కశ్మీర్‌ మహిళల ప్రస్తావన.. పాక్‌కు భారత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌ | India Criticizes Pakistan At UNSC For Hypocrisy On Kashmir, Highlights Its Own Record Of Violence | Sakshi
Sakshi News home page

కశ్మీర్‌ మహిళల ప్రస్తావన.. పాక్‌కు భారత్‌ స్ట్రాంగ్‌ కౌంటర్‌

Oct 7 2025 9:01 AM | Updated on Oct 7 2025 10:26 AM

Indian UN Parvathaneni Harish Counter To Pakistan

న్యూయార్క్‌: దాయాది పాకిస్తాన్‌పై భారత్‌ మరోసారి విరుచుకుపడింది. తమ దేశ పౌరులపైనే(పాకిస్తాన్‌) బాంబు వేసుకునే దేశం మహిళల భద్రత విషయం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఉగ్రవాదంతో ఎప్పటికప్పుడు మారణహోమం సృష్టిస్తూ ప్రపంచాన్ని దృష్టి మరల్చడానికి ప్రయత్నిస్తోందని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC) సమావేశాల్లో పాక్‌ అధికారిణి సౌమా సలీమ్‌ మాట్లాడుతూ.. భారత్‌, కశ్మీర్‌ను టార్గెట్‌ చేసి విమర్శలు చేశారు. మహిళలు, శాంతి, భద్రతపై బహిరంగ చర్చ సందర్భంగా కశ్మీరీ మహిళలు దశాబ్దాలుగా లైంగిక హింసను భరించారు, ఆక్రమణలో ఉన్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. అనంతరం, పాక్‌ వ్యాఖ్యలకు ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి, రాయబారి పర్వతనేని హరీష్ కౌంటర్‌ ఇచ్చారు. ఆమె వ్యాఖ్యలను హరీష్ తీవ్రంగా ఖండించారు.

అనంతరం, హరీష్‌ మాట్లాడుతూ.. కశ్మీర్‌ మహిళల గురించి పాకిస్తాన్‌ మాట్లాడం విడ్డూరంగా ఉంది. తన సొంత ప్రజలపై బాంబులు వేసుకునే దేశం పాకిస్తాన్‌. ప్రతిసారి భారత్‌పై నిందలు మోపేందుకు దాయాది దేశం తీవ్రంగా ప్రయత్నించడాన్ని ఆయన తప్పుబట్టారు. మహిళలు, శాంతిభద్రత అజెండాల్లో మా మార్గదర్శకాలు సరిగానే ఉన్నాయన్నారు. కానీ, సొంత ప్రజలపై బాంబులు వేసి పాక్‌ మారణహోమానికి పాల్పడుతుందన్నారు. అలాంటి దేశం ప్రపంచదృష్టిని మరల్చేందుకు మాపై నిందలు మోపుతుందన్నారు. పాక్‌ తప్పుడు వాదనలను ప్రపంచం చూస్తోందన్నారు.

భారత్‌, జమ్ముకశ్మీర్‌పై ప్రతీసారి పాకిస్తాన్‌ విమర్శలు చేస్తూనే ఉంది. భారత్‌కు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటూనే ఉన్నారు. భారత్‌పై విషం చిమ్మడం పాకిస్తాన్‌కు అలవాటే. 1971లో ఆపరేషన్ సెర్చ్‌లైట్ నిర్వహించిన దేశం పాకిస్తాన్. ఈ క్రమంలో ఆ దేశ సొంత సైన్యం ద్వారా 4,00,000 మంది మహిళా పౌరులపై జాతి విధ్వంసం, సామూహిక అత్యాచారం చేశారు అని ఘాటు విమర్శలు చేశారు. తమ దేశ చర్యలకు మరిచిపోయి.. భారత్‌పై అసత్య ప్రచారం మానుకోవాలని హితవు పలికారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement