఏ లక్ష్యాలను ఎంచుకోవాలని సూచించారో వాళ్లకు ఇంకా ఆదేశాలు రాలేదు. ‘‘ ఢిల్లీ–ఎన్సీఆర్ ప్రాంతంలో వైద్యులను ఉగ్రకోణంలో ఎవరూ అనుమానించబోరు. అందుకే మమ్మల్నే ఈ పనికి ఎంచుకున్నారు. లక్ష్యాలను నిర్దేశించేదాకా వేచి ఉండాలని మాకు ఆదేశాలు అందాయి. ఈ ఉగ్రమాడ్యూల్కు పథకరచన పాకిస్తాన్లో జరిగింది. ఆదేశాలు మాత్రం కశ్మీర్ హ్యాండ్లర్ల నుంచే వస్తాయి. మేం గతంలో కశ్మీర్లో డాక్టర్లుగా పనిచేసిన కాలంలో 2018–2021 భద్రతా బలగాలతో పోరాడి గాయపడిన ఉగ్రవాదులకు చికిత్స చేశాం’’అని షకీల్, ఆదిల్ పోలీసు విచారణలో వెల్లడించారు. -
Delhi: 2,900 కిలోల పేలుడు పదార్థాలు స్వాధీనం!
వారం వ్యవధిలో.. అదీ నాలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలతో నలుగురు డాక్టర్లు అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ క్రమంలో వీళ్ల వద్ద నుంచి 2,900 కిలోల పేలుడు పదార్థాలు, రైఫిళ్లు, పిస్టల్స్, విషపదార్థాలు (రిసిన్, అమ్మోనియం నైట్రేట్) స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ పరిణామం చోటు చేసుకున్న గంటల వ్యవధిలోనే ఢిల్లీలో భారీ పేలుడు సంభవించడం గమనార్హం. డాక్టర్ల అరెస్టుతో బయటపడిన అంతర్జాతీయ ఉగ్ర మాడ్యూల్ వెలుగు చూసింది. ఢిల్లీ ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీలో అధ్యాపకుడు డా. ముజమ్మిల్ షకీల్, జమ్ము కశ్మీర్‌కు చెందిన డాక్టర్ అదీల్ అహ్మద్ రాథర్, గుజరాత్లో డాక్టర్ అహ్మద్ మొహియుద్దీన్ సయ్యద్, ఉత్తర ప్రదేశ్ సహారన్పూర్లో ఓ మహిళా డాక్టర్‌ను అరెస్ట్ అయిన వాళ్లలో ఉన్నారు. జమ్ము కశ్మీర్, ఫరీదాబాద్ పోలీసు సంయుక్తంగా ఈ ఆపరేషన్‌లో ఈ నలుగురు పట్టుబడ్డారు. డాక్టర్లను ఎవరూ అనుమానించరనే ఉద్దేశంతో వాళ్లు ఉగ్ర సంస్థలకు టచ్‌లో ఉంటూ.. దాడులకు ప్రణాళికలు రచించినట్లు నిర్ధారణ అయ్యింది.వీళ్లు జైష్-ఎ-మొహమ్మద్, అన్సార్ ఘజ్వతుల్ హింద్ వంటి నిషేధిత ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నట్లు తేలింది. ఇంటర్నేషనల్ హ్యాండ్లర్లు వీళ్లను ప్రభావితం చేశారని స్పష్టమవుతోంది. అంతేకాదు.. వీళ్లలో ఇద్దరు 2018-2021 మధ్య కాలంలో కశ్మీర్లో గాయపడిన ఉగ్రవాదులకు చికిత్స అందించినట్లు తేలింది. దీంతో.. ఇంటెలిజెన్స్ విభాగాలు ఈ మాడ్యూల్‌ను మరింత లోతుగా పరిశీలిస్తున్నాయి. ఢిల్లీ ఎర్రకోట పేలుడు ఉగ్రదాడిగా అనుమానాలు వ్యక్తం అవుతున్న క్రమంలో.. వీళ్లు పట్టుబడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.వైట్ కాలర్ టెర్రరిజం.. ఇలా ప్రొఫెనల్ వృతుల్లో ఉంటూ ఉగ్రవాదం వైపు మళ్లడమే వైట్ కాలర్ టెర్రరిజం. మేధావులు, విద్యావంతులు, ఉగ్రవాదానికి మద్దతు ఇవ్వడం లేదంటే.. ఆ చర్యలకు పరోక్షంగా సహకరించడం చేస్తుంటారు. జైష్-ఎ-మొహమ్మద్, ఇండియన్ ముజాహిదీన్, అన్సార్ ఘజ్వతుల్ హింద్ వంటి సంస్థలు ఈ మద్దతుతో లబ్ధి పొందుతున్నాయి. అలా దీని మూలాలు భారత్‌లోనూ గత కొన్ని దశాబ్దాలుగా అభివృద్ధి చెందుతున్నాయి. 1990 తర్వాత ఇది గణనీయంగా పెరిగింది. టెక్నాలజీ, గ్లోబలైజేషన్.. విద్యావంతుల మధ్య ధోరణి మార్పుల కారణంగా ఇది పెరిగిపోతోంది. సైబర్ టెర్రరిజం, ఫైనాన్షియల్ మద్దతు, బయో టెర్రరిజం వంటి ఆధునిక రూపాలను సంతరించుకుంటోంది. -
ఇదో విచిత్రమైన ప్రమాదం.. ఎప్పుడైనా చూశారా?
ప్రమాదాలు.. ఈ మధ్యకాలంలో తరచూ నెట్టింట చర్చకు దారి తీస్తున్నాయి. విమాన, ఘోర రోడ్డు ప్రమాదాలు, బస్సులు కాలిపోవడాలు.. జనాల వెన్నుల్లో వణుకులు పుట్టిస్తున్నాయి. తాజాగా.. జమ్ము కశ్మీర్లో ఓ విచిత్రమైన ప్రమాదం చోటు చేసుకుంది. అయితే అదృష్టవశాత్తూ ఎవరికీ ఏం కాలేదు. జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ సమీపంలో శనివారం ఉదయం రైలు పైకి గద్ద దూసుకొచ్చింది. ఇంజిన్ అద్దాన్ని బద్దలు కొట్టుకుని లోపలికి వచ్చేసింది. ఈ ఘటనలో అద్దాల ముక్కలు గుచ్చకుని లోకో పైలట్ స్వల్పంగా గాయపడ్డాడు. బారాముల్లా–బనిహాల్ ప్యాసింజర్ ట్రైన్ బీజ్బెహారా -అనంత్‌నాగ్ మధ్య ప్రయాణిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో లోకో పైలట్ శ్రీ విషాల్ గాయపడ్డారు. దీంతో అనంత్‌నాగ్ రైల్వే స్టేషన్లో ఆయనకు ప్రాథమిక చికిత్స అందించారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. రైలును క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం తిరిగి ప్రయాణానికి అనుమతించారు. ఈ ఘటనలో ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని అధికారికంగా ప్రకటించారు. అనంత్‌నాగ్ ప్రాంతం పక్షుల సంచారానికి ప్రసిద్ధి. ఈ క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. సాధారణంగా విమానాలను పక్షులు ఢీ కొట్టే ఘటనలు చూస్తుంటాం. కానీ, ఇలా రైళ్లను ఢీ కొట్టడం చాలా అరుదైన అంశం. అందుకే వార్తల్లోకి ఎక్కింది. ఈ ఘటనపై ప్రాంతీయ రైల్వే అధికారులు పూర్తి నివేదిక సిద్ధం చేస్తున్నారు. ఘటన సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి అదంతా వీడియో తీశారు. ఈ ఘటనకు కారణమైన గద్ద.. లోపలికి వచ్చాక అక్కడే ఓ మూల కూర్చోవడం అందులో చూడొచ్చు. In an unusual incident on the Srinagar–Anantnag route, an eagle crashed into the windshield of a moving train, injuring the driver and shattering the glass. The train was halted immediately to provide medical aid, while all passengers on board were declared safe.Source:… pic.twitter.com/2Fed2O4rkV— Mid Day (@mid_day) November 8, 2025 -
టీమిండియా వైపు దూసుకొస్తున్న పేస్ గుర్రం
దేశవాళీ క్రికెట్ నుంచి మరో పేస్ బౌలింగ్ సంచలనం టీమిండియా వైపు దూసుకొస్తున్నాడు. తన అసాధారణ వేగంతో బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న రంజీ ట్రోఫీలో తన పేస్ బౌలింగ్‌తో నిప్పులు చేరుగుతున్నాడు. అతడిని ఎదుర్కొవడం బ్యాటర్ల తరం కావడం లేదు. తన తండ్రి ఆశయానికి భిన్నంగా కెరీర్‌ను ఎంచుకున్న ఆ ఫాస్ట్ బౌలర్.. అంతర్జాతీయ క్రికెట్లో సత్తా చాటేందుకు అతృతగా ఎదురు చూస్తున్నాడు. అతడే జమ్మూ కాశ్మీర్‌కు చెందిన రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ (Auqib Nabi).రంజీల్లో అదుర్స్..29 ఏళ్ల ఆకిబ్ నబీ రంజీ ట్రోఫీ 2025-26 సీజన్లో దుమ్ములేపుతున్నాడు. ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు ఆకిబ్ 19 వికెట్లు పడగొట్టాడు. ముంబైతో జరిగిన తొలి మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 7 వికెట్లు పడగొట్టిన ఆకిబ్ నబీ.. రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాత్రం ఒకే ఇన్నింగ్స్‌లో 7 వికెట్లతో చెలరేగాడు. మొత్తంగా ఆ మ్యాచ్‌లో అతడు పది వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్ పై 2 కీలక వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు ఢిల్లీతో జరుగుతున్న మ్యాచ్‌లో నబీ తొలి ఇన్నింగ్స్‌లో ఫైవ్ వికెట్ల హాల్ సాధించాడు. ప్రస్తుత రంజీ సీజన్లో నకీబ్ ఇప్పటివరకు మొత్తంగా ఈ 24 వికెట్లు పడగొట్టాడు. అదేవిధంగా దులీప్ ట్రోఫీలో తొలిసారి వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. నబీ తన ఫాస్ట్ క్లాస్ కెరీర్లో ఇప్పటివరకు 34 మ్యాచ్‌లు ఆడి 115 వికెట్లు సాధించాడు.డెయిల్ స్టెయిన్ ఆఫ్ బారాముల్లాఆకిబ్ బౌలింగ్ శైలి దక్షిణాఫ్రికా దిగ్గజ బౌలర్ డెయిల్ స్టెయిన్‌ను పోలి ఉంటుంది. అందుకే అతన్ని 'బారాముల్లా డెయిల్ స్టెయిన్' అని పిలుస్తుంటారు. అద్భుతమైన పేస్‌తో పాటు బంతిని రెండు వైపులా స్వింగ్ చేసే సత్తా ఆకిబ్‌కు ఉంది. అయితే జమ్మూలోని బారాముల్లాకు చెందిన ఆకిబ్‌ను తన తండ్రి డాక్టర్ చేయాలని ఆశించాడు. కానీ ఆకిబ్‌కు మాత్రం క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకున్నాడు. అతడు తన అద్భుత ప్రదర్శనలతో భారత సెలక్టర్ల దృష్టిలో పడినట్లు తెలుస్తోంది. నబీ ఇదే జోరును కొనసాగిస్తే త్వరలోనే భారత జట్టులోకి వచ్చే అవకాశముంది. కాగా జమ్మూకు చెందిన మరో స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ ఇప్పటికే భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. గాయాల కారణంగా అతడు ఎక్కవ కాలం పాటు జాతీయ జట్టుకు ఆడలేకపోయాడు. -
క్లీన్ స్వీప్ మిస్.. బీజేపీకి ‘క్రాస్ ఓటింగ్’ విక్టరీ!
కేంద్ర పాలిత జమ్ము కశ్మీర్ రాజ్యసభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి(Jammu Rajya Sabha Results). అధికార నేషనల్ కాన్ఫరెన్స్ క్లీన్ స్వీప్ మిస్ అయ్యింది. నాలుగు స్థానాల్లో మూడింటిని కైవసం చేసుకుంది. మిగిలిన ఒక్క స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకోగా.. క్రాస్ ఓటింగ్ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరిగిన తొలి రాజ్యసభ ఎన్నికలు ఇవే. జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో శుక్రవారం(అక్టోబర్ 24వ తేదీన) ఓటింగ్ జరిగింది. 88 మంది ఎమ్మెల్యేలకు గానూ.. 86 మంది నేరుగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. జైల్లో ఉన్న ఆప్ ఎమ్మెల్యే మెహరాజ్ మాలిక్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటేశారు. కాంగ్రెస్, పీడీపీ, సీపీఐ(ఎం), ఏఐపీ, ఇతర స్వతంత్ర ఎమ్మెల్యేలు నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థులకు మద్దతు ఇచ్చారు.ఎన్సీ తరఫున చౌదరి మహ్మద్ రంజాన్, సజ్జాద్ కిచ్లూ, జీఎస్ ఒబెరాయ్, బీజేపీ నుంచి ఆ పార్టీ రాష్ట్ర చీఫ్ సత్ పాల్ శర్మ(Sat Paul Sharma) విజేతలుగా నిలిచారని అసెంబ్లీ సెక్రటరీ ఎంకే పండిత తెలిపారు. भाजपा जम्मू कश्मीर अध्यक्ष श्री @iamsatsharmaca ने आज विधानसभा सचिवालय, श्रीनगर में राज्यसभा सांसद के रूप में विजय का प्रमाण पत्र चुनाव अधिकारी से प्राप्त किया। pic.twitter.com/pZul3mcCjF— BJP Jammu & Kashmir (@BJP4JnK) October 24, 2025నాలుగో సీటు కోసం నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి ఇమ్రాన్ నబీ, సత్ శర్మ పోటీ పడ్డారు. అయితే 32 ఓట్లతో శర్మ విజయం సాధించినట్లు అసెంబ్లీ సెక్రటరీ ప్రకటించారు. జమ్ము అసెంబ్లీలో బీజేపీకి కేవలం 28 సీట్లు మాత్రమే ఉండగా.. 4 అదనపు ఓట్లు వచ్చాయి. అయితే బీజేపీ ఊహించినట్లుగానే.. స్వతంత్రులు వాళ్ల వైపు మొగ్గు చూపినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, సీఎం ఒమర్ అబ్దుల్లా ఆ నాలుగు ఓట్లు ఎక్కడివి? అంటూ ఓ ట్వీట్ చేశారు. క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డ(Cross Voting For BJP) ఆ నలుగురు ఎవరు అనేది తేలాల్సి ఉంది. ఇక..All of @JKNC_ votes remained intact across the four elections, as witnessed by our election agent who saw each polling slip. There was no cross voting from any of our MLAs so the questions arise - where did the 4 extra votes of the BJP come from? Who were the MLAs who…— Omar Abdullah (@OmarAbdullah) October 24, 2025డోడా నియోజకవర్గ ఆప్ ఎమ్మెల్యే మెహరాజ్ మాలిక్ పోస్టల్ బ్యాలెట్ ద్వారా రాజ్యసభ ఎన్నికల్లో ఓటు వేశారు. పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ (PSA) కింద సెప్టెంబర్ 8, 2025న అరెస్ట్ అయ్యారాయన. ఆయన ప్రస్తుతం కథువా జిల్లా జైలులో నిర్బంధంలో ఉన్నారు. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్ము కశ్మీర్ రాష్ట్రం కాస్త కేంద్ర పాలిత ప్రాంతంగా మారింది. ఛండీగఢ్, లక్షద్వీప్ లాంటి కేంద్ర పాలిత ప్రాంతాలకు అసెంబ్లీ ఉండదు. కాబట్టి వాటికి రాజ్యసభ స్థానాలు ఉండవు. అయితే.. 2020లో జమ్ము కశ్మీర్ రీజనల్ అసెంబ్లీ తిరిగి ఏర్పడింది. అందువల్ల ఇతర రాష్ట్రాల మాదిరిగానే రాజ్యసభ ఎన్నికలు మళ్లీ అసెంబ్లీలోనే జరిగాయి. అంతా ఊహించినట్లుగానే అధికార పార్టీ నేషనల్ కాన్ఫరెన్స్ మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది. -
నాలుగు వారాల్లోగా బదులివ్వండి
న్యూఢిల్లీ: కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్ కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించే విష యమై నాలుగు వారాల్లోగా సమాధాన మివ్వా లని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఈ అంశంపై దాఖలైన పలు పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వి నోద్ చంద్రన్ల ధర్మాసనం శుక్రవారం విచారణ చేపట్టింది. రాష్ట్ర హోదాను పునరుద్ధరి స్తామంటూ ఇచ్చిన హామీని సాధ్యమైనంత త్వరగా కేంద్రం అమలు చేసేలా చర్యలు తీసుకోవాలంటూ విద్యావేత్త జహూర్ అహ్మద్ భట్, సామాజిక– రాజకీయ ఉద్యమకా రుడు అహ్మద్ మాలిక్ తదితరులు తమ పిటిషన్లలో కోరారు. ఆర్టికల్ 370 రద్దును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణ సమయంలో రాష్ట్ర హోదాను తిరిగి ఇస్తామంటూ హామీ ఇచ్చిందని పిటిషనర్లు గుర్తు చేశారు. ఈ విషయంపై నాలుగు వారా ల్లోగా స్పందించాలని ఈ సందర్భంగా సీజేఐ బీఆర్ గవాయ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. -
కశ్మీర్ మహిళల ప్రస్తావన.. పాక్‌కు భారత్ స్ట్రాంగ్ కౌంటర్
న్యూయార్క్: దాయాది పాకిస్తాన్‌పై భారత్ మరోసారి విరుచుకుపడింది. తమ దేశ పౌరులపైనే(పాకిస్తాన్) బాంబు వేసుకునే దేశం మహిళల భద్రత విషయం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఉగ్రవాదంతో ఎప్పటికప్పుడు మారణహోమం సృష్టిస్తూ ప్రపంచాన్ని దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తోందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో ఆగ్రహం వ్యక్తం చేసింది.ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) సమావేశాల్లో పాక్ అధికారిణి సౌమా సలీమ్ మాట్లాడుతూ.. భారత్, కశ్మీర్‌ను టార్గెట్ చేసి విమర్శలు చేశారు. మహిళలు, శాంతి, భద్రతపై బహిరంగ చర్చ సందర్భంగా కశ్మీరీ మహిళలు దశాబ్దాలుగా లైంగిక హింసను భరించారు, ఆక్రమణలో ఉన్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. అనంతరం, పాక్ వ్యాఖ్యలకు ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ కౌంటర్ ఇచ్చారు. ఆమె వ్యాఖ్యలను హరీష్ తీవ్రంగా ఖండించారు.అనంతరం, హరీష్ మాట్లాడుతూ.. కశ్మీర్ మహిళల గురించి పాకిస్తాన్ మాట్లాడం విడ్డూరంగా ఉంది. తన సొంత ప్రజలపై బాంబులు వేసుకునే దేశం పాకిస్తాన్. ప్రతిసారి భారత్‌పై నిందలు మోపేందుకు దాయాది దేశం తీవ్రంగా ప్రయత్నించడాన్ని ఆయన తప్పుబట్టారు. మహిళలు, శాంతిభద్రత అజెండాల్లో మా మార్గదర్శకాలు సరిగానే ఉన్నాయన్నారు. కానీ, సొంత ప్రజలపై బాంబులు వేసి పాక్ మారణహోమానికి పాల్పడుతుందన్నారు. అలాంటి దేశం ప్రపంచదృష్టిని మరల్చేందుకు మాపై నిందలు మోపుతుందన్నారు. పాక్ తప్పుడు వాదనలను ప్రపంచం చూస్తోందన్నారు.భారత్, జమ్ముకశ్మీర్‌పై ప్రతీసారి పాకిస్తాన్ విమర్శలు చేస్తూనే ఉంది. భారత్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. భారత్‌పై విషం చిమ్మడం పాకిస్తాన్‌కు అలవాటే. 1971లో ఆపరేషన్ సెర్చ్‌లైట్ నిర్వహించిన దేశం పాకిస్తాన్. ఈ క్రమంలో ఆ దేశ సొంత సైన్యం ద్వారా 4,00,000 మంది మహిళా పౌరులపై జాతి విధ్వంసం, సామూహిక అత్యాచారం చేశారు అని ఘాటు విమర్శలు చేశారు. తమ దేశ చర్యలకు మరిచిపోయి.. భారత్‌పై అసత్య ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. #IndiaAtUNPR @AmbHarishP delivered India’s statement at the UNSC Open Debate on Women Peace and Security marking 25 years of Resolution 1325. Quoting EAM @DrSJaishankar, he described women peacekeepers as “messengers of peace” and outlined India’s rich and pioneering… pic.twitter.com/SesXRFRJbU— India at UN, NY (@IndiaUNNewYork) October 6, 2025 -
‘బీజేపీతో దోస్తీ కన్నా.. సీఎం పదవి వదిలేయడం నయం’
శ్రీనగర్: జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా.. బీజేపీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో దోస్తి కట్టడం కంటే.. ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవటమే తనకు ఇష్టమని స్పష్టంచేశారు. తన ప్రభుత్వంలోకి బీజేపీని భాగస్వామిగా చేర్చుకుంటే.. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కానీ ఆ పని చేయటం తనకు ఇష్టం లేదని ఒమర్ అబ్దుల్లా చెప్పుకొచ్చారు.అనంత్‌నాగ్ జిల్లాలోని అచబల్లో మంగళవారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడారు. ‘మీరు (ప్రజలను ఉద్దేశించి) సిద్ధమైతే చెప్పండి.. ఈ వ్యాపారం (బీజేపీతో పొత్తు) చేయటం నాకు ఇష్టంలేదు. బీజేపీని ప్రభుత్వంలోకి తీసుకోవటం అవసరమని మీరు అనుకుంటే ముందు నా రాజీనామాను ఆమోదించండి. మరో ఎమ్మెల్యే సీఎం అయ్యి ప్రభుత్వాన్ని నడిపిస్తారు. బీజేపీతో పొత్తుకు నేను మాత్రం సిద్ధంగా లేను. మన ప్రభుత్వంలోకి బీజేపీని తీసుకొంటే మనకు ఒక బహుమతి లభించవచ్చు. వాళ్లు (కేంద్రం) మనకు త్వరలోనే రాష్ట్ర హోదా ప్రకటించవచ్చు’ అని పేర్కొన్నారు.ప్రభుత్వంలో కశ్మీర్‌కు మాత్రమే ప్రాతినిధ్యం ఉందన్న వాదనను ఒమర్ అబ్దుల్లా తిరస్కరించారు. ‘ప్రభుత్వంలో పిర్‌పంజాల్‌కు ప్రాతినిధ్యం ఉంది. దిగువ జమ్ము ప్రాంతానికి కూడా ప్రాతినిధ్యం ఉంది. జమ్మూ నుంచి ఉపముఖ్యమంత్రి ఉన్నారు’ అని తెలిపారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను శాంతియుత, ప్రజాస్వామ్యయుత పోరాటాలతోనే సాధించుకుంటామని స్పష్టంచేశారు. -
కశ్మీర్ ప్రజలకు మా మద్దతు
ఐక్యరాజ్యసమితి: జమ్మూకశ్మీర్‌లో ప్రస్తుత పరిస్థితికి ముమ్మాటికీ భారత ప్రభుత్వమే కారణ మని పాకిస్తాన్ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ విమర్శించారు. నిష్పక్షపాతంగా ప్రజాభి ప్రాయ సేకరణ జరగాలని జమ్మూకశ్మీర్ ప్రజలు కోరుకుంటున్నా రని, వారికి తమ మద్దతు ఉంటుందని ప్రకటించారు. స్వయం పాలన వారి ప్రాథమిక హక్కు అని తెలిపారు. సింధూ నది జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపివేయడాన్ని ఖండిస్తున్నామని చెప్పారు. ఈ ఒప్పందంలో ఎలాంటి ఉల్లంఘన జరిగినా అది తమపై యుద్ధంగా పరిగణిస్తామని వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశంలో ప్రసంగించారు. ఈ ఏడాది మే నెలలో జరిగిన ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించారు. నాలుగు రోజులపాటు ఘర్షణ జరిగిందని, పాక్ వైమానిక దళం దాడుల్లో భారత్‌కు చెందిన ఏడు యుద్ధ విమానాలు ధ్వంసమయ్యాయని చెప్పారు. అన్ని కీలక అంశాలపై భారత్‌తో సమగ్ర చర్చలకు పాకిస్తాన్ సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు. అన్ని రకాల వివాదాలకు చర్చలు, దౌత్య మార్గాల ద్వారానే శాంతియుత పరిష్కారం కనిపెట్టాలన్నది తమ విధానమని పేర్కొన్నారు. భారత్‌తో సంప్రదింపులకు నిజాయితీతో కృషి చేస్తున్నామని చెప్పారు. నోబెల్ బహుమతికి ట్రంప్ పేరు ప్రతిపాదిస్తున్నాం.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై షెహబాజ్ షరీఫ్ ప్రశంసల వర్షం కురిపించారు. దక్షిణాసియాలో భారీ యుద్ధం ఆగిందంటే అదంతా ట్రంప్ చలవేనని తేల్చిచెప్పారు. భారత్, పాక్‌ల మధ్య శాంతికోసం ట్రంప్ ఎంతగానో చొరవ తీసుకున్నారని వెల్లడించారు. ఆయన వల్లే యుద్ధం ఆగిపోయిందన్నారు. ట్రంప్ సేవలకు గుర్తింపుగా నోబెల్ శాంతి బహుమతి కోసం ట్రంప్ పేరును ప్రతిపాదిస్తున్నామని పేర్కొన్నారు. తమ ప్రభుత్వం అధికారికంగా ట్రంప్ పేరును నామినేట్ చేస్తోందని తెలియజేశారు. -
'ఐ లవ్ మహ్మద్'పై అభ్యంతరం ఎందుకు?
ఐ లవ్ మహ్మద్ వివాదంపై జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. ప్రజలు తాము ఆరాధించే దైవం పట్ల ప్రేమను వ్యక్తపరచడం తప్పెలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఐ లవ్ మహ్మద్ అనే మూడు సాధారణ పదాలను చట్టవిరుద్ధమని ఎలా అంటారని నిలదీశారు. ఐ లవ్ మహ్మద్ బ్యానర్ ప్రదర్శించిన వారిపై కేసులు పెట్టడాన్ని ఖండించారు. మతిస్థిమితం తప్పినవారే ఇలాంటికేసులు పెడతారని ఫైర్ అయ్యారు. ఈ వ్యవహారంలో వెంటనే కోర్టులు జోక్యం చేసుకుని పరిస్థితిని చక్కదిద్దాలని కోరారు.కాన్పూర్‌లో మొదలైన వివాదంఐ లవ్ మహ్మద్ వివాదం ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో మొదలై దేశమంతా పాకింది. ఈద్-ఎ-మిలాద్-ఉన్-నబీ సందర్భంగా సెప్టెంబర్ 4న కాన్పూర్‌లోని రావత్‌పూర్‌లో జరిగిన ఊరేగింపులో ‘ఐ లవ్ మహ్మద్’ (I Love Muhammad) అనే బ్యానర్‌ను ముస్లింలు ప్రదర్శించారు. దీనిపై స్థానిక హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం తెలిపాయి. మతపరమైన వేడుకల్లో కొత్త ట్రెండ్‌తో ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టే చర్యలకు దిగుతున్నారని ఆరోపించాయి. దీంతో పోలీసులు సెప్టెంబర్ 9న 24 మంది ముస్లింలపై కేసులు నమోదు చేశారు.కాన్పూర్ పోలీసుల చర్యకు నిరసనగా ఉన్నావ్, మహరాజ్ గంజ్, కౌశాంబి, లక్నో నగరాల్లో ముస్లింలు ర్యాలీలు చేపట్టారు. మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, తెలంగాణలోనూ నిరసనలు తెలిపారు. ‘ఐ లవ్ మహ్మద్’ అనడం నేరం కాదని ఎఐఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎక్స్‌లో పోస్ట్ పెట్టడంతో ఈ వివాదం దేశవ్యాప్తంగా హాట్‌టాపిక్ అయింది. తాజాగా ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) స్పందించారు.ఎలా చట్టవిరుద్ధం?"ఈ వాక్యంపై ఎవరికైనా అభ్యంతరం ఎందుకు ఉండాలి? ఈ మూడు పదాలతో ఎవరికి సమస్య ఉంటుంది? ఈ మూడు పదాలు రాయడం వల్ల అరెస్టు ఎలా జరుగుతుందో నాకు అర్థం కావడం లేదు. ఈ మూడు పదాలపై కేసు పెట్టారంటే వాళ్లు మానసిన అనారోగ్యంతో ఉన్నారని అర్థం. ఈ వివాదాన్నికోర్టులు త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నాను. ఐ లవ్ ముహమ్మద్ అని రాయడం ఎలా చట్టవిరుద్ధం?" అని సీఎం ఒమర్ అబ్దుల్లా విలేకరులతో అన్నారు.చదవండి: 'ఐ లవ్ మహ్మద్' ఎందుకు వివాదంగా మారింది?ఇది ఒక మతానికి సంబంధించింది మాత్రమే కాదని మిగతా మతాల వారు కూడా తమ ఇష్ట దైవాలు, గురువులపై ప్రేమను ఏదోక రూపంలో వ్యక్తపరుస్తూనే ఉంటారని చెప్పారు. ''సిక్కులు, హిందువులు సహా అన్ని మతాల వారు తమ దైవాలపై ప్రేమను వ్యక్తం చేయడం లేదా? జమ్మూకశ్మీర్ (Jammu Kashmir) వెలుపల ఎక్కడికైనా వెళ్లండి. దేవుడు ఫొటోలు లేని వాహనాలు మీకు కనిపించవు. అది చట్టవిరుద్ధం కాకపోతే, ఇది ఎలా అవుతుంది?" అని ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. -
పాక్ సైన్యం కవ్వింపులు.. ఎల్వోసీలో భారత ఆర్మీ అలర్ట్
శ్రీనగర్: ఆపరేషన్ సిందూర్ తర్వాత పాకిస్తాన్ మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. తాజాగా భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కుప్వారాలోని నౌగామ్ సెక్టార్లో పాక్ సైన్యం కవ్వింపులకు దిగింది. దీంతో భారత సైన్యం ఎదురు కాల్పులు చేసి పాక్‌ను సమర్థంగా తిప్పికొట్టింది.వివరాల ప్రకారం.. ఆపరేషన్ సిందూర్ అనంతరం దాయాది దేశం పాకిస్తాన్ సైలెంట్ అయ్యింది. భారత్‌తో ఎలాంటి చర్యలకు పాల్పడలేదు. కానీ, తాజాగా సెప్టెంబర్ 20న సాయంత్రం 6.15 గంటల సమయంలో పాక్ ఆర్మీ.. మళ్లీ కవ్వింపు చర్యలకు దిగింది. నియంత్రణ రేఖ(Loc) వెంట కాల్పులకు తెగబడింది. దీంతో, అప్రమత్తమైన భారత సైన్యం.. ఎదురు కాల్పులు జరిపింది. సుమారు గంట పాటు కాల్పులు కొనసాగాయి. ఇందులో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు చెబుతున్నారు.BIG BREAKING 🚨 🚨 Reports of Ceasefire violations by Pakistan along LoC. Indian Army has responded with heavy fire reportedly destroying Pak Army posts in Leepa valley. No damages on our side.Official confirmation awaited! pic.twitter.com/3Fbm9Cdrnw— Megh Updates 🚨™ (@MeghUpdates) September 20, 2025అయితే, తాజాగా కవ్వింపు చర్యల నేపథ్యంలో పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ చేసిన వ్యాఖ్యలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే.. ఇటీవల పాకిస్తాన్-సౌదీ అరేబియా మధ్య ఓ రక్షణ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం రెండు దేశాల్లో ఏ దేశంపై దాడి జరిగినా రెండింటిపై దాడిగా భావించి ఎదుర్కొంటారు. ఈ నేపథ్యంలో పాక్-సౌదీ మధ్య కుదిరిన ఒప్పందంపై పాకిస్తాన్ రక్షణ మంత్రి స్పందిస్తూ..‘ఒకవేళ పాకిస్తాన్, భారత్ మధ్య యుద్ధం తలెత్తే పరిస్థితులు ఎదురైతే.. మాకు సౌదీ అండగా పోరాడుతుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఒప్పందంలో భాగంగా వ్యూహాత్మక పరస్పర సహాయం ఉంటుంది. ఈ ఒప్పందం కింద అణ్వాయుధాలు వాడకూడదన్న నిబంధన ఏమీ లేదు. మాకు ఉన్న అన్ని సామర్థ్యాలను వినియోగిస్తాం. ఇది కేవలం రక్షణాత్మక ఒప్పందం మాత్రమే అని చెప్పుకొచ్చారు. ఇందులో భాగంగానే పాక్ సైన్యం ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిందనే అనుమానం కలుగుతోంది. -
వైష్ణోదేవి ఆలయ యాత్ర మళ్లీ వాయిదా
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని ప్రఖ్యాత వైష్ణోదేవి ఆలయ యాత్ర వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన ప్రకారం ఆదివారం నుంచి యాత్ర తిరిగి మొదలుకావాల్సి ఉంది. అయితే, రెండు రోజులుగా వర్షాలు ఆగకుండా కురుస్తుండటంతో యాత్రను వాయిదా వేసినట్లు శనివారం ఆలయ బోర్డు తెలిపింది. యాత్రను తిరిగి ప్రారంభించే తేదీని వాతావరణం మెరుగయ్యాక ప్రకటిస్తామని ఆలయ బోర్డు వివరించింది.ఆగస్ట్ 26వ తేదీన వైష్ణోదేవి ఆలయ మార్గంలో కొండచరియలు విరిగి 34 మంది భక్తులు చనిపోగా, 20 మంది గాయపడటం తెల్సిందే. అప్పటి నుంచి యాత్రను 19 రోజులుగా ఆపివేశారు. -
పహల్గాం ఉగ్రదాడిని ఖండించిన ఎస్సీఓ
తియాంజిన్: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సభ్యదేశాల అధినేతలు ముక్తకంఠంతో ఖండించారు. ఈ మేరకు సోమవారం ఉమ్మడి డిక్లరేషన్ విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు సంతాపం, సానుభూతి ప్రకటించారు. ఈ హేయమైన ఘటనకు కారణమైన ముష్కరులను, వారి పోషకులను, కుట్రదారులను చట్టం ముందు నిలబెట్టి, కఠినంగా శిక్షించాల్సిందేనని తేల్చిచెప్పారు. ఇలాంటి ఘాతుకాలను సహించడానికి ఎంతమాత్రం వీల్లేదన్నారు. ఉగ్రవాదం, వేర్పాటువాదం, తీవ్రవాదంపై రాజీలేని పోరాటానికి కట్టుబడి ఉన్నామని వారు ఉద్ఘాటించారు. ఉగ్రవాద, వేర్పాటువాద, తీవ్రవాద శక్తులపై అత్యంత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయానికొచ్చారు. అలాంటి శక్తులను స్వలాభం కోసం ఎవరూ వాడుకోకుండా చర్యలు చేపట్టాలని తీర్మానించారు. బెల్డ్ అండ్ రోడ్‌ను తప్పుపట్టిన మోదీ చైనా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బెల్డ్ అండ్ రోడ్ కార్యక్రమం(బీఆర్ఐ) పట్ల ఎస్సీఓ సదస్సు వేదికగా ప్రధాని మోదీ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఇలాంటి అనుసంధాన ప్రాజెక్టులు ఇతర దేశాల జాతీయ సార్వభౌమత్వాన్ని గౌరవించేలా ఉండాలని చెప్పారు. ఏ కార్యక్రమం అయినా సరే నమ్మకం, విశ్వసనీయత పెంచుకొనేలా ఉండాలి తప్ప తగ్గించుకొనేలా ఉండొద్దన్నారు. ఆసియా, ఆఫ్రికా, యూరప్‌ను అనుసంధానిస్తూ బీఆర్ఐని చైనా ప్రభుత్వం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగమైన చైనా–పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) గుండానే వెళ్తోంది. దీన్ని భారత్ మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది. -
వీడు మాములోడు కాదు.. హ్యూమన్ జీపీఎస్!
వీడు నిజంగానే మామూలోడు కాదు. వెరీ వెరీ టాలెండెడ్ టెర్రరిస్టు. దశాబ్దాలుగా పీవోకే నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఉగ్రమూకలు భారత్‌లోకి చొరబడేందుకు దారులు చెప్పి సాయం చేసేవాడు. అలా ఒకటి కాదు.. రెండు కాదు.. వందకి పైగా ఉగ్రవాద చొరబాట్లకు కారకుడయ్యాడు. అందుకే హ్యూమన్ జీపీఎస్ (human GPS)గా బాగూఖాన్(Bagu Khan)కు పేరు ముద్రపడింది. జమ్మూకశ్మీర్‌లోని నౌషెరా సెక్టార్లో జరిగిన ఎన్కౌంటర్లో కీలక ఉగ్రవాది హతమయ్యాడు. దాదాపు 100పైగా ఉగ్రవాద చొరబాట్లకు కారకుడు, హ్యూమన్ జీపీఎస్‌గా పిలవబడే బాగూఖాన్(సమందర్ చాచా)ను కాల్చిచంపినట్లు ఆర్మీవర్గాలు వెల్లడించాయి. అతడు మరో ఉగ్రవాదితో కలిసి దేశంలోకి చొరబడేందుకు యత్నిస్తుండగా ఎన్కౌంటర్ జరిగిందని తెలిపాయి. 1995 నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి బాగూఖాన్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. ఎలాంటి కఠిన మార్గాల్లోనైనా ఉగ్రమూకలు భారత్‌లోకి చొరబడేందుకు ఇతడు సహాయం చేసేవాడని, అందులో ఎక్కువభాగం విజయవంతం అయ్యాయని పేర్కొన్నాయి. అతడు హిజ్బుల్ కమాండర్‌గా ఉన్ననప్పటికీ.. ఈ టాలెంట్(భౌగోళిక పరిజ్ఞానం) వల్ల అన్ని ఉగ్రసంస్థలకు అతడు కీలకంగా మారాడు. ఈ క్రమంలోనే హ్యుమన్ జీపీఎస్‌గా అతనికంటూ ఓ పేరు ముద్రపడింది.భద్రతా బలగాల విజయాలు: ఈ ఎన్‌కౌంటర్‌తో పాటు, గత కొన్ని నెలల్లో జమ్మూకశ్మీర్‌లో 23 మంది ఉగ్రవాదులు హతమయ్యారని సమాచారం. ఇందులో పాకిస్థానీయులు, స్థానిక ఉగ్రవాదులు ఉన్నారు. బాగూఖాన్ ఎన్‌కౌంటర్‌తో నౌషెరా ప్రాంతంలోని ఉగ్రవాద నెట్‌వర్క్‌కు గట్టి దెబ్బ తగిలినట్లు భావిస్తున్నారు. భద్రతా బలగాలు ఇంకా ఇతర దాగిన ఉగ్రవాదుల కోసం ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. -
సరికొత్త చరిత్ర.. అరంగేట్రం మ్యాచ్‌లోనే 4 బంతుల్లో 4 వికెట్లు
దులీప్ ట్రోఫీ 2025లో సరికొత్త చరిత్ర ఆవిష్కృతమైంది. ఈ టోర్నీలో నార్త్ జోన్‌కు ఆడుతున్న జమ్మూ కశ్మీర్ ఫాస్ట్ బౌలర్ ఆకిబ్ నబీ దార్ నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీశాడు. దులీప్ ట్రోఫీ చరిత్రలో ఓ బౌలర్ ఈ ఘనత సాధించడం ఇదే మొదటిసారి. ఈ ఘనత సాధించే క్రమంలో ఆకిబ్ నబీ హ్యాట్రిక్ కూడా నమోదు చేశాడు. తద్వారా కపిల్ దేవ్, సాయిరాజ్ బహుతులే తర్వాత దులీప్ ట్రోఫీలో హ్యాట్రిక్ తీసిన మూడో బౌలర్‌గా చరిత్రపుటల్లోకెక్కాడు.దులీప్ ట్రోఫీలో కపిల్ దేవ్ 1978/79 సీజన్లో నార్త్ జోన్‌కు ఆడుతూ వెస్ట్ జోన్‌పై హ్యాట్రిక్ సాధించాడు. ఈ టోర్నీ చరిత్రలో ఇదే తొలి హ్యాట్రిక్. ఆతర్వాత 2000/01 సీజన్లో సాయిరాజ్ బహుతులే వెస్ట్ జోన్‌కు ఆడుతూ ఈస్ట్ జోన్‌పై హ్యాట్రిక్ నమోదు చేశాడు. తాజాగా ఆకిబ్ నబీ కపిల్, బహుతులే సరసన చేరాడు. నబీకి దులీప్ ట్రోఫీలో ఇదే అరంగేట్రం మ్యాచ్ కావడం మరో విశేషం.28 ఏళ్ల ఆకిబ్ నబీ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఈ ఘనత సాధించాడు. మ్యాచ్ రెండో రోజు (ఆగస్ట్ 29) ఈ ఫీట్ నమోదైంది. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో నబీ 53వ ఓవర్ చివరి మూడు బంతులకు వరుసగా విరాట్ సింగ్ (బౌల్డ్), మనిశి (ఎల్బీడబ్ల్యూ), ముక్తర్ హుసేన్ (బౌల్డ్) వికెట్లు తీసి హ్యాట్రిక్ నమోదు చేశాడు. ఆతర్వాత 55వ ఓవర్ తొలి బంతికి సూరజ్ జైస్వాల్ (వికెట్‌కీపర్ క్యాచ్) వికెట్ తీసి వరుసగా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఆకిబ్ నబీ మెరుపులు ఇంతటితో ఆగిపోలేదు. ఆ మరుసటి ఓవర్ (57) తొలి బంతికి మొహమ్మద్ షమీ వికెట్ కూడా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.నబీ ధాటికి ఈస్ట్ జోన్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. 7 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 5 వికెట్లు కోల్పోయింది. ఈ ఐదు వికెట్లను నబీనే తీశాడు. నబీతో పాటు హర్షిత్ రాణా (2/56), అర్షదీప్ సింగ్ (1/51), మయాంక్ డాగర్ (1/41), నిషాంత్ సింధు (1/19) కూడా తలో చేయి వేయడంతో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 230 పరుగులకే కుప్పకూలింది. వీరి ఇన్నింగ్స్‌లో విరాట్ సింగ్ (69) ఉత్కర్ష్ సింగ్ (38), కెప్టెన్ రియాన్ పరాగ్ (39), కుమార్ కుషాగ్రా (29) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.అంతకుముందు నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 405 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఆయుశ్ బదోని (63), కన్హయ్య (76) అర్ద సెంచరీలతో రాణించగా.. నిషాంత్ సింధు (47), ఆకిబ్ నబీ (44) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మనిశి 6 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. టీమిండియా బౌలర్ షమీ (23-4-100-1)నిరాశపరిచాడు. మరో టీమిండియా బౌలర్ ముకేశ్ కుమార్ (14.5-1-50-0) గాయంతో తొలి రోజే వైదొలిగాడు. -
క్లౌడ్ బరస్ట్‌తో మరోసారి ఆకస్మిక వరదలు.. ఏడుగురు మృతి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఇటీవల క్లౌడ్ బరస్ట్ విషాద ఘటన మరువక ముందే మరోసారి ప్రకృతి ప్రకోపించింది. తాజాగా కథువా జిల్లాలోని ఓ మారుమూల గ్రామంలో క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో వచ్చిన ఆకస్మిక వరదల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. వరద ఉధృతికి ఇళ్లు నేలమట్టం అయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.వివరాల ప్రకారం.. జమ్ము కశ్మీర్‌లోని కథువా జిల్లాలోని ఘటీ ప్రాంతంలో శనివారం అర్థరాత్రి, ఆదివారం తెల్లవారుజామున క్లౌడ్ బరస్ట్ సంభవించింది. దీంతో, ఒక్కసారిగా ఆకస్మిక వరదలు వచ్చాయి. ఈ కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోగా మరికొందరు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఆకస్మిక వరదల ధాటికి రైల్వే ట్రాక్‌లు, జాతీయ రహదారులు దెబ్బతిన్నాయి. భారీ వరదలకు కథువా పోలీసు స్టేషన్ నీట మునిగింది. దీంతో, కేంద్ర బలగాలు, స్థానిక యంత్రాంగం సహాయక చర్యల్లో పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు బయటకు వచ్చాయి.A heart wrenching video from Jod village near Janglot where people were stuck in mudslide after #cloudburst in #Kathua #JammuAndKashmir pic.twitter.com/OaSZt5S5iC— Ajay Jandyal (@ajayjandyal) August 17, 2025 మరోవైపు.. కథువా పోలీస్ స్టేషన్ పరిధిలోని బగార్డ్, చాంగ్డా గ్రామాలు.. లఖన్‌పూర్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని దిల్వాన్-హుట్లీలలో కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే, పెద్దగా నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. భారీ వర్షాల కారణంగా ఉజ్ నది ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. నీటి మట్టం గణనీయంగా పెరిగిందని అధికారులు తెలిపారు. దీంతో, స్థానికులను అక్కడి నుంచి తరలిస్తున్నారు.#Breaking Machail Yatra ke Badh ab Kathua main aaya Cloud Brust#CloudBrust in #Kathua District Ghati, Janglote. Railway track effected, NHW also effected Police station Kathua submerged in waterEvacuation is going on. pic.twitter.com/IS3kEB6M2y— Ashish Kohli ॐ🇮🇳 (@dograjournalist) August 17, 2025ఇదిలా ఉండగా.. ఇటీవల జమ్ము కశ్మీర్‌లోని కిష్ట్వార్ జిల్లాలోని చషోటి గ్రామంలో కుండపోత వర్షం కారణంగా ఆకస్మిక వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 38 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రకృతి విపత్తులో మరో 100 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వరద ఉద్ధృతికి గ్రామంలోని పలు ఇళ్లు కొట్టుకుపోయాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని కిష్ట్వార్ పోలీసు కంట్రోల్ రూమ్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు.Extremely Heavy Rainfall in Kathua District : Railway Track , Highway affected , Police station #Kathua submerged in Water pic.twitter.com/C3t67Wt2V3— Cross Town News (@CrossTownNews) August 17, 20254 dead, many injured after a cloudburst cut off a remote village in Kathua district of Jammu and Kashmir.The cloudburst hit Jod Ghati in Rajbagh area of the district during the intervening night of Saturday and Sunday.#Kathua #JammuKashmir pic.twitter.com/8uod9zI0rN— Vani Mehrotra (@vani_mehrotra) August 17, 2025 -
ఇంకా చిక్కని 82 మంది ఆచూకీ
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని కిష్తవాడ్ జిల్లాలో క్లౌడ్ బరస్ట్ వల్ల విధ్వంసానికి గురైన చోసితీ గ్రామంలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారం సంభవించిన ఆకస్మిక వర్షాలు, వరదల ధాటికి ముగ్గురు సీఐఎస్ఎఫ్ జవాన్లు, ఒక స్పెషల్ పోలీసు ఆఫీసర్ సహా 60 మంది దుర్మరణం పాలయ్యారు. 167 మందిని అధికారులు రక్షించారు. మరో 82 మంది జాడ గల్లంతయ్యింది. వారి కోసం సహాయక బృందాలు గాలిస్తున్నాయి. సహాయక చర్యలకు అడ్డంకిగా మారిన భారీ బండరాళ్లను పేలుడు పదార్థాలతో పేల్చేస్తున్నారు. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం ఉదయం చిసోతీని సందర్శించారు. బాధిత కుటుంబాలకు సీఎం సహాయ నిధి నుంచి పరిహారం అందజేస్తామని వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున, స్వల్పంగా గాయపడినవారికి రూ.50 వేలు చొప్పున ఇస్తామన్నారు. ధ్వంసమైన ఇళ్లకు సైతం పరిహారం ప్రకటించారు. వరదల్లో ఆప్తులను కోల్పోయిన గ్రామస్థులను ఒమర్ అబ్దుల్లా ఓదార్చారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్, జమ్మూకశ్మీర్ డీజీపీ నళిన్ ప్రభాత్ శుక్రవారం అర్ధరాత్రి చోసితీ గ్రామానికి చేరుకున్నారు. సహాయక చర్యలను సమీక్షించారు. శనివారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను జితేంద్ర సింగ్ పరామర్శించారు. సహాయ పునరావాస చర్యలను ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా పర్యవేక్షిస్తున్నారని ఆయన తెలిపారు. అధికారులు ఇప్పటిదాకా 50 మృతదేహాలను గుర్తించి, సంబంధిత కుటుంబాలకు అప్పగించారు. క్లౌడ్ బరస్ట్‌లో కనీసం 16 నివాస గృహాలతోపాటు పలు ప్రభుత్వ భవనాలు, మూడు ఆలయాలు, 30 మీటర్ల వంతెన ధ్వంసమయ్యాయి. పదుల సంఖ్యలో వాహనాలో వరదలో కొట్టుకుపోయాయి. మరోవైపు మచైల్ మాత యాత్రను వరుసగా మూడోరోజు శనివారం సైతం రద్దు చేశారు. -
మీకో, మీ మంత్రికో, మీ ఎమ్మెల్యేకో జరిగితే ఇలాగే చేస్తారా?
జమ్ము కశ్మీర్ కిష్తవాడ్ జిల్లా చోసితీ గ్రామంలో ఫ్లాష్‌ఫ్లడ్ సహాయక చర్యలు మూడో రోజుకి చేరాయి. ఇప్పటిదాకా 60 మంది మరణించగా.. గల్లంతైన 80 మంది కోసం(ఆ సంఖ్యే ఎక్కువే ఉండొచ్చని తెలుస్తోంది) గాలింపు కొనసాగుతోందని అధికారులు ప్రకటించారు. అదే సమయంలో స్థానికుల ఆగ్రహమూ తారాస్థాయికి చేరింది. అందుకు అక్కడి ప్రజాప్రతినిధులు తీరే కారణంగా తెలుస్తోంది.గురువారం మధ్యాహ్నాం క్లౌడ్‌బరస్ట్ కారణంగా మెరుపు వరదలు చోసితీని ముంచెత్తాయి. బురద నుంచి శకలాలను తొలగిస్తున్న కొద్దీ.. మృతదేహాలు బయటపడుతూ వస్తున్నాయి. దీంతో గల్లంతైన వాళ్ల కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరిగిపోతోంది. ఈ క్రమంలో.. జమ్ము కశ్మీర్ ఒమర్ అబ్దుల్లా శనివారం ఆ ప్రాంతంలో పర్యటించగా.. స్థానికుడి నుంచి ఆయనకు నిలదీత ఎదురైంది.‘‘పోలీసులు, సైన్యం మా వాళ్ల జాడ కోసం అహర్నిశలు ఇక్కడ కష్టపడుతున్నారు. మేమూ మాకు చేతనైన ప్రయత్నాలు చేస్తున్నాం. ఇక్కడ 20 జేసీబీలు ఉన్నాయి.కానీ, ఇందులో రెండే పని చేస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు పదే పదే ఇక్కడికి వస్తున్నారు. ఫొటోలకు ఫోజులిస్తున్నారు. దీంతో సహాయక చర్యలు ఆటంకాలు ఏర్పడుతున్నాయి. గత మూడురోజుల్లో ఇక్కడ రెండే రెండు పెద్ద బండరాళ్లను తొలగించారంటే పరిస్థతి అర్థం చేసుకోండి. మాకు కుటుంబాలు లేవా?. కనీసం మా వాళ్ల శవాలనైనా మాకు అప్పగించండి’’ అని ఎన్డీటీవీతో బాధితుడొకరు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. సరిగ్గా అదే సమయంలో సీఎం ఒమర్ అబ్దుల్లా అటుగా వచ్చారు. ఏం జరిగిందో చెప్పమంటూ ఆ వ్యక్తిని ఆరా తీశారు.జరిగిందంతా చెప్పి.. కనీసం తమవాళ్ల మృతదేహాలనైనా అప్పగించాలని కోరాడా వ్యక్తి. జరుగుతోంది అదేనని.. ఘటన జరిగిన నాటి సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆ వ్యక్తికి సీఎం బదులిచ్చారు. ఈ క్రమంలో.. అతను మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. ‘‘సర్.. నేను చెప్పేది ఓసారి వినండి. నా కుటుంబం నుంచి 13 మంది జాడ లేకుండా పోయారు(తమ పిల్లల ఆచూకీ లేదంటూ పలువురు ఆ సమయంలో గట్టిగా రోదించారు). ఎమ్మెల్యేలు, మంత్రులు పది పదిసార్లు ఇక్కడికి వస్తున్నారు. జేసీబీలను ఆపేయించి ఫొటోలు దిగుతున్నారు. మేం నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతున్నాం’’ అని వివరించాడు. విషాదంతో చాలా కుటుంబాలు బాధపడుతున్నాయని, అది తాను అర్థం చేసుకోగలనని సీఎం ఫరూక్ అబ్దుల్లా అన్నారు. దీంతో ఆ యువకుడు.. మీకో, మీ ఎమ్మెల్యేకో, మీ మంత్రికో జరిగితే ఇలాగే చేస్తారా?.. త్వరగతిన చర్యలు తీసుకుంటారు కదా అని నిలదీశాడా వ్యక్తి. దీంతో అధికారులను పిలిపించిన సీఎం ఫరూక్ అబ్దుల్లా.. సహాయక చర్యలు త్వరగతిన జరిగేలా చూడాలంటూ ఆదేశాలు జారీ చేశారు. -
సిందూర్‌లో స్వదేశీ సత్తా
జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులను పొట్టన పెట్టుకున్న పాకిస్తాన్ ముష్కరులకు, వారి పోషకులకు తగిన బుద్ధి చెప్పడమే లక్ష్యంగా భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు 100 రోజులు పూర్తయ్యాయి. శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని మోదీ ఈ ఆపరేషన్ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. స్వదేశీ ఆయుధాలు, రక్షణ వ్యవస్థలతో మనం విజయం సాధించామని చెప్పారు. ‘మేడ్ ఇన్ ఇండియా’ఆయుధాల సత్తా ఏమిటో ప్రపంచానికి తెలిసొచ్చిందని అన్నారు. రక్షణ రంగంలో పూర్తి స్వావలంబన దిశగా ముందుకు సాగుతున్నామని వివరించారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్‌లో శత్రువుపై ఎక్కుపెట్టిన స్వదేశీ ఆయుధాలు ఏమిటో తెలుసుకుందాం.. డి–4 డ్రోన్ల విధ్వంసకారి డి–4 యాంటీ డ్రోన్ సిస్టమ్‌ను డీఆర్డీఓ అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థ ఆపరేషన్ సిందూర్‌లో తన వంతు సేవలు అందించింది. గగనతల నుంచి పాక్ చేసిన దాడులను గట్టిగా తిప్పికొట్టింది. సాధారణ డ్రోన్లతోపాటు చిన్నపాటి మానవ రహిత యుద్ధ విమానాలను నేలకూల్చగలదు. ఆపరేషన్ సిందూర్‌లో స్వదేశీ ఆయుధాలతోపాటు విదేశాల భాగస్వామ్యంతో అభివృద్ధి చేసిన ఆయుధాలను సైతం భారత సైన్యం ఉపయోగించింది. వాటిలో స్కై స్ట్రైకర్ కామికాజ్ డ్రోన్లు, బరాక్–8 మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైళ్లు ఉన్నాయి. అంతేకాదు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చేసిన ఉపగ్రహాలు కూడా ఈ ఆపరేషన్‌కు సహకరించాయి. సమర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ ఫర్ అష్యూర్డ్ రిటాలియేషన్(సమర్) అనేది ఇండియా గగనతల రక్షణ వ్యవస్థలో ఒక భాగం. పాక్ సైన్యం ప్రయోగించిన డ్రోన్లు, క్షిపణులకు మధ్యలోనే కూలి్చవేసింది. భారత వైమానిక దళం సహకారంతో భారత రక్షణ రంగ పరిశ్రమలు దీన్ని రూపొందించాయి. గగనతలంలో తక్కువ ఎత్తులో దూసుకొచ్చే క్షిపణులు, మానవ రహిత విమానాలను ఇది పేల్చేయగలదు. భారత సైన్యంలో ఇది కీలక అస్త్రంగా మారింది. బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్రూయిజ్ మిస్సైళ్లు పాకిస్తాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)లోని ఉగ్రవాదుల స్థావరాలు, శిక్షణ శిబిరాలు, ఎయిర్‌బేస్‌లపై భారత సైన్యం మే 10వ తేదీన అత్యంత కచి్చతత్వంలో కూడిన దాడులు ప్రారంభించింది. ఇందుకు బ్రహ్మోస్ సూపర్ సానిక్ క్రూయిజ్ మిస్సైళ్లు ఎంతగానో తోడ్పడ్డాయి. బ్రహ్మోస్ క్షిపణుల దెబ్బకు పాకిస్తాన్లో 20 శాతం వైమానిక స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఈ క్షిపణులను భారత రక్షణ శాఖ ఆధ్వర్యంలోని డీఆర్డీఓపాటు రష్యా రక్షణ పరిశోధన సంస్థ కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. కచ్చితత్వంతో కూడిన దాడులు చేయడానికి ఇవి ప్రపంచంలో అత్యంత అధునాతనమైన క్షిపణులుగా గుర్తింపు పొందాయి. బ్రహ్మోస్ మిస్సైళ్లను సబ్మెరైన్లు, నౌకలు, యుద్ధ విమానాలతోపాటు భూభాగం నుంచి ప్రయోగించవచ్చు. ఇవి ధ్వని వేగం కంటే మూడు రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్తాయి. ప్రయోగించామంటే లక్ష్యాన్ని తాకాల్సిందే. గురితప్పే ప్రసక్తే లేదు. బ్రహ్మోస్ అంటే కేవలం ఆయుధం కాదు, భారతీయ సైనిక శక్తికి ప్రతీక అని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభివరి్ణంచారు. ఆకాశ్ క్షిపణి వ్యవస్థ భారతదేశ ఐరన్ డోమ్‌గా పేరుగాంచిన ఆకాశ్ క్షిపణులు ఆపరేషన్ సిందూర్‌లో కీలక పాత్ర పోషించాయి. డీఆర్డీఓ అభివృద్ధి చేసిన ఈ మిస్సైళ్లను బీడీఎల్ తయారు చేసింది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత సైన్యం దాడులు ప్రారంభించిన తర్వాత పాక్ సైన్యం ప్రతిదాడులకు దిగింది. డ్రోన్లు, మిస్సైళ్లు ప్రయోగించింది. ఇవి చాలావరకు తుర్కియే, చైనా సరఫరా చేసినవే. ఆకాశ్ మిస్సైల్ సిస్టమ్ వాటిని సమర్థంగా తుత్తునియలు చేసింది. భారత భూభాగానికి ఎలాంటి నష్టం వాటిల్లలేదు. ఆకాశ్ అనేది షార్ట్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్‌తో దీన్ని పోల్చుతుంటారు. ఆకాశ్ క్షిపణి 25 కిలోమీటర్ల దూరంలోని నాలుగు లక్ష్యాలను ఒకేసారి ఛేదించగలదు. -
60కి చేరిన మరణాలు
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని కిష్తవాడ్ జిల్లా చోసీతీ గ్రామంలో ‘క్లౌడ్ బరస్ట్’ ఘటనలో మృతుల సంఖ్య శుక్రవారం 60కి చేరింది. 30 మృతదేహాలను గుర్తించి, సంబంధిత కుటుంబాలకు అప్పగించారు. మరో 69 మంది జాడ ఇంకా లభించలేదు. శిథిలాల కింద చిక్కుకున్నవారిని గుర్తించడానికి అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా గురువారం రాత్రి నిలిపివేసిన గాలింపు చర్యలను శుక్రవారం ఉదయం పునఃప్రారంభించారు. సైన్యం, పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది చోసితీ గ్రామంలో రాళ్లు, బురదను తొలగిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా చెప్పారు. క్లౌడ్ బరస్ట్‌లో 100 మందికిపైగా గాయపడ్డారని స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో తెలిపారు. .ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సీఎం ఒమర్ అబ్దుల్లా, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో మాట్లాడారు. అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. శిథిలాల కింద నుంచి వెలికి తీసినవారిని తక్షణమే ఆసుపత్రికి తరలించడానికి చోసితీలో 65 అంబులెన్స్‌లను సిద్ధంగా ఉంచారు. గ్రామంలో గురువారం మధ్యాహ్నం గంటపాటు క్లౌడ్ బరస్ట్ విరుచుకు పడిన సంగతి తెలిసిందే. ఆకస్మిక వర్షాలు, వరదల ధాటికి పెద్ద సంఖ్యలో ఇళ్లు, దుకాణాలు నేలమట్టమయ్యాయి. గ్రామాన్ని బురద ముంచెత్తింది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో మచైల్ మాత యాత్రను రెండో రోజు శుక్రవారం కూడా రద్దుచేశారు. -
కన్నీటి వరద
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని కిష్తవాడ్ జిల్లాలో ఆకస్మిక వర్షాలు బీభత్సం సృష్టించాయి. క్లౌడ్ బరస్ట్ కారణంగా గురువారం చోసితీ గ్రామాన్ని భారీ వరద ముంచెత్తింది. ఈ ఘటనలో ఇద్దరు సీఐఎస్ఎఫ్ జవాన్లు సహా ఏకంగా 46 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 220 మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. చాలా ఇళ్లు నేలమట్టమయ్యాయి. శిథిలాల కింద చిక్కుకున్న 167 మందిని సహాయక బృందాలు రక్షించాయి. వారిలో 38 మంది పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మచైల్ మాత ఆలయానికి వెళ్లే దారిలో వాహనాలపై ప్రయాణించగలిగే చిట్టచివరి గ్రామం చోసితీ. జిల్లా కేంద్రానికి 90 కిలోమీటర్ల దూరంలో మారుమూల ప్రాంతంలో కొండల మధ్య ఉన్న ఈ గ్రామంపై గురువారం మధ్యాహ్నం 12 గంటలకు క్లౌడ్‌బరస్ట్ విరుచుకుపడింది. సరిగ్గా గంటపాటు భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వరద ముంచెత్తింది. వరద దూసుకొచ్చిన సమయంలో గ్రామంలో 1,200 మంది ఉన్నట్లు తెలిసింది. మచైల్ మాత యాత్ర కోసం అప్పటికే చోసితీ గ్రామానికి చేరుకున్న భక్తులు భయకంపితులయ్యారు. సామూహిక వంటశాల(లంగర్)లో పెద్ద సంఖ్యలో భక్తులు ఉన్నారు. వంటశాలలోకి వరద నీరు చేరింది. పలు ఇళ్లు, దుకాణాలు, సెక్యూరిటీ ఔట్‌పోస్టు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. వీధులన్నీ బురద, బండరాళ్లతో నిండిపోయాయి. కొన్ని ఇళ్లు పేకమేడల్లా కూలిపోయాయి. వాహనాలు కొట్టుకుపోయాయి. వర్షం, వరద ధాటికి ఇప్పటిదాకా 46 మంది మృతి చెందినట్లు గుర్తించారు. మృతదేహాలు ఛిద్రం చోసితీలో హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. బురద, రాళ్ల కింద చిక్కుకున్న మృతదేహాలు ముక్కలయ్యాయి. శరీరం లోపలి అవయవాలు బయటకు వచ్చాయి. ఎటుచూసినా రక్తపు మరకలే. మృతదేహాల ఊపిరితిత్తుల్లోకి కూడా బురద చేరింది. పక్కటెముకలు విరిగిపోయాయి. రాళ్ల తాకిడికి మృతదేహాలు ఛిద్రమయ్యాయి. గుర్తుపట్టలేని విధంగా మారిపోయాయి. బురదను తొలగిస్తున్నకొద్దీ మృతదేహాలు బయటపడుతున్నాయి. ఇక క్షతగాత్రులు షాక్ నుంచి ఇంకా కోలుకోలేదు. అంతా క్షణాల్లో జరిగిపోయిందని అంటున్నారు. అసలేం జరిగిందో చెప్పలేకపోయారు. గల్లంతైన తమవారి కోసం గ్రామస్తులు, భక్తులు వెతుకున్నారు. వారి రోదనలతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జమ్మూకశ్మీర్‌లో కిష్తవాడ్తోపాటు రాజౌరీ, ఉదంపూర్, పూంచ్, కథువా తదితర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తావి, చినాబ్, ఉజ్, సురాన్ తదితర నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సహాయక చర్యలు వేగవంతం చేయాలి: మోదీ కిష్తవాడ్ జిల్లాలో ఆకస్మిక వర్షాల్లో 40 మందికిపైగా భక్తులు, ప్రజలు మృతిచెందడం పట్ల రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. పరిస్థితిని ప్రభుత్వం ఎప్పటికిప్పుడు సమీక్షిస్తున్నట్లు ప్రధానమంత్రి పేర్కొన్నారు. సహాయక, పునరావాస చర్యలు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు గురువారం ‘ఎక్స్’లో పోస్టుచేశారు. క్షతగాత్రులకు అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాతో ఫోన్లో మాట్లాడారు. చోసితీ గ్రామంలో సహాయక చర్యలపై ఆరా తీశారు. బాధితులను ఆదుకోవాలని సూచించారు. క్లౌడ్ బరస్ట్ గురించి తెలిసిన వెంటనే కిష్తవాడ్ డిప్యూటీ కమిషనర్ పంకజ్ వర్మతోపాటు సీనియర్ అధికారులు చోసితీకి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితోపాటు స్థానిక పోలీసులు, సైనికులు, స్వచ్ఛంద సేవకులు రంగంలోకి దిగారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా, వరదల నేపథ్యంలో మచైల్ యాత్రను అధికారులు రద్దు చేశారు. ప్రజలు, యాత్రికుల సహాయార్థం కంట్రోల్ రూమ్, హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశారు. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ జిల్లాలో తొమ్మిది రోజుల క్రితమే క్లౌడ్ బరస్ట్ సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఒకరు మరణించగా, గల్లంతైన 68 మంది ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. విశిష్టమైన యాత్ర మచైల్ మాత యాత్ర జూలై 25న ప్రారంభమైంది. సెపె్టంబర్ 5న ముగియనుంది. చోసితీ నుంచి 8.5 కిలోమీటర్ల దూరంలో సముద్ర మట్టానికి 9,500 అడుగుల ఎత్తులో మచైల్ మాత ఆలయం ఉంది. ఈ గ్రామం నుంచే యాత్ర ప్రారంభమవుతుంది. యాత్రికులు తొలుత ఇక్కడికి వాహనాల్లో చేరుకుంటారు. తర్వాత కాలినడకన దుర్గా మాత ఆలయానికి వెళ్తారు. ప్రతిఏటా జరిగే ఈ యాత్రలో వేలాది మంది పాల్గొంటారు. పొరుగు రాష్ట్రాల నుంచి సైతం భక్తులు తరలివస్తారు. ఇది చాలా విశిష్టమైన యాత్రగా పేరుగాంచింది. యాత్ర కోసం చోసితీని బేస్‌క్యాంప్‌గా ఉపయోగిస్తుంటారు. -
జమ్మూకశ్మీర్ కిష్త్వార్ లో క్లౌడ్ బరస్ట్
-
జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా.. ‘పహల్గాం’ దాడిని ప్రస్తావించిన సుప్రీంకోర్టు
ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించే ముందు స్థానికంగా ఉన్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముంది అంటూ సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఇటీవల పహల్గాంలో జరిగిన దాడిని ప్రస్తావించింది.జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం నేడు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ధర్మాసనం.. రాష్ట్ర హోదా కల్పించే ముందు స్థానిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరముంది. వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాలని నొక్కి చెప్పింది. ఇటీవల పహల్గాంలో జరిగి దుర్ఘటనను విస్మరించలేమని వ్యాఖ్యానించింది. అనంతరం, రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలన్న పిటిషన్‌పై ఎనిమిది వారాల్లోగా సమాధానం దాఖలు చేయాలని ఆదేశిస్తూ కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.Supreme Court, while hearing pleas seeking direction to restore the statehood of the Union Territory of Jammu and Kashmir, observes that in granting statehood, the ground situation has to be taken into consideration.“You cannot ignore what happened in Pahalgam," says CJI BR… pic.twitter.com/qIYliZOsVU— ANI (@ANI) August 14, 2025ఇదిలా ఉండగా.. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ గతేడాది విద్యావేత్త జహూర్ అహ్మద్ భట్, సామాజిక-రాజకీయ కార్యకర్త ఖుర్షాయిద్ అహ్మద్ మాలిక్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లో.. రాష్ట్ర హోదాను పునరుద్ధరించడంలో మరింత ఆలస్యం జరిగితే జమ్ముకశ్మీర్‌లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతింటుంది. ఇది భారత రాజ్యాంగం ప్రాథమిక నిర్మాణంలో భాగమైన సమాఖ్య సూత్రాలను తీవ్రంగా ఉల్లంఘించడమే అవుతుంది. జమ్ముకశ్మీర్‌లో ఎటువంటి హింసాత్మక ఘటనలు, భద్రతాపరమైన సమస్యలు లేకుండా ఎన్నికల జరిగాయి. రాష్ట్ర హోదా కల్పించకపోవడంతో అభివృద్ధికి అనేక అడ్డంకులు ఏర్పడుతున్నాయి. పౌరుల ప్రజాస్వామ్య హక్కులను ప్రభావితం చేసింది అని పేర్కొన్నారు. -
అక్షరంపై ఆంక్షలుకశ్మీర్లో 25 పుస్తకాలపై నిషేధం
అక్షరంపై అంక్షలు... పుస్తకాలపై నిషేధం అంటే.. చరిత్రను సమాధి చేయడం. ప్రజల జ్ఞాపకాలను కప్పేట్టేయాలని ప్రయతి్నంచడం. అధికారాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయడం. ఇటీవల జమ్మూ కశ్మీర్లో జరిగిందదే. 25 పుస్తకాలపై రాష్ట్రంలోని కేంద్రపాలిత ప్రభుత్వం నిషేధం విధించింది. బుకర్ ప్రైజ్ విజేత అరుంధతీ రాయ్, ప్రముఖ రచయితలు ఏజీ నూరానీ, విక్టోరియా స్కోఫీల్డ్, సుమంత్ర బోస్, డేవిడ్ దేవదాస్, అనురాధ భాసిన్, అయేషా జలాల్తోపాటు పలువురి పుస్తకాలపై నిషేధాన్ని ప్రకటించింది. తప్పుడు కథనాలు, వేర్పాటువాదం, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాయనే కారణంతో ఆయా పుస్తకాలను నిషేధిస్తున్నట్టు లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా నేతృత్వంలోని ప్రభుత్వం తెలిపింది. ‘విశ్వసనీయ నిఘా వర్గాల సమాచారం ఆధారంగా హింస, ఉగ్రవాదంలో యువత పాల్గొనేలా తప్పుడు కథనాలు, వేర్పాటువాద సాహిత్యం ఉసిగొల్పుతున్నాయి. ఇవి ఉగ్రవాదాన్ని కీర్తించి భారత్‌పై హింసను ప్రేరేపించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. వీటివల్లే యువత తప్పుదారి పడుతోందని నిఘా వర్గాల నుంచి సమాచారం అందిన తరువాతే ఈ పుస్తకాలను నిషేధిస్తున్నాం’అని జమ్మూ కశ్మీర్ హోం శాఖ గత బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ప్రభుత్వ ఉత్తర్వులో పుస్తకాలు ఏ విధంగా హింసను కీర్తించాయో ప్రత్యేకంగా ప్రస్తావించలేదు. కేవలం విశేషణాలను మాత్రమే ఉపయోగించింది. హోంశాఖ ఆదేశాలకు అనుగుణంగా 48 గంటల్లో, జమ్మూ కశ్మీర్ పోలీసులు పుస్తకాల దుకాణాల్లో సోదాలు నిర్వహించి పుస్తకాలను జప్తు చేశారు. వేసవి రాజధాని శ్రీనగర్‌తో పాటు, మధ్య కశ్మీర్‌లోని గండర్బాల్, ఉత్తర కశ్మీర్‌లోని హంద్వారా, దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాల్లోని పుస్తక దుకాణాల్లో దాడులు చేశారు. శ్రీనగర్‌లో చినార్ పుస్తక ఉత్సవం జరుగుతున్న సమయంలో ఈ నిషేధం విధించడం గమనార్హం. ఈ నిషేధం ప్రజల్లో సెన్సార్షిప్ భయాలను పెంచుతోంది. నిషేధిత జాబితాలో ఉన్న ప్రముఖ పుస్తకాలు.. ప్రభుత్వ నిషేధ జాబితాలో బుకర్ ప్రైజ్ విజేత అరుంధతీ రాయ్ రాసిన ‘ఆజాదీ’, రాజ్యాంగ నిపుణుడైన ఏజీ నూరానీ రాసిన ‘ది కశ్మీర్ డిస్ప్యూట్: 1947–2012’, బ్రిటిష్ రచయిత్రి, చిత్రకారిణి విక్టోరియా స్కోఫీల్డ్ రాసిన ‘కశ్మీర్ ఇన్ కాన్ఫ్లిక్ట్ – ఇండియా, పాకిస్తాన్ అండ్ ది అన్ఎండింగ్ వార్’, జర్నలిస్ట్, కశ్మీర్ టైమ్స్ ఎడిటర్ అనురాధ భాసిన్ రాసిన ‘ది డిస్మాంటిల్డ్ స్టేట్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ కశ్మీర్ ఆఫ్టర్ 370’, ‘కంటెస్టెడ్ ల్యాండ్స్’, డేవిడ్ దేవదాస్ రాసిన ‘ఇన్ సెర్చ్ ఆఫ్ ఏ ఫ్యూచర్ – ది స్టోరీ ఆఫ్ కశ్మీర్’, తారిక్ అలీ, హిలాల్ భట్, హబ్బా ఖాతున్, పంకజ్ మిశ్రా, అరుంధతీ రాయ్‌లతో కలిసి ఆంత్రోపాలజిస్ట్ అంగనా ఛటర్జీ రాసిన ‘కాశ్మీర్: ఎ కేస్ ఫర్ ఫ్రీడమ్’, మొహమ్మద్ యూసఫ్ సరాఫ్ రాసిన ‘కశ్మీరీస్ ఫైట్ ఫర్ ఫ్రీడం’, అబ్దుల్ గోక్హౌమి జబ్బార్ రాసిన ‘కశ్మీర్ పాలిటిక్స్ అండ్ ప్లెబిసైట్’, ఎస్సార్ బటూల్ రాసిన ‘డు యూ రిమెంబర్ కునాన్ పోషో్పరా?’, రాజకీయ శాస్త్రవేత్త, చరిత్రకారుడు సుమంత్ర బోస్ రాసిన ‘కశ్మీర్ ఎట్ ది క్రాస్‌రోడ్స్’, హఫ్సా కంజ్వాల్ రాసిన ‘కాలనైజింగ్ కశ్మీర్: స్టేట్–బిల్డింగ్ అండర్ ఇండియన్ ఆక్యుపేషన్’, మరో ఇద్దరు విదేశీ రచయితలు కలిసి రచించిన ‘హ్యూమన్ రైట్స్ వయొలేషన్స్ ఇన్ కశ్మీర్’తో పాటు పలు పుస్తకాలు ఉన్నాయి. పుస్తకాల్లో ఏముంది? అరుంధతీ రాయస్ రాసిన ఆజాదీ.. 2018 నుంచి 2020 మధ్య కాలంలో ఆమె రాసిన వ్యాసాలు, చేసిన ఉపన్యాసాల సంకలనం. ఇది భారత ప్రజాస్వామ్యానికి చీకటి కాలమని, మెజారిటీవాదం, మతోన్మాదం పెరుగుదల దేశానికి అత్యంత ప్రమాదకరమని చెబుతుంది. దేశం ఎలా స్వేచ్ఛను కోల్పోయిందో వివరిస్తుంది. ఏజీ నూరానీ ది కశ్మీర్ డిస్ప్యూట్.. దీర్ఘకాల కశ్మీర్ సమస్య సంక్లిష్ట చరిత్రను, దాని చుట్టూ ఉన్న రాజకీయ అసంతృప్తి, అసమ్మతిని వివరిస్తుంది. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్ర పాలితంగా మార్చడంపై ప్రశ్నలను సంధిస్తుంది. అనురాధా భసిన్ రాసిన పుస్తకం ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూ కశ్మీర్‌లోని ప్రజల జీవితాలు, స్థానిక రాజకీయాలు, సామాజిక రంగాలపై ఆ చర్యల ప్రభావం గురించి చర్చిస్తుంది. మొత్తంగా పుస్తకాలన్ని.. కశ్మీర్లో మానవ హక్కుల ఉల్లంఘనలు, మారణహోమాలు, ఈ ప్రాంతపు దశాబ్దాల రాజకీయ ప్రస్థానాన్ని, చరిత్రను ప్రతిబింబిస్తాయి. విమర్శల వెల్లువ... పుస్తకాల నిషేధంపై జమ్మూకశ్మీర్‌తోపాటు దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిషేధాన్ని ప్రజల జ్ఞాపకాలపై దాడిగా పౌర హక్కుల ఉద్యమకారులు, రాజకీయ పార్టీలు, రచయితలు అభివరి్ణస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా నిరసిస్తున్నారు. ప్రభుత్వంపై అసమ్మతిని అణచివేయడానికి సెన్సార్షిప్ ఒక ఉదాహరణని, ఇది దేశమంతటా ఉండగా.. 2019 తరువాత జమ్మూ కశ్మీర్లో అత్యంత దారుణంగా మారిందని పేర్కొన్నారు. నిషేధాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని లెఫ్టినెంటర్ గవర్నర్‌ను డిమాండ్ చేస్తున్నారు. ‘ఈ నిషేధం ఇప్పుడు కశ్మీర్లో జరుగుతోంది. రేపు మరోచోట జరగొచ్చు. అధికారం రాతలను అణచివేయొచ్చు. కానీ కశ్మీర్ చరిత్ర పుస్తకాలలో మాత్రమే లేదు. అది మౌఖిక సంప్రదాయంలో ఉంది. ప్రజల జ్ఞాపకాలలో ఉంది. ఆ జ్ఞాపకాలు చెరిపేస్తే చెరిగిపోవు. అవి ఒక తరం నుంచి మరో తరానికి అందజేస్తాయి’అని రచయితలు చెబుతున్నారు. ప్రమాదకర ధోరణి : అనురాధ భాసిన్ ‘మొదట వారు జర్నలిస్టుల కోసం వచ్చారు, మా గొంతులు నొక్కేయడంలో విజయం సాధించామని గ్రహించి, ఇప్పుడు విద్యారంగంపై దృష్టి సారించారు’అని ప్రముఖ ఎడిటర్ అనురాధ భాసిన్ విమర్శించారు. తన పుస్తకం హింసను ప్రోత్సహిస్తుందనే ఆరోపణలను భాసిన్ ఖండించారు. ‘నా పుస్తకం ఎక్కడా ఉగ్రవాదాన్ని కీర్తించలేదు. ప్రభుత్వాలను విమర్శించింది. ఈ రెండింటికీ తేడా ఉందనే విషయాన్ని అధికారులు గమనించడం లేదు. ఇది చాలా ప్రమాదకరమైన ధోరణి’అని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పుస్తకాలను నిషేధించడం వల్ల చరిత్ర చెరిగిపోదని జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ అన్నారు. ‘పుస్తకాలను నిషేధించడం వల్ల చరిత్ర చెరిగిపోదు. అది విభజనను మాత్రమే పెంచుతుంది. కశ్మీర్లో, ప్రజాస్వామ్య గొంతులను నొక్కేయడం, ప్రాథమిక హక్కులను అణచివేయడం అపనమ్మకాన్ని, పరాయి పాలనలో ఉన్నామనే భావనను పెంచుతుంది’అని ఆమె ఎక్స్‌లో పోస్ట్ చేశారు. నియంత్రణకు సుదీర్ఘ చరిత్ర... సెన్సార్షిప్ చరిత్ర ప్రపంచానికి కొత్త కాదు. కశ్మీర్‌కు అసలే కాదు. పుస్తకాలను నిషేధించడం ద్వారా ఆలోచనను అణచివేయాలనుకోవడం చాలా పాత వ్యూహమే. మానవ చరిత్ర అంతటా ఇది ఉంది. 1910లో, బ్రిటిష్ వారు మహాత్మా గాంధీ రాసిన హింద్ స్వరాజ్ పుస్తకం గుజరాతీ ఎడిషన్‌ను నిషేధించారు. దీనిని రాజద్రోహంగా అభివరి్ణంచారు. 1933లో మే నాజీ విద్యార్థులు జర్మన్ కానివిగా భావించిన వేలాది పుస్తకాలను తగలబెట్టారు. 1904లో, మున్షీ ముహమ్మద్ దిన్ ఫౌక్ శ్రీనగర్ నుంచి ఒక వార్తాపత్రికను ప్రచురించడానికి అప్పటి డోగ్రా పాలకుడు మహారాజా ప్రతాప్ సింగ్ అనుమతి కోరారు. ఫౌక్ అనుమతి నిరాకరించడమే కాకుండా, భవిష్యత్తులో అలాంటి అభ్యర్థనలను స్వీకరించకుండా నియమాలను రూపొందించాలని ఆయన తన ప్రధానమంత్రిని ఆదేశించారు. 2010లో 17 ఏళ్ల విద్యార్థి తుఫైల్ మట్టూ హత్య తర్వాత పెద్ద ఎత్తున నిరసనలు చెలరేగడంతో ప్రభుత్వం ఎస్ఎమ్ఎస్ సేవలను నిషేధించింది. మూడేళ్ల తరువాత పునరుద్ధరించింది. 2016లో తిరుగుబాటు తీవ్రస్థాయిలో ఉన్నప్పుడు శ్రీనగర్‌లోని ఇండిపెండెంట్ పత్రిక అయిన ‘కశ్మీర్ రీడర్’ను ప్రభుత్వం నిషేధించింది. హింసను ప్రేరేపించే ధోరణిలో ఉందంటూ నిలిపేసింది. కశ్మీర్లో నిత్య నిర్బంధాన్ని ఎదుర్కొన్నవారు జర్నలిస్టులే. ఆ నమూనా 2019 నుంచి మరింత పెరిగింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
అంతరిక్షం నుంచి తిరిగొచ్చిన లద్దాఖ్ విత్తనాలు
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని లద్ధాఖ్ నుంచి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి(ఐఎస్ఎస్) పంపించిన రెండు రకాల పంటల విత్తనాలను అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ(నాసా) సైంటిస్టులు విజయవంతంగా మళ్లీ భూమిపైకి చేర్చారు. వీటిని కొన్నాళ్లు పరీక్షించి, పొలంలో నాటబోతున్నారు. లద్ధాఖ్‌లో చలి ప్రాంతంలో సాగయ్యే పౌష్టికాహార పంటలైన సీబక్‌థోర్న్, హిమాలయన్ బక్వీట్ అనే పంటల విత్తనాలను ఈ నెల 1వ తేదీన నాసా క్రూ–11 మిషన్ ద్వారా ఐఎస్ఎస్కు చేర్చారు. ఈ విత్తనాలు సరిగ్గా వారం రోజులపాటు ఐఎస్ఎస్లోనే ఉన్నాయి. క్రూ–10 మిషన్ ద్వారా ఈ నెల 9వ తేదీన భూమిపైకి తిరిగి తీసుకొచ్చారు. ‘ఎమర్జింగ్ స్పేస్ నేషన్స్ స్పేస్ ఫర్ అగ్రికల్చర్, అగ్రికల్చర్ ఫర్ స్పేస్’ అనే ప్రయోగంలో భాగంగా ఈ ప్రక్రియ నిర్వహించారు. అంతరిక్షంలోని ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో విత్తనాలు ఎలాంటి మార్పులకు లోనవుతాయి? అనేది పరీక్షించడమే దీని ప్రధాన ఉద్దేశం. అంతరిక్షంలో భూమ్యాకర్షణ శక్తి ఉండదు. రేడియేషన్ అధికం. ఒత్తిడితో కూడిన వాతావరణం ఉంటుంది. ఉష్ణోగ్రతలు తరచుగా మారిపోతుంటాయి. సీబక్‌థోర్న్, హిమాలయన్ బక్వీట్ లద్ధాఖ్‌లో సంప్రదాయ పంటలు. పోషకాలు పుష్కలం. వైద్య అవసరాలకు కూడా ఉపయోగిస్తుంటారు. బాగా చల్లగా ఉండే వాతావరణంలో సాగవుతాయి. అంతరిక్ష వాతావరణాన్ని తట్టుకొనే పంటల పరీక్ష కోసం వీటినే ఎంపిక చేశారు. లద్ధాఖ్ నుంచి అంతరిక్షంలోకి వెళ్లొచ్చిన మొదటి పంటలుగా రికార్డుకెక్కాయి. ఇక ఈ విత్తనాలను ల్యాబ్‌లో విశ్లేషించబోతున్నారు. వాటిలో జన్యుపరమైన మార్పులేమైనా జరిగాయా? అనేది గుర్తిస్తారు. అవి ఎంతమేరకు ఉత్పత్తిని ఇస్తాయి అనేది పరీక్షిస్తారు. అంతరిక్ష వాతావరణాన్ని ఇవి తట్టుకోగలవని తేలితే భవిష్యత్తులో అంతరిక్షంలో ఈ పంటలను సాగు చేసే అవకాశం ఉందని, తద్వారా వ్యోమగాములు ఆహార అవసరాలు తీరుతాయని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ అంతరిక్ష–వ్యవసాయ రంగంలో భారతదేశ ప్రాధాన్యతను సీబక్‌థోర్న్, హిమాలయన్ బక్వీట్ విత్తనాలు చాటిచెబుతున్నాయి. ఐఎస్ఎస్ నుంచి వచ్చిన కొన్ని విత్తనాలను తదుపరి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపిస్తుండగా, మరికొన్నింటిని లద్ధాఖ్ ప్రభుత్వానికి బహుమతిగా ఇస్తామని ప్రోటోప్లానెట్ సంస్థ డైరెక్టర్ సిద్ధార్థ్ పాండే చెప్పారు. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఇద్దరు సైనికులు మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఏరివేతకు ఆపరేషన్ అకాల్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు మృతి చెందారు. మరో ఇద్దరు సైనికులు గాయపడ్డారు. దీంతో, వారిని ఆసుపత్రికి తరలించారు.వివరాల ప్రకారం.. జమ్ముకశ్మీర్‌లో ఆపరేషన్ అకాల్ తొమ్మిదో రోజుకు చేరుకుంది. ఈ క్రమంలో కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులను ఏరివేసేందుకు భద్రతా బలగాల ప్రయత్నించాయి. శుక్రవారం రాత్రి ఎదురుకాల్పుల్లో భాగంగా ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు భారత సైనికులు మృతి చెందగా.. మరో ఇద్దరు గాయపడ్డారు. ఘటనా స్థలంలో భద్రత బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.Operation AKHAL, Kulgam | Lance/Naik Pritpal Singh and Sepoy Harminder Singh made supreme sacrifice. Indian Army expresses deepest condolences and stands in solidarity with the bereaved families. Operation continues: Chinar Corps, Indian Army pic.twitter.com/WtabIZ6Mf0— ANI (@ANI) August 9, 2025 -
లోయలో పడ్డ సీఆర్పీఎఫ్ వాహనం.. ముగ్గురు జవాన్ల దుర్మరణం
జమ్ము కశ్మీర్ ఉదంపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సెంట్రల్ రిజర్వ పోలీస్ ఫోర్స్ సిబ్బంది వెళ్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు జవాన్లు మృతి చెందారు. మరో 15 మంది సిబ్బందికి గాయాలతో చికిత్స పొందుతున్నారు.మొత్తం 23 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందితో వెళ్తున్న బంకర్ వాహనం బసంత్‌గఢ్ నుంచి గురువారం ఉదయం తిరుగు పయనం అయ్యింది. అయితే.. 10.30గం. ప్రాంతంలో కాంద్వా వద్ద అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఇద్దరు సిబ్బంది మరణించగా.. ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో మరొకరు కన్నుమూశారు. క్షతగాత్రులకు స్థానికంగా ఓ ఆస్పత్రిలో చికిత్స అందుతోంది. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సహాయక చర్యలు ప్రారంభించారు. సదరు వాహనం 187వ బెటాలియన్‌కు చెందిందిగా నిర్ధారించారు. ఘటనపై కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. స్థానిక అధికారులతో మాట్లాడి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారాయన. -
భారత్, పాక్ శత్రుత్వం.. కశ్మీర్ ప్రధాన కారణం: పాక్ ప్రధాని సంచలన వ్యాఖ్యలు
ఇస్లామాబాద్: జమ్ము కశ్మీర్ అంశం, ఆర్టికల్ 370 రద్దు విషయమై పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్, భారత్ మధ్య ఉద్రిక్తతలకు కశ్మీర్ ప్రధాన కారణం అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో జమ్ము కశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దును షరీఫ్ తప్పుబడుతూ కేంద్రం నిర్ణయంపై మండిపడ్డారు.పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలకు కశ్మీరే ప్రధాన కారణం. భారత ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేయడం సరైన నిర్ణయం కాదు. యూఎన్ భద్రతా మండలి తీర్మానాలకు అనుగుణంగా కశ్మీరీ ప్రజల సంకల్పం, ఆకాంక్షలు మాత్రమే ముందుకు సాగడానికి ఏకైక మార్గం. కశ్మీరీల స్వేచ్చను భారత ప్రభుత్వం హరించింది. కశ్మీర్ ప్రజలను మోదీ ప్రభుత్వం అణిచివేసింది. కశ్మీర్ సమస్యకు న్యాయమైన పరిష్కారం పాకిస్తాన్ విదేశాంగ విధానంలో కీలకమైంది. ఆర్టికల్ 370 రద్దు వంటి ఏకపక్ష చర్యలను తిప్పికొట్టడంలో అంతర్జాతీయ సమాజం పాత్ర పోషించాలి’ అని కామెంట్స్ చేశారు. ఆగస్టు 5, 2019న ఆర్టికల్ 370ని రద్దు చేసిన సందర్భంగా భారతదేశం చర్యకు నిరసనగా పాకిస్తాన్ ఈ రోజును యూమ్-ఇ-ఇస్తేసల్గా పాటిస్తోందన్నారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. Prime Minister Shehbaz Sharif reaffirmed that lasting peace in the region is impossible without resolving the Kashmir issue. He stated that India cannot strip Kashmiris of their right to freedom, the era of oppression will end, and justice will prevail. pic.twitter.com/WjXezNPmgl— Fizza Butt (@fizzaabutt12) August 5, 2025మరోవైపు.. పాకిస్తాన్ డిప్యూటీ పీఎం ఇషాక్ దార్ మాట్లాడుతూ.. పాకిస్తాన్ ఎల్లప్పుడు తమ పొరుగు దేశాలతో స్నేహపూర్వక సంబంధాలను కోరుకుంటుంది. పొరుగు దేశాలతో ఘర్షణల కంటే సంభాషణ, దౌత్యాన్ని ఎంచుకుంటుంది. పాకిస్తాన్ ప్రజలు, సాయుధ దళాలు ఏదైనా దురాక్రమణ చర్యకు ధృఢమైన ప్రతిస్పందన అందించగలిగే సామర్థ్యం కలిగి ఉన్నారు. కశ్మీర్ విషయంలో పాక్ ఎప్పుడూ సానుకూలంగానే ఉంటుంది’ అని వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370, 35ఏలను రద్దు చేసి మంగళవారానికి ఆరేళ్లు గడిచాయి. ఈ నేపథ్యంలో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్, పీడీపీ సహా మరికొన్ని పార్టీలు మంగళవారం బ్లాక్ డేగా పాటించాయి. అలాగే మాజీ సీఎం, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ పిలుపు మేరకు మంగళవారం రాత్రి 9 గంటల నుంచి 15 నిమిషాల పాటు కశ్మీర్ వ్యాప్తంగా లైట్లను బంద్ చేశారు. ఆర్టికల్ 370 రద్దు అనేది రాజ్యాంగ విలువలపై దాడిగా పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ పేర్కొన్నారు. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా జమ్మూకశ్మీర్ యూనిట్ కాంగ్రెస్ మంగళవారం స్థానికంగా నిరసన చేపట్టింది. ఇదిలా ఉండగా జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను ఎప్పుడిస్తారని అధికార నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా కేంద్రాన్ని ప్రశ్నించారు. ఇక, ఆగస్టు 5వ తేదీన జమ్ము కశ్మీర్లో శాంతి, వికాసం, సమాన హక్కులకు బాటలు వేసిన గొప్ప రోజని బీజేపీ అధికార ప్రతినిధి అల్తాఫ్ థోకర్ తెలిపారు. దీన్ని ఇతర రాజకీయ పార్టీలు బ్లాక్‌డేగా పాటించడం సరికాదని హితవు పలికారు. -
జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ కన్నుమూత
జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్(79) కన్నుమూశారు. అతని ఎక్స్ ఖాతాను నిర్వహించే బృందం ఈమేరకు తన మరణాన్ని ధ్రువీకరించింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్యపాల్ మాలిక్ ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రి(ఆర్ఎంఎల్)లో చికిత్స పొందుతూ మరణించినట్లు తెలిపారు. ఆయన పార్థివదేహాన్ని ఢిల్లీలోని ఆర్కే పురంలోని ఆయన నివాసానికి తరలించనున్నారు. రేపు లోధి శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు.మాలిక్ 1970వ దశకంలో ఎమ్మెల్యేగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. రాజకీయ నాయకుడిగా దాదాపు 50 ఏళ్ల సుధీర్ఘ అనుభవం ఉంది. పశ్చిమ యూపీలోని బాగ్‌పట్‌కు చెందిన ఆయన మొదట చౌదరి చరణ్ సింగ్ ఆధ్వర్యంలోని భారతీయ క్రాంతి దళ్ పార్టీ టికెట్‌పై ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1980లో చరణ్ సింగ్ నేతృత్వంలోని లోక్‌దళ్ ఆయనను రాజ్యసభకు నామినేట్ చేసింది. కానీ 1984లో కాంగ్రెస్‌లో చేరి 1986లో రాజ్యసభకు వెళ్లారు.ఆర్టికల్ 370 రద్దు సమయంలో జమ్ముకశ్మీర్ గవర్నర్‌గా ఆయన ఏడాది కాలం పని చేశారు. గోవా, మేఘాలయ రాష్ట్రాలకు కూడా గవర్నర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. జమ్మూ కశ్మీర్ గవర్నర్‌గా పని చేసిన సత్యపాల్ మలిక్ చాలా సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుపట్టారు. పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి ఈయన చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆర్మీ జవాన్లను హెలికాప్టర్లో తరలించాలన్న తన విజ్ఞప్తిని కేంద్ర ప్రభుత్వం మన్నించి ఉంటే పుల్వామా ఘటన జరిగేదే కాదని ఆయన వ్యాఖ్యానించారు. కొన్ని నెలల క్రితం జరిగిన పహల్గామ్ దాడి విషయంలోనూ ఆయన మోడీ ప్రభుత్వాన్ని తప్పుపట్టారు. నిఘాలోపం కారణంగానే ఈ ఘటన జరిగిందని, ఈ ప్రభుత్వం సిగ్గులేనిదని అంటూనే ప్రజలకు క్షమాపణ చెప్పాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.पूर्व गवर्नर चौधरी सत्यपाल सिंह मलिक जी नहीं रहें।#satyapalmalik— Satyapal Malik (@SatyapalMalik6) August 5, 2025జమ్మూ కశ్మీర్ గవర్నర్‌గా పదవీ బాధ్యతల నుంచి తప్పుకున్న తరువాత 2024లో మాలిక్ నివాస స్థలంతోపాటు సుమారు 30 చోట్ల సీబీఐ దాడులు నిర్వహించింది. అయితే ఇందులో రూ.21 లక్షల నగదును, కొన్ని డిజిటల్ పరికరాలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. లంచం తీసుకున్న కేసులో ప్రశ్నించేందుకు హాజరు కావాల్సిందిగా సీబీఐ ఆదేశించింది కూడా. అయితే తాను ఎలాంటి తప్పు చేయలేదని మాలిక్ స్పష్టం చేశారు. గవర్నర్‌గా ఉండగా ఒక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చే విషయంలో తనకు రూ.300 కోట్ల లంచం ఇవ్వజూపారని మాలిక్ ఆరోపించారు. ఈ ఏడాది మే నెలలో సీబీఐ మాలిక్‌తోపాటు మరో ఐదుగురిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. సుమారు రూ.2200 కోట్ల సివిల్ కాంట్రాక్ట్‌ల జారీ విషయంలో అక్రమాలు జరిగాయన్నది ఆయనపై సీబీఐ చేసిన ఆరోపణ. -
భారత్ హెచ్చరించినా పట్టించుకోని పాక్.. పీఓకేలో దాయాది దుశ్చర్య!
న్యూఢిల్లీ: ఓవైపు భారత దళాలు ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలను ముమ్మరం చేస్తుండగా.. మరోవైపు సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు కొనసాగిస్తోంది. ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌లో ధ్వంసమైన మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడంలో ప్రధాన ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ చురుకుగా సహాయం చేస్తోంది. గత 90 రోజుల్లోనే, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) అంతటా 15కి పైగా ఉగ్రవాద శిబిరాలు, లాంచ్ప్యాడ్లు ఏర్పాటయ్యాయి.పాకిస్తాన్ ఇంటర్–సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ), ఇతర ప్రభుత్వ సంస్థల సహాయంతో ఈ శిబిరాలను పునర్నిర్మిస్తున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇవి భారత దాడుల్లో మరణించిన ఉగ్రవాదుల పట్ల సానుభూతి చూపడమే కాకుండా, ఇప్పుడు వారి నెట్‌వర్క్‌లను పునరుద్ధరించేందుకు పూర్తిగా మద్దతు ఇస్తున్నాయి. కెల్, షార్ది, దుధ్నియల్, అత్ముకం, జురా, లిపా వ్యాలీ, తండపాణి, నయ్యాలి, జాంకోట్, చకోఠి వంటి కీలక ప్రదేశాలలో శిబిరాలను పునర్నిర్మిస్తున్నారు. అదనంగా, జమ్మూ ప్రాంతంలోని మస్రూర్, చాప్రార్ వెంట అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నాలుగు లాంచ్ప్యాడ్లు, షకర్‌గఢ్‌లోని డ్రోన్ సెంటర్ కూడా పునరుద్ధరిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. చిన్న శిబిరాల ఏర్పాటు.. భారత దళాల దెబ్బకు తీవ్రంగా దెబ్బతిన్న ఈ ఉగ్రవాదులు ఇప్పుడు నిఘా నుంచి తప్పించుకోవడానికి, ఉగ్రవాద సామర్థ్యాలను బలోపేతం చేయడానికి కొత్త పద్ధతులు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగిస్తున్నారు. ఆపరేషన్ సిందూర్ కొనసాగుతుందని భారత్ ప్రకటిస్తుండటంతో భద్రతా బలగాల నుంచి మరిన్ని దాడులు జరుగుతాయని ఉగ్రవాదులు భయపడుతున్నారు. భారీ ప్రాణనష్టాన్ని నివారించడానికి, ఉగ్రవాదులు ఇప్పుడు ఒక శిబిరంలో దాదాపు రెండు డజన్ల మంది ఉగ్రవాదులకు వసతి కల్పించే చిన్న శిబిరాలను నిర్మిస్తున్నారు. గతంలో ఒకే శిబిరంలో ఈ సంఖ్య ఐదు రెట్లు ఎక్కువగా ఉండేది.అధునాతన సాధనాలతో పునరుద్ధరణ.. ఉగ్రవాదుల కదలికల సరళి కూడా మారిందని వర్గాలు చెబుతున్నాయి. వారు ఇప్పుడు కవచాలుగా ఉపయోగించుకునేందుకు తమ శిబిరాల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలను చేర్చుకుంటున్నారు. డ్రోన్లు, నిఘా పరికరాల వాడకంతో శిక్షణ సాంకేతికంగా మరింత అభివృద్ధి చెందింది. ఈ శిబిరాలు దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి. రాడార్‌ను మభ్యపెట్టడం, ఉపగ్రహ మాస్కింగ్, ఇతర అధునాతన సాధనాలను ఆయా శిబిరాల్లో ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. నిఘా వర్గాల అంచనాల ప్రకారం, ఈ పునర్నిర్మాణానికి ఐఎస్ఐ 100 కోట్లకు పైగా పాకిస్తాన్ రూపాయలను కేటాయించింది. -
Operation Akhal: మరో ముగ్గురు ఉగ్రవాదులు హతం
కుల్గామ్: ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మరీ్ పోలీసులు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్ ఆక్హాల్లో మరో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. జమ్మూ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలోని ఫారెస్ట్ ఏరియా సమీపంలో ఆదివారం ఉదయం ముగ్గురు ఉగ్రవాదులు భద్రతా బలగాల చేతిలో హతమవ్వగా, ఒక సైనికుడు గాయపడ్డారు. నిన్న రాత్రి నుంచి భద్రతా బలగాలు, టెర్రరిస్టుల మధ్య కాల్పులు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే నేటి(ఆదివారం, ఆగస్టు 3) ఉదయం ముగ్గురు ఉగ్రవాదుల్ని మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. దాంతో శని, ఆదివారాల్లో హతమైన ఉగ్రవాదుల సంఖ్య ఆరుకు చేరినట్లుఉ పేర్కొన్నారు. శనివారం సైతం ముగ్గురు ఉగ్రవాదుల్ని హతమార్చారు. ఉగ్రవాదులు కుల్గామ్ పారెస్ట్ ఏరియాలో మకాం వేసినట్లు తమకు అందిన సమాచారం మేరకు ఆపరేషన్ అక్హాల్ చేపట్టామన్నారు. దీనిలో భాగంగా ఈ రెండు రోజుల్లో ఆరుగురు ఉగ్రవాదుల్ని హతమార్చినట్లుఉ పేర్కొన్నారు. వీరు ద రెసిస్టెన్స్ ఫ్రంట్, లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థలకు చెందిన వారిగా గుర్తించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. -
లద్దాఖ్‌లో ఇస్రో ‘హోప్’ మిషన్
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) కీలక ప్రయోగాలకు సన్నద్ధమవుతోంది. వ్యోమగాములను 2027 నాటికి అంతరిక్షంలోకి, 2040 నాటికి చంద్రుడిపైకి పంపించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. దాంతోపాటు మరిన్ని కీలక అంతరిక్ష ప్రయోగాలకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరీక్షల కోసం జమ్మూకశ్మీర్‌లోని లద్ధాఖ్‌ను ఇస్రో ఎంపిక చేసింది. దేశంలో మొట్టమొదటి అనలాగ్ మిషన్‌ను ఇక్కడే చేపట్టబోతోంది. అచ్చంగా అంతరిక్షంలో, ఇతర గ్రహాలపై ఉండే భౌతిక, వాతావరణ పరిస్థితులను ఇక్కడ సృష్టిస్తారు. అందులో వ్యోమగాములు ఒంటరిగా గడపాల్సి ఉంటుంది. శారీరకంగా, మానసికంగా వారిలో కలిగే మార్పులను అధ్యయనం చేస్తారు. అంతేకాకుండా సాంకేతిక పరిజ్ఞానాన్ని సైతం పరీక్షించబోతున్నారు. ఈ మిషన్‌కు హిమాలయన్ ఔట్‌పోస్ట్ ఫర్ ప్లానెటరీ ఎక్స్‌ప్లోరేషన్(హోప్) అని నామకరణం చేశారు. → లద్ధాఖ్‌లో ప్రత్యేకమైన భౌగోళిక పరిస్థితులు ఉన్నాయి. ఇది సముద్ర మట్టానికి 14,000 మీటర్ల ఎత్తులో ఉంది. ఇక్కడ ఆక్సిజన్ లభ్యత 40 శాతమే. చలి కూడా అధికం. అంగారక గ్రహంతోపాటు చంద్రుడి ఉపరితలానికి దగ్గరగా ఉన్న పరిస్థితులను లద్ధాఖ్‌లో గుర్తించారు. అందుకే హోప్ మిషన్‌కు ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. → ఇద్దరు నివసించేలా ఒక ఇంటిని నిర్మిస్తారు. ఇది స్పేస్‌క్రాఫ్ట్ లాగే ఉంటుంది. ఆహారం వండుకోవడానికి వసతులుంటాయి. ఇతర వనరులు పరిమితంగానే కల్పిస్తారు. వ్యోమగాములు 10 రోజులపాటు నివసించాలి. ఇందుకోసం ఇప్పటికే ఇద్దరిని ఎంపిక చేశారు. ఒకరు ప్లానెటరీ సైన్స్ గ్రాడ్యుయేట్ కాగా, మరొకరు పీహెచ్ పరిశోధకుడు. 135 మంది దరఖాస్తు చేసుకోగా ఇద్దరికి అవకాశం దక్కింది. → సాధారణంగా అంతరిక్ష ప్రయోగాలు రోజుల తరబడి జరుగుతుంటాయి. క్లిష్టమైన పరిస్థితులకు తగ్గట్టుగా వ్యోమగాములు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇందుకోసం ముందస్తుగానే పరీక్షలు నిర్వహిస్తుంటారు. → అనలాగ్ మిషన్ అనేది అంతర్జాతీయంగా అమల్లో ఉన్న విధానం. వ్యోమగాముల ఆరోగ్యంపై పర్యవేక్షణ, ఎమర్జెన్సీ డ్రిల్స్‌తోపాటు ప్రతికూల పరిస్థితుల్లో కమ్యూనికేషన్లను పరీక్షించడానికి వాడుతున్నారు. → హోప్ ప్రాజెక్టులో ఐఐటీ–బాంబే, యూనివర్సిటీ ఆఫ్ లద్ధాఖ్‌తోపాటు కొన్ని ప్రైవేట్ సంస్థలు పాలుపంచుకుంటున్నాయి. → అనలాగ్ మిషన్‌తో అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ మరో అడుగు ముందుకు వేసినట్లేనని నిపుణులు చెబుతున్నారు. -
సింధూ నదిలో పడిపోయిన ఐటీబీపీ బస్సు.. వీడియో
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఐటీబీపీ(ఇండో-టిబెటియన్ బోర్డర్ పోలీసులు) ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. వర్షాల కారణంగా అదుపు తప్పి సింధూ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో పోలీసు సిబ్బందికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.వివరాల ప్రకారం.. జమ్ముకశ్మీర్‌లోని గండేర్బల్ జిల్లాలో ఐటీబీపీ సిబ్బంది ప్రయాణిస్తున్న బస్సు అదుపు తప్పి సింధూ నదిలో పడిపోయింది. ఈ ప్రమాదం నుంచి సిబ్బంది, బస్సు డ్రైవర్ తప్పించుకున్నారు. అతి కష్టం మీద వారంతా బయటకు వచ్చారు. గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదం కారణంగా సింధూ నది నీటిలో బస్సు మునిగిపోయింది. #WATCH | J&K: A joint search and rescue operation has been launched by SDRF Ganderbal and SDRF Sub Component Gund at Kullan in River Sindh, where a bus carrying ITBP Jawans fell down from the Kullan bridge into River Sindh, in which some weapons are missing. Three weapons have… pic.twitter.com/aDYefPHziQ— ANI (@ANI) July 30, 2025 అయితే, భారీ వర్షాల కారణంగా వాహనం అదుపుతప్పినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో సిబ్బందికి సంబంధించిన గన్స్, వస్తువులు నీటిలో కొట్టుకుపోయాయి. ఇప్పటి వరకు మూడు గన్స్‌ను వెతికిపట్టుకున్నట్టు సమాచారం. ఇక, ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. hired by the Indo-Tibetan Border Police (ITBP) 11D/6, met with an accident during the night hours of July 29, 2025, and fell into Nallah Sindh near Zirpora Kullan Bridge in Jammu and Kashmir #BusAccident #accident #itbp #nallahsindh #kullan #JammuKashmir pic.twitter.com/b7fc6OnlrE— NextMinute News (@nextminutenews7) July 30, 2025 J&K: A joint search and rescue operation has been launched by SDRF Ganderbal and SDRF Sub Component Gund at Kullan in River Sindh, where a bus carrying ITBP Jawans fell down from the Kullan bridge into River Sindh, in which some weapons are missing. Three weapons have been… pic.twitter.com/WV5q0mjHym— DD NEWS JAMMU | डीडी न्यूज़ जम्मू (@ddnews_jammu) July 30, 2025 -
ఆ ముగ్గురూ పహల్గాం ముష్కరులే
న్యూఢిల్లీ: వేలాది మంది విచారణ. అనుమా నితులపై నిరంతర నిఘా. ఆశ్రయమిచ్చిన వారి నిర్బంధం. గత ఏప్రిల్ 22న పహల్గాంలో పాశవిక దాడికి పాల్పడి 26 మంది అమాయక పర్యాట కులను పొట్టన పెట్టుకున్న ఉగ్రవాదుల కోసం ‘ఆపరేషన్ మహదేవ్’లో భాగంగా భద్రతా దళాలు నెలల తరబడి వేటాడిన తీరిది. శాటిలైట్ ఫోన్ సిగ్నల్స్ సాయంతో ఆనుపానులు చిక్కడంతో ఎట్టకేలకు వారి పాపం పండింది. సోమవారం జమ్మూ కశ్మీర్లో భద్రతా దళాల చేతుల్లో హతమ య్యారు. ఆ ముగ్గురూ పహల్గాం దాడిలో పాల్గొన్న ముష్కరు లేనని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. వారిని గుర్తించేందుకే నెలల సమయం పట్టిందని వెల్ల డించారు. సాంకేతికత, మానవ నిఘా సాయంతో ఉగ్రవాదులను కదలి కలను కనిపెట్ట గలిగినట్టు వివరించారు. ఆపరేషన్ సిందూర్‌పై మంగళవా రం లోక్‌సభలో ప్రత్యేక చర్చలో ఆ యన ప్రసంగించారు. ఆ పాశవిక దాడితో గాయ పడ్డ దేశ ప్రజల హృద యాలకు సాంత్వన చేకూ ర్చిన ఆపరేషన్ మహదేవ్ తాలూకు వివరాలను సభకు వెల్లడించారు. హతులైన ముగ్గురిని సులే మాన్ అలియాస్ ఫైజల్, అఫ్గాన్, జిబ్రాన్‌గా గుర్తించారు. వారంతా ఏ గ్రేడ్ ఉగ్రవాదులేనని తెలిపారు. సైన్యం తాలూకు 4 పారా మిలిటరీ బలగాలు, సీఆర్పీఎఫ్ జవాన్లు, జమ్మూ కశ్మీర్ పోలీసులు కలసి కట్టుగా ఆపరేషన్‌లో పాలుపంచుకున్నట్టు వివరించారు. పహల్గాం దాడికి పాల్పడ్డ ముష్కరులను ఏరివేసి జాతికి ఊరట కల్పించామని చెప్పారు. ‘‘ఇంత మంచి వార్త విని అధికార పక్షంతో పాటు విపక్షాలు ఆనందిస్తాయని ఆశించా. కానీ వారి ముఖాలన్నీ కళతప్పి కనిపిస్తున్నాయి’’ అంటూ ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ తప్పిదమే ‘పాక్’!ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమవుతూ వస్తోందని అమిత్ షా ఎద్దేవా చేశారు. దేశ సమస్యలన్నింటికీ కాంగ్రెస్ ప్రభుత్వాలే కారణమంటూ తూర్పారబట్టారు. పాక్ ఆక్రమిత భూభాగాలను స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అవకాశాలన్నింటినీ కాంగ్రెస్ ఎప్పటికప్పుడు కాలదన్నుతూ వచ్చిందని ఆరోపణలు గుప్పించారు. అలాంటి పార్టీకి మోదీ ప్రభుత్వం పాక్‌పై పూర్తిస్థాయిలో నిర్ణాయక చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించే నైతిక అర్హత కూడా లేదన్నారు. పహల్గాం దాడిలో పాక్‌కు క్లీన్చిట్ ఇచ్చేందుకు ఎక్కడ లేని ఉత్సాహమూ చూపిన చరిత్ర ఆ పార్టీది అంటూ మండిపడ్డారు. పహల్గాం దాడికి పాల్పడింది స్థానిక ఉగ్రవాదులే కావచ్చని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ హోం మంత్రి పి.చిదంబరం ఇటీవల కూడా వ్యాఖ్యలు చేశారని గుర్తు చేశారు. పీఓకేను స్వాధీనం చేసుకునే అవకాశం చేతికందిన వేళ సైనిక చర్యను కేంద్రం నిలిపేసిందా అంటూ కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగొయ్ సభలో ప్రశ్నించడంపై అమిత్ షా మండిపడ్డారు. ‘‘వాళ్లు ఏం నిరూపించాలని అనుకుంటున్నారు? ఎవరిని కాపాడాలనుకుంటున్నారు? ఇదంతా పాక్‌ను కాపాడేందుకు స్పష్టమైన కుట్రే’’ అంటూ తూర్పారబట్టారు. స్వాతంత్య్రం వచ్చిన వేళ దేశ విభజనను కాంగ్రెస్ వ్యతిరేకించి ఉంటే జమ్మూ కశ్మీర్లో అసలు ఉగ్ర భూతం జడలు విప్పేదే కాదన్నారు. ఉగ్రవాదానికి పాక్ తల్లివేరుగా మారిందంటూ దుయ్యబట్టారు. ఆ దేశం ఏర్పాటును కాంగ్రెస్ తాలూకు తప్పిదంగా అభివర్ణించారు. పాక్‌కు బుద్ధి చెప్పేందుకు వచ్చిన ప్రతి అవకాశాన్నీ కాంగ్రెస్ ఉద్దేశపూర్వకంగానే జారవిడిచిందని ఆరోపించారు. ‘‘1948లో పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను మన సైన్యం పూర్తిగా విముక్తం చేసే సమయంలో నాటి కాంగ్రెస్ ప్రధాని నెహ్రూ ఏకపక్షంగా కాల్పుల విమరణ ప్రకటించారు. 1962 యుద్ధం వేళ అస్సాంను చైనా దఖలు పరుస్తున్నట్టు బాహాటంగా ప్రకటన చేశారు. పైగా ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వ హోదా అవకాశాన్నీ కాలదన్నారు. 1971లో 90,000 మంది పాక్ సైనికులు భారత్‌కు లొంగిపోయారు. ఆ సంఖ్య నాటి పాక్ సైన్యంలో ఏకంగా 42 శాతం. అంతేగాక 15 వేల చదరపు కి.మీ. పాక్ భూభాగం కూడా మన అదుపులోకి వచ్చింది. అయినా పీఓకేను వెనక్కు తీసుకునేందుకు నాటి కాంగ్రెస్ ప్రధాని ఇందిరాగాంధీ ఎలాంటి ప్రయత్నమూ చేయలేదు. సరికదా, ఆ యుద్ధంలో స్వాధీనం చేసుకున్న పాక్ భూభాగాన్ని కూడా పువ్వుల్లో పెట్టి వెనక్కిచ్చారు. ఇలాంటి చరిత్ర ఉన్నవాళ్లు, పహల్గాం దాడికి పాల్పడ్డవారిని ఎందుకు పారిపోనిచ్చారని నన్ను అడుగుతున్నారు. వారిని తుదముట్టించడం ద్వారా ఈ ప్రశ్నకు నా తరఫున భద్రతా దళాలే బదులిచ్చాయి. 1986లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాక్‌కు పారిపోయింది కూడా కాంగ్రెస్ ప్రధాని రాజీవ్ హయాంలోనే. 1993లో ఉగ్రవాదులు సయీద్ సలాహుద్దీన్, టైగర్ మెమన్, అనీస్ ఇబ్రహీం కస్కర్, 2007లో రియాజ్ భత్కల్, 2010లో ఇక్బాల్ భత్కల్ దేశం వీడి పారిపోయినప్పుడు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెసే. వీళ్లందరినీ ఎందుకు పారిపోనిచ్చారో విపక్ష నేత రాహుల్‌గాంధీ నుంచి తెలుసుకోవాలని అనుకుంటున్నా’’ అని అన్నారు. -
ఆపరేషన్ మహదేవ్ పహల్గాం ఉగ్రదాడి మాస్టర్‌మైండ్ హతం
శ్రీనగర్: ‘పహల్గాం’ గాయానికి ప్రతీకారం మొదలైంది. దేశమంతటా ఆగ్రహావేశాలు రగిల్చిన ఆ దాడికి పాల్పడ్డ ఉగ్ర ముష్కరులకు కౌంట్‌డౌన్ మొదలైంది. పహల్గాం దాడి సూత్రధారి అయిన ఉగ్ర ముష్కరుడు హషీం మూసా అలియాస్ సులేమాన్ అలియాస్ ఆసిఫ్‌ను భద్రతా దళాలు సోమవారం మట్టుబెట్టాయి. జమ్మూ కశ్మీర్లో శ్రీనగర్ శివార్లలోని అటవీ ప్రాంతంలో ‘ఆపరేషన్ మహదేవ్’ పేరిట జరిపిన భీకర ఎన్కౌంటర్లో సులేమాన్‌తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను ఎలైట్ పారా కమెండో దళాలు కాల్చిపారేశాయి. వారిని జిబ్రాన్, హంజా అఫ్గానీగా గుర్తించారు. జిబ్రాన్ గతేడాది సోనామార్గ్‌లో టన్నెల్ ప్రాజెక్టు పనులు చేస్తున్న సిబ్బందిని పొట్టన పెట్టుకున్న ఉగ్ర ముఠా సభ్యుడని అధికార వర్గాలు వెల్లడించాయి. ఎన్కౌంటర్ ప్రాంతం నుంచి ఒక ఎం4 కార్బైన్, రెండు ఏకే రైఫిళ్లు, మందుగుండు, గ్రెనేడ్లు తదితరాలు స్వాధీనం చేసుకున్నా రు. ముష్కరుల మృత దేహాలను బలగాలు స్థానిక పోలీసులకు అప్పగించాయి. ఈ ముష్కరులకు సన్ని హితులైన మరో ఉగ్ర ముఠా సభ్యులు సైతం ఎన్కౌంటర్ ప్రాంతానికి సమీపంలోనే నక్కినట్టు బలగాలకు సమాచారం అందింది. దాంతో సమీప ప్రాంతాలన్నింటినీ దిగ్బంధించి జల్లెడ పడు తున్నారు. ‘ఆపరేషన్ మహదేవ్’ ఇంకా ముమ్మరంగా కొనసాగుతున్నట్టు సైనిక, స్థానిక పోలీసు వర్గాలు స్పష్టం చేశాయి. ఇందుకోసం భారీ సంఖ్యలో అదనపు బలగాలను మోహరించారు. సై న్యం, భద్రతా బలగాలు, కశ్మీర్ పోలీసు విభాగ సి బ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నా రు. ఆపరేషన్ మహదేవ్ ఇప్పట్లో ముగి యబోదని కశ్మీర్ జోన్ ఐజీ వీకే బిద్రీ స్పష్టం చేశారు..కునుకు తీస్తుండగానే...హషీం మూసా. అలియాస్ అబూ సులేమాన్. అలియాస్ ఆసిఫ్. పాక్ ప్రేరేపిత ఉగ్ర సంస్థ లష్కరే తయిబా టాప్ కమాండర్. పహల్గాం ఉగ్ర దాడి సూత్రధారి. ఆపరేషన్ మహదేవ్లో మన బలగాలు మట్టుబెట్టిన ముగ్గురు ముష్కరుల్లో అతి ముఖ్యుడు. అయితే ఇంతటి విజయం అంత తేలిగ్గా ఏమీ లభించలేదు. ఇందుకోసం సైన్యం అవిశ్రాంతంగా శ్రమించింది. సీఆర్పీఎఫ్, జమ్మూ కశ్మీర్ పోలీస్తో కలిసి ఏకంగా 14 రోజుల పాటు కలిసికట్టుగా, నిర్విరామంగా వేట సాగించింది. చివరికి శ్రీనగర్ శివార్లలోని అటవీ ప్రాంతంలో మూసా ముఠా ఆనుపానులు కనిపెట్టి ముప్పేట దాడి చేసింది. రెప్పపాటులో దాని కథ ముగించింది. జమ్మూ కశ్మీర్‌లోని లిడ్వాస్ ప్రాంతంలోని చినార్ కార్ప్స్ సైనిక విభాగం ఈ ఆపరేషన్‌ను ఆద్యంతం పర్యవేక్షించింది. అనంతరం ఘటనా స్థలిలో తీసిన డ్రోన్ ఫుటేజీని విడుదల చేసింది. అందులో ముగ్గురు ముష్కరుల మృతదేహాలు కనిపిస్తున్నాయి. వీరంతా లష్కరే, పాక్‌కే చెందిన మరో ఉగ్ర ముఠా జైషే మహ్మద్‌కు చెందిన ఉగ్రవాదులేనని తేలింది. పహల్గాం ఉగ్ర దాడి తమ పనేనని లష్కరే ప్రకటించుకోవడం తెలిసిందే. ఈ ముగ్గురిలో ముఖ్యుడైన మూసా దాడి సమయంలో తీరిగ్గా కునుకు తీస్తూ ఉండటం ఈ ఉదంతం మొత్తంలో కొసమెరుపు!అలా ఉచ్చు బిగించారు...నిజానికి ఆపరేషన్ మహదేవ్ రెండు రోజులుగా కొనసాగుతోంది. దట్టమైన దాచిగాం అడవుల లోతట్టు ప్రాంతం నుంచి అందని అనుమానాస్పద సిగ్నల్స్, కమ్యూనికేషన్‌తో బలగాలు అప్రమత్తమ య్యాయి. వాటి ఆధారంగానే అనుమానితుల జాడను కనిపెట్టగలిగాయి. ఆ వెంటనే సైనిక బృందాలు, ప్రత్యేక బలగాలు (ఎలైట్ ఫోర్సెస్) రంగంలోకి దిగి రెండు రోజులుగా పరిసరాలను జల్లెడ పడుతూ వచ్చాయి. ఆ క్రమంలో ఒక చెట్టు కింద తాత్కాలిక గుడారంలో విశ్రమిస్తున్న ముగ్గురు ఉగ్రవాదులను యాదృచ్చికంగా గుర్తించాయి. దాడిని ఏ మాత్రమూ ఊహించని ముష్కరులు టెంట్లో తీరిగ్గా కునుకు తీస్తూ కనిపించారు. సైనికులు వెంటనే తూటాల వర్షం కురిపించి వారిని హత మార్చారు. ఆపరేషన్‌ను పర్యవేక్షించిన అత్యున్నత స్థాయి అధికారి ఒకరు ఈ మేరకు ధ్రువీకరించారు.రూపం మార్చుకున్న మూసాఎట్టి పరిస్థితుల్లోనూ భద్రతా దళాలకు చిక్కొద్దనే ఉద్దేశంతో మూసా తన రూపాన్ని వీలైనంతగా మార్చుకున్నట్టు నిఘా వర్గాలు తెలిపాయి. ఆ క్రమంలో అతడు భారీగా బరువు కోల్పోయాడన్నారు. పహల్గాం దాడిలో పాల్గొంది ఈ ఉగ్రవాదులే.. మూసా(కుడివైపు చివర)అలాగే.. ఈ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు సైన్యం ప్రకటించింది. ఎప్పటికప్పుడు అప్డేట్స్ను తెలియజేస్తామని ఎక్స్ ద్వారా తెలియజేసింది. నిఘా వర్గాలు ఇచ్చిన సమాచారంతో ములనార్, హర్వాన్ ప్రాంతాల్లో కూంబింగ్ కొనసాగిస్తున్నాయి. మరిన్ని బలగాలు ఆ ప్రాంతానికి చేరుకుంటున్నట్లు సమాచారం. OP MAHADEVContact established in General Area Lidwas. Operation in progress.#Kashmir@adgpi@NorthernComd_IA pic.twitter.com/xSjEegVxra— Chinar Corps🍁 - Indian Army (@ChinarcorpsIA) July 28, 2025 -
పెద్దల అనుభవంతో విద్యార్థులకు లబ్ధి
శ్రీనగర్: యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్ నుంచి ప్రతిభావంతులైన విద్యార్థులు బయటకు రావాలని, దేశ అభివృద్ధికి, జమ్మూకశ్మీర్ అభివృద్ధికి వారు పాటుపడాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ఆకాంక్షించారు. ఆయన ఆదివారం శ్రీనగర్‌లో యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ప్రసంగించారు. పూర్వ విద్యార్థుల అనుభవం, పరిజ్ఞానం నేటి యువతకు ఉపయోగపడేలా చర్యలు తీసుకోవాలని యూనివర్సిటీ యాజమాన్యానికి విజ్ఞప్తి చేశారు. పెద్దలు చొరవ తీసుకుంటే నేటి విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఆ దిశగా సేవలందించాలని పూర్వ విద్యార్థులకు పిలుపునిచ్చారు. యువతకు మెరుగైన భవిష్యత్తు అందించడానికి రోడ్‌మ్యాప్ రూపొందించాలన్నారు. యూనివర్సిటీ ఆఫ్ కాశ్మీర్ అత్యున్నత నైపుణ్యాలు కలిగిన మానవ వనరులను దేశానికి అందిస్తున్న సంపూర్ణ విశ్వాసం తనకు ఉందని జస్టిస్ గవాయ్ వ్యాఖ్యానించారు. కాశ్మీర్ నిజంగా భూమిపై స్వర్గమేనని వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే ఇది ఎంతో అందమైన ప్రాంతమని పేర్కొన్నారు. మనం స్వర్గం నుంచి ఇక్కడికి వచ్చామన్నారు. ఈ యూనివర్సిటీలో చదువుకున్న ఎంతోమంది విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకున్నారని ప్రశంసించారు. యూనివర్సిటీ పూర్వ విద్యారి్థ, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్‌ను జస్టిస్ గవాయ్ సత్కరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు. -
యుద్ధానికి ఆయన వైఫల్యమే కారణం: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్
న్యూఢిల్లీ: పెహల్గాంలో ఉగ్రదాడి, ఆపై చోటు చేసుకున్న పరిస్థితులకు తాను కారణం కాదని, అది జమ్మూ-కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వైఫల్యమేనని ఆ రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసలు పెహల్గామ్ ఉగ్రదాడికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా కారణమన్నారు.కాగా, జమ్ముకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా సోమవారం ఉదయం గోడ దూకి మహారాజా హరిసింగ్‌కు చెందిన డోగ్రా బలగాలు కాల్చిచంపిన వీరుల స్మారకంగా ఉన్న శ్మశానం గోడ దూకి లోపలికి వెళ్లి అక్కడ అమరవీరుల స్థూపాలకు నివాళులు అర్పించారు,. డోగ్రా బలగాలకు వ్యతిరేకంగా పోరాటం చేసి 1931, జూలై 13వ తేదీన పలువురు అమరులయ్యారు. ఈ క్రమంలోనే వారికి కశ్మీర్‌లోని శ్మశాన వాటికలో స్మారక చిహ్నాలు ఏర్పాటు చేశారు. దీన్ని ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకునే యత్నం చేశారు. ఆదివారం(జూలై 13) సీఎం అబ్దుల్లాను ఇంటి నుంచి కదలకుండా ఒక బంకర్ ఏర్పాటు చేశారు. అయితే అది సోమవారం తీసేశారు. నేడు(జూలై 14) ఒమర్ అబ్దుల్లా ఒంటరిగా కారులో వెళ్లి ఆ అమరులకు నివాళులు అర్పించే యత్నం చేశారు. అక్కడ అబ్దుల్లాను పోలీసులు అడ్డుకునే యత్నం చేయడంతో గోడ దూకి వెళ్లి నివాళులర్పించి వచ్చారు. దీనిపై అబ్దుల్లా మాట్లాడుతూ.. రాష్ట్రంలో లెఫ్టినెంట్ గవర్నర్ పాలన నడుస్తోందంటూ మండిపడ్డారు. కేంద్ర నియమించిన లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా చెప్పినట్లే ఇక్కడ నడుస్తోందన్నారు. అనాలోచిత నిర్ణయాలతో ఆగం చేస్తున్నారని మండిపడ్డారు. జమ్మూ కశ్మీర్లో పెహల్గాం ఉగ్రదాదాడికి, తర్వాత ఆపరేషన్ సింధూర్ వరకూ భారత్ వెళ్లడానికి ఎల్జీ మనోజ్ సిన్హా వైఫల్యమే కారణమన్నారు. జమ్మూ కశ్మీర్ రాష్ట్ర హోదాను తిరిగి పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. -
భావప్రకటనా స్వేచ్ఛ ఉందని ఉగ్రవాదాన్ని కీర్తించరాదు
శ్రీనగర్: దేశ రాజ్యాంగం ప్రజలందరికీ భావ ప్రకటనా స్వేచ్ఛను ఇచి్చందని, అది ఉగ్రవాదాన్ని కీర్తించడం కోసం కాదని జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తేల్చిచెప్పారు. ఆదివారం జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా పట్టణంలో 40 ఉగ్రవాద బాధిత కుటుంబాలకు ఉద్యోగ నియామక పత్రాలను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా సభలో మాట్లాడుతూ.. ఉగ్రవాద బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు, న్యాయం అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ప్రతి బాధిత కుటుంబానికి పునరావాసం కల్పించే వరకూ ఈ ప్రక్రియ కొనసాగుతుందని ఉద్ఘాటించారు. రాజకీయ అవకాశాల కోసం ఎవరైనా ఉగ్రవాదాన్ని కీర్తిస్తే.. అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. జమ్మూకశ్మీర్ ఇప్పటికే చాలా ఎంతో రక్తపాతాన్ని చూసిందని, ఇప్పుడా బాధలకు, కన్నీళ్లకు ఫుల్స్టాప్ పెట్టాల్సిన సమయం ఆసన్నమైందని మనోజ్ సిన్హా పేర్కొన్నారు. -
నీలమణిపై మక్కువ.. హైదరాబాదీ నవాబ్కు టోకరా!
సాక్షి, సిటీబ్యూరో: కాశ్మీర్‌లోని కుస్తావ్ జిల్లాలోని పాడ్డర్ ప్రాంతంలోని ఎత్తైన పర్వతాల్లో దొరికే నీలమణికి ప్రపంచంలోనే మంచి డిమాండ్ ఉంది. దీనిని ఆసరాగా చేసుకున్న ఇద్దరు కాశ్మీరీలు హైదరాబాద్‌కు చెందిన నవాబ్ మీర్ ఫిరాసత్ అలీ ఖాన్‌కు రూ.3 కోట్ల మేర టోకరా వేశారు. గత ఏడాది జరిగిన ఈ మోసంపై ఆయన జమ్మూలోని బహుఫోర్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీన్ని దర్యాప్తు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, వారి నుంచి రూ.65 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తాన్ని కోర్టు ద్వారా బుధవారం నవాబ్ మీర్ ఫిరాసత్కు అందించారు. అలీ ఖాన్‌కు విలువైన మణులు, రత్నాలు సేకరణ హాబీగా ఉంది. దీనికోసం ఆయన దేశ విదేశాలకు చెందిన వ్యాపారులను సంప్రదిస్తుంటారు. ఈ విషయం తెలిసిన జమ్మూలోని రాజౌరికి చెందిన మహ్మద్ రాయజ్, పూంచ్ వాసి మహ్మద్ తాజ్ ఖాన్ పథకం ప్రకారం ఫిరాసత్ను సంప్రదించారు. పలుమార్లు హైదరాబాద్ వచ్చిన వెళ్లిన వారు తమ వద్ద విలువైన నీలమణి, అలాంటి మణులతో చేసిన ఆభరణా లు ఉన్నాయంటూ నమ్మబలికారు. తొలుత ఓ మణి ఖరీదు చేయడానికి ఆసక్తి చూపిన ఫిరాసత్ రూ.3 కోట్లు చెల్లించారు. అతడిని గత ఏడాది నవంబర్‌లో రాజౌరీకి పిలిపించిన వారు నకిలీ మణి అప్పగించారు. మరికొన్ని ఆభరణాల విక్రయం కోసం రూ.25 కోట్లకు బేరసారాలు చేశారు. ఆ ద్వయం అందించిన నీలమణిని పరీక్షించిన ఫిరాసత్ నకిలీదని గుర్తించారు. దీనిపై జమ్మూలోని బహు ఫోర్ట్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న అధికారులు నిందితుల కోసం వేట ప్రారంభించారు. సుదీర్ఘకాలం అజ్ఞాతంలో ఉన్న ఈ ద్వయం గత వారం చిక్కింది. వీరి నుంచి రూ.65 లక్షల నగదు స్వా«దీనం చేసుకుని కోర్టుకు అప్పగించారు. న్యాయస్థానం అనుమతితో ఆ మొత్తాన్ని బాధితుడికి చేర్చారు. నిందితుల నుంచి పోలీసులు మరికొన్ని నకిలీ నీలమణులు పొదిగిన ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఫిరాసత్ నుంచి కాజేసిన మొత్తం వెచ్చించి వారు నిందితులు జమ్మూ, కాశ్మీర్లో ఆస్తులు ఖరీదు చేసినట్లు పోలీసులు గుర్తించారు. భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని (బీఎన్ఎస్ఎస్) 107 సెక్షన్ ప్రకారం ఇలాంటి ఆస్తులను జప్తు చేసే అధికారం పోలీసులకు ఉంది. దీంతో ఆ కోణంలో చర్యలు తీసుకుంటున్నారు. -
జమ్మూకశ్మీర్ లో అదుపుతప్పిన అమర్ నాథ్ యాత్రికుల కాన్వాయ్
-
కశ్మీర్లో రాజకీయ దుమారం
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్లో ఉప ఎన్నికలకు ముందే రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. మిత్రపక్షాలైన నేషనల్ కాన్ఫరెన్స్– కాంగ్రెస్ కూటమిపై నీలినీడలు కమ్ముకున్నాయి. బడ్గాం, నగ్రోటా అసెంబ్లీ నియోజకవర్గాలలో జరుగనున్న ఉప ఎన్నికలు ఒమర్ ప్రభుత్వానికి సమస్యలను పెంచాయి. నగ్రోటా ఉప ఎన్నికలో పోటీ చేయడంపై రెండు రాజకీయ పార్టీలు దాదాపుగా ముఖాముఖి తలపడుతున్నాయి. ఈ స్థానం నుంచి పోటీకి అటు నేషనల్ కాన్ఫరెన్స్, ఇటు కాంగ్రెస్ పార్టీ వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేవు. నగ్రోటాలో రెండు పార్టీల మధ్య ఎటువంటి ఒప్పందం కుదరకపోతే కాంగ్రెస్ పార్టీ కూటమి నుంచి బయటికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాగా ఈ సీట్లపై ఇప్పుడు బీజేపీ దృష్టి సారించింది. నిజానికి, ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఏకైక ఎమ్మెల్యే ఒమర్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు. దీని తరువాత, కాంగ్రెస్ కూడా నేషనల్ కాన్ఫరెన్స్‌తో ఘర్షణ మూడ్‌లో ఉంది. కాంగ్రెస్ నాయకులు పూర్తిస్థాయి రాష్ట్ర హోదా అంశంపై గళం విప్పుతూ, ముఖ్యమంత్రిని కూడా బెదిరిస్తున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో నేషనల్ కాన్ఫరెన్స్‌కు 41 సీట్లు ఉన్నాయి. ఇది కాకుండా, ప్రభుత్వానికి ఆరుగురు కాంగ్రెస్, ఏడుగురు స్వతంత్రులు, ఒక సీపీఐ(ఎం) ఎమ్మెల్యే మద్దతు ఉంది. మిత్రపక్షాల మద్దతుదారుల సంఖ్యతో కలిపి నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వానికి 55 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ నగ్రోటా ఉప ఎన్నిక బరి నుంచి వెనక్కి తగ్గడానికి సిద్ధంగా లేదు. అందువల్ల ఈ స్థానానికి జరిగే ఉప ఎన్నికలో నేషనల్ కాన్ఫరెన్స్ తన అభ్యరి్థని నిలబెడితే, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకొనే అవకాశాలున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ మద్దతు ఉపసంహరించుకుంటే, ఒమర్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేల సంఖ్య 49కి తగ్గుతుంది. మరోవైపు నగ్రోటా స్థానంలో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ మధ్య ఘర్షణ వల్ల బీజేపీకి ప్రత్యక్ష ప్రయోజనం చేకూరనుంది. ఉప ఎన్నికకు సంబంధించి బీజేపీ కూడా గట్టి పోటీ ఇవ్వాలని నిర్ణయించింది. కాగా బడ్గాం స్థానంలోనూ కమలదళం తన అభ్యరి్థని నిలబెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. ఇప్పటివరకు ఇక్కడ ప్రధాన పోటీ నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీల మధ్యే ఉండేది. అయితే అమర్నాథ్ యాత్ర తర్వాత కేంద్ర ఎన్నికల సంఘం నగ్రోటా, బడ్‌గాంల్లో ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ రెండు సీట్లు ఖాళీగా ఉండి ఆరు నెలలు అయ్యింది. అయితే ప్రత్యేక పరిస్థితులలో మాత్రమే ఆరు నెలల తర్వాత ఏదైనా సీటును ఖాళీగా ఉంచవచ్చు. ఆరు నెలల వ్యవధి తర్వాత కూడా ఒక సీటును ఖాళీగా ఉంచడానికి ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951లోని నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. -
సవాళ్లకు ఎదురొడ్డి, నెలకు రెండు లక్షలు సంపాదిస్తున్న కశ్మీరీ యువతి
Sania Zehra Success story జమ్మూ కాశ్మీర్‌లోని పాంపోర్‌లో తన తండ్రి తేనెటీగల పెంపక వారసత్వం నుండి ప్రేరణ పొంది 20 ఏళ్ల వయసులోనే యువ పారిశ్రామికవేత్తగా రాణిస్తోందో యువతి. ఊహ తెలిసినప్పటి నుంచి తేనెటీగలను చూస్తూ పెరిగింది కశ్మీర్‌లోని బల్హామా నివాసి సానియా జెహ్రా (Sania Zehra). తండ్రి గుల్జార్ అహ్మద్మీర్ తేనెటీగలు పెంచుతుంటే తాను కూడా ఆసక్తిగా గమనించేది. కానీ కల్తీ ప్రపంచంలో ఆయనకు నష్టాలు తప్పలేదు. దీంతో తానే స్వయంగా రంగంలోకి కశ్మీర్లో తేనెటీగల పెంపకాన్ని విప్లవాత్మకంగా మార్చేసింది. నెలకు లక్షల్లో సంపాదిస్తోంది. సానియా జెహ్రా సక్సెస్ గురించి తెలుసుకుందాం పదండి.కశ్మీర్ సహజ సంపద సారాన్ని కాపాడుతూనే, అభిరుచి, ఆవిష్కరణ ,కృషితో తానేంటో నిరూపించుకుంది సానియా. ఎంత పెద్ద విజయానికైనా నాంది చిన్న ప్రయత్నమే అంటూ స్ఫూర్తిగా నిలుస్తోంది. సవాళ్లను, అడ్డంకులను బద్దలు కొట్టి, వ్యాపారంలో తమ మార్గాలను నిర్దేశించుకుంటున్న కశ్మీరీ మహిళల ప్రతిభకు నిలువటద్దం ఆమె. తేనెటీగల పెంపకంలో ఛాంపియన్సానియా జెహ్రా. కల్తీ మార్కెట్ కారణంగా తండ్రి గుల్జార్ నష్టాల్లో కూరుకు పోయాడు. దీంతో తానే రంగంలోకి దిగింది. అయితే ఫిజియోథెరపీలో డిప్లొమా చేసిన తమ బిడ్డ తేనెటీగలను పెంచుతానంటే ఇంట్లో ససేమిరా అన్నారు. అయినా పట్టుదలగా ముందుకు సాగింది. వారిని ఒప్పించింది. జమ్ము-కశ్మీరు హోలిస్టిక్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కింద రూ.1.50లక్షల లోన్ తీసుకుంది. 2022లో సానియా ‘కశ్మీర్ ప్యూర్ ఆర్గానిక్స్’ను స్థాపించింది. తేనె స్వచ్ఛతను కాపాడటం , వినియోగదారులు, రైతులు ఇద్దరికీ న్యాయమైన ధరలను అందించాలనే లక్ష్యంతో ఆమె ప్రయాణం ప్రారంభమైంది. కేవలం 35 తేనెటీగల కాలనీలతో ప్రారంభించి, వినూత్న పద్ధతులు, అంకితభావం వ్యాపారాన్నిమ ఉందుకు నడిపించింది. కేవలం రెండేళ్లలో 650 కాలనీలకు విస్తరించింది.ఏటా 5,500 కిలోల తేనె ఉత్పత్తి సామర్థ్యంతో, సానియా వెంచర్ ఇప్పుడు నెలకు రూ. 2 లక్షల టర్నోవర్‌ను సాధిస్తుంది. లాభాలకు మించి, ఆమె వ్యాపారం స్థిరమైన వ్యవసాయం తేనెటీగల పెంపకంలో అవకాశాలను సృష్టించడం ద్వారా స్థానికులకు సాధికారత కల్పించింది. పలువురు యువ వ్యవస్థాపకులకు స్ఫూర్తినిచ్చింది.‘కశ్మీర్ ప్యూర్ ఆర్గానిక్స్’ ప్రీమియం తేనె రకాల్లో ప్రత్యేకతను సాధించింది. స్వచ్ఛత ,ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందిన కాశ్మీరీ అకాసియా , మోనోఫ్లోరల్ తేనె ఉన్నాయి. సానియా అక్కడితో ఆగలేదు .ఆమె సౌందర్య సాధనాల మార్కెట్లోకి కూడా అడుగుపెట్టడం విశేషం. ఏ పనీ చిన్నది కాదు. అంకితభావం, నిజాయితీతో పనిచేసినపుడు ఆ దేవుడు తప్పక ఆశీర్వదిస్తాడు అంటుంది సానియా. తేనెటీగల పెంపకం తన తాత వ్యాపారం అని, తండ్రి తర్వాత ఇప్పుడు తాను మూడవ తరంగా ఈ వృత్తిలో ఉన్నానని సానియా చెబుతుంది గర్వంగా.‘‘బోర్ కొట్టినపుడు నాన్న గారికి తేనెటీగల పెంపకంలో సాయం చేసేదాన్ని. కానీ దానిలో ఇంత ఆసక్తిని పెంచుకుంటానని , ఉపాధిని వెతుక్కుంటానని ఎప్పుడూ అనుకోలేదు. నేడు చాలా మక్కువతో తేనెటీగల పెంపకం నుండి, తేనె మార్కెటింగ్ వరకు ప్రతిదాన్ని నేనే నిర్వహించుకుంటున్నా’’ సానియా -
గల్వాన్ గాయానికి ఐదేళ్లు.. కల్నల్ సంతోష్ సహా 20 మంది వీరమరణం
సాక్షి, నేషనల్ డెస్క్: గల్వాన్ లోయ ఘర్షణ. నిరాయుధులైన భారత జవాన్లపై చైనా సైనికులు చేసిన సాయుధ దాడి. మూడు వందలకు పైగా సైనికులు దొంగ దెబ్బ తీసినా.. భారత జవాన్లు వెన్ను చూపలేదు. ప్రాణాలకు ఎదురొడ్డి పోరాడారు. ఈ వీరోచిత పోరాటంలో 20 మంది భారత సైనికులు ప్రాణాలు కో ల్పోయారు. దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన ఈ గల్వాన్ ఘర్షణ జరిగి జూన్ 15తో ఐదేళ్లయింది. ఇది భారత్, చైనా మధ్య సంబంధాలను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ ఐదేళ్లలో వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి మన సరిహద్దు రక్షణ, వ్యూహాల్లో భారీ సంస్కరణలు చోటు చేసుకున్నాయి. సరిహద్దులో మౌలిక సదుపాయాలను పునరుద్ధరించడమే కాదు.. సైనిక సంసిద్ధతను కూడా భారత్ పెంచింది. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు ఇటీవల కాస్త మెరుగుపడ్డాయి.ఐదేళ్లలో అభివృద్ధి గల్వాన్ ఘటన తరువాత మన ఆర్మీ వాస్తవా«దీన రేఖ వెంబడి, ప్రత్యేకించి తూర్పు లడఖ్‌లో సాయుధ దళాలను అధిక మొత్తంలో పెంచింది. అలాగే.. యుద్ధ పరికరాలను కూడా మహరించింది. నిఘా వ్యవస్థను పటిష్టం చేసింది. గల్వాన్ సంఘటన ముఖ్యంగా మౌలిక సదుపాయాల విస్తరణ జరిగింది. కేంద్రం 2024లోనే రూ.2,236 కోట్ల విలువైన 75 ప్రాజెక్టులను పూర్తి చేసింది. ఇక 2025–26 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో రక్షణ శాఖకు రూ.6.81 లక్షల కోట్లు కేటాయించింది. ఇది గతేడాది కంటే కంటే 9.53% ఎక్కువ. ఇందులో రూ.7,146 కోట్లు సరిహద్దు రహదారుల సంస్థ (బీఆర్ఓ)కు కేటాయించారు.వీటితో లడఖ్, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, హిమాచల్ ప్రదేశ్ వంటి వ్యూహాత్మక ప్రాంతాల్లో రోడ్లు, వంతెనలు నిర్మించారు. వీటిలో ఉమ్లింగ్ లా (19,024 అడుగులు) వద్ద ప్రపంచంలోనే ఎత్తైన మోటారు రహదారి నిర్మాణంతోపాటు ప్రస్తుతం నిర్మిస్తున్న న్యోమా ఎయిర్‌ఫీల్డ్, షింకు లా మధ్య సొరంగం కూడా ఉన్నాయి. ఈ ఐదేళ్లలో వాస్తవాధీన రేఖ వెంబడి డిజిటల్ ల్యాండ్‌స్కేప్ కూడా మారిపోయింది. భారత సైన్యం, భారతీ ఎయిర్టెల్ సంయుక్తంగా గల్వాన్, డెమ్‌చోక్‌తో సహా లడఖ్‌లోని మారుమూల గ్రామాలను 4జీ నెట్‌వర్క్‌ను అనుసంధానించారు. ఇది టెలిమెడిసిన్, డిజిటల్ విద్య, ప్రభుత్వ పథకాలను ప్రజల వద్దకు చేర్చడానికి తోడ్పడింది. అంతేకాదు.. దీనివల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెంది, స్థానికుల జీవనోపాధిని మెరుగుపడింది.దౌత్యంలో పురోగతి... దౌత్య పరంగానూ ఇరు దేశాలు పురోగతిని సాధించాయి. 2020 నుంచి ఇప్పటివరకూ వివిధ స్థాయిల్లో 30 దశలకు పైగా చర్చలు జరిగాయి. అనేక ఘర్షణ పాయింట్ల నుంచి సైనాన్ని ఉపసంహరించుకున్నారు. జూలై 2020లో గల్వాన్, ఫిబ్రవరి 2021లో పాంగోంగ్ త్సో, ఆగస్టు 2021లో పీపీ17ఏ (గోగ్రా–హాట్ స్ప్రింగ్స్), సెపె్టంబర్ 2022లో పీపీ15, అక్టోబర్ 2024లో డెమ్చోక్, డెప్సాంగ్‌లలో చైనా తమ శిబిరాలను తొలగించింది. వీటితోపాటు అత్యున్నత స్థాయి దౌత్య సమావేశాలు జరిగాయి. ఈ ఫలితంగా మానస సరోవర్ యాత్ర పునఃప్రారంభమైంది.ఇక ఈనెల 12న భారత పర్యటనకు వచ్చిన చైనా విదేశాంగ మంత్రి సన్ వీడాంగ్‌తో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలతోపాటు ఇరు దేశాల మధ్య నేరుగా విమాన సేవలను తిరిగి ప్రారంభించే అంశాన్ని కూడా చర్చించారు. వీసాను సులభతరం చేయడంతోపాటు మీడియా మార్పిడి, 75 సంవత్సరాల భారతదేశం–చైనా దౌత్య సంబంధాల స్మారక వేడుకలపైనా చర్చించారు. అయితే... ఆయా ప్రాంతాల నుంచి సైన్యాన్ని పాక్షికంగా ఉపసంహరించి నప్పటికీ భారత్ అప్రమత్తంగానే ఉంది. వాస్తవాధీన రేఖ వెంబడి నిఘా కొనసాగిస్తోంది. ఆరోజు ఏం జరిగింది?..భారత్–చైనా సరిహద్దులోని గల్వాన్ నది కీలకమైన ప్రాంతం. ఇక్కడ చైనా బలగాలు వాస్తవా«దీన రేఖను దాటి ముందుకొచ్చాయి. వారిని మన జవాన్లు అడ్డుకోవడంతో పలుమార్లు ఘర్షణ జరిగింది. పరిస్థితి తీవ్రమవ్వడంతో సమావేశమైన ఇరు దేశాల ఆర్మీ అధికారులు బలగాలను వెనక్కి రప్పించాలని నిర్ణయించారు. గల్వాన్‌లోని భారత భూభాగంలో చైనా ఏర్పాటు చేసిన శిబిరాలను పరిశీలించేందుకు బిహార్ రెజిమెంట్ కమాండింగ్ అధికారి, తెలంగాణకు చెందిన కల్నల్ సంతోష్ బాబు జవాన్లతో కలిసి వెళ్లారు. చైనా తన శిబిరాలను తొలగించకపోవడంతో సంతోష్ బృందం వాటిని నేలమట్టం చేసింది. దాంతో చైనా సైనికులు మన జవాన్లపై దాడికి దిగారు. వంద మంది కూడా లేని భారత జవాన్లపై 300 మందికి పైగా చైనా సైనికులు దాడికి తెగబడ్డారు. అయినా ఈ దొంగ దెబ్బను మనవాళ్లు తెగువతో ఎదుర్కొన్నారు. జూన్15న సాయంత్రం మొదలైన మారణకాండ అర్ధరాత్రి దాకా సాగింది. అక్కడ ఆయుధాలు వాడకూడదన్న ప్రోటోకాల్‌ను మన సైనికులు పాటించగా చైనా ముష్కరులు మాత్రం ముందే ఏర్పాటు చేసుకున్న ఇనుప రాడ్లతో దాడికి దిగారు. గాయపడ్డ మన సైనికులను గల్వాన్ నదిలో తోసేశారు. ఈ క్రమంలో కమాండింగ్ అధికారి కల్నల్ సంతోష్ తీవ్ర గాయాలపాలయ్యారు. అయినా యుద్ధమైదానం వీడలేదు. తోటి జవాన్లను వెన్నంటి నడిపించారు. ఈ ఘర్షణలో ఆయనతో పాటు 20 మంది జవాన్లు ప్రాణాలరి్పంచారు. చైనా కూడా భారీగా సైనికులను కోల్పోయింది. ఆ సంఖ్యను అధికారికంగా ఇప్పటికీ వెల్లడించలేదు. 41 మంది గాయపడ్డారని ప్రకటించింది. చైనా 41 మంది సైనికులను కోల్పోయినట్టు రష్యా, ఆ్రస్టేలియా పరిశోధన తేల్చింది. -
కాంగ్రెస్‌కు హార్ట్ బ్రేక్.. ఆర్టికల్ 370 రద్దు ప్రశంసనీయం.. హస్తం నేత వ్యాఖ్యలు
ఢిల్లీ: ఇటీవలి కాలంలో కొందరు కాంగ్రెస్ నేతలు కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను ప్రశంసిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. కేంద్రం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలను కొనియాడుతున్నారు. ఈ విషయంలో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ ముందు వరుసలో ఉండగా.. ఇక, తాజాగా ఆ లిస్టులోకి కాంగ్రెస్ నేత, మాజీ విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ కూడా చేరిపోయారు. జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు చేయడాన్ని ఆయన ప్రశంసించడంతో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఆర్టికల్ 370 విషయమై ఖుర్షీద్ ప్రస్తావిచడంపై కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత దౌత్య బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇండోనేషియాకు వెళ్లిన బృందంలో సల్మాన్ ఖుర్షీద్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా ఇండోనేషియా ప్రతినిధి బృందంతో సల్మాన్ ఖుర్షీద్ మాట్లాడారు. జమ్ము కశ్మీర్‌కు సంబంధించి ఆర్టికల్ 370ని రద్దు చేయడం అభినందనీయం. ప్రత్యేక హోదా ఇచ్చే రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్, భారతదేశంలోని మిగతా ప్రాంతాల నుంచి జమ్ముకశ్మీర్ వేరుగా ఉందనే భావన చాలా కాలంగా ఉంది. కేంద్రం ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో ఈ భావన ముగిసింది. దీంతో, జమ్ముకశ్మీర్ కూడా భారత్‌లోని ప్రాంతమనే భావన ఏర్పడిందన్నారు. ఇదే సమయంలో ఆర్టికల్ 370 రద్దు తర్వాత, జమ్ము కశ్మీర్లో అభివృద్ధి, ఇటీవల జరిగిన ఎన్నికల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. జమ్ము కశ్మీర్ ఎన్నికల్లో 65 శాతం ఓటర్ల భాగస్వామ్యం ఉంది. ఇది కశ్మీర్లో ప్రభుత్వాన్ని ఎన్నుకునేందుకు దోహదపడిందని చెప్పుకొచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.ఇదిలా ఉండగా.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370ను రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ చేసిన తర్వాత కేంద్రం నిర్ణయాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలువురు సీనియర్ నేతలు తప్పుబట్టారు. ఆర్టికల్ 370ని కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆర్టికల్ రద్దు కారణంగా జమ్ముకశ్మీర్ ప్రజలకు ఉన్న ప్రత్యేక హక్కులు కోల్పోతారని కాంగ్రెస్ నేతలు చెప్పుకొచ్చారు. -
‘వహ్ సీఎం సాబ్’.. పహల్గాంలో కేబినెట్ భేటీ
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అరుదైన పని చేశారు. ఉగ్రవాదంతో దెబ్బ తిన్న పహల్గాం పట్టణ పర్యాటకాన్ని పునరుద్ధరించే చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో.. ఏకంగా పహల్గాంలోనే మంగళవారం ప్రత్యేక కేబినెట్ భేటీ (Pahalgam Cabinet Meeting) నిర్వహించి దేశానికి బలమైన సందేశం పంపించారు.అనంత్‌నాగ్ జిల్లా పహల్గాం పట్టణంలోని బైసరన్ లోయ(Baisaran Valley)లో ఏప్రిల్ 22వ తేదీ మధ్యాహ్నా సమయంలో సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు చెలరేగిపోయారు. ఈ ఘటనలో 26 మంది టూరిస్టులు దుర్మరణం పాలయ్యారు. అయితే.. ఈ దాడి ప్రభావం జమ్ము కశ్మీర్ పర్యాటకంపై తీవ్రంగా పడింది. ఘటన జరిగిన సాయంత్రం నుంచే పర్యాటకులు తిరుగు ముఖం పట్టడం ప్రముఖంగా చర్చనీయాంశమైంది. ఆ సమయంలో సీఎం ఒమర్ అబ్దుల్లా(CM Omar Abdullah) సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పర్యాటకుల భద్రతకు అక్కడి ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ.. తాకిడి మాత్రం పెద్దగా ఉండడం లేదు. దీంతో పర్యాటకాన్నే నమ్ముకున్న వేల కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి.ఈ నేపథ్యంలో.. పర్యాటకులను ఆహ్వానిస్తూ ఇవాళ ఆయన పహల్గాంలోనే కేబినెట్ భేటీ నిర్వహించారు. ‘‘ఉగ్రదాడి తర్వాత పహల్గాం ప్రజలు ధైర్యంగా ఉన్నారు. వాళ్లను అభినందించడానికే ఈ సమావేశం. ప్రభుత్వంలో ఉన్నామని ఏదో మొక్కుబడిగా ఇక్కడికి మేం రాలేదు. ఉగ్రవాదుల పిరికి పంద చర్యలకు.. కశ్మీర్ పర్యాటకం, అభివృద్ధి రెండూ ఆగిపోవని చెప్పడానికే వచ్చాం’’ అని అన్నారాయన. అంతకు ముందు.. పహల్గాంలోని టూరిస్టు ప్రాంతాల్లో ఆయన తిరిగారు. ఆ ఫొటోలు వైరల్‌కాగా.. వహ్ సీఎం సాబ్ అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.ఇదీ చదవండి: సారీ మేడమ్.. ఏదో ఏమోషన్లో అనేశా! -
అధైర్యపడొద్దు..
పూంచ్: కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ శనివారం జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ పట్టణంలో పర్యటించారు. ఈ నెల 7 నుంచి 10వ తేదీ దాకా పాకిస్తాన్ సైన్యం దాడు ల్లో మృతిచెందినవారి కుటుంబ సభ్యులను పరామర్శించి, సంఘీభావం ప్రకటించారు. గంటకుపైగా బాధితులతో మాట్లాడారు. వారి ఆవేదన విని చలించిపోయారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తాము అండగా ఉంటామని భరోసా కల్పించారు. బాధితుల సమస్యలను జాతీయ స్థాయికి తీసుకెళ్తామని, అందరికీ తెలియజేస్తామని హామీ ఇచ్చారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ప్రకటించారు. నియంత్రణ రేఖకు కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పూంచ్ టౌన్లో క్రిస్ట్ స్కూల్‌ను రాహుల్ సందర్శించారు. మే 7న ఉదయం పాక్ సైన్యం దాడుల్లో ఈ పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు చనిపోయారు. అయాన్, అరూబా అనే 13 ఏళ్ల ఇద్దరు కవలలు, రమీజ్ ఖాన్ అనే మరో విద్యార్థి మరణించాడు. తమ మిత్రులు దూరం కావడాన్ని ఈ స్కూల్ విద్యార్థులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. రాహుల్ వారితో మాట్లాడి ధైర్యం చెప్పారు. అంతా త్వర లోనే సర్దుకుంటుందని అన్నారు. ‘‘మీకు ఎదురైన సమస్యలకు ప్రతిస్పందనగా చదువులపై దృష్టి పెట్టండి’’అని సూచించారు. చక్కగా చదువుకోవాలని, చక్కగా ఆడుకోవాలని, ఎంతోమంది స్నేహితులను సంపాదించుకోవాలి అంటూ విద్యార్థులను ఓదార్చారు. పూంచ్ నుంచి ఓ కుటుంబం కారులో సురక్షిత ప్రాంతానికి వెళ్లిపోతుండగా పాకిస్తాన్ క్షిపణితో దాడి చేసింది. ఈ దాడిలో కారులో ఉన్న 13 ఏళ్ల బాలుడు విహాన్ భార్గవ్ ప్రాణాలు కోల్పోయాడు. విహాన్ భార్గవ్ కుటుంబాన్ని కూడా రాహుల్ పరామర్శించారు. -
కశ్మీర్ మాజీ గవర్నర్ మాలిక్‌పై సీబీఐ చార్జిషీట్
న్యూఢిల్లీ: కిరు జలవిద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్టుల విషయంలో అవినీతికి పాల్పడ్డారంటూ జమ్మూ కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్, మరో ఏడుగురిపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) గురువారం చార్జిషీట్ దాఖలు చేసింది. మాలిక్‌తోపాటు అతని అనుచరులు వీరేందర్ రానా, కన్వర్‌సింగ్ రానాలపై మూడేళ్ల విచారణ అనంతరం చార్జిషీట్‌ను స్పెషల్‌కోర్టుకు సమర్పించింది. చీనాబ్‌వాలీ పవర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎం.ఎస్.బాబు, డైరెక్టర్లు అరుణ్‌కుమార్ మిశ్రా, ఎం.కె.మిట్టల్, పటేల్ ఇంజనీరింగ్ సంస్థ మేనేజిగ్ డైరెక్టర్ రుపేన్ పటేల్, మరోవ్యక్తి కన్వల్జీత్ సింగ్‌దుగ్గల్ పేర్లను కూడా చేర్చింది. ‘‘నేను గత మూడు నుండి నాలుగు రోజులుగా అనారోగ్యంతో ఉన్నాను. ఆసుపత్రిలో చేరాను. అయినప్పటికీ, ప్రభుత్వ సంస్థల ద్వారా నియంత నా ఇంటిపై దాడి చేస్తున్నాడు. నా డ్రైవర్, నా సహాయకుడిని కూడా అనవసరంగా వేధిస్తున్నారు. నేను రైతు కొడుకుని, ఈ దాడులకు నేను భయపడను. నేను రైతులతో ఉన్నాను’’ అని ఎక్స్ వేదికగా మాలిక్ గురువారం పోస్ట్ చేశారు. -
ముగ్గురు జైషే ఉగ్రవాదుల హతం
త్రాల్: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా, త్రాల్ ప్రాంతంలోని నాదిర్ గ్రామంలో భద్రతా దళాలతో జరిగిన కాల్పుల్లో ముగ్గురు జైషే మహ్మద్ ఉగ్రవాదులు మృతి చెందారు. గురువారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీర్ వని, యావర్ అహ్మద్ భట్‌గా గుర్తించారు. వీరందరూ పుల్వామా జిల్లా వాసులే. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నట్లు నిర్దిష్ట సమాచారం అందుకున్న భద్రతా దళాలు కార్డన్, సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఉగ్రవాదుల జాడ కోసం భద్రతాదళాలు డ్రోన్లను ఉపయోగించాయి. ఉగ్రవాదులను గుర్తించిన అనంతరం.. లొంగిపోవాలని కోరాయి. అయితే, భద్రతా సిబ్బందిని చూసిన వెంటనే, ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. మూడు గంటల పాటు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు మృతి చెందారు. ఆ ప్రాంతంలో ఇంకా ఉగ్రవాదులు ఉండొచ్చని భద్రతా దళాలు భావిస్తున్నాయి. దీంతో ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. జమ్మూకశ్మీర్‌లో 48 గంటల్లో జరిగిన రెండో ఎన్కౌంటర్ ఇది. మంగళవారం షోపియాన్ జిల్లాలోని కెల్లర్ ప్రాంతంలో జరిగిన ఆపరేషన్‌లో ముగ్గురు లష్కరే తోయిబా ఉగ్రవాదులు హతమయిన సంగతి తెలిసిందే.లొంగిపోవాలని తల్లి వేడుకున్నా...మరణించిన ఉగ్రవాదుల్లో ఒకరైన అమీర్ నజీర్ ఎన్‌కౌంటర్‌కు ముందు తల్లితో మాట్లాడిన వీడియో ఒకటి బయటికి వచ్చింది. ఎన్‌కౌంటర్‌కు ముందు చివరి క్షణాల్లో నజీర్ తను దాక్కున్న ప్రదేశం నుంచి తల్లికి వీడియో కాల్ చేశాడు. తన తల్లితో, సోదరితో మాట్లాడాడు. అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకోవద్దని, భద్రతాదళాలకు లొంగి పోవాలని నజీర్‌ను తల్లి వేడుకుంది. ఏకే 47 పట్టుకుని ఉన్న నజీర్ లొంగిపోవడానికి నిరాకరించాడు. ‘సైన్యాన్ని నా ముందుకు రానివ్వండి. అప్పుడు చూస్తా’ అని బదులిచ్చి కాల్ కట్ చేశాడు. -
పాక్ అణ్వాయుధాలను మీరే పర్యవేక్షించాలి
శ్రీనగర్: అత్యంత దుష్ట దేశమైన పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఉండడం ప్రపంచానికి ఎప్పటికైనా ప్రమాదకరమేనని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తేల్చిచెప్పారు. వాటిని అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ) పర్యవేక్షణలోకి తీసుకురావాలని అన్నారు. పాక్ అణ్వాయుధాలు ఐఏఈఏ పరిధిలో ఉంటేనే ప్రపంచ భద్రతకు ముప్పు వాటిల్లదని స్పష్టంచేశారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత రాజ్‌నాథ్ సింగ్ తొలిసారిగా గురువారం జమ్మూకశ్మీర్‌లో పర్యటించారు. పహల్గాం ఉగ్రవాద దాడి మృతులతోపాటు పాకిస్తాన్‌పై దాడిలో ప్రాణత్యాగం చేసిన జవాన్లకు నివాళు లర్పించారు. శ్రీనగర్‌లోని బాదామీబాగ్ కంటోన్మెంట్లో సైనికులను ఉద్దేశించి మాట్లాడా రు. పాక్ అణు బెదిరింపులను భారత్ ఏమాత్రం లెక్కచేయలేదని గుర్తుచేశారు. ఉగ్రవాదాన్ని అంతం చేసే విషయంలో మన పట్టుదలను దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చని అన్నారు. భారత్‌పై అణ్వాయుధాలు ప్రయోగిస్తామని పాక్ ఎన్నోసార్లు బెదిరించిందని తెలిపారు. పాక్ నిజస్వరూపం ప్రపంచం మొత్తం చూసిందని పేర్కొన్నారు. ధూర్త దేశం చేతిలో అణ్వాయుధాలు ఉండడం సరైనదేనా? అని ప్రపంచ దేశాలను రాజ్‌నాథ్ ప్రశ్నించారు. అందుకే పాక్ అణ్వాయుధాలను ఐఏఈఏ పరిధిలోకి తీసుకురావాలని స్పష్టంచేశారు. ఉగ్రవాదంపై మన పోరాటంలో ‘ఆపరేషన్ సిందూర్’ అతిపెద్ద చర్య అని వెల్లడించారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించే విషయంలో ఎంతదూరమైన వెళ్తామని నిరూపించామని పేర్కొన్నారు. -
జమ్మూకశ్మీర్ లో కొనసాగుతున్న ఉగ్రవేట
-
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఉగ్రవాది హతం
శ్రీనగర్: ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా జమ్ముకశ్మీర్‌లో భద్రతా బలగాలు ముందుకు సాగుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా జమ్ము కశ్మీర్‌లోని అవంతి పొరా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమైనట్టు అధికారులు వెల్లడించారు.వివరాల ప్రకారం.. జమ్ము కశ్మీర్‌లోని అవంతి పొరా ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగాయి. ఇందులో పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్తంగా పాల్గొన్నాయి. ఈ దాడుల్లో ఒక ఉగ్రవాది చనిపోయినట్టు అధికారులు తెలిపారు. ఇక, నాడర్, థ్రాల్ ప్రాంతంలో ఈ కాల్పులు చోటు చేసుకున్నాయని పోలీసులు వెల్లడించారు. గత 48 గంటల్లో కశ్మీర్లో ఇది రెండో ఎన్కౌంటర్ ఘటన అని వారు పేర్కొన్నారు.#WATCH | J&K | Encounter underway at Nader, Tral area of Awantipora. Police and security forces are carrying out the operation. Details awaited. (Visuals deferred by unspecified time) pic.twitter.com/sn92x3MfiN— ANI (@ANI) May 15, 2025 -
షెల్లింగ్ లేదు, కాల్పులు లేవు
జమ్మూ/శ్రీనగర్/చండీగఢ్: భారత్–పాకిస్తాన్ కాల్పుల విరమణ అనంతరం ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు జమ్మూకశ్మీర్, నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు చాలా ప్రశాంతంగా ఉంది. 19 రోజుల్లో మొదటిసారిగా షెల్లింగ్, కాల్పులు జరగకుండా ఉన్నాయని ఆర్మీ తెలిపింది. ఏప్రిల్ 22న పహల్గాం దాడి తర్వాత కాల్పుల విరమణ ఉల్లంఘనలలో మొదటిసారి పూర్తిగా విరామం కనిపించింది. కాల్పుల విరమణ ఒప్పందం జరిగిన కొన్ని గంటల తర్వాత, శనివారం రాత్రి, పాకిస్తాన్ జమ్మూకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు మీదుగా వరుస క్షిపణి, డ్రోన్ దాడులను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఆదివారం మాత్రం ఎలాంటి హింసాత్మక ఘటనలు నమోదు కాలేదు. పూంచ్‌లోని సురాన్‌కోట్‌లో సాధారణ పరిస్థితులు తిరిగి నెలకొన్నాయి. పహల్గాం దాడి తరువాత ఏప్రిల్ 23 నుంచి మే 6 వరకు, నియంత్రణ రేఖ వెంబడి అనేక కాల్పుల ఘటనలు నమోదయ్యాయి. రెండు రోజుల కిందట సూరన్‌కోట్‌లో భారీ కాల్పులు జరిగాయి. దీనితో నివాసితులు భయాందోళనకు గురయ్యారు. దాడి తరువాత, నివాసితులు పట్టణం నుంచి పారిపోయారు. కొందరు సమీపంలోని కొండ గ్రామాలు మరియు బంకర్లలో ఆశ్రయం పొందారు. మరికొందరు జమ్మూలోని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. పరిస్థితి ఇప్పుడు మెరుగుపడటంతో, ప్రజలు త్వరలో పూంచ్‌లోని తమ ఇళ్లకు తిరిగి రావాలని ఆశిస్తున్నారు. శ్రీనగర్, పఠాన్‌కోట్, రాజౌరి, అఖ్నూర్, జమ్మూ, కుల్గాం, శ్రీ గంగానగర్, బుద్గాంలలో సాధారణ పరిస్థితికి అద్దం పడుతూ అనేక దృశ్యాలు ఆన్లైన్లో కనిపించాయి. సరిహద్దు ప్రాంతాలకే కాకుండా, చండీగఢ్‌తో సహా ఇతర ప్రాంతాల్లో ఆంక్షలు ఎత్తివేయడంతో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. రోజువారీ జీవితం తిరిగి ప్రారంభమైందని, పరిస్థితి ఇప్పుడు స్థిరంగా ఉందని చండీగఢ్ డిప్యూటీ కమిషనర్ తెలిపారు. దుకాణాలు, ఇతర వాణిజ్య సంస్థలు సాధారణ సమయాల ప్రకారం తెరిచి ఉండటానికి పోలీసులు అనుతించారు. అయితే పౌరులు ఎలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండాలని డిప్యూటీ కమిషనర్ హెచ్చరించారు. పగటి పూట ఎలాంటి సమస్యలు లేవని, రాత్రి 7.30 గంటల తరువాత దుకాణాలు మూసివేస్తుండటంతో సాధారణ జనజీవనానికి ఇబ్బందేమీ లేదని, ప్రజల జీవనోపాధి కూడా ప్రభావితం కావడం లేదని జైసల్మేర్‌కు చెందిన ఓ వ్యక్తి వివరించారు. -
మధ్యవర్తిత్వం ప్రసక్తే లేదు
న్యూఢిల్లీ/న్యూయార్క్/వాషింగ్టన్: రావణకాష్టంగా రగిలిపోతున్న, దశాబ్దాలుగా ఎటూ తేలకుండా సందిగ్ధత, సంఘర్షణలకు కారణమైన జమ్మూకశ్మీర్ అంశంలో మూడో వ్యక్తి జోక్యం అక్కర్లేదని భారత్ పునరుద్ఘాటించింది. కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించేందుకు ఆసక్తి కనబరుస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై భారత్ ఆదివారం స్పందించింది. ‘‘కశ్మీర్‌పై మాకు స్పష్టమైన విధానం ఉంది. చర్చలంటూ జరిగితే పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను భారత్‌కు అప్పగించడం గురించే. అంతకంటే మాట్లాడేది ఏదీ లేదు. ఉగ్రవాదుల అప్పగింత గురించి పాక్ మాట్లాడదల్చుకుంటే సిద్ధంగా ఉన్నాం. అంతకు మించి మాట్లాడటానికి మరో టాపికేమీ లేదు. ఇతర అంశాలపై ఇతరుల మధ్యవర్తిత్వం ఆశించట్లేము. ఇతరులు మధ్యవర్తిత్వం చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు’’ అని ప్రకటించింది. జేజేలు అంటూనే జోక్యానికి యత్నం కాల్పుల విరమణకు ముందడుగు వేసి అత్యంత యుక్తితో వ్యవహరించిన శక్తివంతమైన భారత్, పాక్ అగ్రనాయకత్వాలను చూసి ఎంతో గరి్వస్తున్నానని ఓవైపు పొగుడుతూనే మరోవైపు కశ్మీర్ అంశంలో మధ్యవర్తిగా నిలబడతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన అసలు ఉద్దేశ్యాన్ని బయటపెట్టారు. ఈ మేరకు ఆదివారం ఆయన ‘ట్రూత్ సోషల్’లో ఒక పోస్ట్‌చేశారు. ‘‘ ప్రస్తుత ఉద్రిక్తతలను తగ్గించుకోకపోతే వినాశనం తప్పదని భవిష్యత్ దర్శనం చేసి కాల్పుల విరమణకు మొగ్గుచూపిన భారత్, పాక్ నాయకత్వాలను చూస్తే నాకెంతో గర్వంగా ఉంది. అయితే దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉండి పోయిన కశ్మీర్ అంశానికి పరిష్కారం కనుగొనేందుకు మీ రెండు దేశాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నా’’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించారు. ట్రంప్ జోక్యాన్ని స్వాగతించిన పాక్ మధ్యవర్తిగా నిలబడేందుకు సిద్ధంగా ఉన్నానని ట్రంప్ చేసిన ప్రకటనపై పాకిస్తాన్ స్పందించింది. ‘‘ కాల్పుల విరమణ అంశంలో మధ్యవర్తిగా వ్యవహరించి నిర్మాణాత్మక పాత్ర పోషించినందుకు అమెరికాను అభినందిస్తున్నాం. ఇక జమ్మూకశ్మీర్ వివాద పరిష్కారానికి కృషిచేస్తానని ట్రంప్ ప్రకటన చేయడం ఎంతో సంతోషకరం. ఆయన సుముఖత వ్యక్తంచేయడాన్ని మేం అభినందిస్తున్నాం’’ అని పాకిస్తాన్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. -
కుక్క తోక వంకరే!.. నీచ బుద్ధిని మరోసారి చాటుకుంది..
పాకిస్తాన్ తీరుపై టీమిండియా మాజీ క్రికెటరుల వీరేందర్ సెహ్వాగ్, శిఖర్ ధావన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒప్పందం కుదిరిన కాసేపటికే దాయాది మరోసారి తమ నీచ బుద్ధిని బయటపెట్టుకుందని మండిపడ్డారు. కుక్క తోక వంకర అనే సామెత వీరికి సరిగ్గా సరిపోతుందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆపరేషర్ సిందూర్కాగా పహల్గామ్ ఉగ్రదాడితో జమ్మూకశ్మీర్‌లో ముష్కరులు మరోసారి కల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. ప్రశాంతమైన బైసరన్ లోయలో అమాయక పర్యాటకులపై కాల్పులు జరిపి ఇరవై ఆరు మందిని ఉగ్రవాదులు పొట్టనబెట్టుకున్నారు. పురుషులే లక్ష్యంగా కాల్పులకు తెగబడి ఆడబిడ్డల నుదిటి సిందూరం చెరిగిపోయేలా పాశవిక దాడికి పాల్పడ్డారు.ఇందుకు ఆపరేషర్ సిందూర్ పేరిట భారత్ గట్టి బదులిచ్చింది. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. అయితే, ఉగ్రవాదులకు వ్యతిరేకంగా భారత్ చేపట్టిన దాడులను సహించలేకపోయిన పాకిస్తాన్ సైన్యం.. రంగంలోకి దిగింది.సరిహద్దుల వెంబడి కాల్పులకు తెగబడటంతో పాటు సామాన్యులు, భారత సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేయగా.. భారత సైన్యం ఇందుకు దీటుగా బదులిచ్చింది. పాక్ పప్పులు ఉడకనీయకుండా గాల్లోనే డ్రోన్లు, క్షిపణులను పేల్చివేసింది. అంతేకాదు కరాచీ, లాహోర్, ఇస్లామాబాద్‌ల నుంచి తమను టార్గెట్ చేసిన వారికి బుద్ధి వచ్చేలా విజయవంతంగా ఎదురుదాడులు చేసింది.కాళ్ల బేరానికి వచ్చి.. ఆపై మరోసారిఈ నేపథ్యంలో కాళ్ల బేరానికి వచ్చిన పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి రావాలంటూ భారత్‌ను కోరింది. అమెరికాతో మధ్యవర్తిత్వం చేయించి.. భారత్‌ను ఒప్పించింది. ఈ క్రమంలో శాంతి సాధన లక్ష్యంగా భారత్ ఇందుకు అంగీకరించింది. అయితే, విరమణ ఒప్పందం జరిగిన కాసేపటికే పాక్ మరోసారి తన వక్రబుద్ధిని బయటపెట్టింది.కుక్క తోక ఎప్పటికీ వంకరేసరిహద్దుల వెంట దాడులకు దిగింది. జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్తాన్ వంటి తదితర చోట్ల డ్రోన్లతో దాడికి దిగగా.. భారత్ వాటిని తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తీరును ఉద్దేశించి.. ‘‘కుక్క తోక ఎప్పటికీ వంకరే’’ అన్నట్లు బుద్ధులు ఎక్కడకు పోతాయి అన్న అర్థంలో వీరేందర్ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.నీచ స్వభావాన్ని మరోసారి చాటుకుందిఅయితే, ఇందుకు పాక్ నెటిజన్లు వీరూ భాయ్‌ను అసభ్యకరరీతిలో ట్రోల్ చేస్తుండగా.. భారతీయ నెటిజన్లు వారికి చురకలు అంటిస్తున్నారు. మరోవైపు.. శిఖర్ ధావన్ స్పందిస్తూ.. ‘‘తుచ్చమైన బుద్ధి గల దేశం.. తన తుచ్చమైన చేష్టలను మరోసారి ప్రపంచానికి చూపిస్తోంది’’ అంటూ పాక్ తన నీచ స్వభావాన్ని మరోసారి చాటుకుంది అన్న అర్థంలో ఘాటుగా వ్యాఖ్యానించాడు.ఇదిలా ఉంటే.. భారత్- పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ఐపీఎల్-2025ని వారం పాటు వాయిదా వేస్తున్నట్లు బీసీసీఐ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, పరిస్థితులు అనుకూలిస్తే షెడ్యూల్ ప్రకారమే మే 25న ఫైనల్ నిర్వహించేలా బోర్డు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఆదివారం జరిగే సమావేశంలో ఓ నిర్ణయానికి రానున్నట్లు తెలుస్తోంది. ఇక టీమిండియా మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ఐపీఎల్ హర్యాన్వీ కామెంటేటర్‌గా ఉన్న విషయం తెలిసిందే. చదవండి: IND vs ENG: ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్.. స్వింగ్ కింగ్‌కు పిలుపు? భారత జట్టు ఇదే? -
పాక్ దాడుల్లో సీనియర్ అధికారి మృతి.. సీఎం ఒమర్ అబ్దుల్లా ఆవేదన
శ్రీనగర్: భారత్,పాకిస్థాన్ మధ్య తీవ్రమైన దాడులు కొనసాగుతున్నాయి. పాక్ దాడులను భారత్ తిప్పికొడుతోంది. మరోవైపు.. దాయాదా పాకిస్తాన్.. భారత్ సరిహద్దుల్లో పౌరులు, ఆలయాలే టార్గెట్‌గా దాడులకు తెగబడింది. తాజాగా పాక్ జరిపిన కాల్పుల్లో జమ్ముకశ్మీర్ ప్రభుత్వ అధికారి రాజ్‌కుమార్ థప్పా ప్రాణాలు కోల్పోయారు.వివరాల ప్రకారం.. సరిహద్దుల్లో కాల్పులే కాకుండా డ్రోన్లతో దాడులు చేస్తోంది పాకిస్తాన్. ఈ దాడుల్లో శనివారం ఉదయం జమ్ముకశ్మీర్ ప్రభుత్వ అధికారి రాజ్‌కుమార్ థప్పా ప్రాణాలు కోల్పోయారు. రాజౌరీ పట్టణంలో ఉంటున్న ఆయన ఇంటిపై పాక్ ఫిరంగులు పడటంతో ఆయన మృతి చెందారు. రాజ్‌కుమార్ జిల్లా డెవలప్మెంట్ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.Deeply saddened to hear about the tragic loss of Dr. Raj Kumar Thapa, KAS who was posted as ADDC Rajouri in the Pakistani terror attack. Our heartfelt condolences go out to the bereaved family, friends, and loved ones of the victim.Om Shanti! pic.twitter.com/mmZoS1rJWY— IAS Fraternity 🇮🇳 (@IASfraternity) May 10, 2025ఈ ఘటనపై జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందించారు. రాజ్‌కుమార్ మృతిపై సీఎం ఒమర్ ట్విట్టర్ వేదికగా..‘రాజౌరీని లక్ష్యంగా చేసుకున్న పాక్ జరిపిన దాడుల్లో రాజ్‌కుమార్ మృతి చెందారు. నిబద్ధత కలిగిన ఓ ఆఫీసర్‌ను మనం కోల్పోయాం. ఒక్కరోజు ముందే నేను అధ్యక్షత వహించిన ఆన్లైన్ సమావేశంలో రాజ్‌కుమార్ పాల్గొన్నారు. ఇంతలోనే రాజౌరీలోని ఆయన ఇంటిపై జరిగిన దాడిలో ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. దిగ్భ్రాంతికి గురిచేసిన ఘటనపై స్పందించేందుకు మాటలు రావడం లేదు. ఇది మాకెంతో నష్టం’ అని వ్యాఖ్యలు చేశారు.ఇదిలా ఉండగా.. శుక్రవారం రాత్రి నుంచే సరిహద్దు రాష్ట్రాల్లో కొన్నిచోట్ల పాకిస్తాన్ దాడులు చేసింది. దీంతో, విద్యుత్తు సరఫరా నిలిపివేసి ‘బ్లాకౌట్’ పాటించారు. శ్రీనగర్, పఠాన్ కోట్ ప్రాంతాల్లో ఉదయం కూడా పేలుళ్ల శబ్దాలు వచ్చినట్లు స్థానికులు పేర్కొన్నారు. డ్రోన్లతో పాక్ చేసిన దాడులను భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టింది. సరిహద్దు ప్రాంతాల్లో అధికారులు సైరన్లు మోగిస్తూ ప్రజలను అప్రమత్తం చేశారు. విద్యుత్ సరఫరాను నిలిపేశారు. -
జమ్మూకశ్మీర్‌పై కొనసాగుతున్న పాక్ కాల్పులు
పూంచ్/జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని వివిధ ప్రాంతాల్లో గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజామున వరకు పాక్ జరిపిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు చనిపోయారు. ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరణించినవారిలో ఒక మహిళ, ఒక పురుషుడు ఉండగా.. ఇరు కుటుంబాలకు చెందినవారు గాయపడ్డారు. కాల్పుల్లో గ్రామస్తుని మృతి పూంచ్, రాజౌరీ జిల్లాల్లోని ఫార్వర్డ్ ప్రాంతాల్లో శుక్రవారం తెల్లవారుజామున పాక్ జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తి మృతి చెందాడు. అతని భార్యతో సహా మరో ముగ్గురు గాయపడ్డారు. మృతుడిని లోరాన్ ప్రాంతానికి చెందిన మహ్మద్ అబ్రార్‌గా గుర్తించారు. మెంధర్‌లోని చలేరి ప్రాంతానికి చెందిన లయాఖత్ హుస్సేన్ గాయపడ్డారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. శుకవ్రారం తెల్లవారుజామున 3.50 గంటల నుంచి 4.45 గంటల మధ్య భారీ పేలుళ్లు సంభవించడంతో అధికారులు వెంటనే సైరన్లు మోగించారు. కశ్మీర్‌లోని కుప్వారా, బారాముల్లా జిల్లాలతో పాటు రాజౌరీ, పూంచ్, జమ్మూ జిల్లాల్లోని ప్రాంతాలపై రాత్రికి రాత్రే కాల్పులు, షెల్లింగ్ జరిగాయి. ఈ కాల్పుల్లో భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని, పలు ఇళ్లు, వందలాది వాహనాలు ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు. పాకిస్తాన్ దాడుల నేపథ్యంలో జమ్మూ ప్రాంతంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలను మూసివేశారు. సీనియర్ పోలీసు అధికారులు భద్రతా చర్యలను పర్యవేక్షించారు. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ప్రాంతాల ప్రజలను జమ్మూతో పాటు పూంచ్, రాజౌరీ జిల్లాల్లోని సురక్షిత ప్రాంతాలకు తరలించామని, శిబిరాల్లో ఉంచామని అధికారులు తెలిపారు. ఉరి సెక్టార్లో మహిళ మృతి ఉరి సెక్టార్‌లోని నియంత్రణ రేఖ (ఎల్వోసీ) సమీప ప్రాంతాల్లో పాక్ దళాలు గురువారం రాత్రి జరిపిన కాల్పుల్లో ఓ మహిళ మృతి చెందారు. ఆమె కుటుంబ సభ్యులు ఇద్దరు గాయపడ్డారు. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా ఉరి సెక్టార్‌లోని సిలికోట్, బోనియార్, కమల్‌కోట్, మొహ్రా, గింగ్లే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని భారీ షెల్లింగ్ జరిగిందని అధికారులు తెలిపారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తుండగా మొహ్రా సమీపంలో కారును షెల్ ఢీకొనడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించగా నర్గీస్ బేగం అనే మహిళ మృతి చెందారు. షెల్లింగ్‌తో పలు భవనాలు ధ్వంసమయ్యాయి. ఇక శుక్రవారం ఉరి సెక్టార్‌లోని టూర్నా పోస్టులో ఉన్న గౌహలన్, చోటాలీ ప్రాంతాల్లో పాక్ బలగాలు కాల్పులు జరిపాయి. భారత పోస్టులు, పౌర ప్రాంతాలపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాయి. అయితే ఈ ప్రాంతాల్లో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరిగినట్లు సమాచారం లేదు. -
తెలుగు జవాన్ వీర మరణంపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
సాక్షి, తాడేపల్లి: జమ్మూకశ్మీర్‌లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీర మరణంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దేశ భద్రతలో తన ప్రాణాలను ఫణంగా పెట్టి వీరమరణం పొందిన మురళీనాయక్ త్యాగాన్ని మరువలేమన్నారు. మురళీనాయక్ కుటుంబీకులకు వైఎస్ జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మురళీ నాయక్ కుటుంబాన్ని వైఎస్ జగన్ ఫోన్లో పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని కోరారు.భారత్-పాకిస్తాన్ యుద్ధంలో తెలుగు జవాను వీర మరణం పొందారు. శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గం గోరంట్ల మండలం కళ్లి తండాకు చెందిన మురళీ నాయక్ పాకిస్థాన్ తుపాకులకు బలయ్యారు. అగ్నివీర్ పథకం కింద మూడు సంవత్సరాల క్రితం ఆర్మీ లో చేరిన మురళీ నాయక్... నాసిక్‌లో శిక్షణ పొంది అస్సాంలో పనిచేశారు. పాకిస్తాన్‌తో యుద్ధం నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో విధులు నిర్వహిస్తున్నారు.Deeply pained by the martyrdom of our brave Telugu Jawan, Murali Nayak, from Penukonda, Satyasai district, in the India-Pakistan battlefield in J&K.His supreme sacrifice for the nation will forever inspire us.My heartfelt condolences to his family.We stand with them in this… pic.twitter.com/HfoFixNnZd— YS Jagan Mohan Reddy (@ysjagan) May 9, 2025దేశ సరిహద్దు ప్రాంతంలో విధులు నిర్వహిస్తుండగా.. పాకిస్థాన్ చేసిన కాల్పులకు మురళీ నాయక్ వీర మరణం పొందారు. మురళీ నాయక్ అవివాహితుడు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాం నాయక్, జ్యోతీబాయి కన్నీరు మున్నీరుగా విలపించారు. మురళీ నాయక్ స్వగ్రామం కళ్లి తండాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీర మరణం పొందిన మురళీ నాయక్ మృతదేహం రేపు స్వగ్రామం చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. -
పాక్ సైన్యం కర్కశ కాల్పులు
జమ్మూ/శ్రీనగర్/పూంచ్: ఉగ్రస్థావరాలపై భారత్ దాడి తర్వాత బరితెగించిన పాకిస్తాన్ సైన్యం సరిహద్దువెంట కన్నుమిన్నుకానక కర్కశంగా కాల్పులకు తెగబడింది. గతంలో ఎన్నడూలేనంతగా కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లుపొడుస్తూ తూటాల వర్షం కురిపించింది. మంగళవారం అర్ధరాత్రి నుంచి జమ్మూకశ్మీర్‌లోని పూంచ్æ జిల్లాలో సరిహద్దు వెంట డజన్ల కొద్దీ గ్రామాలపై పాకిస్తాన్ సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సాధారణ నివాస ప్రాంతాలపై జరిపిన కాల్పుల్లో నలుగురు చిన్నారులు సహా 15 మంది ప్రాణాలు కోల్పోయారు. 57 మందికి బుల్లెట్ గాయాలయ్యాయి. గాయాలపాలైన కొందరిని ఆస్పత్రిలో చేరి్పంచారు. వారిలో కొందరు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. మరణించిన వారిలో బల్విందర్ కౌర్ అలియాస్ రూబీ(33), మొహ్మద్ జైన్ ఖాన్(10), జోయా ఖాన్(12), మొహ్మద్ అక్రమ్(40), అమ్రిక్ సింగ్(55), మొహ్మద్ ఇక్బాల్(45), రంజీత్ సింగ్(48), షకీలా బీ(40), అమీర్‌జీత్ సింగ్(47), మరియం ఖటూన్(7), విహాన్ భార్గవ్(13), మొహ్మద్ రఫీ(40), ఒక లాన్స్ నాయక్‌లను గుర్తించారు. పూంచ్ జిల్లాతోపాటు బాలకోటె, మెన్ధార్, మాన్‌కోటె, కృష్ణ ఘతి, గుల్పార్, కెర్నీ సెక్టార్లలో పాక్ రేంజర్ల భారీ స్థాయిలో మోర్టార్లతో కాల్పులు జరిపారు. చారిత్రక ప్రాధాన్యమున్న పూంచ్ కోట, ఆలయాలు, గురుద్వారాలపైనా బుల్లెట్ల వర్షం కురిసింది. బారాముల్లా జిల్లాలోని ఉరీ సెక్టార్లో ఐదుగురు మైనర్లుసహా పది మంది గాయపడ్డారు. కుప్వారా జిల్లాలోని కర్నాహ్ సెకాŠట్‌ర్‌లో బాంబుల శకలాలు పడి మంటలు అంటుకుని పలు ఇళ్లు దగ్ధమయ్యాయి. బుధవారం మధ్యాహ్నందాకా ఈ కాల్పులు ఆగలేదు. ఈ కాల్పుల్లో ఇళ్లు, దుకాణాలు, వాహనాలు, బస్టాండ్లు ధ్వంసమయ్యాయి. జనావాసాలపై తుపాకులు ఎక్కుపెట్టడాన్ని మాజీ జమ్మూకశ్మీర్ డీజీపీ ఎస్పీ వేద్ తీవ్రంగా తప్పుబట్టారు. బోర్డర్‌కు ఆవల డజన్ల మంది మృతి పాక్ రేంజర్ల కాల్పులకు భారత సైన్యం దీటుగా బదులిచ్చింది. భారత సైన్యం కాల్పుల్లో సరిహద్దుకు ఆవల పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించినట్లు ఇండియన్ ఆర్మీ బుధవారం ప్రకటించింది. దాయాది ఆర్మీ పోస్ట్‌లను ధ్వంసం చేసింది. ముందు జాగ్రత్తగా సరిహద్దు జిల్లాలైన జమ్మూ, సాంబా, కథువా, రాజౌరీ, పూంఛ్‌లలో అన్ని పాఠశాలలు, కళాశాలలు, ఇతర విద్యాసంస్థలను బుధవారం మూసేశామని డివిజనల్ కమిషనర్ రమేశ్ కుమార్ చెప్పారు. పహల్గాం ఉగ్రదాడి తర్వాత సరిహద్దు వెంట పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించడం ఇది వరుసగా 13వ రోజు. పూంఛ్–రాజౌరీలోని భీంబర్ గలీలో పాక్ కాల్పులు కొనసాగిస్తోందని భారతఆర్మీలో అడిషనల్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ తెలిపింది. కాల్పుల బారిన పడకుండా అధికారులు సరిహద్దు ప్రాంతాల్లోని వేలాది మంది స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. -
ఆపరేషన్ సిందూర్.. అర్ధరాత్రి ఎప్పుడేం జరిగింది..
శ్రీనగర్: పహల్గాం ఉగ్రదాడి ఘటనతో భారత్, పాక్‌ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల వేళ పాక్‌ను భారత్ దెబ్బకొట్టింది. ఉగ్రదాడికి భారత్ ప్రతీకార చర్యల్లో భాగంగా మంగళవారం అర్ధరాత్రి 1:44 గంటలకు ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో పాకిస్థాన్ (Pakistan)లోని ఉగ్రస్థావరాలపై భారత సైన్యం (Indian Army) మెరుపు దాడులు చేపట్టింది. భారత ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ బలగాలు సంయుక్తంగా ఈ దాడిని నిర్వహించాయి. మిస్సైళ్లతో లక్ష్యాలపై విరుచుకుపడ్డాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌లోని ఉగ్ర మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశాయి. పూర్తి కచ్చితత్వంతో దాడులు చేసినట్లు పేర్కొంది.ఆపరేషన్ సిందూర్ ఇలా.. 1:44 AM ఆపరేషన్ సిందూర్ ప్రారంభం1:45 AM మొత్తం 9 ఉగ్ర స్థావరాలపై ఏక కాలంలో దాడులు.1:45 AM ఉగ్ర స్థావరాలపై మిసైల్స్‌తో దాడులు.2:00 AM న్యాయం జరిగిందంటూ ట్విట్టర్ పోస్టులో భారత ఆర్మీ ప్రకటన..2:25 AM భారత్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామన్న పాక్ ప్రధాని షహబాజ్ షరీఫ్.2:30 AM శ్రీనగర్‌కు విమాన సర్వీసులు రద్దు.3:00 AM ధర్మశాల, లేహ్, జమ్ము, అమృతసర్ విమానాశ్రయాలు మూసివేత.4:00 AM ఎల్వోసీ వెంట ఉన్న గ్రామాలపై పాక్ ఆర్మీ కాల్పులుభారత ప్రభుత్వం ప్రకటన అనంతరం ఇండియన్ ఆర్మీ స్పందించింది. ‘న్యాయం జరిగింది’ అని ఎక్స్‌లో పోస్టు చేసింది. మెరుపు దాడులకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. భారత్ దాడులతో పాక్ అప్రమత్తమైంది. లాహోర్, సియాల్కోట్ ఎయిర్‌పోర్ట్‌లను 48 గంటల పాటు మూసివేసింది. -
‘పహల్గాం ఉగ్రదాడి గురించి కేంద్రానికి ముందే తెలుసు’.. ఖర్గే సంచలన ఆరోపణలు
రాంచీ: పహల్గాం ఉగ్రదాడిపై ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖర్జున్ ఖర్గే సంచలన ఆరోపణలు చేశారు.జార్ఖండ్ రాష్ట్రం రాంచీలో కాంగ్రెస్ పార్టీ సంవిధాన్ బచావో ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీలో సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మల్లిఖార్జున్ ఖర్గే మాట్లాడారు.పహల్గాం ఉగ్రదాడిపై కేంద్రానికి మూడురోజుల ముందే సమాచారం అందింది. నిఘూవర్గాల హెచ్చరికలతో ప్రధాని మోదీ కశ్మీర్ పర్యటన రద్దు చేసుకున్నారు. పర్యాటకులకు మాత్రం భద్రత కల్పించలేకపోయారు’అని ఆరోపించారు. Watch: Congress President Shri @kharge addresses the Samvidhan Bachao Rally in Ranchi, Jharkhand. https://t.co/wRfrg2XD99— Congress (@INCIndia) May 6, 2025 -
ఆనకట్టల కట్టడి
సింధూ, దాని పరీవాహక నదుల నుంచి పాకిస్తాన్‌కు ఇకపై చుక్క నీరు కూడా వదిలేది లేదన్న భారత్, ఆ దిశగా పూర్తిస్థాయి కార్యాచరణకు రంగంలోకి దిగింది. ఆ నదులపై అన్ని జలాశయాల సామర్థ్యాలను పూర్తిస్థాయిలో పెంచే దిశగా చర్యలు తీసుకుంటోంది. వాటిలో పేరుకుపోయిన మట్టి, ఇసుక తదితరాలను పూర్తిగా తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. తద్వారా అన్ని ప్రాజెక్టుల్లోనూ నీటి నిల్వ సామర్థ్యం గరిష్ట స్థాయికి చేరేలా చూడాలని అధికారులకు సూచించింది. జమ్మూ కశ్మీర్లో చినాబ్ నదిపై ఉన్న కీలక బాగ్లిహార్, సలాల్ జల విద్యుత్కేంద్రాల్లో ఆ దిశగా గురువారం లాంఛనంగా మొదలైన పూడికతీత పనులు సోమవారం పూర్తిస్థాయికి చేరాయి. పనుల్లో భాగంగా రెండు డ్యాముల్లో అవసరమైన గేట్లను గురువారం నుంచి శనివారం దాకా పాక్షికంగా ఎత్తడంతో పాక్‌లోని సరిహద్దు ప్రాంతాలు నీటమునిగాయి. సింధూ జల ఒప్పందం నిలిపివేత నేపథ్యంలో ఈ విషయమై పాక్‌కు ముందస్తు సమాచారం ఇవ్వలేదు. 1960ల్లో ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇలా జరగడం ఇదే తొలిసారి. ఒప్పందాన్ని బూచిగా చూపుతూ పూడిక పనులను పాక్ ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ వచ్చింది. ఇప్పుడిక ఆ ప్రాజెక్టుల్లోని పూడిక మొత్తాన్నీ తొలగించి పూర్తిస్థాయిలో నీటిని నింపనున్నారు. అప్పటిదాకా చినాబ్ నదీజలాలు పాక్‌కు పూర్తిగా నిలిచిపోయినట్టే!. సింధూ ఒప్పందం ప్రకారం చినాబ్ జలాలు పాక్‌కే చెందుతాయి. వాటి ప్రవాహాన్ని భారత్ అడ్డుకోవడానికి వీల్లేదు.మూడింటి నుంచి నీళ్లు బంద్జమ్మూ కశ్మీర్లో సింధూ, దాని పరీవాహక నదులపై ఆరుకు పైగా జలాశయాల్లో పూడికతీతను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్న ఆదేశాల నేపథ్యంలో స్థానిక ప్రభుత్వ విభాగాలు పూర్తిస్థాయిలో రంగంలోకి దిగాయి. ప్రభుత్వరంగ ఎన్‌హెచ్‌పీసీ లిమిటెడ్ సారథ్యంలో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. బాగ్లిహార్, సలాల్‌తో పాటు జీలం నది మీది కిషన్‌గంగ జలాశయాల నుంచి పాక్‌కు నీటి విడుదలను ఆదివారం నుంచి నిలిపేశారు. దాంతో పాక్‌లోని పంజాబ్ తదితర ప్రాంతాలకు సాగునీరు నిలిచిపోయింది. సలాల్ ప్రాజెక్టును 1987లో, బాగ్లిహార్ను 2008లో నిర్మించారు. అప్పటినుంచీ వాటిలో పూడికతీత చేపట్టడం ఇదే తొలిసారి. సలాల్ 690 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేస్తుంది. బాగ్లీహార్ సామర్థ్యం 900 మెగావాట్లు. పూడిక నేపథ్యంలో వాటిలో విద్యుదుత్పాదన చాలాకాలంగా సామర్థ్యం కంటే తక్కువగా జరుగుతూ వస్తోంది.10 వేల మెగావాట్ల విద్యుత్జమ్మూ కశ్మీర్లో సింధూ, ఉప నదులపై మొదలు పెట్టిన ఆరు ప్రాజెక్టులు పాక్ అభ్యంతరాల నేపథ్యంలో చాన్నాళ్లుగా నిలిచిపోయాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో వాటి నిర్మాణాన్ని తక్షణం పునఃప్రారంభించాలని కేంద్రం నిర్ణయించింది. సవాల్కోట్ (1,856 మెగావాట్లు), కిర్తాయ్ 1, 2 (1,320 ఎంవీ), పాకాల్దుల్ (1,000 ఎంవీ)తో పాటు 2,224 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన మరో ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. ఇవన్నీ పూర్తయితే ఏకంగా 10 వేల మెగావాట్ల అదనపు విద్యుత్‌తో పాటు సాగు, తాగునీటి అవసరాలకు మరిన్ని జలవనరులు అందుబాటులోకి వస్తాయి. సింధూ ఒప్పందం కింద ఇలాంటి పనులకు పాక్‌కు ఆర్నెల్ల నోటీసు ఇవ్వాల్సి ఉండేది. దాన్ని నిలిపివేసిన నేపథ్యంలో భారత్ తాజా చర్యలను అడ్డుకునేందుకు పాక్‌కు పెద్దగా మార్గాలేమీ లేవు. మధ్యవర్తి అయిన ప్రపంచబ్యాంకు కూడా పెద్దగా చేసేదేమీ లేదు. ఇరు దేశాలనూ చర్చలకు ప్రోత్సహించడం తప్ప ఒప్పందం అమలుకు ఆదేశించడం వంటి అధికారాలేవీ దానికి లేవు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
బాంబులు గుర్తింపు.. జమ్ముకశ్మీర్‌లో జైళ్లకు భద్రత పెంపు
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఉన్న జైళ్లపై ఉగ్ర దాడికి కుట్ర జరుగుతున్నట్టు సమాచారం. జైళ్లపై ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. తాజాగా పూంజ్ జిల్లాలో ఉగ్రవాదులు అమర్చిన ఐదు ఐఈడీ బాంబులను భద్రతా బలగాలు గుర్తించాయి. వాటిని నిర్వీర్యం చేశాయి. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్, శ్రీనగర్‌లో భద్రతను ప్రభుత్వం పెంచింది. జైళ్ల భద్రతపై ఉన్నతాధికారులతో సీఐఎస్ఎఫ్ డైరెక్టర్ సమీక్ష నిర్వహించారు. కాగా, 2023 నుంచి CISF జైళ్ల భద్రతను పర్యవేక్షిస్తోంది. కాగా, కశ్మీర్ జైళ్లలో ఉన్న హైప్రొఫైల్ ఉగ్రనాయకులను విడిపించేందుకు భారీ కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టాయి. ఈక్రమంలో శ్రీనగర్ సెంట్రల్ జైల్, కోట్ బాల్వాల్ జైల్, జమ్మూలోని జైళ్లకు భారీఎత్తున భద్రత కల్పించారు. ఇప్పటికే పహల్గాం ఉగ్రదాడి దర్యాప్తులో భాగంగా చాలామంది స్లీపర్ సెల్స్, ఓవర్ గ్రౌండ్ వర్కర్లను తీసుకొచ్చి ఈ జైళ్లలో ఉంచారు. వీరితోపాటు ఆర్మీ వాహనంపై దాడి కేసులో నిందితులైన నిస్సార్, ముష్తాక్ సహచరులను జాతీయ దర్యాప్తు సంస్థ ప్రశ్నిస్తోంది. ఈనేపథ్యంలో జైళ్లపై దాడి జరగొచ్చనే సమాచారం నిఘా వర్గాలకు చేరింది.ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ఏమాత్రం చల్లారడం లేదు. దాయాది కవ్వింపు చర్యలు ఆగడం లేదు. నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం వరుసగా కాల్పులకు తెగబడింది. జమ్ము కశ్మీర్లో కుప్వారా, పూంచ్, రాజౌరీ, మేంధార్, నౌషేరా, సుందర్బనీ, అఖ్తర్ తదితర 8 ప్రాంతాల్లో కాల్పులు చోటుచేసుకున్నాయి. వాటిని సైన్యం గట్టిగా తిప్పికొట్టింది.దీర్ఘకాల సెలవులు రద్దుఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల సిబ్బందికి దీర్ఘకాల సెలవులు రద్దు చేస్తూ మ్యునీషియన్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్) ఆదేశాలు జారీ చేసింది. ఎంఐఎల్ పరిధిలో 12 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలున్నాయి. సైన్యానికి అవసరమైన ఆయుధాలు వాటిలో తయారవుతాయి. ఆయుధ ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికే సెలవులు రద్దు చేసినట్లు ఎంఐఎల్ అధికారి ఒకరు చెప్పారు. -
జమ్ముకశ్మీర్‌లో ప్రమాదం.. భారత జవాన్లు మృతి
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో భారత ఆర్మీకి చెందిన ముగ్గురు జవాన్లు మృతిచెందారు. వివరాల ప్రకారం.. జమ్ముకశ్మీర్‌లోని రాంబన్ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. రాంబన్ జిల్లాలో ఆదివారం మధ్యాహ్నం ఆర్మీ వాహనం లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతిచెందారు. ఆర్మీ వాహనం 700 అడుగుల లోత్తైన లోయలో పడిపోవడంతో ఈ ప్రమాదం జరిగింది. ఆర్మీ వాహనం జమ్ము నుంచి కశ్మీర్‌కు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న బలగాలు అక్కడ సహాయక చర్యలు చేపట్టాయి. Ramban, Jammu and Kashmir: An accident took place at Battery Chasma on NH44, involving an Army vehicle that rolled into a deep gorge. Police, SDRF, Civil Quarter, and Army teams responded promptly, and a rescue operation is currently underway pic.twitter.com/lZm3yg6JQT— IANS (@ians_india) May 4, 2025Two Army personnel lost their lives after their vehicle plunged into a deep gorge in the Battery Chashma area of #Ramban district.More details awaited. pic.twitter.com/sqp6gdi2gK— The Grameen Express (@grameenexpress) May 4, 2025 -
బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లకు షాక్.. అకౌంట్లు బ్లాక్
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్‌పై భారత్ కఠిన చర్యలు చేపట్టింది. సింధు జలాల ఒప్పందం రద్దు సహా దాయాదిపై అనేక ఆంక్షలు విధించింది. అదే విధంగా పాకిస్తాన్‌కు చెందిన సామాజిక మాధ్యమాల ఖాతాల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది.ఇప్పటికే పాక్ యూట్యూబ్ చానెళ్లు, ట్విటర్‌ను నిషేధించిన భారత్.. క్రీడాకారుల సోషల్ మీడియా అకౌంట్లపై కూడా దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇప్పటికే జావెలిన్ త్రోయర్, ప్యారిస్ ఒలింపిక్స్-2024 స్వర్ణ పతక విజేత అర్షద్ నదీమ్ (Arshad Nadeem) ఖాతాను దేశంలో నిలిపివేసింది.బాబర్ ఆజం, మహ్మద్ రిజ్వాన్‌లకు షాక్ఇక పాకిస్తాన్ స్టార్ క్రికెటర్లు బాబర్ ఆజం (Babar Azam), కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ (Mohammed Rizwan)లకు కూడా తాజాగా షాక్ తగిలింది. వీరిద్దరి ఇన్స్టాగ్రామ్ ఖాతాలను భారత్‌లో నిలిపి వేశారు. వీరి అకౌంట్లను ఓపెన్ చేయాలని చూస్తే.. ‘‘ఈ అకౌంట్ ఇండియాలో అందుబాటులో లేదు. చట్టపరమైన అభ్యర్థనల నేపథ్యంలో దీనిపై ఆంక్షలు ఉన్నాయి’’ అనే సందేశం కనిపిస్తోంది.కాగా పహల్గామ్ దాడి తర్వాత షోయబ్ అక్తర్, షాహిన్ షా ఆఫ్రిది, హ్యారిస్ రవూఫ్, షాహిద్ ఆఫ్రిది, వసీం అక్రం, వకార్ యూనిస్, బసిత్ అలీ తదితర క్రికెటర్ల అకౌంట్లను కూడా భారత్‌లో బ్లాక్ చేశారు. అదే విధంగా ఇతర సెలబ్రిటీలు మహీరా ఖాన్, ఫవాద్ ఖాన్, అలీ జాఫర్, హనియా ఆమిర్ ఖాతాలను కూడా నిలిపివేశారు.భారత్‌లో నిషేధంఇక పాకిస్తాన్ ఆటగాళ్లు ప్రస్తుతం పాకిస్తాన్ సూపర్ లీగ్‌తో బిజీగా ఉన్నారు. ఐపీఎల్-2025తో పోటీ పడి చేతులు కాల్చుకున్న పాక్ క్రికెట్ బోర్డుకు.. పహల్గామ్ దాడి తర్వాత మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే అంతంత మాత్రమైన వ్యూయర్షిప్ ఉన్న ఈ లీగ్ ప్రసారాలను భారత్‌లో నిషేధించారు.కాగా జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో గల ప్రశాంతమైన బైసరన్ లోయలో ఉగ్రవాదులు ఇటీవల పాశవిక దాడికి తెగబడిన విషయం తెలిసిందే. బైసరన్ అందాలు చూసేందుకు వచ్చిన 26 మంది పర్యాటకులను కాల్చి చంపేశారు. దీంతో... అమాయక ప్రజల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇస్తున్న వారిపై భారత్ కఠిన చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ముందుగా దాయాదికి బుద్ధిచెప్తోంది.చదవండి: ఆసియా కప్, బంగ్లాదేశ్ పర్యటనను రద్దు చేసుకోనున్న టీమిండియా..? -
భారత్, పాక్ మధ్య యుద్ధమే.. ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు
శ్రీనగర్: పహల్గాం ఉగ్ర దాడి నేపథ్యంలో భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ తరుణంలో నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండు దేశాల మధ్య యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదని చెప్పుకొచ్చారు. అలాగే, ఈ ఘటనకు భద్రత, నిఘా లోపాలు కూడా ఒక కారణమని అన్నారు.పహల్గాం ఘటనపై తాజాగా ఫరూక్ అబ్దుల్లా స్పందిస్తూ ఉగ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండించారు. ఈ క్రమంలో ఫరూక్ అబ్దుల్లా మాట్లాడుతూ..‘పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తోంది. రేపటి రోజు ఎలా ఉండబోతోందో ఎవరికీ తెలియదు. భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధం జరిగే అవకాశం లేకపోలేదు. ఇరు దేశాలు యుద్ధానికి సిద్ధమవుతున్నాయి. అలా జరగకుండా ఉండాలంటే పహల్గాం ఉగ్ర దాడి జరగడానికి కారణమైన ఉగ్రవాదులను పట్టుకోవాలి. అలాగే, ఈ ఘటన వెనక ఉన్న వారిని వీలైనంత తొందరగా పట్టుకోవాలి. అప్పుడే యుద్ధాన్ని నివారించే దిశగా ప్రయత్నాలు జరుగుతాయి. భద్రత, నిఘా లోపాలు కూడా ఉగ్ర దాడి జరిగేందుకు ఒక కారణమని అనడంలో సందేహం లేదు’ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇదిలా ఉండగా.. అంతకుముందు.. పహల్గాం ఘటనపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. ఉగ్రవాదుల బారి నుంచి అతిథుల(పర్యాటకులు)ను కాపాడటంలో తాను విఫలమయ్యానని రాష్ట్ర శాసనసభ వేదికగా ప్రకటించారు. బైసరన్‌లో ఇంత పెద్ద స్థాయిలో దాడి చేయడం మాత్రం 21 ఏళ్లలో ఇదే తొలిసారి. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఎలా క్షమాపణలు చెప్పాలో తెలియడం లేదు. రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులను సురక్షితంగా తిరిగి పంపాల్సిన బాధ్యత మాదే. నేను ఆ పనిచేయలేకపోయాను. పహల్గాం ఘటన తర్వాత ఏ ముఖం పెట్టుకొని రాష్ట్ర హోదాను డిమాండ్ చేయాలి. నా రాజకీయాలు అంత చౌకబారువి కాదు. గతంలో రాష్ట్ర హోదా అడిగాం.. భవిష్యత్తులో కూడా అడుగుతాం. కానీ, 26 మంది చనిపోయారు.. ఇప్పుడు రాష్ట్ర హోదా ఇవ్వండి అని కేంద్రాన్ని అడగడం సిగ్గుచేటు. ప్రజలు మాకు మద్దతు ఇస్తే.. ఉగ్రవాదం అంతమవుతుంది’ అని పేర్కొన్నారు. -
కశ్మీర్లో స్లీపర్‌సెల్స్ యాక్టివ్.. ఇంటెలిజెన్స్ హెచ్చరిక
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం దాడి ఘటనతో అక్కడ భారత ఆర్మీ హైఅలర్ట్‌లో ఉంది. మరోవైపు.. కశ్మీర్లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈ నేపథ్యంలో 48 టూరిస్టు కేంద్రాలను జమ్ముకశ్మీర్ ప్రభుత్వం మూసివేసింది.వివరాల ప్రకారం.. పహల్గాం దాడి అనంతరం కశ్మీర్ లోయలో స్లీపర్‌సెల్స్ యాక్టివేట్ అయినట్లు నిఘావర్గాలు తెలిపాయి. దీంతో, కశ్మీర్లో మరిన్ని ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో జమ్ముకశ్మీర్ ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. అనంతరం, కశ్మీర్లో ఉన్న 48 టూరిస్టు కేంద్రాలను ప్రభుత్వం మూసివేసింది. కశ్మీర్ వ్యాప్తంగా ఉన్న మొత్తం 87 టూరిస్టు కేంద్రాల్లో వీటిని మూసివేస్తున్నట్లు పేర్కొన్న అధికారులు వెల్లడించారు.ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్రదాడి ఘటనపై జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. పర్యాటకులను పాశవికంగా హతమార్చిన ఘటనపై చర్చించేందుకు జమ్ముకశ్మీర్ శాసనసభ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. ఉగ్రదాడి మృతులకు సంతాపసూచకంగా సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండించింది. పాశవికదాడిపై తీవ్ర దిగ్భ్రాంతిని, ఆవేదనను వ్యక్తం చేస్తూ ఏకగ్రీవంగా ఓ తీర్మానాన్ని ఆమోదించింది.దానికి ముందు సీఎం ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ..‘బైసరన్‌లో ఇంత పెద్ద స్థాయిలో దాడి చేయడం మాత్రం 21 ఏళ్లలో ఇదే తొలిసారి. మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు ఎలా క్షమాపణలు చెప్పాలో తెలియడం లేదు. రాష్ట్రానికి వచ్చిన పర్యాటకులను సురక్షితంగా తిరిగి పంపాల్సిన బాధ్యత మాదే. నేను ఆ పనిచేయలేకపోయాను. పహల్గాం ఘటన తర్వాత ఏ ముఖం పెట్టుకొని రాష్ట్ర హోదాను డిమాండ్ చేయాలి. నా రాజకీయాలు అంత చౌకబారువి కాదు. గతంలో రాష్ట్ర హోదా అడిగాం.. భవిష్యత్తులో కూడా అడుగుతాం. కానీ, 26 మంది చనిపోయారు.. ఇప్పుడు రాష్ట్ర హోదా ఇవ్వండి అని కేంద్రాన్ని అడగడం సిగ్గుచేటు. ప్రజలు మాకు మద్దతు ఇస్తే.. ఉగ్రవాదం అంతమవుతుంది’ అని పేర్కొన్నారు. -
జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో సీఎం ఒమర్ అబ్దుల్లా ఉద్వేగభరిత ప్రసంగం
-
మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థం: షాహిద్ ఆఫ్రిది వివాదాస్పద వ్యాఖ్యలు
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది (Shahid Afridi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Incident) నేపథ్యంలో భారత ఆర్మీని కించపరిచే విధంగా మాట్లాడాడు. తమ సైన్యం వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు భారత్ పాకిస్తాన్‌పై నిందలు వేస్తోందని ఆరోపించాడు.బైసరన్ లోయలోభారత్లో చిన్న టపాసు పేలినా పాక్‌నే నిందిస్తున్నారని.. దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలంటూ ఓ షోలో ఆఫ్రిది అతి చేశాడు. కాగా అందమైన కశ్మీరంలో ఉగ్రవాదులు ఇటీవల కల్లోలం సృష్టించిన విషయం విదితమే. జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో గల ప్రశాంత బైసరన్ లోయలో కాల్పులకు తెగబడి.. 26 మంది పర్యాటకులను చంపేశారు.కఠిన చర్యలకు ఉపక్రమంచిన భారత్ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌కు భారత్ గట్టి షాకులు ఇచ్చింది. సింధు జలాల ఒప్పందం సహా పలు విషయాల్లో పాక్‌ను కోలుకోలేని దెబ్బకొట్టేలా ముందుకు సాగుతోంది. ఆ దేశ ట్విటర్, సినిమాలపై నిషేధం విధించింది. అంతేకాదు.. తాజాగా పాక్‌కు చెందిన 16 యూట్యూబ్ చానెళ్లను బ్యాన్ చేసింది.మీరంతా పనికిరాని వాళ్లనేగా అర్థంఈ క్రమంలో షాహిద్ ఆఫ్రిది స్పందిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు. ‘‘భారత్‌లో చిన్న పటాకా పేలినా వాళ్లు పాకిస్తాన్నే నిందిస్తారు. కశ్మీర్లో 8 లక్షల మందితో కూడిన పటిష్టమైన సైన్యం ఉంది. అయినా సరే ఇదెలా జరిగింది?.. మీరంతా పనికిరాని వాళ్లనేగా దీని అర్థం.ప్రజలకు కనీస భద్రత కల్పించడం కూడా మీకు చేతకావడం లేదు. ఘటన జరిగిన గంటలోపే మీడియా మొత్తం బాలీవుడ్ వైపే గురిపెట్టింది. వారి మాట తీరు నాకు ఆశ్చర్యం కలిగించింది.తమకు తాము విద్యావంతులమని చెప్పుకొంటారు. కానీ వారి ఆలోచనా విధానం ఇంత వరకే పరిమితం. ఇండియాలో ఇద్దరు టాప్ క్రికెటర్లు ఉన్నారు. భారత క్రికెట్‌కు అంబాసిడర్లుగా కొనసాగారు. కానీ వాళ్లు కూడా నేరుగా పాకిస్తాన్ వైపే వేలు చూపిస్తూ నిందిస్తున్నారు. దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలి’’ అని షాహిద్ ఆఫ్రిది రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు.ఇదిలా ఉంటే.. పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా మాత్రం పహల్గామ్ ఘటన నేపథ్యంలో తమ దేశ నాయకత్వ తీరుపై మండిపడ్డాడు. ఉగ్రదాడిని వెంటనే ఖండించకపోవడం అనుమానాలకు తావిచ్చిందని పేర్కొన్నాడు. ఇక పాక్ ఉప ప్రధాని ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులతో పోల్చడాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు. డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ తన వ్యాఖ్యల ద్వారా ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నది తామేనని నేరుగానే అంగీకరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ముక్తకంఠంతో ఖండించారుఇక పహల్గామ్ ఉగ్రదాడిని భారత క్రీడాలోకం ముక్తకంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. టీమిండియా దిగ్గజ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ తదితరులు బాధితులకు, వారి కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. బాధితులకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.అదే విధంగా.. మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. పాక్ క్రికెట్‌తో సంబంధాలన్నీ తెంచుకోవాలని బీసీసీఐకి సూచించాడు. ప్రతి ఏడాది ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడటం ఉగ్రవాదులకు అలవాటై పోయిందని.. ప్రభుత్వం కఠిన చర్యలతో ఉగ్రవాదాన్ని తుడిచిపెట్టేయాలని కోరాడు.చదవండి: మా గురించి మీకేం తెలుసు?.. మాకు అలాంటి పిచ్చిలేదు: సంజనా ఫైర్ -
ఫలితాలు, విదేశీ అంశాలపై కన్ను
ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు ఈ వారం పలు అంశాల ఆధారంగా కదలనున్నాయి. ప్రధానంగా గత వారం జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో టూరిస్టులపై ఉగ్రదాడి కారణంగా భారత్, పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు ప్రభావం చూపనున్నాయి. దీంతో రెండు దేశాల మధ్య రాజకీయ, భౌగోళిక ఆందోళనలు సెంటిమెంటుకు కీలకంగా నిలవనున్నట్లు విశ్లేషకులు ప్రస్తావించారు. ఇవికాకుండా అమెరికా, చైనా మధ్య టారిఫ్‌ల సంక్షోభానికి సైతం ప్రాధాన్యత ఉన్నట్లు తెలియజేశారు. ఈ నేపథ్యంలో గత వారం చివర్లో మార్కెట్లు ఉన్నట్టుండి బలహీనపడ్డాయి. ఫలితంగా ఎన్ఎస్ఈ ప్రధాన ఇండెక్స్ నిఫ్టీ 23,800కు ఎగువన నిలవగలిగితేనే సాంకేతికంగా బుల్లిష్ ధోరణి కొనసాగే వీలున్నట్లు నిపుణులు అభిప్రాయపడ్డారు. కాగా.. ఈ వారం ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితంకానుంది. మహారాష్ట్ర డే సందర్భంగా గురువారం(మే 1న) మార్కెట్లు పనిచేయవు. ఇంధన, సిమెంట్ కంపెనీలు ఇప్పటికే గత ఆర్థిక సంవత్సర(2024–25) ఫలితాల సీజన్ ప్రారంభమై జోరందుకుంది. ఈ బాటలో ఈ వారం మరికొన్ని దిగ్గజాలు క్యూ4(జనవరి–మార్చి) పనితీరుతోపాటు పూర్తి ఏడాది ఫలితాలు ప్రకటించనున్నాయి. జాబితాలో ఇంధన రంగ పీఎస్‌యూలు ఇండిఆయన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్)సహా.. సిమెంట్ దిగ్గజాలు అంబుజా, అల్ట్రాటెక్, టాటా గ్రూప్ దిగ్గజం ట్రెంట్, ద్విచక్ర వాహన దిగ్గజం టీవీఎస్ మోటార్, బజాజ్ ఫైనాన్స్ తదిరాలున్నాయి. గత వారం చివర్లో డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ క్యూ4, పూర్తి ఏడాది ఫలితాలు వెలువరించింది. ఈ ప్రభావం నేటి(సోమవారం) ట్రేడింగ్‌లో రిలయన్స్ కౌంటర్‌పై కనిపించనున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఇతర అంశాలు గత వారం ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు ఇండెక్స్ వెనకడుగు వేసింది. మరోవైపు దేశీ స్టాక్స్‌లో ఎఫ్‌పీఐలు భారీగా ఇన్వెస్ట్ చేశారు. వెరసి డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ రూపాయి బలపడింది. అమెరికా, చైనా మధ్య టారిఫ్‌ల సంక్షోభం కారణంగా పసిడి ధరలు మండుతున్నప్పటికీ ముడిచమురు ధరలు దిగివస్తున్నాయి. బ్రెంట్ చమురు 65 డాలర్ల సమీపంలో కదులుతోంది. రూపాయి పుంజుకోవడం, చమురు చల్లబడటం దేశీ ఆర్థిక వ్యవస్థకు సానుకూల అంశాలుగా మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఈ వారం భారత్, పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు, అంతర్జాతీయ టారిఫ్‌ల సంక్షోభం సెంటిమెంటును ప్రభావితం చేయనున్నట్లు రెలిగేర్ బ్రోకింగ్ రీసెర్చ్ సీనియర్ వీపీ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. ఇవికాకుండా దేశీయంగా పలు కార్పొరేట్ దిగ్గజాలు క్యూ4 ఫలితాలు ప్రకటించనుండటంతో ఇన్వెస్టర్లు వీటిపై దృష్టి పెట్టనున్నట్లు మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సరీ్వసెస్ వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ ఖేమ్కా తెలియజేశారు. మరోవైపు ఎఫ్‌పీఐలు కొనుగోళ్లకు ఆసక్తి చూపుతుండటం సానుకూల అంశమని జియోజిత్ ఇన్వెస్ట్మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజిస్ట్ వీకే విజయకుమార్ పేర్కొన్నారు. సానుకూలం2024 అక్టోబర్ మొదలు దేశీ స్టాక్స్‌లో పెట్టుబడుల ఉపసంహరణకే పెద్దపీట వేస్తున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) ఇటీవల కొనుగోళ్ల యూటర్న్ తీసుకోవడం గమనార్హం! దీంతో గత 7 ట్రేడింగ్ రోజుల్లో ఎఫ్‌పీఐలు నగదు విభాగంలో నికరంగా రూ. 27649 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. గత వారం రూ. 17,425 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు. ఫలితంగా భారత్, పాక్ ఉద్రిక్తతల నడుమ చివరి రెండు రోజుల్లో మార్కెట్లు నీరసించినప్పటికీ నికరంగా గత వారం లాభపడ్డాయి. బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 659 పాయింట్లు(0.84 శాతం) పుంజుకుని 79,213 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 188 పాయింట్లు(0.8 శాతం) ఎగసి 24,039 వద్ద స్థిరపడింది. అయితే బీఎస్ఈ మిడ్‌క్యాప్ మరింత అధికంగా 1.3 శాతం బలపడగా, స్మాల్‌క్యాప్ 0.12 శాతమే లాభపడింది.ఐఐపీవైపు చూపుమార్చి నెలకు పారిశ్రామికోత్పత్తి(ఐఐపీ) గణాంకాలు నేడు విడుదలకానున్నాయి. ఫిబ్రవరిలో ఐఐపీ వృద్ధి గత 6 నెలల్లోనే కనిష్టంగా 2.9 శాతానికి పరిమితమైంది. జనవరిలో నమోదైన 5.2 శాతంతో పోలిస్తే భారీగా క్షీణించింది. ఇక ఏప్రిల్ నెలకు హెచ్ఎస్బీసీ ఇండియా తయారీ పీఎంఐ వారాంతాన(మే 2న) విడుదలకానుంది. అంతర్జాతీయ అంశాల విషయానికివస్తే మార్చి నెలకు 29న యూఎస్ ఉపాధి గణాంకాలు వెల్లడికానున్నాయి. ఏప్రిల్‌కు చైనా తయారీ పీఎంఐ గణాంకాలు, ఏప్రిల్‌కు యూఎస్ పీసీఈ ధరల ఇండెక్స్ 30న వెలువడనున్నాయి. మే 1న బ్యాంక్ ఆఫ్ జపాన్ వడ్డీ రేట్ల నిర్ణయాలు, రిటైల్ ధరలు ప్రకటితంకానున్నాయి. ఈ బాటలో యూఎస్ తయారీ పీఎంఐ, వ్యవసాయేతర ఉపాధి, నిరుద్యోగిత గణాంకాలు 2న వెల్లడికానున్నాయి. -
భారత్ దెబ్బ అదుర్స్.. పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఎమర్జెన్సీ!
దాయాది దేశం పాకిస్తాన్‌కు భారత్ ‘జీలం ఝలక్’ ఇచ్చింది. మున్ముందు సినిమా ఎలా ఉంటుందో తెలిపేలా ఓ ట్రైలర్ చూపించింది. పాకిస్థాన్ అధికార వర్గాలకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా భారత్ శనివారం హఠాత్తుగా జీలం నదిలోకి నీటిని విడుదల చేసింది. దీంతో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే) రాజధాని ముజఫరాబాద్ వద్ద ఒక్కసారిగా నదిలో నీటి మట్టం పెరిగి వరద పోటెత్తింది.నది పొంగి పొర్లుతుండటంతో హతియన్ బాలా వద్ద ‘నీటి అత్యయిక పరిస్థితి’ (ఎమర్జెన్సీ) ప్రకటించారు. హతియన్ బాలా ప్రాంతం ముజాఫరాబాద్ నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో జీలం ఒడ్డున ఉంటుంది. నీటిమట్టం ప్రమాదకర స్థాయిలో ఉందంటూ స్థానిక మసీదుల్లోని మైకుల ద్వారా ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. ఘరీ దుపట్టా, మజ్హాయ్ వంటి జీలం నది ఒడ్డు ప్రాంతాల గ్రామాల్లో నివసించే ప్రజలు అకస్మాత్తుగా నీటిమట్టం పెరగడంతో భీతి చెందారు. Flood alert in PoK's Muzaffarabad as Jhelum River water levels surge. Locals allege India released water w/o informing Pak. auth. Sharp rise in water from Chakothi to Muzaffarabad sparks flood fears. Pak. claims India's move aims to suspend IWT post-Pahalgam attack. #Pakistan pic.twitter.com/Y9v4HwJQUD— Epic Pravin (@EpicPravin) April 27, 2025మన కశ్మీర్‌లోని అనంతనాగ్ జిల్లా నుంచి పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని చకోతీ ప్రాంతం గుండా ప్రవహిస్తూ నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. 20 నుంచి 30 అడుగుల ఎత్తున నీళ్లు ప్రవహిస్తున్నాయని,1990 దశకం తర్వాత ఈ స్థాయిలో వరద రావడం ఇదే మొదటిసారని స్థానికులు చెబుతున్నారు. కాగా, భారత్ చర్య అంతర్జాతీయ నిబంధనలను, జల ఒప్పందాలను పూర్తిగా ఉల్లంఘించడమేనని పాక్ ఆరోపించింది. ఈ ఘటనపై భారత్ వైపు నుంచి ఎలాంటి స్పందనా లేకపోవడం విశేషం!. దీనివల్ల రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు.Major Flooding in Jhelum: #Pakistan Declares EmergencyAfter stopping the water, now India releases excess water in the Jhelum River, allegedly without warning.Muzafrabad in Pok flooded.This is just a glimpse!#PakistanBehindPahalgam pic.twitter.com/QdIjf1v2oj— India Strikes YT 🇮🇳 (@IndiaStrikes_) April 26, 2025అయితే కరువు... లేకపోతే వరద!పహల్గాంలో ఉగ్రవాదుల దాడి తర్వాత సింధు జలాల ఒప్పందం అమలును భారత్ నిలిపివేసిన సంగతి తెలిసిందే. సీమాంతర ఉగ్రవాదానికి పాక్ మద్దతు విడనాడే వరకు ఒప్పందం అమలు సస్పెన్షన్‌లో ఉంటుందని భారత ప్రభుత్వం ప్రకటించింది. ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో 1960లో భారత్, పాక్ నడుమ సింధు నదీ జలాల ఒప్పందం కుదిరింది. పాకిస్థాన్‌లో 90% సేద్యం సింధు జలాలపై ఆధారపడుతుంది. హైడ్రలాజికల్ డేటాను ఎప్పటికప్పుడు సరైన సమయంలో పాకిస్తాన్‌కు అందజేయాలనేది ఈ ఒప్పందంలో మన దేశం నెరవేర్చాల్సిన ఓ కీలక బాధ్యత. వరద హెచ్చరికలను ముందుగానే తెలియజేయడం, నీటి వినియోగ వివరాలు, హిమనీనదాలు (గ్లేసియర్స్) కరిగే తీరుతెన్నుల సమాచారాన్ని పొరుగుదేశంతో పంచుకోవడం భారత్ విధి. ఒప్పందం అమలును భారత్ తాజాగా నిలిపివేయడంతో ఇప్పుడిక ఈ బాధ్యతలకు బ్రేక్ పడింది. సింధు నది, దాని ఉపనదుల్లో ఏయే సమయాల్లో ఏమేరకు నీటి నిల్వలున్నాయనే సమాచారాన్ని భారత్ ఇవ్వకపోతే పాక్ పరిస్థితి... నీరు లేక నేల ఎండిపోయి... ‘పడితే కరువు బారిన పడటం లేదంటే వరద ముంచెత్తడం’ అన్నట్టు తయారవుతుంది. Floods in Muzaffarabad, POK today after India released waterpic.twitter.com/vF4ClKxVgW— Ghar Ke Kalesh (@gharkekalesh) April 26, 2025ఇక, సింధు నది జలాల ఒప్పందాన్ని భారత్ ఇప్పటికే రద్దు చేసింది. దీనిపై పాక్ ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది. నదీ జలాలను మళ్లించినా, అడ్డుకున్నా దీనిని ‘యుద్ధ చర్య’గా భావిస్తామని చెప్పింది. ఈ నేపథ్యంలోనే జీలం నదిలో వరదలు రావడం గమనార్హం. ఈ నేపథ్యంలో ముజఫరాబాద్‌లోని రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (SDMA) ఆపరేషన్స్ డైరెక్టర్ ముజఫర్ రాజా స్పందిస్తూ.. భారత ఆక్రమిత కాశ్మీర్‌లోని ఒక ఆనకట్ట నుండి నీటిని విడుదల చేసినట్లు ధృవీకరించారు. విద్యుత్ ప్రాజెక్టు ఆనకట్ట యొక్క స్పిల్‌వేలు తెరవబడ్డాయి, ఫలితంగా ఒక మోస్తరు వరద పరిస్థితి ఏర్పడింది అని ఆయన అన్నారు, స్థానిక నివాసితులు తమ భద్రత కోసం నదికి దూరంగా ఉండాలని కోరారు.-జమ్ముల శ్రీకాంత్.BREAKING🇮🇳🇵🇰 Local sources report that flooding in the Jhelum River, located in northern India and eastern Pakistan, occurred after India released water without prior notification. pic.twitter.com/vD4VPlsyr5— The Global Beacon (@globalbeaconn) April 26, 2025 -
అటారీ–వాఘా సరిహద్దు మూసివేత..
రాజస్తాన్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి..భారత్, పాకిస్తాన్ల మధ్య రాజుకున్న ఉద్రిక్తతలు.. సరిహద్దుల మూసివేత సామాన్యులకు ఎన్నో అవ స్థలు తెచ్చిపెట్టాయి. రాజస్తాన్‌లోని బర్మేర్‌కు చెందిన షైతాన్ సింగ్ అనే యువకుడికి పాకిస్తాన్‌లోని సింధు ప్రావిన్స్‌కు చెందిన కేసర్ కన్వర్‌తో నాలుగేళ్ల క్రితమే పెళ్లి నిశ్చయమైంది. వరుడికి, అతడి కుటుంబీలకు వీసా దొరక్క పెళ్లి ఇప్పటిదాకా జరగలేదు. ఫిబ్రవరి 28న వీసాలు మంజూరయ్యాయి. ఈ నెల 30వ తేదీన సింధ్ ప్రావిన్స్‌లోని అమర్‌కోట్‌లో వధువు ఇంట్లో వివాహ వేడుక జరగాల్సి ఉంది. ఇందుకోసం సరిహద్దులకు రెండువైపులా ఉన్న కుటుంబాలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇంతలోనే చోటుచేసుకున్న అనూహ్య పరిణామాలతో బుధవారం అట్టారీ–వాఘా సరిహద్దును అధికారులు మూసివేశారు. విషయం తెలియని షైతాన్ సింగ్ కుటుంబం ఊరేగింపుగా అటారీ–వాఘా బోర్డర్ పాయింట్‌కు చేరుకుంది. అక్కడ ఆర్మీ అధికారులు అసలు విషయం చెప్పడంతో అంతా షాకయ్యారు. ‘ఎప్పటి నుంచో ఈ రోజు కోసం ఎదురుచూస్తున్నాం. కానీ, ఇలా జరిగింది’అంటూ షైతాన్ సింగ్ ఆవేదన చెందారు. ‘మమ్మల్ని ఆహ్వానించేందుకు బోర్డర్ పోస్ట్ వద్దకు చేరుకున్న మా బంధువులు చేసేది లేక తిరిగి వెళ్లిపోయారు’అని అతడి సోదరుడు చెప్పారు. ఉగ్రదాడుల కారణంగా తమ బంధుత్వాలు కూడా దెబ్బతింటున్నాయని అతడు పేర్కొన్నాడు. అయితే, ఈ కుటుంబానికి మరో చిన్న ఆశ మిగులుంది. అదేంటంటే, వీరి వీసాల గడువు మే 12వ తేదీ వరకు ఉండటం. అప్పటికల్లా తిరిగి సరిహద్దులు తెరుచుకుంటాయని, పెళ్లి జరుగుతుందని ఆశతో వీరున్నారు. కాగా, భారత, పాకిస్తాన్ సరిహద్దులకు సమీప ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ఉంటున్న సోధా రాజ్పుట్ వర్గం ప్రజల మధ్య వివాహ సంబంధాలు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. -
జోక్ కాదు.. పాక్ క్రికెట్‌తో సంబంధాలన్నీ తెంచుకోండి: గంగూలీ
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) కీలక వ్యాఖ్యలు చేశాడు. పాకిస్తాన్ క్రికెట్‌తో సంబంధాలన్నీ తెంచుకోవాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI)కి సూచించాడు. కాగా జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదులు మంగళవారం పాశవిక దాడికి తెగబడిన విషయం తెలిసిందే.ప్రశాంతమైన బైసరన్ లోయలో 26 మంది పర్యాటకులను లష్కర్-ఎ-తొయిబా ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ క్రమంలో భారత్- పాక్ మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. 2008 తర్వాత టీమిండియా ఒక్కసారి కూడా పాకిస్తాన్ పర్యటనకు వెళ్లలేదన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పాక్ 2013లో భారత పర్యటనకు వచ్చింది.అనంతరం దాయాది దేశాల పరిస్థితుల్లో ఎలాంటి మార్పులు లేకపోవడంతో ఇరుజట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు నిలిచిపోయాయి. అయితే, ఐసీసీ ఈవెంట్లు, ఆసియా కప్ టోర్నీల్లో మాత్రం భారత్- పాక్ (Ind vs Pak) ముఖాముఖి తలపడుతున్నాయి. కానీ తాజాగా పహల్గామ్ ఘటన నేపథ్యంలో సంబంధాలు పూర్తిగా తెగిపోయే పరిస్థితి వచ్చింది.సంబంధాలు తెంచుకోవాలిఈ నేపథ్యంలో బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ.. ‘‘అవును.. వందకు వంద శాతం పాకిస్తాన్‌తో అన్ని సంబంధాలు తెంచుకోవాలి. కఠిన చర్యలు చేపట్టాలి. ప్రతి ఏడాది ఇలాంటి ఘటనలు జరగడాన్ని తేలికగా తీసుకోవద్దు. ఇదేమీ జోక్ కాదు. ఉగ్రవాదాన్ని సహించకూడదు. టెర్రరిజంను తుడిచిపెట్టేయాలి’’ అని పేర్కొన్నాడు.ఇక బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా ఇప్పటికే పాక్‌తో భవిష్యత్తులోనూ ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండబోవని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఐసీసీ నిబంధనలకు అనుగుణంగా ప్రస్తుతం దాయాదితో ఆడుతున్నామని.. అయితే, పరిస్థితులన్నింటినీ ఐసీసీ కూడా గమనిస్తోందని తెలిపారు. భారత ప్రభుత్వం చెప్పినట్లే తాము నడుచుకుంటామని స్పష్టం చేశారు.ముక్తకంఠంతో ఖండించిన క్రీడా లోకంకాగా పహల్గామ్ ఉగ్రదాడి ఘటనను భారత క్రీడా లోకం ముక్తకంఠంతో ఖండించిన విషయం తెలిసిందే. ‘‘బాధిత కుటుంబాలు ఊహించలేని కష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఈ కష్టకాలంలో భారత్‌తో పాటు యావత్ ప్రపంచం వారికి అండగా నిలుస్తోంది. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తేలియజేస్తున్నా. న్యాయం జరగాలని ప్రార్థిస్తున్నా’’ అని టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ అన్నాడు.ఇక విరాట్ కోహ్లి సైతం.. ‘‘ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు శాంతి, బలం చేకూరాలని ప్రార్థిస్తున్నా. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నా. ఇలాంటి క్రూరమైన చర్యకు న్యాయం జరగాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నాడు.మరోవైపు.. ‘‘అమాయకులైన పర్యాటకులపై దాడి హేయమైన చర్య. దీనికి రాబోయే కాలంలో మన ధైర్యవంతమైన సైనికులు గట్టి బదులిస్తారు. జమ్మూకశ్మీర్‌లో శాంతికి భంగం కలగించాలనుకునే వారి ప్రణాళికలు ఎప్పటికీ విజయవంతం కావు’’ అని బాక్సర్ విజేందర్ సింగ్ తన స్పందన తెలియజేశాడు.భారత బ్యాడ్మింటన్ స్టార్ పూసర్ల వెంకట సింధు స్పందిస్తూ.. ‘‘పహల్గామ్ ఉగ్ర దాడి బాధితుల కోసం నా హృదయం తపిస్తోంది. ఎలాంటి కారణమైనా.. ఇంత క్రూరత్వాన్ని సమర్థించదు. బాధితుల దుఖం మాటల్లో చెప్పలేనిది. కానీ వారు ఒంటరి వారు కాదు. వారి వెంట యావత్ దేశం ఉంది. క్లిష్ట సమయంలో ఒకరికొకరు అండగా నిలుద్దాం. శాంతి పునరుద్ధరణ తప్పక జరుగుతుంది’’ అని పేర్కొంది.చదవండి: PSL 2025 Live Suspended: పాకిస్తాన్‌కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక.. -
బాధాతప్త హృదయాలతో వీడ్కోలు.. పాక్ సరిహద్దులో భావోద్వేగ దృశ్యాలు
న్యూఢిల్లీ: పహల్గాం దాడికి పాల్పడింది ఉగ్రవాదులు. ఆ దాడికి మాకు ఏంసంబంధం అండి? ప్రాణాలు రక్షించుకునేందుకు చికిత్స కోసం వచ్చిన మేం. పాక్ వైపు తరలి పోతున్నాం. ఇంతకాలం మాకు స్థానికులు ఇచ్చే అతిథ్యం మా జీవితాల్లో మరిచిపోలేం. కానీ, గత రెండు రోజులుగా వాళ్లు మాతో సరిగ్గా వ్యవరించడంలేదు’’ అని కొందరు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ‘‘ దాడికి పాల్పడింది ఉగ్రవాదులు. శిక్షించాల్సింది వాళ్లనే. కానీ, ఏం తప్పు చేయని మమ్మల్ని ఎందుకు శిక్షిచడం? అని పాక్ పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాక్‌లో పుట్టడమే మేం చేసిన నేరమా? అంటూ పలువురు భావోద్వేగంగా మాట్లాడుతున్నారు. దౌత్యపరమైన చర్చల ద్వారా శాంతి చర్చలకు ముందుకు వెళ్లాలని కోరుకుంటున్నారు. పాక్ నుంచి ప్రతీ నెలా వందల మంది చికిత్స కోసం భారత్‌కు ప్రత్యేక వీసా మీద వస్తుంటారు. ఇందులో వివిధ రకాల జబ్బులు, అనారోగ్య కారణాలతో వచ్చేవాళ్లే ఎక్కువ. మరీ ముఖ్యంగా పసిపిల్లల చికిత్స కోసం భారత్ ఎక్కువ వీసాలు మంజూరు చేస్తుంటుంది.ఇప్పటికే పాక్ పౌరులు భారత్‌ను విడిచిపెట్టిపోవాలని భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో అన్ని రాష్ట్రాల సీఎంకు ఫోన్లో మాట్లాడిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా, వీలైనంత త్వరగా వాళ్లను గుర్తించి వెనక్కి పంపించేయాలని ఆదేశించారు.ఇదిలా ఉంటే.. పాక్ భారత్‌ల మధ్య ఉద్రికత్తలను తగ్గించడానికి.. దౌత్యానికి తాము సిద్ధమంటూ ఇరాన్ ప్రకటించింది. అదే సమయంలో.. ఐక్యరాజ్య సమితి కూడా సమయమనం పాటించాలని ఇరు దేశాలకు పిలుపు ఇచ్చింది. -
ముష్కరుల వేటలో భారత్‌కు సహకరిస్తాం
వాషింగ్టన్: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది హిందువులను పొట్టనబెట్టుకున్న ముష్కరుల వేటలో భారత్‌కు తమ దేశం పూర్తిగా సహకరిస్తుందని అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ చీఫ్ తులసీ గబ్బార్డ్ స్పష్టం చేశారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ఆమె శుక్రవారం ‘ఎక్స్’ వేదికగా సానుభూతి ప్రకటించారు. దాడికి కారకులైన ఉగ్రవాదులను పట్టుకునేందుకు భారత్‌కు సాయంగా నిలుస్తామని అమెరికా విదేశాంగ శాఖ ఇప్పటికే ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధ వారం ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. దారు ణాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. -
ఇద్దరు ఆదిల్ల కథ
శ్రీనగర్: ఇద్దరూ కశ్మీరీలే. ఇద్దరి పేరూ ఒకటే. కానీ ఒక ఆదిల్ మతోన్మాదంతో పాక్ ముష్కర ముఠాలో భాగమై స్వదేశీయులపైనే కాల్పులకు తెగబడ్డాడు. కశ్మీర్ ప్రతిష్టకే మాయని మచ్చలా మిగిలాడు. మరో ఆదిల్ ఆ తూటాలకు ధైర్యంగా ఎదురొడ్డి నిలిచాడు. పర్యాటకులను కాపాడే ప్రయత్నంలో ప్రాణాలర్పించాడు. మొదటివాడు పహల్గాంలో పర్యాటకులపై దాడికి తెగబడ్డ ఏడుగురు లష్కరే తొయిబా ఉగ్రవాదుల్లో ఒకడైన ఆదిల్ హుసేన్ ఠోకర్ అలియాస్ ఆదిల్ గురీ. వారిని ప్రతిఘటించిన సయీద్ ఆదిల్ హుసేన్ షా స్థానిక పోనీవాలా. కశ్మీర్ (Kashmir) పర్యాటకానికి చెడ్డపేరు రాకుండా అడ్డుకునేందుకు చివరిదాకా పోరాడిన అతని ధైర్యసాహసాలను దేశమంతా ముక్త కంఠంతో ప్రశంసిస్తోంది.టీనేజీలోనే... 20 ఏళ్లు దాటిన ఆదిల్ ఠోకర్ స్వగ్రామం దక్షిణ కశ్మీర్‌లోని బిజ్బెహరా ప్రాంతంలోని గురీ. టీనేజర్‌గా ఉండగానే 2018లో పాక్ బాట పట్టాడు. అధికారిక పత్రాలతోనే వెళ్లినా కొద్ది రోజులకే పాక్‌లోనే ‘మాయమైపోయాడు’. పాక్‌కు చెందిన నిషేధిత లష్కరే తొయిబా ఉగ్ర సంస్థలో చేరినట్టు నిఘా వర్గాలు గుర్తించాయి. తోటి ముష్కరులతో కలిసి 2024లో నియంత్రణ రేఖ గుండా భారత్‌లోకి చొరబడ్డట్టు నిర్ధారించుకున్నాయి. అప్పటినుంచీ జమ్మూలోని దోడా, కిష్త్వార్ తదితర ప్రాంతాల్లో ఆదిల్ ఠోకర్ మారణహోమం సృష్టిస్తున్నాడు. లోయలో ఏడాదిన్నరగా జరిగిన పలు ఉగ్ర ఘటనల్లో కూడా అతని హస్తమున్నట్టు తేలింది. పహల్గాం దాడిలో పాల్గొన్న ఏడుగురిలో ఐదుగురు పాకిస్తానీలు కాగా ఇద్దరు కశ్మీరీ ఉగ్రవాదులు. ఠోకర్ వారిలో ఒకడని దాడిలో చనిపోయిన ఓ వ్యక్తి భార్య నిర్ధారించింది. పోలీసులు తమకు చూపిన ఫొటోల ద్వారా అతన్ని గుర్తు పట్టింది. ‘‘నా భర్త తలను తూటాలతో ఛిద్రం చేసింది ఇతనే. దాడి తర్వాత తోటి ఉగ్రవాదులతో కలిసి అడవిలోకి మాయమయ్యాడు’’ అని వివరించింది. దేశమంతా జేజేలు గుర్రాలను నడుపుకునే 30 ఏళ్ల ఆదిల్ హుసేన్ షాది పహల్గాం (Pahalgam). కర్కశ దాడికి వేదికైన బైసారన్ మైదానాల్లోకి రోజూ గుర్రాలపై పర్యాటకులను చేరవేస్తుంటాడు. దాడి వేళ తోటి స్థానికుల్లా తనకెందుకు లెమ్మని అనుకోలేదు. ముష్కరులు కేవలం హిందువులనే లక్ష్యం చేసుకుంటున్నా, తనకు ఎలాంటి ప్రమాదమూ లేదని తెలిసినా ఊరుకోలేదు. తనవంటివారికి జీవనాధారమైన పర్యాటకులను కాపాడేందుకు చివరిదాకా ప్రయత్నించాడు.చదవండి: ఆ క్షణంలోనే చనిపోయేవాడిని.. అందుకే బతికివున్నా..ఒక ఉగ్రవాది నుంచి తుపాకీ లాక్కోబోయాడు. ఆ ప్రయత్నంలో కాల్పులకు బలయ్యాడు. మూడు తూటాలు ఆదిల్ ఛాతీని ఛిద్రం చేశాయి. తన పిల్లలందరిలోనూ ఆదిలే అత్యంత దయా స్వభావి అంటూ తండ్రి సయీద్ హైదర్ షా కన్నీటి పర్యమంతమయ్యాడు. ఆదిల్ అంత్యక్రియలకు జనం భారీగా పోటెత్తారు. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) కూడా పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. -
పాక్ ఆటగాడికి ఆహ్వానం.. నీరజ్ చోప్రాపై ట్రోలింగ్!.. మా అమ్మ ఏం చేసింది?
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తనపై వస్తున్న విమర్శలపై భారత స్టార్ జావెలిన్ త్రోయర్, ఒలింపిక్ పసిడి పతక విజేత నీరజ్ చోప్రా (Neeraj Chopra) స్పందించాడు. తనకు తన దేశం, దేశ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశాడు. ఓ అథ్లెట్‌గా మరో అథ్లెట్‌ను తన పేరిట జరిగే ఈవెంట్‌కు రమ్మన్నానే తప్ప.. మరో ఉద్దేశం లేదని పేర్కొన్నాడు.నో చెప్పిన అర్షద్అసలేం జరిగిందంటే.. కాగా మే నెల (24)లో బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో ‘నీరజ్ చోప్రా క్లాసిక్ జావెలిన్ ఈవెంట్’ జరుగనుంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ స్టార్ ఆటగాడు, ప్యారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గిన అర్షద్ నదీమ్ (Arshad Nadeem)ను ఈ టోర్నీలో పాల్గొనాల్సిందిగా నీరజ్ చోప్రా ఆహ్వానించాడు.అయితే, తాను ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌నకు సన్నద్ధమయ్యే క్రమంలో ఈ ఈవెంట్‌కు రాలేకపోతున్నానని అర్షద్ తెలిపాడు. ఇదిలా ఉంటే.. పహల్గామ్లో మంగళవారం పర్యాటకులపై ఉగ్రదాడి జరగగా.. భారత క్రీడా లోకం ముక్తకంఠంతో ఈ పాశవిక చర్యను ఖండించిన విషయం తెలిసిందే.‘‘జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడితో హృదయం విదారకంగా మారింది. బాధితులు, వారి కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నా’’ అని నీరజ్ చోప్రా ట్వీట్ చేశాడు. అయితే, కొంతమంది నెటిజన్లు అతడిని ట్రోల్ చేశారు. ముఖ్యంగా పాక్‌కు చెందిన అర్షద్ నదీమ్‌ను ఈవెంట్‌కు ఆహ్వానించడాన్ని తప్పుబడుతూ ద్రోహి అంటూ నీరజ్‌ను నిందించారు. విద్వేష విషం చిమ్ముతున్నారుఈ నేపథ్యంలో నీరజ్ చోప్రా స్పందిస్తూ.. ‘‘సాధారణంగా నేను చాలా తక్కువగా మాట్లాడతాను. అయితే, నాకు తప్పుగా అనిపించిన విషయాలకు వ్యతిరేకంగా మాట్లాడటంలో మాత్రం వెనుకడుగు వేయను. ముఖ్యంగా దేశం పట్ల నా ప్రేమపై సందేహాలు, నా కుటుంబ గౌరవమర్యాదలకు భంగం వాటిల్లే పరిస్థితే వస్తే అస్సలు రాజీపడను.అర్షద్ నదీమ్‌ను ఈవెంట్‌కు ఆహ్వానించడం గురించి పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. విద్వేష విషం చిమ్ముతున్నారు. అసభ్యంగా తిడుతున్నారు. మా కుటుంబాన్ని కూడా వదలడం లేదు.ఓ అథ్లెట్‌గా మరో అథ్లెట్ అయిన అర్షద్‌కు నేను ఆహ్వానం పంపాను. అంతేగానీ అందులో వేరే ఉద్దేశాలు ఏమీ లేవు. నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్లో భాగంగా అత్యుత్తమ అథ్లెట్లను దేశానికి రప్పించి.. ప్రత్యేక గుర్తింపు తీసుకురావాలన్న ఉద్దేశంతో మాత్రమే ఇలా చేశాం.ఇందుకు సంబంధించి సోమవారమే అంటే.. పహల్గామ్ ఘటన కంటే ముందే సదరు అథ్లెట్లకు ఆహ్వానాలు చేరిపోయాయి. ఆ తర్వాత 48 గంటలకు ఘటన జరిగింది. నా వరకు నా దేశం, నా దేశ ప్రయోజనాలే అత్యంత ముఖ్యం. అన్నింటికంటే వాటికే నా మొదటి ప్రాధాన్యం ఉంటుంది.మా అమ్మ తప్పేముంది?బాధితులు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. దేశం మొత్తం వారికి అండగా ఉంటుంది. జరిగిన ఘటనతో నా మనసు ఎంతో బాధపడింది. అంతకంటే ఎక్కువ ఆగ్రహాన్నీ తెప్పించింది. మన దేశం ఇందుకు తగిన సమాధానం చెప్పి.. బాధితులకు న్యాయం చేస్తుందని విశ్వసిస్తున్నా.ఓ క్రీడాకారుడిగా చాలా ఏళ్లుగా దేశానికి ప్రాతినిథ్యం వహిస్తున్నా. అందుకు ఎంతో గర్విస్తున్నా కూడా. కానీ దేశం పట్ల నా ప్రేమను సందేహిస్తూ ఇలాంటి కామెంట్లు రావడం మనసును బాధించింది.నన్ను, నా కుటుంబానికి టార్గెట్ చేస్తున్నవాళ్లు.. మాది ఓ సాధారణ కుటుంబం అనే విషయం అర్థం చేసుకోవాలి. నా మీద మీడియాలో కూడా కొన్ని అసత్య ప్రచారాలు జరుగుతున్నాయి. నేను స్పందించననే భ్రమలో ఉన్నారేమో.మీరు చేసే అబద్ధపు ప్రచారాలు ఎన్నటికీ నిజం కావు. మా అమ్మను ఎందుకు వివాదంలోకి లాగుతున్నారో అర్థం కావడం లేదు. దాదాపు ఏడాది క్రితం తను ఓ తల్లిగా స్పందిస్తూ అమాయకంగా, స్వచ్ఛమైన మనసుతో మాట్లాడిన మాటలను కూడా వక్రీకరిస్తున్నారు.ఆరోజు మా అమ్మను ఎంతో మంది ప్రశంసించారు. మరి ఈరోజు అదే మనుషులు ఎందుకు ఇలా తనను కించపరిచేలా మాట్లాడుతున్నారు. నేను మరింత కఠినంగా శ్రమించి దేశానికి మరింత గొప్ప పేరు తెచ్చేందుకు ఎల్లవేళలా కృషి చేస్తా. జై హింద్ ’’ అంటూ సుదీర్ఘ నోట్ షేర్ చేశాడు. దేశం పట్ల తన ప్రేమను శంకించేవారికి ఇలా గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు.కాగా టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన నీరజ్.. ప్యారిస్‌లో రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇక ప్యారిస్‌లో అర్షద్ రికార్డు స్థాయిలో 2.97 మీటర్ల దూరం విసిరి పసిడి పతకం అందుకున్నాడు. కాగా నీరజ్- అర్షద్ టోక్యో, ప్యారిస్ విశ్వక్రీడల సమయంలో కలిసి ఫొటోలు దిగుతూ.. క్రీడాస్ఫూర్తికి నిదర్శనంగా నిలిచారు.ఇక ప్యారిస్‌లో నీరజ్ తృటిలో స్వర్ణం చేజార్చుకున్నా.. అర్షద్ గెలవడం కూడా తమకు సంతోషాన్నిచ్చిందని నీరజ్ తల్లి పేర్కొన్నారు. అర్షద్ కూడా తన కుమారుడి లాంటి వాడేనని.. అతడిని దేవుడు చల్లగా చూడాలని ఆకాంక్షించారు. అయితే, తాజా ఘటనల నేపథ్యంలో నీరజ్‌తో పాటు అతడి తల్లిని కొంతమంది దారుణంగా ట్రోల్ చేస్తున్నారు.చదవండి: కోటీశ్వరుడినయ్యా.. నేను స్టార్ అనుకుంటే వచ్చే ఏడాది కనిపించడు: సెహ్వాగ్ -
పాకిస్తాన్ ఉప ప్రధాని వ్యాఖ్యలు.. మండిపడ్డ పాక్ మాజీ క్రికెటర్
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ చేసిన వ్యాఖ్యలపై ఆ దేశ క్రికెటర్ డానిష్ కనేరియా (Danish Kaneria) స్పందించాడు. ఇషాక్ మాటలను బట్టి తాము ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్నట్లు పాక్ అంగీకరించినట్లు స్పష్టమైందన్నాడు. కాగా జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్లో ఉగ్రవాదులు మంగళవారం పాశవిక చర్యకు పాల్పడిన విషయం తెలిసిందే.బైసరన్ లోయలో పర్యాటకులపై కాల్పులు జరిపిన తీవ్రవాదులు.. 26 మంది ప్రాణాలు తీశారు. ఈ ఘటన నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ భారత్‌కు సంఘీభావం ప్రకటించాయి. పాకిస్తాన్ కూడా పహల్గామ్ దాడిని ఖండించింది.స్వాతంత్ర్య సమరయోధులా?అయితే, పాక్ ఉప ప్రధాని, విదేశాంగ మంత్రి ఇషాక్ దార్ (Ishaq Dar) మాత్రం అనుచిత వ్యాఖ్యలు చేశాడు. ఇస్లామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో దాడులు చేసిన ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులుగా అభివర్ణించాడు. దీంతో ఇషాక్ దార్ వ్యాఖ్యలపై భారతీయ నెటిజన్లు భగ్గుమంటున్నారు.నేరుగా ఒప్పుకోవడమేఈ క్రమంలో పాక్ మాజీ స్పిన్నర్ డానిష్ కనేరియా కూడా ఇషాక్ దార్ తీరుపై ఘాటుగా స్పందించాడు. ఎక్స్ వేదికగా అతడి వ్యాఖ్యలకు సంబంధించిన ఫొటోను షేర్ చేస్తూ.. ‘‘పాకిస్తాన్ ఉప ప్రధానే స్వయంగా ఉగ్రవాదులను స్వాతంత్ర్య సమరయోధులు అని పిలుస్తుంటే.. ఇంతకంటే ఘోరం మరొకటి ఉండదు.ఇది కేవలం సిగ్గుచేటు మాత్రమే కాదు.. తమ దేశం ఉగ్రవాదానికి దన్నుగా ఉందని నేరుగా ఒప్పుకోవడమే అవుతుంది’’ అని కనేరియా ట్వీట్ చేశాడు. కాగా పాకిస్తాన్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడిన కనేరియా.. జట్టులో ఉన్నపుడు తాను ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని గతంలో చాలాసార్లు వెల్లడించాడు.అవమానాలు ఎదుర్కొన్నాహిందువును అయిన కారణంగా తనను సహచర క్రికెటర్లు వేరుగా చూస్తూ.. హేళన చేస్తూ ఇబ్బందులు పెట్టేవారని తెలిపాడు. పాకిస్తాన్ దిగ్గజ పేసర్ షోయబ్ అక్తర్ కూడా కనేరియా జట్టులో ఉండటం చాలామందికి నచ్చేదికాదని పేర్కొనడం గమనార్హం.ఇక అంతర్జాతీయ క్రికెట్లో 61 టెస్టులు, 18 వన్డేలు ఆడిన 44 ఏళ్ల కనేరియా.. ఆయా ఫార్మాట్లలో 261, 15 వికెట్లు తీశాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డుతో విభేదాల నేపథ్యంలో ప్రస్తుతం యూకేలో అతడు నివాసం ఉంటున్నట్లు సమాచారం.కాగా పహల్గామ్లో ఉగ్రదాడి జరగగానే కనేరియా స్పందించాడు. పాకిస్తాన్ హస్తం గనుక లేకపోతే.. పాక్ ప్రభుత్వం, ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఎందుకు వెంటనే ఈ దాడిని ఖండించలేదని ప్రశ్నించాడు. పాక్ ప్రభుత్వమే ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చి పెంచి పోషిస్తోందని ఆరోపించాడు.చదవండి: PSL 2025 Live Suspended: పాకిస్తాన్‌కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..When the Deputy Prime Minister of Pakistan calls terrorists “freedom fighters,” it’s not just a disgrace — it’s an open admission of state-sponsored terrorism. pic.twitter.com/QlS1UDzq20— Danish Kaneria (@DanishKaneria61) April 24, 2025 -
మీరేం సాధించారు?.. మరో 78 వేల ఏళ్లైనా ఇదే పరిస్థితి: గావస్కర్ ఫైర్
పహల్గామ్ ఉగ్రదాడి ఘటన (Pahalgam Incident) నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ (Sunil Gavaskar) చేసిన వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. డెబ్బై ఎనిమిదేళ్లుగా ఒక్క మిల్లీ మీటర్ భూమి కూడా చేతులు మారలేదని.. మరో 78 వేల ఏళ్లు గడిచినా పరిస్థితి ఇలాగే ఉంటుందని ఆయన అన్నారు. మరి అలాంటప్పుడు శాంతియుత జీవనం గడపకుండా.. అమాయకుల ప్రాణాలు తీస్తే వచ్చే లాభమేమిటంటూ తీవ్రవాదులకు చురకలు అంటించారు.బైసరన్ లోయలోఉగ్రవాదులు, వారికి మద్దతుగా నిలిచే వారు ఇకనైనా వాస్తవాన్ని గుర్తించి.. ఇలాంటి పిరికిపంద చర్యలను చాలించాలని గావస్కర్ సూచించారు. కాగా జమ్మూ కశ్మీర్‌లోని పహల్గామ్లో పర్యాటకులపై మంగళవారం ఉగ్రదాడి జరిగిన విషయం విదితమే. జమ్మూకశ్మీర్‌లో ‘మినీ స్విట్జర్లాండ్’గా పేరుగాంచిన బైసరన్ లోయలో ఉగ్రవాదులు జరిపిన భీకర దాడిలో 26 మంది మృతి చెందారు. బాధితులకు అండగాఈ నేపథ్యంలో తీవ్రవాదుల చర్యను క్రీడాలోకం ముక్తకంఠంతో ఖండించింది. ఇలాంటి క్లిష్ట సమయంలో మనమంతా ఒక్కటిగా ఉండి... బాధితులకు అండగా నిలవాల్సిన అవసరముందని పలువురు క్రీడాకారులు అభిప్రాయపడ్డారు.క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లి, బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ సిరాజ్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, పార్థివ్ పటేల్, శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్, అనీల్ కుంబ్లే, రవిశాస్త్రి, శ్రీవత్స గోస్వామి, టీమిండియా హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ బాక్సర్ విజేందర్ సింగ్, స్టార్ షట్లర్ పీవీ సింధు, సైనా నెహ్వాల్, జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా, షూటర్ అభినవ్ బింద్రా, బాక్సర్ నిఖత్ జరీన్, పీఆర్ శ్రీజేశ్ తదితరులు ఉగ్రవాదుల దాడిని ఖండించారు. అంతేకాదు.. పాకిస్తాన్‌తో క్రీడా సంబంధాలు ఎప్పటికీ పునరుద్ధరించకూడదని పలువురు ప్లేయర్లు పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై సునిల్ గావస్కర్ టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన బాధితులు, వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. భారతీయులందరిపై దీని ప్రభావం ఉంటుంది.మరో 78 వేల ఏళ్లు గడిచినా ఇదే పరిస్థితిదుశ్చర్యలకు పాల్పడేవారిని, వారికి మద్దతునిచ్చే వారిని నేను ఒకే ఒక్క ప్రశ్న అడగాలనుకుంటున్నా.. ఇలాంటి పనుల వల్ల మీరు ఏం సాధించారు? ఇకపై ఏం సాధిస్తారు?గత 78 ఏళ్లుగా ఒక్క మిల్లీ మీటర్ భూభాగం కూడా చేతులు మారలేదు. మరో 78 వేల ఏళ్లు గడిచినా పరిస్థితిలో ఎలాంటి మార్పూ రాదు. మరి అలాంటపుడు శాంతియుతంగా జీవిస్తూ.. దేశాభివృద్ధిపైన దృష్టి పెట్టడం మంచిది కదా! దయచేసి ఇకనైనా పిరికిపంద చర్యలు మానుకుని.. బుద్ధిగా ఉండండి’’ అని ఉగ్రవాదులకు హితవు పలికారు.చదవండి: PSL: పాకిస్తాన్‌కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక.. -
PSL: పాకిస్తాన్‌కు భారీ షాక్!.. అసలే అంతంత మాత్రం.. ఇప్పుడు ఇక..
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. అసలే అంతంత మాత్రంగా కొనసాగుతున్న పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ప్రసారాలు భారత్‌లో బంద్ అయిపోయాయి. పాక్ బోర్డుకు చెందిన పీఎస్ఎల్ టోర్నీని భారత్‌లో ప్రసారం చేస్తున్న ‘ఫ్యాన్ కోడ్’ మొబైల్ స్ట్రీమింగ్ సంస్థ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. పహల్గావ్ ఘటన నేపథ్యంలో భారత్‌లో ఇకపై పీఎస్ఎల్ టోర్నీ ప్రసారం చేయమని ప్రకటించింది. భారతీయుల మనోభావాలను గౌరవిస్తూ పీఎస్ఎల్లో మిగిలిన మ్యాచ్‌లను ప్రసారం చేయరాదని నిర్ణయం తీసుకున్నట్లు ‘ఫ్యాన్ కోడ్’ వెల్లడించింది. మరోవైపు పీఎస్ఎల్ టోర్నీ కోసం పాకిస్తాన్లో ఉండి మ్యాచ్‌ల ప్రసారానికి సంబంధించిన వేర్వేరు సాంకేతిక విభాగాల్లో పని చేస్తున్న భారతీయులను వెనక్కి పంపాలని ఆ దేశ ప్రభుత్వం కూడా నిర్ణయించింది. భారత్‌కు చెందిన దాదాపు రెండు డజన్ల మంది పీఎస్ఎల్లో ఇంజినీర్లు, ప్రొడక్షన్ మేనేజర్లు, కెమెరామెన్లు, ప్లేయర్ ట్రాకింగ్ ఎక్స్‌పర్ట్‌లుగా పని చేస్తున్నారు. రెండు రోజుల్లోగా వీరంతా దేశం వీడాలని పాక్ ప్రభుత్వం ఆదేశించింది. నిషేధం కొనసాగుతుంది: బీసీసీఐమరోవైపు- టీమిండియా- పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లపై ఉన్న నిషేధం ఇక ముందు కూడా కొనసాగుతుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు ఉండవని ఆయన పునరుద్ఘాటించారు. భారత్, పాక్ మధ్య 2013లో చివరిసారిగా ద్వైపాక్షిక సిరీస్ జరిగింది. అయితే ఆ తర్వాత ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు బాగా దెబ్బ తినడంతో ఆ తర్వాత ఎలాంటి సిరీస్‌ను నిర్వహించలేదు. ఐసీసీ టోర్నీల్లో మాత్రం రెండు జట్లూ తలపడుతూ వస్తున్నాయి. తాజాగా కశ్మీర్‌లోని పహల్గాంలో పాక్ తీవ్రవాదుల చేతుల్లో 26 మంది భారత పర్యాటకులు మరణించిన నేపథ్యంలో క్రికెట్ మ్యాచ్‌లపై మళ్లీ చర్చ మొదలైంది. ‘పాక్‌తో క్రికెట్ సిరీస్‌ల విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేం పూర్తిగా కట్టుబడి ఉన్నాం. వారు చెప్పిందే మేం వింటాం. కాబట్టి ఇకపై కూడా పాక్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడే అవకాశం లేదు.ఐసీసీతో ఒప్పందాల కారణంగానే వేర్వేరు టోర్నీల్లో ఆ జట్టుతో తలపడాల్సి వస్తోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై అవగాహన ఉన్న ఐసీసీ కూడా ఈ విషయాన్ని గమనిస్తోంది. ఇకపై ఏదైనా ఐసీసీ టోర్నీ వచ్చినపుడు తగిన విధంగా స్పందిస్తాం’ అని రాజీవ్ శుక్లా వివరించారు. ఇటీవల జరిగిన చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చినా... టీమిండియా అక్కడికి వెళ్లలేదు. తటస్థ వేదిక దుబాయ్‌లోని అన్ని మ్యాచ్‌లు ఆడింది. పాక్‌ను లీగ్ దశలో ఓడించడం సహా టోర్నీ చాంపియన్‌గా నిలిచింది. చదవండి: IPL 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా -
భారత్, పాక్ మధ్య యుద్ధం తప్పదా?.. సంచలన నివేదిక
భారత్, పాక్.. రెండు దేశాలూ ఒకదాని గురించి మరొకటి అంచనాలు వేయడంలో పొరపాట్లు జరిగినా లేదా రెండిట్లో ఏదో ఒక దేశం అకారణంగా అతిగా స్పందించినా... సాధారణ శతృత్వం కాస్తా అణుయుద్ధానికి దారి తీయవచ్చు! 1980, 1990ల నాటి అమెరికన్ ఇంటెలిజెన్స్ నివేదికలు ఈ ఉపద్రవాన్నే సూచిస్తున్నాయి. కశ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది పర్యాటకులను ఉగ్రవాదులు బలిగొన్న నేపథ్యంలో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు మిన్నంటుతున్నాయి. ఇదే తరుణంలో విడుదలైన అమెరికన్ ఇంటెలిజెన్స్ రహస్య నివేదికలు మరిత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. డీక్లాసిఫై అయిన ఇంటెలిజెన్స్ నివేదికల పత్రాలను అమెరికాలోని నేషనల్ సెక్యూరిటీ ఆర్కైవ్ మంగళవారం (ఈ నెల 22న) బహిర్గతం చేసింది.నివేదికల ప్రకారం భారత్, పాక్ నడుమ యుద్ధం సంభవించే అవకాశాలు స్వల్పమే అయినప్పటికీ పరస్పరం అంచనాలు వేయడంలో ఆయా దేశాలు పొరబడినా లేదా ఉభయ దేశాల్లో ఏదో ఒకటి అహేతుకంగా ప్రతిస్పందించడమో, అసమంజస నిర్ణయాలు తీసుకోవడమో జరిగినా సంప్రదాయ వైరం కాస్తా అణుయుద్ధంగా పరిణమించవచ్చు. ప్రస్తుతం భారత్ వద్ద సుమారు 160 న్యూక్లియర్ వార్ హెడ్లు, పాక్ అమ్ములపొదిలో 165 అణు వార్ హెడ్లు ఉండవచ్చని ఫెడరేషన్ ఆఫ్ అమెరికన్ సైంటిస్ట్స్ అంచనా. ఆధునిక క్షిపణి వ్యవస్థలు అణుయుద్ధ ముప్పును ‘వేగవంతం’ చేస్తున్నాయి. పాక్ క్షిపణి ‘షహీన్’ ఏడు నిమిషాల్లో న్యూఢిల్లీని చేరగలదు. అలాగే భారత్ క్షిపణి ‘ప్రళయ్’ ఆరు నిమిషాల లోపే ఇస్లామాబాద్ మీద దాడి చేయగలదు. మరో ముఖ్యాంశం... ‘నో ఫస్ట్ యూజ్’ పాలసీకి తాము కట్టుబడినట్టు భారత్ గతంలో ప్రకటించింది. ఈ ‘నో ఫస్ట్ యూజ్ న్యూక్లియర్ డాక్ట్రిన్’ ప్రకారం... భారత భూభాగంపైనో, భారత సైనిక దళాలపైనో అణుదాడి జరిగితేనే మన దేశం ప్రతీకార అణుదాడులకు ఉపక్రమిస్తుంది. అంతేతప్ప భారత్ తనంతట తానుగా, ముందుగా అణ్వాయుధాలను ఏ దేశంపైనా ప్రయోగించదు. ‘ఇండియాస్ రియాక్షన్ టు న్యూక్లియర్ డెవలప్మెంట్స్ ఇన్ పాకిస్థాన్’ శీర్షికతో ఉన్న 1981 నాటి అమెరికన్ స్పెషల్ నేషనల్ ఇంటెలిజెన్స్ ఎస్టిమేట్ (ఎస్ఎన్ఐఈ) ప్రకారం... తమ భద్రతకు తీవ్రంగా ముప్పు వాటిల్లుతుందని భావిస్తేనే భారత్ ముందస్తుగా పాక్ అణు కేంద్రాలపై దాడులు చేస్తుంది. ఇక ‘నో ఫస్ట్ యూజ్ అణు విధానం లాంటి స్వీయ నియంత్రణ, కట్టుబాట్లు మన పొరుగు దేశానికి లేవు. 2019లో భారత యుద్ధ విమానాలు పాక్ భూభాగంలోకి చొచ్చుకెళ్లి బాలాకోట్ వద్ద బాంబులు వేసి ఉగ్రవాద శిబిరాలను నాశనం చేశాయి. అలాంటి సాధారణ, సంప్రదాయ దాడి సందర్భాల్లో పరిస్థితులను అర్థం చేసుకోకుండా పాకిస్థాన్ ఒకవేళ అసంబద్ధంగా ప్రవర్తిస్తే జరిగేది... అణుయుద్ధమే!.ఇండియాతో మరో యుద్ధం తలెత్తితే తమ దేశం మొత్తం కాకపోయినా తమ మిలిటరీ నాశనమవుతుందని పాక్ సైనిక నాయకత్వం భయపడినట్టు 1993 నాటి సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) రహస్య నివేదిక ఒకటి వెల్లడించింది. ‘ఇండియా-పాకిస్థాన్: ప్రాస్పెక్ట్స్ ఫర్ వార్ ఇన్ ద నైంటీస్’ శీర్షికతో ఉన్న ఈ నివేదిక... భారత్-పాక్ మధ్య యుద్ధం జరిగే అవకాశాలు 20% (ఐదింట ఒక వంతు) ఉన్నట్టు అప్పట్లో అంచనా వేసింది.- జమ్ముల శ్రీకాంత్.Conflict with India could destroy Pak military, if not the entire state : declassified CIA docs.Recently declassified paper predicted a spectacular terror attack could increase chances of conflict, Pak would fear destruction of the state.https://t.co/PfOwuRym9A pic.twitter.com/StP3TDJPZi— Manu Pubby (@manupubby) April 24, 2025పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం దౌత్యపరమైన ఆంక్షలతో పాక్‌ను ఉక్కిరి బిక్కిరి చేసింది. అందులో సింధు జలాల ఒప్పందం నిలిపివేతతో ప్రధాన చర్చనీయాంశమైంది. భారత్ చర్యలకు ప్రతిగా.. పాక్ కూడా భారత్‌పై పలు ఆంక్షలను విధిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. -
పహల్గాం దాడిలో హమాస్ నేతల ప్లాన్.. POKలో ఏం జరిగింది?
ఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం ఉగ్రదాడి ఘటనపై కొన్ని అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ దాడి వెనుక హమాస్ కుట్ర ఉందని అనుమానం వ్యక్తమవుతోంది. ఈ మేరకు భారత్‌లోని ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ చెప్పుకొచ్చారు. ఆయన వ్యాఖ్యలకు బలం చేకూరేలా మరిన్ని వ్యాఖ్యలు చేశారు.పహల్గాంలో ఉగ్రదాడి ఘటనపై తాజాగా రూవెన్ అజార్ స్పందిస్తూ..‘హమాస్ నాయకులు ఇటీవల పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జైష్-ఎ-మహమ్మద్ ఉగ్రవాదులతో సమావేశమైనట్టు మాకు సమాచారం ఉంది. పహల్గాంలో దాడికి వీటి మధ్య సంబంధం ఉందనే అనుమానం కలుగుతోంది. ఎందుకంటే.. గతంలో ఇజ్రాయెల్‌పై అక్టోబరు 7, 2023 హమాస్ నరమేధానికి, పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడికి సారూపత్య ఉంది. ఈ రెండు ఘటనలలో అమాయక పౌరులే లక్ష్యంగా ఉన్నారు.అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లోకి చొరబడిన హమాస్ ముష్కరులు సంగీత కచేరీలో పాల్గొన్న 1,400 మందికి పైగా పౌరులను హత్య చేశారు. ఉగ్రవాదులు అన్ని స్థాయిల్లో పరస్పరం సహకరించుకుంటున్నారు.. వారు ఒకరికొకరు అనుకరిస్తూ ఒకేలా మారుతున్నారు. ఈ ప్రమాదాలను ఎదుర్కొనడానికి నిఘా సంస్థలు కలిసి పనిచేస్తున్నాయని నాకు నమ్మకం ఉంది’ అని పేర్కొన్నారు.ఇదే సమయంలో భారత ప్రభుత్వం తీసుకున్న కఠినమైన చర్యలు, హెచ్చరికలు నాకు ఎంతో ధైర్యం కలిగించాయి. దోషులను వేటాడుతాం అని ప్రధాని నరేంద్ర మోదీ హామీ ఇవ్వడం అభినందనీయం. ఉగ్రవాదానికి మద్దతిస్తున్న దేశాలను ప్రపంచం బహిష్కరించాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదులకు అనేక దేశాలు నిధులు, ఇంటెలిజెన్స్ సమాచారం, ఆయుధాల రూపంలో మద్దతు ఇస్తున్నాయి. ఇది ఆమోదయోగ్యం కాదు అంటూ ఘాటు విమర్శలు చేశారు.Watch: On the Pahalgam terror attack, Reuven Azar, Ambassador of Israel to India, says, "You have a similar situation in which people were going to a music festival and were massacred, and people here were going on vacation and they were massacred. It’s the same death cult, the… pic.twitter.com/5obbvzh89V— IANS (@ians_india) April 24, 2025ఇదిలా ఉండగా.. పహల్గాం ఉగ్ర దాడిపై అగ్గిమీద గుగ్గిలమవుతున్న భారత్.. పాక్‌పై ముప్పేట దాడికి దిగింది. బుధవారం పలు ఆంక్షలను విధించిన మన దేశం గురువారం మరింతగా విరుచుకుపడింది. ఉగ్రమూకలకు ఆశ్రయమిస్తున్న పాకిస్తాన్‌కు అందిస్తున్న అన్ని రకాల వీసా సేవలను నిలిపేసింది. ఆ దేశ దౌత్యవేత్తకు సమన్లు జారీ చేసింది. పాక్‌కు చెందిన ఎక్స్ ఖాతాలను నిలిపేసింది. ఆ దేశానికి వివిధ కారణాలతో వెళ్లిన భారతీయులు వెంటనే తిరిగిరావాలని ఆదేశించింది. పాకిస్తాన్‌కు చెందిన నటుడి చిత్రం విడుదలను ఆపేసింది. అటారీ-వాఘా సరిహద్దును మూసివేసిన నేపథ్యంలో గురువారం రిట్రీట్ వేడుకను బీఎస్ఎఫ్ నామమాత్రంగా నిర్వహించింది. పాక్ గార్డులతో కరచాలనాన్ని రద్దు చేసింది. రిట్రీట్ సందర్భంగా సరిహద్దు గేట్లను తెరవలేదు. మిగిలిన అన్ని డ్రిల్స్‌ను యథావిధిగా నిర్వహించామని బీఎస్ఎఫ్ ఒక ప్రకటనలో వెల్లడించింది. -
నేడు కశ్మీర్‌కు రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ శుక్రవారం జమ్ముకశ్మీర్ వెళ్లనున్నారు. పహల్గాం ఉగ్ర దాడి బాధితులను ఆయన పరామర్శించనున్నారు. అనంతనాగ్ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న బాధితులతో రాహుల్ మాట్లాడతారని కాంగ్రెస్ వర్గాలు వెల్లడించాయి. అమెరికా పర్యటనను అర్ధంతరంగా ముగించుకుని తిరిగి వచ్చిన రాహుల్ గురువారం సీడబ్ల్యూసీ భేటీలో పాల్గొన్నారని తెలిపాయి. అనంతరం అఖిల పక్ష సమావేశంలోనూ ఆయన పాలుపంచుకున్నారు. సీడబ్ల్యూసీ తీర్మానం.. మృతులకు ఘన నివాళిఇదిలా ఉండగా.. జమ్ముకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి ముమ్మాటికీ భావోద్వేగాలను రెచ్చగొట్టే చర్యేనని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రకటించింది. ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనకు పాకిస్తానే సూత్రధారి. ఈ ఉగ్రవాద చర్య మన గణతంత్ర విలువలపై ప్రత్యక్ష దాడి. దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి హిందువులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంది. ఇటు వంటి తీవ్రమైన రెచ్చగొట్టే చర్యలను, సీమాంతర ఉగ్రవాదా న్ని సమష్టిగా, దృఢసంకల్పంతో ఎదుర్కోవాలని పునరుద్ఘాటి స్తున్నాం అంటూ సీడబ్ల్యూసీ పేర్కొంది.నిఘా వైఫల్యాలపై విశ్లేషణ అవసరం..ప్రభుత్వ నిఘా వైఫల్యాన్ని ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ ఎత్తి చూపింది. ‘పహల్గాం మూడంచెల భద్రతా వ్యవస్థ కలిగి ఉండే శత్రుదుర్బేధ్యమైన అత్యంత భద్రత కలిగిన ప్రాంతం. కేంద్ర హోం శాఖ పరిధిలోని ఒక కేంద్రపాలిత ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఇంతటి తీవ్ర దాడి చోటుచేసుకుంది. ఈ సమయంలో నిఘా వైఫల్యాలు, భద్రతా లోపాలపై సమగ్ర విశ్లేషణ చేపట్టాల్సిన అవసరం విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎంతో అవస రం. బాధిత కుటుంబాలకు నిజంగా న్యా యం జరిగే ఏకైక మార్గం ఇదే’ అని సీడబ్ల్యూసీ పేర్కొంది. అలాగే, లక్షలాది మంది పాల్గొనే అమర్నాథ్ యాత్రకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలి. పర్యాటకంపై ఆధారపడ్డ కశ్మీర్ ప్రజల జీవనోపాధిని కాపాడాలి’ అని కేంద్రానికి సూచించింది.రాజకీయ ప్రయోజనాలొద్దు..ప్రజల్లో విభజన బీజాలు నాటేందుకు పహల్గాం దాడిని బీజేపీ అధికారిక, అనుకూల సోషల్ మీడియా వేదికలు వాడుకోవడం దారుణమని సీడబ్ల్యూసీ తెలిపింది. కాగా, పహల్గాం దాడిలో అసువులు బాసిన వారికి నివాళులర్పించేందుకు శుక్రవారం పార్టీ శ్రేణులు అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో క్యాండిల్మార్చ్ నిర్వహిస్తాయని అనంతరం కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. -
గణతంత్ర విలువలపై ప్రత్యక్ష దాడి
సాక్షి, న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడి ముమ్మాటికీ భావోద్వేగాలను రెచ్చగొట్టే చర్యేనని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రకటించింది. ఈ దారుణ ఘటనను తీవ్రంగా ఖండించింది. ‘‘ఈ ఘటనకు పాకిస్తానే సూత్రధారి. ఈ ఉగ్రవాద చర్య మన గణతంత్ర విలువలపై ప్రత్యక్ష దాడి. దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి హిందువులను ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకుంది. ఇటు వంటి తీవ్రమైన రెచ్చగొట్టే చర్యలను, సీమాంతర ఉగ్రవాదా న్ని సమష్టిగా, దృఢసంకల్పంతో ఎదుర్కోవాలని పునరుద్ఘాటి స్తున్నాం’’ అంటూ సీడబ్ల్యూసీ పేర్కొంది. గురువారం ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సీడబ్ల్యూసీ అత్యవసర సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంకతోపాటు, కేసీ వేణుగోపాల్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలు ఒక క్షణం మౌనం పాటించి మృతులకు నివాళులర్పించారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన సీడబ్ల్యూసీ, అనంతరం ఉగ్రవాద దాడిని ఖండిస్తూ తీర్మానాన్ని ఆమోదించింది. నిఘా వైఫల్యాలపై విశ్లేషణ అవసరం..ప్రభుత్వ నిఘా వైఫల్యాన్ని ఈ సందర్భంగా సీడబ్ల్యూసీ ఎత్తి చూపింది. ‘పహల్గాం మూడంచెల భద్రతా వ్యవస్థ కలిగి ఉండే శత్రుదుర్బేధ్యమైన అత్యంత భద్ర త కలిగిన ప్రాంతం. కేంద్ర హోం శాఖ పరిధిలోని ఒక కేంద్రపాలిత ప్రాంతం. అలాంటి ప్రాంతంలో ఇంతటి తీవ్ర దాడి చోటుచేసుకుంది. ఈ సమయంలో నిఘా వైఫల్యాలు, భద్రతా లోపాలపై సమగ్ర విశ్లేషణ చేపట్టాల్సిన అవసరం విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎంతో అవస రం. బాధిత కుటుంబాలకు నిజంగా న్యా యం జరిగే ఏకైక మార్గం ఇదే’అని సీడబ్ల్యూసీ పేర్కొంది. ‘‘లక్షలాది మంది పాల్గొనే అమర్నాథ్ యాత్రకు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయాలి. చేయాలి. పర్యాటకంపై ఆధారపడ్డ కశ్మీర్ ప్రజల జీవనోపాధిని కాపాడాలి’’ అని కేంద్రానికి సూచించింది. రాజకీయ ప్రయోజనాలొద్దు..ప్రజల్లో విభజన బీజాలు నాటేందుకు పహల్గాం దాడిని బీజేపీ అధికారిక, అనుకూల సోషల్ మీడియా వేదికలు వాడుకోవడం దారుణమని సీడబ్ల్యూసీ తెలిపింది. కాగా, పహల్గాం దాడిలో అసువులు బాసిన వారికి నివాళులర్పించేందుకు శుక్రవారం పార్టీ శ్రేణులు అన్ని రాష్ట్రాలు, జిల్లాల్లో క్యాండిల్మార్చ్ నిర్వహిస్తాయని అనంతరం కేసీ వేణుగోపాల్ ప్రకటించారు. -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. జవాను వీరమరణం
జమ్మూ: జమ్మూ కశ్మీర్‌లోని ఉధంపూర్‌లో గురువారం చోటు చేసుకున్న ఎన్కౌంటర్లో ఆర్మీ ప్రత్యేక విభాగం జవాను ఒకరు అసువులు బాశారు. ఉగ్రవాదుల కదలికలపై విశ్వసనీయ సమాచారం అందుకున్న బలగాలు డుడు–బసంత్‌గఢ్ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టాయి. ఈ సందర్భంగా తారసపడిన ఉగ్రమూకలు బలగాలపైకి అకస్మాత్తుగా కాల్పులకు దిగాయి. ఘటనలో హవల్దార్ ఝంటు అలీ షేక్ నేలకొరిగారు. అనంతరం కూడా ఎదురు కాల్పులు కొనసాగాయి. ఈ సందర్భంగా బలగాలు నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నాయి. కాగా, గత 24 గంటల్లో చోటుచేసుకున్న మూడో ఎన్కౌంటర్ ఇది. బుధవారం బారాముల్లాలోని ఉడి నాలా వద్ద జరిగిన భీకర ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతమవ్వడం తెల్సిందే. -
Pahalgam Attack: రాజకీయ ఏకాభిప్రాయం కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు
-
48 గంటల్లో మారిన కశ్మీర్ సీన్.. ‘వాళ్లేం తప్పు చేశారు?’
భూతల స్వర్గంగా పేరున్న కశ్మీరానికి దేశం నలుమూలల నుంచే కాదు.. యావత్ ప్రపంచ దేశాల నుంచి పర్యాటకులు క్యూ కట్టేవారు. పచ్చని గడ్డి మైదానాలు.. దూరంగా ఫైన్ చెట్ల మధ్య నుంచి కనిపించే మంచుపర్వతాలు చూపరులను ఎంతో ఆకట్టుకునే ఏప్రిల్-జూన్ సీజన్ మరేంతో ప్రత్యేకంగా ఉండేది. అలాంటి సీజన్ ఇలా బోసిపోయి ఉంటుందని అక్కడి టూరిస్ట్ గైడులు, వ్యాపారులు కలలో కూడా ఊహించి ఉండరు!. పహల్గాం ఉగ్రదాడితో.. కశ్మీర్ పర్యాటకాన్ని చీకట్లు కమ్మేశాయి. మంగళవారం మధ్యాహ్నాం ఉగ్రదాడి జరగ్గా.. బుధవారం ఉదయం నుంచే పర్యాటకులు శరవేగంగా ఆ ప్రాంతాన్ని వీడుతున్నారు. శ్రీనగర్ వెళ్లే విమానాలు ఖాళీగా బోసిపోయి కనిపిస్తుండగా.. అక్కడి నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే విమానాలు మాత్రం ప్రయాణికులతో కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ఇళ్ల రైలు ప్రయాణాల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రయాణాలు కన్ఫర్మ్ కాగా.. హోటల్స్, లాడ్జిలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కార్లు, రోడ్లు ఇలా ఎక్కడపడితే అక్కడ ఎదురు చూస్తూ కనిపిస్తున్నారు పర్యాటకులు. 48 గంటలు.. ఎంత మారిపోయిందో?పహల్గాం ఉగ్రదాడి జరిగి సరిగ్గా రెండు రోజులు గడిచింది. ఈ రెండు రోజులు మొత్తం జమ్ము కశ్మీర్ పర్యటకం స్తంభించిపోయింది. జమ్ము కశ్మీర్‌కు మణిహారంగా భావించే దాల్ సరస్సు చుట్టుపక్కల ఒక్క పర్యాటకుడు కూడా కనిపించలేదంటే ఆశ్యర్యపోనక్కర్లేదు. నిత్యం టూరిస్టులతో బిజీబిజీగా గడిపే షికారాలు.. మూలనపడ్డాయి. అలాగే.. దాడి జరిగిన బైసరన్ లోయ పూర్తిగా సైన్యం అదుపులో ఉండిపోయింది. ఇక మిగతా పర్యాటక ప్రాంతాల పరిస్థితి కూడా దాదాపుగా అంతే ఉంది. పర్యాటకులు లేక వెలవెలబోతున్నాయి. జీవనాధారం దెబ్బ తింటుందనే.. పహల్గాం దాడి.. తదనంతర పరిణామాలు జమ్ము కశ్మీర్‌కు మళ్లీ పాత కల్లోల రోజులను గుర్తు చేస్తున్నాయి. వాస్తవానికి ఏప్రిల్ మే జూన్ నెలల జమ్ము పర్యాటకానికి ఎంత కీలకం. అలాంటి సమయంలో.. అదీ పర్యాటకుల మీద జరిగిన ఉగ్రదాడి కశ్మీర్‌ను ఉలిక్కిపడేలా చేసింది. ప్రశాంతమైన వాతావరణాన్ని చెడగొట్టిన చీడపురుగుల్ని వెతికి నలిపేయాలంటూ పద్మశ్రీ గులాం రసూల్‌ఖాన్ కోరుతున్నారు. ‘‘ఇక్కడి జనాలకు పర్యాటకమే జీవనాధారం. అలాంటిది దెబ్బ తింటే వాళ్లు ఎలా బతుకుతారు?’’ అని ప్రశ్నిస్తున్నారాయన. ఈ క్రమంలో టూరిస్టులకు కొందరు వ్యాపారులు ధైర్యం చెబుతూ.. బతిమాలుతున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. రగిలిపోయిన కశ్మీర్ ప్రజలుఆర్టికల్ 370 రద్దు తర్వాత.. కశ్మీర్లో తీవ్ర స్థాయిలో నిరసనలు జరిగింది బుధవారమే. గత 35 ఏళ్లలో ఏప్రిల్ 23వ తేదీన కశ్మీర్ తొలిసారిగా మొత్తం మూత పడింది. సాధారణ ప్రజలు, వర్తకులంతా రోడ్డెక్కి ఉగ్ర చర్యను ఖండించారు. ఇది తమ ఆత్మపై జరిగిన దాడిగా భావించి ఆందోళనకు దిగారు. స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొనాలని, నిరసన ర్యాలీలో కలిసి రావాలని మసీదుల్లోని మైకుల ద్వారా విజ్ఞప్తులు చేశారు. హిందుస్థాన్ జిందాబాద్, ఐ యామ్ ఇండియన్ అంటూ ఉగ్రచర్యను తీవ్రంగా ఖండిస్తూ నినాదాలు చేశారు. పర్యాటకులకు సాయంజమ్ము కశ్మీర్ టూరిజం విభాగం ధైర్యం చెబుతున్నప్పటికీ.. పర్యాటకులు మాత్రం కశ్మీర్‌ను వీడడం ఆపడం లేదు. ఈ క్రమంలో అక్కడి వ్యాపారులు, డ్రైవర్లు స్వచ్ఛందంగా పర్యాటకులకు సాయంగా నిలుస్తున్నారు. ఉచితంగా ఆహార పొట్లాలను, మంచి నీటిని అందిస్తున్నారు. ఉగ్రదాడి తర్వాత స్వస్థలాలకు వెళ్లే క్రమంలో చిక్కుకుపోయిన వాళ్లకు ఉచితంగా వసతి, భోజన సదుపాయం కల్పిస్తున్నారు. మరికొందరు డ్రైవర్లు వాళ్లను రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులలో ఉచితంగా దించుతున్నారు. ఎంతో కొంత డబ్బు ఇవ్వడానికి పర్యాటకులు ప్రయత్నిస్తున్నా.. వాళ్లు వద్దని చెబుతున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ సాయాన్ని కూడా కొందరు విమర్శిస్తుండగా.. ఎక్కువ మంది అభినందిస్తున్నారు. View this post on Instagram A post shared by Molitics (@moliticsindia)‘‘మేమూ మనుషులమే. ఇది పర్యాటకమో.. మా ఆదాయానికో సంబంధించింది కాదు. సరదాగా కుటుంబాలతో వచ్చిన ఆ పర్యాటకులు చేసిన తప్పేంటి?. ఈ దాడికి పాల్పడిన వాళ్లను సైన్యం వదిలిపెట్టకూడదు. అవసరమైతే మేమూ సైన్యానికి మా వంతు సాయం అందిస్తాం. ఇది డబ్బో, వ్యాపారానికో సంబంధించింది కాదు. మానవత్వానికి సంబంధించింది. అలాంటిది.. మానవత్వం మీద దాడి జరిగింది మరి’’ అని కొందరు కశ్మీరీలు భావోద్వేగంగా చెబుతున్నారు.కొసమెరుపు.. బెంగళూరుకు చెందిన ఇంటీరియర్ డిజైనర్ వినితా చైతన్య.. దాల్ సరస్సులో షికారా ప్రయాణాన్ని తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఒకవైపు టూరిస్టులు ఆ వైపు వెళ్లేందుకు జంకుతుంటే.. ఆమె మాత్రం ఆ ప్రయాణం రద్దు చేసుకోవడం ఇష్టం లేక ఆస్వాదించానంటూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. View this post on Instagram A post shared by Vinita Chaitanya (@vinitachaitanya) -
పహల్గాం హీరో అతడే.. ఉగ్రవాదులతో పోరాడిన పోనీవాలా
న్యూఢిల్లీ: ఒక జంటది హనీమూన్. కొందరిది పెళ్లి రోజు. ఇంకొందరికి ఎన్నో ఏళ్ల కల. పహల్గాం మారణకాండ 26 కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఒక్కొక్క పర్యాటకున్నీ పేరు, వ్యక్తిగత వివరాలు అడిగి మరీ ముష్కరులు బలి తీసుకున్న తీరు హృదయాలను కలచివేస్తోంది. దాదాపుగా అందరినీ ఆధార్ కార్డులు చూపించాలని, ఖురాన్ పంక్తులు అప్పజెప్పాలని అడిగి మరీ కాల్చేశారు.మృతుల్లో ఇద్దరు మినహా అంతా హిందువులే. వారిలో మహారాష్ట్రకు చెందిన వారు ఆరుగురు, గుజరాత్, కర్నాటక నుంచి ముగ్గురేసి, పశి్చమబెంగాల్ నుంచి ఇద్దరు, ఆంధ్రప్రదేశ్, హరియాణా, ఉత్తరాఖండ్, యూపీ, బిహార్, పంజాబ్, కేరళ, ఒడిశా, మధ్యప్రదేశ్, అరుణాచల్‌ప్రదేశ్ నుంచి ఒక్కొక్కరు చొప్పున ఉన్నారు. వీరితో పాటు ఒక నేపాలీ పర్యాటకునితో పాటు స్థానికుడు కూడా దాడిలో మరణించారు.హార్స్ రైడింగ్‌కని బయటికొచ్చి...ఉగ్ర కాల్పులకు బలైన వారిలో యూపీలోని కాన్పూర్‌కు చెందిన శుభం ద్వివేది అనే 31 ఏళ్ల వ్యాపారవేత్త కూడా ఉన్నాడు. ఆయనకు గత ఫిబ్రవరిలోనే పెళ్లైంది. భార్య, తల్లిదండ్రులు, సోదరి, ఆమె అత్తామామలు, బావమరిది తదితరులతో కలిసి సరదాగా గడిపేందుకు బైసారన్ వెళ్లాడు. మంగళవారం కుటుంబీకులంతా హోటల్‌కే పరిమితం కాగా భార్యతో కలిసి శుభం హార్స్ రైడింగ్‌కు వెళ్లాడు. ఉగ్రవాదులు అతన్ని కూడా పేరడిగారు. కల్మా చదవమన్నారు. రాదనడంతో నేరుగా తలపై కాల్చి భార్య కళ్లముందే పొట్టన పెట్టుకున్నారు.CM Omar Abdullah, joined by thousands, offered funeral prayers for Syed Adil Hussain—killed in the Pahalgam militant attack that left 26 tourists dead—at his native village on Wednesday.Photos KM / @UmarGanie1 pic.twitter.com/nXCD0vbsnh— The Kashmir Monitor (@Kashmir_Monitor) April 23, 2025👉కేరళలోని ఎడప్పల్లికి చెందిన రామచంద్రన్ (65) కూడా కాల్పులకు బలయ్యాడు. పర్యాటకప్రియుడైన ఆయన భార్య, ఇటీవలే దుబాయ్ నుంచి వచ్చిన కూతురు, ఆమె పిల్లలతో కలిసి కశ్మీర్ వెళ్లాడు. వాళ్ల కళ్లముందే ఉగ్రవాదులు ఆయన్ను కాల్చేశారు. ఆయన్ను కూడా ఖురాన్ పంక్తులు చదవాలని అడిగి, తాను ముస్లింను కాదని చెప్పగానే చంపేశారు.👉ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌కు చెందిన దినేశ్ మిరానియా అనే వ్యాపారవేత్త పెళ్లి రోజును సరదాగా జరుపుకునేందుకు కుటుంబీకులతో కలిసి పహల్గాం వచ్చారు. భార్యాపిల్లల కళ్లముందే ఉగ్ర తూటాలకు బలయ్యారు.👉కశ్మీర్ వెళ్లాలన్నది ఒడిశాకు చెందిన ప్రశాంత్ సత్పతి (41) కల. నెలల తరబడి డబ్బు కూడబెట్టి మరీ బైసారన్ వెళ్లాడు. భార్య, 9 ఏళ్ల కొడుకు కళ్లముందే నిస్సహాయంగా మృత్యువాత పడ్డాడు.పోరాడిన పోనీవాలా.. ఉగ్రవాదుల నుంచి పర్యాటకులను కాపాడేందుకు సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా (30) అనే స్థానిక పోనీవాలా వీరోచితంగా ప్రయత్నించాడు. ఉగ్ర వాదుల నుంచి తుపాకులను లాక్కునే ప్రయత్నంలో వారి కాల్పులకు బలయ్యాడు. ఆదిల్ గొప్ప ధైర్య సాహసాలు ప్రదర్శించాడంటూ జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రస్తుతించారు. బుధవారం అతని అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు. -
కర్మీర్ పర్యాటక రంగానికి కోలుకోలేని దెబ్బ
శ్రీనగర్/న్యూఢిల్లీ: పహల్గాంలో ఉగ్రవాదుల దాడి.. జమ్మూకర్మీ ర్ పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. జమ్మూకశ్మీర్ పర్యటనకు ప్లాన్ చేసుకున్నవారంతా ఇప్పుడు రిజర్వేషన్లు రద్దు చేసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లోని ట్రావెల్ ఏజెన్సీల్లో దాదాపు 90శాతం రిజర్వేషన్లు రద్దయ్యాయి. గతంలో కర్మీర్‌లో ఉగ్రదాడులు జరిగాయి. కానీ ఈ దాడుల్లో ఇంతకు ముందెన్నడూ పర్యాటకులను గుర్తించి చంపలేదు. పహల్గాం సంఘటన తర్వాత మాత్రం మొత్తం పర్యాటక పరిశ్రమ, భాగస్వాములందరినీ ప్రభావితం చేసింది. కర్మీర్‌లో దాదాపు 80శాతం రిజర్వేషన్స్ రద్దయ్యాయి. జమ్మూకర్మీర్‌కు దాదాపు 90 శాతం బుకింగ్‌లను పర్యాటకులు రద్దు చేసుకున్నట్లు ఢిల్లీలోని పలు ట్రావెల్ ఏజెన్సీలు తెలిపాయి. వచ్చే నెలలో కర్మీర్‌లో పర్యటించడానికి రిజర్వేషన్లు చేసుకున్నారని, ఇప్పుడు ఇప్పుడు రద్దు చేయాలని కోరుతున్నారని వెల్లడించాయి. కర్మీర్‌లో ప్రముఖ పర్యాటక ప్రాంతాలైన గుల్మార్గ్, హజన్ వ్యాలీ, తులిప్ గార్డెన్స్ ఎక్కువగా బుక్ అయ్యాయని, ఇప్పుడు అవన్నీ రద్దయ్యాయని తెలిపారు. అక్కడకు వెళ్లి ప్రాణాలను పణంగా పెట్టబోమని, రిఫండ్ చేయాలని కోరుతున్నారని ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. అయితే కొంతమంది పర్యాటకులు కర్మీర్‌కు బదులుగా వేరే ప్రాంతాలకు మార్చుకుంటున్నారని ఢిల్లీలోని ట్రావెల్ ఏజెన్సీలు నివేదించాయి. ‘‘కొన్ని కుటుంబాలు బస్సు, విమాన టిక్కెట్ల నుంచి హోటళ్ల వరకు అన్నీ ముందుగానే బుక్ చేసుకున్నారు. అయితే ఉగ్రదాడి వార్త తెలిసిన మరుక్షణం నంచే రద్దు చేయాలని మాకు కాల్స్ రావడం ప్రారంభించాయి’’అని ఓ ట్రావెల్స్ యజమాని తెలిపారు. జమ్ముకర్మీర్ పర్యటనకు కీలక కేంద్రంగా ఉన్న కోల్‌కతాలోనూ అనేక మంది రిజర్వేషన్లను రద్దు చేసుకున్నారు. తమ రిజర్వేషన్లను రద్దు చేయాలని లేదా వాయిదా వేయాలని క్లయింట్ల నుంచి నిరంతరాయంగా కాల్స్ వస్తున్నాయని టూర్ ఆపరేటర్లు చెబుతున్నారు. అయితే.. జమ్మూకర్మీర్‌కు బుకింగ్ చేయడం నిలిపేయాలని ఆదేశాలు వచ్చినట్లు మరికొన్ని ట్రావెల్ ఏజెన్సీలు తెలిపాయి. అన్ని రవాణా, బుకింగ్‌లను నిలిపివేయాలని ట్రావెల్ అసోసియేషన్ ఆఫ్ శ్రీనగర్ తమను ఆదేశించిందని, తదుపరి నోటీసు వచ్చే వరకు జమ్మూకర్మీర్ పర్యటనలకోసం కొత్త బుకింగ్‌లు చేయబోమని ప్రకటించాయి. ఇప్పట్లో కర్మీర్‌కు పర్యాటకులు రావడం కష్టమే... ‘పర్యటనలు రద్దు చేసుకుని పర్యాటకులు వెళ్లిపోతున్నారు. మరో నెల రోజుల ప్యాకేజీలను కూడా రద్దు చేశారు. ఇలాంటి ఘటనల తరువాత కూడా పర్యాటకులు ఇక్కడ ఉంటారని, వెంటనే ఇక్కడికి వస్తారని ఆశించలేం. గత కొన్నేళ్లుగా చేసిన మంచి పనులన్నీ వృథాగా పోయాయి. కర్మీర్‌కు మళ్లీ పర్యాటకులను రప్పించడానికి చాలా కష్టపడాల్సి ఉంటుంది’శ్రీనగర్‌కు చెందిన ట్రావెల్ ఆపరేటర్ ఐజాజ్ అలీ తెలిపారు. నష్టాన్ని తగ్గిస్తాం: కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ పహల్గాం దాడి నేపథ్యంలో జమ్ముకర్మీర్‌లో పర్యాటక రంగంపై పడే నష్టాన్ని తగ్గించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నామని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. జమ్మూకర్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పర్యాటక శాఖ కార్యదర్శితో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నామని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని వెల్లడించారు. ఎక్కడికక్కడ భద్రత... భయంతో చాలామంది పర్యాటకులు వెళ్లిపోతుండగా.. చాలా కొద్దిమంది ఉండేందుకు సుముఖత చూపుతున్నారు. ‘దాడి గురించి వినగానే భయం వేసింది. ముంబైకి తిరిగి వెళ్లాలనుకున్నాం. కానీ హోటల్ సిబ్బంది మేం సురక్షితంగా, సౌకర్యవంతంగా ఉండేలా చేశారు. మాకు ఎలాంటి భయం లేదు. ఎక్కడికక్కడ భద్రత ఉంది. పహల్గాం సందర్శించాలి అనుకుంటున్నాం. పరిస్థితి బాగుంటే రేపు అక్కడికి వెళ్తాం. బయటకు వచ్చి చూడగా ఎక్కడ చూసినా పోలీసులు, సైన్యం ఉండడంతో టూరిస్టులు సేఫ్‌గా ఫీలవుతున్నారు. ఇప్పుడు భయం తగ్గుముఖం పడుతోంది’అని మహారాష్ట్రకు చెందిన ఓ పర్యాటకురాలు చెబుతున్నారు. -
ఉరి, పుల్వామా కంటే ఘోరమైన దాడి ఇది: ఒవైసీ
న్యూఢిల్లీ: ఉరి, పుల్వామాలలో జరిగిన దాడుల కంటే.. జమ్ము కశ్మీర్ పహల్గాం(Pahalgam)లో తాజాగా జరిగిన ఉగ్ర దాడి అత్యంత ఘోరమైందని, అది తనను ఎంతగానో బాధించిందని ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ(Asaduddin Owaisi) అన్నారు. నిఘా వ్యవస్థ వైఫల్యం వల్లే దాడి జరిగిందన్న ఆయన.. ఘటనకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.‘‘పహల్గాంలో.. మతం ఏంటని అడిగిన తర్వాతే ఉగ్రవాదులు అమాయక ప్రజలను విచక్షణారహితంగా చంపారు. ఇది గతంలో జరిగిన ఉరి, పుల్వామా ఉగ్రదాడుల కంటే ఘోరమైంది. ఈ దాడిని మేం ఖండిస్తున్నాం. ఇది కచ్చితంగా నిఘా వ్యవస్థ వైఫల్యమే. జమ్ములో ఉగ్రవాదంపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న నిరోధక విధానం పనిచేస్తుందో లేదో పరిశీలించుకోవాలి. ఈ ప్రభుత్వం ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పి.. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తుందని ఆశిస్తున్నాం’’ అని విలేకరులతో అన్నారాయన.దక్షిణ జమ్ము కశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలోని బైసరన్ లోయలో ఘోరం జరిగింది. సైనిక దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు.. మైదానంలో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతున్న పర్యాటకులను చుట్టుముట్టి తుపాకులతో దారుణంగా కాల్చి చంపారు. ఐడీ కార్డులను పరిశీలించి.. పేరు, మతం ఆధారంగా వేరు చేసి మరీ దాడి చేశారు. ఈ దాడిలో 26 మంది అక్కడికక్కడే మరణించగా.. తీవ్రంగా గాయపడి మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వాళ్లలో ఇద్దరు తాజాగా మరణించడంతో మృతుల సంఖ్య 28కి చేరింది. అయితే.. బాడీ కేమ్ ద్వారా దాడి దృశ్యాలను పాక్‌లోని తమ హ్యాండర్లకు ఉగ్రవాదులు చేరవేసినట్లు భద్రతా సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ఉగ్రవాదుల ఫొటోలు, ఊహా చిత్రాలు విడుదల చేసి.. జమ్ము వ్యాప్తంగా గాలింపు కొనసాగిస్తోంది. -
పహల్గాం ఉగ్రదాడిలో విస్తుపోయే విషయాలు
ప్రభుత్వాధికారులను, వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకునే పహల్గాం దాడి జరిగిందా? కాల్చి చంపే ముందు ఉగ్రవాదులు టూరిస్టుల ఐడీ కార్డులను ఎందుకు చెక్ చేశారు?. పైగా మృతుల్లో ఐబీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాల ఉద్యోగులే అధికంగా ఉండడం.. ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. పహల్గాం ఉగ్రదాడిలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి.కశ్మీర్ గడ్డపై నరమేధానికి ఉగ్రవాదులు ఈ పర్యాటక ప్రాంతాన్నే ఎంచుకోవడం వెనుక భద్రతాధికారులు పలు కారణాలు చెబుతున్నారు. పహల్గాం పట్టణానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బైసరన్ వ్యాలీ(baisaran valley)కి కశ్మీర్ ‘మినీ స్విట్జర్లాండ్’గా పేరుంది. శీతాకాలంలో మంచు దుప్పటి పర్చుకునే ఈ ప్రాంతం.. మిగతా కాలంలో పచ్చిక బయళ్లతో, ఫైన్ చెట్లతో.. యూరప్ అల్పైన్ లోయలను తలపిస్తుంటుంది. అందుకే దేశం నలుమూలల నుంచి పర్యాటకలకు వేసవిలో ఈ ప్రాంతానికి క్యూ కడుతుంటారు. పైగా ల్యూలియన్ సరస్సుకు బైసరన్ వ్యాలీ బేస్‌గా ఉండడంతో పాటు ట్రెక్కింగ్ కోసం సాహస యాత్రికులు ఈ ప్రాంతానికి క్యూ కడుతుంటారు.అయితే పహల్గాం(pahalgam) బైసరన్ లోయకు ఉన్న ప్రత్యేకతలే.. ఉగ్రవాదులు సులువుగా చొరబడి అమాయకులపై దాడి చేయడానికి వీలు కలిపించింది. ఇక్కడి పచ్చదనం పాడు కాకూడదన్న ఉద్దేశంతో మోటార్ వెహికిల్స్‌ను అనుమతించరు. పహల్గాం టౌన్ నుంచి ఐదు కిలోమీటర్ల పాటు కాలినడకన లేదంటే పొట్టి గుర్రాలను(Pony) పర్యాటకులు ఆశ్రయించాల్సి ఉంటుంది. పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం కోసం తీసుకున్న ఈ చర్యలు ఈ ప్రాంతాన్ని ఒంటరిని చేసేశాయి. తద్వారా అత్యవసర పరిస్థితుల్లో లేదంటే ఊహించని సంఘటనల సమయంలో చర్యలకు జాప్యం కలిగేలా చేశాయి. ప్రభుత్వాధికారులే లక్ష్యంగా.. పక్కా ప్లాన్‌తోనే బైసరన్ వ్యాలీలో ఉగ్రదాడి జరిగినట్లు స్పష్టమవుతోంది. మంగళవారం మధ్యాహ్నా సమయంలో (2.45గం.-3గం. ప్రాంతంలో) సైన్యం దుస్తుల్లో సమీప అడవుల నుంచి వచ్చిన బృందం.. టూరిస్టులపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపింది. బాడీక్యామ్‌లు ధరించిన ముగ్గురు టెర్రరిస్టులు పర్యాటకులను ఒక చోటా చేర్చి.. వివరాలను ఆరా తీసి మరి కాల్చి చంపి ఆ దృశ్యాలను రికార్డు చేశారు. టూరిస్టులు పారిపోతున్న టైంలో స్నైఫర్ ఫైర్ చేశారు. అయితే ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఆరుగురు ఉగ్రవాదులు దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ దాడిలో 26 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. బైరసర్ వ్యాలీ దగ్గర వాహనాలు లేకపోవడంతో క్షతగాత్రుల తరలింపు మరింత ఆలస్యమైంది. భద్రతా బలగాలు కూడా కాస్త ఆలస్యంగానే అక్కడికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈలోపు దట్టమైన అడవుల్లోకి ఉగ్రవాదులు పారిపోగలిగారు. జమ్ము కశ్మీర్‌లోనే అంత్యంత ప్రశాంతమైన పర్యాటక ప్రాంతంగా పేరు ఉన్న బైసరన్ వ్యాలీ.. నిన్నటి దాడితో ఆ పేరుపై నీలినీడలు కమ్ముకునేలా చేసుకుంది.ఎమోషనల్ పోస్టులుపహల్గాం ఉగ్రదాడి గురించి తెలిశాక.. చాలా మంది(సెలబ్రిటీలతో సహా) సోషల్ మీడియాలో బైసరన్ వ్యాలీ అనుభూతుల్ని పంచుకుంటున్నారు. గతంలో తాము అక్కడికి వెళ్లిన సందర్భంలో దిగిన చిత్రాలను షేర్ చేస్తూ.. ఉగ్రదాడిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రశాంతమైన ఆ నేల నెత్తురోడడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉగ్రవాదంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్రాన్ని కోరుతున్నారు. 👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)#baisaranvalley. Kashmir. Had been there 2 years before with family. Can’t imagine today this tragic incidence has happened at the same place. My heart goes out to the victims, their families and all those tourist civilians who lost their life🙏 pic.twitter.com/MabmrYmG5F— Rakesh Banerjee (@RakeshB41201077) April 22, 2025 Most people refer to Baisaran Valley in Pahalgam as "Mini Switzerland" but I prefer to call it by its own name Baisaran. After all, it’s Kashmir, not Switzerland. Why would I compare such a breathtaking place in Kashmir to another country? Baisaran has its own unique charm.. pic.twitter.com/MDLDXl41L7— batukh (@Samaandar_) March 13, 2025 -
పహల్గాం దాడి సూత్రధారి సైఫుల్లా సాజిద్.. పాక్ ఆర్మీ హస్తం?
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో ముష్కరులు జరిపిన కాల్పుల్లో 28 మంది పర్యాటకులు మృతి చెందారు. అయితే, పహల్గాం దాడి వెనుక సూత్రధారి సైఫుల్లా సాజిద్ ఉన్నట్టు తెలిసింది. దాడులకు పాల్పడింది తామేనని లష్కర్-ఏ-తోయిబా ముసుగు సంస్థ ది రిసిస్టెంట్ ఫ్రంట్ ప్రకటించుకుంది. అంతకుముందు సైఫుల్..లా ముజాహిదీలు కశ్మీర్లో దాడులు చేస్తారని ముందుగానే ప్రకటించాడు. త్వరలో కశ్మీర్ తమ గుప్పిట్లోకి వస్తుందన్న సైఫుల్లా చెప్పుకొచ్చాడు. దానికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.మరోవైపు.. ఈ దాడుల వెనుక పాకిస్థాన్ హస్తం కూడా ఉన్నట్టు సమాచారం. ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఆధారంగా ఉన్నాయి. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ అసీమ్ మునీర్ మాట్లాడుతూ.. కశ్మీర్‌ను పాకిస్థాన్ ఎప్పటికీ మర్చిపోదని, కశ్మీరీలను ఒంటరిగా వదిలిపెట్టబోము. ఇస్లామాబాద్‌కు కశ్మీర్ అంటే గొంతుకు వెళ్లే రక్తనాళం వంటిది. ప్రతీ విషయంలో మనం హిందువులకంటే విభిన్నమైన వారిమని మన పూర్వీకులు నమ్మారు. మన మతం విభిన్నం.మన ఆచారాలు, సంస్కృతులు, ఆలోచనలు, ఆశయాలు పూర్తిగా భిన్నం. అదే రెండు దేశాల సిద్ధాంతానికి పునాది. మనం రెండు విభిన్న దేశాలు, ఒకటి కాదు అని నమ్మారు కాబట్టే ఈ సిద్ధాంతం పుట్టింది. అందుకే పాకిస్థాన్ చరిత్రను మరిపోవద్దని మీ పిల్లలకు కచ్చితంగా చెప్పాలి. ఈ దేశాన్ని ఏర్పాటు చేయడానికి మన పూర్వీకులు చాలా త్యాగాలు చేశారు. మనం కూడా చేశాం. ఈ దేశ చరిత్రను మరిచిపోవద్దని ప్రతిఒక్కరినీ కోరుతున్నాను అంటూ వ్యాఖ్యలు చేశారు.మరోవైపు.. పహల్గాం దాడి ఘటనపై జమ్ముకశ్మీర్ మాజీ డీజీపీ శేష్ పాల్ వైద్ స్పందిస్తూ.. అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ చేసిన దాడి తరహాలో ఉంది. రెండు రోజుల క్రితం పాక్ ఆర్మీ చీఫ్ అసీమ్ మునీస్ భారత్‌పై చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. అవేవో యాదృచ్ఛికంగా అన్నమాటలు కావు. ఎందుకంటే ఉగ్రవాదులు పర్యటకుల మతాన్ని అడిగి, ఎవరైతే ముస్లింలు కారో వారిని మాత్రమే చంపారు. హమాస్ దాడిని ఇజ్రాయెల్ ఎలా తిప్పికొట్టిందో, భారత్‌కు అలానే చేయాలి.#WATCH | #PahalgamTerroristAttack | Jammu, J&K | Former J&K DGP Shesh Paul Vaid says, "This is the Pulwama 2 moment of India. This was a Hamas-style attack on 7 October on Israel. It's not a coincidence that Asim Munir (Pakistan Army chief) uttered illogical words two days back,… pic.twitter.com/7LeIjL2cse— ANI (@ANI) April 23, 2025వాస్తవానికి ఈ ఉగ్రదాడిని పాకిస్థాన్ సైన్యం ప్రారంభించింది. ఎందుకంటే దాడి చేసింది ఉగ్రవాదులు కాదు. ఉగ్రవాదుల ముసుగులో పాకిస్థాన్ సైన్యంలోని ఎస్ఎస్జీ (స్పెషల్ సర్వీస్ గ్రూప్) కమాండోలు ఈ దాడులకు పాల్పడ్డారు. ఇది ఒక పక్కా ప్రణాళిక ప్రకారం జరిగిన దాడి. ఇక మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిందే. వాస్తవానికి ఈ ఉగ్రదాడి అంతా పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఆదేశాలతోనే జరుగుతోంది. పైగా ఈ తరహా దాడులను మరింత తీవ్రతరం చేయాలని ఆయన అనుకుంటున్నారు. అతను తానేంటో నిరూపించుకోవాలని ఆరాటపడుతున్నాడు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. -
పహల్గాం ఉగ్రదాడి: జమ్ములో 56 మంది విదేశీ ఉగ్రవాదులు
పహల్గాం ఉగ్రదాడి.. కేంద్రం సీరియస్.. అప్డేట్స్భారత్లో ఉన్న పాక్ పౌరులు వెంటనే వెళ్లిపోవాలి: విక్రమ్ మిస్రీవిదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ మీడియా సమావేశంపాక్ పౌరులను భారత్‌లోకి అనుమతించేది లేదుపహల్గాం దాడివెనుక పాక్ హస్తం ఉందిమా దగ్గర పూర్తి ఆధారాలున్నాయిఉగ్రదాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాంఇండస్ వాటర్ ఒప్పందాన్ని నిలిపేస్తున్నాంఅటారీ-వాఘా సరిహద్దు చెక్‌పోస్టును మూసివేస్తున్నాంపాక్ తీవ్రవాద స్థావరాలపై భారత్ దాడికి దిగే అవకాశం?“పాక్ ఆక్రమిత్ కాశ్మీర్” (పిఓకే) లో పాక్ తీవ్రవాద స్థావరాలపై భారత్ దాడికి దిగే అవకాశం?“పాక్ ఆక్రమిత కాశ్మీర్” లో 110 నుంచి 125 మంది క్రియాశీలకంగా ఉన్న తీవ్రవాదులుసుమారు 42 “లాంచ్ పాడ్స్” (తీవ్రవాద స్థావరాలు) క్రియాశీలకంగా ఉన్నట్లు సమాచారంఉత్తర కాశ్మీర్ లో క్రియాశీలకంగా ఉన్న 35 మంది తీవ్రవాదులుజమ్మూలో కూడా క్రియాశీలకంగా ఉన్న సుమారు 100 మంది తీవ్రవాదులు. పహల్గాం ఉగ్రదాడిపై ప్రధాని సీరియస్‌సౌదీ పర్యటన కుదించుకుని వచ్చేసిన ప్రధాని మోదీపాక్ గగనతలంలోకి వెళ్లకుండా మరో మార్గంలో ప్రయాణం. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్లో ఉన్న దృశ్యాలతో వెల్లడైన విషయం పాక్ నుంచి ముప్పు ఉండొచ్చనే అనుమానాల నడుమ దారి మళ్లింపు ఎయిర్ పోర్టులోనే కీలక సమావేశం నిర్వహణకేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తో భేటీప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ మరికాసేపట్లో ఉగ్రదాడిలో నేవీ అధికారి మృతి.. కలచివేస్తోన్న నవవధువు కన్నీటి వీడ్కోలు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నేవీ అధికారి వినయ్ నర్వాల్ వారం క్రితం వివాహం చేసుకుని భార్యతో కలిసి హనీమూన్‌కి వచ్చిన అధికారి ఉగ్రదాడిలో మృతి చెందిన ఆయనకు ప్రభుత్వ అధికార లాంఛనాలతో అంత్యక్రియలు కలచి వేస్తోన్న నవ వధువు రోదన Indian Navy Lieutenant Vinay Narwal's wife bids an emotional farewell to her husband, who was killed in the #Pahalgam terror attackThe couple got married on April 16. 💔💔 pic.twitter.com/a83lpg3A40— Venisha G Kiba (@KibaVenisha) April 23, 2025జమ్ములో అత్యధికంగా ఎల్ఈటీ ఉగ్రవాదులు! జమ్ము కశ్మీర్లో 56 మంది విదేశీ ఉగ్రవాదులు అత్యధికంగా లష్కరే తాయిబా(LeT) సభ్యులు ఉన్నారన్న నిఘా వర్షాలు పహల్గాం దాడులు తమ పనేనని ప్రకటించుకున్న ఎల్ఈటీ విభాగం అసిఫ్ ఫౌజీ, సులేమాన్ షా, అబు తల్హా గుర్తింపు ప్రధాన సూత్రధారి సైఫుల్లా సాజిద్? ముజాహిదీలు కశ్మీర్లో దాడి చేస్తారని తరచూ ప్రకటించిన సాజిద్ సాయంత్రం కేబినెట్ కీలక సమావేశంపహల్గాం నుంచి ఢిల్లీకి బయల్దేరిన కేంద్ర హోం మంత్రి అమిత్ షాసాయంత్రం ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశంకేబినెట్ భేటీలో కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం పహల్గాం ఘటనకు దీటుగా జవాబిస్తాం: రాజ్‌నాథ్ సింగ్ పహల్గాం ఉగ్రదాడి ఘటనపై మీడియాతో మాట్లాడిన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పిరికిపంద చర్యగా అభివర్ణించిన రాజ్‌నాథ్ ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు : రాజ్‌నాథ్‌ఉగ్రవాదాన్ని తుదిముట్టించాలనేది భారత్ విధానం : రాజ్‌నాథ్‌ఉగ్రదాడికి పాల్పడిన దోషులను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోం.: రాజ్‌నాథ్‌పహల్గామ్ ఘటనకు దీటుగా జవాబిస్తాం: రాజ్‌నాథ్#WATCH | #PahalgamTerrorAttack | Delhi: Raksha Mantri Rajnath Singh says, "Yesterday, in Pahalgam, targeting a particular religion, terrorists executed a cowardly act, in which we lost many innocent lives... I want to assure the countrymen that the government will take every… pic.twitter.com/VhNHD0kO2E— ANI (@ANI) April 23, 2025 ఉగ్ర రక్కసిపై గళమెత్తిన కశ్మీర్.. ఆరేళ్లలో తొలిసారి బంద్! పహల్గాం దాడిని ఖండిస్తూ వీధుల్లోకి వచ్చిన జనం శ్రీనగర్ సహా కశ్మీర్‌లోని అనేక ప్రాంతాల్లో స్వచ్ఛందంగా బంద్ గతంలో సర్వసాధారణంగా ఉండగా.. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కశ్మీర్లో తొలిసారి బంద్ ఉగ్రదాడి.. పాకిస్థాన్ హైకమిషన్ వద్ద భద్రత కట్టుదిట్టం పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఢిల్లీలో భద్రత కట్టుదిట్టం పాకిస్థాన్ హైకమిషన్ వద్ద గట్టి సెక్యూరిటీ పక్షపాత రాజకీయాలకు ఇది సమయం కాదు: ఖర్గే పహల్గాం ఉగ్రదాడి మన దేశ ఐక్యత, సమగ్రతపై ప్రత్యక్ష దాడిగా పేర్కొన్న కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించివేసేందుకు కేంద్రంతో సహకరించేందుకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ట్వీట్ జమ్మును వీడుతున్న పర్యాటకులుపహల్గాం దాడి నేపథ్యంలో జమ్ము కశ్మీర్‌ను వీడుతున్న పర్యాటకులుఉదయం నుంచి 20 విమానాల్లో పైగా తిరుగు ప్రయాణం కిక్కిరిసిపోతున్న రైల్వే స్టేషన్లుకాట్రా నుంచి ప్ర త్యేక రైళ్లుఆరు గంటల్లో కశ్మీర్‌ను వీడిన 3,300 మంది పర్యాటకులుపర్యాటకులు వీడుతుండడంపై ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాIt’s heartbreaking to see the exodus of our guests from the valley after yesterday’s tragic terror attack in Pahalgam but at the same time we totally understand why people would want to leave. While DGCA & the Ministry of Civil Aviation are working to organise extra flights,… pic.twitter.com/5O3i5U1rBh— Omar Abdullah (@OmarAbdullah) April 23, 2025 భద్రతా బలగాల అదుపులో పలువురు అనుమానితులు ఉగ్రవాదుల్లో ఇద్దరు కశ్మీరీలే!పహల్గాం ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల గుర్తింపుఇద్దరు కశ్మీరీలేనని అనుమానిస్తున్న భద్రతా ఏజెన్సీలు2018లో కశ్మీర్‌ను వదిలి పాక్ వెళ్లిపోయిన అదిల్ గురి, అషన్‌ఇటీవలే మరో నలుగురితో కలిసి కశ్మీర్లో చొరబడినట్లు అనుమానంఅదిల్, అషన్ గురించి సమాచారం సేకరిస్తున్న భద్రతా బలగాలుపాక్ మద్దతుదారుల నుంచి వీళ్లకు మందు గుండు సామాగ్రి, ఏకే 47లునిల్వ ఆహారం, డ్రైఫూట్స్ ఉంచుకున్నట్లు అనుమానాలుమతాలవారీగా టూరిస్టులను వేరు చేసిన ఉగ్రవాదులుపాయింట్ బ్లాక్ రేంజ్లో టూరిస్టులను కాల్చేసిన టెర్రరిస్టులుహెల్మెట్ మౌంటెడ్ బాడీ కేమ్‌లతో రికార్డు చేసి పాక్‌కు చేరవేసి ఉండొచ్చనే అనుమానాలు పాక్ కవ్వింపు చర్యలుపాక్ దొంగ నాటకాలుపహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ కవ్వింపు చర్యలుసరిహద్దు వెంట భారీగా సైన్యం మోహరింపుకశ్మీర్ సరిహద్దులకు యుద్ధ విమానాల తరలింపుకరాచీ నుంచి లాహోర్, రాల్పిండికి యుద్ధ విమానాలుపహల్గాం దాడితో తమకేం సంబంధం లేదని ప్రకటించిన పాక్ ప్రభుత్వందాడి ఘటనను ఖండిస్తూ.. మరణించినవారి కుటుంబాలకు సానుభూతి ప్రకటనమమ్మల్ని నిందించొద్దు అంటూ పాక్ రక్షణ మంత్రి వ్యాఖ్యలుభారత్‌లో పలు రాష్ట్రాల్లో గొడవలు జరుగుతున్నాయని.. అంతర్గత తిరుగుబాటులే పహల్గాం దాడికి కారణమంటూ ప్రకటనఉగ్రవాదులకు సాయం చేసింది పాక్ ఐఎస్ఐనే పరిహారం ప్రకటించిన జమ్ము ప్రభుత్వంపహల్గాం ఉగ్రదాడి బాధితులకు పరిహారం ప్రకటించిన జమ్ము కశ్మీర్ ప్రభుత్వంమృతులకు రూ.10 లక్షలు, తీవ్రంగా గాయపడినవాళ్లకు రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వాళ్లకు రూ.1 లక్షదాడికి నిరసనగా కశ్మీర్ బంద్‌కు పిలుపు ఇచ్చిన ప్రజా సంఘాలు పహల్గాం ఊచకోతను ఖండిస్తూ సుప్రీం కోర్టు ఏకగ్రీవ తీర్మానంపహల్గాం ఉగ్రఘటన.. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల నివాళి మతిలేని చర్యగా అభివర్ణించిన సర్వోన్నత న్యాయస్థానంఉగ్రదాడి మృతులకు సంతాపంగా మౌనం పాటించిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, సిబ్బంది ఈ దారుణ ఘటనను ఖండించిన సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్ ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం ఆపరేషన్?కశ్మీర్, పీవోకేలో ఉగ్రవాదుల ఏరివేతకు కేంద్రం ఆపరేషన్?ప్రధాని మోదీ, రక్షణ మంత్రి వరుస సమావేశాలుహోం మంత్రి అమిత్ షా క్షేత్రస్థాయి పర్యటనకశ్మీర్ పరిస్థితులను ప్రధాని మోదీకి వివరించిన జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో త్రివిధ దళాధిపతుల సమావేశంకేంద్రం ఆదేశాల అమలుకు సిద్ధమంటున్న త్రివిధ దళాధిపతులుపహల్గాం ఉగ్రదాడి ప్రధానాంశంగా.. సాయంత్రం కేంద్ర కేబినెట్ సమావేశంసమావేశం అనంతరం కీలక నిర్ణయం ప్రకటించే అవకాశం పహల్గాంలో కూంబింగ్‌పహల్గాంలో కొనసాగుతున్న కూబింగ్‌ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేటఒకవైపు.. క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్న బలగాలుమరోవైపు డ్రోన్ల సాయంతో కొనసాగుతున్న గాలింపుఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదలపహల్గాం దాడికి పాల్పడ్డ ఉగ్రవాదుల ఊహా చిత్రాలు విడుదలముగ్గురి చిత్రాలను విడుదల చేసిన కేంద్రంఅందులో అసిఫ్ అనే ఉగ్రవాదిబాడీ క్యామ్ ధరించి దాడులకు పాల్పడ్డ ఉగ్రవాదులుమొత్తం ఏడుగురు దాడికి పాల్పడినట్లు చెబుతున్న ప్రత్యక్ష సాక్షులుకానీ, దాడికి పాల్పడింది ముగ్గురి నుంచి నలుగురే?దాడులకు పాల్పడింది తామేనంటూ ప్రకటించిన లష్కరే తోయిబా విభాగం ది రెసిస్టెంట్ ఫ్రంట్ పహల్గాం దాడిపై కేంద్రం సీరియస్‌రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షతన ఉన్నత స్థాయి సమావేశంప్రస్తుత పరిస్థితిని వివరించిన త్రివిధ దళాధిపతులుప్రతిచర్యకు సిద్ధమని ప్రకటనసాయంత్రం ఆరు గంటలకు కేబినెట్ కీలక సమావేశంమరోవైపు భద్రతా ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ భేటీ పలు నగరాల్లో హైఅలర్ట్‌దేశవ్యాప్తంగా పలు నగరాల్లో హైఅలర్ట్ కశ్మీర్ పహల్గాం దాడితో అప్రమత్తమైన కేంద్రంఢిల్లీ, ముంబై సహా పలు నగరాలకు భద్రతాపరమైన హెచ్చరికలు జారీ చేసిన హోం శాఖ బైసరన్‌కు అమిత్ షాపహల్గాం బైసరన్‌కు కేంద్ర హోం మంత్రి అమిత్ షాకాల్పులు జరిపిన ప్రాంతంలో పర్యటించిన షాప్రతి చర్య తప్పదని, ఉగ్రవాదులపై కఠిన చర్యలు ఉంటాయని బాధిత కుటుంబాలకు హోం మంత్రి హామీ నేటి ఐపీఎల్ మ్యాచ్‌లో సంఘీభావంపహల్గాం ఉగ్రదాడికి సంఘీభావం తెలుపుతున్న ప్రముఖులుఐపీఎల్ క్రికెటర్ల సంఘీభావంఇవాళ హైదరాబాద్ ఉప్పల్‌లో ఐపీఎల్ మ్యాచ్‌దాడికి సంఘీభావంగా నల్ల బ్యాడ్జీలు ధరించనున్న ప్లేయర్స్‌ఒక నిమిషం మౌనం పాటించనున్న ఆటగాళ్లుచీర్‌గర్ల్స్ ఉండబోరని ప్రకటించిన బీసీసీఐ రంగంలోకి ఎన్‌ఐఏపహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ బృందంహోటల్స్, లాడ్జిలను జల్లెడ పడుతున్న అధికారులుదాడి తర్వాత అడవుల్లోకి పరారైనట్లు చెబుతున్న ప్రత్యక్ష సాక్షులుఅయినప్పటికీ పహల్గాంను అదుపులోకి తీసుకుని తనిఖీలు చేపడుతున్న భద్రతా బలగాలుప్రత్యక్ష సాక్షులను ప్రశ్నిస్తున్న ఎన్ఐఏ టీం పలు రాష్ట్రాల్లో పాక్ వ్యతిరేక నిరసనలుపహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ దేశవ్యాప్త నిరసనలు రోడ్డెక్కిన ప్రజలుపాక్, ఉగ్రవాద వ్యతిరేక నినాదాలతో ర్యాలీలుఉగ్రవాదం నశించాలంటూ ఫ్లకార్డులతో ప్రదర్శన పహల్గాం ఉగ్రదాడిలో((Pahalgam Terror attack) మరణించిన మృతులకు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నివాళులర్పించారు. బుధవారం ఉదయం శ్రీనగర్ కంట్రోల్ రూంలో సైనిక గౌరవ వందనం నడుమ మృతదేహాలపై పుష్ప గుచ్ఛాలను ఉంచారాయన. అనంతరం దాడిలో గాయపడి అనంత్‌నాగ్ ఆస్పత్రిలో క్షతగాత్రులను ఆయన పరామర్శించారు. #WATCH | Union Home Minister Amit Shah pays tributes to the victims of the Pahalgam terror attack, in Srinagar, J&K pic.twitter.com/tPRSj4ewUg— ANI (@ANI) April 23, 2025మంగళవారం రాత్రే శ్రీనగర్‌కు చేరుకున్న హోం మంత్రి అమిత్ షా(Amit Shah).. వివిధ భద్రతా బలగాల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించిన సంగతి తెలిసిందే. ఈ సమీక్షలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా కూడా పాల్గొన్నారు. ఈ ఉదయం మృతదేహాలకు ఆయన నివాళి అర్పించిన అనంతరం.. ప్రత్యేక విమానాల్లో మృతదేహాలను స్వస్థలాలకు తరలించనున్నారు. మరోవైపు.. పహల్గాం ఘటనకు కారకులైన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. అడవుల్లోకి పారిపోయిన ముష్కరుల కోసం డ్రోన్లతో భద్రతా బలగాలు గాలిస్తున్నాయి.జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం ఉగ్రవాదులు తెగబడ్డారు. ప్రకృతి అందాలను చూసి పరవశిస్తోన్న వారిపై పాశవికంగా దాడి చేసి 28 మందిని పొట్టన పెట్టకున్నారు. ఈ ఉగ్రవాద దాడి ఘటనపై ప్రపంచం మొత్తం స్పందించింది. అమాయకులపై జరిగిన ఈ హేయ చర్యను ప్రపంచ నాయకులు ఖండించారు. అమెరికా నుంచి రష్యా వరకు, ఇటలీ నుంచి ఇజ్రాయెల్ వరకు ప్రధాన నేతలు ఈ దాడిని తీవ్రంగా తప్పుబడుతూ, భారత్‌కు బలమైన సంఘీభావాన్ని ప్రకటించారు. -
జమ్ముకశ్మీర్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు ఉగ్రవాదులు హతం
శ్రీనగర్: కశ్మీర్ లోయలో ఉగ్రదాడి ఘటన వేళ బారాముల్లాలో తాజాగా ఎన్కౌంటర్ జరిగింది. భారత సైన్యం జరిపిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్టు సమాచారం. ఈ క్రమంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం ప్రకటించింది.వివరాల ప్రకారం.. బారాముల్లలో బుధవారం ఉదయం ఎన్కౌంటర్ జరిగింది. భారత సరిహద్దుల నుంచి చొరబాటుకు యత్నిస్తున్న ఇద్దరు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. ఈ సందర్బంగా ఉగ్రవాదుల నుంచి భారీ స్థాయిలో మందుగుండు సామగ్రి, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు సైన్యం ప్రకటించింది. దీంతో, యూరి సెక్టార్లో కూంబింగ్ కొనసాగుతోంది. J&K | Heavy exchange of fire between security forces and terrorists, two terrorists have been eliminated, infiltration bid foiled by the security forces in the ongoing Operation in Baramulla. Large quantity of weapons, ammunition and other war-like stores have been recovered from… pic.twitter.com/OS3opx8lLg— ANI (@ANI) April 23, 2025 -
కశ్మీర్ ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీవాసులు మృతి
శ్రీనగర్/విశాఖపట్నం: జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం సమీప బైసరన్‌లో జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలు బయటకు వస్తున్నాయి. ఈ ఘటనలో విశాఖ వాసి చంద్రమౌళిని ముష్కరులు దారుణంగా హత్య చేసినట్టు తెలిసింది. ఉగ్రవాదులు.. చంద్రమౌళిని వెంటాడి మరీ కాల్చినట్లు సమాచారం.వివరాల ప్రకారం.. పహల్గాంలో మంగళవారం ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారిలో విశాఖ వాసి ఉన్నారు. విశాఖ వాసి చంద్రమౌళిని ఉగ్రవాదులు కాల్చి చంపారు. అతడిని వెంటాడి మరీ కాల్చినట్లు సమాచారం. చంపొద్దని వేడుకున్నా.. మోదీకి చెప్పుకోవాలంటూ విచక్షణా రహితంగా కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. చంద్రమౌళి మృతదేహాన్ని సహచర టూరిస్టులు గుర్తించారు. ఇక, చంద్రమౌళి.. రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగి అని తెలిసింది. చంద్రమౌళి బంధువు DSP నాగేశ్వర్ రావు తాజాగా సాక్షితో మాట్లాడుతూ.. ఈ నెల 18న చంద్రమౌళి కశ్మీర్‌కు బయలుదేరి వెళ్లారు. ఆరుగురు కలిసి విహారయాత్రకి వెళ్లారు. ఇలాంటి దుర్ఘటన చాలా బాధాకరం. ఉగ్రవాద చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ మధ్య గ్రాండ్‌గా చంద్రమౌళి పుట్టినరోజు వేడుకలు జరిపాం. ఇప్పటికీ మా వదినకి ఆయన చనిపోయిన విషయం తెలియదు. ఉగ్రవాద దాడిలో మృతి చెందిన చంద్రమౌళి సమీప బంధువు కుమార్ రాజా తాజాగా మాట్లాడుతూ..‘ఈనెల 16న ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా కశ్మీర్ టూర్‌కి వెళ్లారు. మొత్తం ఆరుగురు వెళ్లారు. ఈనెల 25 నాటికి తిరిగి రావాల్సి ఉంది. చంద్రమౌళి ఫ్యామిలీతో పాటు అప్పన్న, శశిధర్ ఫామిలీలు వెళ్లాయి. చంద్రమౌళి తప్పించుకునే ప్రయత్నం చేశారు.. కానీ, ముష్కరులు హతమార్చారు. మిగిలిన ఐదుగురు క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. మృతదేహం ఇవాళ రాత్రి విశాఖకు తరలిస్తారు. ఆయన ఇద్దరు కుమార్తెలు అమెరికా ఉన్నారు. వారిద్దరూ రేపు.. విశాఖకు చేరుకుంటారు. ఎల్లుండి అంత్యక్రియలు జరుగుతాయి. నెల్లూరు వాసి మృతి..కశ్మీర్‌లోని పహాల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో కావలికి చెందిన సోమిశెట్టి మధుసూదన్ రావు మృతిచెందాడు. నిన్న జరిగిన ఉగ్రదాడిలో మధుసూదన్‌ని కాల్చి చంపిన ఉగ్రవాదులు. బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌గా పనిచేస్తున్న మధుసూదన్. బెంగళూరులో స్థిరపడ్డ మధుసూదన్ కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్ళగా ఈ విషాదకర ఘటన నెలకొంది. కావలి కుమ్మరి వీధిలో సోమిశెట్టి తిరుపాలు పద్మ దంపతుల కుమారుడుగా గుర్తింపు. మృతుడు మధుసూదనన్‌కు భార్య ఇద్దరు పిల్లలు. నేడు ప్రత్యేక విమానంలో మృతదేహాన్ని చెన్నైకి తరలింపు.. సాయంత్రానికి కావలికి చేరుకోనున్న మధుసూదన్ మృతదేహాం. అతడి తల్లిదండ్రులు హార్ట్ పేషంట్స్ కావడంతో విషయం గోప్యంగా ఉంచిన బంధువులు. -
ఢిల్లీ చేరుకున్న మోదీ.. ఎయిర్‌పోర్టులోనే ధోవల్‌తో సమీక్ష!
సాక్షి, ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీ చేరుకున్నారు. కాశ్మీర్లో ఉగ్ర దాడి నేపథ్యంలో ప్రధాని మోదీ.. సౌదీ అరేబియా పర్యటన అర్థాంతరంగా ముగించుకుని భారత్‌కు పయనమయ్యారు. విమానాశ్రయంలో ప్రధాని మోదీని కలిసి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ ప్రస్తుత పరిస్థితి వివరించారు. ఉగ్రవాదులకు బుద్ధి చెప్పేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ చర్చించనున్నారు. ఇక, ఢిల్లీ చేరుకున్న వెంటనే ప్రధాని మోదీ.. ఎయిర్‌పోర్టులోనే కశ్మీర్ ఉగ్రదాడిపై సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమీక్ష సమావేశానికి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. నేడు పహల్గాంకు అమిత్ షాఘటనాస్థలాన్ని సందర్శించాలన్న ప్రధాని మోదీ ఆదేశంతో హోంమంత్రి అమిత్ షా హుటాహుటిన మంగళవారం రాత్రి శ్రీనగర్‌కు చేరుకున్నారు. భద్రతా సంస్థల ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితులను సమీక్షించారు. ఆయన వెంట జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్‌సిన్హా కూడా ఉన్నారు. బుధవారం అమిత్ షా పహల్గాంకు వెళ్లనున్నారు. ఉగ్రవాదుల దుశ్చర్యపై భారత పర్యటనలో ఉన్న అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ. వాన్స్ సహా పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. Prime Minister Narendra Modi arrives in Delhi after cutting short his Saudi Arabia visit in view of the #PahalgamTerroristAttack in Kashmir.NSA Ajit Doval accompanies him. (Source - ANI/DD) pic.twitter.com/PeA7CWRAes— ANI (@ANI) April 23, 2025 -
కశ్మీర్ ఉగ్రదాడిలో నేవీ అధికారి మృతి.. నవవధువు ఆవేదన
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఉగ్ర ఉన్మాదం మరోసారి ఒళ్లువిరుచుకుంది. పర్యాటకులపై తూటాల వర్షం కురిసింది. ఉగ్ర ముష్కరులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (26) కూడా మరణించారు. ఈ విషయాన్ని రక్షణశాఖ అధికారులు ధృవీకరించారు.మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన పహల్గాంలోని బైసారన్ ప్రాంతంలో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఉగ్ర దాడిలో 26 మంది పర్యాటకులు మృతిచెందారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు విదేశీయులున్నారు. వారిలో ఒకరు నేపాలీ కాగా మరొకరిది యూఏఈ. మరో ఇద్దరు స్థానికులు కాగా మిగతావారు కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ, బీహార్, హర్యానాకు తదితర రాష్ట్రాలకు చెందినవారు.భర్తను కోల్పోయిన నవవధువుపెళ్లయి కాళ్లకు పారాణి ఆరకముందే ఆ నవవధువు జీవితం తలకిందులైంది. భర్తను ఉగ్రవాదులు పొట్టనపెట్టుకోవడంతో ఆ నవవధువు తన భర్త మృతదేహాన్ని పట్టుకుని దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చింది. ఈ మారణకాండలో బలైపోయిన నేవీ అధికారి లెఫ్టినెంట్ వినయ్ నర్వాల్ (26)గా గుర్తించారు. హర్యానాకు చెందిన వినయ్, కొచ్చిలో విధులు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 16న వివాహం చేసుకున్న ఆయన, హనీమూన్ కోసమో, లేదా సెలవును ఎంజాయ్ చేసేందుకో కశ్మీర్‌కు వచ్చారు. పెళ్లై కనీసం వారం రోజులు కూడా గడవకముందే, ఆనందంగా గడపాల్సిన సెలవు ఆయన జీవితంలో చివరిది కావడంతో కుటుంబంలోనే కాదు, దేశవ్యాప్తంగా విషాదం అలుముకుంది. ఈ విషయాన్ని రక్షణశాఖ అధికారులు ధృవీకరించారు. ఈ క్రమంలో నవ వధువు రోదిస్తూ..‘మాకు పెళ్లయి కేవలం ఆరు రోజులే అవుతోంది. ఘటన జరిగినప్పుడు మేమిద్దరం పానీపూరీని ఆస్వాదిస్తున్నాం. హఠాత్తుగా ఒక ఉగ్రవాది మా వద్దకు వచ్చాడు. నీ భర్త ముస్లిం కాదు కదా అని అన్నాడు. వెంటనే ఆయన తలకు తుపాకీ గురిపెట్టి కాల్చి వెళ్లిపోయాడు. రక్తపు మడుగులో ఉన్న నా భర్తను ఎవరైనా కాపాడండి’ అంటూ ఏడుస్తున్న హృదయ విదారక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 🚨Vinay Narwal, a 26-year-old Indian Navy officer from #Karnal, #Haryana📅 16 April – Lieutenant Vinay got married.📅 19 April – The couple traveled to Kashmir for the their honeymoon📅 22 April – Lieutenant Vinay was tragically killed in a terrorist attack in #Pahalgam https://t.co/n8ElIenhaE pic.twitter.com/6w0qprTnm8— Haryana Development Index (@InfrageoHaryana) April 23, 2025 -
జమ్ముకశ్మీర్‌లో క్లౌడ్ బరస్ట్.. వరద బీభత్సంతో భయానక వాతావరణం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్ కారణంగా కుండపోత వర్షం కురిసింది. రెండు రోజులుగా ఆగకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. వర్షాల కారణంగా ఇప్పటి వరకు ముగ్గురు మృతిచెందగా.. సుమారు 100 మందిని సహాయక బృందాలు కాపాడాయి. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.వివరాల ప్రకారం.. జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు భీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా రాంబన్ జిల్లాలో దాదాపు 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. కొండ చరియలు విరిగి పడడంతో ప్రధాన మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. బాగ్నా గ్రామంలో ఇల్లు కూలిపోవడంతో ముగ్గురు మరణించారని సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (SSP) రాంబన్ కుల్బీర్ సింగ్ ధృవీకరించారు. మృతులను మొహమ్మద్ అకిబ్ (14), మొహమ్మద్ సాకిబ్ (9), మోహన్ సింగ్ (75) గా గుర్తించారు. వీరందరూ బాగ్నా పంచాయతీ నివాసితులు.#JammuKashmir | Heavy rainfall in several parts of Bhalessa, Doda#Rainfall pic.twitter.com/8rDEyL8X3l— DD News (@DDNewslive) April 20, 2025 #Ramban | Flash floods triggered by heavy rains hit a village near the Chenab River in Dharamkund, J&K.#JammuKashmir #Dharamkund pic.twitter.com/mrcL9RX7Ja— DD News (@DDNewslive) April 20, 2025మరోవైపు.. చాలా చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు పేర్కొన్నారు. సుమారు 100మందిని సహాయక బృందాలు రక్షించినట్లు అధికారులు తెలిపారు. శిథిలాల కింద వాహనాలు చిక్కుకుపోయినట్లు చెబుతున్నారు. పశ్చిమాసియాలోని ప్రత్యేకమైన వాతవరణ పరిస్థితుల వల్లే జమ్మూలో భారీ వర్షాలు, తుఫాను సంభవించిందని వాతావరణ శాఖ తెలిపింది. ఐదేళ్లలో ఇంత భారీ స్థాయిలో వర్షాలు, బలమై గాలులు వీయడం ఇదే మొదటిసారని పేర్కొంది.#Srinagar #Jammu National Highway is closed for traffic due to landslides & mudslides at multiple locations between Ramban and Banihal.The situation is extremely bad,as several vehicles have been damaged by landslides. Since last evening, #Banihal has received 71 mm of rainfall pic.twitter.com/zPj6hEgAl1— Indian Observer (@ag_Journalist) April 20, 2025ఇదిలా ఉండగా.. భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా స్పందిస్తూ.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసరం అయితే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు. రాంబన్‌లో కొండ చరియలు విరిగిపడడం వల్ల తీవ్ర ఆస్తి నష్టం సంభవించిందన్నారు. విపత్తు ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అన్నారు. ఇక, జిల్లా అంతటా రెండు హోటళ్ళు, అనేక దుకాణాలు, నివాస నిర్మాణాలు దెబ్బతిన్నాయి. రహదారులన్నీ బురదతో నిండిపోయాయి. మహిళలు, పిల్లలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.जम्मू कश्मीर मे बादल फटने से भयंकर तबाहीहजारों लोगों की जान पर आफतजम्मू -श्रीनगर नेशनल हाईवे भारी बारिश और लैंडस्लाइड के कारण बंद करना पड़ा हाईवे पर कीचड़ भरा मालवा आने से इसके नीचे कई गाड़ियां दब गई है#JammuKashmir #jammusrinagarhighway #landslide #rain #ramban pic.twitter.com/wH16tknzWt— Ravi Pandey🇮🇳 (@ravipandey2643) April 20, 2025Five vehicles half buried under debris in T2 Ramban#LANDSLIDE #CLOUDBURST #ramban pic.twitter.com/ucMCDsXvRf— Gulistan News (@GulistanNewsTV) April 20, 2025Flood like situation on Jammu - Srinagar National Highway. Avoid a journey till 22 April.Most affected areas: Banihal, Panthyal, and adjacent areas. pic.twitter.com/QUpZMzx8fX— Kashmir Weather (@Kashmir_Weather) April 20, 2025 -
సరిహద్దుల్లో చొరబాట్లను నిలువరించి.. ఆర్మీ జేసీవో వీరమరణం
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద చొరబాటుదార్లతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆర్మీ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్(జేసీవో)వీర మరణం పొందారు. అఖ్నూర్ సెక్టార్‌లోని కేరి భట్టాల్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి ఘటన చోటుచేసుకుంది. అత్యాధునిక ఆయుధాలు ధరించిన ఉగ్రవాదులు ఒక ప్రవాహం వద్ద సరి హద్దులు దాటేందుకు యత్నించారు. బలగాలు చేస్తున్న హెచ్చరికలను వారు ఖాతరు చేయలేదు. ఈ సందర్భంగా భీకర ఎదురు కాల్పులు కొనసాగాయి. ఘటనలో జేసీవో సుబేదార్ కుల్దీప్ చాంద్ తీవ్రంగా గాయపడ్డారు. అనంతరం ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారని అధికారులు తెలిపారు. సైన్యం దీటుగా స్పందించగా తోకముడిచిన తీవ్రవాదులు ఆక్రమిత కశ్మీర్లోకి పలాయనమయ్యారు. సుబేదార్ కుల్దీప్ సింగ్ హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన వారు. కాగా, బలగాలను భారీగా తరలించి, ఆ ప్రాంతాన్ని దిగ్బంధించామని అధికా రులు వివరించారు. భారత్, పాక్ బ్రిగేడియర్ కమాండర్ స్థాయి అధికారుల ఫ్లాగ్ మీటింగ్ జరిగిన రెండు రోజులకే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. ఇదే ప్రాంతంలో ఫిబ్రవరి 11వ తేదీన ఉగ్ర వాదులు అమర్చిన మందుపాతర పేలి ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. కాగా, ముష్కరులతో జరిగిన పోరులో నేలకొరిగిన కుల్దీప్ సింగ్ చాంద్‌కు జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఘనంగా నివాళులర్పించారు. ఆయన త్యాగం వెల కట్టలేదన్నారు.ఇద్దరు ఉగ్రవాదులు హతంభారీగా మంచుకురుస్తున్న కిష్టవార్ జిల్లాలో కొనసాగుతున్న ఆపరేషన్‌లో ఇద్దరు ఉగ్రవా దులు హతమైనట్లు శనివారం అధికారులు తెలిపారు. దీంతో, ఛత్రు ప్రాంతంలో మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు ఉగ్రవాదులను ఏరివేసినట్లయిందన్నారు. టాప్ కమాండర్ సైఫుల్లా సహా ఈ ముగ్గురూ పాక్ కేంద్రంగా పనిచేసే జైషే మహ్మద్‌కు చెందిన వారేన న్నారు. వీరి వద్ద అత్యాధుని ఎం–4 కార్బైన్, ఏకే సిరీస్ రైఫిళ్లను, భారీగా పేలుడు సామగ్రి ని స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ నెల 9వ తేదీన చేపట్టిన గాలింపు చర్యలు కొనసా గిస్తున్నామని స్పష్టం చేశారు. ఉధంపూర్ జిల్లాలోని బసంత్‌గఢ్, రామ్‌నగర్ ప్రాంతాల్లో నూ బుధవారం నుంచి ఉగ్రవాదుల కోసం గాలింపు మొదలైందని చెప్పారు. -
సరిహద్దుల్లో ఎలక్ట్రానిక్ నిఘా వ్యవస్థ
జమ్మూ: దేశ సరిహద్దుల పరిరక్షణకు ఎలక్ట్రానిక్ సర్వైలెన్స్ సిస్టమ్‌ను మోహరిస్తున్నట్లు హోం మంత్రి అమిత్ షా తెలిపారు. జమ్మూకశ్మీర్‌లోకి ఉగ్రవా దుల అక్రమచొరబాట్లను తిప్పికొట్టేందుకు, సరిహ ద్దుల్లో అండర్‌గ్రౌండ్ టన్నెళ్లను గుర్తించేందుకు సాంకేతికతను వినియోగిస్తున్నామన్నారు. సరిహ ద్దుల కు ఆవలి వైపు ఎలాంటి అనుమా నాస్పద కదలి కలున్నా ఈ నిఘా వ్యవస్థ కనిపెట్టి తక్షణమే స్పందిస్తుందన్నారు. జమ్మూకశ్మీర్‌లో మూడు రోజుల పర్యటనకు సోమవారం ఇక్కడికి ఆయన చేరుకు న్నారు. ఈ సందర్భంగా కథువా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దుల్లో ఉన్న ‘వినయ్’ బోర్డర్ పో స్టును సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడున్న బీఎస్ఎఫ్ జవాన్లతో మాట్లాడారు. అత్యంత సవాళ్లతో కూడిన పరిస్థితుల మధ్య విధులను సమర్థమంతంగా నిర్వహిస్తున్న జవా న్లను ఆయన ప్రశంసించారు. వానలు, భీకరమైన చలి, ఎండలను సైతం లెక్కచేయకుండా 365 రోజు లూ బోర్డర్ పోస్టుల్లో విధులు కొనసాగిస్తూ శత్రువుల కదలికలపై ఓ కన్నేసి ఉంచుతున్నారంటూ ప్రశంసించారు. ఇక్కడికి వచ్చి చూసిన వారికే జవాన్ల కష్టం ఏమిటో తెలుస్తుందంటూ వ్యాఖ్యానించారు. అమరుల సంతానానికి ఉద్యోగాలుఅనంతరం మంత్రి అమిత్ షా రాజ్‌భవన్‌లో ఉగ్రవాదులతో పోరాటంలో నేలకొరిగిన 10 మంది పోలీసులు, ఒక ఇంజనీర్ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. వారికి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కారుణ్య ప్రాతిపదికన మందికి ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఇటీవల కథువా జిల్లాలో పాక్ ఉగ్రవాదులతో జరిగిన పోరులో నేలకొరిగిన నలుగురు పోలీసు కుటుంబాల వారు కూడా వీరిలో ఉన్నారు. వీరమరణం పొందిన జశ్వంత్ సింగ్ కుమారుడు 12 ఏళ్ల యువరాజ్ సింగ్ కూడా కారుణ్య నియామక పత్రం అందుకున్నాడు. మేజర్ అయ్యాక ఇతడి నియామ కానికి అనుకూలమైన చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి కోరారు. -
జమ్ము కశ్మీర్లో ఎల్జీ సిన్హా Vs సీఎం ఒమర్.. కేంద్రానికి వార్నింగ్
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ పరిపాలనా సర్వీస్(జేకేఏఎస్)కు చెందిన 48 మంది అధికారులను లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ)మనోజ్ సిన్హా బదిలీ చేయడం వివాదాస్పదంగా మారింది. పరిపాలనా సంబంధమైన అంశాల్లో ఇప్పటికే రాజ్‌భవన్, ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం మధ్య కొనసాగుతున్న విభేదాలకు ఇది ఆజ్యం పోసినట్లయింది. దీన్ని సీరియస్‌గా తీసుకున్న సీఎం అబ్దుల్లా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఎల్జీ సిన్హా, చీఫ్ సెక్రటరీ అటల్ దుల్లూకు లేఖలు రాశారు. అందులో పలు అంశాలను ప్రస్తావించారు.ఈ సందర్బంగా లేఖలో.. ఎన్నికైన ప్రభుత్వ అధికారాన్ని కాదని ఎల్జీ జారీ చేసిన ఉత్తర్వులకు ఎలాంటి చట్టబద్ధత లేదని అందులో పేర్కొన్నారు. ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్‌కు వెంటనే ఖరారు చేయాలని కోరారు. అధికారులను ఏకపక్షంగా బదిలీ చేయడంపై సమీక్ష చేపట్టాలని ఎల్జీకి రాసిన లేఖలో సీఎం ఒమర్ అబ్దుల్లా పేర్కొన్నారు. సీఎం అనుమతి లేకుండా అఖిల భారత సర్వీసేతర అధికారులను బదిలీ చేయవద్దని చీఫ్ సెక్రటరీని కోరారు. ఈ అంశంపై చర్చించేందుకు శుక్రవారం డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరి నివాసంలో జరిగిన అత్యవసర భేటీలో సీఎం ఒమర్‌తోపాటు ఎన్సీ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా పాల్గొన్నారు. హోం మంత్రి అమిత్ షా పర్యటన వేళ ఈ పరిణామాలు చోటుచేసుకోవడం గమనార్హం.ఈ క్రమంలోనే ‘ఇప్పటికే అనేకసార్లు చెప్పాం. ఇదే చిట్టచివరి విజ్ఞప్తి. ఇక మా సహనాన్ని పరీక్షించొద్దు’అని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ)ప్రతినిధి, ఎమ్మెల్యే జడిబల్ తన్వీర్ సాదిఖ్ అనంతరం మీడియా ఎదుట వ్యా ఖ్యానించారు. తమ సహకార వైఖరిని, మౌ నాన్ని బలహీనతగా భావించరాదని పేర్కొ న్నారు. ఈ సమావేశంలో వక్ఫ్ బిల్లును పార్లమెంట్ ఆమోదించడాన్ని ఖండిస్తూ తీర్మానించిందని, అదేవిధంగా, ప్రజలిచ్చిన తీర్పును గౌరవించాలంటూ ఎల్జీకి హితవు పలుకుతూ మరో తీర్మానం చేసిందని ఆయన తెలిపారు. పరిధిని అతిక్రమించలేదు: ఎల్జీ అధికార పార్టీ ఎమ్మెల్యేల అత్యవసర సమావేశం చేసిన తీర్మానంపై ఎల్జీ సిన్హా దీటుగా స్పందించారు. ‘జమ్మూ కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని 2019లో పార్లమెంట్ ఆమోదించింది. ఈ చట్టం పరిధిని అతిక్రమించి నేను ఎలాంటి చర్యలు తీసుకోలేదనే విషయాన్ని స్పష్టం చేయదల్చుకున్నా. నా పరిధి, నా పరిమితులు నాకు బాగా తెలుసు. అంతకుమించి ఎన్నడూ ఏమీ చేయలేదు’అని న్యూస్18కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పష్టం చేశారు. -
హద్దు మీరిన పాక్ సైన్యం... బుద్ధి చెప్పిన భారత జవాన్లు
జమ్మూ: పాకిస్తాన్ సైన్యం మరోసారి హద్దు మీరింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత భూభాగంపై కాల్పులు జరిపింది. అప్రమత్తమైన భారత సైన్యం గట్టిగా బదులివ్వడంతో పాక్ సైన్యం తోకముడిచింది. జమ్మూకశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వద్ద ఈ ఘటన జరిగినట్లు భారత సైనిక అధికార ప్రతినిధి బుధవారం వెల్లడించారు. మంగళవారం మధ్యాహ్నం 1.10 గంటలకు ఎల్ఓసీ వద్ద కృష్ణా ఘాటీ సెక్టార్లో తొలుత మందుపాతర పేలుడు సంభవించిందని, ఆ తర్వాత పాక్ భూభాగం నుంచి ఎలాంటి హెచ్చరికలు లేకుండానే కాల్పులు మొదలయ్యాయని అన్నారు. అక్కడే విధుల్లో ఉన్న భారత సైన్యం వెంటనే అప్రమత్తమై ఎదురు కాల్పులు జరిపిందని తెలిపారు. భారత సైన్యం నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురుకావడంతో చేసేది లేక పాక్ సైన్యం వెనక్కి తగ్గిందని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎల్ఓసీ వద్ద పరిస్థితి నియంత్రణలోనే ఉందని స్పష్టంచేశారు. ఎల్ఓసీ వెంట భారత సైన్యం పట్టు కొనసాగుతోందని తెలియజేశారు. అయితే, ఈ కాల్పుల ఘటనలో పాక్ సైన్యానికి ఏమైనా ప్రాణనష్టం వాటిల్లిందా? అనేది బయటపెట్టలేదు. ఐదుగురు పాక్ జవాన్లు గాయపడినట్లు సైనిక వర్గాలు వెల్లడించాయి. -
జమ్ములో కొనసాగుతున్న ఉగ్ర వేట.. నలుగురు పోలీసుల వీరమరణం
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని కథువా జిల్లాలో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. ఇప్పటికే ఇద్దరు ముష్కరులను మట్టుబెట్టగా.. మరికొందరి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మరోవైపు ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో నలుగురు పోలీసులు వీరమరణం చెందారు. డీఎస్పీ అధికారి సహా మరో ముగ్గురు సిబ్బందికి ఆస్పత్రిలో చికిత్స అందుతోంది.రాజ్‌బాగ్ ప్రాంతంలోని జఖోలె గ్రామం వద్ద గురువారం ఈ ఎన్కౌంటర్ జరిగింది. పాక్ భూభాగం నుంచి దొంగచాటుగా చొరబడిన ఉగ్రవాదుల ఏరివేతకు చేపట్టిన కార్డన్ ఆపరేషన్ సుదీర్ఘ ఎదురు కాల్పులకు దారి తీసింది. ఇంకా నలుగురు ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.ఇదిలా ఉంటే.. ఆదివారం సాయంత్రం కథువా జిల్లా హిరానగర్ సెక్టార్లో జమ్మూకశ్మీర్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌వోజీ)కి ఎదురుపడ్డ ఉగ్రవాదుల గ్రూపు తప్పించుకుపోయింది. ఘటనాప్రాంతంలో ఎం4 కార్బైన్ తపాకులు నాలుగు, గ్రనేడ్లు 2, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఒకటి, ఐఈడీ సామగ్రి అక్కడ లభించాయి. శనివారం వీరు లోయమార్గం గుండా, లేదా కొత్తగా నిర్మించిన సొరంగం గుండా చొరబడి ఉంటారని భావిస్తున్నారు. అప్పటి నుంచి డ్రోన్లు, హెలికాప్టర్లు, బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, జాగితాలతో వేటాడుతూనే ఉన్న ఎస్‌వోజీ అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో గురువారం వారి జాడను పసిగట్టింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో తుపాకీ కాల్పులు, బాంబు పేలుళ్లతో సుఫైన్ గ్రామ సమీప దట్టమైన అటవీ ప్రాంతం దద్దరిల్లుతోంది. పోలీసులకు తోడు ఆర్మీ, సీఆర్పీఎఫ్ను కూడా ఉన్నతాధికారులు అక్కడికి తరలించారు. -
కశ్మీర్లో భీకర ఎన్కౌంటర్
జమ్మూ: జమ్మూకశ్మీర్‌లోని కథువా జిల్లాలో చోటుచేసుకున్న భీకర ఎన్కౌంటర్లో ముగ్గురు పోలీసులు వీరమరణం పొందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఘటనలో ఇద్దరు ఉగ్రవాదులు కూడా హతమయ్యారు. పాక్ భూభాగం నుంచి దొంగచాటుగా చొరబడిన ఐదుగురు ఉగ్రవాదుల ఏరివేతకు చేపట్టిన కార్డన్ ఆపరేషన్ సుదీర్ఘ ఎదురు కాల్పులకు దారి తీసింది. రాజ్‌బాగ్ ప్రాంతంలోని జఖోలె గ్రామం వద్ద గురువారం ఈ ఎన్కౌంటర్ జరిగింది. ఆదివారం సాయంత్రం కథువా జిల్లా హిరానగర్ సెక్టార్లో జమ్మూకశ్మీర్ స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌వోజీ)కి ఎదురుపడ్డ ఉగ్రవాదుల గ్రూపు తప్పించుకుపోయింది. ఘటనాప్రాంతంలో ఎం4 కార్బైన్ తపాకులు నాలుగు, గ్రనేడ్లు 2, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ఒకటి, ఐఈడీ సామగ్రి అక్కడ లభించాయి. శనివారం వీరు లోయమార్గం గుండా, లేదా కొత్తగా నిర్మించిన సొరంగం గుండా చొరబడి ఉంటారని భావిస్తున్నారు. అప్పటి నుంచి డ్రోన్లు, హెలికాప్టర్లు, బుల్లెట్‌ప్రూఫ్ వాహనాలు, జాగితాలతో వేటాడుతూనే ఉన్న ఎస్‌వోజీ అక్కడికి 30 కిలోమీటర్ల దూరంలో గురువారం వారి జాడను పసిగట్టింది. ఈ సందర్భంగా చోటుచేసుకున్న ఎదురుకాల్పుల్లో తుపాకీ కాల్పులు, బాంబు పేలుళ్లతో సుఫైన్ గ్రామ సమీప దట్టమైన అటవీ ప్రాంతం దద్దరిల్లుతోంది. పోలీసులకు తోడు ఆర్మీ, సీఆర్పీఎఫ్ను కూడా ఉన్నతాధికారులు అక్కడికి తరలించారు. -
Kashmir: హురియత్ దుకాణం బంద్.. వేర్పాటువాదుల నోటికి తాళం
న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్‌లో హురియత్(Hurriyat) దుకాణం మూతపడనుంది. ఇక్కడి జనం వేర్పాటువాదానికి స్వస్తిపలికి, భారత రాజ్యాంగంపై తమ విధేయతను ప్రకటిస్తున్నారు. కశ్మీర్లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు వేర్పాటువాదానికి ముగింపు పలికేలా కనిపిస్తున్నాయి. హురియత్ కాన్ఫరెన్స్‌లోని భాగస్వామ్య పార్టీలైన జమ్ము అండ్ కశ్మీర్ పీపుల్స్ మూవ్మెంట్ (జేకేపీఎం), జే అండ్ కే డెమోక్రటిక్ పొలిటికల్ మూవ్మెంట్ (జేకేకేపీఎం) ఇకపై వేర్పాటువాదంతో తమకున్న అన్ని సంబంధాలను తెంచుకుంటున్నట్లు ప్రకటించాయని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు.ఇది భారతదేశ ఐక్యతను బలోపేతం చేస్తుందని అమిత్ షా పేర్కొన్నారు. జేకేపీఎంకు షాహిద్ సలీం నాయకత్వం వహిస్తుండగా, జేకేడీపీఎంకు న్యాయవాది షఫీ రేషి సారధ్యం వహిస్తున్నారు. ఇటీవల షాహిద్ సలీం తాను, తన సంస్థ వేర్పాటువాద భావజాలానికి దూరం అయ్యామని, భారతదేశ రాజ్యాంగంపై విధేయతను కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నానని ఒక ప్రకటనలో తెలిపారు. Separatism has become history in Kashmir.The unifying policies of the Modi government have tossed separatism out of J&K. Two organizations associated with the Hurriyat have announced the severing of all ties with separatism.I welcome this step towards strengthening Bharat's…— Amit Shah (@AmitShah) March 25, 2025ఎన్డీటీవీ అందించిన కథనంలోని వివరాల ప్రకారం సలీం, రేషి నిర్ణయాలను స్వాగతించిన కేంద్ర హోం మంత్రి షా(Union Home Minister Shah) మాట్లాడుతూ వారు తీసుకున్ననిర్ణయం భారతదేశ ఐక్యతను బలోపేతం చేస్తుందని, ప్రధాని మోదీ ప్రభుత్వంలోని సమైక్యత విధానాలు జమ్ముకశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని అంతం చేశాయని అన్నారు. ఈ విషయాన్ని ఆయన తన ‘ఎక్స్’ ఖాతాలో రాశారు. శాంతియుతమైన సమగ్ర భారతదేశాన్ని నిర్మించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలకు అందిన అతి పెద్ద విజయం ఇది అని అమిత్ షా పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: మందుబాబులకు పండుగ.. ఒకటికి మరొకటి ఫ్రీ.. రూ. 200 డిస్కౌంట్ -
రంజాన్ వేళ కశ్మీర్లో అర్ధనగ్న ఫ్యాషన్ షో.. సీఎం ఒమర్‌కు ఝలక్!
శ్రీనగర్: పవిత్ర రంజాన్ మాసం వేళ జమ్ము కశ్మీర్లో అర్ధనగ్న ఫ్యాషన్ షో తీవ్ర దుమారం రేపుతోంది. ఫ్యాషన్ షోలో మహిళలు, పురుషులు పొట్టి పొట్టి దుస్తులతో తెల్లటి మంచుపై ర్యాంప్ వాక్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పర్యాటకంపై ప్రచారం పేరుతో ఈ అశ్లీల ప్రదర్శన ఏమిటని విపక్షాలు, ప్రజలు.. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఈ నేపథ్యంలో కశ్మీర్లో నిర్వహించిన ఫ్యాషన్ షో కార్యక్రమంపై సీఎం ఒమర్ అబ్దుల్లా స్పందించారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇలాంటి ఫ్యాషన్ షో జరగడం పట్ల ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. ప్రజల కోపాన్ని తాము అర్థం చేసుకున్నట్లు చెప్పారు. తన కార్యాలయం స్థానిక అధికారులతో సంప్రదింపులు జరుపుతోంది. ఈ పరిణామంపై 24 గంటల్లోగా నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించారు. నివేదిక తర్వాత చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.మరోవైపు.. ఈ ఫ్యాషన్ షో వ్యవహారం అటు జమ్ము కశ్మీర్ అసెంబ్లీని సైతం తాకింది. రంజాన్ వేళ ఇలాంటి కార్యక్రమాలు ఎలా నిర్వహిస్తారని ప్రతిపక్ష నేతలు ఒమర్ ప్రభుత్వంపై మండిపడ్డారు. దీంతో, అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. A fashion show in Gulmarg has ignited controversy in J&K, with critics calling it "obscene" for being held during Ramzan. pic.twitter.com/4P77B8mtbf— Briefly (@Brieflybynewj) March 10, 2025ఇదిలా ఉండగా.. అంతకుముందు ఉత్తర కశ్మీర్ గుల్మార్గ్లోని ప్రముఖ స్కై రిసార్టులో ఆదివారం ప్రభుత్వ అధికారుల ఆధ్వర్యంలో ఫ్యాషన్ షో నిర్వహించారు. ఇందులో పాల్గొన్నవారు రెచ్చగొట్టే తరహాలో దుస్తులు ధరించారని స్థానిక మత పెద్దలతో పాటు హురియత్ కాన్ఫరెన్స్ చీఫ్ మిర్వాయిజ్ ఉమర్ ఫారూక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది దారుణంగా ఉందని విమర్శించారు. ఫ్యాషన్ షోకు సంబంధించిన చిత్రాలు, వీడియో తమను దిగ్భ్రాంతికి గురి చేశాయని అన్నారు. సూఫీ, సాధు సంస్కృతి, ప్రజల మతపరమైన దృక్పథానికి పేరుగాంచిన లోయలో దీన్ని ఎలా సహించాలి? ఇందులో పాల్గొన్న వారిని వెంటనే జవాబుదారీగా చేయాలి అని మండిపడ్డారు.#Watch: Noisy scenes in J&K #assembly over #Kathua killings, #Gulmarg fashion show pic.twitter.com/R80BG1YQ7A— Greater Kashmir (@GreaterKashmir) March 10, 2025 -
పసికూనలకు రక్షణ..లా
పసిపిల్లలకు భయం ఎక్కువ. ఆ భయాన్ని వాడుకునే నీడలు ఎక్కువ. నీడలు వారిని బంధిస్తాయి వారితో చెడు పనులు చేస్తాయి వారి పసితనాన్ని అశుభ్రం చేస్తాయి.నీడలు ఈ పనికి దేవుణ్ణో, దెయ్యాన్నో తోడు తెచ్చుకుంటాయి. తల్లిదండ్రులు స్వయంగా తీసుకెళ్లి అమాయకత్వంతోనో మూర్ఖత్వంతోనో పిల్లల్ని ఈ నీడలకు అప్పగిస్తారు. పిల్లలు పులి నోటికి చిక్కుతారు. న్యాయం ఎప్పుడోగాని ఉదయించదు. జమ్ము–కశ్మీర్లో మంత్రాల పేరు చెప్పి పిల్లలను లైంగికంగా వేధించిన బాబాకుశిక్ష విధిస్తూ న్యాయమూర్తి ఉద్వేగంగా కవిత రాశారు. భయం లేని వేకువకై ప్రార్థించారు.జనవరి, 2021.మదనపల్లె ఘటన అందరికీ గుర్తుంది. మూఢ విశ్వాసం నెత్తికెక్కి ఇద్దరు ఎదిగొచ్చిన కుమార్తెల ఉసురు తీశారు తల్లిదండ్రులు. చనిపోయాక వారు సత్యయుగంలో జన్మిస్తారట. అందుకోసమని బతికుండగానే సమాధి చేశారు.ప్రాణం పోయడం దైవం. ప్రాణం తీయడం దెయ్యం.అక్టోబర్, 2024.చత్తిస్‌గఢ్‌లోని శక్తి జిల్లా.తల్లి తన ఇద్దరు కుమార్తెలతో కలిసి ఇద్దరు కుమారులను గొంతు పిసికి చంపేసింది. తర్వాత ఉజ్జయినీ నుంచి తెచ్చుకున్న ఒక ‘గురువు’ ఫొటో పెట్టుకొని ఆ చనిపోయిన కుమారులనుప్రాణాలతో లేచేందుకు మంత్రాలు చదవడం మొదలెట్టింది. ఇదంతా ఆమె తంత్ర సాధనలో భాగమట.కడుపున పుట్టిన వారినే కాటేసే గుడ్డితనమే అంధ విశ్వాసం.జూన్, 2024.తమిళనాడులోని అలియలూరు జిల్లా.లేక లేక మనవరాలు పుడితే ఆ పుట్టిన శకునం బాగ లేదని స్వయంగా తాతే ఆ పసికూన ప్రాణాలు తీశాడు. ఆ శకునం కుటుంబానికి హానికారక సూచన కనుక ఈ పని చేశాడట.చేతులతో పూజ చేయడం భక్తి. అదే చేతులతో పీక పిసకడం మూఢ భక్తి.ఫిబ్రవరి 18, 2025.జమ్ము–కశ్మీర్‌లోని సొపోర్ నగర కోర్టులో చీఫ్ జ్యూడిషియల్ మెజిస్ట్రేట్ మీర్ వజాహత్ ఒక 123 పేజీల తీర్పును వెలువరించారు. ఆ తీర్పు అంతా మూఢ విశ్వాసాల వల్ల చిన్నపిల్లల మీద సాగుతున్న దౌర్జన్యాల పట్ల, అకృత్యాల పట్ల ఆవేదన. కారణం? ఆ తీర్పు ఏజాజ్ అహ్మద్ అనే దొంగబాబా పసిపిల్లల మీద సాగించే అకృత్యాల మీద కావడం. ఈ ఘోరాన్ని ఆ బాబా ఏళ్ల తరబడి కొనసాగిస్తూ ఉండటం. విషయం తెలియకనే తల్లిదండ్రులు అందులో భాగం కావడం.ఏం జరిగింది?జమ్ము–కశ్మీర్లో ‘పీర్ బాబా’గా పేరుబడ్డ ఏజాజ్ షేక్ దగ్గరకు చాలా మంది తమ దైనందిన బాధల నుంచి విముక్తి కోసం వచ్చేవారు. అనారోగ్యం, ఆర్థిక బాధలు, తగవులు... వీటికి విరుగుడు కోసం ఆయన దగ్గరకు మంత్ర తంత్రాలకు వచ్చేవారు. అయితే ఇక్కడే ఆ బాబా ఒక చిట్కా పాటించేవాడు– ‘మీ కష్టాలు పోవడానికి దైవ సహాయం కంటే ‘జిన్ను’ (భూతం)ల సాయం మంచిది. జిన్నులతో మాట్లాడి పరిష్కారం చేస్తాను. అయితే జిన్నులు పెద్దల కంటే పిల్లలతో మాట్లాడటానికి ఇష్టపడతాయి. మీరు మీ పిల్లల్ని (అబ్బాయిల్ని) తెచ్చి నాకు అప్పగిస్తే తంత్రాలు ముగిశాక మళ్లీ మీకు అప్పగిస్తాను’ అనేవాడు. అమాయక/ఆశబోతు తల్లిదండ్రులు ఈ మాటలు నమ్మి తమ పిల్లల్ని బాబా దగ్గరకు తీసుకెళ్లేవాళ్లు. పదేళ్లలోపు మగపిల్లలుఈ బాబా చేతిలో బాధితులుగా మారిన వారందరూ పదేళ్ల లోపు అబ్బాయిలే. బాబా వారిని పూజ పేరుతో నగ్నంగా మార్చి అసహజ లైంగిక కార్యకలాపాలకు పాల్పడేవాడని ప్రాసిక్యూషన్ నిరూపించగలిగింది. పిల్లల్ని భయపెట్టేందుకు బాబా తనలోనే ‘జిన్’ ఉందని, అది అన్ని కష్టాల నుంచి దూరం చేస్తుందని, కోరికలు నెరవేరుస్తుందని చెప్పి లైంగిక వాంఛలు తీర్చుకునేవాడు. కొందరు పిల్లలు నాలుగైదు ఏళ్లపాటు ఇతని వల్ల బాధ పడ్డారు. భయం వల్ల, ఆ బాబా స్కూల్ టీచర్ కూడా కావడం వల్ల నోరు మెదపలేక తల్లిదండ్రులు బాబా దగ్గరికెళ్దామంటే వారు మొండికేయడం మొదలెట్టారు. అప్పుడు గాని పెద్దలకు అనుమానం రాలేదు. ఒక బాలుడు తెగించి తండ్రికి జరిగేది చెప్పడంతో బండారం బయటపడింది.శిక్ష పడింది2016లో బాబా అకృత్యాలు బయటపడి బేడీలు పడ్డాయి. అప్పటి నుంచి జైలులో శిక్ష అనుభవిస్తున్న బాబాకు ఫిబ్రవరి 18న న్యాయమూర్తి మీర్ వజాహత్ 14 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించారు. అంతేకాదు భక్తి, విశ్వాసాలను జనం బలహీనతగా ఎంచి దొంగ వేషగాళ్లు పసిపిల్లలను కబళించడంపై న్యాయమూర్తి తీవ్రమైన ఆవేదన, ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి బాబాలు మొత్తం విశ్వాస ప్రపంచానికి విఘాతం కలిగిస్తారన్నారు. ఈ విషయంలో తల్లిదండ్రులు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన ఈ మొత్తం కేసు మీద ఒక లోతైన, సంకేతపూర్వకమైన కవిత రాశారు. ఎంత కదిలిపోతే ఇంత గాఢమైన కవిత వస్తుందనే ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. జస్టిస్ మీర్ వజాహత్ రాసిన కవితవిశ్వాసపు గుసగుసలు... భయవిహ్వల పెనుకేకలువెలుగు దుస్తులు ధరించి నిలిచిన వాడుకారు చీకటిలో దారి చూపుతానని మాటిచ్చాడుగుసగుసగా మంత్రాలు జపిస్తూ తన పవిత్ర హస్తాలతోఅంగలార్చే నేలలో విశ్వాసపు బీజాన్ని నాటాడుసాంత్వనకై వెదుకుతూ అభయానికై తపిస్తూవి΄్పారిన నేత్రాలతో చేరవచ్చిందొక పసితనంకానీ ఆ వెలుగుల మాటున చీకటి నీడలుగడ్డకట్టిన మంచులా వణికించిన గుసగుసలు‘భూతమంటే భయమేలే కానీ నాపై నమ్మకముంచునిన్ను బయటపడేసే తాళంచెవి నా దగ్గరుంది’పవిత్ర వేషంలో మాటలే సంకెళ్లుఇక గొంతు దాటని రోదన... విశ్వాసం గల్లంతుచెప్పినట్టు, తాకినట్టు, దయగా చూసినట్టుమాయామంత్రాల మత్తుగాలి... ఆశలను బూడిద చేస్తూకానరాని వలయాల్లో సుళ్లు తిరిగిన ఉత్త మాటలుఇక మిగిలింది కలవర పెట్టే పీడకలలుఏళ్లు గడిచిపోతాయి... పుళ్లు సలుపుతూనే ఉంటాయికాని ఆ నొప్పి వెనుక దాగి వెంటాడే ఆనాటి గుసగుసలుచీలికలైనదేదీ అతుకు పడనే లేదునిబద్ధమై ఉండాల్సిన ఆత్మ గాలివాటుగా పరిభ్రమిస్తూకాని నిజం తలెత్తుకుని నిలబడుతుందిజాతకాలు తలకిందులవుతాయిన్యాయానికి ఎదురు నిలవక నీడలు చెదిరిపోతాయిగాయాల ఆనవాళ్లు మాసిపోవేమోలే కానీభయం లేని వేకువలో భళ్లున తెల్లారుతుంది -
ఉగ్ర లింకులున్న ముగ్గురు ఉద్యోగుల తొలగింపు
జమ్మూ: ఉగ్ర మూకలతో సంబంధాలున్నట్లు తేలడంతో పోలీసు కానిస్టేబుల్ సహా ముగ్గురు ఉద్యోగులను జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా శనివారం విధుల నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వీరిలో పోలీస్ కానిస్టేబుల్ ఫిర్దౌస్ అహ్మద్ భట్, స్కూల్ టీచర్ అష్రాఫ్ భట్, అటవీ శాఖ ఉద్యోగి నిసార్ అహ్మద్ ఖాన్ ఉన్నారు. నిసార్ అహ్మద్ ఖాన్ 2000వ సంవత్సరంలో నేషనల్ కాన్ఫరెన్స్‌కు చెందిన మంత్రి హత్య కేసులో అరెస్టయ్యాడు. ఇతడికి హిజ్బుల్ ముజాహిదీన్‌తో సంబంధాలున్నట్లు తేలింది. అదేవిధంగా, 2005లో స్పెషల్ పోలీస్ అధికారి(ఎస్పీవో)గా నియమితుడై, 2011లో కానిస్టేబుల్‌గా ప్రమోషన్ పొందిన ఫిర్దౌస్కు ఉగ్రలింకులున్నట్లు తేలడంతో గతేడాది సస్పెండ్ చేశారు. ఆయుధాలు, డ్రగ్స్ సరఫరా చేసే ఇతడు ప్రస్తుతం కొట్ భల్వాల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అనంత్‌నాగ్ జిల్లాలో దాడులకు పథక రచన చేస్తుండగా మరో ఇద్దరు ఉగ్రవాదులతోపాటు పట్టుకున్నారు. రియాసికి చెందిన అష్రాఫ్ భట్ రెహ్బార్–ఇ–తలీం టీచర్‌గా 2008లో చేరాడు. ఇతడికి లష్కరేతోయిబాతో సంబంధాలున్నాయి. పాక్ కేంద్రంగా పనిచేసే మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది మహ్మద్ కాసిమ్ ఆదేశాల మేరకు ఉగ్ర కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇతడిని పోలీసులు 2022లో అరెస్ట్ చేశారు. -
‘పుల్వామా’ అమరులకు ప్రధాని మోదీ ఘన నివాళులు
న్యూఢిల్లీ/హల్దా్వనీ: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో 2019 ఫిబ్రవరి 14వ తేదీన జరిగిన ఉగ్రదాడిలో అమరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు ప్రధాని మోదీ శుక్రవారం నివాళులర్పించారు. దేశం పట్ల వారు అచంచలమైన విశ్వాసాన్ని కనబరిచారని కొనియాడారు. వారి త్యాగాలను భవిష్యత్తు తరాలు గుర్తుంచుకుంటాయని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. ఉగ్రవాదులను ఏరిపారేసేందుకు మోదీ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. పుల్వామా ఉగ్ర ఘటనలో అసువులు బాసిన జవాన్లకు ఆయన ఘనంగా నివాళులర్పించారు. వీరి త్యాగాల వల్లే మన దేశ సరిహద్దులు భద్రంగా ఉన్నాయన్నారు. మానవీయతకే అతిపెద్ద శత్రువైన ఉగ్రవాదంపై పోరుకు నేడు ప్రపంచమే ఏకమైందని శుక్రవారం హోం మంత్రి అమిత్ షా ‘ఎక్స్’లో తెలిపారు. పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌ని ఆత్మాహుతి దళ బాంబర్ వాహనంతో ఢీకొట్టడంతో 40 మంది జవాన్లు అసువులు బాసిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు ప్రతీకారంగా వైమానికదళం యుద్ధ విమానాలు పీవోకేలోని బాలాకోట్ ఉగ్ర స్థావరాన్ని నేలమట్టం చేశాయి. -
‘హోదా’ పునరుద్ధరణకిదే సమయం
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా త్వరలోనే వస్తుందని ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర హోదా పునరుద్ధరణకు సమయం ఆసన్నమైనట్లుగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. గురువారం ఆయన పీటీఐ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలను వెల్లడించారు. ‘కేంద్ర హోం మంత్రితో ఏడాది క్రితమే ఈ విషయం చర్చించాను. రాష్ట్ర హోదాను పునరుద్ధరించేందుకు ఇదే సరైన సమయం’అని ఆయన వివరించారు. ‘ఇటీవల హోం మంత్రి అమిత్ షాతో ఢిల్లీలో ఈ విషయమై చర్చ సానుకూలంగా జరిగింది. త్వరలోనే రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రకటన వెలువడుతుందని ఆశిస్తున్నా. ఈ అంశాన్ని చట్టపరమైన ముగింపు లభించాలని కోరుకుంటున్నా’అని అబ్దుల్లా చెప్పారు. సీఎంగా పగ్గాలు చేపట్టాక కేంద్రం, జమ్మూకశ్మీర్ మధ్య అంతరం తగ్గిందన్న విషయమై ఆయన స్పందిస్తూ..కొన్ని ఘటనల వల్లే దూరం పెరుగుతుందని చెప్పారు. ఇటీవల బారాముల్లా జిల్లా సొపోర్, కథువా జిల్లా బిల్లావర్‌లో జరిగిన రెండు హత్యలు నివారించదగినవని చెప్పారు. వీటిపై కేంద్రం పారదర్శకంగా దర్యాప్తు చేయించి, బాధ్యులను తగు విధంగా శిక్షించాలన్నారు. కశ్మీర్లో సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు చేస్తున్న ప్రయత్నాలకు ఇటువంటి పరిణామాలు అవరోధంగా మారుతాయని వ్యాఖ్యానించారు. భద్రత, పోలీసు విభాగాలు కేంద్ర పాలిత ప్రాంతంలో ఎన్నికైన ప్రభుత్వానికి జవాబుదారీ కానప్పటికీ, ఇటువంటివి చోటుచేసుకోకుండా చూడాల్సిన సమష్టి బాధ్యత ఉందని వివరించారు. ఈ విషయంపైనా హోం మంత్రితో మాట్లాడానని వెల్లడించారు. ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్లు అనుమానమున్న 26 ఏళ్ల వ్యక్తి పోలీసులు వేధిస్తున్నారంటూ ఈ నెల 4న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మరునాడే, సొపోర్‌లోని చెక్‌పోస్ట్ వద్ద ఆగకుండా వెళ్తున్న ట్రక్కు డ్రైవర్ ఆర్మీ జరిపిన కాల్పుల్లో చనిపోయాడు.100 రోజుల పాలనపై.. ‘ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నది వంద రోజులు కోసం కాదు, ఐదేళ్లూ పాలించడానికే. మా పని మమ్మల్ని చేయనివ్వండి. జమ్మూకశ్మీర్‌లో పాలన అంటే మామూలు విషయం కాదు. 2009–2015లోనూ తేలిగ్గా లేదు. ఇప్పుడూ అంతే. ఎవరికైనా ఈ ఇబ్బంది తప్పేది కాదు. ఇది కేంద్ర పాలిత ప్రాంతం. ఈ పరిస్థితుల్లో ఎలా పనిచేయాలో నేర్చుకుంటున్నాం. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకూ ఇది కొత్తే. ఆయనా నేర్చుకుంటున్నారు’అని ఒమర్ అబ్దుల్లా వివరించారు.కేంద్రం నుంచి ఒత్తిళ్లు.. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎదురయ్యే ఒత్తిళ్లపై ఆయన మాట్లాడుతూ..ఇక్కడ తమకు రాజకీయ పరమైన ఒత్తిళ్లకంటే వాతావరణ పరమైన సవాళ్లే ఎక్కువగా ఉన్నాయంటూ నవ్వారు. ఫిబ్రవరిలోనే ఎండలు మార్చి, ఏప్రిల్‌లో మాదిరిగా మండిపోతున్నాయి. రానున్న వేసవిలో నీటి కొరత తీవ్రం కానుందంటూ ఒమర్ అబ్దుల్లా ఆందోళన వ్యక్తం చేశారు. ‘వేడి ఎక్కువగా ఉంది. అయితే, అది కేంద్రం, లెఫ్టినెంట్ గవర్నర్ నుంచీ, ఎవరైనా అధికారీ నుంచీ కాదు. వేడి వాతావరణం కారణంగా ఈసారి నీటి సమస్య తలెత్తనుంది. ఇతరత్రా సమస్యల కంటే దీనిని తీర్చడమెలాగన్నదే మాకు అతిపెద్ద సవాల్ కానుంది’అని ఆయన వివరించారు. ఇటువంటి సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై అన్ని విభాగాల అధికారులతో సమావేశం కానున్నామన్నారు. వచ్చే రోజుల్లో మంచు, వాన కురిస్తే బాగుంటుందని ప్రార్థిస్తున్నానన్నారు. -
Ranji Trophy QFs: అంకిత్ శతకం.. అఖీబ్ నబీ ‘పాంచ్’ పటాకా
కోల్‌కతా: కెప్టెన్ అంకిత్ కుమార్ (206 బంతుల్లో 136; 21 ఫోర్లు) సెంచరీతో కదంతొక్కడంతో ముంబైతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో హరియాణా జట్టు దీటుగా బదులిస్తోంది. సహచరుల నుంచి పెద్దగా సహకారం లభించకపోయినా... అంకిత్ కుమార్ ఒంటరి పోరాటం చేశాడు. ఫలితంగా ఆదివారం ఆట ముగిసే సమయానికి హరియాణా తొలి ఇన్నింగ్స్‌లో 72 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసింది.లక్షయ్ దలాల్ (34), యశ్వర్ధన్ దలాల్ (36) ఫర్వాలేదనిపించారు. ముంబై బౌలర్లలో షమ్స్ ములానీ, తనుశ్ కొటియాన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 278/8తో ఆదివారం రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై చివరకు 88.2 ఓవర్లలో 315 పరుగులకు ఆలౌటైంది.తనుశ్ కొటియాన్ (173 బంతుల్లో 97; 13 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. హరియాణా బౌలర్లలో అన్షుల్ కంబోజ్, సుమిత్ కుమార్ చెరో 3 వికెట్లు తీశారు. చేతిలో 5 వికెట్లు ఉన్న హరియాణా ప్రస్తుతం... ముంబై తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 52 పరుగులు వెనుకబడి ఉంది. రోహిత్ శర్మ (22 బ్యాటింగ్), అనూజ్ (5 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.రాణించిన హర్ష్ దూబే, ఆదిత్య విదర్భ పేసర్ ఆదిత్య థాకరే (4/18) సత్తా చాటడంతో తమిళనాడుతో జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో విదర్భ జట్టు మంచి స్థితిలో నిలిచింది. నాగ్‌పూర్ వేదికగా జరుగుతున్న ఈ పోరులో ఆదివారం ఆట ముగిసే సమయానికి తమిళనాడు తొలి ఇన్నింగ్స్‌లో 46 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. 18 ఏళ్ల సిద్ధార్థ్ (89 బంతుల్లో 65; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశతకం సాధించగా... తక్కినవాళ్లు విఫలమయ్యారు.మొహమ్మద్ అలీ (4), నారాయణ్ జగదీశన్ (22), సాయి సుదర్శన్ (7), భూపతి కుమార్ (0), విజయ్ శంకర్ (22) విఫలమయ్యారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 264/6తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ... చివరకు 121.1 ఓవర్లలో 353 పరుగులకు ఆలౌటైంది. సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ (243 బంతుల్లో 122; 18 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ అనంతరం అవుట్ కాగా... హర్ష్ దూబే (69; 9 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు.తమిళనాడు బౌలర్లలో విజయ్ శంకర్, సోను యాదవ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. చేతిలో నాలుగు వికెట్లు ఉన్న తమిళనాడు జట్టు... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 194 పరుగులు వెనుకబడి ఉంది. కెపె్టన్ సాయి కిశోర్ (6 బ్యాటింగ్), ప్రదోశ్ రంజన్ పాల్ (18 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అఖీబ్ నబీ ‘పాంచ్’ పటాకా పేస్ బౌలర్ అఖీబ్ నబీ ఐదు వికెట్లతో మెరిపించడంతో... కేరళతో జరుగుతున్న రంజీ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్లో జమ్మూ కశ్మీర్ జట్టు మెరుగైన స్థితిలో నిలిచింది. పుణే వేదికగా జరుగుతున్న పోరులో ఆదివారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి కేరళ జట్టు 63 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. జలజ్ సక్సేనా (78 బంతుల్లో 67; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... సల్మాన్ నజీర్ (49 బ్యాటింగ్; 8 ఫోర్లు), నిదీశ్ (30) రాణించారు.ఇన్నింగ్స్ మూడో ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టిన అఖీబ్ను ఎదుర్కునేందుకు కేరళ బ్యాటర్లు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 228/8తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన జమ్మూకశీ్మర్ జట్టు చివరకు 95.1 ఓవర్లలో 280 పరుగులకు ఆలౌటైంది. యుధ్వీర్ సింగ్ (26), అఖీబ్ నబీ (32) కీలక పరుగులు జోడించారు. కేరళ బౌలర్లలో ని«దీశ్ 6 వికెట్లతో అదరగొట్టాడు. ప్రస్తుతం చేతిలో ఒక వికెట్ మాత్రమే ఉన్న కేరళ జట్టు... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 80 పరుగులు వెనుకబడి ఉంది. సల్మాన్ నజీర్ క్రీజులో ఉన్నాడు.మెరిసిన మనన్, జైమీత్బ్యాటర్లు రాణించడంతో సౌరాష్ట్రతో జరుగుతున్న జరుగుతున్న క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో గుజరాత్ భారీ స్కోరు దిశగా సాగుతోంది. రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న పోరులో ఆదివారం ఆట ముగిసే సమయానికి గుజరాత్ 95 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. మనన్ హింగ్రాజియా (219 బంతుల్లో 83; 8 ఫోర్లు, 1 సిక్స్), జైమీత్ పటేల్ (147 బంతుల్లో 88 బ్యాటింగ్; 9 ఫోర్లు) అర్ధశతకాలతో మెరిశారు.అంతకుముందు సౌరాష్ట్ర జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 216 పరుగులకు ఆలౌట్ కాగా... ప్రస్తుతం చేతిలో 6 వికెట్లు ఉన్న గుజరాత్ 44 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. జైమీత్తో పాటు వికెట్ కీపర్ ఉరి్వల్ పటేల్ (29 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. -
జమ్ము మిస్టరీ మరణాలపై కేంద్రం ప్రకటన
మిస్టరీగా మారిన జమ్ము కశ్మీర్ వరుస మరణాల(Mysterious Deaths)పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. అంతుచిక్కని అంటువ్యాధితో మరణిస్తున్నారనే వాదనను కేంద్రం తోసిపుచ్చింది. అయితే విషపూరిత పదార్థాల వల్లే వరుస మరణాలు సంభవించాయని, ఈ వ్యవహారంపై కుట్ర కోణం సహా అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోందని గురువారం ప్రకటించింది.రాజౌరీ(Rajouri) జిల్లాలోని ఓ గ్రామంలో నెలవ్యవధిలో 17 మంది వరుసగా ఒకే తరహా లక్షణాలతో జబ్బుపడి మరీ చనిపోయారు. చనిపోయిన వాళ్లలో చిన్నపిల్లలే(13) ఎక్కువగా ఉన్నారు. వాళ్ల మరణాలకు విషపూరిత పదార్థాలే కారణమని కేంద్రం నిర్ధారించింది. అయితే ఆ టాక్సిన్ ఏంటన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత రావాల్సి ఉందని పేర్కొంది. ఈ మేరకు కేంద్ర సైన్స్&టెక్నాలజీ మంత్రి(స్వతంత్ర) డాక్టర్ జితేంద్ర సింగ్ గురువారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు.‘‘లక్నోలోని సీఎస్ఐఆర్(CSIR) ల్యాబ్ నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో.. ఇది వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షనో కాదని తేలింది. మృతదేహాల నుంచి సేకరించిన నమునాల్లో విషపదార్థాలు ఉన్నట్లు తేలింది. అయితే ఆ విషపదార్థాలు ఏంటన్న దానిని నిర్ధారించుకునే పనిలో శాస్త్రవేత్తలు ఉన్నారు. వారం, పదిరోజుల్లో దీనిపై స్పష్టమైన ప్రకటన రానుంది’’ అని ఆయన తెలిపారు. ఇక అన్నికోణాల్లో ఈ అంశంపై దర్యాప్తు జరుగుతోంది. ఇందులో ఏదైనాకుట్ర ఉందని తేలితే.. బాధ్యులెవరైనా వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు అని అన్నారాయన. ఇదిలా ఉంటే.. ఐటీఆర్ (టాక్సికాలజీ రీసెర్చ్) నిర్వహించిన విశ్లేషణలోనూ ఇంతకు ముందు విషపూరిత పదార్థాలు ఉన్నట్లు గుర్తించింది.డిసెంబర్ 7 నుంచి జనవరి 19వ తేదీల మధ్యలో రాజౌరీలోని బధాల్ అనే కుగ్రామంలో ఈ వరుస మరణాలు(Serial Deaths) సంభవించాయి. జ్వరం, ఒళ్లు నొప్పులు, అలసట, విపరీతంగా చెమటలు పోయడం, స్పృహ కోల్పోవడం తదితర లక్షణాలతో ఆస్పత్రుల్లో చేరారు. పైగా మూడు కుటుంబాలకే చెందిన వ్యక్తులు వరుసగా జబ్బు చేసి మరణించడం గమనార్హం. పైగా ఆ కుటుంబాలకు చెందిన బంధువులు చుట్టుపక్కల నాలుగు గ్రామాల్లో విస్తరించి ఉన్నారు. అయితే అనూహ్యంగా వాళ్లలో కూడా కొందరు ఇదే రీతిలో జబ్బు పడ్డట్లు సమాచారం. అందులోనూ కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.దీంతో బుధవారం అక్కడి అధికారులు బధాల్ గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. సుమారు 40 మందిని ఐసోలేషన్‌కు తరలించారు. ఇక ప్రజల్లో ఆందోళన నెలకొన్న దృష్ట్యా.. బహిరంగా జనం గుమిగూడటంపై ఆంక్షలు అమలు చేస్తున్నారు. వరుస మరణాలతో జమ్ము కశ్మీర్లో హెల్త్ ఎమర్జెన్సీ(Health Emergency) ప్రకటిస్తారనే వదంతులు చక్కర్లు కొట్టాయి. అయితే వైద్య ఆరోగ్య అధికారులు మాత్రం వాటిని కొట్టిపారేశారు. ఆ అవసరం లేదని స్పష్టత ఇచ్చారు. నమునాల్లో న్యూరోటాక్సిన్స్ ఉన్నట్లు తేలడంతో.. కుట్ర కోణం తెర మీదకు వచ్చింది. నిజాలు నిగ్గుతేల్చేందుకు కశ్మీర్ పోలీస్ శాఖ సిట్‌ను ఏర్పాటుచేసింది. మంగళవారం బధాల్కు వెళ్లిన ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా.. త్వరలోనే అన్ని నిజాలు బయటకు వస్తాయని ప్రకటించారు. మరోవైపు.. వరుస మరణాల నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం.. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసేందుకు 11 మందితో కూడిన ప్రత్యేక బృందాన్ని కశ్మీర్‌కు పంపింది. -
కశ్మీర్లో ఎన్కౌంటర్ నేల కొరిగిన ఆంధ్రా జవాను
శ్రీనగర్/బంగారుపాళ్యం: జమ్మూకశ్మీర్‌లోని సొపోర్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఒక జవాను ప్రాణాలు కోల్పోయారు. ఆదివారం జలూర గుజ్జర్పటి ప్రాంతంలో ఉగ్రవాదుల స్థావరాన్ని జవాన్లు చుట్టుముట్టారు. ఈ సందర్భంగా పంగల కార్తీక్(32) అనే జవాను బుల్లెట్ గాయాలతో తీవ్రంగా గాయపడ్డారు. వైద్యం కోసం తరలిస్తుండగానే ఆయన తుదిశ్వాస విడిచారని అధికారులు సోమవారం తెలిపారు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టిన బలగాలు ముష్కరుల కోసం కూంబింగ్ కొనసాగిస్తున్నాయన్నారు. కార్తీక్ వీరమరణంపై శ్రీనగర్ కేంద్రంగా పనిచేసే ఆర్మీ విభాగం చినార్ కార్ప్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ‘విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించిన కార్తీక్ యొక్క అత్యున్నత త్యాగానికి చినార్ కార్ప్స్ సెల్యూట్ చేస్తోంది చినార్ వారియర్స్ కార్తీక్ అపారమైన పరాక్రమానికి, త్యాగానికి వందనం చేస్తోంది. ఆయన కుటుంబానికి సానుభూతి తెలుపుతోంది. వారికి సంఘీభావంగా నిలుస్తుంది’అని ‘ఎక్స్’లో తెలిపింది. కాగా, కార్తీక్‌ది ఏపీలోని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం ఎగువరాగిమాను పెంట గ్రామం. వరద మందడి, సెల్వి దంపతుల రెండో కుమారుడైన కార్తీక్ పదేళ్ల క్రితం ఆర్మీలో చేరారు. ఈయన చనిపోయిన విషయం తెలియడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మంగళవారం రాత్రికల్లా మృతదేహం గ్రామానికి రావచ్చని చెబుతున్నారు. -
అలా చేయడం బీజేపీతో కలిసిన్నట్టు కాదు: ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి పనిచేయాలనుకుంటున్నట్టు చెప్పారు ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా. కేంద్రంతో నిర్మాణాత్మక సంబంధాలను కొనసాగించడమే తమ లక్ష్యమని అన్నారు. ఇదే సమయంలో ఇలా చేయడం బీజేపీ పార్టీతో కలిసినట్టు కాదు అని క్లారిటీ ఇచ్చారు. కేంద్రంలో ఎవరు ఉన్నా తాము ఇలాగే ముందుకెళ్తామని స్పష్టం చేశారు.సీఎం ఒమర్ అబ్దుల్లా కన్వాల్‌లో జాతీయ చానెల్‌తో మాట్లాడారు. ఈ సందర్భంగా ఒమర్.. రాష్ట్ర ప్రయోజనాల కోసమే నేను ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాను కలిశాను. నేను కేంద్రం తీరు పట్ల సానుకూలంగా ఏమీ లేను. ప్రభుత్వంతో కలిసి పనిచేయడం అంటే వారు చేసే ప్రతిదాన్ని నేను అంగీకరిస్తున్నాను అని కాదు. బీజేపీ చేసే పనిని నేను అంగీకరిస్తున్నానని దీని అర్థం కాదు. జమ్ముకశ్మీర్‌కు సంబంధించిన అంశాలపై మాత్రమే కేంద్రంతో అనుకూలంగా ఉంటున్నాం. అంతమాత్రాన మేము బీజేపీకి మద్దతు ఇచ్చినట్టు కాదు.రాష్ట్రం పురోగతి సాధించాలంటే కేంద్రం అవసరం ఎంతో ముఖ్యం. అభివృద్ధి జరగడం, రాష్ట్ర హోదా పునరుద్ధరించడం మా ముందున్న లక్ష్యాలు. పార్టీలు ముఖ్యం కాదు.. కావాల్సింది అభివృద్దే. అవసరం లేని చోట నేను కేంద్రంతో పోరాటం ఎంచుకోవాలా? అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం పట్ల వ్యతిరేక ధోరణితో ఉంటే రాష్ట్రానికే నష్టం జరుగుతుంది అని చెప్పుకొచ్చారు.ఇదిలా ఉండగా.. గత సంవత్సరం నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ జమ్ము కశ్మీర్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఒమర్ అబ్దుల్లా ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. అనంతరం, రెండుసార్లు అమిత్ షాను కలిశారు. ఇటీవల సోనామార్గ్‌లో జరిగిన సొరంగం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీని కలిశారు. దీంతో, ఒమర్..బీజేపీతో సన్నిహితంగా ఉంటున్నారనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నేపథ్యంలో ఒమర్ తాజాగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. -
ప్రధాని మోదీపై ఒమర్ అబ్దుల్లా ప్రశంసలు
శ్రీనగర్:కశ్మీర్లో ఎన్నికలు నిర్వహిస్తామన్న హామీని నెరవేర్చినందుకు ప్రధాని మోదీ(PM Modi)పై కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా(Omar Abdulla) ప్రశంసలు కురిపించారు. సోమవారం జెడ్‌మోర్ టన్నెల్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో ఒమర్అబ్దుల్లా మాట్లాడారు.‘ఇక్కడ ఎన్నికలు నిర్వహిస్తామని మీరిచ్చిన హామీని నెరవేర్చారు.ప్రజలు వారికి కావాల్సిన వారిని ఎన్నుకున్నారు. దీంతో నేను సీఎం హోదాలో ఇక్కడ మాట్లాడుతున్నాను.దీంతో పాటు కశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇస్తానన్న హామీని కూడా మీరిచ్చారు. త్వరలో ఈ హామీని కూడా మీరు నెరవేరుస్తారని నేను ఆశిస్తున్నాను’అని ఒమర్ అబ్దుల్లా ఆశాభావం వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్‌లోని గాందర్బల్ జిల్లాలో నిర్మించిన జడ్-మోడ్ సొరంగాన్ని భారత ప్రధాని మోదీ సోమవారం ప్రారంభించారు. శ్రీనగర్- లేహ్ జాతీయ రహదారిపై 2,400 కోట్ల రూపాయలతో ఈ టన్నెల్‌ను నిర్మించారు. ఇది 6.4 కిలో మీటర్ల పొడవుండే ఈ సొరంగంతో ఏడాదిలో ఏ సీజన్లోనైనా లద్దాఖ్‌ను రోడ్డు మార్గం ద్వారా ఈజీగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక, 2015లో ప్రారంభమైన నిర్మాణ పనులు గతేడాది పూర్తయ్యాయి. -
Jammu Kashmir: మాట ఇస్తే నిలబెట్టుకుంటా!
సోనామార్గ్: ‘‘మోదీ మాటిచ్చాడంటే తప్పడు. నెరవేర్చి తీరతాడు. అన్ని పనులనూ సరైన సమయంలో సక్రమంగా పూర్తి చేసి చూపిస్తా’’ అని ప్రధాని నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. జమ్మూకశ్మీర్‌లో వ్యూహాత్మకంగా కీలకమైన 6.5 కిలోమీటర్ల పొడవైన నూతన సొరంగాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. నిర్మాణ దశలో జెడ్–మోర్హ్ టన్నెల్‌గా పిలిచిన ఈ సొరంగానికి సోనామార్గ్గా నామకరణం చేశారు. జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మోదీ ఇక్కడికి రావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. ‘‘మోదీ మాటిస్తే నెరవేరుస్తాడు. కేంద్రంలో మా ప్రభుత్వం తొలిసారి కొలువుతీరాకే అత్యంత సంక్లిష్టమైన ఈ సొరంగ పనులు మొదలయ్యాయి. మేం మొదలు పెట్టిన పనులను మేమే పూర్తి చేశాం. మూడోసారి అధికారంలోకి రాగానే సొరంగం నిర్మాణం పూర్తి చేశాం. గతంలో చలికాలంలో 3 నుంచి 4 నెలలు భారీ మంచు, కొండచరియలు విరిగిపడటం, హిమపాతం వంటి ప్రతికూల వాతావరణంతో ఈ ప్రాంతం గుండా రాకపోకలకు తీవ్ర ఇబ్బందులుండేవి. ఇప్పుడు ఏ సీజన్లోనైనా శ్రీనగర్, సోనామార్గ్, లేహ్ మధ్య రాకపోకలు సాగించవచ్చు. లద్దాఖ్ ప్రాంతానికి ఇకపై ఎలాంటి ప్రయాణ ఇబ్బందులు లేకుండా సాఫీగా చేరుకోవచ్చు’’ అని ప్రధాని చెప్పుకొచ్చారు. కశ్మీర్లో మార్పు తెచ్చేందుకు నిరంతరం కృషి చేస్తున్నాం ‘‘ మా ప్రభుత్వ కృషి వల్లే కశ్మీర్ లోయలో పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి. ఆంక్షల చట్రంలో నలిగిన శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో ఇప్పుడు ఎంతో మార్పులు చూస్తున్నాం. ఇప్పుడు ఐస్‌క్రీమ్ కోసం కుటుంబాలు రాత్రిపూట కూడా లాల్‌చౌక్‌కు వెళ్తున్నాయి. కళాకారులైన నా స్నేహితులు ఇక్కడి పోలో వ్యూ పాయింట్‌ను నేడు ముఖ్య వ్యాపార కూడలిగా మార్చేశారు. శ్రీనగర్‌లో జనం ఎంచక్కా కుటుంబంతో కలిసి సినిమాలకూ వెళ్లగలుగుతున్నారు. ఇంతటి పెను మార్పులు గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ జరగలేదు. కొన్ని నెలల క్రితం శ్రీనగర్‌లో ఏకంగా అంతర్జాతీయ మారథాన్ జరిగింది. ఆరోజు మారథాన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సైతం పాల్గొన్నారు. ఆ వీడియో వైరల్ అయింది. ఢిల్లీలో కలిసినప్పుడు ఆయన్ను మనస్ఫూర్తిగా అభినందించా’’ అని అన్నారు. నూతన శకమిది ‘‘ఇది జమ్మూకశ్మీర్‌కు నిజంగా నూతన శకం. జమ్మూకశ్మీర్ భారత్‌కు కిరీటం. అదెప్పుడూ మరింత అందంగా, సుసంపన్నంగా ఉండాలి. జమ్మూకశ్మీర్‌లో శాంతియుత వాతావరణం వెల్లివిరుస్తోంది. అదిప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. కశ్మీర్ తన సొంత అభివృద్ధి అధ్యయనాన్ని లిఖించుకుంటోంది’’ అని అన్నారు. టన్నెల్‌ను ప్రారంభించాక మోదీ ఓపెన్‌టాప్ వాహనంలో సొరంగంలోకి వెళ్లి పరిశీలించారు. అక్కడి నిర్మాణ కార్మికులతో మాట్లాడి వారిని అభినందించారు. టన్నెల్ నిర్మాణ సమయంలో గత ఏడాది అక్టోబర్ 20న కార్మికులపై ఉగ్రదాడి సందర్భంగా చనిపోయిన ఏడుగురికి మోదీ నివాళులరి్పంచారు. సున్నా డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతను సైతం లెక్కచేయకుండా టన్నెల్ ప్రారంభోత్సవానికి సోనామార్గ్, గగన్‌గిర్, గుండ్, కంగన్ గ్రామాల నుంచి వేలాది మంది స్థానికులు రావడం విశేషం. దిల్, దిల్లీ మధ్య దూరం చెరిపే నేత మోదీపై ఒమర్ పొగడ్తలు కార్యక్రమంలో పాల్గొన్న జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మోదీనుద్దేశించి మాట్లాడుతూ పొగడ్తల్లో ముంచెత్తారు. ‘‘ దిల్‌కు, దిల్లీకి మధ్య దూరాల ను చెరిపేసే నేత మీరు. ఇచ్చిన వాగ్దానాలను నెరవేరుస్తున్నారు. గత 15రోజుల్లోనే మీరు పాల్గొంటున్న రెండో కార్యక్రమం ఇది. జనవరి ఆరున జమ్మూ కోసం ప్రత్యేకంగా రైల్వేడివిజన్ ఏర్పాటుచేశారు. జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి నాలుగు నెలల్లోనే ఆ హామీ నెరవేర్చారు. ఇక ఈ ప్రాంతానికి మళ్లీ రాష్ట్రహోదా ఇస్తామన్న హామీనీ త్వరలో నెరవేరుస్తారని బలంగా విశ్వసిస్తున్నాం. సోనామార్గ్ టన్నెల్ వంటి ప్రాజెక్టుల పూర్తితో జమ్మూకశ్మీర్‌కు ఢిల్లీకి మధ్య దూరాలు తగ్గి అనుసంధానత పెరుగుతోంది’’ అని ఒమర్ అన్నారు. రూ.2,716 కోట్ల వ్యయంతో.. రూ.2,716 కోట్ల వ్యయంతో సముద్రమట్టానికి 8,650 అడుగుల ఎత్తులో ఈ సొరంగాన్ని నిర్మించారు. గందేర్బల్ జిల్లాలో శ్రీనగర్–లేహ్ జాతీయ రహదారిపై గగన్‌గిర్, సోనామార్గ్ గ్రామాల మధ్యలో ఒకేసారి ఇరువైపుల వాహనాలు వెళ్లేలా టన్నెల్ నిర్మాణం పూర్తిచేశారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు సొరంగంలో చిక్కుకుపోతే బయట పడేందుకు వీలుగా సొరంగానికి సమాంతరంగా 7.5 మీటర్ల వెడల్పుల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ద్వారాలను నిర్మించారు. టన్నెల్ ప్రారంభ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం ఒమర్, జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సైతం పాల్గొన్నారు. #WATCH | Jammu & Kashmir: Prime Minister Narendra Modi inaugurates the Z-Morh tunnel in Sonamarg today. CM Omar Abdullah and LG Manoj Sinha, Union Minister Nitin Gadkari are also present. (Source: DD/ANI)#KashmirOnTheRise pic.twitter.com/GF7rwZaVn1— ANI (@ANI) January 13, 2025 #WATCH | Sonamarg, Jammu & Kashmir: After inaugurating the Z-Morh tunnel, Prime Minister Narendra Modi inspects the tunnel. CM Omar Abdullah, LG Manoj Sinha and Union Minister Nitin Gadkari are also present. (Source: DD/ANI) #KashmirOnTheRise pic.twitter.com/FbOP7COfzm— ANI (@ANI) January 13, 2025 -
ఆర్టికల్ రద్దుతో సంబంధమే లేదు.. మోదీకి ఒమర్ అబ్దుల్లా ఝలక్
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ప్రధాని మోదీ పర్యటన వేళ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. జమ్ము కశ్మీర్లో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆర్టికల్-370 రద్దుతో సంబంధమే లేదన్నారు. 370 రద్దు కంటే ముందే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు ఆయన చెప్పుకొచ్చారు. అభివృద్ధికి, ఆర్టికల్ రద్దుకు లింక్ పెట్టొద్దు అంటూ ఘాటు విమర్శలు చేశారు.తాజాగా సీఎం ఒమర్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడుతూ..‘జమ్ము కశ్మీర్‌లోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ఆర్టికల్ 370తో ముడిపెట్టవద్దు. దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. ఈ ప్రాజెక్టులు ఏవీ ఆగస్టు 5, 2019 తర్వాత ప్రారంభించినవి కావు. అంతకంటే ముందుగానే ఇవి ప్రణాళిక చేయబడ్డాయి. ఆర్టికల్ 370 రద్దుతో సంబంధం లేకుండా జరిగిన అభివృద్ధి ఇది. ఈ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అల్లర్లు జరిగిన ప్రాంతాల్లో లేవు అని చెప్పుకొచ్చారు.ఇదే సమయంలో జమ్ము కశ్మీర్లో 2008, 2010, 2016లో ప్రముఖంగా కనిపించిన రాళ్ల దాడులు, నిరసనలు వంటి కార్యకలాపాలు ఇప్పుడు గణనీయంగా తగ్గాయి. దీన్ని నేను అంగీకరిస్తున్నాను. అయితే, ఇది కొంతవరకు ప్రభుత్వం తీసుకున్న కఠిన నిర్ణయాల కారణంగా ఇది జరిగింది. సీఐడీ విభాగాన్ని ఆయుధంగా మార్చడం, ఉద్యోగులను తొలగించడం, వ్యక్తులను బ్లాక్‌లిస్ట్ చేయడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. మార్పును ప్రజలు అంగీకరించాలి. వారు మనస్పూర్తిగా అంగీకరిస్తే అది ప్రశంసనీయం అంటూ కామెంట్స్ చేశారు. దీంతో, ముఖ్యమంత్రి ఒమర్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. "Let's not link the infrastructure projects in J&K to the politics surrounding Article 370. Most of these projects are not located in any areas that saw activities like stone-pelting and protests": CM Omar Abdullah@OmarAbdullah pic.twitter.com/gbODYR3KdH— Rahul Kanwal (@rahulkanwal) January 13, 2025ఇదిలా ఉండగా.. జమ్ముకశ్మీర్‌లోని గాందర్బల్ జిల్లాలో నిర్మించిన జడ్-మోడ్ సొరంగాన్ని భారత ప్రధాని మోదీ నేడు ప్రారంభించనున్నారు. శ్రీనగర్- లేహ్ జాతీయ రహదారిపై 2,400 కోట్ల రూపాయలతో ఈ టన్నెల్‌ను నిర్మించారు. ఇది 6.4 కిలో మీటర్ల పొడవుండే ఈ సొరంగంతో ఏడాదిలో ఏ సీజన్లోనైనా లద్దాఖ్‌ను రోడ్డు మార్గం ద్వారా ఈజీగా చేరుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక, 2015లో ప్రారంభమైన నిర్మాణ పనులు గతేడాది పూర్తి అయ్యాయి. -
లోయలో పడ్డ ఆర్మీ వాహనం.. నలుగురు సైనికులు దుర్మరణం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ ట్రక్కు లోయలో పడిపోవడంతో నలుగురు సైనికులు మృతి చెందారు. ఇద్దరు సైనికులు ప్రమాదం జరిగిన కాసేపటికే చికిత్స పొందుతూ కన్నుమూయగా, చికిత్స పొందుతున్న మరో ముగ్గురిలో ఇద్దరు చనిపోయారు. దాంతో చనిపోయిన సైనికుల సంఖ్య 4కు చేరింది. ఈ విషయాన్ని ఆర్మీ అధికారులు ధృవీకరించారు. శనివారం ఉదయం బాందీపుర(Bandipore) జిల్లా సదర్ కూట్ పయెన్ ప్రాంతంలో సైనికులతో ఓ ట్రక్కు వెళ్తోంది. అయితే ఒక్కసారిగా అదుపు తప్పి దొర్లుకుంటూ పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఐదుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వాళ్లను ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించి మొత్తంగా నలుగురు సైనికులు చనిపోయినట్లు సీనియర్ ఆర్మీ అధికారులు స్పష్టం చేశారు.#WATCH | Bandipora, Jammu and Kashmir: Dr Masarat Iqbal Wani, Medical Superintendent of District Hospital Bandipora says, "5 injured were brought here, out of which 2 were brought dead, 3 injured who were in critical condition have been referred to Srinagar for further… https://t.co/8RBwynIEvt pic.twitter.com/UVYr8vTiVk— ANI (@ANI) January 4, 2025ఇదిలా ఉంటే.. జమ్ము కశ్మీర్లో ఈ తరహా ప్రమాదాలు కొత్తేం కాదు. గతేడాది డిసెంబర్లో ఫూంచ్ జిల్లాలో ఇదే తరహాలో ఆర్మీ వాహనం పడిపోయి ఐదుగురు సైనికులు మృతి చెందారు. అంతకు ముందు.. నవంబర్ నెల 4వ తేదీన రాజౌరీ(Rajaouri)లో జరిగిన యాక్సిడెంట్లో ఓ జవాన్ చనిపోయాడు. అదే నెల 2వ తేదీన ఓ కారు రెయిసి జిల్లాలో లోయలో పడిపోయి నెలల పసికందు, తల్లి సహా ముగ్గురు మృతిచెందారు. -
ఇంట్లో చెలరేగిన మంటలు.. ఆరుగురి సజీవదహనం
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఘోర అగ్నిప్రమాద ఘటన చోటుచేసుకుంది. అగ్నిప్రమాదం కారణంగా ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.వివరాల ప్రకారం.. కథువాలోని ఓ ఇంట్లో బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి. మంటల్లో చిక్కుకుని ఇంట్లో నిద్రిస్తున్న ఆరుగురు సజీవదహనమయ్యారు. ఈ ప్రమాదం కారణంగా మరో నలుగురు తీవ్రంగా గాయపడటంతో ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
Omar Abdullah: బీజేపీకి దగ్గరవుతున్నారా?
రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరనేది బాగా వాడుకలో ఉన్న నానుడి. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్పరెన్స్ అగ్రనేత ఒమర్ అబ్దుల్లా తాజా ప్రకటనలు ఇదే తరహాలో ఉన్నాయి. కాషాయ పార్టీకి ఆయన దగ్గరవుతున్న సూచనలు కన్పిస్తున్నాయి. ఈవీఎంల ట్యాంపరింగ్ వ్యవహారంపై ఆయన చేసిన వాఖ్యలు బీజేపీతో సామీప్యతను సంతరించుకోవడంతో ఈ వాదనకు బలం చేకూరుతోంది. ఇదంతా కాకతాళీయంగా జరిగింది కాదన్న అభిప్రాయాలు ప్రత్యర్థుల నుంచి వ్యక్తమవుతున్నాయి.మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఈవీఎంల ట్యాంపరింగ్‌పై కాంగ్రెస్ చేసిన ఆరోపణలకు బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కౌంటర్ ఇచ్చారు. ఆయన మాట్లాడిన తర్వాత రోజే ఒమర్ అబ్దుల్లా కూడా మాట్లాడారు. అయితే స్వపక్షమైన కాంగ్రెస్ పార్టీని తప్పుబడుతూ ఆయన వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఎన్నికల్లో విజయాలను తమ ఖాతాలో వేసుకుని, అపజయాలను మాత్రం ఈవీఎంలపైకి నెట్టేయడం సరికాదన్న చందంగా ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. సరిగ్గా అమిత్ షా ఏదైతే అన్నారో అలాగే కశ్మీర్ సీఎం స్పందించారు. ఇప్పుడు ఇదే రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.రాహుల్ గాంధీకి అమిత్ షా కౌంటర్లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ 100 ఎంపీ సీట్లు గెలిచినప్పుడు సంబరాలు చేసుకున్నారని, ఈ దశాబ్దంలోనే ఉత్తమ పనితీరు కనబరిచామని పొంగిపోయారని రాహుల్ గాంధీని ఉద్దేశించి అమిత్ షా కమెంట్ చేశారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో తాను గెలిచాను కాబట్టి ఈవీఎంలు బాగా పనిచేశాయని రాహుల్ గాంధీ నమ్ముతున్నారు. జార్కండ్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో ఈవీఎంలు కరెక్ట్‌గానే పనిచేస్తున్నాయని అనుకున్నారు. మహారాష్ట్రలో ప్రజలు ఓడించేసరికి ఈవీఎంలు వారికి చెడుగా కన్పిస్తున్నాయి. పని చేతగానివాడు పనిముట్లను నిందించిట్టుగా రాహుల్ గాంధీ వ్యవహారం ఉంద’ని అమిత్ షా అన్నారు.కాంగ్రెస్‌ను తప్పుబట్టిన ఒమర్ అబ్దుల్లామరుసటి రోజు ఒమర్ అబ్దుల్లా కూడా ఇదే లైన్లో మాట్లాడారు. గెలిచినప్పుడు ఒకలా, ఓడిపోయినప్పుడు మరో విధంగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడడం తగదని హితవు పలికారు. ఈవీఎంలతోనే లోక్‌సభ ఎన్నికల్లో 100 స్థానాలు గెలిచిన కాంగ్రెస్ మహారాష్ట్ర ఫలితాల తర్వాత మాట మార్చడాన్ని ఆయన తప్పుబట్టారు. ప్రజాతీర్పుపై విశ్వాసం లేనట్టుగా మాట్లాడం మానుకోవాలని, ఓటమికి ఈవీఎంలను బాధ్యులు చేయడం కరెక్ట్ కాదన్నారు. ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యలకు కాంగ్రెస్ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. సీఎం అయ్యాక ఆయన ఎందుకు యూటర్న్ తీసుకోవాల్సి వచ్చిందో అంటూ ప్రశ్నించింది.చదవండి: EVMలపై పోరు.. ధోరణి మారింది ఎందుకో?బీజేపీపై సీఎం అబ్దుల్లా ప్రశంసలుఅయితే ఇక్కడితో ఆగిపోకుండా బీజేపీపై ప్రశంసలు కురిపించారు కశ్మీర్ సీఎం అబ్దుల్లా. సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ ఎంతో మంచిదని, కొత్త పార్లమెంటు భవనం నిర్మించడం అద్భుతమైన ఆలోచన అంటూ కాషాయపార్టీని పొగిడారు. ఈవీఎంల ట్యాంపరింగ్ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీని తప్పుబడుతూ బీజేపీ అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారన్న వాదనను ఒమర్ అబ్దుల్లా కొట్టిపారేశారు. జమ్మూకశ్మీర్‌కు మంచి చేయాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నానని, రాష్ట్ర ప్రయోజనాలే తనకు ముఖ్యమని చెప్పుకొచ్చారు. కాగా, జమ్మూకశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్దరణ కోసం అమిత్‌షాను బుధవారం ఢిల్లీలో సీఎం అబ్దుల్లా కలవనున్నారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో వీరిద్దరి భేటీపై ఆసక్తి నెలకొంది. -
కసబ్ కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది: సుప్రీం కోర్టు
న్యూఢిల్లీ: వేర్పాటువాది యాసిన్‌మాలిక్ కేసు విచారణ సందర్భంగా.. గురువారం అత్యున్నత న్యాయస్థానం ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 26/11 ముంబై దాడుల ఉగ్రవాది అజ్మల్ కసబ్ కేసు విచారణ కూడా న్యాయంగానే జరిగింది కదా అని పేర్కొంది. యాసిన్ మాలిక్ వ్యక్తిగతంగా తమ ఎదుటు హాజరు కావాలని ఆదేశించిన జమ్మూకశ్మీర్ కోర్టు ఆదేశాలను.. సీబీఐ సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. దీనిపై ఇవాళ విచారణ సందర్భంగా.. సుప్రీం పై వ్యాఖ్యలు చేసింది.ఉగ్రవాదులకు నిధులు సమకూర్చిన కేసులో తీహార్ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. అయితే.. 1990లో శ్రీనగర్ శివారులో నలుగురు ఎయిర్‌ఫోర్స్ సిబ్బంది హత్య కేసు, 1989లో రుబయా సయీద్ (అప్పటి హోంమంత్రి ముఫ్తీ మహమ్మద్ సయీద్) కిడ్నాప్ కేసులో యాసిన్ మాలిక్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. ఈ రెండు కేసులకు సంబంధించిన విచారణ నిమిత్తం.. జమ్ము శ్మీర్ కోర్టు వ్యక్తిగతంగా అతన్ని హాజరుపర్చాలని ఆదేశించింది. అందకు తాను సిద్ధంగా ఉన్నట్లు మాలిక్ సమ్మతి తెలియజేశాడు. అయితే..ప్రస్తుత పరిస్థితుల్లో అతడు జమ్మూకశ్మీర్ వెళ్లడం మంచిది కాదని, అది జమ్ములో అలజడి సృష్టించే అవకాశం ఉందని సీబీఐ తరఫున న్యాయవాదులు సుప్రీం కోర్టులో అభ్యంతరం వ్యక్తం చేశారు.సీబీఐ తరఫున తుషార్ మెహతా.. మాలిక్‌ను జమ్ము కశ్మీర్ తీసుకెళ్లాలని అనుకోవడం లేదు అని వాదించారు. అయితే.. జమ్ములో ఇంటర్నెట్ కనెక్ట్ సమస్య ఉందని గుర్తు చేస్తూ.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అతన్ని(మాలిక్) క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉండదు కదా? అని జస్టిస్ ఏఎస్ ఒకా ప్రశ్నించారు. అయితే అతని విచారణను ఢిల్లీకే మార్చాలని మెహతా కోరారు. అతనొక వేర్పాటువాది అని, వ్యక్తిగతంగా హాజరైతే జిమ్మిక్కులు ప్రదర్శించే అవకాశం ఉందని వాదించారు. ఈ వ్యాఖ్యలపై జస్టిస్ ఒకా అభ్యంతరం వ్యక్తం చేశారు. మన దేశంలో కసబ్ లాంటి ఉగ్రవాదికి కూడా విచారణ న్యాయంగానే అందింది కదా అని అన్నారు. అయితే.. జైల్లోనే కోర్టు ఏర్పాటు చేసి విచారణ జరపాలని, దానికి న్యాయమూర్తిని ఎలా ఎంపిక చేస్తారో పరిశీలిస్తామని బెంచ్ పేర్కొంది. అలాగే.. అయితే ఈ విచారణ కోసం హాజరయ్యే సాక్షుల భద్రతకు సంబంధించి కేంద్రాన్ని వివరణ కోరుతూ తదుపరి విచారణ గురువారానికి వాయిదా వేసింది. -
కశ్మీర్ అసెంబ్లీలో ఆఖరి రోజూ ఆగని ఆందోళనలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఆఖరి రోజైన శుక్రవారం కూడా ఆందోళనల మధ్యే కొనసాగింది. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరుగుతున్న చర్చకు బీజేపీ సభ్యులు అడ్డుపడ్డారు. కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని పునరుద్ధరించాలంటూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవాలంటూ నినాదాలతో హోరెత్తించారు. గొడవకు దిగిన ఎమ్మెల్యేలను స్పీకర్ ఆదేశాలతో మార్షల్స్ బలవంతంగా బయటకు తీసుకెళ్లారు. లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు సమాధానమిస్తూ శుక్రవారం సీఎం ఒమర్ అబ్దుల్లా.. జమ్మూకశ్మీర్‌కు పూర్తి రాష్ట్ర హోదా పునరుద్ధరణ ప్రక్రియను కేంద్రం త్వరలోనే ప్రారంభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కేంద్ర పాలిత ప్రాంత హోదాతో పరిమిత అధికారాలతో అభివృద్ధిని, శాంతిభద్రతలను సాధించలేమని చెప్పారు. సమావేశాల సందర్భంగా అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన బీజేపీ శాసనసభా పక్షం నేత సునీల్ శర్మతోపాటు ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలపై ఎన్సీ ఎమ్మెల్యే సజ్జాద్ షహీన్, మరొకరు హక్కుల తీర్మానం ప్రవేశపెట్టారు. వీటిని పరిశీలించి చర్యలు తీసుకుంటానని స్పీకర్ రథేర్ చెప్పారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. -
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీలో మరోసారి ఉద్రిక్తత
-
జమ్ము కశ్మీర్ శ్రీనగర్‌లో భారీ ఉగ్రదాడి
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో మళ్లీ ఉగ్రదాడి జరిగింది. ఆదివారం శ్రీనగర్ సండే మార్కెట్లోని టూరిస్ట్ సెంటర్ ఆఫీస్(TRC)పై ఉగ్రవాదులు గ్రనేడ్లు విసిరారు. ఈ దాడిలో పది మందికి(12 మంది) పైగా తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది. శ్రీ నగర్ నగరానికి గుండెకాయగా చెప్పుకునే లాల్ చౌక్‌ను ఆనుకున్న రోడ్డులోనే సండే మార్కెట్ పేరిట వారాంతపు సంత నిర్వహిస్తారు. మార్కెట్ కారణంగా టీఆర్సీ గ్రౌండ్లో విపరీతమైన జన రద్దీ నెలకొంది. ఇదే అదనుగా భావించిన ఉగ్రవాదులు మైదానంలోకి గ్రనేడ్లు విసిరినట్లు స్థానిక మీడియా చానెల్స్ కథనాలు ఇస్తున్నాయి. దాడి జరిగిన వెంటనే పారామిలిటరీ బలగాలు ఆ ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. క్షతగాత్రుల్ని ఆస్పత్రులకు చేర్చాయి. ప్రస్తుతం అక్కడ ఉగ్రవాదుల కోసం గాలింపు కొనసాగుతోంది. లష్కరే తాయిబా గ్రూప్‌కు చెందిన టాప్ కమాండర్ ఒకరిని.. ఖన్యార్ ప్రాంతంలో భారత సైన్యం మట్టుపెట్టింది. ఆ మరుసటి రోజే ఈ దాడి జరగడం గమనార్హం. #BREAKINGGrenade attack in Srinagar's busy Sunday market injures 5 civiliansIncident occurred near the heavily-guarded Tourist Reception Centre (TRC)Comes a day after security forces neutralized top Lashkar-e-Taiba commander in downtown #Srinagar. Security forces on site… pic.twitter.com/iaWl1NJNL9— Nabila Jamal (@nabilajamal_) November 3, 2024ఇదిలా ఉంటే.. ఈ మధ్యకాలంలో అక్కడ వరుసగా ఉగ్రవాద కదలికలు పెరిగాయి. గత వారం రోజులుగా మూడు ఎన్కౌంటర్లు జరిగాయి. అంతకు ముందు నుంచే సైనిక వాహనాలపైనా దాడులు జరుగుతున్నాయి. దీంతో భద్రతా బలగాలు కూంబింగ్ కట్టుదిట్టం చేశాయి. ఒకవైపు సైనికులు.. మరోవైపు అమాయక ప్రజలు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో వరుస ఉగ్రదాడి ఘటనలపై కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆందోళన వ్యక్తం చేశారు. జమ్ము కశ్మీర్లో టెర్రరిస్టుల దాడులు దురదృష్టకరమని , సరిహద్దుల్లో ఎలాంటి భద్రతా లోపం లేదని.. ఉగ్రవాదులకు భద్రతా దళాలు తగిన సమాధానం ఇస్తున్నాయని చెప్పారు.ఇదీ చదవండి: కశ్మీర్ ఓటమి.. కమలం పార్టీ కీలక నిర్ణయం -
బీజేపీ కీలక నిర్ణయం.. పార్టీ జమ్ముకశ్మీర్ చీఫ్ మార్పు
జమ్ము: జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు ముగియగానే అక్కడి పార్టీ నాయకత్వం విషయంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది.పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిని మార్చింది. జమ్ముకశ్మీర్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా సత్‌శర్మను నియమించింది. ఇప్పటివరకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగిన రవీందర్‌రైనాను పార్టీ జాతీయ కార్యవర్గంలోకి తీసుకున్నారు.ఈ మేరకు బీజేపీ నేషనల్ జనరల్ సెక్రటరీ అరుణ్‌సింగ్ దివారం(నవంబర్ 3)ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం తక్షణం అమలులోకి వస్తుందని ఉత్వర్వుల్లో పేర్కొన్నారు.సత్‌శర్మను సెప్టెంబర్‌లోనే రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా రెండు నెలల్లోనే అధ్యకక్షుడిని చేయడం గమనార్హం. ఇదీ చదవండి: 10 రోజుల్లో యోగి రాజీనామా చేయకుంటే.. -
జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పులు.. రెండు వారాల్లో నాలుగోసారి..
శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకుంది. వలస కార్మికులే టార్గెట్ ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. ఈ క్రమంలో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడటంతో వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.జమ్ముకశ్మీర్‌లోని బుద్గామ్‌లో శుక్రవారం సాయంత్రం ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు జరపడంతో ఇద్దరు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో, గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. దాడిలో గాయపడిన ఇద్దరిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు వలస కార్మికులు ఉస్మాన్ మాలిక్ (20), సోఫియాన్ (25)గా గుర్తించారు. అయితే, వారిద్దరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు.ఇదిలా ఉండగా.. గత రెండు వారాల్లో కశ్మీర్ లోయలో వలస కార్మికులపై నాలుగో సారి దాడి జరిగింది. అక్టోబరు 20న గందర్బల్ జిల్లాలోని సొరంగం నిర్మాణ స్థలంలో ఉగ్రవాదులు దాడులు చేశారు. ఉగ్రదాడిలో స్థానిక వైద్యుడు, బీహార్‌కు చెందిన ఇద్దరు కార్మికులతో సహా ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. -
ఉగ్రవాదంపై రాజీలేని పోరు: అమిత్ షా
న్యూఢిల్లీ: జమ్మూ కశ్మీర్, ఈశాన్య భారతం, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో సాపేక్షంగా శాంతిని నెలకొల్పినట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఉగ్రవాదం, చొరబాట్లు, మతపరమైన ఉద్రిక్తతలను సృష్టించే కుట్రలపై పోరాటం కొనసాగుతుందన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సోమవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పోలీసు అమరుల త్యాగం వృథా కాదన్నారు. ‘‘స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి దేశ భద్రత కోసం 36,438 మంది పోలీసులు ప్రాణత్యాగం చేశారు. గతేడాదే 216 మంది ప్రాణాలు కోల్పోయారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు. వారి త్యాగానికి దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుందన్నారు. కొత్త నేర న్యాయ చట్టాలతో భారత న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునికంగా మారిందన్నారు. పోలీసు సిబ్బంది, కుటుంబీకులు ఇక ఏ ఆయుష్మాన్ ఆసుపత్రిలోనైనా ఉచిత చికిత్స పొందవచ్చని హోం మంత్రి తెలిపారు. ‘‘సీఏపీఎఫ్ సిబ్బంది కోసం 13 వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతులిచ్చాం. వచ్చే మార్చి నాటికి 11,276 ఇళ్లు సిద్ధమవుతాయి’’ అని వెల్లడించారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు సిబ్బందికి ఆయన నివాళులర్పించారు. -
పాక్ సర్కార్‌కు ఫరూఖ్ అబ్దుల్లా వార్నింగ్
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని గందేర్బల్లోని గుండ్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడిని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. భారతదేశంలో ఉగ్రవాదం వ్యాప్తి చేయటాన్ని పాకిస్తాన్ ఆపేయాలని అన్నారు. భారత్‌తో సత్సంబంధాలు కావాలంటే పాకిస్తాన్ ఉగ్రవాద చర్యలకు స్వస్తి చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. జమ్ము కశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్‌గా మారదని తెలిపారు. పాకిస్తాన్ తన గడ్డపై ఉగ్రవాదాన్ని పెంచిపోషించడం విరవించకుంటే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ ఇచ్చారు.‘‘భారత్‌తో సత్సంబంధాలు కావాలంటే ఉగ్రవాద చర్యలకు స్వస్తి పలకాలని పాక్ నాయకత్వానికి చెప్పాలనుకుంటున్నా. జమ్ము కశ్మీర్ ఎప్పటికీ పాకిస్థాన్‌గా మారదు. కశ్మీర్ ప్రజలుగా మేము గౌరవంగా జీవించి.. విజయం సాధిస్తాం. 75 ఏళ్లుగా ఉగ్రవాదం లేని పాకిస్థాన్‌ను సృష్టించలేకపోతే ఇప్పుడు అది ఎలా సాధ్యమవుతుంది?. ఉగ్రవాదాన్ని అంతం చేసే సమయం వచ్చింది. లేకపోతే ఫలితాలు చాలా తీవ్రంగా ఉంటాయి...కశ్మీర్ అమాయకులను చంపితే ఇరు దేశాల మధ్య చర్చలు ఎలా జరుగుతాయి?. ఉగ్రవాదులు చేసిన దాడి చాలా దురదృష్టకరం. వలస వచ్చిన పేద కార్మికులు, ఒక డాక్టర్ ప్రాణాలు కోల్పోయారు. దీనివల్ల ఉగ్రవాదులకు ఏం ప్రయోజనం వస్తుంది? ఉగ్రవాదులు కశ్మీర్లో పాకిస్తాన్‌ను సృష్టించగలరని భావిస్తున్నారా.. మేము ఉగ్రవాదాన్నే అంతం చేయడానికి ప్రయత్నిస్తున్నాం’’ అని అన్నారు.ఈ దాడికి కనీసం ఇద్దరు ఉగ్రవాదులు పాల్పడినట్లు తెలుస్తోంది. ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మరణించగా, మరో నలుగురు, ఓ డాక్టర్ తీవ్రంగా గాయపడి మృతి చెందారు. మరోవైపు ఉగ్రదాడిపై దర్యాప్తు చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కశ్మీర్‌కు చేరుకుంది. -
కశ్మీర్లో స్థానికేతరులపై ముష్కరుల కాల్పులు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రమూకలు మళ్లీ పేట్రేగిపోయాయి. శ్రీనగర్–లేహ్ జాతీయ రహదారిపై టన్నెల్ నిర్మాణ పనుల ప్రాంతంలో ఉన్న ఒక వైద్యుడు, ఐదుగురు స్థానికేతర కార్మికులను చంపేశారు. గందేర్బల్లోని గుండ్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఘటన చోటుచేసుకుంది. పనులు చేస్తున్న స్థానిక, స్థానికేతర కార్మికులు, ఇతర సిబ్బందిపై ఇద్దరు ఉగ్రవాదులు యథేచ్ఛగా కాల్పులకు తెగబడినట్లు సమాచారం. కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా, మరో ఐదుగురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారని అధికారులు తెలిపారు. గాయపడిన మరో ఐదుగురు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారన్నారు. మృతులను డాక్టర్ షెహనవాజ్, ఫహీమ్ నజిర్, కలీం, మహ్మద్ హనీఫ్, శశి అబ్రోల్, అనిల్ శుక్లా, గుర్మిత్ సింగ్‌లుగా గుర్తించారు. ముష్కరులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ఆప్రాంతాన్ని దిగ్బంధించి, గాలింపు చేపట్టాయి. కశ్మీర్ ఐజీ వీకే బిర్డి తదితర అధికారులు ఘటనాస్థలికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. ఘటనను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఖండించారు. ఉగ్రమూకలను వదిలేది లేదని స్పష్టం చేశారు. కాల్పుల ఘటనను సీఎం ఒమర్ అబ్దుల్లా ఖండించారు. ఘటనలో మృతుల సంఖ్య పెరగొచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, శుక్రవారం బుల్లెట్ గాయాలతో ఉన్న బిహార్‌కు చెందిన కార్మికుడి మృతదేçహాన్ని షోపియాన్ జిల్లాలో గుర్తించామని అధికారులు తెలిపారు. -
జమ్మూకశ్మీర్ రాష్ట్రహోదా తీర్మానానికి ఎల్జీ ఓకే
శ్రీనగర్: జమ్మూకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతానికి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలంటూ ఒమర్ అబ్దుల్లా కేబినెట్ చేసిన తీర్మానానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా ఆమోదముద్రవేశారు. గురువారం సమావేశమై కేబినెట్ ఆమోదించిన తీర్మానానికి ఎల్జీ ఆమోదం తెలిపినట్లు అధికారిక వర్గాలు శనివారం వెల్లడించాయి. జమ్మూకశ్మీర్ ప్రజల గుర్తింపు, రాజ్యాంగబద్ధ హక్కులను తిరిగి పొందేందుకు పాత గాయాలను మాన్పే పూర్తిరాష్ట్ర హోదా పొందే ప్రక్రియలో ఈ తీర్మానం తొలి అడుగు అని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. జమ్మూకశ్మీరీల ప్రత్యేక గుర్తింపే నూతన ప్రభుత్వం అనుసరించనున్న విధాననిర్ణయాలకు భూమిక అని ఆయన అన్నారు. నవంబర్ నాలుగోతేదీన అసెంబ్లీ సమావేశాలు జరపనున్నారు. రాష్ట్ర పునరుద్ధరణకు సంబంధించిన విషయాలపై ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులతో చర్చించేందుకు సీఎం ఒమర్ త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. అయితే రద్దయిన 370 ఆరి్టకల్‌ను తిరిగి తీసుకొచ్చే విషయంలో ఎలాంటి తీర్మానాలు జరగకపోవడాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుబట్టాయి. కొలువుతీరిన కొద్దిరోజులకే ఒమర్ సర్కార్ అప్పుడే కేంద్రప్రభుత్వానికి లొంగిపోయిందని ఆగ్రహం వ్యక్తంచేశాయి. -
రాష్ట్ర హోదా త్వరగా రావాలి
శ్రీనగర్: కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్‌కు తొలి సీఎంగా బుధవారం బాధ్య తలు స్వీకరించిన కొద్దిసేపటికే పీటీఐ వీడియోస్‌తో ఒమర్ అబ్దుల్లా ముఖాముఖి మాట్లాడారు. జమ్మూకశ్మీర్‌కు త్వరలోనే రాష్ట్ర హోదా వస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. ‘‘ కాంగ్రెస్ పార్టీతో కలిసి రాష్ట్ర హోదా సాధనకు కృషిచేస్తాం. త్వరలోనే రాష్ట్ర హోదా దక్కొచ్చని భావిస్తున్నాం. ఖాళీగా ఉన్న మంత్రిపదవుల భర్తీ కోసం కాంగ్రెస్‌తో చర్చలు జరుపుతున్నాం. కాంగ్రెస్‌తో బేధాభి ప్రాయా లు అబద్ధం. నిజంగానే సఖ్యత చెడితే ఖర్గే, రాహుల్ గాంధీ, ప్రియాంక వంటి అగ్రనేతలు మా ప్రమాణ స్వీకార కార్య క్రమానికి రారుకదా. ప్రభు త్వంలో చేరాలా వద్దా అనేది వాళ్ల ఇష్టం. శాసనమండలి కూడా లేని జమ్మూ కశ్మీర్లో తక్కువ మంది మంత్రులతో ప్రభు త్వాన్ని నడపాలని భావిస్తున్నాం. గతంలోలాగా 40, 45 మంది మంత్రులుండే కాలం పోయింది. 2018 నుంచి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం కశ్మీర్లో లేదు. తమ సమస్యల్ని పట్టించుకున్న నాథుడే లేడని ప్రజలు నిరాశలో కుంగిపోయారు. అందుకే కొత్తగా ఏర్పడిన మా ప్రభుత్వ తక్షణ కర్తవ్యం వారి సమస్యలను పరిష్కరించడమే. కేంద్రపాలిత ప్రాంతంగా కశ్మీర్‌ను పాలించడం కొత్త రకం సవాల్. అందివచ్చిన తొలి అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవడం పెద్ద నేరంతో సమానం. గత తప్పిదాలు చేయబోను. కేజ్రీవాల్‌సహా దేశంలో పరిపా లనా అనుభవం ఉన్న కీలక వ్యక్తులు అందరి నుంచి పాఠాలు నేర్చుకుంటా’’ అని ఒమర్ వ్యాఖ్యానించారు. -
J&K: సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం
Updates కేంద్ర పాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్ తొలి ముఖ్యమంత్రిగా నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ప్రమాణం చేశారు.శ్రీనగర్‌లోని షేర్–ఇ–కశ్మీర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్(ఎస్కేఐసీసీ)లో జరిగిన ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా సీఎంగా ఒమర్‌తో ప్రమాణం చేయించారు.#WATCH | Omar Abdullah takes oath as the Chief Minister of Jammu and Kashmir.The leaders from INDIA bloc including Lok Sabha LoP Rahul Gandhi, Congress leader Priyanka Gandhi Vadra, JKNC chief Farooq Abdullah, Samajwadi Party chief Akhilesh Yadav, PDP chief Mehbooba Mufti, AAP… pic.twitter.com/IA2ttvCwEJ— ANI (@ANI) October 16, 2024 ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి.. కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంకా గాంధీ, ఇండియా కూటమి నేతలు.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి, ఎన్‌న్సీపీ-ఎస్స్పీ ఎంపీ సుప్రియా సూలే, సీపీఐ నేత డీ. రాజా హాజరయ్యారు.అంతకు ముందు.. జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే శ్రీనగర్ చేరుకున్నారు. #WATCH | Congress President Mallikarjun Kharge reaches Srinagar to attend the swearing-in ceremony of Omar Abdullah as the Chief Minister of Jammu and Kashmir. pic.twitter.com/3OCIoQKqMP— ANI (@ANI) October 16, 2024 ఒమర్ అబ్దుల్లా ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ శ్రీనగర్ చేరుకున్నారు. Rahul Gandhi, Priyanka Gandhi arrive in Srinagar to attend swearing-in ceremony of Omar AbdullahRead @ANI Story | https://t.co/u7dPfwgpJc#RahulGandhi #OmarAbdullah #PriyankaGandhi #SwearingInCeremony #JKChiefMinister pic.twitter.com/SRTlRKJ6N8— ANI Digital (@ani_digital) October 16, 2024 జమ్ము కశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు.. నేషనల్ కాన్ఫరెన్స్ వైస్ ప్రెసిడెంట్ ఒమర్ అబ్దుల్లా బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘ భారత ప్రభుత్వంతో సహకారంతో పనిచేయడానికి ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. అయితే ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి సీఎంగా స్వంత హక్కు ఉంది. నేను విచిత్రమైన సవాళ్లను కలిగి ఉన్నా. పూర్తి ఆరేళ్ల పదవీకాలం పూర్తి చేసిన చివరి ముఖ్యమంత్రిని నేను. ఇప్పుడు నేను జమ్ము కశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతానికి తొలి ముఖ్యమంత్రిని అవుతాను. జమ్ము కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం ద్వారా మా పాలన మొదలవుతుంది’’ అని అన్నారు.ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి ఇప్పటికే ఇండియా కూటమి నేతలు.. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, డీఎంకే ఎంపీ కనిమొళి కరుణానిధి, ఎన్‌న్సీపీ-ఎస్స్పీ ఎంపీ సుప్రియా సూలే, సీపీఐ నేత డీ. రాజా చేరుకున్నారు. Samajwadi Party chief Akhilesh Yadav, DMK MP Kanimozhi Karunanidhi, NCP-SCP MP Supriya Sule and CPI leader D Raja in Srinagar to attend the swearing-in ceremony of J&K CM-designate Omar AbdullahOmar Abdullah to take oath as J&K CM today. (Pics: Akhilesh Yadav's social media… pic.twitter.com/TO4tSGzFmn— ANI (@ANI) October 16, 2024ఆర్టీకల్ 370 ఆర్టీకల్ రద్దు అనంతరం మొదటిసారిగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎన్సీ, కాంగ్రెస్ కూటమి విజయం సాధించడం తెలిసిందే. -
జమ్మూలో ఈవీఎంలు మంచివేనా: కిషన్‌రెడ్డి ప్రశ్న
సాక్షి,హైదరాబాద్:హర్యానాలో ఈవీఎంల అక్రమాలు జరిగితే జమ్మూలో ఎందుకు జరగలేదని,కాంగ్రెస్ గెలిచిన రాష్ట్రాల్లో ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు ఎందుకు రావడం లేదని కేంద్రమంత్రి,జమ్మూకశ్మీర్ ఇంఛార్జ్ కిషన్‌రెడ్డి ప్రశ్నించారు.తెలంగాణ బీజేపీ కార్యాలయంలో కిషన్‌రెడ్డి శుక్రవారం(అక్టోబర్11) మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడారు.‘ఓట్లు జమ్మూలో ఒక రకంగా పోలరైజ్ అయ్యాయి. కశ్మీర్లో మరోరకంగా పోలరైజ్ అయ్యాయి. హర్యానా ఎగ్జిట్ పోల్స్ రాగానే మంత్రి వర్గ కూర్పు పై రాహుల్, సోనియా దగ్గర క్యూ కట్టారు. ఆర్టికల్ 370 పునరుద్ధరణ చేసే అవకాశం లేదు.ఆర్టికల్ 370పై కాంగ్రెస్ మాట్లాడే ధైర్యం చేయడం లేదు. జమ్మూ కశ్మీర్లో ఆరుగురు కాంగ్రెస్ నుంచి గెలిస్తే ఆ ఆరు మంది ముస్లింలే.బీజేపీ నుంచి గెలిచిన 29 మంది హిందువులే. 19 మంది కొత్తవాళ్ళు. భద్రత విషయంలో కేంద్రప్రభుత్వ విధానంలో మార్పు లేదు. జమ్మూలో టెర్రరిజం పై మరింత జాగ్రత్తగా ఉంటాం. జమ్మూలో సరిహద్దు కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే ఉంటుంది. ఈ ఎన్నికల్లో ఒక్క రాయి విసిరిన సంఘటన జరగలేదు.భారతదేశంలో పాకిస్థాన్ ఐఎస్ఐ యాక్టివిటీ తగ్గింది.పెద్ద నోట్ల రద్దుకు పాకిస్తాన్లో దొంగ నోట్ల ముద్రణ ఒక కారణం. పాకిస్తాన్‌కు ఇతర దేశాల మద్దతు లేకుండా చేయడంలో భారత్ సక్సెస్ అయ్యింది.ఒక్క చైనా మాత్రమే పాకిస్తాన్‌కు మద్దతు పలుకుతోంది. ఇదీ చదవండి: ఆదాయం ఎందుకు తగ్గింది -
J&K: ఎన్సీ శాసనసభాపక్షనేతగా ఒమర్ అబ్దుల్లా
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో జమ్ము కశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ -కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. తాజాగా నేషనల్ కాన్ఫరెన్స్ శాసనసభాపక్షనేతగా ఎన్సీ నేత, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ విషయాన్ని గురువారం ఎన్సీ సీనియర్ నేత ఫరూక్ అబ్దుల్లా వెల్లడించారు. ఎన్సీ శాసనసభాపక్షనేతగా ఎన్నికైన అనంతరం మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా మీడియాతో మాట్లాడారు.‘‘ఈరోజు నేషనల్ కాన్ఫరెన్స్ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరిగింది. అందులో నేను లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా ఎన్నుకోబడ్డాను. పార్టీ ఎమ్మెల్యేలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ మద్దతు ప్రకటించింది.#WATCH | Srinagar, J&K: JKNC vice president Omar Abdullah says, "Today in the meeting of the National Conference Legislature Party, I have been elected as the leader of the Legislature Party. I express my gratitude to the MLAs. Talks are going on to get the letter of support from… pic.twitter.com/uM86jG9rc9— ANI (@ANI) October 10, 2024అదేవిధంగా 4 స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఎన్సీ ప్రభుత్వాన్ని ఏర్పాటు తమ మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం ఎన్సీ 42 ఎమ్మెల్యేలు, స్వతంత్ర ఎమ్మెల్యేలు నలుగురిని కలుపుకొని మొత్తం 46 మంది ఎమ్మెల్యేలను కలిగి ఉన్నాం. కాంగ్రెస్ నుంచి మద్దతు లేఖ అందిన వెంటనే మేము జమ్ము కశ్మీర్ ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని రాజ్‌భవన్‌కు వెళ్తాం’ అని అన్నారు. -
Jammu Kashmir election results: కశ్మీర్ లోయలో ఎర్రజెండా
జమ్మూకశ్మీర్ రాజకీయ ముఖచిత్రం నెమ్మదిగా మారుతోంది. కానీ స్థిరంగా ఉన్నది ఒకే ఒక నాయకుడు మహమ్మద్ యూసఫ్ తరిగామి. పచ్చని కశ్మీరీ లోయలో ఎర్రజెండాను రెపరెపలాడిస్తున్న సీపీఎం వెటరన్ లీడర్. కుల్గాం జిల్లాలో 1996 నుంచి సీపీఎంను విజయపథాన నడిపిస్తున్న నేత. జమాతే వెన్నుదన్నుతో మతం పేర ఓట్లడిగిన స్వతంత్ర అభ్యర్థి సయార్ అహ్మద్ రేషిని తన అభివృద్ధితో ఓడించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ నిజానికి తరిగామి ఆయన ఇంటిపేరు కాదు.. ఊరి పేరు అసలే కాదు. షేక్ అబ్దుల్లా ముఖ్యమంత్రిగా ఉన్న 1979లో యూసఫ్‌ను అరెస్టు చేశారు. ఆయన అరెస్టు గురించి ఓ జర్నలిస్టు సీఎంను ప్రశ్నించగా.. ‘ఓ జో తరిగామ్ వాలా?’అంటూ ప్రస్తావించారు. అప్పటినుంచి తరిగామి ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. ఆయన ఎన్నికల అఫిడవిట్లో కూడా తరిగామి ఉంటుంది. దక్షిణ కశ్మీర్లో ఉన్న కుల్గాం.. 1996 నుంచి సీపీఎం పారీ్టకి మంచి పట్టున్న ప్రాంతం. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ.. రాష్ట్రాన్ని ఏ పార్టీ అయినా పరిపాలించనీ. కుల్గామ్ మాత్రం తరిగామీదే. అందుకే మంగళవారం ఆయన గెలుపొందిన తరువాత ‘హక్ కా హామీ తరిగామీ’అంటూ కుల్గామ్ వీధులన్నీ మారుమోగాయి. గట్టిపోటీని తట్టుకుని..ఈ ఎన్నికల్లో కుల్గాంలో గట్టిపోటీ నేలకొంది. నిషేధిత జమాతే ఇస్లామీ బలపరిచిన అభ్యర్థి సయార్ అహ్మద్ రేషితో తరిగామి తలపడ్డారు. మత తీవ్రవాదానికి పేరుగాంచిన జమాత్ 1980 తర్వాత ఈ ప్రాంతంలో ఎన్నికల ప్రక్రియలో పాల్గొనడం ఇదే తొలిసారి. అంతకుముందు దాదాపు మూడు దశాబ్దాల పాటు ఎన్నికల ప్రజాస్వామ్యాన్ని బహిష్కరించింది. దీన్ని కేంద్రం 2019లో నిషేధించింది. 2024 జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 10 మంది జమాత్ మద్దతు గల స్వతంత్ర అభ్యర్థుల్లో రేషి ఒకరు. నేషనల్ కాన్ఫరెన్స్, జమ్మూకశ్మీర్ పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ, సీపీఎం పార్టీలతో కూడిన పీపుల్స్ అలయన్స్ ఫర్ గుప్కర్ డిక్లరేషన్ (పీఏజీడీ) తమ అభ్యరి్థగా తరిగామికి మద్దతు ఇచి్చంది. 85 స్థానాలకు ఎన్నికలు జరగ్గా ఒక్క కుల్గాంలోనే సీపీఎం పోటీ చేసింది. జమాత్ సైద్ధాంతిక ఆకర్షణతో రేషి రంగంలోకి దిగారు. తాను ఓడిపోతే.. ఇస్లాం ఓడిపోయినట్టేనంటూ ప్రచార ర్యాలీలో చెప్పారు. కానీ తరిగామి తన అభివృద్ధి మంత్రంతోనే ముందుకెళ్లారు. ఆరి్టకల్ 370 పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నామని తరిగామి ప్రాతినిధ్యం వహించిన (పీఏజీడీ) చెబుతూ వచి్చంది. తన హయాంలో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి మాత్రమే ప్రచారంలో తరిగామి వివరించారు. నియోజకవర్గంలోని రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రుల వంటి మౌలిక సదుపాయాలను మరింత మెరుగుపర్చాల్సి ఉందన్నారు. ప్రత్యర్థి రేషి ప్రచారం ఇందుకు విరుద్ధంగా ఉంది. కేవలం ఆరి్టకల్ 370 చుట్టే తిరిగింది. అంతిమంగా, ఇస్లాం మతతత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్ట్ తరిగామి విజయం సాధించారు. కుల్గాంలో తరిగామి విజయం ప్రజాస్వామ్యం, లౌకికత్వం విజయమని సీపీఎం పార్టీ కొనియాడింది. జైలు జీవితం.. గృహ నిర్భందం.. 1949లో జని్మంచిన తరిగామి.. అబ్దుల్ కబీర్ వని ప్రభావంతో చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. 18 ఏళ్ల వయసులో అనంత్ నాగ్ కాలేజీలో సీట్లను పెంచాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు చేపట్టిన ఆందోళనలో పాల్గొన్నారు. ఆ తర్వాత 1960, 1970 దశకాల్లో జమ్ముకశ్మీర్ లో జరిగిన పలు విద్యారి్థ, రైతు ఉద్యమాల్లో పాలు పంచుకన్నారు. 1979లో పాకిస్తాన్ మాజీ ప్రధాని జులి్ఫకర్ అలీ భుట్టో ఉరిశిక్ష తర్వాత కశ్మీర్లో అల్లర్లు చెలరేగాయి. ఈ సందర్భంగా ఆయన జైలుకు వెళ్లారు. వివాదాస్పద ప్రజా భద్రతా చట్టం (పీఎస్ఏ) కింద నిర్భందానికి గురైన వామపక్ష నాయకుల్లో తరిగామి ఒకరు. 2019లో ఆరి్టకల్ 370ని రద్దు చేసి జమ్మూకశ్మీర్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించినప్పుడు తరిగామిని శ్రీనగర్‌లో 35 రోజుల పాటు గృహనిర్భందలో ఉంచారు. నిర్భందంలో ఉన్న సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న తరిగామిని ఎయిమ్స్‌కు తరలించేందుకు ఆయన సహచరుడు సీతారాం ఏచూరి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. -
బీజేపీ గెలుపు కాదు.. కాంగ్రెస్ ఓటమి: ఆప్ సెటైర్లు
ఢిల్లీ: హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఎగ్జిట్ పోల్స్‌ను తలకిందులు చేస్తూ.. అనూహ్యంగా బీజేపీ హ్యాట్రిక్ గెలుపు సొంతం చేసుకుంది. అయితే.. హర్యానా ఫలితాలపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. సెటైర్లు వేశారు. హర్యానాలో బీజేపీ గెలుపును అంగీకరించలేనని అన్నారు. బీజేపీ విజయం అనటం కంటే.. కాంగ్రెస్ ఓటమే అధికమని అన్నారు. అధికార బీజేపీ పార్టీకి 39 శాతం ఓట్ల వస్తే.. 61 శాతం ఓట్లు వ్యతిరేకంగా వచ్చాయని గుర్తు చేశారు.‘‘ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ బీజేపీకి వస్తే నేను ఆ పార్టీ విజయాన్ని అంగీకరించేవాడిని. కానీ, అలా జరగలేదు. హర్యానాలో ఓట్లు బీజేపీకి గెలుపు కోసం పడలేదు. బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు వచ్చాయి. 39 శాతం ఓట్లు బీజేపీకి పడ్డాయి. అదే బీజేపీకి 61 శాతం వ్యతిరేకంగా ప్రజలు ఓటు వేశారు. ఇది బీజేపీ గెలుపు కాదు.. కాంగ్రెస్ ఓటమి’’ అని అన్నారు. మరోవైపు.. జమ్ము కశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్‌తో కలిసి కాంగ్రెస్ ఎన్నికల్లో కూటమిగా బరిలో దిగిందని, అందుకే బీజేపీని ఓడించగలిగిందని అన్నారు. ‘‘ జమ్ము కశ్మీర్లో ఇండియా కూటమి ఒక యూనిట్‌గా పోరాటం చేసింది. నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కలిసి కూటమిగా బరిలో దిగటంతో బీజేపీ ఓడిపోయింది. కానీ, హర్యానాలో దురదృష్టవశాత్తు.. ఇండియా కూటమి పార్టీలు ఒంటరిగా బరిలో దిగటంతో ఫలితం కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా వచ్చింది’’ అని అన్నారు.చదవండి: బీజేపీలో చేరిన కేరళ తొలి మహిళా ఐపీఎస్


